• All e-books and audiobooks on The New Life Mission website are free
  • Explore multilingual sermons in global languages
  • Two new revised editions in English have been released
  • Check out our website translated into 27 languages
Search

Sermons

అంశం 8: పరిశుద్ధాత్మ

[8-9] మనలను శుధ్దీకరించిన ఆయనబాప్తిస్మసువార్త (ఎఫెసి 2:14-22)

(ఎఫెసి 2:14-22)
‘‘ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును వుండిన ద్వేషమును,అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుటచేత మధ్యగోడను పడగొట్టి,మన ఉభయులను ఏకముచేసెను. ఇట్లు సంధిచేయుచు,ఈ యిద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి,తన సిలువవలన ఆ ద్వేషమును సంహరించి, దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగాచేసి,దేవునితో సమాధానపరచవలెనని యీలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై యున్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తనుప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగిలిగియున్నాము. కాబట్టి మీరికమీదట పరజనులునుపరదేశులునై వుండక, పరిశుద్దుతో ఏక పట్టణస్ధులును దేవుని యింటివారునై యున్నారు. క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపోస్తులులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్దమైన దేవాలయ మగుటకు వృద్దిపొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలమై వుండుటకు కట్టబడుచున్నారు’’
 
 
మానవుని దేవునినుండి దూర పరచినదేది?
అతనిపాపమే అతని దూరపరచింది. 
 
 
పేదరికం వలన దత్తు చేసుకొన్న బిడ్డ్డ
 
కొరియా యుద్దం ముగిసి ఆర్ధశతాబ్దం అయింది. అది కొరియా వారి మద్య భయంకరమైన గాయాలను మిగిల్చింది. కొరియా యుద్దం తర్వాత చాలామంది పిల్లలను విదేశీయులు దత్తత చేసుకొన్నారు. ఆ సమయంలో యునైటెడ్‌ నేషన్స్‌ (సంయుక్త రాష్ట్రా) సైన్యాలు కొరియా వచ్చి మాకెంతో సహాయం చేసినా ఆ సైనికులు వెళ్ళిపోయిన తర్వాత అనేక మంది పిల్లలు తండ్రులు లేని వారైనారు.
 ఇక్కడ భార్య,పిల్లలను ఏర్పరచుకొన్న అనేకమంది యు.యన్‌. సైనికులు తిరిగి తమ దేశానికి వెళ్ళేప్పుడు వారి కుటుంబాలను యిక్కడే వదలిపెట్టి వెళ్ళిపోయారు. అలా మిగిలిన చాలా మంది పిల్లలు అనాధలైనారు. వారిని వారి తల్లులు అనాధాశ్రమాలలో చేర్చారు. అక్కడి నుండి చాలా మందిని విదేశాలలో దత్తతకుపంపించారు. ఇది వాస్తవానికి ఎంతో అదృష్టం. ఆ అనాధ పిల్లలకు పెంపుడు తల్లిదండ్రులు లభించి బాగా పెంచబడ్డారు.
 దత్తతకు వెళ్ళిన ఈ పిల్లలు పెరిగే కొద్దీ తమ తల్లిదండ్రుల ఇరుగు పొరుగు రూపురేఖలకు భిన్నంగా వున్నారు.తాము కొరియా అనే దూరదేశం వారమని,తమను వీరుదత్తుచేసుకొన్నారని తెలుసుకొని, ‘‘నాతల్లిదండ్రులు నన్నెందుకు విడిచిపెట్టారు,వారు నన్ను ద్వేషించి ఈ దేశానికి పంపించారా’’ అనుకొన్నారు. ఆ చిన్న మనుసులు అసలేం జరిగిందో అర్దం చేసుకోలేకపోయినవి.
వారి అసలైన తల్లిదండ్రులను తెలుసుకోవాలన్న వారిలోని ఆసక్తి,తమనిలా అనాధలుగా విడిచిపెట్టిన తల్లిదండ్రుల మీద ద్వేషం ఒకదానికొకటితోడై వారిని కలుసుకోవాలన్న ఆశ వారిలో పెరిగింది. ‘‘నా త్లదండ్రులెలా వుంటారు?వారు నన్నిలా ఎందుకు అనాధలుగా విడిచిపెట్టారు,నన్నుద్వేషించడం వల్లనే యిలా చేశారా?కాదు. ఇందుకు ఏదో కారణం వుండి వుంటుంది,ఇలా వారిలో ఎన్నో ఆలోచనలు,అపార్ధాలు. కొన్నిసార్లు ద్వేషించబడినవారిగా భావించుకొన్నారు. మరి కొన్ని సార్లు అసలు దీని గురించే ఆలోచించకూడదనుకొన్నారు. వారీ రహస్యం తెలుసుకొనక ముందే కాలంగడిచి ఆ పిల్లలు పెద్దవాళ్ళైనారు. పెళ్ళిళ్ళు చేసుకొన్నారు. పిల్లలను కన్నారు. తమ కుటుంబాలను ఏర్పరచుకొన్నారు.
 స్థానిక టీవివారు ప్రసారం చేసిన ఒక కార్యక్రమాన్ని చూసిన నాకు ఈ పిల్లలంటే ఆసక్తి కలిగింది. ఆ టీవి వారు యిప్పుడు జర్మనీలో పెంపుడు బిడ్డగా పెరిగిన ఒకామెను ‘‘ఇంటర్వూ చేశారు. ఆమెకిప్పుడు ఇరవై సంవత్సరాు మొదట తానొక పెంపుడు బిడ్డనని యితరులకు తెలియడం యిష్టంలేక ఆమె ఈ కార్యక్రమంలో పాల్గనడానికి యిష్టపడలేదామె. కాని ఈ కార్యక్రమం వలన తమ బిడ్డలను విదేశాలలో దత్తుకివ్వడం తగ్గడానికి సహాయపడవచ్చునని ఆమెకు నచ్చచెబితే,అప్పుడొప్పుకొన్నది.
 ‘‘నీ అసలైన తల్లిదండ్రులను నీవు కులుసుకుంటే వారిని నీవేమి అడుగుతావు,అసలు దేనిని తెలుసుకోవాలన్న ఆసక్తి నీలోవుంది’’,అని ఆ కార్యక్రమంచ సేవ్యక్తి ఆమెనుప్రశ్నించాడు. అందుకామె ‘‘అసలు వారు నన్నీ పెంపుడు పరిస్ధితులలో ఎందుకు పెట్టారో నాకర్ధంకాదు.నన్ను మీరు ద్వేషిస్తున్నారా అని వారినడగాలని వుంది’’అని జవాబు చెప్పింది. ఆమెకు జన్మనిచ్చిన తల్లి ఆ కార్యక్రమాన్ని చూసింది. తన కుమార్తెను కలుసుకోవాని ఆ టీవి ప్రసార కేంద్రం వారిని సంప్రదించింది. అలా ఆ తల్లి కుమార్తె కలుసుకోవడం జరిగింది.
 ఆ తల్లి తన కుమార్తెను కలుసుకోడానికి ఎంతో ముందుగా ఎయిర్‌పోర్టుకు వెళ్ళి ఆ విమానం రాక కొరకు ఎంతోసేపు ఎదురు చూసింది. చివరికి తన కుమార్తె బయటికి వచ్చే ద్వారం దగ్గర ఏడుస్తూ ఎదురుచూస్తోంది. కుమార్తె బయటకి వచ్చింది. అంతకు ముందు వాళ్ళెప్పుడూ కలుసుకోలేదు. ఎదిగిన తన కుమార్తెను ఆ తల్లి మొదటిగా టీవిలో చూసింది. ఇప్పుడు కలుసుకొన్నది. ఆమెది జర్మనీ భాష,తల్లిది కొరియా భాష. ఒకరి మాటఒకరికి అర్ధం కాదు. అయినా వారి హృదయాలు మాట్లాడుకొన్నాయి. వారి చూపులు ఒకరితో ఒకరు మాట్లాడుకొనేట్లు చేశాయి. ఒకరి ముఖాలను మరొకరు తాకారు. తాను చేసిన దానికి తనను క్షమించమని తల్లి బతిమాలుకొన్నది. ఆ తల్లి చేయగలిగిందల్లా ఏడ్వడం,జరిగిన దానికి తాను బాధపడుతున్నా అని ఏడ్పు ద్వారా తెలియచేయడము.
 తల్లి కూతుర్లు యిద్దరూ తల్లి యింటికి వచ్చారు. వారు కలసి భుజించారు. వారి భాషలు వేరు. మాటలతో ఒకరినొకరు పలుకరించుకోలేరు. అయితే వారు తల్లీ కూతుళ్ళు చేతులు వూపి,ముఖంలోని భావోద్వేగాలతో ఒకరినొరు తాకి,హృదయాలతో ఎన్నో సంగతులు ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు. ఒకరి నొకరు అర్ధం చేసుకోగలిగారు.
 ఆ కుమార్తె మళ్ళీ తిరిగి జర్మనీ వెళ్ళేటప్పుటికి తన తల్లి తనను ఎంతగానో ప్రేమిస్తున్నదని తెలుసుకొన్నది. ఆమె కొరియా నుండి వచ్చిన తర్వాత ఆ టీవి కార్యక్రమం నిర్వహించిన వారు మళ్ళీ ఆమెతో మాట్లాడారు. వారితో ఆమె ‘‘నా తల్లి నన్ను దత్తతకు ఎందుకిచ్చిందో అడగాల్సిన అవసరం నాకు కనిపించడంలేదు. ఆమె పేదరాలు. ఇప్పటికి పేదరాలే. ఈ దేశంలో ధనవంతులు,ఖరీదైన కార్లు గలవారు. నా తల్లి ఇప్పటికీ యింకా పేదరికంలోనే బతుకుతూవుంది’’అని చెప్పింది.
 ‘‘ఆమె యింకా,నా తల్లిని నేనా ప్రశ్నవేయక పోయినా,నన్ను పేదరికం నుండి కాపాడ్డానికే ఆమెనన్ను పంపించివేసిందని నాకు తెలుసు. అందుకనే ఆ ప్రశ్ననేనామెను అడగలేదు. అప్పుడు నాలోని సందేహాలు,ద్వేషం అన్నీ ఇప్పుడు నాలోలేవు’’అనిచెప్పింది.
 

తమ హృదయాలలోని పాపం వలన ప్రజలు దేవుని నుండి వేరు అవుతారు.

మనం దేవుని నుండి ఎందుకు వేరవుతాం,ఆయనకు ఎందుకు దగ్గరకాలేము,దత్తతకివ్వబడిన ఆ అమ్మాయి తనను పేదరికం నుండి కాపాడ్డానికి తన తల్లి తనను పంపివేసిందని తెలుసుకొన్నది. దేవునివిషయంలో కూడా ఇంతేనా,దేవుడు మనలను తన స్వరూపంలో సృజించాడు. మరి ఆయన నుండి మనలను వేరు చేసిందెవరు?దానికి జవాబు మానవుడు పాపం చేసేట్లుగా సాతాను అతని శోధించాడు. ఆ పాపం అతణ్ణి దేవుని నుండి వేరుచేసింది.
దేవుడు మానవుని తన స్వరూపంలో సృజించాడు. తన సృష్టిని ఎంతగానో ప్రేమించాడు. దేవుని ప్రేమ పాత్రునిగా మానవుని చేశాడు. సృష్టిలో ఏ ప్రాణికీలేని ఆధిక్యతను అతనికిచ్చాడు. అయితే పడిపోయిన సాతాను అనే దేవదూత దేవుని నుండి మానవుని వేరు చేయడానికి పనిచేశాడు. దేవుని మాటలు నమ్మకుండాచేసి,మంచి చెడు తెలివినిచ్చు వృక్షఫలాలను అతడు తినేట్లు శోధించాడు. 
 తన పాపం వల్లనే మానవుడు దేవుని నుండి వేరైనాడు. మొదట మానవుడు దేవునికి విధేయునిగా వున్నాడు. దేవుడిచ్చిన నిత్య జీవము నిచ్చే వృక్షఫలాను దేవుడు తినమని అనుమతించినా దానిని అతడు తినలేదు. కాని తినవద్దని ఆజ్ఞపించిన మంచి చెడులను తెలియచేసే వృక్షఫలాలను అతడు తిన్నాడు. దాని ఫలితంగా మానవుడు దేవుని నుండి వేరుచేయబడ్డాడు.
అంతకు మునుపు దేవునిప్రేమకు పాత్రుడైవున్న మానవుడు తన గర్వంతో దేవునికి అవిధేయుడై ఆయననుండి వేరు చేయబడ్డాడు. దానితో అతని హృదయంలోనికి వచ్చిన పాపం వలన చివరికి దేవునికి దూరం చేయబడ్డాడు. దాని తర్వాత చాలాకాలం దేవునికి దూరంగా వుండి ‘‘ఆయన మమ్మును సృజించిన తర్వాత మిమ్మునెందుకు విడిచి పెట్టాడు,అసలు మేము పాపం చేసేందుకు ఎందుకు అనుమతించాడు. మమ్మును బలహీనులనుచేసి నరకానికెందుకు పంపుతాడు?దీని కంటే అసలు మమ్మును సృజించకుండా వుంటే బాగుండేది కదా’’,అని నేరారోపణ చేయడం మొదలుపెట్టాడు. మనం తిరిగి జన్మించకముందు అనేక ప్రశ్నలు,తెలుసుకోవాన్న ఆసక్తి,సందేహాలు,ద్వేషంతో జీవిస్తాం.
 టీవిలో ఆ దత్తత చేయబడిన స్త్రీ కార్యక్రమం చూసినప్పుడు ఆమెకు,ఆమెను కన్న తల్లికి ఉన్న సంబంధం లాంటిదే మానవునికి దేవునికి మద్య వున్నదని తెలుసుకొన్నాను. కష్టాలు,అపార్ధాలు,శాపం లేక ఏ రకమైన పాపంగాని ఏ పరిస్ధితులలోను మానవుని దేవుని నుండి వేరు పరచలేవు. అంతే కాదు,దేవుడు,మానవుని మద్య సంబంధం ప్రేమ మీద ఆధారపడివున్నా అపార్ధాలు కలిగే అవకాశం వుందని నేను అర్ధం చేసుకోగలిగాను. 
ఆ తల్లి తన కుమార్తెను ద్వేషంతో ఎలా తన నుండిపంపించి వేయలేదో అలాగే దేవుడు కూడా మానవుని యెడల ద్వేషంతో గాక పాపం మీద ద్వేషంతో తననుతాను వేరుపరచుకొన్నాడు. దేవుడు మానవుని ద్వేషించడానికి గాని,మానవుడు దేవుని ద్వేషించడానికి గాని కారణమే లేదు. మనం ఒకరినొకరం ప్రేమించుకొంటున్నాం. దేవునికి వేరుగా మానవుడుండటానికి కారణం,సాతాను కపటోపాయానికి లొంగిపోయి అతడు పాపాత్ముడవ్వడమే. 
 

యేసు ద్వారా దేవుడు మనలను ఆలింగనం చేసుకొన్నాడు.

‘‘అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులైయున్నారు. ఆయన మన సమాధానమై వుండి మీకును మాకును వుండిన ద్వేషమును,అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును,తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధిచేయును. ఈ యిద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించెను’’(ఎఫెసి 2:13-15).ఆజ్ఞ ధర్మశాస్త్రమును కొట్టివేయుటకు ప్రభువు యోహానువలన బాప్తిస్మంపొంది లోక పాపాలనన్నింటిని తానుతీసుకొన్నాడు. తర్వాత మానవుని దేవుడు ఆలింగనం చేసుకొన్నట్లు మానవుని తనపాపాలనుండి రక్షించడానికి ఆయన సిలువ మీద తన రక్తాన్ని కార్చాడు. దేవుని చేత కడుగబడిన వారిని ఇప్పుడు ఆయన ఆలింగనం చేసుకొన్నాడు.
 నీరు లేని ప్రపంచాన్ని గూర్చి మీరెప్పుడైనా వూహించారా?ఒకసారి కొరియాలో పెద్ద ఓడరేవులో ఒకటైన ఇంకాన్‌ నగరంలో ఒక బైబిల్ మీటింగ్‌కు హాజరయ్యాను. అప్పుడు కొన్ని రోజుల వరకు అక్కడ కుళాయిలు పనిచేయక నీళ్ళు రాలేదు. అప్పుడు నీరు లేక ప్రజలు జీవించలేరని నేను అనుకొన్నాను.
దేవుడు ఒక నెలరోజుల పాటు ఈ ప్రపంచంలో నీళ్ళు లేకుండా చేస్తే నగరాలలో,పట్టణాలలో మురికి పేరుకొని దుర్గంధం వ్యాపించి నివసించడం అసంభవమవుతుంది. దేవుడిచ్చిననీటివిలువను మనం అర్ధంచేసుకోవాలి.మానవులకు నీరు తప్పనిసరైన అవసరం. అలాగుననే యొర్తానునదిలో యోహానువలన యేసుపొందిన బాప్తిస్మానికి కూడా నీటి అవసరతా అంతే.
 యోహాను వలన బాప్తిస్మం పొందడానికి యేసు ఈ లోకంలోనికి రాకుండా వున్నట్లయితే,యేసును నమ్మిన విశ్వాసులు తమ పాపాలకు పరిహారాన్ని ఎలా పొంది వుండేవారు?ఒకవేళ యోహానువలన యేసు బాప్తిస్మం పొందకుండా వున్నట్లయితే నీరు లేకుండా ప్రజలెలా జీవించలేరో అలాగే ఈ లోకంలోని ప్రతిఒక్కరూ మరణించి వుండేవారు.
 ఏమైనప్పటికి యేసు బాప్తిస్మంతో మనపాపాలన్నింటిని తీసివేసుకొన్నాడు గనుక మన హృదయాలు కడుగబడ్డాయని,మనం రక్షణతో ఆశీర్వదించబడ్డామన్న నమ్మకంతో వున్నాం. మన విశ్వాసాన్ని బయలు పరిచేది యేసు బాప్తిస్మమే. ఇంకా పరిశుద్దాత్మను పొందడానికి తప్పనిసరైనది యేసు బాప్తిస్మం.
 యేసు శిష్యులలో ఒకరైన పేతురు అన్నాడు,‘‘ దానికిసాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది; అదేదనగా శరీరమాలిన్యము తీపివేయుట కాదు గాని యేసు క్రీస్తు పునరుత్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే’’(1 పేరుతు 3:21). మన పాపాల నుండి మనలను రక్షించడానికి యేసు బాప్తీస్మమిచ్చు యోహాను వలన బాప్తీస్మం పొందాడని పేతురు వివరణ చెబుతోంది. లోక పాపాలన్నింటిని కడిగి వేసిన యేసు బాప్తిస్మమే నిజమైన సువార్త. నిర్గమకాండం 30:17-21 లో ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని వుంచి నీళ్ళతో నింపవలెను. ఆ నీళ్ళతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుగుకొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళునప్పుడును సేవచేసి యెహావాకు హోమధూపము నర్పించుటకు బలిపీఠము నొద్దకు వచ్చునప్పుడును తాము చావక యుండునట్లు నీళ్ళతో కడుగు కొనవలెను. తాము చావక వుండునట్లు తమ చేతులను కాళ్ళను కడుగుకొన వలెను. అది వారికి,అనగా అతనికిని అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నుండును’’
 ప్రత్యక్షపు గుడారంలో చేసుకొనే దానికి,బలిపీఠానికిమద్య ఒక ఇత్తడి గంగాళం వుంది. శుభ్రపరుచుకోడానికి దానిలో నీరు పోసి వుంచుతారు ఇదిగాని లేకుంటే యాజకులు అర్పించే బలి అర్పణలు ఎంత మురికిగానో వుంటాయి.
 ప్రజల నిమిత్తం యాజకులు ప్రతిరోజు అర్పించే బలి యర్పణలు,పాప పరిహారార్ధ బలిపశువు మీద వారి చేతులుంచి,ఆ తర్వాత వాటిని చంపడం వలన ఎంతరక్తాన్ని,మురికిని యాజకులు ఎంత మలినంతో వుంటారో ప్రత్యక్ష గుడారంలో ఈ యిత్తడి గంగాళం లేకుంటే యాజకుడెంతో మలినంతో వుంటాడు.
 యాజకులు శుభ్రమైన చేతులతో తన దగ్గరకు రావాలని దేవుడే యిత్తడి గంగాళాన్ని ఏర్పాటు చేశాడు. పాపాత్ములు తాము తెచ్చిన పాప ప్రాయశ్చిత్త బలి అర్పణపై తమ చేతులుంచి తమ పాపాలు దాని మీదికి బదిలీ చేసిన తర్వాత వారి పక్షంగా ఆ బలిపశువును యాజకులుదేవునికి బలియిస్తారు. అందుకని వారు తమను శుభ్రపరచుకోడానికి దేవుడా గంగాళాన్ని ఏర్పాటు చేశాడు. వారు తమను శుభ్రం చేసుకోకుండా ప్రవేశిస్తే వారు చనిపోతారు. బలిపశువు రక్తాన్ని కార్చిన తర్వాత తనను శుభ్రం చేసుకోకుండా యాజకుడు పరిశుద్దస్థలంలోనికి ప్రవేశించకూడదు.
 అందుకనే ప్రజల కొరకు బలి అర్పించిన యాజకులు దేవుని సమీపంచడానికి గంగాళంలోని నీటితో తమ మాలిన్యాన్నంతటిని కడిగివేసు కొంటారు.
 

యేసు బాప్తిస్మం లోక పాపముల నన్నింటిని కడిగివేసింది.

యుర్ధాను నదిలో యోహానువలన యేసు పొందిన బాప్తిస్మం ద్వారా లోక పాపాలన్నీ యేసు మీదికి బదిలీ చేయబడ్డాయి. నీటిలో ఆయన పూర్తిగా మునగడం ఆయన మరణాన్ని నీటి నుండి ఆయన బయటికి రావడం ఆయన పునరుత్ధానాన్ని సూచిస్తున్నాయి. మరో మాటలో చెప్పుకొంటేలోక పాపాలన్నింటిని తన మీదికి తీసుకోడానికి యేసు యోహానువలన బాప్తిస్మాన్నితీసుకొన్నాడు.ఆ పాపానికి మూల్యాన్ని చెల్లించి సిలువ మీద చనిపోయాడు. ఆయన మరణం మన పాపాలకు మూల్యం చెల్లించగా,ఆయన పునరుత్ధానం వలన మనకు నిత్యజీవం ఇవ్వబడినది.
 తన బాప్తిస్మంద్వారా యేసు మన పాపాలన్నింటిని తనమీదికి తీసుకొన్నాడని మనం నమ్మకపోతే మన హృదయాలు పాపంతో నిండివున్నట్లే. అలాంటప్పుడు దేవుని దగ్గరకు మనంఎలావెళ్ళగలం, పాపవిమోచనా సువార్త ఒక మత శాఖ సిద్దాంతం కాదు గాని అది దేవుని సత్యం.
పరిపూర్ణ పరిజ్ఞానం లేకుండా మన విశ్వాసంలో మనం కొనసాగలేం. మరోమాటల్లో చెప్పుకొంటే యోహానువలన యేసు బాప్తిస్మం తీసుకొన్నాడన్న విషయంలో మనం శ్రద్దతీసుకొనకపోతే ప్రపంచాన్ని జయించలేం. జీవులు తమ ప్రాణాన్ని నిలుపుకోవాంటే నీరు ఎలా అవసరమో అలాగే మనం విశ్వాసంతో జీవించడానికి,పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మన పాపవిమోచనకు యేసు నీటి బాప్తిస్మం అంత అవసరం. మన పాపాల నుండి మనలను రక్షించడానికి యేసు బాప్తిస్మం పొందాలి. సిలువ మీద చనిపోవాలి,పునరుత్థానుడు కావాలి. ఇది మనం హృదయపూర్వకంగా నమ్మాల్సిన నీటిమూలముగాను, ఆత్మమూలముగానైన సువార్త.
యేసును సిలువ వేసి చంపినా,ఆ శిక్షకు తగిన నేరమేమి ఆయన చేయలేదు. మన పాపాలను కడిగివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. 30 సం॥ ప్రాయంలో బాప్తిస్మం తీసుకొన్నాడు. 33 సం॥ ప్రాయంలో సిలువ మీద మరణంతో ఆయన మన రక్షకుడైనాడు. మనమెంత దుర్భలులమైనా,ఎంత పాపాత్ములమైనా మనలను ఆయన తన బిడ్డలుగా చేయాలని ఆశిస్తున్నాడు. అందుకే యేసు బాప్తిస్మాన్ని పొందాడు. అదే సమయంలో దేవుడు మనకు పాపక్షమాపణను,పరిశుద్దాత్మ వరాన్ని అనుగ్రహించాడు.
 ‘‘ఒకడు నీటిమూలముగాను ఆత్మమూలముగాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.’’(యోహాను 3:3-5). మన పాపాలనన్నింటిని కడిగివేయడానికి యేసు బాప్తిస్మాన్ని తీసుకొన్నాడని మనం తెలుసుకోవాలి,నమ్మాలి,ఒక వ్యక్తి క్రొత్తగా జన్మించిన క్రైస్తవుడైతే,యేసు తన బాప్మిస్మంద్వారా లోక పాపాలన్నింటినీ తన మీదకి తీసుకొన్నాడన్న సత్యాన్ని అతడు ధ్యానించకపోతే అతని హృదయం చవిటి నేలగా మారిపోతుంది. మనం శరీర సంబంధులం గనుక మన అనుదిన జీవితంలో కూడా పాపంవలన మన హృదయాలు చవిటి నేలగా మారిపోయే అవకాశం వుంది. అందుకని మనం ఎప్పుడూ విశ్వాసంతో యేసు బాప్తిస్మం ఆయన రక్తం,పునరుత్ధానాలను ధ్యానిస్తూ జీవించాలి. ఈ విశ్వాసం మనం పరలోక రాజ్యంలో ప్రవేశించేంతవరకు మనలను పైకెత్తి వుంచుతుంది.
మన పాపాల నిమిత్తం బాప్తిస్మాన్ని పొంది,మరణించడం తప్ప యేసుకు మరొక మార్గం లేదు.ఆయనలా చేయడం ద్వారా మనకు రక్షణ తెచ్చాడని మనంనమ్మాలి. ఈలోకపాపాలన్నింటిని నుండి విడుదల పొందడానికి ఈ సత్య సువార్తను నమ్మడం తప్ప మనం చేయగలిగినది మరేదీలేదు. 
 నీటిమూలముగాను,ఆత్మమూలముగానైన సువార్తను మనకనుగ్రహించిన దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.తన బాప్తిస్మం రక్తం ద్వారా మన పాపాలన్నింటి నుండి రక్షించడానికి దేవుడు తన అద్వితీయ కుమారుని పంపించి మనకు గొప్ప బహుమానాన్ని అనుగ్రహించాడు.
 మన హృదయాలలో పాపం వలన మనం దేవుని దగ్గరకు వెళ్ళలేక పోతున్నాం,ఆయనకు దూరంగా జీవిస్తున్నాం. దేవుని,మానవుని వేరు చేస్తున్న గోడను
పగుల గొట్టడానికి యేసు యోహాను వలన బాప్తిస్మాన్నిపొంది,మన పాపాలనన్నింటిని తన మీదిక తీసుకొన్నాడు. ఆయన బాప్తీస్మం,సిలువలో కార్చిన రక్తంద్వారాదేవునికి మానవునికి మద్య సంబంధాన్ని పునరుద్దరించాడు. తన బిడ్డల యెడల ఈ శారీరక సంబంధమైన తండ్రి ప్రేమ గొప్పది. యేసుద్వారా మన పాపాల నుండి మనలను రక్షించిన దేవుని ప్రేమ దేనితోను పోల్చలేనిది. అందుకు దేవునికి వందనాలు.
 యేసు బాప్తిస్మం,రక్తం రెండూ ముఖ్యమైనవే. ఈ లోకంలో నీరు లేకపోతే జీవంగలదేదైనా బ్రతకగలదా?యేసు బాప్తిస్మం లేకపోతే జీవంగలదేదైనా బ్రతుకగలదా?యేసు బాప్తీస్మం నమ్మకుండా పాపంలేని వారెవరూ వుండరు. యేసు బాప్తిస్మం తీసుకొని సిలువ మీద చనిపోకుండా వున్నట్లయితే ఎవరు కూడా తమ పాప విమోచన పొందలేరు. అదృష్టవశాత్తు యేసు బాప్తీస్మం తీసుకొని మన కొరకు బలియాగం చేశాడు. మనం వెనుకంజ వేసినా,దౌర్భాగ్యులమైనా ఆయన బాప్తిస్మం,రక్తాన్ని నమ్ముట ద్వారా మనం పరిశుద్దాత్మను పొందగలం. 
 యేసుక్రీస్తు బాప్తిస్మాన్ని సిలువ మరణాన్ని నమ్మిన వారు ఆయన దగ్గరకు రాగలరు. అందుకు ఆయనకు ప్రార్ధించి,స్తుతులు చెల్లించండి. ఇప్పుడు మనం ఆయన బిడ్డలమైనాం.ఇది దేవుని కృప,దీవెన,యేసు బాప్తిస్మం,సిలువమీద రక్తాన్ని గూర్చిన సువార్త అద్భుతమైంది.ఈ సత్య సువార్తను నమ్ముట ద్వారా మన మందరం రక్షణను,పరిశుద్దాత్మను పొందగలం.