Sermons

[అధ్యాయము 21-1] <ప్రకటన 21:1-27> పరలోకము నుండి దిగివచ్చి ఆ పరిశుద్ధ పట్టణము<ప్రకటన 21:1-27>

“అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్తకొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారాయన ప్రజలైయుందురు. దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడై యుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచి వేయును. మరణము ఇక ఉండదు. దుఃఖమైనను ఏడుపైనను వేదన యైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతంచిపోయెనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడైయున్న వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునైయున్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనెను. సమాప్తమైనవి, నేనే అల్ఫాయు ఓమెగయు అనగా ఆదియు అంతమునై యున్నవాడును దప్పిగొను వానికి జీవజలము బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేనతనికి దేవుడనై యుందును. అతడు నాకు కుమారుడైయుండును. పిరికి వారును అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులును, మాంత్రికులును, విగ్రహరాధకులును, అబద్ధికులందరును అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. అంతట ఆ కడపటి యేడు తెగుళ్లతో నిండిన యేడుపాత్రలను పట్టుకొనియున్న యేడుగురు దేవతలలో ఒకడు వచ్చి ఇటు రమ్ము, పెండ్లికుమార్తెను అనగా గొఱ్ఱె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి ఆత్మవశుడనైయున్న నన్ను యెత్తయిన గొప్ప పర్వతము మీదికి కొనిపోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. దానిని యందలి వెలుగు ధగధగ మెరయు సూర్యకాంతము వంటి అమూల్య రత్నములను పోలియున్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును పండ్రెండు గుమ్మములును ఉండెను. ఆ గుమ్మములయొద్ద పన్నిద్దరు దేవదూతులుండిరి. ఇశ్రాయేలీయులు పండ్రెండు గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడియున్నవి. తూర్పువైపున మూడు గుమ్మములు, ఉత్తరపు వైపున మూడు గుమ్మములు, దక్షిణవైపున మూడు గుమ్మములు, పశ్చిమవైపున మూడుగుమ్మములున్నవి. ఆ పట్టణపు ప్రాకరము పండ్రెండు పునాదులు గలది, ఆ పునాదులపైన గొఱ్ఱె పిల్ల యొక్క పన్నిద్దరు అపోస్తులుల పండ్రెండు పేళ్లు కనబడుచున్నవి. ఆ పట్టణమును దాని గుమ్మమును ప్రాకారమును కొలుచుటకై నాతో మాటలాడువాని యొద్ద బంగారు కొలకఱ్ఱయుండెను. ఆ పట్టణము చచ్చవుకమైనది. దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకఱ్ఱతో పట్టణమును కొలువగా దాని కొలత యేడు వందల యేబది కోసులైనది. దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది. మరియు అతడు ప్రకారమును కొలువగా అది మనుష్యుని కొలత చొప్పున నూట నలుబదినాలుగు మూరలైనది. ఆ కొలత దూత కొలతయే. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ వర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకరపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడియుండెను. మొదటిపునాది సూర్యకాంతపురాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, అయిదవది వైడూర్యము, ఆరువది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, పదవది సువర్ణ శునీయము, పదకొండువది పద్మరాగము, పండ్రెండవది సుగంధము, దాని పండ్రెండు గుమ్మములు పండ్రెండు ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడియున్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలియున్నది. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారియైన దేవుడగు ప్రభువును గొఱ్ఱె పిల్లయు దానికి దేవాలయమైయున్నారు. ఈ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను, చంద్రుడైనను దానికక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొఱ్ఱ పిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరింతురు భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసికొని వత్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏ మాత్రమును వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసికొని వచ్చెదరు. గొఱ్ఱె పిల్ల యొక్క జీవగ్రంధమందు వ్రాయబడినవారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను, అసహ్యమైనదానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు.’’వివరణ :


వచనం 1 : అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. సముద్రమును ఇకను లేదు. 

ఈ వాక్యమునకు అర్థమేమనగా మన ప్రభువైన దేవుడు తన నూతన భూమి ఆకాశమును మొదటి పునరుత్ధానములో పాల్గొన్న పరిశుద్ధులకు ఒక బహుమతిగా ఇచ్చును. అప్పటి నుండి పరిశుద్ధులు మొదటి భూమి, ఆకాశముపై నివసించరు. కానీ నూతన రెండవ పరలోకము మరియు భూమిపై నివసిస్తారు. దీవెనలను ఆయన తన పరిశుద్ధులపై కుమ్మరించును. దేవుడు అట్టి దీవెనలను మొదటి పునరుత్ధానములో పాల్గొను పరిశుద్ధులకు మాత్రమే ఇచ్చును.

అనగా ఈ దీవెనలను అనుభవించువారు. క్రీస్తు అనుగ్రహించిన పరిశుద్ధ సువార్తయైన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించి తమ పాపపరిహారము నొందిన పరిశుద్ధులైయున్నారు. మన ప్రభువే పరిశుద్ధులకు పెండ్లి కుమారుడు. ఇప్పటి నుండి ఎదురుచూచుచున్న పెండ్లికుమార్తెలందరూ పెండ్లికుమారుని రక్షణ, దీవెన అను వస్త్రమును ధరించెదరు. తమ గొర్రె పిల్లయను పెండ్లికుమారుని పెండ్లి కుమార్తెవలె అధికారమును పొందుతారు. మరియు ఆయన మహిమ రాజ్యములో మహిమతో జీవిస్తారు.

వచనం 2: మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తెవలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని.

దేవుడు పరిశుద్ధుల కొరకు పరిశుద్ద పట్టణమును సిద్ధపరచెను. ఈ పట్టణము నూతన యెరూషలేము దేవుని పరిశుద్ధ స్థలమైయున్నది. ఈ స్థలము సంపూర్తిగా పరిశుద్ధుల కొరకే సిద్ధపరచబడినది. ఆ పరిశుద్ధ పట్టణము యేసుక్రీస్తు నందు ముందే వ్యూహపరచబడి మన ప్రభువు ఈ విశ్వాసమును నిర్మించకమునుపే సృజింపబడినది. కనుక పరిశుద్ధులు ఆయన కరుణ గల బహుమానము కొరకు మరేమియూ చెల్లించలేరు. కానీ కేవలము స్తుతి చెల్లిస్తారు. మరియు సమస్త మహిమను విశ్వాసంతో ఆయనకు అర్పిస్తారు.

వచనం 3: అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారాయన ప్రజలైయుందురు. దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడై యుండును.

ఇచ్చట నుండి పరిశుద్ధులు నిత్యము దేవుని ఆలయములో ప్రభువుతో కూడా నివసిస్తారు. ఇదంతయూ ప్రభువైన దేవునికృప, పరిశుద్ధులు మరియు ఆత్మమూలమైన రక్షణ వాక్యమును విశ్వసించినందుకై పొందబోవు బహుమానము. కావున ప్రభుని ఆలయములో ప్రవేశించి ఆయనతో నివసించుట అను దీవెనలను పొందినవారు ప్రభువైన దేవునికి సదాకాలము స్తుతి చెల్లిస్తారు.

వచనం 4: ‘‘ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచి వేయును. మరణము ఇక ఉండదు. దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతంచిపోయెనని సింహాసనములో నుండి వచ్చు గొప్ప స్వరము చెప్పుట వింటిని.’’

ఇప్పుడు దేవుడు పరిశుద్ధులతో నివసించును. కనుక ఇక బాధకరమైన కన్నీళ్లు గానీ, తమ ప్రియులను పోగొట్టుకొన్నందుకు దుఃఖమైనను, వేదనతో కూడి ఏడ్పైననూ ఉండదు.

పరిశుద్ధుల జీవితము నుండి మొదటి భూమ్యాకాశము దుఃఖమంతయూ మాయమగును. పరిశుద్ధుల కొరకు ఎదురుచూచుచున్నదేమనగా ఆయన యొక్క నూతన ఆకాశము భూమిలో తమ ప్రభువైన దేవునితో మహిమకరమైన దీవెనకరమైన జీవితమున ప్రభువైన దేవుడు పరిశుద్ధుల స్వంత దేవుడైయున్నాడు. సమస్తమును, పరిసరములన్నిటిని నూతనపరచును. కనుక అక్కడ ఇకను కన్నీరుగానీ, ఏడుపుగానీ, మరణముగానీ, బాష్పబిందువులుగానీ, వ్యాధిగానీ, మరేదైనను మొదటి భూమిపై వారిని బాధించును.

వచనం 5 : అప్పుడు సింహాసనాసీనుడైయున్న వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునైయున్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు.

ప్రభువు అన్నిటిని నూతనపరచును. నూతన ఆకాశమును, నూతన భూమిని సృజించును. తన సృష్టియైన మొదటి ఆకాశమును, భూమిని మాయమగునట్లు చేసి, ఆయన క్రొత్తదైన రెండవ ఆకాశమును భూమిని చేయును. ఈ వచనం మనకు చెప్పునదేమనగా దేవుడు పాతదానిని మరల కొనసాగనిచ్చునని కాదు గానీ దానికి బదులుగాను విశ్వమును సృజించును. కనుక దేవుడు నూతన ఆకాశము భూమిని చేసి, పరిశుద్ధులతో కూడా జీవించును. మొదటి పునరుత్ధానములో పాల్గొన్న వారైన పరిశుద్ధులను ఈ దీవెనలో కూడా భాగస్వాములను చేయును. ఇది మానవ ఊహతో ఎలప్పుడూ కలకనునటువంటి విషయము. కానీ ఇదే దేవుడు తన పరిశుద్ధుల కొరకు సిద్ధపరచినది. కాబట్టి పరిశుద్ధులను సమస్తమును మహిమను కృతజ్ఞతలను, గౌరవమును, స్తుతిని ఈ గొప్ప క్రియలు దేవునికి సమర్పిస్తారు.

వచనం 6 : మరియు ఆయన నాతో ఇట్లనెను సమాప్తమైనవి. నేను అల్ఫాయు, ఓమెగయు. అనగా ఆదియు అంతమునైయున్నవాడను, దప్పిగొను వానికి జీవజలము బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును.

మన ప్రభువైన దేవుడు వీటన్నిటిని ప్రణాళిక చేసి ఆది నుండి అంతము వరకు సంపూర్తిచేసెను. ప్రభువు ఈ కార్యములన్నిటిని చేసెను. వీటన్నిటిని ఆయన తన కొరకును, తన పరిశుద్ధుల కొరకును జరిగించెను. ఆ పరిశుద్ధులు ఇప్పుడు ‘‘క్రైస్తవులని” పిలువబడుచున్నారు. వారు దేవుని ప్రజలైయున్నారు. ఇప్పుడు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించుట ద్వారా దేవుని పరిశుద్ధులైనవారు నిత్యము వారు దేవుని స్తుతించి కృతజ్ఞతలను చెల్లించినప్పటికి ప్రభువైన దేవుని ప్రేమ కొరకును, క్రియల కొరకును తగినంత కృతజ్ఞతలను చెల్లించలేరు.

“దప్పిగొనువానికి జీవ జలబుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును.’’ నూతన ఆకాశము భూమిలో మన ప్రభువు జీవజలము బుగ్గను పరిశుద్ధులకు ఇచ్చును. దేవుడు తన పరిశుద్ధులపైన కుమ్మరించిన గొప్పదీవెన ఇదే. ఇప్పుడు పరిశుద్ధులు నూతన భూమి ఆకాశములో నిత్యము నివసించుచూ జీవజల బుగ్గ నుండి త్రాగుచుందురు. అందువలన వారెన్నటికి దప్పిగొనరు. అనగా పరిశుద్ధులు ఇప్పుడు నిత్యజీవము గల దేవుని పిల్లలైయున్నారు. ప్రభువైన దేవునివలే ఆయన మహిమలో జీవిస్తారు. ఈ గొప్పదీవెన మనకిచ్చినందుకు మన ప్రభువైన దేవునికి నేను మరొకసారి కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. హల్లెలూయ!

వచనం 7: ‘‘జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేనతనికి దేవుడనైయుందును అతడు నాకు కుమారుడైయుండును.’’

“జయించువాడు” అనగా ప్రభువు వలన అనుగ్రహించబడిన తమ విశ్వాసమును కాపాడుకొనినవాడు ఈ విశ్వాసము ఈ లోకమును దేవుని శత్రువులను జయించుటకు పరిశుద్ధులను అనుమతించును. మన విశ్వాసము మన ప్రభువైన దేవునిలోను ఆయన అనుగ్రహించిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను ప్రేమించుటలోను ఉన్నది కనుక అది లోకసంబంధమైన అన్ని పాపములపైన. దేవుని తీర్పుపైన, మన శత్రువులపైన, మన స్వంత బలహీనతపైన అంత్యక్రీస్తు యొక్క హింసపైన జయమునిచ్చును.

వీటన్నిటిపైన జయమునిచ్చినందుకు మన ప్రభువైన దేవునికి నేను మరొకసారి కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. ప్రభువైన దేవునియందు విశ్వాసముగలవారైన పరిశుద్ధులు తమ విశ్వాసముతో తగిన రీతిని అంత్యక్రీస్తును జయించెదరు. పరిశుద్ధులు ప్రతివారికి మన ప్రభువైన దేవుడు ఇట్టి విశ్వాసమును ఇచ్చెను. ఈ విశ్వాసముతో వారు తమ శత్రువులందరితోనూ పోరాడి జయమొందుతారు.

తమ విశ్వాసముతో ఈ లోకమును అంత్యక్రీస్తును జయించిన వారిని తన నూతన భూమ్యాకాశము స్వతంత్రించుకొనుటకు మన ప్రభువైన దేవుడు అనుమతించును. మన ప్రభువైన దేవుడు జయించగల విశ్వాసమును తన పరిశుద్దులకిచ్చెను. కనుక వారు ఆయన రాజ్యమును స్వతంత్రించుకొంటారు. అంత్యక్రీస్తుపై జయమునిచ్చు విశ్వాసమును దేవుడు మనకిచ్చెను. కనుక దేవుడు ఇప్పుడు మనదేవుడాయెను. మరియు మనమాయన పిల్లలమైనాము. మన శత్రువులందరినీ జయించునట్టి ఈ విశ్వాసమును మనకిచ్చినందుకు మన ప్రభువైన దేవునికి నేను వందనములను, స్తుతులను చెల్లించుచున్నాను.

వచనం 8 : పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులును, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరును అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము.

ఆయన స్వాభావికముగా మన ప్రభువైన దేవుడు సత్యదేవుడును ప్రేమామయుడునైయున్నాడు. అయిన దేవుని యెదుట పిరికి వారైనవారు ఎవరు? ఆది పాపమందు జన్మించినవారై ప్రభువు అనుగ్రహించిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్త యొక్క వాక్యముతో తమ పాపములను కడుగుకొననివారైయున్నారు. ఎందుకనగా స్వాభావికముగా వారు దేవునికంటే ఎక్కువగా దుష్టత్వమును ఆరాధించువారు. వారు స్పష్టముగా సాతాను పరిచారకులైయున్నారు. వారు ప్రభువైన దేవుని యెదుట దుష్టత్వమును ఆరాధించిరి కనుక వారు వెలుగుకంటే అధికముగా చీకటినే ప్రేమించి దానినే అనుసరించిరి. అందువలన వారుప్రభువైన దేవుని యెదుట ఏమీ చేయలేక పిరికివారైరి.

దేవుడు తన స్వభావమందు వెలుగైయున్నాడు. కాబట్టి ఎవరైతే తమంతట తాము చీకటైయున్నారో వారు దేవునికి భయపడతారు. ఎవరి ఆత్మలైతే సాతాను వశమునున్నవో వారు చీకటిని ప్రేమిస్తారు. కనుక తానే వెలుగైన దేవుని యెదుట పిరికివారు ఇందువలన వారు తమ దుష్టత్వమును, బలహీనతలను దేవుని యొద్ద విడిచి, ఆయన నుండి తమ పాపపరిహారమును పొందాలి.

అవిశ్వాసులు అనగా మన ప్రభువైన దేవుని ప్రేమను ఆయన యొక్క నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను తమ హృదయములో విశ్వసించనివారు దేవుని యెదుట ఆయనకు శత్రువులును గొప్ప పాపులునైయున్నారు. వారి ఆత్మలు మకిలివై వారు దేవునికి ఆయన ప్రేమకు వ్యతిరేకముగా నిలుచు ప్రతి పాపమును చేయుచూ, అబద్ధ సూచనలను అనుసరించుచూ ప్రతివిధమైన విగ్రహాలను కొలుచుచూ, అబద్ధమును పలుకుదురు. కాబట్టి దేవుని యొక్క న్యాయతీర్పుతో వారందరూ అగ్నిగంధకములతో మండుచున్న గుండములోనికి త్రోయబడుదురు. ఇది రెండవ మరణము అను వారి శిక్ష, ఆయన యెదుట పిరికివారై, ఆయన యొక్క నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించనివారు సాతాను పరిచారకులైనవారు శిక్షార్హులు. దేవుడు వారిని తన నూతన ఆకాశము మరియు భూమిలోనికి ప్రవేశించనివ్వరు. దానికి ప్రతిగా మన ప్రభువు తన నిత్యశిక్షను వారికిచ్చి వారందరినీ (నరహంతకులను, వ్యభిచారులు, విగ్రహారాధకులు, అబద్ధికులు, మాంత్రికులందరితో కూడా) అగ్ని గంధకము గుండములోనికి త్రోయబడెదరు. కనుక పాతాళమును దేవుడు వారికిచ్చును. ఇదే రెండవ మరణము.

వచనం 9 : అంతట ఆ కడపటి యేడు తెగుళ్లతో నిండిన యేడు పాత్రలను పట్టుకొనియున్న యేడుగురు దేవతలలో ఒకడు వచ్చి ఇటు రమ్ము. పెండ్లికుమార్తెను, అనగా గొఱ్ణె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి, ఏడు పాత్రల్లోని తెగుళ్ళలో ఒక తెగులును తెచ్చిన ఒక దూత యోహానుతో ఇట్లు చెప్పెను. ఇక్కడ గొర్రె పిల్ల యొక్క భార్య అనగా ఆయన ఇచ్చిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను తమ హృదయములో విశ్వసించుట ద్వారా యేసుక్రీస్తు యొక్క పెండ్లికుమార్తెలైనవారు.

వచనం 10,11 : ఆత్మవశుడనైయున్న నన్ను యెత్తయిన గొప్ప పర్వతము మీదికి కొనిపోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. దానిని యందలి వెలుగు ధగధగ మెరయు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలియున్నది.

“ఆ గొప్ప పట్టణమైన పరిశుద్ద యెరూషలేము” అనగా తమ పెండ్లికుమారునితో, పరిశుద్ధులు నివశించు ‘‘పరిశుద్ధ పట్టణము’’ వాస్తవముగా యోహాను చూచిన ఈ పట్టణము అందమైనదియు, రమ్యమైనదియునైయున్నది. అది దాని పరిమాణములో అద్భుతమైనదియు, లోపల బయట ప్రశస్త రాతితో పొదగబడి పరిశుభ్రముగాను, స్పష్టముగాను ఉండెను. యేసుక్రీస్తు వధువు తమ వరునితో నివసించబోవు స్థలమును ఆ దూత యోహానునకు చూపించెను. పరము నుండి దిగివచ్చుచున్న ఈ పరిశుద్ధల పట్టణమైన యెరూషలేము గొర్రె పిల్ల భార్యకు దేవుడు ఇచ్చుచున్న బహుమానమైయున్నది.

యెరూషలేము పట్టణము ప్రకాశమానమగాము వెలుగుచున్నది. దాని కాంతి అత్యంత ప్రశస్తమైన రాతివలే ఉన్నది. స్పటికము వలే స్పష్టముగానున్నది. కాబట్టి దానిలో నివసించువారందరికీ దేవుని మహిమ ఎల్లప్పుడూ శాశ్వతముగా నుండును. దేవుని రాజ్యము వెలుగు సంబంధమైనది కనుక తమ చీకటిని, బలహీనతలు మరియు పాపమును కడిగివేసుకున్నవారు ఈ పట్టణములో ప్రవేశిస్తారు. అలాగే ఆ పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించాలంటే మన ప్రభువు అనుగ్రహించిన నిజమైన సువార్త వాక్యమైన నీరు మరియు ఆత్మమూల వాక్యమును తెలిసికొని నేర్చుకొని విశ్వసించాలి.

వచనం 12: ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును పండ్రెండు గుమ్మములును ఉండెను. ఆ గుమ్మములయొద్ద పన్నిద్దరు దేవదూతులుండిరి. ఇశ్రాయేలీయుల పండ్రెండు గోత్రముల నామములు ఆ గుమ్మము మీద వ్రాయబడియున్నది.

ఆ గొప్ప పట్టణ గుమ్మమును పన్నెండు దూతలు కావలి కాయుచున్నవి. వాటిపై ఇశ్రాయేలీయుల పిల్లలైన పన్నెండు గోత్రముల పేర్లు వ్రాయబడియున్నవి. ఆ పట్టణము ‘‘గొప్పదైన ఎత్తైన గోడ” కలిగియున్నది. ఈ పరిశుద్ధ పట్టణములో ప్రవేశించు మార్గము ఎంత కష్టమైనదని చెప్పబడుచున్నది. దేవుని యెదుట మన పాపములన్నిటి నుండి రక్షింపబడి అనగా ఇది మానవ ప్రయత్నముతో అసాధ్యము లేదా దేవుని సృష్టియైన ఈలోక వస్తువులతో కూడా సాధ్యపడదు.

మన పాపములన్నిటి నుండి విడిపించబడి దేవుని పరిశుద్ధ పట్టణములో ప్రవేశించాలంటే ఖచ్చితంగా యేసు శిష్యులకు గల విశ్వాసము వంటి విశ్వాసమును కలిగియుండాలి. నీరు మరియు ఆత్మమూలమైన సువార్తయందు ఇట్టి విశ్వాసము కలిగియుండని వారెవరూ ఈ పరిశుద్ధ పట్టణములో ప్రవేశించలేరు. ఇందువలననే ప్రభువైన దేవుడు దాని గుమ్మములను కాయుటకై పన్నెండు దూతలను నియమించెను.

“నామము ఆ గుమ్మములపై వ్రాయబడెను” అను వాక్యము మరొక రకముగా చెప్పుచున్నదేమనగా ఈ పట్టణ హక్కుదారులు ముందే నిర్ణయించబడిరి. ఆ హక్కుదారులు ఎవరో కాదు కానీ దేవుడు మరియు ఆయన పిల్లలే. ఎందుకనగా ఇప్పుడు దేవుని పిల్లలైన దేవుని ప్రజలదే ఆ పట్టణము.

వచనం 13 : తూర్పువైపున మూడు గుమ్మములు, ఉత్తరపువైపున మూడు గుమ్మములు, దక్షిణవైపున మూడు గుమ్మములు, పశ్చిమవైపున మూడు గుమ్మములున్నవి. పట్టణము తూర్పువైపున మూడు గుమ్మములు ఉన్నట్లే దాని ఉత్తరము దక్షిణము మరియు పడమరవైపు ప్రతి దిక్కున మూడేసి గుమ్మములున్నవి. దీని సూచన ఏమనగా తమ హృదయములో నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించుట ద్వారా తమ పాపములకు పరిహారమునొందిన వారే ఈ పట్టణములో ప్రవేశించెదరు.

వచనం 14: ఆ పట్టణపు ప్రాకారము పండ్రెండు పునాదులు గలది. అ పునాదులపైన గొఱ్ఱె పిల్ల యొక్క పన్నిద్దరు అపోస్తులుల పండ్రెండు పేళ్లు కనబడుచున్నవి.

భవనము లేదా కట్టడాలు పునాదుల కొరకు పెద్ద పెద్ద రాళ్ళను సూచించుటకు బైబిలు నుందు ఉపయోగించబడినది. ప్రభువైన దేవుని పరిశుద్ధ పట్టణ కలిగియుండాలి. ఆ విశ్వాసమేదనగా మన పాపములన్నిటి నుండి ఆయన ఇచ్చు పరిపూర్ణ విమోచన, పరిశుద్ధులు కలిగియుండు విశ్వాసము పరిశుద్దులు పట్టణము యొక్క విలువగల రాళ్ళ కంటే మరి ప్రశస్తమైనది. ఇక్కడ ఈ వచనం మనకు చెప్పునదేమనగా ఆ పట్టణపు గోడలు పన్నెండు పునాదులపై నిర్మించబడెను. మరియు వాటిపై గొర్రె పిల్లయొక్క పన్నెండుమంది అపోస్తులుల పేర్లు వ్రాయబడెను. అనగా యేసుక్రీస్తు యొక్క పన్నెండుమంది అపోస్తుల విశ్వాసము వంటి విశ్వాసము కలవారే ఆ పట్టణములో ప్రవేశించనర్హులని చెప్పుచున్నది.

వచనం 15: ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారములను కొలుచుటకై నాతో మాటలాడువాని యొద్ద బంగారు కొలకఱ్ఱయుండెను.

ఈ వచనం భావమేమనగా దేవునిచే నిర్మించబడిన పట్టణములో ప్రవేశించుటకు ఆయనే ఆమోదించబడిన విశ్వాసమును కలిగి యుండాలి. ఆ విశ్వాసము అతని/ఆమె పాపము నుండి విమోచించును. అనగా యోహానుతో మాట్లాడిన ఆ దూతలకు పట్టణమును కొలుచుటకై బంగారు కొలకర్ర ఉండెను. దీని భావమేమనగా మన ప్రభువు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తలోనే మనకు ఈ దీవెనలన్నిటిని అనుగ్రహించెను. ‘‘విశ్వాసమనునది నీరిక్షించువాటి యొక్క నిజస్వరూపము” (హెబ్రీ 11:1) కాగా వాస్తవముగా దేవుడు ఆ పరిశుద్ధ పట్టణమును, నూతన ఆకాశము మరియు భూమిని, నిరీక్షించువాటి కంటే మరి గొప్పవైన సంగతులను అనుగ్రహించును.

వచనం 16: ఆ పట్టణము చచ్ఛవుకమైనది. దాని పొడుగు దాని వెడల్పుతో నమానము. అతడు ఆ కొలకఱ్ఱతో పట్టణమును కొలువగా దాని కొలత యేడు వందల యేబది కోసులైనది. దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది.

ఆ పట్టణము చచ్ఛవుకముగా నిర్మించబడెను దాని పొడవు, దాని వెడల్పు, ఎత్తు సమానముగానున్నవి. నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించి దేవుని ప్రజలుగా తిరిగి జన్మించగల విశ్వాసమును మనము కలిగియుండవలెనని ఈ భాగము చెప్పుచున్నది. నిజానికి నీరు మరియు ఆత్మమూలమైన సువార్తలో ఖచ్చితమైన విశ్వాసము కలిగియుండని వారినెవరినీ దేవుని రాజ్యములో ప్రవేశించుటకు అనుమతినీయడు.

కేవలము క్రైస్తవులుగానున్నందున వారిలో పాపమున్ననూ పరిశుద్ధ పట్టణములో ప్రవేశిస్తామనే తప్పుడు నమ్మకము కలవారు అనేకులున్నారు. కానీ మన ప్రభువు పాపము నుండి రక్షణను, పరిశుద్ధాత్మను అనుగ్రహించి, ఆయన బాప్తిస్మము ద్వారా భూమిపైన మన పాపమును క్షమించెనని సిలువపై రక్తము కార్చెనను సత్యమును విశ్వసించిన వారిని తన ప్రజలుగా చేసెను. మన ప్రభువు మన నుండి ఆశించుచున్న విశ్వాసము ఇదియే.

వచనం 17: మరియు అతడు ప్రాకారమును కొలువగా అది మనుష్యుని కొలత చొప్పున నూటనలుబది నాలుగు మూరలైనది. ఆ కొలత దూతకొలతయే.

బైబిలు పరముగా నాలుగు అను సంఖ్య బాధను సూచించును. ప్రభువు మన నుండి కోరు విశ్వాసము ఏదో ప్రతివారు కలిగియుండునది కాదు. కానీ ఈ విశ్వాసము దేవుని వాక్యమును అంగీకరించువారు కలిగియుండనిదై వారు దానిని తమ స్వంత ఆలోచనలతో పూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చు. క్రైస్తవునిగా యేసు యొక్క సిలువను, ప్రభువే దేవుడను రక్షకుడనని విశ్వసించుట ద్వారా దేవుని పరిశుద్ధ పట్టణములో ప్రవేశించలేరు. ఆయన యోహాను 3:5లో ‘‘ఒకడు నీటి మూలముగాను, ఆత్మమూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.’’ అని పలికిన దానితో ప్రభుని భావమేమిటో నీకు తెలియునా? మనప్రభువు ఈ భూమిపైకి వచ్చియోహానుచే బాప్తిస్మము పొంది లోకపాపమును సిలువపై మోసి దానిపై తన రక్తమును కార్చుటలో గల అర్థమేమో నీకు తెలియునా? నీవు ఈప్రశ్నకు జవాబిచ్చినచో నేను దేనిని గూర్చిమాట్లాడుచున్నానో నీవు గ్రహించగలవు.

వచనం 18: ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతులతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధవర్ణముగా ఉన్నది.

ఈ వచనం మనకు చెప్పునదేమనగా దేవుని పరిశుద్ధ పట్టణములోనికి ప్రవేశించుటకు గల విశ్వాసము స్వచ్ఛమైనదియు ఈ లోకములోనిది మరి ఏదియూ కాదు.

వచనం 19,20: ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానా విధ రత్నములతో అలంకరింపబడియుండెను. మొదటి పునాది సూర్యకాంతపురాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ, అయిదవది వైడూర్యము, ఆరువది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్పరాగము, పదవది సువర్ణశునీయము, పదకొండవది పద్మరాగము, పండ్రెండవది సుగంధము.

ఆ పట్టణపు పునాది గోడలు అన్నిరకముల ప్రశస్తమైన రాళ్ళతో వేయబడినవి. ఈ వాక్యము నుండి మనకు విశదమగుచున్నదేమనగా మన ప్రభువు యొక్క వాక్యము నుండి వివిధ రకములుగా పోషించబడుచున్నాము. ఈ ప్రశస్తమైన రాళ్ళు మన ప్రభువు తన పరిశుద్ధులకు ఇవ్వబోవుచున్న అన్నిరకముల దీవెనలను చూపించుచున్నవి.

వచనం 21 : దాని పండ్రెండు గుమ్మములు పండ్రెండు ముత్యములు ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యములతో కట్టబడియున్నది. పట్టణపు రాజవీధిశుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలియున్నది.

బైబిలులో ‘‘ముత్యము” పరిశుద్ధతకు సాదృశ్యమైయున్నది. (మత్తయి 13:46) నిజమైన ‘‘సత్యవాది” అతని/ఆమె యొక్క స్థానమును అతని/ఆమె నిత్యజీవము నిచ్చు సత్యమును కలిగియుండుటకు సంతోషముగా వదలివేస్తారు. పరిశుద్ధ పట్టణములో ప్రవేశించు పరిశుద్ధులు, ఈ భూమిపైనుండగా ఎంతో సహనమును కలిగియుండి తమకు సత్యమునందున్న విశ్వాసమునకు అతుకబడి స్థిరులైయుండాలి. ప్రభువైన దేవుడు పలికిన సత్యవాక్యమును విశ్వసించువారు. తమ విశ్వాసమును కాపాడుకొనుటకు గొప్ప ఓర్పును కలిగియుండాలి.

వచనం 22, 23: దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారియైన దేవుడగు ప్రభువును గొఱ్ఱె పిల్లయు దానికి దేవాలయమైయున్నారు. ఈ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను, చంద్రుడైనను దానికక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొఱ్ఱె పిల్లయే దానికి దీపము.

ఈ భాగములో పరిశుద్ధులందరూ రాజులకు రాజైన యేసుక్రీస్తును కౌగలించెదరు. మరియు యెరూషలేమను పరిశుద్ధ పట్టణమునకు మొదటి సూర్యుడేగాని, చంద్రుడే దాని ప్రకాశింపనవసరం లేదు. ఎందుకనగా యేసుక్రీస్తు లోకమునకు వెలుగై, దానికి వెలుగునిచ్చును అని అర్థమున్నది.

వచనం 24 : జనములు దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసికొని వత్తురు. 

ఈ భాగము మనకు చెప్పునదేమనగా వెయ్యేండ్ల రాజ్యములో నివసించు ప్రజలు నూతన ఆకాశము మరియు భూమిలోనికి ప్రవేశించెదరు. ‘‘భూరాజులు” అనగా ఇక్కడ వెయ్యేండ్ల రాజ్యములోని వసించుచున్న పరిశుద్ధులు. ఈ భూరాజులు తమ మహిమను దానిలోనికి తెచ్చెదరు అని కొనసాగుచున్నది. అనగా తమ మహిమ శరీరములో నివశించుచున్న పరిశుద్ధులు ఇప్పుడు వెయ్యేండ్లు రాజ్యము నుండి నూతన ఆకాశమును భూమిని కలిగియుండి దేవునిచే నిర్మించబడిన రాజ్యములోనికి వచ్చెదరు.

అలాగే ఈ భూమిపైనున్నప్పుడు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించుట ద్వారా తిరిగి జన్మించిన వారు వెయ్యేండ్ల పాటు క్రీస్తు రాజ్యములో నివసించుటకు కొనిపోబడి, యెరూషలేము పరిశుద్ధ పట్టణములోనికి ప్రవేశించెదరు.

వచనం 25 : అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏ మాత్రమును వేయబడవు.

పరిశుద్ధ పట్టణమున్న నూతన భూమి ఆకాశము, ఇప్పటికే పరిశుద్దుల వెలుగుతో నింపబడినందున దానిలో రాత్రి కానీ చెడు కానీ ఏదీ ఉండదు.

వచనం 26 : జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసికొని వచ్చెదరు.

ప్రభువైన దేవుని అద్భుత అధికారముల ద్వారా వెయ్యేండ్లుగా క్రీస్తు రాజ్యములో నివశించుచున్న వారు నూతన భూమ్యాకాశములోనికి ప్రవేశించుటకు అర్హత పొందెదరని ఈ వాక్యము మనకు తెలియజేయుచున్నది. ఆ రాజ్యము పరిశుద్ధ పట్టణముగా నిలుచుచున్నది.

వచనం 27 : గొఱ్ఱె పిల్ల యొక్క జీవగ్రంధమందు వ్రాయబడినవారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను, అసహ్యమైనదానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు.

లోకములోని క్రైస్తవులు, క్రైస్తవేతరులలో నుండి ఒకేలాగున నీరు మరియు ఆత్మమూలమైన సువార్త యొక్క సత్యమును తెలిసికొనని వారు అనర్హులై, విడిచిపెట్టదగిన వారైన అబద్ధికులగుదురు. కనుక వారు పరిశుద్ధ పట్టణములో ప్రవేశింపరు.

ఈ భూమిపైన ప్రభువు మనకు అనుగ్రహించిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్త యొక్క అధికారము ఎంత గొప్పదో ఖచ్చితముగా రూఢిపరచుకొనునట్లు దేవుని వాక్యము అనుమతించుచున్నది. ఈ భూమిపై నీరు మరియు ఆత్మమూలమైన సువార్త అనేకమంది ప్రజలకు బోధించబడినప్పటికి, ఈ సువార్త లెక్క లేకుండా కొట్టి వేయబడిన సమయాలు ఈ క్రైస్తవులుగా పిలువబడే వారిలో ఎన్నోసార్లు జరుగుతుంది. కానీ ప్రభువుచే అనుగ్రహించబడిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తనందున్న విశ్వాసము పరలోకమునకు తాళపు చెవి వంటిది.

అనేకులు ఇంకా ఈ సత్యవిషయంలో అజ్ఞానులైయున్నారు. కానీ అతని/ఆమెకు ప్రభువు ఇచ్చిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తతోనే అతని/ఆమె పాప పరిహారము. పరలోకము తాళపు చెవులు ఉన్నవని విశ్వసించినవారి పేర్లు జీవగ్రంధమందు వ్రాయబడును.

నీవు నీరు మరియు ఆత్మమూలమైన సువార్త యొక్క సత్యమును వస్త్రమును ధరించుకొందురు.