• All e-books and audiobooks on The New Life Mission website are free
  • Explore multilingual sermons in global languages
  • Two new revised editions in English have been released
  • Check out our website translated into 27 languages
Search

Sermons

అంశం 8: పరిశుద్ధాత్మ

[8-4] శిష్యులకు కలిగిన విశ్వాసమును పోలిన విశ్వాసము గలవారు (అ.పో.కా. 3:19-20)

(అ.పో.కా. 3:19-20)
‘‘ప్రభువు సముఖము నుండి విశ్రాంతికాలములు వచ్చునట్లును మీకొరకు నియమించిన క్రీస్తుయేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారుమనస్సు నొంది తిరుగుడి’’.
 
 
అపోస్తులులు ఎటువంటి విశ్వాసము గలవారు?
వారు యేసు బాప్తిస్మము మరియు ఆయన సిలువలో కార్చిన రక్తమునందు విశ్వాసముంచిరి.

యేసుక్రీస్తుయొక్క శిష్యులవిశ్వాసము పరిమాణముపరిశుద్దాత్మను పొందినప్పుడు పొందక మునుపు వేరుగా కనిపిస్తుంది. వారి శరీరములో ఏ మార్పు లేదు కానీ,పరిశుద్దాత్మను పొందిన తరువాత 
ఆయన వెలుగులో వారి జీవితాలు పూర్తిగా మారిపోతాయి.
నేను నివసించే పట్టణంలో అందమైన సరస్సు పర్వతాలు ఉన్నాయి. అందమైన దృశ్యాలను చూస్తూ నా హృదయం ఎంతో తృప్తితో ఆశ్చర్యంతో ఇంత గొప్ప సృష్టిని చేసిన దేవునికి స్తుతులు చెల్లిస్తుంది. సూర్యకిరణాలు పడిన నిర్మమైన స్పటికమువంటి నీటిని చూచినప్పుడు నా మృదయం అంతా ఆనందంతో నిండిఉంటుంది. ఆ సమయంలో నా చుట్టూవున్న ప్రపంచం బంగారంవలె ఎంతో విలువైనదిగా నాకు కన్పిస్తుంది.
 అయితే కొన్ని ప్రదేశములలో ఇటువంటి సుందర దృశ్యములు వాటంతట అవి కనిపించవు.
కొన్ని చోట్ల ఆకాశం స్పటికమువలె స్పష్టముగా ఉంటుంది. కాని సూర్యరశ్మి క్రింద ఉన్న నీరు 
మాత్రం బురదవలె కనిపిస్తుంది. అటువంటిదృశ్యములు మనల్ని అంతగా ఆకర్షించవు.
ఎందుకంటే అవి కాంతి విహీనమయినవి. అటువంటి సరస్సును చూచినప్పుడు ఆయన 
సత్యసువార్తద్వారా బురదవంటి నా పాపమును కడిగివేసి నాకు పరిశుద్దాత్మ సహవాసమును కలుగజేసిన ప్రభువునకు స్తుతులు చెల్లిస్తాను. బురదమడుగులో ఉన్న నీటి ఉపరితము ఏ విధంగా సూర్యకాంతిని ప్రతిబింబింపచేయలేదో మనము కూడా దేవుని వెలుగునకు దూరముగా 
ఉండి, స్వాభావికముగా పాపభరితులమైన మనము మనకే తెలియని అగోచరమైన గమ్యము వైపు 
పరుగిడుచూ ఉంటాము. అయితే మన హృదయంలో పరిశుద్దాత్మ నివసించినట్లయితే 
మనము దేవుని బిడ్డలమని ఎరిగి ఆయన సువార్తనుజనులకు ప్రకటించుటకు నడిపించబడతాము. ఎందుకంటేమనము ఆయనకాంతిని అంగీకరించాము. ఆకాంతితోనే ఈ లోకంలో వెలుగుతాము.
అదే విధముగా క్రీస్తు పునరుత్తానుడైన తరువాత ఆయన శిష్యులు పరిశుద్దాత్మనుపొంది ఆయన 
బిడ్డలుగా చేయబడి ఆయనచే వెలిగింపబడిన అపోస్తులులుగా జీవించిరి. పరిశుద్దాత్మ యొక్క 
వెలుగు భూజనులందరికి గొప్ప ఆశీర్వాదము గనుక అవివేకులు ఈ పరిశుద్దాత్మను పొందాలని ఆశిస్తారు.
 

 అపోస్తుడైన పౌలు యొక్క విశ్వాసము :

 పౌలు ఎటువంటి విశ్వాసమును కలిగియున్నాడు. పౌలు తన విశ్వాసము యొక్క సాక్ష్యములో తాను గమలియేలు యొక్క పాదముల యొద్ద విద్యనభ్యసించి శిక్షణ పొందినట్లు వ్రాశాడు. ఆ కాలంలోని గొప్ప బోధకులో గమలియేలు ఒకడు. తాను నేర్చుకొన్న ధర్మశాస్త్రము తన పాపములకు విమోచన కలుగచేయలేదు అని పౌలుతనసాక్ష్యములో ఒప్పుకున్నాడు. ఎందుకనగా పౌలు గొప్ప ధర్మశాస్త్రవేత్త అయినప్పఇకీ మన రక్షకుడైన యేసు సంఘమును హింసించినవాడై యుండెను.
అయితే ఒకానొకరోజు దమస్కుమార్గములో క్రీస్తునిచూచి ఆ దర్శనముచేత ఆయన సువార్తకు సువార్తికుడాయెను. యేసుక్రీస్తు దేవుని కుమారుడై యున్నాడని ఈ లోకములోని పాపములన్నిటిని కడుగుటకు ఈ లోకమునకు వచ్చాడని యోహానుచేత బాప్తీస్మముపొంది, సిువలో రక్తము చిందించియున్నాడని పౌలు నమ్మాడు. అనగా పౌలు తన పాపములు క్షమింపబడినవని విశ్వసించాడు. 
 యేసుశిష్యులు యోహానుచేత ఆయన బాప్తీస్మము సిలువలో ఆయన కార్చిన రక్తము, మన పాపములు క్షమింపడుటకే అని విశ్వసించారు.పౌలు కూడా ఇదే విశ్వాసమును శిష్యులతో 
పంచుకొన్నాడు. కనుక తన పాపముల నుండి రక్షింపబడినాడు. గలతీ 3:27లో ‘‘క్రీస్తు లోనికి బాప్తీస్మముపొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు’’, అని చెప్పుటద్వారా 
యేసుబాప్తీస్మము యందు ఆయనకున్న విశ్వాసమును మరియు ఆయన రక్షణనుగూర్చి ఒప్పుకొన్నాడు. అలాగే పేతురు కూడా 1 పేతురు 3:21లో ‘‘దానికి సాదృశ్యమైన బాప్తీస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు కానీ యేసుక్రీస్తు పునరుత్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనసాక్షినిచ్చు ప్రత్యుత్తరమే’’అని సత్యసువార్తయైన యేసుయొక్క బాప్తీస్మము లోకములోని పాపములన్నిటినీ కడిగివేసినదని యేసుశిష్యులు విశ్వసించారు. ఈ సత్యమును నమ్ముట ద్వారా వారి పాపములు క్షమింపబడినవి గనుక ఇక ధర్మశాస్త్రము యొక్క శాపము క్రిందలేరు.
వారు యేసుయొక్క బాప్తీస్మమును ఆయన సిలువలో చిందించిన రక్తముయందు విశ్వాసముంచారు. ఈ విశ్వాసము శిష్యులకు ఫలమైన అర్హతగా ఎంచబడినది. అ.పో.కా1:21-22. ఈ విధముగా వ్రాయబడియున్నది. ‘‘కాబట్టి యోహాను బాప్తీస్మమిచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మనయొద్దనుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు, ఆయన మనమధ్య సంచరించుచుండిన 
కాలమంతయు మనతో కూడ కలిసియున్న వీరిలో ఒకడు,మనతో కూడా ఆయన పునరుత్ధానముగూర్చి సాక్షియై యుండుట ఆవశ్యకమని చెప్పెను’’,.యేసుకు శిష్యులుగా చేయబడుట యోహానుచేత 
యేసు బాప్తీస్మమునుండి మొదయినది.మన పాపములనుండి మనము రక్షింపబడవలెననంటే 
యేసుబాప్తీస్మము ఆయన సిలువలో కార్చిన రక్తముయందు విశ్వాసముంచాలి, ఇది సత్యము. 
 ‘‘కీస్తు లోనికి బాప్తీస్మముపొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు’’.(గలతీ 3:27). ఆవిధంగా పౌలుకూడా క్రీస్తుబాప్తీస్మము ఆయన సిలువ రక్తమునువిశ్వసించియున్నాడు. 
తీతుకు 3:5లో చూచినట్లయితే‘‘మనము నీతిని అనుసరించి చేసిన క్రియలమూలముగా కాక, 
తన కనికరముచొప్పుననే పునర్జన్మసంబంధమైన (పున:స్ధితి స్థాపన) స్నానముద్వారాను పరిశుద్దాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయుట ద్వారాను మనలను రక్షించెను. ఇక్కడ ‘‘పునర్జన్మ సంబంధమైనస్నానము’’,అనగా యోహాను యేసునకు బాప్తీస్మము ఇచ్చినప్పుడు ప్రపంచంలోని పాపములన్నీ కడుగవేయబడినవి అని అర్ధము.కాబట్టి అదేవిధంగా మీ పాపముకూడా క్షమింపబడవలెనంటే సత్యసువార్త అయిన అనగా యేసు బాప్తీస్మముద్వారా ఆయన మీదకి మన పాపములు పంబడినదని విశ్వాసముంచాలి. ఈ వాస్తవమును నమ్ముటద్వారా పరిశుద్దాత్మ సహవాసము పొందగలము. పౌలు కూడా తన సాక్ష్యముతో ఇదిఒప్పుకొనుచున్నాడు. 
 హెబ్రీ 10:21-22లో ‘‘దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును. నిర్మలమైన ఉదకముతో స్నానముచేసిన శరీరములు గలవారమై యుండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలగి, యధార్ధమైన హృదయముతోమనము దేవుని సన్నిధానమునకు చేరుదము’’,ఇక్కడ‘‘నిర్మమైన ఉదకస్నానము’’అనగా యోహాను చేయేసు పొందిన బాప్తీస్మము మానవాళి పాపములను కడిగెను.
పాత నిబంధనలోను క్రొత్త నింబంధనలోను గమనిస్తే యేసు బాప్తీస్మము మరియు ఆయన సిలువలోమరణము సత్యసువార్తకు మూలాధారముగా చూస్తాము. కాబట్టి మీరుకూడాపౌలుకు కలిగిన విశ్వాసమును అందరితో పంచుకోవాలి. నేడు అనేక మంది క్రైస్తవులు యేసు యోహానుచేత పొందిన బాప్తీస్మమువలన లోకములోని పాపములన్ని క్షమింపబడినవని తెలుసుకోకుండా వ్యర్ధముగా యేసునినమ్ముతారు. కొందరు వేదాంతవేత్తలు మనుష్యులు పాపక్షమాపణ కొరకు తమకుతామే నీళ్ళలో బాప్తీస్మము పొందాలని వాదిస్తారు. ఈ వాదన పరిశుద్దగ్రంధములోని సత్యసువార్తయైననీటి మూలముగాను ఆత్మమూలముగాను కొత్తగా జన్మించుటను ఎరుగక చేసినట్లు అర్ధమవుతుంది. ఆచారప్రకారం బాప్తీస్మము తీసుకొనుటవలన మన పాపములు క్షమింపబడవు. ఆయన 
బాప్తీస్మము మరియు రక్తము నందు విశ్వాసము పాపములన్నింటినీ కడిగివేయును.ఈసత్యసు వార్తను విశ్వసించేవారి పాపములు మాత్రమే క్షమింపబడతాయి. సిలువలో కార్చిన రక్తమును నమ్ముటవలన వారి మీదికి తీర్పుకొట్టివేయబడినది. ఈ విశ్వాసము కలిగిన వారు మాత్రమే పరిశుద్దాత్మను పొందగలరు. 
‘‘మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై యుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యధార్ధమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము’’, (హెబ్రీ 10:22)హెబ్రియులకు వ్రాసిన వ్యక్తి మనను విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యధార్ధమైన హృదయముతో దేవుని సన్నిధానమునకు చేరాలని వ్రాశాడు. కాబట్టి మీరు కూడ సత్యసువార్త యందు విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యధార్ధమైన హృదయముతో దేవుని సన్నిధానమునకు చేరండి.
నేడు క్రైస్తవులు ఎంతో శ్రద్దతో పరిశుద్దాత్మను పొందాలని ఆశిస్తారు. అయితే పాపక్షమాపణ పొందిన వ్యక్తులలో మాత్రమే పరిశుద్దాత్మ నివసిస్తాడు. చాలా మంది ఈ విషయం ఎరుగక,సత్యసువార్తయైన యేసు బాప్తీస్మము మరియు ఆయన రక్తమును గూర్చి ఎరుగకయే పరిశుద్దాత్మను పొందాలని కోరుకుంటున్నారు. ఎవరైతే సత్యసువార్తను నమ్మకుండా దేవుని నమ్ముతారో వారు పరిశుద్దాత్మను పొందలేరు. కారణం ఏమిటంటే వారు పరిశుద్దమైన హృదయము లేనివారు.
పౌలు యేసు బాప్తీస్మము సిలువలో కార్చిన రక్తము వలన పరిశుద్దాత్మ పొందాడు. ఈ నమ్మకం వలన పరిశుద్దాత్మను పొందాడు. ఈ నమ్మకమును వ్యాపింపచేసాడు. అంతేకాక Heretic గా హింసింపబడినాడు. పరిశుద్దాత్మతతో నిండినవాడు గనుక తుదమట్టుకు సత్యసువార్తను ప్రకటించగలిగాడు.‘‘నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను’’, (ఫిలిప్పీ4:13) పౌలుదేవుని సేవ చేసాడు. దేవుని యొద్దకు వెళ్ళే వరకు కూడా పరిశుద్దాత్మ నడిపింపు పొందగలిగాడు. పౌలు విశ్వాసమును పోలిన విశ్వాసము గలవారు పరిశుద్దాత్మను పొందుతారు.
 పౌలు విశ్వాసమును చూద్దాం కొలస్సీ 2:12లో ‘‘మీరు బాప్తీస్మమందు ఆయనతో కూడ పాతిపెట్టబడినవారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వాసించుట ద్వారా ఆయనతోకూడ లేచితిరి’’. యోహను చేత యేసు పొందిన బాప్తీస్మమును నమ్మినందున పౌలు యొక్క పాపములు క్షమింపబడినవి.
 
 
ప్రాచీన కాలము నుండి క్రైస్తవం ఏవిధంగా మార్పు చెందినది

పరిశుద్దాత్మను పొందిన తరువాత శిష్యురాలయిన ఒక సోదరి
సాక్ష్యమును చూద్దాం.
‘‘నేను ముసలిదాననైపోతుప్పటికీ నాకు గర్భము రాలేదు. ఆయన దీవెన ప్రార్ధన ద్వారా పొందేందుకు చాలా చర్చీలకి వెళ్ళేదాన్ని, నేను ఇంట్లో ఉన్నప్పుడు కూడా రెండు లేక మూడు గంటలు ప్రార్ధన చేస్తూ ఉండేదాన్ని. ఈ విధమైన ప్రార్ధన ఆచారం నా జీవితంలో ఒక భాగమైపోయింది. 
ఈ విధమైన భక్తి జీవితమును నా స్వంత ఆలోచనలతో గడుపుచున్న సందర్భంలో ఒక వృద్ద స్త్రీని కలిసాను. నేను ఆమెచేతచేతుంలుచి ప్రార్ధన చేయుంచుకున్నట్లయితే దేవుడు నాకు బిడ్డను ఇస్తాడని ఆమె నాతో చెప్పింది. ఆమె దేవుని దూత అని అందరూ చెప్పుకుంటుంటే విని ఆమెతో చేతులుంచి ప్రార్ధన చేయించుకున్నాను. ఆ క్షణంలో నేనెన్నడు అనుభవించని వింత అనుభవం కలిగింది. నా నాలుక సడలింపబడి భాషలు మాట్లాడడం మొదలుపెట్టాను. నాకు తెలియని వెచ్చనిశక్తి ఏదో నన్ను తాకుతున్నట్లు అనిపించింది.
నా ప్రార్ధనకు జవాబుగా ఆయన పరిశుద్దాత్మ నింపుదలను కలుగజేశాడని ఈ అనుభవము ద్వారా నేను అర్ధం చేసుకున్నాను. నా తలపైన చేతులుంచిన స్త్రీకి పరిశుద్దాత్మ వరములైన స్వస్థత వరము మరియు ప్రవక్త్రిగా నాకు అనిపించింది. ఆమెకు దేవుని వాక్యమును గూర్చిన జ్ఞానం లేదు గాని అనేకమంది సంఘకాపరులు ఆమె వారి తలపైన చేతులుంచుటద్వారా పరిశుద్దాత్మను పొందారు.
 ఈ అనుభవం జరిగినప్పటి నుండి నేను అటువంటి కూటములకు వెళ్ళడం ప్రారంభించాను. నూతన 3‘ఉజ్జీవ ఉద్యమం అనునది అటువంటి ప్రార్ధనా కూటములో ఒకటి. ఆ ప్రార్ధనా కూటములో నా హృదయము దేవుని యెడల నా పొరుగువానియెడ ప్రేమతో మండుచున్నదై నా శరీరమంతా వణుకు పుట్టినది. ఇదే విధంగా నా చుట్టు ప్రక్కలనున్నవారు కూడా భాషలతో మాట్లాడుతూ ఎక్కడంటే అక్కడ సోలిపోతూనే ఉన్నారు. అక్కడ దయ్యం పట్టిన వారు కూడా ఉన్నారు. ఈ ప్రార్ధనా సమావేశం యొక్క పాస్టరు గారు ఆ దయ్యమునువెళ్ళగొట్టుచున్నాడు. ఈ నూతన [3]ఉద్యమము ఏర్పాటు చేయుటకు ముఖ్య ఉద్దేశమేమిటంటే వణుకుట, ప్రవచించుట, దయ్యములను వెళ్ళగొట్టుట, బాషలుమాట్లాడుటద్వారా 
పరిశుద్దాత్మను అక్కడున్న ప్రజలుపొందుటకు సహాయం చేయుట. ఇటువంటి అనుభవాలు 
జరిగినప్పటికీ నాలో ఇంకా పాపమున్నది. నా హృదయంలోని పాపము నేను భయపడునట్లుగా సిగ్గుపడునట్లుగా చేస్తున్నది.
 
[3] క్రైస్తవ జీవితంలో వాస్తవ ‘‘నూతనత్వము’’, సహజమైన అవసరమైన భాగం. ఇది ఆత్మీయప్రవర్తనకు ఆత్మీయజీవితఫముయొక్క సాక్ష్యము. ఇటీవ దైవవాక్యమును వివరించు కొన్ని ఉద్యమము ‘‘నూతనత్వము’’,అను మాట ఆత్మప్రవర్తనను తెలియచేయునది. వారి యొక్క నూతనత్వము హద్దు లేనిదియు ఉద్రేకమును అనుమానాస్పద ప్రత్యేకతు మరియు బైబిులో లేనిదియు కల్పిత బైబిల్‌ బోధను అభ్యసించుచున్నారు.
 ఇది సమస్యతో కూడిన బోధను మరియు అభ్యసించుటకు వివాదాస్పద నూతనత్వమును ప్రోత్సహించుఉద్యమము అత్యధిక పరిశుద్దాత్మవరమును వాక్యముద్వారా నొక్కిచెప్పే దుర్భోధలు,అనవసర ప్రత్యక్షతలు,తప్పుడు ప్రవచనమును, అద్భుత తప్పుడు సూచక క్రియలను బోధించుట మొదగునవి ఏమైనప్పటికి వాస్తవమైన సువార్తను త్రోసిపుచ్చుచూ పరిశుద్దాత్మను బోధించుటను గురించిన తప్పు మార్గములో బోధించు ఉద్యమముగా ఉన్నది.
 
కాబట్టి నేనెప్పుడు ప్రార్ధనచేసినాగాని ఈ సమస్యలను పరిశుద్దాత్మను పొందాలనుకుంటే యోహానుచేత యేసు బాప్తీస్మము పొందినప్పుడే మన పాపములన్ని ఆయపై మోపబడినవనిఆయన రక్తము వలన తీర్పు తీర్చబడినదని మన పాపములన్నింటికి క్షమాపణ అని నమ్మాలి. అప్పుడు నీవు పరిశుద్దాత్మను పొందుతావు.
చాలామంది క్రైస్తవులు యేసురక్తమును మాత్రమే విమోచన సువార్తగా నమ్ముతారు. అయితే మీలోఆయన రక్తమును మాత్రమే నమ్మేవారు నిజంగా మీ పాపము నుండి విడుదలపొందుతారా?మీరు పొందగలరా, విడుదల పొందగలరని మీరు నమ్ముతున్నట్లయితే మీరు ఆయన బాప్తీస్మమునకు నిజమైన అర్ధం గూర్చి అస్పష్టమైన జ్ఞానం కలిగి యున్నారు. అప్పుడు మీ హృదయంలో ఇంకా పాపమున్నదని 
అర్ధం. యేసు బాప్తీస్మమమును ఆయన సిలువలో కార్చిన రక్తములో కూడా ఏకముగా విశ్వసించినప్పుడే నీవు నీ పాపము నుండి రక్షింపబడతావు. అప్పుడే నీవు పరిశుద్దాత్మను పొందుతావు. మనము ఈ లోకమును జయించుటకు ఇదే సత్యమైన సువార్త అని పరిశుద్ద గ్రంధము చెప్పుచున్నది. “మనము మనుష్యుల సాక్ష్యము అంగీకరించుచున్నాము గదా! దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి యిచ్చినదే.”,(1యోహాను 5:8). కాబట్టి దేవుడు మనపాపములనుండి మనలను రక్షించుటకు ఆయన ప్రణాళికలో బాప్తీస్మమిచ్చు
యోహానుచేత యేసునకు బాప్తీస్మమిచ్చుటచేత, ఆ తరువాత ఆయన సిలువవేయేబడినాడు.
 అనేకమంది క్రైస్తవులు యేసును దేవునిగా నమ్మినప్పటికీ పాపక్షమాపణ పొందకపోవుటకు 
కారణమేమిటంటే వారు ఆయన యోహానుచేత పొందిన బాప్తీస్మమునుఆయన సిలువలో 
కార్చిన రక్తముతో కూడిన సత్యసువార్తను నమ్మరు.ఎవరైతే ఈ రెండు విషయములను నమ్ముతారో 
వారు వారి హృదయములలో పరిశుద్దాత్మ నివాసమును పొందుతారు.
జనులు ఎప్పుడైతే వారిపాపములు క్షమింపబడినవనినమ్ముతారో అప్పుడు వారి హృదయము 
శాంతికరమైన జలములవలె అవుతాయి. వారిహృదయములలో పరిశుద్దాత్మనివసించుచున్నప్పటి నుండి ప్రశాంతత, ఆనందము నదివలె పొంగిపొర్లుతుంది. మేము ఈ నమ్మకము గలిగి పరిశుద్దాత్మతో కూడా నడుచుచు ఈ సువార్తను ప్రకటించు దేవునికి చేరువయ్యాము. ఇటువంటి ప్రశాంతతను మా హృదయము ఇదివరకెన్నడు అనుభవించలేదు. నీటి మూలముగాను ఆత్మమూలముగాను క్రొత్తగా జన్మించినప్పటినుండి మా జీవితములో ప్రశాంతత మా హృదయములలో ఖచ్చితముగా సంతోషమును కలిగియున్నాము. మేము ఈ సత్యసువార్త నుండి వెనుదిరుగలేము. పరిశుద్దాత్మ మా హృదయములలో నివసిస్తూ ఆయనవాక్యమును ప్రకటించుటలో తోడ్పడుచుఅనేకులు పరిశుద్దాత్మ నింపుదల పొందుటకు సహాయపడుచున్నాడు.
మేము ఆయన బాప్తీస్మము ఆయన రక్తమును గూర్చిన సువార్తను నమ్మాముగనుక పరిశుద్దాతచేత దీవింపబడితిమి. ఇప్పుడు మీరు కూడా యేసుయొక్క బాప్తీస్మము ఆయన సిలువలో కార్చిన రక్తమును నమ్మి పరిశుద్దాత్మను పొందాలి. ముఖ్యముగా ప్రపంచములోని వారంతా మన పాపమును కడుగుటకు యోహోనుచేత ఆయన బాప్తీస్మము పొందాడని మన పాపముకు తీర్పుగాఆయన సిలువలోమరణించాడని నమ్ముటనుఅలవర్చుకోవాలి. మీరు ఇలా చేసినట్లయితే పరిశుద్దాత్మను పొందుతారు.