Sermons

[అధ్యాయము 22-1] <ప్రకటన 22:1-21> జీవజలము ప్రవహించు నూతన భూమి మరియు ఆకాశము<ప్రకటన 22:1-21>

“మరియు స్పటికమువలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు సింహాసనము నొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెలనెలకు ఫలించుచు పండ్రెండు కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్థమైనదేదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొఱ్ఱె పిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసళ్ల యందుడును. రాత్రి యికెన్నడు ఉండదు. దీపకాంతియైనను సూర్యకాంతియైనను వారికక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. మరియు ఆ దూత ఈలాగు నాతో చెప్పెను. ఈ మాటలు నమ్మకములును సత్యములునై యున్నవి. ప్రవక్తల ఆత్మకు దేవుడగు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతలను పంపెను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంధములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. యోహానను నేను ఈ సంగతులను ‘వినినవాడను, చూచినవాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల యెదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా, అతడు - వద్దు సుమి. నేను నీతోను, ప్రవక్తలైన నీ సహోదరులతోను, ఈ గ్రంధమందున్న వాక్యమును గైకొనువారితో సహదాసుడను దేవునికే నమస్కారము చేయుమని చెప్పెను. మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను ఈ గ్రంధమందున్న ప్రవచన వాక్యములకు ముద్రవేయవలదు కాలము సమీపమై యున్నది. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే యుండనిమ్ము. నీతిమంతుడు ఇంకను నేతి మంతుడు ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్దుడుగానే ఉండనిమ్ము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియలు చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది. నేను అల్ఫాయు, ఓమెగయు మొదటివాడను, కడపటివాడను, అదియు అంతమునైయున్నాను. జీవ వృక్షమునకు హక్కుగలవారై, గుమ్మములగుండా ఆ పట్టణములోనికి పరిశుద్ధుడు ప్రవేశించునట్లు తమ వస్త్రమును ఉదుకుకొనువారు ధన్యులు. కుక్కలును మాంత్రికులును వ్యభిచారులును, నరహంతకులును, విగ్రహారాధకులును, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపట నుందురు. సంఘము కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను. నా దూతను పంపియున్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కయునైయున్నాను. ఆత్మయు పెండ్లికుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నాడు. వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పిగొనిన వానిని రానిమ్ము ఇచ్ఛయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఈ గ్రంధమందున్న ప్రవచన వాక్యమును విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చునది ఏమనగా ఎవడైనను వీటిలో మరి ఏదైనను కలిపినయెడల ఈ గ్రంధములో వ్రాయబడిన తెగుళ్లు దేవుడు వానికి కలుగజేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైననూ తీసివేసినయెడల దేవుడు ఈ గ్రంధములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలులేకుండ చేయును. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు - అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమెన్‌. ప్రభువైన యేసూ రమ్ము, ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై యుండును గాక. ఆమెన్‌.’’వివరణ : 


వచనం 1: మరియు స్ఫటికమువలే మెరయునట్టి జీవజలము నది దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు సింహాసనము నొద్ద నుండి యోహానుకు చూపబడినది ‘‘స్పటికమువలె మెరయునట్టి జీవజలము నది”. ఈ లోకములో నీరు అను మాట జీవమునకు సాదృశ్యమైయున్నది. ఈ జీవజలము నూతన భూమ్యాకాశముల నుండి ప్రవహించును. అక్కడ పరిశుద్ధులు నిత్యము నివసించెదరు అని ఈ వచనం ఇక్కడ చెప్పుచున్నది. గొర్రె పిల్ల యొక్క సింహాసనము నుండి ప్రవహించుచూ జీవ జలనది పరలోక రాజ్యమును తడుపుచూ సమస్తమును నూతన పరచును. ఈ వచన భాగంలో గొర్రె పిల్ల యొక్క సింహాసనము అనగా గొర్రె పిల్ల యేసుక్రీస్తును సూచించును. ఆయన ఈ భూమిపైనున్నప్పుడు నీరు మరియు ఆత్మమూలమైన సువార్త ద్వారా మానవాళిని రక్షించెను.

దేవుడు తన పరిశుద్ధులకు ఇచ్చిన నూతన భూమి ఆకాశములో జీవజలము ప్రవహించును. ఈ తోట నీరు కలర్‌ పెయింటింగ్‌వలె పరిశుభ్రముగాను, స్వచ్ఛముగాను ఉన్నది. అది కేవలము రమ్యమైమనదిగా వర్ణించవలెను. దేవుడు మనకిచ్చిన జీవజలము సాధారణమైన నది కాదు. కానీ ఆ జలము అక్కడనున్న ప్రతి జీవికి జీవమిచ్చును. అలాగే ఈ జీవజలనది సమీపములోనున్న ప్రతి జీవి జీవము పొందును. ఈ జీవజలనది ఒడ్డునున్న పరిశుద్ధులు ఈ నీటిని త్రాగి నిత్యజీవమును అనుభవించుచూ నిత్యము జీవించును.

దేవుని గొర్రె పిల్ల యొద్ద నుండి జీవనది ప్రవహించుచున్నది. నూతన పరలోక రాజ్యములో దేవుని గొర్రె పిల్ల యొక్క కృపను పరిశుద్ధులు స్తుతించెదరు. ఎందుకనగా దేవుడు తన జీవమును కృపను కుమ్మరించెను. ప్రభుని సింహాసనము నుండి ఈ నూతన జీవము అను కృప ప్రవహించుచున్నందుకు నేను ఆయనను స్తుతిస్తున్నాను.

వచనం 2: ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెలనెలకు ఫలించుచు పండ్రెండు కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనమును స్వస్థపరచుటకై వినియోగించును.

ప్రభుని అద్భుత దీవెన యొక్క ప్రదర్శన తన పరిశుద్ధులపై పరలోకములో కొనసాగును. ఎందుకనగా వాక్యము ఇక్కడ మనకు సెలవిచ్చునదేమనగా ప్రభువు మనకు నదికి ఇరువైపులానున్న జీవ వృక్షమును ఇచ్చును. మరియు వాటి ఫలమును తినుటకు అనుమతించును. పన్నెండు రకముల ఫలమును కలిగిన ఆ వృక్షము వాటి నూతన ఫలమును ప్రతి నెలా ఫలించుచూ నూతన జీవజలమును కలిగించును.

ప్రభువు తన పరిశుద్ధులపై కుమ్మరించు కృప ఉన్నతమైనదై గొప్పదైయుండును. మనము చేయగలిగినదంతయూ కేవలము తండ్రియైన దేవుని ఆయనను స్తుతించుటయే ఇప్పుడు పరిశుద్ధులందరూ చేయదగినదంతయూ తమ స్వంతంగా ప్రభుని కొరకు ఏదో చేయుటకు ప్రయత్నించుట కాదు కానీ నూతన భూమ్యాకాశములను నూతన జీవితమును ఇచ్చినందుకై కృతజ్ఞతలు నిండిన హృదయముతో ప్రభువుని స్తుతించుటయే పరిశుద్ధులు హృదయాలను దేవుడు నీకే కృతజ్ఞతలు ప్రభువా! హల్లెలూయ అని గట్టిగా చెప్పినట్లు చేసిన ప్రభువును నేను స్తుతించుచున్నాను.

వచనం 3 : ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు. దేవుని యొక్క గొఱ్ఱె పిల్ల యొక్కయు సంఘమును దానిలో ఉండును.

పరలోకంలో జీవించుచున్న పరిశుద్ధులకు శాపమును శాశ్వతముగా తోసివేయుట అను దీవెనలను దేవుడు ఇచ్చెను. దేవుని సింహాసనము, గొర్రె పిల్లయు పరిశుద్ధులతో కూడా ఉండుట పరలోకము నివసించుచున్న పరిశుద్ధులు గొర్రె పిల్లను తమ హృదయ మధ్యలో స్థాపిస్తారు. కాబట్టి పరిశుద్ధులు హృదయాలు ఎల్లప్పుడూ అందము, సత్యముతో నింపబడి వారి జీవితాలు సంతోషముతో నింపబడతాయి.

“ఆయన దాసులు ఆయనను సేవించెదరు” అను భాగము నుండి పరలోక రాజ్యములో నివసించుచున్న పరిశుద్ధులు ఆయనకు అతి సమీపముగా నుండి మహిమ ధరించుకొని ప్రభువును సేవిస్తారు. పరలోక రాజ్యములో మన ప్రభువు జీవించు స్థలము అత్యంత రమ్యమైనదియు సమృద్ధి రాజ్యమైయున్నది.

అలాగే ఆయన పరిచర్య చేయువారు ప్రభువు ప్రక్కనే అతి సమీపముగా నుండి ఆయన మహిమను అనుభవించెదరు. పరలోక రాజ్యములో కూడా ప్రభువును సేవించువారున్నారని తెలియచేయుచున్నది. పరిచారకుడు అనుమాట తగ్గింపునకు సాదృశ్యము కానీ అతి సమీపముగా నుండి మహిమగల మన ప్రభువును సేవించువారు పరలోకరాజ్యంలో కూడా అధిక దీవెనలొందెదరు. ఎందుకనగా వారు వర్ణించలేనివి కాని మహాదానందమును ధరించుకొందురు. పరలోక రాజ్యములో ప్రభువు సేవకులైనవారు ఈ భూమిమీద కూడా పరలోక మహిమను ధరించుకొన్నవారై అందరి కంటే ఆనందమును పొందెదరు.

వచనం 4: ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసళ్ళయందుండును.

ప్రభువు యొక్క పరిచారకులు, సేవకులను ఎవరికి చెందిన వారు? వారు ప్రభువుయొక్క జనులై దేవుని పిల్లలైయున్నారు. కనుక పరలోక రాజ్యములో ప్రభుని సేవించువారి నొసళ్ళపై ప్రభుని నామము వ్రాయబడినది. ప్రభువు వారిని ఎల్లప్పుడూ కాపాడుచూ దీవించుచుండును. ఎందుకనగా వారు ఆయన వారు. ఆ పరిశుద్ధులు ఆయన పాత్రపై అత్యంత ఆనందకరమైన మరియు మహిమకరమైన సంతోషమును ధరించుకొన్నవారు. ఆయన వారై ప్రభుని సేవకులుగా ఉండుటకు సిగ్గుపడువారు ఆయన మహాత్యము విషయము అజ్ఞానులై, ఎల్లప్పుడును పరలోక పౌరులు కాలేరు.

పరలోకంలో నివసించుచున్న వారి నొసళ్ళపై ప్రభువు పేరు వ్రాయబడినది. ఇది దేవుడు అనుగ్రహించు కృపయైయున్నది. ఇప్పటి నుండి పరిశుద్ధులు ఆయన వారైరి. అలాగే ప్రభునివారైన పరిశుద్ధులను సాతాను కూడా ఏమియూ చేయలేడు. ఆ పరిశుద్ధులు ప్రభువును కలిసి నిత్యము పరలోకరాజ్య మహాత్యములో జీవించెదరు. ప్రభుని మహిమా స్వరూపమును పరిశుద్ధులు ప్రతి దినము చూచెదరు. అనగా ఆయన ప్రేమలోను అద్భుత దీవెనలోను ఎల్లప్పుడూ వారు జీవించెదరు.

పరిశుద్ధులు తెలిసికొనవలసిన విషయము మరొకటి ఉన్నది. ప్రభువైన యేసుతోపాటు తండ్రియైన దేవుడును, పరిశుద్ధాత్మయు తమ కుటుంబముగా వారితో పాటు నివసించును. పరలోకరాజ్యములో తండ్రియైన దేవుడును కుమారుడైన యేసు పరిశుద్ధాత్మయు, పరిశుద్ధులను, దూతలును, ప్రతీది కూడా ఒకే కుటుంబముగా స్పష్టమైన శాంతితో జీవించెదరని కూడా మనము గుర్తించాలి. మనలను ఆయన వారిగా చేసిన ప్రభువును నేను స్తుతిస్తున్నాను.

వచనం 5: రాత్రి యికనెన్నడు ఉండదు. దీపకాంతియైనను సూర్యకాంతియైనను వారికక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు.

బైబిలు చెప్పుచున్న ప్రకారము పరిశుద్ధులు ప్రభుతో కూడా నూతన భూమ్యాకాశములో పరిపాలన చేస్తారు. నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించుట ద్వారా రక్షణ పొందినవారైన పరిశుద్ధులు ఆయనవారై నిత్యము ఆయన సంపదతోను మహాత్యముతోను అధికారముతోను పరలోకమందు ప్రభువుతోపాటు నివసించుచూ పరిపాలన చేయుటకు అనుమతించబడెదరు. సువార్త వలన మరొకసారి మనము ఆశ్చర్యపోతాం. ఎందుకనగా ఎంత అద్భుతమైన దీవెనకరమైన సువార్తను మనం కలిగియున్నాము.

ఈ దీవెనలు మరియు మహిమ అంతటిని బట్టి నేను మన త్రియేక దేవుని పొగడెదను. ఈ భూమిపైనున్నప్పుడు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించిన పరిశుద్ధులు పరలోక రాజ్యములో పరిపాలన చేసెదరు. ఈ కృప ఎంత అద్భుతమైనది! మనమేమియూ చేయలేము కనుక ప్రభుని స్తుతించెదను. వారు ఆ విధముగా దేవుని స్తుతించుట కేవలము సరియైనది.

పరిశుద్ధులు నివసించు నూతన భూమ్యాకాశములో దీపకాంతియైననూ, సూర్యకాంతియైననూ అవసరం లేదు. ఎందుకు? ఎందుకనగా నూతన భూమ్యాకాశములో దేవుడు తానే ప్రకాశించును మరియు అక్కడ రాత్రి ఉండదు. దేవుడు తన పిల్లలుగా పరిశుద్ధులు అక్కడ నిత్యము పరిపాలించునట్లు వారిని అనుమతించెను. పరిశుద్ధ ప్రభువు నుండి పొందిన ఈ కృప ఎంత గొప్పదో ఈ దీవెన మరొకసారి మనకు జ్ఞాపకం చేయుచున్నది.

మన రక్షణ తరువాత మనపై కుమ్మరింపబడిన దీవెనలు ఎంత గొప్పవో పరిశుద్ధులమైన మనము మరొకసారి గుర్తించాలి. మన ప్రభువు తన పరిశుద్ధులపై కుమ్మరించిన ఆయన కృప ఆకాశము కంటే ఎత్తైనది మరియు ఉన్నతమైనది. వారిపైకి వచ్చి ప్రాప్తించునట్లు చేసిన ప్రభువు కృపను పరిశుద్ధులు త్రోసివేయకూడదు. ఆయన మహోన్నతమును బట్టి మహిమ మరియు వారిపై ఆయన కుమ్మరించిన కృపను బట్టి సమృద్ధిలోను, మహత్తులోను నిత్యము జీవింపచేసిన ప్రభువును పరిశుద్ధులు కేవలము నిత్యకృతజ్ఞతలను స్తుతులను చెల్లించవలెను. ఆమెన్‌! హల్లెలూయ! మన దేవుని నేను స్తుతిస్తున్నాను.

వచనం 6: మరియు ఆ దూత ఈలాగు నాతో చెప్పెను. ఈ మాటలు నమ్మకమును సత్యములునైయున్నవి. ప్రవక్త ఆత్మకు దేవుడగు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతలను పంపెను.

“ఈ వాక్కు సత్యమును నమ్మదగినవి” ప్రభువు నిశ్చయముగా ప్రకటన ద్వారా తన పరిశుద్ధులకు చూపించి తన వాగ్ధానమున్నిటిని నెరవేర్చును. ఇందువలననే మన ప్రభువు ముందుగానే దేవుని పరిచారకులతో పరిశుద్ధాత్మ, ద్వారా సమస్తమును బయలుపరచి మాట్లాడెను. ప్రకటన గ్రంధములోనున్న వాక్యములో అతి దీవెనకరమైన మాట ఏది? ప్రకటనలో చాలా దీవెనలున్నాయి. కానీ ప్రభువు తన పరిశుద్ధులు తనతో పాటుగా నూతన భూమ్యాకాశమును ఏలునట్లు అనుమతించును. మరియు వారితో పాటు అధికారముతోనూ, మహిమతోనూ జీవించును అను మాట గొప్ప దీవెన.

దేవుడు ఎంతో నిశ్చయముగా ఈ క్రియలను నెరవేర్చును కనుక పరిశుద్ధులు తమ విశ్వాసము నిరాశలోపడుటకు గానీ లేదా విశ్వాసము నుండి తొలగిపోవుటకు గానీ అనుమతించకూడదు. పరిశుద్ధులు సమస్త శోధనలను, శ్రమలను తమ విశ్వాసము యొక్క నిరీక్షణతో జయించవలెను. మన ప్రభువు తన పరిశుద్ధులకు, సంఘమునకు ఇచ్చిన తన ప్రవచనము మరియు వాగ్ధానములన్నీ నెరవేర్చుటలో తప్పిపోడు. మన ప్రభువు తన పరిచారకులను ఈ భూమిపైకి పంపివారు ప్రవచించునట్లు చేసెను. ఆ విధముగా తన కృపను సంఘముకును పరిశుద్ధులకును బయలుపరచెను.

వచనం 7: ‘‘ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంధములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు.’’

ఈ ప్రకటన గ్రంధము యొక్క ప్రవచన వాక్కు పరిశుద్ధులు హాతసాక్ష్యమును గూర్చి చెప్పుచున్నది. కనుక అంత్యక్రీస్తు పరిశుద్ధులను హింసించు సమయము వచ్చుచున్నది. కాబట్టి వారు తమ విశ్వాసమును మరణము వరకు కాపాడుకోవాలని మనకు బయలుపరచుచున్నది. అది దేవుని చిత్తము. కనుక పరిశుద్ధులు హతసాక్ష్యమును కౌగలించుకొనవలెను. అప్పుడు వారు పునరుత్ధానములోను, ఎత్తబడుటలోనూ పాల్గొని రాబోవు వెయ్యి సంవత్సరాలు క్రీస్తు రాజ్యములో పరిపాలిస్తారు. మరియు నూతన భూమ్యాకాశాలలో నిత్యము జీవిస్తారు. అలాగే మన ప్రభువు వారితో మాటలాడిన దేవుని వాక్కులన్నిటిని పరిశుద్ధులు విశ్వసించి తమ విశ్వాసమును కాపాడుకోవాలి. మన ప్రభువు వాక్యమును విశ్వసించి, విశ్వాసముతో జీవించువారే అంత్యదినములో దీవెననొందినవారు.

ఆయన త్వరగా వచ్చుచున్నానని తన పరిశుద్ధులతో దేవుడు మాట్లాడెను. ఆ ప్రభువు ఇక ఆలస్యము చేయక త్వరగా మన యొద్దకు వచ్చును. నీరు మరియు ఆత్మమూలమైన సువార్త ద్వారా ప్రవహించు దేవుని దీవెనలను, పాపము నుండి పరిశుద్ధులకు తమ రక్షణను తెచ్చు వాక్యమును నెరవేర్చుటకై మన ప్రభువు త్వరగా భూమి మీదకి వచ్చును.

రక్షింపబడిన తరువాత తమకు వాగ్ధానము చేసిన ప్రభువు యొక్క దీవెన వాక్కులకు పరిశుద్ధులు బద్ధులై తమ విశ్వాసమును కాపాడుకోవాలి. ప్రభువు వాక్యముపై తమ విశ్వాసమును ఎప్పుడైనా కోల్పోయినట్లయిన వారు సమస్తమును కోల్పోతారు. అందువలననే తరువాత ప్రభువు వాక్యమునందలి తమ విశ్వాసమును కాపాడుకోవాలి. అనగా తమ ప్రభువు నందు విశ్వాసమును కాపాడుకోవాలని దేవుడు పరిశుద్ధులకు సెలవిచ్చుచున్నాడు.

వచనం 8: యోహానను నేను ఈ సంగతులను వినినవాడును చూచినవాడును. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల యెదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా, దేవుని ప్రవచన వాక్యమును ప్రవక్తలు, పరిశుద్ధులు వ్యాప్తి చేయుదురు. కనుక ఆయన వారితో మాట్లాడినట్టుగానే క్రియ చేయుచున్న దేవుని మనము తప్పక స్తుతించాలి. ఆయనను మనము ఆరాధించాలి. కొన్ని సమయాలలో కొంత మంది దేవుని కంటే తమను హెచ్చించుకొనుచూ దేవునివలెనే పరిగణించబడెదరు. వారు మోసగాళ్ళును అబద్ధప్రవక్తలునైయున్నారు. కనుక అట్లు చేయుదురు. సమస్త స్తుతి, ఆరాధన, మహిమ మరియు పరిచర్యకు దేవుడే యోగ్యుడు.

వచనం 9: అతడు వద్దు సుమి. నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోను, ఈ గ్రంధమందున్న వాక్యమును గైకొను వారితోను సహదాసుడను. దేవునికే నమస్కారము చేయుమని చెప్పెను.

అనుగ్రహించిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్త మర్మమును మొదట తెలుసుకోవాలి. అప్పుడు మనము దేవుని ప్రజలము. ఒకరికొకరము సహోదర, సహోదరీలగుదుము. దీని తరువాతనే దేవుడు తన క్రియలను వారికి అప్పగించును. ప్రభువునకు పరిచారకులైనవారు తప్పక ఆయన వాక్యమును నమ్మి, తమ విశ్వాసముతో దానిని కాపాడుకోవాలి. వీరు సమస్త ఘనతను వారి కొరకు గాక దేవునికే చెల్లించవలసిన వారమైయున్నారు. ఈ లోకములోని ప్రతివాడు అర్పించు ఆరాధనకు మహిమకు దేవుడు అర్హుడైయున్నాడు. హల్లెలూయ.

వచనం 10: మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను. ఈ గ్రంధమందున్న ప్రవచన వాక్యముకు ముద్రవేయవలదు. కాలము సమీపమైయున్నది.

ప్రకటనలో వ్రాయబడిన వాగ్ధాన వాక్యమును దాచకూడదు. అది త్వరగా నెరవేర్చబడును. కనుక ప్రతివానికి దాని సాక్ష్యమియ్యవలెను. ఆమెన్‌! ప్రకటన గ్రంధములోనున్న ప్రవచన వాక్యమును మనమందరమూ నమ్మి దానిని బోధించవలెను.

వచనం 11: అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము. అపవిత్రుడైన వారు ఇంకను అపవిత్రుడుగానే యుండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే యుండనిమ్ము ప్రభువు రాకడ సమీపమైనప్పుడు పాపమును వెదకు వారు దానిని వెదకునట్లున, పరిశుద్ధులుగానున్న వారు పరిశుద్ధులుగానే యుండనిచ్చును. అన్యాయము చేయు వారిని అన్యాయము చేయునట్లు ఆయన కొనసాగనిచ్చును. అంత్యదినము వచ్చినప్పుడు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసముంచుట ద్వారా పాపరహితులైనవారు ఈ భూమిపై ఇంకనూ ఆ సువార్త పరిచర్య చేయుదురు. ప్రభువు వలన పరిశుద్ధత పొందినవారు పరిశుద్ధులుగానే ఉంటారు. విశ్వాసజీవితమును జీవించువారు విశ్వాసములో కొనసాగుతారు. ఇప్పుడు మనకున్న విశ్వాసమును కాపాడుకొనవలెనని మన ప్రభువు సలహానిచ్చుచున్నాడు.

వచనం 12: ‘‘ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియల చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది.’’

మన ప్రభువు త్వరగా వచ్చును. అనగా నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను వ్యాప్తి చేయుటకై పరిచర్య జరిగించి కష్టపడిన వారైన పరిశుద్ధులకు భూమిపై పరలోకమును నూతన భూమ్యాకాశములను వారికిచ్చును. వారి త్యాగమునకైన బహుమానమిదే. ప్రకటనలోని ప్రవచన వాక్యమును పరిశుద్ధులు విశ్వసించినప్పుడు అంత్యకాలము వరకు వారు తమ విశ్వాసమును కాపాడుకొందురు. ఎందుకనగా వారు తమ విశ్వాసమును ప్రభువు మీద నిలిపిరి. పరిశుద్దులు కష్టమును దేవుడు గొప్ప దీవెన అను బహుమానమును ఇచ్చును. మన ప్రభువు మహిమ పూర్ణుడును, కృపాసమృద్ధిగలవాడు.

వచనం 13: ‘‘నేనే అల్ఫాయు ఓమెగయు, మొదటి వాడను కడపటి వాడను. ఆదియు అంతమునై యున్నాను.’’

మన ప్రభువే సమస్తమునకు ఆదియు, అంతమునైయున్నాడు. ఆయన తానే దేవుడైయుండి, రక్షకుడైయున్నాడు. ఆయన మాత్రమే ఇవ్వగల రక్షణ యొక్క సంపూర్తిని జరిగించువాడు, సమస్త విశ్వములోని చరిత్ర అంతయూ, పరలోక భూలోక చరిత్రలు ప్రభువు నుండి ఆరంభమై ఆయన ద్వారానే అంతమగును.

వచనం 14: ‘‘జీవ వృక్షమునకు హక్కుగలవారై, గుమ్మముగుండ ఆ పట్టణములోనికి ప్రవేశించునట్లు తమ వస్త్రమును ఉదుకుకొనువారు ధన్యులు.’’

దేవుడు పలికిన సమస్తమును జీవియైయుండగా, పరిశుద్ధులు ఆయన వాక్యమును విశ్వసించి, బోధించి దానిని కాపాడు కొందురు. ఎందుకనగా ప్రభువు తన పరిశుద్ధులతో మాట్లాడిన ఆయన వాక్కులను, విశ్వములోని సమస్తమును వాస్తవములైయున్నవి. ఇందువలన దేవుని పరిచారకులు ఆయన పరిశుద్ధులు ప్రభువు వాక్యమును తమ మనస్సులో ఉంచుకొందురు. కనుక నూతన భూమ్యాకాశములో నాటబడిన జీవవృక్ష ఫలమును తినుటకు హక్కును పొందెదరు.

ప్రభువు అనుగ్రహించిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించుట ద్వారా పరిశుద్ధులైన వారు తమ విశ్వాసమును కాపాడుకొందురు. ఎందుకనగా పరలోకములోనున్న జీవ వృక్షఫలమును తినుటకు హక్కుదారులగుదురు.

వచనం 15 : కుక్కలును, మాంత్రికులును, వ్యభిచారులును, నరహంతకులును, విగ్రహారాధకులును, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపట నుందురు. 

పైన చెప్పబడిన భాగములోనున్నవారు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించనివారు. కనుక అంత్యకాలము వరకూ వారు తిరిగి జన్మించినవారు కారు. అంత్యక్రీస్తు అతని అనుచరులు అతని సూచనులు మరియు అద్భుతాలు ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించుచూ అంత్యక్రీస్తే దేవుడని ఆయా సమయాలల్లో చూపించుచూ వారిని మోసగించును. అంత్యక్రీస్తు రూపమును వారు ఆరాధించునట్లు చేయుచూ ప్రజలను స్వంత నాశనమునకు నడిపిరి. అట్టి ప్రజలను మన ప్రభువు పరిశుద్ధ పట్టణ ద్వారముకు బయట నిలువబెట్టును. కావున వారు ఎన్నటికి నూతన ఆకాశము భూమిలో ప్రవేశింపలేరు. నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించి తమ విశ్వాసమును కాపాడుకొన్న పరిశుద్ధులకు మాత్రమే ప్రభుని పట్టణపు ద్వారము తెరవబడును.

వచనం 16: ‘‘సంఘము కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను, నా దూతను పంపియున్నాను.’’

నేను దావీదు వేరు చిగురును సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కయునైయున్నాను. పరిశుద్ధుల కొరకు, దేవుని సంఘము కొరకు మన కొరకు మన ప్రభువు దేవుని పరిచారకులను పంపెను. జరగబోవు సంగతులన్నిటిని వారు సాక్ష్యమిచ్చునట్లు చేయును. యేసుక్రీస్తే వారిచేత సాక్ష్యమిప్పించెను. దేవుడు తానే పరిశుద్ధులకు రక్షకుడాయెను.

వచనం 17: ఆత్మయుపెండ్లి కుమార్తెయు అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పిగొనిన వారిని రానిమ్ము. ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.

దేవుని నీతిని గూర్చి ఆకలి, దప్పిక ఈ భూమిపై కలవారిని మన ప్రభువు జీవజలము వాక్యమునొద్దకు ఆహ్వానించుచున్నాడు. దేవునినీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు, ప్రభునొద్దకు వచ్చి ఆయన అనుగ్రహించిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్ముట మరియు దాని వలన జీవజలమును త్రాగుటకు అను దీవెనను పొందెదరు. ఇందుమూలమున మన ప్రభువు ప్రతివారిని యేసుక్రీస్తు నొద్దకు రమ్మని పిలుచుచున్నాడు. ఎవరైననూ నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించనట్లయిన తన ప్రభువు జీవ జలమును త్రాగనిచ్చును.

వచనం 18 : ఈ గ్రంధమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చునది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపినయెడల ఈ గ్రంధములో వ్రాయబడిన తెగుళ్లు దేవుడు వానికి కలుగజేయును.

దేవుని వాక్యమే లేఖనము. అలాగే మనము ఈ వాక్యమును నమ్మినప్పుడు దేనినైననూ తీసివేయలేము లేదా కలుపలేము. దేవుని వాక్యమే లేఖనవాక్యమైయున్నందున ఎవరును వ్రాయబడిన సత్యవాక్యముతో ఏమియూ కలుపలేరు లేదా తీసివేయను లేరు లేదా వ్రాయబడిన సత్యమును వదలి దేనిని నమ్మలేరు. ఈ వాక్య భాగము మనకు తెలియచేయుచున్నది. కనుక మనం జాగ్రత్తగా ఉండవలెను. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రాముఖ్యమైనది దానిని ఎవరూ ప్రాముఖ్యము లేనివిగా విడువలేరు.

అయిననూ ప్రభువు అనుగ్రహించిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నిర్లక్ష్యపెట్టుట కొనసాగించుచున్నారు. ఇందువలననే వారు ఇంకనూ పాపము నుండి విడుదల లేని వారైయున్నారు. ఎందుకు వారింకనూ పాపులుగానున్నారు. ఎందుకు తమ స్వంత నాశనములో పడుచున్నారు. యేసుక్రీస్తు తమ స్వంత రక్షకుడని చెప్పుచున్ననూ, పాపులను పాపము నుండి విడిపించుటకు మన ప్రభువు వారికి తన నీతిని రక్తమును (1యోహాను 5:4-5, యోహాను 3:3-7) ఇచ్చెను. అయిననూ అనేకులు కేవలము క్రీస్తు సిులువలో కార్చిన రక్తమునకే విలువ నిచ్చుచున్నారు. అలాగే వారు తమ పాపము నుండి విడిపింపబడలేదు. కనుక ప్రకటనలో వ్రాయబడిన తెగుళ్ళన్నిటిని ఎదుర్కొందురు.

యేసును నమ్ముకొన్నామని చెప్పుకొనుచు యోహాను ద్వారా ఆయన బాప్తిస్మముపొంది లోక పాపములన్నిటి విషయము శ్రమ నొందెనను సత్యమును నిర్లక్ష్య పెట్టుచునే ఉన్నవారు మరి భయంకరమైన నరకశిక్షను పొందెదరు. ఎందుకు? ప్రభువు ఇచ్చిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను వారు నమ్మలేదు కనుక వారు తిరిగి జన్మించినవారు కాదు. ప్రభువు ఇచ్చిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నిర్లక్ష్యపెట్టువారు నిత్యము మండుచుండు నరకములోపడి నిత్యశిక్షను ఎదుర్కొంటారు. అట్టి ప్రజలందరికి పశ్చాత్తాపపడు దినము వచ్చును.

వచనం 19: ఎవడైనను ఈ ప్రవచన గ్రంధమందున్న వాక్యములో ఏదైనను తీసివేసిన యెడల దేవుడు ఈ గ్రంధములో వ్రాయబడిన జీవవృక్షమును పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండ చేయును.

ఎవని క్రైస్తవ విశ్వాసమైననూ యోహాను నుండి బాప్తిస్మము పొందుట ద్వారా మానవజాతి పాపమును యేసు తనపై మోపుకొని సిలువ వేయబడుట చేత వాటన్నిటిని ఒకసారిగానే కడిగెనను వాక్యము యొక్క సత్యమును వదలివేయు వారు మనలో ఉన్నారా. అంటే అట్టి ప్రజలందరూ నిశ్చయముగా దేవుని పరిశుద్ధ పట్టణములో ప్రవేశించు హక్కును కోల్పోతారు. ఎందుకనగా ఒకేసారిగా మనుష్యజాతి పాపమును తనపై మోపుకొనుటకై యేసు యోహానునొద్ద బాప్తిస్మము పొందెనని వారు నమ్మలేదు. తద్వారా వారు ప్రభువు అనుగ్రహించిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నిర్లక్ష్యపెట్టి పాపులైరి.

ఆలాగునే యేసుక్రీస్తు యోహాను నొద్ద పొందిన బాప్తిస్మము వలన మానవాళి పాపములన్నియూ ఆయనపైన మోపబడెనను సత్యమును క్రైస్తవులు తమ హృదయాలలో విశ్వసించాలి. అట్లు వారు చేయని యెడల ప్రభువు అనుగ్రహించిన పరిశుద్ధ పట్టణములో ప్రవేశించుట అను మహిమ నుండి విడువబడెదరు. యేసు నీ రక్షకుడని నీవు నమ్మితే హృదయపూర్వకంగా యేసు ఈ భూలోకమునకు వచ్చి లోకపాపము నుండి మానవులను పరిపూర్ణముగా రక్షించుటకు యొర్ధాను నదిలో ఆయన యోహాను ద్వారా బాప్తిస్మము పొందెనని అట్టి విధముగా వాటిని తనపై మోపుకొని పాపాలన్నిటిని కడిగివేసెనని నీ పూర్ణహృదయంతో నమ్మి నీ పాపాలన్నిటి నుండి నీవు కడుగబడవలెను. నీ అపవిత్రతంటినీ నీవు కడుగుకొనవలసిన నీటి ఊట మన ప్రభువు పొందిన బాప్తిస్మమే. లోకము యొక్క మన పాపాలన్నిటిని తనపై మోపుకొనుట వలన ప్రభువు తన రక్తమును కార్చెను. తన మరణము ద్వారా మన పాపము జీతమును చెల్లించుటకు ఆయన తన రక్తమును కార్చి మరణించెను.

యేసు యోహాను నుండి పొందిన బాప్తిస్మము పాపము నుండి కలుగు రక్షణకు స్థిరమైన సాక్ష్యము. 1 పేతురు 3:21 ‘‘దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును శోధించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యమును తీసివేయుట కాదు గానీ యేసుక్రీస్తు పునరుత్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనసాక్షినిచ్చు ప్రత్యుత్తరమే” అని చెప్పుచున్నది. యేసు మన పాపములను సిులువ వరకు మోసి తన మరణము ద్వారా మనుష్యులందరి పాపముల కొరకైన జీతమును చెల్లించుటకై ఆయన తన రక్తమును సిలువపై కార్చెను. ఇవన్నీ మనకు బదులుగానే.

ఇందువలననే వచనం 19లో మానవాళికందరికి తన హెచ్చరిక వాక్యమును మరలా ఇచ్చెను. నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను మనము ఉన్నది ఉన్నట్టుగానే నమ్మాలి. దానికి ఏదీ కలుపకూడదు లేదా తీసివేయకూడదు.

వచనం 20: ఈ సంగతులనుగూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పచున్నాడు. ఆమెన్‌.

ప్రభువైన యేసూ, రమ్ము మన ప్రభువు త్వరగా ఈ లోకమునకు తిరిగి వచ్చును. ప్రభువు నందు విశ్వాసముంచి తమ పాపముకు పరిహారమునొందిన వారైన పరిశుద్ధులు పరలోక మహిమను ధరించుకొంటారు. అట్టివారు నమ్మకముగా ప్రభువు రెండవ రాకడ కొరకు ఎదురు చూచుచున్నారు. నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్మినవారు. ఇప్పుడైననూ రాబోవు ప్రభువును ఎదుర్కొనుటకు సిద్ధముగా నుండగా, వారు ప్రభువు రాకడ కొరకును పరిశుద్ధులకిచ్చిన వాగ్ధానమైన దీవెనను ధరించుకొనుటకు ఎదురుచూచుచున్నారు. అలాగే పరిశుద్ధులు విశ్వాసముతోను, కృతజ్ఞతతోనూ ప్రభుని రెండవ రాకడ కొరకు ఆతృతగా ఎదరు చూచుచున్నారు.

వచనం 21: ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై యుండును గాక. ఆమేన్‌.

ప్రవేశించ కోరిక గల వారితో కూడా మన ప్రభువైన యేసు కృపతోడై యుండునను ఆశీర్వాద ప్రార్థనతో ప్రకటన గ్రంధమును ముగించెను. మనము కూడా విశ్వాసముతో యేసుక్రీస్తు అనుగ్రహించిన పరిశుద్ధ పట్టణములో ప్రవేశించగల పరిశుద్ధముగా తప్పక మారాలి.