• All e-books and audiobooks on The New Life Mission website are free
  • Explore multilingual sermons in global languages
  • Two new revised editions in English have been released
  • Check out our website translated into 27 languages
Search

Sermons

అంశం 8: పరిశుద్ధాత్మ

[8-5] మీరు పరిశుద్దాత్మతో సహవాసము కలియుండాలని కోరుకుంటున్నారా? (1యోహాను 1:1-10)

(1యోహాను 1:1-10)
‘‘జీవ వాక్యమును గూర్చినది, ఆదినుండి ఏది యుండెనో,మేమేది వింటిమో,కన్నులార ఏది చూచితిమో,ఏది నిదానించి కనుగొంటిమో,మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియచేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను. తండ్రియొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్యజీవమును మేము చూచి,ఆ జీవమునుగూర్చి సాక్ష్యమిచ్చుచు, దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచినదానిని వినినదానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోకూడను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేమీ సంగతులను వ్రాయుచున్నాము. మేమాయనవలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై యున్నాడు. ఆయనయందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనతోకూడా సహవాసముగలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినయెడల మనమబద్దమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల. మనము అన్యోన్యసహవాసము గలవారమై యుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి ఎమనము పాపములేని వారమని చెప్పుకొనినయెడల మనలను మనమే మోసపుచ్చుకొందుము. మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును.నీతిమంతుడును గనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన యెడల ఆయనను అబద్దికునిగా చేయువారమగుదుము. మరియు ఆయన వాక్యము మనలో ఉండదు’’
 
 
పరిశుద్దాత్మతో సహవాసముగలిగి యుండుటకు మొదట అవసరమైనవి?
మొదటిగా మనము నీటిమూలముగాను ఆత్మమూలముగాను క్రొత్తగా జన్మించుటను గూర్చి తెలుసుకొని దానియందు విశ్వాసముంచుటద్వారా మన పాపములనుండి కడుగబడాలి.
 
నీవు పరిశుద్దాత్మతో సహవాసము గలిగియుండాలి అనుకుంటే మొదటిగా నీలో దేవుని దృష్టికి వ్యతిరేకముగా ఏ చిన్న పాపమున్నప్పటికి అటువంటి సహవాసమును పొందలేమని తెలుసుకోవాలి. మానవులు దేవునిదృష్టికి ఏమాత్రము పాపము లేకుండా ఎలా వుంటారు అని మీరనుకోవచ్చు. అయితే మీరు నిజముగాదేవునితో సహవాసము కోరుకున్నట్లయితే మీహృదయంలో చీకటి ఉండకూడదు. కాబట్టి దేవునితో సహవాసము గలిగియుండాలి. అంటే మీరు రక్షణ సువార్తను నమ్మి మీ పాపముల నుండి కడుగబడాలని తెలుసుకోవాలి.
మీరు నిజముగా పరిశుద్దాత్మతో సహవాసము గలిగియుండాలని కోరుకున్నట్ల యితే మీరు నీటిమూలముగాను ఆత్మమూలముగాను క్రొత్తగా జన్మించుటను గూర్చి తెలుసుకొని దానియందు విశ్వాసముంచుటద్వారా మీ పాపముల నుండి కడగబడాలి. మీకు నీటిమూలముగాను, ఆత్మమూలముగాను క్రొత్తగా జన్మించుటను గూర్చి తెలియకపోతే సువార్తను ఇంకనూ స్వీకరించకపోయినట్లయితే ప్రభువుతో సహవాసమును గూర్చిన ఆలోచనకూడా మీరు చేయకూడదు. నీటిమూలముగాను,ఆత్మమూలముగానైన సువార్తద్వారా మీహృదయంలోని పాపములన్ని శుద్ది చేయబడి మీరు పరిశుద్దాత్మ సహవాసమును పొందగలుగుతారు. ఆయన నీటిమూలముగాను ఆత్మమూలముగానైన సత్యముద్వారా ఎవరి హృదయంలోని పాపమైనప్పటికి శుద్ది చేస్తాడు. మీరు నీటిమూలముగాను ఆత్మమూలముగానైన సువార్తను నమ్మినప్పుడు ప్రభువు మిమ్మును పరిశుద్దాత్మతో సహవాసము గలిగి ఉండాలి అని అనుకుంటున్నారా?అయితే మీ పాపములను మీరు గుర్తెరిగి మీరు పరిశుద్దపరచబడుటకు సత్యసువార్తను విశ్వసించండి. అప్పుడే మీరు నిజముగా దేవునితో సహవాసము గలిగియుంటారు.
నీవు దేవుని సహవాసము కలిగియుండాలి అనుకుంటే యోర్దాను నదిలో యోహానుచేత యేసుపొందిన బాప్తీస్మమును ఆయన సిలవలో చిందించిన రక్తమును నమ్మాలి. మనుష్యులు నిజముగా దేవునితోసహవాసము గలిగియుండాలంటే అసలు పరిశుద్దాత్మఅంటే ఎవరో వారు ఎరిగి యుండాలి. పరిశుద్దాత్మ అనగా పరిశుద్దమైనవాడు. అందువలన ఎవరైతే సత్యసువార్తను నమ్ముతారో వారిలో మాత్రమే ఆయన నివసిస్తాడు.
 యోహానుచేత యేసుపొందిన బాప్తస్మము మరియు ఆయన సిలువ రక్తమును నమ్మి పాపక్షమాపణ పొంది ఇప్పుడు పరిశుద్దాత్మ సహవాసము గలిగియున్న ఒకనిసాక్ష్యమును చూద్దాము.
 ‘‘ఈలోకములో ఎన్నో రకము మనుష్యులు వారి వారి స్వంత ఆలోచనతో జీవిస్తున్నారు. నేనుఅలాంటి వారిలో ఒకడిని. చిన్ననాటి నుండి నేను ఒక సాధారణ జీవితం గడిపాను. నేను నా తల్లి చర్చికి వెళ్ళేవాడిని. అందువలన మామూలుగా దేవుని నమ్మాను. నా తండ్రి ఒక నాస్తికుడు. అందువలన నా నమ్మకమును గూర్చి ఎప్పుడు నన్ను విమర్శించేవాడు. అయితే మిగిలిన కుటుంబ సభ్యులందరము ఆలయమునకు వెళ్ళేవాళ్ళం. ఆలయమునకు వెళ్ళుట నా జీవితములో ఒక భాగమైపోయింది.
నా యౌవన ప్రాయములో మంచాన ఉన్న నాతండ్రిని చూచినప్పుడు జీవము , మరణము, పరలోకము, నరకము ఇలా ఎన్నో ఆలోచనలు నాకు కలిగినవి. చాలామంది నాతో నీవు దేవునినమ్మినట్లయితే, నీవు పరలోకానికి వెళతావు. దేవుని బిడ్డగా చేయబడతావు అనేవారు. కాని నాకప్పుడు అది నిజము అనిపించేదికాదు. నేను దేవునిబిడ్డనౌతానని నాకు నమ్మకం కలిగేదికాదు. భూమిమీద మంచిచేసినట్లయితే పరలోకానికి వెళతామని నేను నేర్చుకొన్నాను. అందువలన అవసరతలతో ఉన్నవారికిమంచి చేయుటకు నేనెప్పుడు ప్రయత్నించేవాడిని. 
అయితే మరోవైపు నా హృదయంలో నేను పాపము చేసానని నాకు తెలుసు. నేను ఇతరులకు మంచివాడిగా కనిపించవచ్చుగాని నేను నిజముగా మంచివాడిని కాదు. నా పాపమును గూర్చి ఎంతగానో వ్యసనపడేవాణ్ని. అటువంటి సమయములో నేను ఆలయమునకు వెళ్ళి ‘‘దయతో నేను నిజముగా నీ బిడ్డనగుటకు నాకు సహాయము చేయి. దయచేసి నాకు సత్యమును తెలియపరచు అని చెప్పి ప్రార్ధించుట అలవాటు చేసుకొన్నాను. నేను ప్రార్ధన చేయునప్పుడు ఒక క్రొత్త విన్నపమును అలవాటు చేసుకొన్నాను. ఆయన వాక్కును గూర్చిన బోధను వినినపుడు వాక్యమును గాని, దానిలోని అర్ధమును గాని గ్రహించేవాడినికాదు. నా జీవితములోని శూన్యతను నా పాపమును గూర్చి, మరణమును గూర్చి ఆలోచనలతో వేసారిపోయాను. నేను క్రొత్తగా జన్మించితేనేగాని ‘‘ఈ విధముగా జీవిస్తాను’’,అని ఆలోచించేవాడిని. ఇటువంటి ఆలోచను ఉన్నప్పటికి ఆలయానికి అతి తక్కువ సమయములలో వెళ్ళేవాడిని. అలా నా యౌవ్వన ప్రాయము గడిచిపోయింది. ఇప్పుడు నేను ఉద్యోగము కోసము వెతకాలి. అయితే అది నేను అనుకున్నంత తేలిక కాదు అనిపించింది. అప్పుడు నేనెంతో దు:ఖములో ఉన్నాను. ఎంత ప్రయత్నించినా నమ్మకం గలిగేది కాదు. నన్ను నేను చూచుకుంటూ నా హృదయమంత శూన్యముగా అధైర్యముతో వేదనపడిపోయాను. అటువంటి సమయములో నా పెద్ద సహోదరుని ద్వారా దేవుని వాక్యము తెలుసుకున్నాను. 
‘‘ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చునట్లును మీకొరకు నియమించిన క్రీస్తుయేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచి వేయబడు నిమిత్తమును మారుమనస్సు పొంది తిరుగుడి’’.(అ.పో.కా.3:19-20)
ఇది నీటిమూలముగాను ఆత్మమూలముగాను సత్యసువార్త. ఇదివరకు వెళ్ళిన ఆలయమున్నిటిలో నేను నేర్చుకొనినదంత ఏమనగా యేసు మన పాపముల కొరకు సిలువలో మరణించాడు అని అయితేఈ సువార్తద్వారా మనపాపములను తీసివేయుటకుయోహానుచేత యేసు బాప్తిస్మము పొందాడు అని మనపాపములకు తీర్పుగా సిలువలో మరణించాడని తెలుసుకొన్నాను.
నా జీవితమంత ఆలయమునకు వెళ్ళుతూ దేవుని కుమారునిగా నటిస్తూ వున్నాను. గాని నేను ఓడిపోయాను. ఆయన వాక్యములోని అర్ధమును తెలుసుకోవాని ప్రయత్నించాను కానీ తెలుసుకోలేకపోయాను. ఎప్పుడైతే నీటిమూలముగాను ఆత్మమూలముగాను క్రొత్తగా జన్మించుటను గూర్చి విని నమ్మానో నన్ను వేధించుచున్న నా పాపము మాయమైపోయింది నా హృదయం ప్రశాంతముగా ఉంది.
ఉత్సాహముతో దేవుని నమ్మడం వలన క్రమము తప్పకుండా ఆలయమునకు వెళ్ళుట వలన పరలోకానికి వెళ్తానని అనుకున్నాను. కాని దేవుడు నీటిమూలముగాను ఆత్మమూలముగానైనువార్తను నా వద్దకు పంపించాడు. నా పాపములన్నిటిని క్షమించాడు. పరిశుద్దాత్మ వరమనుగ్రహించాడు. ఆయన విమోచనను నేను పొందక మునుపే పరిశుద్దాత్మను పొందుటగూర్చిగాని భాషలు మాట్లాడటం గూర్చిగాని నాకుతెలియదు. నేనెప్పుడూ ఆలయమునకు వెళ్ళుతూ మంచిపనులు చేస్తూ ఉండి ఆలయములో సేవచేస్తుండుటవలన దేవుడు నన్ను దీవిస్తాడని అనుకొనేవాడిని. అయితే నీటిమూలముగాను ఆత్మమూలముగానైన సువార్తనునమ్మి పాప క్షమాపణ పొందినప్పుడు మాత్రమే పరిశుద్దాత్మను పొందగలుగుతామని గ్రహించాను.
జీవితములో దేవునిపనిని నమ్మినప్పటికి పాపములోనే యున్నాను. నులివెచ్చని స్థితిలో జీవిస్తు పరిశుద్దాత్మను పొందుటయొక్క ప్రాముఖ్యతను ఎరుగకయే యున్నాను. అయితే ఆయన సేవకునిద్వారా బైబిల్‌ ప్రకారము సత్యసువార్త బోధింపబడి నమ్మి నాతోకూడా పరిశుద్దాత్మ నివసిస్తాడని తెలుసుకొన్నాను. పాపవిమోచన పొందిన వారువాత మొదటిలో నాలో పరిశుద్దాత్మ యున్నదని నమ్మకము కలిగేదికాదు. ఎడతెగక వాక్యము చదువుతుండటవల్ల నాలో ఏదో క్రొత్త విశ్వాసము వికసించినదని పరిశుద్దాత్మను పొందానని విశ్వసించాను. యిప్పుడు నాలో నిజముగా పరిశుద్దాత్మ నివసిస్తున్నాడని దృఢముగా నమ్ముతున్నాను. నేను పాపక్షమాపణ పొందినప్పుడుఎవరైతే పాపరహితులై యుంటారో వారుమాత్రమే దేవుని బిడ్డలౌతారని పరిశుద్దాత్మాను పొందుతారని నాకు తెలుసు.
ఆయన దృష్టిలో క్రమమైన జీవితము జీవించాలని ఎంత ప్రయత్నించినా అది నేను పరిశుద్దాత్మను పొందుటకు తోడ్పడదని నాకు తెలుసు. తాము పాపులమని ఎరిగి దాని గూర్చి వారుఏమి చేయాలో ఎరుగని వారి దగ్గరికి దేవుడు వస్తాడు. ఆయన కోసం ఆశతో చూచెవారి దగ్గరకు ఆయన వస్తాడు.
కేవలము మంచిచేయడం వలన నిర్లక్ష్యముగా దేవుని నమ్ముటవలన నేను దేవుని రాజ్యము చేరలేనని, నా పాపములనుండి నీటిమూలముగాను ఆత్మమూలముగానైన సువార్తద్వారా నన్ను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని నేను ఎరుగునట్లు దేవుడు చేసాడు. నిరంతరం నాలో జీవించునట్లు పరిశుద్దాత్మను ఆయన నాకు అనుగ్రహించాడు. 
నన్ను ఆయన తనబిడ్డగా చేసుకొని పరిశుద్దాత్మతో నింపి నన్ను ఆశీర్వదించిన దేవునికి స్తుతులు. నేను ప్రభువును యెరుగకపోయినట్లయితే నా హృదయంలో ఇంకా పాపము ఉండి యుండేది. అంతేగాక నిత్యనరకములో పడియుండేవాడిని.
 అదేవిధముగా ఒకప్పుడు నేను సిలువలో ఆయనరక్తమును మాత్రమే నమ్మాను. అందువలన ఎంత ప్రయత్నించినప్పటికీ పరిశుద్దాత్మను పొందలేకపోయాను. ఆ సమయములో నేను దేవుని నమ్మాను. కానీ నా హృదయంలోయున్న పాపమువలన పరిశుద్దాత్మను పొందలేకపోయాను. ఒక పాపి తన హృదయములో పరిశుద్దాత్మ నింపుదలను పొందలేడు. అయినప్పటికీ చాలా మంది పాపులు వారి హృదయం పాపభరితమైయుండగా పరిశుద్దాత్మను పొందాలని ఆశిస్తారు.
మీరు నిజముగా పరిశుద్దాత్మను పొందాలి అనుకుంటే ఆయనతో సహవాసము గియుండాలిఅనుకుంటే నీటిమూలముగాను ఆత్మమూలముగాను జన్మించాలి నీవు యింక పాపివేనా? ముందుగాను పరిశుద్దాత్మను పొందిన వారి వద్ద నుండి నీవు సత్యసువార్తను వినవచ్చు పరిశుద్దాత్మతో సహవాసము కలిగియుండాలి అనుకునే వారుతృష్ణగల హృదయంగలిగి నీటిమూలముగాను ఆత్మమూలముగానైన సువార్తను నమ్మాలి. 
ఆలయములోని నీతిమంతులు మాత్రమే పరిశుద్దాత్మ వాక్కును వినగలరు. వారుసత్యసువార్తను వినుటద్వారా నమ్మకమైన జీవితమును జీవించెదరు. అయితే పాపులు సత్యసువార్తను ఎప్పుడు వినకుండానే నరకమునకు పాత్రమైన శాపభరితమైన జీవితమునుగడుపుతారు.
కాబట్టి మీరు నీటిమూలముగాను ఆత్మమూలముగానైన సువార్తను గూర్చి నేర్చుకోవాలి. ఈ సువార్తను మీరు ఎందుకు నమ్మాలి?మీరు ధర్మశాస్త్రసంబంధమైన మతము నుండి తప్పించుకొని దేవుని వాక్యము పైనఆధారపడి నసత్యసువార్తపైన నీనమ్మకమును నిర్మించుకోవాలి.నీటిమూలముగాను ఆత్మమూలగానైన సువార్త ఆదిమసంఘకాలములోని అపోస్తులులు అనుసరించిన సువార్త ఖచ్చితముగా ఒక్కటే. క్రైస్తవులందరు పరిశుద్దాత్మను పొందాలి. అప్పుడే వారు దేవుని కుమారులనబడతారు.
ఎవరైతే ఇంకా నీటిమూలముగాను ఆత్మమూలముగాను కొత్తగా జన్మించుట అనే సత్యసువార్తను నమ్మరో వారి హృదయాలలో ఇంక పాపమున్నదని అర్ధము. వారు పరిశుద్దాత్మతో సహవాసము పొందలేరు. వారు పరిశుద్దాత్మను పొందాలంటే ముందుగావారు దేవుడనుగ్రహించిన నీటిమూలముగాను ఆత్మమూలముగానైన సువార్తను నమ్మాలి.
 

బైబిల్‌ గ్రంధములో పలుచోట్ల పరిశుద్దాత్మ అను మాట ఉపయోగింపబడినది.

యేసు పునరుత్థానము తరువాత పరిశుద్దాత్మ నింపుదల పొందుట మొదలైనది. నేదే రక్షణ దినము నేడే ఆయన అమితమైన కృపకాలం. అయితేమనమునీటిమూలముగానుఆత్మమూలముగానైన సువార్తను నమ్మకుండ పరిశుద్దాత్మ సహవాసము లేకుండా జీవించినట్లయితే ఎంతో దురదృష్టకరము.
మీరు పరిశుద్దాత్మతో సహవాసముగలిగియున్నారా? మీ పాపములవలన మీరు పరిశుద్దాత్మను పొందలేకపోతున్నారా? అయితే మీరు నీటిమూలముగాను ఆత్మమూలముగానైన సువార్తను తెలుసుకోండి. మీరు ఈ సువార్తను నమ్మినట్లయితే పరిశుద్దాత్మ మీలో నివసించి మీ స్నేహితుడౌతాడు. నీటిమూలముగాను,ఆత్మమూలముగానైన సువార్తను నమ్మిన వారిలో మాత్రమే పరిశుద్దాత్మ నివసిస్తాడు. నీతిమంతుల హృదయంలో పరిశుద్దాత్మ తన యొక్క చిత్తమును తెలియపరుస్తాడు. పరిశుద్దాత్మతో పౌలు యొక్క పరిచర్య ఏమిటంటే సువార్తను ప్రకటించుటయే.
 పరిశుద్దాత్మను పొందిన వారిని మీరెలా గుర్తిస్తారు. కొండ గుర్తు ఏమిటి అంటే నీటిమూలముగాను ఆత్మమూలముగాను క్రొత్తగా జన్మించినవారైతే పరిశుద్దాత్మను పొందినవారు. సత్యసువార్తను నమ్మనివారిలో పరిశుద్దాత్మ నివసించడు. ఎవరైతే యోహోనుచేత యేసుపొందిన బాప్తీస్మమును ఆయన సిలువలోచిందించిన రక్తమువలన మనకు యివ్వబడిన పాపక్షమాపణను నమ్ముతారో వారిలో మాత్రమే పరిశుద్దాత్మ నివసిస్తాడు. మీరు పరిశుద్దాత్మతో సహవాసము గలిగి యుండాలి అని అనుకుంటున్నారా?
మీరు పరిశుద్దాత్మనుపొంది ఆయనతో సహవాసము కలిగియుండాంటే మీరు ఎటువంటి సువార్తను అర్ధము చేసుకోవాలో మీకుతెలుసా? యోహాను చేతయేసుబాప్తిస్మం పొందాడని ఆయన సిలువ లొరకము చిందించాడనితిరిగి పునరుత్థానుడైయున్నాడని సత్యసువార్తను నమ్మాలి. మీరు నీటిమూలముగాను ఆత్మమూలముగానైన సువార్తను నమ్మకపోతే మీ పాపములు క్షమింపబడవు. అందువలన పరిశుద్దాత్మ మీలో నివసింపలేడు. మనుష్యులు తనను పొందాలి అంటే నీటిమూలముగాను,ఆత్మమూలముగాను క్రొత్తగా జన్మించాలని పరిశుద్దాత్ముడు గట్టిగా ఆడుగుచున్నాడు. పరిశుద్దాత్మ పాపుల హృదయంలో నివసించడు. పరిశుద్దాత్మను పొందాలి అంటే ముందుగా మీ పాపములు క్షమింపబడునట్లు సత్యసువార్తను నమ్మాలి. మరియు నీవు పరిశుద్దాత్మతో సహవాసము గలిగియుండాలి అనుకుంటే సత్యసువార్తను నమ్మకముగా ప్రకటించాలి. నీవు పరిశుద్దాత్మచే నడిపించబడాలి అంటే సత్యసువార్తను ఎ్లప్పుడు ప్రేమించి, నీవు వెళ్ళిన చోటల్లా దానిగూర్చి ప్రకటించుటకు ప్రయత్నించాలి. నీటిమూలముగాను ఆత్మమూలముగాను జన్మించుటను గూర్చి బోధించే వారిలో పరిశుద్దాత్మ ఉంటాడు.
సత్య సువార్తను నమ్ముచున్న నీతిమంతులైన వారికే పరిశుద్దాత్మ అనుగ్రహింపబడినది. ఈ సువార్తను నమ్ముచున్న నీతిమంతులు మాత్రమే పరిశుద్దాత్మతో సహవాసము గలిగియుంటారు. పరిశుద్దాత్మకు ఆమోదయోగ్యమైన సువార్త ఏదనగా (1 యోహాను 5:3-7)యోహాను చేత యేసుపొందిన బాప్తిస్మము మరియు ఆయన సిలువలో చిందించిన రక్తముతో కూడిన సత్యసువార్త.
పేతురుకూడా ఈ సత్యసువార్తను నమ్మి (1 పేతరు 3:21లో) ఈ విధముగా చెప్పెను. ‘‘దానికి సాదృశ్యమైన బాప్తీస్మము యిప్పుడు మిమ్మును రక్షించుచున్నది: అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనసాక్షినిచ్చు ప్రత్యుత్తరమే’’బైబిల్‌లో ‘‘నీరు’’,ఎక్కువగా బాప్తిస్మము అనగా యేసు పొందిన బాప్తీస్మమునకు సాదృశ్యముగా యున్నది.
పరిశుద్దాత్మను పొందదగిన వారు సత్యసువార్తద్వారా విమోచనను పొంది పాపము నుండి విముక్తి పొందియున్నారు. ఎవరైతే సత్యసువార్తను నమ్ముతారో వారు ఆత్మచేత సత్యములోనికి నడిపింపబడి తండ్రిని ఆత్మతో పూజింపగలరు. (యోహాను 4:23). నీతిమంతుడు తన జీవితమును పరిశుద్దాత్మతో నింపబడుటకు పరిశుద్దాత్ముడు సహాయపడతాడు. పరిశుద్దాత్మను పొందినవారు నిరంతరము దేవుని స్తుతిస్తూ జీవిస్తారు. మనము దేవుని బిడ్డలమని పరిశుద్దాత్ముడు రూఢిపరుస్తాడు. మనము ఎల్లకాలము నీటిమూలముగాను ఆత్మమూలముగానైన సువార్తలోను పరిశుద్దాత్మతోను జీవించుదాము.
 

తనను తాను మోసగించుకొనువారితో పరిశుద్దాత్మ సహవాసము చేయడు.

1 యోహాను 1:8లో పరిశుద్దాత్ముడు పాపులతో ఈ విధముగా అంటున్నాడు,‘‘మనము పాపములేనివారమని చెప్పుకొనిన యెడల మనలను మనమే మోసపుచ్చుకొందుము. మరియు మనలో సత్యముండదు. తమను తామే మోసగించుకొనువారిలో పరిశుద్దాత్ముడు నివసించడు’’, పాపులను పరిశుద్దాత్ముడు ఈ విధముగా గద్దిస్తున్నాడు. ‘‘యేసు బాప్తిస్మమును ఆయన రక్తమును గూర్చిన సత్యసువార్తను మీరెందుకు నమ్మరు’’? యేసు బాప్తీస్మమును ఆయన రక్తమును గూర్చిఎరుగకుండా క్రొత్తగాజన్మించి పరిశుద్దాత్మ పొందిన ఒక క్రైస్తవుని సాక్ష్యమును మనమిప్పుడు చూద్దాం. ఇప్పుడతడు నీటిమూలముగాను ఆత్మమూలముగాను క్రొత్తగా జన్మించి పరిశుద్దాత్మను పొందాడు. ఇక్కడ పరిశుద్దాత్ముడు నిజముగా ఎవ్వరిలో నివసిస్తాడో మనము తెలుసుకోవాలి.
 
 
నీతిమంతులు తమ పాపములను ఒప్పుకొనుట వలన పరిశుద్దాత్మ సహవాసము గలిగియుంటారు.

నేను నీటిమూలముగాను ఆత్మమూలముగా నైనసత్యసువార్తను నమ్మినవారితో మాట్లాడుట వలన పరిశుద్దాత్మను పొందాను నీతిమంతునికి దేవుడు ఏమని చెప్పుతున్నాడో ఒకసారి చూద్దాం. 1 యోహాను 1:9లో ‘‘మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును’’. ఈ వచనము యొక్క అర్ధమేదనగా అపవిత్రమైన మన హృదయంలోనుండి పాపము కడుగబడుటకు ఆయన బాప్తీస్మం పొందుట ద్వారామన పాపములన్నిటిని ఆయనపైవేసుకొని మన పాపపరిహారార్ధమై సిలువ వేయబడ్డాడు అని ప్రకటించు సత్యసువార్త యందు నమ్మకముంచాలి. నీతిమంతులు దేవుని ఎదుట తమ పాపములు ఒప్పుకోవాలి. అప్పుడే వారుపరిశుద్దాత్మతోసహవాసము కలిగియుంటారు. నీతిమంతులు వారిపాపములు ఒప్పుకొని సత్యసువార్త యందు విశ్వాసముంచాలి.
చాలాకాము క్రిందట యేసు బాప్తీస్మము మరియు ఆయన రక్తమును గూర్చిన సత్యసువార్త మన పాపమున్నిటినీ కడిగివేసినది. అందువలన నీతిమంతుడు ఈ సువార్తను విశ్వసించి వారి పాపము నుండి విడుదల పొందాలి. నీటిమూలముగానుఆత్మమూలముగానైన సువార్త ద్వారా ప్రభువుఎప్పుడో వారిపాపములను క్షమించాడు. నీతిమంతులు వారి పాపముల నుండి విడుదల పొందుటకు సత్యసువార్తయందు విశ్వాసముంచాలినీతిమంతులు వారి పాపముల వలన అపవిత్రులైయున్నప్పుడు నీటిమూలముగానుఆత్మమూలముగాను క్రొత్తగా జన్మించు సువార్తను నమ్ముటద్వారా వారి హృదయాలను పరిశుద్దపరచుకోవాలి.
 మన ప్రభువు ఆయన బాప్తీస్మం ఆయన రక్తముద్వారా ఎన్నో యేళ్ళ క్రితం నీతిమంతుల పాపములు కడిగివేసాడు. కాబట్టి ఎవరైతే విశ్వాసముంచారో వారందరు నిజముగా పాపముల నుండి విడుదల పొందినావారు. అయితే నీతిమంతులు దేవుని ఎదుట తమ పాపములను ఒప్పుకోవాలి. సత్యసువార్తను నమ్మాలి. దానివైపు మళ్ళుకొని పాపవిమోచన పొందాలి. అందువలన వారు పరిశుద్దాత్మతో కూడిన క్రొత్త జీవితమును అనుభవిస్తారు. ఎవరైతే వారి బహీనతలతో సంబంధము లేకుండా ప్రభువు వైపు చూస్తారో వారు నిజమైన దేవుని సహవాసము గలిగియుంటారు. నీటిమూలముగాను ఆత్మ మూలముగాను క్రొత్తగా జన్మించుట అను సత్య సువార్తను అనుగ్రహించిన దేవునికి వందనములు.
 

పరిశుద్దాత్మతో సహవాసమును గూర్చిన సరియైన అవగాహన మనమెలా పొందగలుగుతాము?

పరిశుద్దాత్మతో సహవాసము గలిగి జీవించాలని ఎంతోమంది కోరుకుంటారు. గాని వారు యేసుని నమ్మినప్పటికి ఆ కోరికను ఎలా నిజము చేసుకోవాలో వారికి తెలియదు. ఆ సమయం నుండి మనుష్యుందరు నీటిమూలముగాను ఆత్మమూలముగానైన సువార్తను విశ్వసించి పరిశుద్దాత్మతో సహవాసం కలిగి జీవిస్తారు.
అలాగుననే నీతిమంతుడైన వ్యక్తి కేవలము ఒక్కమార్గముద్వారానే పరిశుద్దాత్మతో సహవాసము కలిగియుంటాడు. అదేదనగా నీటిమూలముగాను ఆత్మమూలముగాను జన్మించు సత్యమందు విశ్వాసముంచుట. నీతిమంతుల పరిశుద్దాత్మ మధ్యనున్న సహవాసము సత్యసువార్త లేకుండా కలుగదు. అయితే పరిశుద్దాత్మతో సహవాసమును గూర్చిన సంగతి ఏమిటి? అది కేవలము సత్యసువార్తయందు విశ్వాసముంచుట ద్వారానే సాధ్యమౌతుంది.
 

మనుష్యులు తమ జీవితాంతం పాపం చేస్తూనే ఉంటారని దేవుడు అంటున్నాడు

1యోహాను 1:10లో ‘‘మనము పాపముచేయలేదని చెప్పుకొనిన యెడల ఆయనను అబద్దికునిగా చేయువారమగుదుము. మరియు ఆయన వాక్యము మనలో ఉండదు’’, దేవుని యెదుట పాపము చేయనివాడు ఒక్కడు కూడా లేడు. ప్రసంగి 7:20లో కూడా ఇలా వ్రాయబడియున్నది. ‘‘పాపము చేయక మేలు చేయుచునుండు నీతిమంతుడు భూమిమీద ఒక్కడైనను లేడు. దేవుని యెదుట మనుష్యుందరు పాపులే. ఎవడైనను నేనుపాపము చేయలేదని అన్నట్లయితే వాడు అబద్దికుడు’’. మనుష్యులు జీవితాంతం చనిపోయే వరకు పాపం చేస్తూనే ఉంటారు. అందువలననే యేసు వారి పాపములన్నిటిని మోయుటకు యోహానుచేత బాప్తీస్మము పొందాడు.మనము పాపము చేయకపోతే దేవుని రక్షకునిగా నమ్మవలసిన అవసరము లేదు. తాము పాపములు చేయలేదనుకొనువారితో తేవుడు ‘‘నా వాక్యము మీలో లేదు’’అని అంటున్నాడు. నీటిమూలముగాను ఆత్మమూలముగాను క్రొత్తగా జన్మించాలినినమ్మనివారు నాశనమునకు పాత్రులు.నీతిమంతుడైనప్పటికి, పాపియైనప్పటికి దేవుని యెదుట నేను పాపము చేయలేదంటారో వారు సత్యసువార్తను విశ్వసించుటకు పాత్రులు కారు.
దేవుడు ప్రతి ఒక్కరికి సత్యసువార్తను అద్భుతమైన బహుమానముగా ఇస్తాడు. మేము సత్యసువార్త వలన పాపక్షమాపణ పొందుటకు మా పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపపడ్డాము. మనము పరిశుద్దాత్మతో సహవాసము కలిగి ఉండాలంటే దేవుడు పాపక్షమాపణ నిమిత్తము మనపైనుంచిన సత్యసువార్తవైపు మనం మళ్ళుకోవాలి. పరిశుద్దాత్మతో సహవాసం కలిగి ఉండాలంటే నీటిమూలముగాను ఆత్మమూలముగాను క్రొత్తగా జన్మించుటను నమ్మాలి.అంతేకాక నీటిమూలముగాను ఆత్మమూలముగాను క్రొత్తగా జన్మించినవారు దేవునితో సహవాసం కలిగి ఉంటారు.
ఆదాము హవ్వ పాపాము వలన మనుష్యులకు సంక్రమించిన పాపమువలన మనుష్యుడు దేవునికి దూరస్థుడయ్యాడు. ఆ పాపభీజము యొక్క వారసత్వము పొందిన మనము దేవుని యొక్క సహవాసము కొరకు మళ్ళి చూడవచ్చును. అందుకు నీటిమూలముగాను ఆత్మమూలముగానైన యేసుక్రీస్తుయొక్క సత్యసువార్తయందు విశ్వాసముంచుటద్వారా మనను దేవునికి సమీపస్తులమైయున్నాము. పాపక్షమాపణ పొందగలము.
ఎవరైతే ఈ సత్యసువార్తయందు నమ్మకముంచుతారో వారు వారిపాపములనుండి రక్షింపబడతారు. దేవుడు వారిలో పరిశుద్దాత్మను నింపుతాడు. నీతిమంతులు దేవునితో సహవాసము కలిగియుంటారు. ఎందుకంటే వారు పరిశుద్దాత్మను పొందుతారు. ఎవరైతే వారి పాపమువలన దేవునినుండి దూరమైయ్యారో వారందరు నీటిమూలముగాను ఆత్మమూలముగాను క్రొత్తగా జన్మించుటవలన దేవునితో నిజమైన సహవాసము గలిగి యుంటారు.
పరిశుద్దాత్మ నింపుదల సత్యసువార్త యందు విశ్వాసముంచుట ద్వారా గలుగుతుంది. నీటిమూలముగాను, ఆత్మమూలముగాను క్రొత్తగా జన్మించుటద్వారాను పరిశుద్దాత్మను పొందుతామని మనము తెలుసుకోవాలి. సత్యసువార్తయందు విశ్వాసము దేవుని వద్దకు ఒకక్రొత్త దారిని చూపినది. మన జన్మపాపము. కర్మపాపమువలన దేవుడు మనలను దూరముగా ఉంచినాడు. అడ్డుతెరను ఆయన సిలువ మరణములో తొలగించాడు. నీటిమూలముగాను, ఆత్మమూలముగానైన సత్యసువార్తను నమ్ముటద్వారా దేవునికి సహవాసమునందుంచాడు.
మనము పరిశుద్దాత్మతో సహవాసమును పున:స్ధాపించుకోవాలి. నీటిమూలముగాను ఆత్మమూలముగానైన సువార్తనునమ్మి దానికి లోబడుటద్వారా మనము పరిశుద్దాత్మతో నిజమైన సహవాసము గలిగియుంటాము. సత్యసువార్తనుండి పాపక్షమాపణ కలుగుతుందని మనము నమ్మాలి. అప్పుడే పరిశుద్దాత్మతో సహవాసము గలిగియుంటాము. ఎవరైతే పాపక్షమాపణ పొందలేదో వారు పరిశుద్దాత్మతో సహవాసము పొందలేరు. నీటిమూలముగాను ఆత్మమూలముగాను క్రొత్తగా జన్మించకుండఎవ్వరుకూడా పరిశుద్దాత్మతో సహవాసము గలిగియుండలేరు.
మీకు పరిశుద్దాత్మ సహవాసము పొందుటకు కష్టమనిపిస్తే ముందుగా మీరు నీటిమూలముగాను ఆత్మమూలముగాను క్రొత్తగా జన్మించలేదని పాపక్షమాపణ పొందలేదని మీరు ఒప్పుకోవాలి. మీరు పరిశుద్దాత్మతో సహవాసము గలిగియుండాలిఅనుకుంటే యేసు బాప్తీస్మము మరియు ఆయన రక్తమును గూర్చిన సత్యసువార్తను నమ్మండి. అప్పుడే మీ పాపములు క్షమింపబడి బహుమానముగా పరిశుద్దాత్మను పొందుతారు. సత్యసువార్త మీకు ఖచ్చితముగా పరిశుద్దాత్మతోసహవాసమును యిస్తుంది