• All e-books and audiobooks on The New Life Mission website are free
  • Explore multilingual sermons in global languages
  • Two new revised editions in English have been released
  • Check out our website translated into 27 languages
Search

Sermons

అంశం 9: రోమీయులకు ( రోమా పత్రిక పుస్తకం పై నున్న వ్యాఖ్యానం)

[అధ్యాయము 7-4] శరీరమునకు మాత్రమే సేవ చేయు మన శరీరము (రోమా 7:14-25)

2021.04.28 1,306

(రోమా 7:14-25)
‘‘ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని యెరుగుదుము; అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినైయున్నాడు. ఏలయనగా నేను చేయునది నేనెరుగను; నేను చేయ నిచ్ఛయించునది చేయక ద్వేషించునదియే చేయుచున్నాను. ఇచ్ఛయింపనిది నేను చేసినయెడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాని చేయునది నాయందు నివశించు పాపమేగాని నేనుకాదు. నాయందు, అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివశింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని, దానినిచేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసినయెడల, దానిని చేయునది నాయందు నివశించు పాపమేగాని యికను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకుకీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషునిబట్టి దేవుని ధర్మశాస్త్రము నందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమమును నా అవయవములలో వున్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యడను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవనియమము నకును, శరీర విషయములో పాపనియమమునకును దాసుడనై యున్నాను.’’

 

 

ఆయనకృప ఎంత అద్భుతమైనది !


ఈ వేసవికాల బైబిల్‌ మీటింగ్‌కు మంచి దినమును మాకిస్తూ తుఫానును నిరోధిస్తూ వాతావరణమును ఏలుచూ అనుమతించినందుకు దేవునికి వందనములు చెల్లించు చున్నాను. ఆయన ఆత్మలను పంపెను మరియు ఆయన వాక్యమును ఇచ్చుటకు మరియు ఒకరికొకరము మరియు పరిశుద్ధాత్మతో సహవాసములో ఆనందించుటకు చేర్చెను.
దేవుడు సజీవుడు! ఆయనకృప ఎంత అద్భుతమైనది ! ప్రజలు ‘‘డాగ్‌’’ అని పిలుచు గాలి తుఫాను తప్పక వచ్చునని, తలంచుచున్నారు. అందువలన అధికారులు ఇన్‌`జా లోయలో దండువేసిన వారందరిని వెనక్కి తీసుకొని వచ్చుటకు గస్తీ తిరుగుతూ వున్నారు. ఈ ఉదయం నేను ఇన్‌జా లోయలోనికి వెళ్లాను. ప్రజలు రాబోవుచున్న గాలి తుఫానును ఎంత శక్తివంతముగా వినాశనమును కలిగించబోవు చున్నదో వివరించుకొనుచు, ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచు ఆందోళన పడడం నేను విన్నాను.
వారు ఊహించుచున్నట్లు దేవుని కుమారులైన మనము వేసవికాల శిక్షణా తరగతులకు కూడుకొనిన తరువాత కూడా వారు అనుకున్న ప్రతీదీ జరుగునా? మనము ప్రార్థించినట్లయితే దేవుని కృపచేత ఇది కురవదు. దేవుడు ఆయన ప్రజలను ఊదివేయునా? దేవుడు వాతావరణమును ఏలును. అయితే ఆయన మన విశ్వాస పరిమాణముమీద ఆధారపడి చేయును. ఆయన జ్ఞానముగా పనిచేయును. దీని భావమేమనగా ‘‘మనము ఈ వేసవి కాల శిబిరమును ఏర్పాటుచేసిన తరువాత దేవుడు మనకెందుకు ఈ గాలి తుఫానును ఇవ్వాలి?’’ అని వారు ఆశ్చర్యపోవునట్లుగా చేయుటచేత ఇప్పుడే విశ్వాసము ప్రారంభమైన వారికి నేను పరీక్ష పెట్టను.
దీనిని గురించి నేను వార్తలో విన్నప్పుడు ఈ గాలి తుఫానును నిరోధించే శక్తి నాకు లేదు. నేను చేయగలిగినదంతా ప్రార్థన చేయుట. ఈ వేసవికాల శిబిరము ఇప్పటికే కేటాయించబడినది, మనము ఇప్పటికే కూడుకొనియున్నాము. దీని గురించి చేయుటకు నాకేమి లేదు. ముందుగానే తయారు చేయబడిన వాటితో నిర్మించిన ఈ ప్రార్థనా మందిరము గాలి తుఫానుకు నిలబడుతుందా అని నేను ఆందోళనలో పడ్డాను. అందువలన నేను దేవుని మీద ఆధారపడుట తప్ప మరేమియు చేయలేను. నేను ‘‘దేవా మాకు సహాయము చేయుము, మమ్మును కాపాడుము. యేసు నామమున అడుగుచున్నాను, ఆమెన్‌ అని ప్రార్థించాను. నిశ్చయముగా దేవుడు డాగ్‌ తుఫానును నిరోధించాడు. దేవునికి ప్రతీది తెలుసని నేను నమ్ముచున్నాను. మనలను సురక్షితమైనదానికి ఆయన నడిపించును ఎందుకనగా మనము అర్థము చేసుకొనినదాని కంటే మన పరిస్థితిని ఆయన బాగుగా అర్థము చేసుకొనును.
వాతావరణము దేవుడు సజీవుడని చాలా తక్కువలో చూపించును. నా గుడారములో తుపాకి పేల్చిన శబ్దము వలె మెరుపుతో కూడిన ఊరుమును నేను విన్నాను. అందువలన, నేను నా గుడారము వెలుపలికి వచ్చి, ఆకాశముపైపు చూశాను. ఆకాశము నల్లగా వుండి మరియు దట్టమైన మేఘములు లోయవైపు వస్తూ వున్నాయి. అందువలన ప్రభువా మేఘములో వచ్చుచున్నావా? అని అడిగాను. నా విశ్వాసము బలహీనపడుటకు ప్రారంభించనది. ప్రభువా ఏమి జరుగుచున్నది ? గాలి తుఫాను ఇక్కడికి చేరినదా? నిజముగా ఇది ఇక్కడ వున్నదా? అయితే నేను ప్రార్థించి దేవుని యందు విశ్వాసము కలిగియున్నాను. ఈ విశ్వాసమును పట్టుకొనుటకు, ప్రభువా మమ్మును సంరక్షించెదవని నేను నమ్ముచున్నాను. నేను నీయందు విశ్వాసముంచుచున్నాను. నీవు మా కొరకు కార్యము చేయుదువనే నేను ఇప్పటికే విశ్వాసముంచియున్నాను. మనము విశ్వసించినట్లుగా దేవుడు నిజముగా మనలను దీవించెను. మన హృదయముతో మనము ఆయనకు వందనములు చెల్లించుదుము.

 


శరీరము స్వార్ధపూరితమైనది మరియు చెడ్డది


దేవుడు మన కొరకు కార్యము చేయనట్లయితే మనము ఏమీ చేయలేము. దేవుడు మనలను కాపాడెను మరియు మనకు సహాయము చేయును. దేవుని వాక్యము వైపు ఒకసారి చూద్దాం. రోమా 7:14-25 మనకు చెప్పుచున్నది అపోస్తలుడైన పౌలు అతడు శరీరములో వుంటూ పాపమునకు అమ్మివేయబడియున్నానని తనను తాను చూచుకొనుచున్నాడు. అతడు జీవించుచుండగా శరీరము పాపము చేయుట తప్ప మరేమియు చేయలేదని కూడా అతడు కనుగొన్నాడు.
తిరిగి జన్మించిన మనము కూడా ఈ శరీరముతో మంచి చేయవలెనని కోరినను కీడు చేయుదుము. రోమా7:19 వ్యాఖ్యానించుచున్నది. ‘‘మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు కలుగుట లేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను.’’ మనయందు ఏ మంచి నివశించుటలేదని మనము తెలుసుకున్నాము. దానిని బట్టి ‘‘నేను నా విశ్వాసమును కాపాడుకొనగలనా?’’ అని తలంచుచు వేదనతో నిట్టూర్చుచున్నాను. మన నిస్సహాయమైన చెడ్డ శరీరమును బట్టి మనము ఎంతో దుఃఖించియున్నాము. శరీరము ఎంత స్వార్ధపూరితమైనదో నీకు తెలుసా? రోమా 7:18 వ్యాఖ్యానించుచున్నది. ‘‘నాయందు, అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివశింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు కలుగుట లేదు.’’
మనము ఎల్లప్పుడు కీడుచేయువారి బీజమైనప్పటికి మన వైపే మనము ఆలోచిస్తాం. మానవులమైన మనమందరము ఎంత స్వార్ధపరులమో మీకు తెలుసా? మనము దుష్టులమని మనకు నిశ్చయముగా తెలుసు. అయితే మనము ప్రభువు వైపున వుండము. ప్రభువు నిశ్చయముగా మంచివాడు మరియు ఆయన చిత్తము కూడా మంచిది. మనము చెడ్డవారమని మనకు తెలుసు, అయినప్పటికి మనలను మనము ఎంతో ప్రేమించుకుంటాము. ఆయన యెదుట మరియొక దేవుడుండకూడదని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చాడు. పాపమును గూర్చి తెలివిని మనకిచ్చుటకు దేవుడు మనకు చెప్పెను.
మనలను మనము ప్రేమించుకుంటాము మరియు మనమెంత స్వార్ధపరులమో మరియు స్వనీతిపరులమో మనము ఎరిగియున్ననూ మనకొరకు మనము అంతా చేసుకుంటాము. ఏదైనా ఉపకారమైనది మనకు కనబడినప్పుడు మనము చింత పడతాము. అయితే మనము ప్రభువుకొరకు ఎంత లోభముగా అల్పులముగా వుంటాము? ఇది ఎందుకంటే మనకు ఇంగిత జ్ఞానము లేదు. వారి ఆట బొమ్మలకన్నా విలువైన వస్తువులు ఈ ప్రపంచములో ఉంటాయని వారికి తెలియదు. పిల్లలు వారి ఆటబొమ్మలకన్నా విలువైన వస్తువులు ఈ ప్రపంచములో వుంటాయని వారికి తెలియదు. పిల్లలు అలానే వున్నారు. మనము అలానే వున్నాము. 
మన పాపములు కడిగివేయబడినవి. అయితే మనము ఇప్పటికీ స్వార్ధపరులమే. మనలను పాపములేనివారిగా చేసినందుకు మరియు ఆయన శక్తిచేత పరిశుద్ధాత్మను మనకిచ్చినందుకు మనము ప్రభువుకు వందనము చెల్లించుచున్నాము. మనము తిరిగి జన్మించిన తరువాత మరియు పాపక్షమాపణను పొందిన తరువాత మనలోయుద్ధము ప్రారంభమగును. ఈ యుద్ధము శరీరము మరియు ఆత్మ మధ్యన మనము తిరిగి జన్మించిన తరువాత మనము సంతోషముగా వుంటాము. అయితే మనము త్వరలోనే ఈ యుద్ధము చేత చీల్చివేయబడతాము. అయితే ప్రభువు ఇప్పుడు దేవునిరాజ్యము కొరకు మనము పనిచేయవలెనని కోరుచున్నాడు.
మన ప్రభువు మన కొరకు ఆయన రాజ్యమును వదలివేసెను. ఆయన శరీర రూపములో పంపబడెను. ఆయన లోకమునకు ఒక అందమైన వానిగా పంపబడలేదు. ఆయన ఈ లోకమునకు ఒక దీనునిగా పంపబడ్డాడు. అంటే కురచకాలు కలిగినవానిగా లేక కురూపిగా పంపబడ్డాడు వాస్తవమునకు యేసును ఏ మాత్రము అందగాడు కాడని చెప్పబడినది. ‘‘అతడు తృణీకరింపబడినవాడును ఆయెను మనుష్యుల వలన విసర్జింపబడినవాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించినవాడుగాడును అయెను మనుష్యులు చూడ నొల్లనివాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడుగనుక అతనిని ఎన్నిక చేయకపోతిమి.’’ (యోషయా 53:2) ఇప్పటికి, ప్రభువు మన అందరి పాపమును తీసుకొని పోయెను. 
మన శరీరము కేవలము పాపమును మాత్రమే సేవించును. పౌలు అతని శరీరము ఒక పాపము ముద్ద అని చెప్పెను. అందువలన అతడు ‘‘నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను.’’ అయినప్పటికి అతడు దీని గురించి వివరముగా చెప్పలేదు ఎందుకంటే అతడు అతని పాపమును గురించి చెప్పుటకు సిగ్గుపడ్డాడు.
మనము చెత్తబుట్టవంటి వారము. మనము పాపపు ముద్దలము. మన వెనుక పనికిమాలిన చెత్తను వదలివేయు మనలను మనము చూసుకున్నప్పుడు మనమెంతగా అంగీకారయోగ్యులము కాకుండా వున్నాము. మన మనస్సాక్షిచేత గ్రుచ్చబడుటచేత ప్రభువా నేను దీనిని చేయకూడాదా, నేను నీ చిత్తప్రకారము జీవించాలనుకుంటున్నాను, అయితే నేను దీనిని మరలా చేసాను. దీనిని నేనెలా ఆపగలను ప్రభువా? అని దేవునితో అంటాము.

 


మన దుష్టత్వమును మనము తెలుసుకున్నప్పుడు మనము దేవునికి వందనములు చెప్పగలము


మన దేవుడు యేసుక్రీస్తు మనకిచ్చిన కృపను గురించి ఆలోచించవలెను. మన హృదయముతో దేవుడు చేసిన దానిని గురించి ఆలోచించవలెను. అప్పుడు మాత్రమే ఏది సరియైనదో మనము తెలుసుకొనగలము, అప్పుడు మాత్రమే ప్రభువును సేవించుట ప్రారంభించగలము. దేవుని కృప వలన, మరియు ఆయన యందున్న విశ్వాసమును బట్టి మనము దేవునిని వెదకుచున్నాము. మరియు మనము మన హృదయముతో ఆయనను వెంబడిచుచు ఆయనతో నడుచుచున్నప్పుడు, మన కొరకు ఎదురుచూచుచున్న ఏ సవాలునైనను జయించుచున్నాము.
మనము దుష్టులమని దేవునియెదుట ఉపయోగములేని వారమని మనలను గురించి మనము తెలుసుకున్నప్పుడు మనలను మనము తృణీకరించుకొనుట ప్రారంబిస్తాము. మన శరీరమును బట్టి ప్రభువును సేవించకుండా పాపము చేయకుండా వుండుట అసాధ్యము అని, మరియు మనమెంతగా దీవించబడినను మన బలహీనతను బట్టి మనమేమీ చేయలేమని గ్రహిస్తాము. ఆయనను సేవించుటకు నన్ను దీవించినందుకు నేను దేవునికి వందనములు చెల్లించుచున్నాను. ఈ సువార్తను సేవించుటకు దేవుడు నన్ను ఈ పరిచర్యలో పెట్టకుండా వున్నట్లయితే, ఈ శరీరమందు ఇప్పటికి కేవలము ఒక పాపపు ముద్దగానే మిగిలిపోయి వుండేవాడిని మరియు ఆయన యెదుట ఎన్నడును నీతి కార్యము చేయలేకపోయేవాడిని.
ఆయనను సేవించుటకు సామర్థ్యము గలవానిగా నన్ను చేసినందుకు నేను దేవునికి వందనములు చెల్లించుచున్నాను. అందువలననే ఈ విధముగా ప్రార్థన చేసాను. ‘‘ప్రభువా, వందనము, ప్రభువా, నాకు డబ్బు అవసరము. అయితే నేనేమి కలిగిలేను. నాకేమీ లేనప్పటికి ఇవన్నియు నీ కొరకు నేను చేయదలచుకున్నాను. దయచేసి నాక సహాయము చేయుము. నేను డబ్బును నా కొరకు ఖర్చుపెట్టను, అయితే ప్రభువు కొరకు ఖర్చుపెడతాను. నేను నా కొరకు డబ్బును ఖర్చుపెడితే, నా శరీరము సౌఖ్యముగా వుంటుంది. అయితే నేను దీనిని నీతియుక్తమైన పని కొరకు ప్రభువు కొరకు ఖర్చు పెట్టవలెనని కోరుచున్నాను. ఈ డబ్బు నాకెంతో ప్రశస్తమైనది, ఎందుకనగా నేను దీని కొరకు ఎంతో శ్రమించాను. ఇది నాకు ప్రశస్తమైనది కావున, నేను దీనిని నీకు సమర్పించుచున్నాను. దయచేసి నీ నీతియుక్తమైన కార్యము కొరకు దీనిని ఖర్చుచేయుము.’’
తమ దుష్టత్వమును తెలుసుకొనినవారు వారియందు ఏ మంచి నివశించుటలేదని తెలుసుకుందురు. ఈ మాటలచేత నా ఉద్దేశ్యము ‘‘ఏ మంచి వారియందు నివశించుటలేదా అనియా? వారి శరీరీమందు వారు చెడ్డ విషయములు మాత్రమే కలిగియున్నారని నా భావము. ఒకడు అతని కొరకే జీవించుట దుష్టత్వము.

 

మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి వందనములు చెల్లించుచున్నాను.


పౌలు ఒప్పుకున్నాడు. ‘‘అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను? ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకును, శరీర విషయములో ఆత్మ నియమమునకును దాసుడనైయున్నాను.’’ (రోమా7:24-25) శరీరము దేనికి దాసురాలైయున్నది? శరీరము ఎల్లప్పుడు పాపమునకు దాసురాలై యున్నది. ఏది ఏమైనా మన హృదయముతో మనము దేవునిని సేవించుచున్నాము. ఎవనిద్వారా మనము దేవునికి వందనములు చెల్లించుచున్నాము. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి వందనములు చెల్లించుచున్నాము.
పౌలు చెప్పెను ‘‘మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నేను దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాను!’’ అందువలన నేను కూడా చెప్పుచున్నాను. ఒకవేళ ప్రభువు నా పాపమును తీసుకొని పోనట్లయితే నేను రక్షించబడలేక పోయేవాడిని ఎందుకంటే శరీరము ఇప్పటికి ఇప్పుడు పాపమును సేవించుచున్నది.
‘‘మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నేను దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాను!’’ మేము ప్రభువునకు వందనములు చెల్లించుచున్నాము. ఎందుకనగా ఆయన అందరి శరీర పాపములన్నీ ఆయన తీసుకొని పోయెను. మన శరీరము పాప క్షమాపణను పొందిన తరువాత కూడా కేవలము పాపమును మాత్రమే సేవించుచున్నాము. అయితే హృదయము దేవునిని సేవించుటకు కోరును. ఈ కారణముననే మనము ప్రభువునకు వందనములు చెల్లించుచున్నాము. ఇందువలననే యేసుక్రీస్తు ద్వారా హృదయము నీతిగలదిగా చేయబడినది. నీవు దీనిని విశ్వసించుచున్నావా? మేము దేవునికి వందనములు చెల్లించి ఆయనను సేవించుచున్నాము. ఎందుకనగా ఆయన మా పాపము తీసుకొనిపోయెను. ఒకవేళ ప్రభువు శరీర పాపమును తీసుకొనిపోకుండా మనలను రక్షించకుండా వున్నట్లయితే, మనము శాశ్వతముగా నశించిపోయేవారము. నీవు దీనిని విశ్వసించుచున్నావా?
మన పాపములను ప్రభువు తీసుకొనిపోకుండా వున్నట్లయితే, మనము ఏ విధముగా సమాధానమును కలిగియుండగలము. మనము ఏ విధముగా ప్రభువునకు వందనములు చెల్లించగలము. మనము ఆయనను సేవించగలిగియుండే వారమా? పాపము క్రింద ఉన్న ఒక వ్యక్తి ఇతర ప్రజలకు ఏవిధముగా సహాయము చేయగలడు? చెరసాలలో వున్న ఒక వ్యక్తి చెరసాలలో వున్న ఇతరులను ఏ విధముగా కాపాడగలడు? ‘‘మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నేను దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాము!’’ మన కొరకు మనము ఆయనను సేవించుటకు మన ప్రభువు మన అన్ని పాపములను కడిగివేసెను, ఆయన మన హృదయములో సమాధానము ఇచ్చెను.

 


మనము ఈ ప్రపంచములో ఇప్పటికే చనిపోయి వున్నాము


మన ప్రభువు లేకుండా మనము ఏ విధముగా దేవునిని సేవించగలము. ఆయన కొరకు పనిచేయగలము. ఆయన పరిచర్య కొరకు సమర్పించుకొనగలము? మనము ఈ కార్యములన్నియు ప్రభువు ద్వారా చేయుదుము. మేము ప్రభువును వెంబడించుటలో ఈ దినము, రేపు, ఎల్లుండి, కొనసాగుదుము ఎన్నడును మారదు. ఇది సరియైన విశ్వాసము. ప్రభువును సేవించువారు తన యింటిని చక్కగా దిద్దుకొను జ్ఞానము గల స్త్రీ వంటివారు. తక్కువ వ్యవధిలో వేడెక్కి సులభముగా చల్లబడు పెనము వంటి మార్పుచెందు ఒక మతపరమైన జీవితమును జీవించకుము. నీవు తప్పక ప్రభువును అన్నివేళలా, ఆయన తిరిగివచ్చు పర్యంతము వెంబడించవలెను. నీవు తిరిగి జన్మించిన తరువాత ప్రపంచము నుండి నరికి వేయబడి నశించినవానిగా నిన్ను నీవు ఎంచుకొనుము. నీవు ఎంత మాత్రమును లోకమునకు చెందిన మనష్యుడవు కావు అని గుర్తుంచుకొనవలెనని నేను కోరుచున్నాను. మేము ఇప్పటికే లోకము విషయములో చనిపోయిన వారముగా మారాము. 
లోకము యొక్క కుటుంబ వృక్షము నుండి మా పేర్లు తొలిగించబడినవి. నీవు అర్థము చేసుకొనుచున్నావా? మా పేర్లు అక్కడ లేవు.
ఎంతో కాలము నుండి నిన్ను చూచుట లేదు. ఏమైందీ? నీవు చర్చికి హాజరగుచున్నావని విన్నాను. నీ పాపములన్నియు క్షమించబడినవని విన్నాను. అందువలన నీకుపాపము లేదా? హ్హా?
‘‘అవును, నేను పాపము కలిగిలేను’’
‘‘ఇది క్రొత్తగా వుంది. నీవు ఒక తప్పు చర్చిలో పడ్డావని అనుకుంటున్నాను.’’
‘‘కాదు, దీనిని అలా చూడకు. నా చర్చికి రా. ఇది ఎంత బాగుంటుందో నీవే చూస్తావు.’’
‘‘నీవు ఇప్పటికీవింతగా వున్నావనుకుంటున్నాను.’’
అప్పుడు మనము ‘‘వారు నన్నెందుకు అర్థము చేసుకొనరు? వారు అర్థము చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను’’ ఇప్పటికి రక్షింపబడవలసిన వారు మనలను ఎలా అర్ధము చేసుకొనగలరు? ప్రజలు పాపములేని వారుగా మారగలరని తెలియనివారు మనలను ఎలా అర్ధము చేసుకొనగలరు? యేసు లోకపాపమును తీసుకొనిపోయెనని ఎలా అర్ధము చేసుకొనగలరు? వారు అర్ధము చేసుకొనలేరు. అందువలన వారు నిన్ను అర్ధము చేసుకుంటారని అనుకోకు. ప్రభువు మనకొరకు లోకమునకు వీడ్కోలు చెప్పెను. ఆయన సిలువపైన పసుపురంగు రుమాలును ఊపెను. మనము చాలా తేలికగా కదల్చబడి, సానుభూతితో లోకమునకు వీడ్కోలు చెప్పలేమేమోనని భయముతో ఆయన ‘‘సమాప్తమైనది’’ (యోహాను 19:30) అని చెప్పెను. ఆయన లోక కుటుంబ వృక్షమునుండి మీ పేర్లను తొలగించాను అని కూడా చెప్పాడు.

 


ఆయనను ఎన్నడును సేవించలేని మన అన్ని పాపములను తీసుకొనుటచేత ఆయనను సేవించు వారిగా, ప్రభువు మనలను సమర్థులముగా చేసెను.


ఎన్నడును ప్రభువును సేవించలేని, మనలను, యేసుక్రీస్తు ద్వారా ఆయనను సేవించగలిగిన వారముగా చేయబడియున్నాము. స్వభావ సిద్ధముగా, ప్రభువును ఎన్నడు సేవించలేని వారము. ఆయన సంఘములోనికి తీసుకొనివచ్చి, ఆయనను సేవించుటకు యోగ్యులుగా మనలను చేసినందుకు మనము తప్పక ప్రభువును స్తుతించవలెను. ప్రభువు మనలను ఉపయోగించును. మనము ఆయన కార్యము చేయుచున్నామనునది నిజము కాదు. నీవు దీనిని గ్రహించుచున్నావా? నీతిమంతుడైన ప్రభువు, మరియొక మాటలో, మనలను ఆయన నీతి కార్యములకు మనలను ఉపయోగించును.
సువార్తికుడైన లీ ఒకసారి ప్రసంగములో పెంటకుప్పను ప్రస్తావించాడు. మరియు వాసనగొట్టుచున్న ఒక ఎత్తైన పెంటకుప్పలో దుర్వాసన వంటి ఒక మలినమునని చెప్పాడు. అయితే అదికూడా ఒక హుందాతనముతో కూడిన భావన. మీరు దేనితో ఊహించగలిగినను, మనము ఇంకా మురికితో నింపబడిన వారము. యిర్మియా 17:9 వ్యాఖ్యానించుచున్నది. ‘‘హృదయము అన్నిటికంటే మోసకరమైనది’’ అన్నిటికంటే మోసకరమైన హృదయమును ప్రభువు మరియు అన్నిటికన్నా ఉన్నతమైన, దేవుని మహిమకొరకు జీవించునట్లుగా వారి హృదయమును దేవుడు చేసాడు. ఆయన నీతికార్యము చేయుటకు ఆయన మనలను పిలిచాడు.
మనము ప్రభువును వెంబడించగలము. మరియు ఆయన కృపలో జీవించగలము. ఎందుకనగా ప్రభువు మన అన్నిపాపములను కడిగివేసెను. మనము ఆయనతో శ్రమను అనుభవించగలము ఆయనతో కూడా కలిపి మహిమపరచబడగలము. మనము ఇప్పటికే చనిపోయివున్నాము. అయితే ప్రభువు కొరకు చనిపోయాము. ఒకవేళ ప్రభువు మన అన్ని పాపములను తీసుకొని పోనట్లయితే, మనము రక్షణకు వెలుపల విడిచి పెట్టబడి వుండేవారము. మనము ఒకవేళ శరీరముననుసరించి నడచియున్నట్లయితే మనము ఇప్పటికీ లోక ప్రజలు వలె మిగిలిపోయి వుండేవారము.
దేవుడు ఖచ్చితముగా ఒకేసారి అందరిని రక్షించాడు. ఆయన మనలను రక్షించెను మరియు ఆయన శాశ్వతమైన పరిచర్య కొరకు మనలను సాధనముగా చేసెను. మనమెంత దుష్టులము మరియు మురికి వారము! ప్రభువును కలుసుకొనిన తరువాత, సమయాను కూలముగా మనమెంత దుష్టలమో మరియు మురికివారమో మరింత మరింతగా మనము కనుగొంటాము. అయితే మనలను మనము చూసుకొన్నప్పుడు, మనము వేదనతో, పౌలు ఒప్పుకున్నట్లుగా, ‘‘అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను? ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును?’’ (రోమా 7:24) అని నిట్టూర్చుదును.
అయితే పౌలు వెనువెంటనే ప్రభువును స్తుతించాడు. ‘‘మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాను.’’ ప్రభువు మన పాపములన్నిటిని కడిగివేసెను. శరీర పాపములన్నియు ఆయన ప్రేల్చివేసెను. ప్రతిదినము ఎన్ని పాపములు మనశరీరము చేయుచున్నది? నీ శరీరము పాపము చేయుటలేదన్నట్లు కనబడకుము.

 


నీవు ప్రభువునకు వందనములు చెల్లించుదువా?


మనము శరీరముతో చేసిన అన్ని పాపములను ప్రభువు ప్రేల్చివేసెను. నీవు దీనిని విశ్వసించుచున్నావా? అదేమనగా ప్రభువు తీసుకొనిపోయిన పాపము నీకు ఎక్కువగా అనిపించక పోవచ్చు. అయితే నీ సొంత శరీరము చేసిన పాపములన్నిటినీ ఆయన తీసుకొని పోయెనని నీవు గ్రహించినప్పుడు, ‘‘నేను మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి వందనములు చెల్లించుచున్నాను! ప్రభువా నీకు వందనములు ! నేను స్తుతించుదును! అని కేకలు వేయుదువు.
పాపము దాని స్వంత భావమును కలిగివుంది. ప్రభువు మన జీవితకాలములో, మన చివరి దినము వరకు మనము చేసిన పాపములన్నిటిని తీసుకొనిపోయెను. మనమెంత వందనస్తులమైయున్నాము! మనము కొంచెమే పాపము చేసినట్లయితే, మనము మన పశ్చాత్తాప ప్రార్థనలద్వారా ప్రభువును ఆయన క్షమాపణను అడగవచ్చు. అయితే మన పాపములు లెక్కించలేనివి మరియు మన జీవితకాలమంతా ఆగనివి. మనము దీనిని గ్రహించినప్పుడు, మనము దేవునిని స్తుతించుట తప్ప మరేమియు చేయలేము. ‘‘ప్రభువా, నీకు వందనములు. నీవు నా పాపములన్నిటిని ప్రేల్చి వేసియున్నావు. నేను నిన్ను స్తుతించెదను’’. మనము దేవునికి వందనములు చెల్లించెదము. మరియొక మాటలో మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నీవు దేవునికి వందనములు చెల్లించి ఈ విధముగా ఒప్పుకొందువా? ప్రభువా వందనములు నీ నీతిని సేవించుటకు నన్ను రక్షించినందుకు పిలచినందుకు వందనములు చెల్లించుచున్నాను. నీవు ప్రభువునకు వందనములు చెల్లించుదువా? పాపము నిజ విమోచనము ఈ విధముగా చాలా సులభముగా కనబడుతుంది. అయితే అదే సమయములో ఇది తేలికగా తెలుసుకొనునటువంటిది కాదు. ఇది చాలా సమృద్ధియైనది, గొప్పది, విశాలమైనది, ప్రశస్తమైనది మరియు శాశ్వతమైనది.

 


మనయందు ఉపయోగకారి ఏమీ లేనందున మనము తప్పక ప్రభువును వెంబడించవలెను.


మనము పాపపు ముద్దయై యున్నాము. మనకు మనము చీకటియని తెలుసుకొనవలెను. ‘‘నేను చీకటిని, అయితే నీవు వెలుగు. నేను పూర్తిగా చీకటియై యుండగా నీవునిజమైన వెలుగు. నీవు సూర్యునివి నేను చంద్రుడుని’’ చంద్రుడు సూర్యుని నుండి కాంతిని పొందినప్పుడు మాత్రమే భూమికి వెలుగివ్వగలడు.
చంద్రుడు దానికంతటికదే వెలుగదు. అది సూర్యునినుండి పొందిన కాంతి ప్రతిబింబించుటచేత అది వెలుగుతుంది. ప్రతిదీ చీకటియే. నీవు వెలుగువా చీకటివా? ప్రభువు లేకుండా మనము చీకటిలో వున్నాము. మనము యేసుక్రీస్తును బట్టీ దేవుని వెంబడించగలము, సేవించగలము, వందనములు చెల్లించగలము. ఏలయనగా ఆయనయందు ఏ శిక్షావిధి లేదు. మన శరీరమును మాత్రమే సేవించుట. మరియొక మాటలో, చీకటిని మాత్రమే సేవించుట. నీవు వదిలివేయునంత త్వరగా దీనిని వదలి వేయుము. మనమెంత కష్టపడి ప్రయత్నించిననూ మన శరీరము మార్పు చెందదు. మనయందు ఏ ప్రత్యేకతా లేదు. మన శరీరము నిత్యము ఉండేదికాదు. అందువలన మనము శాశ్వతమైన వాటికొరకు జీవించవలెను. శాశ్వతమైన వాటికొరకు జీవించువాడు తెలివైనవాడు. మనలను గురించి మనము చాలా త్వరగా తెలుసుకొనవలెను. మరియు మనలను మనము త్వరగా వదులుకొనవలెను. మన శరీరము నుండి మనము ఎదురుచూసినది ఏమీ లేదని మనము తెలుసుకొనవలెను. మరియు మనయందు మంచిది ఏదీ లేదు. మనము ఎల్లప్పుడు కేవలము శరీరమును మాత్రమే సేవించు పాపపు ముద్ద. ‘‘నేను కోరినది ఏదైనా సరే నాకివ్వు’’ అని అనుచూ దేహమునకు అంటుకొని రక్తమును పీల్చు జలగవలె ప్రవర్తించును (సామెతలు 30:15)
మనము ఏదో తిని మరుగుదొడ్డికి వెళ్లిన తరువాత వెంటనే ఆకలిగొంటాము. మనము దీనికెంత సేవచేయుటకు ప్రయత్నించిననూ మనము ఈ శరీరముతో తృప్తిపడలేము. మనమెంత రుచికరమైన ఎంత ఎక్కువ తిన్నా దానికి సంబంధం లేకుండా కొన్ని గంటల్లోనే ఆకలిగొంటాము. అయితే మనము ప్రభువుకు వందనములు చెల్లించి ఆయనను వెంబడించినట్లయితే, మన ఆనందము పెద్దదగును.
మనము ప్రభువును వెంబడించుచున్నప్పుడు శూన్యతను అనుభవించుము. నీ విమోచనము తరువాత నీవు నిత్యానందమును కోరుచున్నావా? అప్పుడు ప్రభువును వెంబడించుము. నీవు వెలుగుమయమైన జీవితమును జీవించవలెనని కోరుచున్నావా? ప్రభువును వెంబడించుము. కృపా జీవితమును జీవించవలెనని నీవు కోరుచున్నావా? ప్రభువును వెంబడించుము. ఫలవంతమైన జీవితమును నీవు జీవించవలెనని కోరుచున్నావా? నీవు చీకటిలో వున్నావని తెలుసుకొని వెలుగును వెంబడించుము.
ప్రభువు ఎక్కడికి పోవునో మనమక్కడికి వెంబడించుదుము, ఆయన ఎక్కడ ఆగునో అక్కడ ఆగుదుము. ప్రభువు మమ్మును ఏమి చేయవలెనని కోరునో దానిని మేము చేసెదము. మరియు ప్రభువు మేమేది చేయకూడదని కోరుకొనునో దానిని చేయము. మనము ఆయనతో తప్పక నడవాలి ఆయనను వెంబడించాలి. నీ శరీరము నుండి నీవు ఎదురుచూచునది ఏమైనా కలదా? ఏమీ వుండదు! మనలోనుండి మనము ఎదురుచూచునది ఏదీ వుండదు. కనుక మనము ఆయనను తప్పక వెంబడించాలి. నీ శరీరము శాశ్వతమైనదా? కాదు గదా! నీకేమి ఇవ్వనిదానిని మరియు నిత్యము నిలచియుండని దానిని నీ వెందుకు వెంబడించుచున్నావు?
చాలాకాలము క్రిందట, ఈ విధముగా సాగిపోవు ఒక పాటను నేను పాడుచుండే వాడిని. ‘‘నా యౌవనమును నాకు తిరిగిరమ్ము.’’ అయితే ఇప్పుడు, దేవుడు నాకు నా యౌవనమును తిరిగి ఇవ్వకపోయినను పర్వాలేదు. రెండవ ఆలోచనమీద, నేను తిరిగి యౌవనమునకు వస్తే నేను సంతోషముగా వుండనని తెలుసుకున్నాను. మనము మన జీవితముకు వెలుగైన, ప్రభువును వెంబడించినట్లయితే, మన కొరకు మహిమ కిరీటము ఉంచబడుతుంది. నీవు నీ బాల్యమునకు తిరిగి రానవసరము లేదు. దీనికి బదులుగా ‘‘నేను ప్రభువును తృణీకరించును, నా జీవిత కాలమంతా నేను ప్రతిదినము ప్రభువును వెంబడిస్తాను’’ అని పాడుదము. మన జీవితములలో దేనితో మన ప్రభువును తృణీకరించమో మరియు మనము దేనితో ఎల్లప్పుడు ప్రభువుకు వందనములు చెల్లించుదుమో ఆ నిజ విశ్వాసమును చూపించుచున్నది. మనము ఈ సువార్త పాటను పాడుదాం.
‘‘నేల మంటి నుండి మనిషిని చేసిన ప్రభువైన దేవుని నేను ప్రేమించుచున్నాను. జీవ ఊపిరిని అతని నాసికారంధ్రములో ఊదినవాడు. ఆయన కుమారుని మన కొరకు పంపినవాడు. ఆయన స్వరూపమందు నేను చేయబడితిని, అందువలన నా దేహమును ఆయనకు సమర్పించుకొనుచున్నాను. నేను ప్రభువును ఎరుగనని అనను మరియు ప్రతిదినము నా జీవిత కాలమంత నేను ఆయనను వెంబడించెదను’’.

 


నేను నిజమైన వందనములను ప్రభువుకు చెల్లించెదను


నేను నిజమైన వందనములను ప్రభువుకు చెల్లించెదను. ప్రభువు మన పాపములను కొనిపోయెను మరియు ఆయనను సేవించునట్లుగా, వెంబడించునట్లుగా, ఆయన నీతి కార్యము చేయునట్లుగా మనలను సమర్ధులుగా చేసెను. మన శరీరముతో చేసిన పాపములను ప్రభువు ప్రేల్చివేయనట్లయితే, వాటిని తీసుకొని వెళ్లనట్లయితే, మనమెలా ఆయన నీతికార్యమును చేయగలము? 0.1% కూడా చేయలేము! ఒక పాపి అతడు/ఆమె ఎంత మంచిగా కనబడిననూ ఇప్పటికీ అతడు చెడ్డవాడే. మన ప్రభువు మన పాపములన్నిటిని తీసుకొనిపోయి ఆయనను సేవించు సమర్ధులుగా మనలను చేయడము ఎంత అద్భుతము? మన జీవితకాలమంతటిలో మురికిలో చినిగిపోయి, లోభివలె జీవించి, నరకమునకు విధించబడి, ప్రభువు లేకుండా శూన్య జీవితమును జీవించిన మన అన్ని పాపములను ప్రభువు తొలగించి దీవించుననునది ఎంత ఆశ్చర్యము. మన పాపములన్నిటిని తీసుకొని పోవుటచేత ఆయనను సేవించుటకు మనలను ఎన్నుకొనెననియు విశ్వాసముచేత మన విమోచనముతో మనలను దీవించుట అనునది కేవలము దేవుని కృప ఎంత ఉన్నతమైనదో చూపించుచున్నది. మన హృదయముయందు పాపముతో మనము నీతిమంతులముగా ఎలా వుండగలము?
మనము పాపమును కలిగిలేము అను వాస్తవము వాస్తవమునకు ఒక అసాధారమైనకృప, దేవునికి స్తోత్రము! శరీరము ఖచ్చితముగా మరలా పాపము చేయును. మనమిప్పుడు దేవుని వాక్యము వినుచున్ననూ, ఈ హాలు నుండి అడుగు బయటికి వేసిన తోడనే, మనము మరలా పాపము చేయవచ్చేమో. దీనిని బట్టి నా పాపమును కడిగివేసినందుకు నేను ప్రభువును స్తుతించెదను. సందేహము కలిగియుండవద్దు ` యొర్దాను నదిలో ఆయన బాప్తిస్మము చేత మన ప్రభువైన యేసుక్రీస్తు మన పాపములన్నియు తీసుకొనిపోయెను. మరియు సిలువపై పాపమునకు తీర్పును ముగించెను. నేను విశ్వసించి దేవునిని స్తుతించుచున్నాను! అప్పుడు మనము దేవునిని ఎలా స్తుతించగలము? మనము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునిని స్తుతించగలము.
ప్రియాతి ప్రియమైన పరిశుద్ధులారా! మన మిగిలిన జీవితకాలమంతటిలో మనమెంత కష్టపడి ప్రయత్నము చేసినప్పటికి దేవుని కృపకు బదులు ఏమీ ఇవ్వలేము. మనమెంత బలహీనుమైనప్పటికి, మన పాపమున్నిటిని తీసివేయుటచేత ఆయన నీతి కార్యమును మరియు ఫలవంతమైన కార్యమును చేయు సమర్థులుగా చేసిన ప్రభువునకు మనము నిత్యము వందనములు చెల్లించినను, అది చాలదు. మిగిలిన మన జీవితకాలమంతా ఆయనను మనము స్తుతించినప్పటికి ఆయనను చాలినంత మనము స్తుతించలేము.
మనయందు మంచిది ఏదియు లేదని మన మనస్సులో లోతుగా ఎరిగియున్నాము. దీని గురించి ఆలోచించుము. నీవు జీవించుచున్నంత కాలము పాపము చేయుచున్నావా? నీవు నిశ్చయముగా పాపము చేయుదువు. అయితే ప్రభువు నీ పాపమును ఇప్పటికే తీసుకొనిపోయెను. ప్రభువు దేవుని పనిని చేయుటకు మనలను దీవించెను. ఆయనను సేవించుటకు ప్రభువు మనలను సమర్ధులుగా చేసెను. మనము ప్రభువునకు వందనములు చెల్లించుట తప్ప మరేమి చేయలేము. యేసుక్రీస్తు ద్వారా నీ జీవితకాలమంతా ప్రభువును స్తుతించవలెననియు మరియు కృతజ్ఞతతో కూడిన జీవితమును జీవించవలెనని నేను కోరుచున్నాను. మన దేవుడు దేవునికి కృతజ్ఞతతో కూడిన జీవితమును జీవించు సమర్ధులుగా మనలను చేసెను. మనము శరీరముతో చేసిన పాపములన్నిటినుండి మనలను దేవుడు రక్షించెను. మన హృదయముతో ఆయనను సేవించునట్లు ఒక క్రమములో మన కొరకు మన అన్ని పాపముల నుండి ఆయన మనలను రక్షించెను. మన ప్రభువు కృప ఎంతో ఉన్నతమైనందున, మేము ఆయనను వెంబడించి ఆయనను స్తుతించవలెనని కోరుచున్నాము. మన హృదయమంతటితో ఆయనకు మనము వందనములు చెల్లించుదాం.
యేసుక్రీస్తు ద్వారా మనకివ్వబడిన దేవునికృప ఎంత అద్భుతమైనది! నీ శరీరము ఎంత బలహీనమైనదో ఎంత దుర్మార్గమైనదో తెలుసుకొనవలెనని, నీవేమి చేయుచున్నావో పరిశోధించుకొనవలెనని, ప్రభువు నిజముగా నీ పాపములను తీసుకొనిపోయెనో లేదో దానిని గురించి ఆలోచించవలెనని, ప్రభువునకు కృతజ్ఞతలు చెల్లించుటకు, విశ్వాసముతో జీవించుటకు తెలుసుకొనవలెనని నేను కోరుచున్నాను. ప్రశస్తమైన జీవితమును జీవించుటకు మనలను సమర్ధులనుగా చేసిన ప్రభువునకు నేను వందనములు చెల్లించుచున్నాను. ‘‘మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకు, శరీర విషయములో పాపనియమమునకు దాసుడనైయున్నాను’’. (రోమా7:25) మన హృదయముతో మనము దేవునిని ప్రేమించుచున్నాము. అయితే మన శరీరముతో మనము పాపము ప్రేమించుచున్నాము. అయితే మన ప్రభువు ఎంతో ప్రేమగలవాడు. మన శరీరముతో చట్టసమ్మతముకాని కార్యమును చేయునంతకాలము అది ఒక పాపము కానేరదు. అయితే మనము మన భవిష్యత్తులో చేయు పాపమును కూడా ఇప్పటికే ప్రభువు ప్రేల్చివేసెను. ఇందువలననే మన ప్రభువు ప్రియమైనవాడు, అందువలననే ఆయన కృతజ్ఞతా స్తుతులకు పాత్రుడు.
ప్రభువా, నీకు వందనములు, నిన్ను స్తుతించుటకు ఇచ్చిన హృదయమును బట్టి, మరియు మా జీవితకాలమంతటిలో మేము చేసిన, మా శరీరము పాపములన్నిటినుండి మొత్తముగా మమ్ములను రక్షించినందుకు, నిన్ను స్తుతించుచున్నాను.