(మత్తయి 25:1-12)
‘‘పరలోరాజ్యము, తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయుదేరిన పదిమంది కన్య కలను పోలివున్నది.వీరిలో అయిదుగురు బుద్దిలేని వారు,అయిదుగురు బుద్దిగలవారు. బుద్దిలేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతోకూడా నూనె తీసికొనిపోలేదు. బుద్దిగలవారు తమ దివిటీలతోకూడ సిద్దెలలో నూనె తీసి కొనిపోయిరి. పెండ్లికుమారుడు ఆలస్యము చేయగా వారందరు కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రివేళ ఇదిగో పెండ్లికుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరు లేచి తమ దివిటీలను చక్కపరచిరి గాని బుద్దిలేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్దిగలవారినడిగిరి.అందుకు బుద్దిగల కన్యకలుమాకును మీకును ఇది చాలాదేమో, మీరు అమ్మువారియొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోవుచుండగా పెండ్లికుమారుడు వచ్చెను. అప్పుడు సిద్దపడి యున్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి; అంతట తలుపు వేయబడెను. ఆ తరు వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా, అయ్యా, మాకు తలుపు తీయుమని అడుగగా అతడుమిమ్మునెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను’’.
పరిశుద్దాత్మ ఎవరి దగ్గరికి వస్తాడు?
ఎవరైతే యేసు బాప్తీస్మంలోను ఆయన రక్తంలోను నమ్మకముంచుటవన తమపాపముకు క్షమాపణ పొందుతారో వారి దగ్గరకు ఆయన వస్తాడు.
కన్యకకు సూచనగా ఉండేవారెవరు?
పై భాగంలో అయిదుగురు బుద్దిగల కన్యకలుఅయిదుగురు బుద్దిలేని కన్యకులున్నారు. అయిదుగురు బుద్దిలేని కన్యకలు బుద్దిగల అయిదుగురు కన్యకల దగ్గరున్న నూనెను కొంచెం మాకియ్యమని అడిగారు. అయితే ఆ బుద్దిగల కన్యకు బుద్దిలేని వారితో ‘‘మాకును మీకును ఇది చాలదేమా, మీరు అమ్మువారు యొద్దకు పోయి కొనుక్కొనుడి’’,అని చెప్పారు. కాగా బుద్దిలేని వారు నూనెకొనుక్కొడానికివెళ్ళగా,నూనెగలబుద్దిగల అయిదుగురు కన్యకులు తమదివిటీలను వెలిగించుక పెండ్లివిందులోనికి వెళ్లారు.ఇలాఅయితే దేవుని కొరకు మనం నూనెను ఎలా సిద్ధపరచగల? మనహృదయాలలో పాపక్షమాపణకలిగి ఆయనకొరకు ఎదురుచూస్తూ ఉండడమొక్కటే మనం చేయగలిగేది
మనుష్యులలో రెండు రకాల విశ్వాసాన్ని మనం చూస్తాం. మొదటిది పాపక్షమాపణా సువార్తలో విశ్వాసం కలిగి వుండడం. ఇది పరిశుద్దాత్మను పొందడానికి నడుపుతుంది. రెండోది, తమ స్వంత మత విశ్వాస ప్రమాణాలపై నమ్మకం కలిగి తమ పాపాలను దేవుడు క్షమించాడా, లేదా అన్న దానిని పట్టించుకోకుండా వుండడం.
తమ స్వంత విశ్వాస ప్రమాణాలపై నమ్మకం కలిగివున్న వారికి సువార్త భారంగా వుంటుంది. పెండ్లికుమారుడు వచ్చినప్పుడు నూనె కొనడానికి వెళ్ళిన బుద్దిలేని కన్యకల్లా, పరిశుద్దాత్మను పొందాలని ఒక మందిరంనుండి మరొక మందిరానికి వెళ్ళేవారు తమనుతామే మోసగించుకొంటున్నారు. అలాంటివారు తీర్పుదినానికి ముందే తమ హృదయాలలో సువార్తను నమ్మాలన్న సత్యం వారికి తెలియదు. తమకున్నఆసక్తితో దేవునివశపరుచుకొని (లేక సంతృప్తి పరచి) పరిశుద్దాత్మను పొందాలనుకొంటారు. పరిశుద్దాత్మను పొందాలని మహా ప్రయత్నాలు చేసిన ఒక సంఘకాపరి (లేక పరిచారకుని) ఒప్పుకోలును చూద్దాం. అది మీకు సహాయకరంగా వుంటుంది.
‘‘పరిశుద్దాత్మను పొందడానికి చేయవసిందంతా చేశాను నేను. నా విశ్వాసంలో మన:పూర్వకమైన భక్తి కలిగి (లేక పట్టుదల గలిగి) వుంటే నేను పరిశుద్దాత్మను పొందగలను’’, అని అనుకొని ఒక ప్రార్ధనా మందిరం నుండి మరొక దానికి మరొక దానికి అలా తిరిగాను. ఒక ప్రార్ధనా మందిరంలో ఆరాధానా క్రమంలో భాగంగా ఎలక్ట్రిక్ పియానోను, డ్రమ్ములను వ్రాయించారు. పరిశుద్దాత్మను పొందాలనుకొన్న వారిని పాస్టరు ఒక్కొక్కరిని రమ్మని పిలిచి, వారి నుదిటి మీద చరచగా అతడు భాషలో మాట్లాడడం మొదలుపెట్టాడు. పాస్టరుగారు చుట్టూ పరుగెత్తూతూ మైక్రోఫోనులో మాట్లాడుతూ ప్రజల తలలపై చేతులుంచి‘‘అగ్నిని పొందండి’’పొందండి, అగ్నిని పోందండి.అని అరుస్తూ కొందరిని మూర్చపోయేట్లు కొందరిని స్మారకం లేకుండా పడిపోయేట్టు చేశాడు. ఈ అభ్యాసం పరిశుద్దాత్మను పొందడానికేనా అన్న నా అనుమానం నాకున్నాఅప్పటికే నేనీ కూడికలకు అలవాటు పడిపోయాను. ఇన్ని చేసినా, పరిశుద్దాత్మను నేను పొందలేకపోయాను.
ఆ అనుభవం తరువాత నేను కొండమీదికి వెళ్ళి ఒక దేవదారు వృక్షాన్ని పట్టుకొని ఏడ్వడానికి ప్రయత్నిస్తూ,రాత్రంతా ప్రార్ధించాను. ఒక గుహలోకూడా ప్రార్దించడానికి ప్రయత్నించినా అదీ పని చేయలేదు. దాని తర్వాత నలభై రోజులు రాత్రంతా ప్రార్ధించినా నేను పరిశుద్దాత్మను పొందలేకపోయాను. ఆ తర్వాత వారానికొక రోజు చొప్పున ఏడు వారాలు సాగే ఒక సెమినార్‌కు నన్ను ఆహ్వానించారు,
ఆ సెమినార్ దేవుని ప్రేమ, సిలువ, యేసుపునరుత్ధానం, తలపైచేతులుంచుట, ఆత్మఫలం, ఆధ్యాత్మిక ఎదుగుదల అన్నఅంశాలపై జరుగుతుంది. ఆ సెమినార్ కార్యక్రమం దాదాపు అయిపోయిన తర్వాత ఆ సెమినార్ బోధకుడు నాతలపై చేతులుంచి పరిశుద్దాత్మ కొరకు ప్రార్దనచేశాడు. ఆయనచేయమన్నట్టల్లా చేశాను. నాలోనివత్తిడి కొంచెం తగ్గిన తర్వాత ఆకాశం వైపు నా హస్తాన్ని చాచి,అని పదేపదే పెద్దగాఅరిచాను. నేనలా కేకలు వేస్తూ వుండగా ఒక అన్యభాషలో నేను ధారళంగా మాట్లాడడం మొదలు పెట్టాను. పరిశుద్దాత్మను పొందినందుకు చాలామంది నన్ను అభినందించారు. అయితే ఒంటరిగా యింటి దగ్గర వున్నప్పుడు నేను భయపడ్డాను. అందుకని ఆ సెమినార్‌కు స్వచ్ఛంద సేవకునిగా వీలైనంత ఎక్కువ పని చేయాలని దేశమంతా తిరిగాను. కొందరు రోగుల మీద నాచేతులుంచినప్పుడు వారి రోగం పోయినట్టే కనిపించేది. కాని మళ్ళీ ఆ తర్వాత త్వరలోనే ఆ జబ్బు తిరగబెట్టేది. ఆ తర్వాత నా కళ్ళముందు దర్శనాలు కనిపించి నేను ప్రవచించేవాడను. ఆశ్చర్యం ఏమిటంటే నా ప్రవచనాలన్నీ నెరవేరినవి. అప్పటి నుండి అన్ని చోట్లకు నన్ను ఆహ్వానించేవారు. ఒక ప్రసిద్ద వ్యక్తిగా చూసేవారు నన్ను. అయినా నేనింకా భయపడుతూనే వుండేవాడను. అలాంటి రోజులలో ఒక రోజున ‘‘ఇలా ఒక చోట నుండి మరో చోటుకు తిరగక, మీ ఇంటికి వెళ్ళి మీ కుటుంబం రక్షణ పొందేందుకు సహాయం చెయ్యి, అన్న ఒక స్వరం విన్నాను. అయినాఅదెలాంటి రక్షణో నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా ఈ పరిశుద్దాత్మ వరాన్ని గాని నేను వుపయోగించకపోతే దాన్ని ఆయన నా నుండి తీసివేసుకుంటాడని యితరులు నాతో చెప్పారు. ఒక ప్రక్కన సమర్ధతనుఉపయోగించడానికి నేనుభయపడుతున్నా వాటిని చేయడం నేను మానలేదు.
ఒక రోజున ఒక మంత్రగత్తె (కర్ణ పిశాచి గల వ్యక్తి) క్రీస్తును నమ్మాలను కొంటున్నదని విని, మేము వస్తున్నామని ముందుగా ఆమెకు తెలియచేయకుండానే నా స్నేహితులతో ఆమె దగ్గరకు వెళ్ళాను. ఆమె అప్పటికే వాళ్ళ యింటి ముందు గేటు దగ్గర మా కొరకు ఎదురు చూస్తూ వుంది. మమ్ములను చూడగానే, ‘‘మీరు వస్తున్నారని నాకు తెలుసు’’!అని చెప్పింది. తర్వాత హఠాత్తుగా మా మీద నీళ్ళు చల్లుతూ తూర్పు దేశపు కర్ణ పిశాచత్వానికి,పశ్చిమ దేశపు కర్ణ పిశాచత్వానికి భేదం లేదు’’, అని అంటూ‘‘యేసుమాంత్రికులు’’!అని మా వైపు చూపుతూ, ‘‘ఈయన పిరికివాడు. అతడు కాదు’’ అని అన్నది. ఆ మంత్రగత్తె చెప్పిన మాట నా తలకో పెద్ద దెబ్బలా తగిలింది. నేను చేస్తున్న దానికి ఆ మంత్రగత్తె చేస్తున్న దానికి భేదమేమి లేదు. నా హృదయంలో యింకా పాపం వుంది గనుక నేను చేసినదేదీ నాలోకి పరిశుద్దాత్మను తీసుకురాలేకపోయింది అని ఆలోచించడం మొదలుపెట్టాను,.
ఈ ఒప్పుకోలును బట్టి పరిశుద్దాత్మను పొందడం మన శక్తి సామర్ధ్యాలకు మించినది. అని మేము తెలుసుకొన్నాం. అలాంటి విశ్వాసం దేవుని సువార్తపై ఆధారపడి లేదు గనుక యిలాంటి మత జీవితం జీవించే వారిదివిటీలో నూనె వుండదు.
బైబిల్లోని దివిటీ సంఘాన్ని, నూనె పరిశుద్దాత్మను సూచిస్తున్నాయి. పరిశుద్దాత్మను పొందకుండా అది దేవుని సంఘమో కాదో తెలియకుండాసంఘానికి హాజరయ్యేవారు అవివేకులు.
అవివేకులు రోజురోజుకు తమభావోద్రేకాలతోబాటు,అత్యాసక్తిగలశరారాలను దేవునిముందు మనభావోద్రేకాలు మొత్తం 20 సి.యం.అనుకుని రోజు 1 సి.యం. వెలిగిస్తే మన భావోద్రేకాలనన్నింటిని తగుబెట్టడానికి 20 రోజులు పడుతుంది వారి విశ్వాసం వెనుక వున్న భావోద్రేకాలు ప్రాత:కాల ప్రార్ధనలు, రాత్రంతా జాగారముండి చేసే ప్రార్ధనలు, ఉపవాస ప్రార్ధనలు, ఉజ్జీవ సభలద్వారా నూతన శక్తిని పొందుతాయి. కాని వారి భావోద్రేకాలు వారి జీవితాంతం వెలుగుతూనే వుంటాయి.వారి స్వంత భావోద్రేకాలను తగులబెట్టడానికి ఎన్నటికి తరగని విధానానికి అలవాటు పడిపోతారు.
వారి భావోద్రేకాలు యేసు నామములోకాలిపోతాయి. వారు సంఘానికి హాజరైవారి భావోద్రేకాలను కాల్చివేస్తారు. కాని వారి హృదయాలు మాత్రం కలవరంతో మరి దేని కొరకో వెదుకుతూ వుంటాయి. దీనికి కారణం వారి విశ్వాసం వారిశరీరానుభవాలనుండి వచ్చింది. కనుక వారిలోనున్న అగ్నిజ్వాలఆరిపోకుండా వారిలో ఎడతెగక వుండే అవసరం వారి భావాలను బలపరుస్తూ వుంటుంది. ఎలాంటి విశ్వాసంతో వారు పరిశుద్దాత్మను పొందలేరు. వారి భావోద్రేకాలను కల్చడం వలన పరిశుద్దాత్మను పొందునట్లు అవి చేయలేవు.
మనమందరం దేవుని పూర్ణ సన్నిధిలో పరిశుద్దాత్మను పొందడానికి సరైనవిశ్వాసంతో సిద్దపడాలి. అప్పుడు మాత్రమే పరిశుద్దాత్మను పొందడానికి యోగ్యులమవుతాం. పరిశుద్దాత్మను పొందే యోగ్యులనుగా చేసే విశ్వాసాన్ని మనం ఎలా సాధించగలం ఆ సత్యం యోర్ధాను నదిలో యేసు బాప్తిస్మం ద్వారా, సిలువమీద ఆయన కార్చిన రక్తం ద్వారా ఆయన పూర్తి చేసిన సువార్తలో వున్నది.
దేవుడు మనలను ‘‘చెరుపు చేయు పిల్లలారా’’అన్నాడు (యోషయా 1:4). దీనిని మనం అంగీకరించక తప్పదు. మానవులు పుట్టుకతోనే 12 పాపాలతో పుట్టారు (మార్కు 7:21-23).మానవులు పుట్టిన దగ్గర నుండి చనిపోయేంత వరకు పాపం చేయకుండా వుండలేరు.
యోహాను 1:6-7 యిలా వివరిస్తోంది, ‘‘దేవునియొద్దనుండి పంపబడిన ఒక మనుష్యుడు వుండెను;అతనిపేరుయోహాను. అతనిమూలముగా అందరు విశ్వసించునట్లు అతడు ఆ వెలుగునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను.’’. బాప్తిస్మమిచ్చు యోహాను యేసుకుబాప్తిస్మమిచ్చి‘‘ఇదిగో లోకపాపములను మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల ’’అని (యోహాను 1:29) లోక పాపాన్నంతటిని ఆయన మీద మోపాడు. మన పాపాలన్నింటి నుండి మనం రక్షించబడినందుకు యేసుక్రీస్తుకు బాప్తిస్మం యిచ్చినందుకు యోహానుకు వందనాలు. యోహాను గాని యేసుకు బాప్తీస్మమిచ్చి, లోక పాపాలను మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్ల ఆయనే అని ప్రకటించకుండా వుంటే యేసు మన పాపాలనన్నింటిని తనతో సిలువకు మోసికొని వెళ్ళాడని మనకు తెలిసేది కాదు. మన పాపాలనన్నింటిని మననుండి యేసు తీసుకొన్నాడని, మనం పరిశుద్దాత్మను పొందలగమని మనకు అర్ధమయ్యేట్లు సాక్ష్యమిచ్చిన యోహానుకు కృతజ్ఞతలు చెల్లించాలి.
ఈ విశ్వాసంతో పెండ్లి కుమారుడైన యేసును పొందడాని కిపెండ్లి కుమార్తెగాపూర్తిగా సిద్దపరచబడ్డాం. పరిశుద్దాత్మను పొందడానికి పూర్తిగా సిద్దపడిన యేసును నమ్మే కన్యకలం మనం.నీటి, ఆత్మ బాప్తిస్మ సువార్తను హృదయపూర్వకంగా నీవు నమ్ముతున్నావా? యోహాను ద్వారా ఆయన పొందిన బాప్తిస్మం వలన యేసుక్రీస్తు నీ పాపాలనన్నింటిని తాను తీసుకొన్నాడని నీవు నమ్ముతున్నావా? ‘‘వినుట ద్వారా విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును’’అని చెబుతోంది బైబిల్ (రోమా 10:17). పరిశుద్దాత్మను పొందడానికి యేసు యోహానువలన బాప్తిస్మం పొంది,సిలువ మీద చనిపోయాడని మనం తప్పక నమ్మాలి.యేసు మానవునిగా ఈ లోకానికి వచ్చియోహానుద్వారా బాప్తిస్మాన్ని పొంది, సిలువ మీద మరణించి, పునరుత్థానుడైనాడన్న నమ్మకం ద్వారానే పరిశుద్దాత్మను పొందగలమని మనం గ్రహించాలి.
పైన చదివిన పది మంది కన్యకలలో రెండు రకాల వారున్నట్టే ఈనాడు కూడా విశ్వాసులో రెండు వర్గాలవారున్నారు. మీరేవర్గంలో వున్నారు? నీటిఆత్మ బాప్తిస్మాలను నమ్ముటవల్లనే మీరు పరిశుద్దాత్మను పొందగలరు. మీరు సంఘారాధనకు హాజరవుతున్నారు. అయినా పరిశుద్దాత్మ మీ మీదికి రావాలని యింకా ఎదురు చూస్తూనే వున్నారు. పరిశుద్దాత్మను పొందే నిజమైన మార్గాన్ని మీరు తెలుసుకోవాలి.
ఏ నమ్మాకాలతో మనం పరిశుద్దాత్మను పొందగలం?,కర్ణపిశాచి ఆవహించిన పారవశ్యంతో పరిశుద్దాత్మను పొందగలమా?.అపస్మారక స్ధితిలో నీవు పరిశుద్దాత్మను పొందగలవారు మూఢభక్తిగల మతాలను నమ్ముట ద్వారా నీవు పరిశుద్దాత్మను పొందగలవారు నీ పాపక్షమాపణ కొరకు ఎడతెగక నీవు దేవునికి ప్రార్ధిస్తున్నావారు యేసు బాప్తీస్మాన్ని పొంది నీటిలో నుండి బయటికి రాగానే దేవుని ఆత్మ పావురంలా ఆయన మీదికి దిగి వచ్చాడు. మన పాపాలనన్నింటిని భరించడానికి మన అతిక్రమములన్నింటికి మూల్యం చెల్లించడానికి సిలువ వేయబడతానని ఆయన బాప్తిస్మం పొందాడు.
మనం రక్షించబడి, పరిశుద్దాత్మను పొందాలని, లోక పాపాలన్ని మోసుకొని సిలువకు వెళ్ళడానికి యేసు యోహానుద్వారా బాప్తిస్మం పొందడం వాస్తవం. యోహానువలన యేసు బాప్తిస్మం పొంది, మనపాపాల నిమిత్తం సిలువ మీద తీర్పు పొంది, పునరుత్ధానుడైనాడన్నది సత్యం. మనం పాపక్షమాపణ పొందడానికి యేసు యోహానువలన బాప్తిస్మం పొందడంలో సిలువలోని ఆయన రక్తంలోమనం విశ్వాసముంచాలి. మనలో ఎవరైతే ఆయన బాప్తిస్మంలో కడుగబడ్డామని నమ్ముతారో వారిమీదికే బాప్తిస్మం ద్వారా (మత్తయి 3:13-15) పరిశుద్దాత్మ పావురంలా రావడం చూడగలం.
పరిశుద్దాత్మను పొందాలంటే యోహానువలన యేసు పొందిన బాప్తిస్మాన్ని, సిలువ మీద ఆయన రక్తాన్ని తప్పనిసరిగా నమ్మాలి. ఒక వ్యక్తిపాపక్షమాపణను నమ్మినప్పుడు పరిశుద్దాత్మ పావురంలా సమాధానంతో అతని మీదికి వస్తాడు. ఇప్పటికే పరిశుద్దాత్మను పొందిన వారువిశ్వాసం ద్వారా పాపక్షమాపణ వల్లనే ఇది సంభవమైనదని తెలుసుకోవాలి. ఎవరైతే పాపక్షమాపణను తమ హృదయపూర్వకంగా నమ్ముతారో వారి మీదికి పరిశుద్దాత్మ దిగి వస్తాడు.
నిత్య జీవపు ఆహారంగా ద్రాక్షారసంగాయేసుక్రీస్తు వచ్చాడు. (మత్తయి 3:17,28, యోహాను 6:53-56). యేసు తన బాప్తిస్మం తర్వాత నీటిలో నుండి బయటికిరాగానే ఆకాశం నుండి ‘‘ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేనాదించు చున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.’’, అన్న ఒక శబ్ధం వినిపించింది. (మత్తయి 3:17)
దేవుడు త్రిత్వమని నమ్మడం సులభమే. దేవుడు యేసుకు తండ్రి. యేసు దేవుని కుమారుడు. పరిశుద్దాత్మ కూడా దేవుడే. త్రిత్వం మనకు ఒకే దేవుడు.
సిలువలో మాత్రమే నమ్మకముంచడం వలన, లేక నీతిమంతమైన క్రియల ద్వారా శుద్దీకరించబడాలని ప్రయత్నంచడం ద్వారా ఎన్నటికీ పరిశుద్దాత్మను పొందలేరని తెలుసుకోవాలి. మన పాపాలనన్నింటిని యేసుమీద మోపడానికే యోహాను ఆయనకు బాప్తిస్మమిచ్చాడని, మనకుపాపక్షమాపణ కలిగించడానికే ఆయన సిలువ వేయబడ్డాడని నమ్మినప్పుడే నీవు పరిశుద్దాత్మను పొందగలవు. ఈ సత్యం ఎంత సులభమైంది, ఎంత స్పష్టమైంది!పాపక్షమాపణను, పరిశుద్దాత్మను పొందడం కష్టం కానే కాదు.
దేవుడు మనతో సులభమైన మాటలతో మాట్లాడతాడు. మానవుని సాధారణ జ్ఞానం (IQ) 110 నుండి 120వరకుంటుంది. సాధారణ వ్యక్తులు ఆయన సువార్తను చివరికి 4-5 సం॥ బాలలు కూడా అర్ధం చేసుకోవడం చాలా సులభం. పరిశుద్దాత్మ ఉనికిని గూర్చి లేక పరిశుద్దాత్మ మనలో నివసించడాన్ని గూర్చి దేవుడు తర్క విధానంలో చెప్పి వుంటే మనమెప్పటికైనఅర్ధం చేసుకొని వుండే వారమా?.దేవుడు న్యాయంగా మన పాపాలనన్నింటిని క్షమించి, దానినినమ్మిన వారికి పరిశుద్దాత్మను వరంగా యిచ్చాడు.
తలపై చేతులుంచడం (హస్త నిక్షేపణం) ద్వారా, లేక పశ్చాత్తాప ప్రార్ధన వలన మనం పరిశుద్దాత్మను పొందలేమని దేవుడు చెబుతున్నాడు. ఉపవాసం ద్వారా, లేక భక్తి ద్వారా, లేక రాత్రంతా కొండల మీద ప్రార్ధించుట ద్వారా పరిశుద్దాత్మరాడు. మరి పరిశుద్దాత్మను ఏ విశ్వాస ఫలితంగా పొందగలం? యేసు ఈ లోకానికి వచ్చాడని, మన పాపాలన్నింటిని భరించడానికి బాప్తిస్మం పొందాడని, సిలువ మీద మరణించి, పునరుత్థానుడైనాడన్న సత్యంలో విశ్వాసముంచినప్పుడే పరిశుద్దాత్మను పొందగలం.
దీనిని మనం నిజంగా నమ్మాలా?
మన పాపాలకు మనమెందుకు క్షమాపణ పొందాలి?. దాని వలన పరిశుద్దాత్మను ఎందుకు పొందాలి?దేవుని రాజ్య పౌరులుగా వుండడానికి ఆయన ఆత్మ మనకు అవసరం. కాగా పరిశుద్దాత్మను పొందడానికి యేసు మన రక్షకుడని, ఆయన బాప్తిస్మంలోను, ఆయన రక్తంలోను నమ్మకముంచి, మన పాపాలకు క్షమాపణ పొందాలి.
ఎవరి పాపాలు క్షమించబడ్డాయో వారిని తన ప్రజలుగా ముద్రవేయడానికి వారికి పరిశుద్దాత్మను దేవుడేఅనుగ్రహించాడు. దేవుని వాక్యాధారంగా ఎవరైతే యేసులో నమ్మకముంచిన వారిని స్ధిరపరచిన రుజువుగా ఆయన వారికి పరిశుద్దాత్మను అనుగ్రహిస్తాడు.
చాలా మంది తప్పు విధానాలైన విశ్వాసంలో వుంటారు. యేసు బాప్తిస్మాన్ని నమ్మి పరిశుద్దాత్మను పొందడం చాలా సులభమే. ఇప్పటికే పరిశుద్దాత్మను పొందిన మనకూ అది సులభమే. కాని తమ పాపాలకు క్షమాపణ పొందని వారికి అది అసాధ్యం. వారికి సత్యం తెలియదు. దానికి బదులుపరిశుద్దాత్మను పొందడానికి ఇతర మార్గాలలో అనగా మత మౌఢ్యపు వాక్యాలతో, మతమనే మూర్చలో మునిగిపోయివుంటారు. సాతాను విత్తిన ఆలోచనల ద్వారా వారు కలవరంతో మూఢనమ్మకాల మత ప్రభావంలో పడిపోతారు.
యేసు బాప్తీస్మంలో, ఆయన సిలువ మీద కార్చిన రక్తంలో నమ్మకముంచి ఎవరైతే పాపక్షమాపణ పొందుతారో వారిలో పరిశుద్దాత్మ నివాసముంటాడు. దేవుని రక్షణలోనే నమ్మకం వున్నవారు ‘‘నాలో పాపం లేదు’’,అని ఒప్పుకుంటారు. నీటి,ఆత్మ బాప్తిస్మంలో, ఆయన సిలువ రక్తంలో నమ్మకముంచి, పాపక్షమాపణ పొందిన తన బిడ్డలైనవారికి హామీగా దేవుడు పరిశుద్దాత్మను అనుగ్రహించాడు.
యేసు బాప్తిస్మం, ఆయన రక్తం ద్వారామన పాపాలను ఆయన తీసివేసియున్నాడని యేసుఆయన శిష్యులుపరిశుద్దాత్మ సాక్ష్యమిస్తున్నారు. పరిశుద్దుడైన తండ్రి ప్రజలందరిని వారి పాపాల నుండి రక్షించాలని వుద్దేశించాడు. ఈ ప్రణాళికను యేసుక్రీస్తు అమలు జరిపాడు. ఈ ప్రణాళిక విజయవంతంగా అమలు జరిగిందని పరిశుద్దాత్మ హామీ ఇస్తున్నాడు.
మనలను తన ప్రజలుగా చేసుకోవాలని దేవుడు కోరుకొన్నాడు గనుక యేసు బాప్తిస్మం, రక్తం ద్వారా మన పాపాల నుండి మనలను రక్షించాలని ఆయన నిర్ణయించుకొన్నాడు. కాగా, మన రక్షణను, మన పాప క్షమాపణకు దైవ త్రిత్వం హామీనిస్తున్నాడు.
‘‘ఈయనే నా ప్రియ కుమారుడు. ఈయన యందు నేనానందించు చున్నాను’’ అని మత్తయి 3:17 వివరిస్తున్నది. కనుక దేవుని పరిశుద్దాత్మ ఎవరికైతే ఉన్నదో వారు దేవుని ప్రజలు. వారే ఆయన పిల్లలు. ఆదియందు యేసు దేవుడు’’, మీ పాపాలకు మీరు క్షమాపణ పొందాలనుకుంటే, నా అద్వితీయ కుమారుడైన యేసు సర్వమానవాళి పాపములను శాశ్వతంగా తీసివేశాడని నమ్మితేవారు పరిశుద్దాత్మను పొంది, నా బిడ్డలవుతారు’’,అని తండ్రియైన దేవుడు చెబుతున్నాడు. దీనిని ఎవరైతే నమ్ముతారో వారు తమ పాపాలకు క్షమాపణ పొంది దేవుని కుమారుడు, కుమార్తెలవుతారు. ఆయన బిడ్డలుగా ముద్రవేయబడడానికి వారికి పరిశుద్దాత్మను వరంగా ఆయన అనుగ్రహిస్తాడు. యేసు బాప్తిస్మంతో కలిపి ఆయన రక్తంలో నమ్మకముంచినప్పుడే మన పాపాలకు క్షమాపణ పొందుతాం.
ప్రజలు తమ హృదయాలోచనలను విసర్జించి క్షమాపణ సువార్తను నమ్మకపోతే వారిలోని అసలైన పాపం పోయిందని నమ్మి వారి అసలైన పాపాలకు క్షమాపణ నిమిత్తం ఎడతెగక పశ్చాత్తాప ప్రార్ధనలు చేస్తూ వుంటారు. ఇలాంటి ఆలోచనలకు వారు లొంగిపోతే వారు బైబిల్ తెలుసుకొనలేక కలవరపడిపోతారు. కనుక యేసు శిష్యుల నమ్మకానికి భిన్నమైన నమ్మకాలు కలిగి వుంటారు.
‘‘ప్రార్ధనలు ద్వారా’’,తమ మీదికి పరిశుద్దాత్మ వస్తుందని కొందరు చెబుతూ వుంటూరు. కాని బైబిల్ ప్రకారంగా యిది నిజం కానే కాదు. ఇది చూడ్డానికి సరి అయినదిగానే కనిపిస్తుంది. అయితే యోహాను వలన బాప్తిస్మం పొందిన యేసు నీటిలో నుండి ఒడ్డుకు రాగానే పరిశుద్దాత్మ పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చాడని బైబిల్ చెబుతోంది. మనం గాని పరిశుద్దాత్మను పొందాలనుకుంటే యేసు ఈ లోకానికి వచ్చాడని. లోక పాపాలను భరించడానికి యోహాను వలన బాప్తిస్మాన్ని పొంది, వాటి నిమిత్తం సిలువ మీద తీర్పు తీర్చబడి, మనకు రక్షకుడవడానికి పునరుత్ధానుడైనాడని మనం నమ్మాలని అది నిరూపిస్తుంది.
ఈ సత్యాన్ని మనం నమ్మి పరిశుద్దాత్మను పొందినప్పుడు, ‘‘నీవు నా కుమారుడవు. ఇతని యందు నేను ఆనందించు నా ప్రియకుమారుడు’’,అని దేవుడు చెబుతాడు. భావికాంలో యేసును నమ్మి, పాపక్షమాపణ పొందిన వారితోను దేవుడు ఈ మాటలనే చెబుతాడు. మనలను ఆయన బిడ్డలుగా చేసుకోడానికి దేవుని వాగ్ధానమే ఈ సత్యం.
పరిశుద్దాత్మను పొందడానికి యింకా యితరమార్గాున్నాయని ప్రజలింకా అనుకొంటున్నారు. నీ ఏడ్పులు, ఈ లోక ప్రయత్నాల ద్వారా పరిశుద్దాత్మ నీ మీదికి వస్తుందని నీవనుకొంటున్నావా?దేవుని పనులు ఆయన యిష్ట ప్రకారమే ఆజ్ఞాపించబడతాయి. ఎవరైతే తమ పాపాలకు క్షమాపణ పొందుతారో వారికి మాత్రమే ఆయన పరిశుద్దాత్మను అనుగ్రహిస్తాడు. ‘‘మీ పాపాలనన్నింటిని తీసివేయడానికి వాటి నిమిత్తం తీర్పు తీర్చి, ఆయనను సిలువేయడానికే నా కుమారునికి బాప్తిస్మమిచ్చాను. మీ రక్షకునిగా నా కుమారుని నియమించాను. నా కుమారుడు సాధించిన క్షమాపణను నీవు అంగీకరిస్తే అప్పుడు నేను నీ కొరకు పరిశుద్దాత్మను పంపిస్తాను’’,అని దేవుడు చెబుతున్నాడు.
మన తండ్రి ఆయన కోరినట్టే చేశాడు. ఒక వ్యక్తి రాత్రంతా మోకాళ్ళ మీద వుండి, అతడి ఊపిరితిత్తులు పగిలిపోయేంతగా ఏడ్చినా దేవుడతనికి పరిశుద్దాత్మను పంపించడు. అయితే ‘‘నీవింకా నిజమైన జ్ఞానాన్ని ఒప్పుకోలేదు, పొరబాటైన నమ్మకాలలోనే కొనసాగుతూ వున్నావు.నిజమైన విశ్వాసాన్ని విస్మరించినంత కాలం పరిశుద్దాత్మ నీ మీదకు రాకుండా ఆపివేయబడతాడు’’ దేవుడతణ్ని గద్దిస్తాడు.
ఈ లోకంలో పరిస్ధితులను బట్టి మానవుల నిర్ణయాలు మారుతూవుంటాయి.కాని పాపక్షమాపణకు, పరిశుద్దాత్మను అనుగ్రహించడానికి దేవుడు స్ధిరపరచిన నియమం మారనే మారదు. అసత్యనమ్మకాలలో నీవు పడిపోతే సరైన మార్గాన్ని కనుగొనడం కష్టం. అవిధేయులైన వారికి యేసు అడ్డుబండగా వుంటాడని బైబిల్ చెబుతోంది. (1పేతురు 2:8)
యేసును నమ్మినవారు,ఆయన ఎందుకు బాప్తిస్మం పొందాడో తెలుసుకొనకపోతే తప్పక వారు పాతాళానికి వెళ్తారు. కనుక, మీరు మొదట యేసును నమ్మినప్పుడు పాపక్షమాపణా సువార్త రాసిన యేసు బాప్తిస్మాన్ని ఆయన రక్తాన్ని గూర్చి తెలుసుకోవాలి. అప్పుడు నీవు పాపక్షమాపణను పొందితేనే పరిశుద్దాత్మను కూడా పొందుతావు.
ఈ లోకంలో యేసు జీవితాన్ని గూర్చి ఆలోచిద్దాం. యేసు మానవునిగావచ్చితన బాప్తిస్మంద్వారా లోకపాపాలనంతటినీ తాను భరించాడు.నరకాగ్నినుండి మనలను రక్షించడానికి మన పాపములనిమిత్తం తీర్పు పొంది సిలువ మీద చనిపోయాడు. ఆయనను నమ్మినవారు పరిశుద్దాత్మను వరంగా పొందుతారు.
కాగా, మనమందరం పరిశుద్దాత్మను పొందడానికి నిజమైన మార్గాన్ని అనుసరించాలి. దీనికి సత్య వాక్యం ప్రకారం ఆలోచించాల్సిన అవసరం వుంది. తమ హృదయాలోచలను విడిచి, ఆయన మాటను నమ్మి పాపక్షమాపణ పొంది, పరిశుద్దాత్మవలన నడిపింపబడినవారు సత్యంలోజీవిస్తారు. అంతేగాక, వారు పరిశుద్దాత్మ సహాయంతో ఇతరులను సరైన మార్గంలో నడిపిస్తారు.
యేసు బాప్తిస్మం, రక్తం ద్వారా నెరవేర్చిన విమోచనను నమ్మండి. అప్పుడే విశ్వాసంతో ఆయనను అనుసరించగలం. నిత్యజీవపు పాపక్షమాపణ మనలో పరిశుద్దాత్మ నివాస దీవెనను పొందగలం. తన బాప్తిస్మం, సిలువ మీద మరణం ద్వారా ఈ లోక పాపాలన్నింటిని తన మీదికి తీసుకొన్న ఆయేసు క్షమాపణకు ప్రభువు. యేసు మన పాపాలనన్నింటిని కడిగివేసి సత్యసువార్తను నమ్మిన వారికి పరిశుద్దాత్మను అనుగ్రహించాడు. మీరు నిజమైన విశ్వాసాన్ని అన్వయించుకొనుట వలన పరిశుద్దాత్మను పొందగలరు.