• All e-books and audiobooks on The New Life Mission website are free
  • Explore multilingual sermons in global languages
  • Two new revised editions in English have been released
  • Check out our website translated into 27 languages
Search

Sermons

అంశం 8: పరిశుద్ధాత్మ

[8-7] విశ్వాసులలో పరిశుద్దాత్మ నివాసమును అనుమతించే సత్యసువార్త (యోషయా 9:6-7)

2021.04.27 1,085
(యోషయా 9:6-7)
‘‘ఏలయనగా మనకు శిశువు పుట్టెను. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును.ఆశ్చర్యకరుడు ఆలోచనకర్తబలవంతుడైన దేవుడునిత్యడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.ఇది మొదలుకొని మితిలేకుండా దానికివృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్ధిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యముకధిపతియగు యోహావా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును’’.
 
 
విశ్వాసులలో పరిశుద్దాత్మ నివసించుటకు అనుమతించేది యేది?
నీటిమూలముగాను ఆత్మమూలముగాను క్రొత్తగా జన్మించుటను గూర్చిన సత్యసువార్త.
 
మనం పరిశుద్దాత్మను పొందాలంటే నీటిమూలముగాను, ఆత్మమూలముగానైన సువార్తలో నమ్మకముంచాలి. మన దేవునికి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బవంతుడైన దేవుడు అన్న పేరుంది. తానే పరలోకమార్గమని దేవుడు తనను గూర్చి చెప్పుకొన్నాడు. యేసుక్రీస్తు ప్రతిఒక్కరికి సత్యసువార్తను వరమిచ్చాడు.
ఇంకా చీకటిలో జీవించేవారు ఈ లోకంలో చాలామంది వున్నారు. ఈ చీకటినుండి తప్పించుకోవాలని వారు ప్రయత్నిస్తున్నారు. కానీ సత్యసువార్త వారికి తెలియనందున వారు పాపాల నుండి వారెన్నటికీ తప్పించుకోలేరు. దానికి బదులు తప్పుసిద్దాంతాలలోని వారి నమ్మకంతో వారు క్షీణించపోతున్నారు. దీనికి భిన్నంగా సత్యాన్ని వెదికేవారు సత్యసువార్తను ఎదుర్కొని వారి శేషజీవితమంతా దేవుని దీవెనను నెరవేరుస్తూ జీవిస్తారు. వారు సత్యసువార్తను కనుగొని, వారి పాపాల నుండి వారిని కడగుకొనుటకువారికి నేను సహాయపడడం దేవుని ప్రత్యేక దీవెన అని నా నమ్మకం.
అందువలన దేవుని దీవెన లేకపోతే పాపంనుండి స్వేచ్చను పొందటం అసంభవం. మన దేవునికి చేరువై, పరిశుద్దాత్మను పొందితే మనమెంతో ధన్యులం, విచారకరమైన విషయమేమిటంటే సత్యసువార్తయందు విశ్వాసం వుంచుటద్వారా దేవుని దీవెన కలుగుతుందని చాలామందికి తెలియదు.
 దేవుని అద్వితీయకుమారుడైన యేసుక్రీస్తు మనకిచ్చిన సువార్తలోని నమ్మకంవలన దేవునిఆశీర్వాదం వస్తుంది. ఈ లోక పాపాల నుండి మనలను రక్షించిఆయన కృపతో మనలను ఆశీర్వదించువాడు యేసే. ఆయన తప్ప మరొకరెవరూ మన పాపాలనుండి మనలను రక్షించలేరు. మన హృదయా పరాధాన్ని తుడిచివేయలేరు. తమపాపాలనుండి శాశ్వతమరణ బాధనుండి తననుతాను ఎవరు రక్షించుకోగలరు?
‘‘ఒకని మార్గము వాని దృష్టికి యధార్ధముగా కనబడును అయినను తుదకు అది మరణమునకు చేరును’’, (సామె. 16:25). అని దేవుడు చెబుతున్నాడు. మానవులు తమ స్వంతమతాలను స్ధాపించుకొని, తమంతటతామే నాశనానికి, మరణానికి నడుస్తున్నారు. చాలామతాలు తాము నీతిని నొక్కి చెబుతున్నామని ప్రజలను తమ పాపాలనుండి రక్షించే మార్గాలను చూపుతున్నామని డంబాలు (అతిశయోక్తిగా) పలుకుతున్నాయి. కాని, మన ప్రభువు మనకిచ్చిన నీటిమూలముగాను ఆత్మమూలమైన సువార్త మాత్రమే మన పాపాలన్నింటి నుండి మనలను రక్షించగలదు. పాపాత్ములను తమపాపాలనుండి రక్షించగల రక్షకుడు యేసు మాత్రమే.
యోహాను 14:6లో ‘‘నేనే మార్గమును.సత్యమును, జీవమును’’.అని మన ప్రభువు చెప్పాడు. మరణ మార్గంలోవున్నవారికొరకు ఆయన తన శరీరాన్ని రక్తాన్ని యిచ్చాడు.నిజమైన జీవితానికి తానేమార్గమని తననుగూర్చి చెప్పాడు.యేసు సువార్తను నమ్మనివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడని దేవుడుచెబుతున్నాడు.
పరలోకరాజ్యంలో మనం ప్రవేశించాంటే నీటిమూలముగాను,ఆత్మమూలముగానైన సువార్తను మనం నమ్మాలి.మనపాపాలకు క్షమాపణ పొందాలి. ఆయనే మన రక్షకుడని నమ్మాలి.
 

పురాతనఇశ్రాయేలులో ఒకప్పుడు

‘‘యూదారాజైన ఉజ్జియామనుమడును యోతాము కుమారుడునైన ఆహాజు దినములో సిరియా రాజైన రెజీనును.ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడైన పెకహును యుద్ధము చేయవలెనని యెరూషలెము మీదికి వచ్చిరి గాని అది వారివలన కాకపోయెను’’(యెషయా7:1).
ప్రారంభంలో ఇశ్రాయేలు ఒకే దేశం. అయితే ఇశ్రాయేలు దక్షిణ, ఉత్తర రాజ్యాలుగా చీలిపోయినవి. దేవుని మందిరం సోలోమోను రాజుకుమారుడైన రెహబాము పరిపాలిస్తున్నదక్షిణ రాజ్యమైన యూదయలో వున్నది. తర్వాత సొలమోను సేవకులలో ఒకడైన యెరోబాము ఉత్తరాన మరొక దేశాన్ని స్ధాపించాడు. కనుకఇశ్రాయేలు చీలిపోయింది. అప్పటినుండి అతనికి దేవునిలో విశ్వాసం తగ్గిపోయింది. విశ్వాస తరుగుదలనేది నేటి సిద్దాంత వ్యతిరేక మతాలకు మూలంఅయింది. అతడు (యెరోబాము) తన సింహాసనాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని బట్టి దేవుని ధర్మశాస్త్రాన్ని మార్పు చేయడంతో అతడు సిద్దాంత వ్యతిరేకులకు లేక విమతస్థులకు పితరుడైనాడు. ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలులోని దేవుని ప్రజలకుభిన్నమతాన్నిసృష్టించాడమే గాక దక్షిణ రాజ్యమైన యూదాను వశపరచుకోడానికి ప్రయత్నించాడు. 200సం॥ గడచిపోయినా ఆ రెండు రాజ్యాల మధ్యనున్న ప్రతికూల సంబంధాలు మారనేలేదు.
ఏమైనప్పటికియెషయా ద్వారా దేవుడుమాట్లాడాడు, ‘‘సిరియాయు, ఎఫ్రాయిమును, రెమల్యా కుమారుడును నీకు కీడు చేయవలెనని ఆలోచించుచు మనము యూదా దేశము మీదికి పోయి దాని జనులనుభయపెట్టి దానిప్రాకారమును పడగొట్టి టాబెయేును వాని కుమారుని దానికి రాజుగా నియమించెదము రండని చెప్పుకొనిరి. అయితే ప్రభువైన యెహావా ఈలాగుసెలవిచ్చుచున్నాడు. ఆ మాట నిలువదు, జరుగదు. దమస్కు సిరియాకు రాజధాని,దమస్కునకు రెజీనురాజు. ‘‘అరువదియయిదు సంవత్సరములు కాకమునుపు ఎఫ్రాయిము జనము కాకుండా నాశనమగును. షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని: షోమ్రోనునకు రెమల్యా కుమారుడు రాజు: మీరు నమ్మకుండినయెడల స్ధిరపడకయుందురు’’ (యెషయా7:8-9).
ఆసమయంలో దేవుడు రాజైన ఆహాజుకు యెషయా ద్వారా ప్రవచించాడు. అయితే రాజుకు దేవునిలో నమ్మకం లేదు. ఆహాజు సిరియా సైన్యాన్ని ఎదిరించగల శక్తి లేనివాడు. కాని సిరియా, ఇశ్రాయేలు రాజ్యాలు రెండు ఒకదానితోఒకటి సంధిచేసుకొని తనపై దండెత్తబోతున్నాయని విని ఆహాజు భయంతో వణికిపోయాడు. అయితేదేవునిసేవకుడైన యోషయా రాజు దగ్గరకు వచ్చి, ‘‘అరవై అయిదు సం॥లోపలే ఉత్తర ఇశ్రాయేలు పతనమవుతుందని, ఆ యిద్దరు రాజుల దుర్మార్గపు కుట్ర ఫలించదని చెప్పాడు’’
దేవుని సేవకుడు ఆహాజుతో ‘‘నీ దేవుడైన యెహోవావలన సూచన నడుగుము. అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తయినను సరే’’, అని ఒక సూచన కొరకు అడగమని చెప్పాడు (యెషయా7:11). ‘‘దావీదు వంశస్థులారా,వినుడి:మనుష్యులను విసికించుట చాలదనుకొని నాదేవునికూడావిసికింతురా? కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును, ఆలకించుడి‘‘కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును’’, (యెషయా 7:13-14). ఆయన తనప్రజలను వారిపాపాలనుండి రక్షిస్తాడుఅన్నది ప్రవచనం.
 

దేవుని శత్రువు ఎవరు?

మానవులకు శత్రువు పాపం. పాపం సాతాను నుండి పుడుతుంది. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు తప్ప మనపాపాల నుండి మరొకరు మనలను రక్షించలేరు. మానవుని ప్రాధమిక బలహీనత శారీరకమైనది. కనుక అతడు పాపం చేయకుండా వుండలేడు. మానవుడు పాతాను శక్తి లేక అధికారం క్రింద వున్నాడు. ఇంకా అధిక సంఖ్యాకులు సోది చెప్పించుకొంటూ, ఆ అసత్యప్రవక్తలు చెప్పిన దానిని అక్షరాల అనుసరిస్తూ జీవించబడానికి ప్రయత్నిస్తున్నారు. వారు సాతాను అదుపులో వున్నారనడానికిదే ప్రత్యక్ష నిదర్శనం.
ఒక కన్యక కుమారుని కని అతనికి ఇమ్మనుయేలని పేరు పెడుతుందని చెప్పుట ద్వారా యెషయాకు దేవుడు రక్షణను గూర్చిన సాక్ష్యమిచ్చాడు. పాపభూయిష్టమైన మానవ శరీరంతో యేసును పంపించి సాతానుని అణచివేతనుండి పాపాత్ములను రక్షించుట దేవుని ప్రణాళిక. ప్రవచనం ప్రకారం యేసు మానవ మాత్రునిగా కన్యకయైన మరియకు జన్మించాడు. 
యేసు మనదగ్గరకు రాకున్నట్లయితే మనమింకా సాతాను పాదముల క్రిందే జీవిస్తూ వుండేవారం. కాని యేసు ఈ లోకానికి వచ్చి సమస్తపాపాత్ములను తమపాపాలనుండి రక్షించుసువార్తను మనకివ్వడానికి యోహాను వలన బాప్తీస్మాన్ని పొందాడు. సిలువ మీద చనిపోయాడు. కనుక చాలామందిసువార్తనునమ్మారు. తమ పాపాలకు, క్షమాపణ పొందారు. దేవుని పిల్లలు అయినారు.
ఇప్పుడుకూడా యేసుక్రీస్తు దేవుడా లేక మానవుడా అని చాలామంది వేదాంతులు వాదిస్తూ వున్నారు. సాంప్రదాయ వేదాంతు ‘‘యేసు దేవుడు’’,అని అంటే, కొందరు నవీన వేదాంతులు దానిని ఆక్షేపిస్తూ యేసు యోసేపుకుఅక్రమ కుమారుడు అని వాదిస్తారు. ఇదెంత దు:ఖకరమైన మాట! 
నీటిమీద నడిచే సమర్థ్ణత యేసుకు లేదు అని అంటారు కొందరు కొత్త వేదాంతులు. ‘‘యేసు చాలా దూరంలో వున్న కొండ దిగువన నడిచాడు అది దూరం నుండి చూసి శిష్యులు ఆయన నీటిమీద నడుస్తున్నాడని భావించారు, అని వారంటారు. ప్రస్తుతం నూతన వేదాంత శాస్త్రానికి చెందిన క్రైస్తవ వేదాంత పండితులు (డాక్టర్లు) అందరూ వేదాంత శాస్త్రంలో గొప్పవారు కాదు. వారిలో ఎక్కువ మంది బైబిలులో కనిపించేదానినే నమ్ముతున్నారు.
మరో ఉదాహరణగా యేసు రెండు చేపలు, అయిదు రొట్టెలను 5,000 మందికి పెట్టాడని బైబిల్ వివరిస్తోంది. ఈ అద్బుత కార్యాన్ని వారు సందేహిస్తారు పైగా ‘‘యేసును వెంబడిరచి వచ్చిన ప్రజలు ఆకలితో బాధపడుతున్నారు, కనుక అక్కడున్నవారు అప్పటికి తినగామిగిలినఆహారాన్నిసమకూర్చమని శిష్యులను అడిగాడు యేసు. అప్పుడొక బాలుడు తనదగ్గరున్న తనఆహారాన్ని వారికిచ్చాడు. అప్పుడా శిష్యులుబాలుడిచ్చిన దానిని చూసి, తమ దగ్గర కూడా మిలిగియున్న దానిని బయటికితీశారు. తర్వాత శిష్యులు వారి దగ్గరున్న దానిని సేకరించి అందరూ కలసితినగా పన్నెండు గంపలు మిగిలిపోయింది’’.అని వారంటారు. ఇలాంటి వేదాంతులు దేవునిమాటను వారి పరిమిత అవగాహనకు తగిన విధంగా వివరించడానికి ప్రయత్నిస్తారు.
దేవుని సత్యాన్ని నమ్మి దేవుడిచ్చిన సువార్తలో విశ్వాసముంచాలి. విశ్వసమంటే ఒక విషయం అర్ధవంతంగా వుంది గనుక దానిని నమ్మడం అని.అలా అర్ధవంతంగా లేదు గనుక నమ్మడం లేదని అర్ధం కాదు. మనకు అర్ధం అయినా అవకపోయినా మనం దేవుని నమ్మాలి. రాసియున్న ఆయన మాటలు నమ్మాలి.
యేసు మనుష్యకుమారునిగా మన దగ్గరకు వచ్చాడంటే మన పాపాలనుండి మనలను రక్షించడానికి పంపించబడ్డాడన్నది సత్యం. దేవుడైన యేసు మనలను రక్షించడానికి ఈలోకానికివచ్చాడు. కన్యకకు ఆయనజన్మించిమనుష్య కుమారునిగా మన దగ్గరకు వచ్చాడని యోషయా ప్రవచించాడు.
అది 3:15లో దేవుడైన యోహోవా సర్పంతో, ‘‘మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తల మీద కొట్టును:,నీవు దానిని మడిమె మీద కొట్టుదువని చెప్పెను’’. అంటే మన రక్షకునిగా మానవ జాతిని వారి పాపాల నుండి రక్షించడానికి మానవునిలా యేసును పంపించడానికి దేవునికి ప్రణాళిక వున్నదని అర్ధం.
‘‘ఓ మరణామా!,నీ విజయమెక్కడ? ఓ మరణామా, నీ ముల్లెక్కడ? మరణపు ముల్లు పాపము. పాపమునకున్నబలము ధర్మశాస్త్రమే’’,అని బైబిలులో రాసి వుంది (1 కొరింథి 15:55-56). మరణపు ముల్లు పాపం. మానవుడు పాపం చేసినప్పుడు మరణం అతణ్ణి తన బానిసగా చేసుకొంటుంది. అయితే ‘‘స్త్రీ సంతానం నీ తలను చితుకగొడతాడు’’,అని మన దేవుడు వాగ్ధానం చేశాడు. అంటే సాతాను తెచ్చిన పాపపు ముల్లును యేసు నాశనం చేస్తాడని అర్ధం.
ఈ లోక పాపమును తీసివేయడానికి బాప్తీస్మాన్ని పొంది, ఆ పాపము నిమిత్తం తీర్పు పొందడానికి సిలువ వేయబడడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. సత్యసువార్తను నమ్మిన వారందరిని వారి పాపాల నుండి ఆయన రక్షించాడు. ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు సాతాను శక్తి నుండి మానవ జాతిని రక్షిస్తానని దేవుడు వాగ్ధానం చేశాడు. ఈ ఆధునిక ప్రపంచంలో సువార్తను నమ్మనివారు దేవుని శత్రువులు.
 
 
యేసు ఈ లోకంలో ఎందుకు జన్మించాడు?

మన పాపాల నుండి మనలను రక్షించడానికి దేవుడు మనకు సత్యసువార్తను యిచ్చాడు. దేవుని ధర్మశాస్త్రంతో ఆయన సన్నిధిలోనే ప్రజలు పాపాత్ములైనారు. అలాగే, ప్రజలు తమ పాపాలను తెలుసుకోగలుగునట్లు ధర్మశాస్త్రం అనుగ్రహించబడిరది. ప్రజలు పాపానికి ధర్మశాస్త్రానికి బానిసలైనప్పుడు ఆ ధర్మశాస్త్రపు నైతికావసరతలను నెరవేర్చడానికి ప్రభువు ఈ లోకానికి వచ్చాడు.! 
యేసు ధర్మశాస్త్ర నెరవేర్పుగా, ధర్మశాస్త్ర ఆచరణ కాలంలో జన్మించాడు. తమ పాపాలను తెలుసుకొని, పాపాలను క్షమాపణను పొందడానికి ప్రజలకు ధర్మశాస్త్ర అవసరత ఉంది. తమ దుస్తులు మురికిగా వున్నాయని తెలుసుకొన్నప్పుడే వారి దుస్తులను శుభ్రం చేసుకొంటారు. అలాగే, తమ పాపాలను గుర్తించడానికి మానవులు దేవుని ధర్మశాస్త్రాన్ని తెలుసుకోవాలి. ధర్మశాస్త్రం లేకపోతే, పాపం అనే స్ఫృహే వుండేదికాదు. అప్పుడు యేసు ఈ లోకానికి రావలసిన ఆవశ్యకత లేదు.
దేవుని ధర్మశాస్త్రం నీకు తెలిస్తే, దేవుని కలుసుకొనే అవకాశం నీకుంటుంది. మనకు ధర్మశాస్త్రం తెలుసు కనుక మనం పాపాలను గూర్చి తెలుసుకోగలుగుతున్నాం. మన పాపాలన్ని మనం తెలుసుకొన్న తర్వాతే సువార్తను నమ్మునట్లు యేసుక్రీస్తు సువార్తను తీసుకొని వచ్చాడు. దేవుడు మనకు ధర్మశాస్త్రాన్ని యివ్వకపోతే, అప్పుడు మనం పాపాత్ములం కాదు. న్యాయ తీర్పు అనేది వుండేది కాదు. అలా దేవుడు మనకు ధర్మశాస్త్రాన్ని యిచ్చి పాపాత్ములనందరిని వారి పాపాల నుండి రక్షించడానికి సువార్తను అనుగ్రహించాడు.
సృష్టికర్తకు, ఆయన సృష్టికి మధ్యనున్నధర్మశాస్త్రం దేవుని రక్షణ చట్టం. ఇది ప్రేమతో కూడిన చట్టం. ‘‘మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములను తినకూడదు:’’.అని మానవునితో చెప్పాడు దేవుడు (అది 2:17) దేవుడిచ్చిన ఈ ధర్మశాస్త్రము మన పాపమున్నిటి నుండి మనలను రక్షించిన ఆయనప్రేమకు ఆధారమైనది. రక్షణకు పునాది మన పాపక్షమాపణలో వుంది. తాను సృష్టికర్తనని, ఉన్న సమస్తం తన చిత్త ప్రకారమే ఉనికి గలిగి వున్నాయని దేవుడు మనతో చెప్పాడు. అంటే దేవుడు ఖచ్చితంగా వున్నాడని సత్యసువార్తతో కూడిన రక్షణను ప్రజలు నమ్మాలని అర్ధం.
 పరిపూర్ణ దేవుడు మంచితనంలో సంపూర్ణుడు. ఈలోకం యెడల ఆయనకు గల ప్రేమ, పాపాత్ములందరి రక్షకునిగా వచ్చిన తన అద్వితీయ కుమారుని బలిగా అర్పించుటకు ఈ లోకానికి పంపాడు.దేవుడు మనలను చేసి, మన పాపాల నుండి మనలను రక్షించడానికి సువార్తను యివ్వకుండా వున్నట్లయితే మనం ఆయన మీద ఫిర్యాదు చేసేవారమే. అయితే దేవుడు మనం కల్పించుకొన్న వినాశనం నుండి మనలను రక్షించడానికి రక్షణను స్ధాపించాడు. ధర్మశాస్త్రంవలన మనపాపాలను మనం తెలిసికొనగలిగి వాటిని నేరుగా చూసి,యేసు సువార్తను నమ్మడం మొదలుపెట్టాం. దేవునివాక్యాన్ని మనంఅతిక్రమించినప్పుడు ధర్మశాస్త్రం ముందు మనం పాపాత్ములుగా ప్రత్యక్షపరచబడతాం. పాపాత్ములమైన మనం పాపక్షమాపణ నిమిత్తం ఆయన ముందుమోకరించిఆయన కృప కొరకు వేడుకోవాలి.
మానవ జాతిని పాపం నుండి రక్షించడానికి యేసు స్త్రీకి జన్మించుట ద్వారా ఈ లోకానికి వచ్చాడు. మన యెడల దేవుని ప్రణాళికను నెరవేర్చడానికి యేసు మానవునిగా లోకానికి వచ్చాడు. మనం సత్యసువార్తను నమ్ముతున్నాం. కనుక దేవుని స్తుతిస్తున్నాం.
‘‘నేనెంతో సులభంగా పాపంలో పడిపోయి, అలా తప్పులు చేసినందుకు ఎన్నోకష్టానుభవించే బలహీనునిగాదుర్భులునిగా దేవుడు నన్నెందుకుసృష్టించాడు’’,అని కొందరు ఆయన మీదేనేరారోపణచేస్తారు అయితే మనం కష్టపడాలని దేవుడెప్పుడూ కోరుకోడు. మనం యేసు సువార్తను సందేహిస్తాం గనుక మనం కష్టాలు పడేట్టు ఆయన అనుతిస్తాడు.మనం ఆయన పిల్లలుగా ఆయనకున్నఅధికారం గలవారిగా వుండాలని ఆయన కష్టాలను, రక్షణనిచ్చు సత్యసువార్తను కూడా మనకు అనుగ్రహించాడు. అదే ఆయన ప్రణాళిక.
అయితే అపవాది ‘‘కాదు, కాదు. దేవుడు నియంత! నీ యిష్ట ప్రకారం జీవించు. స్వతంత్రంగా వుండు! నీ స్వంత ప్రయత్నాలతోఆసిపాస్తును (భాగ్యాన్ని) సంపాదించుకో’’!.అని అంటున్నాడు. దేవున్ని మానవులు నమ్మకుండా అపవాది ఆటంకపరుస్తాడు. దేవునికి వేరుగా జీవించాలనుకొనేవారే ఆయన రక్షణ ప్రణాళికకు ఆటంకాలు. యేసు ఈ లోకానికి వచ్చి సాతాను అధికారంక్రింద వున్న వారిని తమ పాపాలను పరిత్యజించమని పిలిచాడు. దేవునికి వేరుగా మనం జీవించకూడదు. 
 

జన్మత: మానవుడు నరకపాత్రుడు.

మార్పు చెందని సత్యమంటూ ఏదీ లేదీలోకంలో. అయితే యేసు సువార్త మార్పు చేయలేని సత్యం కనుక మానవులా సత్యం మీద ఆధారపడి సాతాను అధికారం నుండి విడుదల పొందాలి. మానవజాతి ఆదాము హవ్వ పాపాలను స్వాస్ధ్యంగా పొందారు. క్రీస్తు జోక్యం లేకపోతే వారు నరకాగ్ని పాత్రులవుతారు. దానికి బదులు యేసు బలిదానం వలన మానవుడు దేవుని కుమారుడయ్యే అధికారంతో దీవించబడినందుకు ఆయనకు స్తుతులు. ‘‘అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలువలేదు’’, యోషయా 9:1), దేవుడు తన కుమారుని ఈ లోకంలోనికి పంపించి ఆనందభరితమైన రక్షణను నమ్మిన వారిని ఘనపరిచాడు.
‘‘చీకటిలో నడుచు జనులు గొప్పవెలుగును చూచు చున్నారు. మరణచ్ఛాయగల దేశనివాసుల మీద వెలుగు ప్రకాశించును’’,(యెషయా 9:2). ఈ వాక్యం నేడు మీకు, నాకు నిజమయింది. సువార్తను నమ్ముట వలన మనమీ భూమి మీద పొందలేనిది నిత్యజీవితంలో ఆశీర్వదించబడ్డాం. యేసుక్రీస్తు ఈ లోక పాపాలనన్నింటిని నుండి మానవ జాతిని రక్షించాడు. ఆయన సువార్తను నమ్మిన వారికి నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని అనుగ్రహించాడు.
 
 
నిరాశతో వున్న వారిపై ఆయన సత్యసువార్త అనే వెలుగును ప్రసరింపచేశాడు.

మంచులా మనిషి కొంతసేపు ఈ లోకంలో వుండి అంతలోనే మాయమైపోతాడు. అతని జీవితం సంవత్సరకాలముండే మొలక, గడ్డివంటిది. గడ్డి సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రమే బ్రతికి దైవిక నియమం ప్రకారం మాయమైపోతుంది. ఈ అర్ధంలేని గడ్డిలాగే మన జీవితంలోనివన్నీ వ్యర్ధమైనవే. అయితే అలసిపోయిన మన ఆత్మకు సువార్తను యిచ్చాడు. ఆయన నీతితో మనలనుదేవుని బిడ్డలుగా చేశాడు.ఇదెంతఆశ్చర్యకరమైన కృప! అర్ధరహితమైన మన జీవితాలు నిత్యజీవితాలైనాయి. ఆయన బిడ్డలయ్యే హక్కుతో మనలను దీవించిన దేవుని ప్రేమకు కృతజ్ఞతా వందనాలు.
సత్యసువార్తను నమ్మడం వలన దేవునికృపతో ఆశీర్వదించబడిన ఒక ఆత్మ ఒప్పుకోలును వినండి.
దేవునిలో నమ్మకంలేనికుటుంబంలోపుట్టానునేను.ప్రతిరోజు నీళ్ళతో నిండిన ఒక గిన్నెను తనముందు పెట్టుకొని తన కుటుంబ సంక్షేమం కొరకు ఆకాశంలోను,భూమిమీద వున్న దేవతలనందరిని పూజించే తల్లిని కలిగి వుండడం ఎంతో ధన్యం అన్న ఆలోచనతో పెరిగాను నేను. నేను పెద్దవాడనయ్యే కొద్దీ నా విలువేంటో తెలియక, లేక నా ఉనికికి కారణం ఏమిటో తెలియక, నేను బ్రతికున్న, చనిపోయినా భేదమేమీలేదన్న నమ్మకం ఏర్పడింది. నాలో నా విలువేంటో నాకు తెలియనందున నేను ఏకాంతంలో జీవించాను.
ఈ ఏకాంత జీవితంలో అలసిపోయిన నేను వివాహం చేసుకోవాలని తొందరపడ్డాను. నా వైవాహిక జీవితం బాగుంది. నేను కోరుకోవసిందేమీ లేదు. కనుక నేను సమాధానంగా, శాంతికరమైన జీవితాన్ని జీవించాను. తర్వాత నాకొక బిడ్డ కలగడంతో నాలో ప్రేమ మొదలైంది. స్వార్ధపూరితమైన నా కోర్కె నన్ను విడిచిపెట్టాయి. కాని అంత సన్నిహితంగా వున్న వాటిని పోగొట్టుకొన్నందుకు భయపడ్డాను.
అలా నేను దేవుని కొరకు వెదకడం ప్రారంభించాను. నేను బహీనుడను, అసమర్ధుడను గనుక నా ప్రియులను కాపాడే పరిపూర్ణ సమర్థతగలవాని అవసరత నాకున్నది. కనుక నేను ఒక ప్రార్ధనా మందిరానికి వెళ్ళడం మొదలుపెట్టాను. కాని నా విశ్వాసంనీటితో నిండిన గిన్నెముందుపెట్టుకొని ప్రార్ధించే మా అమ్మ ప్రార్ధనకు భిన్నమైంది. నా ప్రార్ధనలు అస్పష్టమైన భయాలు, ఆశలపై ఆధారపడి వున్నాయి.
ఒకసారి, స్ధానికి సంఘంలో జరిగిన చిన్న కూడికకు వెళ్ళాను. అక్కడ నేను ప్రార్ధన చేస్తూ వుండగా కన్నీళ్ళు కారడం మొదలైంది. నేను కలవరపడి,ఏడ్వకుండావుండాలని ప్రయత్నించాను. కాని కన్నీళ్ళు ధారగా కారుతూనే వున్నాయి. నా చుట్టూ వున్నవారు నాతలమీదచేతుతుంచి,పరిశుద్దాత్మను పొందినందుకు నన్ను అభినందించారు. నాకు దేవుని వాక్యాలే సరిగా తెలియవు. ఆయనలో నా విశ్వాసం అస్పష్టమైంది. అందుకని ఈ వత్తిడి పరిశుద్దాత్మ వలన కలిగినదన్న నమ్మకం నాకు లేదు.అందుకే నేను దిగ్రాంతిచెందాను.
నేను వెళ్ళే సంఘం ‘‘పెంతికోస్తల్‌ -కరిస్మాటిక్‌ మూవ్‌మెంట్‌’’,కు అనుబంధమైనది. దానిలో చాలామందికి నాలాంటి అనుభవం వుంది. దాదాపు అందరూ భాషలో మాట్లాడేవారే. ఒక రోజునపరిశుద్దాత్మతో నిండిన వాడని ప్రజలు చెప్పే ఒక పాస్టరుగారు నడిపించే ఉజ్జీవ సభకు నన్ను ఆహ్వానించారు. పాస్టరు చర్చిలో అనేక మందిని సమకూర్చారు. తనకున్న ఆత్మ శక్తులతో మెదడులో వున్న ఖాళీకు ముక్కుకు సంబంధం గల రోగం (సైనస్‌) వున్న ఒక వ్యక్తిని స్వస్థతపరుస్తానని చెప్పాడు. ఆ జబ్బు ఆసుపత్రులలో సులభంగా తగ్గిపోయేదే గదా అనుకొన్న నేను, ఆయన పరిశుద్దాత్మను ఎలా పొందుతాడో అన్న దాని మీద నాకెక్కువ ఆసక్తి వుంది అయితే పాస్టరు గారు స్వస్థపరచడానికి ముందు, హైస్కూలు ప్రవేశ పరీక్షలో కృతార్ధులవుతారో లేదో ముందుగానే చెప్పగలనని తననుగూర్చి డంబాలు చెప్పుకోవడం మొదలుపెట్టాడు. అతడే దేవుడన్నట్లు అనేకులు ఆయనను స్తుతించారు.
నేనైతే ఆయనను అర్ధం చేసుకోలేకపోయాను. పాస్టరు గారికి ఎలాంటి శక్తి ఆధికారాలున్నాయో పరిశుద్దాత్మ శక్తితో ఆయనేమైనా చేయగలడని నేను చెప్పలేను. ఆయన సైనస్‌ వ్యాధిని స్వస్థపరచడం, పరీక్షలో కృతార్ధులవుతారని చెప్పడం నాకు ముఖ్యం కాదు. ఆయన చేసే అద్భుతాలు పరిశుద్దాత్మ వలన చేసేవి కావని నేను అనుకొన్నాను. 
నేను చూసిన దాని కంటే దేవుని శక్తి ప్రేమ భిన్నమైనదని నా అభిప్రాయం. అందుకని నేనా సంఘానికి వెళ్ళడంమానివేశాను. ఆ పాస్టరు గారికి శక్తున్నాయని నమ్మే వారిని కలుసుకోవడం మానివేశాను. ఆ తర్వాత మౌనంగా వుండే వేరొక సంఘానికి వెళ్ళడంమొదలుపెట్టాను. ఎందుకంటే అక్కడ ఎక్కవగా దేవుని మాటలు చెబుతున్నారని నమ్మాను. అక్కడ ధర్మశాస్త్రాన్ని గూర్చి నేను తెలుసుకున్నాను. దానిని బట్టి నేను అవినీతిపరుణ్ణని దేవుని సన్నిధిలో నేను నీతిలేని వాడనని తెలుసుకొని ఆయన ఆత్మ నన్ను అశ్రద్ద చేస్తున్నాడనిపించింది నాకు.
యెషయా 59:1-2 యిలా వివరిస్తోంది, ‘‘రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు. విననేరకయుండు నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు’’, ఈ మాటలునా పరిస్ధితికి సరిగ్గా సరిపోయాయి. నేను చేసిన ఆలోచించిన ప్రతిదీ పాపభూయిష్టమైనదే కనుక నేనాయన బిడ్డనవడం,పరిశుద్దాత్మనుపొందడంఅసంభవమనిపించింది నాకు.
 కనుక నేను దేవునికి భయపడి, పశ్చాత్తాపంతో ఎడతెగక ప్రార్ధన చేశాను. అలాచేయమని నాకెవరూ చెప్పలేదు. కాని దేవుని ముందు గౌరవనీయునిగా వుండాలని నేనే అలా చేశాను. నేను పాపాత్ముణ్ణి గనుకమన:పూర్వకమైనపశ్చాత్తాపంతో మరెక్కువగాప్రార్ధన చేసినా నాపాపాలు మాయమైపోలేదుఐనా నా ప్రయత్నమంతా నా ఆలోచనలను, నా నిజాయితీని ఆయనకు చూపించాలనే ఈ ప్రార్ధనలుచేశాను.కనుకనా పాపాలుయింకానా లోనేవున్నాయి. అప్పటి నుండి దేవునిపై ఫిర్యాధు చేయడం మొదలుపెట్టాను. ఆయన దృష్టిలో పరిపూర్ణుడిగా వుండాలనుకొన్నాను. అయినా పరిపూర్ణుడను కాలేదు గాని నా ఫిర్యాదులు, పాపములు పెద్ద కుప్పగా పేరుకున్నాయి.
మతపరంగా నేనిలాంటి కలవరంతో వుండగా మా నాన్నగారికి గుండెపోటు వచ్చింది. ఆపరేషన్‌ అని ఆసుపత్రి మంచాల మీద ఎంతో శ్రమపడిన ఆయన 40 రోజులకు చనిపోయాడు. నేను ఇన్నాళ్ళలో ఒక్కసారి కూడా మా నాన్న కొరకు ప్రార్ధించలేదు. పాపాత్ముడనైన నేను ప్రార్ధిస్తే మా నాన్న పరిస్ధితి మరింత దిగజారిపోతుందేమో ననుకొన్నాను. నాలో విశ్వాసం లేకపోయినందుకు ఎంతో దు:ఖపడ్డాను. దేవుని అనుసరించాలనే అనుకొన్నా ఆయన్ను అనుసరించలేకపోయాను. ఆయన మీద ఫిర్యాదుకొనసాగించాను. చివరికి ఆయన నుండి తిరిగిపోయాను. నా మత జీవితం అలా ముగిసిపోయింది. నేనాయనను నమ్మి వుంటే ఆయన ఆత్మ నాలో వుండేది. అప్పుడు నాలో సమాధానం వుండేది. కాని నా విషయం అలాంటిది కాదు. ఆ తర్వాత నా జీవితం మరింత అర్ధరహితముగా గడిచింది. భయంతో, విచారంతో జీవించాను.
అయితే దేవుడునన్నువిడిచిపెట్టలేదు.దేవునివాక్యంద్వారా నిజంగా పరిశుద్దాత్మను పొందిన ఒక విశ్వాసిని నేనుకలుసుకొనేట్టు చేశాడు. యోహాను బాప్తిస్మంవలన యేసు మన పాపాలను భరించాడని, వాటినిమిత్తం సిలువమీద తీర్పు పొందాడని అతనిద్వారా తెలుసుకొన్నాను. కనుక నా పాపాలతోసహా ఈ లోక పాపాలన్నీ క్షమించ బడ్డాయనివిని, దానిని అర్ధంచేసుకొన్నప్పుడు నాపాపాలన్నీ కడిగివేయబడినట్టు తెలుసుకొన్నాను. నేను పాపక్షమాపణ పొందడానికి, పరిశుద్దాత్మ దీవెనకు దేవుడు నాకు సహాయం చేసి శాంతికరమైన జీవితాన్ని నాకు దయచేశాడు. ఆయన మౌనంగా నన్ను నడిపించాడు.మంచి చెడును గూర్చిన స్పష్టమైన అవగాహనను యిచ్చాడు. ఈలోక శోధనను జయించే శక్తిని నాకు అనుగ్రహించాడు. ఆయన నా ప్రార్ధనలకు జవాబిచ్చాడు. నీతివంతమైన జీవితం జీవించడానికి నాకు సహాయం చేశాడు. నాకు పరిశుద్దాత్మను అనుగ్రహించినందుకు ఆయనకు నిజంగా కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాను’’
 మాలో ప్రతిఒక్కరూ దేవుని కృపతో ఆశీర్వదించబడి పరిశుద్ధాత్మనుపొందగలిగేవారమైనాము. సత్యసువార్తను మనకిచ్చినందుకు నేనాయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నీతిమంతులను అలాంటి ఆనందంతో దీవించాడు దేవుడు. నీతిమంతుల హృదయాలు ఆనందనిలయాలు. దేవుడు నిత్యానందాన్ని మనకనుగ్రహించాడు. దేవుని రక్షణ,ప్రేమ,కృప ఎంత పవిత్రమైనవో మేము తెలుసుకున్నాం. అందుకు ఆయనకు మేము కృతజ్ఞులమయ్యాము. ధనంతో కొనలేని పరలోక సంబంధమైన సత్యసువార్తద్వారా దేవుడు మనకు ఆనందాన్నిచ్చాడు. మనం ఆనందంగాసత్ప్రవర్తనగలవారిగా వుండాలని దేవుడు పరిశుద్దాత్మతో బాటు సువార్తను కూడా యిచ్చాడు. అవి మన జీవితాలను ధన్యం చేస్తాయి. నీతిమంతులు ధన్యకరమైన జీవితాన్ని జీవిస్తుంటే ఆయన ఆనందిస్తాడు.
లూకా 1:37-38లో వివరించినట్లు‘‘దేవుడు చెప్పిన యేమాటయైనను నిరర్ధకము కానేరదు. అందుకు మరియఇదిగో ప్రభువు దాసురాలను: నీ మాట చొప్పున నాకు జరుగును గాక’’అని మరియ చెప్పింది. దేవుని దూత చెప్పిన మాటలుమరియ నమ్మిన వెంటనే యేసును ఆమె గర్భం ధరించింది. అలాగే విశ్వాసం ద్వారా నీతిమంతులు సువార్తను వారి హృదయాలలో ధరిస్తారు.
‘‘మిద్యాను దినమున జరిగినట్లు వాని బరువుకాడిని నీవు విరిచియున్నావు. వాని మెడను కట్టుకర్రను వాని తోలువాని కొరడాలను విరిచియున్నావు’’.(యెషయా 9:4). మన జీవితాలలో దు:ఖాన్ని,అస్వస్థతను,దిగజారుడుతనాన్ని సాతాను కలిగిస్తాడు. అతన్నిజయించడానికి మనం చాలా బలహీనులం. దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. కనుక ఆయన సాతానుతో పోరాడి వానిని ఓడించాడు. 
 ‘‘ఏలయనగా మనకు శిశువు పుట్టెను. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజముల మీద రాజ్యభారముండును.ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.ఇదిమొదలుకొని మితిలేకుండా దానికివృద్ధియు,క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమునుస్ధిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును’’(యెషయా 9:6‌-7).
యేసు తీసుకొని వచ్చిన సత్యసువార్త ద్వారా మనలను తన పిల్లలుగా ఘనపరుస్తానని దేవుడు వాగ్ధానం చేశాడు. తన వాగ్ధానం ప్రకారం ఆయన సాతానును ఓడిరచి,సాతాను బానిసత్వం నుండి మనలను విడిపించాడు.
ప్రభువు లోకానికి వచ్చి సమస్తపాపాంధకారాన్ని తన అధికారంతో తీసివేస్తానని వాగ్ధానం చేశాడు. ఆయన మనయెడల ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. కనుక మనం కూడా మన ప్రభువును ఆశ్చర్యకరుడు అని పిలవాలి. దేవుడు మనుష్య కుమారునిగా ఈ లోకానికి రావాలన్న నిర్ణయం మర్మమైంది. ‘‘రండి మన వివాదము తీర్చుకొందము. మీ పాపములు రక్తమువలె ఎఱ్ఱనివైనను అవి హిమమువలె తెల్లబడును కెంపువలె ఎఱ్ఱనివైనను అవి గొఱ్ఱెబొచ్చువలె తెల్లననివగును.’’(యెషయా 1:18).
మన పాపముల నుండి మనలను రక్షించి,నిత్యక్షమాపణను యిస్తానని ప్రభువు వాగ్ధానం చేశాడు. యేసును ఆశ్చర్యకరుడు అని పిలిచినట్టే ఆయన మన కొరకు అద్భుతకార్యాలు చేశాడు. ‘‘ఆలోచన కర్త ,బలవంతుడైన దేవుడు అని అతనికి పేరుపెట్టబడును ’’దేవుడు మనఆలోచనకర్తగా సత్యసువార్తతో మన రక్షణప్రణాళికను సిద్ధంచేసి మనపాపాలనుండి మనలను శాశ్వతంగా రక్షించడానికి ఆ రక్షణ ప్రణాళికను అమలు చేశాడు.
దేవుని అవివేకము మానవుని జ్ఞానము కంటే గొప్పది. మన పాపాలన్నిటి నుండి మనలను రక్షించడానికి యోహానువలన బాప్తీస్మంపొంది,సిలువమీద మరణించడం యేసుక్రీస్తుకొరకు ఆయనచేసిన జ్ఞానాంశమే. ఆయన మన కొరకు చేసిన ఈ కార్యం మర్మమైనది. అయితే ఆయనప్రేమ నియమం మన పాపాలన్నింటినుండి మనలను రక్షించింది. ప్రేమ నియమం అంటే నీటిద్వారా,ఆయన రక్తంద్వారా పరిశుద్దాత్మను పొందడానికి మనలను నడిపే సత్యసువార్త అని అర్ధం.
 ‘‘అతని నలుగగొట్టుటకు యెహోవాకుఇష్టమాయెను ఆయన అతనికి వ్యాధి కలుగచేసెను.’’అని అంటున్నాడు దేవుడు. యెషయా 53:10లో దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి యేసు తన ప్రాణమును పాపం కొరకు అర్పణగా అర్పించాడు. ఆయన తనకుమారుడైన యేసుక్రీస్తుమీద లోకపాపములను మోపాడు.అందుకు తీర్పు తీర్చి సిలువశిక్ష బాధను అనుభవించునట్లు చేశాడు. మన కొరకు క్రీస్తు తనజీవితాన్ని అర్పించాడు. పాపానికి మూల్యంచెల్లించాడు,రక్షణతో మనలను దీవించాడు. మానవ జాతిని వారి పాపముల నుండి చివరిగా రక్షించిన సత్యసువార్త యిదే.
 

దేవుని త్యాగపూర్తి ప్రణాళిక 
 
యోహానుబాప్తిస్మం వలన యేసు ఎన్ని పాపాను తీసుకొన్నాడు?
కాలం ప్రారంభమైన దగ్గరనుండి దాని అంతం వరకుగల భూత భవిష్యత్‌ వర్తమాన కాలపు పాపాలనన్నింటిని ఆయనే తీసుకొన్నాడు.

ఒకనాటి పాపక్షమాపణ ఫలితంగా యిచ్చే అర్పణను గూర్చి బైబిల్ యిలా వివరిస్తోంది. పాపాత్ముడైనవారు నిష్కళంకమైన పశువును తీసుకొనివచ్చి,తన పాపాలనన్నింటినీ దానిమీద మోపడానికి దాని తలమీద అతని చేతులుంచాలి. ఆ తర్వాత ఆ బలి పశువును చంపి దాని రక్తాన్ని యాజకునికి యివ్వాలి. యాజకుడు ఆ రక్తంలో కొంత భాగాన్ని దహనబలులునర్పించు బలిపీఠము కొమ్ముల మీద నుండి మిగిలిన దానిని బలిపీఠం మీద పోయాలి.
ఈ విధంగా చేసినప్పుడు అతడా రోజున చేసిన అతని పాపాలు క్షమించబడతాయి. అతని పాపాలు ఆ బలిపశువు మీదికి వెళ్ళడానికి దాని మీద చేతులుంచాలి. ఈ బలివిధానంలో తమ అర్పణలు అర్పించిన వారు తమ పాపక్షమాపణను పొందుతారు. యేసు సమస్త పాపాలన్ని తనమీదకు తీసుకొనక ముందు మన పాపపరిహారం నిమిత్తం అలాంటి బలియర్పణా విధానం వుండేది.
ఇశ్రాయేలీయుల సంవత్సర కాలమంతటిలో చేసిన పాపాలను పరిష్కరించుకోవడానికి దేవుడు కూడా పాపపరిహారదినాన్ని ఏర్పాటు చేశాడు. ఈపాపాపరి హారబలి ఏడవ నెల పదవదినమున జరుగుతుంది. ఆ రోజున ఇశ్రాయేలీయుందరి పాపాలన్నీ బలిపశువు మీద మోపడానికి అహరోనును ప్రధాన యాజకునిగా నియమించాడు దేవుడు. ఆయన దేవుని ప్రణాళిక ప్రకారం పనిని నిర్వహిస్తాడు. పాపక్షమాపణ దేవుని జ్ఞానం నుండి మానవుల యెడల ఆయనకుగల ప్రేమ నుండి వచ్చింది. ఇది ఆయన శక్తి.
జీవ గ్రంధమునకు నిదర్శనముగా దహనబలిపీటపు కొమ్ములు వున్నాయి (ప్రక.కజ20:12) ఆ దహన బలినర్పించే బలిపీఠపు కొమ్ముమీద బలిపశువు రక్తాన్ని పెట్టడమంటే అది జీవ గ్రంధంలో రాయబడిన ఆ వ్యక్తుల పేర్లను,వారి అపరాధాలను తుడిచివేస్తుందనిసూచన. సర్వశరీరులకు ప్రాణం లేక జీవం రక్తమే. బలియర్పణ ఇశ్రాయేలీయుల పాపాలను తుడిచి వేస్తుంది. చంపబడిన బలిపశువు పాపానికి మూల్యాన్ని చెల్లిస్తుంది. తమ పాపాలకు తీర్పు అంగీకరించి బలిపశువును అర్పించాలని దేవుడు చెప్పాడు. మన యెడల ఆయన వివేకానికిప్రేమకి యిది గుర్తు. 
దేవుని ప్రణాళికను నెరవేర్చడానికి పాపపరిహారార్పణగా యేసు క్రీస్తు ఈలోకానికి వచ్చాడు. తన బలియర్పణ ద్వారా ఈ లోకపాపాలను తుడిచివేశాడు. ఆయన చేసిన ఈ వాగ్దానాన్ని చూస్తే‘‘అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను’’అని చదువుతాం. అంటే ఆయన ఈలోక పాపమును తీసివేశాడని అర్ధం.
‘‘ఏలయనగా మనకు శిశువు పుట్టెను. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజముమీద రాజ్యభారమురడును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడునిత్యుడగు తండ్రిసమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితిలేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును,రాజ్యమును నియమించును. న్యాయమువలనను ‘‘నీతి వలనను రాజ్యమును స్ధిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహావా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.’’ (యెషయా 9:6‌-7).
మర్మమైన,ఆశ్చర్యకరమైన వాగ్ధానమేమిటంటే యేసు దేవుని వుద్ధేశప్రకారం లోకపాపములను తీసివేసి విశ్వాసులందరికీ సమాధానమును యిస్తాడు. దేవుని వాగ్ధానం ప్రేమవాగ్ధానం. దానిద్వారా ఆయన మానవ జాతికి సమాధానాన్ని కలిగించాలని వుద్దేశించాడు. దానినే మనకు వాగ్ధానం చేసి దానిని నెరవేర్చాడు. 
మత్తయి 1:18 యిలా వివరిస్తోంది. ‘‘యేసుక్రీస్తు జననవిధమెట్లనగా, ఆయనతల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్దాత్మవలన గర్భవతిగా వుండెను.’’ ‘‘యేసు’’ అంటే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించు రక్షకుడు అని ‘‘క్రీస్తు’’ అంటే అభిషక్తుడని అని అర్ధం. యేసులో పాపంలేదు. తన ప్రజలను పాపం నుండి రక్షించుటకు కన్యకకు జన్మించిన ఆయన మన రాజు మన రక్షకుడు.
‘‘ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్తద్వారా పలికిన మాట నెరవేరు నట్లు ఇదంతయు జరిగెను.’’(మత్తయి 1:21‌-22).
 

యేసు తన బాప్తీస్మంద్వారా లోకపాపములను తనతో తీసుకువెళ్ళాడు

మత్తయి 3:13-16 యిలా వివరిస్తోంది‘‘ఆ సమయమున యోహానుచేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయనుండి యెర్ధాను దగ్గరనున్న అతనియొద్దకు వచ్చెను. అందుకు యోహాను నేను నీచేత బాప్తిస్మము పొందవలసినవాడనై యుండగా నీవు నాయొద్దకు వచ్చుచున్నావా?అని ఆయనను నివారింపజూచెను గాని యేసు ఇప్పప్పటికి కానిమ్ము; నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడాలాగుకానిచ్చెను. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్ళలోనుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను,దేవుని ఆత్మపావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను. మరియు ఉదిగో ఈయనే నా ప్రియ కుమారుడు,ఈయనయందు నేనానందించు చున్నానని యొక శబ్ధము ఆకాశము నుండి వచ్చెను.’’
ఈ భాగంలో బాప్తిస్మమిచ్చు యోహాను కనిపిస్తాడు.యేసు యోహానుద్వారా ఎందుకు బాప్తిస్మంపొందాలి?లోకంలోని పాపాన్నంతటినీ తన మీదికి తీసుకోవడానికి,దేవుని ప్రణాళిక ప్రకారం వాటన్నిటినీ తీసివేయడానికి యేసు బాప్తిస్మాన్ని పొందాలి.
‘‘ఆయన భుజముమీద రాజ్యభారముండును’’(యెషయా 9:6) ఇక్కడ ‘‘రాజ్యభారము (ప్రభుత్వము)’’అంటే పరలోకానికి యజమానిగా,ఈ లోకానికి రాజుగా యేసు అధికారము,శక్తివున్నవాడు అని అర్ధం. ఈ అధికారం ఒక్క యేసుక్రీస్తుకే ఇవ్వబడింది. మానవజాతి పాపాలనన్నింటిని తీసివేసి అద్భుతకార్యం చేశాడు యేసు. ఈ ఆశ్చర్యకార్యం యోహాను వలన బాప్తిస్మం పొందటానికే. ‘‘నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నది’’అని చెప్పడంలో యేసు ఉద్దేశమేమిటంటే లోకపాపములనన్నింటిని తీసివేయడం సరైనది. తగిన పని అని.
రోమా 1:17 లో ‘‘విశ్వాసమూలముగా అంత కంతకు విశ్వాసము కలుగునట్లు దేవునినీతి దానియందు బయలుపరచబడుచున్నది.’’.దేవుని నీతి సువార్తలో బయల్పరచబడింది. నీటి మూలముగాను,ఆత్మమూలముగానైన సువార్త నిజంగా దేవుని నీతిని బయల్పరుస్తుందా? బయల్పరుస్తుంది! యేసుక్రీస్తు తన బాప్తిస్మం,సిలువ మరణంద్వారా లోకపాపమును తీసివేశాడు అన్నదే నిజమైన సువార్త. దేవుని నీతిని బయల్పరచు సత్యసువార్త. యోహాను యేసుకు యొర్ధాను నదిలో బాప్తిస్మమిచ్చినప్పుడాయన ఈలోక పాపములన్నింటినీ తనపైకి తీసివేసుకున్నాడు.
‘‘నీతి అంతా’’అన్న దానికి గ్రీకు పదం ‘‘డయ్‌ కాయోసునె’’ఆ పదానికి అర్ధం ఏమిటంటే - యేసు న్యాయమైన,అద్భుత విధానంలో మానవజాతిపాపాలన్నింటిని తీసివేశాడు అని. ఈ లోక పాపములనన్నింటిని తుడిచి వేయడానికి యేసు యోహాను వలన బాప్తిస్మంపొందాలి.
మనవజాతికి సమాధానం కలిగించాలంటే యేసు బాప్తిస్మం తప్పనిసరి అని దేవునికి తెలుసు. యేసు యోహానువలన బాప్తిస్మాన్ని పొంది,సిలువ మీద తన రక్తాన్నిచిందించకపోతే ఆయన మనకు రక్షకుడయ్యేవాడేకాదు. లోకపాపములనన్నింటిని యేసు తన మీదికి తీసుకొని పాప పరిహారార్పణ అయ్యాడు.
“మనమందరము గొఱ్ఱలవలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతివాడును తన కిష్టమైన త్రోవకు తొలిగెను యెహోవా మన యందరి దోషములను అతనిమీద మోపెను.”అని అన్నాడు దేవుడు యెషయా53:6లో దేవునిచిత్త్తాన్నిచేయడానికసలోకపాన్నింటిని అంగీకరించాలి. ఈ కారణంగానే యేసు మానవ శరీరంతో ఈ లోకానికి పాపపరిహారార్పణగా వచ్చి,యోహానువలన బాప్తీస్మం పొందాడు.
యేసు దేవుని ప్రణాళికను నెరవేర్చాలన్నా,ఎన్నటికీ మాసిపోని ఆయన ప్రేమను వ్యక్తీకరణ చేయాలన్నా మానవజాతి పాపాలన్నింటిని ఆయన అంగీకరించాలి. యేసు బాప్తిస్మం తీసుకొని నీటినుండి ఒడ్డుకు రాగానే ‘‘మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయనయందు నేనాందించు చున్నానని యొక శబ్దము వచ్చెను.’’ అని చెప్పాడు దేవుడు (మత్తయి 3:17).
 

మనకు శిశువు పుట్టెను

‘‘ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనాకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగుతండ్రి సమాధానకర్తయగు అధిపతిఅని అతనికి పేరు పెట్టబడును.’’ (యెషయా 9:6). యేసు దేవుని కుమారుడు. యేసు సమస్త జగత్తును సృజించిన సృష్టికర్త ఆయన సర్వశక్తిమంతుడైన దేవుని కుమారుడే గాక ఆయన సృష్టికర్త,సమాధానకర్త,మానవులకు ఆనందాన్నిచ్చిన దేవుడు యేసుక్రీస్తు.
యేసు సత్యమైన దేవుడు. ఆయన మన పాపాలనన్నింటిని తీసుకొని,మనలను రక్షించి,మనకు సమాధానాన్ని అనుగ్రహించాడు. ఈ లోకంలో పాపం వున్నదా?లేదు. యేసు తన బాప్తిస్మం,సిలువ మీద కార్చిన రక్తం ద్వారా లోక పాపాలనన్నింటిని కడిగి వేశాడని చెప్పే సువార్తను మనం నమ్ముతున్నాం. కనుక లోకంలో పాపం లేదని నమ్మకంగా చెప్పగలుగుతున్నాం. యేసు మనతో అబద్దం చెప్పడు. తన బాప్తిస్మం,రక్తంతో పాపానికి మూల్యం చెల్లించాడు యేసు. దీనిని నమ్మిన ప్రతి ఒక్కరిని ఆయన తన పిల్లలుగా చేస్తాడు. మనందరికి సమాధానాన్ని అనుగ్రహించాడు. విశ్వాసంలో నిత్యత్వానికి ఆయన మనలను తన బిడ్డలుగా శుధ్దీకరించి జీవింపచేస్తున్నాడు.
 

ఇదిగో! లోక పాపములను మోసికొని పోవు దేవుని గొర్రెపిల్ల.

యోహాను 1:29 యిలా వివరిస్తోంది. “మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోకపాపములను మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల” అని చెప్పాడు. యేసు తన బాప్తీస్మంద్వారా లోకపాపాలన్నిటిని తీసివేసుకొన్న మరునాడు బాప్తీస్మమిచ్చు యోహాను ఎదుటికి వచ్చాడు. అప్పుడు యోహాను ‘‘ఇదిగో లోక పాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱపిల్ల”అని యేసుని గూర్చి సాక్ష్యం చెప్పాడు. మళ్ళీ యోహాను 1:35-36లో కూడా మరునాడు మరల యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుచున్న యేసువైపు చూచి‘‘ఇదిగో దేవుని గొఱ్ఱపిల్ల”అని సాక్ష్యం యిచ్చాడు.
దేవుడు పాత నిబంధనలో వాగ్ధానం చేసినట్లే మెస్సీయ అయిన యేసు దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. మెస్సీయ అయిన యేసుక్రీస్తు ఆశ్చర్యకరునిగా,ఆలోచనకర్తగా బలవంతుడైనదేవునిగా మన దగ్గరకు వచ్చాడు. మన పాపాలనన్నింటి నుండి మనలను రక్షించడానికి బాప్తిస్మాన్ని పొందాడు. మనకు శిశువు పుట్టెను. యోహాను యిచ్చిన బాప్తిస్మంద్వారా ఆయన ఈ లోక పాపాలను అంగీకరించి పాపానికి మూల్యాన్ని చెల్లించి,మన పాపాలకు విమోచన కలిగించి,సమాధానకర్త అయినాడు. ‘‘ఇదిగో! లోక పాపములను మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల’’
మానవులు తమ పాపాలకు చనిపోవడం తప్ప మరో మార్గం లేదు ఒకప్పుడు మానవులు తమ పాపస్వభావాతో లెక్కలేనన్ని పాపాలు చేసి వాటి ఫలితంగా నరక శిక్షకు పాత్రులుగానిర్ణయించబడేవారు. వారు దౌర్భాగ్యపు జీవితాలు జీవించారు. తమ బలహీనత వలన వారిలో ఒక్కరు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించలేదు,అరదరు దానిని గూర్చి కలలో కూడా ఆలోచించలేదు.
యోర్ధాను నదిలో యోహానువలన బాప్తిస్మంపొంది మన దేవుడైన యేసుక్రీస్తు మన పాపాలను ఒప్పుకొని మనం చేసిన పాపానికి శిక్షగా సిలువ వేయబడ్డాడు. క్రీస్తు చనిపోతూ ‘‘సమాస్తమైనది’’,అని చెప్పాడు (యోహాను 19:30) మానవ జాతి అంతటిని వారి పాపం నుండి,మరణం నుండిరక్షించాడని,సువార్తను నమ్మిన వారినెవరినైనా పూర్తిగా విమోచించాడనడానికి సాక్ష్యమైన కేక అది.
“ఇదిగో లోక పాపమును మోసికొని పోవు దేవుని గొఱ్ఱెపిల్ల”,లోక పాపాలన్నీ ఎక్కడ వున్నాయో మీకు తెలుసా?అవి యేసుక్రీస్తు దేహం మీదలేవా?ఈ లోకంలో మనలను విధేయులను చేసే పాపాలు,అతిక్రమాలన్నీ ఎక్కడున్నాయి?అవన్నీ యేసుక్రీస్తు మీదకు మార్పు (బదిలీ) చేయబడ్డాయి. మన పాపాలన్నీ ఎక్కడున్నాయి?అవన్నీ రాజ్యాధికారము గల వాని భుజాల మీద వున్నాయి అవన్నీ సర్వశక్తుడైన దేవుని దేహంలో వున్నాయి 
 
 
జననంనుండి సమాధికెళ్ళేంతవరకుగల పాపాలు

జీవితకాలమంతా మనం పాపాలు చేస్తూనేవుంటాం. మనం పుట్టినరోజు నుండి 20 ఏళ్ళు నిండేంత వరకు మనం పాపాలు చేశాం. 20 ఏళ్ళు గడిచేంత వరకు చేసిన పాపాలన్నీ ఎక్కడున్నాయి?అవన్నీ యేసుక్రీస్తు దేహం మీద కిబదిలీచేయడ్డాయి. 21నుండి40సం॥ మద్యకాలంలో మనం చేసిన పాపాలు కూడా యేసుమీదికి బదిలీ చేయబడ్డాయి. ఒక వ్యక్తి ఎన్నాళ్ళు జీవించినా అతని జీవిత ప్రారంభంనుండి అంతంవరకు అతడు చేసిన పాపాలన్నీ కూడా యేసు మీదికే బదిలీ చేయబడ్డాయి. ఆదాము నుండి మొదలు పెట్టి ఈ భూమి మీద జీవించిన ఆఖరి వ్యక్తి వరకు మానవులు అందరు చేసిన పాపాలు యేసుమీదికి బదిలీ చేయబడ్డాయి. చివరికి మన పిల్లలు,మనుష్యులు,చేసిన చేసే పాపాలన్నీ కూడా ఇప్పటికే యేసుకు బదిలీ చేయబడ్డ్డాయి. ఈ పాపాలన్నీ యేసు బాప్తీస్మసమయంలో ఆయన మీదికి బదిలీ చేయబడ్డాయి.
ఇంకా ఈ లోకంలో పాపాలున్నాయా! లేవు,ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా ఆయన మీదికి ఎందుకు వెళ్లాయంటే యేసుక్రీస్తు యిచ్చిన సువార్తను మనం నమ్ముతున్నాం గనుక. అందుకే లోకంలో ఒక్క పాపం కూడా ఆయన మీదికి వెళ్ళకుండా విడిచిపెట్టబడలేదు. నీ హృదయంలో పాపం వుందా?లేదు. ఆమెన్‌. యేసు క్రీస్తు మన పాపాల నుండి మనలను రక్షించాడన్న సువార్తను మనం నమ్ముతున్నాం. మన కొరకు ఈ అద్భుత కార్యం చేసినందుకు సర్వ శక్తిమంతుడైన యేసును మనం స్తుతిస్తున్నాం.
మనం పొగొట్టుకున్న జీవితాలను యేసుక్రీస్తు మనకు తిరిగి యిచ్చాడు. కనుక మనం దేవునితో జీవించగలమన్న సువార్తను మనం నమ్ముతున్నాం. చివరికి దేవునికి శత్రువులైన వారు కూడా - అంధకారబంధురమైన అడవులలో దాక్కొనుట తప్ప మరే మార్గం లేని పాపాత్ములు కూడా సత్యసువార్తను నమ్ముటద్వారా వారి పాపాల నుండి యిప్పుడు రక్షణ పొందగలరు.
మనప్రభువు యోహానువలన బాప్తిస్మంపొంది సిలువ వేయబడి,పునరుత్థానుడై పాపాలను శుభ్రంగా కడిగి వేశాడని సువార్త భోధిస్తోంది. యేసు సువార్తను నమ్ముటద్వారా మనం శుధ్దీరించబడిన దేవుని పిల్లలమైనాము. మన పాపాలకు అర్పణగా యేసు తన శరీరాన్ని అర్పించాడు. సర్వశక్తిమంతుడైన దేవుని కుమారునిగా ఈ లోకంలో ఒక్కపాపం కూడా చేయని యేసు లోకపాపాలనన్నింటిని తాను తీసుకొని ఆయనను నమ్మిన ప్రతి ఒక్కరినీ రక్షించాడు. యెషయా 53:5‘‘మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను ’’ అని వివరిస్తోంది. 
యేసు ఈలోక పాపములనన్నింటిని జన్మపాపం చేసిన పాపాలతోసహా ఒక్క అతిక్రమాన్ని కూడా వదలిపెట్టక తాను తీసుకొన్నాడు. సిలువమీద తన మరణంతో పాపానికి మూల్యాన్ని చెల్లించుటద్వారా మన పాపాలనుండి మనలను రక్షించాడు తన సువార్త ద్వారా యేసులోక పాపాలను కడిగివేశాడు. యేసు ద్వారా మనం నూతన జీవితాన్ని కనుగొన్నాం. ఈ సువార్తను నమ్మిన వారు ఆత్మలో చనిపోయిన వారు కాదు. మన పాపాలన్నిటికీ యేసు మూల్యం చెల్లించాడు గనుక యిప్పుడు మనకు నూతనజీవితం,నిత్య జీవితం వున్నాయి. సత్యసువార్తను నమ్ముట వలన మనం దేవుని పిల్లలమైనాము.
యేసు క్రీస్తు దేవుని కుమారుడని ఆయన నీ రక్షకుడని నీవు నమ్ముతావా?నేను నమ్ముతాను. యేసుక్రీస్తు నాకు జీవం. ఆయన ద్వారా మనం నూతన జీవితాన్ని కనుగొన్నాం. మన పాపాలకు,అతిక్రమాలకు మనం చావవలసిన వారం. అయితే యేసు తన బాప్తిస్మం,సిలువ మరణంద్వారా పాపానికిమూల్యాన్నిచెల్లించాడు.మన పాపదాస్యంనుండి, మరణాధికారంనుండి, సాతానుబంధకాల నుండి మనలను విడిపించాడు. మరణాధికారం నుండి,సాతాను బంధకాల నుండి మనలను విడిపించాడు.
మన పాపాల నుండి మనలను రక్షించిన ప్రభువు దేవుడు. యేసును నమ్మిన వారందరికి ఆయన రక్షకుడైనాడు. హెబ్రి 10:10-12,14,18లో పాపాల నిమిత్తం మరొక క్షమాపణ పొందవలసిన అవసరం లేకుండా ప్రభువు మనలను శుద్దీకరించాడని చూస్తాం. యేసును నమ్ముటద్వారా మనం దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. మన పాపాలకు,అతిక్రమాలకు మరణించాల్సిన వారమైవుండగా యేసుబాప్తిస్మం,రక్తాన్ని నమ్ముట వలన పరలోక రాజ్యంలో ప్రవేశించి,నిత్య జీవితాన్ని అనుభవిస్తాం.
‘‘నేను గొఱ్ఱలకు మంచి కాపరిని;మంచి కాపరి గొఱ్ఱలకొరకు తన ప్రాణము పెట్టును’’(యోహాను 10:11) మన ప్రభువు తన బాప్తిస్మం,సిలువ మరణం,పునరుత్థానం ద్వారా మన పాపాల నుండి మనలను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ సత్యాన్ని నమ్మి తన పాపాలకు ఎవరు క్షమాపణ పొందుతారో వారిలో నివసించడానికి ఆయన పరిశుద్దాత్మను కూడా అనుగ్రహిస్తాడు. ప్రభువా,నీ సువార్త ఆనందకరమైనది. అది విశ్వాసులలో నివసించడానికి పరిశుద్దాత్మను అనుగ్రహించగలదు. అందుకు నీకు వందనాలు. హల్లెలూయ ! నేను దేవుని స్తుతిస్తున్నాను.