Sermons

[అధ్యాయము 20-2] <ప్రకటన 20:1-15> మనము మరణము నుండి జీవమునకు ఎట్లు దాటగలము?<ప్రకటన 20:1-15>


దేవుడు ఈ లోకమును మాయమగునట్లు చేసి దానికి బదులుగా నూతన భూమి ఆకాశమును మనకిస్తానని చెప్పుచున్నాడు. ఆయన ఇంతకుముందు ఈ భూమిపై నివసించినప్పుడు నిద్రించుచున్న పాపులను అతని/ఆమె సమాధి నుండి లేపును. వచనం 13 ఇక్కడ మనకు ‘‘సముద్రము తనలోని మృతులను, మరణము, పాతాళము తమలోనున్న మృతులను అప్పగించెను” అని చెప్పుచున్నది. నీటిలో మునిగియున్న మనుష్యుని శరీరమును చేపలు తినివేయును. కాగా అగ్నిచే కాల్చబడిన వ్యక్తి ఇకనూ ఎన్నడూ గుర్తించలేనట్లుగా మారును. అయిననూ అంత్యకాలము వచ్చినప్పుడు దేవుడు అందరిని సజీవులనుగా చేసి వారిని నరకమునకు గాని పరలోకమునకు గానీ, పంపుటకు తీర్పుతీర్చును. వారు సాతానుచే మ్రింగబడిననూ, పాతాళములో చంపబడిననూ, కాల్చబడి చంపబడిననూ లెక్కచేయక వారిని జీవింపచేయునని బైబిలు చెప్పుచున్నది.

దేవుని యెదుట జీవగ్రంధముండగా దానిలో పరలోక రాజ్యములో ప్రవేశించ అర్హులైన వారి పేర్లు వ్రాయబడి యుండును. అక్కడ క్రియల యొక్క పుస్తకము కూడా ఉండును. దానిలో నరకములోనికి త్రోయబడువారి పేర్లు వారి పాపము వ్రాయబడి యుండును. ఈ క్రియల పుస్తకములో ఒకడు ఈ భూమిపై నివసించినప్పుడు చేసిన పనులన్నీ వ్రాయబడును. ఈ విషయములన్నీ దేవుడు తన సముఖములో నియమించెను.ఆ ప్రభువు రెండు రకముల పుస్తకాలను కలిగియుండెను.


దేవుడు ఇప్పటికే తన స్వంత నీతిక్రియలను బట్టి ప్రజలను తమను తాము మార్చుకొనగల రెండు విభాగాలుగా చేసెను. దేవుడు నిర్ణయించినదేమనగా మృతులందరూ పునరుజ్జీవింపబడతారు. తన రెండు పుస్తకముల యెదుట నిలిచినవారై తీర్పు తీర్చబడతారు. ఈ భూమిపైనున్నప్పుడు యేసును నమ్మిన తన పాపపరిహారం పొంది వారి పేర్లు మాత్రమే జీవగ్రంధమందు వ్రాయబడి పరలోకములో ప్రవేశించుటకు నిర్ణయించబడతారు. కాబట్టి దేవుని అంత్యతీర్పు ఈ రెండు పుస్తకాలలో దేనిలో ఒకని పేరు వ్రాయబడెనో అనుదానిపై ఆధారపడి ఉండును.

మరొక మాటలో చెప్పాలంటే దేవుడు ఇప్పటికే ఎవరు పరలోకంలో ప్రవేశిస్తారు. ఎవరు నరకంలో త్రోయబడతారు అనుననది నిర్ణయించెను. కనుక దేవుడు మృతులందరినీ పునర్జీవింపచేసి తన పుస్తకమును తెరచి ఆ రెండు పుస్తకాలలో దేనిలో వారి పేరు వ్రాయబడెనో చూచును. జీవగ్రంధములో తమ పేర్లు వ్రాయబడిన వారిని పరలోక రాజ్యమునకు పంపించును. కానీ దానికి బదులుగా ఈ జీవగ్రంధములో తమ పేర్లు లేని వారిని నరకములోనికి త్రోయును.

దేవునిచే నిర్ణయించబడి నిలిచియున్న ఈ సత్యమును మనము తెలిసికొని విశ్వసించాలి. ఎవరు పరలోకమునకు పంపబడతారు. ఎవరు నరకములోనికి పంపబడతారు అని నిర్ణయించుటకు దేవుడు మృతులందరినీ పునరుత్ధానపరచి వారికి తీర్పు తీర్చును. ఆయన వారి పేర్లు జీవగ్రంధమందు వ్రాయబడినవా లేక క్రియలు (తీర్పు గ్రంధము) గ్రంధములో వ్రాయబడిన దానిని బట్టి వారికి తీర్పుతీర్చును తన యెదుట నిలబడబోవు వారందరు ఎక్కడ నిలబడవలెనో ఆ రెండు స్థలములను దేవుడు ముందుగానే నిర్ణయించెను. ఆ స్థలాలు పరలోకము మరియు నరకమే నరకము అగ్ని గుండము దానిలో అగ్ని గంధకము మండుచుండును. జీవగ్రంధమందు తమ పేర్లు వ్రాయబడని వారిని అగ్నిగుండములో పడవేయబడుటకు దేవుడు నిర్ణయించెను. కాగా జీవగ్రంధములో వ్రాయబడినవారు పరలోకములోనికి ఆహ్వానించబడెదరు.

పరలోకంలో జీవజలనది ఒడ్డున జీవవృక్షముండును. ప్రతి రుతువు ప్రకారము పన్నెండురకాల ఫలాలను కలిగియుండును. ఈ రమ్యమైన పరలోకంలో పరిశుద్ధులకు బాధయేగానీ రోగమేగానీ ఉండదు కానీ ఎల్లప్పుడూ దేవునితో సంతోషముగా జీవిస్తారు. దేవుడు తన పరలోకమును పరిశుద్ధులకు ఇచ్చుటకు దేవుడు నిర్ణయించెనని మనము తప్పక విశ్వసించాలి.

యేసుని నమ్మని వారిని మరొకరకంగా క్రియల పుస్తకంలో తమ పేర్లు వ్రాయబడిన వారని అర్థము. ఈ భూమిపైనున్నప్పుడు పాపులు చేసిన క్రియలన్ని ఈ పుస్తకములో వ్రాయబడియుండును. అట్టి వారిందరినీ అగ్నిగుండములోనికి త్రోయుదునని దేవుడు మనకు చెప్పుచున్నాడు. ఆ పుస్తకములో గ్రంథస్తము చేయబడిన వారి పాపములకు తగినట్లు శిక్షించును. ఈ శిక్ష వారు యేసును నమ్మినందుకు ఈ శిక్ష విధించును. నీ పేరు నా పేరు ఈ పుస్తకములోనే ఉన్నది అన్నదే ప్రాముఖ్యమైన విషయం.

ఈ లోకములో జీవించు మనకు కనబడుచున్నదే జీవితము కాదని మనం గుర్తించాలి. కీర్తన 90:10 మనకు ఇట్లు చెప్పుచున్నది ‘‘మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు, అధిక బలమున్నయెడల ఎనుబది సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే. దుఃఖమే అది త్వరగా గతించును. మేము ఎగిరిపోదుము.’’ ఒకవేళ మనం ఈ భూమిపైన 70 సంవత్సరములు లేక 80 సంవత్సరములు బ్రతికిననూ త్వరగానో, ఆలస్యంగానో మనము దేవుని యెదుట నిలబడాలి. అలాగున మనము ఆఖరికి ప్రభువు ఎదుట నిలబడినప్పుడు, జీవగ్రంధము లేక తీర్పు గ్రంధము ఈ రెండింటిలో దేనిలో నీ పేరు వ్రాయబడెను అనునదే, దీనిని బట్టి మనము పరలోకములోనికి ఆహ్వానించబడతామా లేక అగ్నిగుండములోనికి త్రోయబడతామా అనునది కనుగొనవచ్చు. ఈ భూమిపై నివసించుటే సర్వస్వము కాదని మనం గుర్తించాలి.జీవగ్రంధమందు తమ పేర్లు వ్రాయబడినవారు


మనం లూకా 16:19-29 చూద్దాం ‘‘ధనవంతుడొకడుండెను. సన్నపు నార వస్త్రమును ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండినవాడు ధనవంతుని యింటి వాకిట పడియుండి అతని బల్లమీద నుండి పడు రొట్టెముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూత చేత అబ్రహాము రొమ్మును (ఆనుకొనుటకు) కొనిపోబడెను ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును (ఆనుకొనియున్న) లాజరును చూచి తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి, తన వ్రేలికొనను నీళ్లలోముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిజ్వాలలో యాతనపడుచున్నానని చెప్పెను. అందుకు అబ్రహాము-కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్లు సుఖము అనుభవించితివి. ఆలాగుననే లాజరు కష్టము అనుభవించెనని జ్ఞాపకము చేసికొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు రాజాలకుండునట్లును, మాకును మీకును మధ్యలో మహా అగాధముంచబడియున్నదని చెప్పెను.’’

ఈ భాగము నుండి యేసు మనకు బోధించునదేమనగా పరలోకము నరకము వాస్తవమే. ఈ భాగములోనున్న ధనవంతుని వలే, ఎంతో మంది ప్రజలు పరలోక, నరకము యొక్క ఉనికిని నమ్మరు. అబ్రహము విశ్వాసులకు తండ్రి ఇక్కడ లాజరు అబ్రహాము రొమ్మునకు చేరెనని చెప్పబడగా దాని అర్థము. అబ్రహాము దేవుని వాక్యమును ఎట్లు విశ్వసించెనో లాజరు కూడా యేసు తన రక్షకుడని విశ్వసించెను. తన పాప ప్రాయశ్చిత్తము పొందెను. అందువలన పరలోకమునకు వెళ్ళెను. ఈ లోకములో బ్రతుకుచూ లాజరు మరియు ధనవంతుని అదృష్టమును మనమంతా పోల్చి చూడవలెను.

ఈ లోకములోని ప్రతివారికి దేవుడు చెప్పునదేమనగా ఈ భూమిపై జీవితమే సర్వస్వమనుకోకూడదు. ఈ భూమిపై ఒకడు ఎంత కష్టపడి జీవించిననూ అతడు/ఆమె కేవలము అధికంగా 70 లేక 80 సంవత్సరాలు బ్రదకడం అనునది కాదు కానీ అతడు జీవితము అంతయును ఎట్లుండుననునది నిజమైన కష్టము లేక దుఃఖము.

కాబట్టి మన జీవితమును మనం జీవించుచూనే మనమందరమూ తప్పక దీని తరువాత జీవితము కొరకు సిద్ధపడాలి. మనము మన విశ్వాసమును మన పిల్లలకు కూడా అందించాలి. ఎందుకనగా వారు కూడా మంచి స్థలమునకు వెళ్లగలరు. ఈ తీర్పు తీర్చబడుటకు దేవుని యెదుట నిలువబడుట ఎంత బాధాకరము?

దేవుని నిర్ణయమును మార్చుటకు ఏ మనిషికి సాధ్యపడదు. క్రియల గ్రంధములో తమ పేర్లు వ్రాయబడిన వారు అగ్ని గుండములో త్రోయబడుట మాత్రమే జరుగును. అప్పుడు ఆ అగ్నిగుండములో నుండి తప్పించబడుటకు మరే మార్గము మనకు లేదు గానీ జీవగ్రంధమందు మన పేర్లు వ్రాయబడియుండుటయే.

అయిన మన పేర్లు జీవగ్రంధమందు ఎలాగు వ్రాయబడును? కేవలము లాజరు అబ్రహాము రొమ్మున చేర్చబడినట్లే మనము కూడా తప్పక మన పాప పరిహారమును పొందుటకు దేవుని వాక్యము ద్వారా దేవుని నీతిక్రియలను (రోమా 5:18) తెలిసికొని విశ్వసించాలి. అప్పుడే మనము పరలోకములో ప్రవేశించగలము. జీవగ్రంధములో మన పేర్లు వ్రాయబడుటకు మనము తప్పక యేసుని విశ్వసించాలి. యేసు తానే మెస్సయ్య మరియు దేవుడునైయున్నాడు. మెస్సయ్య అనగా పాపములోపడి యున్నవారిని రక్షించువాడు కేవలము యేసు మనలను రక్షించగలడు. లేనియెడల మన పాపములనుబట్టి దేవునిచే తీర్పుతీర్చబడి అగ్నిగుండములో త్రోయబడవలసినవారమై యున్నాము.

దేవుని యెదుట ఏ పాపమును ఎప్పుడును జరిగించనివారు మరియు 100 శాతం తమ క్రియలలో పరిశుద్ధముగానున్న వారెవరైనా ఉన్నారా? ఎవరునూ లేరు! ఎందుకనగా మనమందరమూ తొందరపాటు కలిగియున్నాము. మనము ఏ దారి లేక పాపములో పడియుందుము. మరియు ఈ పాపములకొరకు, మనమందరమూ అగ్ని గుండములో త్రోయబడవలసినవారమే.

కానీ దేవుడు మనలను రక్షించుటకే యేసును భూమిపైకి పంపెను. మనము మన పాపముల కొరకు అగ్నిగుండంలో పడద్రోయబడవలసినవారము. ‘యేసే’ అనగా తన ప్రజలను వారి పాపము నుండి రక్షింపగలవాడని అర్థము (మత్తయి 1:21). కాబట్టి మనం పరలోకం చేరాలంటే యేసు ఈ భూలోకమునకు వచ్చి తన నీతిక్రియలను బట్టి మన పాపములన్నిటి నుండి మనలను రక్షించును అను సత్యమును విశ్వసించాలి.అయిన అగ్నిగుండములోనికి ఎవరు త్రోయబడతారు? 


ప్రకటన 21:8లో అగ్నిగుండములో ఎవరు త్రోయబడతారో చెప్పుచున్నది. ‘‘పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యలును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రికులును అబద్ధికులు అందరూ అగ్నిగంధకముతో నుండు గుండములో పాలుపొందుదురు. ఇది రెండవ మరణము మొదటిగా ‘‘పిరికివారని” బైబిలు ఎవరిని చెప్పుచున్నది? నామకార్థ క్రైస్తవులు, నీరు మరియు ఆత్మమూలమైన సువార్త ద్వారా తమ పాపపరిహారము పొందుటలో తప్పిపోయిన వారు కాబట్టి ఎలాగో వారు యేసును విమర్శించినను వారు దేవుని యెదుట భయపడుదురు. అవిశ్వాసులైన వారిని, అసహ్యులైన వారిని, నరహంతుకులైన వారిని, వ్యభిచారులైన వారిని, విగ్రహారాధికులను, అబద్ధికులందరినీ నరకములోనికి త్రోయును. సాంప్రదాయకంగా కొరియాలో ఎంతోమంది విగ్రహారాధికులున్నారు. ఇప్పటికి దేవుని స్వరూపములో చేయబడిన విగ్రహముముందు ప్రజలు మ్రొక్కి తమ ప్రార్థనలను వాటికి సమర్పించుట అనునది అసాధారణమేమీ కాదు. ఆలాగున ప్రజలు చేయుటకు కారణమేమనగా వారు అజ్ఞానులను, బుద్ధిహీనులైయున్నారు. జీవము లేని ప్రతిమను, పరసంబంధమైనవిగా ఆరాధించుటకు దేవుడు అసహ్యించును. దేవుడు మనిషిని తన పోలిక చొప్పున సృజించెను (ఆది 1:27). మానవుని సమస్త సృష్టికి అధికారియైయుండెను. ఇందువలన మనము తప్పక దేవుని విశ్వసించాలి. ఎందుకనగా మనము పోలికైయున్నందునను మనము ఎల్లప్పుడూ ఉంటాము. ఏలాగంటే దేవుడు నిరంతరమూ జీవించియుండు రీతినే మన మరణము తరువాత మనకొరకు నిత్యరాజ్యము ఉన్నది. అందువలనే దేవుడు ఆయననే ఆరాధించమనెను. ఆయనే శాశ్వతమైన దేవుడు. అలాగైనప్పుడు మనము కేవలము దేవుని సృష్టి ఎదుట మోకరించిన యెడల ఏమి జరుగును? దేవుని ఎదుట గొప్ప పాపమును జరిగించిన వారమౌతాము. ఎందుకనగా దేవుడు అధికముగా అసహ్యించుకొను దానిలో పాలుపొందిన వారమౌతాము. మానవాళి ఎంతో బుద్ధిహీనుడౌతాడు. మరియు తెలివిలేనివారుగా ఉంటారు. మనము మార్చబడిన విశ్వాసము కలవారిందరనీ అగ్నిగుండములో త్రోయుటకు దేవుడు నిర్ణయించెనని మనము గుర్తించాలి.

నరకములోనికి త్రోయబడిన వారికి రెండవ మరణము దీనిని దేవుడు తానే నిర్ణయించెను. వారి మొదటి మరణము ఈ భూమిపై వారి బాధాకరమైన జీవితము ముగిసినప్పుడు ఈ మర్త్యమైన లోకములో నడిచిన తరువాత సంభవించును. తరచుగా చెప్పబడిన రీతినే మొదటి నాలుగు కాళ్ళపైన తరువాత రెండు కాళ్ళపైన ఆ తరువాత కేవలము మూడు కాళ్ళపై జీవించువారు మనుష్యులు కాక మరెవరూ లేరు.

ఈ విధముగా మొదటి మరణమైన తరువాత దేవుని యెదుట మనుష్యులు పాపులుగా నిలుచునప్పుడు వారందరూ తమ తీర్పును ఎదుర్కొందురు. ఈ సమయమందు అంతము కాక నిత్యము నిలచునట్టి రెండవ మరణము అగ్నిగుండములో మరణమైన యెడల కనీసము దాని బాధ నుండి వారు విముక్తులౌతారు. మరణము వారి నుండి పారిపోవును. ప్రతివారు మరణమును చూడక నిత్యము జీవించాలని కోరుకొంటారు. నిజానికి మానవాళి ఉనికి వాస్తవముగా పరసంబంధమై యున్నది. అది ప్రజలు కోరిన విధమే. అందువలనే ఒకడు మరణించిన దానిని మరణమని బైబిలు వర్ణించదు. కానీ గాఢనిద్రలో నున్నారని చెప్పును. కనుక మనలను అగ్నిగుండములోనికి త్రోయు రెండవ మరణమును మనము తప్పక తప్పించుకోవాలి. జీవగ్రంధములో మన పేర్లు వ్రాయబడుటకు మనము ఏమి చేయవలెనో మనం తప్పక గ్రహించాలి. మరియు మన పేర్లు జీవగ్రంధములో వ్రాయబడుటకై సరిగా యేసుక్రీస్తు నందు విశ్వాసముంచాలి. యేసు, బుద్ధుడు, కన్‌ఫ్యూషియస్‌ మరియు మొహమ్మద్‌ అనువారు కేవలము మనుష్యులు. వారు మంచి ప్రజలుగా జీవించాలనుటకు సరిపోలిన వారని ప్రజలు తరచుగా తలంచుచూ ఉంటారు. అందువలననే మనము ఎందుకు యేసునే నమ్మమని వేడుకుంటాము అనేది వారు అర్థం చేసికొనలేరు. కానీ ఇవన్నీ తప్పుడు ఆలోచనలు. నీవు, నేను అలాగే ఈ లోకములోనిది ఏదైనా కేవలము సృష్టియై దేవుని యెదుట మానవాళిగా ఉన్నారు. కానీ మనము యేసుని ఆయన భూమిపైనున్నప్పుడు జరిగించిన వాటిని చూడగా ఆయన మిగిలిన నలుగురు అవతారుల వలే కాదని మనం గుర్తించగలం. ఆయన తానే దేవుడైయుండి మానవాళిని రక్షించుటకు మనుష్యుని రూపములో ఈ భూమిమీదకు వచ్చి తన బాప్తిస్మము ద్వారా మన పాపమును తనపై ఎత్తుకొని మన స్థానములో మన శిక్షను భరించెను. ఈ విధముగా మానవాళిని వారి పాపము నుండి విమోచించు క్రియలను ముగించెను.

క్రీస్తు జననము సాధారణ ప్రజల జననము నుండి వేరైనది స్త్రీ, పురుషుల కలయిక వలన పిల్లలు జన్మిస్తారు. ఈ విధముగానే ఈ లోకములో ప్రతివారు జన్మిస్తారు. కానీ యేసు పురుషుని ఎరుగని కన్యవలన జన్మించెను. మానవులమైన మనలను రక్షించుటకు యెషయా ప్రవక్త ద్వారా 700 సంవత్సరాలు ముందుగా చెప్పబడిన ప్రవచన నెరవేర్పులో తానే దేవుడైయున్న యేసు మానవ శరీరమందు కన్య మరియ గర్భము నందు ఈ భూమిపై జన్మించెను. (యెషయా 7:14) మరియు ఈ భూమిపై నుండగా చనిపోయినవారిని తిరిగి లేపుట కాక వ్యాధిగ్రస్థులను, వికలాంగులను స్వస్థపరచెను. ఆయన లోకపాపములన్నీ పోగొట్టెను.

దేవుడు సృష్టికి ప్రభువైయుండి ఈ విశ్వమంతటినీ తయారు చేసెను. ఈ భూమిమీదికి వచ్చెను. కొంతకాలం తానే మానవుడాయెను. ఇదంతయూ మానవాళిని తమ పాపము నుండి విడిపించుటకే చేసెను. యేసును మనం విశ్వసించవలసిన కారణమేమనగా, మొదటగా దేవుడు తనంతటతానే దేవుడైయుండెను. కనుక ఆయన మన పాపములను మన నుండి తీసివేసెను. తద్వారా మన పేర్లు జీవగ్రంధములో వ్రాయబడును. మనలను పాపరహితులైన దేవుని పిల్లలనుగా చేయును. ఒక్కసారే ఈ భూమిపై జన్మించి ఒక్కసారే మనమంతా మరణమగుదుము. మన మరణం తరువాత మనమంతా తీర్పు తీర్చబడతాము.

కానీ యేసు యోహాను ద్వారా పొందిన బాప్తిస్మము వలన మన పాపములన్నిటిని తనపై మోపికొని మన స్థానంలో ఆయన సిలువలో పొంది, తద్వారా ఆయనను విశ్వసించినవారమైన మనలను నిత్యరాజ్యమైన పరలోకంలో సదాకాలము నివసించునట్లు చేయును. మన పాపమునకైన తీర్పు నుండి మనలను విమోచించుటకు అనగా మన పాపములన్నిటి నుండి దేవుడు తానే మనలను పరిశుద్ధపరచెను. అందువలననే రక్షకుడైన యేసును మనము తప్పక నమ్ముకోవాలి.

యేసు ఏదో ఒక మానవుడు కాదు. మానవాళిని తానే రక్షించెదనని దేవుడు వాగ్ధానము చేసిందున ఈ వాగ్ధానమును నెరవేర్చుటకు ఆయన కన్యగర్భము ద్వారా శరీరాకారిగా ఈ భూమిపైకి వచ్చెను. వాస్తవంగా ఆయన మనలందరినీ మన పాపము నుండి రక్షించును. కనుక మనము తప్పక యేసయ్యను సరిగా నమ్మాలి. అప్పుడు మన పేర్లు జీవగ్రంధములో వ్రాయబడును. నీరు మరియు ఆత్మమూలమైన తిరిగి జన్మించుట ద్వారానే నిత్యరాజ్యమున ఒకడు చూచునని దేవుడు సెలవిచ్చెను. మనమంతా తప్పక యేసును నమ్మాలి.పరలోకమునకు తానే మార్గమైన యేసు :


యేసు ఎంత ఖచ్చితముగా మన పాపములను పోగొట్టెనో మనం తెలుసుకోవాలి. ఈ భూమిపైకి వచ్చి యొర్ధాను నదిలో యోహాను ద్వారా యేసు బాప్తిస్మము పొందెను (మత్తయి 3:13-17). మానవాళి పాపములన్నిటిని తనపై మోపబడునట్లుగా (నీ, నా పాపముతో కలిపి) ఆయన యోహాను నుండి బాప్తిస్మము పొందెను. బాప్తిస్మమిచ్చు యోహాను చేతుల ద్వారా మానవాళి ప్రతినిధి అయిన యేసుపై మానవాళి అంతటి పాపము మోపబడెను. యోహాను ద్వారా లోకపాపములను తనపై మోపుకొన్న తరువాత యేసు సిలువపై తన రక్తమును కార్చి దానిపై మరణించెను. తరువాత మూడు దినాలలో ఆయన మృతి నుండి తిరిగి లేచెను.

ఎవరైతే ఆయన యందు విశ్వాసముంచుతారో వారే నిత్యజీవమును పొందుతారని మన ప్రభువు వాగ్ధానము చేసెను. అతని/ఆమె పాపములన్నిటిని యేసుతానే తనపై మోపుకొని ఈ శిక్షనంతటిని సిలువలో పొందెను. అని ఎవరు విశ్వసించుదురో వారు అగ్ని గుండములో త్రోయబడుదురు గాని దానికి బదులు అతని/ఆమె పేరు జీవ్రగంధమందు వ్రాయబడును.

యోహాను 14:6లో యేసు ఈలాగు చెప్పెను. ‘‘నేనే మార్గమును, సత్యమును, జీవమునైయున్నాను. నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు చేరడు.’’ మానవజాతి పరలోకమునకు మార్గమైన యేసును తప్పక విశ్వసించాలి. యేసే మన రక్షకుడు. యేసు మన దేవుడు. యేసే ఈ లోకంలో నిజమైన సత్యమైన ఒక్కడే దేవుడు మరియు యేసే జీవమునకు ప్రభువైయున్నాడు. మన పేరులు జీవగ్రంధమందు వ్రాయబడుటకు, దేవుని పరలోక రాజ్యములోనికి ఆహ్వానించబడుటకు మనము తప్పక యేసును విశ్వసించాలి.

ఎందుకనగా వాస్తవముగా యేసు మన పాపములనన్నింటిని యొర్ధాను నదిలో యోహాను ద్వారా పొందిన బాప్తిస్మము ద్వారా తనపై మోపుకొనెను. మనము తప్పక ఆయన యందు విశ్వసించాలి. ఆయనే ఏకైక రక్షకుడాయెను. నీవు నేను ఇప్పుడు పరలోకములో ప్రవేశించునట్లు మన పాపములను బట్టి శిక్ష సిలువ వేయబడి తన రక్తమును చిందించి మన రక్షణను యేసు సంపూర్తి చేసెను.

అగ్నిగుండములో త్రోయబడవలసిన వారెవరో వారిని యేసు నిర్ణయించెను. ఎవరు విశ్వసించలేదో ఆ పిరికివారందరూ అగ్నిగుండములోనికి త్రోయబడెదరు. వారు అగ్నిగుండములో త్రోయబడుటే కాక వారి అవిశ్వాసము కారణాన వారి పిల్లలు మరియు వారసులు కూడా త్రోయబడెదరు. ఒకని భౌతిక మరియు ఆత్మీయ జీవితాలు భద్రతలో చేరాలంటే ప్రతివారు వాస్తవంగా ఖచ్చితంగా యేసును విశ్వసించాలి.యేసు తన బాప్తిస్మమును పొందియుండకపోయినను ఏమగును?


దేవుడు ఒక్కడే మనుష్యులకు తన దీవెనలు లేక శాపమును ఇవ్వగలడు. ఇందువలననే మనము తప్పక ఆయనను నమ్మాలి. అనేకుల జీవితాలు ఎందుకు బాధాకరముగానున్నవని నీకు తెలియునా. ఈ భూమిపైన దేశాలు కూలడానికి కారణాలు తెలియునా? అది ఎందుకనగా, ఆయనను ద్వేషించి విగ్రహారాధన చేయువారిని నాలుగు తరములుగా శపిస్తానని దేవుడు చెప్పెను. అయితే దేవుని ప్రేమించి, ఆరాధించి తన ఆజ్ఞలను అనుసరించువారికి తన దీవెనలు వెయ్యి తరములు నిలుచునని (నిర్గ 20:5-6) కూడా ఆయన సెలవిచ్చెను. 

దీని అర్థమేమనగా ఒకడు ఏదో విధముగా యేసును విశ్వసించినట్లయినా అతడు/ఆమె నియమమేమి లేక దీవించబడుదురు. ఒకడు ఆయనను గూర్చిన సరియైన పరిజ్ఞానముతో యేసును నమ్మవచ్చును. ఆయనే తన బాప్తిస్మముచే పాపములన్నీ తనపై మోపికొని వారి పాపములన్నిటిని కడిగివేసెను. మరియు వారి స్థానములో సిలువవేయబడిన ఆయన వారి నిజమైన రక్షకుడాయెను. వారు విశ్వసించిన యేసు క్లుప్తముగా వారి స్వంత దేవుడై స్వంత రక్షకుడాయెను. అటు తరువాత ఆయన అట్టి విధముగా విశ్వసించిన వారిని వెయ్యి తరముల వరకు దీవించెదనని దేవుడు సెలవిచ్చెను.

కానీ అదే సమయంలో యేసును విశ్వసించని వారిని మూడు నాలుగు తరముల వరకు శపించెదనని కూడా దేవుడు వాగ్ధానము చేసెను. ఇందువలనే ప్రతివారు నీరు మరియు ఆత్మమూలమైన సువార్త వలన తిరిగి జన్మించుట అను సత్యమును తెలిసికొని విశ్వసించాలి. అట్టి విశ్వాసముగల వారికి వారి పాపములన్నియు క్షమించబడును. నిత్యజీవమును పొందును. పరలోకములో ప్రవేశించెదరు. అలాగే ఈ భూమిపై నుండగా పూర్వము అబ్రహామునకు దేవుడిచ్చిన దీవెనలన్నీ పొందెదరు.

దేవుడు మన కొరకు నిర్ణయించిన ఈ లోకములో నివసించుచూ వ్రాయబడిన వాక్య ప్రకారము మన విశ్వాసము ఖచ్చితముగా ఉండాలి. ఈ సత్యమును తెలిసికొనక విశ్వసించక ఉండువారిని దేవుడు అగ్నిగుండములోనికి త్రోయును. కానీ విశ్వసించినవారిని దానికి బదులు వారి పేర్లను జీవగ్రంధములో వ్రాయబడి నూతన భూమి, ఆకాశమును ఆహ్వానించబడెదరు. విశ్వసించినవారు తిరిగి జీవించెదరని మనము విశ్వసించాలి. మనము తిరిగి జన్మించుట నీరు మరియు ఆత్మమూలమైన సువార్త వలన మాత్రమే జరుగును.

నీరు లేకుండా ఎలాగు బ్రతకలేమో రక్తమూలమైన సువార్తతోపాటు నీటి మూలమైన సువార్త రక్షణ కొరకు అతి ప్రాముఖ్యమైనది. యేసు బాప్తిస్మము పొందినప్పుడు ఆయన మన పాపములన్నిటిని తనపై మోపుకొనెను. ఆయన నీటిలోమునిగెను. నీటినుండి పైకి లేచెను. దీని అర్థము ఆయన సిలువ మరణము ఆయన పునరుత్ధానము అనగా మన ప్రభువు మన పాపములన్నిటి కొరకు మన స్థానములో తీర్పుతీర్చబడెను. మరియు ప్రభువు నీటి నుండి బయటకు వచ్చుట అనునది ఆయన పునరుత్ధానమును సూచించుచున్నది. మనలో దీనిని విశ్వసించువారమైన మన పునరుత్ధానమును కూడా అని అర్థము.

కూలంకుషముగా యేసు తన బాప్తిస్మము ద్వారా ఆయనే మన పాపములను మోసెనని మనం విశ్వసిస్తున్నాం. యేసు తన బాప్తిస్మమును తీసికొనియుండుకపోయిన మనకు ఏమి సంభవించియుండును? అగ్నిగుండము నుండి తప్పించుకొనుటకు మనకు మార్గము లేకపోవును. వర్షము లేకుండా ఈ లోకములో ఎవరును జీవించలేనట్లే భూగ్రహము నీటి మూలమునకే కొనసాగుచూ ఉన్నది. అలాగే మనకు యేసు బాప్తిస్మము అంతప్రాముఖ్యము అలాగే ఆయన సిలువ మరణము కూడా అంతే ప్రాముఖ్యము కలిగియున్నది. అనగా ఆయన సిలువ మరణము కూడా పొందెను. మనము దేవుని తీర్పు మరియు శిక్ష నుండి విడుదల పొందాలంటే ఖచ్చితంగా మనము యేసుక్రీస్తును నమ్మాలి. మనం పాపాల నుండి కడుగబడాలంటే యేసు బాప్తిస్మము పొందినప్పుడు మన పాపములన్ని ఆయనపై మోపబడెనని మనం విశ్వసించాలి.

క్రైస్తవ విశ్వాసము ప్రజలను భయముతో వణికించునట్టి మతము వంటిది కాదు. ప్రతివారు తప్పక యేసును విశ్వసించాలి. తిరిగి జన్మించినవారు, తిరిగి జన్మించిన సంఘమునకు వచ్చినట్లయిన వారు వాక్యము విని విశ్వాసముతో పోషింపబడతారు.

కొంతమంది ఒకడు యేసును విశ్వసించి రక్షింపబడునట్లు మంచి క్రియలు చేయాలి. అప్పుడు దీవెనలు పొందుతారని చెప్తారు. కానీ ఇది కేవలము అబద్ధికుల మోసముతో చెప్పునదే. అవును మనము మంచి క్రియలు చేస్తూ నిజక్రైస్తవులుగా జీవించాలి. కానీ మన మూల సమస్య అయిన రక్షణను గూర్చియోచించినంత కాలము మన స్వభావము చెడ్డదైనందున మన శరీరజీవితాన్ని 100 శాతం సంపూర్ణముగా నివసింపలేము. అందువలన ఒకడు మంచిక్రియల ద్వారా రక్షింపబడునని చెప్పిన వారు ప్రజలను మోసగించుచూ అబద్ధికులై నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను గూర్చిన అజ్ఞలను మనము పాపమునకు కట్టుబడియున్నామని మనం గుర్తించినప్పుడు యేసుక్రీస్తు పొందిన బాప్తిస్మమును మనం విశ్వసించి వ్రాయబడిన దేవుని వాక్యము నుండి ఆయన మన పాపమును సిలువలో మోసెనని నమ్మిన ఈ విషయాలన్నీ మనం అంగీకరించిన అప్పుడే మనం నీతిమంతులమౌతాము. ఎవరి హృదయాలు పాపరహితంగా ఉంటాయో వారు పరలోకంలో ప్రవేశించుటకు అర్హులు. పరిశుద్ధాత్మ మనలో జీవించుచూ మనలను నడిపించుటకు ముందు మనలో ఎవరునూ మంచివారు కారు. మనం ఎంతగా ప్రయత్నించిననూ మన వల్ల కాదు.

మన పాపములను పోగొట్టి దేవుడు మనలను రక్షించెను. నిత్యమూ మండుచుండుటకు అగ్నిగుండములోనికి మనలను త్రోయుటకు బదులు ఆయన మన పేర్లను జీవగ్రంధములో వ్రాసెను. మనకు నూతన భూమిని, ఆకాశమును ఇచ్చెను. పెండ్లికుమారుని కొరకు తమను అలంకరించుకొను రీతిని ఆయన కూడా మనకు పరిశుభ్రమైన అత్యంత అందమైన గృహమును, తోటలను, పుష్పములను ఇచ్చెను మరియు మన వ్యాధులన్నిటిని తొలగించెను. తన రాజ్యములో ఆయన మనతో కూడా నివసించును. రాబోవు జీవితము కొరకు మనం యేసును విశ్వసించాలి. మన ప్రస్తుత జీవితమును బట్టి కూడా మనం ఆయనను విశ్వసించాలి. మన పిల్లల కొరకు కూడా మనమాయనను విశ్వసించాలి.

నీవు పరలోకమునకు ఆహ్వానించబడుటకు ఇష్టపడతావా! లేక అగ్నిగుండములో త్రోయబడుటకు ఇష్టపడతావా? నీవు ఎటువంటి వారసత్వాన్ని నీ పిల్లలకు ఇవ్వబోతున్నావు? నీవు యేసునుందున్న విశ్వాసము కొరకు ఒక వేళ నీవు బాధను కానీ, ఇబ్బందిని కానీ ఎదుర్కొనవచ్చును. అయిననూ నీవు ఆయనను విశ్వసించాలి. అలాగున చేయుట వలన నీవు నీ కొరకు నీ పిల్లల కొరకు గొప్పదీవెనలను తెస్తావు.

నా ప్రియమైన పరిశుద్ధులారా, ఆయన వాక్యము ద్వారా మనము నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను బోధించవలసిన కారణమున మన కుటుంబము కూడా రక్షింపబడవలసిన కారణమున దేవుడు మనకు చెప్పెను. నా దేవునికి కృతజ్ఞతలు.