• All e-books and audiobooks on The New Life Mission website are free
  • Explore multilingual sermons in global languages
  • Two new revised editions in English have been released
  • Check out our website translated into 27 languages
Search

Sermons

అంశం 9: రోమీయులకు ( రోమా పత్రిక పుస్తకం పై నున్న వ్యాఖ్యానం)

[అధ్యాయము 8-7] ప్రభువు రెండవ రాకడ మరియు వెయ్యి సంవత్సరముల రాజ్యము (రోమా 8:18-25)

(రోమా 8:18-25)
‘‘మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమ యెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి, నాశనమునకు లోనయిన దాస్యములోనుండి విడిపించబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్య్రము పొందునను నిరీక్షణకలదై, స్వేచ్ఛగా కాక దానిని లోపరచినివాని మూలముగా వ్యర్ధపరచబడెను. సృష్టియావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదనపడుచున్నదని యెరుగుదుము. అంతేకాదు, ఆత్మయొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఏలయనగా మనము నిరీక్షణకలిగినవారమై రక్షించబడితిమి. నిరీక్షింపబడునది కనబడునప్పుడు, నిరీక్షణతో పనియుండదు, తాను చూచుచున్న దానికొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించినయెడల ఓపికతో దానికొరకు కనిపెట్టుదుము.’’
 

దేవుని నీతిని విశ్వసించుటచేత నీతిమంతులైనవారు పరలోక మహిమను పొందియున్నారు. ఇందువలననే ప్రజలందరు పరలోక మహిమను ధరింపజేయుటకు, యేసు యొక్క నీరు మరియు ఆత్మ సువార్తతో వారు శ్రమపడుచున్నారు. విశ్వాసులు వారికైవారు దేవునినీతి సువార్తకు సమర్పించుకొని భూమిమీద శ్రమపడుదురు ఎందుకనగా క్రీస్తు శ్రమలో పాలుపంచుకొనుట అనునది మహిమకరమైనది మరియు నీతియుక్తమైనది.
మనము ఎవరిపట్ల లోతైన గౌరవమును భక్తిని కలిగియుందుమో, ఆ దేవుని కొరకు శ్రమననుభవించడము మనకు గౌరవప్రదమైనది కాదా? ఇది నిశ్చయముగా గౌరవ ప్రదమైనది. ఇది మహిమకరమైన శ్రమ. ఇందువలననే దేవునినీతియందు విశ్వసించువారు ఆయన నీతికొరకు శ్రమనను భవించుదురు. ఎవరి కొరకు నీవిప్పుడు శ్రమననుభవించుచున్నావు? నీవు ప్రపంచము కొరకు నీ శరీరము కొరకు శ్రమననుభవించుచున్నావా? ప్రపంచము కొరకు నీవు శ్రమననుభవించినట్లయితే నీ ఆత్మకు లభించు మంచి ఏమిటి? దేవునినీతి కొరకు శ్రమనొందుము మరియు దీనియందు విశ్వాసముంచుము. అప్పుడు దేవుని మహిమ నీపైన వుండును.
 

భవిష్యత్తులో మనము పొందబోవు దీవెనలతో మన వారసత్వము

మనము పొందబోవు వారసత్వమును గురించి మనము ఆలోచన చేద్ధాము. పరలోకమందు మనము పొందబోవు వారసత్వము అనునది క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో మనము యేసుతో పరిపాలనచేయుట. వెయ్యి సంవత్సరముల రాజ్యము మరియు శాశ్వత రాజ్యములో మనము పొందబోవు మహిమ అనునది కొలవలేనంత గొప్పది. కేవలము తిరిగి జన్మించిన విశ్వాసులు తమకు తాము వారికొరకు ఎదురుచూచుచున్న మహిమను తెలుసుకొనగలరు మరియు పొందగలరు.
 
 
పోల్చుటకు సాటిలేని మహిమ

‘‘మన యెడల ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవికావని యెంచుచున్నాము.’’ (రోమా 8:18)
విశ్వాసులు పొందబోవు మహిమను ఇప్పటికాల శ్రమలతో పోల్చినప్పుడు, పౌలు చెప్పుచున్నాడు వారి మహిమ ప్రస్తుత శ్రమలకు ఎంతో మించినది. ఇది పూర్తిగా సత్యము; మన కొరకు ఎదురు చూచుచున్న మహిమ అనునది అత్యున్నతముగా ప్రస్తుతము మనమనుభవించుచున్న శ్రమ కంటే అత్యంత నిశ్చయముగా ఎంతో గొప్పది.
 
 
సృష్టి కొరకు ఆశగ తేరిచూచుట

‘‘దేవుని కుమారులు ప్రత్యక్షత కొరకు సృష్టి తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపించబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్య్రము పొందునను నిరీక్షణకలదై, స్వేచ్ఛగా కాక దానిని లోపరచినవాని మూలముగా వ్యర్ధపరచబడెను.’’(రోమా 8:19-21)
దేవుని సృష్టియంతయు పాప శాపము నుండి విడుదల పొందవలసియున్నది. ఇది విడుదల పొందుటకు, దేవుని రాజ్యము భూమిమీద తప్పక స్థిరపరచబడవలెను. ఈ సృష్టి కూడా దేవుని కుమారులు వెయ్యి సంవత్సరముల రాజ్యము యజమానులుగా మారుటకు వారి ప్రత్యక్షత కొరకు ఎదురుచూచును. ఈ విధముగా సృష్టియంతయు రానైయున్న దేవుని రాజ్యములో ఎప్పుడు దేవుని కుమారులు దేవుని మహిమను ధరించుకొని ఆయనతో పాలించుదురో అని ఎదురుచూచును.
 
 
మన దేహముల విమోచనము కొరకు ఎదురుచూచుట

‘‘సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదన పడుచున్నదని యెరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడ దత్త పుత్రత్వము కొరకు, అనగా మన దేహముయొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఏలయనగా మనము నిరీక్షింపబడునది కనబడునప్పుడు నిరీక్షణతో పనియుండదు. తాను చూచుచున్న దానికొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడనిదాని కొరకు నిరీక్షించిన యెడల ఓపికతో దానికొరకు కనిపెట్టుదుము.’’ (రోమా8:22-35)
దేవుని నీతి సువార్తయందు విశ్వాసముంచినవారు వారి పాపముల నుండి రక్షించబడియున్నారు. వారు దేవుని రాజ్యముకొరకు ఎదురుచూచెదరు. వారి శ్రమలన్నిటి ద్వారా ఓపికతో, ఆ దినము ఎప్పుడు వచ్చునా అని ఎదురుచూచుదురు. వారి సువార్తకొరకు శ్రమపడుదురు మరియు వారి శ్రమల ద్వారా, దేవుని రాజ్యము కొరకైన వారి నిరీక్షణ ఇంకా పెరుగుతుంది. ఇది కేవలము వారికి స్వభావసిద్ధమైనది. శరీర నేత్రముల ద్వారా వారు చూచుచున్నదాని కొరకు వారు ఎదరుచూడరు. అయితే దీనికి బదులుగా, వారికి కనబడని దేవుని రాజ్యము కొరకు మరియు వారి స్వంత రూపాంతరము కొరకు ఎదురు చూచుదురు.
ప్రజలు మరియు ప్రస్తుతము మనము జీవించు ఈ లోకమందున్న అన్ని విషయములు అనునవి ఒక వర్ణనాతీతముగా ఆవిరైపోవు జీవితము. కాలము గడిచిపోవుచుండగా, ప్రపంచము మారును, సాంకేతిక విజ్ఞానము మరియు నాగరికత పెరుగుచుండగా, భవిష్యత్తు కొరకు ప్రజల నిరీక్షణ వారి హృదయములలో పెరుగుచుండును. వారు భవిష్యత్తులో భూమిమీద ఒక స్వర్గమును చూడాలనుకుంటారు అయితే అప్పటికి వారు ఆందోళనతో, అసహనముగా, నిర్మానుష్యముగా, మారుచు ఈ అభివృద్ధికి వేరుగా దీని అంతటిలో ఇంత జాప్యము ఎందుకు జరుగుతుంది అని చింతించుదురు. కంప్యూటర్స్, ఆటోమోబైల్స్‌ మరియు ఇతర సాంకేతిక మరియు శాస్త్రీయ ముందడగు వేయుట కొనసాగుచుండును అయినప్పటికి ప్రజల నవ్వును వినుట చాలా చాలా కష్టముగా మారును.
మానవజాతి భవిష్యత్తు కొరకు ఏమైనా నిరీక్షణ వున్నదా? దీనికి జవాబు దురదృష్టకరముగా లేదు అనియే. ప్రకటన గ్రంథ వాక్యముల ప్రకారము, శాస్త్రజ్ఞులు ఉద్దేశ్యము ప్రకారము, నీటి కొరతతో మనకు కరువు కాటకములు ఎదురుచూచుచున్నవి. ఓజోను పొర నశించుచున్నది. కరువు మరియు అరణ్యము నశించుట అనేకమంది దాహముతోను వేడితోను చనిపోవుటకు దారితీయును. ఈ వినాశనమంతయు మన కొరకు ఎదురు చూచుచున్నదని నీ హృదయములో అనుభూతిని పొందుచున్నావా?
మనము ఆహ్లాదకరమైన ప్రపంచములో జీవించుచున్నామా? కొన్ని విధాలుగా ఇది ఆహ్లాదముగా అనిపించవచ్చు. డబ్బుతో కొనలేనిది ఇక్కడ ఏమున్నది? అయితే మనకు స్వచ్ఛమైన నీరు ఒక ఆరోగ్యకరమైన పరిసరములు అవసరము. అయినప్పటికి మరణాంతకమైన కిరణము వాతావరణములోనికి చొచ్చుకొనిపోవుటకు అనుమతించుట ద్వారా, ఓజోను పొర నాశనము చెందుచున్నప్పుడు, ఆల్ట్రావైలేట్‌ కిరణము ఎక్కువగా మారిపోవుటకు మరియు ప్రజల గుండె కఠినపరచబడుటకు కారణమౌతుంది. ప్రజలు ఎంతో ఆందోళన చెందుదురు. ‘‘ఈ లోకమునకు ఏమి సంభవించబోవుచున్నది’’ అయితే ఈ లోక ప్రజలకు వేరుగా, తిరిగి జన్మించిన విశ్వాసులమైన మనము, మొదటి పునరుత్థానములో పాలు పంచుకొందుము. మరియు యేసుతో కలసి వెయ్యి సంత్సరములు పాలన చేయుదుము అను విశ్వాసమును కలిగియుంటాము.
బైబిల్‌ మనకు చెప్పుచున్నది ప్రభువు తనకు తానే మరలా గొప్ప శబ్ధముతో, గొప్ప ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్ధముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి దిగివచ్చునని చెప్పుచున్నది. (1 థెస్స 4:16) ప్రశ్న ఏమిటంటే ‘‘ఎప్పుడు’’ ఆయన వస్తాడు అనునది. నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచు విశ్వాసులను తీసుకొనిపోవుటకు వచ్చునని మన ప్రభువు మనకు వాగ్ధానము చేసెను, అందువలన మనము ఆ దినము కొరకు ఎదురు చూచుచున్నాము.
తిరిగి జన్మించినవారు ఈ సువార్తయందు విశ్వాసముంచుదురు. ‘‘ఆయన బాప్తిస్మము తీసుకున్నప్పుడు నా పాపము ఆయనపైన మోపబడెను, నా స్థానములో, నా పాపము కొరకు తీర్పు తీర్చబడిన ఆయనను నా రక్షకునిగా అంగీకరించుచున్నాను.’’ దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ అనుగ్రహించెను. ఆయన ప్రజలను పునరుత్థానులుగా చేయుటకు మరియు ఆయనతో ఒక వెయ్యి సంవత్సరములు భూమిమీద పాలన చేయుటకు ఆయన మరలా వచ్చుచున్నాడు. బైబిల్‌ అనునది చదువుచున్నవారికి సరిగా ఒకదానితో ఒకటి జతచేయబడుటకు ఒక ఫజిల్‌ బొమ్మ వంటిది.
మొదటిసారి యేసు వచ్చినప్పుడు, ఆయన పాపులను పశ్చాత్తాపపడుటకు పిలుచుటకు వచ్చెను. ఆయన బాప్తిస్మము ద్వారా వారి పాపములకు ఆయన దేహముపై భరించెను మరియు సిలువపైన ఆయన చిందించిన రక్తము ద్వారా వాటి కొరకు తీర్పు పొందెను. ఇప్పుడు పరలోకమందు ఆసీనుడైన ప్రభువు తిరిగి వచ్చునప్పుడు, ఆయనతో కూడా ఒక వెయ్యి సంవత్సరముల పరిపాలన చేయుటకు దేవుని నీతియందు విశ్వాసముంచు వారిని ఆయన పునరుత్థానులుగా చేయును.
 

వెయ్యి సంవత్సరముల రాజ్యము

ఈ లోకములో, నిజముగా ఇతరులను ప్రేమించువారు దేవుని కుమారులు. వారు మాత్రమే దేవుని నీతి సువార్తను నాశనమైన ఆత్మలను క్రీస్తు కొరకు జయించుటకు ప్రకటించువారు. ఈ లోక ప్రజలు దేవుని కుమారులకు కిరీటముని ఇస్తారా? లేదు. అప్పుడు ఎవరు ఇస్తారు? యేసు తిరిగి వచ్చినప్పుడు, తిరిగి జన్మించిన వారిని పునరుత్థానులుగా చేసి వారు ఒక వెయ్యి సంవత్సరములు ఆయనతో పాలించుటకు అనుమతించుట ద్వారా ఆయన వారికి బహుమానము నిచ్చును.
వెయ్యి సంవత్సరముల రాజ్యము తిరిగి జన్మించిన విశ్వాసులమైన మన కొరకు. ప్రస్తుత ప్రపంచము ఒక ఎడారిలా మారుచున్నప్పటికి, మన ప్రభువు తిరిగి వచ్చినప్పుడు ఒక నూతన ప్రపంచములో జీవిస్తాము. అక్కడ, ప్రభువు మనము ఆయనతోపాటు పాలించుటకు మరియు మనము కోరినంతకాలము ఆనందకరమైన జీవితమును జీవించుటకు అనుమతించును.
రోమా 8:23లో పౌలు చెప్పుచున్నాడు. ‘‘అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్త పుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ‘‘నీవు ఆ దినము కొరకు ఎదురుచూచుచున్నావా? ఆత్మ యొక్క ప్రథమ ఫలములైన మనము కూడా, మన దేహము విమోచనము కొరకు ఆశతో తేరిచూచుచు, మనలో మనము మూలుగుచున్నాము. ఆయన మనలను అనుమతించునని దేవుడు చెప్పెను. నీతిమంతులుగా తిరిగి జన్మించిన, మనము లోకము ఈ రీతిగా వుండునని తెలుసుకోవాలి.
జ్యోతిష్కులు భవిష్యత్తును గురించి చెప్పే జ్యోతిష్యమునందు ఏమీ వుండదు. తిరిగి జన్మించిన విశ్వాసులు భవిష్యత్తులో ఏమి జరగబోవుచున్నదో వారికి బాగుగా తెలుసు. మనము ముందుగా చెప్పినట్లుగా ప్రపంచము మార్పు చెందబోయినను, ఇప్పుడు మనలను ఎవ్వడు నమ్మడు. అయితే వ్రాయబడిన దేవుని వాక్యమునందు విశ్వాసముంచువాడు ఎటువంటి అతిశయము లేకుండా కేవలము ఎదురు చూచును. చివరికి దేవుని వాక్యమును గుర్తించని మిగిలిన ప్రజలు కూడా అయిష్టతతో దానిని గుర్తించినా, వారు నిరీక్షణతో జీవించుదురు.
కావున, విశ్వాసముంచనివారు, వారిజీవితము ముగియక మునుపే తప్పక రక్షణను పొందవలెను. యేసు ఆయన బాప్తిస్మముతో వారి పాపములు ఆయనపైకి తీసుకొనిపోయెనని మన స్థానములో సిలువపై తీర్పు పొందాడని వారు విశ్వసించవలెను. అప్పుడు మాత్రమే చివరి దినము వచ్చునప్పుడు వారు దేవుని రాజ్యములో ప్రవేశించగలరు. అప్పుడు మనము మన ప్రతిఫలమును పొందుదుము. శాశ్వత జీవమును పొందుటకు ఆయన రాజ్యములో మనము ప్రవేశించుదుము.
నీవు విచారముగా వున్నావా? నీవు విసుగుచెందియున్నావా? లేక, నీవు నీ జీవితముతో తృప్తిపరచబడియున్నావా? మనమిప్పుడు స్పష్టముగా యేసు మనకు ఏ విధముగా రక్షకుడయ్యాడో మనము మరణించక మునుపే తెలుసుకొనవలయును. మనము తప్పక పరలోకరాజ్యములో మన జీవితమును సిద్ధపరచుకొనవలెను. ఈ లోకమే అంతా కాదు; ఈ సత్యమును తెలుసుకొనుటచేత మనము పరలోక రాజ్యములో నివశించుటకు సిద్దపడవలెను. జ్ఞానముగలవారు చేయునది ఇదియే. నీవు దిన దినము సంతోషముగా జీవించుచున్నావా? ఆ విధముగా అయితే, నీవు ఒక అవివేకివి. బాగా వుండాలని కోరుకొనువారు అదేమనగా ఒక పరలోక జీవితము. దానిలో ప్రవేశించుట చేత వారి కలను నిజము చేసుకొనుటకు సిద్ధపరచుకొంటారు. మరియొక మాటలో వారు నిజముగా బండమీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతులు వీరు.
 
 
వెయ్యి సంవత్సరముల రాజ్యములో

దేవుడు మనలను ఆయన స్వరూపమందు చేసి మనము ఆయనతో నిత్యము జీవించవలెనని కోరెను. అందువలననే ప్రభువు ఈ లోకమునకు వచ్చెను. ఆయన బాప్తిస్మమును తీసుకొనెను. మనను మన అన్ని పాపముల నుండి విమోచించుటకు ఆయన రక్తమును చిందించాడు. దేవుని నీతియందు విశ్వాసముంచువారు ప్రభువుతో జీవించుదురు. ప్రభువు వారికి దీనికొరకు బహుమానమిచ్చును. మన ప్రభువు మన కన్నుల నుండి కన్నీళ్ళను తుడిచివేయును మనము శ్రమపడిన మన కష్టములన్నిటిని బట్టి మరియు ఒంటరితనమును బట్టి మనకు ప్రతిఫలము నిచ్చును.
దేవుడు అన్నింటిని క్రొత్తవిగా చేయును. ఆయన ఎక్కడ ఒక బాలుడు విషసర్పమును చేతితో పట్టుకొనినను కాటువేయని ఒక నూతన ప్రపంచము వచ్చుటకు ఆయన అనుమతించును. (యెషయా 11:8) దీనిని విశ్వసించి మనము చూడనిదాని కొరకు ఆశతో ఎదురుచూచుచు, ఆ దినము కొరకు ఓపికతో ఎదురుచూడవలెను. మనము చూచుచున్నదాని కొరకు ఎదురుచూచుచు, దేవుని వాక్యమునందు విశ్వసించినయెడల, అప్పుడు మనము జ్ఞానులము. మన రక్షణ తరువాత, ప్రస్తుతము మన నేత్రములతో చూడకపోయినను, నిశ్చయముగా రానైయున్న, ఆ మహిమ కొరకు మనము ఎదురు చూచుదుము.
దేవుడు మనకన్నా ఎక్కువగా మూలుగును అయితే ఇప్పటికి ఎదురుచూచువారిగా మనలను చేయును. మనము ఆశతో మన దేశము ఆత్మీయ దేహాలుగా మార్పుచెందుటకు మరియు మన సమయము వచ్చినప్పుడు పాలించుటకు ఎదురుచూచుచున్నాము. మనయందు నివశించు పరిశుద్ధాత్ముడు మనకేమి చెప్పుచున్నాడు? మనము దేనికొరకు ఎదురుచూచులాగున చేయుచున్నాడు? ఆయన మనలను వేయి సంవత్సరముల రాజ్యము కొరకు ఎదురుచూచునట్లుగా చేయును. మన దేహము నూతన పరచుటకు మరియు మనతో జీవించుటకు మన ప్రభువు ఎదురుచూచుచున్నాడు. మనము కూడా దేవునితో కలసి ఒక వెయ్యి సంవత్సరములు పాలించుటకు ఎదురుచూచుచున్నాము.
హల్లెలూయ! మన ప్రభువుకు మనము వందనములు చెల్లించుచున్నాము.
క్రైస్తవులు పరలోకమునకు వారి నిరీక్షణతో జీవించుచు వారి నీరిక్షణలో నిశ్చయతను కలిగియున్నారు. ఈ నిశ్చయత మన ఉద్రేక అనుభూతుల మీద ఆధారపడియుండదు గాని, అబద్ధమాడని దేవుని వాక్యముమీద ఆధారపడియుండును.