(గలతీ 5:16-26, 6:6-18)
‘‘నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచు కొనుడి,అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. ఇవి యొకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవిచేయ నిచ్ఛయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేతనడిపింపబడినయెడల ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు. శరీరకార్యములు స్పష్టమైవున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు ,కక్షలు భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు ,అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటినిగూర్చి నేనుమునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలమేమనగా, ప్రేమ,సంతోషము,సమాధానము,దీర్ఘశాంతము,దయాళుత్వము,మంచితనము,విశ్వాసము,సాత్వికము,
ఆశానిగ్రహము. ఇట్టివాటికి విరోధమైన నియమమేదియులేదు. క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని యిచ్ఛలతోను దురాశలతోను సిలువవేసియున్నారు. మనము ఆత్మననుసరించి జీవించువారమైతిమా ఆత్మననుసరించి క్రమముగా నడుచుకొందము. ఒకరి నొకరము వివాదమునకు రేపకయు,ఒకరి యందొకరము అసూయపడకయు వృధాగా అతిశయపడకయు వుందము.’’
‘‘వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్ధములన్నిటిలో భాగమియ్యవలెను. మోసపోకుడి,దేవుడు వెక్కిరింపబడడు: మనుష్యుడు ఏమివిత్తునో ఆ పంటనే కోయును. ఏలాగనగా తన శరీ రేచ్ఛలనుబట్టి విత్తువాడు తన శరీరమునుండి క్షయమను పంట కోయును,ఆత్మనుబట్టి విత్తువాడు ఆత్మనుండి నిత్యజీవమను పంట కోయును. మనము మేలుచేయుటయందు విసుకక యుందము. మనము అలయక మేలు చేసితిమేని తగినకాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరకినకొలది అందరియెడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరినవారియెడలను మేలు చేయుదము’’
‘‘నా స్వహస్తముతో మీకెంత పెద్ద అక్షరములతో వ్రాయుచున్నానో చూడుడి. శరీరవిషయమందు చక్కగా అగపడగోరువారెవరో వారు తాము క్రీస్తు యొక్క సిలువవిషయమై హింసపొందకుండుటకు మాత్రమే సున్నతిపొందవలెనని మిమ్మును బలవంతము చేయుచున్నారు. అయితే వారు సున్నతిపొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు; తాము మీ శరీరవిషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతిపొందవలెనని కోరుచున్నారు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవును గాక: దానివలన నాకు లోకమును లోకమునకు నేనును సిలువవేయబడి క్రొత్తసృష్టి పొందుటయే గాని సున్నతిపొందుటయందేమియు లేదు,పొందకపోవుటయందేమియులేదు. ఈ పద్దతిచొప్పున నడుచుకొను వారికందరికి, అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధాన మును కృపయు కలుగునుగాక.
‘‘నేను యేసుయొక్క ముద్రలు నా శరీరమందు ధరించి యున్నాను, ఇకమీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు’’
‘‘సహోదరులారా,మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును గాక.ఆమెన్.’’
ఆత్మలో నడుచుటకు మనమేం చేయాలి?
మనం సత్య సువార్తను బోధిస్తూ దానిని అనుసరించాలి.
అపోస్తులుడైన పౌలు గలతీయుకు రాసిన తన సువార్తలో పరిశుద్దాత్మను గూర్చి రాశాడు. గలతీ 5:13-14లో ఆయనంటాడు. ‘‘సహోదరులారా,మీరు స్వతంత్రులుగా వుండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట,ఆ స్వాతంత్య్రమును శరీరక్రియలకుహేతువు చేసికొనక,ప్రేమ కలిగినవారై యొకనికొకడు దాసులైవుండుడి. ధర్మశాస్త్రమంతయునిన్నువలె నీ పొరుగువాని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై వున్నది’’,ఈ సందేశాన్ని క్లుప్తంగా చెప్పుకుంటే,ఈ సత్యసువార్తను నమ్ముటవలన మనం రక్షించబడి,పాపం నుండి విడుదల పొందాముగనుక ఈ స్వాతంత్రతను అవకాశంగా తీసుకొని శరీరాశలతో ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించకూడదు. కాని ప్రేమ ద్వారా ఒకరికొకరు సహాయపడుతూ ఈ సత్యసువార్తను అనుసరించాలి. మన పాపమంతటినుండి దేవుడు మనలను రక్షించాడు. గనుక ఈ సువార్తను బోధించుట మన విధి. ఇంకా పౌలు అంటారు,‘‘అయితే మీరు ఒకనినొకడు కరచుకొని భక్షించినయెడల మీరు ఒకనివలన ఒకడు బత్తిగా నశించిపోదురెమో చూచుకొనుడి’’(గలతీ 5:15).
పరిశుద్దాత్మతో నింపబడుటకు ఆత్మలోనడువు
గలతీ 5:16 పౌలు ఇలా అంటున్నాడు?‘‘నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి,అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు’’,22-26 వచనాలలో ఆయనింకా ఇలాఅంటున్నాడు. ‘‘అయితే ఆత్మఫలమేమనగా, ప్రేమ,సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టివాటికి విరోధమైన నియమమేదియు లేదు.
క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని యిచ్చలతోనుదురాశలతోను సిలువవేసి యున్నారు. మనము ఆత్మననుసరించి జీవించువారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందము.ఒకరి నొకరము వివాదమునకు రేపకయు,ఒకరి యందొకరము అసూయపడకయు వృధాగా అతిశయపడకయు ఉందము’’,ఇక్కడ - మనం ఆత్మలో నడిస్తే ఆత్మఫలాలను ఫలిస్తాం అని అంటున్నాడు పౌలు. మనం ఆత్మలో నడవాలని కోరుకొంటున్నాడు పరిశుద్దాత్మ,కాని మనం శరీరేచ్ఛలతో జీవిస్తున్నాం.
ఆత్మఫలాలను దరించి వుండని శరీరంతో మానవులమైపుట్టాం. మనం ఆత్మలో నడవాలని ప్రయత్నించినా మన స్వభావం మారదు. అందుకనే ఎవరైతే ఈ సత్య సువార్తను నమ్మి పరిశుద్దాత్మను పొంది,ఆత్మలో నడుస్తారో వారే ఆత్మ ఫలాలను ఫలిస్తారు.
మీరు ఆత్మలో నడవండని బైబిల్ చెప్పడంలోని అర్ధం ఏమిటంటే ఇతరులు కూడా పాపక్షమాపణ పొందునట్లు మనం ఈ సత్య సువార్తను బోధించాలని,ఈ సత్య సువార్త కొరకు మనం జీవిస్తే మానవ స్వభావాన్ని మార్చకుండానే ఆత్మ ఫలాలను ఫలిస్తాం. మనము ఈ సత్యసువార్తలో నడిస్తే, ప్రేమ, సంతోషము, సమాధానము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము అనే ఆత్మఫలాలను కలిగివుంటాం. ఈ ఆత్మఫలాలు యితరులను వారి పాపములనుండి రక్షించి వారు నిత్యజీవాన్ని పొందునట్లుచేయడానికి మనకు సహాయపడతాయి.
శరీరేచ్ఛలు - ఆత్మ కోర్కె
పౌలు అంటాడు,‘‘శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. ఇవి యొకదానికొకటి విరోధముగా ఉన్నవి గనుక మీరేమిచేయ నిచ్ఛయింతురో వాటిని చేయకుందురు.’’ (గలతీ 5:17) విమోచించబడిన మనం శరీరేచ్ఛలను,ఆత్మను కూడా కలిగివున్నాం. ఈ రెండూ ఎప్పుడూ ఒకదానికి మరొకటి వ్యతిరేకంగా వుంటాయి. దాని ఫలితంగా నడచుట అంటే ఏం చేయాలి?దేవుని సంతోషపెట్టే విషయాలేవి,సత్యసువార్తను బోధిస్తూ,దానిని అనుసరించడమే ఆత్మలో నడుచుట అని దేవుడు చెప్పాడు.ఈ రెంటిలో ఏదీకూడా మన హృదయాలను పూర్తిగా నింపలేవు.
సత్య సువార్తను బోధిస్తూ దేవుని సేవించాలని మనహృదయాంతరంగంలో కోరుకొనేట్లు నడుపుతాడా ఆత్మ. ఆధ్యాత్మిక పనులలో పట్టుదలగలిగి వుండేట్లు చేస్తాడు. ఆత్మ,దేవుని సత్యసువార్తను బోధించుటద్వారా ప్రజలను వారి పాపాల నుండి రక్షించడానికి ఆత్మ మనకు సహాయం చేస్తాడు.
మరోప్రక్క,మనం ఆత్మలో నడవకుండా మన శరీరేచ్ఛలను పురికొల్పుతాయి మన కోర్కెలుస ఇఆత్మ శరీరేచ్ఛల మధ్య వేండే నిత్య పోరాటం. శరీరేచ్ఛలకు వ్యక్తి తొంగిపోయినప్పుడు, యిచ్ఛలలను తీర్చే ప్రయత్నంలోనే అతడు అంతరించిపోతాడు. ఈ రెండు ఒక దానికొకటి వ్యతిరేకం గనుక మనం చేయాలనుకునేవాటిని మనం చేయము.
అయితే ఆత్మలో నడచుట అంటే ఏం చేయాలి? దేవుని సంతోషపెట్టే విషయాలేవి?. సత్యసువార్తను బోధిస్తూ దానిని అనుసరించడమే అత్మలో నడచుట అని దే వుడు చెప్పాడు.
వారు ఆధ్యాత్మిక జీవితము గడుపునట్టు ఎవరిలో పరిశుద్దాత్మ నివసిస్తున్నాడోవారికి ఆత్మలోనడిచే హృదయాలను దేవుడ అనుగ్రహిస్తాడు .ఇతరులను వారిపాపాలనుండి రక్షించుటకు వారికిబోధిస్తూ, ఆత్మలో నడుస్తూ ఆత్మఫలాలను కలిగివుండమని దేవుడు మనలను ఆజ్ఞాపించాడు. పరిశుద్దాత్మలో నడవడమంటే దేవుని సంతోషపెట్టే జీవితం జీవించడమని అర్ధం.
ఆత్మలో నడవాలంటే మొదటిగా మనం పరిశుద్దాత్మను పొందాలి. పరిశుద్దాత్మను పొందాలంటే దేవుడిచ్చిన సత్య సువార్తను మొదట మనం నమ్మాలి. మన హృదయాంతరంగాలలో ఈ సువార్తను నమ్మకపోతే పరిశుద్దాత్మను గాని,పాపం నుండి రక్షణను గాని పొందలేము. అంటే మనం ఆత్మలో నడవలేమని అర్ధం.
దేవుని సేవించడానికి,ఆయనకు మహిమ కలిగించడానికి సత్య సువార్తను బోధించాలన్న కోర్కెను ఆత్మ మనకు అనుగ్రహిస్తాడు. ఈ కోర్కె దేవునికి సమర్పించుకొని,లోకమంతటికి సువార్తను ప్రకటించే హృదయం నుండే వస్తుంది. ఈ సువార్తను నమ్మి పాపక్షమాపణ పొందిన తర్వాత పరిశుద్దాత్మను ఎవరు పొందుతారో వారు ఆత్మలో నడువగలుగుతారు. సువార్తను ప్రకటించడానికి తమను ప్రతిష్టించు కొనగలుగుతారు.
ఎవరిలో అయితే పరిశుద్దాత్మ నివసిస్తున్నాడో ఎవరుపరిశుద్దాత్మకు విధేయులైవుంటారో,వారిలో యింకా శరీరేచ్ఛలు వున్నా,వారిలో పరిశుద్దాత్మ నివసిస్తున్నాడు గనుక వారు ఆత్మలో నడుస్తూ వుంటారు. ‘‘పరిశుద్దాత్మలో నడవండి’’అని అనడంలో పౌలు ఉద్దేశమేమిటంటే ఇతరులుతమ క్షమాపణ పొందుటకు సహాయకరంగా యేసు మనకిచ్చిన నీటిమూలముగాను,ఆత్మమూలముగానైన సువార్తను మనం వారికి బోధించాలి అని.
కొన్నిసార్లు మనం ఆత్మలో నడుస్తూనే శరీరేచ్ఛ ప్రకారం నడుస్తూ వుంటాం. శరీరేచ్ఛలు,ఆత్మకోరిక మన జీవితాలలో ఒకదానితో ఒకటి పోరాడుతూనే వుంటాయి. అయితే పరిశుద్దాత్మ నివాసం గలవారు ఆత్మలో నడిచే జీవితం కలిగి వుండాలని స్పష్టంగా తెలుసుకోవాలి. ఈ మార్గంలోనే దేవుని దీవెనలతో నిండివున్న జీవితాన్ని జీవించగలం. పరిశుద్దాత్మ గల వారిలో ఆత్మఫలాలను గలిగి వుండడానికి తిరస్కరించిన వారు శరీరేచ్ఛలను గలిగి క్షీణిస్తూ నశించిపోతారు. వారి ఫలము క్షీణించి,దు:ఖకరంగా వుంటుంది.
‘‘ఆత్మలో నడువు’’అన్న మాటను మనం విన్నాం. అయితే మనలో కొందరు ‘‘నాలో పరిశుద్దాత్మ వున్నాడని తెలియకనే నేనెలా నడువగలను’’,అని అనుకుంటారు. దేవుడు ప్రత్యక్షమై మనతో నేరుగా మాట్లాడితేనే దేవుని పరిశుద్దాత్మ నాలో నివసిస్తున్నాడని తెలుసుకోగలం అని మరికొందరనుకొంటారు. ఇది పొరబాటైన అవగాహన. నీటిమూలముగాను,ఆత్మమూలముగానైన సువార్త కొరకు జీవించాలన్న కోర్కెను ఆత్మ మనకు అనుగ్రహిస్తాడు.
ఆయన మనలో నివసిస్తున్నాడు అన్న నమ్మకం మనలో కలిగే సందర్భాలు కొన్ని వుండవచ్చు. కాని మనం శరీరానుసారంగా నడుస్తున్నాం గనుక ఆయనను గూర్చి భావించలేం. ఆయన మనలో నిద్రపోతున్నాడని భావించేవారు కొందరున్నారు. పరిశుద్దాత్మను పొందినా యింకా శరీరానుసారంగా జీవిస్తున్నవారే అలా అనుకుంటారు.
ఇలాంటి వారు వారి శారీరక సుఖాలనే చూసుకొంటూ ఈ ప్రకారమే చేస్తుంటారు. కాని సుఖభోగాల కోర్కెలు పెరగడం వలన వారు చివరికి బాధననుభవిస్తారు. పరిశుద్దాత్మ కలిగి వుండీ శరీరానుసారంగా జీవించడం సహజం గనుక వాటిప్రకారం జీవిస్తున్నామనుకొంటారు. శరీరేచ్ఛలకు లొంగిన వారు చివరికి వాటికి బానిసలవుతారు.
ఆత్మానుసారులై జీవించండని ప్రభువు చెబుతున్నాడు. అంటే సత్యసువార్తకు పూర్తిగా సేవకులై వుండండని అర్ధం. అంటే సువార్తలో ఆనందిస్తూ,దానిననుసరిస్తూ ఆత్మానుసారులై జీవించడమని కూడా అర్ధం. ఆత్మలో నడవడమంటే ఏమిటో నేర్చుకొని దానిప్రకారం మనం జీవించాలి. మీరు ఆత్మలో నడుస్తున్నారా?
పరిశుద్దాత్మలేని వ్యక్తి ఆత్మలో నడువగలడా?
క్రొత్తగా జన్మించని వారు ఆత్మలో నడవడమంటే ఏమిటో ఎరుగరు. అలా చాలామంది తమ స్వంత విధానంలో పరిశుద్దాత్మను పొందాలని ప్రయత్నించిదాని కొరకు ఆశపడుతూవుంటారు. పరిశుద్దాత్మను కోరుకోవడం పరిశుద్దాత్మనింపుదలను పొందడంఒకటే అని వారనుకొంటారు.
ఉదాహరణకు,కొన్ని మందిరాలలో ఆరాధనకు ప్రజలు కూడుకొన్నప్పుడు,పాస్టరు గారు పెద్దగా ప్రార్ధనచేస్తారు. ఇక అందరూ దేవుని నామాన్ని పెద్దగా వుచ్చరించడం మొదలు పెడతారు. వారిలో కొందరు పరిశుద్దాత్మలో నిండిన వారిలా అన్యభాషలలో మాటలాడతారు. కానీ చెప్పేదేమిటో ఏ ఒక్కరికీ,చివరికి మాట్లాడే వారికి కూడా వారు మాట్లాడినది అర్ధంకాదు. ఇదే సమయంలో వారిలోకొందరు నేలమీద పడి పారవశ్యంతో వణకుతూ వుంటారు. ఇలా చేయడం దయ్యాలు పట్టినందువల్లనే అనడంలో సందేహంలేదు. కాని తాము పరిశుద్దాత్మను పొందామని వారనుకుంటారు. అప్పుడు‘‘ప్రభువా! ప్రభువా! అన్న కేకలు మొదలవుతుంది. వారు ప్రభువును పిలుస్తారు. కన్నీళ్ళు కారుస్తారు,చప్పట్లు కొడతారు.దీనిని వారు ‘‘పరిశుద్దాత్మ నింపుదల పొందడం’’అని అంటారు.
సేవకుడు ప్రసంగవేదికపై కొడుతూ భాషలో మాట్లాడతాడు. ‘‘ప్రజలు ప్రభువాప్రభువా’’అనికేకలు పెడుతుంటారు. ఈ అపవిత్రమైన వాతావరణాన్ని వారెంతో ప్రేమిస్తారు. కొందరు తాము ఏదేను వనంలోని మంచి చెడు తెలివినిచ్చు వృక్షాన్ని దర్శించామని చెబుతారు. వారి అపవిత్రమైన పారవశ్యంలో యేసు ముఖాన్ని దర్శించామంటారు కొందరు. పరిశుద్దాత్మను పొందడానికి,ఆయన నింపుదల పొందడానికి,ఆయనతో నడవడానికి వారు యిలాంటి తప్పువివరణలిస్తుంటారు. దారిమళ్ళించే వారి క్రియలు దేవుని వాక్యాన్ని,పరిశుద్దాత్మను అపార్ధం చేసుకొనేట్టు చేస్తాయి.
‘‘ఆత్మలో నడువు’’అని క్రొత్తగా జన్మించిన వారితో దేవుడు చెప్పేది అదే, అంటే ఆయనకు సంతోషం కలిగించే వాటిని చేయడమని అర్ధం. శరీరకార్యాలను పౌలు పరిశుద్దాత్మ ఫలంతయిలా పోల్చిచెప్పాడు. ‘‘ఆత్మఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.’’ (గలతీ 5:22-23).
‘‘ఆత్మలో నడుచుట’’అంటే సత్యసువార్తను బోధించుట,ఇతరులను వారి పాపాలనుండి రక్షించుట అని అర్ధం. మనమలా చేస్తే ఆత్మఫలాన్ని ఫలించగలుగుతాం. ఆత్మ ఫలాలేవంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసంసాత్వికము, ఆశానిగ్రహము. మనం సత్యసువార్త ప్రకారం జీవించినప్పుడే ఈ ఫలాన్ని కలిగివుండగలం. ఎవరైతే సేవచేస్తూ,ఈ సువార్తను బోధిస్తూ,దాని కొరకు తననుతాను ఉపేక్షించుకొంటారో వారు పరిశుద్దాత్మ నింపుదలొంది ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించగలరు.
ఆత్మఫలంగా ‘‘మంచితనం’’అంటే సువార్త కొరకు న్యాయాన్ని కొనసాగిస్తూ,ఇతరుల మేలు కొరకు కొన్ని పనులు మంచితనం అంటే,ఇతరుల మేలుకొరకు సువార్తను బోధించడం దేవునిదృష్టిలో ఉన్నతమైన మంచితనం.
‘‘దయాళుత్వం’’ఇతరుల యెడల జాలిపడడం. ఇతరుల యెడల ఎవరైతే కృపగలిగి వుంటారో,సహనంతో సువార్తను బోధిస్తారో అప్పుడు దయాళుత్వం సమాధానాన్ని కలిగిస్తుంది. ఆత్మలో నడిచే వ్యక్తి దేవుని పని పూర్తిచేయడం కొరకు చూస్తాడు. ఆయన పనిని చేయడాన్ని ప్రేమిస్తాడు. ఇతరులను ప్రేమిస్తాడు. అన్ని విషయములలో నమ్మకంగా వుంటాడు. ఈ పనిని చెయ్యి అని ఎవరూ చెప్పకపోయినా ,పరిశుద్దాత్మ గలవారు దేవుని పనిపూర్తి అయ్యేంతవరకు నమ్మకంగావుంటారు. వారు సాత్వికం గలిగి,ఆశానిగ్రహంతో ఉంటారు. పరిశుద్దాత్మ గల వ్యక్తే ఆత్మలో నడువగలడు,అలా చేయగలిగినప్పుడు అతడు ఆత్మ ఫలాలను ఫలిస్తాడు.
నీవు ఆత్మలో నడిస్తే నీవు ఆత్మఫలాలను ఫలిస్తావు. అలానడవనప్పుడు శరీరేచ్చలతో నడుస్తూ నశించిపోతావు. గలతీ 5:19-21లో లేఖనం యిలా వివరిస్తోంది.‘‘శరీరకార్యములు స్పష్టమైవున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆట పాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను’’
శరీరకార్యాలు స్పష్టమై వున్నవి
శరీరకార్యాలు స్పష్టమై ఉన్నావి. మొదటి శరీర కార్యం‘‘జారత్వం’’అంటే మరోకరితో అక్రమ సంబంధం కలిగివుండుట. రెండోది ‘‘వ్యభిచారం’’మూడోది ‘‘అపవిత్రత’’ నాల్గవది ‘‘కాముకత్వం’’అయిదవది విగ్రహారాధన’’అంటే దేవుని సేవించుట కంటే విగ్రహాలను పూజించుట,ఆరవది అభిచారము’’ఏడవది ‘‘ద్వేషము’’పరిశుద్దాత్మ లేక శరీరానుసారం నడిచే వ్యక్తి తన పాపస్వభావం వలన యితరుల యెడల ద్వేషంచూపక వుండలేడు.ఎనిమిదవది ‘‘కలహము’’స్నేహితులతోను,కుటుంబంలోని వారితో కలహిస్తూ వుండడం. మిగిలినవి ‘‘మత్సరము’’క్రోధము కక్షలు,స్వార్ధపూరిత దురాశలు,ఇవన్నీ శరీరానుసారుల గుణలక్షణాలు.
పదవది ‘‘మత్తతలు’’ఒక వ్యక్తి శరీరానుసారంగానే నడుస్తున్నప్పుడు అతడ సంఘం పని చేయడం అసంభవం. దాని ఫలితంగా తనంతట తానే సంఘాన్ని విడిచి వెళ్ళిపాతాడు. పదకొండవది ‘‘విమతము’’శరీరానుసారంగా నడిచే వ్యక్తి తన స్వంత యిస్టాన్ని సంతృప్తి పరచుకోడానికే పనులు చేస్తాడు. ఆ జీవితం దేవుని చిత్తానికి ఎంతో భిన్నంగా ఉంటుంది. దాని ఫలితంగా అతడు సత్యసువార్త నుండి తొలగిపోతాడు. విమతం అంటేబైబిల్ సత్యం నుండి క్రమంగా దూరం అయిపోవడం. దేవుని వాక్యంలో నమ్మకం వుండి,ఆత్మలో నడిచేవారు ఎవరైనా దేవుని చిత్తం నుండి తొలగిపోరు. ‘‘అసూయ,హత్యలు,తాగుడు,అల్లరితో కూడిన ఆట పాటలు మొదలైనవి’’కూడా శరీర కార్యాలే. శరీరానుసారంగా నడిచే వారే అలాంటి వాటిననుసరిస్తారు. అందుకనే ఆత్మలోనడువు’’అని ప్రభువు చెబుతున్నాడు. క్రొత్తగా జన్మించిన మనం ఆత్మలో నడవాలి.
కొత్తగా జన్మించని వారి హృదయములో శరీరేచ్ఛలు తప్ప మరేమి వుండవు. అందుకనే వారు ‘‘జారత్వం,అపవిత్రత,అవినీతి,విగ్రహారాధన’’లో మునిగి వుంటారు. క్రొత్తగా జన్మించని అబద్ద బోధకులు తమ అనుచరులు ఎక్కువ ధనం యిచ్చునట్లు వారి మీద మంత్రాలు ప్రయోగిస్తుంటారు. తమకెక్కువ ధనం దానమిచ్చిన వారికి సంఘంలో ముఖ్యబాధ్యతలను,ఉన్నత పదవులను యిస్తుంటారు. శరీరానుసారులు యితరుల యెడల ‘‘ద్వేషం’’చూపుతారు. సంఘాన్ని అనేక శాఖలుగా చీలుస్తారు. తమ శాఖను గూర్చి అతిశయోక్తులు పలుకుతూ,మిగిన వారు విమతస్థులని విమర్శిస్తారు. మనం కూడా శరీరానుసారులమైతే అలాగే ప్రవర్తిస్తాం.
క్రొత్తగా జన్మించిన క్రైస్తవులు పరిశుద్దాత్మ ఫలాన్ని పొందునట్లు చేస్తాడు ఆత్మ.
తిరిగి పుట్టిన వారు సత్య సువార్తను బోధించుటకు జీవించాలి. ఒంటరిగా దేవుని అనుసరించడం మనకు చాలా కష్టం. కనుక దేవుని సంఘంలో చేరి సువార్త సేవా కార్యక్రమాలన్ని చేయాలి. మనం కలసి ప్రార్ధిస్తూ మరొకరు ఆత్మ సువార్త ప్రకారం నడచునట్లు మన శక్తిని వినియోగించాలి. ఆత్మలో నడిచేవారు నీరు,ఆత్మ సువార్తను బోధించడానికి జీవించాలి.
శరీరానుసారంగా జీవించడమంటే తన జీవితం ఒక్కదాని కొరకే జీవించడమని,ఆత్మలో నడవడమంటే ఇతరుల ఆత్మలను రక్షించడానికి జీవించడమని అర్ధం. క్రొత్తగా జన్మించిన చాలామంది క్రైస్తవులు ఇతరుల మేలు కొరకు జీవిస్తారు.
ప్రపంచ వ్యాప్తంగా యింకా ఈ సత్యసువార్తను విననివారెందరో వున్నారు. మనం ఆఫ్రికా,ఆసియా,ఐరోపా,అమెరికా,వేరుగా వున్న ద్వీపాల ప్రజలను ప్రేమిస్తున్నాం. వారికి నీరు,ఆత్మ సువార్తను పరిచయం చేసి వారి యెడల మన ప్రేమను చూపాలి.
మనం ఆత్మలో నడవాలి .దీనికి వ్యతిరేకమైననియమమేదీలేదు. ‘‘ఆత్మఫలమేమనగా, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహము. ఇట్టివాటికి విరోధమైననియమమేదియులేదు.’’ (గలతీ 5:22-23). మనం విధేయులం కావలసినని యమంయిదే. ఆత్మలోనడువమని పౌలు చెప్పాడు. పాపులమైనమన కొరకు మనప్రభువు తనప్రాణాన్ని పెట్టినట్టే మనంకూడా ఇతరులకుసువార్తనుప్రకటించాలి. ఇతరులను వారి పాపాల నుండి రక్షించడం అంటే?ఆత్మలో నడవడమే. మనం ఆత్మలో నడవాలి.
గలతి 5:24-26లో పౌలు యిలా అన్నాడు?‘‘క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని యిచ్చలతోను,దురాశలతోను సిలువ వేసివున్నారు.మనము ఆత్మననుసరించి జీవించు వారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరము అసూయపడకయు వృధాగా అతిశయపడకయు ఉందము.’’మనం ఆత్మలో జీవించే వారమైతే తప్పిపోయిన ఆత్మను రక్షించడానికి మనం జీవించాలి. ఆత్మపని చేస్తూ ఆయనతో మనం నడవాలి. మనం హృదయాలలో యేసుక్రీస్తును కలిగి జీవించునట్టు దేవుడు మనకనుగ్రహించిన పరిశుద్దాత్మ మనలను నడిపిస్తాడు. పరిశుద్దాత్మ ప్రేమకు రాజు. తన ప్రేమకు దేవుడు మనలను వాహనాలుగా వుపయోగించుకొంటాడు.
‘‘క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని యిచ్చలతోను దురాశలతోనే సిలువ వేసి యున్నారు’’.అని అన్నాడు పౌలు (గలతీ 5:24) క్రొత్తగా జన్మించిన వారు యేసు క్రీస్తుతో కూడా చనిపోయారని కూడా పౌలు చెప్పాడు. క్రొత్తగా జన్మించిన వారిప్పటికే యేసుతో చనిపోయిన సంగతి మనం గ్రహించలేదు. కాని మన పాపాలకు మూల్యం చెల్లించడానికే ఆయనను సిలువ వేసినప్పుడే మనం ఆయనతో కూడా చనిపోయాం. మరో మాటలో చెప్పుకొంటే,యేసు క్రీస్తు సిలువ వేయబడ్డాడంటే నీవు నేను ఆయనతో బాటు సిలువలో చనిపోయామన్నది సత్యం. ఆయన మరణం మన మరణం,ఆయన పునుత్ధానం మన పురుత్ధాన హామీని సూచిస్తుంది. మన విశ్వాసంద్వారా నీవు నేను యేసు క్రీస్తులో జీవించగలం. మనలో విశ్వాసమంటే ఆ విశ్వాసం మనం ఆత్మలో నడవడానికి నడిపిస్తుంది.
ఆత్మలో నడవడానికి దేవుడు మనకు అధికారాన్నిచ్చాడు. కనుక పాపక్షమాపణ పొందిన వారు ఆత్మలో నడవాలి. పరిశుద్దాత్మను పొందిన వారు తమకు పాప క్షమాపణ కలిగి నందున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తప్పిపోయిన వారి రక్షణకు సువార్తను ప్రకటించునట్లు తమను ప్రతిష్టించుకోవాలి. ఒక వ్యక్తి పాపక్షమాపణ పొంది,క్రొత్తగా జన్మించినా అతడు తన శరీరానుసారంగా జీవిస్తూ వుంటే అతడు దేవుని సంఘం నుండి వేరై ఆయనను సేవించలేడు. మీరు,నేను నీటిమూలముగాను,ఆత్మమూలముగానైన సువార్తద్వారా మనప్రభువైన యేసుక్రీస్తు దినంవరకు జీవించాలి.
ఎప్పటికి అతిశయపడక,పరిశుద్దాత్మ నింపుదలతో జీవించాలి.
‘‘ఒకరియందొకరము అసూయపడకయు,వృధాగా అతిశయపడకయు వుందాము’’అన్నాడు పౌలు. అతిశయమంటే శరీరేచ్ఛ ప్రకారం జీవించడమని అర్ధం. తమ అతిశయంకొరకు జీవించేవారు అనేకులున్నారి లోకంలో చాలామంది ధనం కూడబెట్టుకొని,ఆధిక్యతలో సంతృప్తిపడుచు,ఈ లోకానందాన్ని ప్రేమిస్తూ,ఈ లోకం కోసం జీవిస్తూ వుంటారు. దానిలో భక్తిలేదు. కాలగమనంలో వారు క్షీణించి,నశించిపోతారు .అందుకని శరీరేచ్ఛ ప్రకారం జీవించేవారు అతిశయపడువారని పిలువబడుచున్నారు. ధనవంతులై వున్నా నిజంగా వారి హృదయాలో నిజమైన శాంతి సమాధానాలు,సంతృప్తివున్నాయా,శరీర ఫలం చివరికి క్షీణించిపోతుంది. ఈ లోకవస్తువు శరీరానికి మాత్రమే మంచివి. ఆత్మకు అవి వుపయోగం లేనివి.
‘‘వెదజల్లి అభివృద్ది పొందువారు కలరు. తగినదానికన్న తక్కువ యిచ్చి లేమికివచ్చువారు కలరు’’అని వివరిస్తోంది బైబిల్ (సామె 11:24). క్రొత్తగా జన్మించని వారికి ఈ లోక వస్తువులే సమస్తం గనుక వారు యితరుకివ్వక వెనుదీస్తారు. అందుకనే వారి జీవితాలకొరకు శ్రద్ద వహిస్తారు. వాటినే కోరుకుంటారు. అయితే చేయదగినది చేయకలేమి కలిగించుకొనేవారున్నారని బైబిల్ చెబుతోంది. ఇవన్నీ కూడా అతిశయం వలన కలిగేవే.
ఆత్మకోర్కె ప్రేమించి అనుసరించాలనుకొనేవారు.
పౌలు ఆత్మీయ జీవితాన్ని జీవించాలని కోరుకున్నాడు. అలాగే జీవించాడు. దేవుని వాక్యం ప్రకారం బాగా జీవించమని మనకు నేర్పించాడు. గలతీ 6:6-10లో ఆయనంటాడు, ‘‘వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్ధములన్నిటిలో భాగమియ్యవలెను. మోసపోకుడి,దేవుడు వెక్కిరింపబడడు: మనుష్యుడు ఎమివిత్తునో ఆ పంటనే కోయును. ఏలాగనగా తన శరీ రేచ్ఛలనుబట్టి విత్తువాడు తన శరీరమునుండి క్షయమను పంట కోయును, ఆత్మనుబట్టి విత్తువాడు ఆత్మనుండి నిత్య జీవమను పంట కోయును. మనము మేలు చేయుటయందు విసుకక యుందము. మనము అలయక మేలు చేసితిమేని తగినకాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికినకొలది అందరియెడలను, విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను మేలు చేయుదము.’’
దేవుని వాక్యము తెలిసిన వారందరు వారికున్న మంచి వాటిని వాక్యోపదేశముకు ఇవ్వాలని పౌలు సలహాయిస్తున్నాడు. ‘‘మంచి పదార్ధము’’అని అనడంలో ఆయన ఉద్దేశం,ఆత్మలో నడిచే జీవితం ద్వారా తప్పిపోయిన ఆత్మను రక్షిస్తూ,వారికి సువార్తను భోధించడం అని,తిరిగి పుట్టిన వారు వాక్యాన్ని బోధిస్తూ,ఆత్మలో నడుస్తున్నవారి మనస్సు,ప్రేమ,వారిలాంటి న్యాయవిమర్శగల మనస్సుకలిగి వారితో కలసి పనిచేయాలి.
‘‘ఉపదేశించు వానికి మంచి పదార్ధములన్నిటిలో భాగమియ్యవలెను.” మంచి పదార్ధాలంటే,సంఘం ద్వారా ఇతరులను వారి పాపాల నుండి రక్షించడమని అర్ధం. వారి వంటి మనస్సు వారి వంటి ప్రార్ధనతో అంటే భక్తిగలిగి ప్రతిదీ చేయమని పౌలు చెప్పాడు. దేవుని పనిని మనమందరం కలసి చేయాలి.
‘‘మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును’’అని అన్నాడు పౌలు ఇక్కడ వెక్కిరించుట ‘‘అంటే ఎగతాళి చేయుట,అపహాస్యము చేయుట’’,అని అర్ధం. కనుక మోసపోకండి. దేవుడు వెక్కిరించబడడు,‘‘అంటే దేవుని వెక్కిరించి,ఎగతాళి చేయకండని అర్ధం. ఉదాహరణకు,దేవుని మాటను తేలికగా తీసుకొనకూడదు. తన మాటలోనికి అనువదించుకొని వాటిని నమ్మలేకపోవడం చేయకూడదు. పౌలు అన్నాడు,‘‘మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును.’’ శరీరేచ్ఛను విత్తువాడు దుర్నీతిని కోస్తాడు. కాని ఆత్మను విత్తువాడు నిత్యజీవాన్ని కోస్తాడు.
నీటిమూలముగాను, ఆత్మమూలముగానైన అనే సత్యసువార్తద్వారా మనం జీవిస్తే ఏ పంట కోస్తాం? మనపాపాలకు రక్షణను, నిత్యజీవాన్ని పొందుతాం. ఇతరుల ఆత్మలను వారి పాపవిమోచనకు నడుపుతూ, దేవుని దీవెనద్వారా ఆత్మఫలాలను కోస్తాం.
తమ శరీరేచ్ఛల కొరకే జీవించే వారి సంగతేమటి? వారు దుర్నీతిని కోస్తారు. అంతంలో వారి మరణం తర్వాత వారికి మిగిలి వుండేదేమీ వుండదు. మనిషి వట్టిచేతులతోనేపుట్టాడు. వట్టిచేతులతోనే చనిపోతాడు.
ఒకవేళ అతడు యితరులను వారి పాపం నుండి రక్షించే పని చేస్తే అతడు ఆత్మ ఫలమనే పంటను కోస్తాడు. నిత్య జీవాన్ని పొందుతాడు. అలాగాక శరీరేచ్ఛ ప్రకారం నడిస్తే దుర్నీతిని శాపము అనే పంటను కోస్తాడు. వాటినే యితరులకు అందిస్తాడు. కనుక విశ్వాసంద్వారా జీవించడంవలన కలిగే సమస్తం తెలిసిన పౌలు శరీరానుసారం జీవించవద్దనిమనకు సలహా యిస్తున్నాడు.
‘‘మనము మేలు చేయటయందు విసుకక వుందము.... తగిన కాలమందు పంటకోతుము’’, పౌలు ఆత్మలోనడచిన దేవునిసేవకుడు. పౌలు ఆత్మలోనడవడాన్ని బైబిల్లో చూసిన కొందరు ‘‘పౌలు ఎడమవైపునకు వెళ్ళి ఫలానా వారిని కలుసుకో’’అని లేక ‘‘ఆ వ్యక్తిని కలుసుకొనవద్దు’’అని ఆయనకేమి చేయాలో పరిశుద్దాత్మ చెప్పాడని అనుకొంటారు. కాని యిది నిజంకాదు.
రక్షణ సువార్తను ఇతరులకు బోధిస్తూ వారి ఆత్మలను రక్షించడంలో సహాయం చేస్తూ పౌలు ఆత్మలో నడిచాడు. ఆత్మలో నడువక,తమ శరీరానుసారం జీవించేవారు క్రైస్తవులలో చాలా మంది వున్నారు. వారు పౌలును ఆహ్వానించకపోగా ఆయనను గూర్చి దుష్ప్రచారం చేశారు. యేసు శిష్యులకు వ్యతిరేకంగా పోరాడుతూ,వారిని గూర్చి దుష్ఫ్రచారం చేసే వారిని గూర్చి తానేమి చేయాలనుకోవడం లేదు అన్నాడు పౌలు.
మీరు ఆత్మలో నడవాలనుకుంటే సువార్త ప్రకారం మీరు జీవించాలి. సున్నతిపొందిన వారు పౌలు మీద నేరం మోపారు. గలతీ 5:11 యిలా వివరిస్తోంది. ‘‘సహోదరులారా, సున్నతి పొందవలెనని నేనింకను ప్రకటించుచున్నయెడల ఇప్పటికిని హింసింపబడనేల? ఆ పక్షమున సిలువవిషయమైన అభ్యంతరము తీసివేయబడునుగదా?’’,‘‘ఒకవేళ ఒక వ్యక్తి యేసునందు విశ్వాసంతో తిరిగిపుట్టినయెడల అతడు సున్నతి పొందవలెను. అతడు తన ముంగోలునకు సున్నతి పొందని యెడల అతడు దేవుని బిడ్డకాడు’’,అని సున్నతి పొందినవారు సున్నతి ఆచారాన్నిగూర్చి పోరాడారు.అయితే పౌలుమీద వారెందుకు నేరారోపణ చేశారు పాపవిమోచన,నిత్య జీవమనే దీవెన అనేవి కేవలం యేసు బాప్తిస్మంలోను,సిలువ మీది ఆయన రక్తాన్నివిశ్వసించడంవలనే పొందగలమని పౌలు నమ్మాడు దానినే బోధించాడు.
నీతిమంతునిగా సత్యాన్ని తెలుసుకొని,దానిని బోధించడం వల్లనే విశ్వాసం కలుగుతుంది. నీటిమూలముగాను,ఆత్మమూలముగానైన సత్యం,చాలా ప్రాముఖ్యమైనదని పౌలు నమ్మాడు. ఈ సత్యం తెలిసిన వారు ఆత్మలో నడుస్తారు. అప్పుడు వారికి సున్నతి అవసరం లేదని పౌలు నమ్మాడు. దీనినే ఆయన బోధించాడు,కాని రక్షణలో ఒక వ్యక్తి విశ్వాసానికి సున్నతి ఒక భాగము కనుక అది అవసరమని సున్నతి పొందిన వారి నమ్మకం. ఏమైనప్పటికీ దేవుడిచ్చిన సువార్త తప్ప మరొక సువార్త లేదు. కనుక దానికి మనమేమి కలపవద్దు. దాని నుండి తీసివేయవద్దు.
పౌలు ఆత్మలో నడిచినప్పుడు ఆయన తోటి యూదులు ఆయనను తిరస్కరించి,హింసించారు. ‘‘శరీర విషయమందు చక్కగా అగపడగోరువారెవరో వారు తాము క్రీస్తు యొక్క సిలువవిషయమై హింస పొందకుండుటకుమాత్రమే సున్నతి పొందవలెనని మిమ్మును బలవంతము చేయుచున్నారు అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు: తాము మీ శరీరవిషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలెనని కోరుచున్నారు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవును గాక: దానివలన నాకు లోకమును లోకమునకు నేనును సిలువ వేయబడి క్రొత్తసృష్టి పొందుటయే గాని సున్నతిపొందుటయందేమియు లేదు,పొందకపోవుటయందేమియు లేదు.’’(గలతీ 6:12-15). సున్నతి పొందిన వారితో పౌలు యిలా అన్నాడు. ‘‘శరీర విషయమందు చక్కగా అగపడగోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క సిలువ విషయమై హింస పొందకుండటకు మాత్రమే సున్నతి పొందవలెనని మిమ్మును బలవంతము చేయుచున్నారు’’
శరీరేచ్ఛల ప్రకారం నడిచే వారిని పౌలు గద్దించాడు.వారు శరీరానుసారం నడిచారు. అలాంటి వారెంతోమంది వున్నారు. వారితో పౌలు తన సంబంధాన్ని మానుకొన్నాడు. ఆయనంటాడు,‘‘అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందుతప్ప మరిదేనియందును అతిశయించుట నాకు దూరమవునుగాక.’’ లోకపాపాలను తీసివేయడానికి యేసుక్రీస్తు యోహాను వలనబాప్తిస్మాన్నిపొంది ,పౌలునుమనప్రభువైనదేవుని పిలిచిన వారినందరిని రక్షించుటకు సిలువమీద చనిపోయాడు. పౌలు అన్నాడు,‘‘యేసుక్రీస్తు వలన నాకు లోకమును,లోకమునకు నేను సిలువ వేయబడివున్నాము. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట యందేమియు లేదు,పొందక పోవుటయందే మియులేదు’’,లోకాశలకుచనిపోయినపౌలు యేసుక్రీస్తు వలన మరల జీవించాడు.
యేసుక్రీస్తులో మనం నిజంగా చనిపోయాం. కాని కొన్నిసార్లు మనము ఈ సత్యాన్ని మరచిపోతుంటాం. దానిని మనం నమ్మాలి. ఈ సత్యంలో మనకు నమ్మకం లేకపోతే శరీరేచ్ఛలకు కుటుంబాలకు మనంకట్టుబడిపోతాం. అది మనం దేవునితో నడవకుండా చేస్తుంది. మన శరీరమెంతో బలహీనమైంది. చివరికి ప్రభువును అనుసరించడానికి మన కుటుంబాలు కూడా మనకు సహాయం చేయలేవు. ఇప్పుడు మనం లోకానికి సిలువ వేయబడ్డాం. చనిపోయిన వ్యక్తి ఈ లోకవిషయాలలో ఈ లోకస్థులకెలా సహాయం చేయగలడు,ఈ లోకంలో చనిపోయిన వారు ఈ లోకవస్తువులను సొంతం చేసుకోలేరు.
యేసు పునరుత్ధానుడైనాడు,ఆయన పునరుత్థానం మనం నూతన ఆధ్యాత్మిక జీవితానికి క్రొత్తగా జన్మించునట్లు చేసింది. ఇక్కడ నూతన పని,నూతన కుటుంబం,నూతన నిరీక్షణ మనకున్నాయి. మనం క్రొత్తగా జన్మించిన వారం. పరలోక సైనికులుగా దేవుని వాక్యాన్ని బోధించే బాధ్యత మనకున్నది.
శరీరకమైన దానిద్వారా కాక ఆధ్యాత్మిక పద్దతులనుపయోగించి యితరుల రక్షణను సాధించడానికి సహాయం చేస్తే తానొక వ్యక్తినైనానని పౌలు ఒప్పుకున్నాడు. తాను చనిపోయానని,యేసుక్రీస్తు ద్వారా తిరిగి పుట్టానని ఆయన చెప్పాడు. మన నమ్మకాలు గూర్చి అలాంటి ఒప్పుకోలును చెప్పగల వారిగా వుండుటకు కష్టపడదాం.
గలతీ 6:17-18లో పౌలు అంటాడు,‘‘నేను యేసుయొక్క ముద్రలను నా శరీరమందు ధరించి యున్నాను, ఇక మీదటవెవడును నన్ను శ్రమ పెట్టవద్దు. సహోదరులారా,మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును గాక. ఆమెన్.’’,పౌలు యేసు ముద్రను తన శరీరం మీద కలిగి వున్నాడు. ప్రభువు కొరకు ఆత్మలో నడవడానికి తన ఆరోగ్యాన్ని గూర్చి ఆయన శ్రద్ద తీసుకోలేదు. క్రమంగా చూపు కోల్పోయినందున ఆయన తానుగా రాయలేకపోయాడు. కనుక పౌలు దేవుని మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆయన పత్రికలను వ్రాయగలిగారు. ఆయన శారీరకంగా బలహీనుడైనప్పటికీ, ఆత్మలో నడువగలుగుతున్నందుకు ఆయన ఆనందించాడు. ఆయనన్నాడు,‘‘మా బాహ్య పురుషుడు కృశించుచున్నను,అంతర్యపురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు.’’(2 కొరింధి 4:16).
ఆత్మలో నడచు వారిగా వుండమని పౌలుమనకు సలహా యిస్తున్నాడు. ఆయనింకా,ఆత్మలో నడచుట అంటే సువార్త కొరకు జీవించుట అని అర్ధం,కాబట్టి ఆత్మలో నడచుట అంటే ఏమిటో మనం మనసులో వుంచుకోవాలి. వ్యర్ధమైన వాటిని పొందడానికి వెదకక,సువార్త సేవ చేస్తు,దాని కొరకు జీవించాలి,మన శేష జీవితమంతా విశ్వాసంతో ఆత్మలో నడుద్దాం.
ఇప్పుడు నీటిమూలముగాను,ఆత్మమూలముగానైనసువార్తను నమ్ముటద్వారా నిజమైన ఆత్మ మన హృదయాలలో వున్నాడు. సువార్త ప్రకారం మనం ప్రార్ధన చేస్తే దేవుడు ఆనందంగా మనకు జవాబు యిస్తాడు. ఆత్మ ఫలాలను ఫలించుట అంటే ఆత్మలో నడుచుట?ఆత్మను విమోచించుట అని అర్ధం. మీరు ఆత్మలో నడచి,సువార్త కొరకు జీవించినప్పుడు మీరు ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం అనేఆత్మఫలాలను ఫలిస్తారు. నీటి మూలముగాను,ఆత్మమూలముగానైన సువార్తను ప్రకటించడమంటే మనం శ్రమ పడాలి,సహనం కలిగి వుండాలి,దయను చూపాలి,తప్పిపోయిన వారి యెడల మంచిని చేయాలి.
ఎవరైతే తప్పిపోయిన వారికి మేలు చేసి,వారికి సువార్తను బోధించుట ద్వారా వారు తమలో పరిశుద్దాత్మ నివాసాన్ని పొంది రక్షణ పొందునట్లు చేస్తారోవారిలో ఆత్మఫలాలు ఫలిస్తాయి. ఆత్మ ఫలాలను ఫలించుట,ఆత్మలో నడుచుట అంటే అర్ధం యిదే.