Sermons

[అధ్యాయము 12-2] <ప్రకటన 12:1-17> ధైర్యమైన నీ హతసాక్ష్యమును కౌగలించుము<ప్రకటన 12:1-17>


అధ్యాయం 12లో దేవుని సంఘము అంత్యకాలములో ఎట్టి శ్రమలను ఎదుర్కొనునో తెలుపుచున్నది. వచనం 1 : ‘‘అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన యొక స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద పండ్రెండు నక్షత్రముల కిరీటమును ఉండెను. ‘‘ఇక్కడ భూమిపైనున్న దేవుని సంఘమును సూచించును. మరియు వాక్యము, ‘‘ఆమె పాదముల క్రింద అనగా దేవుని సంఘము ఇంకనూ లోక పరిపాలన క్రిందనున్నదని భావన. ఇది మనకు చెప్పునదేమనగా ఈ లోకములో దేవుని సంఘము. దానికి చెందిన పరిశుద్ధులు, హతసాక్షులై దేవుని మహిమ పరచెదరు.

“ఆమె శిరస్సు మీద పండ్రెండు నక్షత్రముల కిరీటముండెను” అను వాక్యము సంఘము అంత్యకాలంలో సాతానుతో పోరాడును. మరియు విశ్వాసముతో హతసాక్ష్యమగును అని చూపించుచున్నది. దేవుని వాక్యం మనకు చెప్పుచున్నట్లుగా వాస్తవముగా దేవుని సంఘము ఆనందగానము చేయును. మన విశ్వాసమును నాశనంచేయవలెనని సాతాను మనలను అన్నిరకములుగా ఇబ్బంది పెట్టిననూ, బాధ పెట్టిననూ, కీడు కలిగించిననూ, ఆఖరుగా మన ప్రాణాన్ని కోరిననూ మనము ఇంకనూ విశ్వాసమును కాపాడుకొని నీతియుతంగా హతసాక్షులమవుతాం. ఇదే విశ్వాస విజయము.

ఆది సంఘకాలములో కూడా మనకు ముందున్న పరిశుద్ధులు కూడా హతసాక్షులైరి. ఈ హతసాక్ష్యము మన స్వంత బలము నుండి వచ్చునది కాక మన హృదయంలో నివసించు పరిశుద్ధాత్మ ద్వారా సాధ్యము.

సూర్యుని ధరించిన స్త్రీ అను వాక్యము నుండి ఇక్కడ ‘‘స్త్రీ”అనునది దేవుని సంఘమును సూచించును. మరియు ‘‘సూర్యుని ధరించి” అనగా సంఘము అపరిమితంగా హింసించబడునని అర్థం. భయంకరమైన శ్రమల యొక్క అంత్యకాల తెగుళ్ళలో కూడా పరిశుద్ధులు బలముగా తమ విశ్వాసమును కాపాడుకొనెదరు మరియు సాతానుకు లొంగరు. ఎందుకు? తమ హృదయంలో నున్న పరిశుద్ధాత్మ వలన వారు సాతానుకు విరోధముగా నిలిచి యుద్ధం చేస్తారు. మరియు వారి ప్రాణ త్యాగముతోనైననూ.

ఎట్టి హింసకే గాని, ఎట్టి బెదిరింపుకేగాని వారిని లొంగనియ్యడు. అలాగే పరలోక రాజ్యములో తమ విశ్వాసమును ఉంచినవారు. దేవుని వాక్యం చెప్పుచున్నట్లుగా ఏడుబూరల తెగుళ్ళు పూర్తయిన వెంటనే ఏడు పాత్రల తెగుళ్ళు కుమ్మరింపబడి భూమి లయమగునని నమ్మి వారు సాతాను ఎదుట ఎల్లప్పుడూ సాగిలపడరు.

వారు సాతానునకు లొంగిపోయినట్లయితే ఇంతకంటే మంచిలోకం తమ కొరకు సిద్ధపరచబడలేదని నమ్మినవారు ఎన్నటికి సాతానుకు తలవంచరు. అంత్యక్రీస్తు మరియు అతని అనుచరులపై కుమ్మరింపబడబోవు ఏడు పాత్రల తెగుళ్ళు వారిని విరామం లేకుండా, కనికరం లేకుండా తరుమును అట్టి తెగుళ్ళు గురించి తెలిసికొన్న పరిశుద్ధులు వారిలో 100 శాతం బెదిరింపు వలన వారి విశ్వాసమును వదలరు. ఎందుకనగా వారి హృదయంలో పరిశుద్ధాత్మ పని చేయును. మనలో నివశించుచున్న పరిశుద్ధాత్మ సాతానుకు వ్యతిరేకంగా నిలిచి జయించి హతసాక్షులమగుటకు మనలను బలపరచును.

నాల్గవ బూర యొక్క తెగుళ్ళు పూర్తయి ఐదవ బూర మరియు ఆరవ బూర యొక్క తెగుళ్ళు కలుగునప్పుడు హతసాక్ష్యము మనలను సమీపించును. తమ విశ్వాసమును కాపాడుకొని హతసాక్ష్యులైన వారు మాత్రమే నీరు మరియు ఆత్మమూలమైన తిరిగి జన్మించినవారు. ఏడు బూరల తెగుళ్ళు దిగిరాగా, తాత్కాలికంగా దేవునిచే అనుమతించబడి అంత్యక్రీస్తు లోకముపై అధికారము కలిగియుండును.

అతని అధికారము అల్పకాలముండునని తెలిసికొన్నవారై సాతాను పరిచారకులు అంత్యక్రీస్తు యేసుక్రీస్తును తమ ప్రభువుగా ఆరాధించువారిని హింసించును.కనుక అతడు ఎంతో మందిని తనతో కూడా నరకానికి కొనిపోయెను. కానీ తమ పాపములను ఆయన బాప్తిస్మము ద్వారా యేసుపై మోపుట ద్వారా పాపరహితులైన వారు అంత్యక్రీస్తు హింసకు లొంగరు. కానీ యేసుక్రీస్తు అనుగ్రహించిన సువార్తను బలంగా కాపాడి హతసాక్షులవుతారు.

అలాగే హతసాక్ష్యమే విశ్వాసమునకు సాక్ష్యము. ఈ సాక్ష్యము కలవారే వెయ్యేండ్ల రాజ్యమును ప్రభువుచే సిద్ధపరచబడిన నూతన లోకము మరియు భూమిని పొందుకుంటారు. ఇదే ప్రపంచమంతటా విస్తరింపబడిన నీరు మరియు ఆత్మమూలమైన సువార్తను విశ్వసించు వారందరికీ వర్తించును. బైబిల్‌ చెప్పినదేమనగా దాదాపు తిరిగి జన్మించిన పరిశుద్ధులందరూ ఈ అంత్యకాలములో హతసాక్షులవుతారు.

కానీ హతసాక్ష్యమును తప్పించుకొన చూచువారు తమ నీరు మరియు ఆత్మమూలమైన విశ్వాసంను వదిలివేస్తారు. అంత్యక్రీస్తు వైపు నిలబడి దేవుడుగా అతనిని ఆరాధించుచూ ఏడు పాత్రల తెగుళ్ళు మరియు అంత్యక్రీస్తుచే అతని చేతులలోనే చంపబడతారు. చావు ఎప్పుడూ హతసాక్ష్యమునకు ప్రతి కాదు గానీ, కేవలము నిష్ఫలమైన నిరీక్షణలేని చావు మాత్రమే. సాతాను మరియు అంత్యక్రీస్తు నరకములోనికి త్రోయబడునప్పుడు ఈ ప్రజలు కూడా వారితోపాటు దానిలో పడతారు.

యేసుక్రీస్తును హతసాక్ష్యమును తప్పించుకొనుటకై తోసివేసి, కొంచెమైననూ ఆ శ్రమల కాఠిన్యమును తగ్గించుకొనుట ఒక తెలివిమాలిన పని. ఏడు బూరల తెగుళ్ళు ముగిసినప్పుడు తమ విశ్వాసమును కాపాడుకొనినవారు హతసాక్షులవ్వగా, వెంటనే ఏడు పాత్రల తెగుళ్ళు ఈ భూమిని వణికించును. కొద్దిమందిని జీవించనిచ్చును. స్పష్టమైనవేవనగా ఎవరైతే తమ పాపపరిహారం పొందుతారో వారు నిశ్చయంగా హతసాక్షులవుతారు. మరియు హతసాక్ష్యపు సమయంలో మనం మన ప్రభువును తృణీకరించకూడదు. ఇప్పుడు మనము అంత్యకాలమును గూర్చి సరైన జ్ఞానము కలవారమై మన విశ్వాసాన్ని తప్పక సిద్దపరచుకోవాలి మరియు వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలి.

మన పాపములకు మనం పరిహారాన్ని పొందాము మరియు మనం హతసాక్షమైనప్పుడు మనకు తెలియని ఆనందానుభూతిని అనుభవిస్తాము. అట్లు దేవుడు మనలను బలపరుస్తాడు. నీవు నేను ప్రభువు కొరకు హతసాక్షులమవ్వాలనే విధిలో నుండాలనే ఒక స్పష్టమైన విశ్వాసాన్ని మన హృదయంలో నెలకొల్పాలి. హతసాక్ష్య సమయం గడచిన తరువాత దేవుడు నిశ్చయంగా మనకు పునరుత్ధానాన్ని మరియు ఎత్తబడుటను అనుగ్రహించును. వెయ్యేండ్ల పాలనలో మనలను మహిమపరచు తన నిత్యమైన నూతన ఆకాశము మరియు నూతన భూమిని మనకిచ్చును. మరియు మనలను పరిపాలించునట్లు చేసి నిత్యము సంపదతో జీవించనిచ్చును. మనం వీటన్నిటిని స్థిరంగా విశ్వసించినట్లయితే మన ఆవేదనలన్నియూ ఆనందముగా మార్చబడతాయి.

అపోస్తులుడైన పౌలు చెప్పెను. ‘‘మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచుచున్నాము” (రోమా 8:18) సువార్తను ప్రకటించుచుండగా పౌలు ఎంతో శ్రమ పొందెను. ఎన్నోసార్లు చనిపోవునంతగా కొట్టబడెను. కానీ ఈ శ్రమంతయూ దేవుని మహిమ కొరకేనని ఎరిగినవాడైన పౌలుకు బాధ అంతయూ అనంత సంతోషముగా మారెను. చరిత్ర గ్రంధాలు మరియు చరిత్రకారులు లిఖించిన దానిని బట్టి దాదాపు అపోస్తులందరూ పౌలుతో కూడా హతసాక్షులైరి. పేతురు వాటికన్‌నగరంలో తలక్రిందులుగా సిలువ వేయబడెనని చెప్పబడుతుంది. మరియు అది సంఘ నాయకులు పాలీకార్ప్‌తో పాటు మరియు ఎంతోమంది ఇతర పరిశుద్ధులు సజీవంగానే దహించబడుచున్ననూ ఇట్టి విషయాలు అసాధ్యము.ఈ సమయంలో కూడా అట్టి విశ్వాసం గల పరిశుద్ధులు ఉన్నారు. అలాగే తమ విశ్వాసమును కోల్పోవు వారు కూడా ఉన్నారు. ఒరిజన్‌ ఒక తత్వవేత్త ఈ కాలపు తత్వవేత్తలో గుర్తింపు కలవాడు. ఇతను అపోస్తలుల నుండి ప్రత్యక్షంగా సువార్త విన్నవారిలో ఒకడు. కానీ హతసాక్ష్యమునకై అతని సమయం వచ్చినప్పుడు అతడు దాని నుండి తప్పుకొనెను. అతని ప్రాణం రక్షింపబడగా అతని సహ పరిశుద్ధులు హతసాక్షులైరి. ఈ చర్యతో అతడు యేసు తన కొరకు చేసిన కార్యాలన్నిటిని త్రోసిపుచ్చెను. కనుక ఒరిజమ్‌ యేసు యొక్క దైవత్వాన్ని త్రోసివేసిన వారికి ప్రతినిధిగా మారెను. అతడు తృణీకారమునకు ప్రతిగా ఈ కాలపు తత్వవేత్తలు అతనిని అత్యంత ప్రాచుర్యం గల తత్వవేత్తలలో అతనికి ఉన్నత స్థానం కల్పించిరి.

ఇతర పరిశుద్ధులు హతసాక్ష్యమును కౌగలించగా ఒరిజన్‌ ఎందుకు దాని నుండి తప్పించుకొన్నాడు? హతసాక్షులైన ఇతర పరిశుద్ధులు మనో ధైర్యము కలవారును ఒరిజిన్‌ యొక్క మనోసంకల్పం పిరికిది అని కాదు. ఆ పరిశుద్ధులు దేవుని స్తుతించుచూ హతసాక్షులగుటకు కారణం, వారు పౌలు చెప్పిన దానిని విశ్వసించారు. ఎట్లనగా ‘‘మన యెడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావు” వారు ప్రస్తుత ఇబ్బందిని భరించగలరు. వేరొక విధంగా వారు దేవుని వాగ్ధాన వాక్యమైన ఆయన వారిని పునరుత్ధానులను చేసి కొనిపోవును మరియు వారికి తన వెయ్యేండ్ల రాజ్యము నిచ్చును అను దానిని విశ్వసించిరి.

మనకు కూడా తప్పకుండా హతసాక్ష్య అవకాశం వస్తుందని గుర్తించాలి. ఈ సత్యమును గూర్చిన స్పష్టమైన జ్ఞానముతో కూడిన విశ్వాసం జీవితం జీవించువారు మిగిలిన వారి కన్నా వేరై ఉంటారు. ఆది సంఘకాలము యొక్క హతసాక్షులైన పరిశుద్ధులు చిత్రపటాలను విశ్వసించినవారు వాటిని తమ స్వంత చిత్రపటాలుగా భావించి అవి బలమైన గౌరవనీయమైన మరియు ధైర్యమైన విశ్వాసము గలవైనప్పుడు బైబిల్‌లోని వాక్యములన్ని తమ స్వంత కథని నమ్ముతారు. వారు ఎల్లప్పుడూ హతసాక్ష్యమును కౌగలించగల విశ్వాస జీవితాన్ని జీవిస్తారు అనగా తమ హతసాక్ష్యము తర్వాత దేవుడు తమకు పునరుత్ధానమును కొనిపోబడుటను అనుగ్రహించును. మరియు ముందుగానే తన ప్రణాళికచే సిద్ధపరచబడిన నూతన ఆకాశమును, భూమిని ఇచ్చును అను విశ్వాసమును ఎల్లప్పుడూ కలిగియుండి జీవిస్తారు.

దీనిని ఎల్లప్పుడూ విశ్వసించువారు దృఢమైన విశ్వాస జీవితమును జీవిస్తారు. ఎందుకనగా తమ విశ్వాసము తమ అంతమునకు వారిని సిద్ధపరచునని ఎరుగుదురు. అప్పుడు దేవుని స్తుతించుచూ మరణించగలరు. మరియు ఇది కేవలము వాక్యమునకు మాత్రమే సంబంధించిన విషయం కాదు గానీ వాస్తవ విశ్వాసానికి సంబంధించినది. ఈ వాక్యమును సువార్తను పూర్తిగా నమ్మనివారు మనలను అంత్యక్రీస్తుకు అమ్మివేయువారిలో ముందుంటారు. ఇందువలననే నీవు నేను గుర్తించవలసినదేమనగా మనం హతసాక్షులమవ్వవలసి ఉంది. దేవుని సంఘములోనున్న మన సహోదర సహోదరీలు మన విశ్వాసము వంటి విశ్వాసము కలవారు. మరియు ఎల్లప్పుడూ మనలోనే ఉంటారు కనుక వారు మనకు అత్యంత ప్రాముఖ్యం కలవారు. దేవుని పరిచారకులు ఆయన ప్రజలు మరియు ఆయన సంఘము వీరందరూ కూడా మనకు అంతేముఖ్యలు.

ఆది సంఘకాల పరిశుద్ధులు అంత్యకాలములో జీవించు మనకంటే నమ్మకమైన ఖచ్చితమైన విశ్వాసము కలవారు. వారు తమ హతసాక్ష్యమును దాని తర్వాత వారి పునరుత్ధానము మరియు భూమిని గూర్చి నిరీక్షణ కలిగియున్నారు. అందువలన వారు తమ విశ్వాస జీవితాన్ని నిజముగా తమ మహాశ్రమల కాలములోనున్నట్లే జీవించారు. ప్రభువు రాకడ అతిత్వరలో నున్నట్లే జీవించారు. కనుక మనము అతి సమీపంలోనే ఆరంభం కానున్న మహాశ్రమల యొక్క యుగములో నివసించుచూ వాటిని గూర్చి చదివి వాటి కథలు వాస్తవముగానూ, ఖచ్చితంగాను మనకే.

సరిపోయినవి వారు కూడా శ్రమలో వారి హతసాక్ష్యము పునరుత్ధానం మరియు ఎత్తబడు దేవుని వాక్యమంతటిని తెలిసికొని విశ్వసించిరి వాస్తవంగా మనం సమీపించుచున్న అంత్యకాలము సరిగ్గా మన కన్నుల ఎదుట నిలువనైయుండగా స్థిరముగా మన హృదయాలను హతసాక్ష్యపు విశ్వాసంతో సిద్ధపరచుకోవాలి. సాతాను క్రీస్తు యొక్క నీరు మరియు బాప్తిస్మమును విశ్వసించు వారందరినీ సవాలు చేయును. వారి విశ్వాసమును చెడగొట్టుటకు ప్రయత్నించును. సాతాను నుండి వచ్చు ఈ సవాలునకు లొంగకుండా ఉండాలంటే మన హృదయాలను నీరు మరియు ఆత్మమూలమైన సువార్తతో అంటుకట్టాలి. మరొకసారి నూతన రాజ్యము కొరకైన మన విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి. మరియు ఈ మన విశ్వాసమును మన హతసాక్ష్య సమయము వరకు బలహీనపడకుండునట్లు స్థిరపరచుకోవాలి.

ఆదికాల సంఘపు పరిశుద్ధులు తమ విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకొనుటకు కారణం. శ్రమను తమ హతసాక్ష్యము పునరుద్ధానం మరియు కొనిపోబడుటను గూరిన లేఖనమును, వాక్యములన్నిటిని వారు తెలిసికొని విశ్వసించారు. నీవు నేను కూడా హతసాక్షులమవుతాం. నేను చనిపోతాను మరియు నీవు కూడా మన విశ్వాసాన్ని కాపాడుకొనుటకు చనిపోవాలి. ఒక వేళ నేను మొదటగా ఈడ్చబడి చంపబడతాము. దీనికి ఇదే భయము కలిగించే ముందు చర్య కానీ అంతమున భయపడవలసినదేదీలేదు. ఎందుకనగా హతసాక్ష్యమును తప్పించుకొనుటలో కల న్యాయ కారణము మన విశ్వాసాన్ని వదులుటే, దీనిని మనం చేయలేము.

కేవలం దేవుడు మన హతసాక్ష్యము ద్వారా మహిమపరచబడుటకే దీనిని ఆయన మనకు నియమించెను. కనుక ఇదేదో ఒక్కసారైనా దీనిని మనం అనుభవించాలి. మనము దాని నుండి తొలగిపోలేము లేదా తప్పించుకొనలేము కనుక మన పూర్ణబలముతో దానిలోనికి పరుగెత్తెదము మరియు దానిపై ధైర్యంగా ఆనుకొందాం. ఎవరికీలేని రాజ అధికారాన్ని పొందుతాం. మరియు మనకు మహిమ గల దీవెనల యొక్క విశ్వాసం కూడా కలదు అలాగే మనను బలపరచుమని దేవుని ఎల్లప్పుడూ ప్రార్థించాలి. మరియు ఇంకా అధిక మహిమ ఆయనకు చెల్లించాలి. మన హతసాక్ష్యమును గూర్చి భయపడక విశ్వాసముంచుటలో మనము అత్యంత మహదానందమును పొందుకుంటాం. ఇది దేవునికి గొప్ప మహిమయు మనకు గొప్ప దీవెన.

పరిశుద్ధుల హతసాక్ష్యము పునరుత్ధానము మరియు ఎత్తబడుట ఆ వెయ్యేండ్ల పాలన మరియు నూతన భూమి ఆకాశము గురించి మనతో మాట్లాడుటకు దేవుడు ప్రకటన గ్రంధమును వ్రాసెను. అలాగే ఈ క్షీణదశలోనున్న లోకంలో ప్రకటన గ్రంథమును తెలిసికొనుట ఖచ్చితమైన విశ్వాసాన్ని కలిగియుండుటే నూతన రాజ్యమునకు పోవు మార్గమునకు నీరు మరియు ఆత్మ మూలమైన సువార్త లేకుండా ప్రయాణించలేము. మరియు ఈ విశ్వాసము హతసాక్ష్యము పొందకుండా నిర్ణయించబడదు. కనుక నీ విశ్వాసమును నీ హృదయమునకు గట్టిగా హత్తుకొని సమయము వచ్చినప్పుడు సువార్తను తృణీకరింపక హతసాక్షిగా ఉంటావని మరియు నీ విశ్వాసముతో ముందుకుపోతావని నేను విశ్వసించి ప్రార్థిస్తున్నాను. అప్పుడు నీ విశ్వాస జీవితం ఎంతో గణనీయంగా మార్పు చెందుతుంది.

సాతాను ఉరిలో చిక్కుకొనక వ్యర్థంగా మనం చనిపోము మన హృదయంలో క్రియ చేయు పరిశుద్ధాత్మను అనుసరించుచూ తమను విశ్వాసమును కాపాడుకొనుటకు మనం చనిపోతాం. ఇదే అసలైన హతసాక్ష్యము. మన హతసాక్ష్య దినం ఖచ్చితంగా వస్తుంది. కానీ మనం దానికి భయపడం. ఎందుకంటే మన శరీరాలు సాతానుచే చంపబడినప్పటికి దేవుడు వెనువెంటనే మనలను క్రొత్త మహిమ శరీరముతో జీవింపచేయును అని మనము ఎరిగియున్నాము. మన హతసాక్ష్యము తర్వాత కొద్ది దినములకే మనము పునరుజ్జీవింపబడి ఎత్తబడతామని కూడా మనకు తెలియును. అప్పటి నుండి మన కొరకు నిరీక్షిస్తున్న వెయ్యేండ్ల రాజ్య పరిపాలన అను దీవెన మరియు పరలోకరాజ్యములో ఎల్లకాలము రాజరికము మనకున్నవని మనకు తెలియును. చాలాకాలం క్రితం రోమా చక్రవర్తి ‘‘నీరో” రోమా నగరాన్ని మరలా నిర్మించుటకై ఈ పట్టణానికి నిప్పు పెట్టించెను. దీనిని బట్టి రోమీయులకు కోపం రాగా అతడు ఈ నేరాన్ని క్రైస్తవులపై మోపి ఏ బేధం లేకుండా వారిని ఊచకోత కోయించెను. అలాగే మహాశ్రమల యందు ప్రకృతి సహజ వైపరీత్యాలకు అంత్యక్రీస్తు ఈ తెగుళ్ళుకు కారణం పరిశుద్ధుని నేరం మోపి మనలను దోషులను చేసి చంపును.

కనుక ఇప్పటి నుండి మనము హతసాక్షులము కాగల విశ్వాసాన్ని మనం మరణించునంత విశ్వాసాన్ని ప్రసాదించమని దేవుని ప్రార్థించాలి. మనము మన విశ్వాసాన్ని వదలక హతసాక్షులమైతే దేవుని మహిమ ప్రత్యమగును. కానీ మన విశ్వాసాన్ని విడచి అంత్యక్రీస్తుకు లొంగి అతనినే దేవునిగా స్వీకరించినట్లయితే మనం తప్పక నిత్య నరకాగ్నాలోనికి త్రోయబడతాం. మనం అంత్యక్రీస్తును జయించగల విశ్వాసం కొరకు దేవుని ప్రార్థించినట్లయితే మన ప్రభువు మనకు బలము మరియు అధికారము నిచ్చును. కానీ మన హృదయాలు విశ్వాసంలో స్థిరంగా లేక తృణీకార విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లయితే ఆయన మనకు కేవలం నరకాన్నే ఇస్తాడు.

కొరియా యుద్ధాన్ని గూర్చి చిన్న కథను చూద్ధాం. ఉత్తర కొరియా బలగాలు దక్షిణ ప్రాంత గ్రామాలలోని ఒక చర్చికి వచ్చిరి. ‘‘చూడల్‌ బీ” అను అతను ఆ చర్చి రక్షణ చూస్తున్నాడు. చర్చి స్థలం మురికిగా ఉండుట చూచి దానిని జయించిన సైనికులు ఓర్చుకొనక అతను చర్చి స్థలాన్ని శుభ్రపరచకపోయిన అతనిని సంఘ సమాజం ఎదుట చంపుతామని బెదిరించిరి. కానీ డీకన్‌ వ్యతిరేకిస్తూ వచ్చాడు. అతడు తన విశ్వాసాన్ని కాపాడుకోవాలని చెప్తు కావాలని చంపబడ్డాడు. తర్వాత కొంతమంది క్రైస్తవులు అతని చావును హతసాక్ష్యమని చెప్పుకొన్నారు. కానీ అది హతసాక్ష్యము కాదు. ఎందుకు? హతసాక్ష్యమనగా నీతి క్రియల కొరకు మరణించుట అనగా దేవుని మహిమ ప్రచురపరచుటకు దేవుని పేరు చెప్పి మొండితనంతో ఒకడు మరణించుట హతసాక్ష్యమని పిలువబడుటకు చాలా దూరము.

దేవుడు మనం అనుగ్రహించిన రక్షణ అను ప్రేమను త్రోసివేయవచ్చునా? ఎందుకనగా మనం అపహాసకులము మరియు పాపులము. మన పాపములన్నిటిని యేసుక్రీస్తు తన బాప్తిస్మము ద్వారా తనపైకి మోపుకొని సిలువలో మరణించెను. మన పూర్తి ఆరాధనను మరణించునంతగా ప్రేమించిన మన ప్రభువునకు సమర్పించినట్లు మనం మరణించగానే మాయమగు మన శరీరము కొరకై నూతన భూమి ఆకాశమును మనకు అనుగ్రహించ సువార్తను త్రోసివేయడమే రక్షింపబడుదమను భవిష్యత్తు కలవారమై, ఈ భూమిపై ప్రతివానికి సువార్తను బోధించుటకు సువార్త నందించుచూ మరణించుటకే మనం ఈ లోకంలో జన్మించాము. పాపపరిహారమును పొందిన పరిశుద్ధుల భవిష్యత్తు అనగా మన స్వంత భవిష్యత్తు విశ్వాసంతో జీవించుటకు మరియు దేవుడు మనపై కుమ్మరించు మహిమ కొరకు విశ్వాసము గూర్చిన సవాలును జయించుటకు హతసాక్షులమగుటయే.

మనము ఎన్నో బలహీనతలను కలిగియున్నాము. మరియు దేని వలన కూడా దేవునికి మహిమ చెల్లించలేనంత దౌర్బల్యములతో నిండుకొన్నాము. మనవంటి ప్రజలకు ప్రభువునకు గొప్ప మహిమ చెల్లించగల గొప్ప సదవకాశమును దేవుడు మనకు కలిగించెను. మరియు అది హతసాక్ష్యము కాక మరేదో కాదు. దానిని తప్పించుకొనవద్దు. మనము ఆయనను వేడుకొనిన యెడల శ్రమను తగ్గించగల దేవుని మనం నమ్ముకొందాము. నూతన భూమి ఆకాశమున స్వతంత్రించుకొనుటకైన ముగియబోవు మన లౌకిక బాధను మనం జయించెదము. ప్రభువు తన కొరకు నమ్మకముగా జీవించిన వారిని ఎంతో గొప్ప బాధలు పడుటకు అనుమతించడని లేదా వారి విశ్వాసమును నిరాకరించదగినదేనని కూడా ఆయన అనుమతించాడు. కానీ ఆయన వారిని కాపాడును మరియు వారిపై ఎక్కువ కృపను కుమ్మరించును అని (విశ్వసించి జీవించెదము) మనం హతసాక్షులమవ్వాలని గుర్తించి మనము కఠినత్వము బాధను భరించగలుగుట మరియు ప్రభువు కొరకు పాటు పడుట అని వాటిని అనుభవం పొందవలసియున్నది. వాటి ద్వారా ప్రభువుతో నడుచుట అను అనుభవం ద్వారా మనం మన విశ్వాసంలో అభివృద్ధి పొందుతాము. మరియు అంత్యకాలము వచ్చునప్పుడు ప్రభువు వలన అనుగ్రహింపబడిన బలము ద్వారా హతసాక్ష్యమును ఎదుర్కొంటాము. ఒకవేళ ప్రభువు కొరకు బాధను గూర్చిన అనుభవం ఆయనకు ఆరాధన ఆయన గూర్చిన శ్రమ మరియు త్యాగము లేనివారముగా మనము ఉన్నట్లయితే మహాశ్రమలు ప్రత్యక్షమగుటతో కలుగబోవు హతసాక్షి సమయంలో భయకంపితులమవుతాము. మొదట బాధింపబడి ఆ బాధను జయించిన వారు మాత్రమే తమ బాధను మరొకసారి జయించగలరు.

నీ విశ్వాస జీవితము ప్రభువు కొరకు బాధింపబడి దానిపై జయమొందగలవని మరియు హతసాక్ష్య సమయం వచ్చినప్పుడు నీవు కూడా ఈ విషయములన్నియూ తమ స్వంత మహిమ కొరకు దేవుని కృప యొక్క దీవెనలని తమ హృదయమును గ్రహించి పెదవులతో ఒప్పుకొనువారైన విశ్వాసులలో ఒకనిగా ఉండాలని నేను.

దేవుని ప్రార్థిస్తున్నాను. నీవు నీ విశ్వాసంతో దేవుని రాజ్యము కావాలని స్థిరంగా కోరుకొనిన యెడల ఆ నూతన భూమి మరియు ఆకాశము నిశ్చయంగా నీవే. ప్రతి మనిషి రక్షింపబడాలని సత్యమును గూర్చిన జ్ఞానము కలవారై ఉండాలని దేవుడు కొరుకొనెను. (1తిమోతి 2:4)