• All e-books and audiobooks on The New Life Mission website are free
  • Explore multilingual sermons in global languages
  • Two new revised editions in English have been released
  • Check out our website translated into 27 languages
Search

Sermons

అంశం 9: రోమీయులకు ( రోమా పత్రిక పుస్తకం పై నున్న వ్యాఖ్యానం)

[అధ్యాయము 8-2] దేవుని నీతి, ధర్మశాస్త్రము యొక్క నీతియుక్తమైన అవసరత నెరవేర్పు (రోమా 8:1-4)

2021.04.28 1,113
(రోమా 8:1-4)
‘‘కాబట్టి యిప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు. క్రీస్తుయేసునందు జీవమునిచ్చు ఆత్మయొక్క నియమముల పాప మరణము నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరము ననుసరింపక ఆత్మ ననుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతివిధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడుతన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను.
 

క్రీస్తునందున్న వారు ఎటువంటి విశ్వాసమును కలిగియున్నారో రోమా8:1-4 వరకు మనకు చెప్పుచున్నది. ఈ వాక్యభాగము యొక్క రహస్యమే మనగా, దేవుని నీతియందున్న మన విశ్వాసముతో, ధర్మశాస్త్రము అడుగు ప్రతి విధిని మనము చెల్లించగలమని చెప్పుచున్నది.
అప్పుడు, దేవునినీతియందు విశ్వాసముంచు విశ్వాసము ఏమిటి? దేని ద్వారా మన ప్రభువు మన పాపములను తీసుకొని పోయెనో ఆ యేసు బాప్తిస్మము మరియు ఆయన రక్తముయందు విశ్వాసముంచుట చేత పాపములు  క్షమాపణను పొందిన విశ్వాసమే ఇది. దేవుని నీతిని వెదుకుట చేత, మన రక్షకునిగా, దేవుని నీతియావత్తు నెరవేర్చిన, యేసునందు విశ్వాసముంచుటచేత మనము పాపములను జయించగలము. దేవుని నీతిని వెంబడించు విశ్వాసము మరియు విశ్వాసములో ఘన విజయము ఇది.
మొట్టమొదట, రోమా 8:1 మనకు చెప్పుచున్నది. ‘‘కాబట్టి యిప్పుడు క్రీస్తుయేసునందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు.’’ దేవుని నీతియందు విశ్వాసముంచుటచేత యేసుక్రీస్తునందు నివశించువాడు నిశ్చయముగా పాపమును కలిగిలేడు. అటువంటి విశ్వాసము ధర్మశాస్త్రము యొక్క  నీతియుక్తమైన అవసరతను నీతియావత్తు నెరవేర్చిన ఆయన బాప్తిస్మము మరియు ఆయన రక్తముపై ఆధారపడియున్నది. దేవుని నీతియందు విశ్వాసము తిరిగి జన్మించిన విశ్వాసులకు అతిముఖ్యమైన ఇరుసు వంటిది. కేవలము క్షయమగునవి పాపము లేనివిగా ఏ విధముగా మారగలవు? యేసుక్రీస్తు ద్వారా దేవుని నీతియందున్న కదల్చబడని వారి విశ్వాసముతో, వారి పాపములన్నియు అదృశ్యమాయెను. ఇందువలననే దేవుని నీతియందు విశ్వాసముంచు వారి విషయములో, ఆయన బాప్తిస్మము ద్వారా లోకపాపములన్నియు ఆయన శరీరముపైకి తీసుకొనెను.
రోమా 8:3 మనకు చెప్పుచున్నది అదేమనగా దేవుడు ‘‘తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, ఆయన  శరీరమందు పాపమునకు శిక్ష విధించెను’’ అని యేసు శరీరములో పాపమునకు శిక్ష విధించి, మరియొక మాటలో, తండ్రియైన దేవుడు లోక పాపములన్నిటిని తన అద్వితీయ కుమారునిపై మోపెను. ఈ సత్యవాక్యము మత్తయి 3:14-17లో ప్రత్యక్షపరచబడినది. (దీనికి సంబంధించిన ఎన్నో వివరణాత్మకమైనవి ‘‘నీవు నిజముగా నీరు మరియు ఆత్మ మూలమున తిరిగి జన్మించితివా?’’ అను పుస్తకములో చర్చించబడినవి). ఈ సత్యమునందు విశ్వాసముంచువాడు పాపమును కలిగిలేడు, ఎందుకనగా దేవుడు ఆయన నీతితో లోక పాపములన్నియు క్షమించెను.
 

‘‘అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను!’’

రోమా 7:24 నుండి 8:6 వరకు కలిగిన వాక్య భాగము రెండు వివాదాస్పదమైన విషయములను కలిగియున్నది. వాటిలో ఒకటి పాప సమస్యను గురించిన ఒక చర్చ. మరియొక మాటలో, వారి సొంత శరీరము యొక్క కామాతురతనుబట్టి అవిధేయులగుట, మరియొకటి అతడు యేసుక్రీస్తులో కనుగొనిన ఈ సమస్యకు పరిష్కారముపై ఒక చర్చ.
రోమా 7:24-25 చెప్పుచున్నది. ‘‘అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకును, శరీర విషయములో పాప నియమమునకును దాసుడనైయున్నాను.’’ పౌలు అతని సొంత శరీరమును చూసుకున్నప్పుడు అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను అని రోధించాడు. అయితే అతడు యేసుక్రీస్తు ద్వారా అతని శరీరము నుండి విడిపించబడినందున దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. చివరికి మనస్సుయందు అపోస్తలుడైన పౌలు దేవ నియమమునకును, శరీరము విషయములో పాప నియమమునకు దాసుడైయుండుటను మనము కూడా గమనించుచున్నాము.
పౌలు అతని శరీరము, దేవునిని సంతోషపరచు జీవితమును జీవించుటకు బదులుగా ఆయనకు సంతోషము లేకుండా చేయుచు, పాప నియమమును వెంబడించుచున్నదని పౌలు ఒప్పుకున్నాడు. అయినప్పటికి అతడు చెప్పుచున్నాడు. అతని మనస్సుయందు అతడు ఇప్పటికి దేవుని ఆత్మను వెంబడించుచున్నానని చెప్పుచున్నాడు. అతడు ఈ రెండు నియమముల మధ్య చుట్టబడినప్పుడు, పౌలు దౌర్భాగ్యునిగా నీచునిగా భావించుకున్నాడు. అయితే అతడు అన్నిటికీ అతీతముగా యేసుక్రీస్తునందున్న అతని విశ్వాసమును బట్టి అతని పాపము నుండి అతడు విడిపించుటను బట్టి దేవునికి వందనములు  చెల్లించుట చేత విశ్వాస విజయమును ప్రకటించాడు.
పౌలు అటువంటి కృతజ్ఞతాస్తుతులను చెల్లించగలడు. ఎందుకనగా కేవలము మానవాళి పాపముతో పాటు అతని అన్ని పాపములకు యేసుక్రీస్తు ప్రాయశ్చిత్తమును చేసినాడు అని విశ్వసించినందు వలన మాత్రమే. ఈ లోకపాపములను తనపైకి తీసుకొనుటకు, యోహాను చేత బాప్తిస్మము పొందుటచేత యేసు లోకపాపములన్నిటిని ఆయన శరీరములో వుంచాడు. సిలువపై పాపమునకు తీర్పుతీర్చబడుటచేత, ఆయన తనయందు విశ్వాసముంచిన వారినందరిని లోక పాపములన్నిటి నుండి రక్షించెను.  ఇందువలననే పౌలు రోమా 8:1లో స్పష్టము చేసాడు. ‘‘కాబట్టి యిప్పుడు క్రీస్తుయేసునందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు’’. ఇక్కడ ఏ శిక్షావిధియు లేదు అనగా దేవునినీతియందు విశ్వాసముంచువారియందు పూర్తిగా ఏ పాపమును లేదు అని అర్ధము. దేవుని నీతియందు విశ్వాసముంచుటచేత యేసుక్రీస్తునందున్న వారు ఎన్నడును వారి హృదయములయందు పాపమును కలిగియుండరు. వారు వారి శరీరములయందు బలహీనులుగా వుండవచ్చును, అయితే ఎప్పుడైనను వారు పాపమును కలిగియుండరు.
దీనికి విరోధముగా, శిక్ష అనగా పాపము ఉనికి కలిగియుండుట అను భావము, అదేమనగా  శిక్షంచబడు స్థితి. ఎవడైనను ఎప్పుడైనను తప్పిదము చేసినప్పుడు, మనము సాధారణముగా దానిని పాపము అని పిలుస్తాము. అయితే అతడు దేవుని నీతియందు విశ్వాసముంచకపోవుటను బట్టి అతడు పాపి అవ్వడం జరిగినది. అయినప్పటికి పైనున్న వాక్య భాగము యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షావిధియులేదని చెప్పుచున్నది.
ఇది లోక మతములు దేనికొరకు నిలబడుచున్నవో, ఆ నీతిమత్వ సిద్ధాంతము అని పిలవబడుచున్న సిద్ధాంతమును ఆధారము చేసుకొనిన స్పష్టీకరణ కాదు. ‘ఒప్పుకోలు అనునది విశ్వాసముచేత నీతిమంతునిగా చేయబడుట అని గుర్తించబడుచున్నది’ అనగా ఒకడు వాస్తవముగా నీతిమంతుడు కాకపోయినప్పటికి మరియు అతని హృదయములో పాపమును కలిగియున్నప్పటికి యేసునందున్న అతని విశ్వాసమునుబట్టి, దేవుడు అతనిని నీతిమంతునిగా గుర్తించును అని ఋజువు చేయుటకు వీలుపడని ఒక వాదము అని భావము. అయితే ఇది ఒక పోరపాటు. ఏ విధముగా దేవుడు ఒక పాపిని పాపములేనివాడని చెప్పి అబద్ధమాడగలడు? దీనిని ఆయన చేయడు. దీనికి బదులుగా అటువంటి పాపిని, ‘‘నీవు నిశ్చయముగా నీ మరణమును నీ పాపమును బట్టి ఎదుర్కొంటావు; నీరు మరియు ఆత్మ సువార్తలో చూపబడిన నా నీతియందు విశ్వాసముంచుము’’ అని చెప్పెను.
ఈ దినములలో చాలామంది ప్రజలు అటువంటి సిద్ధాంతమును అతుక్కొని వాటిని సమర్ధించుకొనుటకు మరియు దేవుని నీతిని సంపాదించుకొనుటకు ప్రయత్నము చేయుచున్నారు. అయితే ఇటువంటి విశ్వాసము చాలా తప్పు మరియు అపాయకరము. యేసు సత్యదేవుడు కానట్లయితే, ఆయన ఒక పాపిని ఆయన అనుచరునిగా పిలచి వుండేవాడేమో. అయితే సత్యమైయున్నయేసు, ఒక పాపిని నీతిమంతునిగా పాపములేనివాని గాను పిలవడని మీరు తెలుసుకోవాలి. ఒక పాపిని నీతిమంతునిగాను మరియు పాపములేనివానిగాను పిలచుట దేవుని నీతియెదుట, ఆయన న్యాయము మరియు పరిశుద్ధత యెదుట అసాధ్యము.
పాపము నుండి కలిగిన మీ విడుదల కేవలము యేసునందు విశ్వాసముంచుటచేత కాదు గాని, దేవుని నీతియందు విశ్వాసముంచుట వలననే వచ్చును. అప్పుడు అది మీదిగా మారునని తెలుసుకొనవలెను. చివరికి మీరు యేసునందు విశ్వాసముంచినప్పటికి కూడా, మీకు దేవుని నీతి తెలియక, ఆ విధముగా మీరు దేవుని నీతియందు విశ్వాసముంచకపోయినట్లతే దేవుడు మిమ్ములను నీతిమంతులని పిలువడు. అయితే నేటి వాస్తవము అనునది క్రమక్రమముగా శుద్ధీకరించబడడము మరియు నీతిమత్వ సిద్ధాంతము క్రైస్తవ సనాతన సిద్ధాంతముగా చాలామంది చేత అంగీకరించబడుచున్నవి. అయితే కొంతమంది ఈ సనాతన సిద్ధాంతము అని పిలువబడే సిద్ధాంతము వాస్తవముగా దేవుని నీతిని తెలుసుకొనుటను లేక దేవునినీతిని సంపాదించుకొనుటను ఆపుచేయుచున్నవని తెలుసుకొనుచున్నారు. ఇవి వాస్తవముగా దేవుని నీతికి విరోధమని ఎరుగక ఈ సిద్ధాంతములయందు విశ్వాసముంచుటచేత, అటువంటి సిద్ధాంతము వారికి అడ్డుగోడుగా మారినందున చాలామంది ప్రజలు దేవుని నీతిని పొందుటలో విఫలమయ్యారు.
నీవు నిజముగా ఒక నిజ క్రైస్తవునిగా వుండాలనుకున్నట్లయితే, నీవు నిజముగా క్రీస్తులో వున్నావో లేదో చూచుకొనుటకు నిన్ను నీవు దేవుని వాక్యముతో కొలుచుకొనవలెను. ఆ విధముగా చేయుటకు, నీవు తప్పక నీరు మరియు ఆత్మ వాక్యమును వినవలెను, చూడవలెను, అర్ధము చేసుకొనవలెను. ‘‘నేను యేసునందుంచిన విశ్వాసము సరియైనదేనా? నేను యేసునందు విశ్వాసముంచుచున్నానని అన్నప్పుడు నేను కేవలము మతమును అభ్యసించుటలేదా? నేను యేసులో వుండీ వుండక రెండు పడవల మీద కాళ్ళు పెట్టినట్టుగా లేనా?’’ అని నిన్ను నీవు ప్రశ్నించుకో. ‘‘కాబట్టి యిప్పుడు క్రీస్తుయేసునందున్న వారికి ఏ  శిక్షావిధియు లేదు’’ అను సత్య విశ్వాసమునందు విశ్వాసముంచి నివశించుటచేత దేవుని నీతిని నీవు పొందుకొనుటకు ఇదే సమయము.
ఎఫెసీయులకు వ్రాసిన పత్రికలో మనము తరచుగా ‘‘యేసుక్రీస్తు నందున్న విమోచనము ద్వారా’’ అను మాటను మనము తరచుగా ఎదుర్కొంటాము. దీని భావమేమనగా మనలను మన అన్ని పాపముల నుండి యేసుక్రీస్తునందు రక్షించుటకు దేవుడు మనలను ముందుగా ఏర్పరచుకొని ఎన్నిక చేసుకొనెను అని భావము. దేవుని నీతి చేత ప్రాయశ్చిత్తము పొంది క్రీస్తులోనికి ప్రవేశించిన వారెవరనగా ఎవరి పాపములు పూర్తిగా కడిగివేయబడినవో వారు. ప్రభువు చేత ఇవ్వబడిన నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచిన వారు. యేసుక్రీస్తునందు ఎటువంటి శిక్షను ఎదుర్కొనరు. ఒకడు నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచినప్పుడు, వాడు యేసుక్రీస్తునందు దేవుని నీతిని పొందిన వానిగా మారి, ఈ సువార్తను ప్రకటించువాడగును.
యేసుక్రీస్తునందు దేవుని నీతియందు విశ్వాసముంచువారు మరియు ఆయన విశాల హస్తములలోనికి ప్రవేశించినవారు పాపమును కలిగిలేరు.  ఇది సత్యము మరియు సరియైన జవాబు. యేసు బాప్తిస్మము మరియు సిలువపై ఆయన రక్తము, దేవుని నీతియందు విశ్వాసముంచుటచేత వారి పాపములన్నిటిని అదృశ్యము చేసినందున, వారు పాపమును కలిగియుండుట అసాధ్యము. క్రీస్తునందున్న వారు ఆ కారణమున నిజముగా పాపమును కలిగిలేరు. ఈ సత్యము ` యేసుక్రీస్తునందున్న వారికి పాపము లేదు ` అనునది నీరు మరియు ఆత్మ వాక్యములో కనుగొనబడినది. ఆ విధముగా పాప సమస్యకు చిక్కు కలిగించునది ఏదీ లేదు. నీరు మరియు ఆత్మ సువార్త ద్వారా ప్రత్యక్షపరచబడిన దేవుని నీతి యందు విశ్వాసముంచినప్పుడు, నీవు కూడా నిజముగా నీతిమంతుడవగుదువు. దేవుని నీతి దేనిలో గలదో ఆ నీరు మరియు ఆత్మ సువార్త తెలుసుకో మరియు దానియందు విశ్వాసముంచు.
అప్పుడు నీవు క్రీస్తునందు నివశించు పరిశుద్ద నీతిమంతుడవగుదువు. మనమొక ఒక జఠిల సమస్యను ఎదుర్కొంటున్నామనుకొందాము. మనము నిజముగా ఈ సమస్యకు పరిష్కారమును కొనుగొనాలని కోరినప్పుడు, మనము ఎటువంటి సమస్యలను కష్టాలను ఎదుర్కొంటాము అను దానిని పట్టించుకొనకుండా మనము తప్పక జవాబు కొరకు వెదుకుతూ వుండాలి. అదే విధముగా, యేసునందు విశ్వాసముంచి ఇప్పటికీ ఆయనలోనికి ప్రవేశించనివారు నీరు మరియు ఆత్మ సువార్తలో ప్రత్యక్షపరచబడిన దేవుని నీతిని తప్పక వెదకవలెను.
కొంతమంది ప్రజలు క్రైస్తవత్వమును ప్రపంచములో వున్న అనేక మతములలో ఒక మతముగా తలంచుదురు. మరియు క్రమ క్రమముగా శుద్ధీకరించబడుట అను సిద్ధాంతము యొద్దకు వచ్చి దానియందు విశ్వాసముంచుటచేత వారి పాపములకు పరిష్కారమును కొనుగొనవలెనని ప్రయత్నము చేయుదురు. అయితే అటువంటి సిద్ధాంతముగాని లేక వారి స్వనీతినిగాని వారి పాపమును శుద్ధిచేయలేవని వారు త్వరలోనే తెలుసుకుంటారు. దీనికి బదులుగా నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచుటచేత వారి పాప సమస్య తేలికగా పరిష్కరించబడగలదని వారు కనుగొంటారు.
నీవు నిజ క్రైస్తవునిగా వుండాని కోరినట్లయితే, నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచుటచేత నీవు తప్పక నీ హృదయములోనికి దేవుని నీతిని పొందవలెను. అయితే మతపరమైన ప్రజలు క్రమక్రమముగా శుద్ధీకరించబడుట మరియు నీతిమత్వ సిద్ధాంతము అను వాటితో కొలుచుకొనుచు వారి స్వంత కార్యముల ద్వారా వారి పాపములు పరిష్కరించుకొనవలెనను ప్రయత్నించి దేవుని నీతిని పొందుటకు ప్రయత్నము చేయుదురు. అటువంటి విశ్వాసము పశ్చాత్తాప ప్రార్థన మీద ఆధారపడవలసివస్తుంది. చివరికి అవి నిర్ధారిత నాశనము నుండి విడుదలను కలిగించలేదు. ఎందుకంటే వారు అటువంటి ప్రార్థన చేయుచున్నప్పుడు, వారి పాపములను వారు చూచుచున్న కొలదీ వారి మరింత మరింత పాపులుగా మారుదురు.
 

ఎందుకనగా దేవుని నీతి యేసు యందున్నది

2వ వచనము చెప్పుచున్నది, ‘‘క్రీస్తుయేసునందు జీవమునిచ్చు ఆత్మయొక్క నియమము పాపమరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను.’’ దేవుడు మనిషికి రెండు నియమములిచ్చాడు, యేసుక్రీస్తునందు జీవ ఆత్మ నియమము మరియు పాప మరణముల నియమము. పౌలు మనకు చెప్పుచున్నట్లుగా, జీవాత్మ నియమము మనలను పాపమరణముల నియమమునుండి, మన అన్ని పాపముల నుండి విడిపించెను. నూతన జీవమును పొందుటకు నీవు తప్పక పౌలు చెప్పిన ఈ సత్యమును గ్రహించి అర్ధము చేసుకొనవలెను. ఈ సత్యము ప్రపంచములో వున్న ప్రతి ఒక్కరికి సమానముగా వర్తించును.
మనము, కూడా, జీవాత్మ నియమముయందు విశ్వాసముంచుటచేత పాపమరణముల నియమమునుండి విడిపించబడ్డాము. లేకుంటే, పాపమరణముల నియమము క్రింద మనకు నిర్దేశించబడిన నాశనమునకు చేరుకొనేవారము. అయితే మన హృదయములలో యేసునందు దేవుని నీతియందు విశ్వాసముంచుట చేత ` అదేమనగా, యేసు బాప్తిస్మము మరియు సిలువపైన ఆయన రక్తము జీవాత్మ నియమము క్రింద మనము ఆయన నీతిని పొందియున్నాము. మరియు మనకు సిద్ధపరచబడిన శాశ్వత జీవమును పొందియున్నాము. అప్పుడు నీ పాపములన్నియు క్షమించు నీరు మరియు ఆత్మ సువార్తను ఎక్కడ నీవు కనుగొనగలవు? ఇది యోహానునుండి యేసుపొందిన బాప్తిస్మము మరియు ఆయన రక్తము కార్చిన సిలువయందున్నది. దేవుని నీతి, మరియొక మాటలో నీరు మరియు ఆత్మ సువార్తలో కనుగొనబడినది.
అప్పుడు, మనలను పాపమరణముల నియమము నుండి విడిపించిన దేవుని నీతి సువార్త ఏమిటి? ఇది మన ప్రభువు ఈ భూమిమీద నివశించెను, ముప్పది సంవత్సరముల ప్రాయములో లోకపాపములన్నిటిని ఆయన పై వేసుకొనుటకు యోహానుచేత బాప్తిస్మము పొందెను, సిలువ వేయబడెను, సమాధి నుండి లేచెను, ఇదంతయు మనలను మన పాపముల నుండి విడిపించుటకు  దేవుని నీతి చేత చేయబడిన సువార్త ఇది.
దేవుడు, మానవజాతి దాని బలహీనతను బట్టి పాపము చేయుటకు బంధించబడినదని ఎరిగియున్నందున, పాప మరణముల నియమమునుండి విడిపించగల రక్షణ సువార్తను వారికిచ్చుటచేత, పాపులందరిని వారి పాపములన్నిటి నుండి వారిని రక్షించవలెనని ప్రణాళిక వేసెను. ఇది యోహాను చేత యేసు బాప్తిస్మము మరియు సిలువపై ఆయన రక్తములో కనుగొనబడిన ప్రశస్తమైన ప్రాయశ్చిత సువార్త. ఈ సువార్తయందు విశ్వాసముంచుటచేత, మనుష్యులందరు వారి పాపము యొక్క పాపమరణముల నియమము నుండి విడిపించబడుదురు ` ఈ దేవుని నీతి మానవ జాతిని దాని అన్ని పాపముల నుండి విడిపించిన జీవమునిచ్చు ఆత్మ నియమము.
దేవుడు మనిషికి వాక్యనియమము నిచ్చెను మరియు ఆయన నియమముననుసరించి ఎటువంటి ఓటమియైనా ఒక పాపమగునట్లుగా ఆయన దానిని ఏర్పాటు చేసెను. అదే సమయంలో, దేవుడు పాపులను వారి పాపముల నుండి విడుదల చేయు మరియొక నియమమును కూడా నియమించెను. ఈ రక్షణా నియమము అనునది దేవుని నీతియందు దాగియుండిన సత్యము, దీనియందు విశ్వాసముంచిన వారికి శాశ్వత జీవమునిచ్చు కృపానియమము. మానవజాతి కొరకు దేవుడు సిద్ధపరచిన ప్రాయశ్చిత నియమము అనునది నీరు మరియు ఆత్మ సువార్తయందున్న విశ్వాస నియమము ` అదేమనగా, యేసు బాప్తిస్మము మరియు సిలువపై ఆయన కార్చిన రక్తము  మరియు ఈ విశ్వాసము దేవుని నీతిని ధరింపజేయు జీవ నియమము.
అప్పుడు, పాపమరణముల నియమము ఏమిటి? ఇది దేవుడు మానవజాతికిచ్చిన ఆజ్ఞలు. దేవుడిచ్చిన ధర్మశాస్త్రము ఆయన ఆజ్ఞను వివరముగా అది చేయకూడదు ఇది చేయవలెను అని చెప్పును మరియు ఈ ఆజ్ఞ నుండి తొలగిపోవు ఏ అపజయమైనను ఒక పాపమును తయారుచేయును, దాని జీతము నరకము నందు చెల్లించబడవలసిన మరణము.
ఈ విధముగా ప్రతి ఒక్కరు పాపమరణముల నియమము క్రింద పెట్టబడియున్నారు. అయితే యేసుక్రీస్తు ఆయన బాప్తిస్మము మరియు సిలువపైన ఆయన రక్తమును చిందించుటచేత మనలను పాపమరణముల నియమము నుండి విడిపించెను. యేసు తప్ప పాపులను వారి పాపముల నుండి రక్షించువాడెవడును లేడు. మరియు మన అన్ని పాపముల నుండి మనలను విడిపించు ఆయన చేత ఇవ్వబడిన నీరు మరియు ఆత్మను సువార్త తప్ప మరియొక మార్గము లేదు. కావున నీవు తప్పక యేసు నిన్ను రక్షించుటకు ఈ లోకమునకు ఏ విధముగా వచ్చెనో మరియు దేవుని నీతి ఏమిటో తెలుసుకొనవలెను.
ఈ దినములలో ఏది ఏమైనా ఉన్నతముగా యేసునందు విశ్వాసమును ఒప్పుకొనువారు మరియు పాపమరణముల నియమము గురించి వివరముగా ఉన్నతముగా జ్ఞానముగలవారు అనేకులున్నారు. అయినప్పటికి వారి పాపములన్నిటి నుండి వారిని విడిపించు నీరు మరియు ఆత్మ సువార్తను పూర్తిగా తెలియకుండా వున్నారు. చాలామంది ఇప్పటికి ఈ అజ్ఞానముతోనే యేసుయందు విశ్వాసముంచుచున్నారు. దీని ద్వారా మనము ఎంతకాలము నుండి నీరు మరియు ఆత్మ సువార్త దాచబడియున్నదో మనము తెలుసుకొనగలము. ఈ నీరు మరియు ఆత్మ సువార్త కేవలము సిలువయందు యేసు రక్తమునకు మాత్రమే ఉన్నత స్థానమునిస్తారు. అయితే లేఖనము మనకు చెప్పుచున్నది ఏమనగా యేసు సిలువపైన రక్తము కార్చెను ఎందుకనగా ఆయన యోహాను చేత బాప్తిస్మము పొందినప్పుడు లోక పాపములన్నిటిని ఆయన తనపైకి తీసుకొనెను గాని ఆయన సిలువవేయబడినప్పడు కాదు.
జ్ఞానములోని ఈ వ్యత్యాసము పరలోకమునకు వెళ్ళుటయా లేక నరమునకు వెళ్లుటయ అను వ్యత్యాసమంతటినీ కలుగుజేయునని నీవు తప్పక తెలుసుకొనవలెను. ఇది చూచుటకు చాలా స్వల్పమైనదిగా కనిపించవచ్చును. అయితే ఈ రెండు భావనలు ఒకదానికొకటి పూర్తిగా భిన్నముగా వుంటాయి. ప్రాధమికముగా భిన్న పర్యావసానము కలిగి వుంటాయి. ఇందువలన నీవు యేసుక్రీస్తును నీ రక్షకునిగా అంగీకరించినప్పుడు, నీవు తప్పక నీ విశ్వాసమును నీరు మరియు ఆత్మ సువార్తను కేంద్రముగా వుండునట్లు వుంచుకోవాలి. ఆ విధముగా చేయుట ద్వారా మాత్రమే నీవు నీ అన్ని పాపముల నుండి విడుదలను పొందగలవు. అయినప్పటికీ చాలామంది ఈ దినములలో యేసునందు విశ్వాసముంచువారు చాలా తరచుగా దేవుని నీతిని ఎరుగకనే అజ్ఞానులుగా కొనసాగుచున్నారు.
అటువంటి ప్రజలు సాధ్యమైనంత వరకు తక్కువ పాపము చేయుచు వారిని వారు పవిత్రపరచుకొనుటకు ప్రయత్నము చేయుచు, దేవుని యెదుట నిలువబడుటకు ప్రయత్నము చేయుదురు. అయితే దేవుని నీతి అనునది మానవుని స్వంత ఆలోచనలు, కృషి, లేక ఆలోచన చేత పొందేటువంటి ఏదో ఒకటి కాదు. కేవలము నీరు మరియు ఆత్మ సువార్త సత్యమునందు దాయబడిన ప్రాయశ్చిత్త సువార్తయందు విశ్వాసముంచుట చేత మాత్రమే దేవుని నీతిని పొందగలరు. ధర్మశాస్త్రముననుసరించి తమను తాము శుద్ధిచేసుకొనుటకు ప్రయత్నించు వారి విశ్వాసము ఒక తెలివి తక్కువ విశ్వాసము. ధర్మశాస్త్రమునకు అవసరమైన వాటినన్నిటినీ వెంబడించువాడు ఒక్కడు కూడా లేడు.
 

యేసు శరీరమునందు పాపమును శిక్షించుట చేత

3వ వచనము చెప్పుచున్నది. ‘‘శరీరము ననుసరింపక ఆత్మ ననుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతివిధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంతకుమారుని పాప శరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను.’’ నీరు మరియు ఆత్మ సువార్తను ఎంత వివరముగా పౌలు సాక్ష్యమిచ్చుచున్నాడో ఈ భాగము నుండి మనము కనుగొనగలము. ఇక్కడ ఏ విధముగా తండ్రియైన దేవుడు లోకపాపమును యేసుపై వుంచాడో పౌలు మనకు చెప్పుచున్నాడు. ‘‘దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను.’’
దేవుడు శరీరమందు పాపమునకు శిక్ష విధించెను అని చెప్పినప్పుడు దీని భావమేమిటి? దీని భావము తండ్రియైన దేవుడు ఆయన అద్వితీయ కుమారుని ఈ లోకమునకు పంపెను. ఆయన శరీరములోనికి లోక పాపములన్నిటిని పెట్టుటకు యోహానుచేత ఆయన బాప్తిస్మము పొందునట్లు చేసెను. అక్కడ విశ్వాసులందరి పాపములను యుగయుగములకు శుద్ధి చేసెను. ఇందువలననే ఇది ‘‘దేనిని ధర్మశాస్త్రము చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను’’ అని చెప్పుచున్నది. దేవుడు తన కుమారునిపై లోకపాపములన్నిటిని పెట్టుటచేత వాటిని కడిగివేసెను. మరియు ఆయనను సిలువపై మరణించునట్లుగా మరియు ఆయన సమాధి నుండి పునరుత్థానుడగునట్లుగా చేయుటచేత, పాపములన్నియు మాయమయ్యెను.
నిన్ను రక్షించిన సత్యసువార్త ఇది, మరియు ఈ సువార్త నీరు మరియు ఆత్మ సువార్త. మన ప్రభువు యోహాను 3:5 నికొదేముతో చెప్పిన ‘‘ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు’’ అని చెప్పిన ప్రశస్తమైన సువార్త ఇది. దేవుని నీతి కార్యము చేయునట్లు చేయుము. ఈ సువార్త యేసు యోహాను చేత బాప్తిస్మము పొందినప్పుడు, సిలువపైన రక్తము కార్చినప్పుడు, సమాధి నుండి పునరుత్థానుడైనప్పుడు ప్రత్యక్షపరచబడినది.
మత్తయి 3:15 చెప్పుచున్నది. ‘‘యేసు ఇప్పటికి కానిమ్ము; నీతియావత్తు ఈలాగు నెరవేర్చబడుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడాలాగు కానిచ్చెను.’’ ఈ వాక్య భాగము దేవుని నీతికి మరియు యేసునందు దీని కార్యరూపమునకు సాక్ష్యమించ్చుచుండెను. యేసు గలిలయ నుండి యొర్దానుకు వచ్చినప్పుడు బాప్తిస్మమిచ్చు యోహానుచేత బాప్తిస్మము పొందుటకు ప్రయత్నించెను, మొదట యోహాను ‘‘నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడనైయుండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా?’’ అని అడుగుచు, తిరస్కరించాడు. అయితే యేసు గంభీర స్వరముతో పై వాక్య భాగముచేత యోహానును ఆజ్ఞాపించెను. ‘‘ఇప్పటికి కానిమ్ము, నీతియావత్తు ఈలాగు నెరవేర్చబడుటకు మనకు తగియున్నది.’’
అప్పుడు ‘‘నీతియావత్తు నెరవేర్చబడుట’’ అను దాని భావమేమిటి? దీని భావము యోహాను నుండి ఆయన తీసుకొనిన బాప్తిస్మము ద్వారా లోక పాపములను ఆయనపైకి తీసుకొనెను అని భావము. యేసు ఆయన బాప్తిస్మము పొందిన తరువాత నీటి నుండి వెలుపలికి రాగానే, ఆకాశము తెరువబడెను మరియు పరిశుద్ధాత్మ పావురము వలె ఆయనపైకి దిగి వచ్చెను. అప్పుడు ‘‘ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఆయనయందు నేనందించుచున్నానని యొక శబ్ధము ఆకాశము నుండి వచ్చెను.’’ దేవుడు దేని ద్వారా లోకపాపములన్నిటిని యేసుపైన మోపెనో ఆ యేసు బాప్తిస్మమును బట్టి ఆయన ఆనందించెను. ఇక్కడ మనము మానవజాతిని దాని పాపముల నుండి రక్షించుటకు మరియు ఈ వాగ్ధానము నెరవేర్చాలని తీర్మానించుకొని త్రిత్వమైన త్రియేక దేవుని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను మనము చూచుచున్నాము.
లేఖనము మనకు చెప్పుచున్నది అదేమనగా యేసు బాప్తిస్మము పొందినప్పుడు ఆకాశము నుండి ఒక శబ్ధము స్పష్టము చేసినది. ‘‘ఇదిగో ఈయనే నా కుమారుడు, ఈయన యందు నేనాందించుచున్నాను.’’ అది కూడా యోహాను చేత బాప్తిస్మము పొందుట లేక పాపములను ఆయన కుమారుడు తనపైకి తీసుకొన్నాడను వాస్తవము చేత తండ్రియైన దేవుడు సంతోషపడెనని చెప్పుట కొరకు. యేసు ఆ విధముగా బాప్తిస్మమునందున, ఆయన బాప్తిస్మముచేత లోకపాపములన్నియు ఆయన దేహముపైన పెట్టబడినందున, సిలువపై సిలువ వేయబడుట చేత మరియు సమాధి నుండి తిరిగి లేచుట చేత ఆయన నీతియావత్తును నెరవేర్చెను.
‘‘నీతియావత్తు’’ అనగా మానవజాతిని దాని అన్నిపాపముల నుండి విడుదల చేయు కార్యములు అని భావము. ఈ నీతికార్యములు నెరవేర్చుట కొరకు, యేసు ఆయన బాప్తిస్మముతో లోక పాపములన్నిటినీ తనపైకి తీసుకొనెను మరియు సిలువపై రక్తమును చిందించెను. దేవుని నీతియంతయు అత్యంత సరియైన తగిన పద్ధతిలో నెరవేరెను. బాప్తిస్మము, రక్తమును మరియు యేసు పునరుత్థానము అనునవి దేవుని నీతిని నెరవేర్చినవి, మరియు ఈ దేవుని నీతి దేవుని నీతిని మనలో వుంచుచు మనలను పాపములేనివారముగా చేసినవి. త్రియేక దేవుడు దీనికి ప్రణాళిక వేసెను, యేసు దీనిని నెరవేర్చెను, పరిశుద్ధాత్ముడు ఇప్పుడు చేయుచున్నట్లు దీనికి సాక్ష్యమిచ్చుచుండెను. ‘‘దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను.’’ అను వాక్యమునకు నీవు తప్పక విశ్వసించవలెను.
నిన్ను నీవు అడుగుము. నీ మిగిలిన జీవితములో నీవు నిజముగా ధర్మశాస్త్రము యొక్క అన్ని ఆజ్ఞలను నీవు నిజముగా పరిపూర్ణముగా వెంబడించగలవో లేదో నిన్ను నీవు ప్రశ్నించుకొనుము. నీవు బహుశా, వాటిని వెంబడించుటకు నీ శాయశక్తులా ప్రయత్నిస్తావు, అయితే నీవు ధర్మశాస్త్రము చేత పూర్తిగా జీవించునట్లుగా ఎన్నటికి సామర్థ్యమును కలిగియుండవు. నీవు ధర్మశాస్త్రములోని స్వల్పమైన దానిని నీవు తప్పిపోయి నప్పుడు, నీవు ధర్మశాస్త్రమునంతటిని తొలగిపోయావు (యాకోబు 2:10) మరియు ఇందువలన ప్రతి ఒక్కరు ఎటువంటి మినహాయింపు లేకుండా ధర్మశాస్త్రము క్రింద ఒక పూర్తి పాపిగా అంతమగును.
నీ కోరికలో ధర్మశాస్త్రమును నీ శాయశక్తులా వెంబడించుటకు నీవు నిజాయితీగా వుండవచ్చు. అయితే మనలోనుండి ఆయన అడిగే దేవునినీతి ధర్మశాస్త్రమును వెంబడించుటచేత ఎన్నటికీ లభ్యముకాదు. ధర్మశాస్త్రమును దేవుడు మనకిచ్చిన ఒకే ఒక కారణము ఇందును బట్టి మన పాపములను మనము గుర్తించగలము అనునది అని మనము తెలుసుకొనవలెను. మనము మన శరీరమందు బలహీనులమైనందున, ఎవ్వడును దేవుని ధర్మశాస్త్రమును దాని ఆద్యంతము వెంబడించలేడు.
ఇందువలన, దేవుడు మన పాపముల నుండి పూర్ణముగా మనలను విడిపించుటకు, ఆయన కుమారుని ఈ లోకమునకు పంపి ప్రతివాని పాపములను తీసుకొనుట యోహానుచేత బాప్తిస్మము పొందునట్లుగా చేసెను. ఆయన శరీరమందు బాప్తిస్మము పొందునట్లుగా చేయుటచేత, మరియొక మాటలో, లేక పాపములన్నియు ఆయన శరీరములో పెట్టబడెను. ఇందువలననే లేఖనము మనకు చెప్పుచున్నది దేవుడు యేసు ‘‘శరీరమయందు పాపమునకు శిక్ష విధించెను’’ మరియు ఈ విధముగా దేవుడు మనలను పాపములేని వారముగా చేసెను.
దేవుడు మన పాపములు ఏవిధముగా మాయమగునట్లుగా చేసెనో మనము తప్పక తెలుసుకొనవలెను. మానవ ప్రతినిధియైన యోహానుచేత ఆయన కుమారుడు బాప్తిస్మము పొందునట్లుగా చేసి, దేవుడు మన పాపములన్నిటిని యేసుపై మోపెను. అప్పుడు యేసు లోక పాపములన్నిటిని సిలువ యొద్దకు మోసుకొని రావలసివచ్చెను, మరియు మనకు బదులుగా వాని జీతమును చెల్లించుటకు, దీని మీద రక్తమును చిందించి మరణించెను. మరియు సమాధినుండి ఆయన పునరుత్థానము చేత, దీనియందు విశ్వాసముంచు వారందరి విమోచనమునకు మార్గమును తెరచెను. దేవుడు ఆ విధముగా ప్రణాళిక వేసి పాపము నుండి మన రక్షణను పూర్తి చేసెను.
కాబట్టి మనము తప్పక యేసు బాప్తిస్మమును మరియు సిలువపైన ఆయన రక్తము మన ప్రాయశ్చిత్తము కొరకు ఉద్దేశించబడినవని మన హృదయములయందు విశ్వాసముంచవలెను. దేవుని నీతియందు విశ్వాసముంచువారు నిశ్చయముగా యేసు బాప్తిస్మముయందు మరియు సిలువపైన ఆయన రక్తమునందు విశ్వాసముంచవలెను.
నీవు కూడా, పరిపూర్ణముగా నీతిమంతుడవుగా తీర్చబడుటకు మరియు నీ పాపములన్నిటికీ ప్రాయశ్చిత్తమును పొందుటకు మరియు పాపములేని వాడవుగా వుండుటకు అదే ప్రకారముగా, తప్పక విశ్వసించవలెను. దేవుడు ఏ విధముగా నీ పాపము అదృశ్యమగునట్లు చేసెనో, నీవు సరియైన రీతిలో అర్ధము చేసుకొనవలెను మరియు ఆయన చిత్తమును వెంబడించవలెను మరియు నీవు నీ స్వంత కృషిని విశ్వసించుట కంటే దేవుని యెదుట దీనిని విశ్వసించవలెను.