(రోమా 8:16-27)
‘‘మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులు క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడినయెడల, క్రీస్తుతోడి వారసులము. మన యెడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచుచున్నాము. దేవుని కుమారులు ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి, నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపించబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్య్రము పొందునను నిరీక్షణకలదై, స్వేచ్ఛగా కాక దానిని లోపరచినవాని మూలముగా వ్యర్ధపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకీగ్రవముగా మూలుగుచు ప్రసవవేదనపడుచున్నదని యెరుగుదుము. అంతేకాదు, ఆత్మయొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్త పుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఏలయనగా మనము నిరీక్షణ కల్గిన వారమై రక్షించబడితిమి. నిరీక్షింపబడునది కనబడునప్పుడు, నిరీక్షణతో పని యుండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన యెడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. అటువలె ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్ఛరింప శక్యముగాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయమును పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును; ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు.’’
నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచుటచేత వారి పాపములు క్షమించబడిన వారందరు వారి హృదయములలో పరిశుద్ధాత్మను కలిగియున్నారు. 1వ యోహాను 5:10లో ఇది చెప్పుచున్నది, ‘‘దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే సాక్ష్యమును కలిగియున్నాడు.’’ తన హృదయములో దేవుని కలిగినవాడు తన హృదయములో నివశించు పరిశుద్ధాత్మను కలిగియున్నాడు మరియు అతని హృదయములో పరిశుద్ధాత్మ నివశించుట సాధ్యపడునట్లుగా చేసినది నీరు మరియు ఆత్మ సువార్త.
నీరు మరియు ఆత్మ సువార్త యందున్న మన విశ్వాసము ద్వారా మన పాపము క్షమాపణను మనము కలిగియుండుట చేత మనము దేవుని పిల్లలుగా మారియున్నాము. పరిశుద్ధాత్ముడు మన హృదయములో నివశించును మరియు ‘‘మీరు దేవుని పిల్లలు మరియు ఆయన ప్రజలు’’ అని చెప్పుటచేత మనకు సాక్ష్యమిచ్చును. తమ హృదయములో పరిశుద్దాత్మను కలిగియుండనివారు, మరియొక మాటలో, ‘‘మీరు దేవుని పిల్లలు కారు, పాపులు’’ అని ధర్మశాస్త్రము సాక్ష్యమిచ్చును.
నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచువారికి ‘‘మీరు దేవుని పిల్లలు. మీరు పాపములేని దేవుని ప్రజలు’’ అని పరిశుద్ధాత్ముడు సాక్ష్యమిచ్చును. మనము దేవుని పిల్లలగుటకు దేవుడు, మనము దీనిని తెలుసుకొనుటకు దేవుడు సరిపోయినంతగా దీనిని స్పష్టము చేసాడు, మనము తప్పక నీరు మరియు ఆత్మ సువార్త యందు విశ్వాసముంచవలెను.
‘‘నాకేమి అనిపించడం లేదు. అందువలన నేను దేవుని కుమారుని కాదు అని భావించవలెనా?’’ అని మీరు అడగవచ్చు. కొంతమంది ప్రజలు వారి విశ్వాసములో చాలా పరిపక్వత లేకుండా వుంటారు అందువలన వారు వారి హృదయములో పరిశుద్ధాత్ముడు వున్నాడను సంగతి వారు గ్రహించరు. మనకు మనము సందేహించువారమైనప్పటికి పరిశుద్ధాత్ముడు ‘‘ఏయ్! మీరు దేవుని పిల్లలు! మీరు నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచుటలేదా? మీరు విశ్వసించినందున, మీరు దేవుని పిల్లలు’’ అని చెప్పుట చేత మనలను ఉల్లాసింపచేయును. మనము సందేహాలతో నింపబడినవారమైన్పటికి, మనము నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచినవారము కావున, మనము దేవుని పిల్లలము. మనము దేవుని పిల్లలమని పరిశుద్ధాత్ముడు మనకు సాక్ష్యమిచ్చుచున్నాడు. పరిశుద్ధాత్ముడు మనలో మన అనుభూతులు మరియు స్పందన ద్వారా నివశించు ఏదో ఒకటి కాదు. నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచువారు వారి హృదయములో పాపమును కలిగియుండరు, వారు పాపమును కలిగియుండనంతకాలము, పరిశుద్ధాత్ముడు వారియందు నివాసముండును. మీరు నిశ్చయముగా దేవుని కుమారులు.
పరిశుద్ధాత్ముడు మన హృదయుములో ‘‘మీరు యేసు బాప్తిస్మమునందు, ఆయన సిలువయందు, విశ్వాసముంచియున్నారు మరియు క్షమించబడి యున్నారు. కావున మీరు పాపమును కలిగియుండలేదు మరియు మీరు దేవుని కుమారులు’’ అని చెప్పును.
ఏది ఏమైనా, ఆయన సాక్ష్యము ఒక మానవుని స్వరముతో రాదు. అందువలన, ఒక నిండుగా వుండే స్వరము కొరకు ఎదురు చూడవద్దు! ఒకవేళ ఒక స్వరమును నీవు వినవలెనని కోరినట్లయితే, అప్పుడు సాతానుడు మారువేషముతో ఒక మానవుని స్వరముతో నిన్ను మోసగించుటకు శోధించుటకు ప్రయత్నము చేయును. పరిశుద్ధాత్ముడు దేవుని వాక్య ప్రకారముగా పనిచేయుచుండగా సాతానుడు ప్రజల ఆలోచనలోనికి తొంగి చూచుట ద్వారా పనిచేయును.
దేవుని నీతిని కలిగినవారు ఆయన కుమారులు మరియు వారసులు.
17వ వచనము మనము కలసి చదువుదాము. ‘‘మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల, క్రీస్తుతోడి వారసులము.’’
మనము ఒకవేళ దేవుని పిల్లలమైనట్లయితే, మనము ఆయన వారసులము కూడా. ఒక వారసుడు అనువాడు తన తల్లిదండ్రుల నుండి సమస్తమును పొందువాడు. మరియొక మాటలో, తండ్రియైన దేవునికి కలిగిన ప్రతిదానిలో భాగము పంచుకొనే హక్కును మనము కలిగియున్నాము. ‘‘తండ్రియైన దేవుని వారసుడు ఎవరు?’’ అని అడిగినట్లయితే, ‘‘నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచి వారి పాపములు క్షమించబడిన వారు ఆయన వారసులు’’ అని మనము జవాబు చెప్పగలము.
ఇటువంటి విశ్వాసమును కలిగినవారు దీవించబడినవారు మరియు వారు ఆయన రాజ్యములో క్రీస్తుతో కూడా దేవుని మహిమను సంక్రమించుకొందురు. మనము క్రీస్తుతో కూడా వారసులుగా కలుసుకొనినప్పటి నుండి, మనమందరము కలసి మహిమను పొందుటకు, మనము కూడా ఆయనతో కలిసి శ్రమపడవలెను. క్రీస్తుతో కూడా వారసులుగా కలుసుకొనుట అనగా మన తండ్రియైన దేవుని రాజ్యములో శాశ్వతముగా జీవించుట అని భావము. నీవు నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచినట్లయితే, అప్పుడు నీవు క్రీస్తుతో కలుసుకొనిన ఒక వారసునివి. మనమందరము వారసులము ఎందుకనగా మన తండ్రి కలిగియున్న ప్రతి దానిని మనము స్వతంత్రించు కుంటాము.
సమయం గడిచే కొలది, దేవుని రాజ్యము మనకు దగ్గరగా వచ్చుచున్నదని నేను భావించగలను. ప్రతిదీ తగిన కాలములో అది సంభవించును. బైబిల్‌లో వున్న దేవుని వాగ్ధానము కూడా ఒక దాని వెంట ఒకటి నెరవేర్చబడును. ఇప్పుడు విడిచి పెట్టబడినదంతా, మిగిలిన కొన్ని విషయాలతో పాటుగా ఇశ్రాయేలీయులు పశ్చాత్తాపము పొందుటకు, యేసును వారి రక్షకునిగా ఒప్పుకొనుటకు, మరియు వారి పాపముల నుండి రక్షించబడుటకు విడిచిపెట్టబడినది. ఇశ్రాయేలీయల ఏడేండ్ల శ్రమల కాలములో యేసును వారి స్వంత రక్షకునిగా ఒప్పుకొనెదురు.
భూమి మీద దేవుని రాజ్యము పరలోకములో దేవుని రాజ్యము యొక్కగ్రహింపు ఇశ్రాయేలీయుల యొక్క పశ్చాత్తాపమునకు ముడిపెట్ట బడియున్నది. ఆ చివరి దినము త్వరలోనే వచ్చునని నేను విశ్వాసించుచున్నాను. నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచువారు దేవునితో శాశ్వతముగా జీవించునప్పుడు ఈ దినము సమీపముగా వుండునని నేను విశ్వసించుచున్నాను. ప్రపంచమంతా ఆ దినము 2000 సంవత్సరము అగునేమో అని ఎదురుచూసినది. అయితే 2000 సంవత్సరములు ఇప్పటికే గడిచిపోయినది. వాస్తమువనకు, 2000 సంవత్సరములో భూమిమీద అన్ని మార్పులు సంభవించును అని ఆలోచించినప్పుడు, వెయ్యి సంవత్సరముల పురుగును గురించిన అనేక ఆందోళనలు గడిచిపోయినవి, ఇప్పటికే మనము 2002 సంవత్సరములో ఉన్నాము.
ఎన్నటెన్నటికిని, మనము ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న క్రీస్తు రాజ్యము ఇప్పటికి మనలో వున్న ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చుచున్నది. మనలో పాపక్షమాపణను పొందినవారు దేవుని రాజ్యము సమీపించుటను గూర్చిన అనుభవములోనికి పరిశుద్ధాత్ముడు కూడా నడిపించును. కాబట్టి, ఇప్పుడు దేవుడు చెప్పినట్లుగా ప్రతిదీ నెరవేరును. మనము ఆ దినము కొరకు విశ్వాసముతో ఎదురుచూసెదము.
భవిష్యత్తులో ఇశ్రాయేలీయులు ప్రపంచశాంతికి అడ్డుపడే ఒక రాయిగా వుంటారు. దీనిని బట్టి ఇది అనేక దేశములతో శత్రుత్వమును పోగుచేసుకొనును. ఇదే బైబిల్ మనకు చెప్పుచున్నది ఇశ్రాయేలీయులు చాలామందికి శత్రువుగాను అప్పుడు వారిలో కొందరు వారు ఎంతో కాలము నుండి ఎదురుచూస్తున్న మెస్సీయా నిజముగా క్రీస్తు అని వారు గ్రహిస్తారు. వారు నీరు మరియు సువార్తయందు విశ్వాసముంచుటను బట్టి వారి పాపము క్షమించబడును. దేవుడు దేనికొరకు ప్రణాళిక వేసెనో అది విజయవంతముగా నెరవేరును. ఏది ఏమైనా, ఈ సంగతులన్నియు తగిన కాలములో సంభవించును. మరియు మనము ఇవన్నియు ఒక దినమున ఒక తేదీన జరుగునని కొంతమంది వక్రముగా చెప్పు దానిని బట్టి మనము ఎదురుచూడకూడదు. నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచువారు దేవుని ప్రవచనములు నిజమగుట చూస్తారు. విశ్వాసులు భూమిమీద దేవుడు ప్రమాణము చేసిన వాగ్ధానము భూమిమీద ఆయన రాజ్యము మరియు పరలోకమందు ఆయన రాజ్యము కొరకు నిరీక్షణను కలిగియున్నారు. అటువంటి దినము ఒకటి మనకు సమీపముగా వున్నదని నేను విశ్వసించుచున్నాను.
ప్రభువు వాగ్ధానము చేసినవి ఒకదాని వెంట మరియొకటి నిజమగుచున్న కొలది ఆ సమయము త్వరలోనే వచ్చును. దేవుడు ప్రమాణము చేసిన వెయ్యి సంవత్సరముల రాజ్యము మరియు దేవునిచే వాగ్ధానము చేయబడిన దేవుని రాజ్యమును గూర్చిన గ్రహింపు త్వరలోనే వున్నదని నేను నిశ్చయతను కలిగియున్నాను. నీవు కూడా పరిశుద్ధాత్ముడు ప్రేరేపించుటచేత నేను ఇదే విధముగా ప్రేరేపించబడితినని తలంచుచున్నావా? పరిశుద్ధాత్ముని ద్వారా దేవుని ప్రతి వాగ్ధానము నెరవేర్చబడునని నీవు తలంచుచున్నావా? నిజముగా దేవుని వాగ్ధానమును మన హృదయముతో విశ్వసించువారమైన మనకు పరిశుద్ధాత్ముడు సహాయము చేయును.
పరిశుద్ధాత్మ ద్వారా, ఈ చివరి దినముల యొక్క దేవుని వాగ్ధానము త్వరలోనే నిజమగునని మన హృదయములో నిశ్చయతను మనము కలిగియున్నాము. మన మనస్సులో సంచరించుచున్నవి మరియు మన నిరీక్షణ దేవుని వాగ్ధానములతో పాటుగా ఇవి కూడా నిజమగునని పరిశుద్ధాత్మ ద్వారా మనము విశ్వసించుచున్నాము. ఇది నిజమైన విశ్వాసము.
నీవు నేను మనమందరము దేవుడు ప్రమాణము చేసిన దీవెనలకు వారసులము. కావున, మనము పరిశుద్ధాత్ముని లోపలే మనము ఎదురు చూడవలెను. దేవుని రాజ్యము మనకు త్వరగా వచ్చును. ఇశ్రాయేలీయులు త్వరలోనే యేసుక్రీస్తును వారి మెస్సీయగా విశ్వసించి అంగీకరించుదురు.
చాలామంది ప్రజలు ఇప్పుడు ‘‘దయచేసి త్వరగా రమ్ము ప్రభువా’’ అని ఆయన కొరకు ఎదురుచూచుచున్నారు. పౌలు చెప్పుచున్నాడు అతడు దేవుని వారసుడైనప్పటి నుండి అతడు పొందబోవు మహిమతో పోల్చుకొన్నట్లయితే అవి ఎన్నతగినవి కావని చెప్పుచున్నాడు. దీని భావమేమనగా క్రీస్తుతో ఒక క్రమము ప్రకారముగా మహిమను పొందవలెనంటే, మనము ఆయనతో కూడా శ్రమను కూడా పొందవలెను. ఇందువలననే మనము దేవుని రాజ్యము వచ్చునని విశ్వాసముంచుచు ఎదురు చూచుచున్నాము. క్రీస్తుతో పాటుగా మహిమను పొందుటకు, మనము కూడా ఆయనతో శ్రమ పొందవలెను.
పౌలు నిరీక్షణ అన్ని జంతువులు అన్ని వృక్షములతో కలిపి అవి అన్నియు మరణము నుండి విడుదల పొందుటకు, సృష్టియావత్తు కొరకైయున్నది. అందువలననే సృష్టియావత్తు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. దేవుని కుమారుల కొరకు ఎదురుచూచుట అను ఆదినము సృష్టించబడినవన్నియు శాశ్వతముగా జీవించునప్పుడు ఆ దినము వచ్చును.
కావున, విశ్వాసులమైన మనము శాశ్వతమైన జీవముతో దీవించబడియున్నాము. మన జీవితకాలములో ప్రభువు వచ్చుట మనము చూచినను చూడకపోయినను లేక మనలను కొనిపోవుటకు మన ప్రభువు మనలని నిద్ర నుండి లేపినను లేపకపోయినను, మనము ఆయన కొరకు ఎదురుచూడవలెను.
మనయందు ప్రత్యక్షపరచబడు మహిమ నిజముగా గొప్పదా?
నీతిమంతులకు త్వరలో ప్రత్యక్షపరచబడబోవు మహిమ అనునది ఒక శాశ్వతమైన మహిమ ` దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనుట మరియు దేవుని మహిమలో యుగ యుగములు జీవించుట. అక్కడ ఇక ఏ మాత్రమును మరణము గాని, వేదనగాని, ఏడ్పుగాని వుండదు. దేవుని రాజ్యములో ఎటువంటి బాధ వుండదు. దేవుని రాజ్యములో ప్రకాశించుటకు సూర్యుడు గాని చంద్రుడు గాని అక్కరలేదు. ప్రభువే దీనియందు ప్రకాశించును. గొఱ్ఱె పిల్ల దేవుని రాజ్యమందు వెలుగై యుండును. ఇది కేవలము యేసు మరియు తిరిగి జన్మించిన, పాపములేని విశ్వాసులు మాత్రమే వుండు స్థలము, మరియు ఇది దేవుని మహిమతో నింపబడి యుండును. ఈ రాజ్యము బంగారు కిరిటముతో నింపబడియుండును. మనము యుగ యుగములు నివశించు దేవుని రాజ్యము వర్ణించుటకు మాటలు చాలనటువంటి గొప్పది. మనము ఎదురుచూచుచున్న మహిమ అంత గొప్పది గనుక, పౌలు మనయందు ప్రత్యక్షపరచబడు మహిమ యెదుట ప్రస్తుత శ్రమలు ఎన్నతగినవి కావని చెప్పుచున్నాడు.
కొన్నిసార్లు మనము ఈ లోకములో దేవుని కొరకు పనిచేయుచున్నప్పుడు ప్రకృతిలో దేవుని మహిమను మనము చూడగలము. మనము రంగురంగుల పుష్పములను, పుష్పించు గడ్డిని, ప్రకాశించుచున్న ఆకులను, వెచ్చని వసంతకాల వాతావరణమును చూచినప్పుడు, అడవులు స్వచ్ఛతను చూచినప్పుడు, స్వచ్ఛమైన గాలిని చూచినప్పుడు, చల్లని రాత్రులయందు ప్రకాశించు ఆకాశ నక్షత్రములను చూచినప్పుడు; మనము నాలుగు ఋతువులను గురించి ఆలోచించినప్పుడు మనము పరలోకమును గురించి ఆలోచించుట తప్ప మరేమి చేయలేము. దేవుని సృష్టి అద్భుతమును మనము చూచినప్పుడు, దేవుని రాజ్యము మరింత త్వరలో వచ్చునని మనము నిరీక్షించుదుము.
దేవుని రాజ్యము వచ్చునప్పుడు, అక్కడ ఇక ఏ మాత్రము మరణము వుండదు. మరియు మనము మహిమతో జీవించుదుము. అక్కడ కొదువ అనునది ఏమీ వుండదు గనుక మనము సమృద్ధిలోను ఎదుగుదలలోను జీవించుదుము. ఎక్కడ అంతా పరిపూర్ణముగా వుండునో నేను అక్కడ నివసించుదునను ఆలోచనే నా హృదయమును దేవుని మహిమతో నింపును. విశ్వాసులమైన మనకు, అవన్నియు మనవగును వాస్తవము. ఒక కలవలె వుండును. తిరిగి జన్మించిన మనము మరియొకసారి కృతజ్ఞత కలిగినవారముగా చేయును. నా హృదయమును పూర్తిగా ఈ నిరీక్షణతో నింపిన ప్రభువునకు నేను వందనములు చెల్లించుచున్నాను.
ఇప్పుడు, మనము మన ఊహల ద్వారా కేవలము నిరీక్షించగలము, అయితే భవిష్యత్తులో, దేవుని వాగ్ధానములన్నియు నిజమగునని మనకు తెలియును. ఆ విధముగా మన నిరీక్షణ ఇంకను గాఢమగును, మరియు దేవుని మహిమ మనలను సమీపించు అనుభూతి దినములు గడచుకొలది బలపడుతుంది.
ఇందువలననే విశ్వాసులు భవిష్యత్తు కొరకు నిరీక్షించుదురు. దేవునియందు విశ్వాసము మరియు భవిష్యత్తు కొరకు నిరీక్షణ అనునది దేవుని రాజ్యమును సంక్రమిచుకొనువారికి మహిమయు విశ్వాసమునైయున్నవి. అప్పుడు, ఈ మహిమపరచబడిన ఈ విశ్వాసము, ఒక దీవెన, నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచువారికి మాత్రమే ఇవ్వబడినదా? దీనికి జవాబు ఖచ్చితముగా అవును. దేవుని మహిమ ఎదుట సమయము మాత్రమే గడిచిపోవలెను అనునది కేవలము నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచు నీతిమంతులకు మాత్రమే ఇవ్వబడినది. తగిన కాలములో, దేవుని వాగ్ధానములు మరియు ఆయన మహిమ మనయెడల నిజమగును. ఈ మహిమకరమైన సంగతులన్నియు విశ్వాసులకు నిజముగా సంభవించును. మనము ఎదురుచూచు మహిమ అనునది ఎంతో రమ్యమైనది అత్యద్భుతమైనది.
నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచు నీవు మరియు నేను, దేవుని రాజ్య మహిమలో ప్రవేశించు ప్రజలము. గందరగోళపరచు చెడ్డ ప్రపంచము మన హృదయమును కొన్నిసార్లు చీకటిగా చేయవచ్చు మరియు మనము నిరాశపడి లక్ష్యములేని వారముగా మారవచ్చు. అయితే తిరిగి జన్మించినవారు దేవుని రాజ్య వారసులుగా మారియున్నారు అని విశ్వసించుటచేత, ఈ కష్టములన్నియు అధిగమించగలదు. పాపములేని విశ్వాసుల హృదయములో అన్నిరకముల సమస్యలున్నప్పటికి, వారిలో వారు దేవుని వాగ్ధానమును మనము చేసుకొనుటచేత బలమును పొందగలరు మరియు జీవించగలరు. మన హృదయములో పరిశుద్ధాత్ముడు మిగిలియుండి, ఆదరించుచు, మనము దేవుని పిల్లలమని మన ఆత్మతో సాక్ష్యమిచ్చుచున్నందుకు నేను వందనస్థుడనైయున్నాను.
క్రొత్తగా వారి పాపములనుండి విమోచింపబడినవారు కూడా పరలోక మహిమకొరకు చూచుచు నిరీక్షణతో జీవించుదురు. మనము సమానముగా దేవుని పిల్లలుగా మారియున్నాము. నీవు ఎంతో కాలమునుండి సంఘములో ఒక విశ్వాసి జీవితమును జీవించియున్నట్లయితే, నీ మహిమకరమైన సంపదయందు ఆనందించుచు మీ ఆత్మలోపల వున్న పరిశుద్ధాత్మను నీవు చూడగలవు.
చివరికి నీతిమంతుల హృదయములు కూడా ఈ భూమిమీద మూలుగును
మనము 23వ వచనమును కలిపి చదువుకుందాము. ‘‘అంతేకాదు, ఆత్మయొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్త పుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనముకొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము.’’ మనలను మనము ప్రశ్నించుకొందాము. ‘‘మనము దేని కొరకు నిరీక్షించుచు జీవించుదుము?’’ విశ్వాసులమైన మనము, మన దేహము విమోచనము కొరకు నిరీక్షించుచు జీవించుచున్నాము. మనము దేవుని పిల్లలమని చెప్పినప్పుడు, కేవలము మన ఆత్మ మాత్రము ఆయన పిల్లలగును. మన దేహము ఇంకా మహిమను పొందలేదు గనుక, విశ్వాసులందరు వారి దేహము మార్పుపొందవలెనని నిరీక్షించుచున్నారు.
విశ్వాసుల దేహము దేవుని మహిమను ధరించుకొనినప్పుడు, వారు అగ్నిలోగుండా నడిచిపోగలరు. మరియు వారు కాలిపోరు, మరియు వారు ఎటువంటి కష్టతరమైన వాటినుండైనను గోడ నుండైనా వెళ్ళగల సామర్థ్యమును కలిగియుందురు. మన మార్పు చెందిన దేహము సమయము విశ్వపు అవధుల నుండి స్వతంత్రముగా వుండును.
అయితే మన దేహము ఇంకా మార్పు చెందలేదు. అందువలన మనలో మూలుగుచున్న ప్రథమ ఫలము ఆత్మను మనము కలిగియున్నాము. పరిశుద్ధాత్ముడు నీ యందు మూలుగుచున్న అనుభూతిని నీవు కలిగియున్నావా? ఆయన ఎప్పుడు నీలో మూలిగెను? మనము శరీర సంబంధమైన కోరిక వెంట పరిగెత్తినప్పుడు పరిశుద్ధాత్ముడు మూలుగును.
మనము లోకమువైపు చూచి మనము చూచినదానిని ప్రేమించినప్పుడు, మనయందున్న పరిశుద్ధాత్ముడు మూలుగును. మన దేహము మార్పు చెందలేదు. అందువలన ఆనందముతో లోకములోని విషయము పొందుటకు ప్రయత్నించును, అయితే మన ఆత్మలు ఇప్పటికే మార్పు చెందియున్నందున, మనయందున్న పరిశుద్ధాత్ముడు మూలుగును. ఆ విధముగా లోక సుఖము పొందుట కొరకు ప్రయత్నించుచున్న మన హృదయముల నుండి వెనుకకు తిరిగి పరిశుద్ధాత్ముని నడిపింపును పొందవలెను.
దేవుని వారసులమైన మన లోపల, పరిశుద్ధాత్ముడు మూలుగును ఎందుకనగా పరిశుద్ధాత్ముడు మనయందున్నాడు. మనము ఈ లోకములో జీవించుచుండగా మన భవిష్యత్తు ఎంత చీకటిగా నుండునో మరియు మన దేహము ఎంత బలహీనమో మనము చూడగలము. ఇటువంటి సమయములో, వారు తప్పక దేవుని వారసులు దీవెన కొరకు ఆశగొని తేరిచూడవలెను ఎందుకుంటే వారి దేహము కూడా మహిమపరచబడునని వారికి తెలుసు. విశ్వాసులు ఆ దినము కొరకు ఎదురు చూసెదరు మరియు పూర్తిగా విమోచించబడిన పరిపూర్ణ దేహమును వారు కలిగియుంటారు.
మహిమకరమైన నిరీక్షణతో జీవించుట
మనము 24 మరియు 25 వచనములను ఒకే గొంతుకతో చదువుదాము. ‘‘ఏలయనగా మనము నీరిక్షింపబడునది కనబడునప్పుడు, నిరీక్షణతో పనియుండదు, తాను చూచుచున్న దానికొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడనిదాని కొరకు నిరీక్షించిన యెడల ఓపికతో దానికొరకు కనిపెట్టుదుము.’’
‘‘దేవుని రాజ్య నిరీక్షణతో మనము మన అన్ని పాపముల క్షమాపణను పొందియున్నామా?’’ మనము ఈ ప్రశ్నను అడుగుదాం. నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచుటచేత మనము మన పాపముల క్షమాపణను పొందియున్నామని మనము చెప్పాము. ‘‘మనము చూడనిదాని కొరకు నిరీక్షించిన యెడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము’’ అని దేవుడు చెప్పుచున్నాడు.
ఒక క్రమములో పరలోకమునకు పోవుటకు మరియు మన పాపముల నుండి మనము విడుదల పొందుటకు, మనము తప్పక నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచుటచేత రక్షించబడవలెను. మనము మన పాపములన్నిటి నుండి రక్షించబడిన తరువాత, మనము మన కన్నులను లోకమువైపు త్రిప్పి మనము చూచుచున్నదాని కొరకు మనము నిరీక్షించినయెడల, అప్పుడు మనము దేవుని నీతిని ఎరుగము మరియు దానికొరకు నిరీక్షించుట లేదు అని భావము. మనము చూచుచున్నదాని కొరకు మనము నిరీక్షించినయెడల, అప్పుడు అది నిరీక్షణ కాదు. అందువలన పౌలు అడుగుచున్నాడు. ‘‘తాను చూచుచున్న దానికొరకు ఎవడు నీరిక్షించును.’’ ఇప్పుడు నీతిమంతులుగా మారిన మనము భూమిమీద వున్నవాటి కొరకు మనము నిరీక్షణ కలిగియుండరాదు. అయితే మనము ఆయన వాగ్ధానము ప్రకారము, ఆయన నీతి నివశించు క్రొత్త ఆకాశము క్రొత్త భూమి కొరకు ఎదురుచూడవలెను. (2వ పేతురు 3:13)
నీతిమంతులు నిరీక్షించు విశ్వాసము ఇటువంటిది. నీతిమంతులు క్రొత్త ఆకాశము క్రొత్త భూమి కొరకు నిరీక్షణతో జీవించుదురు. మనము మన దేహము యొక్క కన్నులతో చూడగలిగినది మనము నిజముగా దేనికొరకు నిరీక్షించుచున్నామో అది కాదు. మనము మన మానవ నేత్రములతో చూడలేము. అందువలన మనము దేవుడు వాగ్ధానము చేసిన మహిమ రాజ్యము కొరకు ఆత్మీయ నేత్రములతో ఎదురుచూచుచున్నాము. అందువలననే నిజముగా నీతిమంతులైనవారు వారి నిరీక్షణను పరలోక రాజ్యమునందుంచుదురు. దేవుడు మనకు చెప్పినది వాస్తవముగా నిజమగునని విశ్వసించుటే నిరీక్షణ.
దేవుడు చెప్పెను, ‘‘కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ యీ మూడును నిలుచును’’ (1వ కొరింధి13:13) మనము మన విశ్వాసము ద్వారా మన పాపముల క్షమాపణను పొందియున్నాము. మరియు దేవుని రాజ్యము కొరకు నిరీక్షించుచున్నాము. ఆయన రాజ్యము భూమి మీదికి వచ్చును మరియు ఆకాశముయందుండును మరియు మనము శాశ్వతముగా ఆయన రాజ్యములో జీవించుదుమను నిరీక్షణను కలిగియున్నాము. ఇందువలననే దేవుని వాగ్ధానమునందు మేము విశ్వసించుచున్నాము మరియు మన ప్రస్తుత శ్రమలను భరించుచున్నాము.
ఇక్కడ ఇలా వ్రాయబడినది, ‘‘మనము చూడనిదానికొరకు నీరిక్షించినయెడల ఓపికతో దానికొరకు కనిపెట్టుదుము’’. మనము దేనికొరకు ఎదురు చూచుచున్నామో అది మన కన్నులతో చూడగలిగినది కాదు. మన భౌతిక కన్నులతో చూడలేని దేవుని వాగ్ధానము కొరకు మనము ఎదురు చూచుచున్నాము. విశ్వాసులమైన మనయెడల దేవుని వాగ్ధానము నెరవేరును ఎందుకనగా దేవుని మహిమ ప్రత్యక్షపరచబడునని మనకు చెప్పబడినది. మరియు మనము ఈ వాగ్ధానమునందు విశ్వాసముంచియున్నాము. మన ప్రభువు ఈ భూమిమీదికి తిరిగి వచ్చుచున్నాడనియు విశ్వసించినప్పటి నుండి, మన ప్రస్తుత శ్రమలను మనము భరించగలము.
దేవుని రాజ్యము, ఒక చిన్న అనుమానపు నీడ కూడా లేకుండా, ఈ భూమిమీదికి వచ్చును. ఈ సువార్త అన్ని దేశములకు వ్యాపించినప్పుడు, దేవుని రాజ్యము నిశ్చయముగా వచ్చును. నీతిమంతులు ఈ దినము కొరకు ఓపికతో కనిపెట్టుదురు. మనము కనిపెట్టుచుండగా మన ప్రభువు వచ్చును. ఈ శతాబ్దములో జీవించుచున్న నీవు మరియు నా విషయములో ఇదే నిజము.
ఉక్రేనియన్ భాషలో మా పుస్తకము అనువదించు ఒక ఉక్రేనియన్ స్త్రీ జత పనివారున్నారు. ఉగ్రవాదుల దాడిలో ప్రపంచ వాణిజ్య కేంద్రము పడిపోవుట ఆమె చూచి గందరగోళములో పడి భయపడ్డానని ఆమె చెప్పినది. ఆమె ఇది ప్రకటన గ్రంథములో ప్రకటించిన ‘‘తెల్లని గుర్రము కాలము’’ కావచ్చును అని ఈ లేఖనముకు సంబంధించిన పుస్తకముల కొరకు అడిగినది.
మనము ఖచ్చితముగా ఈ సంఘటన తెల్లని గుర్రము కాలమునకు చెందినది అని చెప్పలేము. అయితే అది దీనికి సంబంధించినది కాదని మనము చెప్పలేము. ఇటువంటి సంఘటనులు తరచుగా సంభవించినట్లయితే, అప్పుడు యుద్ధము సంభవించును. అప్పుడు దేశము ఒకదానితో ఒకటి యుద్ధము చేయును. ఎప్పుడు యుద్ధము పెట్రేగునో, ఈ ప్రపంచము కరువుతో బాధపడును అప్పుడు ‘తెల్లని గుర్రము కాలము’ ఆకస్మాత్తుగా నిజమగును.
అందువలన, ప్రపంచ నాశనమునకు ముందుగా చెప్పబడిన ఈ సంఘటనలను నేను చూచినప్పుడు, మేము తప్పక ఈ సువార్తను ప్రపంచమునకు వ్యాప్తి చేయవలెనని నా సంకల్పమును నేను నూతన పరచుకొన్నాను. ఈ లోకమును గూర్చిన నిరీక్షణను మనము పొగోట్టుకొనుచున్నామనునది నిజము మరియు మన హృదయము కష్టము మనలను ఆవరించినపుపడు మన హృదయము మూలుగును. ఎన్నటికైనను, మనము జీవించియున్నంత కాలము, మన భౌతిక కన్నులతో చూడలేని అయితే మన ఆత్మీయ కన్నులతో చూడగల, దేవుని రాజ్యము కొరకు ఎదురుచూడవలెను.
మనము నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచినందున, మనము పరలోక రాజ్యము కొరకు నిరీక్షించుచున్నాము. మరియు ఓపికతో దీని కొరకు ఎదురుచూచుచున్నాము. దేవుని రాజ్యము మన యొద్దకు వచ్చుచున్నదని మనము విశ్వసించుచున్నందున, మనము మన కష్టములన్నియు భరించగలము. మన హృదయములో పరిశుద్ధాత్ముడు నివశించియున్నందున ఇది సాధ్యము.
నీవు శ్రమనను భవించుచున్నావా? ఓపిక కలిగి బాగుగా భరించుము. శ్రమపడుచున్నది నీవు మాత్రమే కాదు. మా అందరివలె నీవు శ్రమపడుచున్నావు. ఇదంతయు జరిగిన తరువాత, అంతా సరియైన రీతిగా మారును. నీవు భౌతికముగా శ్రమను అనుభవించినప్పుడు నీవు ఆత్మీయ నిరీక్షణను కూడా అభివృద్ధి చేసుకొనలేవని నీకు తెలియదా? దేహము బాగా సౌఖ్యముగా వున్నప్పుడు, మనము దేవునిని వెదకము. మరియు ఆయన నుండి దీవెనలను వెదకము. ఆ విధముగా మనము దేవుని నుండి తప్పిపోతాము. తిరిగి జన్మించిన మనము రానైయున్న మహిమ కొరకు నిరీక్షణ కలిగియుండవలెను మరియు మన ప్రస్తుత కష్టమును భరించవలెను.
ప్రభువు కొరకు ఓపికతో శ్రమను భరించువారు ధన్యులని దేవుడు చెప్పెను. దేవుని రాజ్యము ఈ భూమిమీదికి వచ్చుదినము వచ్చును, మనము ఆయన రాజ్యములో ప్రవేశించుదుము. మనము భరించవలెను. ఓపిక కలిగియుండవలెను. ఆ దినము కొరకైన నిరీక్షణను మనము కోల్పోకూడదు. మనము తప్పక భరించి ఆ దినము కొరకు ఎదురుచూడవలెను. ఇప్పుడు అది ఎంత కష్టము విచారమైనను, దేవుని రాజ్యము ఒక నూతన ఆకాశము మరియు నూతన భూమిగా వచ్చునంత వరకు మనము ఓపిక కలిగియుండవలెను మరియు ఎదురుచూడవలెను.
దేవుని నీతిని కలిగిన వారికి పరిశుద్ధాత్ముడు సహాయము చేయును.
26వ వచనమును చదువుదాం. ‘‘అటువలె ఆత్మయ మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింపశక్యముగాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు’’.
పరిశుద్ధాత్ముడు మన కొరకు ప్రార్థన చేయునా? అవును, ఆయన మన కొరకు ప్రార్థన చేయును! పరిశుద్ధాత్ముడు మన బలహీనతలను తెలుసుకొని మన కొరకు ప్రార్థన చేయును.
పరిశుద్ధాత్ముని మూలుగును గురించి నేను కొంచెమే మాట్లాడాను. దీనిని గురించి మనము మరలా మాట్లాడాలంటే, దేవుడు మనలను వెళ్ళవదన్న దారిలో మనము వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్ముడు మూలుగును. మనము లోకపు పరిస్థితులను చూచినప్పుడు మనము దానితో కలిసి మూలుగుతాము. దేవుడు మనము వెళ్ళగూడదన్న దిశలో మనము వెళ్ళుచున్నప్పుడు, లేక మనము తండ్రి చిత్తమునకు అవిధేయులమైనప్పుడు, మరియు ఆయన చిత్తమునకు వేరుగా మనము జీవించినప్పుడు, పరిశుద్ధాత్ముడు మూలుగును.
ఒక తిరిగి జన్మించిన విశ్వాసి హృదయములో నివశించు పరిశుద్ధాత్ముడు మనము ఉచ్చరింపలేని మూలుగులతో మూలిగినప్పుడు, మనము మన హృదయములో వున్న శక్తిని పొగొట్టుకుంటాము. బలహీనులమౌతాము. అది పరిశుద్ధాత్ముడు మనలను ప్రార్థించునట్లు చేయునప్పుడు ఇది జరుగును. కొన్నిసార్లు పరిశుద్ధాత్ముడు మన కొరకు విజ్ఞాపనము చేయును, లేక మనము ప్రార్థనచేయవలసియున్న వాస్తమును గురించి మనకు తెలియజేయును.
మన తండ్రి చిత్తము ప్రకారము ఆయన యెదుట మనము ప్రార్థన చేయునట్లు చేయుటకు పరిశుద్ధాత్ముడు మన హృదయములో మూలుగును. ‘‘ప్రభువైన దేవా, నీ బాప్తిస్మము ద్వారా మరియు సిలువపై నీవు చిందించిన రక్తము ద్వారా నా పాపములను తీసివేశావు మరియు దీని ద్వారా మేము నీ కుమారులమయ్యాము. భూమిమీదకి నీ రాకడ త్వరగా వచ్చుట నిజమగునని మేము నీరిక్షించుచున్నాము. నీ చిత్తము నిజమగునని మేము ప్రార్థించుచున్నాము’’ మనము ఈ విధముగా ప్రార్థించుదుము.
మనము మన ఆత్మీయ విశ్వాసముకొరకు ప్రార్థించుదుము. ‘‘దేవా, మేము పేదవారము మేము నీ దృష్టిలో కొదువకలిగిన వారము. అందువలన దయచేసి నీ చిత్తము నిజమగుటకు అవసరమైన విశ్వాసమును మాకు దయచేయుము’’. అయన మన బలహీనతలను ఎరిగియున్నందున అప్పుడు దేవుడు మనకు సహాయము చేయును. పరిశుద్ధాత్ముడు మనలను ఒంటరిగా ఒదలడు గాని దేవుని చిత్తము ప్రకారము మనము ప్రార్థించినట్లుగా చేయును మరియు మన హృదయములను కూడా బలపరచును.
పరిశుద్ధాత్ముడు దేవుని చిత్తప్రకారము మనము ప్రార్థించునట్లు చేయును, మరియు మనము సహాయము అడిగినప్పుడు, మన విషయములో దేవుని చిత్తమేదో మనము తెలుసుకొనునట్లు చేయును, మరియు మనకు నూతన శక్తినిచ్చును.
‘‘అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్ఛరింపశక్యముగాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు.’’
నీవు వీనిని అనుభవించుచున్నావా? దేవుడు మనము చేయవలెనని కోరినదానికి భిన్నముగా నీవు తలంచి ప్రవర్తించినప్పుడు, నీకు నీతిమంతులమైన మనము, ఏదైనా తప్పు చేసినప్పుడు, పరిశుద్ధాత్ముడు మనతో చెప్పు అనుభూతిని నీవు కలిగియున్నావా? పరిశుద్ధాత్ముడు నీకు ‘‘ఏయ్, నీది తప్పు!’’ అని చెప్పును. మరియు మన హృదయము మూలుగుటను ప్రారంభించును. ఇది పరిశుద్ధాత్ముడు మూలుగుట అని నీకు తెలియునా? ఒక నీతిమంతుని హృదయము ఆనందించుచున్నప్పుడు నీవు ఈ అనుభూతిని కలిగియుండవచ్చు. ఏలయనగా ఇది నీయందు ఆనందించును; పరిశుద్ధాత్మను బట్టి నీ హృదయము మూలిగినప్పుడు ఇది పరిశుద్ధాత్ముని మూలుగని అప్పుడు నీవు తెలుసుకొంటావు.
మనము ఎప్పుడు బలహీనులమై తప్పుగా ప్రవర్తించినప్పుడు, పరిశుద్ధాత్ముడు మూలుగును మరియు మన కొరకు విజ్ఞాపనము చేయును. మరియు తండ్రియైన దేవుడు మనకు శక్తినిచ్చును. మనకు నూతన శక్తినిచ్చుటకు అన్ని విషయముల కొరకు మనము ప్రార్థించునట్లుగా పరిశుద్ధాత్ముడు మనలను చేయును. అందువలననే ఎవరి హృదయములలో పరిశుద్ధాత్మ ఉండడో వారు సంతోషముగా వుండరు. పరిశుద్ధాత్ముడు దేవుని వాక్యము ద్వారా మనకు శక్తినిచ్చును. మరియొక మాటలో, మనకు నూతన శక్తినిచ్చుటకు పరిశుద్ధాత్ముడు ఆయన వాక్యముతో మన హృదయములలో పనిచేయును.
పరిశుద్ధాత్ముడు మరియొక విధముగా మాట్లాడుటకు ఇష్టపడడు. ఆయన మనకు లేఖనము ద్వారా, దేవుని సంఘము ద్వారా, మన సహోదరీ సహోదరుల సహవాసము ద్వారా శక్తినిచ్చును. అందువలననే సంఘము చాలా ప్రాముఖ్యమైనది, అందువలననే సంఘము పరిశుద్ధాత్ముడు చేయు కార్యములలో ప్రముఖపాత్రను వహించును. సంఘములో వున్నవారు విశ్వాసులు, వారి సహవాసము, స్తుతులు మరియు ప్రసంగము.
బోధకులు ఎవరు అనేదానితో నిమిత్తము లేకుండా, తగిన ప్రసంగము ప్రసంగించులాగున పరిశుద్ధాత్ముడు అక్కడ వుండి వారిలో పనిచేయును. పరిశుద్ధాత్ముడు ప్రసంగించువారిలోను మరియు దానిని విశ్వసించు వారిలోను వారి మనస్సును నిద్రలేపుచు ప్రతి ఒక్కరికి అవసరమైన దీవెనలు ఇచ్చుచు వారిలో పనిచేయును. ఎక్కడ నీతిమంతులు కూడుదురో ఆ దేవుని సంఘములో పరిశుద్ధాత్ముడు దీనిని చేయును. అందు కొరకే విశ్వాసులకు దేవుని సంఘము ఎంతో ప్రాముఖ్యమైనది. ఎప్పుడైతే ఒక విశ్వాసి అతని/ఆమె హృదయములో ఒక కష్టములోనుండి పోవుచుండునో అతని బాధను ఇతరులకు పంచకపోయినను, దేవుని సేవకులు పరిశుద్ధాత్ముని ద్వారా దీనిని ఇప్పటికి గ్రహించుదురు. ఒకవేళ దేవుని సంఘములో కూడుకొనుచున్న ఒక సమూహమైనట్లయితే, పరిశుద్ధాత్ముడు వారి హృదయములను తాకి వారికి ఆదరణ కలిగించగలడు. పరిశుద్ధాత్ముడు లేఖనము ప్రకారముండుటకు వారికి సహాయము చేయును మరియు వారు తిరిగి కోలుకొనుటకు సహాయము చేయును.
మనము విశ్వాస జీవితములను జీవించుచున్నప్పుడు మనము నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచుదుము. మన పాపముల క్షమాపణను మనము పొందుదుము. దేవుని పిల్లలగుదుము, మరియు దీని ఋజువుగా, పరిశుద్ధాత్మను ఒక వరముగా మనము పొందుదుము. అప్పుడు, దేవుడు మనకు ఆయన సంఘమును ఇచ్చును. ఆయన మనకు సంఘమును ఇచ్చిన తరువాత, దేవుడు ఆయన సేవకులతో సంఘము ద్వారా మాట్లాడును. మరియు ఆయన సేవకులు ఆయన వర్తమానము ప్రసంగించునట్లుగా వారిని చేయును. ఆయన లేఖనములతో మన గాయములు స్వస్థపరచును. బలహీనులమైన మనకు శక్తినిచ్చును, హృదయమునందు దీనులైన వారిని దీవించును. మరియు ఆయన కార్యమును వారు జరిగించునట్లుగా వారికి సామర్థ్యము నిచ్చును. ఆయన మన ద్వారా ఆయన చిత్తమును జరిగించును. కావున, విశ్వాసులు ఎన్నడును సంఘము నుండి తాము వేరు చేసుకొనలేరు.
విశ్వాసులు ఎన్నడును ఇతర మతసంబంధమైన ప్రజలతో సంబంధమును తెంచుకొనలేరు, లేక దేవుని లేఖనములో వారి ఎదుగుదలను తెంచుకొనరు. ఖచ్చితమైన సత్యము కేవలము దేవుని సంఘములోనే కనుగొనబడును. కావున, విశ్వాసులు సంఘములో ఒకరితో ఒకరు ఏకీభవించవలెను. ఐక్యత లేని విశ్వాసము ఒక తప్పు విశ్వాసము.
పరిశుద్ధాత్ముడు నీయందు నివశించునని నీవు విశ్వసించుచున్నావా? ఎప్పుడైతే మనము లేఖనములో చెప్పబడినట్లుగా మరియు సంఘము దాని ప్రసంగములో చెప్పబడినట్లుగా, దేవుని సంఘముతో ఐక్యమగుదుమో, పరిశుద్ధాత్ముడు మనకు సహాయము చేయును మరియు మనకు దీవెనలనిచ్చుచు సత్యమునకు మన నేత్రములను తెరచును. అందువలన, అటువంటి విశ్వాసముతో సంఘములో ఐక్యమొందుము. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఆనందించును.
పరిశుద్ధాత్ముని సహాయము ద్వారా ఈ సమయము వరకు మనము జీవించియున్నాము. ఆయన సహాయముతో భవిష్యత్తులో కూడా జీవించుదుము. అందువలననే మన అన్ని పాపముల నుండి పాపక్షమాపణను పొందిన మనకు పరిశుద్ధాత్ముడు ఎంతో ప్రాముఖ్యము. పరిశుద్ధాత్ముడు ఉన్నాడని మనము తెలుసుకొని విశ్వసించవలెను. మనము పరిశుద్ధాత్మ ద్వారా జీవించవలసియున్నదని మన హృదయములలో ఆయన నడిపింపును పొందవలెనని మనము తప్పక తెలుసుకొనవలెను. ఎవరైతే తమ హృదయములో పరిశుద్ధాత్మను కలిగియున్నారో వారు ఆయన చిత్తమును వెంబడించవలెను. నీవు ఒకవేళ నీతిమంతుడవు అయితే, అప్పుడు పరిశుద్ధాత్ముడు నీయందు నివశించును, మరియు ఆ విధముగా పరిశుద్ధాత్ముడు నడిపించునట్లుగా జీవ నియమమును వెంబడించవలెను.
27వ వచనమును కలిసి చదువుకొందాం. ‘‘మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మయొక్క మనస్సు ఏదో ఏరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు’’ తండ్రియైన దేవుడు మనయందు నివశించు ఆత్మ యొక్క మనస్సును ఎరిగినవాడు. పరిశుద్ధాత్ముడు మన మనస్సులో వున్న ప్రతిదానిని ఎరుగును; కావున, తండ్రియైన దేవుడు మన మనస్సులో వున్న ప్రతిదానిని ఎరుగును. ఆ విధముగా, ‘‘ఆయన పరిశుద్ధాత్ముడు, దేవుని చిత్తప్రకారముగా పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయును.’’
దీని భావము మన తండ్రికి పరిశుద్ధాత్ముని మనస్సులో ఏమున్నదో తెలియును. మరియు పరిశుద్ధాత్ముడు తండ్రి చిత్తప్రకారముగా ప్రార్థన చేయును. విశ్వాసులు ఆ విధముగా దేవుని చిత్తప్రకారముగా జీవించుటకు పూనుకొందురు. అందువలననే వారి పాపము క్షమాపణను పొందినవారు పరిశుద్ధాత్మ ద్వారా విశ్వాస జీవితము యొక్క లాభమును పొందుదురు. నీతిమంతుల మనస్సు పరిశుద్ధాత్ముని యొక్క మేలు కొలుపుట చేత నడిపించబడును.
పరిశుద్ధాత్మను తమ హృదయములో లేనివారుండుట దేవుని సంఘములో కనుగొనబడినప్పుడు సమస్యలు లేచును. నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వసించనివారు వారి యందు పరిశుద్ధాత్మను కలిగి లేరు, అందువలన వారు పరిశుద్ధాత్మను కలిగిన నిజమైన విశ్వాసులతో వారు సంభాషించలేరు. వారు సంఘములో చాలా సమస్యను తీసుకొని వస్తారు. దీనికి విరుద్ధముగా, పరిశుద్ధాత్మతో సంఘములో ఒక పరిశుద్ధాత్మతో నింపబడిన ఒక ప్రసంగీకుని ప్రసంగమును వినునప్పుడు, వారి హృదయములు సమాధానముతో వుండును ఎందుకనగా ఆయన సేవకుని ద్వారా, దేవుడు వారికేమి చెప్పవలెనని ప్రయత్నించుచున్నాడో వారు అర్ధము చేసుకొనగలరు.
ఎవడైనను అతని/ఆమె పాపము క్షమించబడినవాడు నిశ్చయముగా అతని/ఆమె యందు నివశించు పరిశుద్ధాత్మను కలిగియున్నాడు. మనయందు మనము పరిశుద్ధాత్మను కలిగియున్నాము మరియు దేవుని చిత్తప్రకారముగా మరియు పరిశుద్ధాత్ముని నడిపింపుచేత జీవించుచున్నాము.
పరిశుద్ధాత్ముడు మనలను ఈ మార్గములో నడిపించును; కొన్నిసార్లు సంఘము ద్వారా, కొన్నిసార్లు విశ్వాసుల సహవాసము ద్వారా, మిగిలిన సమయములలో దేవుని వాక్యము ద్వారా మనము దేవుని చిత్తమును కొనుగొనునట్లుగా చేయును మరియు ఆయన నీతియుక్తమైన మార్గమును వెంబడించునట్లుగా ఆయన మనలను అనుమతించును. పరిశుద్ధాత్ముడు మనము దేవుని ప్రక్క జీవించునట్లుగా మనము ఆయన రాజ్యమును చేరునంత వరకు మనకు నూతన శక్తినిచ్చును.
కావున, నీవు మరియు నేను, మన విశ్వాస జీవితములో పరిశుద్ధాత్ముడు ఎంత ప్రాముఖ్యమో తప్పక గ్రహించవలెను. మనము నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచినప్పుడు, లేఖనములో చెప్పబడినట్లుగా, మనము పరిశుద్ధాత్మను ఒక వరముగా పొందియున్నాము. ‘‘మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు.’’ (అపో.కా. 2:38)
దేవుడు మనకు పరిశుద్ధాత్మను ఒక వరముగా ఇచ్చాడు. అందువలన ఆయన మనము ఆయన చిత్త ప్రకారముగా జీవించునట్లు నడిపించును. ఇది మన తండ్రియైన దేవుని చిత్తము. మనము ఒక క్రమములో ఆయన రాజ్యమునందు ప్రవేశించుటకు, తప్పక ఆయన చిత్త ప్రకారముగా జీవించవలెనని చెప్పుచున్నాడు. మనము దేవుని చిత్త ప్రకారముగా జీవించుటకు మనకు పరిశుద్ధాత్ముని కలిగియుండవలెను. మరియు నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వసించవలెను. అందువలన మనము పరిశుద్ధాత్మను ఒక వరముగా పొందవచ్చు మరియు దేవునిచిత్త ప్రకారముగా జీవించుదుము మరియు ఆయన రాజ్యమునందు ప్రవేశించుదుము.
మనము పరిశుద్ధాత్మను మరియు విమోచనమును వేరువేరుగా పొందము. నేడు ప్రజలకు ఈరెండు దీవెనలు వేరని తలంచుచున్నారు. వారు ఎంతో ప్రయాసపడి కొండలోనికి వెళ్లి. నూతన భాషను మాట్లాడుచు, ప్రార్థన చేసినట్లయితే పరిశుద్ధాత్ముడు వారిమీదికి దిగివచ్చునని వారు తలంచుచున్నారు. వారు పరిశుద్ధాత్ముడు వారి మీదికి దిగివచ్చి ముఖాముఖిగా వారితో మాట్లాడి వారికి ఆయన వర్తమానమును వారికిచ్చునని వారు తలంచుదురు. అయితే ఇది దురదృష్టవశాత్తు, నిజము మాత్రమే కాదు.
పరిశుద్ధాత్ముడు మరియు లేఖనము వేరుచేయబడనివి, మరియు పరిశుద్ధాత్ముడు మరియు విశ్వాసి కూడా వేరుపరచలేనివారు. ఇందువలననే పరిశుద్ధాత్మునికును విశ్వాసులకును, సంఘము మరియు త్రియేక దేవుని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మధ్యనున్న సంబంధము ఒకదానితో ఒకటి ఎంతో సన్నిహితముగా వుండును.
ఈ చివరి కాలములో జీవించుచున్న మనము పరిశుద్ధాత్ముని చేత జీవించుచున్నాము. మనము మన తండ్రియైన దేవుని చిత్తప్రకారముగా మరియు పరిశుద్ధాత్మచేత జీవించుచున్నాము. పరిశుద్ధాత్ముడు దేవుని చిత్తమంతయు ఎరుగును. మన తండ్రియైన దేవుడు పరిశుద్ధాత్ముని హృదయములో ఏమున్నదో ఎరుగును. పరిశుద్ధాత్ముడు మన ఆలోచనలను నడిపించును మరియు దేవునితో వీనిని దేవునికి చేరవేయును. ఈ విధముగా, పరిశుద్ధాత్ముడు దేవుని చిత్తముననుసరించి ప్రార్థించును, మరియు మన తండ్రి ఆయన చిత్తప్రకారముగా జీవించునట్లు చేయుట చేత మన ప్రార్థనకు జవాబిచ్చును.
అందువలననే పౌలు రోమా 8వ అధ్యాయము 16వ వచనము నుండి 27వ వచనము వరకు పరిశుద్ధాత్ముని కార్యములను గురుంచి మాట్లాడెను.
మనము పరిశుద్ధాత్మ ద్వారా దేవుని రాజ్యము కొరకు ఎదురుచూడగలము. మనము మన ప్రస్తుత శ్రమను భరించగలము మరియు మనము మన హృదయములయందు నివశించు పరిశుద్ధాత్ముని శక్తిచేత ఆయన రాజ్యము కొరకు నిరీక్షించుచు, మన ప్రభువు చిత్తానుసారముగా జీవించగలము. మనము పరిశుద్ధాత్ముని ద్వారా భరించగలము. పరిశుద్ధాత్ముని ద్వారా విధేయులము కాగలమని, పరిశుద్ధాత్ముని ద్వారా మన ప్రభువును సేవించు సామర్థ్యమును కలిగియుందుము. ఇవన్నియు మనకు పరిశుద్ధాత్ముని ద్వారా ఇవ్వబడెను. మనము పరిశుద్ధాత్మునితో నడుచు ప్రజలమని, ఎల్లప్పుడు దేవుని వాక్యమును చదువుకొను, వాక్యముతో మన హృదయమును ఐక్యపరచుచు, వినుచు వాక్యమును వెంబడించు ప్రజలమని మనము తెలుసుకొనవలెను. కేవలము మన శరీరమును సంతోషపరచు, శరీరానుసారమైన జీవితము కాదు గాని, మనము మన తండ్రియు మరియు పరిశుద్ధాత్ముడు మనయందు ఆనందించులాగున జీవించవలెను. ఈ వాక్యభాగమునందు పౌలు చెప్పునది ఇదియే.
దేవుడు మన జీవితములో మనతో ఎల్లప్పుడుండును. ఆయన మన హృదయములను భద్రపరచును. మరియు మనకు సహాయము చేయవలెనని కోరును. ప్రభువు మనలను నిత్యము దీవించును గాక. మన ప్రభువు మరలా వచ్చునప్పుడు, ప్రతీదీ మహిమకు మార్చబడును. ఇప్పుడు దేవుని నీతిని కలిగియున్న మనము, దేవుని రాజ్యమునకు చెందినదంతయు మరియు మహిమను స్వతంత్రించుకొందుము. దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనవలెనని కోరువారు జాగ్రత్తగా నీరు మరియు ఆత్మ సువార్తను విని దీనియందు విశ్వాసముంచవలెను.
హల్లెలూయ! దేవుని నీతి నీతో వుండి నిన్ను దీవించునట్లుగా నేను ప్రార్థించుచున్నాను.