(రోమా 8:35-39)
‘‘క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను బాధయైనను హింసయైనను కరువైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా `
నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడినవారము వధకు
సిద్ధమైన గొఱ్ఱెలమని మేము ఎంచబడినవారము.
అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవునవియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను, మన ప్రభువైన క్రీస్తునందలి దేవుని ప్రేమ ఉండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను.’’
‘‘క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను బాధయైనను హింసయైనను కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా?’’ దేవుని నీతిని దానియందు కలిగిన నీరు మరియు సువార్తయందు విశ్వాసముంచు వారికి ఇవ్వబడిన క్రీస్తు ప్రేమ నుండి ఎవరు మనలను ఎడబాపగలరు? శ్రమయైనను బాధయైనను ఆ ప్రేమను తుంచివేయునా? ఆ ప్రేమ నుండి ఏడేండ్ల శ్రమలు మనలను ఎడబాపునా? చేయలేదు!
ఈ లోకములో వున్న శ్రమయైనను బాధయైనను మనలను మన పాపముల నుండి రక్షించిన ప్రభుని ప్రేమనుండి తుంచివేయలేదు. మన అలసటలో మనము ఒంటరిగా వదలివేయబడుటకు కోరుకొనినను, యేసు మనలను మన పాపము నుండి మనలను రక్షించెనా అని అడిగినను, మనమందరము యేసు మనలను నిజముగా రక్షించెను మరియు మనము పాపములేని వారమని స్పందిస్తాము. మన హృదయము ఎంతగా క్షోభించినను బాధననుభవించినను, ఆయన ఇప్పటికి మనలను రక్షించెను మరియు ఆయన మనశాశ్వత రక్షకుడు. ఇప్పటికే మనము బహుగా మన దేహము నిటారుగా నిలబెట్టలేనంతగా అలసిపోయినను లేక జబ్బు పడినను, దేవునినీతిని బట్టి మన వందనములను ఒప్పుకుంటాము. మనలను మన పాపముల నుండి రక్షించిన దేవునినీతినుండి ఏ శ్రమ మనలను విడదీయలేదు.
హింసయైనను, కరవైనను, వస్త్రహీనతయైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను, మనలను దేవుని నీతి నుండి ఎడబాటు చేయలేవు. మనము కొన్నిసార్లు మతపరమైన ప్రజల చేత నేరము మోపబడి వెలివేయబడుట అనునది మనము ఎదుర్కొను హింస. మన హింసలు మన స్నేహితులను, పొరుగువారిని, బంధువులను కలిగి, చివరికి మన కుటుంబ సభ్యులు సహితము సంప్రదాయమును తిరస్కరించువారుగా మనముంటున్నామను నిందను బట్టీ మనలను వదలిపోవచ్చు. ఈ హింసలు యేసుక్రీస్తు రక్షణ నుండి మనలను ఎడబాపునా? అవి ఎక్కువగా ఏమీ చేయలేవు!
మనము ఎంతగా హింసించబడినను, మనలను రక్షించిన దేవునినీతి నుండి మనలనే వేరు చేయలేదు. ఎందుకనగా దేవునినీతి మనలను పాపములేని వారిగా చేసినది, మరియు ఇది ఎన్నడును మారని సత్యము గనుక, ఎవరును మరియు ఏదీ దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపలేదు.
కరువు, ఆత్మీయమైనదైననూ భౌతికమైనదైనను, మనలను వేరు చేయలేవు. మనము నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచినందున మన హృదయము యందు ఎల్లప్పుడు నిలచియుండునదేమనగా దేవుని నీతి ` అది, నీరు మరియు ఆత్మ సువార్తతో మనలను పాపము లేని వారిగా చేసిన మన ప్రభువుయందున్న విశ్వాసము. ఈ విశ్వాసమే విశ్వాసము దేవునినీతియందు విశ్వాసముంచు దేవుని దీవెన. ‘‘ప్రభువు నా పాపములన్నిటిని అదృశ్యము చేసినందున, నేను పాపమును కలిగియుండలేదు! దేవుడు ఆయన స్వంతనీతితో పూర్తిగా వస్త్రము ధరింపజేసినందున, నన్ను నీతిమంతునిగాను పాపములేని వానిగాను చేసెను.’’ ఇందువలననే కరువు ఎంత తీవ్రముగా వున్ననూ, దేవునినీతియందున్న మన విశ్వాసము అదృశ్యము కాదు.
నీరు మరియు ఆత్మ సువార్తతో దేవుని నీతి
ఒకడు నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచనట్లయితే, ఇప్పటికి అతని/ఆమె హృదయమునందు పాపమున్నది. అయితే దేవుని నీతియందు విశ్వాసముంచు వానికి పాపము లేదు. ఇందువలననే ఒక చెట్టు ఫలమును బట్టి దానిని తెలుసుకొనగలమని మన ప్రభువు చెప్పెను. దేవుని నీతియందు విశ్వాసముంచనివారు స్వల్పమైన కష్టము, కరువు, హింస లేక శ్రమలను వారు ఎదుర్కొన్నప్పుడు వారు యేసునందున్న వారి విశ్వాసమును వదలిపెట్టుదురు.
‘‘యేసు నా పాపములనుబట్టి సిలువపై తీర్పుతీర్చబడినను, కేవలము మూల పాపములు తొలగించబడినదని, మరియు నేను అనుదినము నేను చేయు పాపము కొరకు అనుదినము పాపక్షమాపణను అడగవలసివుంది’’ అని తలంచు కొంతమంది ప్రజలున్నారు. ఈ రకమైన విశ్వాసమున్నవారు వాస్తవముగా యేసుక్రీస్తు వారి పాపములను తీసుకొని పోయెనని విశ్వాసముంచకపోవుటను బట్టి పాపమును చేయుచున్నారు. మరియు ఈ క్రమములో, వారిని వారి నిందించుకొనుచు వారిని వారు అపవిత్రపరచుకొంటారు. యేసును తృణీకరించుచు దేవుని నీతియందు విశ్వాసముంచని ప్రజలు వున్నారు.
అయితే నీరు మరియు ఆత్మ సువార్త యందు విశ్వాసముంచువారు దేవుని నీతియందు విశ్వాసము కలిగినవారు, మరియు వారు ఎదుర్కొను పరిస్థితులు ఏమైనప్పటికి ‘‘దేవుడు నిశ్చయముగా లోక పాపములన్నిటి నుండి నన్ను రక్షించెను. నేను పాపములేని వాడను!’’ అను చెప్పుటచేత వారి విశ్వాసమును గట్టిగా పట్టుకొంటారు. చివరికి మనము మన ఆత్మీయ చివరి దినములలో మనము ఒకవేళ మరణమును ఎదుర్కొనవలసి వచ్చినట్లయితే, మనమెన్నడును ఆయన మమ్మును పాపములేనివారిగా చేయలేదు మేము ఆయన కుమారులుగా మారలేదు అని అనము. మన పాపములన్నిటిని తీసివేసిన దేవునినీతి మన విశ్వాసముగా మన హృదయములలో నిలచియుండును. నీరు మరియు ఆత్మ సువార్త అటువంటి శక్తిగలది మరియు గొప్పది. మన జీవితములో ఎటువంటి శ్రమలను ఎదుర్కొన్నప్పటికి, దేవునినీతి క్రీస్తుయందున్నందున, మనము ఎన్నడును దేవుని ప్రేమ నుండి ఎడబాయము.
పై వాక్యభాగములో ‘‘వస్త్రహీనత’’ అనగా భావమేమిటి? వస్త్రహీనత అనగా మనకు కలిగినవన్నిటిని పోగొట్టుకొనుటను సూచించుచున్నది. మధ్యయుగము వరకు యూరపు దేశాలలో ఒక గ్రామములో గాని లేక దేశములోగాని శ్రమలు వచ్చినప్పుడు, ప్రజలు క్షుద్రపూజలు చేసేవారు. తరచుగా బహిష్కరించు సజీవ మేకలను ప్రజల అన్ని శ్రమలకు కారణముగా వదలిపెట్టేవారు. ప్రజలు నిష్టగా వున్నవారిని ఛాందసులుగా నిందించుచు వారికున్నవన్నీ ప్రజలు తీసుకొనేవారు. ఇందువలననే పౌలు ఇక్కడ ‘‘వస్త్రహీనత’’ అను పదమును ఉపయోగించాడు.
ఆ కాలములో, ఒకరు ఇద్దరు సాక్షులతో ఒకనిని అతని గౌరవమును తీసివేయుటకు, అతని/ఆమెకు వున్నదంతయు తీసుకొనుటకు, సజీవ దహనము చేయుటకు దైవదూషణ చేయుచున్నాడని నేరము మోపుటకు సాధ్యపడేది.
ఆ విధముగా మనము వస్త్రహీనతతో మనము వెళ్ళగొట్టబడినప్పటికి, మనకు కలిగినదంతయు పోగొట్టుకొని మరణశిక్ష విధించబడినప్పటికి, మన పట్ల వున్న ఆయన ప్రేమను బట్టి, మన పాపములను తీసుకొనిపోయిన దేవునినీతి, మననుండి ఎన్నడును అదృశ్యము కాదు. ఈ విధముగా నీరు మరియు ఆత్మ సువార్త పూర్తియగును.
ఉపద్రవమైనను, ఖడ్గమైనను క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపలేవు. మనము ఖడ్గము క్రింద పెట్టబడి దానిచేత మనము చంపబడినప్పటికి, విశ్వసించు మనము పాపములను కలిగిలేము. ఆది సంఘమునందున్న చాలామంది క్రైస్తవులు తప్పుగా రోమ్లో అగ్నిలో వేయబడ్డారు. మరియు బోనులోని సింహములకు ఆహారముగా వేయుటద్వారా బహిరంగముగా హింసించబడ్డారు. వారు చనిపోవుచున్నప్పటికి కూడా, వారిని రక్షించిన ప్రభువును స్తుతించారు. వారు నీరు మరియు ఆత్మ సువార్తను విశ్వసించిన విశ్వాసులైనందున వారు స్తుతించగలిగారు. దేవుడు వారిని ప్రేమించెను వారి పాపములన్నియు తీసుకొనిపోయెను అను ఈ సత్యమునందు విశ్వాసముంచుటచేత విమోచించబడినవారు చివరికి వారు చంపబడి సింహములచేత ఆహారముగా తినబడినప్పటికి, ప్రభువును స్తుతించగలరు.
ఈ బలము ఆయన ప్రేమయందు మన పాపములన్నిటిని తీసుకొనిపోయిన దేవుని నీతియందున్న విశ్వాసమునుండి వచ్చును. ఇది ఎందుకనగా దేవుడు మనయందున్నాడు. మనతో మాట్లాడును , మనలను గట్టిగా నిలబెట్టును, మనలను కాపాడును ఆదరించును అటువంటి బలమును మనముఆయన యందు కనుగొనగలము. ఉపద్రవమైనను, ఖడ్గమైనను, బెదరించుటయైనను, మహాశ్రమలైనను మనలను దేవుని ప్రేమ నుండి వేరు చేయలేవు.
నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచువారు దేవునినీతియందు విశ్వాసముంచువారు. మరియు క్రీస్తుకు చెందిన ప్రజలు. దేవుని నీతియందు విశ్వాసముంచినవారు క్రీస్తు చేత ప్రేమించబడినవారు. అయితే కొంతమంది కేవలము సిలువపై ఆయన మరణమును చూచుచు, ఆయన శ్రమలను బట్టి ఏడ్చుచు విచారముచేత క్రీస్తు పరిపూర్ణ ప్రేమ నుండి కేవలము ఉద్రేకముతో కూడిన ప్రేమలోనికి తిరిగియున్నారు. అయితే మానవ ఉద్రేకము ఒక రాత్రితో మారిపోగలవు.
మన ఉద్రేకము ప్రతి ఉదయము మరియు ప్రతి రాత్రి మారినను, మనలను రక్షించిన మన ప్రభువు ప్రేమ మారదు లేక దేనితోనైనను మార్పు చెందదు. ఆయనప్రేమ యుగయుగములకు మార్పులేనిది. నీరు మరియు ఆత్మసువార్త ఈ విధమైన శక్తి కలిగినది. మరియు దేవునినీతి ఇంత గొప్పది. ఎవ్వడును మనలను సంపూర్ణముగా ఆయన ప్రేమ వస్త్రమును ధరింపజేసిన ప్రభువు ప్రేమ నుండి మనలను వేరుచేయదు. ఇది నీరు మరియు ఆత్మ సువార్త యొక్కశక్తి మరియు ఇది దేవునినీతియందున్న మన విశ్వాసము యొక్కశక్తి కూడా.
‘‘సువార్త’’ అను మాటకు గ్రీకులో ‘‘యగ్గేలియన్’’ అను పదము, మరియు ఇది ‘‘డ్యునమిస్’’ను కలిగియున్నదని చెప్పబడినది ` ఈ గ్రీకుల మాటకు దేవుని యొక్క ‘‘బాంబు’’ అను మాటవచ్చు బలము శక్తి, లేక సామర్థ్యము అని భావము. ఒక చేతిబాంబు ఒక ఇంటిని దాని పునాదితో సహా దుమ్ముగా పేల్చుటకు సరిపోతుంది. ఒక యుద్ధనౌకమీద ఉంచబడిన టొమాహక్ అను మిస్సైల్ ఒక పొడవాటి మేడను పూర్తిగా గుర్తుపట్టకుండా ప్రేల్చివేయగలదు. అది ఎంత పటిష్టమైన కట్టడము అయినప్పటికి, మిస్సైల్ నాశనము చేసే శక్తికి సాటిరాదు.
న్యూయార్కులో రెండు పౌర విమానాలు ప్రపంచ వాణిజ్య కేంద్రం రెండు సౌధములను కూల్చివేసినవి విమానము ఈ సౌధములను ఢీకొన్నప్పుడు ఏమి జరిగింది? విమానము పేలిపోవుటచేత ఉద్భవించిన మంటచేత విమాన ఇంధనము చేత ఏర్పడిన మంటలు చాలా చిక్కనై విమానము దూసుకుపోయిన అంతస్తులో వున్న ప్రతిదానిని కరిగించివేసినవి. అంతస్థులు ఇనుపనిర్మాణము మరియు ఆ సౌధముకు ఆధారమైన వరుసలు అన్నీ కరిగిపోయినందున, అంతస్తులన్ని ఆకస్మాత్తుగా కూలిపోయినవి, మరియు కూలిపోయిన అంతస్తుల బరువును మోయలేకపోయినవి. అందువలన చివరికి మొత్తము ముక్కు ముక్కలైనాయి. అంతస్తులన్నీ నెమ్మదిగా క్రిందికి వచ్చినట్లయితే, సౌధము కూలిపోయేది కాదు. అయితే అంతస్తు ఆకస్మాత్తుగా మెలికలు తిరుగుతూ పడిపోయినందున, మిగిలిన ఆధార నిర్మాణములన్ని పడిపోయినవి. సౌధము మొత్తము, అందరూ చూస్తుండగా కొన్ని సెకనులలోనే కూలిపోయినవి.
దేవుని సువార్త శక్తి అనునది నీరు మరియు ఆత్మ సువార్తయై యున్నది. ఇది దేవునినీతిని దానియందు కలిగిన శక్తి కూడా. దేవుని నీతిని వర్ణించుటకు ఈ విచారకరమైనది పోల్చుటకు సరియైనది కాదుగాని, దేవుని చేత ఇవ్వబడిన నీరు మరియు ఆత్మ సువార్త శక్తి అనునది పాపములన్నిటిని పేల్చివేయగల బాంబు వంటిది. దేవునినీతి అనునది ఈ లోకమునకు వచ్చుటచేత బాప్తిస్మమును పొంది, మన పాపములన్నిటిని తీసుకొనుటచేత సిలువపై మరణించుటచేత మరియు మృతులలో నుండి పునరుత్థానుడగుటచేత మన ప్రభువు మనలను రక్షించెను అనునది.
నీరు మరియు ఆత్మ అనునది దేనితో యేసు విశ్వము ప్రారంభమునుండి దీని అంతము వరకు మానవజాతి పాపములను తీసుకొనిపోయెనో ఆ దేవుని నీతి, ఇందువలననే దేవునినీతియందున్న వారి విశ్వాసముచేత వారి విమోచనముద్వారా ఎవరు ఆయనచేత ప్రేమించబడిరో వారి నుండి దేవునిని ఏదీ వేరుపరచలేదు. పౌలు విశ్వాసము కూడా దేవునినీతియందు విశ్వాసము కలిగిన విశ్వాసము.
అప్పుడు, మనము కేవలము సిలువరక్తము యొక్క సువార్తచేత దేవునినీతిని పొందగలమా? మనము పొందలేము. సిలువ రక్తము యొక్క సువార్తయందు విశ్వాసముంచుట అను ఒక్కటే దేవుని నీతిని మనకు ఇవ్వలేదు. మరొక రకముగా తలంచువారు చాలా సులభముగా చిన్న ఇబ్బందికే యేసునందున్న విశ్వాసమును వదలివేస్తారు.
ఉదాహరణకు, వారి భౌతిక సంపద తీసివేయబడినప్పుడు, వారి మతము ప్రాతిపదికతో పనిలో కొన్ని కష్టములు ఎదుర్కొన్నప్పుడు వారు చాలా సులభముగా వారి విశ్వాసమును త్యజించుటకు పూనుకుంటారు. ఇది తప్పించుకొలేనిది మరియు ఇది చాలామంది క్రైస్తవులకు చెందుతుంది. నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచకపోవుటచేత, పరిశుద్ధాత్మను తమ హృదయములలో కలిగిలేరో వారు వారి పాపముల నుండి రక్షించబడినవారు కారు వారు ఒక చిన్న బెదురుకే పట్టబడుటకు నిర్దేశించబడినవారు.
నేటి క్రైస్తవ్యము ఈ లోకమునందు చాలా బలహీనముగా నుండుటకు కారణము కేవలము యేసు రక్తమునకు మాత్రమే పరిమితము చేయబడిన విశ్వాసమును బట్టి ఈ రకమైన విశ్వాసము నీరు మరియు ఆత్మ సువార్త ద్వారా దేవునినీతిని పొందని విశ్వాసమై యున్నది.
అతని/ఆమె అన్ని పాపముల నుండి దేవునినీతిని పొందుటచేత విమోచించబడిన ఒక నీతిమంతుడైన విశ్వాసి చాలా ఆత్మల కొరకు పని చేయగలడు. అతడు/ఆమె నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచుటను బట్టి మరియు పరిశుద్ధాత్మను కలిగియుండుటను బట్టి ఆయన వాక్యమునందు దేవుడు అతనితో/ఆమెతో వున్నందున, ఆ వ్యక్తి అనేక ఆత్మల కార్యములు చేయగలడు దేవుని యొద్దకు నశించిన అనేక ఆత్మలను తీసుకొని రాగలడు. దేవుని నీతియందు విశ్వాసమిది. ఇదే నీరు మరియు ఆత్మ సువార్తయందున్న విశ్వాసము. నీరు మరియు ఆత్మ సువార్త దేవునిచేత ఇవ్వబడినది. మన క్రియల వలన కలిగినది కాదు, ఆ విధముగా మనము ఆయన కార్యము చేయుచున్నది కూడా దేవుని ద్వారానే.
36వ వచనము చెప్పుచున్నది, ‘‘ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా ` నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడినవారము వధకు సిద్ధమైన గొఱ్ఱెలమని మేము ఎంచబడినవారము. ‘వీరిలో ఈ భూమిమీద నివశించుచుండగా ఈ విధముగా బాధకు గురైన వారు నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచువారు వున్నారు. వాస్తవమునకు నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచు విశ్వాసులు తరుచుగా ఇతరులచేత ద్వేషించబడతారు. ప్రత్యేకముగా తాము క్రైస్తవులమని చెప్పుకొనుచు తప్పు విశ్వాసముతో వున్న వారిచేత ద్వేషించబడుదురు.
తిరిగి జన్మించిన క్రైస్తవులు, మరియొక మాటలలో, నామకార్ధపు క్రైస్తవులచేత, బౌద్ధ మతస్థుల చేత ద్వేషించబడ్డారు. ఈ వాక్యభాగము, ‘‘నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడినవారము వధకు సిద్ధమైన గొఱ్ఱెలమని మేము ఎంచబడినవారము.’’ అనునది నీరు మరియు సువార్తలో విశ్వాసులచేత పలకబడిన దేవుని వాక్యము. చివరికి మన ప్రభువు, తండ్రి చిత్తమును ఆయన బాప్తిస్మముతో మరియు సిలువమీద మరణముతో వెంబడించుట చేత, ‘‘వధకు సిద్ధమైన గొఱ్ఱెలమని ఎంచబడెను’’. భూమి మీదకి వచ్చి అటువంటి జీవితమును జీవించుటచేత ప్రభువు మనలను రక్షించెను.
దేవుని నీతి లోక పాపములన్నిటిని జయించినది
37వ వచనము చెప్పుచున్నది, ‘‘అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము.’’ దేవుని ప్రేమయందున్న శక్తిచేత మన విజయమును మనము ప్రకటించుచున్నాము.
నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచువాడు దేవుని ప్రేమను కలిగియున్నాడు. నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచనివాడు కేవలము అతని/ఆమె హృదయమునందు పాపములను కలిగియున్నాడు. పాపముతో వున్న వారి విశ్వాసము మరియు రక్షణ వారి ఉద్రేకమును బట్టి ఎగుడు దిగుడుగా వుండును, ఆ విధముగా వారికి శక్తి లేదు. అయితే నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచువారు శక్తిని కలిగియున్నారు. వారికి వారే శక్తిని కలిగియుండటలేదు. అయితే వారు దేవునిచేత ఇవ్వబడిన సువార్త శక్తిని కలిగియున్నారు. ఈ శక్తితో వారు తట్టుకొని అన్ని శ్రమలలోను హింసయందును విజయము పొందగలరు. నీతిమంతులు తప్పక పాపులకు వ్యతిరేకముగా ఆత్మీయ పోరాటములో పాలు పంచుకొనవలెను. మరియు వారికి నీరు మరియు ఆత్మ సువార్తను బోధించవలెను. నీతిమంతులు తప్పక సువార్త కొరకు హింసించబడుటను స్వభావసిద్ధముగా భావించుకొని సహనమును కూడా కలిగియుండవలెను. ప్రభువు కొరకు జీవించు మన జీవితమే ఒక గమ్యము.
ఒక పశ్చిమ ఆసియా సామెత ‘‘ఒకడు ఒక దినము బైబిల్‌ను చదువుట తప్పిపోయినట్లయితే, అతడు గ్రుచ్చే మాటలు మాట్లాడును’’ అ ని చెప్పుచున్నది. అప్పుడు మన గురించి ఏమిటి? మనము కూడా, ఒక దినము ప్రభువు కొరకు ఆయన సువార్త కొరకు జీవించనట్లయితే అపవిత్రతలోనికి దిగజారిపోతాము. ఈ విధముగా మనము మన మరణము వరకు జీవిస్తాము. అయితే మనము ప్రభువు కొరకు జీవించినట్లయితే, మనలను మనము త్యాగము చేసుకొని దేవుని కొరకు హింసించబడతాము. దురాత్మ బలమునకు విరోధముగా మనము ఒక ఆత్మీయ పోరాటమును పోరాడినట్లయితే, మన హృదయము మనము కొనసాగుటకు నూతన బలమును కనుగొను ఆత్మీయ ఆహారముతో నింపబడును.
క్రైస్తవులు పడిపోయినప్పుడు, ఇది వారు ప్రభువు కొరకు జీవించనందు వలన జరిగినది. అయితే మనము ప్రభువు కొరకు జీవించినప్పుడు, మన ఆత్మీయ బలము మరింత పెరుగును, మరియు మన భౌతిక బలము కూడా మరింతగా బలపడును.
38-39 వచనము చెప్పుచున్నవి, ‘‘మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవునవియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను, మన ప్రభువైన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను.’’ నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచు ఒక విశ్వాసిగా, పౌలు దీని విషయములో సమ్మతిపడ్డాడు. ఇదే విశ్వాసము మనకు కూడా వర్తిస్తుంది. మరణమైనను జీవమైనను మనలను క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపలేవు.
పూర్వ కాలములో, రోమా చక్రవర్తులవలె, ఈ లోక అధికారము కొరకు ప్రయాసపడువారు, క్రైస్తవులు వారి విశ్వాసమును విడిచిపెట్టుట కొరకు ప్రయత్నించుచు, వారి తోటి సహోదరులకు, ఉన్నత ఉద్యోగము, భార్యలు, ఆస్తులు అన్ని రకములైన ప్రలోభములకు గురిచేస్తారు. ఇవి అన్నీ వారి విశ్వాసమును వదులుకొనుట కొరకే అయితే నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచియు ఎన్నడును అధికారమును ఆస్తులు లేక గౌరవము అను శోధనకు లొంగలేదు.
విశ్వాసము అనునది లోకమిచ్చుదానికి ప్రతిఫలముగా మార్చుకొనునది కాదు. ఒకడు మనకు ఖాళీ చెక్కును చూపించి, ‘‘నీవు ఈ సువార్తను మానినట్లయితే నేను నీకు ఈ చెక్కును ఇస్తాను’’, అని చెప్పినట్లయితే ‘‘ఇది ఖర్చు చేసుకొనుటకు నీకు అవసరము; నాకు ఇది ఒక కాగితపు ముక్కకాక మరేమి కాదు’’ అని మన భవిష్యత్తుపైన వున్న విశ్వాసము మరియు నిరీక్షణను బట్టి సమాధానము ఇవ్వగలము.
నీరు మరియు ఆత్మ సువార్త అనునది మాత్రమే దేవుని నీతి కలిగిన సువార్త
‘‘నీవు సిలువ రక్తమునందు మాత్రమే వున్న మా విశ్వాసము కూడా సరియైనదే అని దీనిని అంగీకరించినట్లయితే, మేము కూడా, అప్పుడు మీ విశ్వాసమునకు నీవు తప్పుగా బోధించుచున్నావు అని మేము వేయు నిందను ఆపుట మాత్రమే కాదు. వాస్తవమునకు మేము మీకు సహాయము చేస్తాము’’ అని నాతో అన్నవారు అనేకులు వున్నారు. మత నాయకులు అని పిలువబడే వీరు అటువంటి రాజీ కొరకు నా దగ్గర వుందేమో చూసారు. అయితే దేవుని నీతి ఆయన వాక్యముతో కొలవబడినప్పుడు ప్రశస్తమైనది మరియు విలువైనది. తప్పు అంటే ఏమిటో అది తప్పే మరియు సత్యమేదో అది సత్యమే. ఒక తప్పు విశ్వాసమును గుర్తించుట అనునది కూడా దేవునికి విరోధముగా తిరుగుబాటు చేయుట అందువలన నేను వారి విశ్వాసమునకు సమ్మతించకపోవుటయే కాదు, నేను తప్పక నిరంతరము వారి విధానమువైపు గురిపెట్టుచూ ఉండాలి కూడా.
‘‘నీవు కేవలము యేసురక్తమునందు మాత్రమే విశ్వాసముంచుచున్నావా? అప్పుడు నీవు తప్పక నీ హృదయములో పాపమును కలిగియుండాలి. నీవు నరకమునకు నిర్దేశించబడియున్నావు. నేను చాలా ముభావముగా వుండి అర్ధము చేసుకొనలేక పోవుచున్నానని నీవు తలంచినా నేను దీనికేమి చేయలేను; సత్యమనునది సత్యమే’’. అటువంటి మాట వలన ప్రజలు నాకు దూరముగా వుంటున్నారు ` ఇంకా క్లుప్త వివరముగా వారు నాకు దగ్గరగా వుండలేరు. చాలామంది ప్రజలు వారిని నేను ఇష్టపడుదునని నాకు దగ్గరగా రావలెనని ప్రయత్నము చేసారు. అయితే ప్రతిసారి, నేను వారికి ‘‘మీరు తప్పు కాపరులు జీవనోపాధి కొరకు వ్యాపారము చేయు మోసగాండ్రు, అంతేగాక కేవలము దొంగలు’’ అని వారికి చెప్పాను. అటువంటి వాటిని నేను చెప్పినప్పుడు ఎవరు నన్ను ఇష్టపడతారు? అయితే కానిది ఏదో అది కానిదే, ఇందువలననే నేను నా దృక్పధములో కదలక చాలా స్థిరముగా వుంటున్నాను.
నేను సిలువ రక్తమునందు మాత్రమే విశ్వాసముంచినట్లయితే అటువంటి ఇటువంటి అధికారమును ఇస్తామని చెప్పేవారి చేత కూడా నేను శోధించబడ్డాను. ‘‘ఉన్నవియైనను రాబోవునవైనను, ఎత్తయినను లోతైనను సృష్టించబడిన మరి ఏదైనను’’ అని పై వాక్య భాగము చెప్పినట్లుగా మనకు ఎటువంటి అధికారముగాని, ఎత్తయినా లేక లోతైనా అక్కరలేదు. కొంతమంది మోసగాళ్లు కలిగియున్నామని చెప్పుకొన్నట్లుగా మనకు స్వస్థత వరము అక్కరలేదు. తిరిగి జన్మించిన వారికి మనకు అటువంటివి అవసరము లేదు. మనము చివరికి అటువంటి వాటిని ఇష్టపడము కూడా.
ఈ వాక్య భాగము సృష్టింపబడిన మరి ఏదైనను యేసుక్రీస్తునందు దేవుని ప్రేమనుండి మనలను వేరు చేయలేదని మనకు చెప్పుచున్నది. చివరికి గ్రహాంతరవాసులు విశ్వములో ఉన్నప్పటికి, వారు కూడా మనలను రక్షించిన దేవుని ప్రేమ నుండి ఎడబాప నేరరు.
గ్రహాంతరవాసులున్నారని విశ్వసించు క్రైస్తవులు కొంతమంది వున్నారు. చివరికి దేవుని సేవకులలో కూడా, వారి ఉనికియందు విశ్వాసముంచుచున్నారు. అయితే గ్రహాంతరవాసివంటిదేమీ లేదు. నేను ఒకసారి ఒక సదస్సుకు హాజరైనప్పుడు, గ్రీకు నేర్చుకొన్న మా ప్రొఫెసర్‌లలో ఒకరు. గ్రహాంతరవాసుల యందు విశ్వాసముంచాడు. నేను అతనిని ‘‘లేఖనము నుండి ఏ ఆధారము ద్వారానైన నీవు నీ విశ్వాసమును బలపరచుకొనగలవా?’’ అని అడిగాను. అయితే నా వ్యతిరేకతకు అతడు ఎటువంటి సమాధానము చెప్పలేదనుకోండి. గ్రహాంతరవాసులు అనువారు ఖచ్చితముగా లేరు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆయన అద్వితీయ కుమారుని మనకిచ్చెను. ఒకవేళ నిజముగా గ్రహాంతరవాసులు ఉన్నట్లయితే, యేసు కేవలము ఈ భూమిమీదే జన్మించవలసిన అవసరము వచ్చేది కాదు.
విపరీత కృషి మరియు పరిశోధన అనంతరము, మనము ఇప్పటికే చంద్రున్ని చేరుకొనగలిగాము. మన పరిశోధనలు చివరికి అంగార గ్రహమునకు కూడా చేరుకున్నాయి. అయితే భూమికి వెలుపల జీవము ఉనికి ఏర్పడును ఒక్క ఆధారము కూడా కొనుగొనబడలేదు. నేను లేఖనమును ఆధారము చేసుకొని, నిశ్చయముగా చెప్పగలను. మానవజాతి సాంకేత సామర్థ్యము శాస్త్రీయముగా ఎంతగా అభివృద్ధి చెందినప్పటికి, మనమెంత అపరమితముగా విశ్వమును పరిశోధించినప్పటికి, మనమెన్నడును గ్రహాంతరవాసులను కనుగొనము. సృష్టించబడిన మరి ఏదైనను మనలను యేసుక్రీస్తున్నందున్న దేవుని ప్రేమ నుండి ఎడబాపలేదు. అప్పుడు దేవుని ప్రేమ ఏమైయున్నది? ఇది నీరు మరియు ఆత్మ సువార్త కాక మరి ఏమిటో కాదు. ఇదీ దేవుని ప్రేమ. నీరు మరియు ఆత్మ సువార్తతో పాపములేని వారిగా చేసి మనలను రక్షించిన రక్షణ అనునది దేవుని ప్రేమై యున్నది. మరియు ఈ ప్రేమ నుండి ఏదీ ఎడబాప నేరదు.
పౌలు 9వ అధ్యాయములో విశ్వాసమును గురించి మరలా మాట్లాడుచున్నాడు. అయితే ఇది 8వ అధ్యాయములో విశ్వాస శిఖరాగ్రమునకు చేరిన విశ్వాసపు ముగింపు ఇది. రోమా పత్రిక 1 నుండి 8 అధ్యాయము ద్వారా ఒక అంశము ఏర్పడుతుంది. దీని ముగింపు అయినటువంటి 8వ అధ్యాయముతో, ఇక్కడ విశ్వాసము శిఖరము చేరుకుంటుంది. 8వ అధ్యాయములో దేవుని చూపినట్లుగా నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచు వారు మాత్రమే దేవుని ప్రేమనుండి వేరుపరచలేని వారుగా మారుదురు.
ఆ విధముగా విశ్వాసముంచువారు ఏది ఏమైనా ఆ విధముగా ఎన్నడూ వుండలేరు. వారు కొంతకాలము ప్రభువుకొరకు జీవించవచ్చు. వారు మతపరముగా చివరివరకూ వారి విశ్వాసమును కాపాడుకొనలేరు. ఆయన కొరకు జీవించలేరు. వారు మతపరముగా 10, 20 సంవత్సరములు జీవించవచ్చు. అయితే వారు దేవునితో ఏ సంబంధము లేకుండా దేవుని నుండి వేరుచేయుచు క్రమక్రమముగా క్షీణించి చనిపోవును. ఇది వారికి క్రియలు కొదువైనందుకు కాదు, అయితే వారి హృదయము నుండి వారికి ప్రభువు పట్ల వున్న ప్రేమ మాయమగును. వారు వారి మనస్సులో పరిశుద్ధాత్మను కలిగియుండనప్పటి నుండి, వారి హృదయములో ప్రభువు పట్ల ప్రేమను కలిగియుండరు. ఇక్కడ క్లుప్తముగా దీనికి బదులు వారి హృదయములో పాపముండును.
దినములు గడిచిన కొలది, నీరు మరియు ఆత్మ సువార్తద్వారా నన్ను రక్షించిన రక్షణా ప్రేమ ఎంత ఉన్నతమైనదో లోతైనదో, నేను గ్రహించాను. నేను మొదట ప్రభువును కలుసుకొన్నప్పుడు క్రీస్తుపట్ల నా అభినందనా లోతు, ఒక చెరువులోనికి ఒక చిన్నరాయిని వేసినప్పుడు దాని వలన కనీసం కనిపించీ కనబడకుండా వుండే అలలవలె, నిమ్మళనముగా ప్రశాంతముగా వుండేది. నా స్పందన అనునది కేవలము యేసు నా పాపమును తీసుకొనిపోయెను. ఆ విధముగా నేను ఒక పాపములేని వానినయ్యాను అను ఒక ప్రశాంతమైన గ్రహింపు. అయితే అప్పటి నుండి ఈ సువార్తను బోధించు జీవితమును జీవించుచుండగా, నా హృదయములో వున్న ఈ తరంగము నా హృదయములోనికి ఒక బాంబు దూసుకొని పోయినట్లుగా, ఊహకతీతముగా పొడవుగాను పెద్దవిగాను మారినవి.
మనము తప్పక కేవలము సిలువ సువార్తయందే విశ్వాసముంచవలెనని ఎవరు చెప్పారు? పౌలు దీనిని చెప్పెనా? రోమా పత్రికలో స్పష్టముగా అనేక రీతులుగా నీరు మరియు ఆత్మ సువార్త గురించి మాట్లాడెను. ‘‘క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి యేలాగు లేపబడెనో, అలాగే మనమును నూతన జీవమును పొందినవారమై నడుచుకొనునట్లు, మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి.’’ (రోమా 6:3-4)
ఈ నీరు మరియు ఆత్మ సువార్త ఎన్నో విధములుగా గొప్పది మరియు అన్ని విధములుగా పరిపూర్ణమైనది కాదా? ఒకని విశ్వాసము ఎంత చిన్నది అనే దానికి సంబంధము లేకుండా, ఒకడు నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచినట్లయితే, అప్పుడు అతడు/ఆమె పాపము నుండి రక్షించబడును. నీకు ఎన్ని లోపములున్నవి అను దానికి సంబంధము లేకుండా, నీరు మరియు ఆత్మ సువార్త నీ విశ్వాసము పూర్ణముగా చేయబడును. నీవు ఎంత బలహీనుడవు అను దానికి సంబంధము లేకుండా, నీరు మరియు ఆత్మ సువార్త యందున్న నీ విశ్వాసము ద్వారా నీవు రక్షించబడియున్నావు. నీవు స్వంతముగా ఏ శక్తి కలిగి లేనప్పటికి, మనము దేవునితో దేవుని కొరకు జీవించినట్లయితే, మన హృదయములలో వున్న మురికి అంతా తీసివేయబడును.
అయితే ప్రారంభము నుండి విశ్వాసముంచనివారు ఈ సువార్తను విని దీనితో 10 సంవత్సరములు జీవించినప్పటికి చివరికి దేవునికి విరోధముగా తిరిగి ఆయనను వదిలివేయదురు. వారి కన్నులను మూసుకొనరు వారి స్వంత హస్తముతో దేవుని దీవెనలను తృణీకరించుచు వారి స్వమరణము వైపుకు పోవు అవివేకులు. యేసు బాప్తిస్మమును బట్టి కాక సిలువమీద ఎటువంటి మరణము వుండదు అయినా వారు అనుదినము క్రీస్తును తమ పాపములతో సిలువ వేయుదురు.
గడుచుచున్న ప్రతిదినము ఈ సువార్త ఎంత గొప్పదో పరిపూర్ణమైనదో నేను గ్రహించుచున్నాను ` నేను బలహీనమైన కొలది, ఈ సువార్త ద్వారా చూపబడిన, ప్రభువు ప్రేమ ఎంత అద్భుతమైనదో మొత్తముగా నేను గ్రహించుచున్నాను. మరియు దీనిని బట్టి మరి యెక్కువగా దేవునికి వందనములు చెల్లించుచున్నాను. నేను ఈ సువార్తను బోధించుచున్న కొలది, నా కంఠస్వరము పెరుగుట జరిగినది. ఈ సువార్తను నేను బోధించు కొలది నేను బలవంతుడనయ్యాను. ఈ నిజ సువార్తను నేను బోధించుకొలది, నేను చాలా విషయములలో ఒప్పింపబడిన వాడినయ్యాను.
నీవు తిరిగి జన్మించినను, నీవు దేవుని వాక్యమును విననట్లయితే మరియు ఆయనను సేవించనట్లయితే, నీ మనస్సులలో ముళ్లపొదలు నీలో పెరుగును. ఈ ముళ్ల పొదను బట్టి, నీ మనస్సు వికలమౌతుంది. ఇది సంభవించినప్పుడు, స్తుతిపాటలను పాడి, యెహోవాను గురించి ఆలోచించుము. దేవునిని స్తుతించుచుపాడుటచేత, నీ మనస్సు కడగబడుతుంది. నీవు నీ ఆత్మను తిరిగి పెంచుకొనగలవు.
నీ మనస్సును అపవిత్రపరచు ప్రతీది దిగిపోవునట్లు నీ మనస్సును కుదిపివేయాలి. దేవుని వాక్యముచేత నీ హృదయమును నింపుటచేత నీ హృదయమును నూతన పరచుకొనవలెను, మన హృదయములు ఇప్పటికి కడగబడినవి, అయితే మన హృదయములోనికి లోక సంబంధమైన అపవిత్రత ప్రవేశించినప్పుడు గందరగోళ పరచి కకావికలము చేసినప్పుడు, ప్రభువును స్తుతించుటచేత, తిరిగి నూతన పరచుట చేత మరియు మన హృదయములను లెవనెత్తుట చేత, మనము దేవుని ఆరాధించగలము ఆయనకు ప్రార్థన చేయగలము.
మనలను మనము ఎక్కడ కనుగొన్నాము అనుదానితో సంబంధం లేకుండా, దేవునిని స్తుతించుట అనునది ఒక ఆనందకరమైన మనలను ఉత్తేజపరచు ఒక అనుభూతి. విమోచించబడినవారి మనస్సులలో పాపములేదు. అందువలన వారి మనస్సు నుండి స్తుతించుట మరియు ఆనందించుట అనునవి స్వభావసిద్ధముగా వారి మనస్సుల నుండి వచ్చును. మన ఆనంద హృదయములు మరియు స్తుతిపాట మన మనస్సులో పెరుగు ముళ్ళ పొదలను అదృశ్యము చేయును.
కొన్ని సమయములలో మన బలహీనతలు ప్రత్యక్షపరచబడతాయి. విభిన్న పరిస్థితుల ద్వారా మన ఆలోచనలు మరియు భావనలు తేలికగా మారుటను బ ట్టీ, మనము క్రీస్తునందున్న సహోదరులతో వున్నప్పుడు, ఒక మంచి స్థితిలో సంతోషముగా వున్నప్పటికి, మనకు మనమే వున్నప్పుడు మనము అపవిత్రము, చెడ్డవైన ఆలోచనలను కలిగియుండవచ్చు. ఇందువలననే పౌలు ఆయన శరీరమును చూసుకొన్నప్పుడు ‘అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! మరణమునకు లోనగు ఈ శరీరము నుండి నన్నెవడు విడిపించును? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి నేను వందనములు చెల్లించుచున్నాను’’ అని ఏడ్చాడు.
పౌలు ఇప్పటికీ అతని శరీరము బలహీనముగా వున్నప్పటికి, నీరు మరియు ఆత్మ సువార్తచేత రక్షించబడుటచేత, అతడు సంపూర్ణముగా మారాడు. ఇటువంటి వాడు పౌలు ఒక్కడేనా? నేను కూడా, పౌలు వంటి వాడను. నీవు అతని వంటివాడవు కావా?
లోకస్థులు ఒకచోట కూడినప్పుడు స్త్రీలు గంభీరముగా వారి భర్తలను గురించి పిల్లలు, ఇళ్ళు, పొగుడుకొనుచుండగా, పురుషులు తరచుగా ఎవరు పదోన్నతి పొందారు ఎవరు పొందలేదు అని వారి ఉద్యోగమును గురించి మాట్లాడుకొనుచూ సహజముగా మద్యము సేవించుటకు ఇష్టపడతారు. అయితే నీతిమంతుల సంభాషణ విలువలతో పోల్చినట్లయితే లోకస్తుల సంభాషణకన్నా భిన్నముగా వుంటుంది. చివరికి మనము మన రొట్టెను పంచుకొనుచున్నప్పుడు, ప్రపంచ వ్యాప్తముగా, ఇండియా, జపాన్, యూరప్, ఆఫ్రికా, అమెరికా సంయుక్త రాష్ట్రములలో, ఆ విధముగా దేవునిని స్తుతించుచు మన మనస్సులతో సహవాసమును పంచుకొనుచు రక్షించబడిన ఆత్మను గురించి మాట్లాడుకుంటాము.
రోమా పత్రిక చదువుచున్నప్పుడు, మన హృదయములో పౌలు స్వంత విశ్వాసమును పంచుకొంటాము అనుభూతిని పొందుతాము. దేవునిచేత ఇవ్వబడిన రక్షణ ఎంతగొప్పదో కూడా మనము కనుగొనగలము. సువార్తయొక్క అద్భుతమును మనము అనుభవించగలము. వాక్య భాగమును అర్ధము చేసుకొనగలము మరియు ఈ పదములో దాగియున్న రహస్యమును మనము కనుగొనగలము. ప్రభువుయొక్క రక్షణ ఎంత పరిపూర్ణమైనదో మరియు సంపూర్ణమో మనము గ్రహించినందున, ఆయన నీతిని మనము స్తుతించుట తప్ప మనమేమి చేయలేని నిస్సహాయులము.
ప్రపంచము ఇప్పుడు మారిపోవుచున్నను, మన పాపముల నుండి మనలను రక్షించిన నీరు మరియు ఆత్మ సువార్త ఎప్పటికీ మారదు. క్రీస్తు ప్రేమ మనలను రక్షించినందున, ఈ ప్రేమ మనలను ఎన్నడును విడువనందున ఇప్పటికీ మనలో నిలచియున్నందున, మనము చేయవలసినదంతా మన హృదయములను ఈ లోకము నుండి మరలించి తిరిగి దేవుని వైపు కేంద్రీకరించుట. మనము బలహీనులము, మరియు ఈ బలహీనతలను బట్టీ మనము కొన్నిసార్లు లోక మార్గములో పడిపోవచ్చును. అయితే ఇది సంభవించిన ప్రతీసారి, మనము కేవలము మన హృదయమును దేవుని వైపు త్రిప్పవలెను. మన శరీరము ఇప్పటికీ మారవలసివున్నది మరియు ఇప్పటికి పాపనియమముకు లోనైయున్నది. ఈ విధముగా మనము తప్పక నిరంతరము మన శరీరమును త్యజించి మన ఆత్మీయ తలంపుతో మన జీవితమును జీవించవలెను. ఒక క్రమములో మన హృదయములోని ముండ్లపొదను పెరగకుండా చేయుటకు, మనము ఎల్లప్పుడూ దేవుని తట్టు తిరిగి ఆయన నీతిని స్తుతించవలెను.
ఈ నీరు మరియు ఆత్మ సువార్త ఎంత శక్తివంతమైనదో నీవు గ్రహించావా? ఈ రోమా పత్రిక అంతా నీరు మరియు ఆత్మ సువార్తపై ఆధారపడినందున, మొదట ఈ సువార్తయందు నమ్మికయుంచక దేవుని వాక్యము తాళమును తెరవలేము.
ఈ వాక్యము యొక్క రహస్యమును తెరచి చూచుటకు మమ్మును అనుమతించింనందుకు నేను ప్రభువునకు వందనములు చెల్లించుచున్నాను. దేవుని ప్రేమయైన ఈ దేవుని నీతి నుండి మమ్మును ఎవరును వేరు చేయలేరు. నీవు ఈ దేవుని నీతియందు విశ్వాసముంచవలెనని కోరినట్లయితే, యోహానుచేత ఇవ్వబడిన యేసు బాప్తిస్మమునందు సిలువపైన ఆయన రక్తమునందు నీ రక్షణగా విమోచనముగా విశ్వాస ముంచుము. అప్పుడు నీవు కూడా దేవుని నీతిని పొందెదవు.
దేవుని నీతి దీవెనలు మీతో వుండును గాక.