(రోమా 8:12-16)
‘‘కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు ఋణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావవలసివారై యుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపినయెడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరు దేవుని కుమారులైయుందురు. ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్త పుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగినవారమై మనము ` అబ్బా తండ్రీ అని మొఱ్ఱపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు.’’
అపోస్తులుడైన పౌలు, దేవుని నుండి రక్షణ పొందినవానిగా, తిరిగి జన్మించిన విశ్వాసులు శరీరముననుసరించి నడుచుకొనరాదని, ఆత్మననుసరించి నడుచుకొనవలెనని చెప్పుచున్నాడు. పౌలు, ప్రత్యేకించి దేవుని నీతిని కలిగినవారు శరీరముననుసరించి నడుచు కొనినట్లయితే చనిపోవుదురని, మనము ఆత్మానుసారముగా జీవించినట్లయితే, మనము జీవించుదుమని చెప్పుచున్నాడు. ఆ విధముగా మనము ఈ సత్యమునందు విశ్వాసముంచవలెను. అయితే అప్పుడు, దేవుని నీతితో నివశించువారు ఏమి చేయాలి? వారు దేవునినీతి ననుసరించి నడుచుకొనవలెనా లేక శరీర వాంఛననుసరించి నడుచుకొనవలెనా? వారి దేహమును దేవుని నీతియుక్త కార్యములకు సమర్పించుటయై నదనియు క్రమశిక్షణతో కూడినదనియు వారు తెలుసుకొనవలెను.
తప్పించుకొనలేని నియమము
మనము శరీర స్వభావముననుసరించి కాక, ఆత్మానుసారముగా జీవించవలెనను ఒక నియమమున్నదని పౌలు చెప్పుచున్నాడు. మనము దేవుని నీతిని గురించి తెలుసుకొనక మనుపు మరియు దీనియందు విశ్వాసముంచక మునుపు, మనము ఆత్మానుసారముగా జీవించలేక పోయాము. అయితే ఇప్పుడు మనము దేవునినీతిని తెలుసుకొని దానియందు విశ్వాసముంచి యున్నాము. మనము మన హృదయములను ఆలోచనలను, తలాంతులను మరియు సమయమును ఆయన నీతికార్యముల కొరకు సమర్పించుకొనగలము. మనలను మనము దేవుని నీతిని బోధించుటకు మరియు ఆయన నీతికార్యములను చేయుటలో సాధనముగా ఉపయోగించవలెను.
శరీరానుసారముగా జీవించుట
నీవు నీ శరీరస్వభావము ద్వారా ఆత్మానుసారముగా కాక, క్రీస్తుయందు లేనట్లయితే, బైబిల్ చెప్పుచున్నది నీవు కూడా అందరి అవిశ్వాసుల వలె నశించెదవు. ఇది ఎందుకంటే నీవు తిరిగి జన్మించిన క్రైస్తవుడవైనను, నిజానికి దేవునినీతి ననుసరించి నడుచుకొనుటలేదు. నీవు నిజ క్రైస్తవునిలా వుండవలెనంటే, నీవు ఎంతోకాలము శరీరానుసారముగా జీవించరాదు. నీవు దేవుని నీతిని సేవించుటకు నిర్దేశించబడితివి గనుక దేవుని నీతితో జీవించవలెను. దీనికి బదులుగా నీవు శరీరానుసారముగా జీవించినట్లయితే, నీ ఆత్మ చనిపోవును ఏది ఏమైనా నీవు దేవుని నీతి ననుసరించి నడుచుకొనినయెడల, నీవు సమాధానముతో యుగయుగములు జీవించెదవు.
దేవుని కుమారులు
‘‘దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరు దేవుని కుమారులైయుందురు’’ (రోమా 8:14)
దేవుని నీతియందు విశ్వాసముంచువారు పరిశుద్ధాత్మను ఒక వరముగా పొంది యున్నారు మరియు పరిశుద్ధాత్మ వారిని నడిపించును. నీవు ‘‘దేవుని కుమారులు’’. ఈ దేవుని కుమారులు వారిలో నివశించు పరిశుద్దాత్మను కలిగియున్నారు. అదే విధముగా వారిలో నివశించు పరిశుద్ధాత్మను కలిగియుండనివారు ఆయనకు చెందినవారు కారు. దేవుని వెంబడించు ప్రారంభ స్థానము ఆయన నీతియందున్న విశ్వాసముతో మొదలౌతుంది. దేవుని పిల్లలుగా మారుటకు నీరు మరియు ఆత్మ సువార్త వాక్యమును వినుటచేత మొదలౌతుంది. దీని భావము ఆయన నీతియందు విశ్వాసముంచుటచేత నీవు ఒక దేవుని కుటుంబ సభ్యునిగా మారుదువు. మరియు నిన్ను నీ పాపములనుండి రక్షించుటకు దేవుడు ఆయన నీతిని నీకిచ్చెను.
యేసును, యూదు నాయకుడైన నికొదేము దర్శించినప్పుడు, యేసు అతనితో ఎవడును అతడు/ఆమె నీటిమూలమున మరియు ఆత్మ మూలమున తిరిగి జన్మించితేనే తప్ప దేవుని రాజ్యములో ప్రవేశించలేడని చెప్పెను. నికొదేము దీనికి ఆశ్చర్యపడి ‘‘ముసలివాడైన మనుష్యుడేలాగు జన్మించగలడు?’’ (యోహాను 3:4) అని అడిగాడు. యేసు జవాబిచ్చెను ‘‘ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరమూలముగా జన్మించినది శరీరమును, ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునైయున్నది. మీరు క్రొత్తగా జన్మించవలెనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటికి విసరును; నీవు దాని శబ్ధమును విందువేగాని అది యెక్కడ నుండి వచ్చునో యెక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగాను జన్మించిన ప్రతివాడును అలాగే యున్నాడనెను.’’(యోహాను 3:5-8)
యేసు చెప్పెను అదేమనగా నీరు మరియు ఆత్మ సువార్త చేత జన్మించనివాడు తిరిగి జన్మించుట భావమును తెలుసుకొనలేడు. బాప్తిస్మమిచ్చు యోహాను నుండి యేసు తీసుకొనిన బాప్తిస్మము మరియు సిలువపై ఆయన కార్చిన రక్తములోని విశ్వాసము దేవుని నీతిని పొందుటకు ఆయన నీతికార్యముల యందు విశ్వాసముంచువారిని సమర్ధులనుగా చేయును. సువార్త వాక్యమునందు విశ్వాసముంచువారు పరిశుద్ధాత్మను ఒక వరముగా పొందగలరు. ఒకడు నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచుటచేత ఒకడు దేవుని నీతిని చేరగలడు. దేవునినీతిని అంగీకరించు ప్రతివాడు ఒక దేవుని కుమారునిగా మారును. ఆయన ప్రజలుగా మారిన వారందరూ మన సహోదరీ సహోదరులు.
మనము దేవుని పిల్లలమని ఆత్మ సాక్ష్యమిచ్చును
‘‘ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్త పుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మను కలిగినవారమై మనము - అబ్బా తండ్రీ అని మొఱ్ఱపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు.’’ (రోమా 8:15-16)
మనము దేవుని పిల్లలమను వాస్తవమును గురించి సాక్ష్యమిచ్చుటకు రెండు మార్గములు మాత్రమే కలవు. మొదటిది, నీరు మరియు ఆత్మ సువార్తలో ప్రత్యక్షపరచబడిన దేవునినీతి మరియు మనలను ఆయన కుమారులుగా మార్చిన దేవుని ఆత్మ; రెండవది, మనపైకి దిగివచ్చు పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్ముడు నీరు మరియు ఆత్మ సువార్త లోపల పని చేయును. దేవుడు ఈ విషయములన్నిటికి ప్రణాళిక వేసెను. నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచుట అనునది మనము దేవుని పిల్లలుగా మారియున్నాము అని మనతో చెప్పు మనలోని సాక్ష్యము. దేవుని నీతిని తెలుసుకొని దానియందు విశ్వాసముంచుటచేత దేవుని పిల్లలుగా మారినవారు మన తండ్రియైన దేవుని ‘‘అబ్బా’’ అని ప్రార్థించు హక్కును కలిగియున్నారు.
మనము కొంచెము ప్రత్యేకముగా ఆలోచించుటకు ప్రయత్నము చేద్దాం. ఒకడు అతని/ఆమె హృదయములో పాపమును కలిగియుండి దేవునిని అతని తండ్రిగా పిలువగలడు? తండ్రియైన దేవుడు ఎన్నడును ఒకపాపిని తన కుమారునిగా వుంచడు, మరియు ఒక పాపి ఎన్నడు దేవునిని తండ్రిగా సేవించలేడు. నీవు తప్పక నీలోనికి నీవు చూసుకొనవలెను. ఒకవేళ నీవు కూడా ఏదైనా కారణము చేత ఈ విధముగా ఒక పొరపాటు చేస్తున్నావేమో. దేవుని కుమారులుగా మారియున్నారని పరిశుద్ధాత్మ ద్వారా సాక్ష్యము పొందిన వారందరు దేవుని నీతియందు విశ్వాసముంచినవారు. మనము తప్పక దేవునినీతిని గురించి లోతుగా ఆలోచించవలెను.