(యోహాను 7-37:38)
‘‘ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగొనిన యెడల నాయొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులోనుండి జీవ జలనదులు పారునని బిగ్గరగా చెప్పెను’’
పరిశుద్దాత్మ జీవజలమును ఎవరు త్రాగగలరు?
ఎవరైతే సత్యసువార్తయైన యేసు బాప్తిస్మాన్ని సిలువలో ఆయన రక్తాన్ని నమ్ముతారో వారే.
ఎవరైతే సత్యసువార్తను నమ్ముతారో వారి హృదయాల నుండి పరిశుద్దాత్మ అనే జీవజలం ప్రవహిస్తుంది. యోహాను 7:38 ‘‘నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టువాని కడుపులోనుండి జీవ జలనదులు పారును’’అని వివరిస్తోంది. అంటే దేవుడు మన మనకిచ్చిన సువార్తను ఎవరు నమ్ముతారో వారికి నిజమైన రక్షణ,పాపక్షమాపణ వున్నవని అర్ధం.
పరిశుద్దాత్మ మనలో నివసించడం ఎప్పుడు జరుగుతుంది?యేసుక్రీస్తు యోహానువలన తీసుకొన్న బాప్తిస్మం ద్వారా లోకపాపాలనన్నింటినీ తీసివేశాడని వివరించే నిజమైన సువార్తను విని,దానిని నమ్ముట ద్వారా పరిశుద్దాత్మ నివాసాన్ని పొందవచ్చు. అప్పుడు పరిశుద్దాత్మ జీవజలాన్ని కూడా తాగవచ్చు. సువార్తను నమ్మిన వారిలో పరిశుద్దాత్మ నివసించగా వారు దేవుని వాక్యాన్ని బోధించిన,విన్న ప్రతిసారి ఆధ్యాత్మిక జీవజలం వారిలో నుండి పొంగి పొరలి ఎండిన వారి హృదయాలను తడిపే భావానుభవాన్ని వారు పొందుతారు.
నీటిమూలముగాను,ఆత్మమూలముగానైన సువార్తను నమ్మిన వారి హృదయాలనుండి పరిశుద్దాత్మ జీవజలం ప్రవహించి,పాపాత్ములనందరిని వారిపాపాలనుండి రక్షించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడని చెబుతుంది. నీటిమూలముగాను,ఆత్మమూలముగానైన సువార్తనుండి,దేవుని వాక్యాన్ని నమ్మిన వారి హృదయాలలో వుండే వేరుచేయలేని సత్యం పరిశుద్దాత్మ.
పరిశుద్దాత్మ జీవజలాన్ని తాగాలనికోరే ప్రతిఒక్కరూయేసు బాప్తిస్మం,సిలువలో ఆయన కార్చిన రక్తపు సువార్తను నమ్మి పాపక్షమాపణ పొందాలి. దేవుని వాక్యాన్ని నమ్మిన వారి హృదయాలలో నుండి పరిశుద్దాత్మ జీవజలం నదిలా ప్రవహిస్తుంది.ఈ క్షణంలోకూడా యేసుక్రీస్తు బాప్తిస్మాన్ని,సిలువలోని ఆయన రక్తాన్ని నమ్మి పాపక్షమాపణ పొందినవారి హృదయాలోనుండి పరిశుద్దాత్మ జీవజలపు వూటలు నదిలా ప్రవహిస్తాయి.
అయితే ఈ సత్యసువార్తని నమ్మని వారి హృదయాలలో నుండి పరిశుద్దాత్మ జీవజలం ఒక్క చుక్కైనా రాదు. నీటిమూలముగాను,ఆత్మమూలముగానైన సువార్తను,నేను నమ్మి అంగీకరించేంత వరకు నా హృదయంలో నుండి పరిశుద్దాత్మ జీవజలం ఒక్కచుక్క కూడా ప్రవహించలేదు. అప్పుడు నేను యేసుక్రీస్తును తీవ్రంగా నమ్ముతున్నా నా హృదయంలో పరిశుద్దాత్మలేదు గనుక పరిశుద్దాత్మ జీవజలపు ప్రాధాన్యత నాకుతెలియదు.ఇప్పుడైతేనీటిమూలముగాను,ఆత్మమూలముగానైన సత్యసువార్త నాకున్నది. పరిశుద్దాత్మ జీవజలం నా హృదయంలో నుండి స్వేచ్చగా ప్రవహిస్తోంది.
ఇప్పుడు పరిశుద్దాత్మ జీవజలం నా హృదయంలో నుండి,దేవుని వాక్యం విని,నమ్మిన వారి హృదయాల నుండి ప్రవహిస్తూంది. ‘‘ఎవడైనను దప్పిగొనిన యెడల నా యొద్దకు వచ్చి దప్పికతీర్చుకొనవలెను’’అని యేసు చెప్పినట్లే,నీటిమూలముగాను,ఆత్మమూలముగానైన సత్యసువార్తను నమ్మి క్రొత్తగా జన్మించిన విశ్వాసులద్వారా పరిశుద్దాత్మ జీవజలం ఇతరులను కూడా సేదదీరుస్తుంది. ఈ క్షణంలో కూడా ఈ జీవజలం నీటిమూలముగాను,ఆత్మమూలముగానైన సత్యసువార్తలోని నా విశ్వాసంతో బాటు దానిని యితరులు కూడా దానిని గ్రహించునట్లు నా హృదయంలోనుండి ప్రవహిస్తోంది. పరిశుద్దాత్మ జీవజలాన్ని నా హృదయంలోనుండి కాలువలా దేవుడే ప్రహింపచేస్తున్నాడు. పరిశుద్దాత్మ నివాసమును పొందిన వారికి బాగా తెలిసిన విషయం యిది.
దానిని పొందిన వారు తప్ప యితరులెవరూ దీనిని ఎరుగరు అని ప్రకటన గ్రంధంలో రాసినట్టే,నీటిమూలముగాను,ఆత్మమూలముగానైన సత్యసువార్త తెలిసికొని,నమ్మి పరిశుద్దాత్మ నివాసం గలిగినవారుమాత్రమే జీవజలపు రహస్యాన్ని తెలుసుకోగలరు. కనుక,ఎవరిలో పరిశుద్దాత్మ నివసిస్తున్నడో మీరు తెలుసుకోవాలి. యేసుక్రీస్తు సువార్తను నమ్మిన వారికి మాత్రమే పరిశుద్దాత్మ నివాసం అనుగ్రహించబడుతుందని కూడా మీరు తెలుసుకోవాలి.
సిలువ రక్తాన్ని మాత్రమే నేను నమ్ముతూవుండే వాణ్ణి
యేసు సిలువ రక్తాన్ని పది సం॥గా నేను నమ్ముతున్నా యింకా పాపం నా హృదయంలో వుంది. అప్పుడు రక్తం వల్లనే నాకు పాపక్షమాపణ అన్న నమ్మకంనాలో వుండేది. అయితే,ఈలాంటి నమ్మకంతో నాపాపాలకు పూర్తిక్ష మాపణగాని ,లేకపరిశుద్దాత్మనివాసం పొందలేకపోయాను. అప్పుడు నాజీవితంలో కలవరం,శూన్యం మాత్రమే వుండేవి.యేసుక్రీస్తులో నానమ్మకానికి ఏకైక గుర్తు నేను సంఘారాధనకు హాజరవుతూ వుండటం.
అంటే,నా నమ్మకాలను గూర్చి నేను ఆలోచించడం మొదలు పెట్టినప్పుడు,‘‘నేను నిజంగా పరిశుద్దాత్మను పొందానా’’,నేను మొదట యేసును నమ్మినప్పుడు ఆయన యెడలప్రేమతో నా హృదయం ఉద్రేకంతో నిండిపోయింది. నాకు అన్యభాష వరం కూడా వుండేది. అయితేనేనేమయ్యాను,మండుచున్న ఉద్రేకానుభవం పరిశుద్దాత్మ నివాసమునకు సూచన కాదని,నేనసలు పరిశుద్దాత్మను పొందలేదని తెలుసుకోగలిగాను. నేను యేసును నమ్మాను. కాని పరిశుద్దాతను గాని,పరిశుద్దాత్మ జీవజలంగాని నా హృదయంలో లేవు. నా విశ్వాసం [4]కాల్వినిజమ్ మీద ఆధారపడియున్నది గనుక నా హృదయం వేడిగా వుందా లేక చల్లాగా వుందా అన్న దానికి నిజంగా ప్రాధాన్యతలేదు. నేను నిజంగా ఈ క్రింది ప్రశ్నలకు జవాబు చెప్పాలి.
[4] క్రైస్తవ వివరణలో ఒక విధానం జాన్ కాల్విన్ ప్రవేశపెట్టాడు. అది ముందుగా నిర్ణయించిన దానిని,రక్షణను నొక్కిచెబుతుంది. ఆర్మినియను స్ధితికిఅయిదు అంశాలను కాల్విన్ వాదం అభివృద్ది పరిచింది.కాల్విన్ వాద బోధ : 1. పూర్ణ భ్రష్టత్వం : మానవుని అన్ని భాగలలో అంటే శరీరం,ఆత్మ,మనసు,భావోద్రేకాలన్నిటిలోను పాపం వుంటుంది. 2.అనర్హమైన అనుగ్రహం: మానవుని యెడల దేవుని దయ మానవునికి సంబంధం లేకుండా పూర్తిగా ఆయన యిష్టం మీదే ఆధారపడి వుంటుంది. దానిని పొందడానికి మానవుడు అనర్హుడు. 3.పరిమితమైన పాపప్రాయశ్ఛిత్తం: జీవించివున్న వారందరి పాపాలను క్రీస్తు భరించాడుగాని, ఎవరైతే రక్షణకు ఎన్నుకొనబడతారో వారి పాపాలనే ఆయన భరిస్తాడు. 4.ఆపలేని కృప: దేవుడు పిలిచిన వాని రక్షణ ఆపలేనిది. 5.పరిశుద్దుల పట్టుదల: ఒక వ్యక్తి రక్షణను పోగొట్టుకొనుటకు వీలుకాదు. కాని నీటిమూలముగాను,ఆత్మ మూలముగానైన సత్యసువార్త నుండి దాని బోధను స్పష్టంగా గ్రహించవచ్చు. మరిముఖ్యంగా దాని పరిమిత పాపప్రాయశ్చిత్త సిద్దాంతం నుండి తెలుసుకొనవచ్చు. |
వున్నది గనుకనా హృదయం వేడిగా వుందా లేక చల్లగా వుందా అన్న దానికి నిజముగా ప్రాధాన్యత లేదు. నేను నిజంగా ఈ క్రింది ప్రశ్నలకు జవాబు చెప్పాలి.
1) పరిశుద్దాత్మ నాలో నివసిస్తున్నాడా?లేదు. ఆయన నాలో వున్నాడని నాకు నిశ్చయంగా తెలియదు. యేసు సిలువ రక్తాన్ని నేను నమ్ముతున్నా
2) నాలో పాపం వున్నదా?ఉన్నది. యేసు సిలువ రక్తాన్ని నేను నమ్ముతున్నా పాపంనాలో వున్నది. నేను యేసుక్రీస్తును నమ్మి పశ్చాత్తాప ప్రార్ధనలు రోజూ చేస్తున్నా హృదయంలో యింకా పాపం వుంది. నేనెంత తీవ్రంగా ప్రయత్నించినా నా హృయంలోని పాపం పూర్తిగా ఎప్పుడూపవిత్రపరచబడలేదు.
నాలో నివసించే పరిశుద్దాత్మను నేనెలా పొందాలి? నా హృదయంలోని పాపాలన్ని నేనెలాకడిగివేసుకోవాలి? నేను యేసును నమ్మిన తర్వాత కూడా ఎడతెగక నా మనసును బాధిస్తున్న రెండు సమస్యలివి. యేసును నమ్మిన తర్వాత నేను అన్యభాషలతో మాట్లాడాను నా పాపాలు కూడా కడిగివేయబడ్డాయని నమ్మాను. యేసు రక్తంలో నా విశ్వాసానికి ఆయనకు వందనాలు.
అయినప్పటికి,కాలం గడిచే కొద్దీ నా హృదయం మరిన్ని పాపాలతో పేరుకుపోయింది. యేసు రక్తం మీదనే నేను ఆధారపడి వున్నంతకాం నా పశ్చాత్తప ప్రార్ధనలు,లేక ఉపవాసాలు నా పాపాలను కడిగి వేయలేదు. నేను చేసిన పాపాల కొరకు నేనెంతో కాలం బాధపడ్డాను.నేనెంత అధికంగా బాధపడ్డానో అంత తీవ్రంగా యేసు సువార్తను యితరులకు బోధించాను. యేసురక్తం మీద ఆధారపడి మరింత క్రమంగా ఆరాధనకు హాజరవుతూ నా యేసునుసేవించడానికే అధిక సమయాన్ని హెచ్చించాను.
కాలం గడిచే కొద్దీ నా హృదయంలోని పాపం నిజమైన విశ్వాసానికి ఆటంకమయింది. అంతకు ముందుకంటే ఎక్కువగా యేసును నమ్మడం కష్టం అయింది. మరింతగా యేసు రక్తం మీద ఆధారపడడానికి ప్రయత్నిస్తూ,దేవుని యెడల నా భక్తిని,ధ్యానాన్ని పెంపొందించుకొన్నాను. నానాటికి నా హృదయ శూన్యత మరింత ఎక్కువయింది. ఈ విధమైన విశ్వాసం బయటికి కనిపించే వాటిపైనే శ్రద్దచూపే వేషధారణ క్రైస్తవునిలా నన్ను మార్చివేసింది. నా విశ్వాసం నన్ను పెడమార్గం పట్టించలేదని నమ్మడానికి ప్రయత్నించాను. “నేనే కాదు యేసును నమ్మడంలో ప్రతివారు ఇలాగే వుంటారు” అనిపించింది నాకు. ఏమైనా యేసురక్తం,నా పశ్చాత్తాప ప్రార్ధనలు నాలోని పాపాన్నంతటినీ కడిగి వేయలేకపోయాయి.అయితే నా జన్మ పాపాలను ఎలాంటి విశ్వాసం కడిగివేస్తుంది. అంటే,యేసు యొర్ధాను నదిలో బాప్తిస్మం పొందినప్పడు నా పాపాలన్నీ ఆయనమీదికి బదిలీచేయబడ్డాయన్న నా నమ్మకం ద్వారా నా జన్మ పాపాలన్నీ కడిగివేయబడతాయి. ఇదే మత్తయి 3:13-17లో వున్న యోహాను యేసుకు యిచ్చిన బాప్తిస్మంలోని అసలు అర్ధం,ఆయన సువార్త నాకు తెలియదు. నమ్మలేదు గనుక.
అటని యేసుబాప్తిస్మం ఈ లోకపాపానన్నింటిని కడిగివేస్తుందని అర్ధమా?అవును అది కడిగివేస్తుందనడమే సత్యం. ఇందుకు బైబిల్ సాక్ష్యం. ‘‘ఒకడు కొత్తగా జన్మించితేగాని అతడు దేవుని రాజ్యమును చూడలేదు. ఒకడు నీటిమూలముగాను,ఆత్మమూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు’’ (యోహాను 3:3-5) యేసు ఈ లోకమునకువచ్చి యోహాను బాప్తిస్మం వలన ఈ లోకపాపములను తన పైకి తీసుకొన్నాడు.
ఈ విషయంలో నాకింకా అనుమానం వుండి నేను పాత,కొత్త నిబంధన ద్వారా దానిని పరిశీలించి,అదే సత్యమని నిర్ణయించుకొన్నాను. యేసుబాప్తిస్మ సమయంలో నా పాపాలతో సహా ప్రపంచ పాపాలన్నీ ఆయన మీదికి బదిలీచేయబడ్డాయి. ఈ మాటలు నమ్ముట వలన నేను శుద్దీకరించబడ్డాను. ఇదే బైబిల్లో లిఖించబడియున్న సువార్త సత్యమని నేను తెలుసుకోగలిగాను.
యొర్ధాను నదిలో ఆయన బాప్తిస్మం పొందినప్పుడుదానితోపాటు నా పాపాలు ఆయనకు బదిలీ చేయబడినవని నాకు తెలియదు గనుక యేసురక్తంలో మాత్రమే విశ్వాసం నా పాపాలను కడిగివేయలేదని తెలుసుకొన్నాను. యేసు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు అని,ఆయనబాప్తిస్మం ద్వారా,ప్రపంచ పాపాలన్నింటిని తాను భరించి,సిలువవేయబడి మన పాపాలనుండి మనలను విడిపించాడన్న సత్యాన్ని తెలుసుకోగలిగాను. అంతేగాక,ఆయన బాప్తిస్మం,సిలువలో రక్తం చిందించడం ఈ లోకపాపాలను తీసివేయడానికే అన్న సత్యాన్ని కూడా తెలుసుకోగలిగాను. యేసు ఇచ్చిన సత్యసువార్త కొరకు నా పాపాలు క్షమించినందుకు,నేనిప్పుడు నీతిమంతుడనైనందుకు ఆయనకే వందనాలు.
సంఘ సిద్దాంతాలు కాదుగాని యేసుబాప్తిస్మం,ఆయన కల్వరి రక్తం నా పాపాలను తుడిచివేశాయన్న ఈ సత్యం సువార్తలో వున్నది. యేసురక్తంలో నేను,విశ్వాసం వుంచడంవల్లనే గాక,ఆయనబాప్తిస్మం, సిలువ రక్తంలో కూడా విశ్వాసం వలన నాకు రక్షణ వున్నదని నమ్మడం వల్లనే నా పాపాలనుండి నేను రక్షించబడ్డాను.
మరొక విషయం ఆనంద భరితమైన సువార్తను నమ్మడం మొదలు పెట్టిన తర్వాతనే దేవుని పరిశుద్దాత్మ నా మీదికి వచ్చాడు. అందుకుకూడా నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు యోహాను వలన యేసు పొందిన బాప్తిస్మం,సిలువ మీద ఆయన రక్తం అనే ఆయన మాటలతో బాటు పరిశుద్దాత్మ కూడా నాలో నివసిస్తున్నాయి.
యేసు శిష్యులు నమ్మిన ఈ సువార్తను నాకు ఇచ్చి,ఆనమ్మకానే బోధించునట్లు చేస్తున్న దేవునికి వందనాలు. సత్యసువార్తను నమ్మడమనే ఒకే ఒక పనిని నేను చేసినా దేవుడు నాకు పరిశుద్దాత్మ వరాన్ని అనుగ్రహించాడు. యేసురక్తంలో నమ్మకముంచినంత మాత్రన అది వారి పాపాలను తుడిచి వేయలేదన్న ఈ సందేశాన్ని యిప్పుడు నేను ధైర్యంగా,నిశ్చయంగా అందరికీ ప్రకటించగలను.
యోహాను వలన యేసు బాప్తిస్మం,సిలువ మీద ఆయన రక్తాన్ని గూర్చి వివరించే సువార్తను నమ్మిన వారి పాపాలు మాత్రమే తప్పక కడిగివేయబడగలవని నేను వారికి చెప్పగలను. ఈ సత్యసువార్తను బోధించడానికి దేవుని ముందు ఏమాత్రం సిగ్గుపడను. నీటిద్వారా,ఆత్మద్వారా క్రొత్తగా జన్మిచడంనుగూర్చినసువార్తనుఎంతోగౌరవంతోబోధించగలను,నీటిమూలముగాను,ఆత్మమూలముగాసువార్తను నాకు యిచ్చి పరిశుద్దాత్మ జీవజలాన్నితాగగలుగునట్లు చేసిన దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
నీటిమూలముగాను,ఆత్మమూలముగాననై సువార్త నిజమైనదని రోగపరీక్షలు తెలియజేస్తున్నాయి.
నీ పాపాలకు క్షమాపణ పొంది,నీలో నివసించే పరిశుద్దాత్మను నీవు పొందావా?సువార్త సత్యమైనదని నీవెలా చెప్పగలవు,ఎలాగంటే యేసు యిచ్చిన ఈ సత్యసువార్తను నమ్మబోతున్న వారి మీద నేను కొన్ని పరీక్షలు జరిపాను. ఒక వ్యక్తికి సిలువలోని యేసుక్రీస్తు రక్తాన్ని గూర్చినసువార్తను బోధించాను. యేసుక్రీస్తులో ఏ పాపాం లేదని కూడా అతనితో చెప్పాను. మరొ వ్యక్తికి యోహాను వలన యేసు బాప్తిస్మం,సిలువ మీద ఆయనకార్చిన రక్తాన్ని గూర్చిన సువార్తను బోధించాను. ఫలితంగా,యేసు రక్తంలోనే తన పాపాలకు క్షమాపణ పొందిన వ్యక్తి తన జన్మ పాపాలకు ఎడతెగక క్షమాపణ పొందుతున్నానని చెప్పాడు. మరో వ్యక్తి యిప్పుడు యేసు తన పాపానన్నింటిని తీసుకొని,వాటి కొరకు ఆయన తీర్పు పొందాడు గనుక యిప్పుడు తాను తన హృదయంలో పాపంలేని వ్యక్తినని చెప్పాడు. యోహానువలన యేసుపొందిన బాప్తీస్మం లోక పాపాలన్నింటిని కడిగివేసింది అని చెప్పే సువార్తను నమ్ముతున్నాడు గనుక అతడు దేవుని నుండి పరిశుద్దాత్మను పొందగలిగాడు.
సత్యసువార్తలోని నమ్మకంద్వారా ఈ వ్యక్తి తన హృదయంలో పరిశుద్దాత్మను పొందగలిగాడు. ఆ పరిశుద్దాత్మ అతనిలో ఏ పాపంలేదని చెప్పినందు వలన నాలో ఏ పాపంలేదని నిశ్చయంగా అతడు చెప్పగలిగాడు. యోహానువలన యేసుబాప్తిస్మం,సిలువలోఆయన కార్చిన రక్తంలో నమ్మిన వారందరి హృదయాలలో నివసించు పరిశుద్దాత్మను దేవుడను గ్రహిస్తాడు.
పెంతెకొస్తు రోజున బాహ్యానికి కనిపించే అద్బుతాన్ని చూసిన వారిలో చాలామంది సువార్తను ప్రక్కన పెట్టి,పరిశుద్దాత్మను పొందడమనే సత్యాన్ని అపార్ధంచేసేట్లు చేసింది. తాము పట్టుదలతో ప్రార్ధన చేస్తూ,పరిశుద్దాత్మ కొరకు వెదికితే తమలో నివసించు పరిశుద్దాత్మను పొందుతామని అనుకొంటారు చాలామంది. యేసు బాప్తిస్మం,ఆయన రక్తాన్ని నమ్ముట వల్లనే పరిశుద్దాత్మను పొందగలమన్న సువార్తను ప్రకటించే సత్యాన్నిగూర్చి చాలాకాలంగా ప్రపంచంలోని క్రైస్తవులకు చిన్న ఆలోచన కూడా లేదు. అయితే యిప్పుడు నీటిమూలముగాను,ఆత్మమూలముగాననై సువార్తలో పరిశుద్దాత్మను పొందిన అనేక మందిదేవుని సేవకులు,ఆపరిశుద్దాత్మ సహాయంతో సువార్తను బోధిస్తున్నారు దాని ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ఆ సువార్తను అంగీకరించి హృదయంలో నివసించు పరిశుద్దాత్మను పొందుతున్నారు.
ఈ సువార్తను నమ్మినవారు తమలో పరిశుద్దాత్మాను పొందు అనుభవాన్ని దేవుడనుగ్రహిస్తాడు. ‘‘అంత్యదినములయందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను’’అని దేవుడు చెబుతున్నాడని బైబిల్ వివరిస్తోంది. (అ.పో. 2:17) అయితే,ఆయన సువార్త తెలియకుండా పరిశుద్దాత్మను పొందాలని ఎవరైనా ప్రయత్నిస్తే అది పొరబాటు. యోహాను వలన బాప్తిస్మం, సిలువమీద ఆయన రక్తం అనే సువార్తను నమ్మడం తప్ప పరిశుద్దాత్మను పొందే మరో మార్గం లేనేలేదు.
ఒక వ్యక్తి నీటివలనను,ఆత్మవలనను క్రొత్తగా జన్మించితేనేగాని వరలోక రాజ్యంలో ప్రవేశించలేడని యేసు చెప్పాడు. అలాగే క్రొత్తగా జన్మించిన వారుమాత్రమే పరిశుద్దాత్మను పొందగలరు. కనుక పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ప్రతి ఒక్కరూ పరిశుద్దాత్మను పొందిన వారైవుండాలనడంలో ఏ సందేహం లేదు. యేసుక్రీస్తు సువార్తను నమ్మడం కంటే పరలోకానికి వెళ్ళడానికి మరో మార్గం లేదు. మనం సరుకుకొన్నప్పుడు డబ్బు చెల్లించినట్టే,సత్యసువార్తను నమ్మడం వల్లనే మనలోనివసించుపరిశుద్దాత్మను పొందగలం.
నిజంగా మీలో వుండునట్లు పొందాలనుకుంటే మీరు మొదటిగా నీటిమూలముగాను ఆత్మమూలముగానైన సువార్తను తెలుసుకొనిదానిని నమ్మినప్పుడే పరిశుద్దాత్మను పొందిన అనుభవాన్ని పొందగలరని నేను మీతో చెబుతున్నాను. మీలో పరిశుద్దాత్మ నివసించాలని దేవుడు కోరుకొంటున్నాడు.
నేనీ సత్యసువార్తను నమ్ముతున్నాను. కాలంగడిచే కొద్దీ దేవుడు నాకిచ్చిన ఈ సత్యసువార్తను ప్రపంచంలో కెల్లాఅతిఅందమైనది విలువైనదని నేను గట్టిగా నమ్ముతున్నాను. అందుకు నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీరు అలాగే అనుకొంటున్నారా?మనలో పరిశుద్దాత్మను పొందిన వారు దేవుని దీవెను అధికంగా పొందినవారని మనం తెలుసుకోగలం.
ఈ సత్యసువార్తను నమ్ముట వలన మీలో నివసించు పరిశుద్దాత్మను ఎలా పొందగలరన్న సందేశాన్ని మీకు చెబుతున్నాను. నీటివలన,ఆత్మవలన క్రొత్తగా జన్మిస్తారన్న ఈ సువార్తను అంగీకరించిన వారే తమలో పరిశుద్దాత్మను పొందే యోగ్యతను కలిగివుంటారు.
యోహాను 7:38లో యేసు యిలా వివరించాడు?‘‘నాయందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజలనదులు పారును’’అంటే యేసుక్రీస్తు వారికిచ్చిన సువార్తను నమ్మి పాపక్షమాపణ పొందిన వారు వారిలో పరిశుద్దాత్మను కలిగివుంటారనిఅర్ధం. పరిశుద్దాత్మ అనజీవజలంవారి హృదయాలలో నుండి ప్రవహిస్తుంది. ఈ సువార్తను నమ్మినవారు ఆధ్యాత్మిక జీవజల ప్రవాహానుభవాన్ని పొందుతారు.
నీటిమూలముగాను,ఆత్మమూలముగానైన సువార్తద్వారా నేను క్రొత్తగా జన్మించకముందు యేసుక్రీస్తులో భక్తిగల నమ్మకం నాకున్నా,నా హృదయంలో నుండి పరిశుద్దాత్మ జీవజలం ప్రవహించేదికాదు. అయితే నీటిమూలముగాను,ఆత్మమూలముగానైన సువార్తను నేను నమ్మినతర్వాత,బైబిల్ వివరిస్తున్నాట్టు నా హృదయంలోనుండి జీవజలప్రవాహం స్వేచ్చగా ప్రవహించడం మొదలు పెట్టింది. ఈ క్షణంలో కూడా దేవుడు నాకను గ్రహించిన నీటిమూలముగాను, ఆత్మమూలముగానైన సువార్తతో బాటు,పరిశుద్దాత్మ జీవజలం సమృద్దిగా సంవత్సరమంతా నాలో నుండి ప్రవహిస్తోంది. నాలో పరిశుద్దాత్మను పొందినతర్వాత నేను సువార్తికుని పనిని మొదలు పెట్టి యేసు క్రీస్తు సత్యసువ్తాను బోధిస్తూ వున్నాను.
సువ్తార్తను నమ్మి నాలో పరిశుద్దాత్మను పొందిన తర్వాత విశ్వాసాన్ని గూర్చిన నా ఒప్పుకోలు
నాకు ఇరవై సంవత్సరా ప్రాయం. అది ఆకురాలు కాలం చివరి భాగం. మరణం తప్పదు అన్న ఆలోచన నాలో ప్రబలంగా కలిగింది. నా హృదయంలోని పాపాలు కారణంగా నా జీవితం కలవరంలో,శూన్యమై,అంధకారబందురంగా వుంది. ఏ మార్గాన్ని అవంభించాలో తెలియక అనలోచితంగా తప్పుడు మార్గంలో తిరుగాడుతున్నాను. నా శరీరం అనారోగ్యానికి లోనవడంతోబాటు,నాలోని శూన్యం దినదినాభివృద్ది చెందుతోంది.
పాపాల వలన నేను నిరాశలో మునిగిపోయాను. హఠాత్తుగా వచ్చే అంతం కొరకు,దేవుని తీర్పు కొరకు ఎదురుచూస్తూ ‘‘దేవా,నేను చనిపోకముందు నీలో విశ్వాసంతో నాకు పాపక్షమాపణ దయచెయ్యి. నా శరీర అనారోగ్యాన్ని కూడా తీసివెయ్యి”,అని ఎంతగానో ప్రార్ధించాను.
అలాంటప్పుడు నిరాశతో నిండియున్న నా హృదయంలో ఒక నూతన నిరీక్షణ కుమ్మరింపు మొదలైంది. నా హృదయం నిరాశగానే దేవుని కొరకు రగిలే జ్వాలతో నిండిపోయింది. ఆ రోజు నుండి నా పాపాల నుండి నన్ను రక్షించడానికి యేసు సిలువపై చనిపోయాడన్న నమ్మకంతో ఒక నూతన జీవితాన్ని మొదలు పెట్టాను.
ఆతర్వాత కొద్ది రోజులకే అన్యభాషలలో మాట్లాడే అనుభవాల్ని పొందాను. ఆ తర్వాత సిలువ మీద యేసు నా కొరకు కార్చిన రక్తాన్ని గూర్చి కన్నీరు కార్చాను.
ఈ సంఘటన తర్వాత నా పాత జీవితాన్ని విడిచి పరిశుద్ద ఆదివారాన్ని ఆచరించే కొత్త ఉద్యోగంలో చేరాను. అప్పుడు నా హృదయం యేసుయెడలగల ప్రేమతో నిండి,నా పాప విమోచన కొరకు ఆయన సిలువలో తన రక్తాన్ని చిందించాడన్న కృతజ్ఞత పొంగిపొరలుతోంది. నాలో మతపరమైన ఆసక్తి యేసు సిలువలో కార్చిన రక్తపు మాటలపై ఆధారపడి ఎదగడం మొదలైంది.
కాలం గడుస్తోంది. నా బలహీనతలు,నా జన్మ పాపాల కారణంగా నా మత జీవితానికి తెగులు మొదలైంది. నా నమ్మకం సిలువలో యేసు రక్తంలోనే వున్నందువలన నా జన్మ పాపాలను కడిగివేసుకోవాలని ప్రయత్నించాను. దేవుని క్షమాపణను సాధించగలనన్న నమ్మకంతో చేసిన నా ప్రార్ధనలు కూడా నా జన్మపాపాన్ని పూర్తిగా కడిగివేయలేకపోయినై. అందుకు కారణం నేను దేవుని నియమాలను అనుసరించలేకపోవడమే. ఫలితంగా నా జన్మపాపాలు కుప్పగా పేరుకోవడం మొదలైనాయి.
నా పశ్చాత్తాప ప్రార్ధనలు నా పాపాలను పూర్తిగా కడిగివేయకపోయినప్పటికీ ఆ ప్రార్ధనలే మళ్ళీ మళ్ళీ చేయడం తప్ప నాకు మరో మార్గం లేదు. నేను పాపం చేసినప్పుడల్లా పశ్చాత్తాప ప్రార్ధనలతోను,సిలువమీది యేసు రక్తాన్ని గూర్చి ఆలోచిస్తూ నా పాపాలను కడిగివేసుకొనవచ్చునని నమ్మాను. నా మతజీవితంలో ఎంతగా నేను కొనసాగుతున్నానో నా బలహీనత వలన జన్మ పాపాలు అంత ఎక్కువగా పేరుకోసాగాయి. ఈ పాపాల వలన నా శ్రమలు పెరుగుతున్నాయే గాని తరగడంలేదు.
నేను వేషధారి అయిన పరిసయ్యుని వంటి క్రైస్తవుడిగా తయారైనాను. నా పాపభారంతో సంబంధం లేకుండా ఒక సహాయ పాస్టరు గారిని,మరికొంత కాలానికి మరొక సువార్తికుని నియమించాను. నా జన్మ పాపాల బాధను ఉపశమింప చేసుకోవాలనుకొన్నప్పుడు నా పాపాలను కడిగివేసుకోడానికిదే మార్గం అన్నట్టు ప్రసంగించడానికి బయటకు వెళ్తూ వుండే వాణ్ణి. ఆలాంటి సిద్దాంతంమీద,స్వయంత్యాగంమీద ఆధారపడ్డ నా విశ్వాసం ద్వారా నా జన్మ పాపాలు కడిగివేయబడలేదు.
నేను సాతానుకు పట్టుబడ్డానన్న అనుభవాన్ని కూడా పొందాను. నా జన్మపాపాల వలన శిక్షాపాత్రుడనై అతిక్రమాల నిమిత్తం నన్ను చంపివేయమని కూడా దేవుని వేడుకొన్నాను. ‘‘నీవు పాపంచేశావు! చేయలేదా’’,అని సాతాను శిక్షిస్తూ నన్ను హింసించడం మొదలు పెట్టాడు.
నా విశ్వాసం కూలిపోయే దశకు చేరుకొన్నాను. యేసురక్తంలో పశ్చాత్తాప ప్రార్ధనలో విశ్వాసముంచినంత మాత్రన నా జన్మపాపాలు కడిగివేసుకోలేనని నేను విఫలమైన పరిస్ధితిలో వున్నానని తెలుసుకొన్నాను.
ఒక వేదాంత పాఠశాలలో కాల్వినిజమ్‌ను చదివినప్పుడు యోహానువలన యేసు బాప్తిస్మానికి కారణం ఏమిటన్న ఆసక్తి పెరిగింది నాలో. ఇదే ప్రశ్న అనేక మంది ప్రొఫెసర్లను అడిగాను. అందకు వారు ఆయన దేవుని యెడల తన వినయాన్ని ప్రదర్శించడానికి,ఆయన దేవుని కుమారుడని ప్రకటించబడడానికి ఆయన యోహానువలన బాప్తిస్మం పొందాడన్న మామూలు జవాబులే చెప్పారు. కాని నా ఆసక్తిని అవి తీర్చలేకపోయినై.
యోహాను వలన యేసు బాప్తిస్మంలోనిసత్యం ఆనందభరితమైన సువర్తనే నేను తెలుసుకొనేట్టు చేసింది.
సెమినరీలో నా విద్యాభ్యాసం అయిపోయిన తర్వాతకూడా అంతకు ముందుకంటే మరింతపాపభారంతో కృంగిపోయాను. అప్పుడొక రోజున యేసుబాప్తిస్మం ఎందుకు పొందాడో,ఈ కార్యం వలన సమస్త నీతి నెరవేర్చబడుతుందని ఆయన ఎందుకు అన్నాడో అర్ధం చేసుకోగలిగాను.యోర్ధాను నదిలో బాప్తిస్మంద్వారా నా పాపాలన్ని ఆయన మీద మోపబడినవని లిఖితమైన ఆయన సువార్త ద్వారా తెలుసుకొనునట్లు దేవుడు నాకు సహాయం చేశాడు.
దేవుని మాటలున్న సువార్తను పదేపదే చదవడం ద్వారా యోహాను బాప్తిస్మం వలన నా పాపాలన్నీ ఆయనకు బదిలీ చేయబడినవని,వాటి నిమిత్తం ఆయన సిలువమీద తీర్పు తీర్చ బడ్డాడన్న సత్యాన్ని చివరికి నేను గుర్తించగలిగాను.
ఈ సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకోగలిగానో పరిశుద్దాత్మ నాలోనికి నిజంగా వచ్చాడు. ఈ సత్యసువార్తను నమ్మినప్పుడు నా హృదయంలోని పాపాలన్నీ పూర్తిగా క్షమించబడ్డాయి. నన్ను నిరాశ నిస్పృహలోనికి నెట్టివేసిన ఈ పాపాలన్నీ సువార్త శక్తివలన పూర్తిగా క్షమించబడ్డాయి. నన్ను నిరాశ నిస్ఫృహలోనికి నెట్టివేసిన ఈ పాపాలన్నీ సువార్త శక్తి వలన పూర్తిగా కడిగివేయబడ్డాయి. నా స్వయంత్యాగాలు,పశ్చాత్తాప ప్రార్ధనల వలన తుడిచివేయబడని నా పాపాలన్నీ యిప్పుడు పూర్తిగా మాయమై పోయినందుకు నేను హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతా వందనాలు చెల్లించాను.
సిలువలో యేసు రక్తం వల్లనే లోక పాపా కడిగివేయబడవు అని నేను చెప్పేది సత్యం. యోహాను వలన యేసుబాప్తిస్మం కూడా పాపక్షమాపణకు నడుపుతుంది. నీటిమూలముగాను, ఆత్మమూలముగానైన సువార్తద్వారా ప్రతి ఒక్కరి పాపం కడిగివేయబడుతుందని యిప్పుడు అందరూ అర్ధంచేసుకుని,నమ్మాలి,నా హృదయాంతరంగంలో పరిశుద్దాత్మ నివసిస్తున్నాడని నాకెలా తెలుసంటే,నీటిమూలముగాను,ఆత్మమూలముగానైన సువార్తను,ఆయన కుమారుని గూర్చి దేవుడిచ్చిన సాక్ష్యపు మాటలు నా హృదయంలో పాపాలన్నింటినీ తరిమివేయడానికి చాలునన్న నమ్మకం వల్లనే,సత్యసువార్తను నమ్మిన ఫలితంగా పావురంవలె పరిశుద్దాత్మను నేను పొందాను.
ఆనాటి నుండి నా ఆధ్యాత్మిక పనిని నేను చేయగలుగునట్లు,అనగా ఆనందమయమైన సువార్తను ప్రకటించునట్లు పరిశుద్దాత్మ నాలో పనిచేశాడు. ఇప్పుడు నా హృదయంలో పాపంలేదు. యోహానువలన యేసుబాప్తిస్మం,సిలువ మీద ఆయన రక్తం నా పాపవిమోచనకు సాక్ష్యంగా వుండడమేగాక,నాలో నివసించు పరిశుద్దాత్మను పొందడానికినన్ను నడిపించినవి. హల్లెూయ! దేవునినేనుస్తుతిస్తున్నాను. నీటిమూలముగాను,ఆత్మమూలముగానైన సువార్తను నేను నమ్మినప్పటినుండి పావురంలా పరిశుద్దాత్మ మౌనంగా నా మీదికి వచ్చి నాలో నివసిస్తున్నాడు. కొన్ని సార్లు పావురంలా,మరికొన్ని సార్లు గుండంలా పేలుతూ నా హృదయంలో పనిచేయడం మొదలుపెట్టాడు.
నీటిమూలముగాను,ఆత్మమూలముగానైన సువార్తను మీరు అంగీకరించి,నమ్మితే మీరు కూడా యిప్పుడేమీలోనివసించుపరిశుద్దాత్మనుపొందగలరు.నాతోబాబుమీరుకూడానీటిమూలముగాను,ఆత్మమూలముగానైన సువార్తను నమ్ముటద్వారా దేవునిపరిశుద్దాత్మనుపొంది,ఆయననుస్తుతించాలనుకోవడం లేదా,నాతోబాటు నీటిమూలముగాను,ఆత్మమూలముగానైన సువార్తను ప్రపంచమంతటికీ ప్రకటించాలని మీరనుకోవడం లేదానీటిమూలముగాను,ఆత్మమూలముగానైన సువార్త మిమ్మును శుద్దీకరించి మీలో నివసించు పరిశుద్దాత్మను అనుగ్రహిస్తుంది. విశ్వాసం నుండి విశ్వాసానికి దేవుని నీతిని బయల్పరుస్తుంది సువార్త. అందుకనే ఈ నీటిమూలముగాను,ఆత్మమూలముగానైన సువార్తలో విశ్వాసంద్వారా హృదయంలో నివసించు పరిశుద్దాత్మను అనుగ్రహించాడు దేవుడు.
పరిశుద్దాత్మ నా కొరకు చేసిన అద్బుత కార్యాలు
నాలో నివసించు పరిశుద్దాత్మను పొందిన తర్వాత నేనొక కొత్త సంఘంలో సత్యసువార్తనుబోధించ మొదలు పెట్టాను. ఆ సువార్తను అధికార పూర్వకంగా బోధించుశక్తిని పరిశుద్దాత్మ అనుగ్రహించాడు.
అప్పుడే ఈ క్రింది సంఘటన జరిగింది. నేనున్న పట్టణంలోనే యితర దేశాలవారితో వ్యాపారం చేసే ఒక దర్జీవున్నాడు. ఆయన సంఘంలో సహాయకుడు.ఒకప్పుడు ఒకతనితో వ్యాపారం చేయడాన్ని ఒక హోటల్ వారు ఆటంకపరిచారు. అక్కడ అతడు మన పాస్టరు గారిని చూశాడు. ఆయనాహ్వానాన్ని మన్నించి కలుసుకొని చాలా కాలంగా తాను పాపంలో జీవిస్తున్నానని చెప్పాడు. అయిదు గంటల సలహా తర్వాత నీరు,ఆత్మ వివరణతో పాపక్షమాపణా సత్యాన్ని తెలుసుకోగలిగాడు. అతడు తిరిగి జన్మించాడు. అప్పుడు అతనిలో నివసించు పరిశుద్దాత్మను కూడా పొందాడు.
మందిరం కొరకు ఒక ఇల్లును చూడ్డానికి నేను వెళ్ళినప్పుడు జరిగిన మరొకథ. విశాలమైన బాగా వున్న ఒక ఇల్లును చూశాను. దాన్ని మందిరానికి అద్దెకు తీసుకోవాలంటేఅప్పుడు చాలినంత ధనం నా దగ్గరలేదు. నా పరిస్థితిని బట్టి అంత యింటిని అద్దెకు తీసుకోవడం అసంభవం అనిపించింది. నాకు అయితే ‘‘అధైర్యపడకు,నమ్మకం కలిగివుండు’’అని నాలోని పరిశుద్దాత్మ నన్ను హెచ్చరించాడు. తర్వాత ఆశ్చర్యకరంగా ఆ ఇంటిలోనే ఆయన పనిచేయడానికి సహాయం చేసిన పరిశుద్దాత్మకు వందనాలు. అప్పటినుండి నీటిమూలంగాను,ఆత్మమూలముగానైన సువార్తను బోధించేవానిగా పరిశుద్దాత్మ నన్ను చేశాడు. ఈ క్షణంలో కూడా నాలోవున్న పరిశుద్దాత్మ ఈ సత్యసువార్తను ఎవరైతే విని,నమ్ముతారో వారు తమలో నివసించు పరిశుద్దాత్మను పొందడం నేను చూడగలుగుతున్నాను.
ఈ సత్యసువార్తను బోధించే శక్తిని నాకిచ్చిన పరిశుద్దాత్మకు నేను స్తుతులు చెల్లిస్తున్నాను. పరిశుద్దాత్మ నాకుచేసిన వాటన్నింటినిరాయడానికి నా జీవితకాలమంతా చాలదని నాకు తెలుసు. పరిశుద్దాత్మ నా హృదయంలో నుండి జీవజలం స్వేచ్చగా పారునట్లు చేయునుగాక,నాలో నివసించు ఆయనకే కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాను.
నీటిమూలముగాను,ఆత్మమూలముగానైన సువార్తద్వారా తనతో నడిచే సంఘాన్ని స్థాపించాడుపరిశుద్దాత్మ.
ఒకసారి ఒక అరణ్య ప్రాంతంలో దేవుని కొరకు ఎదురుచూస్తున్న వారికి సువార్తను ప్రకటించడానికి ఒక చిన్న గ్రామానికి దేవుడు నన్ను నడిపించాడు. సువార్తను విని,నమ్ముటద్వారా వారు కూడా పరిశుద్దాత్మను పొందారు. అప్పటి నుండి వారిని నా సహపనివారిగా నడిపించడమేగాక,వారితో కలసి ఈ సత్యసువార్తను ప్రపంచానికి బోదిస్తూ వున్నాం.
అప్పుడు వారు ఓమత శాఖకు చెందిన చిన్న బృందం వారు దేవుని మాట ప్రకారం జీవించాలని కోరుకొంటున్నారు.అయితేపాపానికివారుదాసులైవున్నందునపాపక్షమాపణకొరకుఏడుస్తూవుండేవారు.ఆపరిస్థితులో మేము కలుసుకొనేట్లు,నేను వారికి నీటిమూలముగాను,ఆత్మమూలముగానైన సువార్తను బోధించునట్లు పరిశుద్దాత్మ నడిపించాడు. లేవీయకాండంలోని బలియర్పణ విధానంతో ప్రారంభించి సువార్తను బోధించడం వలన వారు దానిని నమ్మి పరిశుద్దాత్మను పొందారు.
ఆవిశ్వాసులద్వారా ఆసువార్తతో దేవుడు పరిశుద్దాత్మ సంఘాన్ని స్థాపించాడు. సువార్త ద్వారా పరిశుద్దాత్మ వారిని యేసు శిష్యులుగా నియమించాడు. ఇప్పుడు అంతకంతకు ఎక్కువ మంది పరిశుద్దాత్మను పొంది సంఘంలో ప్రవేశిస్తున్నారు.
ఒక మిషన్ స్కూలును ప్రారంభించి,శిష్యులను చేయునట్లు పరిశుద్దాత్మ నన్ను నడిపించాడు. వారికి దేవుని మాటలు ఉపదేశించడానికి,విశ్వాసంద్వారా వారు విధేయులగుటకు నేర్చుకొనడానికి,దేవుని పనివారిగా సేవచేయడానికి పరిశుద్దాత్మ సహాయం చేశాడు. వారు వెళ్ళిన చోటల్లా సువార్త పనులు జరుగునట్లు చేసి,వారి ద్వారా తన సంఘాలను స్ధాపించాడు దేవుడు. నీటిమూలముగాను,ఆత్మమూలముగానైన సువార్తను బోధించునట్లు పరిశుద్దాత్మ తన సేవకులను నడిపిస్తున్నాడు. పాపక్షమాపణ పొందిన నీతిమంతులను సంఘంతో ఐక్యమై ఈ లోకంలో నీతిమంతుగా జీవించునట్లు దీవించి నడిపిస్తున్నాడు పరిశుద్దాత్మ.
అనాది కాలంనుండి సాతాను ప్రజలను మోసగిస్తూనే వున్నాడు. పశ్చాత్తాప ప్రార్ధనలద్వారా ఉపవాసంద్వారా,హస్తనిక్షేపణద్వారా పరిశుద్దాత్మను పొందవచ్చునని సాతాను చెబుతాడు. అది అసలు సత్యంకాదు.పశ్చాత్తాప ప్రార్ధనలు ,హస్తనిక్షేపణద్వారా కాకదేవుడిచ్చి ననీటిమూలముగాను, ఆత్మమూలముగానైన సువార్తను నమ్ముటద్వారా తమ పాపాలకు క్షమాపణ పొందుట వల్లనే వారు పరిశుద్దాత్మను పొందగలరు. మనలో నివసించు పరిశుద్దాత్మకు ఇదే నిజమైన అర్దం. ప్రజలు తమలో నివసించు పరిశుద్దాత్మను పొందునట్లు నీటిమూలముగాను,ఆత్మమూలముగానైన సువార్తను ప్రకటించునట్లు యేసుక్రీస్తు శిష్యులను పరిశుద్దాత్మ ఎడతెగక నడిపిస్తాడు.
ప్రపంచవ్యాప్తంగా సార్వత్రిక పరిచర్యలు చేయనట్లు పరిశుద్దాత్మ మమ్మును నడిపించాడు.
పౌలు తనసువార్తలో ఆనందభరితమైన సువార్తను చెప్పినట్టే నీటిమూలముగాను,ఆత్మ మూలముగానైన సువార్తను బోధించి,వ్యాపింపచేసి,రాయునట్లు నాలోని పరిశుద్దాత్మ నన్ను పురికొల్పుతున్నాడు. విశ్వసించినవాడు పరిశుద్దాత్మను పొందు సువార్త గల క్రైస్తవ పుస్తకాలను మేము ప్రచురిస్తున్నాం. చిన్న కరపత్రాలతో మొదలు పెట్టిన మేము అతి త్వరలోనే సువార్తగల మాపుస్తకాలు ప్రపంచమంతా వ్యాప్తి చెందాయి.
ఈ పుస్తకాలను చదివి,ఈ సుందరమైన సువార్తనునమ్మి తమ పాపక్షమాపణ పొందిన అనేక మందిని సంఘంలో చేరునట్లు నాలోని పరిశుద్దాత్మ నడిపిస్తున్నాడు. ప్రపంచంలోనే 150 దేశాలో అనేక విదేశీ భాషలలో ఈ సువార్తను బోధించునట్లు ఆయన నడిపిస్తున్నాడు.
ప్రపంచ మిషన్ కొరకు,వివిధ భాషలలోనికి ఈ సువార్తను అనువదించడానికి,దీనిని అనేక జాతుల వారు విని,నమ్మునట్లు ప్రార్దించమని పరిశుద్దాత్మ సంఘాన్ని పురికొల్పుతున్నాడు.
ఇతర దేశాలలోని నూతన శిష్యులతో కలసి పనిచేయడానికి,వారితో కలసి ఈ సువార్తను
ప్రకటించడానికి నన్ను నడిపిస్తున్న పరిశుద్దాత్మకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.
రష్యాలో సువార్తను ప్రకటించునట్లు,అక్కడసత్యాన్ని వెదకుతున్న రష్యా సువార్తికులను కలసి వారి కొరకు ప్రార్దించునట్లు పరిశుద్దాత్మ మమ్మును నడిపిస్తున్నాడు. వారు మొదట సువార్త విన్నప్పుడు మనలాగే వారు పరిశుద్దాత్మను పొందారు.
మాస్కోలోని జాతీయ యూనివర్సటీలోని ఒక ప్రొఫెసర్‌గారు నీటిమూలముగాను, ఆత్మమూలముగానైన సువార్తను విని తన ఒప్పుకొలును ఇలా తెలియచేశారు. “నేను దేవుణ్ణి నిజంగా అర్ధం చేసుకోకుండానే ఆరేళ్ళుగా దేవుని నమ్ముతున్నాను. అయితే, నీటిమూలముగాను, ఆత్మమూలముగానైన సువార్త విన్న తర్వాత నాకు గట్టి విశ్వాసం కలిగింది. నా హృదయంలో శాంతిని,ఆదరణను పొందాను,అందుకు దేవునికి స్తుతులు. ఇప్పటి వరకు నేను సరైన విశ్వాసంతో మత జీవితాన్ని గడుపుతున్నాననుకొన్నాను. నా మత జీవితం మన పాపాల కొరకు చనిపోయిన యేసురక్తాన్ని నమ్మడంతోనే వుండేది. అయినా దేవుడు నా పాపాలన్నింటిని క్షమించాడన్న ఆలోచన నాకు లేదు.
తర్వాత నేను క్రొత్తగా జన్మించిన పాస్టర్లను కలుసుకొన్నాను. దేవుడిచ్చిన సువార్తను విని నేనింకా పాపాత్ముడనే అని తెలుసుకొన్నాను. నేనింకా ఈ మంచి సువార్తను కనుగొనాలని, నీతిమంతునిగా వుండడమంటే ఏమిటో తెలుసుకోవాని ప్రయత్నించాను. యేసు బాప్తిస్మం పొందినప్పుడు నా పాపాలన్నీ ఆయన మీద మోపబడ్డాయని తెలుసుకొన్నాను. ఇది సత్యసువార్త. నా జన్మ పాపమేగాక,నా అనుదిన పాపాలు,భావికాపు పాపాలు కూడా యేసుబాప్తిస్మమన్నప్పుడు ఆయన మీద మోపబడ్డాయని తెలుసుకొన్నాను. ఈ సత్య సువార్తవిని,నమ్ముటద్వారా క్రొత్తగా జన్మించి మహా ఆనందాన్ని పొందాను’’
నీటిమూలముగాను,ఆత్మమూలముగానైన సువార్తను విని నమ్మిన ఈ ప్రొఫెసర్ గారు ఇంకా అనేక మంది రష్యనులు పరిశుద్దాత్మను పొందారు. ఇప్పుడక్కడ పరిశుద్దాత్మ సంఘం స్థాపింపబడింది. పరిశుద్దాత్మ పనిద్వారా అనేకులు ఈ సువార్తను నమ్ముతూవున్నారు. దేవుడే ఈ పనులన్నీ చేశాడు.అందుకు పరిశుద్దాత్మకు ప్రత్యేకంగా స్తుతులు చెల్లిస్తున్నా.
నీటిమూలముగాను,ఆత్మమూలముగానైన సువార్తను నమ్ముతున్న వారిలాగే నాలో నివసిస్తున్న పరిశుద్దాత్మ నన్ను క్రొత్తగా జన్మించిన క్రైస్తవునిగా చేశాడు. ఇప్పుడు నేను సత్యసువార్తను ప్రపంచానికి బోధిస్తున్నాను. మాకు ఈ సత్యసువార్తను గూర్చిన పుస్తకాలు ఇంగ్లీషులోనికేగాక, ప్రపంచవ్యాప్తంగా అనేక భాషలలోనికి అనువదించబడుతూ వుండేట్లు ఆయన నడిపిస్తాడు. మీలో కూడా పరిశుద్దాత్మ నివసించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు పరిశుద్దాత్మను పొందగలరు.
దేవుని పేరును పెద్దగా పిలుస్తూ,తీవ్రంగా ప్రార్ధనలుచేస్తూ పరిశుద్దాత్మను పొందాలని చాలామంది ప్రయత్నిస్తారు. అయితే యేసు మనకిచ్చిన ఈ సత్యసువార్తలేకుండా పరిశుద్దాత్మను పొందాలని ప్రయత్నించడం పొరపాటు. నీటిమూలముగాను, ఆత్మమూలముగానైన సత్యసువార్త లేకుండా పరిశుద్దాత్మ నివసించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు పరిశుద్దాత్మను పొందగలరు.
యేసు తమకిచ్చిన ఈ సత్యసువార్తను నమ్మకుండా ఆయన శిష్యులు పరిశుద్దాత్మను పొందారా?లేదు. ఈరోజులలో నీటిమూలముగాను,ఆత్మ మూలముగానైన సత్యసువార్తను నమ్మిన వారిలోనే పరిశుద్దాత్మ నివసిస్తూ,వారి హృదయాల నుండి పరిశుద్దాత్మ జీవజలం ప్రవహిస్తూవుంది. ఇప్పుడు ఈ క్షణంలో ఈ సత్యసువార్తతో బాటు పరిశుద్దాత్మ జీవజలం నా హృదయంలో నుండి ప్రవహిస్తోంది. హల్లెూయ! ప్రభువుకే స్తుతికలుగునుగాక!