(1 యోహాను 1:9)
“మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త-దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును “
రక్తము వలననైన సువార్త కేవలము సగము సువార్తయే.
యేసు రక్తము వలననైన సువార్తద్వారా మనము పరలోకములో ప్రవేశించగలమా?
లేదు, మనము సంపూర్ణ సువార్తయందు విశ్వసించవలయును. (నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్త)
1 యోహాను 1:9 కేవలము నీతిమంతులకు మాత్రమే వర్తించును.ఈ వాక్యము ఇంకను విమోచింపబడని ఒక పాపి తను అనుదిన పాపమును అంగీకరించినచో ఆ వ్యక్తి పాప భారము నుండి విమోచన పొందలేడు.నేను చెప్పుచున్న విషయము మీరు గ్రహించియున్నారా? తిరిగి జన్మించని పాపుల కొరకు ఈ వాక్యము వ్రాయబడ ప్రకారము లేదు.
ఈ లోకములో అనేకులు ఇంకనూ తిరిగి జన్మించిన అనుభవమును పొందకయే 1 యోహాను 1లో నున్న ఈ వాక్యము ప్రకారము వారి పాపములకు పశ్చాత్తాపపడి, పాప క్షమాపణ దొరుకునని విశ్వసించి ప్రార్థింతురు.
తిరిగి జన్మించిన అనుభవము పొందని వారు ఈ పాపపు ఒప్పుకోలు ప్రార్థన వలన సంపూర్ణముగ విమోచింపబడుదురా?మనము ఈ విషయములో ముందుకు వెళ్ళుటకు పూర్వమే దీనిని గురించి అర్థము చేసుకొనుట ముఖ్యమైన విషయము.
1 యోహానులోనున్న వాక్య భాగమును చదువుటకు ముందుగా అపోస్తలుడైన యోహాను పాపియా లేక నీతిమంతుడా అన్న విషయము నిశ్చయించు కొనవలయును.ఈ క్రింది ప్రశ్నను మనం వేసుకుందాము. అపోస్తులుడైన యోహాను నీరు మరియు ఆత్మసంబంధమైన సువార్త ద్వారా తిరిగి జన్మించిన, నీతిమంతుడా లేక ఇంకనూ పాపియా?
ఒకవేళ అపోస్తులుడైన యోహాను పాపి అని మనo చెప్పగలిగితే, విశ్వాస విషయములో మనమింకనూ తప్పిపోయి వున్నాము. ఒకవేళ అపోస్తులుడైన యోహాను యేసునందు విశ్వాసముంచి తిరిగి జన్మించిన అనుభవము గల నీతిమంతుడైన యెడల ఆయనకున్న విశ్వాసము మన విశ్వాసమువంటిది కాదని గ్రహించవలయును. అట్టి విశ్వాసమును మనమును కలిగియుండవలయును.
ఇంకొక ప్రశ్న. అపోస్తులుడైన యోహాను ఈ పత్రిక వ్రాసినది నీతిమంతులకా లేక పాపులకా? ఈ పత్రిక కేవలము నీతిమంతుల కొరకే వ్రాయబడియున్నది.
ఒకవేళ తిరిగి జన్మించిన అనుభవము లేని పాపులు 1 యోహాను 1:8-9ని తమకు అన్వయించు కొనిన యెడల ఇది నిరుపయోగమైనది. నీ పాపము నుండి విడిపించబడి నీతిమంతుడవు కాగోరిన యెడల నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్తను విశ్వసించి దేవుని యెదుట నీ పాపమును అంగీకరించవలయును. ఈ లోకపాపమునంతయు శుద్ధీకరించిన ఈ సువార్త ద్వారా ప్రభువు నీ పాపములన్నియు తొలగించును.
అపోస్తులుడైన యోహానుకున్న విశ్వాసము కూడా ఇటువంటిదే.1 యోహాను 5వ అధ్యాయములో యోహాను మాట్లాడుతూ,‘‘ నీరు, రక్తము మరియు ఆత్మయందు నేను విశ్వసించుచున్నాని తెలిపెను.’’ నీరు, రక్తము మరియు ఆత్మ ద్వారా వచ్చిన ప్రభువైన యేసును నీవు విశ్వసించుచుంటివా? సిలువలోనున్న క్రీస్తును మాత్రమే నీవు అంగీకరించుచున్నావా లేక ఆయన పొందిన బాప్తిస్మము, చిందించిన సిలువ రక్తము మరియు ఆత్మ ద్వారా వచ్చిన యేసును విశ్వసించుచుంటివా?
ఈ యేసు కార్చిన సిలువ రక్తమునందు మాత్రమే విశ్వాసముంచిన యెడల నీవు రక్షింపబడుదువా, ఒకవేళ నీకున్న విశ్వాసము కేవలము సిలువలో కార్చిన రక్తమందు మాత్రమే అయిన యెడల నీవు కేవలము సగము సువార్తను మాత్రమే విశ్వసిస్తున్నావన్నది సత్యము. సహజముగా సిలువలో యేసు కార్చిన రక్తమునందు మనము విశ్వాసముంచి, పాప క్షమాపణ ద్వారా మన పాపము విమోచింపబడునని భావిస్తూ వుంటాము.
అయితే నీ అనుదిన పాపము నిమిత్తము పశ్చాత్తాపడి ప్రార్థన చేసి యేసు రక్తములో విశ్వాసముంచిన యెడల నీ పాపములన్నియు తొలగిపోవునా? ఒకవేళ నీవు అటువంటి వ్యక్తివే అయితే నీ పాపము నీ హృదయములోనే నిలచియుండును. మన అనుదిన ప్రార్థనలు మరియు పాపపు ఒప్పుకోలు ద్వారా కేవలము యేసు రక్తమునందు మాత్రమే విశ్వాసముంచిన యెడల మన పాపములు యెన్నటికి శుద్ధీకరింపబడవు.ఒకవేళ నీవూ అలాంటి వ్యక్తివయితే, నీరు మరియు ఆత్మసంబంధమైన సువార్తను ఎరుగనియెడల అది అసంపూర్ణమైన విశ్వాసమునకు దారితీయును.
నీరు, రక్తము మరియు ఆత్మ వలననైన సువార్తను విశ్వసించిన అపోస్తలుడైన యోహాను తిరిగి జన్మించగలిగెను. అయితే నీవు కేవలము సిలువరక్తమునందు మాత్రమే విశ్వాసముంచుచున్నావు. సువార్తను గురించిన సంపూర్ణ మర్మము నీకు తెలియనియెడల ఇతరులను నీవు రక్షణలోనికి ఏవిధముగా నడిపింపగలవు? నీవింకనూ తిరిగి జన్మించిన అనుభవము లేకయే కేవలము పశ్చాత్తాప ప్రార్థన ద్వారా నీ పాపము నుండి విమోచింపబడగలవని ఆలోచించుచున్నావు. ఈ మార్గము నిన్ను గమ్యమునకు చేర్చలేదు.
ఒక వ్యక్తి తన పాపము నుండి శుద్ధీకరింపబడుటకు ఎంత తీవ్రతతో ప్రార్థన చేసినను అతడు తన హృదయమునందు పాపక్షమాపణ పొందనేరడు. ఒక్కొక్కసారి మన పాపములు శుద్దీకరింపబడినవని విశ్వసించినట్లయితే అది కేవలము నీ ఊహలో నుండి పుట్టినదే. ఆ విధముగ నీవు పశ్చాత్తాపపడి ప్రార్థన చేసిన యెడల ఒకటి లేక రెండు రోజులు మాత్రమే నీవు శాంతితో జీవించగలవు. అయితే ఈ మార్గము ద్వారా నీ పాపము నుండి ఎన్నటికి విడిపింపబడవు.
పాపులు ఎంతో పశ్చాత్తాపపడి ప్రార్ధించి తమ పాపము నుండి రక్షింపబడుదుమని విశ్వసించెదరు.ఇన్ని సంవత్సరాలు దీర్ఘకాలము నీవు యేసునందు విశ్వాసముంచినను ఇంకను పాపిగానే వుండుటకు కారణమిదియే. నీరు మరియు ఆత్మవలననైన ఈ సువార్త వీరికి తెలియదు. నీవు యేసునందు విశ్వాసముంచి తిరిగి జన్మించిన అనుభవము పొందని యెడల నీవును అటువంటి వ్యక్తివి కాగలవు. నీవు అనుదినము నీ పాపమును ఒప్పుకొని ప్రార్థన చేయుచున్నయెడల నీవింకను తిరిగి జన్మించిన అనుభవము పొందలేదని దీని భావము. అపోస్తలుడైన యోహాను విశ్వసించినట్లు నీవును నీరు మరియు ఆత్మసంబంధమైన సువార్తయందు విశ్వాసముంచగలవా, లేక నీ ఊహాకల్పితమైన విశ్వాసము మరియు భావన ద్వారా విమోచింపబడగలవా. ఇందులో ఒకటి స్పష్టమైన సత్యం, రెండోది అసత్యం.
ప్రభువైన యేసు బాప్తిస్మముపొంది, లోకపాపమంతయు స్వీకరించి తీర్పుపొంది పాపులకు ప్రత్యామ్నాయముగ సిలువపైన మరణించెనని బైబిలులో తెలియపరచబడిన సువార్తయే సత్యసువార్తయై యున్నది. ఏ వ్యక్తి అయినను సరే యేసుపొందిన బాప్తిస్మమును మరియు సిలువ మరణమును అంగీకరించిన యెడల పాపము నుండి విమోచింపబడును. ఇంకొక విధముగ చెప్పాలంటే ఏ వ్యక్తియైన తన పాపము నిమిత్తమై ఒప్పుకోలు ప్రార్థన చేయుచు, తాను విమోచింపబడగలనని విశ్వసించిన యెడల ఆ వ్యక్తి తన పాపమునకు విమోచన పొందనేరడు. నీవు చేసే అనుదిన పాపము నీవు గుర్తించుకొనగలవా? నీవు పశ్చాత్తాపపడని ఈ పాపమునిమిత్తమై దేవుడేలాగు నిన్ను విమోచింపబడగలడు? మన అనుదిన పాపము నిమిత్తమై పాపపు ఒప్పుకోలు సరైన విధానమా? ఈ ప్రశ్నలన్నిటికి, కాదు అని సమాధానము చెప్పవలయును.
నిజమైన పశ్చాత్తాపం మరియు ఒప్పుకోలు యొక్కఉద్దేశ్యం
ఒప్పుకోలు మరియు మంచి పనుల పరిమితులు ఏమిటి?
కేవలము మన అపరాధమును అంగీకరించి, మంచిపనులు చేయుచు మన పాపములను మనము ఒప్పుకొనినంత మాత్రమున మనము రక్షింపబడము.
బైబిలులో ఉదాహరించబడిన పశ్చాత్తాపము యేదనగా మనము అబద్ధపు విశ్వాసములో నుండి తొలగి నిజమైన విశ్వాసము వైపుకు మరలుటయే. నీతిమంతులు ఈ కార్యము ద్వారా తమ పాపములను అంగీకరించి సువార్త వెలుగులోనికి రాగలరు.
ఒకవేళ నీవింకనూ పాపివైనట్లయితే ఈ క్రింద చెప్పబడిన విధముగ నీ పాపమును ఒప్పుకొనవలయును.‘‘ప్రియమైన దేవా, నేను ఎంతో పాపము చేసియున్నాను మరియు నీవు పంపు విధముగ నేను నరకమునకు పాత్రుడనే. అయితే నా పాపము నుండి రక్షింపబడవలనని నేను కోరుకుంటున్నాను. కనుక నా సమస్త పాపముల నుండి నన్ను రక్షించండి.’’ఇది సరియైన పాపపు ఒప్పుకోలైయున్నది.
అయితే తిరిగి జన్మించిన వ్యక్తి ఏ విధముగా తన తప్పును దేవుని యెదుట ఒప్పుకొనవలయును?‘‘ప్రియమైన దేవా, నా శరీరమును బట్టి నేనెన్నో పాపములు చేసియున్నాను. నేను యోహాను ద్వారా యేసు బాప్తిస్మము పొందెననియు మరియు నా సమస్త పాపములు నుండి రక్షింపబడితిననియు, మరియు నా పాపముల విషయమై నాకు ప్రత్యామ్నాయముగ యేసు మరణించెనని ఒప్పుకొనుచున్నాను. రక్తము మరియు నీటి ద్వారా ప్రభువైన యేసు నన్ను రక్షించెనని కృతజ్ఞతా పూర్వకముగా అంగీకరించుచున్నాను.’’తిరిగి జన్మించిన అనుభవము పొందని వారు మరియు పొందినవారు పై రెండు విధములుగా తమ పాపములను అంగీకరించవలయును.
అపోస్తలుడైన యోహాను వంటి విశ్వాసము మనకును వుండవలయును. నీ పాపమును దాచిపెట్టి నీతిమంతులు చేయు ప్రార్థన చేసిన యెడల నీవు పాపమునకు జీతమైన మరణమునుండి రక్షింపబడవు.
మళ్ళీ పుట్టని పాపులందరూ ఒప్పుకోలు ప్రార్థనల వెనుక దాచడం మానేసి, నీరు మరియు రక్తం మరియు ఆత్మ యొక్క నిజమైన సువార్తను విశ్వసించడం ప్రారంభించాలి. వారు అపొస్తలుడైన యోహాను విశ్వాసాన్ని నేర్చుకోవాలి మరియు తద్వారా మోక్షాన్ని సంపాదించాలి
తమ పాపము నిమిత్తమై విధింపబడబోవు శిక్ష యెంత భయంకరమైనదో పాపులు గ్రహించనేరరు. నీరు మరియు ఆత్మ ద్వారా తిరిగి జన్మించిన అనుభవము పొందుకొనలేకపోవుటే దేవుని యెదుట గొప్పపాపమైయున్నది.
యేసునందు విశ్వాసముంచినను ఇంకనూ తిరిగి జన్మించని వారు ఈ విధముగ పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేయవలయును.‘‘దేవా, నేను పాపిని. అందువలన నేను నరకాగ్నికి పాత్రుడను.’’ అని ప్రార్ధించవలయును. అంతేగాని ‘‘దేవా, నా పాపమును శుద్దీకరించండి.’’అని ప్రార్థించుట మానవలయును.ప్రభువైన యేసుక్రీస్తు యొర్దానులో పొందిన బాప్తిస్మము మరియు సిలువపై చిందించిన రక్తము ద్వారా మనలను మన పాపము నుండి విమోచించెనన్న ఈ సువార్తను ఒక పాపి హృదయములో విశ్వసించవలయును. దేవుని యెదుట తమ పాపము నుండి రక్షింపబడుటకు ఈ విధమైన పాపక్షమాపణ ప్రార్థన చేయవలయును.
ఒక పాపి తానింకను తిరిగి జన్మించిన అనుభవము పొందలేదని యెరిగి నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్తనందు విశ్వసించవలయును. అప్పుడే అతడు రక్షింపబడును.నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్త వలన పాపి రక్షణ సంపూర్ణమాయెను.‘‘మరి ఎవరి వలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను.’’ (అపో. 4:12) దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును బాప్తీస్మం మిచ్చు యోహాను వలన బాప్తిస్మము పొంది సిలువపై మరణింపచేయుట ద్వారా పాపులందర్ని వారి పాపము నుండి రక్షించెను.
ప్రజలు తమ శరీరముతోను మరియు హృదయముతోను, పుట్టుక నుండి చనిపోవు పర్యంతము చేసిన పాపములన్నిటినీ దేవుడు శుద్దీకరించెను. అయితే మనము రక్షింపబడుటకు నిజమైన సువార్తయందు విశ్వాసముంచవలయును. మన పాపము నుండి విడిపింపబడుటకు మరియు పరిశుద్ధత పొందుటకు ఇదొక్కటే మార్గము.నీరు మరియు ఆత్మ సంబంధమైన సత్యసువార్తయందు మనము విశ్వాసముంచిన యెడల ఒక్కసారిగానే నీతిమంతులము కాగలము.
యేసు బాప్తిస్మము పొంది లోకపాపమును స్వీకరించి వాటి నిమిత్తమై సిలువలో మరణించి తిరిగి మూడవనాడు పునరుత్థానుడై ఇప్పుడు తండ్రి కుడిపార్శమున కూర్చొని యున్నాడనుట నిస్సందేహముగ సత్యమైయున్నది.
మనమందరము ఈ విధముగా పాపపు ఒప్పుకోలు తెలుపవలయును.‘‘దేవా, నేను చనిపోవు పర్యంతము ప్రతిదినము పాపము చేయుచునే యున్నాను. నా తల్లిగర్భమునుండి నేను పాపిగా జన్మించితిని. నేను చేసిన పాపము నిమిత్తమై నరకాగ్నిలోనికి త్రోయబడుటకు పాత్రుడను. ఇందును బట్టి నీరు, రక్తము మరియు ఆత్మ ద్వారా వచ్చిన నా రక్షకుడైన యేసునందు నేను విశ్వాసముంచుచున్నాను.’’
మత్తయి సువార్త 3వ అధ్యాయములో తెలుపబడినట్లుగా యేసు లోకపాపమంతయు అనగా మనము చనిపోవు పర్యంతము చేసిన పాపములన్నియు ఆయన యొర్దానులో పొందిన బాప్తిస్మము ద్వారా తానే స్వీకరించెను.“మీరు సత్యమును గ్రహించినయెడల,అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగ చేయును’“(యోహాను 8:32).
ఒకవేళ యేసు మనలను కేవలము మూల పాపము నుండి మాత్రమే విమోచించి మనము చేసిన పాపమను సమస్యను మనమే పరిష్కరించుకొనవలెనని చెప్పినయెడల అది మన హృదయమును ఎంతగానో భాదించియుండును. అయితే ప్రభువైన యేసు తాను పొందిన బాప్తిస్మము ద్వారా మరియు సిలువలో కార్చిన రక్తము ద్వారా మనను సమస్త పాపము నుండి విడిపించెను. ఇప్పుడు మనము ఏ విషయమై ఆలోచించవలయును? మనము యేసు పొందిన బాప్తిస్మమునందు మరియు ఆయన సిలువ రక్తమునందు విశ్వాసముంచి దేవునికి కృతజ్ఞత తెలుపుకొనినయెడల ఆత్మ మన హృదయములో నివసించును.
నీవు యేసునందు విశ్వాసముంచుచున్నావా? ఆత్మ నీ హృదయములో నివసించునని విశ్వసించుచున్నావా? యేసు తాను బాప్తిస్మము పొందుట ద్వారా నీ పాపములన్నియు ఆయన తొలగించియున్నాడు. దాని నిమిత్తమై ఆయన సిలువపై తీర్పుపొందియున్నాడు.కనుకనే మనము పొందవలసిన నాశనము నుండి తప్పింపబడితిమి. ఇదే నిజమైన సువార్త.
నీతిమంతుల ఒప్పుదల.
నీతిమంతుల నిజమైన ఒప్పుదల ఏమైయున్నది?
వారు అనుదినము పాపము చేయుచూ ఉందురనియు, వాటి నిమిత్తమే యేసు 2000 సంవత్సరాల క్రితమే శుద్ధీకరించెనని విశ్వసింతురు.
1 యోహాను 1:9 ‘‘మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును.’’ అనగా నీరు మరియు ఆత్మసంబంధమైన సువార్తను అంగీకరరించువారు ఈలాగు పాపములు ఒప్పుకొనవలెను,‘‘ప్రభువా, దేవా నేనెంతగా పాపము చేయకుండ ఉండవలెనని ప్రయత్నించిననూ, నా జీవితములో పాపము చేయుచునే యున్నాను. నేను చేసే ప్రార్థన ద్వారా ప్రాయశ్చిత్తము పొంది రక్షింపబడలేనని నేను గ్రహించాను. పాపమునకు జీతము మరణమని నేను నమ్మియున్నాను. నా పాపము నుండి కేవలము యేసుపొందిన బాప్తిస్మము మరియు సిలువ మరణము ద్వారానే నాకు విమోచన లభించును. దేవా, నేను ఈ రోజు కూడా పాపము చేసియున్నాను. అయితే ఈ నా పాపములన్నియు నా ప్రభువైన యేసు 2000 సంవత్సరములకు పూర్వమే యొర్దానులో పొందిన బాప్తిస్మము ద్వారా శుద్దీకరించియున్నాడని విశ్వసించుచున్నాను.’’ ఈ విధముగా ప్రార్థన చేసిన యెడల తాను చేసిన తప్పిదము నిమిత్తమై అతని మనస్సాక్షికి కూడా విడుదల పొందును. ఈ విధముగా మనము కలిగియున్న ప్రతి సమస్య పరిష్కరించబడును.
అయితే ఇప్పటికే తిరిగి జన్మించిన అనుభవము కలవారు తమ పాపములను ఒప్పుకొనిన చాలును. వారు చేసిన ప్రతిపాపము నుండి యేసుక్రీస్తు శుద్దీకరణను అనుగ్రహించెనని మరలా జ్ఞాపకము చేసికొనుటకే ఈ ఒప్పుకోలైయున్నది. దాదాపు 2000 సంవత్సరముల క్రితం యేసు పాపుల నిమిత్తమై బాప్తిస్మము పొంది మరణించెను గనుక వారెంత బలహీనులైననూ వారి పాపములు సంపూర్ణముగా తొలగించబడియే యున్నవి.
ఇప్పుడు ధ్యానించిన వాక్యభాగము నీతిమంతులుగా తీర్చిబడినవారికెంతో ఉపయోగమైయున్నది. అయితే ఒకపాపి ఈ వాక్యమును ధ్యానించి సరైన విధానములో ఉపయోగించని యెడల, అతనికి కష్టముగానుండును. బైబిలులోని వాక్యభాగములో ఈ వచనమును అనేకసార్లు అర్థరహితముగా, అనేకులు ఉపయోగించెదరు. చాలా కాలముగా ఈ వాక్యభాగమును క్రైస్తవులు సరిగా అర్థము చేసికొనుటలేదు.
వైద్యములో సరైన అనుభవములేని వైద్యుడు తన దగ్గరకు వచ్చు రోగులను మరణమునకు గురిచేయును. ఇటువంటి వైద్యుడు తనకు తెలియని మందును రోగులపై ప్రయోగించిన యెడల వారు మరణించెదరు గదా.
ఏ వ్యక్తి అయినను తనకివ్వబడిన బాధ్యతను సక్రమముగా నిర్వర్తించాలంటే సరిగా అభ్యాసము చేయవలెనన్న విషయము విదితిమే. విశ్వాస విషయములో కూడా ఇది సమంజసమే. బోధకులు, వ్రాయబడిన వాక్యమునకు సరిగా అర్థము చేసుకొని దానిలోని సత్యమును ఖచ్చితముగా మరియు స్పష్టముగా బోధించవలెను. వారి బోధను గ్రహించు వారు కూడా బోధించబడిన దానిలో విశ్వాసము నిలుపవలయును.
బోధకులు తమ అనుచరులకు తప్పుడు సిద్ధాంతమును బోధించిన యెడల లేక విశ్వాసులు సరైన విధానములో బైబిలును నేర్చుకొనని యెడల వారిద్దరి కొరకు తీర్పు మరియు నరకము ఉంచబడినవి. తిరిగి జన్మించిన అనుభవము కలవారే బైబిలును సరిగా బోధించగలరు. మంచి ఔషధము కూడా సరైన మోతాదులో లేక సరైన వ్యాధికి ఉపయోగించని యెడల అది రోగికి మరణము తేవచ్చును. బోధ విషయములోను, నేర్చుకొను విషయములో కూడా ఇదియే వర్తించును. మన జీవితములో పసి బాలుని చేతిలో నిప్పు వున్న యెడల ఏ విధముగా అది ప్రమాదము తెచ్చునో, అదే విధముగా దేవుని వాక్యము కూడా సరి అయిన వారి చేతులలో లేని యెడల అంతటి ప్రమాదమే తెచ్చును.
నీతిమంతుల ఒప్పుకోలు మరియు పాపుల మధ్య వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి.1 యోహాను 1: 9 నీతిమంతుల కోసం. నీతిమంతుడు తన పాపాలను ప్రభువు యెదుట విశ్వాసంతో అంగీకరించినప్పుడు, అతను వారి నుండి విముక్తి పొందాడు. ఎందుకంటే యేసు అప్పటికే 2000 సంవత్సరాల క్రితం పాపములన్నింటినీ కడిగివేసాడు.
క్షమాపణ కోసం ప్రార్థించిన ప్రతిసారీ పాపులు తమ పాపాలు కడిగి వేయబడెనని నమ్మడం తప్పు. ఒకరు మళ్ళీ పుట్టనప్పుడు, ఒప్పుకోవడం ద్వారా అతని పాపములు శుద్దీకరింపబడునా?
దేవుడు నీతిమంతుడు దేవుడు ఈ లోకపాపములు తొలగించుటకే తన అద్వితీయ కుమారుడైన యేసును ఈ లోకమునకు పంపి, ఆయన పొందిన బాప్తిస్మము ద్వారా ఈ రక్షణ కార్యమును జరిగించెను. ఆయన బాప్తిస్మమునకు సాదృశ్యమైన నీరు మరియు సిలువపై కార్చిన రక్తమునందు విశ్వాసముంచిన వారిని రక్షించెను. కనుక నీతిమంతులుగా తీర్పుపొందిన వారు చేయు పాపపు ఒప్పుకోలు ద్వారా దాదాపు 2000 సంవత్సరముల క్రితమే యేసువారి పాపములను తానే వహియించెనని తెలియపరచుచున్నాడు. ఒకవేళ వారు శరీర విషయములో బలహీనులై, అసంకల్పిత పాపమును జరిగించినను, వారు హృదయములో పాపరహితులైతిరి గనుక రక్షింపబడియున్నారు.