• All e-books and audiobooks on The New Life Mission website are free
  • Explore multilingual sermons in global languages
  • Two new revised editions in English have been released
  • Check out our website translated into 27 languages
Search

Sermons

అంశం 9: రోమీయులకు ( రోమా పత్రిక పుస్తకం పై నున్న వ్యాఖ్యానం)

[అధ్యాయము 7-6] పాపుల రక్షకుడైన ప్రభువును స్తుతించుము (రోమా 7:14-8:2)

(రోమా 7:14-8:2)
‘‘ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని యెరుగుదుము; అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినైయున్నాను. ఏలనయగా నేను చేయునది నేనెరుగను; నేను చేయ నిచ్ఛయించునది చేయక ద్వేషించునదియే చేయుచున్నాను. ఇచ్ఛయింపనిది నేను చేసిన యెడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాని చేయునది నాయందు నివశించు పాపమేగాని నేను కాదు. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివశింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసినయెడల, దానిని చేయునది నాయందు నివశించు పాపమేగాని యికను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషునిబట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో వున్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరచు కొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్బాగ్యుడను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకును, శరీర విషయములో పాప నియమమునకును దాసుడనైయున్నాను. కాబట్టి ఇప్పుడు క్రీస్తుయేసునందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు. క్రీస్తుయేసునందు జీవము నిచ్చు ఆత్మయొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను.’’
 
 
మనుష్యుడు పాపమును సంక్రమించుకొనిన ఒక పాపి

మానవులందరు ఆదాము మరియు అవ్వ నుండి పాపమును సంక్రమించుకొని పాపపు బీజములుగా మారాము. ఆ విధముగా మనము స్వభావ సిద్ధముగా పాపము యొక్క పుత్రులుగా తప్పించుకొనుటకు వీలులేని పాపముతో నిండిన జీవులమయ్యాము. మనలో ఎవ్వరును పాపులుగా వుండవలెనని కోరినప్పటికీ మన పితరుడైన ఒక్క ఆదాము నుండి లోకములోనున్న ప్రజలందరు పాపులుగా మారుట తప్ప మరేమి కాలేకపోయారు.
పాపము మూలమేమిటి? ఇది మన తల్లిదండ్రుల నుండి సంక్రమించినది. మనము మన హృదయమునందున్న పాపముతో జన్మించాము. ఇది పాపులయొక్క సంక్రమించబడిన స్వభావము. మనము ఆదాము హవ్వ నుండి సంక్రమించబడిన 12 రకముల పాపములను కలిగియున్నాము. ఈ పాపము దురాలోచను, జారత్వమును, దొంగతనమును, నరహత్యలును, వ్యభిచారమును, లోభమును, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును ` అనునవి మన పుట్టుకనుండే మనలో వున్న మూలములు. మానవుని మూల స్వభావము పాపము.
ఈ విధముగా మనము పన్నెండు రకముల పాపములతో జన్మించియున్నాము. మనము మన హృదయములలో పాపముతో జన్మించియున్నందున మనము పాపులమని ఒప్పుకొనుట తప్ప మరేమి చేయలేము. ఒక మానవుడు ఒక జన్మపాపి మరియు తప్పించుకొనలేని పాపి ఎందుకంటే అతడు/ఆమె స్వభావసిద్ధముగా అతడు/ఆమె పాపము చేయకపోయినప్పటికి అతని/ఆమెయందు పాపమును కలిగియున్నాడు. ఒకడు ఒకని హృదయమునందు పాపముతో జన్మించుటను బట్టి ఒకడు పాపిగా మారును. మనము మన శరీరముతో పాపములు చేయకపోయినను, దేవుడు హృదయమును చూచుచున్నందున మనము పాపులుగా మారుట నుండి తప్పించుకొనలేము. అందువలన మానవులందరు దేవునియెదుట పాపులు. 
 

మానవుడు అతిక్రమ పాపమును చేయును

ఒక మానవుడు అతిక్రమించు పాపమును కూడా చేయును. అతడు/ఆమె లోపల వున్న మూలపాపము పెరుగుటచేత శరీరముతో పాపము చేయును. మనము ఈ పాపమును దోషము లేదా అతిక్రమము అని పిలుచుదుము. మన హృదయములోనున్న పన్నెండు రకముల పాపముల నుండి ఉద్భవించు మన వెలుపలి ప్రవర్తనకు చెందిన నేరము. లోపలున్న దుష్ట పాపము ఒక మానవుని అన్యాయమైన క్రియలను చేయునట్లుగా చేయును దానిచేత మానవులనందరిని ఎటువంటి మినహాయింపు లేకుండా పాపులుగా చేయును. ఒక మానవుడు చాలా చిన్నవాడుగా వున్నప్పుడు ఒక పాపిగా అనిపించడు. పర్షిమాన్‌ చెట్టు మొక్కగా వున్నప్పుడే దాని కాయలను ఎలా కాయలేదో, పాపము అతడు/ఆమె పసిప్రాయములో వున్నప్పుడే గుర్తించ తగినట్లుగా వెలుపలికి రాదు. వయస్సు పెరుగుచున్న కొలది పాపము కొంచెము కొంచెముగా వెలుపలికి రావడం ప్రారంభిస్తుంది. మనము పాపులమని మనము తెలుసుకుంటాము. మనము ఈ పాపములను దోషములు లేక అపరాధములు అని పిలుస్తాము, మరియు అవి మన ప్రవర్తన ద్వారా చేయబడిన పాపములు.
ఈ రెండూ పాపములని దేవుడు చెప్పుచున్నాడు. హృదయములో వున్న పాపము మరియు మన శరీరము యొక్క అన్యాయక్రియలు అను ఈ రెండు పాపములు. దేవుడు ఒక మానవుని పాపి అని పిలచుచున్నాడు. హృదయము యొక్క పాపములో మరియు ప్రవర్తనలోని పాపములో అన్ని పాపములు కలుపబడినవి. అందువలన, ప్రజలందరు వారు వారి ప్రవర్తన ద్వారా పాపములు చేసినను చేయకపోయినను దేవునిదృష్టిలో పాపులు.
అవిశ్వాసులు మనుష్యుడు స్వభావసిద్ధముగా మంచిగా పుట్టాడు, ఎవరును పుట్టుకతో పాపులు కారని నొక్కి చెప్పుదురు. అయితే దావీదు దేవునితో ఒప్పుకున్నాడు. ‘‘నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసియున్నాను. నీ దృష్టియెదుట నేను చెడుతనమును చేసియున్నాను. కావున ఆజ్ఞ ఇచ్చునప్పుడు నీవు నీతిమంతుడవుగా అగపడుదువు. తీర్పుతీర్చునప్పుడు నిర్మలుడవుగా అగపడుదువు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను’’. (కీర్తన 51:4-5) ఈ వాక్యభాగము భావమేమనగా, ‘‘నేను ఈ విధముగా పాపము చేయుటతప్ప మరేమియు చేయలేను. ఎందుకనగా స్వభావసిద్ధముగా ఒక పాపపు బీజమును. నేను నా పాపములన్నిటినుండి విడిపించబడి నీతిమంతుడనగుదును. అయితే నీవు వాటిని తీసివేయనట్లయితే, నేను నరకమునకు పోవుదును. నేను పాపము కలిగియున్నానని నీవు చెప్పినట్లయితే నేను పాపము కలిగినవాడను. నేను పాపములేని వాడనని నీవు చెప్పినట్లయితే నేను పాపము లేనివాడను. దేవుడు చేయు ప్రతీదానిమీద నీ తీర్పు ఆధారపడి వున్నది.’’
ఖచ్చితముగా చెప్పుచున్నాను, దేవుని దృష్టిలో మానవులందరు వారి తల్లిదండ్రుల నుండి పాపమును సంక్రమించుకొనినందున పాపులుగా వుండుట తప్ప మరేమియు చేయలేరు. వారి ప్రవర్తనకు సంబంధము లేకుండా వారు జన్మపాపులు. పాపమునుండి తప్పించుకొనుటకు ఒకే ఒక మార్గమేదనగా యేసు రక్షణయందు విశ్వాసముంచడము. పిల్లలకు విద్య బోధించు సారాంశమును ఈ క్రింద పేర్కొనినట్లు తప్పుగా చెప్పుకొనుచున్నది. ‘‘ప్రజలందరు మంచి స్వభావముతో జన్మించారు. అందువలన మానవులు మంచి స్వభావమును బట్టి విలువగా జీవించును. నీకే కేవలము ప్రయత్నించినంత మాత్రముననే మంచి చేయగలవు.’’ వారు కేవలము ఆశాజనకమైన విషయమునే చెప్పుదురు. మానవులు నైతిక సూత్రాల బోధనల క్రింద జీవించుదురు. అయితే వారు వారి హృదయములలో గృహములలో సమాజములో ఎందుకు పాపము చేయుదురు? వారు ఈ విధముగా చేస్తారు ఎందుకంటే వారు స్వభావసిద్ధముగా పాపముతో జన్మించారు. మానవులు పాపము బీజములుగా జన్మించారు. ఒక మానవుడు అతడు/ఆమె మంచి చేయవలెనని కోరినప్పటికి పాపము చేయుట తప్ప మరేమి చేయలేడు. ఇది మనము పుట్టుకతో పాపముతో జన్మించామని ఋజువు చేస్తున్నది.
 

నీవు తప్పక నిన్ను నీవు తెలుసుకొనవలెను

ప్రజలు వారు పుట్టుకతో పాపముతో జన్మించినందున వారి జీవితకాలమంతా శరీరముతో పాపము చేయుటతప్ప మరేమి చేయలేరు. ఇది మానవజాతి అసలు స్థితి. మనము తప్పక మన గురించి మనము తెలుసుకొనవలెను. సోక్రటీస్‌ ‘‘నిన్ను నీవు తెలుసుకో!’’ అని చెప్పాడు. మరియు యేసుక్రీస్తు, ‘‘నీవు పాపములోనే గర్భము ధరించబడియున్నావు కావున నీవు దోషమును కనియున్నావు. అందువలన నీవు నీ పాపముకు క్షమాపణను తప్పక పొందవలెను’’ అని చెప్పెను. నిన్ను నీవు తెలుసుకో. చాలామంది ప్రజలు వారిని వారు అపార్ధము చేసుకొంటారు. దాదాపు అందరు వారిని గురించి వారు తెలుసుకుంటారు. తాము చెడు చేయువారి బీజములని ఎరిగిన తరువాత యేసు సత్యమును వెదకి దీనియందు విశ్వాసముంచినవారు జ్ఞానము గలవారు. వారు పరలోక రాజ్యములో ప్రవేశించు హక్కును కలిగియున్నారు.
తమను గురించి తాము తెలుసుకొననివారు ఇక ఎన్నడును పాపము చేయకుము అని ఒక వేషధారణ అను ఒక ఆట ఆడమని బోధిస్తారు. వారు వారి లోపల వున్న పాపమును వ్యక్తీకరించవద్దని చెప్పుదురు. మతపరమైన విద్యావేత్తలు పాపమును చేయకుండా అవి బయటకి వచ్చుటకు ప్రయత్నించినప్పుడల్లా అణచివేయుటకు శిక్షణనిస్తారు. వారందరు వారి నరక మార్గములో వున్నారు. వారు ఎవరు? వారు సాతాను సేవకులు, తప్పుడు బోధకు. వారు బోధించునది మన ప్రభువు మనకు బోధించనది కాదు. మన ప్రభువు మనకు పాపము చేయమని చెప్పలేదనుకోండి. అయితే ఆయన మనకు చెప్పుచున్నాడు. ‘‘మీరు పాపములను కలిగియున్నారు. నీవు ఒక పాపివి మరియు పాపము వలన వచ్చు జీతము మరణము. నీ పాపములను బట్టి నీవు నీ నాశన మార్గములో వున్నావు. అందువలన, నీవు నీ పాపముల నుండి విమోచించబడాలి. నీ పాపములన్నిటి నుండి నిన్ను రక్షించిన రక్షణా బహుమతిని నీవు పొందుకొనుము. అప్పుడు, నీ పాపములన్నిటి నుండి నీవు రక్షించబడుదువు మరియు నీవు శాశ్వత జీవమును పొందుదువు. నీవు ఒక నీతిమంతునిగా, ఒక ప్రశస్తమైన దేవుని కుమారునిగా మారుదువు.’’
 

దేవుడు మానవులకు ధర్మశాస్త్రమును ఎందుకిచ్చెను?

పౌలు చెప్పెను, ‘‘మరియు అపరాధము విస్తరించునట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని యేలాగు ఏలెనో, అలాగే నిత్యజీవము కలుగుటకై, నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను.’’ (రోమా5:20) దేవుడు మనకు ధర్మశాస్త్రమును ఇచ్చెను దాని ద్వారా మన పాపములు ప్రత్యక్షపరచబడెను. (రోమా7:13) పాపులకు ధర్మశాస్త్రమును ఆయన ఇచ్చెను అందువలన వారు వారి పాపమును తీవ్రముగా గుర్తించెదరు.
యాకోబు కుమారులైన ఇశ్రాయేలీయలు నిర్గమము తరువాత వారు అడవిలో నివశించునప్పుడు దేవుడు వారికి ధర్మశాస్త్రమును ఇచ్చాడు. ఆయన 613 శాసనముల నిచ్చెను. దేవుడు మానవులకు ధర్మశాస్త్రమును ఎందుకిచ్చెను? దేవుడు వారికి మొదటగా వారి పాపము వారు ఎరుగనందున వారి పాపములను వారు గుర్తించునట్లుగా వారిని చేయుటకు, రెండవదిగా వారు పాపముతో జన్మించినందున.
మానవులు ఎంత భయంకరమైన పాపులో ధర్మశాస్త్రముయొక్క పది ఆజ్ఞలు చూపించుచున్నవి. ‘‘నేను తప్ప వేరొక దేవుడు నీకుండ కూడదు. పైన ఆకాశమందేగాని క్రింద భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. నీ దేవుడైన యోహోవా నామమును వ్యర్ధముగా ఉచ్చరించకూడదు. యెహోవా తన నామమును వ్యర్ధముగా నుచ్చరించువానిని నిర్దోషిగా ఎంచడు, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుకొనుటకు జ్ఞాపకముంచుకొనుము, నీ తల్లిని తండ్రిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని యిల్లు ఆశింపకూడదు,... నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు.’’ (నిర్గమ 20:3-17)
దేవుడు మనకందరికి ధర్మశాస్త్రము నిచ్చెను, మరియు దీని ద్వారా మన హృదయములో ఖచ్చితముగా ఎటువంటి పాపమును కలిగియున్నామో మనకు నేర్పాడు. మనము దేవుని యెదుట పూర్తిగా పాపులమని దేవుడు మనకు నేర్పాడు. మనము పాపులమను సత్యముతో మనలను వెలిగించాడు ఎందుకుంటే మనము ధర్మశాస్త్రమును నెరవేర్చలేము.
ఒక మానవుడు దేవుని ధర్మశాస్త్రము పాటించగలుగుట సాధ్యమగునా? ఇశ్రాయేలీయులు గాని అన్యులుగాని వారి యెదుట మరియొక దేవుడు వుండకూడదని చెప్పినప్పుడు, ఆయన వారు కనీసం వారు ప్రారంభము నుండి ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞనైనా పాటించలేని వారని వారు తెలుసుకొనవలెనని ఆయన కోరుకున్నాడు. ఆజ్ఞ ద్వారా, వారు సృష్టికర్త కన్నా సృజించబడినదానిని మిగిలిన వాటిని ప్రేమించరని తెలుసుకున్నారు. వారు దేవుని నామమును వ్యర్ధముగా వుచ్చరించామని తెలుసుకున్నారు. వారు దేవుడు అసహ్యించుకొనిన విగ్రహములను చేసుకొని వాటిని సేవించారు. మరియు దేవుడు వారికి విశ్రాంతి నిచ్చినప్పుడు, వారి కొరకు వారు విశ్రాంతి కూడా తీసుకొనలేదు. వారు వారి తల్లిదండ్రులను కూడా గౌరవించలేదని వారు తెలుసుకున్నారు. వారు నరహత్య చేశారు. వారు వ్యభిచరించారు, దేవుడు వారినిచేయకూడదని చెప్పిన అన్యాయ క్రియలన్నిటిని చేశారు. క్లుప్తముగా, వారు దేవుని ధర్మశాస్త్రమును పాటించలేక పోయారు.
 

ఎవని పాపములు ఇప్పటికీ క్షమించబడలేదో వారిపైన ధర్మశాస్త్రము ఆధిపత్యము కలిగివుంది

దేవుడు ధర్మశాస్త్రమును ఎందుకిచ్చెనో ఇప్పుడు అర్ధము చేసుకున్నావా? దేవుడు మొదట ధర్మశాస్త్రమును తిరిగి జన్మించని వారికి ఇచ్చెను. ‘‘సహోదరులారా, మనుష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రమతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాటలాడుచున్నాను.’’(రోమా7:1) దేవుడు పాపమును వారి పితరుల నుండి సంక్రమించుకొనిన వారికి మరియు ఇప్పటికి తిరిగి జన్మించని వారికి వారు పాపము క్రింద అంగలార్చుటకు ధర్మశాస్త్రమును ఇచ్చెను. ధర్మశాస్త్రము అతడు/ఆమె జీవించుచున్నంత కాలము ఆ వ్యక్తిమీద ఆధిపత్యము చేయును. ఆదాము యొక్క ప్రతి సంతానము అతని/ఆమె హృదయములో పన్నెండు రకముల పాపములను కలిగియున్నాడు. వారి హృదయములో పాపము కలిగినవారికి దేవుడు ధర్మశాస్త్రమును ఇచ్చెను మరియు వారితో వారు విధి వ్రాతమైన పాపమును కలిగియున్నారని చెప్పెను. ఈ విధముగా మనలోని వ్యభిచారము లేక నరహత్యలు మనలోనుండి బయటికి వచ్చి మనలను పాపము చేయునట్లు చేయునో, ధర్మశాస్త్రము మనకు చెప్పుచున్నది. ‘‘దేవుడు నీకు వ్యభిచారమును చేయవద్దని చెప్పెను. అయితే నీవు మరలా వ్యభిచారము చేసావు. అందువలన నీవొక పాపివి. నరహత్య చేయవద్దని దేవుడు నీకు చెప్పాడు, నీ ద్వేషముతో నీవు నరహత్య చేసావు. వ్యభిచారము మరియు నరహత్యలు చేయు నీవు ఒక పాపివి. దొంగిలించవద్దని దేవుడు నీకు చెప్పాడు. అయితే మరలా నీవు దొంగతనము చేసావు. అందువలన నీవు ఒక దొంగవి’’. ఈ విధముగా, ధర్మశాస్త్రము ఎక్కడ ఉనికిని కలిగియున్నదో ధర్మశాస్త్రము అక్కడ ఉనికిలోనికి వచ్చెను.
ఇందువలననే పౌలు చెప్పెను. ‘‘సహోదరులారా, మనుష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రమతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాటలాడుచున్నాను’’ ధర్మశాస్త్రము ఎవని పాపము ఇప్పటికి క్షమించబడలేదో వారిపైన ఆధిపత్యము కలిగియున్నది. దేవుని ధర్మశాస్త్రము ఎరుగని అన్యులకు, వారి మనస్సాక్షే వారికి ధర్మశాస్త్రమైనది. వారు కీడును చేసినప్పుడు, వారి మనస్సాక్షి వారు పాపము చేసారని వారికి చెప్పును. అదే విధముగా, అవిశ్వాసులు మనస్సాక్షి వారికి ధర్మశాస్త్రము వలె పనిచేస్తుంది. మరియు వారు వారి మనస్సాక్షి ద్వారా వారి పాపమును గుర్తుపట్టుదురు. (రోమా 2:15)
చివరికి నీ మనస్సాక్షి కూడా దేవుడున్నాడని నీకు చెప్పుచున్నప్పటికి, సృష్టికర్తను నీవు ఎందుకు సేవించవు? నీవు దేవునిని ఎందుకు వెదకవు? నీవు నీ హృదయమును ఎందుకు మోసపరచుకొంటావు? నీవు నీ పాపమును గురించి సిగ్గు పడతావు. మరియు ఇతరులు నీ పాపమును గురించి తెలుసుకొంటారని భయపడతావు. అయితే దేవుని నంగీకరించని పాపులు మరియు వారు హృదయమును మోసపరచుకొను పాపులు సిగ్గుపడరు.
మనము ఆకాశము, భూమి, ఇతర ప్రజలు, లేక ఇతర ఏ జీవి వైపైనా చూసినినప్పుడు మనము పాపమును కలిగియుంటే సిగ్గుపడుదుము. దేవుడు మానవులకు మనస్సాక్షిని ఇచ్చెను మరియు మనస్సాక్షి ధర్మము పాపమును ప్రశ్నించును. అయితే వారిలో అనేకులు దేవుని యెదుట వేషధారుల వలె ఆటలాడుచు, వారు జీవించుచున్నంత కాలము వారికిష్టము వచ్చునట్లు, దేవుడు లేకుండానే జీవించుదురు. వారు నరకమునకు నిర్దేశించబడి యున్నారు. ధర్మశాస్త్రమునకు చెవియొగ్గమని పౌలు వారికి చెప్పినట్లుగా, ‘‘సహోదరులారా, మనుష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రమతనిమీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాటలాడుచున్నాను’’ అని వారికి గుర్తు చేసెను. ఒక మానవుడు తప్పని సరిగా రెండు సార్లు జన్మించాలి ఒకసారి పాపిగా, ఒక నీతిమంతునిగా జీవించుటకు దేవుని విమోచనా కృపచేత తిరిగి జన్మించాలి.
పౌలు ఈ క్రింది విధముగా పాప నియమము ఉగ్రత నుండి ప్రభువు మనలను ఏ విధముగా కాపాడెనో వివరించాడు. ‘‘భర్తగల స్త్రీ, భర్త బ్రతికియున్నంతవరకు ధర్మశాస్త్రము వలన అతనికి బద్దురాలు గాని, భర్త చనిపోయిన యెడల భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందెను గనుక వేరొక పురుషుని వివాహము చేసుకొనినను వ్యభిచారిణి కాకపోవును.’’ (రోమా 7:2-3)
ఒక పెండ్లి అయిన స్త్రీ అక్రమ సంబంధమును కలిగియుంటే, ఆమె వ్యభిచారిణి అని పిలువబడును. ఒకవేళ ఆమె భర్త చనిపోతే మరియు ఆమె మరియొకని పెండ్లి చేసుకొనినట్లయితే, దీనిలో తప్పు ఏమీ లేదు. ఇదే తర్కము పాపనియమము నుండి మన విడుదలకు వర్తించును. ఆదాము సంతతిలో ఎవని పాపము ఇంకా క్షమించబడలేదో వారందరి మీద ధర్మశాస్త్రము ఆధిపత్యము వుంది. ఇది వారికి ‘‘మీరు పాపులు’’ అని చెప్పుచున్నది. అందువలన ధర్మశాస్త్రము క్రింద వారి పాపముతో నిండియున్న తనమును ‘‘నేను తప్పక నరకమునకు వెళ్లవలెను. నేను పాపిని నా పాపము జీతమును బట్టి నేను తప్పక నరకమునకు పోవుట సహజ సిద్ధమైనది’’ అని చెప్పుచు ఒప్పుకొందురు. క్రీస్తు దేహము ద్వారా మనము ధర్మశాస్త్రము విషయములో చనిపోయినవారమైతే, ధర్మశాస్త్రమునకు మనమీద అధికారము వుండదు, ఎందుకనగా ఆయనతో కూడా మనము బాప్తిస్మము పొందుట వలన మన ప్రాచీన పురుషుడు క్రీస్తుతో సిలువవేయబడియున్నారు.
 

మన ప్రాచీన స్వభావము చనిపోయినది. 

మన పాత భర్తల విషయములో మన ప్రభువు శ్రద్ధ తీసుకొనెను మరియు మనము ఆయనను పెండ్లి చేసుకొను సమర్ధులుగా చేసెను. ‘‘కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించునట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అనే వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి’’. (రోమా7:4) మానవులందరు వారి అందరి పితరుడైన ఆదాము వన పాపములో పుట్టిన వారికి దేవుడు ధర్మశాస్త్రమును ఇచ్చాడు. అందువలన, పాపము ఆజ్ఞ ద్వారా ఇంకా ప్రత్యక్షపరచబడవలసియున్నది. వారు దేవుని తీర్పు క్రింద నివశించునట్లు వారిని చేసెను. అయితే వారిని క్రీస్తు శరీరము ద్వారా రక్షించెను. యేసుక్రీస్తు మన స్థానములో చనిపోయెను. దేవుని ధర్మశాస్త్రము ప్రకారము మనము నరకమునకు పోవుట సరియైనది కాదా? అది సరియే. ఏది ఏమైనా, మన ప్రభువు ఈ లోకమునకు పంపబడెను, యొర్దాను నదిలో బాప్తిస్మము పొందుటచేత ఆయన బాప్తిస్మముతో మన పాపములన్నియు తీసుకొనెను, సిలువ వేయబడెనను మనకు బదులుగా తీర్పుతీర్చబడి ధర్మశాస్త్ర ఉగ్రత చేత శపించబడెను. దీని ద్వారా మరియు దీనితో మాత్రమే దీనిని విశ్వసించుట చేత మనమిప్పుడు రక్షించబడగలము మరియు తిరిగి జన్మించగలము.
తిరిగి జన్మించనివారు తప్పక నరకమునకు వెళ్లవలెను. వారు తప్పక యేసునందు విశ్వాసముంచి తప్పక రక్షించబడవలెను. మనము తప్పక ఒకసారి యేసుక్రీస్తుతో చావవలెను. మన ప్రాచీన పురుషుడు ఒకసారి చనిపోకపోతే, మనము నూతనమైన వారముగా మారలేము మరియు పరలోక రాజ్యమందు చేరలేము. మన ఐక్యపరచబడిన విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రము ప్రకారము మన ప్రాచీన పురుషులు తీర్పుతీర్చబడునట్లయితే, మనము తప్పక తీర్పు తీర్చబడి నరకమునకు పంపబడుదుము. తిరిగి జన్మించని వారందరు తప్పక నరకమునకు వెళ్ళవలెను.
అవిశ్వాసులు బాగుగా జీవిస్తారు. ఒక మంచి జీవితము ఇవ్వగలిగిన దానిని బహుగా ఆనందిస్తారు. అయితే వారు వారి నిత్య శిక్షను గురించి శ్రద్ధ తీసుకొనరు. మానవులందరు వారు ఈ భూమిమీద జీవించియుండగానే ప్రభువైన యేసుక్రీస్తు చేత వారి పాపక్షమాపణను పొందవలెను. విశ్వాసము ద్వారా ప్రతి ప్రాచీన పురుషుడు యేసుతో ఐక్యమగుట చేత ఒకసారి చావవలెను. ఎందుకనగా మనము ఈ లోకము నుండి వెళ్లిపోయిన తరువాత తిరిగి జన్మించలేము. మనము ఒకసారి చంపబడవలెను. మరియు మన పాపములనుండి యేసుక్రీస్తునందున్న విశ్వాసము ద్వారా విడుదల పొందవలెను. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు దేహము ద్వారా ఏ విధముగా ? యేసు ఈ లోకమునకు వచ్చెను, మరియు మన పాపములన్నిటిని తీసుకొని పోయెను అని విశ్వసించుటచేత నీవు చనిపోయావా? ఇప్పటికి చనిపోకుండా వున్నవారు ఎవరైనా వున్నారా? నీవే! ‘‘నేనెలా చనిపోయినవానిగా మారగలను? నేను చనిపోతే ఎలా జీవించి వుంటాను’’? అని ఆశ్చర్యపోవచ్చు. ఇది ఒక రహస్యము. ఇది ఏ మతము ఎన్నడును పరిష్కరించలేని ఒక మర్మము.
కేవలము తిరిగి జన్మించినవారు మాత్రమే వారి ప్రాచీన పురుషులు యేసుక్రీస్తుతో ఐక్యపరచబడుట వలన చనిపోయారని చెప్పగలరు. తిరిగి జన్మించిన విశ్వాసుల యొద్ద నుండి పాపులు దేవుని వాక్యమును వినినప్పుడు మాత్రమే వారి ప్రాచీన పురుషులు చనిపోగలరు మరియు వారు తిరిగి జన్మించగలరు. దీని ద్వారా వారు దేవుని సేవకులుగా మారుదురు. మానవులందరు తిరిగి జన్మించిన పరిశుద్ధుల నుండి దేవుని వాక్యమును తప్పక వినాలి. నీవు వారి బోధనను నిర్లక్ష్యము చేసినట్లయితే నీవు తిరిగి జన్మించబడలేవు. పౌలు కూడా ఆ సమయమునందు ప్రఖ్యాతి గాంచిన బోధకులలో ఒకరైన గమాలియేలు వద్ద దేవుని వాక్యమును నేర్చుకొన్నను, క్రీస్తు లేకుండా తిరిగి జన్మించలేక పోయాడు. మనమెంత వందనస్థులము! మనము విశ్వాసముచేత యేసుక్రీస్తు దేహము ద్వారా మనము చనిపోయినప్పుడు, మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తు నందు విశ్వాసముంచుట చేత, దేవుని కొరకు నీతి ఫలమును ఫలించగలము. అప్పుడు మనము పరిశుద్ధాత్మయొక్క తొమ్మిది వరములను మనము ఫలించగలము.
 

మన అవయవములలో నున్న పాపేచ్ఛలు మరణఫలమును ఫలించుటకై కార్య సాధకములైయున్నవి

‘‘ఏలయనగా మనము శరీరసంబంధులమై యుండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై, ధర్మశాస్త్రము వలననైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములైయుండెను’’ (రోమా 7:5) ‘‘మనము మన శరీర సంబంధులమై యుండినప్పుడు, అనగా తిరిగి జన్మించక మునుపు అని అర్ధము. యేసుక్రీస్తు ద్వారా మనము విశ్వాసము కలిగియుండనప్పుడు మరణార్ధ ఫలమును ఫలించుటకై మన అవయవములలో వున్న పాపేచ్ఛలు కార్యసాధకములైయున్నవి. ఆ సమయమునందు పాపేచ్ఛలు నిరంతరముగా మన అవయవములలో పనిచేయును. హృదయములో పన్నెండు రకములైన పాపపు కంతలున్నవి. మరో విధముగా చెప్పాలంటే, మన హృదయము నుండి వెలుపలికి వచ్చే పాపము పన్నెండు రకములు. ఈ దినమున, ఉదాహరణకు వ్యభిచారమను ఒక పాపము దానికంతలోనుండి బయటికి వచ్చి హృదయమును కదలించవచ్చు. అప్పుడు హృదయము తలకు ఆజ్ఞాపించును. ‘‘వ్యభిచారము దాని రంధ్రములో నుండి వెలుపలికి వచ్చుచున్నది. అది నాకు వ్యభిచారము చేయమని చెప్పుచున్నది’’ అప్పుడు, తల ‘‘సరే నేను చేతులకు, కాళ్ళకు దీనిని నిర్వహించమని చెబుతాను. కాళ్ళు చేతులారా వినండి, మీరు కోరినట్లు మీరు చేయండి. త్వరపడండి!’’ తల దాని అవయవముకు శరీరము ఎక్కడ వ్యభిచరించునో అక్కడికి పోవుటకు ఆజ్ఞాపించును. అదే విధముగా నరహత్యకు చెందిన పాపము దాని రంధ్రము నుండి వెలుపలికి వచ్చునప్పుడు, అది హృదయమును కదలించును మరియు హృదయము మరియొకని పట్ల కోపము వచ్చునట్లుగా తలను చేయును. అప్పుడు తల దీనికొరకు సిద్ధపడమని దేహమునకు చెప్పును. పాపము మన అవయవములో ఈ విధముగా పనిచేయును.
ఈ కారణము చేతనే మనము తప్పక మన పాపములు క్షమాపణను పొందాలి. మనము ఒకవేళ పాపములకు క్షమాపణ పొందనట్లయితే మనము ఏమీ చేయలేము గాని ఇది మనము చేయవలెనని కోరినది కాకపోయినను హృదయము ఆజ్ఞాపించునట్లుగా చేయుట తప్ప మరేమి చేయలేము. ప్రతి ఒక్కరు ఈ నిజసువార్త చేత తిరిగి జన్మించవలెను. ఒక లార్వా సీతాకోక చిలుక అయినట్లుగా ఒకడు తిరిగి జన్మించినప్పుడు అతడు సంపూర్ణుడగును. సేవకులు కేవలము వారు తిరిగి జన్మించిన తరువాతనే ప్రభువును నిజముగా సేవించగలరు. వారు తిరిగి జన్మించకమునుపు వారు చెప్పగలిగినదంతా ఏమిటంటే, ‘‘ప్రియమైన పరిశుద్ధులారా, మీరు తప్పక మంచి చేయవలెను. రోగులువారిని వారు బాగు చేసుకొనుటకు ఇది సంజీవని. వారు వారి హృదయమును కడుగుకొనుట ఎట్లో తెలియకపోయినను సమాజమును వారి హృదయమును వారు కడుగుకొనమని అడుగుదురు.
మన అవయవములలో వున్న పాపేచ్ఛలు మరణార్థమైన ఫలమును ఫలించుటకు కార్యసాధకములైయున్నవి. ఒక వ్యక్తి అతడు/ఆమె పాపము చేయవలెనని కోరినందున పాపము చేయునా? పాపమునకు సేవకులుగా మనము పాపము చేస్తాము. ఎందుకంటే మనము పాపముతో పుట్టియున్నాము. మన అందరి పాపములు ఇప్పటికి కడిగివేయబడినందున, మనము ఇప్పటికి యేసుక్రీస్తు దేహము ద్వారా మరణించవలసివున్నది. మనము పాపము చేయుటకు అసహ్యించుకొనినను పాపము చేయుదుము. కావున ప్రతి ఒక్కరు పాపక్షమాపణను పొందవలెను.
ఇప్పటికీ వారి పాపములు తీసివేయబడని పాస్టర్లు ప్రభువును సేవించుట మానుకొనుట మంచిది. వారు చైనా వారి కేబేజీలు అమ్ముకొనుట మంచిది. వారు ఆ విధముగా చేయవలెనని నేను కోరుచున్నాను. చాలా డబ్బు సంపాదించుకొనుటకు ప్రజలను మోసము చేయుచు ప్రజలకు అబద్ధము చెప్పుట కన్నా మరియు వారి కొరకు వారు కానుకలు తీసుకొని పందులవలె క్రొవ్వుపట్టివుండుటకన్నా ఇది వారికి మంచిది.
ఒకడు అతడు/ఆమె అని పాపము నుండి రక్షించబడకపోయినట్లైతే, అతని/ఆమె అవయవములలో వున్న పాపము మరియు దాని పాపేచ్ఛలు మరణార్థమైన ఫలమును ఫలించుటకు కార్యసాధకములగును. మన పాపములన్నిటిని తీసుకొని పోయిన తరువాత ఆయన పరిశుద్ధాత్మను పొందుట చేత ఆయన కృప క్రింద మనము ప్రభువును సేవించగలము. అయితే మనము ధర్మశాస్త్రము క్రింద ప్రభువును సేవించలేము. మన ప్రభువు ఆ విధముగా మనకు చెప్పుచున్నాడు. ‘‘ఇప్పుడైతే దేనిచేత నిర్భందించబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై, ధర్మశాస్త్రము నుండి విడుదలను పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితిగలవారము గాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవచేయుచున్నాము.’’ (రోమా 7:6)
 

ధర్మశాస్త్రము మన పాపములను అత్యధిక పాపముగా మార్చును

‘‘కాబట్టి ఏమందుము? ధర్మశాస్త్రము పాపమాయెనా? అట్లనరాదు. ధర్మశాస్త్రము వలననేగాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పినయెడల దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవును. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసికొని సకల విధమైన దురాశలను నాయందు పుట్టించెను, ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటినిగాని, ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరల జీవము వచ్చెను; నేనైతే చనిపోతిని. అప్పుడు జీవార్ధమైన ఆజ్ఞ నాకు మరణార్ధమైనట్టు కనబడెను. ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దానిచేత నన్ను చంపెను. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు నీతిగలదియు ఉత్తమమైనదియునై యున్నది. ఉత్తమమైనది నాకు మరణకరమాయెనా? అట్లనరాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేయుచు, పాపము పాపమైనట్టు అగుపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము, అది నాకు మరణకరమాయెను.’’ (రోమా7:7-13)
దేవుడు మన పాపములు అత్యధిక పాపములగు నిమిత్తము మనకు ధర్మశాస్త్రము నిచ్చెనని పౌలు చెప్పెను. అతడు ‘‘ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు; ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది’’ (రోమా 3:20) ఏది ఏమైనా, చాలామంది క్రైస్తవులు నీతి నియమమును వెదకుచు ధర్మశాస్త్రము చేత జీవించుటకు ప్రయత్నము చేయుచున్నారు. తిరిగి జన్మించని చాలామంది పాస్టర్లు వారు ధర్మశాస్త్రమునకు అవిధేయులైనందున వారు జబ్బుపడ్డారని నిశ్చయతను కలిగియుందురు. వారు కేవలము ధర్మశాస్త్రము చేత జీవించినట్లయితే వారి జబ్బు నుండి మరలా కోలుకొందురని అనుకుంటారు.
మనము నిజముగా మన జబ్బుకు ధర్మశాస్త్రము పట్ల మన అవిధేయత కారణమనే ముగింపునకు వచ్చామా? చాలామంది క్రైస్తవులు, సేవకులు మరియు వారి విశ్వాసులవలె, దేవుని ధర్మశాస్త్రము ప్రకారము జీవించనందు వలన పరిస్థితులు సరిగా జరగడం లేదని తలంచుదురు. వారు వారి పాపమును బట్టి రోగగ్రస్తులైయ్యారని తలంచుదురు. అందువలన వారు పాపమునకు భయపడుదురు. వారు ప్రతిదినము ఏడుస్తారు. బైబిల్‌ మనకు ‘‘ఎల్లప్పుడు సంతోషముగా వుండుడి, యెడతెగక ప్రార్థన చేయుడి; ప్రతి విషయము నందును కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తము’’. (1వ థెస్సలోనీకయుకు 5:16-18) అని మనకు చెప్పుచున్నప్పటికి, వారు బైబిల్‌ చెప్పు ఒక వాక్య భాగమునకు కూడా జోడించవచ్చు. ‘‘ఏడ్వుడి, మానకుండ దుఃఖపడుడి, ప్రతిదానియందు ఏడ్వుడి,’’ అని చెప్పుదానిని అయితే తప్పు, పాస్టర్లు ప్రజలను ఎల్లప్పుడు ఏడ్వమని బోధించుదరు. ముఖము మీది ఏడ్చిన గురుతులు వారి విశ్వాసమునకు గురుతులు.
ధర్మశాస్త్ర సంబంధమైన విశ్వాసముతో ఏడ్చువారు తాము మంచి విశ్వాసమును కలిగియున్నామని చెప్పుకొందురు. తిరిగి జన్మించని తప్పు పాస్టర్లు బాగుగా ఏడ్చేవారిని ఒక సీనియర్‌ డీకన్గాను మరియు బాగా ఏడ్చే మగవానిని ఒక డీకన్గా నియమించుదురు. చర్చిలో ఏడ్వవద్దు. నీకు నిజముగా ఏడ్వవలసి వస్తే ఇంటి దగ్గర ఏడ్వుము. యేసు ఎందుకు సిలువవేయబడెను? మనలను ఏడ్చే పసివారిగా చేయుటకా? కాదు గదా! యేసు మన అన్ని దుఃఖములను, శాపములను, జబ్బులను నొప్పులను అన్నిటిని ఒక్కసారే తీసివేసెను. అందువలన ఆయన సిలువ మరణము మనలను ఏడ్చువారిగా చేయదుగాని దానికి బదులుగా సంతోషముగా జీవించువారిగా చేయును. అందువలన వారెందుకు ఏడ్వవలెను? వారు తిరిగి జన్మించిన దేవుని సంఘములో ఏడ్చుటకు ప్రయత్నము చేసినట్లయితే వారు తప్పక వారి ఇంటికి పంపివేయవలెను.
 

తిరిగి జన్మించిన వారికి తిరిగి జన్మించిన వారికి వున్న బేధమేమిటి?

ధర్మశాస్త్రము ఎన్నటికి తప్పుకాదు. ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది. మనము నీతిమంతులముకాదు గాని ఇది మాత్రము నిజముగా నీతియుక్తమైనది. మనము ధర్మశాస్త్రమునకు విరోధముగా వున్నాము ఎందుకంటే మనము ఆదాము సంతానముగా పాపముతో జన్మించియున్నాము. మనము చేయకూడనివి మనము చేస్తాము, మనము చేయవలసినవి చేయలేకపోతాము. అందువలన ధర్మశాస్త్రము మనలను అత్యధిక పాపులుగా చేయును.
‘‘ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని యెరుగుదుము; అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినైయున్నాను. ఏలయనగా నేను చేయునది నేనెరుగను. నేను చేయ నిచ్ఛయించునది చేయక ద్వేషించునదియే చేయుచున్నాను. ఇచ్ఛయింపనిది నేను చేసినయెడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్లు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాని చేయునది నా యందు నివశించు పాపమే గాని నేను కాదు. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివశింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన యెడల, దానిని చేయునది నాయందు నివశించు పాపమేగాని యికను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నందను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషునిబట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో వున్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును?’’ (రోమా7:14-24)
ఈ వాక్యభాగమునకు ముందు పౌలు చెప్పుచున్నాడు, మనమందరము అతనితో కూడా కలిపి, ఒకసారి ధర్మశాస్త్రము చేత తీర్పుతీర్చబడవలసి యున్నది. యేసుక్రీస్తు దేహము ద్వారా ధర్మశాస్త్రము యొక్క తీర్పునంతటిని మరియు ఉగ్రతను పొందినవారు మాత్రమే దేవుని నీతి ఫలమును ఫలించగలరని చెప్పుచున్నాడు. ఆయన యందు ఏ మంచి నివశించుటలేదని చెప్పుచున్నాడు. అయితే తిరిగి జన్మించినవాడు చేయును. వీరిద్దరి మధ్య స్పష్టమైన తేడా వుంది. తిరిగి జన్మించని వారికి శరీరము ఆత్మ రెండూ వుంటాయి. అందువలన వారిలో రెండు రకములైన కోరికలుంటాయి. అయితే తిరిగి జన్మించని వారిలో కేవలము శరీర వాంఛమాత్రమే వుంటుంది అది కేవలము పాపము మాత్రమే చేయవలెనని కోరును. అందువలన వారి జాగ్రత్త అంతా ఏమిటంటే ఎంత రమ్యముగా నిరంతరము పాపము ఏ విధముగా చేయాలి అనునదియే. ఇది వారి జీవితములో ఒక లక్ష్యము, తిరిగి జన్మించని వారికందరికి ఇది సామాన్యము.
పాపము ప్రజలను పాపము చేయునట్లుగా చేయును. రోమా 7:20 చెప్పుచున్నది. ‘‘నేను కోరని దానిని చేసినయెడల, దానిని చేయునది నాయందు నివశించు పాపమేగాని యికను నేనుకాదు’’ తిరిగి జన్మించిన వారి హృదయములలో పాపమున్నదా? లేదు, తిరిగి జన్మించని వారి హృదయములలో పాపమున్నదా? అవును! నీవు నీ హృదయములలో పాపమును కలిగియున్నట్లయితే, పాపము శరీరములో పనిచేయును మరియు ఇది ఇంకా పాపము చేయునట్లుగా చేయును. ‘‘మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసినయెడల, దానిని చేయునది నాయందు నివశించు పాపమేగాని యికను నేను కాదు.’’ మానవులు వారి జీవితకామంతా పాపము చేయుట తప్ప మరేమియు చేయలేరు ఎందుకనగా వారు పాపముతో జన్మించియున్నారు.
తిరిగి జన్మించినవారు అవిచ్ఛిన్నముగా ఆత్మ ఫలమును ఫలించుదురు. తిరిగి జన్మించనివారు అటువంటి ఫలమును ఫలించలేరు. వారికి ఇతరులమీద కరుణ వుండదు. కొంతమంది వారి పిల్లలు వారికి లోబడినట్లయితే వారి స్వంత పిల్లలను చంపుదురు. వారి పిల్లలు వారి మాటకు అవిధేయులైనప్పుడు వారి హృదయము నుండి క్రూరత్వము బయటికి వచ్చును. వారి హృదయములో వారి పిల్లలను చంపుదురు. వారు వాస్తవముగా వారి పిల్లలను చంపకపోయినను, వారి హృదయముతో లెక్కలేనన్ని సార్లు వారిని హత్య చేయుదురు.
నేనిక్కడ ఏమి చెప్పుటకు ప్రయత్నము చేయుచున్నానో నీకు అర్ధము అవుతుందా? అయితే నీతిమంతులు అటువంటి కార్యమును చేయలేరు. వారు వాదములోనికి దిగవచ్చు. అయితే వారు ఇటువంటి క్రూరమైన హృదయమును కలిగియుండరు. ఇతరులు కలిగియున్నట్లు అంత చేదుతోను కోపముతోను నింపబడరు.
దీనికి బదులుగా, నీతిమంతులు వారు వివిధ అభిప్రాయములను కలిగి వాదనను పెట్టుకున్న వారితో కూడా, వారి హృదయముతో ప్రజల మీద కరుణను కలిగియుండవలెనని కోరుదురు. ‘‘కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది’’. మానవులు వారు దేవుని పోలిక చొప్పున చేయబడియున్నందున మేలు చేయవలెనని కోరుదురు. అయితే పాపము వారి హృదయములో ఇప్పటికి నిలచియున్నందున, వారి నుండి కేవలము చెడ్డవి మాత్రమే బయటికి వచ్చును.
తిరిగి జన్మించని క్రైస్తవులు ఒకరితో ఒకరు విలపించును ‘‘నేను నిజముగా మంచి చేయవలెనని కోరాను. అయితే నేను చేయలేకపోయాను. నేనెందుకు చేయలేకపోయానో నాకు తెలియదు’’ వారు చేయ లేక పోవుదురని వారు తెలుసుకొనవలెను ఎందుకనగా వారు ఇప్పటికీ రక్షించబడని పాపులు. వారు వారి హృదయములో పాపమును కలిగియున్నందున వారు మేలు చేయలేరు. తిరిగి జన్మించిన వారు శరీర వాంఛతో పాటుగా ఆత్మ కోరికను కూడా కలిగియుందురు. అయితే ఇప్పటికి తిరిగి జన్మించనివారు ఆత్మను కలిగియుండరు. తిరిగి జన్మించిన వారికి మరియు తిరిగి జన్మించని వారు మధ్య కనుగొనబడిన ఒక ముఖ్యమైన బేధమిది.
పౌలు 7వ అధ్యాయములో తిరిగి జన్మించని అతని స్థితిని గురించి మాట్లాడుచున్నాడు. రోమా 7:1 నుండి ధర్మశాస్త్రమును గురించి వివరించుట చేత, అతడు చేయగోరు మేలు చేయలేక పోయాడని చెప్పుచున్నాడు, అయితే అతడు చేయగోరని కీడు చేయగలిగాడు. పౌలు, మరియొక మాటలో, పాపము చేయవలెనని కోరిక లేదు కేవలము మేలు చేయవలెనని మాత్రమే కోరాడు. అయినప్పటికి అతడు ఖచ్చితముగా ఏది చేయకూడదని కోరాడో అది మాత్రమే చేయగలిగాడు. అతడు నిజముగా అతని హృదయములో చేయగోరినది చేయుట అసాధ్యమని కనుగొన్నాడు. ‘‘అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను? ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును?’’ అతడు అతని విధిని బట్టి విలపించుచున్నాడు అయితే వెంటనే మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాను. అని ప్రభువును స్తుతించుచున్నాడు.
దీని భావమేమిటో నీవు అర్ధము చేసుకొన్నావా? తిరిగి జన్మించిన మనము, అతడు చెప్పుచున్న దాని అర్ధము చేసుకొనగలము. అయితే తిరిగి జన్మించనివారు దీనిని ఎన్నడు అర్ధము చేసుకొనలేరు. సీతాకోకచిలుకగా ఎన్నడు మారలేని లార్వాసీతాకోక చిలుక చెప్పునది ఎన్నడు అర్ధము చేసుకొనదు. ‘‘నేను చెట్టుమీద ఒక దినమునకు కొన్ని గంటలు పాటలు పాడతాను. ఆ గాలి ఎంత చల్లగా వుంటుంది!’’ లార్వా భూమి మీద నుండి ‘‘నిజముగా? గాలి అంటే ఏమిటి?’’ అని చెప్పవచ్చు. ఇది సీతాకోక చిలుక చెప్పునది ఎన్నడు అర్ధము చేసుకొనలేదు. అయితే సీతాకోకచిలుకకు గాలి అంటే ఏమిటో తెలుసు.
పౌలు తిరిగి జన్మించినందున, తిరిగి జన్మించిన వారికి మరియు తిరిగి జన్మించని వారికి మధ్య బేధమును ఖచ్చితముగా వివరించగలిగాడు. అతనిని రక్షించినవాడు యేసుక్రీస్తని అతడు చెప్పుచున్నాడు. యేసుక్రీస్తు మనలను రక్షించెనా? అవును ఆయన రక్షించెను! ‘‘కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకును, శరీర విషయములో పాపనియమమునకును దాసుడనైయున్నాను.’’
ఎవని పాపము తీసుకొని పోబడెనో వారు వారి హృదయముతో దేవుని నియమమును సేవించుదురు. అప్పుడు, శరీరముతో వారు దేనిని సేవించుదరు? వారి శరీరముతో వారు పాపమును సేవించుదురు. శరీరము పాపమును చేయుటకు ఇష్టపడును ఎందుకనగా ఇది ఎంతమాత్రము మార్పు చెందలేదు.
శరీరము శరీర విషయమును కోరును మరియు ఆత్మ, ఆత్మ విషయమును కోరుదురు. అందువలన ఎవని పాపము తీసివేయబడెనో వారు దేవునిని వెంబడించవలెనని కోరును. ఎందుకనగా పరిశుద్ధాత్ముడు ఇప్పుడు వారియందు నివశించుచున్నాడు. అయితే ఎవని పాపములు తీసివేయబడలేదో వారు వారి మనస్సుతో మరియు శరీరముతో పాపమును వెంబడించుట తప్ప మరేమియు చేయలేరు. ఇప్పుడు వారి పాపము కొనిపోబడిన తిరిగి జన్మించినవారు, వారి శరీరము పాపమును వెంబడించుచున్ననూ, వారి మనస్సుతో దేవునిని వెంబడించగలరు.
 
 
క్రీస్తుయేసునందున్న జీవాత్మ నియమము మనలను పాప మరణముల నియమము నుండి స్వతంత్రులుగా చేసెను.

మనమిప్పుడు 8:1కి దాటిపోదాము. యేసు రక్షణయందు విశ్వాసముంచుటచేత ఎవని పాపములు తీసుకొనిపోబడినవో వారు పాపులుగా పుట్టినను, దేవుని ధర్మశాస్త్రము చేత శిక్షించబడరు. ‘‘కాబట్టి ఇప్పుడు క్రీస్తుయేసునందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు. క్రీస్తుయేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను’’ (రోమా 8:1-2)
కావున యేసుక్రీస్తునందున్న వారికి ఇప్పుడు ఏ శిక్షావిధియు లేదు. ఏ శిక్షావిధి లేదు! తిరిగి జన్మించిన వారికి పాపము లేదు. మరియు వారిపైన ఏ తీర్పు వుండలేదు. వారి హృదయములలో ఎటువంటి పాపము వుండదు ఎందుకంటే యేసుక్రీస్తునందున్న జీవాత్మ నియమము వారికి పాపమరణము నియమమునుండి వారిని స్వతంత్రులుగా చేసెను. మన ప్రభువు జీవమునకు మూలము. ఆయన పరిశుద్ధాత్మచేత గర్భము ధరించబడుటచేత, దేవుని గొఱ్ఱె పిల్లగా మారెను. యోహాను చేత ఆయన బాప్తిస్మము ద్వారా యొర్దాను నదిలో లోక పాపములన్నిటిని ఆయనపైకి తీసుకొనెను. మన స్థానములో తీర్పుతీర్చబడి, ఆయన మన కొరకు సిలువ వేయబడెను. దీని ద్వారా ఆయన పూర్తిగా మన పాపములన్నిటిని తీసుకొనిపోయెను.
అప్పుడు, మన పాపములను బట్టి మరలా మనము చనిపోవవలసియున్నదా? తీర్పు తీర్చబడుటకు మనమేమైనా కలిగియున్నామా? ఆయన బాప్తిస్మము ద్వారా మన అందరి పాపములను ఆయనపైన పెట్టబడినప్పుడు, మనయందు మనము పాపమును కలిగియున్నామా? లేదు కదా! మనము తీర్పుతీర్చబడుటకు లేము ఎందుకనగా ప్రభువు యొర్దాను నదిలో బాప్తిస్మము పొందాడు, మన స్థానములో సిలువ వేయబడ్డాడు, పాపులనందరిని రక్షించుటకు మూడవ దినమున మృతులలో నుండి తిరిగి లేచాడు.
ధర్మశాస్త్రము మన మీదికి ఉగ్రతను తీసుకొని వచ్చుచుండగా దేవుని రక్షణ ఆయన తీర్పునుండి మనలను స్వతంత్రులుగా చేయును. ‘‘క్రీస్తుయేసు నందు జీవము నిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమము నుండి నన్ను విడిపించెను.’’ పాపము కలిగియున్న వారి మీదికి దేవుని ఉగ్రత ప్రత్యక్షపరచబడినది. దేవుడు వారిని నరకమునకు పంపును. అయితే ప్రభువు మనలను పాపమరణ నియమము నుండి మన హృదయములో అన్ని పాపములను తీసుకొనిపోవుటచేత స్వతంత్రులుగా చేసెను. ఆయన యేసుక్రీస్తునందున్న, విశ్వాసులను పాపము నుండి స్వతంత్రులుగా చేసాడు. నీ పాపములు తీసికొనిపోబడినవా?
‘‘శరీరముననుసరింపక ఆత్మననుసరించియే నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతివిధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాపశరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను.’’ (రోమా8:3-4)
మన ప్రభువు మనకు స్పష్టముగా ఇక్కడ మన శరీరము బలహీనమైదని మరియు ధర్మశాస్త్రమునకు అవసరమైన నీతియుక్తమైన అవసరమునకు విధేయత చూపించలేదని చెప్పుచున్నాడు. దేవుని ధర్మశాస్త్రము నిశ్చయముగా మంచిది మరియు రమ్యమైనది. అయితే మన శరీరము కూడా చాలా బలహీనమైనది. కావున మనము దీని ప్రకారము జీవించలేము. దేవుని ధర్మశాస్త్రము మనము పరిపూర్ణముగా వుండవలెనని కోరును. ఇది మనము దేవుని ధర్మశాస్త్రమునకు పూర్తిగా లోబడుటకు చేరుకొనవలెనని కోరును. అయితే మన శరీరము దీని బలహీనతను బట్టి ధర్మశాస్త్రమునకు అవసరమైన వాటిచేత జీవించలేదు. ఆ విధముగా ధర్మశాస్త్రము మన మీదికి దాని ఉగ్రతను తీసుకొని వచ్చుచున్నది. దీనియంతటి కొరకు మనము తీర్పుతీర్చబడ వలసియున్నట్లయితే మరి యేసు కొరకు వున్నదేమిటి?
దేవుడు మనలను రక్షించుటకు తన ఏకైక కుమారుని పంపెను. దేవుని పాప శరీరాకారముతో ఆయన సొంత కుమారుని పంపుటద్వారా, మన పాపములకు ఆయన నీతిని ఇచ్చెను. యేసు శరీరాకారముతో ననుసరింపక ఆత్మననుసరించు, మనయందు నీతియుక్తమైన ధర్మశాస్త్రము అవసరత నెరవేర్చబడునట్లు దేవుడు మన పాపములన్నిటిని యేసుపైకి బదిలీ చేసెను. మనకొరకు చేసెనని మనము అంగీకరించినప్పుడు మన పాపములు తుడచి వేయబడినవి.
 

ఆత్మానుసారముగా జీవించువారు మరియు శరీరానుసారముగా జీవించువారు

రెండు రకములైన క్రైస్తవులు ఉన్నారు. తమ స్వంత ఆలోచనలను వెంబడించువారు మరియు వాక్య సత్యమును వెంబడించువారు. మొదటివారు నశించుచుండగా తరువాత వారు రక్షించబడగలరు మరియు నీతిమంతులుగా మారగలరు.
‘‘శరీరానుసారులు శరీర విషయములమీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు; శరీరానుసారమైన మనస్సు మరణము; ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునైయున్నది.’’ (రోమా8:5-6) దేవునియందు విశ్వాసముంచుట అనగా ధర్మశాస్త్రము ప్రకారము జీవించుట అని తలంచుట అనునది ఎన్నడును పరిపూర్ణమైనది కాదు. ‘‘శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయములమీద మనస్సునుంతురు.’’
శరీర కార్యము కేవలము బాహ్య శరీరమును శుభ్రపరచును. అటువంటి వారు ఇంటిలో భార్యతో గొడవలు పడుచు ఇంటిలో చెడ్డగా వున్నప్పటికీ, ప్రతి ఆదివారము బైబిల్‌ దుమ్ము దులిపి వారు పరిశుద్ధుల వలె నడుచుచు చర్చికి వెళ్లుదురు. వారు ఆదివారమున దేవదూతలగుదురు.
‘‘హాయ్‌, ఎలా వున్నావు?’’
‘‘నిన్ను మరలా కలుసుకొనుట సంతోషం’’
వారు వారి పాస్టరు గారి ఒక పరిశుద్ధ స్వరముతో మరియు కరుణాయుతముగా బోధించనప్పుడెల్లా, ఆమెన్‌ అంటారు. ఆరాధన అయిపోయిన తరువాత మౌనముగా బయటికి వస్తారు. అయితే వారి దృష్టికి చర్చి కనుమరుగవగానే వెంటనే వారు భిన్నముగా మారతారు.
‘‘దేవుని వాక్యము నాకేమి చెప్పినది? నేనుగుర్తించుకొనలేక పోయాను. అలా త్రాగడానికి వెళదాం.’’
వారు చర్చిలో దేవదూతలవలె వుంటారు. అయితే వారు చర్చి నుండి దూరమవగానే ఎంతో సేపు గడవక మునుపే వారు శరీర సంబంధులగుదురు.
కావున పాపులు దేవునికి తప్పనిసరిగా ఈ విధముగా ప్రార్థన చేయవలెను. ‘‘దేవా, దౌర్భాగ్యుడనైన నన్ను, దయచేసి రక్షించుము. నీవు నన్ను రక్షించనట్లయితే నేను పరలోక రాజ్యములో ప్రవేశించలేను మరియు నేను నరకమునకు వెళ్ళుదును. అయితే నేను చనిపోవునంత వరకు నేను చేయు పాపమును నీవు కడిగివేసినట్లయితే, విశ్వాసము చేత నేను పరలోక రాజ్యములో ప్రవేశించగలను.’’ వారు పూర్తిగా దేవునిపై ఆధారపడుదురు.
ప్రతి విశ్వాసి వారి పాపము నుండి విమోచనమును పొందగలరు. మరియు అతడు / ఆమె దేవుని వాక్యమును వెంబడించినప్పుడు ఒక ఆత్మీయ జీవితమును కొనసాగించగలరు. ‘‘శరీరానుసారులు శరీర విషయములమీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయములమీద మనస్సునుంతురు;’’ దేవుని సత్యము ప్రకారము మనము తలంచి విశ్వాసముంచినట్లయితే, సమాధానమునకు వచ్చును. ‘‘ఏలయనయగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడదు. కాగా శరీర స్వభావము కలవారు, దేవుని సంతోషపరచనేరరు’’ (రోమా8:7-8) ఇప్పటికి ఎవని పాపము తీసుకొనిపోబడలేదో మరియు ఇప్పటికి శరీరము నందున్నవారు ఎన్నడును దేవుని సంతోషపరచలేరు.
‘‘దేవుని ఆత్మ మీలో నివశించియున్న యెడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు’’. (రోమా 8:8-9) ప్రజలు ఈ వాక్య భాగముతో గందరగోళములో పడుదురు ఎందుకంటే పౌలు సమృద్ధియైన ఆత్మీయపదముతో మాట్లాడుచున్నాడు. తిరిగి జన్మించనివారు రోమా 7 మరియు 8వ అధ్యాయముతో గందరగోళములో పడుదురు. వారు ఎన్నడును ఈ వాక్యమును అర్ధము చేసుకొనలేరు. అయితే, తిరిగి జన్మించిన మనము, శరీర సంబంధులము కాము. కేవలము శరీరము కొరకు జీవించము.
పై వాక్యభాగములో పౌలు ఏమి చెప్పుచున్నాడో జాగ్రత్తగా చదువుము. పరిశుద్ధాత్ముడు నీయందు నివశించుచున్నాడా? ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే, ఆ వ్యక్తి ఆయనకు చెందినవాడు కాదు. ఆయనకు చెందినవాడు కాదంటే అప్పుడు దాని అర్ధము ఈ వ్యక్తి సాతానుకు చెందినవాడు మరియు నరకమునకు నిర్దేశించబడిన ఒక పాపి అని భావము.
‘‘క్రీస్తు మీలోనున్న యెడల మీ శరీరము పాపవిషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతివిషయమై జీవము కలిగియున్నది. మృతులలో నుండి యేసును లేపినవాని ఆత్మ మీలో నివశించినయెడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివశించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును.’’ (రోమా 8:10-11) ఆమెన్‌.
మన ప్రభువు పరిశుద్ధాత్మచేత గర్భము ధరించబడ్డాడు, శరీరాకారముతో లోకమునకు పంపబడ్డాడు, మరియు మన పాపములన్నిటిని తీసుకొని పోయాడు. ప్రభువు పాప విమోచనమును విశ్వసించు, విశ్వాసుల హృదయములోనికి వచ్చియున్నాడు. ప్రతి వారి హృదయము లోపల కూర్చుని యున్నాడు. పరిశుద్ధాత్ముడు హృదయములోనికి వచ్చి మన ప్రభువైన యేసు మన అన్ని పాపములను మంచు అంత తెల్లగా కడిగివేసెనని సాక్ష్యమిచ్చును. యేసు మరలా లోకమునకు తిరిగి వచ్చినప్పుడు దేవుడు మన శరీరముకు కూడా జీవమునిచ్చును. ‘‘మృతులలో నుండి క్రీస్తు యేసు లేపినవాడు చావునకు లోనైన మీ శరీమును కూడా మీలో నివశించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును.’’
 

మనము దేవుని కుమారులమని ఆత్మ మన ఆత్మలకు సాక్ష్యమిచ్చును

మనము తిరిగి జన్మించిన తరువాత పరిశుద్ధాత్మచేత మరియు దేవునియందున్న విశ్వాసముచేత మనము తప్పక జీవించవలెను. ‘‘కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు ఋణస్థులము కాము, మీరు శరీరానుసారముగా ప్రవర్తించినయెడల చావవలసినవారై యుందురు గాని ఆత్మ చేత శరీర క్రియలను చంపినయెడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు. ఏలయనగా మరల భయపడుటకు మనము దాస్యపు ఆత్మను పొందలేదుగాని దత్త పుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగినవారమై మనము అబ్బా తండ్రీ అని మొఱ్ఱ పెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడినయెడల క్రీస్తుతోడి వారసులము’’ (రోమా 8:12-17) అబ్బా, తండ్రీ అని మనము మొఱ్ఱపెట్టుదుము ఎందుకనగా మనము దత్తపుత్రాత్మను పొందితిమి, అంతేగాని భయము మరియు బంధకముల ఆత్మను కాదు.
‘‘మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు’’ మొదటగా, దేవుని వాక్య పునాది ద్వారా మనము పాపముల ప్రాయశ్చిత్తమును పొందియున్నామని పరిశుద్ధాత్ముడు సాక్ష్యము చెప్పుచున్నాడు. రెండవ సాక్ష్యమేమనగా మనకు పాపము లేదు అని. మనము రక్షించబడియున్నామని ఆత్మ సాక్ష్యము చెప్పుచున్నాడు. ఎవని పాపములు తీసివేయబడియున్నవో వారి హృదయముయందు పరిశుద్ధాత్ముడు కార్యము చేసాడు. ‘‘నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు’’ (రోమా 3:10) నిజము, అయితే ఇది దేవుడు మనలను విడిపించకమునుపు. ఈ వాక్య భాగము క్రింద, మనము ఉచితముగా ఆయన కృపచేత యేసుక్రీస్తునందున్న విమోచనము ద్వారా నీతిమంతులముగా తీర్చబడితిమని వ్రాయబడినది. (రోమా3:24) మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన పక్షమున సాక్ష్యమిచ్చుచున్నాడని కూడా వ్రాయబడినది. దేవుడు దీనిని మన కొరకు చేసెను అని మన హృదయములలో అంగీకరించినప్పుడు ఆత్మ మన యొద్దకు వచ్చును. అయితే మనము దీనిని విశ్వసించనట్లయితే, ఆత్మ మనయందు ఎక్కడా కనుగొనబడదు. దేవుడు మనకొరకు చేసిన దానిని మన హృదయములోనికి చేర్చుకొన్నట్లయితే, ఆత్మ మనయందు ఎక్కడా కనుగొనబడదు. దేవుడు మన కొరకు చేసిన దానిని మన హృదయములలోనికి చేర్చుకొన్నట్లయితే, ఆత్మ సాక్ష్యమిచ్చును. ‘‘నీవు నీతిమంతుడవు, మీరు నా కుమారులు, మీరు పవిత్రులు, మీరు నా ప్రజలు’’ మనము పిల్లలమైతే వారసులము. అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల, క్రీస్తుతోడి వారసులము. దేవుని కుమారులు ఆయనతో మహిమపరచబడునట్లుగా క్రీస్తుతో కూడా శ్రమపడుట పూర్తిగా తగినది. పరిశుద్ధాత్మను కలిగినవారు, ఆత్మచేత నడిపించబడుదురు, పరలోకరాజ్యములో ప్రవేశము పట్ల నిరీక్షణ కలిగి యుందురు.
 

ప్రస్తుత కాలమందు శ్రమలతోపాటు వెయ్యి సంవత్సరముల రాజ్యము మరియు పరలోక రాజ్యముయందు నిరీక్షణతో మనము నివశించుదుము.

రోమా 8:18-25కు తిరుగుదుము. ‘‘మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమ యెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచుచున్నాము. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. ఏలయగా సృష్టి, నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపించబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్య్రము పొందుదునను నిరీక్షణ గలదై, స్వేచ్ఛగా కాక దానిని లోబరచినవాని మూలముగా వ్యర్ధపరచబడెను. సృష్టియావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచూ ప్రసవవేదనపడుచున్నదని యెరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచూ, మనలో మనము మూలుగుచున్నాము. ఏలయనగా, మనము నిరీక్షణ గలవారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడునది కనబడుచున్నప్పుడు, నిరీక్షణతో పనియుండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును ? మనము చూడనదాని కొరకు నిరీక్షించినయెడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము.’’
మనము ఆత్మ ప్రథమ ఫలమైయున్నాము. తిరిగి జన్మించిన మనము పునరుత్థానము యొక్క ప్రథమ ఫలములము. మనము మొదటి పునరుత్థానములో పాలుపంపులు పొందుదుము. యేసుక్రీస్తు పునరుత్థానము యొక్క ప్రథమ ఫలమైయున్నాడు. ఆయనను అంటిపెట్టుకొని యుండువారము మనము. క్రీస్తునందున్న వారు మొదటి పునరుత్థానములో పాలుపంపులు పొందుదురు; అప్పుడు, అంతము వచ్చును. భక్తిహీనుల రెండవ పునరుత్థానములో తీర్పుపొందుటకు పాలుపంపులు పొందుదురు. అప్పుడు అంతము వచ్చును. భక్తిహీనుల రెండవ పునరుత్థానములో తీర్పు పొందుటకు పాలుపంపులు పొందుదురు. ఇందువలననే పౌలు చెప్పుచున్నాడు. ‘‘మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమ యెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచుచున్నాము.’’ ఇక్కడున్న మహిమచేత, పరలోకరాజ్యమును వెయ్యిసంవత్సరములను ప్రస్తావించుచున్నాడు. ఆ దీవెనకరమైన దినములు వచ్చినప్పుడు మనము మార్పు చెందుదుము. దేవుని కుమారులు మొత్తముగా మృతులలో నుండి లేచుదురు మరియు వారిలో ప్రతి ఒక్కరు ప్రభువు యొక్క శాశ్వత జీవమును పొందుదురు. శరీరము వాస్తవముగా మృతులలో నుండి మరలా లేచును (మన ఆత్మలు ఇప్పటికే మృతులలో నుండి తిరిగి లేచినవి) రెండు అన్నిటిని క్రొత్తవిగా చేయును మరియు నీతిమంతులు ఒక వెయ్యి సంవత్సరములు రాజ్యంలో సంతోషముతో జీవించుదురు.
దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి యావత్తు తేరి చూచుచున్నది. మనము మార్పు చెందుచున్నప్పుడు సృష్టి మార్పు చెందును. అక్కడ దుఃఖముండదు, వేదనుండదు, లేక వెయ్యి సంవత్సరముల కాలములో మరణము వుండదు. అయితే మనమిప్పుడు మూలుగుచున్నాము. ఎందుకు? ఎందుకనగా శరీరము ఇప్పటికీ బలహీనము. మన ఆత్మలు ఎందుకు మూలుగుచున్నవి? అవి మన దేహము విమోచనము కొరకు మూలుగుచున్నవి.
‘‘అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్త పుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు, మనలో మనము మూలుగుచున్నాము. ఏలయనగా, మనము నిరీక్షణ గలవారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడునది కనబడుచున్నప్పుడు, నిరీక్షణతో పనియుండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడనిదాని కొరకు నిరీక్షించినయెడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము.’’ (రోమా8:23-25)
మనము ఈ నిరీక్షణయందు రక్షించబడియున్నాము. కావున, దత్తపుత్రత్వము కొరకు ఆశగా ఎదురు చూచుచున్నాము. పాపములన్నీ పూర్తిగా తీసివేయబడిన మనము, వెయ్యి సంవత్సరముల రాజ్యములో పరలోక రాజ్యములో ప్రవేశించుదుము. ప్రపంచము ఆకస్మాత్తుగా దాని అంతమునకు వచ్చినను మనము నశించము. మన ప్రభువు ఈ లోక అంతములో మరలా వచ్చును. ఆయన అన్నిటినీ క్రొత్తవిగా చేయును మరియు నీతిమంతుల క్రొత్త శరీరమును లేపును. ఆయన వారిని వెయ్యి సంవత్సరములు పాలించునట్లు చేయును.
ఈ లోకము అంతము పాపులకు నిరాశను కలిగించును, అయితే నీతిమంతులకు నూతన నిరీక్షణను కలిగించును. పౌలు దీని కొరకు నిరీక్షించెను. నీవు మూలుగుచున్నావా మరియు నీ దేహ విమోచనము కొరకు ఎదురుచూచుచున్నావా? ఆత్మ కూడా ఎదురు చూచుచున్నదా? మనము యేసు పునరుత్థాన దేహము వలె బలహీనతయైననూ, బాధయైననూ అభవించని ఆత్మీయ దేహముగా, మార్చబడుదుము.
 
 
నీతిమంతులు విశ్వాసము కలిగియుండునట్లు పరిశుద్ధాత్ముడు సహాయము చేయును.

విశ్వాసము కలిగియుండునట్లు పరిశుద్ధాత్ముడు సహాయము చేయును. మనము చూచుచున్నదాని కొరకు ఎదురు చూచెదమా? చూడము, మనము ఇప్పటికీ చూడలేని దానికొరకు నిరీక్షించుదుము. ‘అటువలె ఆత్మయు మనబలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్ఛరింపశక్యముగాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో యెరుగును; ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు.’’ (రోమా 8:26-27)
మనయందున్న ఆత్మ నిజముగా ఏమి కోరును? మనమేమి చేయుటకు అతడు సహాయము చేయును? మనము నూతన భూమి నూతన ఆకాశము కొరకు (2వ పేతరు 3:13) పరలోకరాజ్యము కొరకు ఎదురుచూచుచున్నాము. మనము ఈ నశించిపోవుచున్న ఈ లోకములో నివశించుటకు కోరుకొనుట లేదు. మనము అలసిపోయి వున్నాము. అందువలన ప్రభువు దినము కొరకు ఎదురుచూచుచున్నాము. మనము పాపము లేకుండా, జబ్బు లేకుండా, దుష్ట ఆత్మ లేకుండా శాశ్వతముగా జీవించాలని కోరుచున్నాము. అక్కడ మనము ఆనందముతో, సమాధానముతో ప్రేమతో మరియు దీనత్వముతో ప్రభువునందు ఒకరికొకరము పూర్ణ సహవాసముతో జీవించవలెనని కోరుదుము.
అందువలన, ఆత్మ మన కొరకు మూలుగుచు విజ్ఞాపనము చేయును, నూతన ఆకాశము నూతన భూమి కొరకు ఎదురుచూచును. నిజాయితీగా మాట్లాడుచున్నాను. నీతిమంతులమైన మనము, మన సహ దేవుని సేవకులతో పాటు పాస్టర్‌ అను ఆట ఆడుకొనుటచేత సంతోషించుదుమేమోగాని, అది తప్ప, ఈలోకములో ఎటువంటి సంతోషమును కలిగియుండము. మనము ఈ లోకమునందు జీవించుచున్నాము ఎందుకంటే మనకు నీరు మరియు ఆత్మ సువార్తను బోధించుటయందు ఆశక్తి యున్నది. అయితే ఈ గొప్ప తీర్మానమును బట్టియే గాని, నీతిమంతులకు ఈ లోకమునందు నివశించుటకు వేరొక కారణము లేదు.
 

ఆయనను ప్రేమించుచూ తిరిగి జన్మించిన వారికి మేలు కలుగునట్లు సమస్తమును సమకూడి జరుగును

మనము రోమా 8:28-30 చదువుదాం. ‘‘దేవుని ప్రేమించువారికి అనగా ఆయన సంకల్పంచొప్పున పిలువబడినవారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్టుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను.’’
రోమా 8:28లో పౌలు చెప్పుచున్నాడు, ‘‘దేవుని ప్రేమించువారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినవారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.’’ ఈ వాక్య భాగము చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది ప్రజలు ‘‘నేనెందుకు పుట్టాను? సాతాను ఎక్కడ వుండడో దేవుడు నన్నక్కడ పుట్టించాల్సింది, మరియు ఆయన మొదటి నుండి నేను ఆయన రాజ్యములో నివశించునట్లుగా నన్ను అనుమతించవలసివుంది. ఆయన నన్ను ఈ విధముగా ఎందుకు చేసాడు?’’ అని ఆలోచిస్తారు. కొన్ని చెడ్డ పరిస్థితులలో జన్మించినవారు ఒక ద్వేషమును కలిగియుంటారు. మొదట వారి తల్లిదండ్రులకు విరోధముగా, తరువాత దేవునికి విరోధముగా, ‘‘నీవెందుకు నన్ను ఇటువంటి శ్రమలతో నన్ను జన్మించేలా చేశావు?’’
అటువంటి విచారణ జరిపేవారికి ఈ వాక్యభాగము సరియైన జవాబును అందిస్తుంది. మనము దేవునిచేత సృజించబడినవారముగా పుట్టాము. ఇది సరియేగదా? మనము ఆయన సృష్టి ఆయన దేవుని స్వరూపమందు ఆయన పోలిక చొప్పున మనలను సృజించాడు. అయితే మనము ఇప్పటికీ ఆయన సృష్టే. దేవుడు మనలను ఈ లోకములో వుంచుటకు ఒక సంకల్పము వున్నది. లేఖనము చెప్పుచున్నది ‘‘దేవుని ప్రేమించువారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినవారికి, మేలు కలుగుటకై సమస్తమును సమ కూడి జరుగుచున్నవని యెరుగుదుము.’’ మన పితరులు సాతానుచేత మోసగించబడిన, ఆదాము అవ్వ నుండి పాపము సంక్రమించబడినందున, మనము పాపులముగా మరియు శ్రమననుభవించువారముగా జన్మించాము. అయితే దేవుడు ఒక క్రమములో విశ్వాసముద్వారా మనలను ఆయన కుమారులుగా చేయుటకు యేసుక్రీస్తును మన కొరకు పంపాడు. ఆయన మనలను సృష్టించుటలోని సంకల్పము ఇది. ఆయన మనకు సంతోషకరమైన దేవుళ్లకు చెందిన శాశ్వత జీవమును వెయ్యి సంవత్సరములలో మరియు పరలోకరాజ్యములో యేసుక్రీస్తు మరియు దేవునితో ఇచ్చుటకు కూడా ఆయన ఇష్టపడ్డాడు.
‘‘దేవుని ప్రేమించువారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినవారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.’’ మనపట్ల దేవుని చిత్తమును మన పాపములన్నీ తీసుకొనిపోయినప్పుడు విజయవంతముగా నెరవేర్చబడెను. ఇది సరియైనది కాదా? మనము ఈ లోకములో జన్మించినందుకు సంతోషముగా లేమా? మనము మహిమను గురించి ఆలోచించినప్పుడు మరియు భవిష్యత్తులో ఆనందించుము అని తలంచినప్పుడు, మనము జన్మించుటను బట్టి సంతోషముగా వుండుట మినహాయించి మనమేమి చేయలేము. అయితే చాలామంది ప్రజలు సంతోషముగా లేరు, ఇందువలననే వారు దేవుని ప్రేమను తృణీకరించుదురు.
పాపములు మరియు జబ్బు ఎందుకున్నవో నీకు తెలుసా, దుర్జనులకు అంతా సవ్యముగా వుంటుంది. కేవలము మంచిగా బ్రతకవలెను అని అనుకొనువారు ఎందుకు శ్రమలు అనుభవించుచున్నారో నీకు తెలుసా? ఇది ఎందుకంటే మనము శ్రమననుభవించినప్పుడు మాత్రమే మనము దేవునిని వెదుకుదుము. ఆయనను కలుసుకుందుము మరియు మన పాపము క్షమాపణ పొందుటచేత ఆయన కుమారులుగా మారుదుము. ఆయనను ప్రేమించువారికి మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగునట్లు చెడ్డ ప్రజలు ఈ లోకములో ఇప్పటికీ జీవించునట్లు దేవుడు చేసెను.
నీవు ఈ విధముగా ఆలోచించవద్దు. ‘‘దేవుడు నన్నెందుకు ఈ విధముగా చేసాడో నాకు తెలియదు. నేనెందుకు ఇటువంటి పేద గృహములో జన్మించి శ్రమననుభవించునట్లు దేవుడు నన్నెందుకు చేసాడు?’’ దేవుడు సాతానుని మరియు ధర్మశాస్త్ర పాలన క్రింద మనము ఈ లోకములో జన్మించునట్లుగా మరియు మనము రాజులుగా శాశ్వతముగా మన ప్రభువుతో ఆయన రాజ్యమందు నివశించునట్లుగా చేయుటకు ఆయన కుమారులుగా చేయుటకు మనలను చేసెను. మనలను ఈ విధముగా చేయుటలో దేవుని సంకల్పము ఇది. మనము దేవునికి విరోధముగా సణుగుటకు నిందించుటకు మనకేమి లేవు. ‘‘నేనెందుకు ఈ విధముగా చేయబడ్డాను? నేనెందుకు ఈ విధముగా వుండాలి?’’ ఇటువంటి కష్టము ద్వారా దేవుని మంచి చిత్తము విజయవంతముగా నెరవేర్చబడుతుంది.
నీ శ్రమలను గురించి ఫిర్యాదు చేయకు. నీ జీవితమును గురించి ఎన్నటికీ నిరాశతో కూడిన పాటను పాడకు. ‘‘మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును’’ (హెబ్రీ 9:27). ఒకని పుట్టుకకు మరియు మరణమునకు మధ్య దేవుని రక్షణాకృప వున్నది. మనము యేసునందు విశ్వాసముంచుచున్నాము. మన పాపములన్నియు దేవుని కృప చేత తీసుకొనిపోబడినవి, మరియు మనము శాశ్వతముగా వెయ్యి సంవత్సరములు పాలించుదుము మరియు దేవుని రాజ్యములో జీవించుదుము. మనము ‘‘సృష్టియంతటి ప్రభువు’’ అని పిలువబడుదుము. దేవుడు నిన్నెందుకు శ్రమననుభవించుటకు చేసెనో ఇప్పుడు నీవు అర్ధము చేసుకున్నావా? మనము తిరిగి దేవుని వద్దకు వచ్చునట్లు చేయుటచేత, ఆయన కుమారులుగా మనము దీవించబడుటకు దేవుడు మనకు శ్రమను కష్టమును ఇచ్చెను.
 
 
ఆయన కుమారునితో సారూప్యము గలవారగునట్లు దేవుడు మనలను ముందుగా ఏర్పరచెను.

పాపము క్షమాపణను పొందుటకు దేవుని తీర్పునుండి రక్షించబడుటకు, నీతిమంతులుగా మారుటకు, మనకెంతో సమయముపట్టదు. మనమందరము ఒకేసారి నీతిమంతులముగా చేయబడియున్నాము. విశ్వాసముచేత మనము తక్షణమే దేవుని కుమారులుగా మారగలము. దేవుని రక్షణ అనునది ఒక చాలాకాలము సాగు మనసొంత శుద్దీకరణ ఫలితముకాదు. దేవుడు మనలను ఒక్కసారి రక్షించెను అందరినీ ఒకేసారి నీతిమంతులుగా చేసెను.
‘‘ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారినిముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలచెను; ఎవరిని పిలచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను.’’ (రోమా 8:29-30)
చాలామంది ప్రజలు ఈ వాక్యభాగమును ‘‘కాల్వినిజమ్‌ యొక్క ఐదు సిద్ధాంతములకు’’ పునాదిని చేయుదురు. అయితే వారు తప్పు. ఇక్కడ పౌలు చెప్పుచున్నాడు, ‘‘దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను.’’ దేవుడు యేసునందు మనలను ఆయన కుమారులగుటకు ముందుగానే ఏర్పరచుకొనెను. ఆయన ప్రణాళికలో మనము ఈ భూమిమీద జన్మించునట్లుగా ముందుగానే ఏర్పరచుకొనెను. ఆయన మనలను చేసెను. ఎవని సారూప్యమందు చేయుటకు ? దేవుని సారూప్యముగల వారవుటకు ఆయన కుమారుని సారూప్యము గలవారగుటకు.
ఆయన సంతోషకరమైన చిత్తము ప్రకారము యేసుక్రీస్తు ద్వారా ఆయన కుమారులుగా మనలను దత్తత తీసుకొనుటకు దేవుడు మనము పుట్టుటకు అనుమతించెను. ఆయన కుమారులుగా ఆయన కుమారుని సారూప్యము గలవారమగుటకు, ఆయన కుమారుని పంపుటకు మనకు వాగ్ధానము చేసెను. ఆదాము సంతానముగా మనము పాపులుగా వుండగానే యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనలను పిలిచెను. ‘‘ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును’’ (మత్తయి 11:28) ఆయన మన పాపములన్నిటిని తీసుకొని పోయిన తరువాత మనలను పిలిచెను. విశ్వాసము చేత మనలను నీతిమంతులుగా చేయుటకు ఆయన మనలను పిలిచెను.
 

దేవుడు మనలను నీతిమంతులుగా చేసెను మరియు ఆయన మనలను మహిమపరచెను

దేవుడు పాపులను పిలచెను వారిని అందరినీ ఒక్కసారే నీతిమంతులుగా తీర్చెను. వేద పండితులు నొక్కి చెప్పుచున్నట్లుగా క్రమ క్రమముగా శుద్దీకరింపబడుట కాదు గాని, యేసుక్రీస్తును మన రక్షకునిగా అంగీకరించుట చేత మనమందరము ఒక్కసారి నీతిమంతులముగా చేయబడియున్నాము. దేవుడు పాపులను, నీతిమంతులుగా చేయుటకు పిలిచెను. ఈ కారణము చేతనే ఆయన పాపులను పిలచును.
‘‘ఆయన ఎవనిని పిలచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను’’ దేవుని చేత పిలువబడిన వారు మరియు యేసుచేసిన దానియందు విశ్వాసముంచినవారు నీతిమంతులుగా మారారు. మనమింతకు మునుపు ఆదాము వారసులముగా నిశ్చయముగా పాపమును కలిగియున్నాము. అయితే మన పాపములన్నియు యేసు నిజముగా వాటినన్నిటిని తీసుకొనిపోయెను అను సత్యమునందు విశ్వాసముంచినప్పుడు మన పాపములన్నియు తీసుకొనిపోబడెను. అప్పుడు నీవు పాపమును కలిగియున్నావా లేక లేదా? లేదు కదా ? మనయందు మనము ఇక ఎంత మాత్రమును ఏ పాపమును విడిచిపెట్టబడదు. ‘‘ఆయన ఎవరిని ముందుగా పిలచెనో వారిని మహిమపరచెను.’’
దేవుని కుమారులుగా మారినవారు నీతిమంతులు. ఒక్కొక్క మెట్టుగా, కొన్ని దశలలో మనము ఆయన కుమారులుగా చేయబడ్డాము అనునది నిజముకాదు. దీనికి బదులుగా, ఆయన విమోచనము చేత మనము ఒక్కసారి ఆయన కుమారులుగా మహిమపరచబడ్డాము.
‘‘మరియు ఆయన ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను.’’ దేవుడు మనలను ఆయన కుమారులుగా చేసెను. చాలామంది క్రైస్తవులు ‘‘ఐదు మెట్ల రక్షణ’’ యందు ఎందుకు విశ్వాసముంచెదరో నాకు అర్ధము కాదు. రక్షణ మరియు దేవుని పిల్లలుగా మారుట అనునది ఒక్కసారే అందరికీ జరిగెను. మన దేహము పునరుత్థానము పొందుటకు కొంత కాలము పట్టును, అయితే పాపమునుండి విడుదల ఒక్కసారే సంభవించును. కనురెప్పపాటులో ఆయన మనలను రక్షించుటకు ఏమి చేసెనో దానిని అంగీకరించుటచేత మరియు మనలను పిలచినవాడు. మనకిచ్చిన, పాపము క్షమాపణ వాక్యమునకు స్పందించినప్పుడు తక్షణమే మనము విమోచనము పొందగలము. ‘‘ప్రభువా, వందనములు హల్లెలూయ! ఆమెన్‌! నీవు నన్నురక్షించినందుకు నేను రక్షించబడ్డాను. నీవు నా పాపములన్నిటిని కడిగివేయక పోయినట్లయితే నేను విమోచించబడగలిగి వుండే వాడిని కాను. నా ప్రభువా, నీకు వందనములు! హల్లెలూయ!’’ మన పాపములు ఈ విధముగా తుడిచివేయబడినవి.
విమోచనమునకు మన క్రియలు కాని మన సమయము కాని అవసరము లేదు. మన విమోచనములో మన క్రియలకు 0.1% కూడా పాత్రలేదు. కాల్వనిష్టులు ఒకడు విమోచించబడుటకు పరలోకరాజ్యమునకు చేరుటకు ఒక్కొక్క మెట్టు చొప్పున నీతిమంతునిగా తీర్చబడవలెను అని చెప్పుదురు. ఒక పురుగు 100మీటర్ల పురుగును అది ఎంత ప్రయత్నించినను ఒక సెకనులో ఎలా చేరలేదో, ప్రజలు వారెంత మంచి వారైనను, ధర్మశాస్త్రమును పాటించుటకు వారెంత ప్రయత్నము చేసినప్పటికి, వారి స్వంత కృషిచేత నీతిమంతులుగా మారలేరు. ఒక పురుగు ఎంత కష్టపడి కడుగుకున్నను, ఎంత ఖరీదైన కాస్మటిక్స్‌ వాడినను అది పురుగే. అదే విధముగా పాపులు వారి హృదయములో పాపమున్నంత కాలం వారెంత మంచిగా కనబడినను వారు కేవలము పాపులే.
ఒక్కొక్క మెట్టు శుద్ధీకరింపబడుట చేత ఒక పాపి ఏ విధముగా పూర్తిగా నీతిమంతునిగా తీర్చబడగలడు? శరీరము సమయము గడిచేకొలది మెరగువుతుందా? లేదు. శరీరము వయస్సు పెరుగుచున్న కొలదీ భక్తిహీనముగాను మరింత చెడ్డదిగాను అగును. అయితే బైబిల్‌ చెప్పుచున్నది. ‘‘దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారా తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను.’’ ఈ వాక్య భాగము దేవునిచేత ఒక్కసారే ఏమి సంభవిస్తుందో ఒక వరుసలో చెప్పెను; ఇది విమోచనము నీతిమంతులుగా తీర్చడము కొన్ని దశలలో విజయవంతముగా నెరవేర్చబడెనని చెప్పుట లేదు. ఒకడు ప్రభువు నందు విశ్వాసముంచుట చేత ఒకేసారి నీతిమంతునిగా చేయబడగలడు, అంతేగాని దశలు దశలుగా కాదు.
చాలామంది వేదాంత పండితులు, వారేమి చేయుచున్నారో వారు ఎరుగకయే, సరియైన కారణములేని అంశమును చొప్పించి ప్రజలను నరకమునకు పంపుదురు. దేవుడు మనకు విమోచనమును వాగ్ధానము చేసెను మరియు యేసుక్రీస్తు ద్వారా పిలచెను, మనలను నీతిమంతులుగా తీర్చెను. ఆయన పిలుపుకు జవాబిచ్చుటకు ఎవరు ముందుకు వచ్చెనో వారిని మహిమపరచెను. ‘‘తన్ను ఎందరంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను’’ (యోహాను 1:12) దేవుడు మనలను మహిమపరచెనా? మహిమ పరచెను! మనము మంచి క్రియలు చేయుట ద్వారా మరియు పరీక్షల ద్వారా మహిమపరచబడగలమా? నీతిమంతులుగా మారుటకు మనము కష్టపడి ప్రయత్నము చేయవలెనా? కాదుగదా! మనము ఇప్పటికే నీతిమంతులముగా తీర్చబడియున్నాము.
 

దేవుని ప్రేమ నుండి మనలను ఎవరును వేరుపరచలేరు

దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి యెవ్వడు? ‘‘ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధియెవడు? తన సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవునిచేత ఏర్పరచబడిన వారిమీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే; శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తుయేసు. అంతేకాదు, మృతులలో నుండి లేచినవాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మనకొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను బాధయైనను హింసయైనను కరవైనను, వస్త్రహీనతయైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్ల ప్రేమించువాని అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవునవి యైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను, మనప్రభువైన యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను’’ (రోమా 8:31-35; 37-39).
ఎవరును దేవుని ప్రేమ నుండి మనలను వేరుచేయలేరు. ఎవరును నీతిమంతులమైన మనలను పాపులుగా చేయలేరు. ఎవడును దేవుని కుమారులుగా మారినవారిని మరియు వెయ్యి సంవత్సరముల పాలనలోను పరలోకములోను నివశించువారిని ఎవరును అడ్డగించలేరు. మహా శ్రమలు మనలను పాపులుగా మార్చునా? వేదనలు మనలను పాపులుగా మార్చునా? హింస మనలను పాపులుగా మార్చునా? కరువైనను, వస్త్రహీనతయైనను, ఖడ్గమైనను, మనలను మరలా పాపులుగా చేయునా? ‘‘తన సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతోపాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు?’’ దేవుడు మనకు పరలోక రాజ్యమును ఇచ్చును. మనలను రక్షించుటకు ఆయన తన అద్వితీయ కుమారున్నే ఇచ్చినందున ఆయన మనకు ఉచితముగా అన్నిటినీ ఇచ్చును. ఇంత గొప్ప త్యాగమును మన కొరకు చేయుటకు ఇష్టపడియున్నప్పుడు, అప్పుడు, ఆయన మనలను ఎందుకు ఆయన కుమారులుగా చేయడు?
 
 
మనపైన క్రుమ్మరించబడిన విమోచనము అనునది...

మనలను మన పాపములనుండి విమోచించుటకు, మనము మొదటగా తండ్రియైన దేవునిచిత్తము ప్రకారము యేసుక్రీస్తు శరీరాకారములో పంపబడెను అని అంగీకరించవలెను. రెండవదిగా, యొర్దాను నదిలో యేసు ఆయన బాప్తిస్మము ద్వారా మన పాపములన్నిటిని ఆయనపై వేసుకొనెను అని అంగీకరించవలెను. మూడవదిగా, యేసు మన కొరకు సిలువవేయబడెను అని ఒప్పుకొనవలెను, చివరిగా ఆయన పునరుత్థానము పొందెనని ఒప్పుకొనవలెను. మనము పైనున్న ప్రతిదానిలో ఏ ఒక్కదానియందు విశ్వాసముంచకపోయినను మనము రక్షించబడము.
యేసు దేవుని కుమారుడని విశ్వాసముంచనివారు, లేక ఆయన దేవుడు మరియు సృష్టికర్త అని విశ్వసించనివారు దేవుని రక్షణకు వెలుపల వున్నారు. ఒక వ్యక్తి యేసుక్రీస్తు దైవత్వమును తృణీకరించినట్లయితే అతడు/ఆమె సాతాను బిడ్డయగును. బాప్తిస్మమిచ్చు యోహానుచేత బాప్తిస్మము పొందినప్పుడు మన పాపములన్నీ ఆయనపైన పెట్టబడినను వాస్తవమును తృణీకరించినవారు కూడా రక్షించబడలేరు. యేసు వారి రక్షకునిగా మారలేడు. వారి ఆలోచనచేత వారు యేసునందు విశ్వాసముంచినప్పటికీ వారు వారి హృదయముయందు రక్షించబడరు. వారు యేసును ఎరిగినప్పటికి నరకమునకు పోవుదురు. యేసుక్రీస్తు మన స్థానములో చనిపోయెను ఎందుకనగా ఆయన బాప్తిస్మముతో మన పాపములన్నిటినీ తీసుకొనెను. యేసు మన పాపములను బట్టి చనిపోయెను. ఆయన పాపములను బట్టి కాదు. అప్పుడు ఆయన విశ్వాసముంచు వారందరిని నీతిమంతులుగా తీర్చుటకు మరియు వారిని పునరుత్థానమునందు వారిని లేపుటకు ఆయన మృతులలో నుండి మరలా లేచెను.
 

ఆయన బాప్తిస్మము యందున్న విశ్వాసముతో మనము రక్షించబడియున్నాము

8వ అధ్యాయమునకు కలుపుచు 7వ అధ్యాయమును నేను చాలాసార్లు బోధించాను. 7వ అధ్యాయము పాపము కలిగినవాడు మేలు చేయడని చెప్పుచున్నది. అయితే 8వ అధ్యాయము క్రీస్తుయేసునందున్న వారికి ఏ శిక్షావిధియులేదని మరియు యేసుక్రీస్తునందున్న మన విశ్వాసము మనలను పాపములేని వారిగా చేస్తున్నదని చెప్పుచున్నది. మనము బలహీనులము మరియు దేవుని చిత్తప్రకారముగా జీవించలేము అందువలన తండ్రియైన దేవుడు యేసుక్రీస్తు మన రక్షకునిగా పంపెను. మరియు ఆయన మనమింకను పాపులుగా వున్నప్పుడు ఆయన బాప్తిస్మముతో మన పాపములన్నిటిని తీసుకొనెను. యేసుక్రీస్తు ద్వారా మనము మన అన్ని పాపముల నుండి రక్షించబడియున్నాము మరియు నీతిమంతులుగా చేయబడియున్నాము. పౌలు 7 మరియు 8 అధ్యాయము ద్వారా పౌలు మనకు బోధిస్తున్నది.
‘‘కాబట్టి ఇప్పుడు శరీరానుసారముగా గాక ఆత్మానుసారముగా నడుచుకొను, క్రీస్తుయేసునందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు.’’ మనము ఇప్పుడు పాపమును కలిగిలేము. నీవు యేసుక్రీస్తునందున్నావా? యేసుక్రీస్తు నీ కొరకు చేసిన దానిని నీ వంగీకరించుచున్నావా? పౌలు అతని పాపము నుండి విమోచించబడినట్లు, యేసు బాప్తిస్మముయందు మరియు సిలువపై ఆయన రక్తమునందున్న మన విశ్వాసము ద్వారా, మన పాపములను కూడా తీసుకొనిపోబడెను. బాప్తిస్మము మరియు రక్తము మరియు పునరుత్థానమునందు విశ్వాసముంచుటచేత మనము విమోచించబడి యున్నాము. ఒక వ్యక్తి కేవలము యేసుక్రీస్తు బాప్తిస్మమునందు విశ్వాసముంచుటకు తిరస్కరించినట్లయితే, మరియు ఒక వ్యక్తి కేవలము యేసుక్రీస్తు మనకు మాదిరిగా వుండుటకు మాత్రమే బాప్తిస్మము పొందెనని నొక్కి చెప్పినట్లయితే, దేవుడు ఆ వ్యక్తిని నరకమునకు పంపును. దేవుని వాక్యము యెదుట మత్సరము కలిగియుండకుము. పౌలు తనకు తానే చాలాసార్లు దీనిని గురించి చెప్పినప్పుడు ఏ విధముగా పాస్టర్లు సేవకులు యేసు బాప్తిస్మమును నిర్లక్ష్యము చేయుదురు? విశ్వాస పితరులలో ఒకడైన అపోస్తలుడైన పౌలు విశ్వాసమును వారెలా నిర్లక్ష్యము చేయుదురు? దేవుడు తానే ఒక అపోస్తలునిగా చేసిన, దేవుని సేవకుని బోధనను వారెలా నిర్లక్ష్యము చేయుదురు?
మనము యేసుక్రీస్తు గురించి బోధించవలెనని కోరినట్లయితే, మనము తప్పక బైబిల్‌లో వ్రాయబడిన ప్రకారము బోధించాలి. మరియు మనము బైబిల్‌ ప్రకారము విశ్వాసముంచాలి. ప్రభువుమనకు చెప్పుచున్నాడు. ‘‘మీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులైయుండి సత్యమును గ్రహించెదరు; అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును’’ (యోహాను 8:31-32) నీవు మరియు నేను పౌలు వలె యేసు బాప్తిస్మము నందు విశ్వాసముంచుటకు వచ్చాము.
ఎప్పుడు నీ పాపములు యేసు దేహముపైకి బదిలీ చేయబడినవి? బాప్తిస్మమిచ్చు యోహాను చేత ఆయన బాప్తిస్మము పొందినప్పుడు మన అందరి పాపములు యేసుపైకి చేర్చబడినవి. యేసు యోహానుతో ‘‘ఇప్పటికి కానిమ్ము; నీతి యావత్తు ఈలాగునెరవేర్చుట మనకు తగియున్నది’’ ఇక్కడ ‘‘ఈలాగు’’ అనగా గ్రీకులో ఈ విధముగా అత్యున్నతముగా తగినది. ఇది తప్ప మరియొక మార్గము లేదు అని అర్థమిచ్చు ‘‘హుటోస్‌’’ అను మాట. ఈ పదము యేసు తిరుగులేకుండా యోహాను నుండి ఆయన పొందిన బాప్తిస్మము ద్వారా మానవజాతి పాపములను తనపైకి తీసుకొనెను అని చూపించుచున్నది. బాప్తిస్మము అనగా ‘‘కడుగుట’’ అని భావము. మన హృదయములలోనున్న పాపములన్నియు కడిగివేయబడుటకు, మన పాపములు యేసుక్రీస్తుపైకి బదిలీ చేయబడవలెను.
మన పాపములను తీసుకొనిన యేసుక్రీస్తు, మనకు బదులుగా సిలువవేయబడెను, మనతో ఐక్యమగుటచేత పాతిపెట్టబడెను. ఆ విధముగా పౌలు ‘‘నేను క్రీస్తుతో సిలువవేయబడియున్నాను’’ (గలతీయులకు 2:20) అని స్పష్టము చేసాడు. వాస్తవమునకు సిలువపైన మరణమునకు కొట్టబడినది క్రీస్తు అయినప్పుడు మనమెలా సిలువ వేయబడగలము? మనము క్రీస్తుతో సిలువ వేయబడ్డాము ఎందుకనగా యేసు తనపైకి మన అన్ని పాపములను తీసుకొనెను మరియు ఈ పాపములనుబట్టి సిలువ వేయబడెను అని విశ్వసించుచున్నాము.
నా పాపములన్నిటి నుండి నన్ను రక్షించిన ప్రభువును నేను స్తుతించుచున్నాను. యేసు మనలను నీతిమంతులుగా చేసియున్నందున మనము ధైర్యముగా సువార్తను ప్రకటించగలము. శరీరము బాగా బలహీనమై దేవుని మహిమను పొందలేకపోవుచున్న, మనలను మన అన్ని పాపములనుండి రక్షించినందుకు మన ప్రభువుకు నేను వందనములు చెల్లించుచున్నాను.