(రోమా 8:9-11)
‘‘దేవుని ఆత్మ మీలో నివసించియున్న యెడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మలేనివాడైతే వాడాయనవాడు కాడు. క్రీస్తు మీలోనున్న యెడల మీ శరీరము పాపవిషయమై మృతమైనదిగాని మీ ఆత్మ నీతివిషయమై జీవము కలిగియున్నది. ఆత్మా మీలో నివసించుచున్న యెడల మృతులలో నుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకులోనైన మీ శరీరమును కూడా మీలో నివశించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును.
ఒక వ్యక్తి నిజ క్రైస్తవుడా లేక కాదా అనునది దేవుని ఆత్మ అతని/ఆమెలో నివశిస్తుందా లేదా అను దాని ప్రకారము కనుగొనబడుతుంది. ఒక వ్యక్తి అతడు/ఆమె యేసునందు విశ్వాసముంచిననూ విశ్వాసముంచకపోయిననూ, అతని/ఆమె హృదయములో పరిశుద్ధాత్మను కలిగియుండన ట్లయితే వాడు ఏ విధముగా ఒక క్రైస్తవునిగా వుండగలడు? పౌలు మనకు చెప్పుచున్నాడు మనము యేసునందు విశ్వాసముంచుచున్నామా లేదా అనునది ప్రాముఖ్యమైన విషయము కాదు. పరిశుద్ధులకు అవసరమైన నిజమైన విశ్వాసము అనునది ఆత్మ వారిలో నివశించునట్లు సిద్ధపడు విశ్వాసము. నీలో పరిశుద్ధాత్మ సన్నిధి నీవు నిజమైన క్రైస్తవుడవా కాదా అను దానిని నిర్ధారించును.
ఆ విధముగా, పౌలు చెప్పెను, ‘‘ఎవడైనను క్రీస్తు ఆత్మలేనివాడైతే వాడాయనవాడు కాడు’’. అతడు చెప్పెను ‘‘ఎవడైనను.’’ ఆ వ్యక్తి ఒక పరిచారకుడా, సువార్తికుడా, లేక ఉజ్జీవ ప్రసంగీకుడా అనేది విషయము కాదు. ఒకడు అతడు/ఆమె హృదయమందు పరిశుద్ధాత్మను కలిగియుండక పోయినట్లయితే, ఆ వ్యక్తి ఆయన వాడు కాదు. పరిశుద్దాత్మను పొందుటకు నిన్ను నడిపించు దేవునినీతియందు నీవు విశ్వాసముంచకపోయినట్లయితే, నీవు నరకమునకు వెళ్ళుటకు నిర్దేశించబడిన ఒక పాపివి. మనము ఆ విధముగా దేవుని నీతిని కలిగియున్న నీరు మరియు ఆత్మ సువార్త విషయములో జాగ్రత్తను కలిగియుండవలెను.
ఒకవేళ పరిశుద్ధాత్ముడు మనలో నివశించుచున్నట్లయితే, దీని భావము క్రీస్తు బాప్తిస్మమునందున్న మన విశ్వాసము ద్వారా మనము పాపముల విషయములో చనిపోయివున్నాము. అయితే మన ఆత్మ నూతనముగా పొందిన నీతిని బట్టి జీవించుచున్నది. దీనిని మించి, మన ప్రభువు మరలా వచ్చు రోజున, మన క్షయమైన దేహము అదే విధముగా జీవమును పొందును. ఇందువలననే మనకు పరిశుద్ధాత్మను ఇచ్చిన వాని గురించి ఆలోచించవలెను.
దేవుని నీతియందు విశ్వాసముంచు విశ్వాసమును నీవు కలిగియుండక పోయినట్లయితే, నీవు క్రీస్తుకు చెందినవాడవు కావు. ఒకవేళ దానికి మరియొక వైపున, నీవు దేవుని నీతియందు ఈ విశ్వాసమును నీవు కలిగియున్నట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు నీయందు నివశించును. ఈ విశ్వాసము లేకుండా, పరిశుద్ధాత్ముడు నీపైన పరిపాలన చేయడు. కావున దేవుని నీతిని కలిగియున్న విమోచనా వాక్యమును నీవు కలిగిలేనట్లయితే, చివరికి నీవు బాహ్యముగా ఒప్పుకున్నను మరియు ప్రతి ఆదివారం ఆరాధనలో అపోస్తలుల ప్రమాణమును అప్పగించినను, నీవు క్రీస్తుకు చెందిన వాడవు కావు. నీవు క్రీస్తుకు చెందిన వాడవు కానట్లయితే, నీ ఆత్మ శపించబడుతుంది మరియు నీవెంత మంచి చేయవలెనని కోరిననూ, ఇది నిన్ను శాశ్వత నాశనమునకు నడిపించును.