• All e-books and audiobooks on The New Life Mission website are free
  • Explore multilingual sermons in global languages
  • Two new revised editions in English have been released
  • Check out our website translated into 27 languages
Search

Sermons

అంశం 9: రోమీయులకు ( రోమా పత్రిక పుస్తకం పై నున్న వ్యాఖ్యానం)

[అధ్యాయము 8-1] 8వ అధ్యాయమునకు పరిచయము

2021.04.28 1,058
8వ అధ్యాయము రోమా పత్రికలో అతి ప్రాముఖ్యమైన అధ్యాయముగా వర్ణించబడవచ్చునేమో ఈ అధ్యాయములో వున్న రకరకముల భావనల ద్వారా, దేవుని నీతి ఎంత అద్భుతమైనదో పౌలు మనకు ప్రత్యక్షపరచుచున్నాడు.
మొదటి భావన ఏమనగా, ‘‘కాబట్టి యిప్పుడు క్రీస్తుయేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు’’ (రోమా 8:1) మనము మన శరీరమునందు ఎంత నీచముగా తక్కువ వారమైనప్పటికి, దేవుని నీతి మన అన్ని పాపముల నుండి మనలను స్వతంత్రులుగా చేసెను అని భావము.
రెండవ భావన ఏమనగా ‘‘ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను’’ (రోమా8:3). ప్రజలు వారి శరీరమునందు దేవునిచేత ఇవ్వబడిన ధర్మశాస్త్రమును వెంబడించలేక పోయినందున, యేసుక్రీస్తు, ఆయన బాప్తిస్మము మరియు సిలువపైన ఆయన రక్తముతో ఆయనపైన వారి అన్ని పాపములను తీసుకొనుటచేత, వారిని వారి పాపములనుండి తీర్పు నుండి రక్షించెను. ఇది ఎందుకంటే యేసు ఈలోకమునకు వచ్చి బాప్తిస్మమిచ్చు యోహానుచేత ఇవ్వబడిన ఆయన బాప్తిస్మముతో ఒక్కసారే లోక పాపములను తీసుకొనిపోయి, ఆయన సిలువపై లోక పాపములన్నిటిని ఆయన మోయగలుగునట్లుగా, దానిపై సిలువవేయబడినట్లుగా, మరియు ఈ సత్యమునందు విశ్వాసముంచు వారినందరిని రక్షించుటకు మరణము నుండి తిరిగి లేవగలిగాడు. మన ప్రభువు యొక్క ఈ కార్యములన్ని, తండ్రియైన దేవుని చిత్తమునకు లోబడి, పాపులను వారి పాపములనుండి రక్షించుటకు దేవుని నీతిని నెరవేర్చుట కొరకైయున్నది.
మూడవ భావన ఏమనగా ‘‘శరీరానుసారులు శరీర విషయములమీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు’’, (రోమా 8:9) దీని బావమేమనగా మనము దేవుని యందు విశ్వాసముంచుటకు తీర్మానించుకున్నప్పుడు మన స్వంత ఆలోచనలను బట్టి కాదు గాని, దేవుని వాక్యమును వెంబడించుట చేత మనము అయన యందు విశ్వాసముంచవలెను. 
నాల్గవ భావన ఏమనగా "దేవుని ఆత్మ మీలో నివసించియున్న యెడల మీరు ఆత్మ స్వభావము వారేకానీ శరీర స్వభావము గలవారు కారు". (రోమా 8:9) దేవుని నీతి యందు విశ్వాస ముంచు వారు వారి హృదయములలో పరిశుద్ధాత్మను పొందియున్నారు. మరియు వారు దేవుని పిల్లలుగా మారినారు. ఇది కూడా కేవలము క్రమము తప్పకుండా గుడికి వెళ్లినందువలన నీవుదేవుని కుమారునిగా మారలేవు అని భావము.
అయిదవ భావము ఏమనగా ‘‘కాబట్టి సహోదరులారా, మనము శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు ఋణస్తులము కాము’’. (రోమా8:12) ఈ భావన మనకు చెప్పుచున్నదేమిటనగా దేవుని నీతిని నెరవేర్చిన ప్రభువు సువార్త యందు విశ్వాసముంచుటచేత ఎవరైతే వారి పాపముల నుండి రక్షించబడియున్నారో వారు వారి శరీరమునకు ఋణస్తులు కారు మరియు దానికి సేవ చేయరు.
ఆరవ భావన ఏమనగా, ‘‘ఏలయనగా మరల మీరు భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కాని దత్త పుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మను కలిగిన వారమై మనము అబ్బా తండ్రీ అని మొఱ్ఱపెట్టుచున్నాము’’ (రోమా8:15) దేవునియందు విశ్వాసముంచువాడు పరిశుద్దాత్మను పొందియున్నాడు కావున వారిప్పుడు తండ్రియైన దేవునిని ‘‘అబ్బా తండ్రీ’’ అని మొఱ్ఱపెట్టుచున్నారు.
ఏడవ భావన ఏమనగా ‘‘మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము. అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమపొందుటకు ఆయనతో శ్రమపడినయెడల, క్రీస్తుతోడి వారసులము’’ (రోమా8:16,17) దేవుని నీతియందు విశ్వాసముంచినవారు పరిశుద్ధాత్మను పొందినవారు, క్రీస్తుతో కూడా కలిపి, పరలోక రాజ్యమునకు వారసులగుదురు.
ఎనిమిదవ భావన ఏమనగా ‘‘సృష్టియావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదన పడుచున్నదని యెరుగుదుము’’ (రోమా8:22) ఇది మనకు దేవుని నీతియందు విశ్వాసముంచు విశ్వాసులు కూడా, మిగిలిన జీవరాశులతో కలిపి, ఈ భూ సంబంధమైన వేదనను ఎదుర్కొంటాం. అయితే తరువాత రానైయున్న ప్రపంచములో అక్కడ ఏడ్పును వేదనయు వుండదని కూడా చెప్పుచున్నది.
తొమ్మిదవ భావన ఏమనగా ‘‘మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను’’ (రోమా8:30) ఇది దేవుడు పాపులను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుయందు పాపులను పిలచి, ఆయన నీతితో వారి పాపములన్నిటిని ఒకేసారి తీసుకొని పోవుటచేత ఆయన వారిని పిల్లలుగా చేసెను అని మనకు చెప్పుచున్నది.
చివరగా, అఖరిది మరియు పదియవదియైన భావన ఏమనగా, ‘‘దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే.’’ (రోమా 8:33) దేవుని నీతియందు విశ్వాసముంచుట చేత వారి పాపముల నుండి విడుదలను పొందుటను బట్టి వారి బహుమానముగా పరిశుద్ధాత్మను పొందిన దేవుని పిల్లలకు ఎవడును తీర్పుతీర్చలేడు.
ఈ పది భావనలు రోమా 8వ అధ్యాయమునకు పునాది వాక్యము. మన ప్రధాన చర్చిలో వివరముగా వాటిని గురించి పరీక్షించుటకు ఇప్పుడు తిరుగుదాము.