• All e-books and audiobooks on The New Life Mission website are free
  • Explore multilingual sermons in global languages
  • Two new revised editions in English have been released
  • Check out our website translated into 27 languages
Search

Sermons

అంశం 9: రోమీయులకు ( రోమా పత్రిక పుస్తకం పై నున్న వ్యాఖ్యానం)

[అధ్యాయము 7-1] 7వ అధ్యాయమునకు పరిచయము

2021.04.28 920
విమోచనమునకు ముందు దేవుని ధర్మశాస్త్రముచేత అతని శరీరము మరణమునకు గురియైనదను వాస్తవముపై ప్రతిస్పందిస్తూ, అపోస్తలుడైన పౌలు యేసునందు విశ్వాసముంచుటచేత, పాపము విషయములో మృతుడను అని అతని విశ్వాసమును ఒప్పుకుంటున్నాడు. మనము దేవుని నీతిని కలుసుకొనక మునుపు `అనగా మనము తిరిగి జన్మించకమునుపు` క్రీస్తునందు విశ్వాసముంచు మనము ధర్మశాస్త్రము యొక్క శాపము ఆధిపత్యములో వున్నాము. ఆ విధముగా మనపైన ధర్మశాస్త్రము అధిపత్యము కలిగియుండినది మనకు దేవుని నీతిని తీసుకొని వచ్చిన యేసుక్రీస్తును ఎదుర్కొనుటచేత మనము మన పాపముల నుండి విమోచించబడలేదు.
శరీరమునందు సులభముగా అర్థముకాని ఆత్మీయ విషయములను పౌలు మాట్లాడెను ` అదేమనగా, భర్త చనిపోయిన ఒక స్త్రీ ఆమె భర్త అధికారమునుండి ఏ విధముగా పూర్తిగా స్వతంత్రురాలగునో, అదే విధముగా పాపము విషయములో చనిపోయినవారు, ఎంతోకాలము పాపము అధిపత్యము క్రింద వుండరు. ఈ వాక్యభాగము చాలా సులభముగా వుండవచ్చు. అయితే ఇది ఆత్మీయముగా అత్యంత ప్రాముఖ్యమైనది. దీని భావమేమనగా, దేవునినీతిని కలుసుకొననివారు, వారు ఇష్టపడినను పడకపోయినను, ఒక వాస్తవముగా, ధర్మశాస్త్ర శాపము క్రింద జీవించుటకు విధి వ్రాత వ్రాయబడియున్నారు. ఇందువలననే వారు ఇప్పటికీ వారు పాపముల సమస్యను పరిష్కరించుకొనలేదు. 
రోమా 6:23 మనకు చెప్పుచున్నది ‘‘పాపము వలన వచ్చు జీతము మరణము’’, దీని భావమేమనగా పాపము దాని జీతము చెల్లించినప్పుడు మాత్రమే మాయమవుతుంది. ఒకడు యేసునందు విశ్వాసముంచి, యేసుచేత ఇవ్వబడిన దేవునినీతిని ఎరుగనట్లయితే, అప్పుడు అతడు ఇప్పటికీ పాపములో జీవించుచున్నాడు మరియు అతడు తప్పక పాపమునకు జీతమును చెల్లించవలెను. అందువలననే మనము యేసుక్రీస్తు ద్వారా దేవుని నీతిని కలుసుకొనవలెను. కేవలము దేవునినీతిని ఎదుర్కొనుటచేత మాత్రమే, మనము మన పాపముల విషయములో చనిపోయినవారము, ధర్మశాస్త్రమునుండి స్వతంత్రులగుదుము, మరియు మన నూతన వరుడైన యేసుక్రీస్తును వివాహము చేసుకొందము. యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని నీతిని కనుగొనగలము. అయితే ఈ దేవునినీతియందు విశ్వాసముంచక, ఎవడును ధర్మశాస్త్రము నుండి స్వతంత్రుడు కాలేడు. ధర్మశాస్త్ర శాపమును విరుగగొట్టు ఒకే ఒక మార్గమనునది దేవునినీతి ఎరిగి దానియందు విశ్వాసముంచుట. యేసు ద్వారా ఈ దేవుని నీతిని నీవు కనుగొన్నావా? లేనట్లయితే, నీవు నీ స్వనీతిని వదలివేసి దేవుని వాక్యము వైపుకు తిరుగుటకు ఇది తగిన సమయము. 
 

పాపము విషయములో చనిపోయాక క్రీస్తు వైపుకు

పౌలు రోమాలో వున్న అతని సహోదరులకు చెప్పాడు. ‘‘మీరునూ ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి.’’ ‘‘ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి’’ అంటే ఏమిటో మీరు ఒక క్లుప్తమైన అవగాహన కలిగియుండవలెను. క్రీస్తు శరీరము ద్వారా పాపము విషయములో చనిపోకుండా ఎవడును క్రీస్తు యొద్దకు చేరడు. మన పాపములు, మరియొక మాటలో, యేసుక్రీస్తు శరీరముతో తప్పక చావవలెను. ఇది యోహానుచేత పొందిన యేసు బాప్తిస్మము మరియు సిలువపైన ఆయన మరణమునందు విశ్వాసముంచినప్పుడు మాత్రమే సాధ్యమగును.
యోహానుచేత యేసుపొందిన బాప్తిస్మమునందు విశ్వాసముంచుటచేత పాపము విషయములో క్రీస్తుతోపాటు మనము మరణించగలము. యోహానుచేత ఇవ్వబడిన ఆయన బాప్తిస్మముతో మానవజాతి పాపములను ఆయన శరీరముపైకి బదిలీచేయుటచేత యేసు మరణించినందున, మన పాపములు కూడా, మనము దీనియందు విశ్వాసముంచినప్పుడు మరణించినవి. యోహానుచేత యేసుపొందిన బాప్తిస్మము ద్వారా లోక పాపములన్నియు యేసుపై మోపబడినవి అనునది సత్యము. ఈ సత్యము కేవలము తెలియబడినదిగా మాత్రమే వుండకూడదు. అయితే దీనిని మన హృదయములో విశ్వాసముతో దాచుకొనవలెను. మనము దేవుని రాజ్యములో ప్రవేశించునంతవరకు మనము తప్పక ఈ విశ్వాసమును దాచుకొనవలెను. ఇందువలననే పౌలు క్రీస్తు శరీరము చేత మనము ధర్మశాస్త్రము విషయములో చనిపోయామని చెప్పుచున్నాడు. అలాగున, ఎవరు ఈ సత్యమునందు విశ్వాసముంచుదురో వారు యేసుక్రీస్తు యొద్దకు వెళ్లగలరు. ఆయనతో జీవించగలరు, దేవుని కొరకు నీతి ఫలమును ఫలించగలరు.
మనము అక్షరానుసారముగా ప్రాచీన స్వభావమునందు విశ్వాసముంచకూడదు, అయితే నూతన ఆత్మ సత్యమునందు విశ్వాసముంచవలెను. పాపులు వాస్తవముగా ధర్మశాస్త్రమును బట్టి మరిన్ని పాపములు చేస్తారు. ఇది ఎందుకంటే ధర్మశాస్త్రము వారి పాపమును గూర్చి జ్ఞానముగలవారిగా వారిని చేయుటచేత, వారిని మరింతగా పాపముచేయునట్లు అనుమతించుటచేత, వారిలో దాగియున్న మరిన్ని పాపములను ప్రత్యక్షపరచును. ధర్మశాస్త్రము చేయు పనులలో ఒకటి ఏమనగా మన పాపములను మనము గుర్తెరుగనట్లు చేయుట. అయితే ఇది పాప స్వభావము మరింతగా ప్రత్యక్షమగునట్లుగా మరియు మనము మరిన్ని పాపములు చేయునట్లుగా చేయు పనులను కూడా చేయును. దేవుడిచ్చిన ధర్మశాస్త్రము లేకుండా మనయందు ఎంతో పాపమున్నదని మనము ఎరుగకుండా వుందుము కాదా? అయితే దేవుడు మనకు ధర్మశాస్త్రము నిచ్చెను, ఈ ధర్మశాస్త్రము మనలను కేవలము మరింత పాపులుగా మాత్రమే చేయుటకాదు గాని, ఇది మనము మరిన్ని పాపములను చేయునట్లు మనలను చేయును.
కావున, క్రీస్తు శరీరము ద్వారా మనము పాపము విషయములో చనిపోయినందున, దేవునినీతియందు విశ్వాసముంచు విశ్వాసముతో మనమిప్పుడు దేవునికి సేవ చేయవలసియున్నది. అక్షరానుసారమైన వాక్యమునందు విశ్వాసముంచుటకు బదులుగా మన హృదయము యందు గాఢముగా వుంచబడిన మనకివ్వబడిన విమోచనా వరము మరియు ఆత్మసహాయముతో మనము ప్రభువును సేవించవలసియున్నదని పౌలు మనకు చెప్పుచున్నాడు. బైబిల్‌ మనకు చెప్పుచున్నట్లుగా, ‘‘అక్షరము చంపునుగాని ఆత్మ జీవింపజేయును.’’ దేవుని నీతియైన నీరు మరియు ఆత్మ సువార్తయొక్క భావమును గ్రహించుటచేట మనము తప్పక ప్రభువును వెంబడించవలెను. మనము దేవుని వాక్యమునందు విశ్వాసముంచినప్పుడు, మరియొక మాటలో, లిఖించబడిన వాక్యమునందు దాగియున్న నిజ భావమును తెలుసుకొని దానియందు విశ్వాసముంచవలెను.
 
అప్పుడు ధర్మశాస్త్రము పాపమగునా? అట్లనరాదు!

పౌలు ధర్మశాస్త్రమును దాని కర్తవ్యమును నొక్కి చెప్పుటచేత వివరించుచున్నాడు. ఇది ధర్మశాస్త్రము యొక్క కర్తవ్యమును అర్థముచేసుకొనుట చేత విశ్వాసముంచుట ఎంత ప్రాముఖ్యమో తెలియజేయుచున్నది. పౌలు అతని పాపమును అంతకు మునుపు అతని సొంత విధానములో చూచుకున్నాడు. దీనిని చేయుట వలన అతని సొంత పాపములను అతడు ఎరుగలేదు, అయితే దేవుని ధర్మశాస్త్రము ద్వారా అతడు మత్సరము కలిగి హృదయమును అతడుకలిగియున్నాడని అతడు తెలుసుకున్నాడు.
పౌలు అర్థము చేసుకున్నట్లే యేసునందున్న విశ్వాసులు నేడు ఇదే విధమైన గ్రహింపును కలిగియుందురని నేను ఆశించుచున్నాను. ధర్మశాస్త్రము చేత ఎంత కష్టపడి జీవించాలని ప్రయత్నము చేసినను, ధర్మశాస్త్రము యొక్క సత్యమును గురించి ఎరుగని ప్రజలు అనేకులున్నారు. కొంచెం కష్టపడినట్లయితే, వారు ధర్మశాస్త్రమును పాటించగలరు అని తలంచుచు చర్చికి వెళ్ళుదురు. అయితే వాస్తవమునకు, ఈ ప్రజలు దేవుని నీతిని వాస్తవముగా ఏ మాత్రము కనుగొనలేరు.
దేవునిచేత ఇవ్వబడిన సమృద్ధియైన ధర్మశాస్త్రమును గురించిన భావమును వారు గ్రహించలేదు. ఆ విధముగా వారు ధర్మశాస్త్ర సంబంధులయ్యారు. వారు కనీసము వారి హృదయమును సైతము చూడలేని వేషధారులైన గ్రుడ్డివారు, వారు క్రైస్తవ సమాజములో దేవుని నీతికి విరోధముగా నిలబడియున్నారని ఎరుగరు. నేటి క్రైస్తవ్యములో అటువంటి ప్రజలు చాలామంది వున్నారు. నిజముగా దేవుని నీతిని ఎరుగక యేసును ధర్మశాస్త్ర సంబంధమైన విశ్వాసములో వారి నామకార్ధపు రక్షకునిగా అంగీకరించినవారు శాశ్వత మరణము అను శిక్షనుండి వారు మినహాయించబడరు.
దేవుని ఆజ్ఞ ద్వారా అతని హృదయమునందున్న దురాశను అతడు గ్రహించాడని పౌలు వ్యాఖ్యానించుచున్నాడు. ఆజ్ఞ ద్వారా అతని పాపమును అతడు గ్రహించినప్పుడు, అతడు దేవుని ధర్మశాస్త్రమును పాటించవలసియున్నదని తలంచు ఒక ధర్మశాస్త్ర సంబంధిగానే ఉన్నాడు. దేవుని ఆజ్ఞ పౌలు హృదయమునందున్న దురాశను ప్రత్యక్షపరచి పౌలు పాపమును మరింత పాపంతో నిండినవిగా చేసినవి. ఈ విధముగా పౌలు అతడు ఒక భయంకరమైన పాపిగాక మరేమి కాదని గ్రహించాడు.
మానవుని మనస్సులో పన్నెండు రకములైన పాప స్వభావములు కలవు. ధర్మశాస్త్ర వాస్తవ కర్తవ్యమును పౌలు గ్రహించినప్పుడు, అతడు అతనిని గురించి నిజముగా ఎంత పాపముతో నిండినవాడో గ్రహించక చాలా మంచివాడని అనుకున్నాడు. దేవుని ఆజ్ఞ ప్రకారము నడుచుటలోని అతని కృషి ఫలితము అతనికి ఆజ్ఞను పాటించుటలో అతడు ఎంత దూరముగా వున్నాడో చూపించినది మరియు ఈ ఆజ్ఞలు అతని పాపములను వాస్తవముగా ఎక్కువగా ప్రత్యక్షపరచినవి. 
ప్రజలు యేసునందు విశ్వాసముంచినప్పుడు ఎలా వున్నారు? నీవు మొదట యేసును విశ్వసించుట ప్రారంభించినప్పటి నుండి, నీవు నీ విశ్వాసముతో మండియుండవచ్చు. అయితే సమయము గడిచిన కొలది, ప్రామాణికముగా నీలో వున్న చాలా పాపములను నీవు కనుగొనగలవు. దేని ద్వారా ఈ పాపమును నీవు కనుగొన్నావు? లిఖించబడిన ధర్మశాస్త్రము మరియు ఆజ్ఞ ద్వారా ఈ పన్నెండురకముల ఆజ్ఞలతో మనహృదయము ఏ విధముగా నింపబడినదో మనము కనుగొనియున్నాము. ధర్మశాస్త్రము మొదట పాపులమైన మనలను మనము చూసుకొని కుచించుకు పోయాము. ఇందువలననే, ధర్మశాస్త్రము ద్వారా, మనము నిజముగా భయంకరమైన పాపులమని కనుగొన్నాము.
అందువలననే కొంతమంది ప్రజలు వారికి సౌఖ్యముగా వుండుటకు నీతిమత్వ సిద్ధాంతమును సృజించారు. ఈ సిద్ధాంతము మనము మన హృదయములో పాపమును కలిగియున్నప్పటికి కేవలము మనము యేసునందు విశ్వాసముంచుటచేత దేవుడు మనలను నీతిమంతులుగా గుర్తించును అని చెప్పుకొనుచున్నది. ఇది కేవలము మానవుడు చేసిన సిద్ధాంతము. ప్రజలు వారి పాపమును దాచుకొనుటకు అటువంటి సిద్ధాంతమును చేశారు. ఈ సిద్ధాంతములయందు తృప్తిపరచుకొనుటచేత జీవించుటకు ప్రయత్నము చేయుచు, దీనియందు విశ్వాసముంచారు. వారు ఇప్పటికీ ధర్మశాస్త్రము యెదుట పాపులుగా ప్రత్యక్షపరచబడుచున్నందున, వారి పాపములు వారి మనస్సులో బరువైనవిగా తూగుచున్నవి. మన అన్ని పాపముల నుండి మనము స్వతంత్రులమగుటకు, దేవుని నీతి కలిగియున్న నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచుట తప్ప మరియొక అవకాశము లేదు. మన అన్ని పాపముల నుండి మనము రక్షించబడుటకు ఇది ఒక్కటే మార్గము.
పౌలు అతని గత జీవితములో దేవుడు ఆజ్ఞను పాటించుటకే ఇచ్చెనని తలంచినట్లుగా, వాటిని ప్రయత్నించుట మరియు వాటిని పాటించుటకు చేయగలిగినది చేయవలెనని ప్రయత్నించుట అనునది కేవలము స్వభావ సిద్ధమైనదని అతడు గ్రహించాడు. అయినను దీనికి భిన్నముగా, ఈ ఆజ్ఞలు పాపమును బట్టి అతను ఆత్మను మరణింపచేయునని అతడు కనుగొన్నాడు. పౌలు చివరికి దేవుని ఆజ్ఞను అపార్థము చేసుకొని దానియందు పొరపాటు విధానములో విశ్వసించడని గ్రహించాడు.
మార్కు 7:21-23లో ఉదాహరించినట్లుగా, ప్రతి ఒక్కరు వారి హృదయములో పన్నెండు రకములు పాపములను కలిగియున్నారు. ‘‘లోపలి నుండి, అనగా మనుష్యుల హృదయములోనుండి దురాలోచనను, జారత్వమును, దొంగతనమును, నరహత్యలును, వ్యభిచారమును, లోభమును, చెడుతనమును, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకరమును వచ్చును. ఈచెడ్డవన్నియు లోపలినుండియే బయలువెళ్ళి, మనుష్యుని అపవిత్రపరచునని చెప్పెను.’’
పౌలు మరియు మిగిలిన ప్రజలు చివరికి దేవుని ఆజ్ఞ ద్వారా వారి పాపములను గుర్తించారు. ధర్మశాస్త్రముచేత వారి పాపములను వారు మరణమునకు విధించబడియున్నారనియు గ్రహించారు. అప్పుడు యేసుక్రీస్తు ద్వారా దేవుని నీతిని వారు కనుగొన్నారు మరియు దానియందు విశ్వాసముంచారు. దేవుని నీతిని గురించి నీ గ్రహింపు ఏమిటి? నీవు ఆజ్ఞను పాటించగలనని తలంచుట ద్వారా ఇప్పటికీ వాటిని పాటించవలెనని నీవు ప్రయత్నము చేయుచున్నావా? మనము మన పాపములను గుర్తించి దేవుని దగ్గరకు చేరునట్లుగా దేవుడు ఆయన ధర్మశాస్త్రమును ఇచ్చాడు పాపము నుండి విడుదల పొందుటకు, మరియొక మాటలో, దేవునినీతియందు విశ్వాసముంచుటచేత దేవుడు ఎందుకు ఆయన ధర్మశాస్త్రమును ఇచ్చాడు మరియు మనము ఖచ్చితముగా దానియందు విశ్వాసముంచాలి అను దానిని గురించి ఒక సరియైన గ్రహింపునకు మనము రావలెను. ఒకసారి నీవు ఈ సత్యమును గ్రహించినట్లయితే నీరు మరియు పరిశుద్ధాత్మ సువార్త ఎంత ప్రశస్తమైనదో నీవు తెలుసుకుంటావు.
దేవుని ఆజ్ఞలయందు విశ్వాసముంచువారు దేవుని దృష్టిలో వారెంత గొప్ప పాపులో వారు తెలుసుకుంటారు. దేవుని ఆజ్ఞ పాత్ర ఏమిటో ఎరుగని ప్రజలు మరియు దేవుని నీతియందు విశ్వాసముంచనివారు వారి మతపరమైన జీవితములో గొప్ప కష్టము గుండా పోతారు చివరికి వారి స్వనాశనమునకు నడిపించబడతారు. ఇందువలన పాపముతో నింపబడియున్న ఈ ప్రపంచములో జీవించుచుండగా పాపమునకు దూరముగా వుండుట కేవలము అసాధ్యము. ఇందువలననే కొంతమంది ప్రజలు దూరముగా వున్న కొండలో తమను తాము వేరు పరుచుకుంటారు. మరియు సన్యాస జీవితము జీవించుటకు ప్రయత్నిస్తారు. కొండల మధ్య జీవించుటచేత మరియు లోకపాపముకు దూరముగా వుండుటచేత, వారు పాపములను చేయకుండా తప్పించుకొనగలరని తలంచుదురు, అయితే విషయము ఇది కాదు.
లోకములో వున్న ప్రతి ఒక్కరు పాపమును చేయును ఆ విధముగా అతని హృదయమునందు పాపమును కలిగియున్నాడు అనునది నిజమైనప్పటికీ, అటువంటి పాపము నుండి విమోచనము అనునది దేవుని నీతిని తెలుసుకొని దాని యందు విశ్వాసముంచుటయందు మాత్రమే కనుగొనబడినది అని మనము తప్పక గ్రహించవలెను. ప్రపంచమును దాని పాపమునుండి తప్పించుకొనుటకు ప్రయత్నము చేసినను, వారి హృదయములోవున్న పాపమునుండి తప్పించుకొనలేము. ఇందువలననే, మన హృదయములో పాపములు కనుగొనబడినవి. నిజముగా మనలను పాపము నుండి తోలివేయుటకు మనము తప్పక నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచవలెను. దేవుని ధర్మశాస్త్రము మరియు ఆయన ఆజ్ఞలు మన పాపములను మరింత పాపపూరితముగా చేయును. వారి పాపము తీవ్రతను తెలుసుకొనినవారు తప్పక నీరు మరియు సువార్త ద్వారా మనకు ప్రత్యక్షపరచబడిన దేవుని నీతిని తెలుసుకొని దానియందు విశ్వాసముంచవలెను.
‘‘అప్పుడు జీవార్ధమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్లు కనబడెను. ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దానిచేత నన్ను చంపెను’’ (రోమా 7:10-11) మనకు ధర్మశాస్త్రమును గురించి తగిన గ్రహింపు వుండవలెను. ధర్మశాస్త్రమును తగిన విధముగా అర్థము చేసుకొననివారు వారి జీవితకాలమంతా, వారి ఆఖరిదినము వరకు ధర్మశాస్త్రము నుండి తప్పించుకొనుటకు ప్రయత్నము చేయుచు ధర్మశాస్త్ర సంబంధమైన దానియందు మునిగిపోవుదురు. ధర్మశాస్త్రము యొక్క పాత్రను ఎరిగినవారు మాత్రమే యేసుచేత నెరవేర్చబడిన దేవునినీతియందు విశ్వాసముంచుదురు ప్రేమించుదురు. అప్పుడు, ఈ దేవుని నీతి గురించి నీవు తెలుసుకుందువా? గత కాలమందు అతడు తిరిగి జన్మించినందున, అప్పుడతడు అతని శరీరమునకు చెందినవాడై పాపమునకు అమ్మబడెను అని చెప్పెను. అతడు ధర్మశాస్త్రము ప్రకారముగా జీవించవలెనని కోరినప్పటికీ, అతడు ఏమి చేయకూడదని కోరుకొనెనో దానిని చేయుటతోనే ముగించెను. అదేమనగా పాపము చేయుట అని కూడా ఒప్పుకున్నాడు. ఇందువలన అతడు తనయందు దేవునినీతిని కలిగిలేనందున పరిశుద్ధాత్మను కలిగిలేడు. అప్పుడు అతని కోరికకు విరోధముగా పాపము చేయుటకు కారణము అతని హృదయమునందున్న పాపమని అతడు అంగీకరించాడు ఎలయనగా ఆ సమయమునకు అతడింకా దేవుని నీతిని కనుగొనలేదు.
దీనికి భిన్నముగా, పౌలు ఒక నియమమును గ్రహించాడు. ఆ నియమము పాప నియమము ` అతని అత్యంత ప్రామాణిక వాస్తవము యొక్క గ్రహింపు, తన హృదయములో పాపము కలిగిన వ్యక్తి పాపము చేయకుండా ఉండలేడు అనునది. అయితే అతడు అంతరంగ పురుషుడు ఎల్లప్పుడు దేవుని ధర్మశాస్త్రము ప్రకారం జీవించవలెనని కోరునని కూడా అతడు గ్రహించాడు. అయితే పౌలు పాపపు చెట్టు పాప ఫలమును ఫలించునట్లుగా, కేవలము పాపములో మాత్రమే కొనసాగగలిగిన ఒక పాపి అని ఒప్పుకున్నాడు. ఎందునకగా అప్పుడతడు యేసుక్రీస్తును కలుసుకొననందున, అతని పాపము విమోచనమును అప్పటికి పొందలేదు. మరియొక మాటలో, అతని పాపమును బట్టి మరణమునకు విధించబడుట అతనికి తగినటువంటిది. 
ఇందువలననే, అతడు ‘‘మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును’’ (రోమా 7:24) అని విడిపించుటచేత అతడు ఒక దౌర్భాగ్యునినని ఒప్పుకున్నాడు. పౌలు అతడు పాపిగా వున్నప్పుడు తన గురించి తాను మననము చేసుకొనినది ఇది. పౌలు ఈ ఒప్పుకోలు నీకు కూడా వర్తించునని నీవు గమనించాలి. ధర్మశాస్త్రమును పాటించలేని మరణమునకు లోనగు ఈ శరీరములో నీవు ఇప్పటికి బంధించబడలేదా? మనము తప్పక దేవుని నీతియందు విశ్వాసముంచాలి. ఈ నీరు మరియు ఆత్మ సువార్తయందు ఈ దేవునినీతి దాగియున్నది మరియు ఈ సువార్తయందు విశ్వాసముంచుటచేత ఆయన నీతిని మనము పొందగలము.
యేసుక్రీస్తు బాప్తిస్మము మరియు సిలువపైన ఆయన మరణమునందు విశ్వాసముంచుటచేత పౌలు అతని దౌర్భాగ్య స్థితి నుండి స్వతంత్రుడు కాగలిగాడు.