• All e-books and audiobooks on The New Life Mission website are free
  • Explore multilingual sermons in global languages
  • Two new revised editions in English have been released
  • Check out our website translated into 27 languages
Search

Sermons

అంశం 9: రోమీయులకు ( రోమా పత్రిక పుస్తకం పై నున్న వ్యాఖ్యానం)

[అధ్యాయము 8-9] మేలు కలుగుటకు సమస్తమును సమకూడి జరుగును (రోమా 8:28-30)

(రోమా 8:28-30)
‘‘దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినవారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులగా తీర్చెనో వారిని మహిమపరచెను.’’
 

ఈ దినమున, రోమా 8వ అధ్యాయములో వున్న వాక్యభాగమును గమనించుటకు మనము ఇష్టపడుచున్నాము. ఇది దేవుడు ముందుగా ఏర్పరచుకొనెను, పిలచెను, దేవుని కుమారుడైన, యేసుక్రీస్తునందున్న వారిని మహిమ పరచెను అని చెప్పుచున్నది. మనము దీనిని గురించి మాట్లాడుకుందాము. మరియు ప్రజలు ఏ విధముగా క్రమ క్రమముగా శుద్ధీకరించు సిద్ధాంతమును అర్ధము చేసుకొనవలెనని ఇష్టపడుదురో దానిని గురించి మాట్లాడుకుందాము.
రోమా 8:28 చెప్పుచున్నది. ‘‘దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినవారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.’’ మనము దేవుని ప్రేమించువారు ఎవరు? అని ఆలోచించవలెను.
మేలు కలుగుటకు సమస్తమును నిజముగా సమకూడి జరుగునా? ఆ విధముగా దేవుడు చెప్పెను. ఆది యందు, దేవుడు ప్రజలను సృజించక మునుపు, ఆయన ఉద్దేశ్యము ప్రకారము ఆయన కుమారులుగా మనలను చేయుటకు, ఆయన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తునందు మేలు కలుగుటకు చేసెను.
ఏదేను తోటలో మంచి చెడుల వివేకమునిచ్చు చెట్టు వున్నదని మనము గు ర్తుంచుకొనవలెను. దేవుడు ఎందుకు ఈ చెట్టును నాటెను? దేవుడు ఈ మంచి చెడు వివేకమునిచ్చు చెట్టును మొదటి స్థానములో నాటకున్నట్లయితే అది బాగుండేది. చాలామంది ప్రజలు ఈ విషయములో చాలా ఆసక్తిని కలిగియున్నారు.
అయితే ఇక్కడ దేవుని సమృద్ధి ప్రణాళిక ఉద్దేశ్యము వున్నాయి. దేవుడు తన స్వరూపమందు ప్రజలను చేయుటకు వారిని సృజించాడు. వాస్తవమునకు, మనము దేవుని నీతిని పొందనంతవరకు మానవజాతి మిగిలిన సృష్టికన్నా భిన్నమైనది కాదు.
 

దేవుడు ఎందుకు మంచి చెడుల వివేకమునిచ్చు చెట్టును మొలిపించెను?

అందువలననే మనము మంచి చెడుల వివేకమునిచ్చు చెట్టు ఫలము ఆదాము అవ్వలు తినవద్దని దేవుడు ఎందుకు ఆజ్ఞాపించెనో తప్పక తెలుసుకొనవలెను. కారణమేమై యుండును? ఇది దేవుని ధర్మశాస్త్రము క్రింద మానవులను పెట్టుటకు మరియు మనలను యేసుక్రీస్తు ద్వారా విమోచించుటచేత మనను ఆయన పిల్లలుగా చేయుటకు. దేవునినీతియంతయు వాక్యమునందు దాయబడినది. ‘‘దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినవారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము’’ (రోమా8:28) యేసుక్రీస్తుచేత ఇవ్వబడిన నీరు మరియు ఆత్మ సువార్తయందు ఈ ప్రశ్నకు మనము జవాబును కనుగొనవలెను.
దీనిని చేయుటకు, మొదట మనము దేవుని సువార్తను గుర్తించవలెను. అప్పుడు మనము దేవుని ప్రణాళికయంతటిని మరియు అది చేయునదంతా మేలు అని ఎరుగుదుము. అయితే ఈ సత్యమును అర్థము చేసుకొనుటకు నీరు మరియు ఆత్మ సువార్తయందున్న విశ్వాసము ద్వారా మనము తప్పక తిరిగి జన్మించవలెను. దేవుడు మనకిచ్చిన సువార్తయందు ఈ జవాబు కొరకు మనము వెదకవలెను.
దేవుడు మనలను సృజించిన కారణము, ఏదేను తోటలో మంచిచెడుల వివేకమునిచ్చు వృక్షమును మొలిపించుటకు, దీని ఫలమును ఆదాము అవ్వలు తినుటకు అనుమతించుట, మనము ధర్మశాస్త్రము తెలుసుకొనునట్లు చేయుట, ఇవన్నీ మనలను ఆయన కుమారులుగా చేయుటకు. మనలనందరిని విడిపించిన, మన ప్రభువు, మనకు పాపము క్షమాపణను, శాశ్వత జీవమును పరలోక మహిమను ఇచ్చుటకు అవన్నియు సంభవించునట్లుగా అనుమతించెను. దేవుడు మనిషిని మట్టి నుండి చేసెను. మరియు మానవజాతి బలహీనముగా జన్మించునట్లు చేసెను. బైబిల్‌ మనలను తరచుగా మట్టి పాత్రతో పోల్చును. కుమ్మరియైన దేవుడు, మనిషిని మట్టి నుండి నిర్మించెను. ఆయన మనిషిని మట్టి నుండి చేసి అతనిలోనికి నీరు మరియు ఆత్మ ప్రేమను ఊదెను. మనలను ఆయన స్వంత కుమారులుగా చేయుటకు దేవుడు మనకు నీరు మరియు ఆత్మ సత్యమును ఇచ్చెను.
మంటితో చేసిన కుండ తేలికగా పగులును. ఈ విధముగా ఒక క్రమములో మనిషిని ఆయన కుమారునిగా చేయుటకు దేవుడు మొదట మనిషి దేహమును మరియు ఆత్మను బలహీనముగా సృజించెను. మానవజాతి పాపములన్నింటిని కడిగివేసి, వారిని దేవుని పవిత్రతను ధరింపజేసి, నీరు మరియు ఆత్మ సువార్తచేత తిరిగి జన్మించువారిగా వారిని చేయుటచేత వారికి శాశ్వత జీవమునిచ్చుటకు, యేసుచేత ఆయన ఉద్దేశ్యము నెరవేర్చబడెను. అందువలననే ఆదియందు మనలను లోపములేని వారిగా కాక, అసంపూర్ణులుగా మరియు బలహీనులుగాను చేసెను.
 

దేవుడు మనిషిని ఆదియందు ఎందుకు బలహీనముగా సృజించెను?

దేవుడు ఎందుకు ఏదేను వనమునందు మంచిచెడు వివేకమునిచ్చు చెట్టును మొలిపించెను మరియు దీని ఫలమును తినవద్దని ఎందుకు ఆదాము అవ్వలకు ఆజ్ఞాపించెను? దీని వెనుక కారణమును తప్పక అర్ధము చేసుకొని నీరు మరియు ఆత్మ సువార్తలో వున్న దానిని అర్ధము చేసుకొనవలెను. ఆదాము అవ్వలు పాపములో పడినప్పుడు, స్త్రీ సంతానము సర్పము తలను చితకకొట్టునని మరియు సర్పము స్త్రీ సంతానము మడిమెను కరచునని దేవుడు ఎందుకు చెప్పెను? ఈ సంగతులన్నియు ప్రజలను ఆయన పిల్లలుగా చేయుటకు సంభవించెను. ఇది ఆయన అద్వితీయ కుమారుడైన, యేసుక్రీస్తునందు ఆయన మనకొరకు సిద్ధపరచిన ప్రణాళిక.
అప్పుడు, దేవుని సంకల్పము ప్రకారము ‘‘పిలువబడినవారు’’ ఎవరు? వారు ఎవరనగా తమ పాపములను, దోషములను గుర్తించి, దేవుని ప్రేమను మరియు కరుణను వెదకువారు. షరతులు లేకుండా ఎన్నిక చేయుట మరియు క్రమక్రమముగా శుద్ధీకరించబడుట అను వేదాంత సిద్ధాంతములన్నియు తప్పు. షరతులు లేకుండా ఎన్నిక చేయుట అను సిద్ధాంతము తప్పు ఎందుకనగా కొంతమందిని షరతులు లేకుండా ఎన్నుకొని మరికొంతమందిని ఏ కారణము లేకుండా విడిచిపెట్టేటువంటి దేవుడు కాడు మన దేవుడు.
దీనికి బదులుగా, ఎవరు తమ పాపములను తెలుసుకొని వారు నరకమునకు వెళ్ళుట తప్ప మరొక అవకాశము లేదని ఒప్పుకుందురో ఎవరిమీద దేవుని కృప ఉండునో మరియు ఆయన ఎవరిని నీరు మరియు ఆత్మ సువార్త చేత పిలుచునో, దేవుడు వారిని ఎన్నిక చేసుకొనును మరియు వారిని పిలుచును.
ఈ లోకములోని జన్మించిన అనేకులలో, ఎటువంటి కారణము లేకుండా ఏ ఒక్కడు కూడా దేవుని యొద్దకు తిరిగి చేరలేదు. నీవు దేవునికి విరోధముగా నిలబడుదువు. ఎటువంటి కారణము లేకుండా దేవుడు నిన్ను ఎంచుకొనినట్లయితే, నీవు దేవునికి విరోధముగా నిలబడుదువు. ఎటువంటి కారణము లేకుండా నిన్ను దేవుడు సాతాను బిడ్డగా చేసాడనునది సిగ్గు కలిగించు విషయం. దేవుడు చేసినది ఇది కాదు.
నీవు దేవుని చేత ఎన్నికచేయబడనట్లయితే, ఇది నిన్ను బట్టే, నీవు నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచకపోవుటను బట్టి దేవునిచేత ఇవ్వబడిన నీరు మరియు ఆత్మ సువార్తయందు నీవు విశ్వాసముంచకపోయినట్లయితే, అప్పుడు దేవుడు నిన్ను వదలివేయును. ఏలయనగా ప్రభువు చెప్పెను. ‘‘అయితే నేను పాపులను పిలువ వచ్చితినిగాని నీతిమంతులను పిలువ రాలేదు.’’ (మత్తయి 9:13) వేదాంత పండితులు దురదృష్టవశాత్తు చేసినదేమిటంటే, మన దేవునిని ఎవని మాట వినకుండా ఏ ఆలోచనా లేకుండా తీర్పు తీర్చు దేవునిగా మార్చారు.
 
 
దేవుని చిత్తము ప్రకారము పిలువబడిన వారు ఎవరు?

దేవునిచేత పిలువబడినవారు నరకమునకు నిర్దేశించబడిన పాపులు. వారు దేవుని వద్దకువచ్చి వారు బలహీనులు మరియు చనిపోవునంతవరకు పాపము చేయుటతప్ప మరొక అవకాశము లేనందున వారు నరకమునకు వెళ్ళ తగినవారని ఒప్పుకుందురు. దేవుడు పాపులను పిలచెను మరియు నీరు మరియు ఆత్మ సువార్తచేత వారి పాపములను పవిత్రపరచెను. నరకమునకు పంపుట తప్ప మరియొక అవకాశములేని వారిని దేవుడు పిలచెను వారిని నీరు మరియు ఆత్మ సువార్తచేత వారి పాపముల నుండి విడిపించెను.
దేవుడు మంచివారిని మరియు ధర్మశాస్త్రమునకు విధేయులైనవారిని పిలుచుటకు రాలేదు. దేవుడు వాస్తవముగా ఆయన చిత్తప్రకారము జీవించుటకు ప్రయత్నించువారిని పిలచును. అయితే వారు దేవునియందు విశ్వాసముంచి దేవుని మీద ఆధారపడినను, వారి బలహీనత వారిని పాపము చేయుటకు బలవంతము చేయునని ఆయన గుర్తించును. దేవుని సంకల్పము అనునది బలహీనులను, అల్పులను, మరియు చేవలేని వారిని నీతిమంతులుగా చేయుట. ఆయన కుమారులుగా చేయుట. ఆయన చిత్తప్రకారము ఆయన పిలుపు ఇది. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరుగును.
మనము తప్పక దేవుని పిలుపుయందు విశ్వాసముంచవలెను. మనము ఎటువంటి కారణము లేకుండా యేసునందు విశ్వాసముంచుచున్నామని మనము చెప్పకూడదు. సరియైన విశ్వాసమనునది దేవుని సంకల్పము ప్రకారము ప్రభువునందు విశ్వాసముంచుట, అంతేగాని నీ స్వంత సంకల్పము ప్రకారము కాదు. దీని భావమేమనగా దేవుడు మన బలహీనతలను బాగుగా ఎరిగియున్నాడని, ఆయన మన పాపములన్నిటి ఒక్కసారే తీసుకొనిపోయాడని, ఆ విధముగా ఆయన మనలను పాపములేని వారిగా చేసాడని విశ్వసించుట. మన విశ్వాసమును దేవుని సంకల్పము మీద పెట్టుటచేత, మనము ఆయన పిల్లలము కాగలము. మనము ఆయన సంకల్పమును ఎరిగి స్వీకరించినప్పుడు మనలను ఆయన పాపములేని పిల్లలుగా చేయుట దేవుని చిత్తము ` దేవుడు నిజముగా ప్రేమించి, పిలచిన ప్రజలు వీరు.
 

దేవునిచేత ఎన్నుకొనబడిన వారు ఎవరు?

దేవుడు తన కుడివైపునున్న వారితో ‘‘రండి యేసునందు విశ్వాసముంచండి పరలోకమునకు వెళ్ళండి’’ అని చెప్పి, ఎడమవైపుకు తిరిగి ‘‘నరక మునకు వెళ్ళండి’’ అని చెప్పుటకు రెండు వరుసలలో నిలబడి ప్రజలను దేవుడు కలిగియుండలేదు.
జాన్‌ కాల్విన్‌ సిద్ధాంతమును విశ్వసించువారు దేవుడు ఎటువంటి కారణము లేకుండానే కొంతమంది ప్రజలను ఎన్నుకొనును మరియు మిగిలిన వారిని వదిలివేయుటకు ఆదిలోనే నిర్ణయించుకొనెను అని వాదించుదురు. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరుగును. మనము ఎటువంటి కారణము లేకుండానే షరతులు లేకుండానే ఎన్నుకొనబడ్డాము అని తలంచుట అనునది తలనొప్పిని కలిగిస్తుంది.
అప్పుడు దేవుడు అన్యాయస్థుడా? ఖచ్చితముగా కాదు. ప్రతివారు దేవుని యెదుట ఆయన ధర్మశాస్త్రము యెదుట సమానము. మనము దేవుని నుండి యేసుక్రీస్తు ద్వారా మనలను మన పాపముల నుండి రక్షించిన, రక్షణా కృపను పొందియున్నాము. ఈ సత్యమునందు విశ్వాసముంచు అవకాశము ప్రతివారికి సమానము. దేవుని సంకల్పమును ఎరిగి స్వీకరించినవారిని మరియు వారి బలహీనతలను ఎరిగి నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచువారిని ఆయన అనుమతించును.
అప్పుడు, దైవిక ఎన్నిక మరియు ముందుగా ఏర్పరచబడుట అనగా ఏమిటి? అవి ఆయన మనకిచ్చిన నీరు మరియు ఆత్మ సువార్తయందు దేవుని సంకల్పము చొప్పున మనము పిలువబడుటకు ఇవ్వబడినవి ఇవి. ఇది ఎందుకనగా దేవుడు యేసుద్వారా మన పాపములను తీసివేసెను మరియు మనలను ఆయన పిల్లలుగా చేయుటకు మనము ఈ లోకమునందు జన్మించియున్నాము. మరియు సువార్తను విను ఒక అవకాశము మనకు ఇవ్వబడినది. దేవుడు వీటన్నింటిని యేసుక్రీస్తునందు ముందుగానే మనకొరకు సిద్ధపరచెను. ఇది దేవుని ప్రణాళిక. మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, మనము తప్పక ఏశావు వలె వున్నామా లేదా యాకోబు వలె వున్నామా అని చూసుకొనవలెను.
లేఖనము చెప్పుచున్నది దేవుడు ఏశావును ద్వేషించగా ఆయన యాకోబును ప్రేమించెను అని. ఇది కయీను మరియు హేబేలు గురించి కూడా మాట్లాడుచున్నది. దేవుడు హేబేలును ప్రేమించెను కయీనును ద్వేషించెను. దేవుడు ఎటువంటి కారణము లేకుండానే ఏశావు, కయీనును ద్వేషించెనా మరియు ఎటువంటి కారణము లేకుండానే యాకోబు హేబేలును ప్రేమించెనా? కాదు. ఎందుకంటే ఏశావు మరియు కయీను కేవలము వారు తమ సొంతశక్తిని నమ్ముకొన్నారు. వారు ఎన్నడును దేవుని కృపను అడుగలేదు. ఇదిలా వుండగా యాకోబు మరియు హేబేలుకు వారి బలహీనత తెలుసు. వారు దేవుని కృప కొరకు వేడి, ఆయన వాక్యమునందు విశ్వాసముంచారు.
ఈ ప్రజలను ఒక ఉదాహరణగా ఉపయోగించుటచేత ఈ లేఖనము దేవుని ముందు ఏర్పాటును మరియు ఎన్నికను వివరించుచున్నవి. మనము ఏ వైపునకు చెందినవారము? ఏశావు చేసినట్లు కేవలము మనము మన శక్తిని నమ్ముకొనుటచేత మనము దేవునిని కలుసుకొనగలమా? లేదు. మనము కలుసుకొనలేము! మనము దేవునిని కలుసుకొనగలిగిన ఒకే ఒక మార్గము అనునది దేవుని కృపచేత నింపబడిన, నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచుటచేత ఆయనను కలుసుకొనుట. దేవుని యెదుట నిలువబడిన వరుసలో ఏ వరుసలో మనము ఉన్నాము? మనము దేవుని సన్నిధిలో ఎల్లప్పుడు దీవించబడవలెనని కోరుకొనువారము. అయితే మన బలహీనతను బట్టి మనము ఎల్లప్పుడు విఫలమవుతూ వుంటాము. మనము దేవుని సంకల్పము ప్రకారము జీవించవలెనని మనము కోరినప్పటికి, మనము ఇప్పటికి దేవునియెదుట అల్పులము మరియు బలహీనులము, అందువలన మనము ఆయనను అడగగల ఒకే ఒకటి ఆయన కృప.
మనము దేవునిచేత దీవించబడవలెనని కోరినట్లయితే, మనము యాకోబు వంటి వారముగా మారవలెను. హేబేలునకు కలిగిన విశ్వాసము కలిగియుండవలెను. మనము బలహీనులము, అల్పులము, మరియు దుష్టులమని దేవునియెదుట మనము గుర్తించవలెను.
కీర్తన 145:14 చెప్పుచున్నది. ‘‘యెహోవా పడిపోవువారినందరిని ఉద్ధరించువాడు క్రుంగిపోయిన వారినందరిని లేవనెత్తువాడు.’’నిజముగా, ప్రతివారు దేవుని సన్నిధిలో పడిపోయివున్నారు. మనకు ధైర్యము లేదు. మనము చిన్న చిన్న లాభము కొరకే రాజీపడిపోతుంటాము. మనము దిగజారిపోయినవారము. మనము కొన్నిసార్లు ధైర్యవంతులముగా కనబడతాము. అయితే అది కేవలము ఒక సెకను మాత్రమే. మనము మన జీవితమును దగ్గరగా చూసినట్లయితే, మనమెంత దిగజారిపోయివున్నామో మనకు తేలికగా అర్థమౌతుంది. మనలను సత్యమును వదలివేయమని బలవంతము చేయు అసత్యమైనదానికి మరియు బలమైనదానికి మనలను మనము అప్పగించుకుంటాము. అయితే దిగజారిన వారిని ప్రేమించుటకు యేసునందు వారికి రక్షణనిచ్చుటకు దేవుడు పిలచెను మరియు ఆయన కుమారులుగా వారిని ఆయన చేసెను.
మనము ఒక క్రమములో దేవునిచేత ప్రేమించబడుటకు మనము ఎంత బలహీనులమో మరియు పాపముతో నిండియున్నామో మనము గ్రహించుకొనవలసిన అవసరత వున్నది. మనము ధర్మశాస్త్రముతో తృప్తిపడునట్లుగా మనము ధర్మశాస్త్రమును సరిగా పాటించలేనివారమను చక్కని గ్రహింపునకు వస్తాము ఆ విధముగా, మనము పరిపూర్ణ జీవితమును జీవించలేము.
ఒక వేళ నేను పరిపూర్ణుడనైతే, నాకు ఎన్నడును రక్షకుడు అవసరము లేదు. మనము ఒకవేళ పరిపూర్ణులమైతే మనకు దేవుని సహాయము మరియు దీవెనలు ఎందుకు అవసరము? మనము దేవుని యెదుట చాలా బలహీనులమైనందున మనకు ఆయన దీవెనలు అవసరము. మనకు ఆయన కృప అవసరము. దేవుని కరుణ మనమీద చాలా బలమైనది ఏలయనగా ఆయన తన అద్వితీయ కుమారుని మనకొరకు పంపి మన పాపమును కడిగివేయుటకు పాపములను ఆయన తనపై వేసుకొనునట్లుగా చేసెను. మనము పాపముల నుండి విడుదలను పొందునట్లు, మనకు బదులుగా పాపమునకు శిక్షను యేసుపై మోపెను.
కేవలము ఈ విశ్వాసముతో మాత్రమే మనము దేవుని ప్రియమైన పిల్లలుగా మారగలము. మన స్వంత రక్షణకు మన కృషినిబట్టి గాక ఈ కరుణను బట్టి మనము ఆయన ప్రేమ వస్త్రమును ధరించుకొనియున్నాము.
చాలామంది క్రైస్తవులు ముందుగా ఏర్పరచుకొనుట మరియు ఎన్నిక అను సిద్ధాంతమును బోధించుచు వెంబడించుచున్నప్పటికి, వారు కూడా ఈ సిద్ధాంతము విషయములో ఆందోళన కలిగియున్నారు. ఇందువలననే వారు నిరంతరము దేవునిచేత ఎన్నుకొనబడ్డామా లేదా అని ఆందోళన పడుతూవుంటారు.
ఈ రెండు సిద్ధాంతములు 90శాతం కాల్వనిష్టుల వేదాంతమును తయారు చేయును. ప్రశ్న ఏమంటే, వారు యేసునందు విశ్వాసముంచినప్పటికి, వారు నిజముగా ఎన్నుకొనబడ్డారా లేదా అనునది, ఇదే వారికి ఆందోళన కలుగజేస్తుంది. అయితే నీవు ఎన్నుకొనబడ్డావా లేదా అనునది ప్రాముఖ్యమైనది కాదు. దీనికి బదులు, దేవుని నీతి చేత రక్షించబడుటకు నీరు మరియు ఆత్మసువార్తయందు విశ్వాసముంచుట నీకు ప్రాముఖ్యము. విశ్వాసముచేత ఈ దేవుని నీతిని పొందినవారు ఎన్నుకొనబడినవారు.
ఒకసారి ఛాందస వేదాంతములో ప్రముఖులలో ఒకరిగా పేరుపొందిన ఒక డాక్టరు ఉన్నాడు. ఇతడు కాల్వనిజమ్‌ మీద అంటే ముందుగా సిద్ధపరచబడుట మరియు దైవిక ఎన్నిక అనుసిద్ధాంతము బోధించువాటికి గొప్ప విలువను ఇచ్చాడు.
ఒక దినమున, ఈ విషయమును గురించి అతడు బోధించుచున్నప్పుడు ఒక విద్యార్ధి అడిగాడు’’ సరే, మీరు దేవుని చేత ఏర్పరచబడ్డారా? దేవుడు ఎవరిని ఎన్నుకొనునో మీరెలా చెప్పగలరు?
ఆ వేదాంత పండితుడు జవాబు చెప్పాడు, ‘‘దీనిని ఎవరు తెలుసుకొనగలరు? మనము దేవునియెదుట నిలువబడినప్పుడు మాత్రమే దీనిని తెలుసుకొనగలము.’’
అప్పుడు, ఆ విద్యార్ధి మరలా అడిగాడు, ‘‘మీరు దేవునియెదుటకు వెళ్ళినప్పుడు నీవు ఏర్పరచబడలేదని చెప్పినట్లయితే నీవేమి చేస్తావు?’’
ఆచార్యుడు జవాబు చెప్పాడు ‘‘దేవుడు తనకు తానే నిర్ణయించుకున్నప్పుడు నేనేమి చేయగలను? అందువలన మీరు దేవునియెదుట నిలువబడినప్పుడు మాత్రమే తెలుసుకొనగలరు అని చెప్పాను.’’
ఆ విద్యార్ధి ఆలోచించడం మొదలుపెట్టాడు. ‘‘ఇతడు చాలా దీనమైనవాడు. ఇంత గొప్ప మనిషి కూడా తాను ఎన్నికచేయబడ్డానో లేదో నాకు తెలియదు అని చెప్పుచున్నాడు. అందువలన ఒకడు (అతడు/ఆమె) తాను ఎన్నిక చేయబడ్డానో లేదో అతనికి తెలియకుండుట సహజము.’’
అయితే దేనిలో దేవునినీతి దాయబడివున్నదో ఆ సత్యము ఇప్పుడు స్పష్టముగా ప్రదర్శించబడుచున్నది. మనిషికి తెలియకుండా దేవుడు దాచినవి కొన్ని వున్నాయి. అయితే తగిన సమయములో దేవుడు వాటిని ప్రత్యక్షపరచును. ఒక సువార్తికుడు తాను రక్షించబడ్డానో లేదో లేక ఏర్పరచబడియున్నాడో లేదో కనీసం ఇది కూడా తెలియకుండా అతడు ఏ విధంగా సువార్తను బోధించగలడు? దేవుని చేత పిలువబడినవారు దేవుని నీతియందు విశ్వాసముంచారు.
రోమా 8:29 వ్యాఖ్యానించుచున్నది. ‘‘ఏలయనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్టుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యముగల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను.’’ తండ్రియైన దేవుడు ఆయన అద్వితీయ కుమారుని సారూప్యము నిచ్చెదనని మనకు నిశ్చయము కలిగించుటకు దానిని బట్టి ఆయన అనేక సహోదరులలో మొదటివాడగునట్లు ముందుగా ఏర్పరచెను. ఇక్కడ యేసు ‘‘ప్రథమ ఫలము’’ అని పిలువబడ్డాడు. మనము యేసునందు మరియు ఆయన ఇచ్చిన నీరు మరియు ఆత్మ సువార్తనందు విశ్వాసముంచినట్లయితే, మనము అన్ని పాపముల నుండి రక్షించబడి, మనము దేవుని పిల్లలమగుదుము. అప్పుడు, యేసుకు మనకు గల సంబంధము ఏమైయుంటుంది? ఆయన మన పెద్ద సహోదరుడు. ఆయన దేవుని పెద్ద కుమారుడు మనము ఆయన చిన్న సహోదరీ సహోదరులము.
చాలా కాలము క్రిందట, నేను ఒక ప్రార్థనా గృహమునందు నివశించుచున్నప్పుడు, ఒక వృద్ధ సువార్తికుడు నన్ను దర్శించెను. అతడు చైనాలో వున్నప్పుడు యేసునందు విశ్వాసముంచుట ప్రారంభించాడు. తరువాత అతడు కొరియా వచ్చాడు. ఒకరోజు ప్రార్థించుచుండగా నేను వింటున్నాను. అతడు చెప్పుచున్నది ఇది. ‘‘సహోదరుడైన యేసు మరియు తండ్రియైన దేవా, నీవు నన్ను రక్షించినందుకు వందనములు. సహోదరుడా, యేసు, దయ చేసి నాకు సహాయము చేయుము.’’ యేసు మన సహోదరుడు!
దేవునికి మన గురించి అంతా తెలియునా అని మనము అడగవచ్చు. దీనికి జవాబు అవును అని, ఆయనకు మన గురించి అంతా తెలుసు. తండ్రియైన దేవునికి మన గురించి అంతా తెలుసు. ఆయన తన అద్వితీయ కుమారుని ద్వారా మనలను మన పాపముల నుండి రక్షించుటకు ఈ లోకము సృజించబడక మునుపే ఆయన ప్రణాళిక వేసెను. ఇది దేవుని ప్రణాళిక. ఆయన కుమారుడు యేసు ఈ లోకమునకు వచ్చెను, మనలను మన పాపముల నుండి రక్షించుటకు బాప్తిస్మము పొంది సిలువవేయబడెను. దేవుడు దీనిని ఇప్పటికే ప్రణాళిక వేసెను.
లోకము పునాది వేయబడకమునుపే, దేవుడు ‘‘ముగ్గురు వ్యక్తుల సమావేశము’’ను ఏర్పాటు చేసాడని మనము చెప్పవచ్చు. త్రియేక దేవుడు ` తండ్రి, కుమార, మరియు పరిశుద్ధాత్మ ` ఆయన నీతియందు విశ్వాసముంచువారిని రక్షించునట్లుగా ప్రణాళిక వేసెను. ఆయన ప్రణాళిక ఏమనగా ప్రజలను సృష్టించి ఆయనతో ఆయన పరిపూర్ణ రాజ్యమునందు నిత్యము నివశించునట్లుగా వారిని ఆయన కుమారులుగా చేయుట.
తండ్రియైన దేవుడు, కుమారుడు మరియు పరిశుద్ధాత్ముడు, వీరందరు ఈ ప్రణాళికను సమ్మతించారు. ఆయన మానవుని ఏ విధముగా చేయాలి. మరియు మానవజాతిని ఆయన కుమారులుగా ఏ విధముగా చేయాలి అని ఆలోచించే విధానములో, దేవుడు ఆయన కుమారుని ఈ లోకమునకు పంపుటకు, ఆయన బాప్తిస్మము పొంది సిలువపై మరణించుటకు, ఆ విధముగా వారు ఆయన కుమారుని సారూప్యములోనికి మార్చబడునట్లుగా దేవుడు ప్రణాళిక వేసెను.
మనలను సృష్టించుటలో దేవుని సంకల్పము ఏమిటి? ఇది మనలను ఆయన కుమారులుగా చేయుట కొరకు. యేసు దేవుని ప్రథమ కుమారుడా? అవును, ఆయన దేవుని ప్రథమ కుమారుడు మరియు మనము కూడా దేవుని కుమారులమైనందున, మనము కూడా ఆయన సహోదరులము.
యేసు 33 సంవత్సరములు ఈ భూమిమీద జీవించుచుండగా, ఆయన మానవజాతి బలహీనతను మరియు అత్యల్పజీవితము అనుభవించెను. అందువలననే మనము ప్రార్థించుచున్నప్పుడు మనము ‘‘యేసు, నేను చాల బలహీనుడను. నేనీ విధముగా వున్నాను. దయచేసి నాకు సహాయము చేయుము మరియు నన్ను కాపాడుము. నీ వాక్యమును అంగీకరించునట్లుగా ప్రజల హృదయమును మెత్తగా చేయుము, కాపాడుము, కృపనిమ్ము. మరియు వారికి సహాయము చేయుము.’’ అని చెప్పుదుము. ప్రభువు మన ప్రార్థనలను విని జవాబిచ్చును. యేసుకు ప్రార్థన చేయుట దేవునికి ప్రార్థన చేయుట అనునది ఒక్కటే.
మనలను సృజించుటలో దేవుని సంకల్పము ఏమిటి? ఇది మనలను ఆయన పిల్లలుగా చేయుటకు దేవునికి మన గురించి ప్రతిదీ తెలియును. మనము ఈ లోకములో జన్మించునట్లుగా ఆయన మనలను చేసెను మరియు యేసు బాప్తిస్మము మరియు సిలువ మరణము ద్వారా ఆయన మనలను రక్షించెను. ఎందుకనగా ఆయన స్వంత కుమారులుగా కుమార్తెలుగా దత్తత తీసుకొనుటకు, లోకము పునాదివేయబడక మనుపే, ఆయన ముందుగా నిర్ణయించినందున. ఆయనకు మన జీవము మరణము గురించి మాత్రమే కాదు. మన ప్రతి కదలిక తెలుసు. మనము ఎప్పుడు జన్మించామో, మనము ఎప్పుడు కన్నామో, మరియు మన జీవితములో ఏమి సంభవించినదో ఆయనకు తెలుసు. మన జీవితము గురించి సమస్తము తెలిసిన దేవుడు, నీరు మరియు ఆత్మ సువార్తను ఇచ్చాడు, ఆ విధముగా మనము యేసుక్రీస్తు నందు విశ్వాసముంచవచ్చు మరియు దేవుని పిల్లలము కావచ్చు.
దేవుడు మనలను ముందుగానే ఎరిగి ముందుగానే ఏర్పరచుకొనెను. రోమా 8:30 వ్యాఖ్యానించుచున్నది. ‘‘మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెనో; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను.’’ ఈ వాక్య భాగమును అర్ధము చేసుకొని విశ్వాసించుట ఎంత ప్రాముఖ్యమను దానిని నేను తగినంత నొక్కి చెప్పలేక పోవుచున్నాను. 
చాలామంది ప్రజలు క్రమ క్రమముగా శుద్ధీకరించబడుట అను సిద్ధాంతమును బలపరచుటకు ఈ వచనమును తీసుకుంటారు. దేవుడు మనలను ముందుగా నిర్ణయించెను, పిలిచెను. నీతిమంతులుగా తీర్చెను, మనను మహిమ పరచెను అను ఈ వాక్యభాగమును ఆధారము చేసుకొని ` ఇందువలననే మన హృదయములలో పాపము కలిగియున్నప్పటికి, దేవుడు మనలను పాపములేని వారిగా గుర్తించును. శుద్ధీకరించు కాలములో గుండా వెళ్ళిన తరువాత, ఒకవేళ మనము పరిశుద్ధ పరచబడు స్థితి వున్నట్లయితే మనము మహిమ పరచబడుదుము అని వీరు చెప్పుదురు.
పాపులను యేసుక్రీస్తునందు పిలుచుటకు దేవుడు ముందుగా నిర్ణయించుకొనలేదా? కొంతమంది ప్రజలు ఆయన పిలుపుకు స్పందించినప్పటికి, ఆయన మనలనందరిని పిలచెను. వారు ఏశావు మరియు కయీను వంటివారు. వారు నరకమునకు పంపబడినవారు.
 

దేవుని కరుణ యందు

తండ్రియైన దేవుడు ఆయన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తునందు మనలను పిలచుటకు ప్రణాళిక వేసెను. నీరు మరియు రక్తముతో మన పాపములను కడిగివేయుటచేత ఆయన స్వంత కుమారులుగా దత్తత తీసుకొనుటకు ఆయన ముందుగా నిర్ణయించెను. దేవుడు వారిని పిలచినప్పటికి దేవుని యొద్దకు వెళ్లనివారు దేవుని రక్షణకు వెలుపల ఉన్నారు. అటువంటి ప్రజలు ఆయన కృప నుండి మినహాయించబడి, నరకమునకు నిర్దేశించబడ్డారు. అయితే దేవుని పిలుపుకు లోబడిన ప్రజలు కూడా వున్నారు. వారు ‘‘నేను ఈ విధముగా బలహీనముగా వున్నను, నా వంటి వానిని నీవు అంగీకరించుదువా?’’ అని వారు చెప్పుదురు.
‘‘కావచ్చు, నేను అంగీకరిస్తాను’’ అని దేవుడు చెప్పును.
‘‘నిజముగా? నేను చాలా బలహీనముగా వున్నప్పుడు నీవు నన్ను అంగీకరించుదువా?’’
‘‘కావచ్చు, నేను నిన్ను అంగీకరిస్తాను.’’
‘‘దేవా, నీకు ప్రత్యేకముగా సమర్పించుకొనుటకు నేనేమీ కలిగిలేను మరియు నేను ఇప్పటి నుండి మంచిగా వుండగలను అని కూడా నేను వాగ్ధానము చేయలేను.’’
‘‘ఇప్పటికి నేను నిన్ను అంగీకరిస్తాను.’’
‘‘నా గురించి నీకు తెలిసియుండక పోవుటను బట్టి ఇది జరగవచ్చు. నీవు నా విషయములో నిరాశ పడతావు.’’
ఎవరైనా ఒకరు అతడు/ఆమె నిజముగా మనయందు విశ్వాసముంచుచున్నారని చెప్పినప్పటికి, మనము ఎటువంటి వారమో మనము ఎరిగియున్నప్పుడు, మనమెక్కడో ఒకచోట దాగియుండాలని కోరుకున్నట్లయితే, మనము సహజముగా సిగ్గుపడమా? మనమెందుకు దాచుకొనవలెనని ప్రయత్నము చేస్తాము? మనము ఇంతకన్నా మంచిగా వుండలేము గనుక, మరియు మనము ఇంతకు ముందు నుండి చేస్తున్న వాటిని సహితము కొనసాగించలేము గనుక.
ఇందువలననే మనము ‘‘నేను చాలా బలహీనుడైనను నీవు నన్ను అంగీకరించుదువా? నీవు నిజముగా నన్ను అంగీకరిస్తావా? నేను కనీసము నీ యందు విశ్వాసముంచుటకు అనుమతించెదవా? నా వంటివాడు ఎవడైన పాపముల క్షమాపణను పొందునా? నేను భవిష్యత్తులో నేనే మాత్రము మంచిగా వుండలేకపోయినప్పటికి నావంటి వాడు నీతిమంతునిగా మారగలడా?’’ అయతే మన దేవుడు అడవి ఒలీవచెట్టును సేద్యములో వున్న ఒలీవ చెట్టుగా మార్చే శక్తిగల దేవుడు.
మనము సహజ సిద్ధముగా అడవి ఒలీవచెట్టులము, అయితే యేసు మనకిచ్చిన సువార్తను బట్టి సేద్యములోనికి వచ్చిన ఒలీవ చెట్లముగా మారాము. పాపము చేయుట తప్ప మరేమి చేయలేని నిస్సహాయులమైన మనలను దేవుడు పిలచెను. మనము కేవలము కొంచెము బలహీనులుగా వున్నప్పుడే దేవుడు మనలను పిలచెనా? మనము ఏ సామర్థ్యము లేకుండా వున్నప్పుడే దేవుడు మనలను పిలచెను. మన గొప్ప తప్పిదము మరియు దూరము చేయు బలహీనతకు వేరుగా ఆయన మనలను యేసుక్రీస్తునందు పిలచెను. అల్పులమైన మనలను ఆయన పిలచెను. ఆయన మనలను పిలచిన తరువాత ఏమి చేసెను? మనము శాశ్వత జీవమును కలిగియుండునట్లుగా ఆయన మన పాపములన్నిటిని తీసివేసి ఆయన నీతిని మనకిచ్చెను.
ఆయన ఈ కార్యములన్నిటిని ఏ విధముగా చేసెను? మత్తయి 3వ అధ్యాయములో, దేవుడు మానవాళి కొరకు ఏర్పరచినట్లుగా, యేసు ఈ లోకమునకు వచ్చి నీతియావత్తును నెరవేర్చునని మనము చెప్పబడ్డాము. యేసు యోహాను చేత బాప్తిస్మము పొందెను, మానవాళి పాపములన్నియు ఆయనపైకి తీసుకొనెను, వారి పాపములన్నిటిని భరించుచు సిలువపై మరణించెను. లోక పాపములనుండి వారిని రక్షించుటకు మూడవ దినమున సమాధి నుండి తిరిగి లేచెను. ఆయన మనకు నూతన జీవమునిచ్చెను ఆ విధముగా చేయుటచేత ఆయన మనలను నీతిమంతులుగా తీర్చి, మన పాపములన్నిటిని కడిగి వేసెను. యేసు మనలను పిలచెను, నీరు మరియు రక్తముతో మన పాపములన్నిటిని కడిగివేసెను. దేవుని నీతిని మనకిచ్చెను, మనలను పాపములేని వారిగా చేసెను, మనలను దేవుని పిల్లలుగా చేయుటచేత, నీతిమంతులుగా తీర్చిన మనలను మహిమ పరచెను.
మనము పరలోకములో ప్రవేశించుటకు మరియు దేవుని కుమారులుగా మనము శాశ్వతముగా జీవించుటకు యేసు మనలను మహిమపరచెను. నీవు దీనిని అర్ధము చేసుకున్నావా? అయితే మత సిద్ధాంతము, నీవు పాపివైనప్పటికి, నీవు యేసునందు విశ్వాసముంచినట్లయితే, నీవు తగిన కాలములో క్రమక్రమముగా శుద్ధీకరించబడుదువు. నీవు చనిపోవు సమయానికి, నీవు దేవుని యెదుట ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా నిలబడుదువు అని బోధిస్తాయి. ఇది సత్యమునకు విరుద్ధము. ఇది నిజమైన విశ్వాసము కాదు. ఇటువంటి విశ్వాసము శుద్ధీకరణ సిద్ధాంతము కొరకే గాని, సత్యము కొరకు కాదు.
ప్రభువు మనలను మన పాపముల నుండి రక్షించెను మరియు దేవుడు మనలను ముందుగా ఏర్పరచుకొనెను, పిలచెను. ఒక్కసారే నీరు మరియు రక్తముతో మన పాపములన్నిటిని కడిగివేసెను. శుద్ధీకరించిన మనలను ఆయన కుమారులుగా చేసెను. మరియు మహిమతో మనము దేవుని రాజ్యములో ప్రవేశించులాగున మనలను దీవించెను. ఇది సత్యము, ఒక వాక్యములో దీవెనలన్నిటిని యేసుక్రీస్తునందు పెట్టుటచేత, ఈ విధముగా ఆయన సత్యమును గురించి మాట్లాడెను. ఈ వాక్యభాగము క్రమక్రమముగా శుద్ధీకరణ సిద్ధాంతము యొక్క ఏడు దశలను గురించి ఇది మాట్లాడుట లేదు. మనము పూర్తిగా శుద్ధీకరించబడుటకు ఏడు దశలలో గుండాపోయిన తరువాత మనము క్రమ క్రమముగా పరిపూర్ణులమగుదుమని ఇది చెప్పుటలేదు.
మనము యేసునందు విశ్వాసముంచిన తరువాత దేవుడు మనలను పిలచునని లేదా మనము పెద్ద వారమగుచున్న కొలది మనము శుద్ధీకరించబడుదుమని రోమా 8:30 చెప్పుట లేదు. మనము పరిపూర్ణముగా శుద్ధీకరించబడు వరకు శుద్ధీకరణ వంతెనను ఒక్కొక్కమెట్టు ఎక్కుదుమని ఇది మనకు చెప్పుటలేదు. మనము యేసును ఎరిగినప్పుడు, మరియు యేసు మనలను పిలిచినప్పుడు, నీరు మరియు ఆత్మతో ఒక్కసారి ఆయన మన పాపములను క్షమించెను. మనము ఈ సువార్తతో దేవునియొద్దకు వచ్చినప్పుడు ఆయన చేతులతో కౌగలించుకొనబడుదుము.
కొంతమంది ప్రజలు ‘‘ఇంతకు మునుపు కనీసము నా పాపములను నేను ఎరుగను, అయితే ఈ ప్రసంగము వినిన తరువాత, నేను దీనిని గ్రహించుటకు ప్రారంభించాను. నాకు గతములో ఒకటి లేక రెండు పాపములు వున్నవని నాకు గురుతు మరియు నేను భవిష్యత్తులో కూడా పాపము చేయుచూ వుండవచ్చు. అందువలన నేను దేవునియందు విశ్వాసముంచగలనని నేను అనుకోవడము లేదు’’ అని చెప్పుదురు. అయితే ఇది సరియైనది కాదు. దీనికి బదులుగా మనము ఈ విధముగా ఆలోచించాలి. ‘‘ఆహా! ఇది సరియైనది. నేను పాపములు చేయుచున్నప్పటికి నాకు నా స్వంత పాపము తెలియదు. దేవుని వాక్యమంతా నిజము. నేను ఆయన వాక్యమునందు విశ్వాసముంచాలి. అయితే నేను దీని ప్రకారము జీవించలేక పోవుచున్నాను. నేను తప్పించుకొనుటకు వీలు లేని నరకమునకు నిర్దేశించబడిన నీచమైన పాపిని. అందువలననే యేసు వచ్చాడు.’’
మనము యేసునందు విశ్వాసముంచి పాపముల క్షమాపణను పొందుటచేత మనము పాపములేని వారముగా చేయబడియున్నాము. మనము శుద్ధీకరించబడి దేవుని కుమారులుగా చేయబడియున్నాము. మనము దేవుని పిల్లలమైనప్పటి నుండి, మనము పరలోకములో చేరగలిగినవారము మరియు మహిమపరచబడగలము. ఇదియే దేవుని నీతి మరియు సత్యము.
దేవుడు మనలను ముందుగా ఏర్పరచుకొనెను. మనలను పిలచెను. నీతిమంతులుగా తీర్చెను మరియు మనలను మహిమ పరచెను. మీరు ‘‘నేను క్రమక్రమముగా మార్పుచెంది ఒక పాపములేని వ్యక్తిగా మారుదును’’ అని చెప్పుట చేత క్రమక్రమముగా శుద్ధీకరించబడుట అను సిద్ధాంతము సరియైనది అని మీరు తలంచవచ్చు. నీవు నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచిన క్షణము నుండే నీవు శుద్దీకరించబడుదువు మరియు నీతిమంతునిగా తీర్చబడుదువు. నీ హృదయము దశలు దశలుగా మార్పు చెందదు. నీ హృదయము ఒక్కసారిగా మార్పు చెందును. నీవు దేవుని వాక్యమునందు మరియు సంఘమునందు విశ్వాసముంచు కొలది ఇది క్రమక్రమముగా పెరుగును అనునది నీ విశ్వాసము.
మనము దేవుని వాక్యముచేత పోషించబడుచున్న కొలదీ మన విశ్వాసము పెరిగి, మనము ఇతరులకు బోధించు స్థానము వరకు అది చేరుకొనును. మనము ఇంకా పరిపూర్ణమైన తరువాత ఇంకా పాపములేని వారమైన తరువాత మనము దేవుని పిల్లలమగుదుమని నొక్కి చెప్పుట అనునది బైబిల్‌ను ఆధారము చేసుకొనినది కాదు. మనము ఒక్కసారే శుద్ధీకరించబడుదుము మరియు పాపము లేని వారమగుదుము.
దేవుడు మనలను యేసుక్రీస్తునందు ముందుగా ఏర్పరచుకొనిన ప్రకారము మనలను పిలచెనా? అవును, ఆయన ఆ విధముగా చేసెను. ఆయన మనలను యేసునందు పిలచెను మరియు పాపములేని వారిగా నీతిమంతులుగా మనలను పిలచెను. దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చి యేసుక్రీస్తుద్వారా మనలను పాపములేని వారిగా చేసెను, ఆయన కుమారులుగా మనలను తీసుకొనెను, ఆయన రాజ్యములోనికి మనము ప్రవేశించుటకు మనలను మహిమ పరచెను.
మనము దేవుని నీతిని నెరవేర్చిన, యేసుక్రీస్తు రక్షణయందు విశ్వాసముంచుట చేత ఒక్కసారిగా మనము నీతిమంతులముగా తీర్చబడియున్నాము. మనము దేవుని పిలుపుకు విధేయులమైనందున మరియు యేసు మన పాపములన్నిటిని కడిగివేసాడని విశ్వసించాము. మన బలహీనతకు వేరుగా, పాపములేని వారముగా దేవుని నీతి కుమారులుగా చేయుటకు, ఆయన రాజ్య ప్రజలుగా చేయుటకు దీవించబడ్డాము.
అందువలననే శుద్ధీకరణ సిద్ధాంతము తప్పు. ఇది ఏ మాత్రము అర్ధాన్ని ఇవ్వదు. బైబిల్‌ మనకు స్పష్టముగా చెప్పుచున్నది. ‘‘మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులగా తీర్చెనో వారిని మహిమ పరచెను.’’ విశ్వాసము క్రమముగా పెరుగుతుంది. అయితే పాపము క్షమాపణ, దేవుని పిల్లలుగా మారుట, మరియు పరలోకములో ప్రవేశించుట అనునవన్నీ ఒక్కసారిగా జరుగుతాయి. నీవు దీనియందు విశ్వాసముంచుచున్నావా?
నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచుటచేత మనము దేవుని పిల్లలుగా మారగలిగాము. నీరు మరియు ఆత్మ కృప ద్వారా దేవుడు మన పాపములన్నిటి నుండి విలువలేని మన జీవితమును రక్షించాడు. మన రక్షణ కొరకు ఏ విధముగానైన ఏదైనా మనము చేయగలమా? మనము నీతిమంతులుగా మారుటలో మనమేదైనా కూడగట్టియున్నామా? మనము ప్రణాళిక వేసినది ఏదీ లేదు. అతడు/ఆమె జన్మించక మునుపు యేసునందు విశ్వాసముంచుటకు తీర్మానించుకొనినవాడు ఎవడును లేడు. అతడు/ఆమె అతని/ఆమె తల్లి గర్భములో వుండగానే యేసునందు తీర్మానించుకొనుటకు నిర్ణయించుకొనిన వాడు ఎవడైనా కలడా?
నీరు మరియు ఆత్మ సువార్తను బోధించువారిచేత మనము ఈ సత్యమును వినుట మనకు సంభవించినది మరియు ఇది సత్యమని గ్రహించాము. మరియు నేను దీనియందు విశ్వాసముంచుట తప్ప మరియొక అవకాశమే లేదు; నా వంటి ఒక పాపాత్ముడు తప్పక దీనియందు విశ్వాసముంచాలి అని మనలో మనము అనుకొన్నాము. ఆ సమయము నుండి మనము నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచుట ప్రారంభించాము. పాపము క్షమాపణను పొంది, దేవుని పిల్లలుగా మారాము.
నీతిమంతులు మాత్రమే దేవుని కుమారులు. శాశ్వతమైన సంపదతో దేవుడు వారిని శాశ్వతముగా పరలోక గౌరవముతో మహిమ పరచును. మహిమ పరచుటను గురించినదంతా ఇదే నీరు మరియు ఆత్మను స్వీకరించు విశ్వాసులందరికి దేవుడు ఈ దీవెనలను ఇచ్చెను.
ప్రభువుకు స్తోత్రము.