Sermons

[అధ్యాయము 20-1] <ప్రకటన 20:1-15> ఆ ఘటసర్పము అగాధమునకు పరిమితమగుట<ప్రకటన 20:1-15>

“మరియు పెద్ద సంకెళ్లను చేతపట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల యొక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును, అనగా అపవాదియు సాతాను అను ఘటసర్పము పట్టుకుని వెయ్యి సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి, ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు ఇక జనమును మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్రవేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. అంతట సింహాసనములను చూచితిని. వాటి మీద ఆసీనులైయుండు వారికి విమర్శచేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూరమృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తన నొసళ్లయందుగాని చేతులయందుగాని దాని ముద్ర వేయించుకొనని వారిని, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడినవారి ఆత్మలను చూచితిని. వారు బ్రదికినవారై, వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ వెయ్యి సంవత్సరములు గడచు వరకు కడమ మృతులు బ్రదుకలేదు. ఇదియే మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునైయుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు. వెయ్యి సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశలయందుండు జనములను, లెక్కకు సముద్రపు ఇసుకవలె ఉన్న గోగు మాగోగు అనువారిని మోసపరచి వారిని యుద్ధమునకు పోగుచేయుటకై వాడు బయలుదేరును. వారు భూమియందంతట వ్యాపించి, పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణము ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను. వారిని మోసపరచిన అపవాది అగ్ని గంధకము గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూరమృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. మరియు ధవళమైన మహా సింహాసనమును దాని యందు ఆసీనుడైయున్న యొకనిని చూచితిని. భూమ్యాకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను. వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి, కొద్దివారేమి మృతులైన వారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడి యుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు జీవగ్రంథమును వేరొక గ్రంధము విప్పబడెను. ఆ గ్రంథముయందు వ్రాయబడియున్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పుపొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళలోకమును వాటి వశముననున్న మృతులనప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పుపొందెను. మరణమును మృతుల లోకమును అగ్ని గుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవ గ్రంధమందు వ్రాయబడినట్టు కనబడనియెడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను.’’వివరణ : 


వచనం 1 : మరియు పెద్ద సంకెళ్లను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవిగల యొక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని.

సువార్త కొరకు కష్టించిన పరిశుద్ధులకు తన బహుమానములిచ్చుటకై మన ప్రభువైన దేవుడు క్రీస్తు రాజ్యమును వెయ్యేండ్లపాటు వారికి బహుమతిగా నిచ్చును. అలాగు చేయుటకు మొదటగా ఆ ఘట సర్పమును వెయ్యేండ్లపాటు అగాధములో బంధించమని దేవుడు తన దూతలలో ఒకరికి ఆజ్ఞనిచ్చును. దేవుడు దీనిని తప్పక మొదట నెరవేర్చును. ఎందుకనగా పరిశుద్ధులు క్రీస్తు యొక్క వెయ్యేండ్ల రాజ్యములో జీవించుటకు ముందే ఘటసర్పము అగాధములో బంధించబడవలెను. కాబట్టి దేవుడు తన దూతలకు అగాధపు తాళపు చెవిని, పెద్ద సంకెళ్ళను ఇచ్చి ఘటసర్పమును అగాధములో బంధించి పడవేయునట్లు ఆజ్ఞాపించెను.

వచనం 2: అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘటసర్పమును పట్టుకుని వెయ్యి సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసెను. 

ఆదాము హవ్వలను ఆశపెట్టి పడవేసినది ఆ సర్పమే. బైబిలు ఆ సర్పమును సాతానని ఘటసర్పమని పిలుచుచున్నది. దేవుడు ఆ ఘటసర్పముపై పట్టు సాధించి వెయ్యేండ్ల పాటు వానిని అగాధములో బంధించును. కనుక పరిశుద్ధులు క్రీస్తుతో పాటుగా శాంతితో వెయ్యేండ్ల రాజ్యములో నివసించెదరు.

వచనం 3: ఆ వెయ్యి సంవత్సరములు గడచు వరకు ఇక జనమును మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్రవేసెను. అటుపిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను.

ఈ భూమిపై క్రీస్తురాజ్యమును నిర్మించుటకు మరియు వెయ్యేండ్లు పరిశుద్ధులు ప్రభువుతో కూడా పరిపాలించుట కొరకు దేవుడు వెయ్యేండ్లు ఘటసర్పమును అగాధములో బంధించి పరిశుద్ధులను మోసపరచకుండా ఆపును.

“అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచి పెట్టబడవలెనని” ఈ భాగములో చెప్పబడెను. ఆ వెయ్యేండ్లు పూర్తయిన తరువాత దేవుడు కొంచెము కాలము ఘటసర్పమును విడచిపెట్టును. తద్వారా అతడు పరిశుద్ధులు బాధించుట తిరిగి ఆరంభించగానే నిత్యనరకాగ్నిలోనికి అతనిని పంపివేసి మరి ఎన్నడు కనబడకుండా చేయును.

వచనం 4: అంతట సింహాసనమును చూచితిని. వాటి మీద ఆసీనులై యుండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూరమృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక, తమ నొసళ్లయందుగాని చేతులయందుగాని దాని ముద్రవేయించుకొనని వారిని, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడినవారి ఆత్మను చూచితిని. వారు బ్రదికినవారై, వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి.

క్రీస్తు రాజ్యములో తిరిగి జన్మించిన క్రైస్తవులు తీర్పుతీర్చుటకు అధికారము పొందెదరు. క్రీస్తు యొక్క యాజకులుగా చేయబడిన ఆ పరిశుద్ధులు ప్రభువుతోపాటు ఆ వెయ్యేళ్ళ రాజ్యములో పాలన చేస్తారు. తమ విశ్వాసమును కాపాడుకొనుటకును, యేసును గూర్చిన సాక్ష్యము కొరకును హతసాక్షులైనవారు దానిలో నివసించెదరు. వారు మృగపు గుర్తును స్వీకరించక దాని ప్రతిమను పూజింపకయున్నవారు.

వారు అంత్యక్రీస్తుచే తేబడిన శ్రమల కాలములో హతసాక్షులైరి. మరియు దేవుడు వారిని పునరుత్ధానపరచి జీవింపచేయును. రాబోవు వెయ్యేండ్లపాటు క్రీస్తు రాజ్యములో పరిపాలించనిచ్చును.

మొదటి పునరుత్ధానములో ప్రవేశించిన వారికి కూడా ఇవే దీవెనలు కుమ్మరింపబడును. ప్రభువుచే అనుగ్రహింపబడినవి రెండు పునరుత్ధానములున్నవి. మొదటి పునరుత్ధానము రెండవ పునరుత్ధానము వెయ్యేండ్ల రాజ్యములో నివసింపబోవు పరిశుద్ధులు మొదటి పునరుత్ధానమునకు సంబంధించినవారై దానిలో పాలు పొందెదరు. ఈ మొదటి పునరుత్ధానములో పాలొందువారు క్రీస్తు రాజ్యమైన వెయ్యేండ్ల రాజ్యములో జీవించుట అను మహిమలో కూడా పాలొందుదురు. మొదటి పునరుత్ధానము పరిశుద్దులందరినీ కొనిపోవుటకు యేసుక్రీస్తు తిరిగి వచ్చునప్పుడు సంభవించును. (1థెస్స 4:15`17) కానీ రెండవ పునరుత్ధానము వెయ్యేండ్ల రాజ్య కాలములో సంభవించును. ఎట్లనగా అది పాపులను నిత్య మరణమునకు గురిచేయుటకై పాపుల కొరకు సిద్ధపరచబడెను.

వెయ్యేండ్ల పాటు పరిపాలించు అధికారము సర్వశక్తుడగు దేవునిచే పరిశుద్ధులకు ఇవ్వబడెను. క్రీస్తు రాజ్యము వారికివ్వబడెను. ఎందుకనగా వారు ప్రభువు యొక్క నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించి దానిని కాపాడుకొనుటకు తమ జీవితమును సమర్పించిరి.

వచనం 5: ఆ వెయ్యి సంవత్సరములు గడచు వరకు కడమ మృతులు బ్రదుక లేదు. ఇదియే మొదటి పునరుత్ధానము.

ప్రభువు నొద్ద తమ పాపక్షమాపణ పొందనివారు పాపులుగా ఈ భూమిపై నివసించిన పిమ్మట ఆయన యొద్దకు వెళ్ళినట్లయిన పరిశుద్ధులకు ప్రభువు ఇవ్వబోవుచున్న ఆ మొదటి పునరుత్ధానములో ప్రవేశించనేరరు. అలాగే క్రీస్తు రాజ్యములో వెయ్యేండ్ల పాటు పరిశుద్ధులు విందులో పాల్గొన్ననూ వారు మొదటి పునరుత్ధానము పొందలేదు కానీ దానికి బదులు వారు రెండవ పునరుత్ధానంలో పాల్గొంటారు. కారణమేమనగా మొదటి పునరుత్ధానమును పొందిన పరిశుద్ధులు క్రీస్తు రాజ్యములో సంపదతోను మహిమతోను వెయ్యేండ్లు పరిపాలించు అధికారమును కూడా పొందుతారు.

అయిననూ ఆ రెండవ పునరుత్ధానములోనికి దేవుడు పాపులను అనుమతించును. ఎందుకు? రెండవ సమయానికి వారి మరణము నుండి వారిని దేవుడు లేపి, వారిని వాటి పాపమును బట్టి తీర్పు తీర్చును. వారి గతి ఎలాగుండునంటే వారు తమ పాపముకై తీర్పు తీర్చబడుటకై మృతి నుండి లేపబడతారు. ఇందుమూలమున వరుసలోనూ క్రమంలోను పరిశుద్ధులు పునరుత్ధానము కంటే పాపులు పునరుత్ధానము భిన్నముగా ఉండును. నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించిన కారణాన మొదటి పునరుత్ధానములో ప్రవేశించిన వారి నుండి ఏ ఒక్కరిని కూడా ప్రభువు వెయ్యేండ్లు పూర్తగు వరకు తిరిగి బ్రతుకుటకు అనుమతించడు. కనుక నీతిమంతుల పునరుత్ధానము, పాపుల పునరుత్ధానము కంటే వెయ్యేండ్లు ముందుగా జరుగును. నీతిమంతుల పునరుత్ధానము నిత్యజీవమును, దీవెనను పొందుటకు కాగా పాపుల పునరుత్ధానము తమ పాపముకొరకై నిత్యశిక్షను పొందుటకు.

వచనం 6: ఈ మొదటి పునరుత్ధానములో పాలగువారు ధన్యులను పరిశుద్ధులునైయుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు.

రెండవ మరణమునకు మొదటి పునరుత్ధానములో పాలొందువారిపై ఏ అధికారము ఉండదని బైబిల్‌ మనకు చెప్పుచున్నది. ఆ విధంగానే ఈ మొదటి పునరుత్ధానంలో పాల్గొనువారు దీవెన పొందినవారు. ఎందుకనగా వారు వెయ్యేండ్ల రాజ్యములో కూడా పరిపాలిస్తారు.

వచనం : 7-8 వెయ్యి సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశలయందుండు జనములను, లెక్కకు సముద్రపు ఇసుకవలె ఉన్న గోగుమాగోగు అనువారిని మోసపరచి వారిని యుద్ధమునకు పోగుచేయుటకై వాడు బయలుదేరును.

వెయ్యేండ్లుగా అగాధములో బంధింపబడి, విడిచిపెట్టబడిన తరువాత మరొకసారి ఆ మృగము పరిశుద్ధులకు వ్యతిరేకిగా నిలుచును. కనుక వాడు మరల తిరిగి రాకుండునట్లుగా దేవుడు వానిని అగ్నిగంధకములోనికి త్రోయును. ఈ తీర్పుతో ఘటసర్పము కేవలము నరకములోనే కనబడును.

“తిరిగి జన్మించని వారు ఈ వెయ్యేండ్లు పాలనలో నివసిస్తారా?’’ అని మనం అడగవచ్చును. దాని సమాధానమును అవును. ఈ భూలోకమునకు చెందిన ప్రజలు అనేకులు క్రీస్తు రాజ్యములో ఉన్నారని ప్రకటన 20:8లో లిఖించబడినది. ఆ ప్రజలు ఇంతకు మునుపు భూమిపై నివసించిన వారా లేక క్రొత్తగా సృజింపబడినవారా అనేది మనకు స్పష్టముగా తెలియదు. కానీ మనకు తెలిసినదేమనగా వారెవరో దేవునికి తెలియును. పరిశుద్ధులు పరిపాలిస్తారాని అక్కడ సముద్ర ఇసుక రేణువులంత విస్తారంగా అనేక జనాంగాలు ఉంటాయని మనకు తెలియును.

క్రీస్తు రాజ్యములో పరిశుద్ధులు నివసించునప్పుడు వారు ఇంకను భూమిపై నున్న ప్రజలను చూస్తారనునది సత్యము. వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకై బ్రదికిన వారై సముద్ర ఇసుక రేణువులంతా విస్తారంగా ఉంటారు. మరొకసారి పరిశుద్ధులకు వ్యతిరేకముగా నిలుచుటకై వారు ఘటసర్పముతో చేతులు కలిపినప్పటికి వారందరూ దేవుని అగ్నితో నాశనపరచబడతారు. గొప్పదైన ధవళ సింహాసనము యొక్క నిత్య తీర్పును పొందుతారు. మరియు నిత్యము మండుచున్న అగ్నిలోనికి త్రోయబడుదురు. దానితో వెయ్యేండ్ల పాలన అంతములోనికి వచ్చును. అక్కడ నుండి పరిశుద్ధులు నిత్యము వారు నివసించునట్లు నూతన భూమి ఆకాశమునకు వారు వెళతారు.

వచనం 9: వారు భూమియందంతట వ్యాపించి, పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను.

దేవునికి ఆయన పరిశుద్ధులకును వ్యతిరేకముగా స్థిరముగా నిలిచిన సాతాను ఘటసర్పమే సాతాను ఈ భూలోక ప్రజలై క్రీస్తు రాజ్యములో నివసిస్తున్న ప్రజలను మోసగించి, పరిశుద్ధులను బాధించగలిగినప్పటికి దేవుడు సర్వశక్తుడైనందున ఆయన ఆకాశము నుండి అగ్నిని కుమ్మరించి వారినందరినీ కృంగదీసి తనకును తన పరిశుద్ధులకును ఎప్పుడూ వ్యతిరేకముగా నిలువకుండునట్లు ఘటసర్పమును నిత్య అగ్నిలోనికి త్రోసివేయును.

వచనం 10: వారిని మోసపరచిన అపవాది అగ్ని గంధకము గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూరమృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్లు బాధింపబడుదురు.

ఘటసర్పము అగ్ని గంధకములోనికి త్రోసి అతడు పగలు రాత్రి బాధింపబడునట్లు దేవుడు నిశ్చయపరచును. ఇది దేవుని న్యాయ తీర్పైయున్నది. ఆ బాధకు ఘటసర్పమును అతని అనుచరులును తగిన వారే.

వచనం 11: మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైయున్న యొకనిని చూచితిని. భూమ్యాకాశము ఆయన సముఖము నుండి పారిపోయెను. వాటికి నిలువ చోటు కనబడకపోయెను.

పరిశుద్ధులకు వెయ్యి సంవత్సరాలు బహుమానమునిచ్చిన తరువాత దేవుడు నూతన భూమి ఆకాశమును సృజించి, ఆ స్థలంలో శాశ్వతకాలము వారితో జీవించును. దీనిని చేయుటకు దేవుడు తాను చేయ నిర్ణయించి వాటి ముగింపునకు వచ్చిన ఆఖరి దశలో పూర్తి చేయాలి. ఆఖరి క్రియగా ప్రభువు తానే న్యాయాధిపతిగా పాపులకు ఆఖరి తీర్పు తీర్చుటకై ధవళ సింహాసనంపై కూర్చొని జీవగ్రంధమందు తమ పేర్లు వ్రాయబడిన వారిని తప్ప లిఖించబడినట్లుగా వారి వారి క్రియల చొప్పున వారికి తీర్పు తీర్చును.

పాపులకు దేవుడు తీర్పు తీర్చుట దీనితో పూర్తగును. అప్పటి నుండి నూతన ఆకాశము భూమి యొక్క పాలన ఆరంభమగును. మన ప్రభువు మొదటి ఆకాశమును, మొదటి భూమిని మాయమగునట్లు చేసి రెండవ లోకమైన నూతన ఆకాశము మరియు నూతన భూమి సృజించి పరిశుద్ధులను ఆ పరలోకరాజ్యములో నివసింపనిచ్చును. తన జీవగ్రంధములోను తీర్పు గ్రంధములోనూ వ్రాయబడిన దాని ప్రకారము ఒక గుంపు ప్రజలకు నూతన భూమి మరియు ఆకాశమును మరియు మరియొక గుంపునకు నరకమును శిక్షను ఇచ్చును.

వచనం 12 : మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంధము విప్పబడెను. మరియు జీవగ్రంధమును వేరొక గ్రంధమును విప్పబడెను. ఆ గ్రంధము యందు వ్రాయబడియున్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పుపొందిరి.

ఈ సమయమందు క్రీస్తుని తీర్పు అంత్యశిక్షను కనుపరచును అలా ఆయన తన అంతిమ వాక్కును నరకమను శిక్షను పాపులపైకి పంపును. తమ క్రియలను బట్టి తీర్పు గ్రంధముందు వ్రాయబడినట్లు వారికి తీర్పు తీర్చబడును. అట్టి విధముగా పాపులు రెండు మార్లు చనిపోవుదురు. పాతాళము యొక్క బాధ, వారికి రెండవ మరణము దానినే బైబిలు శాశ్వత మరణముగా వర్ణించుచున్నది. పాపులు నరక్షశిక్ష నుండి తప్పించుకొనలేరు. కాబట్టి వారు ఇప్పుడే నీరు మరియు ఆత్మమూలమైన సువార్త యొక్క వాక్యమును నేర్చుకొనుటకు తప్ప వెదకవలెను. వారు ఇంకనూ ఈ భూమిపైనున్నప్పుడే దానిని విశ్వసించి తద్వారా జీవగ్రంధమందు తమ పేరు లిఖించబడు దీవెనలను పొందెదరు.

వచనం 13: సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళ లోకమును వాటి వశముననున్న మృతులనప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందును.

సముద్రము తనలోని మృతులను అప్పగించెను. మరణమును, పాతాళలోకమును వాటి వశముననున్న మృతులను అప్పగించెను. తన పాపముకొరకై పాపులందరూ అంతిమ తీర్పును పొందవలెను. ఈ భాగములో వర్ణించబడిన స్థలము మరణము, మరియు పాతాళము అనగా ప్రత్యేకముగా ఈ స్థలములో సాతాను, యొక్క పరిచారకులై తాము జీవించియున్నప్పుడు అతని ఆధీనములోనున్న దేవునికి వ్యతిరేకముగా నిలువబడి పాపము జరిగించినవారై దేవునిచే బాధింపబడెదరు. ఈ వచనం మనకు బోధించునదేమనగా ఒకప్పుడు దేవుడు తన తీర్పు విషయమై ఒక్క నిమిషము బోధించినప్పటికి తమ అంతిమ తీర్పునకిప్పుడు సమయము వచ్చియున్నది.

అలాగే ప్రజలు ఎక్కడ నివసించినను వారు ఎవరికి సంబంధించిన వారో గుర్తించుకొనవలెను. ఈ భూమిపై నున్నప్పుడు సాతాను పరిచారకులుగా పనిచేసినవారు మృతి నుండి తీర్పు పునరుత్ధానము కొరకు లేచెదరు. కానీ మన ప్రభుని నీతి క్రియలకు పరిచర్య జరిగించినవారు జీవ పునరుత్ధానము కొరకు దీవెన కొరకు లేచెదరు. పాపులందరూ తమ పాపము కొరకు తీర్పు తీర్చబడి తమ అంతిమ శిక్షను నరకములో పొందెదరు. కానీ నీరు మరియు ఆత్మమూలమైన సువార్తకై పరిచర్య జరిగించినవారు నిత్యజీవపు పునరుత్ధానమును, దీవెనలను పొందెదరు.

కాబట్టి ఈ భూమిపై నుండగానే ప్రజలు గుర్తించవలసినదేమనగా ప్రభువు మన పాపములను పరిహరించిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్త అత్యంత ప్రాముఖ్యము గలదని గుర్తించాలి. ఈ భూమిపై సాతాను పరిచారకులుగా జీవించిన వారు నిత్యశిక్ష యొక్క పునరుత్ధానముతో లేచెదరు. కానీ మన ప్రభుని నీతి క్రియలకు పరిచర్య జరిగించినవారు నిత్యజీవ పునరుత్ధానముతోను దీవెనతోనూ లేచెదరు. పాపులందరూ తమ దోషము కొరకై తీర్పు తీర్చబడి అంతిమ శిక్షను ఈ భూమిపై నున్నప్పుడే విశ్వసించాలని దాని యొక్క సంక్షిప్త ఉద్దేశ్యమును కనుగొనగలము. ఈ సువార్త ద్వారానే ప్రభువు మన పాపమును పరిహరించెను.

వచనం 14 : మరణమును మృతుల లోకమును అగ్ని గుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము.

ఈ వచనం మనకు దేవుని యెదుట మానవాళి పాపముల కొరకై తీర్చబడబోవు తీర్పును, ఆ పాపము సాతాను పక్షమున నిలచుట ద్వారా జరిగెను. ప్రజలను సాతాను వైపు నడిపిన వారి కొరకై ఉంచబడిన శిక్ష అగ్ని గుండములో వేయబడుటయే. దేవుడు పాపులపైకి తేబోవునది రెండవ మరణము మరియు అగ్నిగుండము యొక్క శిక్ష బైబిలు మాట్లాడు మరణము కేవలము మాయమగుట కాదు కానీ నరకాగ్నిలో నిత్యశిక్షను పొందుట.

లేఖనములో చెప్పబడిన రక్షణ తాత్కాలికమైనదికాదు గానీ శాశ్వతమైనది. ఈ భూమిపై నుండగానే నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించిన వారు నిత్యపరలోకరాజ్యములో ప్రవేశించి, నిత్యము సంతోషముతో జీవిస్తారు. నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించని వారికి ఇవ్వబోవు బహుమానమునకును అవిశ్వాసులకివ్వబడబోవు శిక్షలకును మధ్య పరలోకమునకు భూమికి మధ్యగల వ్యత్యాసమంత గొప్ప వ్యత్యాసమున్నది.

వచనం 15: ఎవని పేరైనను జీవగ్రంధమందు వ్రాయబడినట్లు కనబడినట్టు కనబడనియెడల వారు అగ్ని గుండములో పడవేయబడెను.

“ఎవరైనా” అనగా జీవగ్రంధములో ప్రజల పేర్లు వ్రాయబడుట లేక వ్రాయబడకపోవుట అనునది తమ పాపములన్ని క్షమించబడి వారు హిమమువలె తెల్లగా మారుటకు కారణమైన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించారా లేదా అనుదానిపై పూర్తిగా ఆధారపడియున్నది. కానీ వారు సంఘమునకు వెళ్ళు వారు లేక వారి సంఘము శాస్త్రీయమైనవా లేక విరుద్ధమైనవా అని కాదు. కాబట్టి ప్రభుని జీవగ్రంధమందు తమ పేర్లు వ్రాయబడినవారు ఏ రాయితీ లేక నరకాగ్నిలోనికి త్రోయబడుదురు.

ఈ లోకములోని మతస్తులు వారి పాపవిమోచనకంటే తమ సాంప్రదాయాలకు ఆచారాలకు అధిక ప్రాధాన్యత నిచ్చునట్లుగా వారు సముఖత కలిగి ఉన్నారు. కానీ దేవుని యెదుట నిలుచున్నప్పుడు యేసు అనుగ్రహించిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను ఒకని హృదయంలో లేనట్లయిన అతని పేరు జీవగ్రంధములో వ్రాయబడదు. అతడు/ఆమె ఒకవేళ మంచి క్రైస్తవుడైననూ, అతడు/ఆమె కూడా అగ్నిగుండములోనికి త్రోయడతారు.

కాబట్టి నీవు ఈ భూమిపై నివసించుచున్నప్పుడే నీవు నీ చెవులతో నీ పాపాలన్నీ పోగొట్టిన ప్రభువు యొక్క నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను వినాలి. మరియు నీవు దానిని నీ పూర్ణహృదయంతో విశ్వసించాలి. అప్పుడు నీ పేరు జీవగ్రంధములో వ్రాయబడిన మహిమను నీవు పొందగలవు.