• All e-books and audiobooks on The New Life Mission website are free
  • Explore multilingual sermons in global languages
  • Two new revised editions in English have been released
  • Check out our website translated into 27 languages
Search

Sermons

అంశం 8: పరిశుద్ధాత్మ

[8-3] మీరువిశ్వశించినప్పుడు పరిశుద్దాత్మను పొందితిరా? (అ.పో.కా. 19:1-3)

(అ.పో.కా. 19:1-3)
‘‘అపొల్లో కొరింధిలో నున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పైప్రదేశములలో సంచిరించి ఎఫెసునకు వచ్చికొందరు శిష్యులను చూచిమీరు విశ్వసించినప్పుడు పరిశుద్దాత్మను పొందితిరా? అని వారి వారు పరిశుద్దాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి.అప్పుడతడు ఆలాగైతే మీరు దేనినిబట్టి బాప్తిస్మము పొందితిరని అడుగగావారు యోహానుబాప్తిస్మమునుబట్టియే అని చెప్పిరి’’
 
 
‘‘బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని యిప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది అని ఎందుకు బైబిల్ చెప్తుంది? 
యేసుక్రీస్తు యోహాను ద్వారా బాప్తిస్మముపొందుట వలనను సిలువపై తన యొక్క రక్తము కార్చుటద్వారానైన సుందరమైనసువార్తను నమ్మి లోకపాపములన్ని తుడిచి వేయబడినాయి అని విశ్వసించుటద్వారామనుష్యులు దేవునిరాజ్యమును స్వతంత్రించుకొందురు.

అపోస్తులుడైన పౌలు ఎటువంటి సువార్తను బోధించాడు? యేసు బాప్తిస్మము మరియు ఆయన రక్తము యొక్క సువార్తను బోధించాడు. అ.పో.కా.19:1లో ఈ విధముగా చెప్పబడినది. ‘‘అపోల్లో కొరింధిలో నున్నప్పుడు జరిగినదేమనగా పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెస్సునకు వచ్చికొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్దాత్మను పొందితిరా? అని వారినడిగెను’’. అయితే ఈ ప్రజలు యేసు బాప్తిస్మము యొక్క అర్ధమును విడిచి యేసును నమ్మిరి. పరిశుద్దాత్మను కలుగజేయు సత్యసువార్తను వీరు ఎరుగరు. అందువలనే ‘‘మీరు విశ్వసించినప్పుడు పరిశుద్దాత్మను పొందితిరా’’?అను ప్రశ్న ఎఫెస్సులోని శిష్యులకు క్రొత్తగా అనిపించింది.
అప్పటి వరకు అందరు ‘‘మీరు క్రీస్తును నమ్ముచున్నారా’’,అని అడుగుటయే విన్నారు గాని పౌలు అడిగిన ప్రశ్న వారి యొక్క విశ్వాసమును నూతన పరచుకొనిపరిశుద్దాత్మను పొందుటకు దారితీసినది. పౌలు తన పరిచర్యలో యేసు బాప్తిస్మమును ఆయన రక్తమును గూర్చిన సువార్తను బోధించుచుండెను. పౌలు పేతురు, యోహానులు యేసు బాప్తీస్మమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. మొదటగా పౌలు బాప్తిస్మమును గూర్చిన సాక్ష్యమిచ్చిరి. మొదటగా పౌలు, బాప్తిస్మమును గూర్చిన సాక్ష్యమును చూద్దాం.
(రోమా 6:2-3.గలతీ 3:27)
క్రీస్తులోనికి బాప్తీస్మము పొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు. రెండవదిగా పేతరు (1 పేతురు 3:21),‘‘దానికి సాదృశ్యమైన బాప్తీస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది; అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనసాక్షినిచ్చు ప్రత్యుత్తరమే’’. 
మూడవదిగా (1 యోహాను 5:5-8)‘‘యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు?,నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్ళతో మాత్రమేగాక నీళ్ళతోను రక్తముతోను వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు, నీళ్ళును, రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి యున్నారు’’.
సత్యసువార్తను సంపూర్తి చేయుటలో బాప్తిస్మమిచ్చు యోహాను ప్రాముఖ్యమైన పాత్రను పోషించాడు. బాప్తిస్మమిచ్చు యోహాను గూర్చి (మలాకీ 3:1-3)మరియు (మత్తయి 11:10-11)లో వ్రాయబడియున్నది. లేఖనములోని ప్రవచన నెరవేర్పుగా రాబోయే ఏలియానే ఈ బాప్తిస్మమిచ్చు యోహాను, ఈయన సమస్త మానవాళికి ప్రతినిధిగా యున్నాడు. పాతనిబంధన కాలములో పాప పరిహారార్ధ బలిగా బలిపశువుపై చేతులుంచటం ద్వారా మనుష్యుని పాపమును ఆ బలిపశువు పై రక్తమును చిందించుట వలన పరిహారించినది యుండును. అయితే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు తన బాప్తీస్మము మరియు సిలువ ద్వారా లోకపాపములను తన భుజములపై వేసుకొని పాపపరిహారార్ధ బలిగా చేయబడెను.
యేసుక్రీస్తు యోర్ధాను నదిలో యోహాను చేత లోకములోని సమస్త పాపములను తన బాప్తిస్మము ద్వారా తనపైన వేసుకొని సర్వమానవాళికి రక్షణను దయచేసెను.
మనుష్యుందరి పాపము విమోచన నిమిత్తమై దేవుడు తన ప్రణాళికలో రెండు ప్రాముఖ్యమైన పనులను నెరవేర్చెను. మొదటిగా కన్య మరియ ద్వారా యేసుక్రీస్తు ఈ లోకములో జన్మించుట, లోకములోని పాపములన్నిటిని తీసివేయుటకు యోహాను బాప్తిస్మము పొందుట మరియు సిలువవేయబడుట, రెండవదిగా బాప్తిస్మమిచ్చు యోహాను ఎలిజబెత్తు ద్వారా జన్మించెను. త్రియేక దేవుడు తన ప్రణాళికలో బాప్తిస్మమిచ్చు యోహానును, ఆరు నెలలు ముందుగా ఈ భూమి మీదకి పంపెను.
మత్తయి 11:10లో బాప్తిస్మమిచ్చు యోహాను గూర్చి యేసు ప్రభువు ఈ విధముగా సాక్ష్యమిచ్చాడు. ‘‘ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ ముందర నీ మార్గమును సిద్దపరచును. అని ఎవని గూర్చి వ్రాయబడెనో అతడే ఈ యోహాను’’, అంతేగాక బాప్తిస్మమిచ్చు యోహాను కూడా ‘‘ఇదిగో లోక పాపమును మోసుకొనిపోవు దేవుని గొఱ్ఱపిల్ల’’, (యోహాను 1:29)అని యేసును గూర్చి సాక్ష్యమిచ్చెను.
ఆయనకు బాప్తిస్మమిచ్చిన యెహాను గూర్చి బైబిల్‌ గ్రంధములో పలుచోట్ల వ్రాయబడియున్నది. బాప్తిస్మమిచ్చు యోహానును గూర్చి మనము అవగాహన కలిగియుండట మంచిది. యేసుక్రీస్తుకు ముందుగా ఈ లోకానికి యోహాను పంపబడెను. దేవుని ప్రణాళికలోని రక్షణ సువార్తను నెరవేర్చుటలో యోహాను పాత్రను పరిశుద్ద గ్రంధములో ఈ విధముగా చెప్పబడినది. లోకములోని పాపములను బాప్తిస్మమిచ్చు యోహానుచేత హస్తనిక్షేపణ ద్వారా యేసు అంగీకరించెను. అదే విధముగా ఆయనకు బాప్తిస్మమిచ్చిన యోహాను వాటిని ఆయన మీద మోపుట ద్వారా దేవుని చిత్తము నెరవేర్చెను.
యోహాను యేసునకు బాప్తిస్మమిచ్చినందువలన మనము ఆయనకు బాప్తిస్మమిచ్చుయోహాను అని పిలుస్తుంటాము. యేసుక్రీస్తు యోహాను చేత బాప్తిస్మము పొందెను. అనగా అర్ధం ఏమిటి? బాప్తిస్మము అనగా ‘‘కడగబడుట’’,ఆయన బాప్తిస్మం ద్వారా సమస్త మానవాళి పాపము ఆయన మీదకి మోపబడెను. తరువాత సిలువలో ఆయన చిందించిన రక్తముచేత కడుగబడెను. పాత నిబంధనలో బలి అర్పించు దానిపై హస్తనిక్షేపణ చేయుట ద్వారా తనలోని పాపమును ఏ విధముగా ఆ బలి పశువుపైకి పంపబడుతుందో అదే విధముగా యేసుక్రీస్తు బాప్తిస్మము పొందుట ద్వారా ఆయన మీదకి మన పాపములు పంపబడెను. బాప్తిస్మమునకు ఆత్మీయముగా ‘‘కడగబడుట’’ ‘‘భూస్థాపన చేయుట’’ ‘‘తీసివేయుట’’అను అర్ధములు గలవు. యోహాను చేత యేసు బాప్తీస్మము పొందుట జనులందరి పాప విమోచనకు ప్రతీక.
ఇశ్రాయేలీయుందరు వారి సంతవ్సర కాలములో చేసిన పాపములను పాపపరిహారార్ధ దినమున ప్రధాన యాజకునిపై హస్తనిక్షేపణ చేయుట ద్వారా బలిపశువు మీదికి ఆ పాపమును మోపెడివారు. పాత నిబంధనలోని ఈ త్యాగము యేసుక్రీస్తు యొక్క బాప్తిస్మము సిలువ మరణము వంటిదే. ఈ పాప పరిహార దినమును దేవుడే ఇశ్రాయేలీయు పాప విమోచన కొరకు నియమించెను. ఏడవ నెల పదియవ దినమున ప్రధాన యాజకుడు ఇశ్రాయేలీయుల అందరి పాపములను బలిపశువు పై హస్త నిక్షేపణ చేయుట ద్వారా జనులందరి పాప పరిహారము కొరకు చేసెడివారు. ఇది దేవుడు స్థాపించిన తాగ్యపూరిత ప్రక్రియ. బలిపశువుపై హస్తనిక్షేపణ చేయుట ద్వారా జనులందరి పాపములను ఆ బలి పశువుపైకి పంపుట దేవుడు ఏర్పరచిన నత్యమైన కట్టడ.
‘‘అప్పుడు అహరోను సజీవమైన ఆ మేకతలమీద తన రెండు చేతులు ఉంచి, ఇశ్రాయేలీయుల పాపములన్నియు అనగా వారి దోషములన్నియు వారి అతిక్రమములన్నియు దానిమీద ఒప్పుకొని, ఆ మేకతల మీద వాటిని మోపి తగిన మనుష్యుని చేత అరణ్యములోనికి దానిని పంపవలెను. ఆ మేక వారి దోషమున్నిటిని ఎడారి ప్రదేశముకు భరించిపోవును. అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్టవలెను’’, (లేవి 16:21-22)
పాత నిబంధనలో బలి అర్పించు దానిపైన హస్తనిక్షేపణ చేయుట ద్వారా ఒక పాపి తన పాపములను తీసివేసి బలి అర్పించు దానిపైకి పంపుట ద్వారా పాపక్షమాపణ పొందెడివారు. పాప పరిహార దినమందు ప్రధాన యాజకుడైన అహరోను ఇశ్రాయేలీయుల ప్రతినిధిగా హస్తనిక్షేపణ చేసి వారి పాపమునకు పాప పరిహారార్ధ బలిగా అర్పించినవాడు.
యేసుక్రీస్తు బాప్తస్మమునకు ఆత్మీయముగా అర్ధము ‘‘బాప్తీజో’’,అను గ్రీకు మాటకు ‘‘కడుగబడుట’’ ‘‘భూస్థాపన చేయుట’’,అని అర్ధము పాత నిబంధనలో ప్రధాన యాజకుడు హస్తనిక్షేపణ ద్వారా ఇశ్రాయేలీయుల పాపములను ఏ విధముగా తన మీద వేసుకొన్నాడో అదే విధముగా క్రొత్త నిబంధనలో యోహాను చేత బాప్తిస్మం ద్వారా యేసుక్రీస్తు సమస్త మానవాళి పాపములను తన మీద వేసుకొన్నాడు. ఆ తరువాత సిలువ మరణం ద్వారా బలిగా అర్పింపబడి మన అందరి పాపములను పరిహరించాడు. ఇదే సత్య సువార్తకు అర్ధము.
ఏ విధముగా ప్రధాన యాజకుడైన అహరోను ఇశ్రాయేలీయుల పాపముల ప్రాయశ్చిత్తము కొరకు బలి పశువుపై హస్తవిక్షేపణ చేస్తాడో అదే విధముగా అహరోను వారసుడైన బాప్తిస్మమిచ్చు యోహాను సమస్త మానవాళికి ప్రతినిధిగా వారి పాపములను యేసుక్రీస్తుపైకి పంపుటకు హస్తనిక్షేపణ చేయుట ద్వారా బాప్తీస్మమిచ్చెను. దేవుడు తన ప్రేమలోని ఈ అద్బుతమైన ప్రణాళికను పరిశుద్ద గ్రంధములోని కీర్తనలు 50:4-5 వచనములో ఈ విధముగా వివరించెను. ‘‘ఆయన తన ప్రజకు న్యాయము తీర్చుటకై బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా వద్దకు సమకూర్పుడని మీది ఆకాశమును భూమిని పిుచుచున్నాడు’’. ఆమెన్‌. హల్లెలూయ.
ఆదిమ సంఘ కాలములో రెండు శతాబ్దా వరకు క్రిస్మస్‌ పండుగను ఎవరు ఆచరించలేదని సంఘ చరిత్ర చెబుతుంది. ఆదిమ సంఘ కాలంలోని క్రైస్తవులు యేసు యొక్క అపోస్తులులతో కలిపి ‘‘యేసు బాప్తిస్మము తీసుకొన్న రోజు’’, జనవరి 6వ రోజున మాత్రమే ఉత్సవముగా జరుపుకొనేవారు. అయితే యేసు బాప్తిస్మమునకు వారు ఎందుకంత ప్రాముఖ్యతనిచ్చారు. దానికి జవాబు అపోస్తులులు క్రైస్తవ్యము యొక్క తాళపు చెవి. అయితే మీలో యేసు బాప్తిస్మమునకు, నేడు విశ్వాసులు తీసుకొన్న నీటి బాప్తిస్మము గూర్చి అస్పష్టత కలుగకూడదని ఆశిస్తున్నాను.
నేడు విశ్వాసులు తీసుకొను బాప్తిస్మమునకు ఆనాడు బాప్తిస్మమిచ్చు యోహాను ద్వారా క్రీస్తు పొందిన బాప్తిస్మమునకు చాలా వ్యత్యాసము కలదు. గనుక మనము పరిశుద్దాత్మను పొందాలి అంటే యేసుక్రీస్తు శిష్యులు గలిగిన విశ్వాసము మనము కలిగియుండాలి. యేసుక్రీస్తు యొక్క బాప్తిస్మమును ఆయన మన పాపములను పరిహరించుటకై సిలువలో చిందించిన రక్తమును నమ్ముట ద్వారా పరిశుద్దాత్మను పొందాలి.
యేసు బాప్తిస్మము పొందుట ద్వారా‘‘ఇదిగో లోక పాపమును మోసికొనుపోవు దేవుని గొఱ్ఱెపిల్ల’’, (యోహాను 1:29)గా చేయబడెను.యోహాను 1:6-7లో ఈ విధముగా చెప్పబడినది. ‘‘దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను అతని పేరు యోహాను. అతని మూలముగా అందరు విశ్వసించునట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను’’మన పాపములను తీసివేసిన రక్షకుడైన యేసునందు నమ్మిక కలిగి యుండవలెననంటే యోహాను యొక్క పరిచర్యను ఆయన సాక్ష్యమును బాగుగా అర్ధము చేసుకోవాలి. అప్పుడే మనము యేసుక్రీస్తును రక్షకునిగా నమ్మగలుగుతాము. పరిశుద్దాత్మను పొందాలి అంటే యోహాను యొక్క సాక్ష్యము ద్వారా వెలిగింపబడిన నమ్మకము అవసరము. కాబట్టి సత్యసువార్తను గూర్చిన సంపూర్ణమైన అర్ధము గలిగియుండాలి అంటే యోహాను చేత యేసు పొందిన బాప్తిస్మం ఆయన సిలువలో చిందించిన రక్తమును మనము నమ్మాలి.
మత్తయి 11-12లో ఈ విధముగా వ్రాయబడియున్నది. ‘‘బాప్తీస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది. బలాత్కారులు దాని నాక్రమించుకొనుచున్నారు’’, ఇది బైబిల్‌లో అతికష్టమైన వాక్యభాగములో ఒక్కటిగా ఎంచబడినది. అయితే ‘‘బాప్తీస్మమిచ్చు యోహాను దినము మొదలుకొని’’అను వాక్యముపైన మనము గమనించినట్లయితే యోహాను పరిచర్య మన రక్షకుడైన యేసుయొక్క పరిచర్యకు సూటిగా సంబంధము కలిగియుంది.
ఆయన రాజ్యమును మనము వీరివలె ధైర్యము గలిగి నమ్మకముతో ప్రవేశించాలని కోరుకుంటున్నాడు. మనము ప్రతిదినము పాపము చేసినప్పటికి మనము అస్ధిరులము,చంచలత్వము గలిగిన వారమైనప్పటికి ఆయన రాజ్యములోనికి మనను సత్యసువార్తయందు నమ్మకము కలిగియుండుటను బట్టి ధైర్యవంతులుగా ప్రవేశింపచేస్తున్నాడు. కాబట్టి పైన చెప్పబడిన ఆదిమ సంఘకాలములోని బాప్తిస్మమును ఎంతో ప్రాముఖ్యమైన ఆచారముగా ఎంచుకొన్నారు. ఎందుకంటే యేసుయొక్క బాప్తీస్మము గూర్చి వారికున్న కీలకమైన నమ్మకము. కాబట్టి మనము కూడా యేసుయొక్క బాప్తిస్మమును మూలాధారముగా ఎంచుకొనవలెను. అంతేకాక యోహాను చేత బాప్తిస్మము పొందుట వలననే యేసు సిలువ వేయబడ్డాడు అను దానిని గూర్చి ఖచ్చితమైన జ్ఞానమును మనము సమీపించి దానియందు నిజమైన నమ్మకము కలిగి యుండాలి యేసు నా కోసము బాప్తీస్మము పొంది సిలువ మరణము పొంది పునరుద్ధానుడైయ్యాడని నమ్ముట ద్వారానే పరిశుద్దాత్మ మనలో నివసిస్తాడు అని మనము జ్ఞాపకముంచుకోవాలి. సత్య సువార్తలో యేసు బాప్తీస్మమునకు ఆయన సిలువలో చిందిన రక్తమునకు అంతటి ప్రత్యేకమైన అర్ధమున్నది.
సత్యసువార్తయైన యేసు బాప్తీస్మము మరియు ఆయన మన పాప పరిహారము కొరకు చిందించిన రక్తమును నమ్ముటయే పరిశుద్దాత్మను పొందుటకు సుగమమైన మార్గము. యేసుక్రీస్తు ద్వారా సమస్త మానవాళి పాపము ఒకేసారి కడిగివేయబడినవి. మనము పరిశుద్దాత్మను పొందుటకు ఆయన బాప్తీస్మము వలననైన విమోచనకు దారితీసినది. యేసు యొక్క బాప్తీస్మమును అర్ధము చేసుకొనలేనివారు దానిని కేవలం ఒక ఆచారముగా పరిగణిస్తారు.
సత్యసువార్తలో భాగమైన యేసుయొక్క బాప్తిస్మము ఆయన ఏ విధముగా సిలువలో అందరి పాపములు తీసివేయుట కొరకు రక్తము చిందించుట అనే తండ్రి యొక్క తీర్పును అంగీకరించాడో మనకు వివరిస్తుంది. ఎవరైతే సత్యసువార్తను విశ్వసింతురో వారు దేవుని కలిగియుండుట వలన సంఘ సభ్యునిగా చేయబడి పరిశుద్దాత్మ దీవెనను అనుభవించి ఆనందిస్తారు. ఎవరి పాపములు క్షమింపబడునో దేవుడు వారికి పరిశుద్దాత్మ కృపావరమును అనుగ్రహిస్తాడు.
ఈ వాక్యభాగముననుసరించి మనుష్యులందరు యేసు తన బాప్తీస్మము ద్వారా సిలువ మరణము ద్వారా మన అందరి పాపములకు విమోచన కలుగజేసాడని సత్య సువార్తను నమ్ముట ద్వారా ఆయన రాజ్యములోనికి ప్రవేశింపగలమని అర్ధము. వేరొక విధముగా చెప్పాలి అంటే మనము ఈ సత్యసువార్త యందు ధృడమైన నమ్మకం కలిగి జీవించుట వలన దేవుని రాజ్యము పొందగలమని అర్ధము.
యేసుయొక్క బాప్తీస్మము మన పాపమును తీసినదను విషయముపై మనము విశ్వాసము కలిగియుండుట ద్వారా పరిశుద్దాత్మను పొందగలమని రూఢిపరచుచున్నది. ఈ సువార్తను మనము మన యిరుగు పొరుగు వారికి స్నేహితులకు బంధువులకు లోకములోని ప్రతి ఒక్కరికి తెలియచెప్పుటలో మనము ఈ సత్యసువార్తయందు విశ్వాసముంచుట ద్వారా విమోచనను పరిశుద్దాత్మ నింపుదల అను వరములను పొందుతాము.
యేసు బాప్తీస్మము మన పాపమును తీసివేసెను మరియు ఆయన రక్తము మన పాపములకు తీర్పు. నీటి మూలముగాను ఆత్మమూలముగాను బాప్తీస్మం పొందుట అను సత్యసువార్తను మనము అన్యజనులకు వివరించాలి. ఈ విధముగా చేయుట ద్వారా వారు ఈ సువార్తను నమ్మి పరిశుద్దాత్మను పొందుతారు. మీరు ఈ సువార్తను నమ్మాలని నేను కోరుకుంటున్నాను. ఈ సత్యసువార్తయైన యేసుయొక్క బాప్తీస్మం మరియు సిలువలో చిందించిన రక్తము యందు విశ్వాసముంచుట ద్వారా మనము పాపక్షమాపణ పొంది పరిశుద్దాత్మ నివాసము పొందుతాము.
పరిశుద్దాత్మను పొందిన ప్రతి ఒక్కరు దేవుని కుమారులుగా చేయబడుదురు. మరియు మనలో నీటి మూలముగాను ఆత్మమూలముగాను క్రొత్తగా జన్మించిన వారు సహోదరులుగా, సహోదరీలుగా చేయబడుతారు. పౌలువలె ఈ సత్యసువార్తను ఇచ్చిన దేవునికి వందనములుచెబుతూ స్తుతిస్తున్నాను. ఆమెన్‌.