• All e-books and audiobooks on The New Life Mission website are free
  • Explore multilingual sermons in global languages
  • Two new revised editions in English have been released
  • Check out our website translated into 27 languages
Search

Sermons

అంశం 9: రోమీయులకు ( రోమా పత్రిక పుస్తకం పై నున్న వ్యాఖ్యానం)

[అధ్యాయము 7-2] పౌలు విశ్వాస సారాంశము : పాపము విషయములో చనిపోయిన తరువాత క్రీస్తుతో ఐక్యము చెందుము (రోమా 7:1-4)

2021.04.28 1,061
(రోమా 7:1-4)
‘‘సహోదరులారా, మనుష్యుడు బ్రదికినంత కాలమే ధర్మశాస్త్రమతనిమీద ప్రభుత్వము చేయుచున్నదని మీకుతెలియదా? ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాటాలాడుచున్నాను. భర్తగల స్త్రీ, భర్త బ్రదికియున్నంతవరకే ధర్మశాస్త్రము వలన అతనికి బద్దురాలు గాని, భర్త చనిపోయిన యెడల భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదలను పొందును. కాబట్టి భర్త బ్రదికియుండగా ఆమె వేరొక పురుషుని చేరనియెడల ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదలను పొందెను గనుక వేరొక పురుషుని వివాహము చేసుకొనినను వ్యభిచారిణి కాకపోవును. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించునట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరునూ ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి.’’
 

చిక్కుబడిన దారపు వుండను నీవెన్నడైనా చూచితావా? పౌలు విశ్వాసముంచిన యేసు బాప్తిస్మము యొక్క సత్యమును ఎరుగక ఈ అధ్యాయమును అర్థము చేసుకొనుటకు ప్రయత్నము చేసినయెడల, నీ విశ్వాసము ఇంతకు ముందున్న స్థితికంటే గొప్ప గందరగోళముగా మాత్రమే వుండును.
దేవుని ధర్మశాస్త్రము యెదుట ప్రతి ఒక్కరు పాపపూరితమైయున్నందున, ఒకడు ఆత్మీయముగా మరణించిన తరువాత మాత్రమే యేసుక్రీస్తు దగ్గరకు వెళ్లగలడు మరియు తిరిగి జన్మించగలడని పౌలు ఈ అధ్యాయమునందు చెప్పుచున్నాడు.
 

పౌలు గ్రహించిన సత్యము
 
రోమా 7:7 వ్యాఖ్యానించుచున్నది, ‘‘కాబట్టి యేమందుము? ధర్మశాస్త్రము పాపమాయెనా? అట్లనరాదు ధర్మశాస్త్రము వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియక పోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము నాకు చెప్పనియెడల దురాశయనునది ఎట్టిదో నాకు తెలియక పోవును’’ దీనిని మించి, అతడు జతచేయుచున్నాడు. ‘‘అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధములైన దురాశను నాయందు పుట్టించెను’’ దేవుని 613 శాసనములను అతడు అతిక్రమించుచున్నాడని పౌలు గ్రహించాడు. మరియొక మాటలో, అతడు పాపము చేయుట తప్ప మరేమియు చేయలేని పాపపుముద్ద మాత్రమే, ఎందుకంటే అతడు మొదటి మనిషి అయిన ఆదాము వారసుడు, అతని తల్లిచేత పాపములోనే గర్భము ధరించబడి, అపరాధముతో జన్మించెను. 
ఈ లోకములో పుట్టిన ప్రతి మనుష్యుడు అతని జననము నుండి మరణము వరకు పాపము చేయును. వారు ఆ విధముగా దేవుని ఆజ్ఞను పాటించుటలో అసమర్థులు. ఈ పాపపు ముద్ద ఏ విధముగా అన్ని 613 ఆజ్ఞలను మరియు దేవుని ధర్మశాస్త్రమును పాటించగలరు ? దేవుని ధర్మశాస్త్రము యెదుట మనము పాపులము మాత్రమే అని గుర్తించినప్పుడు, దేవుని నీతియైన యేసుక్రీస్తు దగ్గరకు మనము వెళ్ళగలము. మరియు యేసుక్రీస్తు ద్వారా చివరికి మనము పాపము నుండి విడుదలను పొందుదుమని గ్రహించగలము. యేసుక్రీస్తు దేవుని నీతిగా మారెను. ఈ దేవుని నీతిని యోహానుచేత ఆయన పొందిన బాప్తిస్మము మరియు సిలువపైన ఆయన రక్తము ద్వారా ఆయన మనకు తెచ్చెను. కావున మనమందరము దేవునినీతిని ఎరిగి దాని యందు విశ్వాసముంచవలెను. మనము తప్పక విశ్వాసముంచవలసిన కారణమేమనగా ఈ దేవునినీతి ఆయనయందు కనుగొనబడినది.
నీవు దేవుని నీతిని తెలుసుకొని దానియందు విశ్వాసముంచుచున్నావా? దేవునినీతి అనునది నీరు మరియు ఆత్మ సువార్తయందు దాయబడిన ఒక రహస్యము. ఈ రహస్యము యొర్దానునదిలో యోహానునుండి యేసు పొందిన బాప్తిస్మము నందు అంతయు కలిగియున్నది. నీవు ఈ రహస్యమును తెలుసుకొనగోరుచున్నావా? నీవు ఈ సత్యమునందు విశ్వాసముంచవలెనని కోరినట్లయితే, నీ విశ్వాసము ద్వారా దేవుని నీతిని నీవు పొందుదువు.
దేవుని ధర్మశాస్త్రమును మరియు ఆజ్ఞలను మనము తెలుసుకొనక మునుపు, మనము అనుదినము పాపములు చేస్తున్నప్పటికి, మనము పాపులము కానట్లుగా అనిపిస్తుంది. అయితే మనము చర్చికి హాజరగుట ప్రారంభించినప్పటి నుండి, మనము నిజముగా చాలా పాపముతో నింపబడినవారమని గ్రహిస్తాము. మనయందు ప్రత్యక్షపరచబడిన పాపమును బట్టి ఆత్మీయ మరణమునకు చేరకుందుము. ఆ విధముగా, ఒక క్రమములో ఆత్మను యేసుక్రీస్తు వద్దకు నడిపించుటకు, పౌలు దేవుని ఆజ్ఞను మరియు ధర్మశాస్త్రమును అపార్థము చేసుకొనుటచేత తప్పుగా అర్థము చేసుకొనిన గడచిన దినమును మననం చేసుకుంటున్నాడు.
దేవుని ధర్మశాస్త్రము యొక్క పాత్రను అర్దము చేసుకొనుటకు ఇక్కడ ఒక ఉదాహరణ ఉన్నది. నేనిప్పుడు బైబిల్‌ను పట్టుకొనియున్నాను. ఈ బైబిల్‌ పేజీలో కొంత ప్రాముఖ్యమైన భాగమును నేను దాచేసి, ‘‘దీనియందు దాయబడిన దానిని కనుగొనుటకు ఎన్నడు ప్రయత్నము చేయవద్దు’’ అని చెప్పి కొంతసేపు ఈ బైబిల్‌ను మీతో ఈ బల్లపై వుంచినట్లయితే, నీవు ఎలా స్పందిస్తావు? నా మాట విన్న వెంటనే, ఆ బైబిల్‌లో ఏమి దాగియున్నదా కనుగొనవలెను అను కోరిక నీకు కలుగుతుంది. ఈ ఆసక్తి కారణముగా, నీవు నా సూచనను అతిక్రమిస్తావు. ఈ బైబిల్‌లో ఏమిదాగివున్నదా అని నీవు తక్షణమే ఆశ్చర్యపోతుంటావు, కనుగొనడం తప్ప మరియొక అవకాశము నీకు లేదు. బైబిల్‌లోనికి ఎన్నడు చూడకు అని నేను చెప్పకుండా వుంటే, నీవెన్నడు అటువంటి శోధనను ఎదుర్కొనవు. అదే విధముగా దేవుడు మనలను ఆజ్ఞాపించినప్పుడు మనయందు దాగియున్న పాపము పరిస్థితులకనుగుణముగా కార్యము చేయును.
మానవజాతికి దేవుడిచ్చిన ధర్మశాస్త్రము ప్రజల హృదయమునందున్న పాపమును ప్రత్యక్షపరచుపాత్రను కలిగియున్నది. మనము దీనిని పాటించగలిగి వెంబడించుటకు మనకు ఆయన ఇవ్వలేదు. దీనికి బదులుగా, ఒక క్రమములో మన పాపమును ప్రత్యక్షపరచి మనలను పాపులుగా చేయుటకు ఈ ధర్మశాస్త్రము ఇవ్వబడెను. యోహాను నుండి యేసుపొందిన బాప్తిస్మము మరియు సిలువపై ఆయన చిందించిన రక్తమునందు కనుగొనబడిన దేవుని నీతియందు విశ్వాసముంచక, యేసుక్రీస్తు వద్దకు వెళ్ళినట్లయితే మనమందరము నశించిపోవుదుము. ధర్మశాస్త్రము యొక్క పాత్ర ఏమనగా మనను క్రీస్తు దగ్గరకు తీసుకొని వచ్చుట మరియు ఆయన ద్వారా దేవుని నీతియందు విశ్వాసముంచుటకు సహాయము చేయుట అని మనము మన మనస్సులో వుంచుకొనవలెను.
ఇందువలననే అపోస్తలుడైన పౌలు సాక్ష్యమిచ్చుచున్నాడు. ‘‘అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధములైన దురాశను నాయందు పుట్టించెను’’ (రోమా 7:8) దేవుని ధర్మశాస్త్రము ద్వారా, అపోస్తులుడైన పౌలు పాపము యొక్క మూల ప్రమాణములు ఏమైయున్నవో చూపించాడు. అతని ప్రమాణములో అతడు ఒక పాపిగా వుండెనని, అయితే యేసుక్రీస్తు చేత ఇవ్వబడిన దేవునినీతియందు విశ్వాసముంచుట చేత అతడు శాశ్వత జీవమును పొందెను అని ఒప్పుకున్నాడు.
 

పౌలు విలాపము మరియు విశ్వాసము

ఆ విధముగా పౌలు, ‘‘అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి  కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను’’ (రోమా 7:24-25). 
దేవుని నీతిని కలిగియున్న అతడు కూడా, ఇప్పటికీ పాపము చేసెనని, అటువంటి దేవుని నీతి ఆయనకు మాత్రమే కాదు మిగిలిన మానవజాతికి అత్యవసరముగా అవసరమని పౌలు గుర్తించాడు.
యేసుపొందిన బాప్తిస్మములో దాగియున్న రహస్యమును నిక్కచ్చిగా తెలుసుకొనుటచేత మరియు దీనియందు విశ్వాసముంచుటచేత మనము దేవుని నీతిని పొందవలెను. క్రీస్తు బాప్తిస్మము మరియు సిలువపైన రక్తములో కనుగొనబడిన దేవుని నీతిని నీవు మరియు నేను తప్పక తెలుసుకొని దీనియందు విశ్వాసముంచవలెను. అప్పుడు మాత్రమే పాపము చేయుట తప్ప మరి ఏ అవకాశము లేని, మన ఆత్మలు  మరియు శరీరము, మన పాపముల నుండి విడుదలను పొందును. క్రీస్తు బాప్తిస్మము మరియు సిలువపైన ఆయన రక్తము దేవునినీతిని నెరవేర్చెనను వాస్తవమును మనము మరువరాదు.
దేవుని నీతిని ఎరుగనివారు వారెంతగా ఆయన ధర్మశాస్త్రమును పాటించుటకు కష్టపడి ప్రయత్నించినప్పటికి చివరికి పాపులుగా మాత్రమే మిగిలిపోగలరు. దేవుని ధర్మశాస్త్రము మనము వాటిని పాటించుటకు ఇవ్వబడలేదని మనము తప్పక గ్రహించాలి. అయితే ధర్మశాస్త్ర సంబంధులు  విమోచనా రహస్యము సిలువపైన ఆయన రక్తముతో పాటుగా యేసు తీసుకొనిన ‘‘బాప్తిస్మము’’పైన ఆధారపడియున్నదని గ్రహించరు. దీని ఫలితముగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగుటకు ఆలోచించుటచేత అపార్థము చేసుకొందురు, మరియు వారు గందరగోళములో జీవించుటలో కొనసాగుదురు. అయితే మనము ధర్మశాస్త్రముచేత మన పాపములను గుర్తించి దేవునినీతియందున్న మన విశ్వాసము ద్వారా జీవించుదుము. మనము మన స్వనీతిని వెంటాడుటకు తప్పక ఈ దేవుని నీతికి విరోధముగా తిరుగరాదు. దీనికి బదులుగా, క్రీస్తు బాప్తిస్మము మరియు సిలువపైన ఆయన రక్తముచేత నెరవేర్చబడిన దేవుని నీతియందు మనము తప్పక విశ్వాసముంచవలెను. మరియొక మాటలో, దేవునినీతిని నెరవేర్చిన, ప్రభువునకు వందనము చెల్లించుట నేర్చుకొనవలెను.
ఇందువలననే పౌలు, అతని స్వంత శరీరము వైపు చూసుకుంటున్నాడు. ప్రారంభదశలో అతడు ‘‘అయ్యో; నేనెంత దౌర్భాగ్యుడను’’ అని ఏడ్చాడు. అయితే ఇప్పటికీ యేసుక్రీస్తు ద్వారా దేవునికి వందనములు  చెల్లించుచున్నాడు. పౌలు యొక్క ఈ ఒప్పుకోలుకు కారణమేమనగా, అతడు పాపము చేసిన కొలదీ, అంతకంటే ఎక్కువగా యేసు బాప్తిస్మము మరియు సిలువపైన యేసు రక్తము మొత్తముగా దేవునినీతిని నెరవేర్చెను. శరీర నియమమునకును మరియు దేవుని నీతికి మధ్య కష్టమైన జీవితమును జీవించుచున్నప్పటికీ, మనము కూడా ఆనందముతో విజయముతో అరవగలము. ఎందుకనగా యేసుక్రీస్తు నందున్న మన విశ్వాసముతో మనము రక్షించబడియున్నాము. పౌలుకు కలిగిన విశ్వాసము ఏమనగా యేసుక్రీస్తు బాప్తిస్మము మరియు సిలువపైన ఆయన రక్తమునందు విశ్వాసముంచిన ఒకని విశ్వాసము. ఈ విధముగా పౌలు దేవుని నీతియందున్న అతని విశ్వాసములో నివశించెను మరియు ఈ దేవుని నీతియందు విశ్వాసముంచుటచేత, ఆయనకు స్తుతులు అర్పించువానిగ మారగలిగాడు.
రోమా 7వ అధ్యాయములో, దేవుని నీతియందున్న అతని విజయమునకు భిన్నముగా, గడిచిన కాలములో అతని దౌర్భాగ్యస్థితిని గురించి మాట్లాడుచున్నాడు. పౌలు  విశ్వాస విజయము అనునది దేవుని నీతి యందున్న అతని విశ్వాసము వలన కలిగినది.
‘‘సహోదరులారా, మనుష్యుడు బ్రదికినంతకాలమే ధర్మశాస్త్రమతనిమీద ప్రభుత్వం చేయుచున్నదని (ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను) మీకు తెలియదా?’’ (రోమా 7:11)
7వ అధ్యాయము యొక్క అంతిమ దశ 24 మరియు 25 వచనములో కనుగొనబడినది. పౌలు వ్రాసెను. ‘‘అయ్యో, నేనెంత దౌర్బాగ్యుడను! మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకును, శరీర విషయములో నేను పాపనియమమునకును దాసుడనైయున్నాను.’’
రోమా 6వ అధ్యాయములో, మనలను క్రీస్తుతో ఐక్యపరచి పాతిపెట్టబడి పునరుత్థానమునకు నడిపించు విశ్వాసమును గురించి పౌలు మాట్లాడాడు. మనలను ఆయన బాప్తిస్మముతో మరియు సిలువపైన ఆయన మరణముతో ఐక్యపరచుట ద్వారా, మనము ఈ విశ్వాసమును సంపాదించు కొనగలము.
పౌలు యేసుక్రీస్తును కలవకముందే కాదు యేసును అతడు ఎదుర్కొనిన తరువాత కూడా దేవుని ధర్మశాస్త్రమును అతిక్రమించిన అసంపూర్ణమైన శరీరము కలిగియున్న అతడు ఒక దౌర్భాగ్యుడని గ్రహించాడు. ‘‘మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును?’’ అప్పుడు అతడు ‘‘ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి వందనములు  చెల్లించుచున్నాను’’ అని చెప్పుచూ, దేవుని నీతియందు విశ్వాసముంచుటచేత మరణమునకు లోనగు శరీరమునుండి విడుదలను పొందగలడని అతడు ముగించాడు. క్రీస్తుద్వారా దేవునినీతియందు విశ్వాసముంచుటచేత మరియు ఆయనతో ఐక్యము చెందుటచేత శరీరము మరియు మనస్సు పాపము నుండి పౌలు స్వతంత్రునిగా చేయబడ్డాడు.
పౌలు చివరి ఒప్పుకోలు ఏమనగా, ‘‘కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకున్న శరీర విషయములో నేను పాప నియమమునకును దాసుడనైయున్నాను’’ (రోమా 7:25) మరియు 8వ అధ్యాయము ప్రారంభములో, అతడు ఒప్పుకున్నాడు. ‘‘కాబట్టి ఇప్పుడు క్రీస్తుయేసునందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు. క్రీస్తుయేసు నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణముల  నియమము నుండి నన్ను విడిపించెను’’ (రోమా 8:1-2). 
మొట్టమొదటిగా దేవునిచేత రెండు నియమములు  ఇవ్వబడినవి. పాపమరణముల  నియమము మరియు జీవాత్మ నియమము. జీవాత్మ నియమము పౌలును పాపమరణముల నియమము నుండి విడిపించెను. దీని భావమేమనగా అతని పాపములన్నియు తీసుకొనిపోయిన, యేసు బాప్తిస్మము మరియు సిలువపై ఆయన మరణముయందు విశ్వాసముంచుటచేత, అతడు తనను తాను యేసుతో ఐక్యపరచుకొనెను మరియు అతని అన్ని పాపములనుండి రక్షించబడెను. యేసు బాప్తిస్మము మరియు సిలువపైన ఆయన రక్తముతో ఐక్యపరచు విశ్వాసమును మనము కలిగియుండవలెను. 
రోమా 7వ అధ్యాయములో పౌలు అతడు పూర్వము ధర్మశాస్త్రమునకు లోనైయున్నవాడని, అయితే యేసుక్రీస్తు ద్వారా, ఈ శిక్ష నుండి అతడు విడుదలను పొందియున్నాడని ఒప్పుకున్నాడు. అలాగున, అతనియందు నివశించుచున్న పరిశుద్ధాత్మ ద్వార అతడు దేవునిని సేవించగలిగాడు.
 
 
పౌలు గ్రహించిన సత్యము

పౌలు ఒప్పుకున్నాడు. ‘ధర్మశాస్త్రము పాపమాయెనా? అట్లనరాదా! ధర్మశాస్త్రము వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును’’ (రోమా 7:7) నీవు ఆశింపవద్దు అని ధర్మశాస్త్రము చెప్పనంతవరకు దురాశయనిన ఎట్టిదో అతనికి తెలియలేదు. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశను నాయందు పుట్టించెను అని చెప్పుటచేత ధర్మశాస్త్రమునకు మరియు పాపమునకు గల సంబంధమును పౌలు వివరించెను. దీని భావము మానవ హృదయము ప్రామాణికముగా పాపముతో నింపబడినవి. ప్రజలు వారి తల్లి గర్భమునందు గర్భము ధరించబడినప్పుడే, వారు పాపములో గర్భము ధరించబడ్డారు, వారు పన్నెండు రకముల పాపములతో వారు పుట్టుదురు.
ఈ పన్నెండు రకముల పాపములు అనునవి దురాలోచనను, జారత్వమును, దొంగతనమును, నరహత్యలును, వ్యభిచారమును, లోభమును, చెడుతనమును, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ప్రతివారు వారు చనిపోవు వరకు ఈ పాపములను చేయుదురు. ఈ లోకములో వున్న ప్రతి ఒక్కడు ఏవిధముగా అతడు /ఆమె ఈ పన్నెండు రకముల పాపములతో పుట్టినప్పుడు దేవుని ధర్మశాస్త్రమునకు మరియు పది ఆజ్ఞలకు లోబడియుండగలడు? మనము ఇది చేయకూడదు అని చెప్పు దేవుని ధర్మశాస్త్రమును మరియు ఆజ్ఞలను మనము వినునప్పుడే పాపము మనలో కార్యము చేయుటను ప్రారంభించును.
మనకు దేవుని ధర్మశాస్త్రము మరియు ఆజ్ఞలు తెలియనప్పుడు, మనయందున్న పాపము నిశ్శబ్ధముగా నిద్రపోవును. అయితే ఏమి చేయకూడదు ఏమి చేయవలెను అను ఆజ్ఞను వినిన తరువాత, ఈ పాపము వెలుపలికి వచ్చి మనలను ఇంకనూ పాపులుగా చేయును.
తిరిగి జన్మించినవాడు ఎవడైనను లేక ఈ నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచక ఈ సత్యమును అర్థము చేసుకొనని వాడు అతనియందు పాపమును కలిగియున్నాడు. ఈ పాపము, ఆజ్ఞల ద్వారా చురుకుదనమును సంతరించుకొనినందున, అప్పుడు మరింత పాపమును ఉత్పత్తి చేసింది. ప్రజలు ఏమి చేయకూడదు ఏమి చేయవలెనో చెప్పు ధర్మశాస్త్రము పాపములను మచ్చిక చేసుకొనుటకు ప్రయత్నించు శిక్షణనిచ్చు వానివంటిది. ఏదిఏమైనా, పాపము దేవుని ఆజ్ఞకు విరోధముగా పోవును మరియు వాటికి అవిధేయులగును. ఒక పాపి ఆజ్ఞను వినినప్పుడు, అతని/ఆమె యందున్న పాపము అతనిని మరిన్ని పాపములు చేయుటకు నడిపించుచు చురుకుదనము పొందును. 
పది ఆజ్ఞల ద్వారా మనలో పాపమున్నదని మనము గ్రహించగలము. ధర్మశాస్త్రము యొక్క పాత్ర ఆ విధముగా మన హృదయములోపల ఉన్న పాపమును ప్రత్యక్షపరచుటకు, మన పాపతత్వమును నిద్రలేపుటకును మరియు దేవుని ఆజ్ఞలు పరిశుద్ధమైనవని మనము గ్రహించునట్లుగా చేయును. మన ప్రమాణాలలో, ఆస్తులను లేక మనవికాని భాగస్తులవి కలిపి దేవుడు సృజించిన దేనినైనను ఆశించు దురాశతో మనము జన్మించియున్నాము.  అందువలన ఆశించకు అను వ్యాఖ్యానించు ఆజ్ఞ మనకు చెప్పునదేమనగా మనము పుట్టిన దినమునుండి నరకమునకు నిర్దేశించబడిన జన్మ పాపులము అని. ఇది దేవుని నీతిని నెరవేర్చిన, రక్షకుని ఆవశ్యకతను కూడా తెలియజేస్తుంది.
ఇందువలననే పౌలు పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని అన్ని రకములైన చెడ్డ కోరికను ఉత్పత్తి చేయును అని పౌలు ఒప్పుకొనుచున్నాడు. దేవుని నీతిని విశ్వసించక మునుపు అతడు దేవుని మంచి ఆజ్ఞను అతిక్రమించిన గొప్ప పాపినని, ఏలయనగా మూలము నుండి పాపముతో నిండి యుండెనని మరియు పాపముతో వుండెనని గ్రహించాడు.
మనము 7వ అధ్యాయమును పరిశోధించినప్పుడు, పౌలు చాలా ఆత్మీయపరుడని, బైబిలు గురించి మంచి  జ్ఞానము కలవాడని, గొప్ప ఆత్మీయ గ్రహింపు అనుభవమును కలిగియున్నాడని మనము కొనుగొనగలము. ఏది ఈ ఆజ్ఞల ద్వారా అన్నిరకములైన చెడ్డ కోరికను ఉత్పత్తిచేయునో, ఆ ధర్మశాస్త్రము ద్వారా అతనియందు పాపమున్నదని అతనికి స్పష్టముగా తెలియును. దేవుని ధర్మశాస్త్రము అతనియందున్న పాపమును ప్రత్యక్షపరచు పాత్ర కలిగియున్నదని అతడు తెలుసుకొనుట జరిగినది. ఈ పాపము ఉజ్జీవింపబడుచున్న కొద్దీ, జీవము తీసుకొని రావలసిన ఆజ్ఞలు మరణమును తెచ్చెనని అతడు ఒప్పుకున్నాడు.
నీ విశ్వాసము ఏ విధముగా వున్నది? ఇది పౌలు విశ్వాసమువలె వున్నదా? నీవు యేసునందు విశ్వాసముంచినను విశ్వాసముంచకపోయినను నీ హృదయమునందు పాపములేదా? ఆ విధముగా అయినట్లయితే, నీవు ఇప్పటికీ దేవుని నీతిని ఎరుగవు, పరిశుద్ధాత్మను పొందలేదు. నీ సొంత పాపముకు తీర్పు తీర్చబడుటకు నరకమునకు వెళ్ళు ఒక పాపివి. నీవు ఈ వాస్తవమును అంగీకరించుచున్నావా? నీవు అంగీకరించనట్లయితే అప్పుడు దేనియందు దేవునినీతి ప్రత్యక్షపరచబడినదో, ఆ నీరు మరియు ఆత్మ సువార్తయందు  విశ్వాసముంచుము. నీ అన్ని పాపముల నుండి నీవు రక్షించబడుదువు. దేవునినీతిని సంపాదించుకొందువు. నీ మీదికి దిగివచ్చు పరిశుద్దాత్మను కలిగియుందువు. మనము తప్పక నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచవలెను.
 

పాపము, ఆజ్ఞను హేతువు చేసుకొని పౌలును మోసగించెను

అపోస్తలుడైన పౌలు చెప్పెను, ‘‘అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్లు కనబడెను, ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దానిచేత నన్ను చంపెను’’. (రోమా 7:10`11) మరియొక మాటలో, పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని పౌలును మోసగించెను. పౌలు ఆజ్ఞ నిజముగా మంచిదని న్యాయమైనదని విశ్వాసముంచాడు మరియు అప్పటికి పన్నెండు రకముల పాపములు అతని హృదయమునందు సజీవముగా వుండి చీమును కలిగించుచున్నవి. దీని భావమేమనగా అతడు పాపముచేత మోసగించబడ్డాడు ఎందుకంటే ఆజ్ఞల ఉద్దేశ్యమును అతడు అర్థము చేసుకొనలేకపోయాడు.
మొదటిగా, దేవుడు ధర్మశాస్త్రమును దానికి లోబడుటకు ఇచ్చెనని పౌలు తలంచాడు. అయితే తరువాత, ధర్మశాస్త్రము లోబడుటకు ఇవ్వబడలేదు. దేవుని పరిశుద్ధాత్మతో పాటుగా, ప్రజల హృదయము లోపల వున్న పాపమును ప్రత్యక్షపరచుటకు, అవిశ్వాసులు దేవునిచేత తీర్పుతీర్చబడుటకు ఇచ్చెనని గ్రహించాడు. ఈ విధముగా పౌలు దేవుని ధర్మశాస్త్రమును మరియు ఆజ్ఞను సరిగా అర్థము చేసుకొననంతకాలము పాపముచేత మోసగించబడ్డాడనని తలంచాడు. నేడు అత్యధిక ప్రజలు ఇదే విధముగా మోసగించబడుచున్నారు.
దేవుడు మనకు ఇచ్చిన ధర్మశాస్త్రము మరియు ఆజ్ఞలు వాటికి లోబడుటకు కాదుగాని మన సొంత పాపమును గ్రహించుటకు మరియు నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచుటచేత దేవుని నీతిని చేరుటకు మనము ఈ లోకములో మన పాపముతో ధర్మశాస్త్రము ప్రకారముగా జీవించుచున్నంత కాలము, మన పాపపూరిత స్వభావము యొక్క ప్రత్యక్షత అంతమగుచుండును.
అందువలన ఒక పాపి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనదైనప్పటికి ఆ ధర్మశాస్త్రము ద్వారా, అతడు/ఆమె ఒక పరిశుద్ధమైన జీవితము జీవించు సామర్థ్యము లేక శక్తిని కలిగిలేడని గ్రహిస్తాడు. ఆ క్షణములో, అతడు / ఆమె ధర్మశాస్త్రము చేత నరకమునకు పంపబడుట తప్పా మరియొక అవకాశములేని ఒక పాపిగా మారుదురు. నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచని పాపులు ధర్మశాస్త్రమును దేవుడు వారికి లోబడుటకు ఇచ్చెనని తలంచుటలో ముందుకు పోతూ వుంటారు. వారు ధర్మశాస్త్రమునకు లోబడుటకు ప్రయత్నించుటలో కొనసాగుతూ వుంటారు. అయితే వారికి వారు మోసములో పడి చివరికి నాశనములోనికి పడిపోవుదురు.
దేవుని నీతిని ఎరుగక పోవుటచేత తిరిగి జన్మించని వారు వున్నవారు పాపమును చేయుదురు పశ్చాత్తాప ప్రార్థన చేయుటచేత క్షమాపణను పొందుటకు ప్రయత్నము చేయుదురు. చివరికి ఏదీ ఏమైనా దేవుని ధర్మశాస్త్రము యొక్క ఉద్దేశ్యమును అపార్థము చేసుకొన్నామని వారిని వారు మోసపరచుకొన్నారని గ్రహిస్తారు. పాపము, ఆజ్ఞను హేతువు చేసుకొనుటచేత, వారిని మోసగించెను. దేవుని ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది. అయితే వారియందున్న పాపము దీనికి బదులుగా నరకమునకు నడుపును.
పౌలు చెప్పెను, ‘‘కాబట్టి ధర్మశాస్త్రము పరిశ్ధుమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు నీతిగలదియు ఉత్తమమైనదియునై యున్నది. ఉత్తమమైనది నాకు మరణకరమాయెనా? అట్లనరాదు. అయితే పాపమ ఉత్తమమైనదాని మూలముగా నాకు మరణము కలుగజేయుచు, పాపము పాపమైనట్టు అగపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము, అది నాకు మరణకరమాయెను’’ (రోమా7:12`13) ఈ సత్యమును అర్థము చేసుకొనినవారు వారి దేవుని నీతి అవసరతను గ్రహించుదురు. కనుక నీరు మరియు ఆత్మ సువార్త నిజమైన సత్యమని విశ్వసించుదురు. నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచు ఒక వ్యక్తి దేవుని నీతియందు కూడా విశ్వాసముంచును. మనమందరము ఆయన నీతియందు విశ్వాసముంచుటచేత మన అన్ని పాపముల నుండి విడుదలను పొందుదుము మరియు దేవుని పరిశుద్ధతను చేరుకొందము. మీరందరు ఈ సువార్త చేత దీవించబడవలెనని కోరుచున్నాను.
 

పౌలు మనస్సు మరియు శరీరము ఎలా వుండెను?

పౌలు  ఆత్మతో నింపబడి దేవుని వాక్యము యొక్క ఒక లోతైన గ్రహింపును కలిగియున్నాడు. ఏది ఏమైనా ఈ మాటను బట్టి పౌలు అతని శరీరము గురించి మాట్లాడెను. ‘‘ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము; అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినైయున్నాను. ఏలయనగా నేను చేయునది నేనెరుగను; నేను చేయ నిచ్ఛయించునది చేయక ద్వేషించునదియే చేయుచున్నాను. ఇచ్ఛయింపనిది నేను చేసినయెడల ధర్మశాస్త్రము శ్రేష్ఠమైనదైనట్లు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాని చేయునది నాయందు నివశించు పాపమేగాని నేను కాదు.’’ (రోమా 7:14-17) స్వభావసిద్ధముగా అతడు శరీర సంబంధి గనుక పాపము చేసెనని చెప్పాడు. అతడు శరీరసంబంధిగా వున్నంత కాలము అతడు మంచి చేయవలెనని కోరినప్పటికి, శరీర కోరికను వెదకువానిగా తనను తాను చూసుకొన్నాడు.
పౌలు ఆ విధముగా, ‘‘అంతరంగ పురుషుని బట్టి నేను దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించుచున్నాను గాని, వేరొక నియమము నా అవయవములో వున్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పొరాడుచు నా అవయములోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరచుకొనుచున్నది’’ (రోమా7:22-23)అని గ్రహించాడు. ఇందు వలననే అతని శరీరమును గురించి ‘‘అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను!’’ (రోమా 7:24) అని ఏడ్చుచు, విలపించాడు. పౌలు తిరిగి జన్మించిన తరువాత కూడా, చెడుతనము అతనియందున్నదని పౌలు చెప్పినప్పుడు, అతడు మంచి చేయవలెనని కోరినను, అతడు బాధను అనుభవించాడు. చెడుతనము అతని యందున్నదని పౌలు చెప్పినప్పుడు  అతడు అతని స్వంత శరీరమును గురించి ప్రస్తావించాడు. అతని అవయవములో ఆత్మనియమమునకు విరోధముగా పోరాడుచు, శరీరమునకు నష్టము కలుగచేయుచు, పాపము చేయుటకు నడుపు మరియొక నియమమును అతడు చూసాడు పాపము చేయుటకు శరీరము అతనిని స్వాధీనపరచుకొనుట అతడు చూసినందున, తీర్పునకు గురికాబడుట తప్ప అతనికి మరియొక అవకాశమే లేదని మాత్రమే అతడు అంగీకరించాడు. పౌలు కూడా శరీరము కలిగి యున్నందున, అతని శరీరము నుండి లేచు పాపమును బట్టి అతడు విలపించాడు.
అందువనలనే పౌలు ‘‘అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను!’’ అని స్పష్టముగా ప్రకటించాడు. అయితే అతడు దేవుని నీతిని నెరవేర్చినందుకు యేసుక్రీస్తుకు వందనము కూడా చెప్పాడు. ఇందువలననే యేసు ఈ భూమిమీదికి వచ్చెను, బాప్తిస్మము పొందెను, మానవజాతియంతటికి పాపము క్షమాపణను ఇచ్చుటకు సిలువ వేయబడెను అని విశ్వసించాడు. యేసుక్రీస్తు రక్తము మరియు బాప్తిస్మముతో ఆయనతో ఐక్యపరచు విశ్వాసమును అతడుకలిగియున్నందున అతడు హృదయపూర్వకముగా దేవునికి వందనము చెల్లించగలిగాడు.
యోహాను యేసుకు బాప్తిస్మమిచ్చినప్పుడు, అతని పాపములన్నియు లోపల పాపమువలె, ఒకేసారి అన్ని యేసుపైకి బదిలీ చేయబడినవని పౌలు తెలుసు. యేసు సిలువపైన మరణించినప్పుడు మనమందరము అదే విధముగా పాపము విషయములో మరణించామని కూడా అతనికి తెలుసు. కావున, మనము తప్పక నీరు మరియు ఆత్మ సత్యముతో కలిపి ఒక ఐక్య విశ్వాసమును కలిగియుండవలెను. నీ హృదయము యేసుక్రీస్తు బాప్తిస్మము మరియు రక్తముతో ఐక్యము చెందినదా? మరియొక మాటలో, దేవునినీతిని నెరవేర్చిన నీరు మరియు ఆత్మసువార్తతో నీ హృదయము ఐక్యము చెందినదా? యోహానునుండి మన ప్రభువు తీసుకొనిన బాప్తిస్మము మరియు సిలువపైన ఆయన చిందించిన రక్తముతో ఐక్యమునొందు మన విశ్వాసమును మనము తప్పక కలిగియుండవలెను. ఐక్య విశ్వాసములు కలిగియుండుట అనునది మనకు ఎంతో ప్రాముఖ్యము ఎందుకనగా నీరు మరియు ఆత్మ సువార్తతో ఐక్యము చెందుట అనునది ప్రభువు నీతితో ఐక్యము చెందుటయగును.
రోమా6:3 వ్యాఖ్యానించుచున్నది. క్రీస్తుయేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? దీని భావమేమనగా యేసు బాప్తిస్మమునందు విశ్వాసముంచుట చేత, మనము కూడా ఆయనతో బాప్తిస్మమును పొందియున్నాము. మన ప్రభువు మరణములోనికి ఐక్యపరచబడిన వారమయ్యామను భావమిచ్చుచున్నది. అదేమనగా, విశ్వాసముద్వారా ఐక్యతలోనికి బాప్తిస్మము పొందుటచేత, మనము ఆత్మీయముగా ఆయన మరణములోనికి బాప్తిస్మమును పొందాము. ప్రభువుతో ఐక్యమొందుట అనునది ఆయన బాప్తిస్మముతో ఐక్యమునొందుట మరియు ఆయన మరణముతో ఐక్యమునొంది మరణించుట.
కావున మనము తప్పక దేవునినీతిని యేసుబాప్తిస్మము మరియు సిలువపైన ఆయన మరణముయందు విశ్వాసముంచి వాటియందు ఐక్యపరచబడవలెను. నీవు ఇప్పటివరకు దేవునినీతిని పట్టుకొనిన, నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచనట్లయితే నీవు యేసు బాప్తిస్మముతోను మరియు ఆయన మరణముతోను ఐక్యపరచబడలేదు. ఇదే దేని యందుదేవుని నీతి ప్రత్యక్షపరచబడినదో ఆ సువార్త ఇది.
మన హృదయము యేసు బాప్తిస్మము మరియు సిలువపైన ఆయన మరణముతో ఐక్యము చెందనట్లయితే, మన విశ్వాసము కేవలము వేదాంతపరమైనది మరియు నిరుపయోగమైనది. నిన్ను నీవు యేసు బాప్తిస్మము మరియు సిలువపైన ఆయన రక్తముతో ఐక్యపరచుకొనుము మరియు వానియందు విశ్వాసముంచుము. ఈ విధముగా మనము విశ్వాసమంచవలెను. వేదాంతపరమైన విశ్వాసము ఉపయోగము లేనిది. ఉదాహరణకు నీది కాని గృహము ఎంత అందమైనదైనా ఏమి మేలు? దేవునినీతి మనదిగా చేయుటకొరకు, మన పాపములను కడిగివేయుటకు యేసు బాప్తిస్మము ఉద్దేశ్యమును తెలుసుకొనవలెను, మన శరీరము మరణము కొరకు సిలువపైన ఆయన మరణమును తెలుసుకొనవలెను. మన ప్రభువు చేత నెరవేర్చబడిన దేవునినీతియందున్న మన విశ్వాసము ద్వారా, అన్నిటి నుండి ఒకేసారి విమోచించబడవలెను, మరియు నూతన జీవములో నడువవలెను.
యేసు బాప్తిస్మము మరియు సిలువపైన ఆయన రక్తమునందున్న ఆవిధమైన విశ్వాసము ద్వారా, దేవుని నీతి వాస్తవముగా నీ స్వంతమగును. మనము తప్పక యేసు బాప్తిస్మము మరియు రక్తముతో ఐక్యము చెందవలెను, లేనట్లయితే మన విశ్వాసమునకు అర్థమే వుండదు.
‘‘అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, పాపమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును?’’(రోమా 7:24) ఇది కేవము పౌలు  విలాపమేకాదు.  క్రీస్తు నుండి వేరుపరచబడినవారివలె, నీది మరియు నాది కూడా. ఈ వేదన నుండి మనలను విడిపించువాడు యేసు, మరియు ఇది కేవలము మన కొరకు బాప్తిస్మము పొంది సిలువవేయబడి, పునరుత్థానుడైన ప్రభువునందు విశ్వాసముంచుట చేత మాత్రమే పరిష్కారించబడగలరు.
పౌలు చెప్పెను ‘‘మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ` నేను దేవునికి వందనములు చెల్లించుచున్నాను.’’ ఇది పౌలు ప్రభువుతో తనన తాను ఐక్య పరచుకొన్నాడని చూపించుచున్నది. యేసు బాప్తిస్మము మరియు ఆయన రక్తము ద్వారా మన పాపములన్నిటినుండి మనలను రక్షించెనని మనము విశ్వాసముంచి ఐక్యము చెందినట్లయితే మనము క్షమించబడి శాశ్వత జీవమును పొందుదుము. ఐక్యపరచబడిన హృదయముతో యేసు బాప్తిస్మమునందు నీవు విశ్వాసముంచినప్పుడు, నీ పాపములన్నియు యేసుక్రీస్తు పైకి బదిలీవేయబడినవి. ఆయన సిలువ మరణమునందు నీవు ఐక్యపరచబడుటతో ఒక విశ్వాసమును నీవు సంపాదించుకొన్న తరువాత నీవు ఆయనతో చనిపోయి ఆయనతో పునరుత్థానుడవు కావలసివుంది.
యేసు ఆయనకు ముప్ఫై సంవత్సరముల వయస్సు వచ్చినప్పుడు ఆయన పరిచర్యను ప్రారంభించాడు. మొట్టమొదటి ఆయన పరిచర్యలో చేసిన కార్యమేదనగా బాప్తిస్మమిచ్చు యోహానుచేత యొర్దాను నదిలో బాప్తిస్మము పొందుట. ఆయన ఎందుకు బాప్తిస్మము పొందెను? ఇది మానవాళి పాపములన్నిటిని ఆయనను భరించుట కొరకైయున్నది. కావున, యేసుచేత జరిగించబడిన దేవుని నీతితో మన హృదయమును ఐక్య పరచినప్పుడు, ఆయన బాప్తిస్మము ద్వారా మన పాపములన్నియు వాస్తవముగా యేసుపైన మోపబడినవి. మన పాపములన్నియు యేసుపైకి బదిలీచేయబడి అన్ని పాపములు  ఒకేసారి కడిగివేయబడినవి.
మన ప్రభువు వాస్తవముగా ఈ లోకమునకు వచ్చి మన పాపములను భరించుటకు బాప్తిస్మము పొందెను మరియు వాటి జీతమును చెల్లించుటకు మరణించెను. యేసు ఆయన బాప్తిస్మము పొందక మునుపు యోహానుతో ‘‘నీతియావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నది’’ (మత్తయి 3:15) అని చెప్పెను. ‘‘నీతియావత్తు’’ అనునది నరకమునకు నిర్దేశించబడిన మానవజాతిపాపములన్నిటిని కడిగివేసిన యేసు బాప్తిస్మమును సూచించుచున్నది. మరియు ఆయన మరణమును పునరుత్థానమును కూడా సూచించుచున్నది. దేవుని నీతి ఏమైయున్నది? పాత నిబంధనలో దేవుని వాగ్ధానము ప్రకారము, పాపులనందరిని రక్షించిన యేసు బాప్తిస్మము మరియు సిలువపైన మరణము అనునది ఆయన నీతియై యున్నది. యేసు మనష్యుని ఆకారములో ఈ లోకమునవచ్చి బాప్తిస్మము పొందుట అనునది మానవజాతి పాపమును ఆయనపైకి తీసుకొనుటకు మరియు వాటిని కడిగివేయుటకు.
యోహాను యేసుకు ఎందుకు బాప్తిస్మమిచ్చెను? ఇది మానవజాతి పాపములన్నిటిని తీసుకొనుటచేత నీతియావత్తు నెరవేర్చుట కొరకు క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన, మనమందరము ఆయన మరణములోనికి కూడా బాప్తిస్మము పొందియున్నాము. ఆయన మృతులలో నుండి లేచినందున, నూతన జీవములో ఇప్పుడు నడుచుచున్నాము. దేవుని నీతియందు విశ్వాసముంచుట అనునది యేసు బాప్తిస్మము, సిలువపైన ఆయన మరణము మరియు ఆయన పునరుత్థానమునందు విశ్వాసముంచి ఐక్యపరచబడుట. ఆయన బాప్తిస్మము పొందినప్పుడు యేసు మన పాపములన్నిటిని ఆయనపైన వేసుకొనెను అని విశ్వాసముంచుట అతి ప్రాముఖ్యమైనది. ఆయన సిలువలో మరణించినప్పుడు మనము ఆయనతో పాతిపెట్టబడియున్నాము. ఎందుకనగా ఆయన బాప్తిస్మము ద్వారా మనము ఆయనతో ఐక్యపరచబడ్డాము. మన పాపములన్నిటి నుండి విడిపించబడిన తరువాత కూడా దేవునినీతియందు విశ్వాసముంచుట అనునది మన హృదయము ఐక్యపరచబడుటకు అత్యంత అవసరమైనది. ఆయన సిలువపైన  మరణించినప్పుడు మనమందరము ఆయనతో కూడా మరణించినందుకు నేను దేవునికి వందనములు  చెల్లించుచున్నాను. ఏలయనగా ఆయన బాప్తిస్మముతో అప్పటికే ఆయన మన పాపములన్నిటిని తీసుకొనిపోయెను.
మన విమోచనము ద్వారా దేవునినీతిని సంపాదించుకొనిన తరువాత విశ్వాసముతో యేసుతోఐక్యము చెందుట అనునది అత్యవసరమైనది. విమోచనా బహుమానమును పొందిన తరువాత, మన విశ్వాసము కేవలము ఒక మార్పుగా మాత్రమే తగ్గిపోగలదు. అయితే మన హృదయమును ప్రభువు నీతితో ఐక్యపరచినట్లయితే, మన హృదయము దేవునితో జీవించును. మనము దేవుని నీతితోఐక్యము చెందినట్లయితే, మనము ఆయనతో జీవించుదుము. మనము ఆ విధముగా చేయనట్లయితే, ఆయనకు ఏ సంబంధము లేనివారముగా మారుదుము. మనము ప్రభువుతో ఐక్యము చెందకుండా, మన ప్రక్క వారి తోటను చూచి ఆశ్చర్యపడునట్లుగా, కేవలము వేడుక చూచువారివలే మిగిలిపోయినట్లయితే, ఆయన నుండి వేరుపరచబడుట ద్వారా దేవునితో ఏ సంబంధము లేని వారముగా మారుదుము. కావున, విశ్వాసమునందు ప్రభువు వాక్యముతోను మరియు దేవునినీతితోను ఐక్యము చెందవలెను.
 
 
యేసు బాప్తిస్మము మరియు సిలువపైన మరణముతో ఐక్యము చెందుటయందు మనము విశ్వాసము కలిగియున్నట్లయితే, మనము ప్రభువు నందు ఐక్యపరచబడిన క్రైస్తవులము.
 
దేవుని నీతియందు విశ్వాసముంచుట అనునది ప్రభువుతో ఐక్యపరచబడుట మరియు ఆయన నీతిని గుర్తించుటకు విశ్వాసమును కలిగియుండుట. మన జీవితములోని ప్రతి కార్యము దేవుని నీతితో ఐక్యపరచబడి యుండవలెను. ఆ విధముగా మనము జీవించవలెను. మనము ఆయన నీతితో ఐక్యము చెందినట్లయితే మనము మన శరీరమునకు దాసులమై చనిపోవుదుము, అయితే మనలను మనము దేవుని నీతితో ఐక్యపరచుకొనిన క్షణము నుండి, మన పాపములన్నియు క్షమించబడును. ప్రభువు నీతితో మనము ఐక్యపరచబడినప్పుడు మాత్రమే మనము దేవుని సేవకులమగుదుము. అప్పుడు దేవుని కార్యములన్నియు మనకు చెందినవిగా మారును, మరియు అటువంటి ఆయన కార్యములన్నియు మరియు శక్తి మనదిగా మారును. ఏది ఏమైనా, మనము ఆయనతో ఐక్యము చెందకపోయినట్లయితే, మనము ఆయన నీతితో ఏ సంబంధము లేని వారముగా మారుదుము.
మనము శరీరమునందు పౌలు వలె, అల్పులము మరియు బలహీనుము, అందువలన మనము తప్పక నీరు మరియు ఆత్మసువార్తతో ఐక్యమొందవలెను. యేసు యోహానుచేత బాప్తిస్మము పొందెను మనలను మన అన్ని పాపములనుండి రక్షించుటకు సిలువ వేయబడెను అని విశ్వసించవలెను ఐక్యము నొందవలెను. దేవుని సంతోషపరచు విశ్వాసము ఇది మరియు మన ఆత్మకు దేహముకు దీవెనలు తీసుకొనివచ్చును. విశ్వాసముంచు ఐక్యపరచబడిన మన హృదయముతో ప్రభువు సమృద్ధియందు మనము విశ్వాసముంచినట్లయితే, వాగ్ధానము చేయబడిన పరలోక దీవెనలన్ని మనవగును. ఇందువలననే మనము ఆయనతో ఐక్యము నొందవలెను.
మరియొక వైపున, మనము మన హృదయమును దేవునినీతితో ఐక్యపరచనట్లయితే, మనమెంత మాత్రము ఆయనను సేవించువారముగా వుండము. దేవుని నీతితో వారి హృదయమును ఐక్యపరచని క్రైస్తవులు అన్నింటికన్నా లోక విలువను ప్రేమించుదురు. వారు లోకములోని అవిశ్వాసులకు ఏ మాత్రము భిన్నముగా వుండరు. వారి జీవితము వలె వారు ప్రేమించు వారికి కలిగిన ఆస్తులన్నీ తీసివేయబడినప్పుడు మాత్రమే దేవునినీతియందున్న విలువను వారు గ్రహించుదురు. లోకములో వున్నవి ప్రజల జీవితమును అధీనములో వుంచుటకు శక్తిని కలిగియుండలేక విలువను కలిగి వుండవు. కేవలము ప్రభువు నీతి మాత్రమే వారి పాపము క్షమాపణను, శాశ్వత జీవమును మరియు దీవెనలను ఇవ్వగలదు. లోకపదార్థముల మన జీవితములకు విలువైనవి కావు. మనము మన ప్రభువు నీతితో ఐక్యపరచబడినట్లయితే మన పొరుగు వారివలె, మనము కూడా జీవించుదుము.
ప్రభువు నీతియందు మన హృదయము కూడా ఐక్యము నొందవలెను. మనము తప్పక విశ్వాసముతో జీవించవలెను మరియు క్రీస్తుతో మన హృదయమును ఐక్యపరచవలెను. క్రీస్తు నీతితో ఐక్యపరచబడిన విశ్వాసము రమ్యమైనది. 7వ అధ్యాయములో పౌలు చివరిగా చెప్పుచున్నదేమనగా మనము తప్పక ప్రభువునందు ఐక్యమునొందుటలో ఆత్మీయముగా జీవించవలెను.
ఆయన నీతితో అతని హృదయము ఐక్యము చెందకుండా దేవుని సేవకునిగా మారినవానిని నీవెన్నడైనను చూచితివా? ఒక్కడును లేడు! దేవుని నీతితో కలుసుకొనకుండా నీరు మరియు ఆత్మ సువార్త పాపక్షమాపణ కొరకు అవసరమైన ఒక షరతు అని గుర్తించు వానిని ఏవనినైనను చూచితివా? ఒక్కడును లేడు. మనము బైబిల్‌ గురించి ఎంత తెలిసినను, మనము దేవుని నీతితో కలుసుకొననంతకాము మరియు విశ్వసించనంతకాలము మన విశ్వాసము ఉపయోగములేనివగును, యేసు బాప్తిస్మము మరియు సిలువపైన ఆయన మరణము నందు మనము విశ్వాసముంచుటచేట, మన అన్ని పాపముల నుండి మనము రక్షించబడుదుము.
మనము ఒకేసారి పాపక్షమాపణను పొంది సంఘమునకు హాజరగుచున్నట్లయితే, మనము ఒకవేళ ఆయన నీతితో ఐక్యము చెందినట్లయితే, ప్రభువు ప్రణాళికలో ఏ భాగము లేని పాపులము. మనము దేవుని యందు విశ్వాసముంచుచున్నామని చెప్పినప్పటికి, మనము ఆయన నీతితో ఐక్యపరచబడనట్లయితే, మనము ప్రభువు నుండి వేరు పరచబడుదుము. మనము ఆదరించబడవలెనన్న సహాయము మరియు క్రీస్తుతో నడిపించబడవలెనన్న మనము తప్పక దేవునినీతితో ఐక్యము నొందవలెను.
నీవు ఎన్నడైనను నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచుటచేత నీవు దేవుని నీతిని నీ అన్ని పాపముల క్షమాపణను పొందితివా? పౌలు  సేవించినట్లుగా, ప్రతిదినము నీ శరీరము పాపమును సేవించుచుండగా, నీ మనస్సుతో దేవుని ధర్మశాస్త్రమును సేవించుదువా? అన్ని సమయములయందు మనము తప్పక దేవుని నీతితో కలుసుకొనవలెను. దేవుని నీతితో మనలను మనము ఐక్యపరచుకొనట్లయితే ఏమి సంభవించును? మనము నశించిపోవుదుము. అయితే దేవుని నీతితో ఐక్యము చెందినవారు దేవుని సంఘముతో ఐక్యము చెంది జీవితమును కొనసాగించుదురు.
దేవుని నీతియందు విశ్వాసముంచుట అనగా సంఘముతోను దేవుని సేవకులతోను కలుసుకొనుట మనము దేవుని నీతితో ప్రతిదినము ఐక్యము చెందినప్పుడు మాత్రమే మనము విశ్వాసముతో జీవించుటలో కొనసాగగలము. ఆయన నీతియందు విశ్వాసముంచుటచేత వారి పాపము నుండి రక్షించబడినవారు ప్రతి దినము తప్పక దేవుని సంఘముతో ఐక్యపరచబడవలెను. ఈ శరీరము ఎల్లప్పుడు పాప నియమమును సేవించుటకు కోరుచున్నందున మన మెల్లప్పుడు దేవుని ధర్మశాస్త్రమును ధ్యానము చేయుచు విశ్వాసముచేత జీవించవలెను. మనము దేవుని నీతిమీద కేంద్రీకరించి ధ్యానము చేయుటలో కొనసాగినప్పుడు మనము ప్రభువుతో ఐక్యమొందగలము.
దేవుని నీతియందు విశ్వాసముంచు మనము, అనుదినము దేవుని సేవకులతోను మరియు సంఘముతోను ఐక్యముగా వుండవలెను. ఆ విధముగా చేయుటకు, మనమెల్లప్పుడు దేవుని నీతిని జ్ఞాపకముంచుకొనవలెను. మనము ప్రతిదినము దేవుని సంఘమును గురించి ఆలోచించుచు దానితో ఐక్యముగా వుండవలెను. మనకు బదులుగా మన ప్రభువు మన అన్ని పాపములు భరించుటకు బాప్తిస్మము పొందెను అను వాస్తవమును ధ్యానము చేయవలెను. ఈ విశ్వాసముతో మరియు దేవునినీతితో మనము కలుసుకున్నప్పుడు, మనము దేవుని నుండి సమాధానమును కలిగియుండగలము. మరియు నీవు తిరిగి నూతన పరచబడుదువు, ఆయన చేత దీవించబడి శక్తిమంతుడవగుదువు.
దేవుని నీతితో నిన్ను నీవు ఐక్యపరచుకొనుము. అప్పుడు నీవు నూతన బలమును కనుగొందువు. ఇప్పుడు దేవుని నీతియందు యేసు బాప్తిస్మము నందు విశ్వాసముంచుము. నీ పాపము కొనిపోబడును. సిలువపైన క్రీస్తు మరణముతో నీ హృదయమును ఐక్యపరచము. నీవు, కూడా ఆయనతో చనిపోవుదువు. ఆయన పునరుత్థానముతో ఐక్యమొందుము. నీవు కూడా మరలా జీవించుదువు. క్లుప్తముగా నీ హృదయమందు నీవెప్పుడు క్రీస్తుతో ఐక్యపరచబడుదువో, నీవు చనిపోయి క్రీస్తుతో పునరుత్థానుడువగుదువు, ఆ విధముగా నీ అన్ని పాపముల నుండి నీవు విడుదల పొందుదువు.
నీకు క్రీస్తుతో ఐక్యము చెందనట్లయితే ఏమి సంభవిస్తుంది? మనము గందరగోళములోపడి యేసు ఎందుకు బాప్తిస్మము పొందెను? పాత నిబంధననకు క్రొత్త నిబంధనకు బేధమేనగా, ముందుగా మాట్లాడిన చేతులుంచుట అనునది మరియు తరువాత చెప్పబడిన బాప్తిస్మము అయితే? దీనికున్న పెద్ద బంధమేమిటి? అని అడగవచ్చు. సమాచారమే దృక్పధముగా లేక వేదాంతపరమైన విశ్వాసము అనునది వాస్తవమైన విశ్వాసము కాదు. అయితే ఇది క్రమ క్రమముగా దేవునినుండి దూరముగా తిరిగులాడునట్లుగా నడుపును.
ఈ విధముగా విశ్వసించువాడు అతని ఉపాధ్యాయుని నుండి కేవలము సమాచారమును మాత్రమే స్వీకరించువాని వంటివాడు. విద్యార్ధి నిజముగా అతని ఉపాధ్యాయుని గౌరవించినట్లయితే, అతడు అతని గొప్ప ప్రవర్తనను, నాయకత్వమును, గొప్ప మూర్తిమత్వమును కూడా నేర్చుకొనును. మనము దేవుని వాక్యమును మరియొక జ్ఞానముగా నేర్చుకొనకూడదు. అయితే మనము దేవుని మూర్తిమత్వమును, ప్రేమను, కరుణను, తీర్పును మన హృదయముతో స్వీకరించవలెను. ఒక సమాచారముగా ఆయన వాక్యమును నేర్చుకొనుట అను ఆలోచనను మనము తప్పక తోలివేయవలెను. దేవుని నీతితో కలుసుకొనుట అనునది విశ్వాసులను నిజ జీవితమును సంపాదించుకొనుటకు నడుపును. ప్రభువుతో ఐక్యమొందము! ఐక్యపరచబడిన విశ్వాసమే నిజమైన విశ్వాసము. ఒక వేదాంత మరియు జ్ఞాన సముపార్జనతో కూడిన విశ్వాసము ఒక ఐక్యపరచు విశ్వాసము కాదు గాని, మ్రింగివేయు విశ్వాసము.
ఒక పాటలో పాడబడినట్లుగా ‘‘దేవుని కరుణ’’ అనునది ‘‘పరలోక సముద్రము మరియు అంతములేని ప్రవాహము’’. మన హృదయము దేవుని నీతితో ఐక్యము చెందినప్పుడు, ఒక అవధులు లేని అంతములేని దేవుని కరుణవంటి మనకు సమాధానము నిచ్చిన ఆయన నీతి వుంటుంది. అయితే వేదాంత మరియు సమాచార సముపార్జన దృక్పధముగ దేవునితో కలువని విశ్వాసము లోతులేని నీరు వంటిది. సముద్రమునకు లోతులేనట్లయితే, ఇది తేలికగా నురుగు కక్కును, అయితే సముద్రము లోతుగానున్న ప్రాంతములోని మెరుపు పుట్టించు నీలి తరంగము ప్రవాహము వర్ణణాతీతముగా వుంటుంది. అయితే లోతులేని నీటిలో, అలలు తీరమును తాకినప్పుడు అవి గడ్డ కడతాయి. విరిగిపోతాయి, నరుగ కడతాయి, కలగాపులగముగా కలసిపోతాయి. దేవునినీతితో ఐక్యపరచని విశ్వాసము కలవారు లోతులేని నీటిలో అలలవంటివారు. 
దేవుని నీతి ఐక్యముగ హృదయము కలిగినవారు, లోతుగా వుండి, క్రీస్తుకు కేంద్రముగా, స్థిరులుగా అన్ని పరిస్థితులలో కదల్చబడనివారుగా వుంటారు. అత్యున్నతుడైన వాని చిత్తము వైపు వారి హృదయము కదులును. ఎవరి హృదయము ఆయన నీతితో కలుపబడవో వారు స్వచ్ఛమైన సమస్యకే సులభముగా కదల్చబడుదురు.
ప్రభువుతో ఐక్యపరచబడిన విశ్వాసమును మనము తప్పక కలిగియుండవలెను. మనము తప్పక దేవుని వాక్యమును కలుసుకొనవలెను. మనము తప్పక చిన్న చిన్న వాటికే కదల్చబడకూడదు. ప్రభువుతో ఐక్యపరచబడినవారు క్రీస్తుతో బాప్తిస్మమును పొందారు మరియు క్రీస్తుతో చనిపోయారు. మరియు మృతులలోనుండి క్రీస్తుతో మరలా లేచారు. మనము ఈ లోకమునకు ఏ మాత్రమును చెందము గనుక, ఆయన నీతి సేవకులుగా అంగీకరించిన, ఆయనను సంతోషపరచుటకు మనము దేవుని నీతితో ఐక్యము చెందవలెను.
మనము దేవుని నీతితో ఐక్యము చెందినట్లయితే మనము ఎల్లప్పుడు సమాధానము సంతోషము పూర్ణ బలముతో వుందుము ఎందుకంటే ప్రభువు బలము మనదగును. ఆయన శక్తి మరియు దీవెనలు మనవిగా చేయబడినందున, మనము గొప్పదీవెనతో జీవించుదుము. మనము విశ్వాసముతో యేసు బాప్తిస్మము మరియు సిలువపైన ఆయన మరణమును కలుసుకొన్నట్లయితే, ఆయన శక్తియంతయు మనదగును.
ప్రభువుతో నీ హృదయమును ఐక్యపరచుము. నీవు నీ ప్రభువుతో ఐక్యపరచినట్లయితే, నీవు దేవుని సంఘముతో కూడా ఐక్యపరచబడుదువు. దేవునితో ఐక్యము నొందినవారు వారి సహవాసములోను, ఆయన కార్యములలోను ఆయన వాక్యమునందున్న వారి విశ్వాసములో కలిసి పెరుగుట ద్వారా, ఈ విధముగా చేయుటచేత, ఒకరితో ఒకరు ఐక్యముగా నుందురు.
మనము మన హృదయమును క్రీస్తుతో ఐక్యపరచనట్లయితే, ఏది ఏమైనా, మనమంతా పోగొట్టుకుంటాము. చివరికి మన విశ్వాసము ఆవపు గింజంత చిన్నదైనప్పటికి, మన ప్రభువు ఇప్పటికతై మన పాపములను అన్ని ఒకేసారి క్షమించెను. మన బలహీనతకు వేరుగా ప్రతిదినము మనము ఈ సత్యముతో కలుసుకొనవలెను. కేవలము ఐక్యపరచబడిన ఒక విశ్వాసము మాత్రమే యేసుక్రీస్తు ద్వారా దేవునికి వందనములు చెల్లించునట్లు చేయును మరియు నిన్ను జీవింపజేయును.
మనము ప్రభువు నీతితో ఐక్యము చెందినప్పుడు, మనము నూతన బలమును కనుగొందుము మరియు మన హృదయము స్థిరముగా నుండును. మనము దేవుని వాక్యముతో ఐక్యము చెందినప్పుడు మన హృదయము నీతిమంతముగా తీర్చబడును. మన స్వంత మనస్సును వెంబడించుటచేత ప్రభువును సేవించవలెను అను పట్టుదలను సంపాదించుకొనుట అసాధ్యము. మనము యేసు బాప్తిస్మముతో ఐక్యము చెందినప్పుడు, ఆయన సిలువ మరియు పునరుత్థానము మన విశ్వాసము లేఖనముననుసరించి స్థిరముగా నిలుచును పెరుగును.
మనము తప్పక మన హృదయమును ప్రభువుతో ఐక్యపరచవలెను. ఆయనయందు ఐక్యపరచబడిన విశ్వాసమే నిజమైన విశ్వాసము; ఆయనతో ఐక్యపరచబడని విశ్వాసము ఒక తప్పు విశ్వాసము.
యేసు బాప్తిస్మము మరియు సిలువపైన ఆయన రక్తమును మనకిచ్చుటచేత మన విశ్వాసమును దేవునితో ఐక్యపరచుటకు అనుమతించినందుకు మేము దేవునికి వందనములు చెల్లించుచున్నాము. ఈ దినము మొదలుకొని మనము ప్రభువును కలుసుకొను చివరి దినము వరకు మీరు తప్పక మీ హృదయమును ఆయనతో ఐక్యపరచవలెను. రండి మనము ఆయనతో ఐక్యమగుదుము.
మన హృదయమును దేవునితో ఐక్యపరచవలసియున్నది ఎందుకనగా మనము ఆయన యెదుట బలహీనులము. పౌలు కూడా దేవునితో ఐక్యపరచబడ్డాడు మరియు అతని పాపము నుండి విడిపించబడ్డాడు. దేవుని నీతియైన యేసుక్రీస్తు చేత ఇవ్వబడిన నీరు మరియు ఆత్మ సువార్తను తెలుసుకొని దానియందు విశ్వాసముంచుటచేత పౌలు దేవుని ప్రశస్తమైన నీరు మరియు ఆత్మ సువార్తను ప్రపంచమునకు బోధించిన సేవకునిగా మారాడు. మన మనస్సుతో దేవుని ధర్మశాస్త్రమును సేవించుచు మన శరీరముతో పాప నియమమును సేవించును, మనము బలహీనులమైనందున, మనము ప్రభువుతో ఐక్యము చెందుట ద్వారా మాత్రమే జీవించగలము.
యేసు నీతితో ఐక్యపరచు విశ్వాసమును గురించి నీవు నేర్చుకొనియున్నావా? నీ విశ్వాసముయేసు బాప్తిస్మముతో ఐక్యము చెందినదా? యేసు బాప్తిస్మము మరియు రక్తమునందు విశ్వాసముంచు ఒక ఐక్యపరచబడిన విశ్వాసమును నీవు కలిగియుండటకు ఇదే సమయము. దేవుని నీతియందు ఐక్యము కలిగియుండని విశ్వాసము కలిగినవారు వారి విశ్వాసములో వారి రక్షణలో, వారి జీవితములో వారు విఫలమయ్యారు.
కావున, దేవుని నీతి అనునది నీ విడుదలకు వుండవలసిన అవసరము. ప్రభువుతో ఐక్యము చెందియుండుట అనునది మననందరిని పాపములు  క్షమాపణను పొందుటకు మరియు దేవుని కుమారులుగా మారుటకు నడిపించు ఒక దీవెన. ఆయన నీతియందు విశ్వాసముంచుట ద్వారా మరియు నిన్ను నీవు ఐక్యపరచుకొనుట ద్వారా దేవుని నీతిని పొందుము. అప్పుడు దేవుని నీతి నీదగును మరియు దేవుని దీవెను ఎల్లప్పుడు నీతో వుండును.
 

యేసుక్రీస్తును బట్టి దేవునికి వందనములు!

మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి వందనములు చెల్లించుచున్నానని పౌలు చెప్పుచున్నాడు. యేసుక్రీస్తు ద్వారా విశ్వాసము చేత పొందిన దేవుని నీతిని బట్టి అతడు దేవునికి వందనములు  చెల్లించుచున్నాడు. పౌలు  దేవుని నీతియందు విశ్వాసముంచిన తరువాత కూడా, అతని మనస్సుతో దేవుని ధర్మశాస్త్రమును మరియు శరీరముతో పాపనియమమును సేవించుట తప్పా మరేమియు చేయలేకపోయాడు. అయితే అతడు దేవుని నీతియందు అతని హృదయమంటితో విశ్వాసముంచినందున, అతని హృదయము పాపమును కలిగిలేదు.
యేసుక్రీస్తునందు అప్పటికే ధర్మశాస్త్రముచేత శిక్షించబడ్డానని, దేవుని నీతిని బట్టి పాపము నుండి రక్షించబడ్డానని పౌలు ఒప్పుకున్నాడు. దేవుని ఉగ్రతను మరియు ఆయన ధర్మశాస్త్రము యొక్క శిక్షను ఎదుర్కొనువారు దేవుని నీతియందు వారి హృదయములో విశ్వాసముంచుటచేత రక్షణా ఫలమును ఫలించగలరని కూడా పౌలు చెప్పెను. తిరిగి జన్మించినవారి హృదయములో, శరీర సంబంధమైన కోరికతో పాటుగా పరిశుద్ధాత్మ కోరికు కూడా వుండును. అయితే తిరిగి జన్మించని వ్యక్తి తన హృదయములో కేవలము శరీర సంబంధమైన వాంఛను మాత్రమే కలిగి వుంటాడు. కావున, పాపులు  కేవలము పాపము చేయుటను మాత్రమే కోరుదురు. దీనిని మించి వారి స్వాభావికమైన ప్రేరణను బట్టి, ఇతరుల నేత్రములకు వారి పాపము అందముగా చేయుటకు ప్రయత్నము చేయుదురు.
తిరిగి జన్మించని పెద్దలు  డీకాన్స్ సామాన్యముగా నేను విలువగా బ్రతుకవలెనని కోరుచున్నాను, అయితే ఇది ఎందుకింత కష్టముగా నాకు తెలియదు అని అంటుంటారు. వారు ఎందుకు ఈ విధముగా జీవించుచు ఎందుకు నిస్సహాయిుగా వుంటున్నారో మనము చూడాలి. ఇది ఎందుకనగా వారు దేవునినీతియందు విశ్వాసముంచక తిరిగి జన్మించనివారు. వారు హృదయములో పాపముంటుంది. ఎందుకనగా దేవుని నీతి వారియందు కనుగొనబడలేదు. అయితే తిరిగి జన్మించిన వారి హృదయములో దేవుని నీతి మరియు పరిశుద్ధాత్మ రెండు వుంటాయి. అయితే పాపముండదు.
పౌలు అతని హృదయములో పాపమును కలిగియున్నప్పుడు, అతడు ‘‘మేలైనది చేయవలెనన్న కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుట లేదు. నేను చేయగోరుమేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను? ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును?’’ ఏది ఏమైనా పౌలు వెంటనే మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నేను దేవునికి కృతజ్ఞతగా స్తుతులు చెల్లించుచున్నాను (రోమా7:25) అని కలుపుచున్నాడు. దీని భావము దేవుని
నీతినంతటిని నెరవేర్చిన, యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట చేత అతడు అతని అన్ని పాపముల నుండి రక్షణ పొందియున్నాడని భావము.
7వ అధ్యాయములో పౌలు చెప్పవలెనని ప్రయత్నము చేయున్నదేనమగా, తిరిగి జన్మించకుండా మతపరముగా వున్నప్పుడు, అంతకుముందు ధర్మశాస్త్రము పాత్ర ఏమైయున్నదో అతడు ఎరుగలేదు. అయితే అతడు పాపముచేత, ఏర్పడిన దౌర్బాగ్యస్థితి నుండి అతనిని విడిపించినవాడు, దేవుని నీతిని విజయవంతముగా నెరవేర్చిన యేసుక్రీస్తు అని చెప్పెను. యేసుక్రీస్తు మనలను పాపము నుండి రక్షించుటకు దేవుని నీతిని నెరవేర్చెను అని విశ్వసించుదురో వారు రక్షించబడుదురు.
దేవుని నీతియందు విశ్వాసముంచువారు మనస్సుతో దేవుని ధర్మశాస్త్రమును సేవించుదురు, శరీరముతో పాప నియమమును సేవించుదురు. వారి శరీరము పాపము వైపునకు మొగ్గుతుంది. ఎందుకనగా వారు తిరిగి జన్మించినప్పటికి, ఇది ఇప్పటికి మార్చబడలేదు. ఈ శరీరము పాపమును కోరును, అయితే దేవునినీతియందు విశ్వాసముంచు మనస్సు, దేవుని నీతిని వెంబడించుటకు ఇష్టపడును. మరియొక వైపున పాపము క్షమాపణను పొందనివారు వారి మనస్సుతోను వారి శరీరముతోను పాపమును చేయుటకే నడిపించబడుదురు. ఎందుకనగా వారి హృదయ ప్రమాణములో పాపము కనుగొనబడినది. అయితే దేవుని నీతిని ఎరిగి దీనియందు విశ్వాసముంచినవారు ఆయన నీతితో నిలచియుందురు.
క్రీస్తు దేవుని నీతిని నెరవేర్చినందున, మేము యేసుక్రీస్తు ద్వారా దేవునికి వందనములు చెల్లించుచున్నాము. ఆయన నీతిని మాకు ఇచ్చినందుకు మరియు దీనియందు విశ్వాసముంచుటకు మమ్మును నడిపించినందుకు ప్రభువునకు వందనము.