• All e-books and audiobooks on The New Life Mission website are free
  • Explore multilingual sermons in global languages
  • Two new revised editions in English have been released
  • Check out our website translated into 27 languages
Search

Sermons

అంశం 8: పరిశుద్ధాత్మ

[8-12] పరిశుద్ధాత్మ నింపుదల గల జీవితాన్ని జీవించు (తీతుకు 3-1:8)

(తీతుకు 3-1:8)
‘‘అధిపతులకును,అధికారులకును లోబడి విధేయులుగా వుండవలెననియు,ప్రతిసత్కార్యము చేయుటకు సిద్దపడి వుండవలెననియు,మనుష్యులందరి యెడల సంపూర్ణమైన సాత్వికమును,కనపరచుచు,ఎవనిని దూషించక జగడమాడని వారును శాంతులునైవుండవలెననియు వారికి జ్ఞాపకము చేయుము. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును,అవిధేయులమును,మోసపోయిన వారమును,నానా విధములైన దురాశలకును,భోగములకును దాసులమునై వుండి,దుష్టత్వము నందును,అసూయలయందును కాలముగడుపుచు,అసహ్యులమై యొకని నొకడు ద్వేషించుచు వుంటిమి గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు,మానవుల యెడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియలుమూలముగాగాక,తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానముద్వారాను పరిశుద్దాత్మ మనకు నూతనస్వభావము కలుగచేయుటద్వారాను మనలను రక్షించెను. మనమాయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి,నిత్యజీవమును గూర్చిన నిరీక్షణనుబట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్దాత్మను మనరక్షకుడైన యేసుక్రీస్తుద్వారా ఆయన మనమీద సమృద్ధిగా కుమ్మరించెను. ఈ మాటనమ్మదగినది గనుక దేవునియందు విశ్వాసముంచినవారు సత్‌క్రియలను శ్రద్దగా చేయుటయందు మనస్సుంచునట్టు నీవీ సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలెనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుష్యులకు ప్రయోజనకరమైనవియునై వున్నవి’’.
 
 
సంపూర్ణ పరిశుద్దాత్మ గల జీవితాన్ని మనమెలా జీవించగలం?
మనం దేవుని చిత్తాన్ని అర్ధం చేసుకొని దానిప్రకారం సువార్తను బోధించుట ద్వారా.
 
యేసునునమ్మి తమలో నివసించు పరిశుద్దాత్మను పొందినవారు సంపూర్ణ పరిశుద్దాత్మనింపుదలగల జీవితాన్ని జీవిస్తారు. క్రైస్తవులకు సంపూర్ణ పరిశుద్దాత్మగల జీవితంకావాలని దేవుడు కోరుచున్నాడు. మనం ఆయన ఆజ్ఞను అనుసరించాలి. అప్పుడు సంపూర్ణ పరిశుద్దాత్మ గల జీవితాన్నిమనమెలా జీవించగలం,అంటే అపోస్తుడైన పౌలు దీనిని గురించి చెప్పిన దానిపై మనం ధ్యానముంచాలి.
 

సంపూర్ణ పరిశుద్దాత్మ జీవితానికి ఏమి అవసరం?

తీతు 3:1 లో పౌలు అన్నాడు,‘‘అధిపతులకును,అధికారులకును లోబడి విధేయులుగా వుండవలెననియు, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్దపడి వుండవలెనని. వారికి జ్ఞాపకము చేయుము.’’మొదట మనం అధిపతులకును అధికారులకును లోబడి ప్రతి సత్కార్యము చేయుటకు సిద్దపడి వుండాలని ఆయన మనకుచెబుతున్నాడు. మనం ఈలోక నియమాలకు అవిధేయులమైతే సంపూర్ణ పరిశుద్దత్మ జీవితాన్ని జీవించలేమని ఆయన వుద్దేశం. అట్లని,లోకాధికారులు,నియమాలు సత్యానికి వ్యతిరేకమైనవైతే మనం వాటికి విధేయులమవ్వవలసిన అవసరం లేదు. ఆ నియమాలు మన విశ్వాసాన్ని భంగపరచనివైతే సమాధానంతో సువార్త సేవ చేయడానికి మనం విధేయులం కావాలి.
 మనలో పరిశుద్దాత్మను పొందిన మనం లౌకిక నియమాలను భంగపరిచి సంపూర్ణ పరిశుద్దాత్మ జీవితాన్ని ఎలా గడపగలం,అందుకనే ఈలోక ధర్మాన్ని మనం పాటించాలి. తమలో పరిశుద్దాత్మను పొందిన వారు సాంఫీుక నియమాలకు విధేయులు కావాలి. ఈ లోక ధర్మాన్ని మనం నిలిపినప్పుడే మనం దేవునితో నడువగలం.
 బహుశా మనలో ఒకరు సంఘారాధనకు వెళ్తూ మార్గ మద్యంలో ఒకనేరం చేశామనుకోండి. అతడు మామూలుగా నిబ్బరంగా దేవుని సేవించగలడా,అతడు చట్టానికి వ్యతిరేకంగా జీవిస్తే దేవుని ఉపదేశం ప్రకారం అతడెలా జీవించగలడు,ఆత్మలో నడుస్తున్నప్పుడు మనం సాంఫీుక నియమాలను ఉల్లంఘించకూడదు. చట్టాన్ని వుల్లంఘించడం వలన మంచేమీ జరగదు. సువార్తను ప్రకటిస్తూ మనం చట్టానికి విధేయులమైశాంతి సమాధానానికు విధేయులం కావాలి. సంపూర్ణ పరిశుద్దాత్మ జీవితాన్ని గడిపేవారు సాంఫీుక నియమాలకు కట్టుబడి వుండాలి.
 
 
మన హృదయాలలో వినయం కలిగి వుండాలి.

‘‘మనుష్యులందరి యెడల సంపూర్ణమైన సాత్వికమును కనుబరచుచు,ఎవనిని దూషింపక,జగడమాడనివారును,శాంతులునై వుండవలెను’’అని అన్నాడు పౌలు. సంపూర్ణ పరిశుద్దాత్మ గల జీవితం జీవించాలంటే మనం ఎవరిని గూర్చి చెడుగా మాట్లాడక,శాంతులమై,సాత్వికంతో అందరి యెడల వినయం కలిగి వుండాలి.
 క్రొత్తగా జన్మించిన వారి హృదయాలలో వినయం వుంటుంది. ఆశానిగ్రహం వుంటుంది. సాత్వికం కూడా వుంటుంది. వారిలో నివసిస్తున్న పరిశుద్దాత్మవల్లనే యిది సాధ్యం. మనం ఒకరితో ఒకరం జగడమాడుతూ సువార్తను క్షీణింపచేయకూడదు అని చెప్పాడు పౌలు. సాంఫీుక చట్టం సువార్తకు వ్యతిరేకంగా వున్నప్పుడు మనం పోరాడుతాం. అలాలేనప్పుడు మనం శాంతంతో జీవిస్తూ యితరులు మనలను చేసింది’’.అనుకొనేట్లుగా జీవించాలి. 
శరీరేచ్ఛలలో గమనించేట్లు చేయాలి. వారు ‘‘అతడు కొన్నిసార్లు క్రూర సింహంలా వున్నా అతడు నిజంగా పావురంలా శాంతపరుడు. క్రైస్తవ్యంలో అతనికున్న నమ్మికయే అతన్నంత సౌశీల్యునిగా ఆలోచనాపరునిగా సాత్వికంగాని,లేక వినయంగాని వుండదు. మనలో నివసించు పరిశుద్దాత్మ ద్వారా,మన పాపాల నుండి మనలను రక్షించిన ప్రభువు ద్వారా మనం ఇతరులతో సాత్వికంగా వుండగలం. నా యెడల భయంకరమైన తప్పు చేసిన వానిని క్షమించి,మనస్సులోని వినయంతో అతని యెడల ప్రవర్తించడమే నిజమైన వినయం. మనసులో ద్వేషం వుంచుకొని పైకి వినయాన్ని నటించడం నిజమైన వినయం కాదు. వినయం,క్షమాపణ గల హ్రుదయం క్రొత్తగా జన్మించిన క్రైస్తవుని ఆంతర్య నీతి.
 ప్రజలు మనకు చెడు చేసినా మనం సాత్వికంగా వుండాలి. వారు సువార్తకు ఆటంకం కలిగించనంత కాలం మనం ప్రతి ఒక్కరితోను సాత్వికంగానే వుండాలి. వారు ఆటంకం కలిగిస్తే సత్యమనే వెలుగు ద్వారా సాత్వికమనే వెలుగును ఆ ఆటంకం స్థానంలో నింపాలి. సాత్వికాన్ని దేవుని వాక్యంలోనే కనుగొనగలం. కనుక దానిని ఆటంకపరిచే వారితోను,దాని గూర్చి అపకీర్తి కలిగించేవారితో సాత్వికంగా వ్యవహరించనవసరంలేదు.
 తనను వ్యతిరేకించే వారిని దేవుడు క్షమించడు. అందుకు వారు మూల్యం చెల్లించేట్లు చేస్తాడు. అబ్రాహాముతో దేవుడు యిలా చెప్పాడు,‘‘నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను;నిన్ను దూషించువాని శపించెదను;’’ అని. (ఆది 12:3). సత్య సువార్తను ఆటంకపరిచే వారికి రక్షణపొందే మార్గమే లేదు. వారికే గాక వారి మూడు తరాల వారి నాశనాన్ని వారు తప్పించుకోలేరు.
 మనం సహనంతోను,వినయంతోను ఎందుకు వుండాలో తీతు 3:3 యిలా వివరిస్తోంది. ‘‘మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానావిధములైన దురాశలకును భోగములకును దాసులమునై వుండి ....... ఒకని నొకడు ద్వేషించుచు ఉంటిమి’’,మనం క్రొత్తగా జన్మించక ముందు మనం వారిలాగే వున్నాం. కనుక వారి యెడల సహనం కలిగి,వారిని క్షమించాలి.
 మన రక్షకుడైన దేవుని యొక్క దయయు,మానవుల యెడల ఆయన కున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక,తన కనికరముచొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను,పరిశుద్దాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. మనమాయన కృపవలన నీతిమంతులమని తీర్చబడి,నిత్యజీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్దాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మనమీద సమృద్దిగా కుమ్మరించెను. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వసముంచిన వారు సత్‌క్రియలను శ్రద్దగా చేయుటయందు మనస్సుంచునట్లు నీవీసంగతులనుగూర్చి ధృఢముగా చెప్పుచుండవలెనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుష్యులకు ప్రయోజన కరమైనవియునై యున్నవి’’అని వివరిస్తోంది తీతు 3-4:8
మనం మంచి పనులు చేసినందుననే దేవుడు మనలను మన పాపాల నుండి రక్షించలేదు. ఆయన మనలను ప్రేమించి,మన మీద కనికర పడినందున మనం క్రొత్తగా జన్మించే దీవెనను అనుగ్రహించాడు.మరోమాటలో చెప్పుకొంటే,యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి బాప్తీస్మాన్ని తీసుకొని,సిలువ మీద చనిపోయి,పునరుద్ధానుడై దాని వలన మన పాపాలను కడిగివేశాడు. పునరుత్ధానుడైన యేసు యిప్పుడు దేవుని కూడి పార్శ్యమున కూర్చొని వున్నాడు. మృతులలో నుండి లేచుట వలన ప్రపంచంలో అసంపూర్ణంగా వున్నవాటినన్నిటిని పరిపూర్ణం చేశాడు.
 మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు పరిశుద్దాత్మనిచ్చి మనలను ఆశీర్వదించాడు. మన పాపాలను క్షమించడానికి యేసుక్రీస్తు యోహానువలన బాప్తిస్మాన్ని పొందుటద్వారా వాటిని తన పైకి తీసుకొని సిలువ మీద చనిపోయాడు. అందువలన మనం రక్షణపొంది,నీతిమంతులమైనాం.
 నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమయ్యాం’’అని బైబిల్ అంటోంది. అంటేఆయన వారసులుగా ఆయన ఆస్తిని,ఘనతను వారసత్వంగా పొందామని అర్ధం. ఇలాంటి ధన్యమైన జీవితాన్ని జీవించాలంటే మనం సంపూర్ణ పరిశుద్దాత్మగల జీవితాన్ని జీవించాలి. నీటిమూలముగాను,ఆత్మమూలముగానైన సువార్తను నమ్మి మీ పాపక్షమాపణను పొంది ఇతరులకు సువార్తను ప్రకటించాలి.
 కాగా,పాపక్షమాపణ పొందిన వారిగా ఇతరులు మేలు కొరకు పనిచేస్తూ,ఈలోక చట్టాలను ఆచరిస్తూ,దేవుని కొరకు ఎదరు చూసే వారికి సువార్తను ప్రకటించాలి. మన యెడల చెడు చేసిన వారిని క్షమించి,వారు సువార్తకు ఆటంకం కలిగించకుండునట్లు వారి యెడల మంచితనాన్ని,వినయాన్ని ప్రదర్శించాలి. ఇవి మంచివియు,మనుష్యులకు ప్రయోజనకరమునై వున్నవి’’,నీవు సంపూర్ణ పరిశుద్దాత్మకొరకు ఆశపడుతూ వుంటే పౌలుమనతో చెప్పిన దానిని జ్ఞాపకం చేసుకో,ఇదేదో ప్రత్యేకమైన దానిలా అనిపించదు కాని ఇవి చాలా ప్రాముఖ్యమైన మాటలు.
 మనము ఈ లోకంలో జీవిస్తున్నాం గనుక ఈలోక సిద్దాంతాలకు అవిధేయులమైతే ఇతరులతో విరోధం వస్తుంది. పరిశుద్దాత్మ నింపుదలను పొందలేం. మనకు విశ్వాసం వున్నా మనం సంపూర్ణ పరిశుద్దాత్మ గల జీవితాన్ని జీవించాలనుకుంటే ఈ లోక చట్టానికి విధేయులమై మంచి పనులు చేస్తూ,పొరుగువారితో సామరస్యంగా జీవించడం మంచిది.
 

సంపూర్ణపరిశుద్దాత్మగల జీవితాన్నిజీవించాలనుకొంటున్నావా?

ఎఫెసి 5:8-11 యిలా వివరిస్తోంది. ‘‘మీరు పూర్వమందు చీకటియై యుంటిరి,ఇప్పుడైతే ప్రభువునందు వెలుగైవున్నారు. వెలుగు ఫలము సమస్తవిధములైన మంచితనము,నీతి,సత్యమను వాటిలో కనబడునున్నది. కనుక ప్రభువుకేది ప్రతీకరమైనదో దానిని పరీక్షించుచు,వెలుగు సంబంధులవలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలి వారైయుండక వాటిని ఖండించుడి.’’ మనం వెలుగు బిడ్డలుగా నడుస్తూ,ఆత్మఫలాలను ఫలించాలని ఈ భాగం చెబుతోంది.
 ఎఫెసి 5:12-13 యిలా చెబుతోంది,‘‘ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుటయైనను అవమానకరమై యున్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును; ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగే గదా’’,ప్రత్యక్షపరచబడినవన్నీ వెలుగు వల్లనే ప్రత్యక్షపరచబడ్డాయని పౌలు యిక్కడ వివరిస్తున్నాడు. ఒక నీతిమంతుడు నీతిగా జీవించలేకపోతే అతడు దేవుని వలన గాని,లేక తనంతటతానే బయ్పడతాడు. ఒక వ్యక్తి అంధకార క్రియలు చేస్తున్నట్లు కనుగొనబడి,వెలుగు చేత దూషించబడితే ఏం జరుగుతుంది,తన తప్పులన్నీ ఒప్పుకొని,దేవుని ఎదుర్కొన్నప్పుడు ఈతని హృదయం తేలిక అవుతుంది. ‘‘సమస్తమును ఖడింపబడి వెలుగు చేత ప్రత్యక్ష పరచబడును. ప్రత్యక్ష పరచునది ఏదో అది వెలుగే గదా,వెలుగు చేత ప్రత్యక్షపరచబడడం మంచిది. అప్పుడు మన అతిక్రమమును మనం ఒప్పుకొని దేవుని దగ్గరకు తిరిగి వస్తాం
 మనం నిజంగా సంపూర్ణ పరిశుద్దాత్మ గల జీవితంజీవించాలనుకొంటే మన హృదయాలలో దయాగుణం వుండాలి. ఒకరి హృదయంలో పాపంలేకుంటే అతడు దయగలిగి వుండనవసరం లేదని కాదు. మనం దయ,మంచితనం కలిగి వుండాలి. నీటి మూలముగాను ఆత్మ మూలముగానైన సువార్త తెలియని వారికి మనం వివేకంతో దానిని బోధించి,దానిని వారు అర్ధం చేసుకొని వారు పాపక్షమాపణ పొందునట్లు ప్రార్ధించాలి. ఇతరులకు కీడు చేయకూడదు. మనం తినడం,నిద్రించడం,సువార్త ప్రకారం జీవిస్తూ ఇతరులకు కూడా సేవ చేయాలి.
 సంపూర్ణ పరిశుద్దాత్మ జీవితం జీవించడమంటే సమయం యొక్క ప్రాముఖ్యతనుతెలుసుకొని, జ్ఞానులవలె సువార్త సేవ చేయడమని అర్ధం. మనం లోకాన్ని ప్రేమించినప్పుడు,అంధకార మోసానికి లోబడతామని,దేవుని పని చేయడంలో అశ్రద్ద చూపుతామని తెలుసుకోవాలి,కనుక దేవునిపై మన ధృష్టిని నిలిపి ఆయనకోరే దానిని చేయాలి. దేవుడనుగ్రహించిన రక్షణను నమ్ముచున్నప్పుడు అన్ని సమయాలను మనం జాగ్రత్తగా గమనించాలి. ఆత్మజ్ఞానం కలిగిన వ్యక్తి లోకం అంధకారమయం కాకముందే ఈ సత్య సువార్తను బోధించాలి.
 
 
దేవుని చిత్తాన్ని అర్ధం చేసుకొనుట

 దేవున్ని సంతృప్తి పరిచేదేదో దానిని మనం కనుగొనాలి. తన సంఘం,వాక్యం ద్వారా మనమేం చేయాలని ఆయన కోరుచున్నాడో మనం తెలుసుకోవాలి,ఆయన్ను సంతృప్తిపరచడానికి మనమేం చేయాలో తెలుసుకొని,మనలను గురించిన ఆయన చిత్తాన్ని స్పష్టంగా నిర్ణయించుకోవాలి.
తమ పాపక్షమాపణ పొందిన వారు,క్రొత్తగా జన్మించిన వారు. వారే తమలో పరిశుద్దాత్మను గలిగిన వారై వుంటారు. ఎవరైతే పరిశుద్దాత్మ కలిగివుంటారో వారు నిజమైన పవిత్రత కలిగి,దేవుని పిల్లలై వుంటారు.అలా సంపూర్ణత్మ గలవారై జీవించుట పరిశుద్దుల విధి. మనం యితరుల అవసరాలను పట్టించుకొనక మన కొరకే మన సమర్ధతను,శక్తులను వ్యర్ధం చేయకూడదు. కాల ప్రవాహంలో కొట్టుకుపోతూ మనం దేవుని కార్యాలకు ఆటంకం కలిగించకూడదు. 
 దేవునిప్రేమద్వారా మనం శుద్దీకరించబడి,పునరుజ్జీవాన్ని పొందివుంటే దేవుని పనిని కొనసాగించే మంచి వారిగా వుండాలి. దేవుని నమ్ముట ద్వారా మనం ఆయన పిల్లలమైతే మంచి వారమై వుండాలి.
 దేవుని బిడ్డల శరీరేచ్ఛలు పరిపూర్ణమైనవి కాకపోయినా దేవుని చిత్తము నెరిగి,మంచి పను చేస్తూ వుంటే అవి దేవుని సంతృప్తి పరుస్తాయి. క్రొత్తగా జన్మించిన వారై వుండి,ఇతరులకు కీడుచేస్తే తమ కొరకే జీవిస్తూ వుంటే వారు ‘‘మద్యముతో మత్తులై వుండకుడి,దానిలో దుర్వాపారము కదు. అయితే ఆత్మ పూర్ణలై వుండుడి’’(ఎఫెసి 5:18) అనే పౌలు మాటకు వ్యతిరేకం.
ఎఫెసి 5:19-21లో ‘‘ఒకని నొకడు కీర్తనలతోను,సంగీతములతోను,ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు,మీ హృదయములో ప్రభువును గూర్చి పాడుచు,కీర్తించుచు,మన ప్రభువైన యేసు క్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రియైన దేవునికి ఎ్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. క్రీస్తు నందలి భయముతో ఒకని కొకడు లోబడి వుండుడి’’ అని అన్నాడు పౌలు. మనం పరిపూర్ణ ఆత్మ గలిగి జీవించానులకొంటే మనం రక్షణ సువార్తను నమ్మి,దానిని గూర్చి బోధిస్తూ,దేవుడు మనకేం బయల్పరిచాడో దానిని తెలియజేయాలి.
 మనం ప్రార్ధించినప్పుడల్లా మనం ఏకస్వరంతో ఆయనను స్తుతించునట్లు ఈ 
దీవెననన్నింటినీ కీర్తనలలో,పాటలలో,ఆధ్యాత్మిక గీతాలలో నమోదు చేశాడు. మనం ఆయనను పొగడుతూ,కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ,ఆయనను స్తుతించాలి,ఇంకా రక్షణ పొందని వారి కొరకు,ఒకరికొకరం ప్రార్ధించు కొన్నప్పుడు పూర్ణాత్మగల ధన్యమైన జీవితాలను జీవించగలం. మన హృదయాంతరంగాలో దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ,మనలను రక్షించిన యేసుక్రీస్తును గౌరవించాలి. ఈ ఆలోచనతో మన తప్పును మనం ఒప్పుకోవాలి,మన పాపాలను శుద్దీకరించినందుకు అభివందనాలతో,ఆయనకు విధేయులం కావాలి,పరిపూర్ణాత్మగల జీవితం జీవించడమంటే అర్ధం అదే.
 

మన శేషజీవితమంతా సత్యసువార్త సేవ చేయాలి.

 మనం మంచి పనుల ప్రణాళిక వేసుకొని సత్యసువార్త మహిమ కొరకు వాటిని వినియోగించాలి,దేవుని సంఘంలో చేరి ప్రతి ఒక్కరి ఆత్మరక్షణ కొరకు కలసి దేవునికి మొర్రపెట్టాలి. చాలామంది దేవుని కొరకు ఎదురుచూస్తున్నా,వారికి సువార్త తెలియదు గనుక వారు క్రొత్తగా జన్మించలేదు. ‘‘దేవా,దయచేసి వారిని రక్షించు’’అని మనం వారికొరకు దేవునికి ప్రార్ధించాలి. తప్పిపోయిన వారిని రక్షించే సువార్త కొరకు మన,ఎఫెసి (6:13-17).ఆస్తులను యివ్వాలి. ఇతరు ఆత్మ రక్షణార్ధం దేవుని రాజ్య విస్తరణ కొరకు జీవించడమే మంచి పనులు చేయడమంటే.
సంపూర్ణ ఆత్మ నింపుదల గల జీవితం జీవించడమంటే యేసు క్రీస్తును మహిమపరచడమే.
 సంపూర్ణ ఆత్మ నింపుదల గల జీవితం జీవించడమంటే యేసుక్రీస్తు ఆజ్ఞలను పాటించడమని అర్ధం. ఎఫెసి 6:10-13 చదివి దీని అర్ధం తెలుసుకొందాం. ‘‘తుదకు ప్రభువుయొక్క మహాశక్తిని బట్టి ఆయనయందు బలవంతులై యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును దరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునదిశరరులతోకాదు,గాని ప్రధానులతోను,అధికారులతోను,ప్రస్తుత అంధకారసంబంధులగు లోక నాధులతోను,ఆకాశమండలమందున్న దురాత్మలసమూహ ములతోను పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును,సమస్తము నెరవేర్చినవారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి’’,
 సంపూర్ణ ఆత్మ నింపుదల గల జీవితం జీవించడమంటే ప్రభువులో నమ్మకంతో,ఆయనశక్తిలోవిశ్వాసంలో స్ధిరంగా వుండడమని. మన యిష్ట ప్రకారం గాక,మనలోని ఆత్మ శక్తి ప్రకారం జీవించడం అని అర్ధం. ఇంకా ప్రార్ధనా జీవితం జీవించడమని కూడా అర్ధం. ప్రార్ధన చేయడం ద్వారా వివిధ రకాలైన సమర్ధతలు,దేవుడు అనుగ్రహించు దీవెనలు పొంది బలమైన జీవితం జీవించాలి. ఇలాంటి జీవితం జీవించడమంటే దేవుని సర్వాంగ కవచమును ధరించుట అని అర్ధం మనం దేవునితో నడవడానికి ప్రయత్నించినా దేవుని సేవించడానికి,ఆయనకు విధేయులమవడానికి మనమెంతో బలహీనులం,గనుక మనం ఆయనను కలిగివుండకపోతే ఆత్మ నింపుదల గల జీవితాన్ని జీవించలేము.
మన ఆత్మ శక్తిని పెంపొందించుకోవాలంటే దేవుని వాక్యంలో నమ్మకం కలిగి వుండాలి. మనకు విశ్వాసం వున్న‘‘దేవునికి వాక్యంలో రాసివున్నట్లు జరుగుతుందని నాకు తెలుసు’’అని చెబుతూ దేవుని సర్వాగ కవచాన్ని ధరించుకోవాలి.
 ఇలాంటి జీవితం గడపడంలో మీకెవరికైన సమస్యలుంటే లేఖనంలో మాటలు జ్ఞాపకంచేసుకొని,దేవుని సర్వాంగకవచాన్నిధరించుకొండనిదేవుడుచెబుతున్నాడు.ఈమాటలనుమీహృదయాంతరంగంలోనికితీసుకుంటే దేవుని సర్వాంగ కవచాన్ని ధరించడమంటే ఏమిటో మీరు తెలుసుకొంటారు. మన పరిసరం,ఇతయి ఏమనుకొన్నా మనం దేవుని వాక్యాన్ని పట్టుకొని వుండడం ద్వారా అలా మనం ఆత్మ నింపుదల గల జీవితాన్ని గడపగలం.
ఈ నమ్మకం మనమెక్కడ పొందగలం,ప్రకటన 3:22 యిలా వివరిస్తోంది?‘‘సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక.’’,ఆత్మ సంఘాలతో చెప్పు మాటను మనం వినాలి. ఎవరి ద్వారా పరిశుద్దాత్మ మాట్లాడతాడు,దేవుడు పరిశుద్దులతోను,ఆయన సంఘంలోని సేవకుల ద్వారా ప్రజలందరితో దేవుడు మాటలాడతాడు.
 అనగా దేవుని సంఘబోధలు దేవుని వాక్యాధారమైనవైవుంటాయి. గనుక మీరువాటినివినాలి అని మనసులో ఈ విశ్వాసంతో సంఘబోధనను మీరు అంగీకరించాలి. భోధకునిలో పరిశుద్దాత్మ లేకుంటే అతని స్వంత ఆలోచను బోధించే అవకాశం వుంది. ఒకవేళ బోధకుడు బైబిల్ ఆధారం లేని మాటలు బోధిస్తే పరిశుద్దాత్మ అతనిలో వుంటాడు గనుక అలాంటి మాటు మాట్లాడకుండా అతన్ని ఆపివేస్తాడు.
 పరిశుద్దాత్మ దేవుడే,దేవుని సేవకునిలో దేవుడు నివసిస్తాడు గనుక అతని అధికారం ఎంతో గొప్పది. యేసు పేతురుతో ‘‘పరలోకరాజ్యముయొక్క తాళపు చెవులు నీకిచ్చెదను,’’అని అన్నాడు (మత్తయి 16:19) నీటి మూలముగాను,ఆత్మమూలముగానైన సువార్త పరలోక రాజ్యపు తాళం చెవులు. అనగా పరలోక రాజ్యప్రవేశానికి సువార్తే తాళపుచెవి. పేతురుకే గాక,ప్రతి దేవుని సేవకుడు,పరిశుద్దుందరికి వారు క్రొత్తగా జన్మించి,వారిలో పరిశుద్దాత్మ వున్నంతకాలం దేవుని వాక్యాన్ని బోధించు అధికారాన్ని దేవుడు అనుగ్రహించాడు.
 సంపూర్ణ ఆత్మ నింపుదల గల జీవితం కొరకు మనం దేవుని సర్వాంగ కవచాన్ని ధరించాలి. మనలో విశ్వాసం లేకపోతే,సంఘబోధను మనసులో వుంచుకొని,సంఘ అధికారాన్ని దేవుని సేవకులఅధికారాన్ని నమ్మి అనుదినం వాటిని అనుసరించాలి. ఇప్పుడు నీవు వింటున్న ప్రసంగం నీ జీవితానికి నేరుగా సంబంధించకపోయినా,వుపయోగం లేకపోయినా,దానిని నీ హృదయంలో భద్రపరచుకో. నీ అనుదిన జీవితానికి అవసరమైన బైబిల్ వాక్యాలను తెలుసుకొని,వాటిని నమ్మి వాటి ప్రకారం జీవించు. అలా నీవు విశ్వాసం గల వాడవుతావు. అప్పుడు ఆత్మ నింపుదల గల జీవితాన్ని జీవించగలుగుతావు. దేవునితో నడుస్తావు. ఈ లోక అంధకార శక్తులైన అధిపతులు,అధికారులపై విజయాన్ని పొందుతావు.
 ఈ లోకాధికారులకు మీరు విధేయులై వుండాలని చెప్పాడు,ఇప్పుడు ఈ లోక అంధకార అధికారులతో పోరాడమని చెబుతున్నందుకు మీరు కలవరపడవచ్చు. రోమా ప్రభుత్వ కాలంలో ఈ చక్రవర్తి తానే దేవుణ్ణని ప్రకటించుకొని ప్రజలందరు తనను దేవునిగా కొలవాలని చట్టం చేశాడు. ఇది దేవుని వాక్యానికి వ్యతిరేకం గనుక క్రైస్తవులాపని చేయలేరు. ఆ కాలంలో ప్రజందరును మోకరించి పూజించాలన్నాడు గనుక చక్రవర్తితో పోరాడడం తప్ప క్రైస్తవులకు మరోమార్గంలేకపోయింది.
 అపవాదితో జరిగే పోరాటంలో మనం జయించాంటే మనం దేవుని వాక్యాన్ని పట్టుకొని,దానిలో నమ్మకం కలిగి వుండాలి. మనం దేవుని వాక్య ప్రకారం జీవిస్తూ వుంటే ఆయన దీవెన పొంది,సాతానునుకొట్టాలి,మనం రక్షణ పొందిన వారమైనా దేవుని వాక్యాన్ని పట్టుకొని వుండకపోతే సాతానుతో చేసే యుద్దంలో మనం ఓడిపోతాం.‘‘మీవిరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు.’’,అని దేవుడు మనలను జాగ్రత్తగా వుండమని చెబుతున్నాడు (1 పేతురు 5:8) దేవుని వాక్యాన్ని నమ్మని వ్యక్తిపై సాతాను సులభంగా దాడి చేస్తాడు.
 ‘‘ఆ వాక్యాలు సరైనవే కాని వాటిని నేను పూర్తిగా నమ్మలేను’’అని అనకూడదు. ‘‘రాసి వున్న ప్రతిదీ నిజంగా నెరవేరుతుంది’’అని వాటిని పట్టుకొని వుండాలి. ఇదే సరైన విశ్వాసంమనం దేవుని సర్వాంగ కవచం ధరించగలిగేట్టు చేస్తుంది’’‘‘మన ప్రభువు చెప్పినట్టే ప్రతిదీ జరిగినది’’అని చెప్పేవారు ధన్యులు. ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని పట్టుకొని దానిమీద ఆధారపడి వుంటేఅతనివిశ్వాసాన్నిపరిస్ధితులుఅనుకూలంగా మారతాయి. ఒకవేళ అపవాది మనలను శోధించడానికి ప్రయత్నించినా మనం ‘‘నేను దేవుని వాక్యాన్ని నమ్ముచున్నాను ఆయన వాక్యమే సరైన జవాబని నమ్ముచున్నాను’’అని చెబితే అతడు పారిపోతాడు. ఈ విధంగా సాతానును జయించవచ్చు.
 
 
మనం దేవుని వాక్యాన్ని కలిగివుండాలి.

 ‘‘అందుచేతనుమీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును,సమస్తము నెరవేర్చినవారై నిలువ బడుటకును శక్తిమంతులగునట్లు,దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను మైమరపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్తవలనైన జోడుతొడుగుకొని నిలవబడుడి. ఇవన్నియుగాక విశ్వాసమను డాలు పట్టు కొనుడి,దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును,దేవుని వాక్యమను ఆత్మఖడ్గమును ధరించుకొనుడి’’(ఎఫెసి 6:13-17)
 ఈ భాగంలో ‘‘మీనడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నిలువబడుడి’’అన్న మాట ఒక వ్యక్తి నడికట్టుతో పోల్చబడ్డాయి. అంటే దేవుని వాక్యంతో మన మనస్సును కట్టుకోవాలి. మనం మనసు దేవునితో ఒకటిగా వుండునట్లు సత్యవాక్యాన్ని అనుసరించాని పౌలు చెబుతున్నాడు. ఈ దట్టి ఎంత గట్టిగా వుంటే దేవుని వాక్యంతో అంత గట్టిగా దాడిచేయవచ్చు. మన మనస్సులో దేవునితో ఒకటిగా వుంటే మనం సహజంగా నమ్మగలిగి ‘‘దేవుడు చెప్పిన ప్రతిదీ మేలునే చేస్తుందని నేను నమ్ముచున్నాను’’ని చెప్పగలం.
 తర్వాత మనం నీతియను మైమరుపు తొడుగుకొనాలి. అంటే దేవుడు మనలను రక్షించాడు అని చెప్పే నీటి మూలముగాను,ఆత్మమూలముగానైన సువార్తను మైమరుపు తొడుక్కోవాలి. విలువైన ఆభరణాలు గల మైమరుపును ధరించాలి. దేవుడు మనపాపాలన్నింటిని క్షమించాడన్న నమ్మకంతో దానిని ధరించాలి. మన హృదయపూర్వకంగా దేవుని వాక్యాన్ని నమ్మాలి. సమాధానమిచ్చే రక్షణ సువార్తను బోధించాలి. 
 పై వాక్యాలన్నింటిని పట్టుకొని సమాధాన సువార్త అను సిద్దమనస్సను జోడుతొడుక్కొని అందరికీ దేవుని సమాధానమునిచ్చే రక్షణ సువార్తను ప్రకటించాలి. మన పాపాముల నుండి మనం రక్షణ పొందితే మన నమ్మకాన్ని నోటితో ఒప్పుకొంటాము. మన పాపం,చెడు బయ్పరచినప్పుడల్లా దేవుడు వాటిని యిప్పటికేక్షమించాడని వాటిని నెమరువేయకుండా తుడిచివేయాలి. యేసు బాప్తిస్మం,ఆయన సిలువ రక్తంతో ఆయన అలాగే చేశాడు. ఎవరైతే వారి పాపాల నుండి విముక్తి పొందలేదో వారికి సమాధానమును అనుగ్రహించు నీటి మూలముగాను,ఆత్మ మూలముగానైన సువార్తను మనం బోధించాలి.
 అన్నిటికంటే విశ్వాసమను డాలుతో దుష్టునితో పోరాడాలి. సాతాను మనపై దాడి చేసినప్పుడు విశ్వాసమను డాలును ఒక చేతితో,సత్య వాక్యాన్ని మరోచేత ధరించి అతని తరిమివేయాలి.
తర్వాత మనం రక్షణ అను శిరస్త్రాణమును ధరించాలి. ‘‘నీటి మూలముగాను,ఆత్మమూలముగానైన సువార్త ద్వారా నేను నా పాపాలన్నింటి నుండి రక్షణ పొందాను. ఈ విధంగా దేవుడు నా పాపాలను క్షమించాడు అని చెబుతూ రక్షణ వాక్యాన్ని ఒప్పుకోవాలి. దేవుని వాక్యాన్ని రక్షణ శారస్త్రాణాన్ని వాక్యమనే ఖడ్గాన్ని మన ఆయుధాలుగా సాతానుపై వాడాలి.
 సాతాను మనపై దాడిచేస్తే మన ఖడ్గాన్ని దూసి అతణ్ణి పడగొట్టాలి. ‘‘దేవుడేమి చేయమని చెప్పాడు. నేను దానిని నమ్మాను. అదలాగే జరిగింది’’,దేవుని మాటలో విశ్వాసంతో మనం సాతానును తరిమివేయగలం. దేవుని వాక్యంలో నీకు నమ్మకం వుంటే నీ ఆత్మ ఖడ్గాన్ని దూసినప్పుడు సాతాను ‘‘అమ్మో,అదెంతో బాధపెడుతుంది’’అని పారిపోతాడు. మనకు దేవుని వాక్యంలో నమ్మకం వుంటే సాతాను చేసే ఎలాంటి దాడినైనా ఓడిరచగలం.
 నా శరీరం అసంపూర్ణమైనది. కానీ నేను పాపవిమోచన పొందిన దేవుని వ్యక్తిని,దేవుడు నాతో చెప్పిన మాటలతో విశ్వాసంతో నేను జీవిస్తాను’’,అని ఒప్పుకొని అలాంటి మత జీవితాన్ని జీవించగలవు. ఈలాంటి విశ్వాసంతో మనం జీవిస్తూ వుంటే మన విశ్వాస జీవితాలను భంగ పరచడానికి శోధించడానికి వచ్చే సాతానును సత్యమనే ఖడ్గంతో తరిమి వేయగలం. ఈ లోకపు మాటలతో మనం పోరాడితే సాతాను జంకను కూడా జంకడు. దేవుడు యిలా చెప్పాడు’’ అనే మాటతో మనం సాతానుతో పోరాడితే దేవుని వాక్యధికారం ముందు సాతాను లొంగిపోతాడు.
మనం సంపూర్ణ పరిశుద్దాత్మ నింపుదలతో జీవించాలనుకొంటే సంఘం,పరిశుద్దులు,దేవుని సేవకులందరూ తాము సువార్తను బోధించుటకు పూనుకోవాలి, దేవుని ప్రార్ధించాలి. ప్రతి ఆత్మ పాపక్షమాపణ ఎంత అవసరమో అలాగే పరిశుద్దులందరూ సంపూర్ణ పరిశుద్దాత్మ నింపుదల గల జీవితాన్ని జీవించాలి. ఇది దేవుని ఆజ్ఞ.
తమ పాపాలకు క్షమాపణ పొందిన వారు విశ్వృాస జీవితం ఎలా గడపాలో తెలియకపోతే వారు పరిశుద్దాత్మ నింపుద గ జీవితాన్ని గడపడమెలాగో తొసుకోవాని దేవుడు కోరుతున్నాడు. పరిశుద్దాత్మ నింపుద గ జీవితం మంచి పను చేస్తూ సువార్తను ప్రకటించేట్టు పరిశుద్దను ప్రోత్సహిస్తుంది. సువార్తను బోధించడాన్ని వారు ప్రేమిస్తారు. ప్రార్ధన చేస్తారు దేవుని వాక్యాను నమ్మి వాటికి కట్టుబడి వుంటారు. మనం రక్షణ అనుశిరస్త్రాణాన్ని,నీతియను మైమరువును ధరించి ,నేనెప్పుడూ నీతిమంతుడనే,అని చెప్పి సాతానును తరిమి వేయాలి.
 పరిశుద్దులు,పరిశుద్దాత్మ నివాసం గల వారు గనుక వారు ఆత్మలో నడుస్తూ పరిశుద్దాత్మ శక్తిని పొందగరు. వారు ప్రార్ధనా విశ్వాసాన్ని సంపాదించి దేవుని దీవెనతో ఆయన పనిని చేస్తుంటారు.. వారు సాతానును ఓడిరచి,దేవుని ముందు నిలిచేంత వరకు ఆగ్మలో నడవాలి. దేవుని సర్వాంగ కవచాన్ని ధరించి,పరిశుద్దాత్మ నింపుద గ జీవితాన్ని జీవించేవారే క్రొత్తగా జన్మించిన క్రైస్తవులు.
 “ఏయనగా మనము పోరాడునది శరీరుతో కాదు గాని ప్రధానుతోను,అధికారుతోను,ప్రస్తుత అంధకార సంబంధుగు లోకనాధుతోను,ఆకాశమండ మందున్న దార్మాత సమూహముతోను పోరాడుచున్నాము”(ఎఫెసి 6:12). క్రొత్తగా జన్మించిన వారి పోరాటం,రక్త మాంసముతో పోరాటం కాదు,ఆత్మ నింపుద వారి పోరాటం. అంధకార సంబంధమైన దురాత్మ,సమూహాతోను,మన విశ్వాస జీవితాను ఆటంకపరిచే వారితోను,సువార్త సేవ చేయక మనను ఆటంక పరిచేవారితో.
 దేవుని సువార్త కొరకు పోరాడడానికి మనం బయటకు వెళ్ళునప్పుడు శిరస్త్రాణాన్ని,ఆత్మ కవచాన్ని ధరించి వెళ్ళాలి. ఈ పోరాటంలో మనం సాధారణ దుస్తు ధరిస్తే గాయపడతాం. అందుకని మనం దేవుని సర్వాంగ కవచాన్ని ధరించాలి. పోరాటంలో విజయాన్ని సాధించడానికి ముందు సంపూర్ణంగా సిద్దపడాలి. మనకు ఖడ్గాు,డాళ్ళు,శిరస్త్రాణాు కావాలి. మైమరుపును ధరించాలి,నడుమునకు దట్టి కట్టుకోవాలి. రెండు కాళ్ళకు జోళ్ళు తోడుక్కోవాలి. అప్పుడు రెండు చేతులో ఖడ్గండాలు, ధరించి మన శత్రువును ఓడిరచాలి. ఇదే పరిశుద్దాత్మ నింపుదల గల జీవితం.
 

సత్య సువార్తను మనం అనుసరించాలి.

 ‘‘నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్ధమును మనలో నివసించు పరిశుద్దాత్మవలన కాపాడుము.’’అనిచెప్పాడుపౌలు(2తిమోతి1:14)మన పాపాలననుండి మనలనురక్షించిన నీటిమూలము గాను, ఆత్మమూలముగానైన సువార్తే మంచి హామి. తీతు 3:5 యిలా వివరిస్తోంది,‘‘...పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను,పరిశుద్దాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను.’’.మన మీలోకంలో చేసిన పాపాన్నింటిని మన ప్రభువు సిలువ మీద చనిపోయి,పునరుత్ధానుడగుట ద్వారా కడిగివేశాడు. మన మీ సత్య సువార్తను అనుసరించాలి. మనం రక్షణ అను శిరస్త్రాణాన్ని నీతియను మైమరుపును ధరించాలి. సత్యమును దట్టిని నడుముకు కట్టుకోవాలి. నీటిమూలముగాను,ఆత్మ మూలముగానైన సువార్తను మనం నమ్మాలి.
 ఇలా మనం సర్వాంగ కవచాన్ని ధరించి సాతానుతో పోరాటంలో విజయాన్ని పొందాలి. అప్పుడే ఆ విజయాన్ని సాధించి,దానిని యితరులతో పంచుకోగలం. మనం మన స్వాస్థ్యమైన దేవుని రాజ్యంలో ప్రవేశించగలం’’ఈరోజు వరకు మనం సాతానుతో అనేక ఆధ్యాత్మిక యుద్దాలను చేయాలి. అతని నుండి అనేక ధ్వజాలను తీసి వేయాలి. మన వ్యతిరేకితో చేసే పోరాటంలో ఎన్ని ఎక్కువ విజయాలు సాదిస్తే ఆ తర్వాత పోరాటం అంత సులభం అవుతుంది. మనమందరం దేవుని రాజ్యభివృద్ది కొరకు,దాని విస్తరణ కొరకు ప్రార్ధించినప్పుడు,ఆత్మ నింపుదల గల జీవితాన్ని పొందగలం. 
 మన పాపాలకు క్షమాపణ పొందడంతో తృప్తి పడక,ఆత్మ నింపుదల గల జీవితాన్ని జీవించాలి. సువార్త కొరకు,మన మంచిపనుల కొరకు దేవుని వాక్యాన్ని నమ్మాలి. సాతానుతో పోరాటంలో ఓడిపోయి నాశనం కాకుండునట్లు పరిశుద్దాత్మ ద్వారా నడిపించబడుతూ,దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ,దానిలో నమ్మకం కలిగి వుండాలి. 
 నా మాటలు మీరు అర్ధం చేసుకున్నారా? అర్ధం చేసుకో గలిగినప్పుడే పరిశుద్దాత్మ నింపుదల గల జీవితాన్ని కలిగి వుండగలరు. నీటిమూలముగాను,ఆత్మమూలముగానైన సువార్త సేవ మీరు చేస్తారని,దేవునిపై ఆధారపడి,ఆయన వాక్యానుసారం జీవిస్తారని నమ్ముతున్నాను. సాతాను నుండి ఆత్మ రక్షణ పనిని మనమందరం చేస్తూ ప్రభువు వచ్చు వరకు ఆత్మనింపుదల జీవితాన్ని నడుపుదాం. పరిశుద్దాత్మ నింపుదలను పొందాలన్నది దేవుడు మనకిచ్చిన రెండో ఆజ్ఞ. అందుకాయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. మన హృదయంలోని పాపాలను తీసివేసినందుకు మనలో నివసించు పరిశుద్దాత్మను మనం పొందాలి. నాలో నివసించు పరిశుద్దాత్మ కొరకు కాకపోతే ఆత్మనింపుదల గల జీవితాన్ని మొదలు పెట్టే వాణ్ణే కాదు. ఆత్మ నింపుదల గల జీవితాలను మనకిచ్చినందుకు దేవునికి వందనాలు.నీలో పరిశుద్దాత్మ నివసిస్తున్నాడని నీవు నమ్ముతున్నావా,ఎవరైతే తమ పాప క్షమాపణ పొందారో వారిలో పరిశుద్దాత్మ నివసిస్తున్నాడు పాపా క్షమాపణ లేని వారిలో పరిశుద్దాత్మ వుండడు. నీటి మూలముగాను,ఆత్మ మూలముగానైన సువార్త తెలియని వారిలోను,దానిని నమ్మని వారిలో పరిశుద్దాత్మ నివాసం వుండడు. తమలో పరిశుద్దాత్మ లేని వారందరు నరకాగ్నిలో పడవేయబడతారు.
 మన హృదయంలో పాపం లేదు గనుక మనలో నివసించు పరిశుద్దాత్మను మనం కలిగి వున్నాం. పరిశుద్దాత్మ నివాసం గల మనం పరిశుద్దాత్మ నింపుదల పొందడానికి ఆత్మ కోర్కెకు మనం విధేయులం కావాలి. మన మెంతగా విధేయులమైతే సర్వాంగ కవచం ధరించిన వీరుడంత బలమైన విశ్వాసాన్ని మనం పొందగలం. ఆత్మకు విధేయులం కాకపోతే మన సర్వాంగ కవచాన్ని తీసివేసినట్టే.
పరిశుద్దాత్మ మాటలో పెరిగి విశ్వాసం గల వ్యక్తిగా ఎదుగుదాం. ‘‘కాగా వినుట వలన విశ్వాసము కలుగును;వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును.’’(రోమా 10:17) అని దేవుడు చెబుతున్నాడు గనుక మనం పరిశుద్దాత్మ మాటలు విన్నప్పుడు మనలో విశ్వాసం అభివృద్ది చెందుతుంది. అప్పుడు సాతాను మనపైదండెత్తినా దేవుని మాటలోని విశ్వాసం మనలను కాపాడుతుంది. నీటిమూలముగాను,ఆత్మమూలముగానైన సువార్తను నమ్మి విశ్వాస కవచాన్ని ధరించిన వారిపై సాతను దండెత్తలేడు. విశ్వాసం గలవారు సాతాను దాడులను తిప్పికొట్టగల శక్తి కలిగి వుంటారు.
 పరిశుద్దాత్మ నింపుదల గల జీవితమంటే నీటి మూలముగాను,ఆత్మమూలముగానైన సువార్తను నమ్మకంగా ప్రపంచమంతా చాటించడమని అలాంటి జీవితమే పరిశుద్దాత్మ నింపుదల గల జీవితం.