Sermons

[అధ్యాయము 21-2] <ప్రకటన 21:1-27> దేవునిచే అనుమతించబడిన విశ్వాసము వంటిది మనము కలిగియుండవలెను.<ప్రకటన 21:1-27>


దేవుడు మనకు నూతన భూమిని ఆకాశమును ఇచ్చెను. నీవు ఇప్పుడు చూచుచున్న మొదటి భూమి ఆకాశము దానికి సంబంధించినవన్నీ మాయమగును. ఆయన వాటి స్థానములో ఒక నూతన ఆకాశమును నూతన భూమిని నూతన సముద్రమును మిగిలిన వాటన్నిటిని ఈ నూతన విశ్వములో నూతన పరచును. అనగా మన ప్రభువైన దేవుడు తన నూతన ఆకాశమును నూతన భూమిని మొదటి పునరుత్ధానములో ప్రవేశించినపుడు తన నూతన ఆకాశమును నూతన భూమిని మొదటి పునరుత్ధానంలో ప్రవేశించిన తనపరిశుద్ధులకు బహుమానముగానిచ్చును. ఈ దీవెనలు దేవుని నుండి వచ్చు దీవెనలు ఆయన తమ పాప పరిహారమును పొందిన తన పరిశుద్ధులపై కుమ్మరించును. 

కాబట్టి దేవుడు మొదటి పునరుత్ధానములో పాల్గొన్న తన పరిశుద్ధులకు ఈ దీవెనలను అనుగ్రహించెను. యేసుక్రీస్తు అనుగ్రహించిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించి తమ పాపపరిహారము పొందిన పరిశుద్ధులకు మాత్రమే దేవుడు ఈ దీవెన పొందననుగ్రహించును. కనుక మన ప్రభువు పరిశుద్ధులకు మాత్రమే దేవుడు ఈ దీవెన పొందననుగ్రహించును. కనుక మన ప్రభువు పరిశుద్ధులకు పెండ్లికుమారుడాయెను. ఇప్పటి నుండి వధువు చేయుటకు మిగిలిన దేమనగా వరుని రక్షణ దీవెన అను వస్త్రము ధరించి, గొఱ్ఱె పిల్ల భార్య యొక్క అధికారము పొంది శాశ్వతముగా ఆయన మహిమ రాజ్యములో మహిమతో నివసించుటయే.

పరిశుద్ధ పట్టణమైన యెరూషలేము పరలోకము నుండి దిగివచ్చిన భాగములో చెప్పబడినది. ఇది సామాన్యమైన పట్టణముకాదు. అది పెండ్లికుమార్తె వలె అందముగా అలంకరింపబడి పరలోకము నుండి దిగివచ్చుచున్నదని చెప్పబడినది. దేవుడు పరిశుద్దుల కొరకు ఒక పరిశుద్ధ పట్టణమును సిద్ధపరచును. ఆ పట్టణము దేవుని ఆలయమైన యెరూషలేము పట్టణము. ఈ దేవాలయము కేవలము దేవుని పరిశుద్ధుల కొరకే సిద్ధపరచబడినది. ప్రభువైన దేవుడు ఈ విశ్వమును సృజించకమునుపే యేసుక్రీస్తునందున్న పరిశుద్ధుల కొరకే ప్రణాళిక చేయబడియున్నది. కనుక పరిశుద్ధులు ఇకయేమియూ చేయలేరు కానీ ప్రభువైన దేవుని ఈ దయగల బహుమానమును బట్టి తమ విశ్వాసముతో ఆయనకు మహిమను చెల్లించెదరు.

ఇవన్నియూ పరిశుద్ధులు దేవుని ప్రజలుగా చేయబడిరి మరియు ఆయన వారి దేవుడాయెను. నీరు మరియు ఆత్మమూలమైన సువార్త వాక్యమును విశ్వసించినందుకు పరిశుద్ధులు బహుమానముగా పొందిన దేవుని కృపావరమేయున్నవి. కనుక దేవుని ఆలయములో ప్రవేశించుటకు దీవెనయు. ఆయనతో జీవించు వారు నిత్యము దేవునికి మహిమను కృతజ్ఞతలను చెల్లించెదరు. ఎందుకనగా దేవుడు ప్రతి కన్నీటిని తుడిచివేయునని లేఖనము తెలియచేయుచున్నవి. అక్కడ ఇక మరణముగానీ, ఏడ్పుగానీ, బాధగానీ ఉండవు. పాతవి గతించినవి. ఏడ్పు, దుఃఖము మరణము, అలసట, విచారము ఇప్పుడు ఈ లోకములో నున్నట్లుగా నూతన భూమి ఆకాశములో అట్టివన్నియూ గతించిపోవును. ప్రభువు అనుగ్రహించిన నూతన భూమి, ఆకాశములో నివసించువారు ఇక ఎన్నటికి కన్నీటిని విడువరు. లేదా బాధ వలన ఏడ్వరు. ఎందుకనగా తమ ప్రియులను పోగొట్టుకొనరు గనుక నూతన భూమి, ఆకాశములోనికి పరిశుద్ధులు ప్రవేశించు సమయము ఆసన్నమగునప్పుడు మొదటి ఆకాశము, మొదటి భూమి, వాటి దుఃఖము తేలికగానే మాయమగును. పరిశుద్ధుల కొరకు ఎదురుచూచుచున్నదేమనగా సదాకాలము దేవునితో కూడా నూతన ఆకాశము, భూమిలో మహిమతో జీవించు జీవితమును దీవెనలను పొందుట, దేవుడు మొదటి లోకపు అపరిపూర్ణతలనన్నిటిని తీసివేయును. నూతన లోకమును సంపూర్ణము చేయును.

అధ్యాయం 21లోని ప్రధాన భాగము మనకు నూతన భూమ్యాకాశములను గూర్చి ఈ లోకములో నున్నవన్నియూ తొలగించబడిన తరువాత 20వ అధ్యాయములోనున్నట్లుగా వెయ్యేండ్ల రాజ్యమును గూర్చి చెప్పుచున్నది. అధ్యాయం 20లో ఈ భూమి సంబంధమగు ప్రతి మారుమూల ప్రదేశముతో సహా సమస్తము అంతమగును. అంత్యక్రీస్తు (ఆ మృగము) కాలము, అబద్ధప్రవక్తలు, అతని అనుచరులు మరియు దేవుని విశ్వసించనివారు. ఈ లోకములో ఆయనకు వ్యతిరేకులై నిలుచువారు. అందరూ అంతరించిపోవుదురు. వెయ్యేండ్ల రాజ్య అంతమునకు వచ్చినప్పుడు వారందరూ అగ్నిలో పడద్రోయబడునప్పుడు వారు కనబడు స్థలము కేవలము పాతాళమే.

కనుక అధ్యాయం 21లో ఆయన తన పరిశుద్ధులకు ఇవ్వబోవుచున్న నూతన భూమి ఆకాశమును గూర్చి దేవుడు చెప్పుచున్నాడు. ఆ స్థలము పరిపూర్ణమైనదై ఏ పాపియూ అక్కడ కనబడడు. నీవు అడవి జంతువులను చూచుటకు ‘జూ’కు వెళ్ళినట్లుగానే సాతానును అతని అనుచరులను ఎవరైనా చూడగోరినట్లయిన వారు పాతాళమునకు వెళ్ళవలసినదే.

దేవుడు మనకు ఇవ్వబోవు స్థలమైన నూతన భూమి ఆకాశములో మన ప్రభువు కూడా మనతో నివసించును. దేవుడు మన కొరకు పరిశుద్ధ పట్టణమును అందమైన ప్రకృతితో నిగనిగలాడు పచ్చని తోటతోను చేసెను. నూతన భూమి ఆకాశము వచ్చినప్పుడు మొదటి లోకపు వస్తువులన్నియు దాని పరిపూర్ణత అంతయూ మాయమగును. కేవలము సత్యమే ఉండును. మరియు పరిపూర్ణ పరిశుద్ధులే శాశ్వత కాలము పరలోక రాజ్యమంతటిని పరిపాలించెదరు.నీ ప్రస్తుత పరిస్థితిలో నీవు నిరుత్సాహపడకూడదు


ప్రస్తుత కాలము చీకటికాలమును. నిరీక్షణ లేని కాలమునైయున్నది. నిరీక్షణ అనునది ఈ కాలములో ఎక్కడా కనబడదు. ప్రతివారి భవిష్యత్తు అనిశ్చితి అను మేఘముచే ఆవరించబడెను. అందువలననే ఆయా సమయాలలో మనము కృంగిపోతాము. మనము సువార్తను బోధించుచున్ననూ బలహీనులమైపోతాము. నా మట్టుకు నేను దీని వలననే నా హృదయము కృంగును. కానీ ప్రకటన గ్రంధము చదువుచూ దాని భాగమును వివరించుచున్నప్పుడు దేవుని సేవకులు, పరిశుద్ధులు అంత్యకాలమును ఎదుర్కొనుచూ, బాధపడనవసరం లేదని నేను గమనిస్తాను. ప్రస్తుత శ్రమలు మరియు బాధలు కేవలము తాత్కాలికమని నేను గుర్తించగానే ఆ ప్రకాశమానమైన పట్టణము నా కనుల ముందు కనబడును. మరి ఎప్పుడూ ఆ బాధ నేను పడకుండునట్లు దేవుడు నన్ను బలపరచెను. కేవలము మన ప్రస్తుత పరిస్థితులనే మనం దృష్టించిన యెడల నిజానికి మన జీవితాలు కృంగిపోతాయి. బాధపడి ఆశక్తి రహితంగా మారతాయి. మరియు మనము సువార్తను ప్రకటించుచుండగా అంతులేని నిరుత్సాహమునకు మనము ఎదుర్కొంటాము. కానీ మన ప్రభువు దీవెనలన్నీ మనలను సమీపించుచుండగా అవి మన శరీర నేత్రములకు కనబడకున్ననూ, మన హృదయాలు సమస్త నిరాశ నుండి విడిపించబడి, దాని స్థానములో గొప్ప నిరీక్షణ, ఆనందముతో నింపబడతాము. మనము దుఃఖములో జీవించుటకు ఖచ్చితముగా ఏ కారణము లేదు ఎందుకనగా మన దేవుడు ముందే మనకు నూతన భూమి ఆకాశమునిచ్చెను. నీవు నూతన భూమి ఆకాశమును నమ్ముచున్నావా? నీవు దానిని అనుభవించనప్పటికి నీవు ఎప్పుడైనా దానిలో నిరీక్షణ ఉంచావా? ఈ భూమిపై కూడా కొన్ని అందమైన స్థలము ఉన్నవి. ఈ లోకములో నివసించునట్లు మనం వాతావరణమును గూర్చి మనము మాట్లాడినప్పుడు సాధారణంగా మనము చెట్లు, నదుల ప్రక్కనున్న పచ్చిక బయళ్లు, పొలములోని పుష్పములు మరియు మంచి మనుష్యులను గూర్చి మనం మాట్లాడతాం. అక్కడ స్వచ్ఛమైన నీరు ప్రవహించాలి. దానిలో చెడు వ్యక్తులెవరూ ఉండకూడదు లేదా ఏ లోటు ఉండదు. అట్టి పరిస్థితులన్నీ ఉన్నపుడు దానిని మనము రమ్యమైన వాతావరణం అని చెప్తాం. కానీ పరలోకంలో ప్రతిదీ సంపూర్ణమైనది. అట్టిది ఈ లోకమంతటినీ పాడుబడుచున్న స్థలముకన్ననూ ఎంతో అనుకూలముగా ఉండును. ప్రశ్న ఏమనగా ఎంతో పరిపూర్ణముగా నిర్మించబడి పరలోకము నుండి క్రిందికి తేబడుచున్న ఆ పరిశుద్ధ పట్టణమును ప్రభువు ఎవరి కొరకు సిద్ధపరచెను. పరిశద్ధుల కొరకే దేవుడు ఈ పట్టణమును సిద్ధపరచెను. ఇందువలననే మొదటి భూమిపైనున్న సమస్తమును మనము మరచిపోవాలి. మనము వెయ్యేండ్ల రాజ్యములో నివసించబోవుచున్నప్పటికి తరువాతి లోకములో 21వ అధ్యాయంలో వర్ణించబడిన నూతన భూమి ఆకాశము దేవుడు సత్యముగా మనకు ఇవ్వబోవుచున్నాడు. మరి విశేషమైన మహిమతో ప్రభువుతోపాటు దానిలో నివసించబోవుచున్నాము.

అలాగు చేయవలెనంటే యేసుక్రీస్తును మన కొరకు పంపుట ద్వారా దేవుడు మనలను రక్షించెను. మరియు మనలను పునరుత్ధానపరచి కొనిపోవును. యేసు వలే పునరుత్ధానమైన శరీరమును పూర్ణముగా పొందిన మనము ప్రభువుతో జీవించుట అనునది మనకొరకు నిరీక్షించుచున్న దీవెనకరమైన జీవితమును దీవెనకర ప్రతిబింబమును ఖచ్చితముగా ప్రదర్శింపబడును. నూతన భూమ్యాకాశ రాజ్యమును మనకిచ్చుటకు దేవుడు నిన్ను నన్ను ఈ భూమిపై జయించునట్లు చేసెను. మరియు ఆయన మనలను రక్షించెను. దేవుడు ముందుగా నిర్ణయించిన సమృద్ధి గురించి ఈ లోకములోనున్న పరిశుద్ధులు గుర్తించినట్లయిన వారందరూ ఏ కష్టమును, దుఃఖముతో బాధపడక లేక కృంగిపోకుండా చక్కగా జీవించగలరు. దేవుడు చేసిన దానిని భవిష్యత్తులో ఆయన మన కొరకు చేయబోవు దానిని మనము చూచినట్లయిన మనమందరము పాజిటివ్‌గానూ, ఆనందముగానూ జీవించగలము. కానీ మనలను రాజకీయ, ఆర్థిక నిరీక్షణ లేని పరిస్థితిని ఈ భూమి యొక్క సమాజమును చూచినట్లయిన నిరాశములో మునిగిపోవుట కంటే మరి ఏదియూ మనకు మిగలదు. దేవుడు మనకు నూతన భూమి ఆకాశమును ఇచ్చెను మరియు ఆ పరలోకము మనదేనని నీవు, నేను మరచిపోకూడదు. ఇది వాస్తవము ఇది సత్యము. ఈ లోకము నిన్ను బాధపెట్టుటకు ప్రయత్నించిననూ దాని వలన నీవు బాధపడకూడదు. లేదా కోపగించకూడదు కానీ ప్రభుని వైపు చూడాలి. ప్రభువు తన పరిశుద్ధులకే నూతన భూమి ఆకాశమును వాస్తవముగా ఇచ్చెనని నమ్మి, అట్టి విశ్వాసముతో నీ జీవితాన్ని కొనసాగించా. సమస్తమును నూతన పరుస్తానని దేవుడు చెప్పెను. ఆయన సమస్తమును నూతన పరచెదనని ఆయన యోహానుతో చెప్పెను.

“ఎందుకనగాఈ మాటలు సత్యమును నమ్మదగినవియునైయున్నవి” మొదటి పునరుత్ధానములో పొల్గొనువారు సమస్తమును దేవుడు నూతన పరచునట్టి దీవెనలన్నిటిలో పాలు పొందెదరు. మానవ ఊహలతో దీనిని మనము ఎప్పుడూనూ ఊహించలేము. కానీ అది దేవుడు తన పరిశుద్ధుల కొరకు సిద్ధపరచినది కనుక పరిశుద్ధులందరూ, మహిమను, కృతజ్ఞతలను, గొప్పతనమును స్తుతులను ఎల్లకాలము దేవునికిచ్చెదరు. ఎందుకనగా ఆయన ఈ గొప్ప కార్యమును నెరవేర్చును.

“విశ్వాసమనునది నిరీక్షింపబడు వాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవియున్నవనుటకు రుజువునైయున్నది.’’ (హెబ్రీ 11:1) అని బైబిలు చెప్పుచున్నది. వీటిని మన కన్నులతో చూడలేక పోయినప్పటికి అనగా అనుమానం లేకుండా అవి వాస్తవము. మన పాపములన్నిటి నుండి రక్షింపబడతామని నమ్ముతున్నాం. మరియు మన రక్షణను విశ్వసించుటతో వాస్తవముగా మనము రక్షింపబడినాము. రక్షింపబడిన తరువాత ఏ కొదువలేని పరిపూర్ణమైన ఖచ్చితమైన లోకములో సదాకాలము జీవించెదమని నమ్మి కోరుకొనుచున్నాము. కనుక వాస్తవముగా దేవుడు మన నిరీక్షణను నెరవేర్చెను. మనము కోరుకొని, నిరీక్షించినవన్నీ వాస్తవములోనికి వచ్చెను. ఎందుకనగా మన నిరీక్షణ అంతయూ సత్యమే.

ప్రకటన 10వ అధ్యాయంలో సముద్రము మీదను, భూమి మీదను నిలిచినట్టి దూత ద్వారా ప్రభువు యోహానుతో మాట్లాడినప్పుడు వాటిని వ్రాసికొనుటకు యోహాను ప్రయత్నించినప్పుడు దేవుడు వాటిని వ్రాయవద్దని చెప్పెను. ప్రభువు మాట్లాడిన విషయములన్నిటిలో కొన్ని విషయములు వ్రాయబడుటకు ఆయన అనుమతించలేదు. ఎందుకనగా అవి కేవలము పరిశుద్ధులమైన మనకు మాత్రమే చూపించదలచిన మర్మములైయున్నవి. ఆ మర్మము మనము ఎత్తబడుట కాక మరేదీకాదు. ఖచ్చితముగా ఏ స్థానము వద్ద మనము ఎత్తబడతామో తెలిసికొనుటకు దేవుని ఏడుబూరల నిర్ణయాత్మకమైన ఆధారమై ఈ మర్మమును తెలిసికొనునట్లు చేయునని మనము ముందు గుర్తించాలి. ఆయన ఏడవ బూర ఎప్పుడు మ్రోగును? ఏడవ సంవత్సరము కాలమైన మహాశ్రమలోని మొదటి మూడున్నర సంవత్సరములు గతించిన కొలది కాలముననే ఆ ఏడవ బూర మ్రోగును. అప్పుడే పరిశుద్ధులు పునరుత్ధానము మరియు ఎత్తబడుట వచ్చును. మరియు ఎత్తబడుట ముగియగానే, కొద్ది కాలమునకే ఏడు పాత్రల తెగుళ్ళు సంభవించును. కొన్ని సంవత్సరాల క్రితం ఆసియాలోనున్న ఆ ఏడు సంఘములను శీర్షికగల విషయముతో నొక ఉజ్జీవ కూడికను నేను జరిపించాను. నేను ఈ ఆసియాలో నున్న ఏడు సంఘములను గూర్చి రచనకూడా చేశాను. దానిలో ఇప్పుడు నేను వ్రాసిన భాగమును గూర్చి వివరించాను. ఆ పుస్తకములోని ఉపమానమును చూసే సమయము ఎంతో మార్పు చెందినప్పటికి మారుచున్న కాలముతో ఏ సంబంధము లేనిదైనట్టు దేవుని వాక్యములో ఏ మార్పులేదు అని నేను భావిస్తున్నాను.

దేవుడు నీ కొరకు, నా కొరకు సిద్ధపరచిన నూతన భూమి ఆకాశములో నివసించాలని నీవు కోరుచున్నావా? దేవుడు చెప్పినప్పుడు సమస్తమును క్రొత్తవిగా చేయును. పునరుత్పత్తి వలే ఉన్నవాటినే ఆయన నూతన పరచునని కొద్దిమంది వ్యాక్యానిస్తారు. కానీ 21వ అధ్యాయము నుండి అది ఖచ్చితముగా పూర్తిగా నూతన లోకము, పాత దాని నుండి పూర్తిగా వేరైనది. తిరిగి జన్మించినవారు దేవునిచే పూర్తిగా నవీనముగా చేయబడిన నూతన భూమి ఆకాశములో పాలిభాగస్తులవుతారు. ఎందుకనగా పరలోక సంబంధమైన వాటిలో వారు పాలిభాగస్తులు అనగా పరలోకములో వారు భాగస్వాములు. వస్తు సంబంధమైన మన ఆలోచనపై ఆధారపడక మనము ఆత్మ సంబంధముగా యోచించవలెను. దేవుడు మనకు అనుగ్రహించిన దానిని విశ్వసించిన పరిశుద్ధుల వలే మీరందరూ ఉండాలని, ఇవన్నియూ ఇప్పటికి నెరవేర్చబడకపోయిననూ వాస్తవము. లోనికి వచ్చునని నమ్మిన విశ్వాసులుగా మీరు ఉండాలని నేను దేవుని ప్రార్థించుచున్నాను. దేవుడు మనకు గొప్పదీవెనలను అనుగ్రహించెను. దప్పిగొన్నవారికి ఉచితముగా జీవజలధారనిచ్చెదనని దేవుడు చెప్పెను. ఈ మాట నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను గూర్చి కాదు. ఈ భూమిపై తన సువార్తను ఇచ్చుట ద్వారా తమ దప్పిక దేవుడు తీర్చెనని తమ పాపము నుండి రక్షించెనని ప్రజలు నమ్ముట కూడా జీవజలము త్రాగుటకు సంబంధించినదే. కానీ ఈ భాగము ఇక్కడ దీనిని మాత్రమే సూచించుట లేదు. కానీ నూతన భూమి ఆకాశములో నిజముగా జీవజలమును త్రాగుటను గురించి ప్రస్తావించుచున్నది. ఈ జీవ జలమును త్రాగు ప్రతివాడు మరణమును చూడడు. అతని/ఆమె శరీరము ప్రభుని శరీరముగా మారును. అతడు/ఆమె సదాకాలము ఆయనతో నివసించును. మన ప్రభువైన దేవుడు వీటన్నిటిని ప్రణాళిక చేసి ఆది నుండి అంతము వరకు దానిని నెరవేర్చును. ప్రభువు జరిగించిన వాటన్నిటిని ఆయన వాటిని తన కొరకు తన పరిశుద్ధుల కొరకు జరిగించెను. అలాగే పరిశుద్ధులందరూ దేవునిచే క్రీస్తు వారని పిలువబడతారు. ఆయన ప్రణాళిక ప్రకారము దేవుని నిజమైన పిల్లలైనారు.

నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించి పరిశుద్ధులైన వారందరూ గొప్ప ప్రేమను బట్టి ఆయన ఆశ్చర్యకార్యములను బట్టి తమకు కొదువలేదని గుర్తించిన వారై నిత్యము ఆయనకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించెదరు.

‘‘దప్పిగొనిన వానికి జీవజల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించెనని ప్రభువు సెలవిచ్చిన ప్రకారం ఆయన వాస్తవముగానే తన పరిశుద్ధులకు జీవ జలధారనిచ్చెను, నిత్యజీవమును పొందుటకు వారిని అనుమతించెను. దేవుడు తన పరిశుద్ధులపై కుమ్మరించిన వాటిలో గొప్ప బహుమానమైయున్నది. ఇప్పుడు పరిశుద్ధులు నూతన భూమ్యాకాశములో సదాకాలము జీవించుచూ జీవజలధారలను త్రాగుచూ ఉంటారు. దాని వలన ఇక ఎన్నడూ వారు దప్పిగొనరు. ఇప్పుడు పరిశుద్ధులు ఒకరకముగా దేవుని పిల్లలై ప్రభువైన దేవుని వలే నిత్యజీవముగల వారై మహిమలో జీవించెదరు. మరియొకసారి ఈ గొప్ప దీవెనను మనకిచ్చినందుకుగాను ప్రభువైన దేవునికి మహిమను కృతజ్ఞతలను నేను చెల్లించుచున్నాను.సత్యసువార్తనందున్న ఈ విశ్వాసము లోకమును జయించునట్లు మనలను చేయును.


ఇప్పుడు అపోస్తులుడైన పౌలు తన ప్రస్తుత సమయమునకు తిరిగి వచ్చెను. వచనం 7లో జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేనతనికి దేవుడనైయుందును. అతడు నాకు కుమారుడై యుండును. ‘‘జయించువాడు” అనగా ప్రభువు అనుగ్రహించిన విశ్వాసమును కాపాడుకొనినవారని ఇక్కడే సూచించుచున్నది. ఈ విశ్వాసము పరిశుద్ధులందరినీ సమస్త ఇబ్బందులను, బహీనతలను జయించునట్లు అనుమతించును. ప్రభువైన దేవునిపట్ల మనకు గల విశ్వాసమును, ఆయన అనుగ్రహించిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తలో మనకు గల సత్యప్రేమ ఈ లోక పాపములన్నిటిపై దేవుని తీర్పుపై మన శత్రువుపైన మన స్వంత బలహీనతలపైన అంత్యక్రీస్తు హింసపైన మనకు జయమునిచ్చును.

వీటన్నిటిపై మనకు జయమునిచ్చినందుకై ప్రభువైన దేవునికి నేను మహిమను కృతజ్ఞతాస్తుతులను చెల్లించుచున్నాను. ప్రభువైన దేవుని విశ్వసించు ఈ పరిశుద్ధులు తమ విశ్వాసంతో అంత్యక్రీస్తును జయించగలరు. ఎందుకనగా వారిలో ప్రతి ఒక్కరు తమ విరోధులతో చేయు యుద్ధములో జయోత్సాహము చేయగల విశ్వాసమును ప్రభువైన దేవుడు వారికి అనుగ్రహించెను. ఇప్పుడు తమ విశ్వాసముతో ఈ లోకమును అంత్యక్రీస్తును జయించిన పరిశుద్ధులను నూతన భూమ్యాకాశములను స్వతింత్రించుకొనునట్లు దేవుడు అనుమతించును. ఇట్టి బలమైన విశ్వాసమును మనకిచ్చినందుకు మన దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులను చెల్లించుచున్నాను.

జయించువారికి నూతన భూమ్యాకాశములో తన వారసత్వము నిచ్చెదనని అక్కడ ఏడ్పుగాని, వేదనగాని, బాధగానీ ఉండదని దేవుడు సెలవిచ్చెను. జయించువారు మాత్రమే దానిని పొందుటకు అర్హులు. ఈ విశ్వాస విజయమే ప్రభువు మనకు ఇచ్చిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తలోనున్న విశ్వాసము. ఈ విశ్వాసముతోనే మనం లోకమును మన పాపమును, మన స్వంత బహీనతలను అంత్యక్రీస్తును జయించగలము.

అంత్యక్రీస్తును జయించు అట్టి విశ్వాసమునకు బహుమానముగా మనము త్వరలోనే దేవుని నుండి నూతన భూమ్యాకాశములను పొందగలము. మన విశ్వాసమునకు ఈ దీవెనలను పొందెదము.కనుక అంత్యక్రీస్తు మనకు వ్యతిరేకముగా నిలిచి, మన విశ్వాసమును దొంగిలించ ప్రయత్నించినప్పుడు విశ్వాసముతో మన శత్రువు విధానములన్నిటిపై విజయము పొందెదము. దేవుని వాక్యమును విశ్వసించి జయించువారు ఇతరులు ఏమన్ననూ పట్టించుకొనక తమ పాపములన్నిటిని ప్రభువు తీసివేసెనను సత్యమునందున్న విశ్వాసమును కాపాడుకొందురు. మన పాప పరిహారము పొందినవారమై మనము తిరిగి జన్మించినవారమై ఇప్పుడు అంత్యకాలములో జీవిస్తున్నాము. కనుక విశ్వాసముతో అంత్యక్రీస్తు విధానమును తప్పక జయించాలి.

దేవుడు మనకు తన నూతన భూమ్యాకాశములను ఐశ్వర్యము, ఘనత, మహిమనిచ్చెనను సత్యము నందు విశ్వాసముతో అతిత్వరగా సమసిపోవు శ్రమలను మనము జయించెదము. మన కొరకు మంచి లోకము ఎదురుచూచుచుండగా నిజముగా మనము విశ్వాస సువార్తను మనము త్రోసివేయుదుమా? రేపు మనకు మంచి విషయము వచ్చునప్పుడు అత్యద్భుత విషయాలు మన కొరకు నిరీక్షించుచుండగా మనము కేవలము ఒక దినము కొరకు మనలను సిద్ధపరచిన ఈ దినము కష్టమును మనము ఓర్చుకొనలేము. మనలను మనము కాపాడుకోవాలి.

పరిశుద్ధులు తమ మనస్సునందుంచుకొనవలసిన అతిముఖ్యమైన విశ్వాసము. నిరీక్షణ, ప్రేమనుగూర్చి బైబిలు తరచుగా మనకు చెప్పుచున్నది. నిరీక్షించువారు దేవుడు తమకు అనుగ్రహించిన ఈ దీవెనలన్నియూ వాస్తవమని విశ్వాసమున్న వారు ప్రస్తుత శ్రమలను జయించుట కంటే అధిక సామర్థ్యము కలవారు. అంత్యకాల తెగుళ్ళు త్వరలోనే అంతమగును. కనుక దేవుడు తన పరిశుద్ధులు వాటి నుండి తప్పించుకొను మార్గమును చూపును. కనుక మనమందరమూ కాపాడుకొనవలెను. నీవు నూతన భూమ్యాకాశములలో ప్రవేశించెదరని, గొప్ప విశ్వాసముతో దానిలో జీవించెదవని నేను నమ్ముచున్నాను.

విశ్వాస ఆనందములో, ఈ వాక్యములన్నీ విశ్వాసము ద్వారా నీ శరీరమును కాక నీ హృదయమును తాకును. అట్లు జరిగినచో నీ హృదయము క్రొత్త బలమును కనుగొనును కనుక బలపడును. మరియు అది నిరీక్షణ కలిగి యుండును.

అంత్యకాలములో పరిశుద్ధులందరూ హతసాక్షులగుదురు. నూతన భూమ్యాకాశములో మనకు స్థానమున్నదను నిరీక్షణతో చూస్తే రెట్టించిన బలముతో హతసాక్షులను కౌగలించుకొనుటకు అవసరమైనదాని కంటే బలము కలవారమౌతాము.

ఆయన స్వభావములో మన ప్రభువైన దేవుడు సత్యదేవుడైయుండి ప్రేమాయుడైయున్నాడు. ఆయన మూలముగా దేవుని యెదుట పిరికివారగు ప్రజలు ఎవరు? వారు నిజమైన పాపముతో జన్మించినవారు ప్రభువు అనుగ్రహించిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తతో తమ పాపమును కడుగుకొనని వారు ఎందుకనగా వారి స్వభావములో దేవుని ఆరాధించుట కంటే అధికముగా వారు చెడు తనమును ఆరాధించెదరు వారు వెలుగు కంటే అధికంగా చీకటిని ప్రేమించి దానిని అనుసరించెదరు. కనుక ప్రభువైన దేవుని ఎదుట వారు పిరికివారుగా ఉన్నారు. దేవుని ఎదుట పిరికివారైన వారందరూ అగ్నిగంధకములతో మండుచున్న గుండమందు పాలిభాగస్తులవుతారు. ఈ ప్రజలు తమంతట తాము చీకటైయుండి తమ హృదయులలో పాపమును కలిగియున్నారు.

కనుక వారు దేవుని ఎదుట పిరికివారగుదురన్నది స్థాపించబడిన సత్యము. సాతానునకు చెందిన ఆత్మకలవారు చీకటిని ప్రేమించుచుండగా వెలుగైయుండిన దేవుని ఎదుట పిరికివారగుదురు. ఇందువలన వారు తమ చెడుతనమును, బలహీనతలను దేవుని యొద్దకు తీసికొనవచ్చి ఆయన నుండి తమ పాప పరిహారమును పొందవలెను. ప్రభువిచ్చిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించనివారు దేవుని ఎదుట గొప్పపాపులై ఆయన విరోధులగుదురు.

తమ ఆత్మలు నిషిద్ధమైన వాటికి చెందగా వారు దేవుని ప్రేమకు వ్యతిరేకముగా నిలిచినందున ప్రతి పాపమును చేయుచూ అసత్య సూచనలను అనుసరించి సమస్త విగ్రహమును ఆరాధించి ప్రతివిధ అబద్ధమును పలుకుచు అగ్ని గంధకములతో మండుచున్న గుండములో దేవునిచే తీర్పు తీర్చబడి త్రోయబడెదరు. ఇదే వారి రెండవ మరణము.

ఈ రెండవ మరణము నరకమునకు పోవు వారి కొరకు నియమించబడినవి. వీరే పిరికివారు అవిశ్వాసులు, నిషిద్ధులు, నరహంతకులు, వ్యభిచారులు, విగ్రహారాధికులు అంత్యక్రీస్తును అతని అనుచరులతో చేతులు కలిపినవారు దేవుని ప్రేమను ఇప్పుడు అంగీకరించరు. ఆయన యందు విశ్వాసముంచనివారు చాలా చెడ్డవారు. ఈ చెడ్డవారందరూ అగ్నిగంధకములతో మండుచున్న గుండములోనికి త్రోయబడుతారని బైబిలు చెప్పుచున్నది. ఇందువలననే దీనిని రెండవ మరణమని బైబిలు పిలుచుచున్నది.

రెండవ పునరుత్ధానములో పాల్గొనువారు, అగ్నిగుండములో త్రోసినను చావరు. ఇట్లు అగ్నిలోనికి త్రోయబడుటకే వారు శరీరమందు పునరుత్ధానపరచబడి దానిలో నిత్యమూ జీవించెదరు.

దేవునియందు అవిశ్వాసులు అగ్నిగంధకములోనికి త్రోయబడుటకే తిరిగి లేస్తారు. రెండవ పునరుత్ధానము నిత్య ఆవేదనను మరణము నొందకుండా అనుభవించుట అనునది అవిశ్వాసులైన ప్రజల కొరకు దాచబడియుండెను.

ఏడు తెగుళ్ళ కల ఏడు పాత్రలు కుమ్మరించబడిన తరువాత కొద్దికాలానికి ఆ వెయ్యేండ్ల రాజ్యము పూర్తి చేయబడును. దాని వెయ్యేండ్లు గడిచిన తరువాత పరిశుద్ధులు నూతన ఆకాశమునకు భూమికి కొనిపోబడెదరు. ఆ వచనంలో ‘‘పెండ్లికుమార్తెను అనగా గొర్రె పిల్ల భార్యను నీకు చూపెదనని” గొర్రె పిల్ల భార్య అనగా ఇక్కడ యేసుక్రీస్తు ద్వారా ఇవ్వబడిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్త ద్వారా రక్షించబడి దానిలో విశ్వాసముంచినవారు.పరిశుద్ధ పట్టణపు మహిమయు, సౌందర్యమును వర్ణనకు అందనవి


యెరూషలేము పట్టణము పరిశుద్ధ పట్టణమునకు సాదృశ్యమైయున్నది. అక్కడ పరిశుద్ధులు తమ పెండ్లికుమారునితో నివసిస్తారు. యోహాను చూచిన ఈ పట్టణము వాస్తవముగా అందముగాను, రమ్యముగాను ఉన్నది. అది దాని పరిమాణములో అద్భుతమైనది. లోపల బయట ప్రశస్తమైన రాళ్ళతో పొదగబడినది. స్పష్టముగాను పరిశుభ్రముగాను ఉన్నది. యేసుక్రీస్తు యొక్క పెండ్లికుమార్తే తమ పెండ్లి కుమారునితో ఎక్కడ నివసిస్తారో యోహానునకు దూత చూపించినది. 

ప్రశస్తమైన రాళ్ళతో నిర్మించబడిన స్థలములో నివసించుటకు, పన్నెండు రకములైన ప్రశస్తమైన రాళ్ళతో నిర్మించబడిన ఈ స్థలములో గొర్రె పిల్ల వధువులైన వారు శాశ్వత జీవమును జీవించెదరు. ఈ పట్టణము ఆయన గొర్రె పిల్ల భార్యకు ఇవ్వబోవు బహుమతైయున్నది. ఈ భాగములో యెరూషలేము పట్టణము ధగధగమెరయుచూ దాని కాంతి ప్రశస్తమైన రాతికాంతివంటిదై స్ఫటికమువలే స్పష్టముగా నుండి సూర్యకాంతపురాయి వలే ఉన్నది.

కాబట్టి దేవుని మహిమ ఆ పట్టణముతోను దానిలో నివసించువారితోనూ ఉన్నది. దేవుని స్వభావము వెలుగు కనుక తమ చీకటంతటిని కడిగివేసుకొన్నవారు. తమ బలహీనత లేని వారు. పాపరహితులు ఈ పట్టణములో ప్రవేశించెదరు. అలాగే ఈ పరిశుద్ధ పట్టణములో ప్రవేశించుటకు మన ప్రభువు మనకిచ్చిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్త యొక్క సత్యవాక్యమును మాత్రమే మనము నమ్మవలెను.

ఈ భాగములో ఆ పట్టణమునకు గొప్పదైన ఎత్తైన గోడ పన్నెండు గవునులను కలిగియున్నదని చెప్పబడినది. ఆ గవునులపైన పేర్లు వ్రాయబడెనని ఇవి ఇశ్రాయేలు పన్నెండు గోత్రముల పేర్లు అని కూడా చెప్పబడినది. నిజముగా దేవుడు వాస్తవానికి ఈ పట్టణమును పరిశుద్ధుల కొరకు నిర్మించెను అని చెప్పుచున్నాడు. దాని చుట్టూ గొప్పదైన ఎత్తు గోడ ఉన్నది.

ఈ పరిశుద్ధ పట్టణములో ప్రవేశించుటకు గల మార్గము ఎంతో కష్టమైనదని సూచనైయున్నది. అనగా మానవ ప్రయత్నములో దేవుని యెదుట మన పాపములన్నిటి నుండి రక్షింపబడుట అసంభవమని దీని భావము లేదా దేవుని సృష్టియైన ఈ లోక సంబంధమైన కార్యము వలన అని అర్థం. మన పాపములన్ని క్షమించబడి దేవుని పట్టణములో ప్రవేశించుటకు ఖచ్చితంగా మనకు యేసుక్రీస్తుని పన్నెండుమంది శిష్యులకున్న విశ్వాసము ఉండాలి. ఆ విశ్వాసమే నీరు మరియు ఆత్మమూలమైన సువార్త సత్యమును నమ్ముట.

అలాగే ఇట్టి విశ్వాసమును నీరు మరియు ఆత్మమూలమైన సువార్త పట్ల లేనట్టివారు ఈ పరిశుద్ధ పట్టణంలో ఎప్పటికి ప్రవేశింపలేరు. ఆ పట్టణమును కావలికాయుటకై ప్రభువైన దేవుని వలన నియమింపబడినవారై ద్వార పాలకుల వలే నిలువబడియున్న పన్నెండు దూతలున్నవి. ‘‘ఆ ద్వారముపై పేర్లు వ్రాయబడియున్న”వను వాక్యభాగములో మరో విధంగా ఆ పట్టణపు స్వంతదారులెవరో నిర్ణయింపబడెను. ఎందుకనగా దానిస్వంత దారులు దేవుడును ఆయన ప్రజలునైయున్నారని ఇప్పుడు ఆయన పిల్లలైన దేవుని ప్రజలకు అది చెందునని ఇక్కడ చెప్పబడినది.

ఆ పరిశుద్ధ పట్టణమునకు దాని నలుదిక్కులలో ప్రతి దానికి వరుసగా ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమరలో మూడేసి ద్వారములున్నవి. ప్రభువు ఈ మూడు ద్వారములను ఇక్కడ ప్రస్తావించినది ఆ ద్వారము కేవలము ఇప్పుడు మనము విశ్వసించి సువార్తకు సంబంధించినది మనకు చెప్పుటకేనని నేను ప్రగాఢముగా తలంచుచున్నాను. 1యోహాను 5:7-8 నిజసువార్త సాక్ష్యమిచ్చుటనునవి పరమందు, భూమిమీదను మూడు ఉన్నవని మనకు చెప్పుచున్నది. ఈ మూడు సాక్ష్యమును విశ్వసించువారు పరమందు ప్రవేశింపగలరు. తిరిగి జన్మించినవారమైన మనము త్రియేక దేవునిలో జీవిస్తున్నాము. మరియు ఆయన నీతిక్రియల ద్వారా మనలను రక్షించునవి నీరు రక్తము మరియు ఆత్మ.

పన్నెండుమంది అపోస్తులుల పేర్లు పట్టణ గోడ పన్నెండు పునాదులమీద వ్రాయబడెనను సత్యము ప్రభువు మనకు వాగ్ధానము చేసిన దానిని ఖచ్చితముగా నెరవేర్చెను. ఆయన వారి పేర్లను జీవగ్రంధము నుండి తుడుపు పెట్టక దానిలో వాటిని లిఖించెను.

ఒక క్రోసు, గ్రీకులో స్టేడియస్‌ అనునది దూరమును కొలుచు కొలమానము. దాదాపు 600 అడుగులు (185 మీ)గా ఈ దినాల కొలతలలో ఉన్నవి. చచౌకము పట్టణము ప్రతి ప్రక్క పరలోకములో 12,000 ఫ్లర్లాంగు అని బైబిలు చెప్పుచున్నది. అనగా ప్రతి ప్రక్క 2,200కి.మి (1390 మైళ్ళు) అని చెప్పుచున్నది. దాని వెడల్పు, పొడవు, ఎత్తు సమానమని మనకు చెప్పబడినది. అద్భుతమైన పట్టణ పరిమాణము దేవుని రాజ్యము ఎంత గొప్పదై మహిమకరమైనదో తెలియచేయుచున్నది.

సంఖ్య నాలుగు యొక్క బైబిలు అర్థము దుఃఖము. ప్రతివారు కలిగిన ఎదో ఒక విశ్వాసమును ప్రభువు మన నుండి కోరుకొనలేదు. కానీ దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్లుగానే అంగీకరించువారికి కలిగినట్టి విశ్వాసమును కోరుచున్నాడు. వారు మన జ్ఞానముతో దానిని పూర్తిగా అర్థం చేసికోలేకపోయినను క్రైస్తవునిగా యేసుక్రీస్తు సిలువ ప్రభువే దేవుడని రక్షకుడని విశ్వసించుట ద్వారా పరిశుద్ధ పట్టణములో ప్రవేశించుట అసాధ్యము. మన ప్రభువుతానే చెప్పినట్లు అతడు/ఆమె నీటి మూలముగాను ఆత్మమూలముగాను తిరిగి జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేరు. బాప్తిస్మమిచ్చు యోహాను ద్వారా బాప్తిస్మము పొందినప్పుడు లోకపాపము యేసుపై మోపబడెనని విశ్వసించినప్పుడే ప్రజలు తిరిగి జన్మించగలరు. ఆయన వారి స్థానములో నుండి వారి పాపమును కడుగుటకు తన రక్తమును సిలువలో కార్చి సిలువలో చనిపోయెను.

“పట్టణము స్వచ్ఛమగు స్పటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది.’’ అను భాగములో ఎవరి విశ్వాసము సువర్ణము వలెనున్నదో అనగా నిజముగా దేవుని విశ్వసించువారు దానిలో ప్రవేశించెదరని ఈ భాగములో చెప్పబడినది. ప్రభుని పరిశుద్ధ పట్టణములో ఒకడు ప్రవేశించుటకు అనుమతించు విశ్వాసము. దేవుని వాక్యము వ్రాయబడినట్టుగానే విశ్వసించునట్టిదై అట్టిది స్వచ్ఛమైనదై లోక సంబంధమైన వాటి నుండి వేరుగా ఉండాలి. మరో విధంగా ఇక్కడ చెప్పునదేమనగా ఒకడు నీరు మరియు ఆత్మమూలముగా దాని స్వచ్ఛత యొక్క దేవుని వాక్యమును అంగీకరించి తిరిగి జన్మించి ఆ వాక్యమును నిజముగా విశ్వసించాలి. మరియు అతని/ఆమె విశ్వాసము పరిశుద్ధపరచబడాలి. ఆ పట్టణపు పునాదుల యొక్క గోడలు ప్రతి విధమైన ప్రశస్తమైన రాళ్ళతో పొదగబడెను.

అనగా మనము మన ప్రభువు వాక్యము నుండి వివిధ రకముల విశ్వాసముచే పోషింపబడాలని చెప్పుచున్నది. మనము క్రమశిక్షణ గల విశ్వాసమును కలిగి యుండాలి. కేవలము నీరు మరియు ఆత్మమూలమైన విశ్వాసము లేక పరలోకమును గూర్చిన నిరీక్షణ లేక వెయ్యేండ్ల రాజ్యపు నిరీక్షణ కలిగియుండడం కాదు. ఇప్పటి శ్రమలను సహించుచుండగా ఈ శిక్షణ గల విశ్వాసము కూడా దేవుని వాక్యము నుండే వచ్చును.

ప్రభువు తన పరిశుద్ధులకు తమ పాపపరిహారమును దీవెనలనే కాక తమ పాపము క్షమించబడినవారు వెయ్యేండ్ల రాజ్యములోనూ, పరలోకములోను ప్రవేశించెదరను తమ నిరీక్షణ నెరవేర్పును దీవెనలను అనుగ్రహించెను. దుఃఖముగానీ, విచారముగానీ ఎప్పుడు కనబడనట్టి నూతన భూమ్యాకాశములో ప్రవేశించుటకు తమను అర్హులుగా చేసిన దేవునికి పరిశుద్ధులు కృతజ్ఞతలు చెల్లించాలి.

పరలోకములో ప్రవేశింపగోరిన పరిశుద్ధులు ఈ భూమిమీద నుండగా ఎంతో ఓర్పుగలవారై యుండాలి. తమ విశ్వాసముయొక్క మధ్య స్థానమున స్థిరముగా నాటబడాలి. ప్రభువైన దేవునిచే పలుకబడిన సత్యవాక్యమును విశ్వసించువారు. అనగా తమ విశ్వాసమును కాపాడుకొనుటకు గొప్ప రక్షణ అవసరమైయున్నది. అంత్యకాలము వచ్చినప్పుడు విశ్వాస విరోధియైన అంత్యక్రీస్తు ప్రత్యక్షమగును.

ఈ అంత్యక్రీస్తు సాతాను పరిచారకునివలే, విశ్వాసులైన ప్రజలకు అనేక శ్రమలను తెచ్చును. వారిని తమ విశ్వాసము వదులునట్లు చేయుటకు కోరుకొనును. ప్రజలు తమ విశ్వాసమును వదలి అంత్యక్రీస్తుపై నిలబడిన వారి వెయ్యేండ్ల రాజ్యము మరియు పరలోకము అందకుండా పోవుటే కాక, సాతానుతో కూడా వారు నరకములో త్రోయబడెదరు.

కాబట్టి బాధలు, హింసలు, అంత్యకాల తెగుళ్ళ మధ్య మన విశ్వాసము ఖచ్చితముగా కాపాడుకొనునట్టి రక్షణ అవసరము. ఎందుకనగా దుర్భేద్యమైన రక్షణ నూతన ఆకాశమును, భూమిని మనదిగా చేయును.

నూతన భూమి ఆకాశములో నివసించుట ప్రభుని బాహువులో కౌగలించుట వలే ఉండును. ఎందుకనగా నూతన లోకమునకు వెలుగైయున్న యేసుక్రీస్తు ఈ పరిశుద్ధ భూమిపై వెలుగువలే ప్రకాశించును. కనుక దానిపై ప్రకాశించుటకు సూర్యుడుగాని, చంద్రుడు గాని అవసరం లేదు. యేసుక్రీస్తు మన రక్షకుడు, సృష్టికర్త మన న్యాయాధిపతి. నూతన ఆకాశము మరియు భూమిలో ఆయన దేవుడై మనతో కూడా నివసించును. ఆయన ద్వారా మనం పరలోకంలో ప్రవేశిస్తాము. ఆయన నుండే సమస్త దీవెనలు ప్రవహించును. పరిశుద్ధులు చేయునది ఎల్లప్పుడూ ప్రభుని స్తుతించెచుట.

కింగ్‌జేమ్స్‌వర్ణనలో 24వ వచనంలో ఈ విధముగా వ్రాయబడెను. ‘‘జనులు దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు తమ మహిమను దానిలోకి తీసికొని వత్తురు” భూ మహిమ పరలోకములోనికి తేబడును అనగా మొదటి భూమిని పరిపాలించినవారు. వారు ధనవంతులైరి కనుక వారి సంపదను నూతన భూమి ఆకాశములోనికి తెచ్చును అని కాదు. ఇక్కడ ప్రస్తావించబడిన భూమి, వెయ్యేండ్ల రాజ్యము యొక్క భూమి.

పరిశుద్ధులు రక్షింపబడి ఉన్నట్లుగానే అందరూ వెయ్యేండ్ల రాజ్యములో ప్రవేశించినప్పటికి సందేహము లేకుండా వారికి వివిధ అధికారము ఇవ్వబడును. కొందరు పది పట్టణములను ఏలగా మరి కొందరు ఐదు పట్టణములను ఏలుదురు. అది వారు మొదటి లోకములో నుండగా సువార్తను బోధించుటలో కష్టించి పనిచేసిన దాని బట్టి ఉండును.

వచనం 24 మనకు చెప్పునదేమనగా వివిధ అధికారము కల ఈ రాజు నూతన భూమ్యాకాశముకు వచ్చెదరు. వెయ్యేండ్ల రాజ్యములో ఏలుబడి చేసిన వారు అనగా నూతన భూమ్యాకాశములో ప్రవేశించువారు తమతో కూడా తమ మహిమను, ఘనతను ప్రభుని యందు విశ్వాసమును తెచ్చెదరు. కనుక ఇప్పుడు మనము నివసించుచున్న ఈ మొదటి భూమితో చేయునదేదియు లేదు.

నూతన భూమి ఆకాశములు పరిశుద్ధ పట్టణమున్న ప్రదేశము. ఇప్పటికే పరిశుద్ధ కాంతితో నింపబడినందున అక్కడ ఇక రాత్రి ఉండదు. నీరు మరియు ఆత్మమూలమైన సువార్త సత్యమును ఎరుగని వారు చేసినవారై, నిషేధింపబడవలసినవారై, అబద్ధికులై ఉంటారు. కనుక వారు పరిశుద్ధ పట్టణములో ప్రవేశింపలేరు. నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించువారు పరలోకములో ప్రవేశించెదరు. కనుక ఈ నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను పరలోకమునకు తాళపు చెవియై పాపపరిహారమునకు మూలమైయున్నది. దేవుడు మనకు ఈ తాళపు చెవినిచ్చెనని నీవు గుర్తించి విశ్వసించినప్పుడు నీ పేరు జీవగ్రంధములో వ్రాయబడునని నీవు గుర్తించాలి. ఈ సువార్త సత్యమును నీవు అంగీకరించిన ఆ పరిశుద్ధ పట్టణములో ప్రవేశించుట అను దీవెన అను వస్త్రమును ధరించుకొందువు.

పరిశుద్ధ పట్టణము ఇప్పటికే మనకు అనుగ్రహింపబడెనని విశ్వసించాలి. ఆ నిరీక్షణ బట్టి నీ జీవితము జీవించు.

ఇప్పుడు మనము ఎదుర్కొనుచున్నవన్నీ ఈ స్వతంత్ర రాజ్యములో కొలవబడుచున్నట్లుగానే నిజమైన ఆనందము ఏమిటో అను దానిని మనము కొట్టివేయలేము. మనము దేవుని కొలకర్రచే కొలవబడినప్పుడు పరలోకము కలిగియున్నవారే నిజ ఆనందము కలవారని మనమందరమూ గుర్తించగలము. ఎందుకు? త్వరగానో ఆలస్యముగానో ఈ లోకములోని సమస్తమునూ మాయమగును. మన నిరీక్షణయుంచుటకు ఏ స్థలమునూ లేక దేవుని ప్రణాళిక చొప్పున శ్రమలను తెగుళ్ళును వారిపైకి తేబడును. కనుక వారు లయమై పోయెదరు. ఒకని నిరీక్షణ తేలికగా క్రుళ్ళి, బూడిదగా మార్చబడు శరీర విషయమందు ఉంచుటకంటే ఘోరమైన బుద్ధిహీనత మరొకటి ఉండదు.

కానీ దానికి వ్యతిరేకంగా, నిత్యరాజ్యమైన పరలోకముపై తమ నిరీక్షణను ఉంచువారికి అది కుళ్ళినదికాదు, కాలిపోవునది కాక దీవెన పొందెదరు. ఈ లోకంలో అత్యంత సంతోషకరమైన ప్రజలు ఎవరనగా పరలోకప్రవేశము కలిగి వారి పాపములన్నియూ క్షమించబడి కడుగబడినవారే దేవునిచే దీవించబడిన జీవితం మనం జీవించాలి.

తమకు నూతన భూమ్యాకాశమునిచ్చినందుకు ఆయనకు మహిమ చెల్లించి వారు తమకు తాము ప్రతి ఆత్మ పరలోకములో ప్రవేశించునట్లు చేయగల సత్య సువార్తను బోధించువారు ఆయనను స్తుతించెదరు.

మనమందరమూ అట్టి దీవెనకరమైన జీవితమును జీవించాలి. మనమంతా దేవునిచే ప్రేమించబడదాం. మరియు మన ప్రభువు నమ్మకమును మనం నిలబడినపుపడు మనమందరమూ ఆయన బాహువులో కౌగలించబడు జీవితంను జీవిద్దాం.