• All e-books and audiobooks on The New Life Mission website are free
  • Explore multilingual sermons in global languages
  • Two new revised editions in English have been released
  • Check out our website translated into 27 languages
Search

Sermons

అంశం 8: పరిశుద్ధాత్మ

[8-11] పరిశుద్దాత్మ నింపుదలతో నీ జీవితాన్ని గడుపుట (ఎఫెసి 5-6:18)

(ఎఫెసి 5-6:18)
‘‘వ్యర్ధమైన మాటలవలన ఎవడును మిమ్మును మోసపరచనియ్యకుడి,ఇట్టి క్రియలవలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై వుండకుడి. మీరు పూర్వమందు చీకటియై వుంటిరి. ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై వున్నారు. వెలుగు పలము సమస్త విధములైన మంచితనము,నీతి సత్యమను వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధులవలె నడచుకొనుడి,నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై వుండక వాటిని ఖండించుడి,ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్య మందు జరిగించు పనులను గూర్చి మాటలాడుటయైనను అవమానకరమై వున్నది. సమస్తమును ఖండింపబడి వెలుగుచేత ప్రత్యక్ష పరచబడును. -ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగేగదా. అందుచేత - నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులో నుండి లెమ్ము,క్రీస్తు నీమీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు దినములు చెడ్డవి గనుక,మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు,అజ్ఞానువలెగాక,జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతోమత్తులై వుండకుడి,దానిలో దుర్వాపారము కలదు,అయితే ఆత్మ పూర్ణులై వుండుడి’’
 
 
మన జీవితాలు పరిశుద్దాత్మ నింపుదల గలిగి వుండునట్లు మనమేమి చేయాలి?
మనలను మనంఉపేక్షించుకొని సిలువ నెత్తుకొని మన చెడ్డ ఆలోచనలను విడిచి సువార్తను ప్రకటించుటకు సమర్పించుకోవాలి.

 ‘‘పరిశుద్దాత్మ నింపుదల గల జీవితాన్ని కాపాడుకొనుటకు’’ సువార్తను ప్రకటించడానికి మనలను మనంసమర్పించుకోవాలి. అదుకు మొదటిగా మన హృదయాలలో పరిశుద్దాత్మను నివసింపచేసే దీవెన పొందాలి.మనలోనివసించుపరిశుద్దాత్మనుపొందడానికిదేవుడిచ్చిననీటిమూలముగాను,ఆత్మమూలముగానైన సువార్తను నమ్మాలి. ఈ విశ్వాసం ద్వారా మనలో పరిశుద్దాత్మ నివసించు దీవెనను పొందుతాం.తమలో పరిశుద్దాత్మ నివాసం గలవారు పరిశుద్దాత్మ నింపుదల గల జీవితాన్ని కోరుకుంటారా?కోరుకొంటారు. అయితే అలాంటి వారిలో కొందరు యిలాంటి జీవితాన్ని జీవించరు. కారణం?వారి స్వంత సమస్యలు దేవుని పనుల కంటే ప్రాధాన్యతను పొందుతాయి. అంటే వారు దేవునితో నడువరు.పరిశుద్దాత్మనింపుదలగలజీవితాన్నికాపాడుకోడానికిమనందేవునివాక్యాలనుతెలుసుకొని,వాటిలోనమ్మకముంచాలి. అందుకు ఎలాంటి జీవితం,నమ్మకం మనకుండాలో మొదటిగా బైబిల్ను చూద్దాం.
 
 
కొందరు పరిశుద్దాత్మనింపుదలగల జీవితాన్ని జీవించకపోవడానికి కారణం ఏమిటి?

మొదటిగా,వారు తమను తాము పరిత్యజించుకోరు. తమను తాము ఉపేక్షించుకొనువారే దేవునితో నడుస్తారు అని బైబిల్ చెబుతోంది. పరిశుద్దాత్మ నింపుదలగల జీవితాన్ని తమ స్వశక్తితో పొందడం అసంభవం. దానిని పొందడానికి ప్రతి ఒక్కరు తమను తాము ఉపేక్షించుకోడనికి తమలోని పరిశుద్దాత్మమీద విశ్వాసం కలిగి వుండాలి. తమలో పరిశుద్దాత్మ నివాసం గల వారికి కూడా దేవుని రాజ్యంతో కొంత సంబంధం లేకుండా తమను తాము ఉపేక్షించుకొనడం కష్టమే. అలా పరిశుద్దాత్మ నింపుదల గల జీవితాన్ని పొందడానికి మనం నీటి మూలముగాను,ఆత్మమూలముగానైన సువార్త సేవ చేయాలి. అప్పుడే ఒక వ్యక్తి తనను ఉపేక్షించుకొని నీతికి దాసునిగా జీవించగలడు.
 మత్తయి 16:24-26 యిలా వివరిస్తోంది,‘‘అప్పుడు యేసు తన శిష్యులను చూచి -ఎవడైనను నన్ను వెంబడిరపగోరిన యెడల,తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ నెత్తికొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును. ఒక మనుష్యుడు లోక మంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొంటే అతనికేమి ప్రయోజనము,ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమియ్యగలడు’’
 క్రొత్తగా జన్మించిన కొందరు తమ శరీరేచ్ఛను ఉపేక్షించుకొనరు గనుక వారు పరిశుద్దాత్మ నింపుదల గల జీవితాన్ని జీవించలేరు. తమలో పరిశుద్దాత్మ నివాసం గల వారు కూడా వారి శరీరేచ్ఛను విడిచిపెట్టినా ఒక పరిశుద్దాత్మను మాత్రమే అనుసరిస్తారు. దేవుని అనుసరించడానికి శరీరేచ్ఛలో అనేకాంశాలను విడిచిపెట్టాలి. ‘‘తనను తాను ఉపేక్షించుకొని,తన సిులువ నెత్తుకొని,నన్ను వెంబడింపవలెను’’,అని ప్రభువు చెప్పాడు.
ఐహిక సంబంధమైన మనస్సు కలిగి వుండడం మరణంతో సమానం. ఆధ్యాత్మికచింతన గల మనస్సు కలిగి వుండడం,జీవం,సమాధానం. ఆత్మలో నడవాలనుకొనే వారు శరీర జీవితాన్ని త్యజించాలి. ఈ త్యాగం చేయడానికి సాహసించే వారు మాత్రమే పరిశుద్దాత్మ నింపుదల గల జీవితాన్ని గడపగలరు. పరిశుద్దాత్మ సంపూర్ణతాసత్యం
 నీవు ప్రభువును అనుసరిస్తావా లేక లోకాన్నా,సంపూర్ణ పరిశుద్దాత్మ గల జీవితాన్నిగడపాలనుకుంటే నీవే ఎంచుకోవాలి. మన పాపాల నుండి దేవుడు మనలను రక్షించి మనలో నివసించు పరిశుద్దాత్మ వరాన్ని అనుగ్రహించాడు. పరిశుద్దాత్మ సంపూర్ణత గల జీవితం ముందే నిర్ణయించింది,లేక దైవికంగా నిర్ణయించింది కాదు. ఆజీవితం నీటిమూలముగానుఆత్మ మూలముగానైన సువార్తను నమ్మిన వారి ఉద్దేశాల మీదనే ఆధారపడి వుంది.
 
 
సంపూర్ణ పరిశుద్దాత్మ జీవితం జీవించాలన్న కోరిక నీకు ఉండాలి.

 సంపూర్ణ పరిశుద్దాత్మజీవితం జీవించాలన్న కోర్కె నీకుంటే దానిని పొందడానికి దేవుడు దీవించి సహాయం చేస్తాడు. దాన్ని నీవు కోరుకొనకపోతే సంపూర్ణ పరిశుద్దాత్మ జీవితాన్ని నీవు వదిలిపెట్టాలి.
 నీ కోర్కె ప్రకారం గాక,నీటిమూలముగాను,ఆత్మమూలముగానైన సువార్తయందు నమ్మకంవల్లనే నీలో నివసించు పరిశుద్దాత్మను పొందగలవు. అయితే సంపూర్ణ పరిశుద్దాత్మ గల జీవితాన్ని జీవించడం,దానిని పొందిన జీవితాన్ని కాపాడుకొనడం పూర్తిగా నీ యిష్టం మీదనే ఆధారపడివుంది.
కనుక నీవు ఆ జీవితాన్ని కోరుకొంటే నీ స్వంత ఉద్దేశాన్ని పరీక్షించుకొని దేవుని సహాయం కొరకు అడుగు. మనం నిజంగా దానిని కోరుకుంటే దేవుడు మనలను ఆశీర్వదించి,మన కోర్కెను నెరవేరుస్తాడు. మన లక్ష్యాన్ని మనం సాధించాలంటే మన శరీరేచ్ఛను మనం ఉపేక్షించాలి.
రెండోది,సంపూర్ణ పరిశుద్దాత్మ గల జీవితాన్ని జీవించాలంటే మన సిులువను మనం ఎత్తుకోవాలి. కష్ట పరిస్ధితులలో కూడా దేవుని చిత్త ప్రకారం జీవిస్తూ,దాని ప్రకారమే జీవించడం. అదే సంపూర్ణ పరిశుద్దాత్మగలనైతిక జీవితాన్ని గడుపుట అంటే.
మూడవది,ప్రభువన్నాడు,‘‘తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకొనును,నానిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొంటే అతనికేమి ప్రయోజనము,ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమియ్యగలడు’’,ప్రభువును అనుసరించడమే మన జీవితాలకు సరియైనది. ఆయనను మనం అనుసరిస్తే మన ఆత్మ,శరీరాలు అభివృద్ది చెందుతాయి. మనమాయనను అనుసరించక,మన ఇష్ట ప్రకారమైన జీవితాన్ని ఎంచుకొంటే మన ఆత్మ శరీరాలు నశించిపోతాయి.
సంపూర్ణ పరిశుద్ధాత్మ గల జీవితాలను మనమెందుకు కలిగి వుండలేకపోతున్నాం,కారణం మన శరీరేచ్ఛను మనం ఉపేక్షించలేక పోతున్నాం. మనం యేసును అనుసరించినప్పుడు మన ఆంతర్య కోర్కెలను బలపరచి,మనలను మరింత బలంగా వుండునట్లు నడిపిస్తాడు.
ఎఫెసి 5-11:13 యిలా వివరిస్తోంది,‘‘నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై వుండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుటయైనను అవమానకరమైవున్నది. సమస్తమును ఖండింపబడి వెలుగుచేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగే గదా’’?నిష్పలమైన అంధకార క్రియలతో క్రైస్తవులకు సహవాసం లేదు. కాని నిష్పలమైన అంధకార క్రియలతో మనయిష్టమొచ్చిన విధంగా వుంటే వాటిని బయట పెట్టమంటున్నాడు దేవుడు. మనఅంధకారక్రియలకు మనం దూషణపాలవుతాం.వాటిని రహస్యంగా చేయువారి క్రియలను గూర్చి మాట్లాడ్డమే అవమానకరం. బయట పెట్టబడినవన్నీ వెలుగు వలన ప్రత్యక్షపరచబడినవే.
 అవమానకరమైన వీటిని బయటపెట్టి,మాటలాడ గలిగిన వారెవరు,నీ సోదరీ సోదరులు,దేవుని సేవకులు,వాటిని బయటపెట్టలేరు. నీవే వాటిని బయల్పరచాలి. బయ్పరచబడినవన్నీ వెలుగు వలన ప్రత్యక్ష పరచబడినవని చెప్పబడిరది. కనుక,మన చెడుకార్యాలు మంచివి కావని మనం ఒప్పుకోవాలి. ఆ నిష్ఫలమైన అంధకార క్రియలను బయల్పరచడానికి మనంతట మనమే,లేక మన నాయకుడు పరిశుద్దాత్మ ద్వారా నడిపించబడాలి.
 ఈ లోకంలో బయ్పరచబడినవి నిందించడంతో అంతమైపోతాయి. కాని దేవుని లోకంలో అన్నింటిని వెతుగు ప్రత్యక్షపరుస్తుంది. మనం పరిపూర్ణులంకాదు గనుక ఈ లోకంలో మనకు తెలియకుండానే అనేక పాపాలు చేస్తూ వుంటాం. అయితే దేవుని వాక్యమనే వెలుగును మనమీద ప్రకాశింప చేసుకొన్నప్పుడు కొన్ని పాపాలను తెలుసుకొని,వాటిని ఒప్పుకోగలుగుతాం. కనుక,మన దేవునికెన్నో స్తుతులు చెల్లిస్తాం.
మన పాపాలు అతిక్రమాలనన్నింటిని యేసు తీసివేశాడు గనుక,ఆయన యోర్ధాను నదిలో బాప్తీస్మం తీసుకొన్నప్పుడు దేవుని నీతి యావత్తు నెరవేర్చబడినది గనుక దేవుని నీతి ద్వారా వెలుగు వలన మనం ప్రత్యక్షపరచబడ్డాం. యేసు యోహానువలన బాప్తీస్మం పొందినప్పుడు మానవులు చేసిన కోట్లాది పాపాలు యేసు మీదికి బదిలీచేయబడ్డాయి. ఈ లోకపాపమును మోసికొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ పాపాల కొరకు తీర్పు పొందడానికి ఆయన సిలువ మీద చనిపోయాడు. పునరుర్ధానుడైనాడు. ఆయన సిలువ మీద ‘‘సమాప్తమైనది’’అని చెప్పినప్పుడు (యోహాను 19:30)మానవుల పాపాలనన్నింటిని ఆయన క్షమించాడు. మానవ జాతిరక్షణపొందింది. యేసుచేసిన బలియాగంలో విశ్వాసంద్వారా మనంశుధ్దీకరింబడ్డాం. మన పాపాలు క్షమించబడ్డాయి గనుక మనం మళ్ళీ వెలుగులోనికి వచ్చాం. నీతితో దేవుని అనుసరిస్తాం.
 

 సమయాన్ని సద్వినియోగం చేసుకొనమని దేవుడు చెప్పాడు.

పరిశుద్దాత్మ గలిగిన సంపూర్ణ జీవితం జీవించాలంటే మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని పౌలు అంటున్నాడు.ఎఫెసి 5:15-17లో ఆయన యిలా వివరించాడు?,‘‘దినములు చెడ్డవి గనుక,మీరుసమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు,అజ్ఞానులవలెగాక,జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి’’.మనం సంపూర్ణ పరిశుద్దాత్మ గలిగి జీవించాలంటే సమయాన్ని సద్వినియోగం చేసుకొంటూ,అజ్ఞానులవలె వుండకూడదు. దేవుని చిత్తం,లేక ఆయన ఉద్దేశమేమిటో తెలుసుకొని దానిని చేయాలి. మన శరీరేచ్ఛకు నమ్మకంగా వుండడమో,లేక దేవునికి సమర్పించుకోవడమో ఏది తగిన జీవితమో మనమే నిర్ణయించుకోవాలి.
 మనం క్రొత్తగా జన్మించిన తర్వాత పరిశుద్దాత్మ మనలో నివసిస్తాడు. మనమా పరిశుద్దాత్మను పొందడమంటే దేవుడే మన యజమాని,ఆయనే మన రాజు అని అర్ధం. ఆయనే మన రక్షకుడు,ఆయనే మన దేవుడని మనం ఒప్పుకోవాలి. ఆయన నన్ను సృజించిన దేవుడు. నాపాపాలన్నింటిని క్షమించి,నన్ను దీవించినవాడు. నా జీవితంలో దీవెనను గాని శాపాలు గాని నా జీవితం మీద మరణం మీద అధికారం గల రాజు ఆయనే,కనుక మన జీవిత కాలమంతా ఆయనకే విధేయులమై వుండాలి.
దీనిని గురించి ఫిలిప్పీ 2:5-11 ఏంచెబుతోందో చూద్దాం. ‘‘క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగివుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై వుండి,దేవునితో సమానముగా వుండుట విడిచి పెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని మనుష్యుని పోలికగా పుట్టి,దాసుని స్వరూపమును ధరించుకొని,తన్ను తానే రిక్తునిగా చేసికొనెను. మరియు,ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి,మరణము పొందునంతగా,అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై,తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని,భూమిమీద వున్న వారిలో గాని,భూమిక్రింద వున్న వారిలో గాని,ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును,ప్రతి వాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్ధమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును,దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి,ప్రతినామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను’’.
‘‘ఈమనస్సు మీరును కలిగి వుండుడి’’.ఇది యేసుక్రీస్తు మనస్సు అని అంటున్నాడు పౌలు. అంటే సృష్టికర్తయైన దేవుడు తన తండ్రియైన దేవుని చిత్త ప్రకారం తన ప్రజలను వారి పాపాలనుండి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు అన్న ఈ మనస్సు కలిగి వుండుడి అని అన్నాడు పౌలు. ప్రభువీలోకానికి వచ్చి యోహానువలన పొందిన బాప్తిస్మంలో లోకపాపాలనన్నింటిని తన పైకి తీసుకొన్నాడు. ఆయన సిలువ మీద చనిపోయినప్పుడు లోక పాపాలను తీసివేశాడు. మూడు రోజుల తర్వాత పునరుత్ధానుడై మన రక్షకుడైనాడు.
సృష్టికర్తయైన యేసు క్రీస్తు మనలను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. తన బాప్తిస్మం,సిలువరక్తం ద్వారా తన ప్రేమను మనకు చూపించాడు. ఆయన సృష్టికర్త అయినా,ఒక మామూలుజీవిలా తనను తగ్గించుకొని మనకనుగ్రహించిన పాపక్షమాపణ నిమిత్తం సృష్టియావత్తు ఆయన ముందు మోకరించి,ఆయనను స్తుతించాలి. ఆయన సమస్తసృష్టికి ప్రభువేగాక,మనకు సమస్త నీతి అని మనం ఒప్పుకునేట్టు చేశాడు.
దేవుని నమ్మే మనం మనలో నివసించు పరిశుద్దాత్మను పొంది దేవుడే నాకు నిజమైన యజమాని అని నమ్మి మనలను సృష్టించి మన పాపాలనుండి మనలను రక్షించిన యేసు క్రీస్తు ప్రేమను హృదయంలో కలిగి వుండాలి. ఇంకా ధన్యమైన జీవితాన్ని జీవించునట్లు చేసే యజమానిగా,మనకు సమస్తాన్ని సిద్దపరచి మన కొరకు పని చేస్తాడన్న విశ్వాసం కూడా కలిగి వుండాలి.
 చాలా మంది క్రొత్తగా జన్మించిన తర్వాత యజమానుని మార్చుకోవడానికి యిష్టపడరు. తమలో పరిశుద్దాత్మ నివాసంగా గలవారు చాలామంది తమకు తామే యజమానులమంటారు. పరిశుద్దాత్మ సంపూర్ణత గల వారు దేవుని అనుసరించే జీవితం గలిగి వుంటారు. ఈ జీవితాన్ని ఒక్క రోజులో పొందలేం. కాని మన జీవితాలకు యేసే యజమాని అని,ఈ జగతిలోని సర్వసృష్టిని ఆయనే సృజించాడని నమ్మినప్పుడే ఆ జీవితాన్ని జీవించడానికి వీలవుతుంది. మన పాపాల నుండి మనలను రక్షించి పరలోక రాజ్యపు నిత్య జీవితాన్ని అనుగ్రహించిన మన ప్రభువు,యజమాని,దేవుడు యేసు అని ఆయన్ను సేవించాలన్న విశ్వాసం కలిగి వుండాలి.
 చాలా మంది తమ జీవితాలకు తామే యజమానులమని జీవిస్తుంటారు. తమ జీవితాల మీద తమదే అధికారమన్న దానిని కాపాడుకోడానికి, కొనసాగించడానికే ప్రయత్నిస్తూ వుంటారు. అయితే యజమానులను మార్చుకోవలసిన తగిన సమయంయిదే. ఇప్పుడు మనం దేవుని ఎరిగినవారం,కనుక మనక వసరమైన యజమాని మనప్రభువే.
మనందరి హృదయాలలో పాపంవుంది మన చెడు పనులకు నరక శిక్షకు పాత్రులమైనాం. అయితే నీటి మూలముగాను,ఆత్మమూలముగానైన సువార్తద్వారా మన ప్రభువును మనం కనుగొన్నాం. దేవుడు మనలనెంతగానో ప్రేమిస్తున్నాడు. కనుక ఆయన ఈ లోకానికి వచ్చి యోహానుద్వారా పొందిన బాప్తిస్మం వలన మన పాపాలన్నింటిని ఆయన తీసుకొని మన రక్షకుడవడానికి సిలువ మీద మరణించాడు. దేవునిలో మన విశ్వాసంద్వారా మన పాపాలనుండి విముక్తి పొందాం. అనగా మనలో నివసించు పరిశుద్దాత్మను పొందాం.
 ‘‘దేవుని ఆత్మ మీలో నివసించి వున్న యెడల మీరు ఆత్మ స్వభావము గలవారే’’అని అంటోంది. బైబిల్ (రోమా 8:9) మనం పాపవిమోచన పొందినప్పుడు,అనగా మనలో నివసించు పరిశుద్దాత్మను పొందినప్పుడు మనం దేవుని పిల్లలమైనాం. మన దేవుడైన పరిశుద్దాత్మ ఉపదేశం ప్రకారం దేవుని నీతిలో నడుస్తాం. అలా జీవించడానికి మనకు మనమే యజమానులమనే మనస్సును విడిచిపెట్టాలి. ఆయనను మనవానిగా ఆయననే మన ఏకైక యజమానిగా చేసుకోవాలి.
 

మన హృదయంలోని సింహాసనాలను ఆయనకు అప్పగించాలి

మన జీవితాలకు మనమే యజమానులమనుకొన్నప్పుడు దేవుని మనం అనుసరించలేం.మనలను సేవించమని దేవుడు మనలను ఆజ్ఞాపించినప్పుడు‘‘సరే ప్రభువా’’అని అంటాం. లేకుంటే తనకు సహాయం చేయమని అడగాలిగాని ఇలా ఆజ్ఞాపిస్తే ‘‘నిన్ను నేనెందుకు సేవించాలి’’అని అంటాం. అలాంటి వ్యక్తికి దేవుని ఉపదేశాలు ఉపయోగంలేనివని,సోమరితనంతో,చిక్కులు పెట్టే మాటలనిపిస్తాయి.
ఏమైనప్పటికి పరిశుద్దాత్మ నింపుదల పొందడానికి ఆయన ఆజ్ఞలకు విధేయులం కావాలి. వధకులాక్కుపోయే గొర్రెలం కాదు మనం. మనలను సత్యమార్గంలో నడిపే మన రక్షకుడైన దేవుని మనం స్వచ్ఛందంగా అనుసరించాలి. మనలను రక్షణతో ఆశీర్వదించిన దేవుడాయనని మనం ఆయనను మన యజమానిగా సేవించి,ఆయన సిద్దాంతాలను అనుసరిస్తే మనం పరిశుద్దాత్మతో నింపబడతాం. మీరు మీ కుటుబం సభ్యులు ఆయనను రాజుగా చేసుకొని,అన్నిటి కంటే పైగా ఆయననే వుంచితే మీ జీవితాలలో కృప,ఆశీర్వాదాలు వుంటాయి.
 గాలివానకు వ్యతిరేకంగా సముద్రంలో ప్రయాణం చేస్తున్న వ్యక్తి ప్రక్కన యేసు నిలిచి వున్న చిత్రాన్ని మీరు చూసే వుంటారు. మన జీవితాలలోని సవాలును ఎదుర్కొంటూ ప్రభువు పనినిచేస్తూవుంటే మన చేతులు పట్టుకొని యేసు క్రీస్తు మనలను నడిపిస్తున్నట్టుగా అందులో చూస్తాం. సర్వశక్తి మంతుడైన దేవుడే మన జీవితాలను కాపాడతాడు ఆయన మనలను రక్షించాడు. సాతాను నుండి ఆయనే మనలను కాపాడతాడు. మనలను నడిపిస్తూ మన జీవితాలపై అధికారం కలిగి వుంటాడు.
 ఆయన మన యజమాని అయినాడు గనుక మనలను దీవించి,మన జీవితాలను పర్యవేక్షిస్తాడు. కాని ఆయనను మన యజమానిగా అంగీకరించనప్పుడు,ఆయన తన పాత్రను నిర్వహించడు. ఆయన వ్యక్తిత్వం గల దేవుడు గనుక తనను అనుసరించమని మనలను బలవంతం చేయడు. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడైనా కూడా,ఆయనే మన యజమాని అని మనం స్వచ్ఛందంగా ఆయనను సేవిస్తూ,సహాయాన్ని ఆర్ధించకపోతే మన కొరకు ఆయనేమి చేయడు.
 

సమస్తము ఆయనమీద వేయుడి

మనము ఆయన యజమాన్యాన్ని నెరవేర్చునట్లు మన సమస్తం ఆయన మీద వేయాలి. మనం పరిపూర్ణులం కాదు గనుక మన సమస్తం ఆయన మీద వేసి,మన బాధ్యతంతా ఆయనకు అప్పగించాలి. మన కుటుంబాలను,అనుదిన జీవితాలను,మనకున్న సమస్తాన్ని ఆయన మీద వేసినప్పుడు దేవుని జ్ఞానాన్ని పొందుతాం. ఆయనిచ్చిన విశ్వాసం,శక్తిద్వారా సమస్త సమస్యలను పరిష్కరిస్తూ ఆయన కోరిన విధంగా జీవించగలుగుతాం.
అప్పుడు మనసమస్యలు ఆయనసమస్యలవుతాయి.ఆయనే వాటి బాధ్యతవహిస్తాడు. అప్పుడు మనం సంపూర్ణ పరిశుద్దాత్మగల జీవితాన్ని జీవిస్తూ ఆయన ముందు మోకరించి ఆయనే మన యజమానిగా ఒప్పుకొని ఆయనను సేవిస్తూ ఆయనలోని సమాధానాన్ని మనం అనుభవిస్తాం.
 పరిపూర్ణ పరిశుద్దాత్మగల జీవితాన్ని జీవించడానికి ఎలాంటి విశ్వాసం మనం కలిగి వుండాలో ఫిలిప్పీ 3:3లో చూడండి. ‘‘శరీరమును ఆస్పదము చేసికొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసు నందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము’’,ఇక్కడ ‘‘సున్నతి’’అంటే ఆత్మతో దేవుని ఆరాధిస్తూ,క్రీస్తు యేసులో ఆనందిస్తూ,శరీరరేచ్ఛలో నమ్మకం లేని వారని అర్ధం.
సున్నతి ప్రకారం జీవించడమంటే మన హృదయాలలోని పాపాలన్నంతటినీ తీసివేసికొనిదానిని యోహాను వలన బాప్తిస్మం పొందిన యేసు క్రీస్తు మీద మోపడం అని అర్ధం. ఆత్మ వలన నడిపింపబడుతున్న వారు వారి జీవితాలను ఆత్మకే అచ్చివున్నారు. వారు ‘‘ఈ మహిమకరమైన జీవితాన్ని జీవించడానికి యేసే నన్ను నడిపించాడు. ఆయన నన్నునీతిమంతునిగాచేసి ఆశీర్వదించాడు.ఆయనను సేవించడానికి కవసరమైన కృపను ఆయనే అనుగ్రహించాడు’’,అని చెబుతూ దేవుని సేవిస్తూ,యేసు క్రీస్తులో ఆనందిస్తారు. ఇదే సంపూర్ణపరిశుద్దాత్మగలజీవితం.పౌలుఅంటాడు,‘‘కాబట్టి మీరు భోజనము చేసినను,పానము చేసినను,మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి’’,1కొరింధి 10:31).
 ఫిలిప్పీ 3:13-14 ఇలా వివరిస్తోంది. ‘‘సహోదరులారా,నేనిది వరకే పట్టుకొని వున్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను. వెనుక వున్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురియొద్దకే పరుగెత్తుచున్నాను’’,గతంలోని సంగతులను మరిచిపోయి ముందున్న వాటి కొరకు గమ్యం దగ్గరకు వెళ్ళాలి. గతంలోని మన నైతిక కార్యాలను లేక చెడును మరచిపోయిముందున్న మంచి వాటి కొరకు గమ్యం వద్దకే పోవాలి. ఆ గమ్యం ఆయన సిలువ నెత్తుకొని,ఆయనలో నమ్మకముంచడమే.
మనం అసంపూర్ణులం కనుక శరీరేచ్చను గూర్చి ఆలోచించినప్పుడు మనం దాని ఆశలో పడిపోతాం.అయినా దేవుని వైపుచూస్తూ ఆయనలో విశ్వాసం గలిగి ఉంటే మన బహీనతలు, అతిక్రమాలన్నింటినీ త్యజించగలం. యేసుక్రీస్తు యోహానువలన బాప్తిస్మాన్నిపొంది,సిలువ మీద చనిపోయినప్పడు మన పాపాలన్నీ ఆయన మీదకు బదిలీచేయబడ్డాయి. ఆయన పునరుర్ధానం ద్వారా ఆయన మన రక్షకుడైనప్పుడు మనకు నూతన జీవితాలు అనుగ్రహించబడ్డాయి. కనుక మన వెనుక వున్న వాటినన్నిటినీ విడిచి ముందున్న వాటి కొరకు గమ్యం వద్దకే పరుగెత్తుదాం.
 

సంపూర్ణ పరిశుద్దాత్మ గల జీవితాన్ని జీవించుట

ముందున్న వాటి కొరకు,ఉన్నతమైన గమ్యం కొరకు ముందుకే వెళ్ధాం. గతంమీకు భారంగా వుంటే వీలైనంత త్వరగా వాటిని మరచిపోతారని ఆశిస్తున్నాను. మన బలహీనత వలన చేయలేనివి చాలా వుండి వుంటాయి. కాని భావికాలంలో వున్న ముఖ్యమైన వాటికోసం వాటిని విసర్జించాలి. భావి జీవితం ముఖ్యమైనది గనుక విశ్వాసం ద్వారా ఆయన వలన నడిపించబడుతూ మనపై రాజరికాన్ని ఆయనకు అప్పగిద్దాం. భావి కాంలో మనం ఎలా జీవించాలో,ఆయనకిష్టమైనవేవి చేయాలో ఆయన్నే నిర్ణయించనిద్దాం.
 
 
యేసు శిష్యులుగా మనం జీవించాలి

పాప విమోచనలో బలమైన విశ్వాసం గల వారమైతే సంపూర్ణ పరిశుద్దాత్మ గల జీవితాన్నిజీవించగలం. ఇది చాలా ముఖ్యం. 2 తిమోతి 2:1-10 పరిశీలించి చూద్దాం,‘‘నా కుమారుడా క్రీస్తుయేసునందున్న కృపచేత బలవంతుడవుకమ్ము. నీవు అనేక సాక్షుల యెదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్ధ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపుము. క్రీస్తుయేసుయొక్క మంచి సైనికునివలె నాతోకూడా శ్రమను అనుభవించుము. సైనికుడెవడును యుద్దమునకు పోవుచున్నప్పుడు,తన్ను దండులోచేర్పుకొనినవానిని సంతోష పెట్టవలెనని ఈ జీవిన వ్యాపారములో చిక్కుకొనడు. మరియు జెట్టియైనవాడు పోరాడునప్పుడు,నియమం ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. పాటుబడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొన వలసినవాడు. నేను చెప్పుమాటలు ఆలోచించుకొనుము. అన్ని విషయములయందు ప్రభువు నీకు వివేకమనుగ్రహించును. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలోనుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసికొనుము. నేను నేరస్థుడనై వున్నట్లు ఆ సువార్త విషయమై సంకెళ్ళతో బంధింపబడి వుండలేదు. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణపొందవలెనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను.
పౌలు తిమోతితో చెప్పినట్లే పరిశుద్దాత్మ మనతో “యేసుక్రీస్తునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము నీవు అనేక సాక్షుల యెదుట నావలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్ధ్యము గల,నమ్మకమైన మనుష్యులకు అప్పగింపుము”అని చెబుతున్నాడు.
 “యేసుక్రీస్తునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము”ఇక్కడ కృపచేత బలవంతుడవు కమ్ము అని అనడంలో నీటిమూలముగాను,ఆత్మమూలముగానైన సువార్తలోని విశ్వాసంతో ఆయనను నమ్మి,ఆయననే పట్టుకొని బలం పొందుట అని అర్ధం. యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి తన బాప్తిస్మం ద్వారా మన పాపాలన్నింటిని ఆయనే ఒప్పుకొని,సిలువ మీద చనిపోయి,పునరుత్ధానుడై మన రక్షకుడైనాడు. అంటే మనమాయన కృపలోబలవంతులమై,ఆయన యెడల కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు మనలను రక్షించాడు. కనుక విశ్వాసం ద్వారా ఆయన వరంగా రక్షణను అంగీకరించాలి. ఇదే పాపక్షమాపణ రక్షణ. దీనికి వేకువ జామున చేసే ప్రార్థనలకు,ప్రార్ధనా మందిర నిర్మాణానికి సహాయం చేయడానికి సంబంధంలేదు. రక్షణ పొందడానికి ఇవ్వన్నీ మేలుకంటే కీడునే అధికంగా కలిగిస్తాయి.
 పాప క్షమాపణ ద్వారా మన రక్షణ అంటే మన క్రియలతో సంబంధం లేక మన పాపాలన్నిటిని భరించడానికి యేసుక్రీస్తు బాప్తిస్మం పొంది,మన అతిక్రమాలనన్నింటిని తుడిచి వేయడానికి సిలువమీద చనిపోయి,మన పాపాల నుండి మనలను రక్షించడానికి పునరుత్ధానుడైనాడు అని అర్ధం. సంఘ పెద్దలు,పాస్టర్లు కూడా ఈ సత్యసువార్తను నమ్ముట వలన వారి పాపాల నుండి రక్షణ పొందారు. ఇలాగే తమ హృదయపూర్వకంగా యేసుక్రీస్తును ఎవరు నమ్ముతారో వారు తమ పాపాలకు క్షమాపణ పొందుతారు. కనుక మనం రక్షణ కృపలో నమ్మకముంచి మన విశ్వాసాన్ని బలపరుచుకొందాం.
 మనం సంపూర్ణ పరిశుద్దాత్మ గల జీవితాన్ని కోరుకుంటే నీటిమూలముగాను,ఆత్మమూలముగానైన సువార్తలోని విశ్వాసంతో బలవంతులం కావాలి. మన జీవితాలలో మన బలహీనతను కొలవడంలో మనం తప్పిపోతూ వుంటాం. కనుక రక్షణ కృపలో మనం బలవంతులం కావాలి. మన బలహీనతలు మనకు కనిపించినప్పుడల్లా నీటి మూలముగాను,ఆత్మమూలముగానైన, సువార్తద్వారా దేవుడు నన్ను రక్షించాడు,యేసుక్రీస్తు నా పాపాలను నన్ను క్షమించాడని, చెప్పుకుంటూ మన విశ్వాసాన్ని ధ్యానం చేయాలి. ఈ సువార్తను నమ్ముట వలన,మనలోని పరిశుద్దాత్మవలన బలాన్నిపొంది నీతిమంతులమవుతాం. మన విశ్వాసం ద్వారా మనం ధన్యులమైనాం.
“మీరు భోజనము చేసినను,పానము చేసినను,మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి”అని అన్నాడు పౌలు (1 కిరింధి 10:31). అది అతిప్రాముఖ్యమైనది. అంటే మన జీవితాలను దేవునికి సమర్పించుకోవాలని అర్ధం. “మీరు భోజనము చేసినను పానము చేసినను”దేవుని పని చేయడానికి బలంకొరకు మనం తినాలి. త్రాగాలి,సువార్తను బోధించడానికి మన ఆరోగ్యం నిమిత్తం మంచి వాటిని తినాలి.
 “సైనికడెవడును యుద్దమునకు పోవునప్పుడుతననుదండులోచేర్చుకొనినవానినిసంతోషపెట్టవలెనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు”(2 తిమోతి 2:4). సువార్తను బోధించడానికి మీరు పరిపూర్ణ పరిశుద్దాత్మ గల జీవితాన్ని గడపాలి. సువార్తను బోధించడానికి జీవించనప్పుడు మనం విశ్వాసం గల జీవితాన్ని జీవిస్తాం. మీరు కష్టించి పని చేయుట ద్వారా సంపాదించిన కానుకలను సువార్త బోధన కొరకు ఉపయోగించాలి.
సంపూర్ణ పరిశుద్దాత్మ నింపుదల గల జీవితాన్ని నీవు జీవించాలనుకొంటే నిన్ను నీవు దేవునికి ప్రతిష్టించుకోవాలి. ఆయన సేవలో వుండాలి. నీ ధనాన్ని సువార్తకు వినియోగించాలి. నీ కష్ట సుఖాలను దేవునితో చెప్పుకోవాలి. ఈలాంటి జీవితాన్ని గడపాలనుకొంటే స్ధిరమైన విశ్వాసంతో సువార్త సేవ చేయాలి.
 ఇప్పటి వరకు చాలామంది తమంతట తామే తమ జీవితాలను గడిపారు. తమకు తామే యజమానులై గోడలు నిర్మించుకొని ఆస్తిని సంపాదించుకొన్నారు. అయితే యిప్పుడు మనం దేవుని కొరకు జీవించాలి. దేవుని మనవానిగా,మన ఏకైక యజమానిగా స్వీకరించాలి అని పౌలుఅంటున్నాడు. “సైనికుడెవడును యుద్దమునకు పోవునప్పుడుతనను దండులో చేర్చుకొనిన వానిని సంతోషపెట్టవలెనని ఈ జీవన వ్యాపారములో చిక్కకొనడు”మంచి సైనికునిగా జీవించడమంటే సిద్దాంతాలను అనుసరించడం. మనం దేవునికి నమ్మకమైన సైనికుగా జీవిస్తే మన సమస్యలను ఆయనే పరిష్కరిస్తాడు. మనలను కాపాడతాడు,మనలను నడిపిస్తాడు. “మొదట దేవుని రాజ్యమును, ఆయన నీతిని వెదకండి”,అని ఆయన అంటున్నాడు (మత్తయి 6:33).
 దేవుని వాక్యంలో అసత్యమైన దేదీలేదు. మనం ఆయనను అనుసరిస్తే ఆయన వాక్యంలోని సత్యాన్ని అనుభవించగలం. అయితే తన హృదయంలో పరిశుద్దాత్మ లేని వ్యక్తి తన సింహాసనాన్ని దేవునికి అప్పగించలేడు. మొదటిగా నీ హృదయంలో పరిశుద్దాత్మ నివసించాలి. దాని వలన పరిశుద్దాత్మ నింపుదలను అనుభవించగలడు. అప్పుడు తన హృదయంలో ఆనందాన్ని,సమాధానాన్ని పొందగలడు.
 నీటిమూలముగానైన,ఆత్మమూలముగానైన సువార్తను అర్ధం చేసుకొని,దానిని నమ్మినప్పుడే నీలో పరిశుద్దాత్మ నివాసం నిజమవుతుంది. నీవు పరిశుద్దాత్మ నింపుదలను కోరుకొని,ధన్యకరమైన జీవితాన్ని జీవించాలనుకుంటే దేవుని రాజుగా సేవించి ఆయన రాజ్యమేలుటకు జీవించాలి. అప్పుడు నీవు పరిశుద్దాత్మ నింపుదలను కలిగి,నీ హృదయం సమృద్దితో అభివృద్దికరమైన జీవితాన్ని గడుపుతూ దేవుని రాజ్యపు బిడ్డల దీవెనలను పొందగలం.
దేవునిలో నమ్మకంతో పాపక్షమాపణను,పరిశుద్దాత్మను పొందిన వారు పరిశుద్దాత్మ నింపుదల గల జీవితాన్ని జీవించగలరన్న సందేశాన్నిచ్చాను నేను. పరిశుద్దాత్మ నింపుదల గల జీవితానికి నిర్వచనం చెప్పాను. ఇలాంటి జీవితాన్ని ఎలా గడపగలమో వివరించాను. విశ్వాసం ద్వారా మీ సింహాసనాలను దేవునికి అప్పగించగలరని,విశ్వాసం ద్వారానే ఆయనను సేవించగలరని,పరిశుద్దాత్మ నింపుదల గల జీవితాన్ని గడపగలరని వివరించాను.
ఒక వ్యక్తి తిరిగి పుట్టడానికి పరిశుద్దాత్మ కలిగివుంటే చాలదు. అతడు పరిశుద్దాత్మ నింపుదల గల జీవితాన్ని కొనసాగించాలి. అలాంటి జీవితం గడిపినప్పుడే మన ఆత్మలు,శరీరాలు తప్పక ఆశీర్వదింపబడతాయని తెలుసుకుంటాం.
 ఇలాంటి జీవితం దానంతట అదే సంభవించదు. ప్రభువే మన యజమాని అని నమ్మి,మన హృదయాలలో ఆయనకు మొదటి స్థానం యిచ్చినప్పుడే ఆ జీవితాన్నిపొందగలం. దేవుడు మనలను రక్షించి,పరిశుద్దాత్మ నింపుదల గల జీవితాన్ని సువార్త సేవ చేసే జీవితాన్ని యిప్పటికే అనుగ్రహించాడు. కనుక మనం సంపూర్ణాత్మగల జీవితాన్ని గడపాలి.
 మీ జీవితాలను ఆయనకు ప్రతిష్టించి,ఆయన కొరకు జీవించాలి,ఈ సత్య సువార్తను బోధిస్తూ ఆయన్ను సేవించాలి,అప్పుడు నీ హృదయం కష్టపడాలి పరిశుద్దాత్మతో నిండి,సంతోషము,కృప నీలో నుండి ప్రవహిస్తాయి. ఆయన తిరిగి వచ్చిన దినాన ఆయన ముందు సగర్వంగా నిలిచి,ఆయనిచ్చు బహుమానాన్ని పొందగలవు. విశ్వాసం ద్వారా సంపూర్ణ పరిశుద్దాత్మగల జీవితం కొరకు మనం కష్టపడాలి. దాని ద్వారానే ఆత్మ నింపుదలగల జీవితాన్ని జీవించగలం.
 సంపూర్ణ పరిశుద్దాత్మ గల జీవితాన్ని జీవించడానికి నీ సింహాసనాన్ని దేవునికి అప్పగించాలి. మీ హృదయాలలో ఆయనకే మొదట స్థానం యిస్తారని నమ్ముతున్నాను. పరిశుద్దాత్మ నింపుదలగల జీవితం జీవించాలన్న కోరిక నీలో వుండాలి. అప్పుడా పరిశుద్దాత్మ నింపుదల గల జీవితాన్ని గడపడానికి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు.