(రోమా 8:29-30)
‘‘ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను.’’
ఈ వాక్య భాగము దేవుడు ప్రజలను యేసుక్రీస్తునందు రక్షించుటకు ముందుగా ఏర్పరచుకొనెనని మనకు చెప్పుచున్నది. ఆ విధముగా చేయుటకు, దేవుడు వారిని క్రీస్తులో పిలచెను, ఆయన ఎవరిని పిలచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను. ఈ లేఖనాల పునాది అంతా యేసుక్రీస్తులోనే ప్రణాళిక వేయబడి జరిగించబడినది. చాలామంది వేదాంత పండితులు అబద్ధ ప్రవక్తలు వారి స్వలాభము సత్యమును కేవలము ఒక సిద్ధాంతముగా మార్చినప్పటికీ, రోమా
పుస్తకము మనకు చెప్పుచున్నదంతా ఇదే. ఈ సత్యమును ఎంతమంది అపార్ధము చేసుకొన్నారో మనము పరిశీలన చేద్దాము.
కొంతమంది వేదాంత పండితులు ఈ వాక్య భాగము నుండి ఐదు ప్రధాన సిద్ధాంతములను అభివృద్ధి చేసారు. 1) ముందుగా తెలుసుకొనుట 2) ముందుగా ఏర్పరచుట 3) ప్రభావము చేయగల పిలుపు 4) నీతిమంతులుగా తీర్చుట 5) మహిమ పరచుట. ఈ ఐదు సిద్ధాంతములు ‘‘రక్షణా బంగారు గొలుసు’’గా తెలుసు మరియు ఇవి విశ్వాసులకు అవిశ్వాసులకు ఒకే విధముగా ఒక సత్యము వలె వ్యాప్తి చేయబడినవి. అయితే వారు చెప్పుకొనేదంతా తప్పుల తడక.
ఐదు సిద్ధాంతములన్నీ దేవుడు చేసిన దానిని గురించి మాత్రమే మాట్లాడును ` అది, ‘‘దేవుడు ఒక వ్యక్తిని ఇప్పటికే ఎరుగును, ఎన్నుకొనెను, ఇప్పటికే పిలచెను, నీతిమంతులుగా తీర్చెను, మరియు మహిమ పరచెను’’. అయితే ముందుగా నిర్ణయించుట అను సిద్ధాంతము దేవుడు రక్షించు కొంతమందిని ఎటువంటి షరతులు లేకనే వారు పుట్టకమునుపే ఎన్నిక చేసుకొనెను అని చెప్పుకొనును. అప్పటికి బైబిల్ సంబంధమైన ముందుగా నిర్ణయించుట అను సత్యము దేవుడు ఆయన ప్రేమను పాపులపై క్రుమ్మరించుటచేత వారిని ఆయన కుమారులుగా చేసెను అని బోధించుచున్నది. వారిని ఆ విధముగా ఎన్నుకొనుటచేత, దేవుడు వారిని పిలచెను, నీతిమంతులుగా తీర్చెను, వారిని మహిమ పరచెను.
ముందుగా నిర్ణయించుట మరియు ఎన్నిక చేయుట అను వేదాంతపరమైన సిద్ధాంతముల తప్పు
క్రైస్తవ వేదాంతములో, జాన్ కాల్విన్ చేత ప్రకటించబడిన కాల్వనిజమ్‌కు చెందిన ‘‘అయిదు గొప్ప సిద్ధాంతములు’’ అనునవి మనము కనుగొనగలము. వాటిలో ముందుగా నిర్ణయించుట మరియు ముందుగా ఎన్నికచేయుట అనునవి ఉన్నాయి. రాబోవు చర్చిలో, ఈ సిద్ధాంతము బైబిల్ సంబంధమైన తప్పును లేవనెత్తి నీరు మరియు ఆత్మ సువార్తకు సాక్ష్యమిస్తాను.
ఎన్నిక సిద్ధాంతము అనునది జాన్ కాల్విన్ అని పిలవబడే ఒక వేదాంత పండితుని చేత ఉద్భవించినది. కాల్విన్ కాలమునకు ఎంతో కాలము మునుపే దేవుడు యేసుక్రీస్తులో ఎన్నిక గురించి మాట్లాడెను. అయితే ఇతర ఎన్నిక సిద్ధాంతము చాలామందిని గందరగోళములోనికి నడిపించింది. ఈ తప్పు సిద్ధాంతము దేవుని ప్రేమకు పరిమితిని ఏర్పరచి వివక్ష కలిగినదిగా గాని అవధులుగా లేవు, అయితే దేవుని ప్రేమకు పరిమితులను ఏర్పరచు ఈ ఎన్నిక సిద్ధాంతము తప్పు కాక మరి ఏమీ కాలేదు. అయితే వాస్తవమేమంటే, యేసునందు విశ్వాసముంచు నేటి క్రైస్తవుల ఈ సిద్ధాంతమును ఒక స్వాభావికమైనదిగా విధి వ్రాత అయినట్లుగా అంగీకరించారు.
ఈ ముందుగా నిర్ణయించుట అను సిద్ధాంతము యొక్క ఉద్దేశ్యము ఒక తత్వముగా చేయవలెనని కోరిన వారికి, వారి మనస్సులను అధిగమించినదాని వలె వారికిది నమ్మదగినదిగా చేయుచు, చాలామంది మనస్సులను పాలించుటను ప్రారంభించినది. ఈ సిద్ధాంతము సృష్టికి పూర్వమే, దేవుడు కొంతమందిని ఎటువంటి షరతులు లేకుండా, ఎన్నుకొని కొంతమంది ఈ ఎన్నిక నుండి వదలివేయబడ్డారని చెప్పుకొనుచున్నది. ఈ సిద్ధాంతము నిజమైతే, ఎన్నిక చేయబడని ఆత్మలు దేవునికి వ్యతిరేకముగా లేచుటకు ఆధారము కలిగియుండును, మరియు ఆయన న్యాయము లేని మత్సరము కలిగిన దేవునిగా వుండును.
ఈ సిద్ధాంతము వలన, నేటి క్రైస్తవ్యము గొప్ప గందరగోళములో పడిపోయినది. దీని ఫలితముగా, చాలామంది క్రైస్తవులు ‘‘నేను ఎన్నిక చేయబడ్డానా? దేవుడు నన్ను సృష్టికి పూర్వమే ఎన్నుకొననట్లయితే, యేసునందు విశ్వాసముంచుటలో ఉపయోగము ఏమిటి?’’ అని ఆశ్చర్యపడుచు బాధపడుచున్నారు. వారు కూడా దేవుని ఎన్నికలో కలపబడ్డారా లేదా మినహాయించబడ్డారా అని ఎంతో ఆశక్తితో మునిగియున్నారు. ఇందువలననే ముందుగా నిర్ణయించుట అను సిద్ధాంతము యేసునందు విశ్వాసముంచు వారిలో దేవుని చేత ఇవ్వబడిన నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచుటకు బదులుగా వారు ఎన్నిక చేయబడ్డారా లేదా అను ప్రశ్నకు ప్రాధాన్యతను ఇచ్చినందున, ఎంతో గందర గోళమును పుట్టించినది.
ఈ సిద్ధాంతము క్రైస్తవ సత్యమును ప్రపంచములో మరొక మతముగా మార్చినది. ఇప్పుడు దేవుని నీతికి సాక్ష్యమిచ్చు నీరు మరియు ఆత్మ సువార్తతో పారద్రోలవసిన సమయము ఇది. ఆ విధముగా, నీవు మొదట ముందుగా నిర్ణయించబడుట అను సిద్ధాంతము సరియైనదో కాదో చూసుకొని, నీరు మరియు ఆత్మ సువార్తను తెలుసుకొని దానియందు విశ్వాసముంచుటచేత నీ అన్నిపాపముల నుండి విమోచించబడాలి. దేవుని చేత నిజముగా ఎన్నికచేయబడిన వారు ఎవరనగా ఆయన నీతిని ఎరిగి దానియందు విశ్వాసముంచువారు.
సత్యముచేత పలకబడిన ముందుగా నిర్ణయించుట మరియు ఎన్నిక
ఎఫెసీయులకు 1:3-5 వరకు చెప్పుచున్నది, ‘‘మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకను గ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు, తన చిత్తప్రకారమైన దయా సంకల్పము చొప్పున, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా మనలను స్వీకరించుటకై, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని జగుత్త పునాది వేయబడక మునుపే, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ‘‘ఎఫెసీయుల నుండి చెప్పబడిన ఈ వాక్య భాగము నందున్న ఎన్నిక ‘‘లోకము పునాది వేయబడక మునుపు క్రీస్తులోని’’ (ఎఫెసీ 1:4) ఎన్నిక. పాప రక్షణా కృప నుండి ఒక వ్యక్తిని కూడా యేసుక్రీస్తు మినహాయించలేదని చెప్పుచున్నది.
ఈ వాక్య భాగము నుండి, ముందుగా నిర్ణయించబడుట అను సిద్ధాంతము ఎంత ఖచ్చితముగా తప్పో మనము గట్టిగా చెప్పాలి. ఈ సిద్ధాంతము యొక్క ప్రాధమిక తప్పు అనునది ఏమనగా ఇది దేవుని ఎన్నిక స్థాయికి ఇది మొదలు నుండే విరుద్ధమైనది. అనగా ఎవరు రక్షించబడుదురు ఎవరు రక్షించబడరు అనునది దేవుని వాక్యముమీద ఆధారపడి వుండదు గాని, దీనికి బదులుగా ఆయన పరిధిలో మరియు షరతులు లేని నిర్ణయముపై ఆధారపడియుండును అనునది.
అటువంటి షరతులు లేని ముందుగా నిర్ణయించుట మరియు ఎన్నిక అను తర్కము మీద మన విశ్వాసము ఆధారపడినట్లయితే, మన ఉత్కంఠతతో మరియు నిశ్చయము లేని ఆందోళనతో మనము ఎప్పుడైనా యేసునందు ఏ విధముగా విశ్వాసముంచగలము? కాల్వనిజమ్ దేవుడు కేవలము అన్యాయస్తుడు మరియు సరియైనవాడు కాదు అనునట్లు త్రిప్పు ఒక తప్పు సిద్దాంతమును బోధించును. కాల్విన్ అటువంటి పొరపాటు చేయుటకు కారణమేమనగా అతడు దేవుని ముందు నిర్ణయమునుండి ‘‘యేసుక్రీస్తునందు’’ అను స్థితిని తీసివేసాడు, ఈ తప్పు చాలామందిని తప్పు దోవ పట్టించుటకు మరియు గందరగోళములో పడవేయుటకు తగినంత భయంకరమైపోయింది. అయితే లేఖనము మనకు స్పష్టముగా చెప్పుచున్నది. ‘‘దేవుడు మనలను ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నందు ఎన్నికొనెను.’’ (ఎఫెసీయులకు 1:4)
ఒకవేళ, కాల్వనిష్టులు చెప్పుకున్నట్లుగా, దేవుడు కొంతమందిని వారికి దేవునిగా వుండుటకు షరతులు లేకుండా ఎన్నుకొని మిగిలిన వారిని ఎటువంటి కారణము లేకుండా మినహాయించినట్లయితే, దీని కన్నా నిరర్ధకమైనదేమి వుంటుంది? కాల్విన్ చాలామంది మనస్సులో దేవునిని ఒక న్యాయము లేని దేవునిగా మార్చాడు. అయితే రోమా 3:29లో బైబిల్ మనకు చెప్పుచున్నది. ‘‘దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును. అన్యజనులకును దేవుడే.’’ దేవుడు ప్రతి ఒక్కరికి దేవుడు మరియు అందరికీ రక్షకుడు.
యేసు అందరికి దేవుడైయున్నాడు. యోహానుచేత ఆయన పొందిన బాప్తిస్మము మరియు సిలువపై ఆయన రక్తముచే మానవజాతి పాపములన్నిటిని ఆయనపైకి తీసుకొనుటచేత ఆయన ప్రతివారికి విమోచనము నిచ్చెను (మత్తయి 3:15). క్రీస్తు లోక పాపములన్నిటిని ఆయన బాప్తిస్మముతో భరించుటచేత మరియు ఈ పాపములను సిలువయొద్దకు మోసికొనిపోవుటచేత (యోహాను 1:29), మన స్థానములో ఈ పాపము కొరకు శిక్షించబడుటచేత (యోహాను 19), ఆయన ప్రతి పాపిని రక్షించెను అని లేఖనము చెప్పుచున్నది. యోహాను 3:16 కూడా మనకు చెప్పుచున్నది. ‘‘దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.’’ యేసుక్రీస్తు ప్రతి వాని పాపమును ఆయన బాప్తిస్మము తీసుకొని, సిలువపై మరణించెను, దేవునినీతిలో మానవులందరి కొరకు సమాధి నుండి లేచెను.
దేవుడు ఎవరిని పిలిచెను అను మన గ్రహింపు తప్పక ఆయన వాక్యముపై ఆధారపడియుండవలెను. ఆ విధముగా చేయుటకు, మనము రోమా 9:10-11 వరకున్న వాక్య భాగమును చూద్దాము. ‘‘అంతేకాదు, రిబ్కా మన తండ్రియైన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతియైనప్పుడు, ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పమును, క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగా నిలకడగా వుండు నిమిత్తము, పిల్లవాడింక పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును.’’
‘‘పిలుచువాని పిలుపు’’ నిలకడగా వుండు దేవుని ఉద్దేశ్యమని ఇది ఇక్కడ చెప్పుచున్నది. అప్పుడు దేవుడు ఎవరిని, యేసుక్రీస్తునందు పిలిచెను? దేవుడు పిలిచిన వారు ప్రాముఖ్యముగా పాపులు, ఏశావు యాకోబుల మధ్య దేవుడు ఎవరిని ప్రేమించెను? ఆయన యాకోబును ప్రేమించెను. దేవుడు స్వనీతితో నిండిన ఏశావు వంటి వారిని ప్రేమించలేదు గాని, యాకోబు వంటి పాపులను ఆయన ప్రేమించిన వారిని నీరు మరియు ఆత్మ సువార్తతో తిరిగి జన్మించునట్లుగా అనుమతించెను. ఇది యాకోబు వంటి పాపులను యేసుక్రీస్తు ద్వారా ప్రేమించుటకు, పిలుచుట దేవుని చిత్తమైన మంచి నీతి.
ఆదాము ప్రతివారికి పితరుడైనందున, అందరు ఒక పాపి సంతానముగా జన్మించారు. కీర్తనలు 51లో దావీదు చెప్పుచున్నాడు. అదేమనగా అతడు తల్లి గర్భమునందుండినప్పుడే పాపములో గర్భము ధరించబడియున్నానని ప్రజలు పాపులుగా జన్మించినందున, వారు వారి సంకల్పమునకు వేరుగా పాపము చేయుదురు. వారి జీవితకాలమంతా, వారి అంతము వరకు పాప ఫలమును ఫలించుటలో కొనసాగుదురు. మార్కు 7:21-27 వరకు చెప్పుచున్నది. ఆపిల్ చెట్టు ఆపిల్ పండ్లు కాయునట్లుగా మరియు మరియొక చెట్టు దాని కాయలు కాయునట్లుగా, మానవుడు వారి జీవిత కాలమంతా పాపములో జీవించుటకు బంధించబడియున్నారు. ఎందుకంటే వారు పాపముతో పుట్టారు.
నీ కోరికకు విరోధముగా నీవు పాపము చేయు అనుభూతిని నీవు తప్పక కలిగియుండాలి. ఇది ఎందుకంటే ప్రారంభము నుండి నీవు పాపిగా జన్మించావు. ప్రజలు వ్యభిచారముతో కలిపి దురాలోచనతోను, కామ వికారముతోను, నరహత్యలు, దొంగతనము, మత్సరము, దుష్టత్వము, మోసము, మోహము మరియు ఇటువంటి ఇతర పాపములుతో వారి మనస్సులో కలిగి జన్మించారు. ఇందువలననే ప్రతివారు అతని లేక ఆమె జీవితమును పాపములో జీవించుదురు. పాపము సంక్రమించబడినది. మన పితరులు మన మీద మోపిన పాపముతో మనము జన్మించినది మొదలుకొని, మనము ప్రాధమికముగా పాపములో జీవించుటకు తీర్మానించుకొనియున్నాము. ఈ కారణము చేతనే మనము యేసును మన రక్షకునిగా విశ్వసించవలెను మరియు దేవుని నీతిని విశ్వసించవలెను.
అప్పుడు దీని భావము దేవుని మొదటి పనియైన, ఆదాము విఫలమయ్యెననా? కాదు, దీని భావము ఇది కాదు. దేవుడు మానవజాతిని ఆయన కుమారులుగా చేయుటకు నిశ్చయించుకొనెను. అందువలన ఆయన మొదటి మనిషి పాపములో పడుటకు అనుమతించెను. యేసు బాప్తిస్మము మరియు ఆయన రక్తముతో ఆయన కుమారులుగా చేయుటకు ఒక క్రమములో మనలను రక్షించుటకు ఆయన ప్రాథమికముగా మనలను అనుమతించెను. అందువలన, మనము ఎటువంటి మినహాయింపు లేకుండా పాపులుగా జన్మించామని తెలుసుకొనవలెను.
ఏది ఏమైనా, దేవుడు సృష్టికి ముందే మానవజాతి పాపులగుదురని ఎరిగి, యేసుక్రీస్తును ఈ లోకమునకు పంపవలెనని నిర్ణయించుకొనెను. అప్పుడు ఆయన, యోహాను నుండి యేసుక్రీస్తు తీసుకొనిన బాప్తిస్మము ద్వారా, లోక పాపములన్నిటిని ఆయనపైన పెట్టి, సిలువపై మరణించునట్లుగా చేసెను. మరియొక మాటలో, పాపము నుండి ఈ విమోచనా మరియు దేవుని కుమారునిగా మారుట అను దీవెనలతో ఎవరు విశ్వసించుదురో వారిపై దీవెనలు క్రుమ్మరించునట్లుగా ఆయన నిర్ణయించుకొనెను. ఇది మానవజాతిని దేవుడు సృష్టించుటలో దేవుని ప్రణాళిక మరియు ఆయన సంకల్పము.
కొంతమంది ప్రజలు వారి అపార్ధములో ‘‘యాకోబును ఏశావును చూడుము. ఒకడు ఎన్నిక చేయబడి మరియొకడు వదలివేయబడలేదా?’’ అని అడగవచ్చు. అయితే దేవుడు యేసుక్రీస్తు వెలుపల ఎవరు రక్షించబడవలెనని కోరుదురో వారిని షరతులు లేకుండా ఎన్నకొనలేదు. ఆయన స్పష్టముగా యేసుక్రీస్తు ద్వారా ప్రతివారిని ఆయన కుమారులుగా చేయుటకు ఎన్నుకొనెను. పాత నిబంధనను మాత్రమే మనము పరిగణలోనికి తీసుకున్నప్పుడు, దేవుడు ఒక పక్షమునే ఎన్నుకొనెను అను అవగాహనకు మనము రావచ్చును. అయితే నూతన నిబంధనతో, మనము ఎటువంటి పొరపాటు లేకుండా ఆయన పాపులనందరిని రక్షించుటకు యాకోబు వంటి వారినే ఎన్నుకొనెనని మనము చూడగలము. దేవుడు ఆయన వాక్యముతో ఎవనిని పిలచెనో మనము స్పష్టముగా అర్ధము చేసుకొనవలెను మరియు విశ్వాసముంచవలెను.
ఏశావు మరియు యాకోబునకు సంబంధించి, ఎవనిని దే వుడు పిలిచెను, ప్రేమించెను? పూర్తి తప్పిదముతో, మోసము మరియు దుర్నీతితో నిండిన, ఆయన నీతితో అతనిని ప్రేమించుటకు రక్షించుటకు యాకోబును తప్ప మరి ఎవనిని పిలువలేదు. నీవు కూడా, ఈ సత్యమునందు అనగా తండ్రియైన దేవుడు ఆయన నీతియందు యేసుక్రీస్తు ద్వారా నిన్ను పిలిచెనని విశ్వాసముంచవలెను. నీవు తప్పక యేసుక్రీస్తునందు నీరు మరియు ఆత్మ సువార్త మంచి దేవుని నీతియను వాస్తవమునందు విశ్వాసముంచవలెను.
అప్పుడు, యాకోబు వంటి ప్రజలను దేవుడు ఎందుకు ఎన్నుకొనెను? దేవుడు యాకోబును ఎన్నుకొనెను ఎందుకనగా అతడు దుర్నీతిపరులైన మానవజాతులన్నిటికీ ప్రతినిధిగా వున్నాడు. దేవుని చేత యాకోబు పిలువబడుటకు ఆయన చిత్తముతో ఏకీభవించు ఒక పిలుపు; ‘‘మనము యేసుక్రీస్తునందు ఎన్నుకొనబడి యున్నాము’’ అను లేఖనముననుసరించిన ఒక పిలుపు. ఈ పిలుపు ‘‘ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము’’, క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా వుండు నిమిత్తము’’, అను వాక్య సత్యమునుకూడా కలిగియున్నది.
యేసుక్రీస్తు ద్వారా పాపులను రక్షించుట అనునది ఆయన ప్రేమతో దేవుని ప్రేమను పరిపూర్ణముగా నెరవేర్చుట కొరకైనది. ఇది పాపుల కొరకు దేవుని నీతి చేత స్థిరపరచబడిన రక్షణా చట్టము. ఆయన నీతితో వారికి వస్త్రము ధరింపజేయుటకు, స్వనీతి ఏ మాత్రము లేని, యేసుక్రీస్తు ద్వారా ఆయన పిలుపుకు జవాబిచ్చిన, యాకోబు వంటి ప్రజలను దేవుడు పిలిచెను.
బాగా వున్నారనిపించే స్వనీతి పరులను దేవుడు పిలిచెనా? లేక పూర్తిగా తప్పిదముతో నిండిన స్వనీతిలేని వారిని ఆయన పిలిచెనా? దేవుడు పిలిచిన వారెవరనగా యాకోబు వంటి ప్రజలు వారి పాపముచేత నరకమునకు నిర్దేశించబడిన పాపులను పిలిచెను మరియు రక్షించెను. నీవు కూడా, పుట్టినప్పటి నుండి దేవుని మహిమను పొందలేని ఒక పాపిగా ఉన్నావు. ఈ విధముగా నరకమునకు కట్టబడియున్నావు. మరియొక మాటలో, నీ నిజతత్వమును తెలుసుకొన అవసరము వుంది. దేవుడు యేసుక్రీస్తు ద్వారా పాపులనందరిని పిలిచెను ఆయన నీతియందు వారిని రక్షించెను.
దేవుని ప్రజలు అనువారు ఆయన నీతియందు విశ్వాసముంచుట చేత నీతిమంతు లుగా తీర్చబడినవారు. దేవుడు పాపులనందరిని పిలిచి వారిని యేసునందు విమోచించవలెనని ముందుగానే నిర్ణయించెను, ఆయన ముందుగా ఏమి నిర్ణయించెనో దానిని నెరవేర్చెను. ఇది దేవుడు మాట్లాడిన యేసుక్రీస్తునందు ముందు నిర్ణయము మరియు నిజమైన ఎన్నికను అర్ధము చేసుకొనుటకు, మనము తప్పక ఎన్నికమీద పాత నిబంధనలో వర్ణించినట్లుగా, తెర వెనకున్న సత్యమును మొదట అర్ధము చేసుకోవాలి.
పాత నిబంధన నుండి దేవుని ఎన్నిక వెనుక వున్న విషయము
ఆదికాండము 25:21-26 వరకు ఏశావు యాకోబు కథలను వారు ఇంకా వారి తల్లి గర్భములో వుండగానే వారి కధను గురించి మనకు చెప్పుచున్నది. ఈ ఇద్దరిలో, దేవుడు యాకోబును ఎన్నుకొన్నాడు. కాల్విన్ ఎన్నిక సిద్ధాంతమునకు ఈ వాక్యభాగమును ఆధారము చేసుకొన్నాడు. అయితే అతని గ్రహింపు దేవుని చిత్తమునకు దూరముగా వుందని మనము త్వరలోనే కనుగొంటాం. దేవుడు ఏశావు కంటే యాకోబును ఎందుకు ప్రేమించాడో దానికి ఒక కారణం వుంది. ఈ కారణమేమనగా, ఏశావు వంటి ప్రజలు, దేవుని మీద ఆధారపడి దేవునియందు నమ్మికయుంచుటకంటే, వారు వారి స్వంత శక్తిని నమ్ముకొనుట చేత జీవిస్తారు. అదే సమయంలో యాకోబువంటి ప్రజలు దేవుని మీద ఆధారపడి దేవునినీతియందు విశ్వాసముంచుటచేత జీవిస్తారు. దేవుడు ఏశావు కంటే యాకోబును ప్రేమించెను అని చెప్పినప్పుడు, దీని భావము దేవుడు యాకోబు వంటి ప్రజలను ప్రేమించెను అని. ఇందువలననే మనము ‘‘క్రీస్తునందు ఎన్నుకొనబడి యున్నాము.’’ (ఎఫెసీ1:4)
యేసు లేకుండా దేవుని నీతికి వెలుపల ‘‘షరతులు లేని ఎన్నిక’’ అనునది కేవలము ఒక తప్పు క్రైస్తవ సిద్ధాంతము. ఈ భావము అదృష్ట దేవున్ని క్రైస్తవ్యములోనికి తీసుకొని వచ్చి దానిని విశ్వసించునట్లు చేయుటకు సన్నిహిత సంబంధము కలిగినది. అయితే సత్యము మనము చెప్పుచున్నదేమనగా దేవుడు పాపులనందరిని యేసుక్రీస్తునందు ఎన్నుకొనెను. ఎందుకనగా దేవుడు పాపులనందరిని ‘‘యేసుక్రీస్తునందు’’ రక్షించుటకు ఎన్నుకొనెను. ఆయన ఎన్నిక ఒక న్యాయమైన ఎన్నిక. దేవుడు యాకోబును షరతులు లేకుండా ఎన్నుకొని ఏ ఆధారము లేకుండా ఏశావును తృణీకరించినట్లయితే ఆయన అన్యాయస్తుడైన దేవుడగును, అయితే ఆయన మనలను యేసుక్రీస్తు నందు పిలిచెను. ఆయన ఎవరిని పిలిచెనో వారిని రక్షించుటకు, లోక పాపములన్నిటిని, దేవుని నీతిని నెరవేర్చిన, ఆయన బాప్తిస్మముతో తీసుకొనుటకు, మరియు ఆయన ప్రశస్తమైన రక్తమును సిలువపైన చిందించుటకు, యేసును ఈ లోకమునకు పంపెను. ఈ విధముగా దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనలను ప్రేమించెను మరియు ఎన్నుకొనెను.
మనము మన మానవ ఆలోచ నలను త్రోసివేసి, లేఖనముకు చెందిన వాక్యమునందు అక్షరానుసారమైన విశ్వాసముగాక, ఆత్మీయముగా మనలనందరినీ ఎన్నుకొనెను. అయితే కాల్విన్ దేవుని ఎన్నికను ఏ విధముగా పరిగణిస్తాడు? ఒకడు దేవుని నీతిని ఎరిగి దీనియందు విశ్వాసముంచినప్పుడు నిజ విశ్వాసము కనుగొంటాడు. మానవ ఆలోచనలను సత్యముగా విశ్వసించుట, ఒక విగ్రహమును పూజించుట వంటిదేకాని, దేవునిని పూజించుట వంటిది కాదు.
యేసు ద్వారా దేవుని నీతియందు విశ్వాసముంచుట అనునది స్పష్టముగా తప్పు సిద్ధాంతమైన ముందుగా నిర్ణయించుటను విశ్వసించుట నుండి దూరముగా వుండును. లిఖించబడిన దేవుని వాక్యము ప్రకారముగా మనము యేసును ఎరిగి విశ్వసించనట్లయితే, కారణమును వివేచింపలేని జంతువులకన్నా మనమే మాత్రము బేధమును కలిగియుండలేము. మనము ‘‘యేసుక్రీస్తునందు’’ దేవుని నీతి ముద్ర చేత దేవుని కుమారులుగా ఎన్నిక చేయబడియున్నాము. లేఖన ఆధారముతో మనము తప్పక మన విశ్వాసమును పరీక్షించుకోవాలి.
కాల్వినిజమ్ యొక్క ఐదు సిద్ధాంతములలో ఒకటి ‘‘పరిమితి ప్రాయశ్చిత్తము’’ను గురించి మాట్లాడును. ఈ సిద్ధాంతము లోకములోనున్న అనేకులలో, కొంతమంది దేవుని రక్షణ నుండి మినహాయించబడిరి అని చెప్పుకొనును. అయితే దేవుని న్యాయము మరియు ఆయన నీతి ఎన్నటికి అన్యాయముగా వుండలేదు. లేఖనము మనకు చెప్పుచున్నది దేవుడు ‘‘ఆయన, మనుష్యులందరు రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవము గలవారై యుండవలెనని యిచ్ఛయించుచున్నాడు.’’ (1వ తిమోతి 2:4) రక్షణా దీవెన కొంతమందికి అనుమతించబడక, కొందిరికి అనుగ్రహించబడిన, ఒక పరమితి కలిగిన దీవెన అయినట్లయితే, యేసు నందు వారి విశ్వాసమును వదలివేయు ప్రజలు అనేకులున్నారు. అటువంటి తప్పు సిద్ధాంతములయందు విశ్వాసముంచు ప్రజలు తప్పక నీరు మరియు ఆత్మ సువార్తకు మరవలెను. యేసుక్రీస్తును వారి స్వంత రక్షకునిగా విశ్వసించుటచేత, వారి పాపము నుండి రక్షించబడి శాశ్వత జీవమును పొందవలెను. దేవుడు ఆయన నీతితో యేసుక్రీస్తు ద్వారా ప్రతి ఒక్కరిని రక్షించెను.
ఒకవేళ దేవుడు నిజముగా కొంతమందిని ప్రేమించి ఇతరులను ద్వేషించినట్లయితే, ప్రజలు దేవునికి తమ వీపు చూపుదురు. ఇప్పుడు, దేవుడు ఇక్కడ నిలబడి వున్నాడనుకొందాము. దేవుడు ఎటువంటి కారణము లేకుండా తన కుడిచేతివైపున ఉన్నవారిని రక్షణకు ఎన్నుకొని తమ ఎడమచేతి వైపున వున్నవారిని నరకమునకు విడిచిపెట్టునా? ఎడమచేతి వైపున వున్నవారికి దేవునికి విరోధముగా లేచుట తప్ప మరొక అవకాశమే లేదు. ఒకవేళ దేవుడు ఈ విధముగా వున్నట్లయితే, ఈ ప్రపంచములో ఎవరు ఆయనను నిజదేవునిగా ఆరాధిస్తారు? షరతులు లేకుండా దేవునిచేత ద్వేషించబడినవారు దానిని బట్టి ఆయనకు విరోధముగా లేస్తారు, వారు కూడా, దేవునిని ద్వేషిస్తారు. చివరికి ఈ లోకములో వున్న నేరస్తులు కూడా వారికి వారి స్వంత విలువలు నిజాయితీ వున్నదని చెప్పుదురు. అప్పుడు, మన సృష్టికర్త ఏ విధముగా న్యాయములేని వాడు, మరియు అటువంటి అన్యాయస్తుడైన దేవునిని ఎవరు విశ్వసిస్తారు?
మన తండ్రియైన దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తునందు కనుగొనబడిన దేవునినీతి చేత పాపులనందరిని రక్షించుటకు నిశ్చయించుకొనెను. ఇందువలననే కాల్వనిస్ట్ కొంతమట్టుకైన ప్రాయశ్చిత్త సిద్ధాంతమునకు దేవునినీతితో పనిలేదు. అయినప్పటికి ఇటువంటి తప్పు సిద్ధాంతము వలన, చాలామంది ప్రజలు దురదృష్టవశాత్తు దేవునిని తప్పుగా విశ్వసించుటలో లేక ఆయన నుండి మరలిపోవుటచేత, ఇప్పటికీ నశించి పోవుచున్నారు, ఇదంతా వారి స్వంత అపార్ధము నుండి సంభవించినది.
ఒక అసత్యముతో నిండిన సినిమా
కొన్ని సంవత్సరముల క్రితము ‘‘ది స్టాండ్’’ అని పేరు పెట్టబడిన, స్టెఫెన్‌కింగ్ నవల, ఒక చిన్న టీవి సీరియల్‌గా చేయబడినది. ఇది ప్రపంచ వ్యాప్తముగా గొప్ప ప్రఖ్యాతి నార్జించింది. ఈ నవల సన్నివేశము ఈ విధముగా బహిర్గతము చేస్తుంది. 1991 సంవత్సరములో, ఒక రోగము అమెరికాలో వచ్చింది. ఈ రోగమును ‘నిరోధించు’ కొన్ని వేలమందిని మాత్రమే విడిచిపెట్టి అమెరికాను కుదిపివేస్తుంది. ఈ విధముగా బ్రతికిన వారిలో, దేవుని స్వభావసిద్ధముగా ఆరాధించువారు కొలరాడో వున్న బౌల్డర్‌లో కులుసుకున్నారు. ‘‘చీకటి మనిషిని’’ పూజించువారు లాస్ వేగాస్‌లో కలుసుకున్నారు. ఈ రెండు ముఠా ప్రజలు వేరువేరుగా, ఒక దానిని మరియొటి అంతము చేసుకొనే వరకు, తిరిగి సంస్థను ఏర్పరచుకొన్నారు.
బ్రదికిన వారిలో, స్టార్ట్ అను ఒక యౌవనస్తుడు పదే పదే ఈ లోకము అంతమగునను కుంటున్నాడు, అబీగయిలు అను పిలువబడిన ఒక వయస్సున్న ఆడమనిషి, నిన్ను దేవుడు ఇప్పటికే ఎన్నుకొన్నాడని గుర్తుచేస్తు, ఫలానా స్థలమునకు వెళ్ళమని అతని కలలో చెప్పుచూ వుంటుంది. ఈ సినిమాలో, అతడు దేవునియందు లేక యేసుక్రీస్తునందు విశ్వాసముంచనప్పటికి, దేవుడు అతనిని ముందుగానే ఎన్నుకొనినందున దేవుడు ఈ యవ్వనస్థున్ని రక్షిస్తాడు.
అప్పుడు, కనీసము యేసునందు విశ్వాసముంచని వారిని ఎటువంటి షరతులు లేకుండా రక్షించునా? రక్షించదనుకోండి. దేవుడు యేసుక్రీస్తు నందు ఆయన నీతియందు విశ్వాసముంచువారిని వారి పాపములనుండి రక్షించుటకు ప్రతివారిని ముందుగానే నిర్ణయించెను.
ఈ సినిమా కధాగమనము కాల్విన్స్ సిద్దాంతములైన ముందుగా నిర్ణయించుట మరియు ఎన్నుకొనుట అనువాటి మీద ఆధారపడినది. ఈ సినిమా దేవుడు ఒక పరిధిలో కొంతమందిని సిద్ధాంతములోని కొంత భాగమును తెలిపే ఒక కధ. ఏ విధముగా దేవుడు ఒక పరిధిలో కొంతమందిని నరకమునకు పంపుటకు మిగిలిన వారిని రక్షించుటకు నిర్ణయించుకొనగలడు? దేవుడు న్యాయస్థుడైనందున, ప్రతివారిని యేసుక్రీస్తు నందు ముందుగానే నిర్ణయించి ఎన్నుకొనెను. మరియు ఆయన నీతి రక్షణ నుండి ప్రక్కన పెట్టబడినవారు ఒక్కడు కూడా లేడు. యేసుక్రీస్తు లేకుండా దేవుని ముందు నిర్ణయము మరియు ఎన్నిక అనునవి అర్ధము లేనివి మరియు బైబిల్‌కి చెందినవి కావు. చాలామంది వేదాంత పండితులు దేవుడు కొంతమందిని ఎన్నుకొని కొంతమందిని విడిచిపెట్టెను అని చెప్పుట దురదృష్టము.
ఆయన విశ్వమును సృష్టించక మునుపే, దేవుడు పాపులనందరిని రక్షించుటకు మరియు ఆయన నీతితో వారిని యేసుక్రీస్తు ద్వారా ఆయన కుమారులుగా చేసుకొనుటకు ప్రణాళిక వేసెను. మరియొక మాటలో, యేసుక్రీస్తు సువార్తద్వారా పాపులనందరిని ఎన్నుకొనెను. అప్పుడు నీవు ఏ విధముగా విశ్వసిస్తావు?
కొండ లోతులలో ధ్యానము చేయు బౌద్ధ సన్యాసులు దేవుని ఎన్నిక నుండి మినహాయించబడ్డారని నీవు విశ్వసిస్తావా? యేసుక్రీస్తు లేకుండా దేవుని ముందు నిర్ణయము మరియు ఎన్నిక షరతులు లేనివైతే, ఆయన వాక్యమునకు బోధించవలసిన అవసరమే మనకు ఉండేదికాదు. దాని యందు విశ్వాసముంచవలసిన ఆయన వాక్యమును బోధించవలసిన అవసరమే మనకు ఉండేది కాదు. దానియందు విశ్వాసముంచవలసిన అవసరము వుండేది కాదు. ఒకవేళ, రక్షకుడైన యేసుక్రీస్తు లేకుండా కొంతమంది రక్షించబడుటకు మరియు కొంతమంది రక్షించబడకుండా వుండుటకు నిర్దేశించబడినట్లయితే, పాపులు యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలసిన అవసరమే వుండేది కాదు. యేసు ఆయన బాప్తిస్మము మరియు సిలువపైన ఆయన రక్తముతో మన పాపముల నుండి మనలను రక్షించెను అనునది చివరికి ఇది కూడా విశ్వాసముంచని ఈ బౌద్ధ సన్యాసులకు కూడా దేవుడు అనుమతించెను, అయితే వారు పశ్చాత్తాపపడి వారి మనస్సులను దేవునివైపు త్రిప్పినప్పుడు మాత్రమే ఇది జరుగును.
యేసుక్రీస్తు నందు విశ్వాసముంచి తమ జీవితమును జీవించువారు ఈ లోకములో చాలామంది వున్నారు. మనము వీరిని రెండు సమూహములుగా విభజించుటకు ఒక సమూహము ఏశావు వంటి సమూహమగును రెండవది యాకోబు వంటి వారి సమూహమగును. యాకోబు వంటి ప్రజలు వారిని వారు నరకమునకు వెళ్ళవలసినవారితో పోల్చుకుంటారు. ఆ విధముగా యేసు ద్వారా ఇవ్వబడిన నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచుట చేత వారి పాపముల నుండి వారు రక్షించబడుదురు. రెండవ సమూహము యేసుక్రీస్తునందున్న విశ్వాసమునకు తమ స్వంత కృషిని జతచేయుట ద్వారా ద్వారములోనికి ప్రవేశించాలని ప్రయత్నించు ఏశావు వంటి ప్రజలతో ఏర్పరచబడిన సమూహము.
ఎవరి వంటి వాడవు నీవు? యాకోబు వంటి వాడవా లేక ఏశావు వంటి వాడవా? నీవు దేవుని నీతియందు విశ్వాసముంచుచున్నావా? లేక ముందుగా నిర్ణయించబడుట అను తప్పు సిద్ధాంతమునందు విశ్వాసముంచుచున్నావా? నీ నిర్ణయము ఈ రెండు సిద్ధాంతములలో దేనిపట్ల వుంటుందో దానిని బట్టి నీవు నరకములో అంతమౌతావా లేక పరలోకములో వుంటావా అను దానిని నిర్ణయించును. నీవు తప్పక దేవుని నీతితో చెప్పబడిన, నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచుటచేత దేవునితో సమాధానము కలిగియుండుటకు ఈ తప్పు సిద్ధాంతమును త్రోసివేసి దేవుని నీతిని పొందాలి. ఈ విశ్వాసము మాత్రమే మన పాపము నుండి పరిపూర్ణ విడుదల కలుగచేయును మరియు శాశ్వత జీవమును ఇచ్చును.