(యోహాను 16:5-11)
‘‘ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుచున్నాను. నీవు ఎక్కడికి వెళుచున్నావని మీలో ఎవడును నన్నడుగుట లేదు గాని నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దు:ఖముతో నిండియున్నది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుటవలన మీకు ప్రయోజనకరము; నేను వెళ్ళనియెడల ఆదరణకర్త మీయొద్దకు రాడు; నేను వెళ్ళినయెడల ఆయనను మీ యొద్ద ఆయన వచ్చి, పాపమును గూర్చియు నీతిని గూర్చియుతీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనచేయును. లోకులు నాయందు విశ్వసముంచలేదు గనుక పాపమును గూర్చియు,నేను తండ్రి యొద్దకు వెళ్ళుటవలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు, ఈ లోకాధికారి తీర్పుపొంది యున్నాడు గనుక తీర్పునుగూర్చియు ఒప్పుకొనజేయును.’’
పరిశుద్దాత్మ క్రియలేవి?
ఆయన లోక పాపమును, నీతిని, తీర్పును ఒప్పుకొనచేస్తాడు.
అది 1:2 యిలా వివరిస్తోంది,‘‘భూమి నిరాకారముగాను,శూన్యముగాను వుండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను.’’.కలవరం,పాపం వున్న హృదయాలలో గాక సత్యసువార్తను నమ్మే వారి హృదయాలలో మాత్రమే పరిశుద్దాత్మ నివసిస్తాడని ఈ భాగంలో మనం చూస్తాం. అయినప్పటికీ,వారు కలవరపాటుతోను,హృదయ శూన్యతతో వున్నా,తమ హృదయాలలో పాపం వున్నా పరిశుద్దాత్మను పొందాలన్న కోర్కెతో మూఢభక్తి గల విశ్వాస ప్రభావానికి లోనవుతారు చాలా మంది.
మూఢభక్తి పారవశ్యంతో పొందిన ఆత్మ నిజమైన ఆత్మకాదు. సాతాను క్రియలు నియమాలు లేని మూఢభక్తిగలవారిమీదవుంటుంది.మూఢభక్తిగలవారుసాతానుకుతంత్రాలకు,శక్తికిసులభంగాప్రభావితువుతారు. కానీ,పరిశుద్దాత్మ వివేకం,నిర్ధిష్టమైన వుద్దేశం గల దేవుని వ్యక్తి. ఈ లోకాన్ని సృజించడానికి పరిశుద్దాత్మ తండ్రియైన దేవునితోను,ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోను కలసి పనిచేశాడు. ఇప్పుడీ లోకంలో పరిశుద్దాత్మ ఎలాంటి పని చేయాలో తెలుసుకొందాం.
లోకం పాప భూయిష్టమైనదని పరిశుద్దాత్మ నేరస్ధాపన చేస్తాడు.
లోకంలో పాపంతో వున్నదని పరిశుద్దాత్మ మొదట ఎవరైతే యోహానువలన యేసుబాప్తిస్మాన్ని,ఆయన సిలువరక్తాన్ని అంగీకరించరో వారిని నేరస్థులుగా చేస్తాడు.ఆయన పాపాత్ములనందరిని,నీటిమూలముగాను,ఆత్మమూలముగానైన సత్యసువార్తను నమ్మనివారిని నేరస్థులని నిర్ణయిస్తాడు.
దేవుని నీతినిబట్టి లోకంమీద తప్పు మోపుతాడు.
పరిశుద్దాత్మ చేసే రెండో పని,దేవుని నీతికి,పాపాత్ములను వారి పాపాల నుండి యేసు రక్షిస్తాడు అన్నదానికి సాక్షిగా వుంటాడు. యోహాను 16:10 యిలా చెబుతోంది. ‘‘నీతిని గూర్చి ..... నేను తండ్రియొద్దకు వెళ్ళుటవలన మీరిక నన్ను చూడరు’’.దేవుని నీతి అంటే బైబిల్ వుద్దేశమేమిటో మనం తెలుసుకోవాలి. యోహానువలన బాప్తిస్మంతో యేసు లోక పాపానన్నింటిని మీదకి తీసుకొన్నాడని,ఆయనలో నమ్మకముంచిన వారందరూ దేవుని కృప ద్వారా నీతిమంతువుతారన్నది బైబిల్ వుద్దేశం. యేసు యోహాను బాప్తిస్మంవలన లోకపాపాలన్నీ తనవిగా అంగీకరించి,వాటికి ప్రతిగా సిలువ మీద తన రక్తాన్ని చిందించి,పునరుత్ధానుడై పాపాత్ములందరి రక్షకుడైనాడు. దేవుడు మనకిచ్చిన సత్యసువార్త యిదే. దేవుని చిత్త ప్రకారం యేసు నీటిద్వారా రక్తంద్వారా లోకపాపాలను తీసివేసి మన జీవితాలకు యజమాని అయినాడు.
యేసు బాప్తిస్మం,సిలువ మీది రక్తమనే సువార్తనుప్రజలు నమ్మునట్లు,వారి పాపాలకు క్షమాపణ పొందడానికి పరిశుద్దాత్మ సహాయం చేస్తాడు. త్రిత్వంలోని దేవుని కార్యాలు స్తుతిని తెలియచేస్తున్నాయని మీరు తెలుసుకోవాలి. పరిశుద్దాత్మ సత్యసువార్త కొరకు పనిచేస్తూ,ప్రజలు దేవునిప్రేమను నమ్మునట్లు చేస్తాడు. నీటిమూలముగాను,ఆత్మమూలముగానైన సువార్తకూడాసత్యమైనదని ఆయనహామీయిస్తాడు
లోకమునకు తీర్పు వున్నదని చెబుతాడు.
పరిశుద్దాత్మ మూడో పని,సాతాను పనులను నాశనం చేయడం. “మీరు యేసును నమ్మవచ్చు కానీ క్రైస్తవ్యం లోకంలోని అనేక మతాలో ఒకటి అనే నమ్ము” అని ప్రజలలో ఆలోచన కలిగిస్తాడు సాతాను. ప్రజలు యేసును నమ్మినా,వారు యేసుబాప్తిస్మాన్ని,సిలువమీద ఆయన కార్చిన రక్తాన్నినమ్మి తాము పాపక్షమాపణ పొందకుండా ఆటంకాలుకలిగించడానికి ప్రయత్నిస్తూవుంటాడు సాతాను. సాతాను క్రైస్తవ్యాన్ని ‘‘సామాన్య” మతంగా తగ్గించాడు. గనుక చాలా మంది సాతాను మోసానికి లోనైనారు. మంచి వారు మాత్రమే యేసును నమ్మగలుగుతారు. యేసులో నమ్మకముంచడంలోని వుద్దేశం వారు నీతిమంతులుగా క్రొత్తగా జన్మించాలన్నదీ.
అసత్యమైన విశ్వాసం మీలో వుండకూడదు. మీరు యేసునెంతగా నమ్మినా మీలోని అసత్యవిశ్వాసం మిమ్మును శుద్దీకరించబడేవారినిగా చేయదు. మీలో అసత్య విశ్వాసముంటే,సాతాను అబద్దాల వలన మీరు యేసును స్పష్టంగా చూడలేరు. తెలుసుకోలేరు. నీటిమూలముగాను,ఆత్మమూలముగానైన సువార్తను నమ్మి రక్షణ పొందిన వారి రక్షణకు పరిశుద్దాత్మ హామీగా వుంటాడు. తమలో పాపం గల వారి నమ్మకాలన్నీ నిష్ప్రయోజనమైనవే.
సువార్తసత్యాన్నిగూర్చి పరిశుద్దాత్మ సాక్ష్యమిస్తాడు.లోక పాపాలను తీసివేయడానికియేసుబాప్తిస్మాన్ని తీసుకొన్నాడు. పాప మూల్యాన్ని చెల్లించడానికి యేసు బాప్తిస్మాన్మి తీసుకొన్నాడు. పాపమూల్యాన్ని చెల్లించడానికి ఆయన సిలువ వేయబడ్డాడు. పరిశుద్దాత్మ ఈ సత్యనికి సాక్ష్యంచెబుతున్నాడు.సత్య సువార్తను నమ్మి పాప క్షమాపణ పొందమనిఅందరికి సలహా యిస్తున్నాడు పరిశుద్దాత్మ. ఈ సత్యసువార్తనెవరైతే తమ హృదయాలలో స్వీకరించరో వారిపై పరిశుద్దాత్మ నేరస్ధాపన చేసి, వారికి తీర్పు తీరుస్తాడు.
ప్రతి ఒక్కరూ ధన్యకరమైన విశ్వాసాన్ని కలిగి వుండాలి.
ధన్యకరమైన విశ్వాసమంటే ఏమిటి?పాపక్షమాపణద్వారా మనలోనివసించు పరిశుద్దాత్మను పొందుటకు నడిపే విశ్వాసం. చాలాకాలంగా యేసుపై విశ్వాసం కలిగి వున్నా యింకా పాపమున్న వారినే ప్రపంచంలో అనేక మందిని చూస్తాం. వారెంతెక్కువగా యేసును నమ్ముతూవుంటారో అంతెక్కువ పాపాత్ములవుతూ వుంటారు. వారి పాపాల నుండి విడుదల పొందలేకపోవడానికి వారికున్న పెద్ద సమస్యేమిటంటే,అన్యభాషలో మాట్లాడడం,దర్శనాలు చూడ్డం వారి పరిశుద్దాత్మను పొందామనకోవడానికి ఋజువు అని వారు అనుకొంటున్నారు. వారి పాపాలకు రాబోయే దేవుని తీర్పును గూర్చి వారికి తెలియదు.
ఈ లోకంలో చాలామంది సాతాను క్రియలనుండి పరిశుద్దాత్మ పనిని గుర్తించలేదు. సాతాను క్రియలు వారిలో అసత్యమైన నమ్మకాలను కలిగించి వారిని గందరగోళ పరిస్థితి తర్వాతే నాశనానికి నడుపుతాయి. దేవునికి వ్యతిరేకియై దీనిని సాధించాలనే సాతాను ప్రయత్నిస్తూ వుంటాడు. మూఢనమ్మకాల ప్రభావంతో వారిని దేవుని తెలుసుకోలేకుండా చేసి తన బానిసలుగా చేసుకొంటాడు. మనవాతీత ఆశ్చర్యకార్యాలు,అద్భుతాలను అనుభవించాలన్న కోర్కెనుకలిగించి ఆ విలువలుమ సత్యసువార్తలో విశ్వాసంద్వారా తాముపొందే పరిశుద్దాత్మకంటే విలువైనవన్న ఆలోచనను సాతాను వారిలో కలిగిస్తాడు
అయినప్పటికి దేవుని వాక్యంద్వారా దేవున్ని లోకాన్ని ప్రజలు చూడగలిగేట్టు చేస్తాడు పరిశుద్దాత్మ. పరిశుద్దాత్మద్వారా వారు దేవుడే మానవుని సృష్టి చేశాడని,మానవులను దేవుడుప్రేమిస్తున్నాడని,వారిని ఆయన రక్షించాడని నమ్మేట్లు చేస్తాడు. యేసుక్రీస్తు మానవులను తమ పాపాల నుండి రక్షించి,విశ్వసం ద్వారా నీటిమూలముగాను,ఆత్మమూలముగానైన సువార్తను నమ్మి తన ప్రేమలో జీవించడానికి ఆహ్వానించడమే దేవుని ప్రణాళికని వారు తెలుసుకొనేట్టు చేస్తాడు పరిశుద్దాత్మ.
1 పేతురు 3:21లో. ‘‘దానికి సాదృశ్యమైనబాప్తిస్మముఇప్పుడుమిమ్మునురక్షించుచున్నది’’అని,ఇంకా 1 పేతురు 1:23లో ‘‘మీరు క్షయ బీజము నుండి కాక,శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టినవారు’’అని వ్రాయబడినది.
పరిశుద్దాత్మ చేసే మరో పని పాపం నిజమని,నీతిని గురించి,తీర్పును గూర్చి మానవుడు తెలుసుకొని,వాటిని నమ్మేట్టు చేయడం. ఇంకా దేవుని తీర్పును,యేసు బాప్తిస్మం,
సిలువ మీద ఆయన కార్చిన రక్తాన్ని తెలుసుకొని,దానిని నమ్మడం ద్వారా తన పాపాల నుండి విడుదల పొందవచ్చునని మానవులు తెలుసుకొనేట్టుచేయడం. మానవులు నీటిమూలముగాను, ఆత్మమూల ముగానైన సువార్తలో విశ్వాసముంచినప్పుడు తాను వారిలో వుంటానన్న జ్ఞానం కలిగిస్తాడు పరిశుద్దాత్మ.
ఇప్పటి వరకు పరిశుద్దాత్మ పనులను మనం చూశాం. నీటిమూలముగాను,ఆత్మమూలమైన సువార్తలో నమ్మకముంచి,వారి పాపాలకు క్షమాపణపొందిన వారందరు తమలో నివసించు పరిశుద్దాత్మను,దేవుని ప్రేమను పొందుతారు.
పరిశుద్దాత్మ వ్యక్తిత్వం
పరిశుద్దాత్మ సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన అవసరమైన మూర్తిమత్వ గుణగణాలను అనగా వివేకము,భావోద్వేగము,ఉద్దేశం (సంకల్పము) కలిగి ఉన్నాడు. పరిశుద్దాత్మ వివేకం గలవాడు గనుక దేవుని లోతైన సంగతులను (1 కొరింధి2:10) మానవుల హృదయాలను వెదుకుతారు.
పరిశుద్దాత్మకు భావోద్వేగం వుంది గనుక దేవుని వాక్యాన్ని నమ్మిన వారంటే సంతృప్తిచెందుతాడు.కాని అవిశ్వాసులను గూర్చి దు:ఖిస్తాడు. ఇంకా నీతిమంతులు పరిశుద్దాత్మద్వారా దేవుని ప్రేమను అనుభవిస్తారు.
పరిశుద్దాత్మను ‘‘ఆదరణ కర్త’’అని కూడా పిలుస్తారు. అంటే నీతిమంతుల కష్టాలో సహాయం చేస్తాడు. వారికివిజయాన్నికలిగిస్తాడు.వారి శత్రువులతో పోరాడతాడు. మానవుల మైనమనలో వివేకం భావోద్వేగం, సంకల్పాలెలా వుంటాయో పరిశుద్దాత్మలో నుయివివున్నాయి. నీటిమూలముగాను, ఆత్మమూలముగానై న సువార్తను నమ్మేవారిలో ఆయన నివసిస్తాడు.
పరిశుద్దాత్మపని ఈ క్రిందివిధంగా వుంటుంది.
ప్రజలు పాపక్షమాపణలోని సత్యాన్ని తెలుసుకొనేట్టు చేసి విశ్వాసుల హృదయాలలో నివసిస్తాడు పరిశుద్దాత్మ. యేసు తన బాప్తిస్మం,తన రక్తంద్వారా మానవజాతి పాపాలను తాను తీసుకొన్నాడన్న సత్యానికి సాక్ష్యం చెప్పడం కూడా పరిశుద్దాత్మ పనే (1 యోహాను 5:6-8). తన సేవకు,పరిశుద్దులను వారి ఏ రకమైన కష్టాలలోనైనా ఆదరించి,బలపరిచి,మళ్ళీ నిలబడేట్టు చేస్తాడు. దేని కొరకు ప్రార్ధించాలో వారికి తెలియనప్పుడు ఆయన వారి కొరకు మధ్యవర్తిగా విజ్ఞాపనా ప్రార్ధన చేస్తాడు. (రోమా 8:26). దేవుని సంఘంలో నీతిమంతులకు విశ్రాంతినిచ్చి ఆయన వాక్య సమృధ్ధిలోనికి వారిని నడిపిస్తాడు (కీర్తన 23).
బైబిలుకు సంబంధించిన పరిశుద్దాత్మ పని
నీతిమంతుల హృదయాలలోని సత్యాన్ని గుర్తించి దానిని నమ్మునట్లు వారిని నడిపించి,దానిని ఇతరులకు బోధించునట్లు చేస్తాడు పరిశుద్దాత్మ. ‘‘దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్దపడి యుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును ప్రయోజనకరమైయున్నది’’.(2తిమోతి 3:16).
‘‘యెహోవా గ్రంధమును పరిశీలించి చదువుకొనుడి. .... నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ యిదే. ఆయన నోటి ఊపిరి వాటిని పోగుచేయును.’’.(యెషయా 34:16).
‘‘ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ‘‘ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్దాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగా పలికిరి’’(2 పేతురు 1:20-21).
పరిశుద్దాత్మ దేవుని సేవకులను ప్రేరేపించి మనం చదువుకొనునట్లు దేవుని వాక్యాన్ని రాయించాడు. నీటిమూలముగాను,ఆత్మమూలముగానైన సువార్తను ఆయన ప్రజలకు పరిచయం చేసి,దానిని ప్రపంచానికి బోధించునట్లు మనలను నడిపిస్తాడు. కనుక నీతిమంతులు వారి జీవితాలలో ఎన్నో పరీక్షలతో బాధపడినా వాటిని జయించునట్లు చేసే పరిశుద్దాత్మ శక్తికి వందనాలు.
పరిశుద్దాత్మ ఫలములు,వరములు
పరిశుద్దాత్మ వరాలు అంటే దేవుని సత్యసువార్తను ఇతరులకు వ్యాప్తి చేయుటకు పరిశుద్దులకు ఆయనిచ్చు సమర్ధతని అర్ధం. కనుక పరిశుద్దులు పరిశుద్దాత్మ యిచ్చే వరాల ద్వారా దేవుని పనికి పూనుకొంటారు. ప్రభువుకు మహిమ చెల్లించునట్లు ఆయన వారికి సహాయం చేస్తాడు. ‘‘అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడు చున్నది’’.(1 కొరింధి 12:7).
పరిశుద్దాత్మ వరాల వుద్దేశం ,పరిశుద్దులను విశ్వాసంతో సిద్దపరచడం,వారి ముందున్న పరుగులో పరుగెత్తుటకు వారికి సహాయం చేయడం (ఎఫెసి 4:11-12). దేవుని సేవకులకు,పరిశుద్దులకు సమర్ధతను అనుగ్రహించి సువార్త వ్యాప్తి చేయుటలో వారికి సహాయం చేస్తాడు. దేవుని సంఘం క్రీస్తు యేసులో శుద్ధీకరించబడిన పరిశుద్దుల సమాజం (1కొరింధి -1:2).
యేసుక్రీస్తు సంఘానికి శిరస్సై వున్నాడు గనుక పరిశుద్దాత్మను పొందిన ప్రతి క్రైస్తవుడు తనకివ్వబడిన హోదా,విధులను బట్టి వ్యవహరించాలి. పరిశుద్దులు దేవుని రాజ్యం కొరకు పని చేస్తారు గనుక పరిశుద్దాత్మ వారికి ఆథ్యాత్మిక గ్రహన శక్తిని,సమర్థతను అనుగ్రహిస్తాడు. దేవుడు మనకిచ్చిన సువార్త మహిమను ప్రత్యక్షపరచడానికి పరిశుద్దాత్మ అన్నింటినీ చేస్తాడు. ఆయనంటాడు,‘‘కాబట్టి మీరు భోజనముచేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి’’(1 కొరింధి 10:31).
వివిధ రకాలైన ఆత్మ వరాలు
పరిశుద్దాత్మ వరాలు 12 రకాలైనవి వున్నాయి. ఇవి వివిధ విధాలుగా వేర్వేరు వ్యక్తులకు కలిగినట్లు బైబిలులో చూస్తాం. ఈ వరాలకు సంబంధించిన పెద్ద జాబితాను రోమా 12:6-8 లోను(1 కొరింధి 12:8-10)లోను(ఎఫెసి 4:11)లో చూస్తాం. 1 కొరింధి 12లో వివరించిన తొమ్మిది ఆత్మ వరాలు ఈ క్రింద వున్నాయి.
1. బుద్ది వాక్యము : ఇది నీటి మూలముగాను,ఆత్మమూలముగానైన సువార్తను అర్ధం చేసుకొనే ఆధ్యాత్మిక ప్రేరణనిచ్చి, ఈ సువార్తను బోధించునట్లు చేస్తుంది.
2. జ్ఞాన వాక్యము : ఇది నీతిమంతుల జీవితాలలో వచ్చే అనేకమైన సమస్యలను
లిఖితమైన దేవుని వాక్యముద్వారా పరిష్కరించుకొనే సమర్ధతనిస్తుంది.
3. విశ్వాసము : ఆత్మను వారి పాపాలనుండి,సాతాను నుండిరక్షించుఅద్భుతంచేయడానికిరిశుద్దులకు బలమైన విశ్వాసాన్ని,నమ్మకాన్ని అనుగ్రహిస్తాడు పరిశుద్దాత్మ. నీతిమంతుడైన వ్యక్తి తన పాపక్షమాపణ పొంది,విశ్వాస శక్తితో వారి ఆధ్యాత్మిక అవకతవకలను కుదురుస్తాడు.
4. స్వస్ధతలు : నీతిమంతుకు దేవుని వాక్యంలో గల విశ్వాసంద్వారా స్వస్ధపరచు సమర్ధతను పరిశుద్దాత్మ అనుగ్రహిస్తాడు.
5. అద్బుత కార్యములు చేయు శక్తి : దేవుని వాక్యాన్ని నమ్ముట వలన దేవునిపని చేయుటకు
పరిశుద్దుని అనుమతించే అశ్చర్యకరమైనవరమది.అద్భుత కార్యం అంటే విశ్వాసం ద్వారా మానవ జ్ఞానమనే సహజ ధర్మాన్నిదాటి జరిగే మానవావీతకార్యం.
6. ప్రవచనం : ఈ సమయంలో దేవుని వాక్యాన్ని నమ్మి,దానికి విధేయులైనవారుమాత్రమే లిఖించినదానిప్రకారం ప్రవచిస్తారు. బైబిలులో రాసివున్న దానిపై నమ్మకంలేని వ్యక్తి మాటలు నిజమైన ప్రవచనం కాదు. పరిశుద్దాత్మ గల దేవుని సేవకులు దేవుని వాక్యాన్ని బోధించి,దానిద్వారా జ్ఞానాభివృద్దిని కలిగించి,దేవుని శరీరమై నసంఘం ద్వారా ఆయన పనిచేయుటకు ఉపదేశిస్తారు. దేవుని సేవకులకు, పరిశుద్దులకు పరిశుద్దాత్మ ఈ సమర్థతను అనుగ్రహిస్తాడు.
7. ఆత్మ వివేచన : ఒక వ్యక్తి తన పాపాలు క్షమించబడినవో లేవో నిర్ణయించు సమర్థతయిది.మనలో ఈ వరం లేకపోతే సాతాను మనలను దారి తప్పించే అవకాశం వుంది. ఈ లోకం సాతాను అదుపులో వుందిగనుక దేవుడు మనకను గ్రహించి నసత్యసువార్తను నమ్ముటవలన ఈలోకంలో నిశోధనను, భారాలను,పాపాలను జయించు వరాన్ని పొందగలం. నీతిమంతుడు సత్యసువార్తను నమ్ముటవలన ఈ వరాన్ని పొందగలడు. అలా అతడు తన హృదయంలో పాపం వున్నదో లేదో చెప్పగలడు.
8. నానావిధ భాషలో మాటలాడుట : అన్యభాషలో మాట్లాడడాన్ని గూర్చి బైబిల్ బోధిస్తోంది. ‘‘అయినను సంఘములో భాషతో పదివేల మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధకలుగునట్లు నా మనస్సుతో అయిదు మాటలు పలుకుట మేలు’’(1కొరింధి 14:19). తనకు తానే అర్ధం చేసుకొనలేని భాషలో మాటలాడుటకంటే దేవుని వాక్యసత్యాన్ని అర్ధం చేసుకోవడం చాలా ముఖ్యమని ఒకపరిశుద్దుడు తెలుసుకోవాలి.కనుక అతడు భాషలో మాటలాడుట మానుకోవాలి.
9. భాష అర్ధం చెప్పుట : అది సంఘ కాలంలో శిష్యులు సువార్తను బోధించుటకు ఈ వరం వారికి అనుమతించబడిరది. ఈ రోజుల్లో సందేశాలను వివిధ భాషలోనికి అనువదించి,వివరించు పరిచర్యద్వారా పరిశుద్దాత్మ సువార్తను వ్యాప్తి చేస్తున్నాడు. ఇతర భాషలో వార్తను బోధించగలవ్యక్తికిభాషాంతరంచేసేవ్యక్తి అవసరతలేదు. అయితే భాషా సమస్యులు వచ్చినప్పుడు తన పనిని నెరవేర్చడానికి దేవుడే అనువాదకులను అనుగ్రహిస్తాడు. దేవుడు క్రమభంగంలోను,మైమరపుతో దేవుడు పనిచేయడు. సత్యసువార్తలో పరిశుద్దాత్మ పని చేస్తూ,సువార్తను వివిధ భాషలోనికి అనువదించునట్లు పరిశుద్దులను నడిపిస్తాడు.
పరిశుద్దాత్మ ఫలాలేవి?
పరిశుద్దాత్మ పలాలను గూర్చి బైబిల్ చెప్పేదేమిటంటే,‘‘అయితే ఆత్మఫలమేమమనగా ,ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, అశానిగ్రహము, ఇట్టివాటికి విరోధమైన నియమమేదియులేదు’’(గలతి 5:22-23).
1. ప్రేమ : నీరు,ఆత్మ సువార్తను బోధించుటవలన పాపాత్ములనందరిని తమ పాపాలనుండి రక్షించడానికి నీతిమంతులకు నిజమైనప్రేమ అనుగ్రహించబడింది. నీతిమంతులకు నిజమైన యేసుప్రేమ అయిన సువార్తను కలిగి ఇతరుల ఆత్మనిమిత్తం ఆ నిజమైన ప్రేమతో సువార్తను బోధిస్తున్నారు.
2. సంతోషం : ఇది మనం క్రొత్తగా జన్మించినప్పుడు మన హృదయాంతరంగంలో నుండి పొర్లివచ్చే వివరించలేని మహిమాన్వితమైనసంతోషం. తన పాపాలన్నింటికీ క్షమాపణపొందిన నీతిమంతులని హృదయంలో వుండే సంతోషం (ఫిలిప్పీ 4:4). నీతిమంతుల హృదయాలలో సంతోషం వుంది గనుక ఆ సంతోషాన్ని ఇతరులకు పంచే సమర్థత వారికుంది.
3. సమాధానం : నీటిమూలముగాను,ఆత్మమూలముగానైన సువార్తలో విశ్వాసంకలిగివున్నాం.మనం పాపక్షమాపణ పొందిన నీతిమంతునికి అనుగ్రహించబడిన ఆదరణగల హృదయంయిది. నీతిమంతుల సమాధానసువార్తను బోధించునట్లు పరిశుద్ధాత్మ చేస్తాడు. ఈ సమాధాన సువార్తను విన్నవారు తమ పాపాలను జయించునట్లు యితరులను నడిపించగల శక్తివంతమైన విశ్వాసాన్ని,నమ్మకాన్ని వుంచునట్లు వారిని ఈ రక్షణ వరంలోనికి నడిపిస్తాడు. దేవునికి,మానవజాతికి మధ్య సమాధానం కలిగించి (మత్తయి 5:9)ఇతరులను పాపక్షమాణకు నడిపించే నీతిమంతులుదేవుని కుమారుని పిలువబడతారు (సామె.12:20)నీతిమంతు నైతిక జీవితాన్ని జీవించునట్లు,సువార్త స్పూర్తి ద్వారా యితరులను సమాధానంతో జీవించేట్టు చేయడానికి నీతిమంతులను నడిపిస్తాడు పరిశుద్ధాత్మ.
4. దీర్ఘశాంతము : సత్యసువార్తనునమ్ముట ద్వారా తమ పాపాల నుండి విడుదల పొందిన నీతిమంతుల హృదయాలలో దీర్ఘశాంత ఫలాలు వుంటాయి. పరిశుద్ధాత్మతో సహవాసం గలిగినవారిలో దీర్ఘశాంతమనే భావం వుంటుంది. నీతిమంతులలో దీర్ఘశాంతం,సహనమనే హృదయముంటుంది.
5. దయాళుత్వము : మనం పాపంతో నిండి వున్నప్పుడు దేవుడు కనికరించి యేసుబాప్తిస్మము, సిలువలో ఆయన రక్తంద్వారా మన పాపాలనుండి మనలను విడిపించాడు. యేసు మన మీద కనికరం చూపి మన పాపాలను తుడిచేశారు గనుక మనం ఇతరులపై కనికరం చూపి వారిని ప్రేమించాలి. నీతిమంతులు దయాహృదయాలు కలిగి సువార్త ఫలాలు కలిగి వున్నారు.
6. మంచితనము : ఇక్కడ మంచితనము అంటే ‘‘సద్గుణము’’ అని అర్థం. నీతిమంతుల హృదయాలు మంచితనంతోను దేవునిలో విశ్వాసంతో నిండివున్నాయి.
7. విశ్వాసము : విశ్వాసము అంటే దేవునిలో పూర్తి నమ్మకం కలిగి వుండమని. యేసుకు నమ్మకంగా వుండడంవలన విశ్వాసహృదయం వుంటుంది.
8. సాత్వికము : అంటే ఇతరులను పూర్తిగా అర్థం చేసుకొని వారి విషయమై మన హృదయాలలో ప్రేమతో,సున్నిత మనస్కులమై వుండు సమర్థత అని. తమ శత్రువులను ప్రేమించి,మన విడుదల కొరకు ప్రార్థించు హృదయం నీతిమంతులలో వుంటుంది.
9.ఆశానిగ్రహము:ఆశాని గ్రహము సహనంకలిగి ,కోపాన్ని దుష్ప్రవర్తనవిడిచితనజీవితాన్ని అదుపు చేసుకోవడమని.
పరిశుద్దాత్మతో నింపబడుట
పరిశుద్దాత్మతో నింపబడిన దాని ఫలితమేమిటి,ఈ దీవెన పొందుట వలన పరిశుద్ధులు దేవుని సంఘంలో చేరినప్పుడు వారు యేసుక్రీస్తు శిష్యులు అవుతారు. నీతిమంతులు నీతి పరికరాలై క్రీస్తు సంకల్పాన్ని నెరవేర్చు వారుగా తమను తాము ప్రతిష్టించుకొంటారు. నీతిమంతు వుద్దేశాన్ని దేవుని చిత్తంఅదుపుచేస్తుంది.వారు తమఆస్తులను, తలాంతులను(ప్రజ్ఞాపాటవాలను) ఆయనకొరకే తమ యిష్టప్రకారం ప్రతిష్టించుకొంటారు. నీతిమంతుల విజయం,ఆనందం,నమ్మకం అనే భావంతో ప్రపంచ పాపాలను జయించాలన్నపట్టుదలతో తమజీవితాలను గడుపుతారు. అట్లనివారిలో ఆధ్యాత్మికపేదరికం, ఓటమి, ఆశాభంగం వుండవు (రోమా 7. ఆధ్యా).
‘‘అయినను పరిశుధ్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదదరు. గనుక మీరు యెరూషలేములోను,యూదయ సమరయ దేశముల యందతటతను భూదిగంతముల వరకును ’’(అ.పొ. 1:8). పరిశుద్ధాత్మ నింపుదల నీతిమంతును సువార్తను బోధించునట్లు నిడిపిస్తుంది.
ఎవరిలో పరిశుద్ధాత్మ నివసిస్తూ వుంటాడో వారికి శక్తివంతమైన విశ్వాస జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. యేసుసువార్తను నమ్మడం ద్వారా ఎవరు పాపక్షమాపణ పొందారో వారికి తనపిల్లల గుటకుహక్కుననుగ్రహించాడు దేవుడు (యోహాను 1:12). విశ్వాసం ద్వారా దేవుని పిల్లలైన నీతిమంతులు ఈ లోకంలో సత్యసువార్తను ప్రకటిస్తారు.
నీతిమంతులు పాపక్షమాణ కొరకు సువార్త ద్వారా సాతానును ఓడించే సమర్థత కలిగి వుంటారు. ఇంకా వారు ఆధ్యాత్మిక అనారోగ్యాలను స్వస్థపరుస్తాడు (మార్కు 16:18),సాతాను అధికారాలను అణగదొక్కుతారు (లూకా 10:19),పరలోక రాజ్యాంలో ప్రవేశిస్తారు (ప్రక. 22:14).
నీతిమంతులు దేవుని వాగ్థాన వాక్యాలను నమ్మి అదే అధికారంతో రాజుతో జీవిస్తారు (2కొరింథి 6:17-18).
నీతిమంతులు తమ లోకాశలను విడిచిపెట్టి,సత్యసువార్తను ప్రకటించునట్లు నడిపిస్తాడు పరిశుద్ధాత్మ (గలతీ 5:6).
నీతిమంతులు సత్యసువార్తను చదివి,దానిని నమ్మి,ఇతరులకు దానినిబోధించునట్లు చేస్తాడు పరిశుద్ధాత్మ (1తిమోతి 4:13).నీతిమంతులు ప్రతిరోజు దేవుని సంఘంలో సమకూడుకొనునట్లు చేస్తాడు పరిశుద్ధాత్మ (హెబ్రీ 10:25).
నీతిమంతులు సత్యమనే వెలుగు వలన తమ హృదయాలను ప్రత్యక్ష పరచడానికి
(1యోహాను 1:9) ,తమ పాపాలను ఒప్పుకొంటారు (ఎఫెసి 5:13).
నీతిమంతులు జీవితాలో వారు సరైన మార్గంలో నడుచునట్లు పరిశుద్ధాత్మ నడిపిస్ధాడు (కీర్తన 23).
దేవుని వరాలను ఆర్పవద్దని పరిశుద్ధాత్మ నీతిమంతులకు చెబుతాడు (1థెస్స 5:19).
సత్యసువార్తద్వారా పరిశుద్ధాత్మ అద్భుతకార్యాలను చేస్తాడు.(మార్కు 16:17-18).
నీతిమంతులు దేవుని సంఘంలో చేరి దేవుని సేవకులుగా జీవించునట్లు చేస్తాడు పరిశుద్ధాత్మ. నీతిమంతులు సత్యసువార్తను బోధిస్తూ ఆధ్యాత్మికంగా జీవించునట్లు,పరిశుద్ధాత్మ నింపుదల పొందునట్లు నడిపిస్తారు. ఇది సత్యసువార్తద్వారా పరిశుద్ధాత్మ చేసే అద్భుతమైన పని (1 పేతురు 2:9).
ఈ క్షణంలో పరిశుద్ధాత్మ పరిశుద్ధుల హృదయాలలో పనిచేస్తున్నాడు. హల్లెలూయ!