(రోమా 8:4-11)
‘‘ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాపశరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు. ఆత్మానుసారులు ఆత్మ విషయములమీద మనస్సునుంతురు, శరీరానుసారమైన మనస్సు మరణము; ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. కాగా శరీరస్వభావము గలవారు దేవుని సంతోషకపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించియున్న యెడల మీరు ఆత్మ స్వావము గలవారే గాని శరీరస్వభావము గలవారుకారు. ఎవడైనను క్రీస్తు ఆత్మలేనివాడైతే వాడాయనవాడు కాడు. క్రీస్తు మీలోనున్నయెడల మీ శరీరము పాపవిషయమై మృతమైనదిగాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగియున్నది. మృతులలో నుండి యేసును లేపినవాని ఆత్మ మీతో నివశించినయెడల, మృతులలోనుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివశించుచున్న తన ఆత్మద్వారా జీవింపజేయును.’’
ఇప్పుడు మేము చేస్తున్న సాహిత్యము ద్వారా సముద్రమును దాటి చేస్తున్న పరిచర్య చాలా ప్రభావము కలదిగా ఉంటుంది. మనము దేవుని వాక్యమును చదువుచున్నప్పుడు మనము దీవించబడియున్నాము. మనము ఆయన వాక్యమునందు విశ్వాసముంచినప్పుడు మన విశ్వాసము పెరుగుతుంది.
గత ఐదువందల సంవత్సరములనుండి ప్రజలు క్రమ క్రమముగా శుద్ధీకరించబడుట, నీతిమత్వ సిద్ధాంతము, మరియు పశ్చాత్తాప ప్రార్థనల ద్వారా మాత్రమే విమోచన సాధ్యము అని పేర్కొను తప్పు సిద్ధాంతముల ద్వారా మోసగించబడుచున్నారు.
రోమా 8:3 మనకు చెప్పుచున్నది ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. అది శరీరమునందు బలహీనమైయున్నది. దేవుడు తన సొంత కుమారుని శరీరాకారముతో పంపి, ఆయన శరీరమునందు పాపమునకు శిక్ష విధించెను. మనలను మన అన్ని పాపముల నుండి విడిపించుటకు ఆయనకు తీర్పు తీర్చెను.
ఈ దినమున, మనము దేవుని సత్యము కొరకు రోమా 8:4-11కు తిరిగి యున్నాము. రోమా8:3-4 చెప్పుచున్నది. ‘‘శరీరము ననుసరింపక ఆత్మననుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను.’’ అయితే, ప్రశ్న ఏమిటంటే, అది ఇది, దీని భావము ఏమిటి?
మొదట, శరీరానుసారముగా జీవించకపోవుట అనగా ఏమిటి?
దీని భావము శరీర లాభాలను వెదకకవుండుట. ఆత్మ కోరికలకు మరియు శరీర వాంఛకు వ్యత్యాసమునకు చూపించుట, మరియు దేవునికి లోబడని వారికి దూరముగా నుండుట. 5వ వచనము చెప్పుచున్నది. ‘‘శరీరానుసారులు శరీర విషయములమీద మనస్సుంతురు.’’ ‘‘శరీర విషయములు’’ అనగా అర్ధమేమిటి? దీని భావమేమనగా, చివరికి చర్చికి హాజరగువారు కూడా, వారి స్వంత కోరికలను వెదకుతారు.
దీనిని సులభముగా చెప్పుటకు, క్రైస్తవులు ఈ లోకములోని లాభసాటి వ్యాపారము నిమిత్తము చర్చికి వెళ్ళకూడదు. ఇది శరీరానుసారముగా జీవించుట. ఈ ప్రజలు పెద్ద సంఘాలకు క్రమముగా వచ్చి హుందాతనముగ వినియోగదారుల కొరకు వారి వ్యాపారమును పరిచయము చేయుటకు వాణిజ్య ప్రకటనలు చేయుట కొరకు వెళ్ళుదురు. వారు వారి స్వంత శరీరము కొరకు సంఘముకు హాజరగుదురు. మరియు యేసునందు విశ్వాసముంచుదురు.
మరి కొంతమంది కూడా ఇక్కడ వున్నారు. వారు క్రైస్తవ జాతిలోనే కేవలము భౌతిక దీవెనలు మాత్రమే వెంబడించుటకు తన అనుచరులను నడిపించువారైన శాఖలను చేయువారున్నారు. వీరు కూడా శరీరముననుసరించి నడుచుకొందురు మరియు వీరు వారి మనస్సును శరీర విషయముల మీద ఉంచుదురు.
మనము చాలా తేలికగా మన క్రైస్తవ జాతిలోనే శాఖాబేధములను కలిగించువారిని ఎదుర్కొంటాము. అప్పుడు ఈ శాఖలను చేయువారు ఎవరు? మీరు వారి సంఘ ఘనతధిక్కారముతో తమ విశ్వాసమును తప్పు స్థానములో ఉంచి తమను తాము మోసపరచుకొనువారు. వారు తమ శాఖలు ఫలానా ఫలానా కారణముతో స్థాపించబడినదని, వారికి అటువంటి ఇటువంటి వేదాంత పండితులు ఉన్నారని, వారు ఆ విధముగా ఈ విధముగా ప్రపంచమంతటా గొప్పగా పేరుగాంచినవారని, మరియు వారికి ఈ విధమైన గొప్ప సంప్రదాయమున్నదని, ఇలా రకరకాలుగా చెప్పుదురు. ఈ పోగడ్తలన్నీ ఈ ప్రజల శూన్యతను మరియు వారి స్వంత విశ్వాసమును కట్టుచున్నవి. ఇటువంటి విశ్వాసమును కలిగియున్నవారు ప్రపంచములో ఎందరో వున్నారు.
శాఖాబేధమును కలిగించువారు వారి స్వంత శరీర లాభాల కొరకు యేసునందు విశ్వాసముంచుదురు. శరీరానుసారముగా జీవించువారు ఇప్పటికి వారి సంఘమును గురించి అతిశయించుదురు వారి వారి పెద్ద సంఘాలకు హాజరగుట వలన భౌతికముగా దీవించబడుదురు. కొన్ని సంఘాలు కొన్ని సామాన్య గురిని ‘‘నీ భార్యను ప్రేమించు’’ అనునటువంటి వాటిని కలిగియుంటాయి. అయితే ఇది కూడా ‘‘శరీరానుసారముగా జీవించుట’’ అను భావమే. సంఘాలు వారి కనుదృష్టి ఒకడు భార్యను ప్రేమించవలెను అను దానిపై నిలపవచ్చునా? వారు ఆ విధముగా చేయరాదు. అప్పుడు నేను మనము మన భార్యను ప్రేమించరాదు అని చెప్పుచున్నావా? నేనలా చెప్పుటలేదు కదా! అయితే అటువంటి లక్ష్యము అవి ఎంత రమ్యమైనవైనను, బాగున్ననూ, సంఘాల యొక్క ప్రాథమిక ఉద్దేశ్యముగా వుండరాదు.
శరీరానుసారముగా జీవించువారు శరీర విషయములమీద మనస్సునుంతురు. చాలామంది సేవకులు సంఘ సభ్యులు పరిమాణము పెరుగుట మీద, కానుకల మీద, భవంతులమీద, ఆసక్తి కలిగి ఇటువంటి ప్రజలుగా మారిపోయారు ఇవి ఇప్పుడు వారి విశ్వాసమునకు ముఖ్య ఉద్దేశ్యముగా మారినవి. ఒక పెద్ద దానిని, పొడుగుదానిని మరియు పెద్ద సంఘమును కట్టుట వారి అత్యున్నత లక్ష్యముగా మారినది. చివరికి వెలుపలికి వారు అటువంటి ఎక్కువమంది అనుచరులను ప్రోగుచేయుట వారిని పరలోకములోనికి నడిపించునని మరియు మిగిలిన విషయములో క్షమాపణను లభించునని చెప్పనప్పటికీ, వారి చివరి లక్ష్యము మాత్రము పెద్ద పెద్ద భవంతులను కట్టుటకు ఎక్కువ డబ్బును ప్రోగుచేయుట.
వారి సంఘము శరీర విషయమును వెంబడించునట్లు చేయుటకు వారు వారి అనుచరులను మతపరమైన ఉద్రేకములోనికి త్రిప్పుదురు. కొంతమంది కాపరులు వారి సంఘాలను ఈ ఉద్రేకములోనికి త్రిప్పుటకు వారి సామర్ధ్యముమీద విజయమున కట్టుదురు, సగం మంది అత్యాసక్తులు, భ్రాంతిలో వుండువారు, మరియు పూర్తిగా వక్రముగా నడిపించ బడినవారు.
ఆత్మానుసారముగా జీవించువారు దేవునివారు
ఏది ఏమైనా, వాస్తవముగా క్రైస్తవులలో దేవుని ఆత్మననుసరించి నడుచుకొనువారు వున్నారు. ఈ ఆత్మానుసారముగా నడుచుకొనువారు దేవుని వాక్యానుసారముగా జీవింతురు. వారి సొంత ఆలోచనలను వ్యతిరేకించుచు లేఖనములో వ్రాయబడిన వాటిని విశ్వసించుదురు. దేవుడు సంతోషపడునట్లు చేయుదురు. మరియు నీరు మరియు ఆత్మ సువార్తను ప్రకటించుదురు.
బైబిల్ వ్యాఖ్యానించుచున్నది ఆత్మానుసారముగా జీవించువారు వారి మనస్సులను ఆత్మ విషయములమీద ఉంచుదురు. మనము దేవుని నీతియందు విశ్వాసముంచుటచేత మనము క్షమించబడినట్లయితే మనము ఆలోచనారహితముగా జీవించరాదు. అయితే ఆత్మ కార్యములమీద ధ్యానముంచుచు జీవించవలెను. ఆత్మచేత జీవించువారు ఆత్మీయముగా జీవించుదురు మరియు విశ్వాసముచేత ఆత్మ కార్యములను చేయుట మీద మనస్సునుంతురు. ఆత్మ కార్యములను వెదకువారు ధన్యులు. వీరు దేవుని సంతోషపరచువారు, ఇతరులను లోక పాపముల నుండి రక్షించువారు, మరియు విశ్వాసముతో జీవించువారు. మనము మన పాపముల విషయములో క్షమించబడియున్నాము. కావున మనము తప్పక మన మనస్సును ఆత్మ కార్యముల మీద ఉంచి ఆయన ప్రకారము జీవించవలెను.
మన జీవితములో లక్ష్యమేమనగా ఆత్మ కార్యమును నెరవేర్చుట, అనగా నీరు మరియు ఆత్మ సువార్తను బోధించుట. మనము తప్పక మన మనస్సులను ఆత్మ కార్యములమీద ఉంచవలెను. ఆత్మ కార్యముల మీద మీ మనస్సును ఎంతవరకు ఉంచావు? మనము దేవుని నీతియందు విశ్వాసముంచుటచేత మరియు దీనిని బోధించుటచేత మనము ఒక ఆత్మ యుద్ధమును చేయుచున్నాము మరియు ఆత్మ కార్యములను అభ్యసించవలెను. చివరికి మనము బలహీనులమైనను పూర్తిగా తప్పిదములో పడియున్నను మనము ఎల్లప్పుడు ప్రభువును ఏది సంతోషపరచును అని తలంచుచు మన మనస్సును దేవుని కార్యములపై పెట్టి ఆత్మ కార్యములను ఒక సవాలుగా తెలుసుకొనవలెను. ఎప్పుడైతే ఒక ప్రత్యేకమైన పని జరుగునో, ప్రభువు సంతోషపడునట్లుగా మనము తప్పక ఇంకా ఎక్కువ పని చేయుట కొరకు తపనపడాలి.
మనమిప్పుడు నీరు మరియు ఆత్మ సువార్తను ప్రపంచమంతటికి సాహిత్యము ద్వారా ప్రకటించుచున్నాము. మన వెబ్‌సైట్‌ను దర్శించుట ద్వారా రోజుకు 200 నుండి 300 వరకు మన ఉచిత క్రైస్తవ పుస్తకములను మరియు ఇ-పుస్తకములను పొందుచున్నారు. నీరు మరియు ఆత్మ సువార్తను ప్రపంచములో ఉన్న ప్రతి దేశములో బోధించబడుటకు, ఆయన సంఘములో మీకు ఈ సువార్త సేవను చేయుచున్నాము. మేము ఆత్మ కార్యముల మీద మనస్సుంచనట్లయితే, ఈ ఆత్మ ఫలములు మాకు లభించేవి కావు. మనము తప్పక ఒక దాని తరువాత ఒకటి ఆయన కార్యము కొనసాగించుట కొరకు మన మనస్సులను ఆత్మ కార్యముల మీద లగ్నము చేయవలెను. అప్పుడు మనము మన ఆత్మవరుడు, యేసుక్రీస్తు, సామెతలు 31వ అధ్యాయములో కనుగొనబడిన ఒక ప్రశస్తమైన వధువుగా సంతోష పరచగలము.
8వ వచనము చెప్పుచున్నది, ‘‘కాగా శరీర స్వభావము గలవారు దేవునిని సంతోషపరచనేరరు’’ ఇది పాప క్షమాపణను పొందని వారిని సూచించున్నది. ‘‘ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడదు. కాగా శరీర స్వభావము గలవారు దేవునిని సంతోషపరచనేరరు’’ (రోమా 8:7-8). అటువంటి పాపులు , వారియందు ఆత్మను కలిగియుండరు దేవుని పనిని చేయలేరు. ఆయనను సంతోషపరచలేరు.
పాపులు దేవుని ధర్మశాస్త్రమునకు వారికి వారు చెందరు. వారు దేవుని నీతికి చెందినవారు కారు. వారు ఆయనను సంతోషపరచలేరు. ఇది ఎందుకంటే వారిలో పరిశుద్ధాత్ముడు నివశించుచున్నందున వారు దేవుని చిత్తమేమిటో అర్ధము చేసుకొనలేరు. దేవుని సంతోషపరచునది ఏమనగా నీరు మరియు ఆత్మ సువార్త చేత మానవజాతిని వారి పాపములన్నిటినీ క్షమించుట. ఆయన పాపుల స్తుతి ఆరాధనతో సంతోషపడడు.
పాపులు ఆయనను స్తుతించునప్పుడు ఆరాధనలో పాపులు ఎంతగా చేతులెత్తిననూ, ఎంత కన్నీరు కార్చినను, వారు దేవునిని సంతోషపరచలేరు. పాప క్రైస్తవులు ఉద్రేకముల ద్వారా సడలించబడుట చేత దేవునిని సంతోషపరచవలెనని ప్రయత్నము చేయుదురు. పాపములను కలిగినవారు ప్రభువును సంతోషపరచలేరు. ఎందుకనగా వారు పాపులు. వారు ఎంతగా ప్రయత్నము చేసిననూ, పాపులు ఎన్నడును ప్రభువును సంతోషపరచలేరు. వారు ఎంతగా ప్రభువును సంతోషపరచవలెనని ఇష్టపడ్డారు అనునది విషయము కాదు. ఆయనను సంతోషపరచుట వారికెంత అసాధ్యము అనునది విషయము.
ప్రజలు పెద్ద పెద్ద సంఘములను కట్టినప్పుడు దేవుడు సంతోషించునా? ఆయన సంతోషించడు. ఒక పెద్ద సంఘ ఆలయములోనికి వెళ్ళవలసి వచ్చినప్పుడు, అన్ని విధాలుగా పెద్ద ఆలయము కట్టబడవలెను. అయితే ఒక పెద్ద ఆలయము కట్టుట అనునది కేవలము భవనము కొరకే గాని దేవుని సంతోషపరచుటకు కాదు.
నా పట్టణములో, ఉదాహరణకు దానికి ప్రక్కనే పూర్వమున్న చర్చి ఇప్పటికి బ్రహ్మండమైన ఆకారములో అన్ని వసతులతో వున్ననూ, ఒక నూతన చర్చి బిల్డింగ్ కొరకు 3 మిలియన్లు అమెరికన్ డాలర్లు ఖర్చు పెట్టారు. ఆ సంఘము కేవలము 200-300 వరకుమాత్రమే పరిమితమైనప్పుడు, అటువంటి భవంతిని కట్టడం అత్యవసరమా? దేవుని సంఘము ఇటుకలతో కట్టబడినది కాదు. మనము దేవుని ఆలయమైయున్నామని మరియు దేవుని ఆత్మ నీతిమంతుల హృదయములో నివశించునని దేవుడు చెప్పుచున్నాడు.
అవసరమునుబట్టి పెద్ద చర్చిను కట్టడం సరియైనదే, అయితే ఈ పెద్ద ఆలయము దేవునికి మహిమను తెచ్చునా? లేదు. ఇది మహిమను తీసుకొనిరావు. ఒక సంఘములోనికి ఎక్కువమంది ప్రజలు కూడుకొనుట దేవునికి మరింత మహిమను తెచ్చునా ? లేదు. ఆ విధముగా చేయుటచేత నీవు దేవుని సంతోషపరచలేవు. శరీరమునందున్న వారు దేవుని సంతోషపరచలేరు.
కొన్నిసార్లు, చివరికి నీతిమంతులుకూడా శరీర సౌఖ్యాలను మాత్రమే వెదకువారున్నారు. ఈ ప్రజలు ప్రభువును సంతోషపరచలేరు. నీతిమంతులలో, పాపులవలె ఇప్పటికి వారి శరీరానుసారమైన ఆలోచనల చేత పట్టబడినవారు కొంతమంది ఉన్నారు. ఈ ప్రజలు దేవునిని సంతోషపరచలేరు. వారు వాస్తవమునకు సంఘములో ఆరోగ్యకరమైన విశ్వాస జీవితమును కొనసాగించలేరు. ఆరోపణలు చేయుచు, దేవుని సంఘమును వ్యతిరేకించుచు చివరికి సంఘమును విడిచిపెట్టుదురు.
కావున, నీతిమంతులమైన మనము ఒక నీతియైన దేవుని సంతోషపరచు జీవితమును జీవించవలెను గాని, శరీర సౌఖ్యాలను మాత్రమే వెదకు జీవితమును జీవించరాదు. మనము తప్పక దేవుని కార్యమును గురించి మరియు ఆయన నీతిని గురించి ఆయన నీతికార్యములను చేయుట గురించి మన దేహమును మనస్సును ఉపయోగించుట గురించి, దేవుని నీతి సాధనముగా ఆయనకు చెందినవారముగా మనము ఆలోచన చేయవలెను. మనము దేవునిని సంతోషపరచు ఒక జీవితమును జీవించవలెను.
ఆత్మానుసారులు క్రీస్తువారు
మనము 9వ వచనమును కలిపి చదువుదాము. ‘‘దేవుని ఆత్మ మీలో నివశించియున్న యెడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు.’’
ఈ వాక్య భాగము, పౌలు ప్రకారము, మనము నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచినట్లయితే ` మరియొక మాటలో, మనము దేవుని నీతియందు విశ్వాసముంచి నట్లయితే మరియు మన పాపములనుండి మనము విమోచింపబడినట్లయితే, మనము ఎంతో కాలము శరీరమునందుండము కాని మనము ఆత్మయందు వున్నాము అని భావము. ఒకవేళ ఎవడైనను అతని/ఆమె హృదయములో ఆత్మను కలిగియున్నట్లయితే, ఆ వ్యక్తి క్రీస్తునందున్నాడు, ఒకవేళ ఎవడైనను క్రీస్తు ఆత్మను కలిగియుండనట్లయితే ఈ వ్యక్తి ఆయనవాడు కాడు.
కావున, మనము, శరీరమునందు కాదు ఆత్మయందున్నాము. నీరు మరియు ఆత్మ సువార్త ద్వారా విమోచించబడి ఆత్మయందున్న మనము, క్రీస్తునందున్న నీతిమంతులవలె దేవునిని సంతోషపరచు సామార్థ్యముగల మనము నీతి సైనికులమని మరువరాదు. మనము మన శరీర బలహీనతను బట్టి నిరాశపడరాదుగాని, మనమెంత బలహీనులమైన, మనమాయన వారము, మనము ఆయనయందున్నాము, కావున మనము ఆయన పనివారమైయున్నామను విశ్వాసముతో దేవుని సంతోషపరచవలెను.
మనము తిరిగి జన్మించిన తరువాత కేవలము శరీర కార్యములను మాత్రమే వెదకుట మనకు అనుమతించబడలేదని మనము తప్పక తెలుసుకొనవలెను. నీతిమంతులు కేవలము దేవుని నీతి కొరకు మాత్రమే నిర్దేశించబడినవారని తెలుసుకొని మనము జీవించవలెను. 10వ వచనము క్రైస్తవులు ఏ విధముగా జీవించవలెనో మనకు చూపించుచున్నది. ‘‘క్రీస్తు మీలోనున్న యెడల మీ శరీరము పాపము విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగియున్నది.’’
సత్యమునకు, మనము, మన దేహము క్రీస్తుతో కూడా సిలువ వేయబడి మన పాపముల నిమిత్తమై మరణించినవి. మనము దేవుని నీతి కార్యముల ద్వారా మన అన్ని పాపములనుండి మనము రక్షించబడియున్నాము. ఈ నీతిని బట్టి, నీతిమంతుల ఆత్మలు శాశ్వత జీవమును కలిగియున్నవి. శాశ్వత జీవము నీతిమంతులుగా తీర్చబడినవారు ఎంతోకాలము వారి స్వంత శరీరానుసారముగా జీవించుటకు అనుమతించబడరు అని మనము తప్పక తెలుసుకొనవలెను.
మనము దేవుని నీతి కొరకు జీవించుటకు నిర్దేశించబడియున్నాము. మీలో కొందరు నీరు మరియు ఆత్మ సువార్తచేత తిరిగి జన్మించిన తరువాత, నిరాశలో, ‘‘శరీరమందున్నవారు దేవుని సంతోషపరచలేరు అని బైబిల్ చెప్పుచున్నది. నేను తప్పక వారిలో ఒకనిని’’ అని అనుకొనవచ్చు. అయితే ఇది మాత్రము సత్యము కాదు. ఆయన నీతి సైనికులుగా మనము జీవించులాగున దేవుడు మనలను నూతన పరచెను.
కొంతమంది బైబిల్‌ను అపార్ధము చేసుకొనుట వలన ఆ విధముగా తలంచవచ్చు. చివరికి కొంతమంది నీతిమంతులు వారి శరీరము ననుసరించి జీవించుచున్నందున మరియు వారు బలహీనులైనందున, దేవుని ప్రకారము జీవించలేమని తలంచుదురు, అయితే సత్యమేమనగా పరిశుద్ధాత్మ తమలో కలిగినవారు దేవుని కార్యము చేయుట ద్వారా ఆనందించుదురు. దేవుని కార్యము చేయుట వారిని సంతోషముగా చేయును, ఆనందముగా చక్కగా వుండునట్లు చేయును. మరియొక వైపున దేవుని కార్యము లేని ఒక జీవితము ఒక ఉద్దేశ్యము లేని కదలింపబడని, ఒక శాపకరమైన జీవితము.
మనము నీరు మరియు ఆత్మ సువార్తను స్వీకరించి, దేవుని నీతియందు నివశించిన తరువాత, పరిశుద్ధాత్ముడు మన యందు నివశించును. విమోచించబడిన ఎవనిమీదకైనను పరిశుద్ధాత్ముడు దిగివచ్చి వానిలో నివశించును. పరిశుద్ధాత్మ నివశించుదానిలో ఏమి సంభవించును? వారు దేవుని నీతిని సేవించుటకు మరియు ఆయన నీతికార్యమును చేయుటకు నిర్దేశించబడుదురు.
క్లుప్తముగా, పాప క్షమాపణను పొందినవారు మరియు నీతిమంతులుగా తీర్చబడినవారు కేవలము విశ్వాసముచేత మాత్రమునే జీవించవలెను. నీతిమంతులు వారు విశ్వాసముచేత జీవించునప్పడు మాత్రమే వారి విశ్వాసమును కాపాడుకొనగలరు మరియు దేవుని కార్యమును చేయగలరు. నీవు నీతిమంతునిగా తీర్చబడుటకు బదులుగా నీవు నీ శరీరముననుసరించి లోకానుసారముగా జీవించుదువని నీవు తలంచినట్లయితే, ఇది నీవు పాపముల క్షమాపణను పొందియున్నావు అని గ్రహించినందున మరియు నీ గమ్యము ఇప్పటికే మారినందున.
నీతిమంతుల గమ్యము మారినది. వారు తిరిగి జన్మించక మునుపు, వారు లోకము కొరకు మరియు వారి స్వంత ఉద్దేశ్యము కొరకు జీవించారు. మరియు వారు వారి శరీరానుసారముగా జీవించినప్పుడు సంతోషముగా వున్నారు. ఏది ఏమైనా, తిరిగి జన్మించిన తరువాత, ఆ విధముగా జీవించుట అసాధ్యము. మనము పాపముల క్షమాపణను పొందియున్నాము. ఆరంకెల సంపాదనను మనము కలిగియున్ననూ మనము సంతోషముగా వుండగలమా? ఎప్పుడైతే మనము ఆత్మను లోకము నుండి విడుదల చేయుటకు మనలను మనము సమర్పించుకొందుమో, మనము ఏ విధముగా భౌతిక సంబంధమైన విషయమునుబట్టి సంతోషపడగలము?
నేను, మరియొక మాటలో, కష్టపడి శరీర కార్యమును గురించి మరియు ఆత్మ కార్యములను గురించి ఆలోచన చేయవలెనని అడుగుచున్నాను. ఒక క్రమములో వాటిని గురించి నీవు తెలుసుకొనుటకు నీవు చేయవలసినదేమియు లేదు. నీవు చేయవలసినదంతయు ఈ విషయమును గురించి గంభీరముగా ఆలోచన చేయుటయే.
నేను చాలా కాలమునుండి రోమా 1 నుండి 6 వరకు ఇంతకు ముందున్న ప్రసంగముల పుస్తకములో మరియు 7వ అధ్యాయము నుండి 16వ అధ్యాయము వరకు ఈ పుస్తకములో బోధించాను. ఈ రెండు పుస్తకములు, క్రైస్తవ ప్రచురణలోని 5వ మరియు 6వ గ్రంధము, ప్రపంచములోనున్న క్రైస్తవులందరికి విడుదల చేయబడును. నా క్రైస్తవ ప్రచురణల ద్వారా చాలామంది దేవునినీతిని గురించి తెలుసుకొందురని నేను నిశ్చయత కలిగియున్నాను. నా పూర్వపు మూడు ప్రసంగ పుస్తకముల్లో, దేవుని రక్షణ గురించిన ప్రాధమిక బోధల గురించి మాట్లాడాను. మొదటి గ్రంధము సువార్తను గురించి మాట్లాడెను, రెండవ గ్రంధము వేదాంత విషయమును గురించి మాట్లాడెను, మూడవ గ్రంధము పరిశుద్ధాత్మ మీద మరియు పరిశుద్ధాత్మను పొందుటకు సరియైన మార్గమును గురించి మాట్లాడెను. మరియు రోమా మీద ఈ నాలుగవ మరియు ఐదవ గ్రంధము వేదాంత సిద్ధాంతము ఏ విధముగా తప్పుగా వున్నవి అను దానిని గురించి, ఎందుకని క్రైస్తవులు యేసునందు విశ్వాసముంచిన తరువాత కూడా వారి పాపములు మాయమగుట లేదు. ఏ విధముగా నీరు మరియు ఆత్మ సువార్త దేవుని నీతిగా ప్రత్యక్షపరచబడెను అని లోతుగా మాట్లాడును.
ఈ పుస్తకము ద్వారా సువార్త మరింత విస్తారముగా ప్రపంచమంతటా వ్యాపించునని నేను విశ్వసించుచున్నాను. మొదట ప్రచురించిన రెండు గ్రంధములప్పటి కంటే మూడవ పుస్తకమును ప్రచురించిన తరువాత సువార్తను బోధించుటలో గుర్తించదగిన అభివృద్ధి వుంది. ఇప్పుడు మూడవ గ్రంధము తరువాత, చాలా చాలా మంది నా క్రైస్తవ పుస్తక ప్రచురణలోని మొదటిది మరియు రెండవ పుస్తకమును అడుగుచున్నారు.
ఈ రెండు పుస్తకములు ప్రచురించబడిన తరువాత, నీరు మరియు ఆత్మ సువార్త ఎంత శక్తిగలదో మనము తెలుసుకుంటాము. ఆయన నీతిని తెలుసుకున్న వారిపైకి దేవునిచేత అనేకమైన దీవెనలు సమృద్ధిగా క్రుమ్మరించబడునని నేను ప్రార్థించుచున్నాను. వారు రోమా పత్రికను ఏ విధముగా అర్ధము చేసుకొనవలెనో తెలుసుకుంటారు. దేవునినీతిని కలిగియున్న సువార్తలోని విశ్వాసముచేత ఇది అర్ధము చేసుకొనబడుచున్నది.
మనమందరము సువార్త కొరకు కలసి పనిచేయుచున్నాము. నీవు కూడా దేవుని పనిని చేయుట లేదా? పాపులను వారి పాపము నుండి రక్షించుటకు నీవు సువార్తను బోధించు పరిచర్యను బలపరచుచున్నావు. మనము మన భాగములో విశ్వాసముగా వున్నప్పుడు, మరియు సువార్త పని చేసినప్పుడు, చాలా ఆత్మలు ప్రపంచమంతటా వారి పాపములన్నిటి నుండి రక్షించబడును. అప్పుడు మనము లోకములోని పనులకొరకు ఈ ప్రశస్తమైన పనిని అశ్రద్ధ చేయగలమా?
నీతిమంతులమైన మనము, మన స్వంత శరీరము కొరకు ఎంతోకాలము నిర్దేశించబడలేదని నేను మీకు స్పష్టము చేయుచున్నాను. ఇప్పుడు, మన గమ్యము దేవునినీతిని నెరవేర్చుట కొరకు సిద్దపరచబడినది, ఆత్మలను రక్షించుటకు మరియు ఈ నీతి కొరకు జీవించుటకు. నీవు తప్పక దీనిని తెలుసుకొని నీ మిగిలిన జీవితకాలము, నిజ సువార్త కొరకు, పాపములో పడిపోయిన ఆత్మ రక్షణ కొరకు, దేవుని కొరకు జీవించవలెను.
దీనిని గురించి రోమా పత్రిక మాట్లాడుచున్నది ఇది. మనము 10 మరియు 11 వచనములను చూద్దాము. ‘‘క్రీస్తు మీలోనున్న యెడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగియున్నది. మృతులలో నుండి యేసును లేపినవాని ఆత్మ మీతో నివశించినయెడల, మృతులలో నుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివశించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును.
పైన వాక్యభాగము భావమేమనగా మన దేహములు, ఎంతో కాలమునుండి మన పాపముల విషయములో చనిపోయివున్నవి. అయితే మన ఆత్మలు దేవుని నీతిని బట్టి మరియు విశ్వాసమును బట్టి జీవించుచున్నవి. ఎవడైనను దేవుని నీతియందు విశ్వాసముంచినయెడల అతడు/ఆమె ఒక నూతన జీవమును సంపాదించుకొనును. మనము దేవుని నీతియందు విశ్వాసముంచుటచేత నూతన జీవమును సంపాదించుకొనియున్నాము.
11వ వచనము చెప్పుచున్నది. ‘‘మృతులలో నుండి యేసును లేపినవాని ఆత్మ మీతో నివశించినయెడల, మృతులలో నుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివశించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును.’’ దీని భావము అంతమున ఆయన మనలను పునరుత్థానులుగా చేయును. మనము ఇంతకాలము వరకు కేవలము పాపము మరియు మన శరీరము కొరకు జీవించిన జీవితము గడిచిపోయినది, మిగిలిన మన జీవితము దేవుని కొరకు మరియు ఆయన నీతి కొరకు జీవించుటకు మన గమ్యము మార్చబడినది.
‘‘ఎటువంటి సందేహము లేదు నీతిమంతులు ఏమి చెప్పుదురో దానిని చెప్పుటకు వారు తరచుగా కూడుకొందురు’’ అని నీతిమంతుల జీవితమును గురించి నీవు తలంచుచు నీవు విసుగు చెందవచ్చు. ఏది ఏమైనా, నీవు సంఘములో వున్నట్లయితే, నీ ప్రక్కన కూర్చొనివున్న ఒక తిరిగి జన్మించిన వాని నోరు తెరచుకొనుటను బట్టి లేక వారి ఆరాధన, స్తుతి వారి స్వరమును బట్టి మీ మనస్సులు నూతన పరచబడును. ఇది ఎందుకంటే పరిశుద్ధాత్ముడు దేవుని సంఘములో మరియు విశ్వాసుల హృదయములో పనిచేయును. మీ మనస్సు నూతన పరచబడును. మరియు నీ హృదయములో ఆత్మీయ ఆహారముచేత తృప్తిపరచబడుటచేత, నూతన శక్తి పొందుదువు, బయటికి వెళ్ళి ఆత్మ కార్యములు జరిగించుటకు ఆత్మీయ బాధ్యతలు నీవు సంపాదించుకొంటావు.
విశ్వాసుల కూడికలో నీవు సేదదీరగలవు. నీవు లోకము నుండి వేరైన వాస్తవమును నీ గమ్యము మార్చబడినదని చూపును. అందువలననే శరీరముననుసరించి నడుచుకొనువారు వారి మనస్సులను శరీరకార్యముల మీద లగ్నము చేయుదురు. అయితే ఆత్మానుసారముగా జీవించువారు, ఆత్మ కార్యములమీద మనస్సుంతురు. నీతిమంతులుగా తీర్చబడిన, మనము శరీరముననుసరించి ఎంతోకాలము జీవించలేము. నీతిమంతులు ఎంతోకాలము పాపమునకు దాసులుగా వుండాలని కోరుకోరు. మనము కనీసము ఆత్మననుసరించి నడువవలెనని కోరుదుము మరియు మన మనస్సును ఆత్మ కార్యములమీద లగ్నము చేస్తాం. నీతిమంతులు ఆత్మకార్యములు, క్రీస్తుకొరకు ఆత్మను జయించు కార్యములను చేస్తారు.
మనము దేవుని పని కొరకు కష్టపడి పనిచేయవలెను, దీని విషయమై మన స్వంత ఉద్దేశ్యము వదులుకోవాలి. మరియు మన మనస్సు దేవుని పనిమీద లగ్నం చేయాలి. మనము తప్పక మిగిలిన మన జీవితమును ఈ విధముగా జీవించాలి. దేవునినీతి కొరకు జీవించుటచేత మాత్రమే నీ గమ్యము మార్చబడినది. ఎందుకనగా నీవు నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచుటచేత విమోచనము పొందావు. నీవు ఈ సత్యమును తెలుసుకొన్నావని నేననుకుంటున్నాను.
నీవెంత మాత్రమును ఎంతోకాలము ఈ లోకమునకు తిరుగక పాపమునకు ఒక దాసునిగా కాకుండా వుండాలనే నా బాధ. నీవిప్పుడు లోకమువైపు తిరిగినట్లయితే, ఇది నీ సొంత మరణమనేభావము. శరీరానుసారముగా నుండుట మరణము. నీవు ఇప్పటికి నీ శరీర కోరికను వెదకుచున్నట్లయితే నీ ఆత్మ చనిపోవును, నీ మనస్సు చనిపోవును, నీ దేహము కూడా చనిపోవును. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రము దాటిన తరువాత వారు తిరిగి ఐగుప్తునకు రాలేదు. ఒక ఐగుప్తీయుని కలుసుకున్నందుకు సంతోషపడలేదు. అదే విధముగా, నీతిమంతులముగా తీర్చబడిన మనము కూడా ఐగుప్తునకు తిరిగి పోలేము. ఒక ఐగుప్తు ఆత్మ కలిగినవానిని కలుసుకొనుటచేత సంతోషపడలేము.
ఒక నీతిమంతుడు తిరిగి జన్మించిన వ్యక్తి బయటికి వెళ్ళి లోకములోని వ్యక్తులతో జీవించుచున్నయెడల, అతడు/ఆమె దేవుని సంఘమునకు తిరిగి వెళ్ళవలెనని తాపత్రయపడును. అతడు/ఆమె దేవుని సంఘమును పొగొట్టుకొనవచ్చు. కావున మనము మన మనస్సును దేవుని కార్యము మీద లగ్నము చేయుదుము.
దేవుని ఆత్మ కార్యములనగా భావమేమిటి? అవి దేవునికి చెందినవి కావా? అవి దేవుని సువార్తను సేవించుచున్న కార్యములు కావా? అయినప్పటికి మనము బలహీనులము అసంపూర్ణలము కామా? మీరు బలహీనులు అదే విధముగా నేను కూడా. నీవు బలహీనుడవు మరియు అసంపూర్ణుడవైనను నీవు పాపము క్షమాపణను పొందలేదా? నీవు పాపము క్షమాపణను పొందావు! అప్పుడు పరిశుద్ధాత్ముడు నీలో నివశించునా? జవాబు మాత్రము ఖచ్చితముగా అవును అనునదే!
అప్పుడు మనము, ఆత్మ కార్యములమీద మనస్సు లగ్నము చేయుటకు సామర్థ్యము కలిగియున్నావా లేదా? మనము కలిగియున్నాము ` మనమందరము ఆత్మకార్యముల మీద మనస్సు లగ్నము చేయుటకు సామర్థ్యమును కలిగియున్నాము. నీవు ఆత్మకార్యమును చేయునట్లుగా దేవుడు నీ లక్ష్యమును మార్చాడని నీకు తెలుసునా? నీవు దీనిని విశ్వసించుచున్నావా?
మన మనస్సు ఇప్పుడు మారెను. నీవు నీ మనస్సు మారిన తరువాత ఆ వాస్తవమును నీవు ఎరుగనట్లయితే, ఇది నీకు కేవలము సమస్యలనే తెచ్చును. నీవు తప్పక నీ మనస్సును దేవుని నీతిపై ఏకాగ్రతతో లక్ష్యముంచవలెను. అప్పుడు దేవుని సంఘము నీ ఇల్లగును. నీతోటి విశ్వాసులు సహోదరులు, అక్కాచెలెళ్ళు, నీ తల్లిదండ్రులు` మరియొక మాటలో అదే ఆత్మలో నీ కుటుంబము. మీ సంఘములో వున్న ప్రతి ఒక్కరు నీ కుటుంబమునకు చెందినవారగుదురు. నీకు ఇంతకుమునుపు ఆలోచించుకున్నట్లయితే, తిరిగి దీని గురించి పట్టించుకొనుటకు మరియు ఈ బోధలపై కొంత గంభీరముగా ఆలోచన చేయుటకు ఇదే సమయము.
రక్తసంబంధమైన కుటుంబము మాత్రమే నీ కుటుంబమని నీవు తలంచవద్దు. నీ కుటుంబము ఇక్కడ వున్నది మరియు ఇది తిరిగి జన్మించిన ప్రతివాని కుటుంబము. మీరంతా దేవుని కుటుంబములో ఒక భాగము. అందువలననే మనము తప్పక ఆత్మానుసారముగా జీవించవలెను. మనము తప్పక దేవుని కొరకు జీవించవలెను, ఏలయనగా ఆత్మానుసారముగా జీవించుట సమాధానమును సంపాదించుకొనుటయై యున్నది.