అంశం 9: రోమీయులకు ( రోమా పత్రిక పుస్తకం పై నున్న వ్యాఖ్యానం)
[అధ్యాయము 8-8] నీతిమంతులకు సహాయము చేయు పరిశుద్ధాత్ముడు (రోమా 8:26-28)
(రోమా 8:26-28)
‘‘అటువలె ఆత్మీయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింపశక్యముగాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును; ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుని ప్రేమించువారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినవారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.’’
దేవుని నీతియందు విశ్వాసముంచువారి హృదయములలో పరిశుద్ధాత్ముడు వున్నాడు. పరిశుద్ధాత్ముడు వారిని ప్రార్థించునట్లుగా చేయును మరియు వారు ఆ విధముగా చేయుటకు సహాయము చేయును. ఆయన ఉచ్ఛరింపశక్యముగాని మూలుగులతో వారి పక్షమున విజ్ఞాపనము కూడా చేయును. దీని భావమేమనగా పరిశుద్ధాత్ముడు దేవుని చిత్తానుసారముగా ప్రార్థించునట్లు సహాయము చేయును. అందువలననే దేవుని నీతియందు విశ్వాసముంచువారు దేవుని పిల్లలమని పిలువబడుచున్నారు. ప్రభువు ఎల్లప్పుడూ కాలము అంతము వరకు ఎల్లప్పుడూ వారితో వుండునని ప్రమాణము చేయును.
నీతిమంతునియందున్న పరిశుద్ధాత్ముడు, దేవుని చిత్త ప్రకారముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. నీవు పరిశుద్ధాత్మను పొందగలవు అను విషయములో నీవు ఏ విధముగా తలంచుచున్నావు? ప్రార్థించుట ద్వారానా? నీవు పాపము కలిగియున్నను పరిశుద్ధాత్మను పొందగలవని నీవు తలంచుచున్నావా? దేవుని నీతి యందు విశ్వాసముంచువారి హృదయములో మాత్రమే పరిశుద్ధాత్ముడు నివశించును మరియు పనిచేయును.
దేవుని చిత్త ప్రకారముగా ప్రార్థన చేయవలెనని కోరు క్రైస్తవులు పరిశుద్ధాత్ముని సహాయమును పొందుదురు. దేని కొరకు వారు ప్రార్థన చేయవలెనో వారు నేర్చుకొందురు మరియు అర్ధము చేసుకొందురు. దేవుని నీతియందు విశ్వాసముంచుటచేత నీవు పరిశుద్ధాత్మను పొందినట్లయితే, పరిశుద్ధాత్ముడు నీ కొరకు విజ్ఞాపనము చేయును మరియు నీ మార్గమందు నిన్ను విడిపించును.
మంచివారికి సమస్తమును సమకూడి జరుగును
‘‘దేవుని ప్రేమించువారికి అనగా, ఆయన సంకల్పము చొప్పున పిలువబడినవారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము’’ (రోమా 8:28)
విశ్వాసుల పక్షమున దేవుడున్నాడు, దేవుని ప్రేమించువారికి సమస్తమును సమకూడి జరుగుటకు ఆయన కారకుడగును. దేవుడు తిరిగి జన్మించిన విశ్వాసులను ప్రేమించును. కొన్నిసార్లు మన క్షేమము కొరకు మన శత్రువును ఆయన ఉపయోగించును. అయితే చివరికి, వారి పాపములను బట్టి ఆయన వారిని శిక్షించును. ఆ విధముగా విశ్వాసులకు అనుమతించు మంచి మాత్రము వలెనే మన ప్రతి శత్రువు ఆయన నిత్యముందు శిక్షలోనికి అదృశ్యమగును.