Sermons

[అధ్యాయము 22-2] <ప్రకటన 22:1-21> మహిమ యొక్క నమ్మకములో సంతోషముగాను మరియు బలముగాను ఉం డుము<ప్రకటన 22:1-21>


ప్రకటన 22:6-21 వచనము యందు పరలోకమును గూర్చిన నిరీక్షణను చూపుచున్నది. అధ్యాయం 22 ప్రకటన గ్రంధము యొక్క ముగింపు అధ్యాయమై నూతన యెరూషలేమునకు దేవుడిచ్చిన ఆహ్వానము మరియు లేఖనము ప్రవచనమున విశ్వాస నిజత్వమును గూర్చి తెలియజేయును. ఈ అధ్యాయము నూతన యెరూషలేము, నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించుట ద్వారా తిరిగి జన్మించినవారైన పరిశుద్ధులకు దేవుడిచ్చు బహుమానమని తెలుపుచున్నది.

తిరిగి జన్మించిన పరిశుద్ధులు దేవుని నివాసములో ఆయనను స్తుతించునట్లుగా దేవుడు చేసెను. దీనిని దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించుట ద్వారా ప్రభువు ఎదుట మన పాపములన్నిటిని క్షమాపణ పొంది మనలను పరిశుద్ధులనుగా తీర్చినందుకు మనము ఎంత కృతజ్ఞులమో తెలుపుటకు మాటలు చాలవు. మనము పొందిన ఆ గొప్ప ఆశీర్వాదము ఈ భూమిపై ఎవరు పొందగలరు? ఎవరునూ లే రు.

ఈ దినము ప్రధాన అంశం ప్రకటన చివరి అధ్యాయము ఆదికాండమందు మానవాళి నమూనాలను దేవుడు తయారు చేయుట చూచెదము. మరియు ప్రకటన గ్రంధమందు ఆయన ప్రణాళికలన్నింటిని నెరవేర్చును. దేవుని ప్రణాళిక చొప్పున మానవాళి కొరకు దేవుని క్రియలను సంపూర్తి చేయు క్రమంలో ఈ లోకమును నాశనము చేయు విధానమును ప్రకటన గ్రంధమందు వర్ణించబడెను. ప్రకటన వాక్యము ద్వారా దేవుడు చూపిన విధముగా పరలోకరాజ్యమును ముందుగానే చూడగలము.దేవుని పట్టణము ఆకాశము మరియు దాని వనము


21వ అధ్యాయం దేవుని పట్టణము గూర్చి తెలుపుచున్నది. ‘‘మరియు అతడు ప్రకారమును కొలువగా అది మనుష్యుని కొలత చొప్పున నూట నలుబది నాలుగు మూరలైనది. ఆ కొలత దూత కొలతయే. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతులతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమగు స్పటికముతో సమానమైన శుద్ధవర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడియుండెను. మొదటి పునాది సూర్యకాంతపురాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ, అయిదవది వైడూర్యము, ఆరువది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్పరాగము, పదవది సువర్ణ శునీయము, పదకొండవది పద్మరాగము, పండ్రెండవది సుగంధము. దాని పండ్రెండు గుమ్మములు పండ్రెండు ముత్యములు. ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడియున్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలియున్నది.’’

ఈ ప్రకటన వాక్యము దేవుడు తిరిగి జన్మించిన వారైన తన ప్రజలకు ఇవ్వబోవు నూతన యెరూషలేమును వర్ణించుచున్నది. చెప్పబడిన రీతిగా పరలోకమందున్న యెరూషలేము పట్టణము పండ్రెండు రకములైన రాళ్ళతో నిర్మించబడి ముత్యములతో కట్టబడి పండ్రెండు గుమ్మములు కలిగియున్నది.

22వ అధ్యాయము యెరూషలేము పట్టణములో కనబడిన వనమును గూర్చి మాట్లాడెను. 1వ వచనం ‘‘మరియు స్ఫటికమువలె మెరయునట్టి జీవజలము నది దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు సింహాసనము నొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను అని చెప్పుచున్నది.’’ దేవుని పట్టణమందు స్ఫటికమువలెనున్న ఒక నది దాని గుండా ప్రవహించుచున్నది. ఆది యందు ఏదేను వనములో ప్రవహించునట్లు దేవుడు చేసిన నాలుగు నదులను పోలియున్నది. దేవుడు ఈ వచనమునందు రాబోవు కాలమందు పరిశుద్ధులు ఆనందించును అని చెప్పుచున్నాడు.

ప్రధాన భాగము జీవవృక్షము కూడా ఈ వచనములో ఉన్నదని తెలుపుచున్నది. పండ్రెండు రకముల ఫలమును ఫలించును. అది నెలనెలకు ఫలించును. దాని ఆకులు దేశము జనములను స్వస్థపరచుటకు వినియోగించును. దాని స్వభావము దృశ్యము ఫలము ఫలించుచుండుటయే కాక, దాని ఆకులు, స్వస్థత శక్తి కలిగియున్నది.పరిశుద్ధత చేత ఆశీర్వాదము పొందుదురు !


పరిశుద్ధ గ్రంధము బైబిల్‌ దేవుని పట్టణమును గూర్చి ఈ విధంగా తెలుపుచున్నది. ‘‘అక్కడ శాపములు ఉండవు కానీ దేవుని సింహాసనము గొఱ్ఱె పిల్ల అందుండును. మరియు ఆయన పరిచారకులు ఆయనకు సేవ చేయుదురు. వారు ఆయన ముఖము చూతురు. ఆయన వ్రేలు వారి నుదిటిపై వ్రాయబడును.’’ మరియు అది తెలుపుచున్నది మన పాపమును క్షమించిన వాడు రక్షించిన దేవునితో యుగయుగములు రాజ్యమేలుదురు.

ఈ భూమిపై నుండగా నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్మి తమ పాపము తుడిచివేయబడినవారు తమ పాపము మాయమగుటను దీవెనను పొందుట మాత్రమే గాక దేవుని స్వంత పిల్లలైరి. వారు దేవుని రాజ్యములో ప్రవేశించినప్పుడు తమకు పరిచర్య చేయుటకై అనేకమైన దేవదూతలను కలిగి ప్రభువుతో పాటుగా నిత్యము పరిపాలన చేయుదురు. ఈ భాగములో నీతిమంతులు జీవజల నది ఒడ్డున నిలబడి జీవ వృక్ష ఫలమును తింటూ ఉండు నిత్యకృపను దేవుని నుండి పొంది ఈ దీవెనలో భాగముగా ఏ వ్యాధి లేక యుందురు అని చెప్పబడెను.

ఈ భూలోక కాంతిగానీ సూర్యకాంతిగానీ అవసరం లేక దేవుని మహిమ రాజ్యములో సదాకాలము తానే వెలుగైన దేవునితో నివసిస్తారు. నీరు మరియు ఆత్మమూలమైన సువార్త ద్వారా తమ పాప పరిహారము పొందినవారైన దేవుని పిల్లలు అనగా దేవుని వలే జీవిస్తారు. ఇదే నీతిమంతులు పొందబోయే కృప.

ప్రకటన గ్రంధమును వ్రాసిన అపోస్తులుడైన యోహాను యేసు పన్నెండు మంది శిష్యులలో ఒకడై యోహాను సువార్తను నూతన నిబంధనలోని మూడు పత్రికలను కూడా రచించెను. మొదటి, రెండవ, మూడవ యోహాను రాసిన పత్రికలు రోమా చక్రవర్తిని దేవునిగా గుర్తించుటకు ఒప్పుకొననందున పత్మాసు దీవికి వెలివేయబడెను. ఈ వెలికాలంలో దేవుడు యోహాను నొద్దకు తన దూతలను పంపి ఈ భూమిపై జరుగబోవు దానిని అతనికి చూపించెను. లోక నాశనమును దాని వలన పరిశుద్ధులు నివసించుటకు ప్రవేశించి నివసింపబోవు స్థలమును అతనికి చూపించెను.

ఆదికాండమును సృష్టికి ఒక నమూనాగా వర్ణించినచో ప్రకటన గ్రంధమును ఆ నమూనాలకు సంపూర్ణ ఆకారమని మనము వర్ణించగలము. 4వేల సంవత్సరములుగా మన ప్రభువే తానే లోక పాపములన్నిటిని యేసుక్రీస్తు ద్వారా తొలగిస్తానని మానవాళికి సెలవిచ్చెను. నూతన గ్రంధ కాలములో సమయము రాగా దేవుడు తన వాగ్ధానమును నెరవేర్చును. యేసుక్రీస్తు అను రక్షకుని లోకమునకు పంపెను. ఆయన యోహాను ద్వారా యేసుకు బాప్తిస్మమిప్పించెను. ఆయన సిలువలో క్రీస్తు కార్చిన రక్తము ద్వారా లోక పాపములను తొలగించెను.

మానవాళి సాతాను మోసములో పడినప్పుడు ఆ పాపము వలన నాశనములోనికి పట్టబడినప్పుడు మన ప్రభువు దానిని పాపము నుండి విడిపిస్తానని వాగ్ధానం చేసెను. అప్పుడాయన యేసుక్రీస్తును పంపి ఆయన బాప్తిస్మమొంది రక్తము కార్చునట్లు చేసి దాని ద్వారా మానవజాతికి దాని పాపమునుండి సంపూర్ణముగా రక్షించెను.

ప్రకటన వాక్యముద్వారా తమ పాప పరిహారము పొందిన వారి కొరకు ఎదురుచూచుచున్న మహిమ ఎట్టిదో దేవుడు స్పష్టముగా గ్రంధస్తము చేసెను. అలాగే పాపులకు ఎదురగు తీర్పును కూడా వ్రాయించెను. అనగా ఆయనను నమ్మినామని విశ్వాసంగా చెప్పువారిలో అనేకులు కూడా నరకములో పడతారని (మత్తయి 7:21-23) దేవుడు తెలియచేసెను.

మన ప్రభువు పాపులను వారి పాపము నుండి విమోచించెను. మరియు నీతిమంతుల కొరకై ఆయన సిద్ధపరచిన మేలు వాక్యముకు ముద్రవేయవద్దని కూడా మనకు చెప్పెను.ఎవరు అన్యాయస్థులు మరియు అపవిత్రులు?


వచనం 11 చెప్పునదేమనగా ‘‘అన్యాయము చేయువాడు ఇకను అన్యాయమే చేయనిమ్ము. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే యుండనిమ్ము. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే యుండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే యుండనిమ్ము.’’ అన్యాయస్థులు ఎవరు? ప్రభువు అనుగ్రహించిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్త యొక్క ప్రేమను నమ్మినవారే అన్యాయస్థులు. ప్రజలు ఎల్లప్పుడు పాపము చేయుచుండగా దేవుడు వారికిచ్చిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను వారు తప్పక నమ్మాలి. అప్పటి నుండి తమ జీవితములో దేవుని మహిమ పరచాలి. ఎందుకనగా మనుష్యుల నుండి మహిమను పొందవలసిన వాడు దేవుడే కనుక ఆయనే మనలను తన రక్షణ వస్త్రముతో కప్పెను కనుక మనము జీవించు జీవితమంతా దేవునికి మహిమకరముగా ఉండాలి. దేవునికి అవిధేయులైనవారు అపవిత్రులు, ఎందుకనగా వారు ఆయన వాక్యమును ఎల్లప్పుడూ విశ్వసించలేదు.

మత్తయి 7:23లో మతకర్తలు ఆయనను కేవలము పెదవులతోనే నమ్ముతున్నారని ప్రభువు సెలవిచ్చెను. ‘‘నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును” మన ప్రభువు వారిని అక్రమము చేయువారని పిలిచెను. ఈ ప్రజలు కేవలము తమ క్రియల ద్వారా మాత్రమే యేసును విశ్వసించిరి. గాని నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను పూర్ణహృదయముతో విశ్వసించలేదు. అక్రమంగా నుండుట పాపము. ఒకడు తన హృదయముతో దేవుని వాక్యము నమ్మకపోవుట పాపము. కాబట్టి దేవుని యెదుట ప్రజలు అక్రమము చేసినప్పుడు దేవుడు వారికిచ్చిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్త యొక్క రక్షణను మరియు ప్రేమను వారు నమ్మలేదని దాని అర్థము. ఒకడు తన స్వంత ఆలోచన ప్రకారము దేవుని యొక్క వాక్యమును మార్చి తాను అనుకొన్నదాని ప్రకారము ఏదో ఉహాజనితముగానున్న దానిని నమ్ముకొనుటయే అక్రమము.

నిజముగా యేసుని నమ్మినవారు తప్పక దేవుడు స్థిరపరచిన దానిని ఉన్నదానిని ఉన్నట్లుగానే అంగీకరించవలెను. మనము యేసును నమ్ముతున్నాం. కానీ ఏ విధముగానూ దేవుని ప్రణాళికను ఆయన రక్షణను మార్చలేదు. ప్రధాన అంశము మనకిచ్చు సందేశమేమనగా ఆయన శాశ్వత రక్షణయందు ఉన్నది ఉన్నట్లుగానే నమ్మువారికి దేవుడు నిత్యజీవమునిచ్చును కానీ దేవుని నీతిని మార్చి తమ ఇష్టానుసారముగా నమ్మికయుంచువారిని నరకమునకు పంపును.

“అన్యాయము చేయువాడు అన్యాయము చేయనిమ్ము” అనగా అట్టి ప్రజలు తమ కాఠిన్యమును బట్టి దేవుడు నియమించిన రక్షణను నమ్మలేదు. వారే అన్యాయస్థులు. ఇందువలననే పాపులు ఎల్లప్పుడు అన్యాయంగానే ఉంటారు.

ఆ భాగము ఇలాగు కొనసాగును. ‘‘అపవిత్రుడైన వానిని అపవిత్రుడుగానే యుండనిమ్ము” అనగా వారు పాపులైనను నీరు మరియు ఆత్మమూలమున యేసు వారి పాపములను తొలగించినది సత్యమైనప్పటికి విశ్వాసముతో ఎలాగైనను తమ పాపమును కడుగుకొను ఉద్దేశ్యముతో లేనివారైయున్నారు. అలాగే ఇట్టి అవిశ్వాసులను దేవుడు అలాగునే వదిలివేయును తరువాత వారికి తీర్పుతీర్చును. ప్రజలకు మనస్సాక్షినిచ్చుట ద్వారా దేవుడు అట్టివారికి తమ హృదయములోనున్న పాపము గుర్తించగలుగుటకు సామర్థ్యమిచ్చెను. అయినప్పటికి తమ హృదయ పాపమును తొలగించుకోవాలని ఉద్దేశ్యమైనను నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను తెలిసికొనుటకైనను ఆసక్తిలేనివారై యున్నారు. దేవుడు వారిని అలాగే వదిలివేయుదునని ఆయన మనకు చెప్పుచున్నాడు.

సామెతలు 30:12 ఇట్లు చెప్పుచున్నది. ‘‘తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడని వారి తరము కలదు” ఈ రోజులలో క్రైస్తవ మతములోనున్న ప్రజలు తమ పాపము నుండి కడగబడవలెనని కోరుకోరు. అయినను యేసు తానే దేవుడైయుండి పాపులను రక్షించుటకే ఈ భూమిపైకి వచ్చెను. ఒక్కసారి బాప్తిస్మము పొంది మానవ పాపమును తనపై మోపుకొని సిలువ వేయబడుట ద్వారా ఒకేసారి ఈ పాపముకై తీర్పుపొంది తద్వారా నమ్మిన వారిని వాస్తవంగా పాపము నుండి రక్షించును.

నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను తెలిసికొని నమ్మిన వారిని యేసు వారి పాపము నుండి రక్షించెను. మన ప్రభువు అతడు/ఆమె ఏ రకపు పాపము చేసిన వారైననూ అతని/ఆమె పాపమును క్షమించుటకు అనుమతించును. అయిననూ విశ్వాసము ద్వారా ఇట్టి పాపవిమోచనను పొందని ప్రజలు ఇంకనూ ఉన్నారు. ఇట్టివారు తమ పాపము కడుగబడుటకైననూ ప్రయత్నము చేయకుండుటకు తమను కఠిన పరచుకొంటారు.

దేవుడు వారిని అలాగే ఉండనిమ్మనుచున్నాడు. ఇది దేవుని నీతిని నెరవేర్చుట. ఇది దేవుడు న్యాయవంతుడని చూపుటకు ఇట్టి ప్రజలు అగ్ని గంధకములోనికి త్రోయబడి నిత్యము కాలుచూ ఉంటారు. అప్పుడు వారు దేవుడు న్యాయవంతుడని తెలిసికొంటారు. వారు యేసును తమ రక్షకుడని ఒప్పుకొనిననూ వారు తమ మనస్సాక్షిని మోసం చేసికొనకుండా తమను మోసగించుకొంటారు. కానీ వారు మిగిలిన వారి మనస్సాక్షిని మోసం చేస్తారు. వారు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను తిరస్కరించారు. కనుక దేవుడు వారు చేసిన దానిని బట్టి వారికి మూల్యం చెల్లిస్తారు.ప్రతి వాని క్రియలను బట్టి వానికి జీతమిచ్చును


ఈ భూమిపై రెండు రకముల ప్రజలున్నారు. వారు దేవుని తెలిసికొన్నవారు తెలిసికొననివారు. మన ప్రభువు ఆమె/అతని క్రియలను బట్టి జీతమిచ్చును.

ఎవరునూ అతని/ఆమెను బట్టి తామే తీర్పుతీర్చబడరు. కానీ యేసునొద్ద నుండి తీర్పువచ్చును. ఒకేసారి తన బాప్తిస్మము ద్వారా ఆయన మానవ పాపములను తనపై మోపుకొనెను. లోక పాపమును సిలువపైకి మోసికొనిపోయి ఆ సిలువపై మానవజాతి తాము ఎదుర్కొనవలసిన న్యాయతీర్పును ఆయన పొందెను. ఈ సత్యమును నమ్ముట ద్వారా మానవులు నీతిమంతులు కాగలరు.

ఈ సత్యమును నమ్మినవారే ప్రభువును తెలిసికొన్నవారు పాపరహితులైన వారిని ఈ సత్యమును తెలిసికొని నమ్మినవారిని వారు జీవించుచున్నంత కాలము ఈ సువార్తను బోధించి తన పరిశుద్ధ వాక్యమును కాపాడవలెనని దేవుడు అడుగుచున్నాడు. ‘‘పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడు గానే యుండనిమ్మని” దేవుడు చెప్పుచున్నాడు. ఈ ఆజ్ఞలను మనం మన హృదయంలో ఉంచుకొని మన పరిశుద్దుల విశ్వాసమును కాపాడుకొని సంపూర్ణ సువార్తను మనము బోధించాలి. ఎందుకు? ఈ లోకంలో ఎంతో మంది ప్రజలు ఈ సత్యసువార్తను తెలియనివారు కనుక పర్యావసానంగా తప్పుడు విశ్వాసముతో ఉన్నారు.

ఈ భూమిపై అనేకులు అసత్య రక్షణ యొక్క సువార్తను ఏమరుపాటుగానే ఆదరించుచున్నారు. ఇప్పటికే మన ప్రభువు మనుష్యుల పాపమును పోగొట్టిననూ ఈ ప్రజలు తమ పాపక్షమాపణ కొరకు ప్రతిదినం ప్రార్థిస్తారు. ఇప్పటికే తమ పశ్చాత్తాప ప్రార్థనలను రోజువారీ చేయుచు తమ పాపమును కడుగుకొనుటకు ప్రయత్నిస్తారు.శాశ్వతంగా పరిశుద్ధ పరచబడుటకు ఇక ఎన్నడూ పాపము చేయకుండుటకు ప్రయత్నిస్తారు. శాశ్వతంగా పరిశుద్ధ పరచబడుటకు ఇక ఎన్నడూ పాపము చేయక శాశ్వతంగా నీతిమంతులై ఆ విధంగా యేసుతో జతపనివారగుదురు. కానీ దేవుని కుమారుడైన యేసు క్రీస్తు రాజును ప్రధాన యాజకుడునై దేవుని కుమారుడైన యేసుక్రీస్తు రాజును, ప్రవక్తయు, ప్రధాన యాజకుడునై యున్నాడు.

దేవుని యొక్క నిజసేవకులు ప్రతివారు నిజముగా తమపాపము క్షమింపబడునట్లుగా తమ పనిని చేయుటయే గాక దేవుని జతపనివారుగా ప్రతివారిని ఈ సత్యమునకు నడిపించెదరు. రాబోవు విషయమును గూర్చిన సరియైన జ్ఞానమును వ్రాయబడిన వాక్యము ద్వారా తెలిసికొన్నవారే దేవుని సేవకులైయున్నారు.

వచనం 12-13 : ‘‘ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియల చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది. నేను అల్ఫాయు ఓమేగయు. మొదటివాడును కడపటివాడును ఆదియు అంతమునైయున్నాను.’’ మన ప్రభువు నిజముగా అల్ఫాయు ఓమెగయు మొదటివాడును కడపటి వాడును ఆదియును అంతమునైయున్నాడు. మనము దేవుడు మాట్లాడిన ప్రతి విషయమును భయముతో గైకొనవలెను.

మన ప్రభువు తమక్రియలకు తగిన దానికన్నా అధికమైన దీవెనలతో పరిశుద్ధులను నింపును. ఎందుకనగా ఆయన కృపగలవాడును, మహిమోన్నతుడునైయున్నాడు. ఆయన కృపగలవాడును దయగల వాడునైయుండి మన పాపము నుండి మనలను రక్షించును. మరియు ప్రకటన వాక్యము మనకు చెప్పుచున్నట్లు ఆయన శక్తిమంతుడును న్యాయవంతుడునై యుండి ఆయన రక్షణ క్రియను పూర్తి చేసెను. ఈ రక్షణ క్రియ త్వరగా జరిగి అది పరిశుద్ధులను నూతన యెరూషలేమునకు ప్రవేశించునట్లు చేసి అదే వారి క్రియలకై మన ప్రభువు వారికి బహుమానమిచ్చును.ఆయన ఆజ్ఞలను గైకొనువారే దీవెనొందినవారు


14వ వచనంతో కొనసాగినట్లయిన ‘‘ఆయన ఆజ్ఞలనుగైకొనువారు ధన్యులు? జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మములగుండా ఆ పట్టణములోనికి ప్రవేశించునట్లు తమ వస్త్రమును ఉదుకుకొనువారు ధన్యులు”. అని ప్రధాన భాగము మనకు చెప్పుచున్నది. ఈ వచనంను తీసికొని చాలామంది రక్షణ క్రియల ద్వారానే వచ్చును ఆయన ఆజ్ఞను గమనించుట ద్వారా అని చెప్తారు.

కానీ నిజానికి, ‘‘ఆయన ఆజ్ఞను జరిగించుట” అనగా విశ్వాసముతో దేవుని వాక్యము వ్రాయబడినది అలాగే విశ్వసించి దానిని గైకొనుట అపోస్తులుడైన యోహాను ఇట్లు వ్రాయుచున్నాడు. ‘‘ఆయన ఆజ్ఞ ఏదనగా ` ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని, ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకనినొకడు ప్రేమింపవలెననదియే” (1యోహాను 3:23) కనుక నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను మనము ప్రకటించుటకు మనము అంకితమైతే మనము ఆయన సముఖములో ఆయన ఆజ్ఞలను గైకొనాలి.

జీవిత కాలంలో మనము చేయు పాపములన్నిటిని బాప్తిస్మమిచ్చు యోహాను నొద్ద బాప్తిస్మం తీసికొనుట ద్వారా యేసు వాటిని తుడిచివేసెను. ఆయన బాప్తిస్మము తరువాత మన ప్రభువు సిలువలో రక్తం కార్చి ఆయన పునరుత్ధానము మరియు తను కొనిపోబడుట ద్వారా మనము తిరిగి జన్మించునట్లు చేసెను మరియు ఆయన సత్యములో జీవించుటకు మనలను అనుమతించెను.

మనము తిరిగి జన్మించిన వారమైన తరువాత మరలా మనము పాపములోపడిన యెడల మన పాపములన్నిటిని కడిగిన సత్యవాక్యమునకు మనము తప్పక తిరుగవలెను. మన ప్రభువు యొర్ధాను నదిలో తీసుకొన్న బాప్తిస్మసత్యమునకు తిరుగవలెను. ఆ బాప్తిస్మము మన బలహీనతను తొట్రుపాట్లను మరియు పాపమును తొలగించును మనము యేసు యొక్క బాప్తిస్మముతో కూడా బాప్తిస్మము పొంది సిలువలో మృతినొందిన క్రీస్తుతో కూడా పాతిపెట్టబడవలెను. ఆలాగు మనము చేసినప్పుడు తిరిగి జన్మించిన తరువాత మనము చేసిన పాపము నుండి విడిపించబడతాం శుద్ధులుగా కడుగబడతాము. నిత్యరక్షణ యొక్క పరిహారమును మనము అంటుకట్టబడుట ద్వారా దేవుని నీతికి మనము కట్టుబడి ఆయన యొక్క శాశ్వతమైన మరియు పరిపూర్ణమైన రక్షణను బట్టి ఆయనకు కృతజ్ఞులము.

యేసుక్రీస్తు ఈ లోక పాపములను ఇప్పటికే కడిగివేసెను. సమస్య మన మనస్సాక్షిని బట్టియే. ఆయన బాప్తిస్మముతో మన పాపమునుగూర్చి పరిహారమును మన ప్రభువు చేసినప్పటికి తన బాప్తిస్మము సిలువ మరణము ద్వారా మన పాపములను కడిగెనని మనం గుర్తించలేము. కనుక మన మనస్సాక్షి పాపిగా ఉండి మనలను ఇబ్బందిపెట్టును. కాబట్టి మనలో ఇంకను పాపమున్నదని మనము తొలగించి యేసుక్రీస్తు అనుగ్రహించిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్త ద్వారా మన పాపములన్నిటిని కడిగెనను వాస్తవమును మనము నమ్మగలము.

మన పాపము వలన మన హృదయం గాయపడితే ఈ పాపగాయమును మనము ఏ సత్యముతో స్వస్థపరచగలము?

ఈ గాయములు కూడా నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించుట ద్వారా స్వస్థత పడును - అనగా యొర్ధాను నది వద్ద బాప్తిస్మము పొందుట ద్వారా ఆయన తానే ఈ లోకపాపమును ప్రభువు మోపుకొనెను. ఆయన వాటిని కలువరి సిలువకు వాటిని మోసికొనిపోయి దానిపై ఆయన రక్తమును కార్చుట ద్వారా వాటిని పోగొట్టెను. అనగా పాప పరిహారము పొందిన తరువాత మన క్రియల ద్వారా జరిగించిన మన పాపములు కూడా యేసుక్రీస్తు మన ఈ పాపక్రియలతో పాటు పాపములన్నిటిని కడిగెనను సువార్తను మనము స్థిరముగా నమ్మినప్పుడు అవి కడుగబడును. యేసు తన బాప్తిస్మమును పొంది సిలువ వేయబడినప్పుడే ఈ లోక పాపములన్నియూ కడుగబడినవి. అలాగే లోక పాపములు కానీ మన స్వంత పాపములు రెండు లేదా మూడుసార్లు కడుగబడవలసినవసరం లేదు. అవి కడుగబడుతూనే ఉండనవసరం లేదు. పాప పరిహారము కొద్దికొద్దిగా జరుగునని ఎవరైనా బోధించినట్లైతే అతడు/ఆమె బోధించుచున్నది తప్పుడు సువార్త.

లోక పాపములన్నీ కడుగబడుటను దేవుడు ఒక్కసారే చేసెను. హెబ్రీ 9:27 మనకు చెప్పినట్లు ‘‘మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడును; ఆ తరువాత తీర్పు జరుగును” పాపము వలన మనము ఒక్కసారే మృతి పొందు రీతిని పాప పరిహారము కూడా ఒక్కసారే పొందవలెననునది మన దేవుని చిత్తమై యున్నది. యేసుక్రీస్తు మన పాపములన్నిటిని తనపై మోపుకొనెను. ఒక్కసారే మృతి నొందెను అలాగే మన స్థానములో ఒక్కసారే తీర్పు పొందెను. ఆయన ఈ క్రియలను అనేకసార్లు చేయడు.

మన హృదయముతో యేసుక్రీస్తును విశ్వసించి మన పాపపరిహారము పొందినప్పుడు మన పాపములన్నిటికి నిత్యపరిహారమును పొందామను నమ్ముట మన హక్కైయున్నది. అప్పటి నుండి మనం చేయు పాపము ఆయా సమయాలలో మన హృదయములను గాయపరచును. కనుక మనము చేయవలసినది మన ప్రభువు మన పాపమును ఒక్కసారిగా కడిగెను మరియు గాయపడిన మన హృదయ గాయమును కడిగి బాగుచేయునని విశ్వాసముతో ‘‘ప్రభువా, నేను బలహీనతతో నిండాను. మరలా నేను పాపం చేశాను. నేను నీ చిత్తప్రకారం పూర్ణ జీవితమును జీవించలేకపోవుచున్నాను. కానీ యొర్ధాను నదిలో నీవు బాప్తిస్మము పొందినప్పుడు సిలువలో రక్తం కార్చినప్పుడు నా పాపమును కూడా నీవు కడుగలేదా? హల్లెలూయ! ప్రభువా! నేను నిన్ను స్తుతించుచున్నాను.’’

అట్టి విశ్వాసముతో మన పాపపరిహారమును మరొకసారి రూఢిపరచుకొని ప్రభువుకు ఎల్లప్పుడూ కృతజ్ఞత తెలిపెదము. ప్రకటన ఆఖరి అధ్యాయములో యేసుక్రీస్తు నొద్దకు వెళ్ళుటకు ముందు ఆయన జీవవృక్షము ప్రభువు ఇప్పటికే లోకపాపమును క్షమించెనని పరిహారము పొందినవారు దేవుని రాజ్యమైన పరిశుద్ధ పట్టణములో ప్రవేశించుటకు హక్కులను తమ విశ్వాసం ద్వారా పొందిరని విశ్వసించాలని చెప్పుచున్నది.

దేవుని పట్టణములో ప్రవేశించువారి కొరకై శిక్షనొందెనని బాప్తిస్మము పొందుట ద్వారాను తన రక్తమును కార్చుట ద్వారాను యేసు పరమందు మానవుల పాపము నమ్మవలెను. మనలో బలహీన క్రియలు అనేకము ఉన్నప్పటికి మన రక్షకుని రక్తము మరియు బాప్తిస్మము ద్వారా మన విశ్వాసము ప్రభువు వలన నిజమైనదని అనుమతించబడెను మరియు మనమంతా జీవవృక్షము ముందుకు వెళ్లగలము.

క్రీస్తు బాప్తిస్మమును ఆయన రక్తమును నమ్ముట ద్వారా మాత్రమే నూతన యెరూషలేములో ప్రవహించుచున్న జీవజలమును త్రాగుటకును జీవవృక్ష ఫలమును పొందుటకు హక్కుదారులగుదురు. ఎవడును తీసివేయలేనట్టి నూతన భూమ్యాకాశములోనికి ప్రవేశించు అర్హత నీరు మరియు ఆత్మమూలమైన సువార్త నుండి కలుగును. కనుక మనము దానిని కాపాడి ఎంతో మంది ఇతరులకు దానిని బోధించవలెను. అలాగే ‘‘ఆయన ఆజ్ఞలను గైకొనుట” అను వాక్యభాగపు భావమేమనగా మనము ఈ లోకమును విశ్వాసముతో జయించుట అని అనగా నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్మి దానిని గైకొని ఈ ప్రపంచ నలుమూలలకు ఈ సత్యసువార్తను బోధించుటకు మనలను మనము సమర్థించుకొనుటయే.

మత్తయి 22లో యేసు ‘‘వివాహ విందు అను ఉపమానము”ను మనకు చెప్పెను. ఈ ఉపమాన సారాంశమేమనగా తమ వివాహ వస్త్రము ధరించనివారు వెలుపలి చీకటిలోనికి త్రోయబడెదరు. (మత్తయి 22:11-13) గొర్రె పిల్ల వివాహవిందులో పాల్గొనుటకు మనమెట్లు పెండ్లి వస్త్రము ధరించుకొనగలము. మరియు ఆ పెండ్లి వస్త్రములేవి? గొర్రె పిల్ల వివాహ విందులో పాల్గొనునట్లు పెండ్లి వస్త్రము నీరు మరియు ఆత్మమూలమైన సువార్త ద్వారా దేవుడు అనుగ్రహించిన నీతియే. నీవు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించుచున్నావా? అలాగైతే నీవు ఆయన నీతితో అందముగా అలంకరించబడెదవు. కనుక నీవు కుమారునికి పాపరహిత వధువుగా పరలోకరాజ్యములో ప్రవేశించగలవు.

తిరిగి జన్మించిన వారమైన మనము కూడా ప్రతి దినము పాపం చేస్తాం. అయిననూ దేవుని యెదుట తమ పాపము క్షమించబడి నీతిమంతులైనవారు. తమ విశ్వాసముతో నీతి వస్త్రముతో తమ దినదిన పాపము కడుగబడుటకు అర్హులై యున్నారు. ఎవరి పాపములైతే నిలిచియుండునో తమపాపము కడుగుకొనుటకు అర్హులు కారు. కనుక వారు తమ పాపము నుండి తమను తాము ప్రతిదినము చేయు పశ్చాత్తాప ప్రార్థనలతో శుద్ధులనుగా చేసికొనలేరు. ప్రభువునందు విశ్వాసముంచుట ద్వారా లోకపాపములనుండి మనము రక్షింపబడినాము కనుక మన ప్రభువు ఈ లోకములో జన్మించి బాప్తిస్మము పొంది తన రక్తమును చిందించుట ద్వారా లోకములోని మన పాపములన్నిటిని కడిగెనని తెలిసికొని విశ్వసించుట వలన ఇవన్నియూ సాధ్యపడినవి.

అనగా మన ప్రతిదిన పాపము ఆయన సత్యసువార్త వలన ఇప్పటికే కడిగివేయబడినవి. నీరు మరియు రక్తము యొక్క వాక్యము ద్వారా ప్రభువు నుండి పాప పరిహారము నొందినవారికి కూడా తమ జీవితకాలములో జరిగించు పాపము నుండి రక్షణ యొక్క నిశ్చయత కలదు.

మన ప్రభువు ఒక్కసారే మన పాపమును పోగొట్టినందున మనము కూడా మన స్వంత క్రియల ద్వారా చేయు పాపము నుండి కలుగు నిత్యనిశ్చయతను నమ్ముట ద్వారా రక్షణ పొందగలము. అది కాకపోయిన మన ప్రభువు ఒక్కసారే మన పాపమును కడుగకపోతే మనము పాపరహితులముగా కాగలమా? ఆ పరిశుద్ధ పట్టణమైన పరలోకములోనికి మనము ఎలా ప్రవేశించగలము?

జీవవృక్షము యేసు ఎదుట మనము ఎట్లు నిలువగలము. మన పాపములన్ని కడిగి మన ప్రభువును నమ్ముట ద్వారా మచ్చలేని ప్రజలముగాను, శుద్ధులముగాను ఆ పరలోకరాజ్యములో ప్రవేశించగలము. ఎప్పుడైనా మన జీవితంలో పాపము చేస్తే మన ప్రభువు నొద్దకు పోయి అట్టి పాపములన్నిటిని ఆయన పోగొట్టెనని విశ్వసించిన యెడల మనము అట్టి పాపము నుండి విడిపింపబడగలము. ఇందువలన కేవలము తిరిగి జన్మించిన వారు మాత్రమే తమ విశ్వాసము ద్వారా తమ అనుదిన పాప క్షమాపణ పొందు అవకాశమును పొందెదరు.

రాజైన దావీదు దేవుని ఎదుట గొప్ప పాపమును చేసినాడు. అతను దేవుని పరిచారకుడైననూ పాపం చేశాడు.అతడు ఒక వివాహిత స్త్రీతో వ్యభిచారం జరిగించాడు. తనకు విధేయుడైన ఆమె భర్తను చంపించాడు. అయిననూ అతడు దేవుని దయగల క్షమాపణ కొరకు దేవుని స్తుతించి ఇట్లు ప్రార్థన చేశాడు.

“తన అతిక్రమములకు పరిహారము నొందిన వాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్ధోషియని యెంచబడినవాడు ఆత్మలో కపటములేనివాడు ధన్యుడు.’’ (కీర్తను 32:1-2)

ఈ లోకంలో మరియు దేవుని దృష్టిలో ధన్యుడు ఎవరు? తిరిగి జన్మించినవారు కాక మరెవరూ ధన్యులు కాదు. రక్షించబడినవారు జీవితంలో పాపంచేసి పాపాలన్నీ దేవుడే తొలగించెనని దేవునివైపు చూసేవారు. కలుషిత హృదయాన్ని ప్రతిదినం కడుగుకొనుచూ నూతన జీవాన్ని పొందేవారు మాత్రమే ధన్యులు. ఇది మన విడుదలకు, మన దేవుడు ఇచ్చిన రక్షణ నిశ్చయత తెలియజేస్తుంది.

వారి యొక్క చిన్నచిన్న తప్పులును అన్నియు కలుపుకొని నీతిమంతులైన వారు మాత్రమే వారి అపరాధమును క్షమాపణ పొందుకొనెను. వారి యొక్క సమస్త క్రియలు అలాగే వారి హృదయాలో ఆ రకంగా ఏ విధమైన కళంకము లేకుండా నీతిమంతులుగా మారుచున్నారు. ఆ విధంగా నిర్ధోషులమైన మనము, నీతిమంతులమై దేవుడు మన నిమిత్తం ఏర్పాటు చేసిన దేవుని రాజ్యంలో ప్రవేశించగలము. యేసుప్రభువు రక్షణ ద్వారమని, జీవవృక్షమని, ఆయన మనకోసం తన ప్రభావాన్ని ప్రత్యక్షపరచుకొనెనని మనం ఒప్పుకొనినయెడల పాపక్షమాపణ పొంది దేవుని రాజ్యంలో చేరెదము.జీవ వృక్షానికి ముందు నడుచువారు.


పాపక్షమాపణ పొందినవారు ఎందుకు ప్రభువుకు ముందుగా నడుచుచున్నారో కారణం తెలుసా, దేవుడు మన పాపాన్ని లేకుండా చేసెనని, కృపగల రక్షణను పునరాలోచనచేసి, దానిని గుర్తించి, అందును బట్టి దేవుని స్తుతించుచూ దేవుని రాజ్య ప్రవేశానికి ఇంకా అధికమైన అర్హత పొందుట కొరకే. ఇందునుబట్టి మనం సువార్తను ప్రకటించుచున్నాము.

అసంఖ్యాకులైన క్రైస్తవులు వారి అపార్థాల వల్ల, తప్పుడు నమ్మకాల వల్ల, దేవుని వాక్యాన్ని సరిగా బోధించే దైవసేవకులను కలుసుకోలేకపోవుచున్నారు. ఇప్పటికి వారి పనులలో మునిగి ప్రతి ఉదయం మరియు రాత్రి అంతా పాపక్షమాపణ ప్రార్థనలు చేస్తున్నారు. వారెందుకీ పనులు చేస్తున్నారు? ఆ విధంగా చేయుట ద్వారా వారి పాపాలు క్షమింపబడతాయని నమ్ముచున్నారు. అంతేగాక వారికి బోధింపబడుచున్న అబద్ధ సిద్ధాంతాలను నమ్ముచున్నారు. ఇది దేవుని దృష్టిలో నీతిలేని కార్యాలు. అలాంటి ప్రజలు నీతిగల దేవునిని ఆయన అపారమైన ప్రేమను తెలియనివారైనందున వారు చాలా దురదృష్టవంతులు.

పరిశుద్ధ గ్రంధము అనగా ఇది ఏదో సాధారణంగా తీసికొనే సంగతికాదు. ఎవరికిష్టం వచ్చినట్లు వారు అనువాదం చేయుటకు వీలుకానిది. అయితే ప్రజలు వారి ఇష్టానుసారం అనువదించి, బోధించి, నమ్మినట్లయిన ఫలితం దానికి తగినట్లుగానే ఉంటుంది. వారు దేవుని నీతిని ఆయన ప్రేమను తెలిసికొననివారు పరిశుద్ధ గ్రంధములో ప్రతిభాగం ప్రత్యేక అర్ధాన్ని కలిగి ఉంది. అంతేగాక పాపక్షమాపణ పొందిన దేవుని ప్రవక్తలైన వారు మాత్రమే దీనిని అనువదించాలి.

“జీవ వృక్షానికి ముందు నడుచుట” అనగా దేవుడు ఈ భూమిపై ఉండెననియు, మన పాపాలు తొలగించెనను సంగతి ప్రతిదినం నమ్ముటకు, ఆయనను స్తుతించుటకు మరియు ఆయన సువార్త బోధించుటకు చెందియున్నవి. తిరిగి జన్మించిన మనం ఆయన మన పాపాలు తనపై వేసికొనెనని, ఈ సత్యాన్ని ప్రతిదినం స్థిరం చేసికొనుటకు, కృతజ్ఞతాస్తుతులతో ఆయనను ఆరాధించుటకు మన దేవుని ముందు నడుచుట అనేవి జ్ఞాపకం చేసికొనవలయును.

ఈనాడు సర్వలోకంలో వ్యాపించియున్న క్రైస్తవులు ఈ భాగాన్ని పొరబాటుగా అనువదించి పశ్చాత్తాప ప్రార్థనల ద్వారా రోజువారీగా తమ పాపాలు కడుగబడునని పరలోక రాజ్యం ప్రవేశించి పొందగలము అని నమ్ముచున్నారని చెప్పుట అతిశయోక్తి కాదేమో! కాని ఆ భాగం యొక్క అర్థం ఇది కాదు.

పాపక్షమాపణ పొందిన తరువాత మన పనుల ద్వారా మనం చేసిన పాపాలన్నింటిని దేవుడు తుడిచి వేసెనని మన హృదయాలు నెమ్మదిగా ఉంటాయి. మన పాపాలకు ప్రాయశ్చిత్తం లభించినదని నిశ్చయం పొందిన తరువాత ఇంక ఏ మాత్రం పాపంతో బంధింపబడలేము. ఇదే పరలోక రాజ్యంలోని ‘‘జీవవృక్షానికి ముందు నడుచుటకు” మార్గము.

ఈ వాక్యభాగము మానవ కల్పిత ఆలోచనలకు పూర్తిగా భిన్నమైనది. అందును బట్టి సత్యాన్ని తెలిసికోవాలంటే తిరిగి జన్మించిన అనుభవం ఉన్న దేవుని సేవకుల వద్ద మొదటిసారిగా సత్యాన్ని విని ఆ సత్యాన్ని తెలిసికొనవలసినవారమై ఉన్నాము.పట్టణానికి వెలుపల ఉన్నవారు


ప్రకటన 22:15లో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ‘‘కుక్కలును, మాంత్రికులును, వ్యభిచారమును, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు” ఈ మాటలు అంత్యదినాల్లో ఉన్న తిరిగి జన్మించని వారికి చెందియున్నవి. దేవుడు ఈనాటి ప్రజలను అంత ఖచ్చితంగా వర్ణించుట ఆశ్చర్యాన్ని గొలుపుతుంది.

కుక్క యొక్క ఒక లక్షణం ఏదనగా తిన్నదానిని కక్కివేయుట అనగా కుక్కలు దానిని తిరిగి తింటాయి. (మరలా కుక్కలు తిరిగి తింటాయి) ఆ విధంగా అవి వాంతి చేసికొనినదానినే తిరిగి తింటాయి. ప్రభువు ఈ విధంగా చెప్పుచున్నారు. ఈ ‘‘కుక్కలు” పట్టణంలో ప్రవేశించలేవు.

ఈ కుక్కలు ఎవరిని ఉద్దేశించినవి? కొందరు ప్రజలు ‘‘ప్రభువా నేను పాపిని” నా పాపాలు కడుగు అని బిగ్గరగా అరుస్తారు. ఆ తరువాత దేవునికి స్తోత్రం అని పాడుదురు. ‘‘నేను క్షమింపబడినాను” అని పాడుదురు. ఆ మరుక్షణమే మరలా బిగ్గరగా అరుస్తారు. ‘‘ప్రభువా నేను పాపిని. నీవు మరొకసారి క్షమించిన నేనెప్పుడూ పాపం చేయను.’’ కల్వరి రక్తం ద్వారా నేను కడుగబడినానని మరలా పాడుదురు.

ఈ ప్రజలు వెనుకకు ముందుకు లాగబడుదురు. కారణం వారు నిజంగా క్షమింపబడినారో లేదో వారికే తెలియదు. బైబిల్‌లో ఉదహరింపబడిన కుక్కలు వీరే గాని మరొకరు గాదు. కుక్కలు ప్రతిరోజు మొరుగుతాయి. అవి ఉదయం మొరుగును. మధ్యాహ్నం మొరుగును. సాయంత్రం మొరుగును. ఈ ప్రజలు ఖచ్చితంగా ఈ విధంగా మొరగరు, వారి పాపాలు క్షమింపబడినప్పటికి వారు పాపులనే అరుస్తారు. ఒక నిమిషం నీతిమంతులుగా ఉంటారు. వెంటనే మరో నిమిషంలో పాపులుగా వ్యవహరిస్తారు.

అందును బట్టి వారు కుక్కలవలె లోపల ఉన్నదానిని కక్కి దానిని తినేటువంటి వారుగా, కక్కినదానిని తిని మరలా తినుటకు కక్కేవారిగా పోల్చబడినవారు. క్లుప్తంగా బైబిల్‌ ఈ విధంగా తెలియజేయుచున్నది. ఇంకా తమలో పాపం ఉన్నవారు ‘‘కుక్క” వంటివారు. ఈ కుక్కలు పరలోకరాజ్యంలో ప్రవేశింపరు. అయితే పరలోక పట్టణానికి వెలుపల ఉంటారు. తరువాత, సోదెగాండ్రు ఎవరు? వీరెవరనగా, గుడికి వెళ్ళువారిలో అమాయకులైన వారి అమయకత్వాన్ని అవకాశంగా తీసికొని తియ్యనిమాటలతో వారి ధనాన్ని దోచుకునేవారు. మరియు అబద్ధపు సూచనలు, అద్భుతాలు ద్వారా ప్రజలను స్వస్థపరచెదమని చెప్పి మోసం చేసేవారు. వారు దేవుని నామాన్ని వ్యర్ధపరుస్తున్నారు. వారు పరిశుద్ధ పట్టణం చేరలేరు.

అంతేగాక వికృతమైన లైంగికచేష్టలు చేసేవారు, నేరస్తులు, విగ్రహారాధికులు, అబద్ధాన్ని ప్రేమించి దానిని అనుసరించేవారు పరలోక రాజ్యం చేరరు. అంత్యదినాల్లో ప్రజలను మోసగించే కుక్కవంటి వారు సొదెగాండ్రు మరియు క్రీస్తు విరోధి వీరందరూ ఏకం అగుదురు. అద్భుతాలు, గుర్తుల ద్వారా ప్రజలను మోసగించెడివాడు. ఆత్మలు దొంగిలించేవాడు. దేవునికి విరోధంగా నిలబడేవాడు. దేవునికంటే అధికునిగా పూజింపబడాలని కోరే క్రీస్తు విరోధి మరియు అతని అనుచరులందరు పరలోక పట్టణంలో ప్రవేశించుటకు అర్హులు కారు.

మనమింకా పాపులుగా ఉన్నామని చేప్పేవారి మోసంలో పడినట్లయిన లేదా మన ఉద్రేకపరిచే అద్భుతాలు, సూచకక్రియ మోసంలో పడినట్లయితే వాక్యంలో హెచ్చరించబడిన రీతిగా ఏడ్చుచూ పండ్లు కొరుకుచూ క్రీస్తు విరోధి అయిన సాతానుతో కూడా పరలోకపట్టణానికి వెలుపలే ఉండిపోతాము.

ప్రకటన 22:16,17 వచనాలలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ‘‘సంఘము కోసరము ఈ సంగతులను గూర్చి విూకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపియున్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కయునైయున్నాను. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పిగొనిన వానిని రానిమ్ము. ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.’’

ఉచితంగా నీవు పాపక్షమాపణ పొందియున్నావా? జీవజలాన్ని ఉచితంగా త్రాగుటకు తండ్రియైన దేవుడు ‘‘నీరు మరియు ఆత్మమూలమైన సువార్త” ను పరిశుద్ధాత్మ ద్వారా తన సంఘము ద్వారా మనకు అనుగ్రహించెను. దేవుని నీతియందు ఆకలిగొన్నవారు ఆయన నిమిత్తం దప్పిగొన్నవారు మరియు అన్నిటిని ఓర్చుకొని పాపక్షమాపణ పొందాలనికోరే వారి కొరకు దేవుడు తన కృపతో కప్పాలని ఆహ్వానిస్తూ ఆయన రక్షణ అనే జీవజలాన్ని దయచేసెను. జీవజలం ప్రవహించే ఆ క్రొత్త భూమి, క్రొత్త ఆకాశంకి ఆహ్వానం పొందాలంటే పాపక్షమాపణ పొందుట ఒకే ఒక మార్గం.అవును, యేసు ప్రభు రమ్ము


ప్రకటన 22వ అధ్యాయం 19వ వచనం ఈ విధంగా తెలియజేయుచున్నది. ‘‘ఎవడైనను ఈ ప్రవచన గ్రంధమందున్న వాక్యములో ఏదైనను తీసివేసిన యెడల దేవుడు ఈ గ్రంధములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును.’’

మన స్వంత ఉద్దేశ్యమును ఆధారము చేసికొని ఏ మార్గములో మనము కోరినప్పటికి దేవుని యెదుట మనము నమ్మజాలము. ఒకవేళ ఇది దేవుని వాక్యంలో వ్రాయబడినట్లయితే మనం అందరం ‘‘అవును” అని చెప్పేవారము. ఎవరైనా దేవుని వాక్యంలో వ్రాయబడిన దానిని ‘‘కాదు” అని చెప్పిన మన దేవుడు కూడా వారితో ‘‘నీవు నా బిడ్డవు కావు”{అని చెప్పేవారే. అందునుబట్టి వాక్యానుసారంగా ఆయనను నమ్మాలి. దేవుని వాక్యానికి ఏదైనా కలపడం గాని, దేవుని వాక్యంలో నుండి ఏదీ తీసివేయుట గాని చేయరాదు, దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా నమ్మాలి.

ఏది నిజమైన విశ్వాసం అని పరిశుద్ధాత్మ దేవుడు తన సంఘము ద్వారా మాట్లాడుచున్నాడో దానిని విశ్వసించి, దేవుని సేవకులను అంటిపెట్టుకొని ఉండవలెను. కొందరు జనులు వారి విశ్వాసమునుండి నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను మినహాయించుటచే ఇంకా వారి హృదయాల్లో పాపం మిగిలి ఉన్నది. పాపం లేనివారే పరలోక పట్టణం చేరేదరని వాక్యం పదేపదే వారికి చెప్పుచున్నప్పటికి, యేసుప్రభుని బాప్తిస్మమును వారి విశ్వాసం నుండి తొలగించి దానికి ప్రతిగా పశ్చాత్తాప ప్రార్థన ద్వారా వస్తురూప కానుకల ద్వారా పరలోకరాజ్యం చేరే ప్రయత్నం చేస్తున్నారు.

యేసు ప్రభుని తమ రక్షకునిగా అంగీకరించే వారందరూ యొర్ధాను నది వద్ద యేసుప్రభువు యోహానుచే పొందిన బాప్తిస్మము ద్వారా మానవుల పాపాలన్ని యేసుప్రభువుపై మోపబడినాయని విశ్వాసంతో ఒప్పుకోవాలి. యేసుప్రభుని బాప్తిస్మమును నీవు విడిచిపెట్టిన నీ స్వంత విశ్వాసానికి నీవు లోబడినట్లు అవుతుంది. నీవు నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను నమ్మినట్లయితే సిలువ రక్తానికి అర్థం లేకుండా పోతుంది. క్రీస్తు ప్రభుని పునరుత్థానం కూడా నీకు వర్తించదు. ఎవరైతే యేసుప్రభువు తమ పాపాలు ఉచితంగా తీసివేసెనని నమ్ముదురో వారికే పునరుత్ధానం వర్తిస్తుంది. అపోస్తులుడైన యోహాను 22:20 వచనంలో చెప్పినట్లు ‘‘ప్రభువైన యేసూ రమ్ము” అని బిగ్గరగా చెప్పగలరు.

ప్రకటన 22:20లో ఈ విధంగా చెప్పబడినది ‘‘ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు - అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమెన్‌. ప్రభువైన యేసూ రమ్ము.’’ కేవలం నీతిమంతులు మాత్రమే ఈ విధంగా చెప్పగలరు. నీతిమంతుల ప్రార్థననుసరించి ప్రభువైన యేసు త్వరగా తిరిగి ఈ లోకానికి రాబోవుచున్నాడు. నీరు మరియు ఆత్మమూలమైన సువార్త ద్వారా సరియైన పాపక్షమాపణ పొందిన నీతిమంతులు మాత్రమే ఆనందించగలరు. ఆయన రాకడకై ఆశతో ఎదరుచూడగలరు. ఎవరైతే నీరు మరియు ఆత్మమూలమైన సువార్త అనే వస్త్రము ధరించెదరో, వారే ప్రభుని ఎదుర్కొనుటకు సిద్ధపడినవారు, వారెవరనగా పాపంలేని వారు అని అర్థము.

మన ప్రభువు ఈ లోకానికి వచ్చే రోజు అనగా నీతిమంతులు ఎదరుచూస్తున్న రోజు కోసం ప్రభువు వేచియున్నాడు. జీవ జలం ప్రవహించే క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలోనికి ఆయన దీవెనలతో ప్రవేశించే నీతిమంతులకు తన వెయ్యేండ్ల రాజ్యాన్ని బహుమతిగా ఇచ్చి తన మహిమ వస్త్రంతో కప్పును. మన ప్రభువు కోసం వేచియుండుట ఎంతో దూరం లేదు. అందు వల్ల మనం చేయవలసింది ‘‘ఆమెన్‌, ప్రభువైన యేసూ రమ్ము” అని ప్రార్థించాలి. కృతజ్ఞతతో, భక్తిపూర్వకంగా ప్రభునిరాకడ కొరకు వేచియుండాలి.

చివరిగా 21వ వచనం ఈ విధంగా తెలియజేయుచున్నది. ‘‘ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై యుండును గాక” ఈ విధంగా దీవిస్తూ అపోస్తులుడైన యోహాను ప్రకటన గ్రంధాన్ని ముగించెను. ప్రతివారు యేసుప్రభుని విశ్వసించి, రక్షించబడి పరలోకరాజ్యం చేరాలని హృదయపూర్వకంగా ఆశించి ఈ దీవెనల నిచ్చెను.

ప్రియమైన పరిశుద్ధులారా మనం దేవునిచే రక్షింపబడినామంటే అర్థం ఆయన మనలను ప్రేమించెను. పాపాల నుండి విడిపించెను మరియు తన ప్రజలుగా చేసెను. దేవుడు మనలను నీతిమంతులుగా చేసి పరలోక రాజ్యం చేరునట్లు చేసెను. నిజంగా ఇది ఎంతో అద్భుతమైనది, అందును బట్టి దేవునికి వందనస్తులమై యున్నాము.

బైబిల్‌ మనతో ఏమి మాట్లాడుచున్నదో దానికి ఇది కేంద్రమై ఉన్నది. నీవు నేను తిరిగి జన్మించాలనే ఉద్దేశ్యంతో దేవుడు సత్యసువార్తను వినే అవకాశం కల్పించి దాని ద్వారా మన పాపాల నుండి తీర్పునుండి మనలను విడుదల చేసెను. ఆయన దయచేసిన రక్షణను బట్టి నేను దేవుని స్తుతించుచూ వందనాలు చెల్లించుచున్నాను. 

సురక్షితంగా మన పాపాల నుండి ప్రాయశ్చిత్తం పొందుట నిజంగా ఇది మనకెంతో అదృష్టం. మనము దేవునిచే ఎంతగానో దీవించబడుచున్న ప్రజలం , మనమందరం ఆయన ప్రవక్తలం. అందును బట్టి ఇంకా సువార్త వినవలసినవారికి నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను వ్యాపింపజేయవలసినవారము. అంతేగాక సువార్తను పరిపూర్ణమగునట్లు దేవుని వాక్యాన్ని బహిరంగంగా బోధించవలసినవారమై యున్నాము.

 రక్షకుడు న్యాయాధిపతి, సృష్టికర్తయైన యేసుప్రభుని ప్రతివారు విశ్వసిస్తారని నేను ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను. మరియు కాలము సంపూర్ణమైనప్పుడు ప్రభునిచే అనుగ్రహించబడిన పరిశుద్ధస్థలమైన క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని చేరెదనని ఆశించుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరితో ఉండును గాక.