• All e-books and audiobooks on The New Life Mission website are free
  • Explore multilingual sermons in global languages
  • Two new revised editions in English have been released
  • Check out our website translated into 27 languages
Search

Sermons

అంశం 8: పరిశుద్ధాత్మ

[8-2] ఎవరైనా తన ప్రయత్నములచేత పరిశుద్దాత్మను పొందగలరా? (అ.పొ.కా. 8:14-24)

(అ.పొ.కా. 8:14-24)
‘‘సమరయవారు దేవునివాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపొస్తులులు విని, పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్దాత్మను పొందవలెనని వారికొరకు ప్రార్ధన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవనిమీదను అయన దిగియుండలేదు, వారు ప్రభువైన యేసునామమున బాప్తీస్మము మాత్రము పొందియుండిరి. అప్పుడు పేతురును యోహానును వారిమీద చేతు లుంచగా వారు పరిశుద్దాత్మను పొందిరి. అపొస్తులులు చేతులుంచుటవలన పరిశుద్దాత్మన అనుగ్రహింపబడెనని సీమోను చూచి వారియెదుట ద్రవ్యము పెట్టినేనెవనిమీద చేతులుంచుదునో వాడు పరిశుద్దాత్మను పొందునట్లు ఈ అధికారము నాకియ్యుడని అడిగెను. అందుకు పేతురునీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించు కొందునని తలంచుకొనినందున నీ వెండి నీతోకూడ నశించును గాక. నీ హృదయము దేవునియెదుట సరియైనది కాదు గనుక యీ కార్యమందు నీకు పాలుపంపులు లేవు. కాబట్టి యీ నీ చెడుతనము మానుకొని మారు మనస్సునొంది ప్రభువును వేడుకొనుము; ఒకవేళ నీ 
హృదయాలోచన క్షమింపబడవచ్చును: నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతిబంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పెను. అందుకు సీమోనుమీరు చెప్పినవాటిలో ఏదియు నా మీదికి రాకుండ మీరే నాకొరకు ప్రభువును వేడుకొనుడని చెప్పెను’’.
 
 
హస్తనిక్షేపణద్వారా ఏవ్యక్తియైనా పరిశుద్దాత్మనుపొందగలడా పొందలేడు. నీటిమూలముగాను ఆత్మమూలముగానైన?
సువార్తను నమ్ముట వలననే పొందగలడు.
 
పైన చెప్పబడిన వాక్య సారంశముననుసరించి ‘‘ఎవడైన తన స్వంతప్రయత్నముల చేత సంపాదించగలడా’’అను వర్తమానము అందచేయాలని కోరుచున్నాను. ఆదిసంఘకాలంలో అపోస్తులులు దేవునినుండి శక్తిపొంది అనేక ప్రదేశములకు పంపబడిరి. అపోస్తులుల కార్యములో అనేక సూచక క్రియలు వున్నవి. అపోస్తలులు జనులపై చేతులుంచగా పరిశుద్ధాత్మ వారిమీదికి దిగివచ్చుట వాటిలో ఒకటి. వారిలో అంతుకుముందు ఎవరిమీదను పరిశుద్దాత్మ దిగిఉండలేదు. వారు ప్రభువైన యేసునామమున మాత్రమే పొందియుండిరని బైబిల్‌ చెబుతుంది. క్రీస్తును నమ్మినప్పటికి పరిశుద్దాత్మనుపొందనివారు అపోస్తలులు వారిపై చేతులుంచగా పరిశుద్దాత్మను పొందిరి.
అయితే వారు చేతుంచుటవలన ఎలా పరిశుద్దాత్మను పొందారు? ఆ దినములో దేవుని వాక్యము ఇంకా వ్రాయబడుచూ ఉంది. మరియు దేవుని పని ఇంకను పూర్తికాలేదు. అందువలన దేవుడు అపోస్తులులతోఉండి వారిద్వారా .... రక్షకుడు అని సర్వోన్నతుడైన దేవుని కుమారుడని జనులు నమ్ముటకు దేవుడే అద్భుతములను, ఆశ్చర్యకార్యములను మనుష్యునికి గోచరమగుటకు చేసిన గొప్ప తరుణమది. పరిశుద్దాత్మ క్రియలను శక్తివంతముగా చూపించుటకు,యేసుక్రీస్తు దేవుడని,దేవుని కుమారుడని, రక్షకుడని ఋజువు చేయుటకు అవసరమైయున్నది. పరిశుద్దాత్మ ఆశ్చర్య అద్భుత కార్యములతో ఆదిమసంఘకాలంలో పని చేయకుండినట్లయితే ఎవ్వరూ యేసు రక్షకుడని విశ్వసించేవారు కాదు.
అయితే ఈ దినములలో మనము పరిశుద్దాత్మను పొందుటకు కంటికి కనపడేవిధముగా అద్భుతములు,ఆశ్చర్య కార్యములుజరిగించవలసిన అవసరము లేదు. ఎందుకంటే మనకు పరిశుద్ద గ్రంధము సంపూర్తి చేయబడి ఇవ్వబడినది. అంతేగాక పరిశుద్దాత్మ పొందుట అనునది మనవిశ్వాసముమీద ఆధారపడి ఉన్నది. మరియు సత్యసువార్తను నమ్ముటద్వారానే సాధ్యమౌతుంది. దేవునియెదుట ఎవరైతే సత్యసువార్తను నమ్ముతారో వారికి దేవుడు పరిశుద్దాత్మను యిస్తాడు. ఆయన మొదటిరాకడ, బాప్తిస్మము మరియు రక్తమును గూర్చి నెరవేరిన దేవుని వాక్యమును ఎవరు నమ్ముతారో వారికి దేవుడు పరిశుద్దాత్మను,నివాసమును దయచేస్తాడు.
ఈ దినములలో సంఘకాపరులు విశ్వాసులకుకంటికి కనపడే ఆశ్చర్యకార్యములే పరిశుద్దాత్మ మనలో నివసించుచున్నాడు అనుటకు సాక్ష్యము అని బోధించుచున్నారు. మరియు విశ్వాసులకు పరిశుద్దాత్మనుపొందుటకు ఆవిధముగానే నడిపిస్తున్నారు. వారు భాషలుమాట్లాడుట పరిశుద్దాత్మనుపొందుటకు గుర్తు అనిచెపుతూ జనులను మోసగించుచున్నారు. ఈ కాపరులు తమనుతాము అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేయు అపోస్తులులుగా ఎంచుకొని, వారి మనోభావోద్రేకముతో దేవునియొక్క కృపను అనుభవించాలి అనుకొనే మతమౌఢ్యుల ఏకాగ్రతను ఆకర్షించుచున్నారు. 
ఈ మూఢ మతాభిమానము ప్రపంచములోని క్రైస్తవులందరికి వ్యాపించింది. అనేకులు తమ విశ్వాసమును వెంబడించుచూ అసాధారణ క్రియద్వారా దురాత్మలను స్వీకరిస్తున్నారు. నేడుకూడ యిటువంటి మూఢ మతాభిమానులు యితరులపై హస్తనిక్షేపణ చేయుటద్వారా వారికి పరిశుద్దాత్మను అందించగలము అని అంటున్నారు.
మొదటి వృత్తాంతములో చెప్పబడినరీతిగా వారు గారఢీవాడైన సీమోనువలె భ్రమలో జీవించువారు. వారు స్వార్ధమైన అసంతృప్తితో జఠిలమైన అత్యాశతో మత్తులో జీవిస్తున్నారు. కానీ వారిక్రియలు జనులను కేవలము గందరగోళంలో పడేస్తున్నవి. దేవునియెదుట పరిశుద్దాత్మను పొందాలి అంటే వారు ఈ, తప్పుడు బోధనుండి సత్యమార్గమునకు మళ్ళుకోవాలి.నేటికి చాలామంది అబద్ద ప్రవక్తలు తాము పరిశుద్దాత్మ పనులు చేస్తున్నాము అని నటిస్తూ, తప్పుడు మత అలవాట్లద్వారా సాతానుపనిజరిగించుచున్నారు. పరిశుద్దాత్మనుపొందుటకు నిజమైన క్రైస్తవుడు,దేవునివాక్యమును జ్ఞానమును హత్తుకొని యుండాలి. పరిశుద్దాత్మయొక్క శారీరకఅనుభవమునుగూర్చి నొక్కిచెప్పు పెంతుకోస్తువారు వారి తప్పుడు విశ్వాసాలను త్రోసివేసి,దేవునివాక్యమునకు మళ్ళుకొని వారిని పరిశుద్దాత్మ పొందుటకు, నిశ్చయముగా నడిపించు సత్యమును హత్తుకొనవలెను. 
ఆదినములో సీమోను పేరుగాంచినగారడీవాడు, యేసుశిష్యులు జనులను పరిశుద్దాత్మ పొందుటకు, నడిపించుటనుచూచిన సీమోను వారికి ద్రవ్యమిచ్చి పరిశుద్దాత్మను కొనాలి అనుకొన్నాడు. యిటువంటి విశ్వాసము కలిగిన జనులు తప్పక సాతానుబానిసలుగా చేయబడి సాతానుక్రియలు చేస్తారు. సీమోను పరిశుద్దాత్మను లోభత్వముతో కూడిన ఆత్మతో పొందాలి అని అనుకున్నాడు. ఈ విధమైన విశ్వాసము సత్యమైన ఆత్మను స్వీకరించు విశ్వాసము కాదని మనము చూడగలము.
దేవుని శక్తిపట్ల స్వార్ధపూరితమైన కోరికతో సీమోను ద్రవ్యమిచ్చి పరిశుద్దాత్మనుకొనదలచాడు. అందువలన దేవుని సేవకుడైన పేతురుచేత తీవ్రముగా గద్దింపబడ్డాడు. సీమోను యేసుక్రీస్తును నమ్మినప్పటికీ పాపక్షమాపణద్వారా పరిశుద్దాత్మను పొందలేదు. అంతేకాక ఈలోకసంబంధమైన వస్తువును యిచ్చుట ద్వారా పరిశుద్దాత్మను పొందాలి అనుకొన్నాడు.
అతడు బహ్యముగా క్రీస్తును నమ్మినవానిగా కనపడినప్పటికీ అతని అంతరంగమందు దేవుని ఎరుగని వాడిగా, దేవుని సత్యమైనమాటకు వ్యతిరేకమైనయోచననుచేయువాడిగా యున్నాడు. అంతేకాక లోభత్వములో నిండినవాడుగా ప్రత్యక్ష పరచబడెను. దేవుని కృపాపరమైన పరిశుద్దాత్మను కేవలము ధనముతోకొనాలి అనుకొన్న గారడీవాడైనసీమోనును పేతురు గద్దించాడు. నీవు నీధనముతో కూడ నశించెదవని సీమోనుతో చెప్పెను.
ఈ దినములో అబద్ద ప్రవక్తలు దురాత్మలతో కూడి అద్భుతము ఆశ్యర్చ క్రియలు అన్ని కూడ పరిశుద్దాత్మ క్రియలేనని, ప్రజలను మోసగించుచున్నారు. ఈ విధమైన శక్తిని, పరిశుద్దాత్మ పొందుటకై ప్రయాసముతో ప్రార్ధించు వారిని మెచ్చుకుని ప్రోత్సహించువారు అనేకులను మనము నిత్యము చూచుచున్నాము. కాని, జ్ఞాపకముంచు కోవసిన విషయము ఏమిటి అంటే ఒకడు లోకములోని దురాశతో నిండియుండి చేయు ప్రార్ధనద్వారా పరిశుద్దాత్మను పొందలేడు. 
మీ మద్య కరిస్మాటిక్‌ ప్రజలు ఎవరైనా యున్నారా? మీరు వీరి విషయములో చాలా జాగ్రత్తగా యుండాలి. వీరు మూర్ఖమైన విశ్వాసముతో ఇతరులను ఎదుర్కొంటారు. వారు దయ్యమును వెళ్ళగొడతాము అని జనుపై హస్తనిక్షేపణచేసి వారు పరిశుద్దాత్మ పొందునట్లు చేస్తామని చెప్పుచుంటారు. వీరు దురాత్మ శక్తిని కలిగియున్నారు కానీ పరిశుద్దాత్మ శక్తిని కాదు. తాము హస్తనిక్షేపణద్వారా పరిశుద్దాత్మను పొందామని రూఢీగా చెప్పువారు తమతోపాటు ఇతరులను కూడా దురాత్మలను పొందుటకు నడిపిస్తున్నారు.
ఎవరైతే నీటిమూలముగాను ఆత్మమూలముగాను క్రొత్తగా జన్మించుట అనే సత్యసువార్తను (1యోహాను 5:3-7) నమ్ముతారోవారిలో పరిశుద్దాత్మనిజముగా నివసిస్తున్నాడు. నీటిమూలముగా ఆత్మమూలముగా క్రొత్తగా జన్మించుటను గూర్చిన సువార్త పరిశుద్దగ్రంధములో వివరముగా వ్రాయబడినప్పటికి చాలామంది వారిహృదయములో పాపముఉంచుకొనుట వలన అసాధారణ శక్తులవలనను నిశ్చేష్టుడుఅవడంవలననో భాషలు మాట్లాడుట వలననో, దర్శనము చూచుటవలననో లేకదయ్యములను వెళ్ళగొట్టుట ద్వారానో దేవుని చేరుకోవాలని ఆశిస్తారు. అందువలనే అబద్ద ప్రవక్తలు ప్రజలను మోసగించి దురాత్మలనుండి కలుగుమూఢవిశ్వాసముతో క్రైస్తవ్యమును నమ్ముటకు నడిపిస్తారు.
పేతురు సీమోనును ఈ విధముగా గద్దించాడు. ‘‘నీవు దేవుని వరమును ద్రవ్యమిచ్చికొనవలెనని అనుకొన్నావు. గనుక నీవు నీ ధనముతో నశించెదవు. నీ హృదయము దేవునిఎదుట సరియైనది కాదు’’కనుక ఈ కార్యమందు నీకు పాలుపంపులు లేవు. కాబట్టి నీచెడుతనమును మానుకొని మారుమనస్సు పొంది, ప్రభువును వేడుకొనవలెను. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోరదుష్టత్వములోను, దుర్నీతిబంధకములోను ఉన్నట్లు నాకు కనబడుచున్నది అన్నట్టు చెప్పెను’’.నేటి దినములో గారడీవాడైన సీమోనువంటి పరిచారకులున్నారు. వీరిలో అనేకులు కరిస్మాటిక్‌ వారు. వారు వారిమందను తప్పనిసరిగా ధనము ఇమ్మని కోరుతారు. మనము యిటువంటి విశ్వాసమునకు దూరముగా ఉండి నీటిమూలముగానుఆత్మమూలముగాను క్రొత్తగా జన్మించుటవలన పరిశుద్దాత్మను పొందుదము. (మత్తయి 3:15, 1 పేతురు 3:21, యోహాను 1:29, యోహాను 19:21-23).
 
 
కరిస్మాటిక్‌ ప్రజలు హస్తనిక్షేపణ చేయుటద్వారా పరిచర్యను జరిగిస్తారు.

ఇటువంటి విశ్వాసమునకు దూరముగా యుండాలి. నేడు అనేకులు హస్తనిక్షేపణద్వారా పరిశుద్దాత్మ పొందగలమని అబద్దపునమ్మకము కలిగియున్నారు.లేఖనములో అనేకులు, అపోస్తులులద్వారా హస్తనిక్షేపణ చేయించుకొని పరిశుద్దాత్మనుపొందారు.కనుక వారుకూడ ఆ విధముగానే పొందవచ్చునని భావిస్తారు. కొంతమంది హస్తనిక్షేపణ చేయుటద్వారా పరిశుద్దాత్మను జనుల తలమీదికి పంపుతాము అని నటిస్తారు. ఇటువంటి మనుషులనును గూర్చి జాగ్రత్తపడాలి. 
అదిమ సంఘములోయున్న అపొస్తులుల విశ్వాసమునకు వీరివిశ్వాసమునకు చాలా వ్యత్యాసము యున్నది అని గ్రహించాలి. ఈ రోజులలో క్రైస్తవుల నమ్మకంలో వున్న ప్రాముఖ్యమైన సమస్య ఏమిటి అంటే వారు నీటిమూలముగా ఆత్మమూలముగా క్రొత్తగా జన్మించుట అనే సువార్తయందు విశ్వాసముంచరు. వారు మేము దేవుని నమ్ముకున్నాము అని చెబుతూఉంటారు. కాని ఆయనను పూజించరు. అంతేకాక ఎవరికివారే ఇతరులతోపాటు మోసగించుకుంటారు. అయితే ఒక పాపి ఎప్పటికీ పరిశుద్దాత్మను పొందలేడు. అలాగే యింకొకరికి సహాయపడలేడు. ఎవరైనా ఒక పాపిమీద ఆత్మదిగివచ్చునని అన్నట్లయితే అది ఖచ్చితముగా దేవుని ఆత్మ అన్నట్లు నటించు దురాత్మ లేక సాతాను ఆత్మయే గాని దేవుని పరిశుద్దాత్మ కానేరదు.
ఆదిమసంఘ కాలములో అపోస్తులులు యేసును రక్షకునిగా ఎరిగినవారు,ఆయన మానవాళి పాపములను యోహానుచేత బాప్తస్మము సిలువ మరణముద్వారా కొట్టివేసాడు అని సత్యమునందు నిశ్వసించినారు,కనుకనే పరిశుద్దాత్మను పొందగలిగారు వారు నమ్మిన నీటిమూలముగాను ఆత్మమూలముగాను క్రొత్తగా జన్మించుట అనే సువార్తను ఇతరులకు భోధించి, వారిని పరిశుద్దాత్మను పొందుటకు నడిపించారు. అయితే నేడు చాలామంది క్రైస్తవులలో మూర్ఖపు నమ్మకాలు వున్నాయి. పాపియైన పరిచారకుడు ఇంకొక పాపియొక్క హస్తనిక్షేపణ చేయుటద్వారా ఆ పాపికి నిజముగా పరిశుద్దాత్మను ఇవ్వగలడా?.ఇది ఖచ్చితముగా అర్ధములేని మాట. వారి హృదయములో పాపములున్నప్పటికీ తాము పరిశుద్దాత్మను పొందామని చెప్పేవారుకూడావున్నారు. ఒక వ్యక్తితనఅనుచరులదృష్టికి మంచి కాపరివలె కనపడినప్పటికీ, తన హృదయంలో పాపముండిన యెడల అతడు మరియొకనికి పరిశుద్దాత్మను యివ్వలేడు.
చాలామంది యిటువంటి అబద్దపు నమ్మకము గలిగియున్నారు. అందువలననే అనేకమంది అబద్ద ప్రవక్తలు ప్రజలను నరకములోనికి నడిపించుచున్నారు. ఎవరైతే ఈ విధమైన విశ్వాసమును బోధిస్తారో వారు అబద్ద ప్రవక్తలు, అని వెంటనే గుర్తించాలి. వీరుముందుగానే దయ్యములు పట్టినవారు.
ఒక వ్యక్తిలో పాపముయున్నట్లయితే వారిలో పరిశుద్దాత్మ నివసిస్తాడా? నివసించడు. అయితే ఒక పాపి మరియొక వ్యక్తిని పరిశుద్ధాత్మను పొందుటకు నడిపించగలడా? అవదు. అటువంటి సమయములో కరిస్మాటిక్‌ ప్రజలు వారిలో పాపముంచుకొని అద్భుతములు,ఆశ్చర్యకార్యములు ఎలా చేయగలుగుతున్నారు. దురాత్మవలననే అని చెప్పవచ్చును. పరిశుద్దాత్ముడు పాపిలో ఎప్పటికీ నివసించడు. ఎవరైతే నీటిమూలముగా ఆత్మమూలముగా క్రొత్తగా జన్మించుట అనే సత్య సువార్తను నమ్ముతారో వారిలోనే పరిశుద్దాత్మ నివసిస్తాడు.నీ మీదికి వచ్చునది పరిశుద్దాత్మయే అని నీవు ఖచ్చితముగా చెప్పగలవా?
‘‘యేసు ఇట్లనెను ఒకడు నీటిమూలముగాను ఆత్మమూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతోనిశ్చయముగా చెప్పుచున్నాను’’అని యేసు ప్రభువు యోహాను సువార్త 3:5 లో చెప్పాడు. అదేవిధముగా నీటిమూలముగానుఆత్మమూలముగాను క్రొత్తగా జన్మించుట వలననే పరిశుద్దాత్మను పొందగలము. నేడు క్రైస్తవులుచేసే ముఖ్యమైనపొరపాటు ఏమిటంటే పాప క్షమాపణ పొందని పరిచారకుద్వారా హస్తనిక్షేపణ పొందుటవలన పరిశుద్దాత్మను పొందగలమని నమ్మడం. ఇది చాలా ముఖ్యమైన పొరపాటు. ఈ రోజులలో ఇదే ఎక్కువగా జరుగుచున్నది. 
 

నిజమైన పాపక్షమాపణ మరియు హస్తనిక్షేపణ మధ్యనున్న సంబంధము.

హస్తనిక్షేపణ,అనగా తనలో నుండి ఎదుటి వ్యక్తిలోనికి పుంపుట. ఈ విధముగా ఆలోచించండి! మనము మైక్రోఫోనులోమాట్లాడితే ఆ శబ్ధము తీగ నుండి యాంప్లిఫైయర్‌ద్వారా పెద్దగా అందరికీ వినబడుచున్నది. అదే విధముగా పాతనిబంధన కాలములో పాపియైనవాడు బలి అర్పించపోవుదానిమీద తన చేతులుంచి తనపాపములనుదానిమీదికి బదిలీచేయుట ద్వారా పాప క్షమాపణ పొందేవాడు. అలాగే దేవునిసేవకులువారిచేతులనుప్రజలపైనుంచి దేవుని శక్తిని వారిలోనికి పంపుతారు. ఈ విధముగా చేతులుంచుట (హస్తనిక్షేపణ) అనుమాటకు బదిలీచేయుట, పంపుట అను అర్ధము వచ్చినది.
కరిస్మాటిక్‌వారు ప్రజలపై చేతులుంచుటద్వారా దేవునిశక్తిని పరిశుద్దాత్మనింపుదలను చేయుటలేదు.కాని దురాత్మలనే పంపుతున్నారు. దురాత్మ శక్తులున్నవాడు ఇతరులపై హస్తనిక్షేపణ చేయుటద్వారా అతనిలోని దురాత్మలను ఇతరులలోనికి పంపుతారని జ్ఞాపకముంచుకోవాలి. దయ్యము పట్టిన వ్యక్తి ఇంకొకరిపై హస్త నిక్షేపణ చేయుటవలన తనలోని దయ్యములను ఆ వ్యక్తి లోనికి పంపుతున్నాడు. ఎందుకంటే సాతానుడు తన పనిని పాపులద్వారా నెరవేర్చుకొంటాడు.
ఈ కారణముచేత ప్రతిఒక్కరు సత్యసువార్తను నమ్మి నీటిమూలముగాను ఆత్మమూలముగాను క్రొత్తగా జన్మించుటవలన పరిశుద్దాత్మను పొందాలి. పాపక్షమాపణ పొందకపోయినట్లయితే వారు దేవుని నమ్మినప్పటికి సాతాను వారిపై అధికారముచేస్తాడు.
దయ్యములు పట్టినవాడుతన చేతులను ఇతరుల తలపైనఉంచితే ఆ దురాత్మలు అతనిలోకి వచ్చిబూటకపు అద్భుతములను చేస్తుంది. హస్త నిక్షేపణ చేయుటవలన వారిలోనికి దురాత్మలు వస్తాయని మనము తెలుసుకొని సత్యసువార్తనునమ్మి నీటిమూలముగాను ఆత్మమూలముగాను క్రొత్తగా జన్మించుటద్వారా పరిశుద్దాత్మను పొందాలి.
హస్తనిక్షేపణచేయుటఅనగా ఒకరిలోనిదిఇంకొకరిలోనికి పంపబడుటకు దేవుడు ఏర్పాటు చేసినది. అయితే సాతానుడు ఈరోజులలో అనేకులకు పరిశుద్దాత్మను ద్రవ్యమిచ్చి విక్రయించాలని తాపత్రయపడుట పెద్ద సమస్యగా మారినది.
 

చాలామంది క్రైస్తవులు పరిశుద్దాత్మను పొందుటను గూర్చి అపార్ధము చేసుకొనుచున్నారు.

మీరు పరిశుద్దాత్మను ఎలా పొందారుఅని నేను అడిగినప్పుడుచాలావరకు తమ పశ్చాత్తాప ప్రార్ధనద్వారా పొందాము అని జవాబు యిచ్చారు.ఇది సత్యముకాదు.మనము ప్రత్యేకమైనప్రార్ధనలు చేయుటద్వారా పరిశుద్దాత్మను పొందగలమా?.కాదు. ఎవరైతే సత్యసువార్తనునమ్మి నీటిమూలముగాను ఆత్మమూలముగాను క్రొత్తగా జన్మిస్తారో వారిలో పరిశుద్దాత్మ నివసిస్తాడు. ఎందుకంటే దేవుడు సత్యస్వరూపియైయున్నాడు.ఆయన పరిశుద్దాత్మను పొందుటకు ఒకధర్మమును (చట్టమును ఏర్పరచియున్నాడు. పాపము చేయు మనుష్యుని హృదయములో పరిశుద్దాత్మ నివసింపగలడా? ఖచ్చితముగా నివసింపలేడు. హస్తనిక్షేపణవలన ఒకడు పరిశుద్దాత్మను పొందలేడు. ఎవరైనా ఉజ్జీవ సభకు వెళ్ళి అక్కడ వెఱ్ఱిగా అరిచి పరిశుద్దాత్మ కొరకు ప్రార్ధన చేసినాగాని పరిశుద్దాత్మ అతని గ్రహింపుకు దూరములో వుంటాడు. పాపులు ఖచ్చితముగా పరిశుద్దాత్మను పొందలేరు. అయితే ఒకపాపి సత్యసువార్తనునమ్మి పాపక్షమాపణపొంది నీటిమూలముగాను ఆత్మమూలముగాను క్రొత్తగా జన్మించినప్పుడు మాత్రమే పరిశుద్దాత్మను పొందగలడు. 
నీటిమూలముగాను ఆత్మమూలముగాను క్రొత్తగా జన్మించుట అనే సువార్తను ఎఱుగని వారు ఎప్పటికీ పరిశుద్దాత్మను పొందలేరు. నేడు ఈసత్యసువార్త క్రైస్తవ సాహిత్యముద్వారా సంఘసమావేశముల ద్వారా ఇంటర్‌నెట్‌ద్వారా, ఎలక్ట్రానిక్‌ పుస్తకముల ద్వారా బాగా వ్యాపిస్తుంది. కాబట్టి ఎవరైనా ఈ సువార్తను ఎరిగి దానియందు విశ్వాసముంచినయెడల పరిశుద్దాత్మను పొందగలరు.నీవుయింకను పరిశుద్దాత్మను పొందనట్లయితే వెంటనే సత్యసువార్తనునమ్మి నీటిమూలముగాను ఆత్మమూలముగాను క్రొత్తగా జన్మించాలి అని తెలుసుకోవాలి.
 

తప్పుడు విశ్వాసమునకు ఒక ప్రధానమైన ఉదాహరణ

ఈ దినములలో దురాత్మను పొందిన మనుష్యుల యొక్క లక్షణాలను మనము పరీక్షించినట్లయితే వారిలో దయ్యము అసలైనఉనికి కనబడుతుంది.‘‘పరిశుద్దాత్మ కొరకు ఉజ్జీవసభలు’’,అనే కూటములో మనము అనేకమంది ప్రజలు అన్నిటికీ తెగించి ఆశతో పరిశుద్దాత్మను పొందాలి అని వచ్చే వారిని చూస్తున్నాము.ఈ కూటములో వీరు వేగముగా చప్పట్లు కొడుతూ ఉపవాసముండి పశ్చాత్తాపముతోప్రార్ధిస్తూ ఉంటారు. ఈ సభలో బోధకుడు వారిని మూర్ఖముగా ప్రార్ధనలు చేయమంటూ లేకపోతే పరిశుద్దాత్మ వారి మీదకి రాదని అనగానే ప్రజలంతా ఒక్కసారిగా ‘‘దావే ప్రభువా’’,అని అరుస్తూ మూఢమైన ప్రార్ధనను చేయుట మనము చూస్తుంటాము. 
ఈ మూర్ఖులు నిజముగా పరిశుద్దాత్మను పొందుతున్నారాలేదు. ప్రజులు అరుస్తూఎక్కడఅంటే అక్కడ పడిపోతూ వింత శబ్దాలు చేస్తూ భాషలు మాట్లాడటం మనము చూస్తుంటాము. ఒకతను తన తలయెత్తి పెద్దగా అరుస్తూ ఉండగా ఆ సభలోనివారంతా ఉద్రేకముతో నిండిపోతారు. కొంత మందికి మూర్ఛలు వచ్చి వణికిపోతు భాషలుమాట్లాడుతూఉంటారు. జనులు ఇవన్నీ పరిశుద్దాత్మనుపొందుటకు గుర్తులని అంటారు. కాని, దయ్యము పడితే ఏమౌతుందో ఆలోచించండి! ఇది నిజముగా పరిశుద్దాత్మ పనియేనా ఖచ్చితముగా కాదు. 
 

సాతానుడు చాలామంది క్రైస్తవులను మోసగించుచున్నాడు.

నేడు క్రైస్తవులు సాతానుకుయిష్టమైన్తి జీవితమును జీవించుచున్నారు.ఒక శక్తిగల పరిచారకునితో హస్తనిక్షేపణచేసి ప్రార్ధనద్వారా పరిశుద్దాత్మను పొందాలి అంటూ సాతానుడు భ్రమ పుట్టిస్తూ ఉంటాడు. చాలామంది ఇటువంటి ఆచారపూరితమైన సిద్దాంతమును నమ్ముతారు. ఎక్కువగా ప్రార్ధన చేయడంవలన పరిశుద్దాత్మను పొందవచ్చునను ఆలోచనతో మనుష్యులను నింపుతాడు. ఇటువంటి నమ్మకము కలిగిన ప్రజలను రెండంతలుగా మూడంతలుగా చేయవలెనని సాతానుడు యోచిస్తాడు. కాబట్టి చాలామందికి నీటిమూలముగాను ఆత్మమూలముగాను క్రొత్తగా జన్మించుటకు గూర్చిన సువార్త తెలియదు తెలుసుకోవాలని అనుకోరు.ఇలాంటి ఆలోచనను మనలోకలిగించు సాతానుతో మనము పోరాడాలి. మరియు సత్యసువార్తను తెలుసుకొని నమ్మాలి.నీటిమూలముగాను ఆత్మమూలముగాను క్రొత్తగా జన్మించుటవలన పరిశుద్దాత్మ మనలో నివసిస్తాడు అనే సత్యాన్ని మనము నమ్మాలి.
 

పరిశుద్దాత్మ మనలో నివసించుటను గూర్చి క్రైస్తవులో వున్న దురభిప్రాయము

ముందుగా కరిస్మాటిక్‌వారితో సంబంధంకలిగియున్నవారు ఎ క్కువ అపార్ధం చేసుకున్నారు. వారి హృదయములో పాపమునుంచుకొని పరిశుద్దాత్మను పొందాలని ఆశిస్తారు. వారు పొరపాటుగా ఈ విషయాన్ని నమ్ముతారు. అయితే నీటిమూలముగాను ఆత్మమూలముగాను క్రొత్తగా జన్మించలేనివాడు పరిశుద్దాత్మను పొందలేడు.
రెండవదిగా పరిశుద్దాత్మనుపొందుటకు వారిలోని అహంకారము ఆటంకమనివారు నమ్ముతారు. అయితే ఎవరికి గర్వం లేదో వారు పరిశుద్దాత్మను పొందవచ్చుననా దీని అర్ధం. అసలు ఈ లోకంలో కొంచెమైనా అహంకారంలేని మనిషి ఎవడైనా ఉన్నాడా! దేవుడు క్షమించలేని అహంకారి ఎవరంటే తనస్వంత ఆలోచనను జీవవాక్యమునకు జతచేయువాడు. నీటిమూలముగాను , ఆత్మమూలముగాను క్రొత్తగా జన్మించుటను గూర్చిన సత్యసువార్తను అలక్ష్యపెట్టి అనేకులు వారి వారి స్వంత మార్గములో పరిశుద్దాత్మను పొందాలని ప్రయత్నిస్తారు. అయితే నీటిమూలముగాను ఆత్మమూలముగాను క్రొత్తగా జన్మించువారిలో మాత్రమే పరిశుద్దాత్మ నివసిస్తాడు.
మూడవదిగా కొంతమంది తమ పాపమును నిర్భయముగా దాపరికం లేకుండా దేవునియెదుట ఒప్పుకొనుటవలనమాత్రమే పరిశుద్దాత్మ వారిమీదకి వస్తుందని అనుకుంటారు. కాబట్టి వారు పాపక్షమాపణకొరకు గోజాడి అడుగుతారు. కాని కేవలము పాపపు ఒప్పుకోలువలన పరిశుద్దాత్మ మనలో నివసించడు. ఎందుకనగా మనము పాపమును ఒప్పుకొనుచున్నాముగాని దానిని విడిచిపెట్టుటలేదు.చాలామంది క్రైస్తవులు తమపాపమును విడిచిపెట్టకుండానే,పరిశుద్దాత్మ వారిలో నివసించాలని పరిశుద్దాత్మ నివాసముకావాలని ఎంతోఆశతో కోరుకుంటారు ఈవిధమైన మూఢనమ్మకము కలవారు దయ్యము పట్టినవారవుతారు.
నాలుగవదిగా దేవుని దీవెనకొరకు శ్రద్దగా ప్రార్దిస్తే మనలో పరిశుద్దాత్మ నివసిస్తాడని కొందరు అనుకొంటారు. అయితే యాచించటం వలన పరిశుద్దాత్మను పొందలేము. ఇది పొరపాటు ఆలోచన.
ఐదవదిగా కొన్ని ఆత్మీయశక్తులుకలిగియుండుటయే మనలో పరిశుద్దాత్మ నివసించుటకు గుర్తు అని కొందరు అనుకుంటారు. వారు భాషలు మాట్లాడుట, పరిశుద్దాత్మ మనలో నివసించుటకు సాధారణముగా సాక్ష్యముగా భావిస్తారు. యేసు నామములో కేవలం దయ్యమును వెళ్ళగొట్టడం లేక భాషలు మాట్లాడడంవలన పరిశుద్దాత్మ మనలో నివసింపడు. పాపము సాతానుకు సంబంధించినది. ఎవడైన తమ హృదయములో పాపముంచుకొని తనకు ఏవోకొన్ని వింతశక్తులుండుట వలన పరిశుద్దాత్మను పొందాలి అని నిజముగా చెప్పగలడా, ఇది దయ్యము చేయు పోకిరిపని.
యేసుక్రీస్తుప్రభువు మనకు అనుగ్రహించిన సత్యసువార్తయైన నీటిమూలముగాను ఆత్మమూలముగాను క్రొత్తగా జన్మించుట ద్వారానే మనము పరిశుద్దాత్మను పొందగలము. పాపక్షమాపణను, పరిశుద్దాత్మను వేరే పద్దతులలో పొందాలి అనుకుంటే నీవు తప్పు మార్గములోనికి నడిపింపబడుచున్నావు. నీవు పొరపాటు నమ్మకములోనుండి విడుదల పొంది ఆత్మీయ ప్రామాణికమైన ఆలోచనలోనికినిజమైన విశ్వాసమునకు నడిపింపబడాలి అని ఆశిస్తున్నాను.
నేడు అనేకమంది క్రైస్తవులను దయ్యములు ఆవరించియున్నాయి అనుటలో అతిశయోక్తి లేదు. ప్రపంచములోని క్రైస్తవులందరు దయ్యము శక్తిక్రిందఉండి పీడించబడుచున్నారు. ఎందుకంటే వారు ఉజ్జీవ సభలద్వారాను, లేక హస్తనిక్షేపణద్వారాను పరిశుద్దాత్మను పొందాలి అని ఆశిస్తున్నారు.
ఎవరైతే పరిశుద్దాత్మశక్తిని పొందారో వారి దగ్గరకు వెళ్ళాలి అని కోరుకుంటారు. వారిచేత హస్తనిక్షేపణ చేయించుకొని పరిశుద్దాత్మను పొందాలనే ఆశతో వెళతారు. అయితే వారు ఎన్ని ప్రార్ధనలుచేసినా వారు ఎంతగా దేవునినమ్మినా ఆసక్తితో ప్రార్దించినను దేవుడుతప్ప మరెవరు పరిశుద్దాత్మ నివాసముయివ్వలేరు.
నేడు అనేకులు గారడీవాడైనసీమోనువలె పరిశుద్దాత్మను కొనాలి అని ప్రయత్నిస్తున్నారు. వారు ఈ లోక బోధలచేత పరిశుద్దాత్మను పొందాలి అని అనుకుంటున్నారు కాని,సత్యసువార్తవలనకాదు. చాలామంది క్రైస్తవులు ఈ ఆలోచనలో స్ధిరపడిపోయారు. ఎవరిలో అయితే పరిశుద్దాత్మకు అవసరమైన అర్హతలు ఉన్నవో వారిలోమాత్రమే పరిశుద్దాత్మ నివసిస్తాడు. నీటిమూలముగా ఆత్మమూలముగా క్రొత్తగా జన్మించుట మాత్రమే పరిశుద్దాత్మను పొందుటకు అవసరమైన సూత్రము. (అ.పో.కా.2:38) ఇది సత్యానికి జవాబు మాత్రమే. హస్తనిక్షేపణద్వారా పరిశుద్దాత్మను పొందడం కొంతవరకు మాత్రమే జరిగినది. ఆ తరువాత నీటిమూలముగా ఆత్మమూలముగానుక్రొత్తగా జన్మించిన వారి మీదికిపరిశుద్దాత్మ పంపబడినది. కాబట్టి నీటిమూలముగాను ఆత్మమూలముగాను క్రొత్తగా జన్మించుట అనే దేవుని సువార్తతప్ప పరిశుద్థాత్మను పొందుటకు అవలంబించే మార్గము ఏదైనా అది సాతాను మార్గమే. దయ్యము సాతాను సేవకుడని దేవుడు చెప్పుచున్నాడు. జనులు దేవుని నమ్మినంత మాత్రాన పాపము క్షమింపబడకుండునట్లు సాతానుడు ఎంతో తెలివిగా పని జరిగించాడు. ‘‘మీరు దేవుని నమ్మి పెద్దచేత హస్తనిక్షేపణ చేయించుకొన్నట్లయితే నేను మీకు పరిశుద్దాత్మను ఇస్తాను’’, అని సాతాను మనుష్యులతో అంటున్నాడు.ఈ విధమైన మోసముతో సాతానుడు ప్రపంచములో తన ఉనికిని సరిహద్దులకు వ్యాపింపచేయుచున్నాడు.
ఇప్పుడు దయ్యము పట్టినవారి లక్షణములు ఎలా యుంటాయో మనము చూద్దాం. జ్యోతిష్యులలోను కర్ణపిశాచి పట్టినవారిలో పూనకం పట్టినవారిలో నిశ్చేష్టులవడం, మూర్చ, కళ్ళు తిరిగిపడిపోవటం వంటి లక్షణములను దయ్యము పట్టినవారిలో చూస్తుంటాము. అప్పుడు వారి నాలుకలు సడలింపబడి వారి మనస్సుకు వ్యతిరేకముగా అన్య భాషలో మాట్లాడతారు. 
గారడీ చేయువారు,క్రైస్తవులు,హస్త విక్షేపణద్వారా దయ్యము శక్తులనుపొందిన వీరు యిటువంటి అనుభవముకు వారసులు. కరిస్మాటిక్‌ వారిలోఉజ్జీవింప చేసెడివాడు, ‘‘అగ్నితో, అగ్నితో, అగ్నితో’’,అని మైక్‌లో అరవగానే జన సమూహమంత ఆవేశముతో అదుపు తప్పిపోతారు.అతనిచేత హస్తనిక్షేపణద్వారా పరిశుద్దాత్మను పొందాలి అనుకొనేవారు ముందుకువచ్చి నిలబడతారు. అప్పుడు వారంత ఆపలేనంతగా సభలో ఒణుకుతో మూర్ఛలు, భాషలతో మాట్లాడుట వంటివి చేస్తారు. ఇవన్ని పరిశుద్దాత్మ వలె నటించు సాతానుని క్రియలు.
మాంత్రికుని చేత ఆవరింపబడిన దురాత్మలతో నిండిన మనుష్యులు, హస్తనిక్షేపణద్వారా దయ్యము పట్టిన మనుష్యులు, ఒకే రకముగా యుంటారు.ఇన్ని సాక్ష్యములను ఎరిగినప్పటికీ మనుష్యులుపరిశుద్దాత్మను పొందుటను గూర్చి అపార్ధము చేసుకుంటూనే యున్నారు. ఇటువంటి క్రైస్తవులు తీవ్ర అయోమయంలో పడుతున్నారు. ఎందుకంటే పైన చెప్పబడినవన్ని వారు అనుభవించుటను బట్టి పరిశుద్దాత్మను పొందాము అని అనుకుంటారు.
 

సాతానుడు జ్యోతిష్యులవలె క్రైస్తవుల ద్వారా నటిస్తాడు.

దయ్యములు పట్టిన మనుష్యులచేత సాతానుడు ప్రవచన ప్రార్ధనలు చేయిస్తాడు. వారు ఈ విధముగా ప్రవచిస్తారు. ‘‘నీవు గొప్ప నాయకుడవౌతావు. నీ యింటిలో అనేకులు ఆశ్రయము పొందుతారు. భవిష్యత్తులో దేవుడు నిన్ను మంచి నమ్మకముగల సేవకునిగా నిలబెడతాడు’’, ‘‘ఇంక దేవునికి ప్రియమైన సేవకుడవౌతావు’’, అని వారింక మీ మాటపైన నమ్మకముంచాలి అని జీవితాంతము సాతానుకి దాసులుగాయుండాలి అని ఈ విధముగా ప్రవచించేట్లు చేస్తాడు.
జ్యోతిష్యులు మనుష్యుల భవిష్యత్తును గూర్చి ఇలా ప్రవచిస్తారు. ‘‘నీకు నీటి గండం వుంది’’ ‘‘నీవు చాలా డబ్బు సంపాదిస్తావు’’, ‘‘తూర్పు నుండి ఒకడు వచ్చి సహాయపడతాడు’’, అని అంటారు. అబద్ద ప్రవచనము చేయుటయే దయ్యము పట్టిన వారి మొదటి లక్షణము. తరువాత వారికే అర్దము కాని భాషలో వారు మాట్లాడుతూ ఒణుకుతూ వుండి మతి స్థిమితము లేని వారిలా మాట్లాడతారు. ఎప్పుడైన మాంత్రికుడుగాని, జ్యోతిష్యుడు గాని వినయముగా మాట్లాడతారు.
అయితే నిజముగా పరిశుద్దాత్మను పొందినవారు, యేసుప్రభువు తన బాప్తిస్మము మరియు సిలువ మరణముద్వారా సమస్త మానవాళి పాపములకు విమోచన కలుగచేశాడని అది బైబిల్‌ సత్యమనిమ్ముతూ అనేకులను ఆమార్గములోనికి నడిపిస్తారు. వారు నీతి మార్గములో నడుచుటకు ప్రయత్నిస్తారు. ఎంతో వినయముగా, శాంతముగా నమ్రతతో అందరితోను దేవుని ప్రేమతో మాట్లాడుతారు. 
దేవునికి యిష్టమైన మార్గములో నడుస్తారు. కనుక దేవుడు వారి హృదయము లోకము వైపు వెనుతిరుగకుండ పరిశుద్దాత్మలోనికి వారిని నడిపిస్తారు.
పాపక్షమాపణ పొందిన నీతిమంతులకు, దురాత్మ వలన వ్యక్తిత్వము కోల్పోయిన వారికి వ్యత్యాసము స్పష్టముగా కనబడుతుంది. పాప క్షమాపణ పొంది, పరిశుద్దాత్మను పొందిన వారికి నిజమైన వ్యక్తిత్వము తిరిగి వస్తుంది. ఇతరులు బాధతో యున్నప్పుడు నీతిమంతులు వారిని చూచి ఎంతో చింతిస్తారు. వారిని వారు త్యాగము చేసుకొని అలాంటివారి విమోచన కొరకు ప్రార్ధన చేస్తారు. ఇంకొక వైపు చూస్తే దయ్యము పట్టినవారిని సాతానుడు తన ఆధీనములోనికి తీసుకొని వారిని తన చిత్తమునకు బానిసలుగా చేస్తాడు. ఎందుకంటే వారు బాషలు మాట్లాడుట,ఒణుకుట ఇవన్ని పరిశుద్దాత్మ వరము అని భావిస్తారు. కాని ఏమాత్రము ఇవి పరిశుద్దాత్మ వరములు కావు.
పరిచర్యచేయు అనేకులు వారుచేయుఅద్భుతములు,ఆశ్చర్యకార్యములు భాషలుమాట్లాడుట, ప్రవచించుటవంటి శక్తులు కలిగియుండుటవలన గర్వపడుచున్నారు. అయితే వారిహృదయం పాపములో యుండుట దయ్యము పట్టిన వారు అనుటకు సాక్ష్యముగా యున్నది. కాబట్టి వారిలో పరిశుద్దాత్మకు బదులు దురాత్మలు నివసిస్తున్నవి. సాతానుడు మోసగాడు గనుక వాడు చేసిన అద్బుతములన్ని కొంతసేపు మాత్రమే పనిచేసి మళ్ళీ తిరగబడుతున్నాయి.
పరిశుద్దాత్మ చేయు పనులకు,దురాత్మ చేయు పనులకు స్పష్టమైన వ్యత్యాసముంది. పరిశుద్దాత్మను పొందినవారు మొదటిలో ఎటువంటి దీవెనను,వరము పొందకపోయినప్పటికీ సమయము గడుచుకొలది ఉదయమునఎదుగుచున్నసూర్యునిలా దేవునిశక్తి నీతిమంతుల హృదయాలలో ఎదుగుచుండును.
 

దయ్యము పట్టిన క్రైస్తవులు
 
పరిశుదాత్మపొందవలెనని అనుకున్నప్పటికి అనేకులకెందుకు దయ్యము పడుతుంది?
ఎందుకనగా వారు పరిశుద్దాత్మను అబద్ద ప్రవక్తల హస్తనిక్షేపణద్వారా పొందాలి అనిఆశించుటవలన వీరు దయ్యములను పొందుచున్నారు
 
చాలామంది క్రీస్తు విశ్వాసుల యొక్క శరీరాలు, ఆత్మ కృశించిపోయియుండుట మనము చూస్తుంటాము. ఎందుకంటే వారు అబద్ద ప్రవక్తలచేత హస్తనిక్షేపణ పొందుటవలన వారికి దేవునిగూర్చిన జ్ఞానము అక్కరలేదు. ఎందుకంటే వారు బైబిల్‌లోనిసత్యమును నమ్మరు. వారు తీరిక లేకుండ తమ శక్తులను ఉపయోగిస్తూ ఉంటారు. దానివలన అనేకులు సాతాను సేవకులు అవుతున్నారని ఎరుగకయే ఇలా చేస్తున్నారు. వారు ఎందుకంత వాడుతుంటారు?.ఎందుకంటే వారి శక్తులు వాడకపోతే అవి కొంతకాలానికి నశించిపోతాయి. అందువలన క్షణము తీరిక లేకుండ చేస్తూనే యుంటారు.
వారు ఎడతెరిపిలేకుండ యేసునామములో ప్రార్ధనలు చేస్తూ, అద్భుతములను సాధన చేస్తూనే యుంటారు. ‘‘నేను బోధించే వరము పొందాను’’,అని చెప్పేవారు తమ వరమును ఎప్పుడు సాధన చేస్తూనేయుండాలి. ఎందుకంటే అలా చేయకపోతే వారు బూటకపుఆనందము త్వరగా మాయమైపోతుంది. దురాత్మవరములైన భాషలు మాట్లాడుట, స్వస్థత ప్రవచనములవంటి వాటికి ఈ మనుష్యులు నమ్మకముగా యుండకపోయినట్లయితే వారు అనారోగ్యము పాలౌతారు. మాంత్రికుడు తనపనిమానేస్తే అనారోగ్యము పాలైనట్లు కాబట్టి వారు ఈ సాతాను వరమును మన:పూర్వకముగా సాధన చేయాలి లేకపోతే బాధచేత విడువబడినవారైపోతారు.
ఒకప్పుడు మన:పూర్వకముగా యేసునందు విశ్వాసియైన ఒకని ఎరుగుదును. అతడు అనేక శక్తులు గలవాడు. ఆయన ప్రజలను పరిశుద్దాత్మ పొందుటనుగూర్చి ప్రోత్సహిస్తూ వారిపై హస్తనిక్షేపణచేసి స్వస్థతలు, దయ్యములను వెళ్ళగొట్టుట, భాషలు మాట్లాడుటవంటి గౌరవములేనిఇతరులకు అసూయపరుడైన వ్యక్తిగా మారిపోయాడు. వేలకొలదిగా ప్రజలు అతనిని అనుసరించేవారు. అయితే కొంతకాలమునకు ఆ వ్యక్తి యేసుక్రీస్తు దేవుడు కాదని ఆయన దేవుని కుమారుడు కాదని బోధించుట మొదలుపెట్టాడు. అతడు క్రీస్తును శపిస్తూ నేనే దేవుడనంటూ ప్రచారం మొదలు పెట్టాడు. చివరకు తన హృదయములోను ప్రజల హృదయములోను యేసును చంపేశాడు.
ఇటువంటి మనుష్యులు సాతాను అడుగుజాలలో నడుచువారు. గనుక నీటియొక్కయు పరిశుద్దాత్మ యొక్కయు సువార్తను తిరస్కరించెదరు, తప్పుడు నమ్మకము కలిగియుంటారు. ఎందుకంటే తాముకూడ అపోస్తులులమంటూ తమకుకూడ ఆ శక్తులన్నీ కలవని భ్రమపడతారు. వారి మీదికి పరిశుద్దాత్మ వచ్చిందని బలమైన నమ్మకం కలిగియుంటారు.
పశ్చాత్తాపముతో ప్రార్ధన చేయడం వలన పరిశుద్దాత్మమనలో నివసించునని నమ్ముతారు. అయితే ఇది దేవుని వాక్కువలన నెరవేరే క్రియకాదు. అంతే కాకుండా ఒక విశ్వాసి భాషలు మాట్లాడినా ప్రవచించినా పరిశుద్దాత్మను పొందాడు అనుటకు నిదర్శనమని నమ్ముతారు. అనేక మంది పరిశుద్దాత్మ మనలో నివసించుటను గూర్చి నిజమైన అర్ఞతనెరుగరు కనుక అబద్ద ప్రవక్త చెప్పే సువార్తనే విస్వసిస్తారు. సాతానుడు క్రైస్తవులలోదురాత్మను పంపి వారిపై అధికారము చేయుచున్నాడు. ఈ క్రియలన్ని సాతాను యొక్క ఉచ్చులు.
లెక్కలేనంతమంది అబద్ద ప్రవక్తల బోధద్వారా దయ్యము పట్టినవారై పోతున్నారు.సగటు విశ్వాసులు సాధారణ మత జీవితమును గడుపుతారు. కాని దయ్యము పట్టినవారు తమ దురాత్మలను ఉపయోగించి అసాధారణ జీవితాన్ని జీవిస్తారు. వారు చూపించే అర్హతలు ఏమిటి?.వారు స్వస్థతలు చేయగలరు, బాషలు మాట్లాడగలరు. మరియు ఇతరులకు ‘‘హస్తనిక్షేపణ’’ద్వారా దయ్యము పట్టించగలరు. మనము హస్తనిక్షేణ’’, అంటే ఏదో ఒకటి తనలో యున్నది బయటకు పంపుట అనే అర్ధము తెలుసుకోవాలి. ఈ విధముగా దయ్యము రాజ్యము అధికముగా వ్యాప్తి చెందుచున్నది.
 
 
మనుష్యుని అత్యాశద్వారా దురాత్మలు పనిచేస్తాయి

ప్రధాన భాగములోగల సీమోనువంటి ప్రజలలో సాతానుడు పనిచేస్తాడు. నేడు అనేకమంది సాతానుచే మోసగింపబడి పశ్చాత్తాప ప్రార్ధన ద్వారా ఉపవాసముండుటవలన. హస్తనిక్షేపణవలన, పరిశుద్దాత్మ తమలో నివసిస్తుందని నమ్ముతారు. వారు సత్యసువార్తనునిర్లక్ష్యపెట్టి దయ్యము పట్టినవారై శపితమైనజీవితమును యింకా జీవిస్తూ యున్నారు.
ఈ హస్త నిక్షేపణ అనబడే మద్యవర్తిద్వారా పరిశుద్దాత్మను పొందాలి అనుకొనే క్రైస్తవులను సాతాను క్రియలకు అనుకూలస్తులుగా చేస్తుందని ఎరిగి దూరముగాయుండాలి. సీమోనువంటి అబద్దప్రవక్తలు యేసును నమ్మినప్పటికి వారిహృదయములో పాపముంచుకొన్నవారు, దయ్యము పట్టినవారు. వీరు దురాత్మ వలన ఆశ్చర్యకార్యములు చేస్తారు. సాతానుడు తన దాసులచేత హస్త నిక్షేపణ చేయించి వారిలోనికి దురాత్మలను పంపి ఈ లోకములో తన రాజ్యమును కట్టుచున్నది.ఈరోజులలో ‘‘పెంతెకోస్తు, కరిస్మాటిక్‌’’ సంఘాలు ప్రపంచమంతట సామాన్యక్రైస్తవ మతాశాఖ, సంఘాలుగా అధికారికముగా గుర్తింపబడినవి.
19వ శతాబ్దపు తదుపరి అర్ధభాగములో ప్రపంచమంతా భౌతికముగా అభివృద్దిచెందిన కారణముగా వ్యయం కూడా అధికముగా యుండినది. అట్టి సమయములో పాశ్చాత్య క్రైస్తవ్యము నీరసించిపోవుటకుప్రారంభించినది. అయితే అదేసమయములో క్రీస్తుకుదగ్గరవ్వాలని కోరికగల క్రైస్తవులు సంఘాలలో జీవము లేకపోవుట చూచి అసంతృప్తి చెందారు. కొంతమంది తమలో ఆత్మీయ ఎదుగుదల లోపించిన కారణముగా వారి విశ్వాసం క్రీస్తును ప్రేమించేట్లు చేయలేక పోయింది. కొంతమంది అయితే నిరాశకులోనై క్రీస్తుప్రేమకు దూరమైనారు. 2పెంతెకొస్తు కరిస్మాటిక్‌ అనే ఉద్యమం ఆ రోజులలో ఇలాంటి పరిస్ధితులో వేలాగ్ని తొడిగింది.
ఈ ఉద్యమములో చొరవ గలిగిన వారు ప్రత్యక్షముగా గొప్ప అనుభవము గలిగియుండాలి అని కోరుకొన్నారు.అనగా ఆరంభంలో పెంతుకొస్తు వారు ఆశ్చర్యపరుచు భాషలతో మాట్లాడుట ఆశ్చర్యకార్యములు, అద్భుతములు చేయుట అనే వాటియందు ఆసక్తి కనపర్చారు. వారి ఆసక్తి మూలముగా బైబిల్ సంబంధముగా ఏ ఆధారము లేని బోధలు, కార్యములద్వారా తమనుతాము పరిశుద్దాత్మ అనబడే అధికారం క్రిందికి లోబరుచుకున్నారు.
అభివృద్ది చెందుచున్న ప్రపంచంలో వారి వారి అవసరత కారణముగా యీ ఉద్యమము బాగా అభివృద్ది చెందినది. వారి నాయకులు కూడా అభివృద్ధి చెందుతున్న ప్రపంచములోని క్రైస్తవులను, మతపరముగానైన ఆసక్తితో పాటు ద్రవ్యము,ఆరోగ్య రక్షణగ దీవెనతో ఆకర్షింపగలిగారు. అయితే క్రొత్త యుగ ఉద్యమం అనబడే ఒకే సిద్దాంతము బోధతో క్రొత్త పెంతుకొస్తుత్వంలాగా మరియొక [2]ఉద్యమం దీని నుండి వేరైపోయినట్లు సమాచారం. 
 
[2] 20 శతాబ్దం పూర్వార్ధంలో పశ్చిమ దేశాలలో 
సాధనచేస్తు సముదాయాభివృద్దిలోనూ, సామూహిక వినియోగంలో క్రైస్తవం క్షీణించడం మొదలైంది. అదేసమయంలో ఈకారణంగా తమ సంఘాలోని క్షీణత యేసుకుదగ్గరవ్వానే మార్గంకొరకుఅన్వేషించే చాలామంది క్రైస్తవుఅసంతృప్తికి లోనైనారు. ఇతయి ఆధ్యాత్మిక ఎదుగుదలోని ఆలస్యానికి, లేక అసు లేకపోవడానికి బాధపడ్డారు.అయినావారు తమవిశ్వాసాన్ని యేసుయెడ వ్యక్తిగతముగా మచుకోవడంలో భంగపడ్డారు.. ఈ పరిస్ధితులో పెంతెకొస్తు కృపావరాు అనే ఉద్యమం తలెత్తింది. ఈ ఉద్యమంలో వారు ఆసక్తికరమైన అనుభవాలు ఆచారాలలో అనగా అన్యభాషలో మాట్లాడటం, ప్రవచిచడం, ఆశ్చర్యకార్యాలు చేయడం, అద్భుతాలు చేయడం మొదటి పెంతెకొస్తునాడు జరిగిన సంఘటనను అభినందించడం మొదలైనవాటిలోఆసక్తినిచూపారు. వారి పరిశుద్ధాత్మలో ఆధిపత్యం అన్తేదానికి తమను తాము అప్పగించుకొన్నారు. ఖచ్చితంగా చెప్పుకుంటే వారి అనేకబోధలలో,అలవాట్లు బైబిల్ ఆధారమైనవి కావు. అభివృద్ది చెందుతున్న ప్రపంచంలో వారి అవసరతలనే సందర్భంలో ఈ వుద్యమం ఆశ్చర్యకరంగా అభివృద్ది చెందింది. వారి నాయకులు అభివృద్ది చెందుతున్న క్రైస్తవుల ఆస్తి, ఆరోగ్యంతోబాటు వారికున్న మతాసక్తిని ఆకర్షించారు. ఈ ఉద్యమంలోనుండి వేరైన ఒకఉద్యమం ‘‘నియోపెంతెకోస్తలిజమ్’’వంటివి అదేబోధను చేస్తూనే ఏజ్‌మూమెంట్‌ అనిపిలిచారు.

ఈ లోకము యొక్క అంతము సమీపముగా యున్నది. కడవరి దినములలోనైన మనము క్రొత్తగా జన్మించాలంటే సాతాను ఎలా పనిచేస్తుందో ఎరిగి వాని మాయోపాయములను ఎదిరించగలగాలి. 
మన పాపము నుండి ఒకసారే విముక్తి పొంది వాటిని విడిచి నీటిమూలముగానుఆత్మమూలముగాను క్రొత్తగా జన్మించి పరిశుద్దాత్మను పొందాలి. దేవునిఆత్మ మనలోనికి ఎలావస్తుందో రూఢిగా ఎరిగి ఆ సత్యజీవమునకు మరలుకోవాలి.
దేవుడుచెప్పిన విధముగా ‘‘నా జనులు జ్ఞానములేనివారై నశించుచున్నారు’’.(హోషెయ 4:6).ఈ రోజులలో చాలామంది సత్యమార్గమును అన్వేషించువారు వారియొక్క అజ్ఞానము, అమాయకత్వమునుబట్టి కరిస్మాటిక్‌వారునడిపించు తప్పు త్రోవలోనికి నడిపింపబడుచున్నారు. 
పెంతెకొస్తు కరిస్మాటిక్‌ సంఘములు ఎడారులలో స్థాపించినాగాని లోకులు అక్కడకూడ ఉంటారు అని జనులందరు అనుకుంటూ ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది?.కరిస్మాటిక్‌ వారు వారి అబద్దపుశకులద్వారా ఇతరులనుతికమకపెట్టి వారిపై చేతులుంచి దయ్యము పట్టినవారిగా నడిపించివారి సంఘములను వ్యాపింపచేయుచున్నారు.
వారిలో ఆసక్తికరమైన తలాంతు ఏమిటి అంటే ఒకసారి వారుచేతులుంచి దయ్యమును పట్టువారిగా చేస్తే ఆప్రజలు మతపూరితమైన జీవితము గడుపుటలో ఆసక్తిగలిగియుంటారు.
 మరియొక ఆసక్తికరమైన అంశము, కరిస్మాటిక్‌ వారు చాలా ధనమును విరాళముగా సంఘమునకు యిచ్చి మూర్ఖపు నమ్మకముగలిగిన వారిగా జీవిస్తున్నారు. చాలామంది క్రైస్తవులుకూడ దురాత్మశక్తివలనైనసువార్తపరిచర్యయందు ఆసక్తిచూపుచు తామునరకమునకు పాత్రులమగుచున్నాము అనుసంగతి మరచియున్నారు. దురాత్మ శక్తిని తమ రక్షణకు సాక్ష్యముగా మన:పూర్వకముగా విశ్వసించువీరు ఏ మాత్రము అనుమానము లేకుండా పరలోకము కొరకు ఎదురుచూస్తున్నారు.అయితే వారు పాపభరితమైన హృదయంకలిగి నరకమునకు పాత్రులుగా చేయబడతారు.
 వారిని ‘‘నీవు యేసుని నమ్మినప్పటికి పాపములో జీవిస్తున్నావా’’అని అడిగితే వారు పాపము కలిగియుండుట మానవలక్షణము అని బుకాయిస్తారు. ఒక మానవుడు క్రీస్తుని నమ్మినప్పటికి పాపములేకుండట అసాధ్యమని వారు తలంచుదురు. వారిలో పాపము ఉన్నప్పటికీ మేము పరలోకమునకు వారసులమని వారుఅనుకుంటారు.ఎందుకంటే అబద్దపు శక్తులు కలిగి యుండుటయుదేవుని నమ్ముచున్నాము అని సాక్ష్యమిచ్చుట వారికి సులభముగా యున్నది.
ఎంత అర్ధరహితమైన ఆశయిది. వారు ఈ విధముగా స్ధిరనమ్మకము గలిగి యుండుటకు కారణము వారికి అసాధారణ శక్తులు కలిగియుండుట,భాషలు మాట్లాడుట, దర్శనములు చూచుట,స్వస్థతలు చేయుటవంటి పరిశుద్దాత్మశక్తికి నిదర్శనమని గట్టిగా నమ్ముతారు. అందువలన వారు విమోచన పొందాము అని పరిశుద్దాత్మనుపొందాము అని నిర్భయముగా చెప్పుదురు.
వీరికి రక్షణను గూర్చిన సరియైన అవగాహన లేనందున వారికి కంటికి కనబడే అద్బుతము జరుగకపోతే తాము రక్షణపొందామని నమ్మరు. కాబట్టి వీరు ఈ దృశ్యమైన శక్తులు పొందాలని ఎంతో కష్టపడి చివరకు సాతాను ఉచ్చులో చిక్కుపడిపోతారు. వీరు దేవుని జవాబును సత్యసువార్తయందు వెదకరు కనుక వీరు పరిశుద్దాత్మకు బదులుగా దురాత్మలను పొందుచున్నారు.
 దురాత్మ వారిచెవులలో ‘‘నీవు పాపివి గదా, నీవు పాపము చేయలేదా’’ అనిచెప్పుచూ వారిని తమనుతామే అంతముచేసుకొను పరిస్థితికితెస్తుంది. ఈ మధ్య పాపక్షమాపణపొంది పరిశుద్దాత్మపొందినవానిని నేనెరుగుదును. అతడు మారు మనస్సు పొందకమునుపు మూర్ఖమైన నమ్మకముకలిగి జీవిస్తూ, భాషలు మాట్లాడుచు అశ్చర్యక్రియలు చేసెడివాడు.ఎంతో పశ్చాత్తాపముతో పాపమును ఒప్పుకొని రాత్రంతా ప్రార్ధనచేసినప్పటికి అతని పాపములు అతనిని వేధించేవి. సాతానుడు మెల్లగా ‘‘నీవు పాపివి, నీవు బ్రతుకకూడదు’’ అని అంటుండగా ఆ వేధనను భరించలేక మనసులోనే పాపమును ఒప్పుకొంటూఉండేవాడు. నీటిమూలముగాను ఆత్మమూలముగాను క్రొత్తగా జన్మించేంతవరకు అతనికి విడుదల కలుగలేదు.
 కాబట్టి నీవుకూడా నీటిమూలముగాను ఆత్మమూలముగాను క్రొత్తగా జన్మించకపోతే సాతానునికి బలికావలసియుంటుంది. పాపక్షమాపణ పొందనివారు ఎవరైన సాతానుని ఎదిరించగలరా?.సత్యసువార్తను హత్తుకొననివారు సాతాను బంధకములలో చిక్కుకుంటారు. దేవునిసువార్త అయిన నీటివలన ఆత్మవలన క్రొత్తగా జన్మించుట సాతానుని పారద్రోలుటకు అత్యవసరము. కాబట్టి యేసుక్రీస్తును నమ్ము ప్రతివారు నీటిమూలముగాను ఆత్మమూలముగానుక్రొత్తగా జన్మించాలి. మరియు ప్రపంచములోని ప్రజలందరికి చాటి చెప్పాలి. ఇది వినుచున్న నీవు దీనికి లోబడి దీనిని విశ్వసించాలి.
 

చట్టబద్దతలేని మర్మము ఇప్పటికే లోకములో పనిచేయుచున్నది.

ప్రపంచము నేడు దయ్యపుపనులతో నిండియున్నది. ప్రజలకు పరిశుద్దాత్మ పొందుటకు అవసరమైన సువార్తను అందించాలి. అంటే ముందుగా పరిశుద్దాత్మను పొందుటను గూర్చిన అపార్ధమును పెల్లగించాలి.
మొదటిగా హస్తనిక్షేపణద్వారా పరిశుద్దాత్మ వస్తుందనే నమ్మకము తప్పు అనిస్పష్టముచేయాలి. హస్తనిక్షేపణవలన అన్యభాషలు మాట్లాడుట, దేవుని నుండి వాక్కును పొందటం వంటివి సాతాను క్రియలని తెలియజెప్పాలి. సత్యసువార్తను నమ్ముటద్వారానే మనము సాతానుని మాయోపాయమును జయించగలము. సత్యసువార్తను నమ్ముట వలనే మన పాపములకు క్షమాపణ కలుగుతుందని తెలియజెప్పాలి.
సత్యసువార్తచేత ‘‘అబద్దము’’ అయిన సాతానుని జయించాలి. సాతానుడు లోకములోని ప్రజలందరిని పాపపు దాస్యములో యుంచాడు. కాబట్టి తప్పు మార్గములోనికి నడిపింపబడవని సాతానుని మాయోపాయాలను తెలపాలి.
ఈ దినములలో పరిశుద్దాత్మను కొనదలచిన సమరయుడైన సీమోనువంటి పరిచారకులు సంఘమును పాలించుచున్నారు.వారు అంధులైయుండి అంధులను నడిపిస్తున్నారు. వారు సత్య సువార్తను ఎరుగక పాప భరితులైయున్నారు. కనుక ప్రజలను రక్షణ మార్గములో నడుపలేరు. వారి శిష్యులలో సాతానుడు నివసించునట్లు వారిపై హస్తనిక్షేపణచేసి సంపూర్ణరాత్రి ప్రార్ధనలు, పశ్చాత్తాప ప్రార్ధనలు వంటివి జరుపుదురు.వీరు నిజానికి దయ్యము పట్టినవారు.వీరిని దేవుని మార్గమునకు మళ్ళించాలిఅంటే ముందుగా వారికి నీటిమూలముగాను ఆత్మమూలముగాను క్రొత్తగా జన్మించుటను గూర్చిసువార్తను తెలియజెప్పి సాతానుపనులను నాశనము చేయాలి. సాతాను లక్షణము ప్రజలకు తెలియకపోతే వారు నిస్సహాయతలో నశించుట తప్ప మరి ఏమి చేయలేరు.
 కరిస్మాటిక్‌వారు చేయు క్రియలన్నీ వారు పాపములోవుండి చేసినట్లయితే అవి సాతాను పనులే. ‘‘నీవు నీ హృదయములో పాపము యుంచుకొని ఇవన్నీ చేసినట్లయితే నీతో యీ పనులు చేయుంచునది సాతానుడు. నీవు పాపివైయుండి పరిశుద్దాత్మ నీలో నివసించుచున్నదని భావిస్తే నీవు మోసగింపబడ్డావు’’.అని వారికి బోధించాలి.
 అపొస్తులులు విశ్వాసము వారిచేతుంచుటద్వారా పరిశుద్దాత్మనుపొందిన ప్రజలవిశ్వాసము (అపో.8) ఒకే రకమైనది. ఎందుకంటే వారు నీటిమూలముగాను ఆత్మమూలముగాను క్రొత్తగా జన్మించినవారు.కాని అపొస్తులుల విశ్వాసము,నేడు క్రైస్తవుల విశ్వాసములోచాలా వ్యత్యాసముంది.ఎందుకంటే నేటిక్రైస్తవులు కేవలము హస్తనిక్షేపణవలన మాత్రమేరక్షణ పొందగలుగుచున్నాము అని నమ్ముతున్నారు.
ఒక వ్యక్తిపైన చేతులుంచుటద్వారా ఆ వ్యక్తి పరిశుద్దాత్మను పొందగలడా?.పొందలేడు. బైబిల్‌ అది. 1:2లో ఏమి చెప్పుతుంది అంటే ‘‘దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను’’కాబట్టి పాపక్షమాపణపొంది పరిశుద్దాత్మను పొందాలి అంటే నీటిమూలముగాను ఆత్మమూలముగానైన సత్యసువార్తనునమ్మి క్రొత్తగాజన్మించినవారికి దేవుడుపరిశుద్దాత్మ అను వరమును ఇస్తాడు.
 మనము పరిశుద్దాత్మను పొందుటకు హస్తనిక్షేపణనుఅవలింబిస్తే దేవుడు మన పాపక్షమాపణకై నిర్ణయించిన నీటిమూలముగాను,ఆత్మమూలముగాను క్రొత్తగా జన్మించుటకు వ్యతిరేకించిన వారమౌతామని జ్ఞాపకముంచుకోవాలి.ఒక వ్యక్తిద్వారా మనకు పరిశుద్దాత్మ వస్తుంది అనడం దేవుని సవాలు చేయడమే. అటువంటి విశ్వాసము గలవారు సుళువుగా సాతాను వలలో చిక్కుకుంటారు. కాబట్టి ఇలా జరుగకుండా చూచుకోవాలి. 
మనము నీటిమూలముగాను ఆత్మమూలముగాను జన్మించినప్పుడే మన పాపములన్నీ క్షమింపబడ్డాయనుటకు పరిశుద్దాత్మ సాక్షి. ఎవరైతే ఈ సువార్తను నమ్ముతారో ఇక వారిహృదయంలో పాపముండదు. అంటే దాని అర్ధము అతడు పాపము చేయలేదని కాదు. కానీ ఆ సత్యసువార్త శక్తియందు నమ్మకముంచువాడు కనుక నీటిమూలముగాను ఆత్మమూలముగాను అయిన సువార్తతోపాటు పరిశుద్దాత్మ ద్వారా ఆ వ్యక్తిలో కూడా పాపము లేదను సాక్ష్యము చెప్పెను. దేవుని ఆత్మ లేకుండ ఒకడు క్రీస్తు నా రక్షకుడు అని చెప్పలేడు.
 దయ్యము పట్టినవారు ఈ సువార్తను ఎరుగరు. అంతేకాక ఈ విషయము గూర్చి తర్కించరు. వారు సత్యమును ఒప్పుకోలేరు. పరిశుద్దాత్మ హస్తనిక్షేపణద్వారానే మనలోనికి వస్తుందని వారు బుకాయిస్తారు. నేడు అనేక సంఘములలో జరుగు సాతాను క్రియలను తప్పుడు బోధను నీవు గుర్తెరగాలి.అందువలన నీటిమూలముగాను, ఆత్మమూలముగాను క్రొత్తగా జన్మించుటయందు నమ్మక ముంచి పరిశుద్దాత్మను పొందడం అత్యవసరమై వున్నది.