(రోమా 7:24-25)
‘‘అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకును, శరీర విషయములో పాపనియమమునకును దాసుడనైయున్నాను.’’
శరీరము పాపమును సేవించుననునది ఒక నియమము
నీ విశ్వాస జీవితము ఎలా వున్నది? ‘‘ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము’’ (మత్తయి 26:41) నీవు ఈ విధముగా లేవా?
బైబిల్ కూడా మనకు చెప్పుచున్నది. ‘‘కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకును, శరీర విషయములో పాప నియమమునకును దాసుడనైయున్నాను. ‘‘మనలను అధిగమించు నియమములు ఇవి. మన హృదయము దేవుని ప్రేమించుటకు మరియు సత్యమును ప్రేమించుటకును చేయబడినవి, అయితే శరీరము పాప నియమమును సేవించుట కేవలము దాని స్వభావము మాత్రమే. దేవుని వాక్యము మనకు చెప్పుచున్నది శరీరము పాపమును సేవించుచుండగా హృదయము సువార్తను మరియు ఆయన నీతిని సేవించుచున్నది.
పాప నియమము ఏమిటో నీకు తెలియునా? మనము విశ్వాసపాత్రమైన జీవితమును జీవించవలెనని కోరుచున్నాము. అందువలన దేవుని సేవకులము మరియు పరిశుద్ధులమైన మనము, మన శరీరము వాస్తవముగా పాపము చేయునప్పుడు సింహమువలె ధైర్యముగా వుంటాము. అయితే మన శరీరము పాపమును సేవించుచు పాపములో మునిగియున్నప్పుడు మనము శక్తిని కలిగియుండము. మనమిక ఏ మాత్రము పాపము చేయకుండా వుంటే, మనము సంతోషముగా పూర్తి ధైర్యముగా వుంటామని తలంచుదుము. అయితే వాస్తవమునకు, మనమిక ఏ మాత్రము పాపము చేయమను నిశ్చయత మనకు ఉండదు. పరిశుద్ధులు మరియు దేవుని సేవకుల హృదయము దీనిని బట్టి కుచించుకొనిపోయి వున్నవి.
‘‘నా పాపములన్నియు పోయెను! కల్వరి కృప ద్వారా! మనము విమోచనము కలిగి ఈ విధముగా దేవుని స్తుతించుచున్నను, మన భవిష్యత్తు విశ్వాస జీవితమును గురించి ఆలోచించినప్పుడు మనకు ఆత్మ విశ్వాసముండదు. మనము శరీర బలహీనతను గురించి ఆలోచించి ఈ ముగింపునకు వస్తాము. ‘‘నేను భవిష్యత్తులో ఈవిధముగా జీవించకూడదు; నేనిక పాపము ఎంత మాత్రము చేయకూడదు’’ మనము ఒకసారి ప్రభువుపై ఆధారపడినప్పుడు, మరలా దేవునినీతిపై ధృఢముగా నిలబడినప్పుడు, మనము దేవునికి ‘‘ప్రభువా, వందనములు హల్లెలూయ, నేను చనిపోవు దినము వరకు నిన్ను వెంబడింతును.’’ అప్పుడు మనము ప్రకాశిస్తూ శక్తివంతముగా ప్రభువును సేవిస్తాము. అయితే అది ఎంతో కాలము నిలువదు. ఎందుకనగా మరలా మనము పాపము చేసినప్పుడు మనకు మనము నిరాశపడుదుము. వాస్తవమునకు, రక్షించబడిన పరిశుద్ధులు మరియు దేవుని సేవకులు ఈ విధముగా వున్నారు. ఈ విధముగా మనము శరీరము కేవలము పాపమును మాత్రమే చేయునను వాస్తవము చేత చిన్నబుచ్చు కొనుచున్నాము.
ప్రభువు ఈ శరీర బలహీనతచేత మనము బంధింపబడవలెనని కోరుకొనుటలేదని నాకు తెలుసు. ఈ కారణము చేతనే అపోస్తలుడైన పౌలు ఆత్మను శరీరము నుండి వేరు చేసెను. ‘‘కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకును, శరీర విషయములో పాపనియమమునకును దాసుడనైయున్నాను’’. మన శరీరము ఏ మాత్రము మెరుగుపరచబడదు. శరీరము కేవలము పాప నియమమును మాత్రమే సేవించును. పౌలు ఇది నియమమని చెప్పుచున్నాడు. శరీరము కేవలము పాపమును వెంబడించి సేవించుటకు మాత్రమే చేయబడినది. నీవు దీనిని అర్ధము చేసుకొనుచున్నావా? ఇది నియమము. నియమమును ఎవరు మార్చగలరు? నీవు కాని నేను కాని మార్చలేను. అప్పుడు మన హృదయముతో ఎవరిని సేవించుదుము? మనము తప్పక దేవునిని సేవించవలెను. మనము తప్పక దేవుని, సత్యమును, ఆత్మను మరియు ఆయన నీతిని మన హృదయమంతటితో ప్రేమించవలెను.
శరీరము నుండి ఎక్కువ ఆశించకుము
శరీరము శరీర సుఖమును, సౌఖ్యమును, సమాధానమును, ఆనందము మరియు దాని గర్వమును పెంచవలెనని కోరును గాని, దేవుని నీతిని గాదు. శరీరము అది సంతోషించునట్లుగా ప్రతీది జరగవలెనని కోరుకుంటుంది.
‘‘శరీరమా వినుము, నేను ఒక మంచి విధిని చేయవలెనని కోరుచున్నాను’’ అని చెప్పుచూ, శరీరము నుండి ఎక్కువ ఆశించకుము. నీ శరీరము మెరుగౌతుందని నీ ఊహను వదలివేయుము. శరీరము దేవునిని మరియు ఆయన నీతిని ప్రేమించునని ఊహించకుము, లేదా ఇది దేవుని నీతిని సేవించవలెనని కోరుతుంది. లేక ఆయన కొరకు శ్రమపడవలెనని కోరుతుంది అని ఊహించకు.
శరీరము నుండి ఎదైనా మంచిని కోరువారు అవివేకులు. అప్పుడు మనమేమి చేయవలెను? ప్రభువు ధర్మశాస్త్రము ప్రకారము ప్రతీదీ జరుగుతుంది. దేవుని నియమమును మనము ఎరిగియున్ననూ, దానిని మార్చగలమా? అది ప్రభువు నియమము గనుక మనము మార్చలేము గదా.
శరీరము పాపమును సేవించునట్లుగా చేయునది దేవుని నియమము. మనము వేదనపడి, మనము నల్లగా అయితే, ఇది ఎందుకంటే మనము శరీరమును సేవించుచున్నాము గనుక. మన శరీరము బాగా జీవించవలెనని కోరుతుంది. అందువలన శరీరము దానికదే తీర్పు తీర్చు కుంటుంది. మనకు మనమే తీర్పు తీర్చుకొనవద్దు. దీనికి బదులుగా, శరీరమును అది ఎలా వున్నదో అలాగే వదిలివేద్దాం. మీరు మీ హృదయముతో ప్రభువునందున్న విశ్వాసముతో జీవించవలెనని కోరుచున్నాను. శరీరము అది చనిపోవువరకు పాపము చేయుట నుండి తప్పించుకొనలేదు. ఎందుకనగా శరీరము పాపమును మాత్రమే సేవిస్తుంది. మనకు మనమే పాపము చేయుట నుండి తప్పించుకొనలేము. మీరు ‘‘శరీరము మెరుగవవచ్చు’’ అని తలంచవచ్చు. అయితే ఇది ఎన్నడూ కాదు. లేక నీవు స్పృహాలో లేకుండా పాపము చేస్తున్నప్పుడు నీవు ‘‘ఇది చెడ్డ పరిసరాలను బట్టి’’ అని తలంచవచ్చు. కాదు! ఇట్టి పరిస్థితులను బట్టి ఎన్నడూ కాదు ` శరీరము ప్రారంభము నుండి పాపము చేయుటకు ఉద్దేశించబడినది.
శరీరము ఎన్నడూ మంచి చేయదు. శరీరము అది చనిపోవు వరకు పాపము చేయును. ‘‘శరీరము మెరుగౌతుందా?’’ అటువంటి దాని కొరకు ఎదురుచూడకు ఎందుకంటే నీవు మిక్కిలి నిరాశపడతావు. నీవు ఎన్నిసార్లు నీ హృదయమును తరచుగా సిద్ధపరచుకొన్నను, ‘‘అలా నేను ప్రవర్తించను’’ అని నీకు నీవు చెప్పుకున్నా. చివరికి నీ ఇష్టమునకు విరోధముగా చెడ్డవాటిని చేయుటతప్ప, మరేమియు చేయలేదు. మనలో ఎవరు పాపమును చేయకూడదని మన మనస్సును త్రిప్పుకొనలేదు? ప్రతి ఒక్కరు! అయితే శరీరము పాపమును మాత్రమే సేవించుట అనునది దేవుని నియమము.
కాథలిక్ గురువు మరియు కన్యలు బౌద్ధ సన్యాసులు మాదిరిగా, ప్రతి మతములోని మునులవలె వారి శరీరముతో పరిశుద్ధ జీవితమును జీవించవలెనని కోరుదురు. అయితే నిందలేని ఒక జీవితమును జీవించుట శరీరమునకు అసంభవము. వారు వారి జీవితమును ఒక వేషధారులవలె జీవించుదురు. మన శరీరముతో మంచి చేయుట మన శరీరముకు అసాధ్యము. శరీరము పాప నియమమును సేవించును. దేవుడు సిద్ధపరచిన నియమము ఇది. ఒక సీతాకోక చిలుక ఎగురుచూ ఆనందించుచున్నట్లు, ఒక లార్వా ఏవిధముగా ఎగరలేదో, ఇది ఒక నియమము. కేవలము ఒక లార్వా మురికిని తినుటకు ఎలా ఇష్టపడుతుందో, మానవ శరీరము పాపమును చేయుటకు ఇష్టపడను. నీ శరీరము నుండి ఎదురుచూడగలిగినది ఏదైనా వున్నదని నీవు నిజాయితీగా చెప్పగలవా? చెప్పలేవు గదా. ఇందువలననే అపోస్తలుడైన పౌలు చెప్పెను, ‘కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకును, శరీర విషయములో పాప నియమమునకును దాసుడనైయున్నాను.’’ (రోమా 7:25)
మన శరీరము మనము చనిపోవునంతవరకు పాపము చేయును. ఇది పాపమును చేయుటతప్ప మరేమియు చేయలేదు. చాలాకాలము శిక్షణపొందిన తరువాత మన శరీరము ఇక ఏ మాత్రము పాపము చేయకుండా వుండునా? లేదు! శరీరము ఏ మాత్రము మెరుగుపరచబడలేదు. శరీరము అది కోరినంత మట్టుకు అది పాపము చేయుచున్నప్పుడు అది సరియేనా? కాదు! నేనిక్కడ చెప్పుచున్నది ఇది కాదు. నేను కేవలము శరీరము పాపము చేయుటతప్ప మరేమియు చేయలేదని నా భావము. మన పాపములు మన చిత్తము మీద మన సామర్థ్యము మీద ఆధారపడవు. మనము పాపము చేయుట కోరినప్పటికి, పాపము చేయుట తప్ప మరేమి చేయలేము. మరియు మనము పాపము చేయకుండా వుండుటకు ప్రయత్నించిన కొలది మనము మరింతగా పాపమును చేయుదుము.
‘‘వేరొక నియమము నా అవయవములో వున్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలో పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను? ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును?’’ (రోమా 7:23-24) శరీరమునకు మంచి చేయుట అసాధ్యము ఎందుకనగా శరీరము మనలను పాప నియమములోనికి చెరపట్టుచున్నది.
ప్రజలు దీనిని చెప్పుటకు అసహ్యించుకొందురు మరియు వారు దీనిని గురించి సిగ్గుపడుదురు. వారు ‘‘నీవు దీనిని బహిరంగముగా ఎలా చెప్పగలవు?’’ అని అందురు. అయితే దీనిని గురించి బహిరంగముగా పౌలు తనను గురించి తానే చెప్పలేదా? శరీరము పాప నియమమును సేవించును. మన చిత్తముతో పనిలేకుండా, మనము చనిపోవునంత వరకు, పాపమును సేవించుదుము. మనము కేవలము పాపము చేయుటకు జన్మించలేదు. ఇప్పటికీ, శరీరము పాపమునకు ఒక సాధనమను దానిని కాదనలేము.
ప్రభువు ఆయనను సంపూర్ణముగా సేవించునట్లు మనలను సమర్థులుగా చేసెను
ప్రియమైన పరిశుద్ధులారా, మీరేమి ఆలోచించుచున్నారు? నీవు ప్రయత్నించుచు వున్నట్లయితే, నీ శరీరముతో నీవు ప్రభువును సేవించగలనను కుంటున్నావా? ఇది సాధ్యమా? కాదు!
మనలను మన అన్ని పాపముల నుండి ఎవరు కాపాడెను? యేసు కాపాడెను. అప్పుడు, యేసుక్రీస్తు పాపమును సేవించు శరీరమును దాని అన్ని పాపముల నుండి మనలను విడిపించెనా? పాప నియమమును సేవించుచు మన జీవితమంతటియందు పాపమును చేయుచున్న మనలను యేసుక్రీస్తు నిజముగా రక్షించెనా? దీనికి జవాబు గట్టిగా అవును అని! అవును ఆయన చేసెను! పాపము చేయకుండా వుండడము శరీరమునకు అసాధ్యము. మరియు నీ శరీరము ద్వారా నీ పాపము నుండి క్షమించబడుటకు మరియు దేవుని శిక్షనుండి విడిపించబడుట అసాధ్యము. అయితే ప్రభువు దీనిని సాధ్యముగా చేసెను. ప్రభువు మనలను నీతిమంతులుగా చేసెను మరియు మనము నిరంతరముగా పాపము చేయుచున్నప్పటికీ కూడా, ఆయన మనలను మన అన్ని పాపముల నుండి రక్షించెను.
మన ప్రభువైన యేసుక్రీస్తు మనలను రక్షించెను. మనలను రక్షించిన ప్రభువు ఎవరు? ఈయనే యేసుక్రీస్తు. అప్పుడు యేసు ఎవరు? ఆయన దేవుని కుమారుడు మరియు విశ్వాసులందరికీ ప్రభువు. ఆయన మనలను రక్షించిన ప్రభువు. మన ప్రభువైన యేసుక్రీస్తు పాపములన్నిటి నుండి మనలను పరిపూర్ణులుగా చేసెను. యేసుక్రీస్తు ఆయనను సేవించు సమర్థులనుగా చేసెను.
ప్రభువు పాపము లేకుండా జీవించుటకు మనలను సమర్థులనుగా చేసెను. మనలను సృజించిన సర్వాంతర్యామి అయిన ప్రభువు మన అన్ని పాపముల నుండి మనలను రక్షించెను. శరీరము అది చనిపోవునంత వరకు పాప నియమమును సేవించుచున్నప్పటికీ, మన ప్రభువు మొత్తముగా మనలను రక్షించెను. మరియు మనలను నీతిమంతులుగా చేసెను. ఇందువలననే పౌలు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి వందనములు చెల్లించుచున్నాడు. మనము కూడా, మన ప్రభువైన యేసుక్రీస్తును పంపినందుకు దేవునికి తగినంతగా వందనములు చెల్లించలేము.
ప్రభువు రక్షణ ఎంత ఆశ్చర్యకరమైనదో, మరియు ఇది ఎంత ఉన్నతమైనదో మరియు కృపకలిగినదో మనము తప్పక తెలుసుకొనవలెను. మనము చనిపోవునంతవరకూ పాపము చేయుట తప్ప మరేమీ చేయమని అపవిత్రమైన శరీరమును రక్షించిన ఆయన బలమైన శక్తి కొరకు మనము కృతజ్ఞతలు చెల్లించుట తప్ప మరేమి చేయలేము. ప్రభువు ఆయన శక్తితో మనలను రక్షించెను. మరియు విశ్వాసముతో ఆయనను సేవించునట్లుగా మన అవయవములను ఆయన సాధనములుగా చేసెను. ప్రభువు మనలను పరిపూర్ణముగా రక్షించెను అందువలన మనమిక ఎంతోకాలము పాపమునకు దాసులుగా వుండము.
మన ప్రభువు మనలను పరిపూర్ణముగా రక్షించలేదా? అవును ఆయన రక్షించెను! ఆయన మొత్తముగా పరిపూర్ణముగా మనలను రక్షించాడు. ఆయనను సంపూర్ణులుగా సేవించునట్లు మనలను సమర్ధులనుగా చేసెను. ఈ గొప్ప కార్యమును చేసినవారు ఎవరు? మన ప్రభువు చేసెను. వారి శరీరముతో పాపము చేయుట తప్ప మరేమియు చేయలేని వారిని నీతిమంతులుగా మారుటకు మరియు దేవుని సేవించునట్లు త్రిప్పినది ఎవరు? మన ప్రభువు త్రిప్పెనే! మన జీవితమంతా పాపము చేయు మనలను, మన అన్నిపాపముల నుండి మనలను ప్రభువు రక్షించెను. ఆయన మనలను మార్చెను కూడా దానిని బట్టి మనము ఆయన నీతిని సేవించగలుగుచున్నాము.
ప్రభువు మనలను మన అన్ని పాపముల నుండి రక్షించెను
మనము మానవులమైనందున తప్పక దీనిని గురించి ఆలోచించవలెను. ప్రభువు రక్షణ ఎంత అద్భుతమైనది అని ఎందుకు ఆలోచిస్తానంటే నేను మానవుడను. శరీరము కేవలము పాపమును మాత్రమే సేవిస్తుంది అని నేను తెలుసుకొనకుండా వుంటే, నేనే దీనితో ఎల్లప్పుడు నిశారపడేవాడిని. నేను నా పాపము క్షమాపణను ఇప్పటికే పొందియున్నను, నా పాపమును బట్టి నా విశ్వాస జీవితమును వదలివేసి వుండేవాడిని.
‘‘నేను రక్షించబడక మునుపు, నేను పాపము చేసిననూ, నిలబడగలిగే వాడిని. అయితే నేను ఇప్పుడు కూడా పాపము చేయుచున్ననూ, నేను రక్షించబడియున్న దానికి మరియు రక్షించబడనిదానికి బేధము కనబడుటలేదు. తిరిగి జన్మించుట వలన ఉపయోగమేమున్నది?’’ నీవు ఇప్పటి కన్నా ఇంతకు ముందే బాగున్నావని నీవను కొనవచ్చు. నీవు ఇప్పుడు రక్షించబడియున్నావు. నీవు రక్షింపబడునప్పుడు నీ శరీరము బాగున్నదని నీవు భావించవచ్చు. ఇప్పటికి తిరిగి జన్మించనివారు నేను చెప్పుచున్నదానిని అర్ధము చేసుకొనలేరు.
మన శరీర పాపములన్నియు క్షమించబడెనని మనము తెలుసుకొని విశ్వాసముంచినప్పుడు మాత్రమే మనము యేసుకు వందనములు చెల్లించగలము. నేను చనిపోవునంత వరకు చేసిన పాపములన్నిటినీ తీసుకొనిపోయిన ప్రభువునకు నేను వందనములు చెల్లించుచున్నాను.
కొరియా పూర్వ కీర్తన పుస్తకము కూర్పునందు ఒక పాట ఈ విధముగా సాగుతుంది. హల్లెలూయ! ఆయనను స్తుతించండి నా గడిచిన పాపములన్నియు క్షమించబడెను! నేను ప్రభువైన యేసుతో జీవించుచున్నాను. అప్పుడు నేనెక్కడికి వెళ్ళిననూ అది పరలోకరాజ్యమే దీని భావమేమిటి? ఒకవేళ ప్రభువు కేవలము మన గడిచిన పాపములనే తీసుకొని పోయినట్లయితే మనము తరువాత చేయవలసినదేమిటి? మనము శరీరముతో ఇక ఏ మాత్రము పాపము చేయకూడదు. మనము పాపము చేసినప్పుడల్లా బహుగా పాప క్షమాపణ కొరకు ప్రార్థన చేయవలెను. ఎలాగైనా మనము తప్పక బాగా జీవించాలి. అయితే ఇది సాతానుని సిగ్గుకరమైన తంత్రము.
ఈ తంత్రము కన్నా ఏదీ తియ్యగా వుండదు. సాతానుడు మనలను ‘‘నీ గడిచిన పాపములన్నియు క్షమించబడెను. అందువలన, నీవు యేసుతో నడచినట్లయితే, నీవిక ఏ మాత్రమును పాపము చేయవు. నీవు పరలోకరాజ్యములో ప్రవేశించుదువు. భవిష్యత్తులో నీవు పాపము చేసిన ప్రతిసారి, నీవు తప్పక క్షమించబడుటకు పశ్చాత్తాప ప్రార్ధనను చేయవలెను. అందువలన, నీవు పరలోకరాజ్యములో చేరెదవు. నీవు దీనిని గ్రహించుచున్నావా?’’ చాలామంది ప్రజలు వారు బైబిల్ చదువుచున్నప్పుడు దీనిని విశ్వసించెదరు. వారు ఏడుస్తూ, హల్లెలూయ! ఆయనను స్తుతించుడి! నా పాపములన్నియు క్షమించబడెను. నేను ప్రభువైన యేసుతో నడచెదను అప్పుడు నేనెక్కడికి వెళ్ళినను అది పరలోకము అని కీర్తనలు పాడుదురు.
ఈ కీర్తనలోని మాటలు నిజమా? నీ గడిచిన పాపములు మాత్రమే క్షమించబడెనా! మన ప్రభువు గడిచిన మన పాపములే కాదు. మన అన్ని పాపములను తీసుకొనిపోయెను. ఆయనను మనమిప్పుడు హల్లెలూయా! ఆయనను స్తుతించుడి! నా పాపమును క్షమించబడెను! నేను ప్రభువైన యేసుతో నడచెదను, అప్పుడు నేనెక్కడికి వెళ్లినను అది పరలోక రాజ్యమే.
తిరిగి రక్షించబడినవారు వారు చనిపోవునంత వరకు వారి శరీరము పాపము చేయుట దేవుని నియమముని వారు ఎరిగినప్పుడు మరల పాపము చేయుటను బట్టి అయోమయములో పడవచ్చు. వారి శరీర దుష్టత్వమును వారు కనుగొనినప్పుడు తిరిగి జన్మించనివారివలె వారు తేలికగా వారి మనశ్శాంతిని పొగొట్టుకొందురు. వారు పాపము చేయునప్పుడు మాత్రమే వారు సమాధానముగా వుంటారు. ఇప్పటికి వారు పాప క్షమాపణను పొందని ప్రతి క్రైస్తవుని జీవితములో కనుగొనబడగా ఒక క్షణము ఇది. వారు వారి పెదవులతో ‘‘నా పాపములన్నియు పోయెను, నీ పాపములన్నియు కూడా పోయెను. మన అన్ని పాపములన్నియు పోయెను. అయితే మరలా వారు పాపము చేసినట్లయితే వారు మరియొకసారి పాప క్షమాపణను అడుగవలసియున్నదని తలంచుదురు. వారు పాపము చేస్తున్న కొలదీ, అంత మృదువుగా వారు ‘‘నా పాపము పోయెను, నీ పాపములన్నియు పోయెను’’. సమయము గడిచిపోవుచున్న కొలది వారు వారిని బట్టి నిరాశపడుదురు.
మన ప్రభువు మనలను పరిపూర్ణముగా మన అన్ని పాపముల నుండి రక్షించెను. మన ప్రభువు మన అన్ని పాపముల నుండి రక్షించెను. అందును బట్టి ఏ సమయమందైనను ఏ పరిస్థితిలోనైనను మనము ఆయనను స్తుతించి ఆయనకు వందనములు చెల్లించగలము. యేసుక్రీస్తు ద్వారా అన్ని సమయములలో ఆయనతో సమాధానమును ఆనందించగలము సహాయము కొరకు దేవునికి ప్రార్థన చేయగలము.
శరీరము కేవలము పాపనియమమునుకు మాత్రమే సేవించును అని మనము ఎరిగినట్లయితే మనము విశ్వాసము చేత పాపము నుండి తప్పించుకొనగలము.
నీ విశ్వాస జీవితము ఎందుకంత కష్టముగా ఉన్నది? నీ కష్టమైన విశ్వాస జీవితముతో హింసించబడియున్నావు. ఎందుకంటే నీకు శరీరము పాపమును మాత్రమే సేవించునను సత్యము తెలియదు. మనము ఈ సత్యము తెలుసుకొనుటచేత మనము తప్పక ఒక విశ్వాస జీవితమును కొనసాగించవలెను.
మనము దేవుని సత్యమును తెలుసుకున్నాము మరియు ఆయన వాక్యమును ఆసక్తితో వినునప్పుడు మార్పు చెందుదుము మరియు ఒకరితో ఒకరను సహవాసమును కలిగియున్నాము. ‘‘మీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులైయుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేయును’’(యోహాను 8:31`32) ‘‘మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము!’’ ప్రభువు మనలను మన అన్ని పాపముల నుండి పరిపూర్ణముగా రక్షించెను అందువలన మనము అన్ని సమయములలో దేవునికి వందనములు చెల్లించగలము. నీవు దీనిని విశ్వసించుచున్నావా? ప్రభువు మనలను మన అన్ని పాపముల నుండి రక్షించెను.
నీవు నీ స్వంత ఆలోచనచేత కృంగిపోవద్దు వేదన పడవద్దు అవి నిన్ను ఎక్కడికీ నడిపించలేవు. మనము ప్రభువును వెంబడించగలము. ఆయనకు వందనములు చెల్లించగలము, మనము పాపపు కాడిక్రింద ఉండనప్పడే మనము ఒక విశ్వాస జీవితమును జీవించగలము మన విశ్వాసమునకు మన క్రియలకు అవినాభావ సంబంధమున్నట్లయితే, మనము మరలా పాపము చేస్తామని నీకు తెలిసినట్లయితే, మన మెల్లప్పుడును ఆనందించలేము మరియు ప్రభువును వెంబడించలేము. మన ప్రభువు రక్షణకొంచెము పరిపూర్ణము కానిదయితే, గట్టి నిశ్చయతతో మనము ప్రభువును వెంబడించగలిగి వుండేవారము కాము.
మేము ప్రభువునకు వందనములు చెల్లించుచున్నాము. ఎందుకంటే ఆయన మన అన్ని పాపములు తీసుకొనిపోయెను. మనము ఆయనను శక్తితో వెంబడించవలెను స్తుతించవలెను. నేను నా స్వంత పాపములు సమస్యను పరిష్కరించలేనట్లయితే, నేను ఇతరులను వారి పాపములనుండి ఎలా రక్షించగలను? ఇతరులకు సువార్తను నేనెలా బోధించగలను? ఒక మునిగిపోవుచున్న మనుష్యుడు మునిగిపోవుచున్న వారిని ఎలా రక్షించగలడు? మన శరీరము పాపము చేయుటతప్ప మరేమి చేయలేని నిస్సహాయమైనదని మనము గ్రహించినయెడల మనము పాపము నుండి తప్పించుకొనగలము. మనము ఈ సత్యమును అంగీకరించినట్లయితే ‘‘క్రైస్తవ్యము’’ అని పిలువబడే ఒక మతము యొక్క సిద్ధాంతము చేత ప్రభావితము చేయబడినవారమగుదుము.
ఒక తమాషా కథ ఒకటుంది. నీవు దీనిని తెలుసుకొనవచ్చు. ఒకానొకప్పుడు, ఒక యౌవన్తుడైన కాథలిక్ గురువు దూరమున వున్న ఒక గ్రామములో చనిపోవుచున్న ఒక విశ్వాసిని చూచుటకు గుర్రపు బండిలో ఇద్దరు కన్యలతో కూర్చున్నాడు. గుర్రమును తోలుటకు అతడు వారిద్దరిమధ్యలో కూర్చొనవలసి వచ్చింది. అందమైన యౌవనస్థురాలైన కన్య ఆయనకు కుడివైపున కూర్చుని వుంది. కురూపియైన ముసలి కన్య అతనికి ఎడమచేతివైపు కూర్చుని వుంది. బండి పట్టణములో నున్నని విశాలమైన రోడ్డుమీద వెళ్ళుచున్నప్పుడు సమస్యేమి లేదు. అయితే కొండలలో సన్నని గతుకుల రోడ్డు మీదకి రాగానే, బండి భయంకరముగా ఊగడం ప్రారంభించినది. కాథలిక్ గురువు అతని మనస్సులో ఏమి అనుకొనుచున్నాడో ఊహించుము. బండి కుడిచేతివైపు వంగగానే, ‘‘ఓ ప్రభువా, నీ కిష్టము వచ్చినట్లుగానే చేయుము’’ అని ప్రార్థించాడు. దానికి అటువైపు వంగినప్పుడు అతడు హృదయములో వేదనతో ‘‘ఓ ప్రభువా, నన్ను శోధనకు గురిచేయకుము’’ అని ప్రార్థించాడు.
మన మందరము అతని వలె ఉన్నాము. మన శరీరము కేవలము పాప నియమమును మాత్రమే వెంబడించును. అయితే మనము తప్పక ప్రభువు చిత్తమును తెలుసుకొని ఆయన చిత్తము ప్రకారము విశ్వాసముతో ఆయనను వెంబడించవలెను. ఎందుకనగా మనలో నుండి మనము ఎదురు చూచుటకు మనమేమీ కలిగిలేము. మనము చనిపోయివున్నాము మరియు మన శరీరము మెరుగుపరచబడుటకు సాధ్యపడదు.
మనము ప్రభువును వెంబడించుదును ఎందుకనగా ఆయన మనలను పరిపూర్ణముగా రక్షించెను
మంచి క్రియలను చేయుటచేత మనము పరలోకరాజ్యములో ప్రవేశించిన యెడల మనమెంత ఎక్కువగా భావిస్తాము లేక మన రక్షణ మనమెన్ని మంచి క్రియలను చేసాము లేదా ఎన్ని పాపములను చేసాము అనే దానిమీద ఆధారపడినట్లయితే? ప్రభువు మనతో చెప్పుచున్నాడు. ‘‘మీరు మీ జీవితకాలమంతా పాపమును చేయుచున్నారు. నీవు చనిపోవునంతవరకు చేయు పాపములను నేను తీసివేసియున్నాను. నేను మిమ్మును నీతిమంతులుగా చేసియున్నాను. నేను మిమ్మును పాపములేని నీతిమంతులుగా చేసియున్నాను. నేను మిమ్మును పరిపూర్ణముగా రక్షించియున్నాను. నీవు నాకు వందనములు చెప్పుదువా? మన జవాబు ఏమిటి? అవును, మేము నీకు వందనములు చెల్లించుచున్నాము. మా ప్రభువా! అతడు మరలా అడుగును నీవు నన్ను వెంబడించెదవా? నీవు ఎలా జవాబు చెప్పుదువు? అవును, నేను నిన్ను వెంబడించుదును.
నీవు దేవునిని వెంబడించవలెనని కోరుచున్నావా? మనము ప్రభువును వెంబడించవలెనని కోరుచున్నాము ఎందుకనగా ఆయన మన అన్ని పాపములను తీసివేసెను. ప్రభువు కేవలము 90%పాపమును మాత్రమే తీసివేసినట్లయితే నీవు ఆయనను వెంబడించ గలిగియుండే వాడివి కాదు. ‘‘మిగిలిన నా 10% పాపమును కూడా తీసివేయవలసివుంది. ఈ పాపము సమస్యను నాకు నేనే ఏ విధముగా పరిష్కరించకొనగలను? నా మురికిని నేను కడుగుకొనవలసియుండగా నేనెలా నిన్ను వెంబడించగలను? అని దేవునితో చెప్పుట చేత ఫిర్యాదు చేయవచ్చు. అప్పుడు, ఈ పాపమును బట్టి, మనము దేవునిని వెంబడించుట మానివేస్తాము.
ఏది ఏమైనా, మనమిప్పుడు ప్రభువును స్వచ్ఛందముగా వెంబడించవలెనని కోరుచున్నాము ఎందుకనగా ఆయన మనలను పరిపూర్ణముగా మన అన్ని పాపముల నుండి రక్షించెను. ‘‘అవును, నీవు నన్ను పరిపూర్ణముగా రక్షించావు. ఇప్పటి నుండి నేను నిన్ను వెంబడించగలను! ప్రభువా వందనములు. నేను నిన్ను స్తుతించుచున్నాను. నేను నిన్ను మహిమపరచుదును. నేను నిన్ను ప్రేమించుచున్నాను. మనము మనలను ప్రభువుకు సేవచేయుటకు సమర్పించుకొనుటకు వచ్చాము ఎందుకనగా మేము ఆయనను ప్రేమించుచున్నాము మరియు ఆయనను వెంబడించుచున్నాము. మా హృదయాంతరంగములో నుండి మేము ప్రభువును వెంబడించవలెనని కోరుచున్నాము. ఎందుకనగా ఆయన మనలను మన అన్ని పాపముల నుండి రక్షించెను. మరియు మేము ఆయన ప్రేమ చేత తాకబడియున్నందున.
చర్చికి హాజరగుటలో కూడా ఇదే కారణము. మనము ఆదివారపు ఆరాధనకు హాజరుకావలెనని కోరిక కలిగియున్నయెడల అది అత్యంత సులభము. ఏదో కారణము చేత హాజరుకాగూడదని అనుకుంటే, అప్పుడు వారమునకు ఒక్కసారి ఆరాధనకు వెళ్ళడము కూడా మనకు ఒక క్లిష్టమైన సమస్యయగును. నీవు ప్రతి ఆరాధనలో ‘స్త్రీలారా, పురుషులారా, గడిచిన వారమంతా మీరు చేసిన పాపమును బట్టి పశ్చాత్తాపపడండి’ అను వేదనకరమైన మాటలనే పదే పదే వినినప్పుడు, కొన్ని సంవత్సరముల తరువాత చర్చికి వెళ్ళడం మానివేస్తావు. దృఢమైన చిత్తమును కలిగిన వారు చాలాకాలము వుండవచ్చు. బహుశా ఒక పది సంవత్సరములు లేదా ఇరవై సంవత్సరములు. అయితే వారు కూడా చివరికి మానివేస్తారు. చాలామంది అబద్ధ ప్రవక్తలు వారి పాపముల నుండి బాధపడు ప్రజలను పశ్చాత్తాపపడమని బలవంతము చేయుదురు. ఇందువలననే చాలామంది ప్రజలు యేసునందు విశ్వాసముంచుట చాలా కష్టమైనదని తలంచుచు చర్చికి వెళ్ళుట మానుదురు.
ఆయన ప్రేమచేత ముచ్చటపడుటచేత, మేము ప్రభువును వెంబడించుచున్నాము. మేము ‘‘యేసును ప్రేమించుదును ప్రపంచములోనున్న దేనితోనైనను నేను యేసును మార్చలేను’’ అని పాడుట చేత, ప్రభువును స్తుతించుట తప్ప మరేమియు చేయలేను. మేము ఆయనను నిజముగా ప్రేమించుచున్నందున మేము ఆయనను వెంబడించుదుము.
ఆయన రక్షణ ఎంత అద్భుతమైనది. ఒక చిన్న స్వల్పమైన పాపము కూడా లేకుండా ఆయనను సేవించునట్లు ప్రభువు మనలను సమర్ధులనుగా చేసెను. ‘‘కాబట్టి, యిప్పుడు క్రీస్తుయేసునందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు. క్రీస్తుయేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణము నియమమునుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను.’’ (రోమా 8:1-2) ప్రభువు ఆయనను ఎల్లప్పుడు స్తుతించుటకు మరియు వందనములు చెల్లించుటకు మనలను దీవించెను. అన్ని సమయములయందు ఆనందించుచు ఆయనను వెంబడించవలెనని కోరుచున్నాడు. ఆయన మనలను రక్షించెను. నీవు దీనిని విశ్వసించుచున్నావా?
మీ స్వంత బలహీనతచేత హింసించబడకుడి. ఎవరి ఉద్రేకము స్వాధీనములో లేకుండా వుండెనో వారి పాపములన్నిటిని దేవుడు తీసుకొనిపోయెను. ఆయన చెడు స్వభావము మరియు కామవికారము కలిగినవానిని కూడా రక్షించెను. ఇప్పుడు, ఇది నిన్ను ప్రభువును వెంబడించునట్లుగా చేయుట లేదా? ఇందువలననే మనము ప్రభువును ప్రేమించుచున్నాము. మన ప్రభువు ఆయనను వెంబడించునట్లు మనను బలవంతము చేయుట లేదు లేక ఆయనను ఆరాధించుటకైనను బలవంతము చేయుట లేదు. దేవుడు మనలను దీవించెను. ఆయన మన తండ్రి అయ్యెను, మరియు మనము ఆయన కుమారులుగా మారియున్నాము. మరియు దేవుడు ఆయనను వెంబడించుమని మనకు చెప్పుచున్నాడు. ఆయనను సేవించమని ఆయన సేవకులకు చెప్పెను.
దేవుని చేత రక్షించబడిన వారందరూ ఆయన సేవకులు. ఆయన పనివారినందరిని దేవుడు దీవించును మరియు ఆయనను వెంబడించమని వారికి చెప్పును. ప్రభువు మనలను మన కార్యముల కొరకు పిలువలేదు. ప్రభువు మనకు చెప్పుచున్నాడు. ‘‘అన్ని పాపముల నుండి నేను నిన్ను పరిపూర్ణముగా రక్షించాను. నీ ఉద్రేకము భరించగలిగినది కాదు. నీయందు కామవికారమును కలిగియున్నావు. నీవు వర్ణన కతీతముగా వున్నావు. నీవు అవేవికివి. నీ పితరులు పాపమును బట్టి నీవు శపించబడవలసియున్నది. అయితే నేను నిన్ను రక్షించాను మిగిలిన విషయాలు నేను లెక్క చేయను. నీవు నీ జీవితకాలమంతా పాపము చేయుటతప్ప మరేమియు చేయలేవు. అయినప్పటికి నేను నీ పాపములన్నిటిని తీసివేసాను. నేను నీ కొరకు శ్రమపడ్డాను మరియు నీ పాపములన్నిటిని తుడిచివేయుటకు మృతులలో నుండి లేచాను. నేను నిన్ను ప్రేమించుచున్నందున ఈ కార్యములన్నిటిని చేసాను. నేను నిన్ను ప్రేమించుచున్నాను. నీవు నన్ను ప్రేమించుచున్నావా? మన జవాబు ఏమైయున్నది. అవును, నేను నిన్ను ప్రేమించుచున్నాను ప్రభువా, నేను కూడా నిన్ను ప్రేమించుచున్నానని నీకు తెలుసు. వందనములు ప్రభువా!
‘‘నన్ను వెంబడించుము, నేను మనుష్యులను పట్టు జాలరులుగా చేయుదును’’ నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నాయందు విశ్వాసముంచువాడు, నేను చేయు కార్యములను అతడు కూడా చేయును, నేను తండ్రియొద్దకు వెళ్ళుచున్నాను గనుక నాకంటే గొప్పవైనవి చేయునని నిశ్చయముగా చెప్పుచున్నాను’’ ప్రభువు చెప్పెను. నీవు దీనిని విశ్వసించుచున్నావా? మనమెంత దుష్టస్వభావము కలవారము? దేవుని యెదుట మనమెన్ని పాపములను చేసియున్నాము? పాపము చేయనివాని వలె కనబడవద్దు.
మన జీవితకాలమంతా లెక్కలేనన్ని సార్లు పాపము చేసాము. మన పాపములు ఆకాశములోని నక్షత్రముల వలె చాలా వున్ననూ, మన ప్రభువు శాశ్వతముగా మన అన్ని పాపములను తీసుకొని పోయెను. ప్రభువైన యేసు పూర్తిగా మరియు సంపూర్ణముగా మన అన్ని పాపములను తీసుకొనిపోయెను.
దేవుడు మనలను ఆయన నీతిచేత వస్త్రము ధరింపజేయుట వలన మనలను ఆయన పనివారిగా జేసెను.
కొన్నిసార్లు మనము మనలను పరిశీలించుకొన్నప్పుడు మనమిక ఏ మాత్రము దేవునిని వెంబడించలేమని తలంచుదురు. మన హృదయములు కొన్నిసార్లు పగటిదినమువలె ప్రకాశవంతముగా వుంటాయి. మిగిలిన సమయములలో చాలా దీనముగా వుంటాయి. సమయము నుండి సమయము గడిచే కొలది తిరిగి జన్మించిన తరువాత ప్రభువును వెంబడించుచున్నప్పుడు మనలను మనము చీకటిలో కనుగొందుము. మనము నాలుగు ఋతువులలో పోవుచున్నట్లుగా మార్పు చెందుదుము. దేవుడు నోవాహు ఓడలోనికి వెళ్లినప్పుడు ఆ ఎనిమిది రకములైన ఋతువులను ఇచ్చెను, దేవుడు చెప్పెను. భూమి నిలిచియున్నంతవరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణమును వేసవి శీతకాలమును రాత్రింబగళ్ళును ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. (ఆదికాండము 8:22)
మన విశ్వాసములో ఎగుడు దిగుడులు ఆగవు. కొన్ని దినములు యేసును ఆనందముతో స్తుతించెదము. అయితే మనము కష్టమును ఎదుర్కొన్నప్పుడు కోపమునకు తిరుగుదుము.
‘‘వారి పాపమును వారి అతిక్రమమును ఇకను ఎన్నటికిని జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్ధబలి యికను ఎన్నడును వుండదు’’ ప్రభువు చెప్పుచున్నది ఇది (హెబ్రీ 10:17-18)
శరీరము చనిపోవువరకు పాపము చేయుటతప్ప మరేమియు చేయలేదు. ఇది శరీర నియమము. శరీరము పాప నియమమును సేవించును. దీని భావము శరీరము పాపమును మాత్రమే చేయగలదు. పాపము మాత్రమే చేయగలిగిన వారిని దేవుడు తన సొంత సేవకులుగా చేసుకొనెను. మనలను దేవుడు ఏ విధముగా తన సేవకులుగా చేసుకొనెను? నిశ్చయముగా పాపము కలిగిన వారిని ఆయన సేవకులుగా ఆయన చేసుకొనలేడు.
మీ చివరి దినముల వరకు మీ శరీరము చేసిన అన్ని పాపములను తీసుకొనిపోవుటచేత మమ్మును ఆయన సేవకులుగా చేసెను మరియు మిమ్మును పరిపూర్ణులుగా చేయుటకు మీ పాపము జీతమంతటినీ చెల్లించెను. ఆయన మిమ్మును పరిశుద్ధపరచి ఆయన పరిశుద్ధపనివారుగా వుండుటకు మిమ్మును పిలిచెను. ఆయన మనలను ఆయన సేవకులుగా పిలిచెను. మనము బలహీనులమైనప్పటికి, మనమిప్పుడు శక్తిని కలిగియున్నాము. ఏ శక్తి అని మీరడగవచ్చు. మనము ఆయన నీతి శక్తిని కలిగియున్నాము. ప్రభువు నీతిని ధరించుకొనుటచేత మనము పరిపూర్ణ శక్తిని కలిగియున్నాము. మరియొక మాటలో మనము పరిపూర్ణులుగా చేయబడియున్నాము. మనము శరీరమందు బలహీనులమైననూ, ఆత్మయందు మనము బలవంతులము.
ప్రభువును ఎవరు సేవించగలరు?
‘‘దుఃఖపడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడు సంతోషించువారము; దరిద్రులమై నట్టుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించువారము; ఏమియు లేనివారైనట్లుండియు సమస్తమును కలిగినవారము’’ (2వ కొరింధి 6:10) మనము పాపము కలిగిలేము. కావున నీరు మరియు ఆత్మ సువార్తతో రక్షించబడుటకు అనేకులకు మేము సహాయము చేయుదము. ఇది క్రీస్తు మర్మము మరియు పరలోకరాజ్య రహస్యము.
మనలను మొత్తముగా రక్షించిన ప్రభువును నేను స్తుతించెదను. ప్రభువును సేవించగలిగినవారు ఎవరు? పాపము చేయకుండా ప్రయత్నించుచు ప్రభువును వెంబడించువారా లేక వారి భవిష్యత్తు కాలములో చేయబడిన పాపముతో వారి అన్ని పాపములను ప్రభువు తీసుకొనిపోయెను అని విశ్వాసముంచినవారా? రెండవ వారు మాత్రమే ప్రభువును సేవించగలరు ఆయనను వెంబడించగలరు. ప్రభువు వారి పాపములన్నిటిని పరిపూర్ణముగా రక్షించెను అని విశ్వాసముంచువారు మాత్రమే ఆయనను సేవించగలరు. వారు ఇష్టపూర్వకముగా వారిని వారు ప్రభువునకు సమర్పించుకొందురు మరియు ఆయన కార్యము కొరకు వారికి చెందినవన్నీ పెట్టుబడిగా పెట్టుదురు. ఆయన పనివారుగా వుండుటను బట్టి వారు అతిశయించుదురు ప్రభువు కొరకు ఎంత చిన్నదైనను చేయగలిగినదానిని బట్టి అతిశయపడుదురు.
కొంతమంది ప్రజలు, వారి స్వనీతి విరిగిపోవునేమో అని భయపడుదురు, అందువలన వారు కోపము తెచ్చుకొనగలిగి పరిస్థితులలో వారు ఉన్నను వారు కోపము తెచ్చుకొనరు. వారి స్వనీతి విరిగి పోవలెను. మన చెత్తను చెత్త బుట్టలో వేసినట్లుగా మన స్వనీతిని కూడా చెత్త బుట్టలో వేయవలెను. మన నీతి తప్పక విరిగిపోవలెను. మనము దానిని నరికివేసి ఒక చెత్తబుట్టలోనికి త్రోసివేయవలెను. మనము మన స్వనీతిని విడిచిపెట్టినప్పుడు మాత్రమే ఆయన నీతిని ఎత్తి పట్టుకొనగలము మరియు ప్రభువునకు వందనములు చెల్లించగలము.
అటువంటి ప్రజలు ‘‘కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి’’ (కీర్తన 100:4) అని పాడుచు ప్రభువును స్తుతించగలరు. తమ స్వనీతిని కలిగినవారు, వారు రక్షించబడినప్పటికి, అంతము వరకు ప్రభువును స్తుతించలేరు. వారి జీవితకాలమంతా శరీరము పాపమును మాత్రమే సేవించునని ఎరిగినవారు మరియు ప్రభువు వారి పాపములన్నిటిని, రాబోవు వాటిని కూడా తీసుకొని పోయెనని విశ్వసించువారు, ప్రభువును ప్రేమించవలెననీ ఓపికతో ఆయనను సేవించవలెనని కోరుదురు. వారి హృదయములలో ప్రభువును ప్రేమించవలెను అను కోరికను మనము కనుగొంటాము.
ప్రభువును వెంబడించలెనని ఆయనను ప్రేమించు హృదయమును నీవు కలిగియున్నావా? ఆయనకు కృతజ్ఞతలను చెప్పు హృదయమును నీవు కలిగియున్నావా?
పాపము లేకుండా సంతోషకరమైన జీవితములు జీవించుటకు ప్రభువు మనలను సమర్థులుగా చేసాడు
దేవుని సేవకులమైన మనము, సంవత్సరమునకు ఒక మిలియన్ డాలర్లు సంపాదించే వానికన్నా ఒక సమృద్ధియైన సంతోషకరమైన జీవితమును జీవించుచున్నాము. మనము వేసవి కాలమున పుచ్చ కాయలను, ద్రాక్షాపండ్లు, దానిమ్మపండ్లు వాటి ఋతువులలో వాటిని తింటున్నాము. మనమేది కోరుదుమో వాటిని మనము తినగలము. మనము పేదవారము కాము. విమోచించబడిన తరువాత మీరెన్నడైనా పేదవారుగా వున్నారా; మనము సమృద్ధిలో జీవించుచున్నాము.
మనము ప్రభువుతో నడచినట్లయితే సమృద్ధిలో మనము జీవించగలము. ప్రభువును వెంబడించువానికి లేమి కలుగదు. నీవు దీనిని విశ్వసించు చున్నావా? ప్రపంచ ప్రమాణము ప్రకారము మనము సంపన్నులము కాక పోయినను, కొరత లేకుండా జీవించుదుము. నీవు దీనిని విశ్వసించుచున్నావా? నీవు ప్రభువును కలుసుకొనిన తరువాత తీరని కోరికలు అవసరతలు వున్నవా? మాకు కొదువేమి లేదు. మేము గతముకంటే చాలా సంపన్నులముగా జీవించుచున్నాము. నేను ఇంతకు ముందుకంటే బాగా జీవించుచున్నాను బాగా నిద్ర పోవుచున్నాను.
మన ప్రభువు మనలను పరిపూర్ణముగా రక్షించెను. మాటలు ఈ దీవెనలను వర్ణించలేవు. మన ప్రభువు మనలను మొత్తముగా రక్షించెను. నిన్ను మరియు నన్ను ఆయనద్వారా వందనములు చెల్లించు సమర్ధులుగా చేసెను. ఆయన కృప ఎంత ఉన్నతమైనది.
‘‘అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను!’’ అతను శరీరము చూచుకొనుటద్వారా పౌలు చెప్పెను. ‘‘మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును?’’ మనము మన జీవితకాలమంతా పాపము చేస్తాము. మనము ఈ శరీరముతో చేసిన పాపములన్నిటి నుండి మనలను ఎవడు విడిపించెను? ప్రభువైన యేసుక్రీస్తు మనలను రక్షించెను, పౌలు చేసినట్లుగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి వందనములు చెల్లించుచున్నాను. నా ప్రభువా నీకు వందనములు మా పాపములన్నిటినీ తీసివేసినందుకు వందనములు .
అపోస్తులుడైన పౌలు అతడు దేవుని నీతిని పొందిన తరువాత తన స్వనీతితో జీవించలేదు. అతని శరీరము పాపమునకు అమ్మివేయబడినదని చాలాసార్లు చెప్పాడు. కొంతమంది ప్రజలు 7వ అధ్యాయము అతడు రక్షించబడకమునుపు వ్రాసెనని మరియు 8వ అధ్యాయము అతడు రక్షించబడిన తరువాత వ్రాసెనని చెప్పుదురు. అది సరియైనది కాదు.
దేవుని వాక్యము రక్షించబడిన వారికి మరియు రక్షించబడని వారికి ఇద్దరికి వర్తిస్తుంది. ఇది ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. చాలామంది వేదాంత పండితులు. దేవుని వాక్యమును ఎరుగక, 7వ అధ్యాయమును 8వ అధ్యాయమునుండి మొదటిది రక్షించబడనివారికి రెండవది రక్షించబడినవారికి వర్తింపచేయవలెనని చూస్తారు. వారు ఒక పరిధిలో దేవుని వాక్య భాగమును వాక్య భాగముగా ఎలా వేరు చేయాలో వారికి తెలియకపోయిననూ పేరాలుగా వేరు చేస్తారు. చాలామంది చక్కగా వున్ననూ దీనియందు మోసము చేయువారు అనేకులున్నారు.
మన ప్రభువు పూర్తిగా మొత్తముగా మన పాపములన్నిటిని తీసుకొనిపోయెను. మీరు దేవునికి వందనములు చెల్లించుటచేత విశ్వాసము చేత జీవించవలెనని కోరుచున్నాము. మీ ముఖముమీది మడతను నున్నగా ఇస్త్రీ చేసుకొనవలెనని నేను కోరుచున్నాను. ప్రభువు నీ హృదయమునందున్న చీకటి పాపములన్నిటిని తీసుకొని పోయెను. శరీర పాపములన్నిటి నుండి మనలను రక్షించిన ప్రభువునకు వందనములు చెల్లించుచున్నాను.