• All e-books and audiobooks on The New Life Mission website are free
  • Explore multilingual sermons in global languages
  • Two new revised editions in English have been released
  • Check out our website translated into 27 languages
Search

Sermons

అంశం 8: పరిశుద్ధాత్మ

[8-1] పరిశుద్దాత్మ దేవుని వాగ్ధానములలో పనిచేయును (అపోస్తుల కార్యములు1:4-8)

2021.04.27 778
(అపోస్తుల కార్యములు1:4 -8)
‘‘ఆయన వారిని కలిసికొని యీలాగు ఆజ్ఞాపించెనుమీరు యెరూషలేమునుండి వెళ్లక, నావలన వినిన తండ్రియొక్క వాగ్దానముకొరకు కనిపెట్టుడి;యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దిన ములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెద రనెను.కాబట్టి వారు కూడివచ్చినప్పుడుప్రభువా, యీ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అను గ్రహించెదవా? అని ఆయనను అడుగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని యున్నాడు; వాటిని తెలిసికొనుట మీ పనికాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంత ముల వరకును”
 
 
పరిశుద్దాత్మ మనలో నివసించుట దేవుని వరమా లేక ఒకని స్వశక్తిచేత ఇవ్వబడినదా?
పాపము క్షమింపబడినవారికి దేవుని వాగ్ధానము వారి జీవితములో నెరవేరినవారికి దేవుడు అనుగ్రహించు కృపావరము పరిశుద్దాత్మ (నింపుదల).
 
ఒకప్పుడు పరిశుద్దాత్మ వంటి అగ్ని జ్వాలను ప్రార్ధనద్వారా పొందిన అనుభవం నాకు వున్నది. కానీ ఈ జ్వాలలు నాలో ఎంతోకాం ఉండలేదు. పెరుగుతున్న పాపములో ఆ జ్వాలలు అణగారిపోయాయి. పాపమువలన సుళువుగా ఆరిపోవు దురాత్మ వలన కాక సత్యసువార్తవలనైన పరిశుద్దాత్మను గూర్చిన సత్యమును ఇప్పుడు నేను వెలికి చూపాలని ఆశిస్తున్నాను. 
ఇప్పుడు నేను మీకు పరిచయం చేయబోవు పరిశుద్దాత్మ ప్రార్ధనద్వారా పొందగలిగేదికాదు కానీ కేవలమునీరు ఆత్మవలనైన సువార్తను విశ్వసించుటద్వారామాత్రమే పొందగలిగినది. 
ఈ పుస్తకము మీరు [1]పరిశుద్దాత్మ నివాసమును పొందుటకు మిమ్మును నడిపించాలని ఆశిస్తున్నాను.నేనుఈపుస్తకముద్వారాఅందిస్తున్నసందేశమునుచదువుచుండగాపరిశుద్దాత్మనడిపింపును మీరు గ్రహిస్తారు.ఈసమయంలోనీవు దేవునిపరిశుద్ధాత్మను పొందుట దేవుని చిత్తమైయున్నది. ఈ పుస్తకముద్వారా నీవు పరిశుద్దాత్మ నింపుదలను నేర్చుకుంటావు. దానిని పొందుతావు. మీకు సహాయముగా ఈ పుస్తకముతోపాటు క్రితమువ్రాసిన రెండుపుస్తకములనుకూడా మీరు చదవండి.ఈ పుస్తకముద్వారా మీరు దేవునియందు ఖచ్చితమైన విశ్వాసమును పొందుతారు. 
పెంతుకోస్తుదినమున యేసుక్రీస్తుశిష్యులమీదికి పరిశుద్దాత్మ ఏ విధముగా దిగివచ్చినాడో 
అదే విధముగా ఈనాడు ఎందరోక్రైస్తవులు
 
[1]క్రొత్తగా జన్మించిన వారిలో అనగా ఎవరైతే నీటిమూలముగా, ఆత్మమూలముగా జన్మించు సువార్తను నమ్ముటవలన రక్షింపబడిరో వారిలో పరిశుద్ధాత్మ నివశిస్తాడు. అయన వారిలో నిరంతంరము నివశిస్తూ వారిని ఎన్నడు విడువక వారు ఎంతకాలం ఆ సత్య సువార్తనునమ్ముతారో అంతవరకు వారిని హత్తుకొని వుంటాడు. ఆయన పరిశుద్ధులకు బలమైననమ్మకము ఇచ్చి బైబిల్లోని దేవుని చిత్తమును గ్రహించుటకు వారిని నడిపించును. ఈ లోకపు శోధనలను, కష్టములను. ఎదిరించుటకు బలవంతులుగా చేసి వారు అత్మ ఫలములను అధికముగా ఫలించుటకు సహాయపడతారు. దేవుడు పరి శుద్ధుల శరీరము దేవుని ఆలయముగా మహిమ పరచి వారిలో పరిశుద్ధాత్మ నివాసము చేస్తాడు.(అపో,కా, 2:38, 39, యోహాను 14:16, 16:8‌-10, 1కొరింధి 3:16, 1కొరింధి 6:19, గలతీ 5: 22, 23)

తాముకూడా పరిశుద్దాత్మను పొందలెనని ప్రయత్నిస్తున్నారు. ఈ విధమైన పరిచర్యను వ్యాప్తి చేయుటలో కొంతమంది ధనార్జన చేశారు. పరిశుద్దాత్మ మానవ స్వశక్తిచేత పొందవచ్చన్నట్లుగా వారు నటిస్తారు.
వారు దర్శనమును చూడాలని, అద్బుతకార్యములను చేయాలని,దేవుని స్వరము వినాలని,భాషలు మాట్లాడాలని,స్వస్థతలు చేయాలని,దయ్యములను వెళ్ళగొట్టాలని కోరుకుంటారు. కానీ వారి హృదయములు పాపంతో నిండియున్నాయి. వారు దురాత్మ ప్రభావము కలిగియున్నవారు. (ఎఫెస్సి 2:1-2)ఇప్పటికీ చాలామంది తాముదురాత్మల శక్తిక్రింద ఉన్నామని యెరుగకనే జీవిస్తున్నారు. అందువలననే సాతానుడు మనుష్యులను ఇంకాశోధిస్తూ కేవలము అపోహలైన అద్భుతములను,ఆశ్చర్యకార్యములను,జరుగిస్తూ మయోపాయములతో మోసగిస్తున్నాడు.
యేసుక్రీస్తుప్రభువు ఆయనశిష్యులకుఆజ్ఞాపించాడు. ‘‘మీరు యోరూషలేమునుండి వెళ్ళక, నావలన వినిన తండ్రియొక్క వాగ్ధానముకొరకు కనిపేట్టుడి;’’.(అపో.కా.1:4) అపోస్తుల కార్యములోబయలు పరచబడిన పరిశుద్దాత్మను పొందుటఅనునది అనుభవమువలననో,భక్తివలననో లేక పశ్చాత్తాపముతో కూడిన ప్రార్దన వలననో కలిగినది కాదు. కానీ,పరిశుద్దాత్మను మీకు ఆదరణకర్తగా వుంచుతాననిన దేవుని వాగ్ధానము కొరకు ఎదురు చూచుటవలన కలిగినది. పైన చెప్పినదాని వలన నేర్చుకోవలసిన సారంశము ఏమంటే పరిశుద్దాత్మ మనలో నివసించుట కేవలము ఎడతెగక చేయు ప్రార్థనల వలన కలిగినదికాదు. కానీ దేవునియందు ఆయన మనకనుగ్రహించిన సువార్తయైన నీటిమూలముగా ఆత్మమూలముగా బాప్తీస్మము పొందుటవలన కలిగిన సంపూర్ణమైన విశ్వాసముద్వారా పొందు దేవునికృపావరము.యేసుప్రభువు మనకనుగ్రహించిన సువార్తనువిశ్వసించుటవలన నిజముగా పరిశుద్దాత్మ మనలో నివసిస్తాడు. మనము పరిశుద్దాత్మ నివాసము మనలో పొందాలని దేవుడుమనకు నీటిమూలముగాను ఆత్మమూలముగాను క్రొత్తగా జన్మించుటనే సత్యసువార్తను అనుగ్రహించాడు. (1యోహాను 3:3-5).
‘‘పరిశుద్దాత్మ యొక్క వాగ్ధానము’’అను మాటక్రొత్తనిబంధనలో మనకు చాలాసార్లు కనబడుతుంది. పెంతుకొస్తు దినమందు పరిశుద్దాత్మచేత బాప్తీస్మము పొందిన పేతురుచేసిన వాక్యోపదేశము ఈ విధముగా వుంది (అపోకా. 2:38-39).‘‘పేతురు మీరు మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాస్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరుశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఈ వాగ్ధాననము మీకును మీ పిల్లలకును దూరస్ధులందరికిను, అనగా ప్రభువైన మన దేవుడు తనయొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని వారితో చెప్పెను’’.
ఎవరి జీవితంలో పాపక్షమాపణను పొందుతారోదేవుని వాగ్ధానము పరిపూర్ణమవుతుందో వారు దేవుని కృపావరముగా పరిశుద్ధాత్మను పొందుతారు. క్రొత్తనిబంధనలో పరిశుద్దాత్మ మనలోనివసించుట దేవునికి మనుష్యులకు మధ్య సంధి వలన కలిగినది కాదుగాని దేవుని వరమైన వాగ్ధానము వలననే కలిగినది కాబట్టి అపోస్తులులకార్యములో బయలుపరచబడిన పరిశుద్దాత్మనింపుదల అనునది ప్రార్ధనవలన పొందేదికాదు. (అ.పో.8:19-20)
పరిశుద్దాత్మ నింపుదల కేవలము దేవుడను గ్రహించిన నీటిమూలముగాను ఆత్మమూలముగాను క్రొత్తగా జన్మించుట అను సత్యసువార్తను నమ్మువారు మాత్రమే పొందుతారు. యేసుప్రభువు తనశిష్యులు పరిశుద్దాత్మను పొందుటకు పరిశుద్దాత్మను పంపుతానని వాగ్ధానము చేశాడు. ‘‘యోహాను నీళ్ళతో బాప్తీస్మము ఇచ్చెను కొద్ది దిన ములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెద రనెను’’.(అపో. 1:5)అందువలన ఆయన శిష్యులు దేవుని వాగ్ధానము నెరవేర్పు కొరకు ఎదురుచూశారు. బైబిల్లో పరిశుద్దాత్మ నివాసము గలిగిన నమ్మకమును గమనించినట్లయితే పరిశుద్దాత్మ వారి స్వశ్వక్తి చేతస్వనీతివలన కలిగినదికాదు. దేవుని చిత్తప్రకారము జరిగినదని మనము గ్రహిస్తాము.అపోస్తులకార్యములో శిష్యులుపొందిన పరిశుద్దాత్మ మనుష్యుప్రయత్నమువలననో,ఆధ్యాత్మిక సంపాద్యమువలననో కలిగినది కాదు.
అపోస్తుల కార్యములో వ్రాయబడిన విధముగా శిష్యులపై పరిశుద్దాత్మ దిగివచ్చుట వెంటనే నెరవేరినది. ఎందువలనంటే యేసుక్రీస్తు ప్రభువు ‘‘కొద్ది దినములలోగా’’,అని అన్నాడు. ఆదిసంఘములో ఇది మొట్టమొదటి ఆశీర్వాదం. మనము లేఖనములను గమనించినట్లైతే దేవుని వాగ్ధానము ఉపవాసమువలననో లేకప్రార్ధనవలననో లేక తమకుతామే అర్పించుకొనుట వలననో నెరవేరలేదు. కానీ దేవునిలో విశ్వాసముంచుట వలన కలిగినది. యేసుక్రీస్తు ఆరోహణము అయిన తరువాత విశ్వాసులు పాపక్షమాపణ పరిశుద్ధ్ధాత్మ నివాసము ఏక కాలమున పొందారు.
 

యేసుక్రీస్తు శిష్యులమీదికి పరిశుద్ధాత్మ అకస్మికముగా వచ్చినది

‘‘పెంతెకొస్తను పండుగదినము వచ్చినప్పుడు అందరు ఒకచోట కూడియుండిరి’’.(అపో.కా. 2:1)
పరిశుద్దాత్మను మీకు ఆదరణకర్తగా పంపుతానని దేవునినెరవేర్పుకొరకు ఆయనశిష్యులందరు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తూ ఒక చోట కూడివున్నారు. పరిశుద్దాత్మ వారిమీదికి దిగివచ్చాడు. ‘‘అప్పుడు వేగముగా వీచు బలమైన గాలివంటి యొకధ్వని ఆకాశమునుండి అకస్మాత్తుగా, వారు కూర్చుండియున్న యిల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలలవంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగ అందరు పరిశుద్దాత్మాతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్‌శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి.’’(అపో.కా.2:2-4)
పరిశుద్దాత్మ‘‘అకస్మాత్తుగా ఆకాశము నుండి’’వారిమధ్యకు వచ్చాడు.ఇక్కడ ‘‘అకస్మాత్తుగా’’,అను మాటకు అది మనుష్యుని చిత్తమువలనకలిగినదికాదు అని అర్ధము. ‘‘ఆకాశము నుండి’’,అనుమాట పరిశుద్దాత్మ ఎక్కడ నుండి వారికి అనుగ్రహింపబడెనో వివరిస్తున్నది. అంతేగాక మనుష్యుని చిత్తమువలననో స్వశక్తివలననో పరిశుద్దాత్మను పొందగలమన్న ఆలోచనను కొట్టివేస్తుంది. ‘‘ఆకాశము నుండి’’,అను మాట పరిశుద్దాత్మ ప్రార్ధనవలన అనుగ్రహింపబడతాడు,అను విషయమును మోసకరమైన వాదనగా ఋజువుచేస్తుంది.
‘‘పరిశుద్దాత్మ అకస్మికముగా ఆకాశము నుండి వచ్చెను’’,అనునది పరిశుద్దాత్మ మనలో నివసించుటకు భూసంబంధ సాధనములైన భాషలు మాట్లాడుటతననుతాను సమర్పించుకొనుటవలన కలిగేదికాదు అని అర్ధమవుతుంది.యేసుప్రభువు శిష్యులు మొట్టమొదటిగా సత్యసువార్తను ప్రతిజాతివారుప్రతి రాష్ట్రం వారు అర్దం చేసుకోవాలని పరిశుద్దాత్మతో నిండినవారై నానాభాషలు మాటలాడువారితో వారివారి స్వంత బాషలో మాటలాడిరి. ఎందువలనంటే విదేశీ భాషలో మాటలాడుకొను యూదులు వారి స్వంత మాతృబాషలో సువార్తను పరిశుద్దాత్మ శక్తి ద్వారా ప్రకటించుటకు దేవుడు వారికనుగ్రహించాడు. అన్యజాతుల నుండి వచ్చిన జనులుగలిలయవారైన శిష్యులందరు తమ తమ మాతృభాషలో మాటలాడుట విన్నారు.
‘‘మరియు అగ్నిజ్వాలలవంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరు పరిశుద్దాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్‌శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి.’’ (అ.పొ.కా.2:3-4) ఇక్కడ మనము ‘‘వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా’’అను వాక్యమును పరిశీలనగా చూడాలి. ప్రభువు శిష్యులు పరిశుద్దాత్మను పొందుటకై ఎదురుచూస్తే ఒకచోట కూడిన వీరు ముందుగానే సత్యసువార్తయైన నీటిమూలముగాను ఆత్మమూలముగాను క్రొత్తగా జన్మించానన్న విషయాన్ని విశ్వసించినవారు. ఈ దినములలో చాలామంది క్రైస్తవులు ఈ వృత్తాంతమును అపార్ధము చేసికొని వారు ప్రార్ధన చేస్తున్నప్పుడు పరిశుద్దాత్మ బలమైన గాలివంటి ఒక శబ్ధముతో వారిమీదికి వస్తుందని నమ్ముతారు. పరిశుద్దాత్మనుగూర్చిన ఈ విధమైన నమ్మకముఅవివేకము, గలిబలివలన కలుగుతుంది. నిజముగా పరిశుద్దాత్మ జనులమీదికి వచ్చునప్పుడు గొప్ప శబ్ధముతో వస్తాడా?కాదు. ఆ విధముగా శబ్ధము చేయడు.
అయితే ప్రజలు వినుచున్న శబ్దము సాతానుడు వారి ఆత్మలను మ్రింగునప్పడు కలిగే శబ్ధము. సాతానుడు ఈ శబ్ధమును అపోహను, గొనుగుడును,(అబద్దపు) ఆశ్చర్యపు కార్యమును చేయునప్పుడు చేస్తాడు. ఇవన్నీ జనులను మోసగించి వారిని గలిబిలిచేసి తానే పరిశుద్దాత్మ అని నమ్మించేందుకు ఈ విధంగా నటిస్తాడు. జనులు కూడా పరిశుద్దాత్మ ‘‘(ష్‌....సు...సు...’’)అనే గొప్ప శబ్ధముతో వస్తాడని అపోహ పడతారు.వారు దురాత్మచేత తప్పుమార్గములో నడిపింపబడుతున్నారు. అపొస్తుల కార్యములో వ్రాయబడిన విధముగాకేవలము సత్యసువార్తయందు విశ్వాసము కలిగిజీవించుటవలనమాత్రమే పరిశుద్దాత్మనుపొందగలము.
 

పేతురు యొక్క విశ్వాసము అతడు పరిశుద్దాత్మను పొందుటకు పరిశుద్దాత్మ తనలో నివసించుటకు అర్హమైనదిగా యెంచబడినది : (1 పేతురు 3:21)

అపోస్తులుల కార్యము 2వ అధ్యాయములో మొదటి పెంతుకోస్తు దినమున జరిగిన సంఘటననుగూర్చి శిష్యులు ముందుగానే నీటిమూలముగా ఆత్మమూలముగా క్రొత్తగా జన్మించుటయందు విశ్వాసముంచారు. కనుక పరిశుద్దాత్మవారిమీదికివచ్చాడనుసత్యమును దేవుడు ఋజువు చేస్తున్నాడు. అయితే సాధారణముగా ప్రజలు‘‘పెంతుకోస్తు’’ అను మాటను పరిశుద్దాత్మ ఆకాశమునుండి వచ్చునప్పుడు కొన్ని అసాధారణమైన సంజ్ఞతో అర్ధరహితమైన ఏడ్పుతోను,అల్లరితో బొబ్బ పెట్టునట్లు వస్తాడని భావిస్తారు.
అందువలననే ఈ మద్య ఉజ్జీవసభలలో వెర్రి ఆవేశముతో ప్రార్ధించుట, ఉపవాసముండుట లేకపోతే జనులపై చేతులుంచి ప్రార్ధించుటవలన పరిశుద్దాత్మను పొందవచ్చునని నమ్ముతున్నారు. విశేషముగా దయ్యమును వెళ్ళగొట్టడం,స్మృతితప్పి పడిపోవుట,ఏళ్ళ తరబడి అపస్మారక దశలో వుండుట లేక విపరీతముగా వణకుట,మూర్ఛలు,ఇవి పరిశుద్దాత్ముని క్రియలు కావు.
పరిశుద్దాత్మ ఒక యుక్తియుక్తమైన జీవి. మనుష్యుని వ్యక్తిత్వాన్ని అక్ష్యపెట్టడు. అహంకారంతో మనుష్యునిపట్ల అమర్యాదగా ప్రవర్తించడు. ఎందుకనగా పరిశుద్దాత్ముడు తెలివి,ఆవేశము,వివేకము, కోరిక, వ్యక్తిత్వము వున్న వ్యక్తి అయిన దేవుడు.ఎప్పుడైతే మనుష్యు నీటిమూలముగాను ఆత్మమూలముగా క్రొత్తగాజన్మించి జీవిస్తారో అప్పుడే పరిశుద్దాత్ముడు మనుష్యులమీదికి వస్తాడు. (అ.పో.కా. 2:38)
ప్రవక్తయైన యోవే ప్రవచించిన విధముగా పరిశుద్దాత్మ శిష్యులమీదికి దిగివచ్చాడని పేతురు సాక్ష్యమిచ్చాడు. పాప క్షమాపణ పొందినవారు పరిశుద్దాత్మను పొందుతారు అనునది దేవునివాగ్ధానము నెరవేర్పు. ఎవరైతే యేసుప్రభువు మానవాళిని పాపము నుండి రక్షంచుటకు సిలువవేయబడినాడు అనే సత్యమును నమ్ముతారో వారు పరిశుద్దాత్మనుపొందుతారు. యేవే ప్రవచనముతో కూడిన పేతురు ప్రసంగము మనకు యేసు బాస్తీస్మమును గూర్చిన అవగాహన ఎందుకుఉండాలో దానిపై ఎందుకువిశ్వాసముంచాలో తెలుపుతుంది.ఈ సత్యమును తెలుసుకొనుటవలన క్రైస్తవులు పరిశుద్దాత్మను పొందుటకు నడిపింపబడతారు.
మీరుఈ సత్యసువార్తను,పేతురు సాక్ష్యమును నమ్ముతున్నారా?లేక ఇంకా వ్యర్ధమైన మూఢనమ్మకములతో సత్యసువార్తకు ఏమాత్రంసంబంధంలేని వాటినే కలిగియున్నారా?దేవుని ప్రణాళికను నిర్లక్ష్య పెట్టి మీ స్వంత ఆలోచనతో పరిశుద్దాత్మను పొందుటకు శ్రమపడతున్నారా!ఇంకా ఎవరైనా దేవుని నమ్ముతూ పాపపు ఒప్పుకోలు ప్రార్ధనలు చేస్తూ తమ పాపము కడుగబడలెనని ఆశించినట్లయితే నీటిమూలముగా ఆత్మమూలముగా క్రొత్తగా జన్మించుటఅనే సత్యసువార్తలో నమ్మికయుంచడంతప్ప పరిశుద్దాత్మనుపొందుటకు వేరొకమార్గంలేదు.
నీటిమూలముగా ఆత్మమూలముగాజన్మించుట అనే సువార్తనుగూర్చిన జ్ఞానము లేకుండగనే నీవు ఇంకా పరిశుద్దాత్మను పొందుటకై వేచి వున్నావా?పరిశుద్దాత్మను మనలో నివసింపచేయు క్రీస్తు బాప్తీస్మము,ఆయన సిలువలో కార్చిన రుధిర ధారలనుగూర్చిన సత్యమును నీవు ఎరుగుదువా?మొట్టమొదటిగా నీవు నీటిమూలముగా ఆత్మమూలముగా క్రొత్తగా జన్మించుటవలననే పరిశుద్దాత్మను పొందగలుగుతావని తెలుసుకోవాలి. నీటిమూలముగా ఆత్మమూలముగా జన్మించుట అనే సత్యసువార్తను నమ్మువారికి మాత్రమే నిజమైన పరిశుద్దాత్మ నింపుదల అనుగ్రహింపబడుతుంది. మాకు ఆయన సత్యసువార్తయైన నీటిమూలముగా ఆత్మమూలముగా క్రొత్తగా జన్మించుటను తెలియచేసి పరిశుద్దాత్మ నివాసమును అనుగ్రహించిన దేవునికి వందనములు.