• All e-books and audiobooks on The New Life Mission website are free
  • Explore multilingual sermons in global languages
  • Two new revised editions in English have been released
  • Check out our website translated into 27 languages
Search

Sermons

అంశం 9: రోమీయులకు ( రోమా పత్రిక పుస్తకం పై నున్న వ్యాఖ్యానం)

[అధ్యాయము 8-11] శాశ్వతమైన ప్రేమ (రోమా 8:31-34)

(రోమా 8:31-34)
‘‘ఇట్లుండగా ఏమందుము? దేవుడు మనపక్షమున నుండగా మనకు విరోధియెవడు? తనసొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతోపాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవునిచేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే; శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే; అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మనకొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే.’’
 

ఒకవేళ దేవుడు ఇప్పటికే సృష్టికిముందే ఆయన నీతితో మనలను కప్పుటకు నిర్ణయించుకొనినట్లయితే, దీనిని కదలించువాడు ఎవడును లేడు. నీతిమత్వ సిద్ధాంతమునందు కాక దేవునినీతియందు మనము విశ్వాసముంచుటచేత, సరియైన విధానములో పాపములేనివాడుగా చేయబడినవారు నిజమైన దేవుని కుమారులు. 
ఈ విధముగా, మతపరమైన ప్రజలందరు సరియైనవారు కారు. కొంతమంది ప్రజలు కేవలము యేసునందు విశ్వాసముంచినందుకు హింసించబడుచున్నారు. అయితే వారిలో దేవుని నిజమైన నీతిని ఎరుగని వారు హింసించబడుచున్నారు. ఏది ఏమైనా, ఆయన నీతియందు విశ్వాసముంచుటచేత దేవుని పిల్లలుగా మారినవారు ఎన్నడును దేవుని నుండి వేరు చేయబడలేరు. దేవుడు ఆయన నీతి సువార్తను మనకిచ్చినప్పుడు, మనకు విరోధి ఎవడు?
 

దేవుడు ప్రతిదానిని ఒక వరముగా మనకిచ్చాడు

‘‘తన సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతోపాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు?’’ (రోమా 8:32)
ఆయన కుమారునియందు విశ్వాసముంచుటచేత దేవునినీతిని పొందినవారికి, దేవుడు ప్రతిదానిని ఒక వరముగా అనుగ్రహించాడు పరలోక రాజ్యము, దేవుని కుమారులుగా మారు భాగ్యము, దేవుని వాక్యమును అర్ధము చేసుకొను కృప, నీతి యొక్క పనివానిగా జీవించు సామర్థ్యము గల దీవెన, మరియు శాశ్వత జీవము యొక్క దీవెన.
ఒక క్రమములో మనలను ఆయన కుమారులుగా చేయుటకు దేవుడు ఆయన కుమారుని మనకిచ్చెను. ఆయన మనకివ్వనిది ఏముంటుంది? ఆయన నీతిద్వారా నిజ విశ్వాసమును పొందినవారికి దేవుడు పరలోక మరియు ఇహలోక దీవెనలన్నిటిని ఇచ్చాడు. విశ్వాసులు మరియు దేవుని సేవకులు ఆయన నీతిని బట్టి యుగయుగములు ఆయనను స్తుతిస్తారు.
 

దేవునిచేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు?

‘‘దేవుని చేత ఏర్పరచబడిన వారిమీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన యేసుక్రీస్తే; అంతేకాదు, మృతులలో నుండి లేచినవాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము చేయువాడును ఆయనే’’ (రోమా8:33-34)
యేసుక్రీస్తునందున్న ఆయన నీతితో దేవుడు ఎవరిని ఏర్పరచుకొనెనో ఆ ప్రజలకు విరోధముగా ఎవడును నేరము మోపలేడు, యేసుక్రీస్తును బట్టి, దేవుని నీతితో వారిని పాపమునుండి స్వతంత్రులనుగా చేసెను. యేసుక్రీస్తు ద్వారా దేవుని నీతియందు విశ్వాసముంచు ప్రజలు వారి హృదయములో పాపమును కలిగిలేరు. ఇది ఎందుకనగా, ఆయన నీతియందు విశ్వాసముంచుటచేత పాపములేని వారిగా చేసినది దేవుడే కాని మరియొకరు కాదు.
దేవుని కుమారుడైన, యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకమునకు వచ్చి, బాప్తిస్మమిచ్చు యోహాను చేత బాప్తిస్మము పొందెను. లోకపాపము భారమంతటిని ఆయనపైకి తీసుకొనెను, సిలువపై మరణించి మూడు దినములలో సమాధి నుండి తిరిగి లేచెను, విశ్వాసముంచువారికి ప్రభువయ్యెను.
ఇందువలననే దేవునినీతియందు విశ్వాసముంచుటచేత నీతిమంతులుగా మారినవారు పాపులని తప్పు చేయువారని మనము చెప్పలేం. ఇప్పటికి ఆయన నీతియందు విశ్వాసము గలవారిని దేవుడు గుర్తించును. దీనికి ఒక స్వాస్థ్యముగా పరిశుద్ధాత్ముడు వారి హృదయములో నివశించును. అందువలననే ఎవడును దేవునినీతికి అపకీర్తిని కలిగించలేడు లేక ఆయన నీతియందు విశ్వాసముంచుటచేత పాపము క్షమించబడిన వారికి అపకీర్తిని కలిగించలేడు.
దేవుని నీతి, యేసుక్రీస్తు బాప్తిస్మము మరియు సిలువపైన ఆయన రక్తమును చిందించుట, ఆయన మరణము మరియు పునరుత్థానము ద్వారా కనబడెను. యేసుక్రీస్తు, దేవుని నీతినంతటిని నెరవేర్చిన తరువాత, దేవుని కుడి పార్శ్వమున మన రక్షకునిగా విజ్ఞాపనము చేయువానిగాను కూర్చుండెను.