• All e-books and audiobooks on The New Life Mission website are free
  • Explore multilingual sermons in global languages
  • Two new revised editions in English have been released
  • Check out our website translated into 27 languages
Search

Sermons

అంశం 9: రోమీయులకు ( రోమా పత్రిక పుస్తకం పై నున్న వ్యాఖ్యానం)

[అధ్యాయము 8-12] మనకు విరోధముగా నిలుచు ధైర్యము గలవారు ఎవరు? (రోమా 8:31-34)

(రోమా 8:31-34)
‘‘ఇట్లుండగా ఏమందుము? దేవుడు మనపక్షముననుండగా మనకు విరోధియెవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతోపాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవునిచేత ఏర్పరచబడినవారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే; శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచినవాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే.’’
 

రోమా 8:31-34లో విశ్వాసుల నుండి వేరుపరచలేని క్రీస్తు ప్రేమను గురించి నీరు మరియు ఆత్మ సువార్తను వివరించుచు మరియు దీని ఆఖరి ముగింపునకు వచ్చుచూ, పౌలు సాక్ష్యమిచ్చుచున్నాడు. ఈ వాక్య భాగము గొప్ప రక్షణానందమును గురించి ప్రకటించును మరియు విశ్వాసపు శిఖరాగ్రమును చేరుకుంది.
రోమా 8:31లో పౌలు చెప్పెను, ‘‘ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధియెవడు?’’ పౌలు వలె సమయము గడుచుకొలది ఈ నీరు మరియు ఆత్మ సువార్తకాంతిని వెదజల్లునను అనుభవము మనకున్నది మరియు మన బలహీనతలు ప్రత్యక్షమగు కొలది ఇది గొప్ప రక్షణా సువార్తగా మారును. మనము నీరు మరియు ఆత్మ సువార్తను సేవించుచున్న కొలది, మనము మరింత ఎక్కువగా ఆనందముతోను స్థిర విశ్వాసముతోను నింపబడుదుము.
ఆయన నమ్మిన సువార్తను పౌలు ‘‘నా సువార్త’’ (2వ తిమోతి 2:8) అని పిలిచాడు. పౌలు సాక్ష్యమిచ్చిన సువార్త అనునది యేసు బాప్తిస్మము మరియు రక్తముయందున్న విశ్వాసము తప్ప మరియొకటి కాదు.
‘‘నా సువార్త’’ అని పౌలు బోధించినది మతపరమైన ప్రజలు విశ్వాసముంచిన సిలువ సువార్తను సూచించదు, అయితే యేసు మానవజాతి పాపమును ఒక్కసారే అన్నిటిని తీసుకొనిపోయెను అని ప్రకటించు, నీరు మరియు ఆత్మ సువార్తను సూచిస్తుంది.
ఈ సువార్త పౌలును ఒక గొప్ప ధైర్యముగల మనిషిగా చేసింది. అతడు పాపము క్షమాపణను పొందినప్పటి నుండి దేవునినీతి ఆయన హృదయములో నిండినది ఆ విధముగా అతని హృదయము పరిశుద్ధాత్మచేత నింపబడినది. అతడు అతని జీవితకాలమంతా నీరు మరియు ఆత్మ సువార్తకు సాక్ష్యమిచ్చుటకు అంకితము చేసుకొన్నాడు. నీరు మరియు ఆత్మ సువార్తకు మానవజాతి పాపములన్నిటిని ఒక్కసారిగా తీసివేయు శక్తిని మరియు అధికారమును కలిగియున్నది.
అప్పుడు, పౌలు విశ్వాసముంచిన నీరు మరియు ఆత్మ సువార్తకు విరోధముగా నిలుచువాడు ఎవడు? ఎవడును లేడు! రోమా 8:31 మనకు చెప్పుచున్నది. ‘‘ఇట్లుండగా ఏమందుము? దేవుడు మనపక్షముననుండగా మనకు విరోధియెవడు?’’ నీరు మరియు ఆత్మ సువార్తను విశ్వసించువారికి విరోధముగా నిలుచువాడు ఎవడు? నీరు మరియు ఆత్మ సువార్త ద్వారా దేవుడు మానవజాతిని లోకపాపముల నుండి రక్షించినప్పుడు, ఆయన శక్తిని శూన్యముగా చేయువాడు ఎవడు? యేసు నామమందు మాత్రమే విశ్వాసముంచు వారేమి, లేక సాతాను తనకు తానేమీ నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచువారికి విరోధముగా నిలువలేడు ఓడించలేడు.
 

ఆయన మనలనందరిని ఒక్కసారే నీతిమంతులుగా తీర్చెను

రోమా 8:29-30 వ్యాఖ్యానించుచున్నది. ‘‘ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్టుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనోవారిని మహిమపరచెను.’’
ఇది తండ్రియైన దేవుడు పాపులనందరిని రక్షించుటకు ప్రణాళిక వేసెను మరియు నీరు మరియు ఆత్మసువార్త ద్వారా వారిని పిలిచెను, వారిని ఆయన కుమారులుగా చేయుటకు వారి పాపములన్నిటిని ఒక్కసారే కడిగివేసెను అని చెప్పుచున్నది. ఎప్పుడైతే ప్రభువు నీరు మరియు ఆత్మ సువార్త ద్వారా పాపులనందరిని వారి పాపమునుండి రక్షించెనో, ఆయన చేసిన దానికి విరోధముగా ఎవరు నిలువగలరు?
నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచుటచేత నీతిమంతులుగా తీర్చబడినవారిపైన విజయము సాధించుట ఎవరికి సాధ్యపడగలదు? ఇది అర్ధరహితం. నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచి నీతిమంతులుగా తీర్చబడినవారికి విరోధముగా నుండువాడు దేవునికి విరోధముగా నుండుట తప్ప మరియొకనికి కాదని నీవు తప్పక తెలుసుకొనవలెను. నీవు తప్పక నీ పాపము నుండి రక్షించబడుటకు ఏ విధముగానైనను నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచవలెను. నీవు నీ మనస్సు నీ హృదయమునందు ఈ సత్యమునకు విరోధముగా వున్నట్లయితే, అప్పుడు నీవు నీ పాపమునుండి రక్షించబడవు మరియు నీవు నరకమునకు వెళ్ళునట్లు శిక్షించబడుదువు.
 

దేవుని నీతి కలిగినవారికి విరోధముగా ఎవడును వుండలేడు

‘‘ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధియెవడు?’’ (రోమా 8:31) ఆ దేవుడు మన కొరకు నీరు మరియు ఆత్మ సువార్తద్వారా ఆయన మన పాపములన్నియు తీసుకొనిపోయి మనలను రక్షించెను వాస్తవమునకు ప్రాతినిధ్యము వహించుచున్నాడు. అప్పుడు, నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచుటచేత వారి పాపముల నుండి విమోచించబడినవారికి విరోధముగా ఎవడు వుండగలడు, ఎవనికి ఈ విశ్వాసము తప్పు అని చెప్పుట సాధ్యమగును? ఇది ఒక ఉపయోగములేని వేదనతోకూడిన అబ్యాసమౌతుంది. నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచువారి విశ్వాసమునకు దేవుడు సమ్మతించాడు.
ఎవడైనను ఏ విధముగా దీనిని సవాలు చేయగలడు? యేసు ఆయన బాప్తిస్మము మరియు సిలువపైన ఆయన రక్తముతో లోక పాపములన్నిటిని మోసికొని పోయెను. దీనియందు విశ్వాసముంచువారు తప్పు చేయుచున్నారని ఎవరు చెప్పగలరు? ఎవరును లేరు?
రోమా 6:3లో పౌలు చెప్పెను, ‘‘క్రీస్తుయేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా?’’ పౌలు భావమేమనగా అతడు దేని ద్వారా అతని పాపములన్నియు యేసుపైకి బదిలీ చేయబడినవో మరియు శుద్ధీకరింపబడినవో ఆ యేసు బాప్తిస్మమునందు, సిలువపైన ఆయన రక్తమునందు, మరియు దేనితో పౌలు చనిపోయి క్రీస్తునందు పునరుత్థానుడయ్యెనో దానియందు అతడు విశ్వాసముంచెను.
గతీయులకు 3:27 కూడా మనకు చెప్పుచున్నది, ‘‘క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు.’’ ఈ వాక్య భాగము యేసుక్రీస్తు, ఆయన బాప్తిస్మముతో లోకపాపములన్నియు తీసుకొని, ఈ పాపమును బట్టి సిలువపైన సిలువవేయబడెను, పునరుత్థానుడయ్యెను, ఈ సత్యమునందు విశ్వాసముంచు వారందరు దేవుని కుమారులుగా చేయు దీవెనలతో ఇవన్నియు మనకు బహుమానముగా ఇవ్వబడెను అని మనకు చెప్పుచున్నది. పౌలు విశ్వాసము అతడు యేసులోనికి బాప్తిస్మము పొందియున్నాడని, సిలువపై యేసుతో మరణించెనని, మరియు ఆయనతో పునరుత్థానుడయ్యెనని దానిని ఆధారము చేసుకొనియున్నది. కావున, ఒకసారి నీవు యేసు బాప్తిస్మమునందు విశ్వాసముంచి నప్పుడు, నీ పాపములన్నియు కడిగి వేయబడెను మరియు యేసుక్రీస్తుతో పునరుత్థానుడవగుట చేత నీవు దేవుని కుమారుడవగుదువు.
‘‘క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు.’’ మరియొక మాటలో, యేసు ఈ లోకమునకు వచ్చెను మరియు లోక పాపములన్నిటిని ఆయనపైకి తీసుకొనుటకు బాప్తిస్మమిచ్చు యెహానుచేత బాప్తిస్మము పొందెను, అని విశ్వసించువారు యేసులోనికి బాప్తిస్మము పొందియున్నారు. దీనిని మించి, వారు యేసుతో కూడా సిలువపైన మరణించారని కూడా విశ్వసించుదురు మరియు వారి విశ్వాసముచేత ఆయనతో వారు పునరుత్థానులయ్యారు.
కావున యేసు బాప్తిస్మము నందు మరియు ఆయన రక్తమునందు విశ్వాసముంచువాడు ఎవడైనను అతని/ఆమె పాపము నుండి రక్షించబడును. యేసు నిశ్చయముగా దేవుని కుమారుడెలాగయ్యెనో, క్రీస్తు బాప్తిస్మము మరియు రక్తమునందు విశ్వాసముంచుటచేత విమోచించబడిన వారు ఆ విధముగా దేవుని కుమారులగుదురు. ‘‘క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు.’’ మనము నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచినప్పుడు, మనము దేవుని కుమారులగుటకు క్రీస్తు నీతిని ధరించుకొందుము.
పౌలు యేసు బాప్తిస్మమును గురించి మాట్లాడెను ఎందుకనగా ఆయన నీరు మరియు ఆత్మ సువార్త యందు విశ్వాసముంచుట చేత ఒక గొప్ప దీవెనను పొందెను. అయితే చాలామంది ఇప్పటికి దేవునినుండి నీరు మరియు ఆత్మ సువార్తతో వచ్చు అటువంటి ఒక దీవెనను పొందవలసియున్నది. అత్యధికులు పౌలు బోధించినది సిలువ సువార్త అని తలంచుదురు, అయితే సత్యమేమంటే యేసు బాప్తిస్మమును సిలువపైన ఆయన రక్తముతో కలుపు నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచెను మరియు వ్యాప్తి చేసెను.
అప్పుడు, ఎందుకు యేసును వెంబడించువారు నేడు ఈ నీరు మరియు ఆత్మ సువార్తను ఎరుగకయున్నారు? అది సంఘము యొక్క కాలములో బోధించబడిన ఈ నీరు మరియు ఆత్మ సువార్త కాలముతో మార్పు చెందింది. ఆదిమ సంఘ కాలములో, విశ్వాసులందరు నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచారు మరియు బోధించారు.
ఏది ఏమైనప్పటికి, ఈ మధ్యలో, ఈ సువార్త మార్చబడి ఆయన బాప్తిస్మమును పూర్తిగా ప్రక్కనపెట్టి కేవలము సిలువ సువార్తగా మాత్రమే బోధించబడినది. ఇది, ఎందుకు, ఇప్పటికి కూడా, ఆదిమ సంఘ కాలములో వున్న నిజ సువార్త నుండి ప్రక్కకు తప్పిస్తూ, అత్యధికులు సిలువ రక్తమునందే విశ్వాసముంచుచున్నారు అను దానిని వివరించుచున్నది.
ఇటువంటి ప్రజలు ఇప్పటికీ వారిలో పాపమును కలిగివున్నారు. దేవునినీతి ప్రత్యక్షపరచబడిన, నీరు మరియు ఆత్మ సువార్తను వారు ఎరుగక యున్నారు. ఆ విధముగా వారు యేసునందు విశ్వాసముంచుచున్నాము అని చెప్పుచున్నప్పటికీ, ఇప్పటికీ పాపులే, వారు ఇప్పటికి దేవుని నీతికి విరోధముగా వున్నారు.
ఆత్మీయముగా గ్రుడ్డివాడు అయినవాడు దేనిని చూడగలడు? గ్రుడ్డివాడు ఒక ఏనుగును తట్టి చూచి అర్ధము చేసుకొనుటకు ప్రయత్నించవచ్చును. ఒక గ్రుడ్డివాడు ఒక ఏనుగు కాలును తట్టిచూచి ఇది ఒక స్తంభము అని చెప్పవచ్చు. అయినప్పటికి మరొక గ్రుడ్డివాడు దాని తొండమును తాకి చూచి ఇది ఏదో పొడవుగా వుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే వారిద్దరిలో నీరు మరియు ఆత్మ సువార్త యొక్క గొప్పతనమును గురించి మాట్లాడలేదు.
కావున, నీరు మరియు ఆత్మ సువార్త యొక్క దీవెనను ఎరుగనివారు దీనిని బోధించలేరు. చూడకలిగినవారు ఎవడైన దేనినైనా మాటలతో చెప్పుటకు ప్రయత్నము చేసినప్పుడు అర్ధము చేసుకొనగలడు, అయితే గ్రుడ్డివాడు ఎన్నడును దీనిని వాస్తవముగా అర్ధము చేసుకొనలేడు.
ప్రజలందరు పుట్టుకతో పాపులు. మనము పుట్టుకనుండి ఆత్మీయముగా గ్రుడ్డివారమైనందున మనకు నీరు మరియు ఆత్మ సువార్త సత్యమును మనము ఎరుగము. యేసు సిలువ రక్తమునందు మాత్రమే విశ్వాసముంచువారు స్వంతగా ఒక నూతన క్రైస్తవ్య విధానమును తయారు చేసారు. సిలువ రక్తమునందు మాత్రమే వారు విశ్వాసముంచుచు వారు యేసునందు విశ్వాసముంచుచున్నామని చెప్పుకొనునప్పుడు వారి పాపములు ఏ విధముగా కడగబడగలవు? సమయము గడిచిన కొలది ఎన్నో ఎన్నో పాపములు పేరుకుపోవును.
యేసు రక్తమునందు విశ్వాసమును మాత్రమే రక్షణగా విశ్వసించువారు ఆత్మీయముగా ఇప్పటికి మేల్కొననివారు. అయితే యోహాను 3:5లో యేసు స్పష్టముగా చెప్పుచున్నాడు. ‘‘ఒకడు నీటిమూలమున ఆత్మమూలమున తిరిగి జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడు.’’ దేవుని కుమారులుగా మారుట మరియు ఆయన రాజ్యములో ప్రవేశించుట అను మహిమతో ఒక క్రమములో దీవించబడుటకు మనము తప్పక నీరు మరియు ఆత్మ సువార్తయందు తప్పక విశ్వాసముంచవలెను.
పౌలు నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచినప్పటి నుండి, అతడు విశ్వాసముతో, ‘‘దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధియెవడు?’’ (రోమా 8:31) అని చెప్పుచున్నాడు. ఈ నీరు మరియు ఆత్మ సువార్తను ఎరుగనివారు దేవుని కుమారులకు విరోధముగా వుండగలరా? వారు దేవుని కుమారులకు విరోధముగా వుండగలరేమో గాని, వారు ఎన్నడును వారి మీద జయమును పొందలేరు. సిలువ రక్తమునందు మాత్రమే విశ్వాసము కలిగినవారు నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచువారిని జయించలేరు.
దేవుని నీతికి విరోధముగా నిలుచువారు కేవలము దేవునికి శత్రువులు మాత్రమే అగును ఆ విధముగా ఎన్నడును వారు ఆయన దీవెనలను పొందలేరు. నీరు మరియు ఆత్మ సువార్త ప్రత్యక్షపరచబడిన నీరు మరియు ఆత్మ సువార్తలేకుండా, ఎవడును రక్షణను పొందలేడు లేక అతనిని/ఆమెను పరలోకమునకు తీసుకొనిపోవు విశ్వాసమును కలిగియుండలేడు. నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచువారు తప్పు సువార్తను జయించి నిజమైన సువార్తకు తిరిగి వస్తారు. దేవుని కుమారులు లోకమును మరియు సాతానును కూడా జయించుదురు.
కొంతమంది యేసు బాప్తిస్మము మరియు ఆయన రక్తమును స్పష్టముగా అర్ధము చేసుకొనలేరు. మరియు వారు అర్ధము చేసుకొనలేకపోవుట అనునది వారిని తప్పు విశ్వాసమునకు నడుపుతుంది. నీవు సిలువ రక్తమునందు విశ్వాసముంచి యేసు బాప్తిస్మము సువార్తయందు విశ్వాసముంచుట చేత, పాప క్షమాపణను పొందుట అను దానిని గురించి నీవు ఎక్కువగా ఆలోచించనట్లయితే, అప్పుడు నీ విశ్వాసము తప్పు.
దేవుని యెదుట నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచువారు నిజ విశ్వాసమును కలిగి ఆయన నీతిని పొందినవారు. ఆయన కుమారుని సిలువ రక్తమునందు మాత్రమే విశ్వాసముంచువారు పొరబడుచున్నారని దేవుడు మనకు తెలియజేయుచున్నాడు. ఆయన నీతియందు విశ్వాసముంచనివారు నీరు మరియు ఆత్మ సువార్తను గుర్తించరు మరియు విశ్వాసముంచరు. అయితే ఆయన నీతియందు విశ్వాసముంచినవారు, సిలువపైన యేసు రక్తమును మరియు వారి పాపమును మోసికొని పోయిన యేసు బాప్తిస్మమును కూడా విశ్వసించును.
మనము తప్పక మన కాఠిన్యమును త్రోసివేయవలెను. నీరు మరియు ఆత్మ సువార్తను సమ్మతించని వారు వారి తప్పు విశ్వాసము సత్యమని నొక్కి చెప్పుదురు. రక్తమునందు మాత్రమే విశ్వాసము కలిగినవారు ఆయన నీతియందు సగము విశ్వాసము మాత్రమే కలిగినవారు. నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచినవారు మాత్రమే పూర్ణ విశ్వాసమును కలిగివుంటారు, వారు దేవుని నీతియందు కూడా విశ్వాసముంచుదురు మరియు ఆయన నీతిని సంపాదించుకుంటారు. (మత్తయి3:15, 11:11)
సిలువ రక్తమునందు మాత్రమే విశ్వాసముంచువారి చేత వ్రాయబడిన పుస్తకము వ్యర్ధమైన పుస్తకముగా మారిపోయినది. వేదాంత పండితుల చేత తర్కించబడిన సిద్ధాంతములు నేడు క్రైస్తవుల చేత నిర్లక్ష్యము చేయబడినవి అయితే, నీరు మరియు ఆత్మ సువార్త గొప్ప ఏకాగ్రతను పొందుతుంది. ఈ విశ్వాసము అపోస్తలుల కాలము నుండే ఉనికిలో వుంది మరియు ఇది ఎన్నడును మారదు. దేవుని వాక్యము ఎన్నటికి నిలిచి వుంటుంది. అయితే యేసు రక్తమును మాత్రమే పూర్తిగా విశ్వసించినవారు ప్రజల జ్ఞాపకాల నుండి చెరిగిపోతున్నారు. కారణమేమిటి? ఇది ఎందుకనగా రక్తము అనునది కేవలము, పాపులపై ఎటువంటి ప్రభావము చూపలేని, సగమైన దేవునినీతి.
నిజాయితీగా చెప్పుచున్నాను, ఈ దినమున అనేకులు, వారు క్రైస్తవులైనప్పటికి క్రైస్తవులు కాకపోయినప్పటికి, చాలా పాపములు చేయుచున్నారు. కేవలము రక్తమునందు మాత్రమే విశ్వాసముంచుటచేత ఏ విధముగా ఈ పాపములన్నీ క్షమించబడగలవు? సిలువపైన రక్తమును మాత్రమే నొక్కి చెప్పు సిద్ధాంతము ప్రజలు పాపములు చేసినప్పుడెల్లా పశ్చాత్తాప ప్రార్థనలు చేయమని బోధించును, అయితే వారి పాపము క్షమించబడుటకు వారు ఎంత కాలము ప్రార్థన చేస్తారు ? వారేమి చెప్పినప్పటికి, పాప క్షమాపణను వారు పొందలేరు.
యేసు ఈలోకమునకు వచ్చి బాప్తిస్మము పొందకుండా కేవలము చనిపోవునంత వరకు రక్తమును మాత్రమే కార్చెనా? ఇది నిజము కాదని మీకు తెలుసు. యేసు ఈ లోకమునకు వచ్చి బాప్తిస్మము పొందుటచేత పాపములన్నిటిని తనపైకి తీసుకొనెను. (మత్తయి 3:15) ఆయన సిలువపైన రక్తమును చిందించక మునుపు యోహాను చేత బాప్తిస్మము పొంది, ఆయనను సిలువపైన సిలువ వేయుటకు అనుమతించెను. ఈ విధముగా యేసు నీతియావత్తును నెరవేర్చెను. యోహాను నుండి యేసు పొందిన బాప్తిస్మమును నీవు విశ్వసించినట్లయితే ప్రతిదినము నీ పాపము క్షమించబడుట కొరకు ఏడవవలసిన అవసరము లేదు. దీనికి బదులుగా, దేవుని నీతియందు విశ్వాసముంచుము సంపూర్ణ రక్షణను పొందుము.
 

మనము చేయు పాపముల కన్నా గొప్ప రక్షణను యేసు మనకిచ్చెనా?

యేసుచే ఇవ్వబడిన విమోచనము మనము చేసిన పాపము మరియు చేయబోవు పాపముకన్నా ఎంతో గొప్పది. యేసు బాప్తిస్మము మరియు సిలువ పైన ఆయన రక్తము మానవజాతి పాపముకన్నా గొప్పవి కానట్లయితే, అప్పుడు మనము యేసునందు విశ్వాసముంచలేదు విమోచనమును పొందలేము. ఏది ఏమైనా, ఆయన బాప్తిస్మము ద్వారా లోక పాపమును మోసికొనిపోయిన ప్రభువు యొక్క మంచితనము ఎంతో గొప్పది.
ఇదే విధముగా, పరలోక ద్వారము విశాలముగా తెరువబడినది, అయితే నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచకుండా ఎవడును ఇందులోనికి ప్రవేశించలేడు. నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచువారికి నీవు విరోధముగా వుండవచ్చు. అయితే నీవు దేవుని భయంకరమైన దేవుని తీర్పునుండి తప్పించుకొనలేవు. కావున, నీవు దేని ద్వారా దేవునినీతి నెరవేర్చబడినదో ఆ నీరు మరియు ఆత్మ సువార్త యందున్న విశ్వాసమును జయించగలమని అనుకొనవద్దు.
నీరు మరియు ఆత్మ సువార్తకు విరోధముగా నిలిచిన అనేకులు అపోస్తలుడైన పౌలుకు కూడా విరోధులు. అయితే పౌలు విశ్వసించిన నీరు మరియు ఆత్మ సువార్త తప్పు అని ఎవడును చెప్పలేడు. వారు కేవలము యేసు దేవుని కుమారుడు వారి రక్షకుడని మాత్రమే వారు ఒప్పుకున్నారు.
రోమా 8:32 మనకు చెప్పుచున్నది, ‘‘తన సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతోపాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు?’’ తండ్రియైన దేవుడు ఆయన అద్వితీయ కుమారుని ఈ లోకమునకు పంపి ఆయన బాప్తిస్మము ద్వారా దీని పాపమును భరించునట్లు చేసి, సిలువపై మరణించునట్లు, మనలను మన పాపముల నుండి ఒక క్రమములో విడుదల చేయుటకు సమాధి నుండి లేచునట్లు చేసెను.
లోక పాపము నుండి మనలను ఒక క్రమములో రక్షించుటకు మరియు మనలను ఆయన కుమారులుగా చేయుటకు, యేసును తండ్రియైన దేవుడు అద్వితీయ కుమారునిగా ఈ లోకమునకు పంపెను. ఏలయనగా తండ్రియైన దేవుడు అందరిని నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచునట్లుగా, ఆయన కుమారులుగా దీవించబడినవారుగా నీతిమంతులుగా చేయుట కొరకు, ఆయన తన అద్వితీయ కుమారుని బాప్తిస్మము పొందుటకు పంపెను. దేవుడు మానవజాతి యంతటికి పరలోక దీవెనలను మరియు నీరు మరియు ఆత్మ సువార్తను ఒక బహుమానముగా ఇచ్చెను. వాటిలో ఒక దీవెన ఏమనగా, నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచుటచేత ఆయన కుమారునిగా మారుట. 
‘‘తన సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతోపాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు?’’ (రోమా8:32) ఇక్కడ ‘‘సమస్తము’’ అనునది దేవుని బహుమానమును సూచిస్తుంది. ఏ బహుమానము? యేసును చేర్చుకొని ఆయన నామమందు విశ్వాసముంచినవారికి ఆయన కుమారులుగా అధికారమును ఇచ్చెను ` అదేమనగా, నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచువారు దేవుని కుమారులుగా చేయబడ్డారు. నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచువారు పాపములేనివారు. వారు నీతిమంతులు నిజముగా శుద్ధీకరించబడిన దేవుని కుమారులు.
వీటిన్నిటియందు విశ్వాసముంచుటచేత దేవుని కుమారులుగా మారినవారు పరలోక రాజ్యముతోను మరియు వెయ్యి సంవత్సరములు రాజ్యమును బహుమానముగా కలిగియున్నారు. నీతిమంతులు పరలోక మహిమలన్నిటిని సంక్రమించుకొనునట్లుగా దీవించబడియున్నారు.
‘‘ఉచితముగా సమస్తమును మనకిచ్చును’’ అనునది కొంతమంది చేత పరిశుద్ధాత్మను ఇచ్చుటగా అర్ధము చెప్పబడినది. వారు ‘‘మనము ఒకసారి యేసునందు విశ్వాసముంచిన తరువాత పరిశుద్ధాత్మ ప్రత్యేకముగా మనకివ్వబడిన దీని భావము కాదా?’’ అని తలంచుదురు. ఇది నిజము కాదు ఎందుకనగా నీవు నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచినప్పుడు, నీవు నీ పాపములు క్షమాపణను మరియు అదే సమయములో పరిశుద్ధాత్మను పొందుదువు. ఒక పాపపు హృదయములో పరిశుద్ధాత్ముడు నివశింపలేడు. మన పాపములన్ని క్షమించబడిన క్షణమునందే పరిశుద్ధాత్ముడు మనయొద్దకు వచ్చును.
పరిశుద్ధాత్మను పొందుటకన్నా విశ్వాసులకు ఇంకా చాలా వున్నవి. పరలోక దీవెనలన్నీ మనకు ఇచ్చునంత వరకు దేవుని బహుమానముకు అంతము లేదు. ఈ లోకములో, ఆ సామర్థ్యము స్వస్థత, భాషలలో మాట్లాడుట, ప్రవచించుట అనునవి బహుమానము అని తలంచుటకు ఇష్టపడుదురు. అయితే ఈ వాక్యభాగమునందు ప్రస్తావించబడిన బహుమానము తండ్రికలిగియున్నవి అన్నియు పరలోకమునకు చెందినవి. బహుమానముచేత, దేవుని నీతి కలిగిన ఆయన కుమారులకు దేవుడు సమస్తమును ఇచ్చునని పౌలు సమస్తమును గురించి మాట్లాడుచున్నాడు.
నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచువారికి ఆయన ఒక వరముగా సమస్త మేలులను ఇచ్చెదనని దేవుడు చెప్పెను. నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచువారు తిరిగి జన్మించినవారుగా వుండు బహుమానమును దేవుడిచ్చెను. నీరు మరియు ఆత్మ సువార్తను విశ్వసించువారికి పరలోకము యొక్క సమస్తమును ఒక బహుమానముగా దేవుడు ఇచ్చును. క్రైస్తవులు ఈ లోకమునందు నివశించుచున్నప్పుడు ఎంతో వేదన ననుభవించుదురు అయితే దేవుని రాజ్యము వచ్చినప్పుడు, వారు దేవుని మహిమచేత నింపబడుదురు.
 

నీవు ఏ కారణము లేకుండా ఏర్పాటు చేయబడినవని చెప్పకు

రోమా 8:33-34 వ్యాఖ్యానించుచున్నది. ‘‘దేవునిచేత ఏర్పరచబడిన వారిమీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే; శిక్ష విధించువాడెవడు? చనిపోయిన యేసుక్రీస్తే; అంతేకాదు, మృతులలో నుండి లేచినవాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే.’’
‘‘దేవుని చేత ఏర్పరచబడిన వారిమీద నేరము మోపువాడెవడు?’’ నీరు మరియు ఆత్మ సువార్తతో దేవుడు రక్షించిన వారి మీద నీవు నేరము మోపగలవా? నేరము మోపలేవు?
వేదాంత పిండితులు కొంతమంది ఏ షరతులు లేకుండా ఏర్పాటు చేయబడ్డారు అని చెప్పుటచేత కాల్విన్‌ను గుర్తుచేస్తారు. ఏది ఏమైనా, దేవుని సన్నిధిలో మనము ఎన్నడును ఏ షరతులు లేకుండా అను పదమును ఉపయోగించకూడదు. ఆ విధముగా చేయుటచేత, వారు దేవుని ఏ మాత్రము ఎరుగని వారుగా ఋజువు చేసుకొంటున్నారు. మరియు వారి సిద్ధాంతములు తప్పు. షరతులు లేని ఏర్పాటు అనగా దేవుడు కొంతమందిని ఏ కారణము లేకనే ప్రేమించును అదే విధముగా ఏ కారణము లేకనే మిగిలిన వారిని ద్వేషించును అని భావము. ఆయన కొంతమందిని ప్రేమించి కొంతమందిని ద్వేషించినప్పుడు ఏ విధముగా మనము దేవుడు నీతిమంతుడని చెప్పగలము? మన దేవుడు ఇటువంటి దేవుడు కాడు. మన దేవుడు క్రీస్తునందు మానవజాతినంతటిని ప్రేమించును సంరక్షించును.
ఇక్కడ, 32వ వచనములో ఇది చెప్పబడినది, ‘‘తన సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు?’’ మానవ జాతిని ఒక క్రమములో రక్షించుటకు దేవుడు ఆయన కుమారుని ఇచ్చెను. ఆయన ద్వారా, నీరు మరియు రక్తము వాక్యము ద్వారా ఆయన మన పాపములన్నిటిని తీసుకొని పోయెనని విశ్వాసముంచునట్లుగా దేవుడు మనలను చేసెను. 33వ వచనములో ఇది వ్రాయబడినది. ‘‘దేవునిచేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు?’’ ఇక్కడ ‘‘దేవుని ఏర్పాటు’’ అనునది దేవుడు కొంతమందిని ఏ షరతులు లేకుండా ఎన్నుకొనునని చెప్పుట లేదు. యేసు లేకుండా ఎవరు జీవించలేరో ఒక క్రమములో ఆయన నీతి వస్త్రమును ధరింపచేయుటకు ఎవరు వారి స్వనీతి లేకుండా వుంటారో వారిని దేవుడు ఏర్పాటు చేసుకొనును.
దేవుని నీతి చేత ఏర్పాటు చేయబడినవారు ఎవరనగా ఎవరు యేసు ఈ లోకమునకు వచ్చి బాప్తిస్మము పొంది, మన పాపములన్నీ తీసుకొనిపోవుటకు సిలువపై తనను తాను బలిచేసుకొనెను అను సత్యమునందు విశ్వాసముంచి సేదదీరుదురో వారు. వారిని లోక పాపముల నుండి రక్షించి ఆయన నీతితో వారికి వస్త్రము ధరింపజేసిన, దేవునియందు విశ్వాసముంచువారు వీరు.
అప్పుడు, నీతిమంతుల మీద నేరము మోపగలవాడు ఎవడు? ఎవడును లేడు మన విశ్వాసము తప్పు అని ఎవడును చెప్పలేడు. నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచుటచేత వారి పాపము నుండి రక్షించబడి దేవుని కుమారులుగా ఏర్పాటు చేయబడిన వారికి తీర్పు తీర్చు వాడు లేడు. కేవలము క్రీస్తు రక్తమునందే విశ్వాసముంచువారు నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచువారు తప్పు అని చెప్పలేరు దేవుని యెదుట వారిపైన నేరము మోపలేరు.
కొంతమంది ప్రజలు నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచుట చేత దేవుని నీతిని ధరించుకొనిన వారికి అన్యాయ తీర్పు తీర్చుదురు. అయితే అది సరియైనదేనా? కాదు! దేవుని యెదుట నీతిమంతులుగా ఏర్పాటు చేయబడినవారు ఏ ఒక్కనిచేత అన్యాయ తీర్పును ఎన్నడును పొందలేడు.
నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచు వారు పాపులు అని చెప్పగలిగి మరియు వారి విశ్వాసమును తప్పుగా తీర్పు తీర్చువారు ఎవరు? మేము ఎంతోకాలము నుండి దేనిలో దేవుని నీతి ప్రత్యక్ష పరచబడినదో ఆ నీరు మరియు ఆత్మ సువార్తను ప్రపంచములో వున్న ప్రజలందరికి ప్రకటించుచున్నాము.
అయితే నీరు మరియు ఆత్మ సువార్తను బోధించుచున్నందుకు ఎవరును మా మీద నేరము మోపలేదు. కొద్దిమంది మాత్రమే సిలువ రక్తము ఒక్కదానియందున్న విశ్వాసమునకు సమ్మతించమని అడిగారు. వారు కూడా నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచుట తప్పు అని చెప్పలేకపోయారు.
నీరు మరియు ఆత్మకు చెందిన నిజ సువార్త దేవుని నీతిని కలిగియున్న సువార్త. ఇది నిజ సువార్త. మరియు మిగిలిన సువార్తలన్నీ అసంపూర్ణము. నీరు మరియు ఆత్మ సువార్తను బోధించిన అపోస్తలుడైన పౌలు ఈ నిజ సువార్తకు భిన్నముగా ఏ సువార్త ఎన్నడును వుండలేదని చెప్పాడు, మరియు అతడు ‘‘మేము మీకు ప్రకటించిన సువార్తను గాక మరియొక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించినయెడల అతడు శాపగ్రస్తుడగును గాక. మేమిదివరకు చెప్పిన ప్రకారమిప్పుడును మరల చెప్పుచున్నాము. మీరు అంగీకరించిన సువార్త గాక మరియొకటి ఎవడైనను మీకు ప్రకటించినయెడల వాడు శాపగ్రస్తుడగును గాక’’ (గలతీ 1:8-9)
నీరు మరియు ఆత్మ సువార్త బైబిల్‌ పరముగా తప్పు అని ఎవ్వడును చెప్పలేడు. నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచనివారు దీనికి విరోధముగా వున్నారు. దేవునిచేత ఇవ్వబడిన నీరు మరియు ఆత్మ సువార్త తప్పు అని నీవు విశ్వసించినట్లయితే, అప్పుడు నీవు దేవునికి విరోధముగా వెళ్ళుము. మేము మొదట ఆయన బాప్తిస్మము ద్వారా పాపములను తనపైన వేసుకొనకుండా ఏ విధముగా యేసు మన పాపముల కొరకు సిలువవేయబడగలడు?
 
 
దేవుని నీతికి చెందిన విశ్వాసులు పాపములు కలిగియున్నారని చెప్పకుము

‘‘నేరము మోపుట’’ అనగా ఒక నేరస్థాపనలో తీర్పును అడుగుట. ఒక దుష్టకార్యము చేయువాడు ఒక్కడే నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచువారిపైన నేరము మోపగలడు. నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచువాడు దేవునినీతియందు విశ్వాసము కలిగియుండును, దీనిని బట్టి ఎవరు తప్పుగా వారి విశ్వాసమునకు తీర్పు తీర్చుదురు? వారు తప్పు అని ఎవరు తీర్పు తీర్చుదురు? ఎవడును లేడు ఏలయనగా వారికి తీర్పుతీర్చువాడు దేవుడు. నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసము కలిగిన వారు పాపము కలిగియున్నారని ఎవరును నిందించలేడు.
‘‘తీర్పుతీర్చువాడు దేవుడే’’ (రోమా 8:33) నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచువారు పాపములేని వారని ఎవరు ప్రకటించగలరు? దేవుడు మాత్రమే చేయగలడు. నీరు మరియు ఆత్మ సువార్త యందు విశ్వాసము కలిగినవారు నీతిమంతులుగా తీర్చబడియున్నారని ఆయన నీతి చేత స్పష్టముగా ప్రకటించుచున్నాడు.
‘‘నీతిమంతులుగా తీర్చబడుట’’ అనునది పాపము కలిగినవానికి వర్తించదు. అయితే ఇది ఎవరి పాపములు వాస్తవముగా క్షమించబడినవో వారిని ‘‘పాపములేనివారు మరియు నీతిమంతులు’’గా చేయుట అనునది వారికి వర్తిస్తుంది. నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచువారు పాపములేని వారని దేవుడు చెప్పినప్పుడు, వారికి దేవుని నీతిని కలిగిలేరని వారి తప్పు అని చెప్పుటకు ఎవరు ధైర్యము చేయుదురు? ఆ విధముగా ఈ లోకములో ఏ వేదాంత పండితుడు చెప్పలేడు.
నేటి క్రైస్తవ్యము మతపరమైన పవిత్రత పొందుటకు ప్రయత్నము చేయు శుద్ధీకరణ సిద్ధాంతము చేత అపవిత్రపరచబడినది. ఇంగ్లాండులో ఒక వేదాంత పండితుడు, ‘‘దేవుని సంఘము పరిశుద్ధమైనదా?’’ అని అడిగిన తరువాత, దేవుని సంఘము కూడా లోపమును కలిగి వున్నదని చెప్పుకున్నాడు. స్పష్టముగా, ఈ వేదాంత పండితునికి నీరు మరియు ఆత్మ సువార్త తెలియదు మరియు దేవుని నీతియందు విశ్వాసమును కలిగి యుండలేదు.
అయితే నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచు దేవుని సంఘమున్న ప్రతి విశ్వాసి అతడు/ఆమె శరీరమందు బలహీనముగా వున్నప్పటికి, అతడు/ఆమె లోపము లేని పూర్ణమైన దేవుని నీతిని కలిగి, పూర్ణముగా పాపము లేనివాడు.
దేవుని సంఘమందున్న ప్రతి ఒక్కరు పాపములేని వారా? అవును! సంఘము అనునది శుద్ధీకరించబడి క్రీస్తునందు పాపములేని వారుగా కలుసుకొను ఒక స్థలము. ఒకవేళ విశ్వాసులు పాపము కలిగియున్నట్లయితే, అప్పుడు వారు దేవుని కుమారులు కారు. వారు శుద్ధీకరించబడునట్లుగా చేసినదేమిటి? ఇది, దేవుని నీతిని పొందుటచేత వారిని పాపములేని వారుగా చేసిన నీరు మరియు ఆత్మ సువార్త. ఆ వేదాంత పండితుడు చివరికి దేవుని సంఘము కూడా లోపమును కలిగియున్నదని చెప్పాడు. ఎందుకంటే అతడు నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచలేదు లేక కనీసము ఎరుగలేదు.
నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచు ప్రజలు పాపము గలవారని చెప్పగల ధైర్యము కలవారు ఎవరు? వారిని నీతిమంతులుగా తీర్చినవాడు దేవుడు. మనము కేవలము బలహీనులమైనందున, నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచు మనము, పాపముతో వుండగలమా? మనము ఖచ్చితముగా వుండలేము! అప్పుడు మనము ఇప్పటికి పాపము చేయుచున్నప్పటికి కూడా మనకు పాపములేదు అని దీని భావమా? అవును, మనకు పాపము లేదు. అందువలననే మనము నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచవలసిన అవసరము వుంది. ప్రజలు ఉద్దేశ్యపూర్వకముగా పాపము చేయవలెనని అనుకొనరు, అయితే వారి బలహీనతను బట్టి వారు పాపము చేస్తారు. 
పాపము చేయవలెనని కోరు ప్రజలు వాస్తవముగా కొద్దిమంది మాత్రమే; దాదాపు అన్నిదోషములన్నియు మానవుని బలహీనతచేత కలిగినవి. నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచువారు వారి హృదయములో పాపమును కలిగిలేరు. ఎందుకనగా వారు దేవునినీతిని కలిగియున్నారు. మనము పాపము లేకుండా వున్నాము. ఎందుకనగా దేవుడు ఆయన నీతితో మన పాపములన్నిటిని దూరముగా చేసెను. అందువలన బైబిల్‌ చెప్పుచున్నది. ‘తీర్పు తీర్చువాడు దేవుడే’ నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచువారు ఆయన నీతిని కలిగియున్నందున పాపములేని వారని స్పష్టముగా ప్రకటించువాడు దేవుడు. మనము నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచుట చేత మన అన్ని పాపముల నుండి మనము విడుదలను పొందియున్నాము.
ఒకవేళ యేసు మన భవిష్యత్తు పాపములను కూడా తీసికొని వెళ్లనట్లయితే, మనము ఏ విధముగా మన పాపముల నుండి విమోచించబడగలము మరియు ఏ విధముగా మనమిక ఏ మాత్రమును పాపులము కాదని ఎలా చెప్పగలము? ఒకవేళ మనము, దేవుని నీతియందు విశ్వాసముంచిన తరువాత, పాపము చేసి పాపములో జీవించినట్లయితే, అప్పుడది మనలను తగినంతగా శుద్ధిచేయక, లేక మన విమోచనమును అనర్హమైనదిగా చేయుచు, మరలా తిరిగి మనలను నరకమునకు నిర్దేశించునా? దీని జవాబు ఏమనగా కాదు అని! మనలను మనము శుద్ధీకరించుకొనుట వలన రక్షణ వచ్చినట్లయితే ఈ లోకములో ఎన్నడైనను రక్షించబగలవాడు ఎవడు? ఎవడును రక్షించబడలేడు! ఈ శరీరమందు ఎవడును పరిపూర్ణ జీవితమును జీవించలేడు పూర్తిగా ఆజ్ఞలను పాటించుటచేత శుద్ధీకరించబడలేడు. అందువలన బైబిల్‌ వ్యాఖ్యానించుచున్నది, ‘‘నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు’’ (రోమా3:10)
 

స్వభావరీత్యా, మానవులు వారి స్వంత క్రియల ద్వారా దేవుని నీతిని పొందలేరు

దేవుడు, యోహానుచేత బాప్తిస్మము పొందిన, అద్వితీయ కుమారుని పంపెను, మానవజాతిని లోక పాపముల నుండి రక్షించుటకు ఆయనను సిలువపై పెట్టెను. నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచువారు వారి విశ్వాసముచేత వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఇందువలననే ఈ లోకములో కూడా నీతిమంతులు వుండగలిగియున్నారు. అబ్రాహాము దేవుని మాటయందు విశ్వాసముంచుటచేత విశ్వాసమునకు తండ్రి అయ్యెను.
నీతిమంత్వ సిద్ధాంతముద్వారా దేవునినీతిని పొందగలమని చాలామంది క్రైస్తవులు చెప్పనప్పటికీ, వాస్తవమునకు వారు దీనిని గురించి తెలియని వారుగా వున్నారు. దేవునినీతి ఏమిటి? ఇది మానవనీతికి ఎంతో దూరముగా వున్నది. ఏ సువార్తయందు దేవునినీతి ప్రత్యక్షపరచబడెను? నీరు మరియు ఆత్మ సువార్తయందు దేవుని నీతి ప్రత్యక్షపరచబడెను. దీనియందు విశ్వాసముంచక మనము నీరు మరియు ఆత్మ తృణీకరించినట్లయితే, దీని భావము మనము దేవునికి విరోధముగా వున్నాము.
నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచకుండా ఎవడును పాపమునుండి విమోచింపబడలేడు లేక దేవుని నీతిని పొందలేడు. ఎవడైనను కొంచెమైనను దేవుని నీతికి విరోధముగా వుండగలడా? నేను ఎంతోకాలము క్రితము నీరు మరియు ఆత్మ సువార్తను విశ్వసించి దీనిని బోధించుచున్నాను. అయితే ఈ సువార్తకు విరోధముగా నిలుచువానిని నేనెన్నడును చూడలేదు. దేవుని వాక్యమును ఆధారము చేసుకొని ఎవడును నీరు మరియు ఆత్మ సువార్తకు విరోధముగా వుండలేడు ఎందుకనగా దేవునినీతికి చెందిన ఈ సువార్త మన పాపముల నుండి పరిపూర్ణమైన సంపూర్ణమైన విమోచనము నిచ్చును.
 

దేవుని నీతి కలిగిన వానిని శిక్షించువాడు ఎవడు?

రోమా 8:34వ వచనమును చదువుదాం. ‘‘శిక్ష విధించువాడెవడు? చనిపోయిన యేసుక్రీస్తే; అంతేకాదు, మృతులలో నుండి లేచినవాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మనకొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే.’’ దేవుని నీతియందు విశ్వాసముంచువారిని పాపముతో నిండినవారని ఎవడైనను శిక్షించగలడా? ఎవడును శిక్షించలేడు.
నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచి, విశ్వాసముతో వారి పాపములనుండి విడుదల పొందిన విశ్వాసులను, పాపులని ఎవడైనను శిక్షించగలడా? శిక్షంచలేడు! ‘‘శిక్షించువాడు ఎవడు?’’ దేవుని నీతికి చెందిన విశ్వాసులను పాపులని చెప్పగలవాడు ఎవడు?
పాపమునకు వచ్చు జీతము మరణము. ఒకవేళ నీవు నీ హృదయములో పాపమును కలిగియున్నట్లయితే, నీవు నరకమునకు పోవుదువు. దేవుడు ప్రజలకు తీర్పుతీర్చును ఎందుకనగా వారు పాపమును కలిగియున్నారు. అయితే దేవునినీతియందున్న విశ్వాసముతో ఎవరి పాపము తీసివేయబడెనో వారు దేవునిచేత తీర్పు తీర్చబడరు, వారు తీర్పుతీర్చబడుటకు వారిక ఎంత మాత్రమును పాపములను కలిగియుండరు. దేవుని నీతియందు విశ్వాసము కలిగిన వారిని దేవుడే తీర్పులోనికి తీసుకొనిరానప్పుడు, వారిని శిక్షించుటకు ఎవడు ధైర్యము చేయగలడు? యేసుక్రీస్తు నందున్న ఒక విశ్వాసి పాపముతో వున్నట్లయితే, అతడు/ఆమె ఒక పాపి మరియు దేవునిచేత తీర్పు తీర్చబడును మరియు శిక్షించబడును. పాపులు వారి హృదయమునందున్న పాపమును బట్టి శిక్షించబడుదురు మరియు ఇతర ప్రజల చేత వెలివేయబడుదురు. అయితే ఒకవేళ క్రీస్తునందున్న ఒక విశ్వాసి నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచి దేవునినీతిని పొందినట్లయితే, వాడు దేవుని యెదుట పాపములేని వాడు, మరియు ఆ వ్యక్తిని ఎవడును నిందించలేడు. అటువంటి ప్రజల మనస్సాక్షిలో పాపముండదు.
‘‘శిక్ష విధించువాడెవడు? చనిపోయిన యేసుక్రీస్తే; అంతేకాదు, మృతులలో నుండి లేచినవాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే’’ దేవుని కుమారుడైన, యేసు, మనకు దేవునినీతినిచ్చుటకు భూమిమీదికి వచ్చెను, మన పాపములన్నిటిని భరించుటకు బాప్తిస్మమిచ్చు యోహానుచేత బాప్తిస్మము పొందెను. ఆయన రక్తమును చిందించుటచేత సిలువపైన మరణించెను, మన రక్షకుడగుటకు సమాధినుండి తిరిగిలేచెను. ఆయన ఇప్పుడు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి మన రక్షకునిగా విజ్ఞాపనము చేయుచున్నాడు.
దేవుని నీతి కలిగిన వారి కొరకు పరిశుద్ధాత్ముడు కూడా ప్రార్థన చేయును. యేసు పరలోకమందు మన కొరకు ప్రార్థన చేయును. పరిశుద్ధాత్ముడు కూడా, మన కొరకు తండ్రియైన దేవునికి ప్రార్థన చేయును, అయితే భిన్నమైన రీతిలో మనము బలహీనులమైనప్పుడు మన హృదయములో ఉచ్ఛరింపశక్యము కాని ‘‘మూలుగులతో’’ ప్రార్థించును.
నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచువారి హృదయములో వున్న దేవునినీతి ఎంత పరిపూర్ణమైనది? దేవుని నీతి పరిపూర్ణత నీరు మరియు ఆత్మ సువార్త పరిపూర్ణమని మనకు చెప్పుచున్నది.