• All e-books and audiobooks on The New Life Mission website are free
  • Explore multilingual sermons in global languages
  • Two new revised editions in English have been released
  • Check out our website translated into 27 languages
Search

Sermons

అంశం 9: రోమీయులకు ( రోమా పత్రిక పుస్తకం పై నున్న వ్యాఖ్యానం)

[అధ్యాయము 9-1] 9వ అధ్యాయమునకు పరిచయము

 
 
నీరు మరియు ఆత్మ సువార్త ఇశ్రాయేలీయులకు అన్యులకు ఇద్దరికీ

ఎందువలన పౌలు అతని స్వంత దేశస్థులను బట్టి అతని హృదయములలో బహు దుఃఖమును మానని వేదనయు కలిగియున్నానని చెప్పుచ్చున్నాడు? ఇది ఎందుకంటే పౌలు అతని తోటి సహోదరులకొరకు అతనికి బహుగా ప్రియమైన వారి కొరకు క్రీస్తునుండి వేరుచేయబడిశపించబడుటకు ఇష్టపడుచున్నాడు. అతని స్వంత శరీరము ప్రకారము, అతను నిజముగా అతనిదేశస్థులు రక్షించబడవలెనని కోరుచున్నాడు. 
ఈ చివరి యుగములో, మేము నీరు మరియు ఆత్మ సువార్త ప్రపంచమంతటికి బోధించుటకు గొప్ప ఆసక్తిని కలిగియున్నాము. ఈ సత్య సువార్తను వ్యాప్తిచేయుట దేవుని ఉన్నతమైన సంకల్పము మరియు అదే సమయములో తిరిగి జన్మించిన విశ్వాసులకు అతి ప్రాముఖ్యమైన గురి. ఈ చివరి కాలములో ఇశ్రాయేలీయులు ఈ నీరు మరియు ఆత్మ సువార్తను స్వీకరిస్తారా లేదా అనునది మన దృష్టిని ఆకట్టుకొనే మరొక అంశం. వారు రక్షించబడునట్లు వారి కొరకు ప్రార్ధనచేయుటను కొనసాగించాలి, ఏలయనగా వారు ఈ సువార్తను స్వీకరించినప్పుడు, ప్రభువు రెండవ రాకడ సంభవించునని మనకు తెలియును. 
ఈ సంవత్సరము నా ప్రార్ధన అంశములు అనునవి ప్రపంచ సువార్తీకరణ కొరకు ప్రార్ధన చేయుట మరియు ఇశ్రాయేలీయులు, ఇశ్రాయేలీయుల చేత ఈ నిజ సువార్త స్వీకరణ కొరకు. ఇశ్రాయేలీయులవారి స్వంత ప్రజలనుండి దేవుని సేవకులు ఉద్భవించాలని కూడా నేను ప్రార్ధించుచున్నాను. దేవుడు ఒకసారి వారికి ఆయన ధర్మశాస్త్రమును ఇచ్చాడు మరియు ఆయన కన్నులయెదుట వారినిరాజ్య యాజకులుగా కూడా చేసాడు. క్రీస్తు కూడా, శరీరము ప్రకారము, ఇశ్రాయేలీయుల నుండి వచ్చాడు, అయినప్పటికీ వారు ఆయనయందు విశ్వాసముంచుటకు నిరాకరించారు, ఆయన చిత్తమునకు వ్యతిరేకముగా తిరుగుటలో కొనసాగుటచేత ఇప్పటికీ వారు దేవునికి విరోధముగా వున్నారు. 
 

ఆయన మరలా వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనుట చాలా కష్టముగా వుండునని ప్రభువు మనకు చెప్పుచున్నాడు
 
నీరు మరియు ఆత్మ సువార్త యెరూషలేమునుండి ఉద్భవించి ప్రపంచమంతటా వ్యాప్తి చెందవలెననునది దేవుని చిత్తము. ఏదిఏమైనా ప్రజల హృదయములు ఈ దినములలో కఠినమాయెను. చాలామంది ప్రజలు సత్యమును వెదకుటనుండి తప్పిపోవుచున్నారు. 
ఈ మధ్యనే, "ది లాస్ట్ టెంటేషన్ ఆఫ్ క్రైస్ట్" అని పేరున్న ఒక సినిమా యేసును ధర్మశాస్త్రమునకు ఒక విరోధివలే చూపించింది కొరియాలో విడుదల అయ్యింది. ఇది పూర్తిగా దేవదూషణతోనిండివుంది మరియు దీని మూల సందేశము ఏమిటంటే, యేసు దేవుడు ఎన్నటికీ కాడు, ఇండియాకు చెందిన బుద్ధుడు అని బాగా తెలియబడిన యువరాజు సిద్ధార్థ వంటి, కేవలము ఒక సామాన్య మనుష్యుడు అని. ఈ సినిమా యేసు దేవుడు మరియు రక్షకుడు అను సత్యముపట్ల విద్వేషపూరితముగా వుంటుంది. ఇందువలననే దేవుడు చెప్పెను, " మనుష్యకుమారుడు వచ్చునప్పుడు ఆయన నిజముగా భూమిమీద విశ్వాసము కనుగొనునా? "(లూకా 18:8).
మనము ఎవనియందు విశ్వాసముంచుచున్నామో, ఆ యేసు క్రీస్తు, దేవుడు, ఆయన సృష్టియంతటిలో దేవునికన్నా ఉన్నతుడు, నిత్యత్వమును బట్టి స్తుతులకు యోగ్యుడు. ఇశ్రాయేలీయులలో జన్మించుటచేత, యోహానుచేత బాప్తిస్మము పొందుటచేత మానవజాతి పాపములన్నిటినిఆయన తనపైకి తీసుకొనెను, సిలువ మీద రక్తము చిందించి మరణించెను, మూడవ దినమున మృతులలోనుండి తిరిగి లేచెను, మరియు ఆయనయందు విశ్వాసముంచువారందరికి రక్షకుడయ్యెను. దేవునినీతిగా మారిన, మన ప్రభువు, ఆయనయందు విశ్వాసము గలవానిని నీతిమంతులుగా తీర్చటచేత మనలను మన పాపములనుండి విడిపించెను. 
పౌలు మనకు చెప్పుచున్నాడు అబ్రాహాము సంతానమైన, ఇశ్రాయేలీయులు ఎంతమంది వున్నప్పటికీ, దేవుని కుమారులుగా మారగలిగిన వారు, యేసునందు విశ్వాసముంచువారే అని చెప్పుచున్నాడు. 
ఇశ్రాయేలీయులు భవిష్యత్తులో చాలా శ్రమలను నిందలను ఎదుర్కొంటారు. దేవుని చిత్తమనునది చివరికి వారిలో కొందరు యేసును వారి రక్షకునిగా మన ప్రభువునందు విశ్వాసముంచుట. మన ప్రభువు ఇశ్రాయేలీయుల పాపములతో కలిపి, లోకపాపములన్నిటిని తీసికొనిపోయినప్పటికీ, వారు ఇప్పటికీ యేసును వారి రక్షకునిగా విశ్వసించుటకు నిరాకరించుచున్నారు. 
నీవు బలహీనుడవా? మనలో కొంతమంది ఇతరులకన్నా బలవంతులు లేదా బలహీనులుగా వుండవచ్చు. అయితే దేవుని యెదుట, మనమంతా లోపములతో నిండినవారము. కేవలము మన ప్రభువు ఈ లోకమునకు వచ్చెను, ఆయన బాప్తిస్మముచేత ఆయన భుజముల పైకి మన పాపములను తీసుకొనెను, సిలువ పై మరణించుటచేత మన స్థానములో తీర్పుతీర్చబడెను మరియు శిక్షించబడెను అని విశ్వసించుటచేత మాత్రమే, పాపమునుండి స్వతంత్రులమైన మనము దేవుని కుమారులుగా మారగలము. మనలను ఆయన ప్రజలుగా, పాపమునుండి స్వతంత్రులుగా చేసిన, దేవుని శక్తియందు విశ్వాసముంచి మనము తప్పక స్తుతించవలెను. మన ప్రభువు నిజముగా గొప్పవాడు.
కొంతమంది ప్రజలు మనుష్యులను బట్టి ప్రతీదీ ఉనికిలో వున్నదని తలంచుదురు. ఉదాహరణకు, నియమావళి పురుషులచేత కార్యరూపము దాల్చి, వారి కొరకు ఉనికిలో వున్నవి అని తలంచుదురు. ఏది ఏమైనా, ప్రతిదీ మనుష్యులచేత సృష్టించబడలేదు; ఏవైనను దేవుని చిత్తముచేత మాత్రమే సాధ్యమగునని మనము తప్పక తెలుసుకోవాలి. దేవుడు ఈ లోకమును ఈ విశ్వాముయావత్తును సృజించెను. చివరికి మనలను పాలించు మనుష్యులచేత చేయబడిన నియమావళికూడా, దేవుని చిత్తమును ఆధారము చేసుకొని వుంది. 
ప్రతిదానియందు దేవుడు పనిచేసినందున మరియు ఆయన చిత్త ప్రకారముగా ప్రతీదీ బహిర్గతము చేయబడినందున, అన్ని విషయములలో మనము తప్పక ఆయన నీతిని కనుగొనవలెను. మనము బలహీనులమైనప్పుడు, మనము దేవునికి విరోధముగా పాపము చేసినప్పుడు, మనము పాపములతో నిండియున్న దానిని బట్టి ఆయననుండి నరికివేయబడినప్పుడు, యేసుక్రీస్తునుండి విడుదల కలుగజేసెనో, ఆ యేసు అవతారము మరియు ఆయన బాప్తిస్మము చేత ఆయన వాగ్ధానమును నెరవేర్చెను.
ఇప్పుడు, నీరు మరియు ఆత్మ సువార్త లోకములోని ప్రతిమూలకు వ్యాపించుచున్నప్పుడు, దేవుని అసలు ప్రణాళిక పూర్తియగును. లోకములోని సంఘటనలు ఏ విధముగా బహిర్గతమౌచున్నవో మనము చూచినప్పుడు, ఇశ్రాయేలీయులు అమెరికా సంయుక్త రాష్ట్రములు కేంద్రములో వుండుట మనము చూస్తాము. దేవుని ప్రమేయము లేకుండా మరియొక ప్రపంచయుద్ధము సాధ్యపడునని నేను నమ్ముచున్నాను. 
ప్రపంచ వాణిజ్య కేంద్రములు కూలినప్పుడు, దీని భయంకరమైన పాటు లోకమంతటిని కదిలించింది. ఈ కాలములోగాని శతాబ్దములోగాని, ప్రపంచము యుద్దములో మరలా మునిగినట్లయితే, మనకేమి సంభవిస్తుంది? మనము నిశ్చయముగా మరొక ప్రపంచయుద్ధమునుండి కోలుకోలేము. మనచేత నాశనముచేయబడిన అన్ని నష్టములనుండి ప్రకృతికూడా కోలుకోలేదు. ప్రపంచమంతా సమాధానముతో నీరు మరియు ఆత్మ సువార్త ప్రపంచమంతటా ప్రకటించగలుగునట్లు మీరందరు ప్రార్ధన చేయుదురని నేను ఆశించుచున్నాను. మన ఆందోళన ఏమంటే లోకములో సమాధానము లేకుండా, మనము ఆ విధముగా చేయలేము. మనమందరము సమాధానము కొరకు ప్రార్ధన చేయవలెను, యుద్ధమును ఉగ్రవాదమును నిర్మూలించుటకు పోరాడవలెను.
మనుష్యుని చేత చేయబడిన ఏ మతమును మనుష్యుని పాపమును తొలగించలేదు. యేసుక్రీస్తు మాత్రమే, ఆయన ఒక్కడే, మనలను మన పాపములనుండి విడిపించగలడు. యోహానునుండి ఆయన తీసుకొనిన బాప్తిస్మము మరియు సిలువపైన ఆయన రక్తము మాత్రమే మన పాపములను కడిగివేయగలవు మరియు తీర్పుతీర్చగలవు. ఈ దీవెన దేవునినీతియందు విశ్వాసముంచువారికి ఇవ్వబడినది. మనము మన పాపములనుండి విడుదలపొందగల ఒకే ఒక మార్గము అనునది క్రీస్తు బాప్తిస్మము మరియు ఆయన రక్తము నందు విశ్వాసముంచుటచేత. మరియొక మార్గము లేదు. మనము అనేక మతపరమైన ప్రజలు చేయుటకు ఇష్టపడు, గొప్ప పశ్చాత్తాప ప్రార్ధనలద్వారా ప్రాయశ్చిత్తము చేయబడలేదు. దీనికి బదులుగా, ఆయన బాప్తిస్మము మరియు సిలువపైన ఆయన రక్తముచేత మన పాపములన్నిటిని తీసుకొనిపోయిన యేసు అవతారముద్వారా, మొత్తముగా పూర్తిగా, మన అన్ని పాపములనుండి విడిపించిన దేవునినీతియందు విశ్వాసముంచుట అనునది మన పాపముల ప్రాయశ్చిత్తమునకున్న ఒకే ఒక్క మార్గము. 
 

నీరు మరియు ఆత్మ సువార్త సత్యమునందు విశ్వాసముంచుటచేత మనము మన అన్ని పాపములనుండి రక్షించబడియున్నాము.
 
ఈ సత్యము లోకములోని ప్రతి మూల బోధించబడవలెను ఈ సత్యమునందు విశ్వాసముంచకపోవుట అనునది అన్యులకు వలె ఇశ్రాయేలీయులకు కూడా పాపమని మనము గుర్తించాలి. ప్రతి ఒక్కరు ఈ నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచాలి. 
రెండు జాతీయతలు, అన్యులు మరియు ఇశ్రాయేలీయులు, ఈ లోకములో జీవించుచుండగా పాపము చేయుటలో కొనసాగుట తప్ప మరేమి చేయలేరు. అయితే మన ప్రభువు ఈ పాపముల విషయములో అందరిని ఒక్కసారే ఆయన బాప్తిస్మముతో సంరక్షించెను. యేసు బాప్తిస్మము మరియు సిలువపై ఆయన రక్తము అను సత్యముకంటే సులభమైన స్పష్టమైన సత్యము ఏదైనా ఉండగలదా? యోహాను యేసుకు ఎందుకు బాప్తిస్మమిచ్చెను? ఆయన యోహానుచేత బాప్తిస్మమియ్యబడెను మరియు సిలువవేయబడెను ఆ విధముగా ఆయన ఒక్కసారే మన పాపములను తీసుకొనిపోయెను. ఈ సత్యమునందు విశ్వాసముంచకపోవుటచేత లేక వారి హృదయములలో దీనిని అంగీకరించకపోవుటచేత, ప్రజలు వారి పాపములను బట్టి వారి స్వనాశనమువైపుకు వెళ్లుచున్నారు. 
యేసు పొందిన బాప్తిస్మము "ఈలాగున" (మత్తయి 3:15) నీతియావత్తును నెరవేర్చును. `ఈలాగున` అను పదము గ్రీకులో `ఈ విధముగా`,`ఉన్నతముగా సరిపోయిన` లేక `దీనికంటే మరియొక మార్గము లేదు` అని అర్ధమిచ్చు `హుటోస్` అను పదము. ఈ పదము యేసు తిరుగులేకుండా యోహానునుండి ఆయన తీసుకొనిన బాప్తిస్మముద్వారా మానవజాతి పాపములు ఆయనపైకి తీసుకొనెను అని మనకు చూపించుచున్నది. యోహానుచేత యేసు బాప్తిస్మము పొందుటచేత లోకపాపములను యేసు తనపైకి తీసుకొనిననందున, ఆయన మనకు బదులుగా సిలువను మోసుకొనిపోయి దీనిపై రక్తమును చిందించగలిగాడు. దేనిచేత మానవజాతి అంతా దాని పాపములనుండి విమోచింపబడగలదో ఆ ప్రాయశ్చిత్త సత్యము ఇదేనని మనము తప్పక గ్రహించవలెను. 
మన ప్రభువు మనకు చెప్పెను, "మీరు నా వాక్యమునందు నిలిచియున్నట్లయితే, నిజముగానా శిష్యులగుదురు. మీరు సత్యమును తెలుసుకొందురు, మరియు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును". యేసు బాప్తిస్మము మరియు ఆయన రక్తము అనునవి, మన పాపములనుండి మనలను విడిపించు, దేవుని సత్యము; ఇది పూర్తిగా లిఖించబడిన దేవుని వాక్యమునందున్నది. నిత్యత్వము కొరకు, నీరు మరియు ఆత్మ సువార్తతో, ఈ ప్రాయశ్చిత్త సత్యము నిలిచియుండును. యేసు బాప్తిస్మము మరియు సిలువపైన ఆయన రక్తముచేత పాపులందరు ప్రాయశ్చిత్తము చేయబడవలెను అనితండ్రియైన దేవుడు నిశ్చయించుకొనెను అనునది ఆయన చిత్తము. మన విమోచనము కొరకుఆయన బాప్తిస్మము మరియు రక్తమునందు మనము విశ్వాసముంచినప్పుడు, దేవుడు మనకొరకు ఏవి స్థిరపరచేనో వాటియందు మనము విశ్వాసముంచుదుము. నీరు మరియు ఆత్మ సువార్త సత్యమునందు విశ్వాసముంచినప్పుడు మాత్రమే మన పాపములు విమోచించబడును. 
. ఈ ప్రాయశ్చిత్త సత్యమును, నీ విమోచనముగా ఈ క్షణమునందే, క్రీస్తు బాప్తిస్మము మరియు సిలువపైన ఆయన రక్తమును, నీవు విశ్వసించినట్లయితే, అప్పుడు నీవు నీతిమంతుడుగాతీర్చబడుదువు.మరియొకవైపున, నీవు విశ్వసించకపోయినట్లయితే, అప్పుడు నీవు ఒక పాపిగానేవుంటావు. "అందరును పాపముచేసి దేవుడనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు". యేసుక్రీస్తును మన రక్షకునిగా విశ్వాసముంచుటచేత, మనము మన అన్ని పాపములనుండి క్షమించబడి దేవుని కుమారులుగా మారగలము. ఈ నీరు మరియు ఆత్మ సువార్తయందు ఒకడు విశ్వాసముంచకూడదు అను దానికి కారణము లేదు. ఈ విమోచనా సువార్త అవసరములేనివాడు ఒక్కడు లేడు. ప్రతివానికి ఇది అవసరము. ఎవడైనను అతని/ఆమె ముందు సిద్ధపరచబడిన నీరు మరియు ఆత్మ సువార్త సత్యము ఇంత స్పష్టముగా వున్నపుడు, దీనియందు విశ్వాసముంచకూడదుఅని కోరుకోవాలి, ఇది అతని/ఆమె పాపములు శుద్దీకరించబడుటకు అతని అయిష్టత కదా? 
ప్రపంచ వ్యాప్తముగా చాలామంది ఈ నీరు మరియు ఆత్మ సువార్తను అంగీకరించియున్నారు. మరియు ఇంకా దీనిని ముందుకు తీసుకోనిపోవు నిమిత్తము వ్యాపింపజేయుటకు బోధించుచున్నారు. వారిలో కొంతమంది మా పుస్తకములకు స్వచ్చంధ పంపిణీదారులు అగుటకు అడిగారు. క్రీస్తు రక్తమునందు విశ్వాసముంచుటద్వారా మాత్రమే మీ పాపములనుండి మీరు విమోచించబడినట్లయితే, అప్పుడు ఈ లోకములో నున్న ప్రతి ఒక్కరు నీతిమంతులుగా తీర్చబడుదురు, పాపమునుండి స్వతంత్రులగుదురు. ఒకడు కేవలము సిలువ రక్తమునందు మాత్రమే విశ్వాసముంచినట్లయితే, అతడు అనుదినము పడే పశ్చాత్తాపపడి ప్రార్ధనలు చేసినప్పటికీ, అటువంటి ప్రార్థనలను ఉద్రేకముద్వారా, మతపరమైన సంప్రదాయ అభ్యాసములలో, అలవాటు చొప్పునచేయుచూ కొనసాగును, అతడు ఇప్పటికీ పాపములో కొనసాగును. 
ఒకవేళ నీవు నీ పాపములను ప్రాయశ్చిత్త ప్రార్ధనలచేత కడిగివేసుకొనవలెనని ప్రయత్నించినట్లయితే, నీ కార్యము, నీ కృషిచేత కాక, కేవలము యేసు బాప్తిస్మముతో మరియు సిలువపైన ఆయన బలియాగముచేత నీ పాపములన్నిటిని తీసికొనిపోయి నీ స్థానములో శిక్షించబడుటద్వారా, నెరవేర్చబడిన దేవునినీతిని తగ్గించుటవలన, అప్పుడు నీవు దేవునికి విరోధముగా భయంకరమైనపాపమును చేయుచున్నావు. 
నీవు యేసును ఒక రక్షకునిగా అంగీకరించినయెడల, నీ ప్రాయశ్చిత్తమనునది, యేసు బాప్తిస్మము మరియు ఆయన సిలువ మరణముద్వారా కలుగునని విశ్వసించుము. పాపులను వారిపాపములనుండి విడిపించుటకు యేసు వాగ్దానము చేసెను, మరియు యొర్దానులో యోహానుచేత బాప్తిస్మము పొందుట మరియు దేవునినీతిని నెరవేర్చుటకు సిలువపైన రక్తమును చిందించుటను బట్టి ఆయన వాగ్దానమును బట్టి ఆయన జీవించెను.ఈ సత్యమునందు విశ్వాసముంచక పోవుటకు మనకు ఏ కారణమున్నది? నీవు తప్పక నీ విమోచనముగా యేసు బాప్తిస్మము మరియు సిలువపైన ఆయన రక్తమును చిందించుటయందు విశ్వాసముంచాలి. 
ఆయన బాప్తిస్మము పొందినప్పుడు యేసు లోక పాపములన్నియు ఆయనపైన తీసుకొనెను అను సత్యము మత్తయి సువార్త 3:13-17లో కనుగొనబడుతుంది. వారి పాపములన్నిటినుండి క్షమించబడుటకు ఇష్టపడనివారు ఈ సత్యమునందు విశ్వాసముంచుటకు నిరాకరించుదురు. నీరు మరియు ఆత్మ సువార్త సత్యమునందు విశ్వాసముంచుటచేత మాత్రమే నీవు దేవుని కుమారునిగా మారగలవు మరియు శాశ్వత జీవమును పొందగలవు - నీ పాపములనుండి ఏదీ నిన్ను విడిపించలేదు. ఈ సత్యమునందు విశ్వాసముంచుటకన్నా అద్భుతమైనదేదీలేదు, ఆయన క్షమాపణకన్నా దేవునినుండి ఒక మంచి బహుమానము మరియొకటిలేదు. దేవుడు మనకు ఇస్తానని చెప్పిన అనేక బహుమానములలో, మన పాపముల ప్రాయశ్చిత్తము అను బహుమానము అన్నిటికన్నా ఉత్తమమైనది.
దేవుడు మనకిచ్చిన రెండవ ఉత్తమ బహుమానము అనునది మనము పాలించబోవు రాబోవుచున్న వెయ్యి సంవత్సరముల రాజ్యము, మూడవ బహుమానము నిత్యము, పరలోక రాజ్యములో దేవునితో కలిసి పాలించుచు నివశించుట అనునది. దేవుడు, ఈ చివరి యుగము వరకు, ఇశ్రాయేలీయులకు మరియు అన్యులకు ఈ విమోచనా సత్యము ప్రత్యక్షపరచబడుటకొరకు అనుమతించెను. 
లేఖనములలో ప్రవచించబడినట్లుగా, ఇద్దరు సేవకులు ఇశ్రాయేలీయులనుండి లేచుదురు, వారినుండి దేవుడు అద్భుతమైన సువార్త ఆశ్చర్యకార్యములను వారి ద్వారా జరిగించును. అనేకులు యేసును వారి మెస్సియగా విశ్వాసముంచుటకు, ఎవరిని వారి స్వంత ప్రజలనుండి లేపునో ఈ ఇద్దరి సేవకులద్వారా ఇశ్రాయేలీయులు నీరు మరియు సువార్తను వింటారు. మనము ఆ దినము కొరకు యోహాను " ప్రభువైన యేసురమ్ము" (ప్రకటన 22:20). 
అని అడుగుటచేత యోహాను ఎదురుచూసినట్లుగా, మనము ఆ దినము కొరకు వేచియుంటాము. ప్రభువు తిరిగివచ్చు సమయము వచ్చినప్పుడు,క్షమించబడి రక్షించబడిన ఈ సత్యమునందు విశ్వాసముంచుటను బట్టి నీవెంత కృతజ్ఞత కలిగివుంటావో తెలుసుకుంటావు. నీరు మరియు ఆత్మ సువార్త సత్యముయందు విశ్వాసముంచుటచేత నీవు నీ పాపములన్నిటినుండి విడుదలపొందవలెననునది నా కోరిక. ప్రపంచము మారవచ్చు, అయితే మనలను మన పాపములనుండిదేనిచేత దేవుడు రక్షించెనో, ఆ నీరు మరియు ఆత్మ సువార్త ఎన్నటికీ మారని శాశ్వతమైన సత్యము. మార్చబడని ఈ రక్షణా ప్రాయశ్చిత్తమును పొందుటకు మనము తప్పక ఈ సత్యమునందు విశ్వాసముంచవలెను. దేవుని విమోచనా సత్యము నీదగును గాక. 
 

మనలను కరుణా పాత్రలుగా చేయుటచేత దేవుడు మనలను విడిపించెను. 
 
రోమా 9వ అధ్యాయము గ్రంధస్తము చేయుచున్నది దేవుడు ఏశావుకన్నా యాకోబును ఎక్కువగా ప్రేమించినందున అతనిని రక్షించెను అని. ఆ విధముగా, ఏశావు ఒక ఉగ్రతా పాత్రగా చేయబడుచుండగా, యాకోబు ఒక కరుణా పాత్రగా చేయబడెను. ఇది మనకు ఎందుకని అను ప్రశ్నను తీసుకొని వస్తుంది. అది ఏమంటే దేవుడు ఏశావు కన్నా యాకోబుపైన అభిమానము చూపెనా?అని. ఎటువంటి సందేహములేకుండా, " దేవుడు పక్షపాతముతోను ద్వేషముతోను ఒకనిని ఎటువంటి షరతులు లేకుండా ద్వేషించి ఒకనిని ప్రేమించుటకు ఏర్పాటుచేసుకొనెను గనుక, ఆయన ముందు ఏర్పాటు ఏర్పాటు మరియు ఎన్నిక అనునవి తప్పు" అని వాదిస్తారు. 
మనము దేవుడు సృజించిన లోకమును చూచినప్పుడు, ఆయన సృష్టి ఎంత అందమైనదో స్వచ్ఛమైనదో మనము చూస్తాము. మొక్కలు, జంతువులు, దేవునిచేత సృజించబడిన మిగిలినవి ఎంత పరిపూర్ణముగా అనిపిస్తాయి. అప్పుడు, దేవుడు ఏ విధముగా కారణము లేకుండా ఒకనినిద్వేషించి ఒకనిని ప్రేమించగలడు? విషయము ఇది కాదు.
ఆదాము అవ్వల అవిధేయతవలన, పాపము లోకములో ప్రవేశించెను, మరియు ఈ పాపమునుబట్టి, తరువాత వచ్చిన వారందరు పాపములో కొనసాగుటకు నిర్దేశించబడ్డారు, నరకమునకు వెళ్ళుటకు నిర్దేశించబడకుండా వుండుటను తప్పించుకొనలేక పోయారు. దేవుడు యాకోబును పాపమునుండి రక్షించి ఏశావును పాపమునుండి రక్షించనందున, ఇది ఆయన ఏదో తప్పు చేస్తున్నాడను దానిని సూచించదు. ఆయన కన్నులయెదుట, ఆ విధముగా చేయుటకు దేవుడు కారణమును కలిగియున్నాడు.
క్రైస్తవ సమాజములో ఏశావువలె ప్రవర్తించు వారిని చాలామందిని మనము కనుగొనగలము. అటువంటి వ్యక్తి, ఆరాధన ఎక్కడ ఎప్పుడు పెట్టినా, ఉదయకాల ఆరాధననుండి రాత్రి చివరి ఆరాధన వరకు, దానికి హాజరవక తప్పిపోవడం, అను దానిని చూడడం చాలా కష్టం. కొంతమంది ఇంటిలోకన్నా ఎక్కువ సమయమును పనినుండి ఇంటికి వెళ్లకుండా చర్చికి వచ్చుటచేత, చర్చిలోనే గడపవచ్చు. మనము వారిని `మతపరమైన పరుగుపందెగాళ్లు` అని పిలవవచ్చు. వారిలో, ఏదిఏమైనా, దేవునినీతిని గంభీరముగా తీసుకొనరు. ఎందుకంటే వారు వారి స్వనీతిని కట్టుకొనుటకు ప్రయత్నము చేస్తారు, ఆ విధముగా చేయుటచేత, వారు దేవుని నీతిని ఎరుగకయుందురు. 
దేవునినీతిని ఎరుగనివారు కూడా ఇప్పటికి పరలోకమునకు వెళ్లవలెనని వారి పాపములు క్షమించబడవలెనని కోరుదురు. అయితే వారి కృషి దేవుని యెదుట ఇతర ప్రజలయెదుట వారి స్వనీతిని స్థాపించుకొనుటకు ప్రయత్నము చేయుటకే గాని, వారి పాపములనుండి వారు రక్షించబడు ప్రయత్నము కాదు, ఆయననీతియందు విశ్వాసముంచినవారికి దేవుడు దేవునినీతియందున్నవిశ్వాసము ప్రతి ఒక్కరికి కాదు అని చెప్పుచున్నాడు. 
అప్పుడు, ఏ రకమైన ప్రజలు దేవునినీతియందు విశ్వాసముంచగలరు? వీరు వారి మనస్సులలో, ఏ విలువలేని వారమని గ్రహించి, వారి పాపతత్వమును గుర్తించిన ప్రజలు. నీరు మరియు ఆత్మ సువార్తయందు జరిగిన ఆయన ప్రాయశ్చిత్తముద్వారా, దేవునినీతిని కనుగొనినప్పుడు, వెంటనే దానియందు విశ్వాసముంచి దేవునిని మహిమ పరచిన ప్రజలు, ఈ రకమైన ప్రజలు. మనము దేవునినీతియందు విశ్వాసముంచాము ఆ విధముగా రక్షించబడియున్నాము అనగా మనము దేవునినీతి అవసరమైన దీనులము. లేకుంటే, మిగిలిన మన జీవితమంతా పాపములో జీవించుటకు నాశనములోనికి నిర్దేశించబడుదుము. 
దేవుని యెదుట వారి స్వనీతిని వెదకువారు గర్వముతో నిండినవారు. అటువంటి వ్యక్తి "ప్రభువా, నేను నీకు పదియవవంతు ఇచ్చాను, నీకు ప్రార్ధన చేయుచు రాత్రంతా గడిపాను, గడిచినపది సంవత్సరముల నుండి ప్రతిదినము ఉదయకాల ఆరాధనలను ఎన్నడును తప్పిపోలేదు, నీ కొరకు మంచి కార్యములు చేసాను" అనిచెప్పవచ్చు.
ఏది/ ఏమైనా, అతడు/ఆమె ఎటువంటి నీతిని కలిగిలేరని గుర్తించినప్పుడు ఆయన మరింత ఎక్కువగా సంతోషిస్తాడు,ఆ విధముగా అతడు/ఆమె కలిగియుండలేని, అతని/ఆమె స్వంత కృషిచేత, ఋజువు చేసుకొనుటకు బదులుగా, నీరు మరియు ఆత్మ ప్రాయశ్చిత్తముద్వారా దేవునినీతియందు విశ్వాసముంచవలసిన అవసరముంది. 
ఇప్పుడు కూడా, క్రైస్తవ సమాజములో, వారి నీతిని చూపించుకొనుటకు అన్ని రకముల వాటిని చేయుటకు ప్రయత్నము చేయు ప్రజలు చాలామంది వున్నారు. కొంతమంది చివరికి వారు చెప్పినట్లు నడుచుకొంటారు కూడా. నీరు మరియు ఆత్మ సువార్తద్వారా కనపరచబడిన, దేవునినీతియందు వారు విశ్వాసముంచక పోవుటను బట్టి వారి పాపములు పూర్తిగా కడగబడలేదు. దేవుడు వారి అంతమును నిర్ధారించును. మన ప్రభువు బాప్తిస్మము మరియు రక్తమును వారి ప్రాయశ్చిత్త సత్యముగా ప్రభువునందున్న వారి విశ్వాసముచేత పాపముల ప్రాయశ్చిత్తముచేత వారు దేవుని నిజ కుమారులగుదురని మేమంతా ఆశించుచున్నాము. 
రక్షణా పాత్రలపై అపొస్తలుడైన పౌలు చెప్పుచున్నాడు అదేమనగా ఆయన ఎవనిమీద జాలిగొనునో వారిపట్ల ఆయనకు జాలిగలదు, ఆయన ఎవరిపై కనికరము చూపునో వారిని కనికరించును. అప్పుడు, దేవుని జాలిపొందు ప్రజలు ఎవరు? మానవులందరు నిజముగా దేవుని వాక్యము ప్రకారము నడుచుకొనవలెనని కోరినను ఆ విధముగా చేయలేరు. వారు దేవుని వాక్యమునందు విశ్వాసముంచి దాని ప్రకారము నడుచుకొనవలెనని వారి నిజమైన కోరికకు బదులుగా వారుపదే పదే తొట్రిల్లుదురు. దేవుని యెదుట విచారముతో అంతమగుదురు, ముందుగానే అపరాధభావనను కలిగియుంటారు, మరియు వారు నరకమునకు శిక్షించబడుటకు తగినవారని తలంచుదురు. ఆ విధముగా వారు ఈ లోకములోను మరియు పరలోక రాజ్యములోను వారు దీనులను గుర్తించుటచేత, వారిపై జాలిపడవలెనని దేవునిని అడుగుదురు. దేవుడు వారిపట్ల జాలిపడనిదే వారు రక్షించబడలేదని వారు ఎరిగినందున, వారు ఎటువంటి సంకోచము లేకుండా దీనికొరకు ఆయనను అడుగుదురు.
పాపములనుండి విడుదల, మరియొక మాటలో, దేవుడు ఎవరిపట్ల జాలిగొనునో, ఎవరిని ఆయన కనికరించునో అక్కడ కనబడును. ఈ ప్రజల కొరకు, ఆయన బాప్తిస్మముతో ఆయన అద్వితీయ కుమారుడు లోక పాపములన్నింటినీ ఆయనపైకి తీసుకోనుటచేత, సిలువమీద మరణించి, మృతులలోనుండి పునరుత్థానుడగుటచేత - ప్రజలందరు వారికి నిశ్చయించబడిన నాశనమునుండి వారిని విడుపించుటకు, దేవుడు నీరు మరియు ఆత్మ సువార్తను బహుమానంగా ఇచ్చెను. మన తండ్రి దీనులైనవారి మీద కరుణ కలిగియుండును.
 అయితే ఈ లోకములో ఆయన ఎవరిమీద కరుణ కలిగియుండునో వారికంటే ఎవరిమీద ఆయన ఉగ్రత చూపించునో వారు ఎక్కువమంది ఉన్నారని అనిపిస్తుంది. నేటి క్రైస్తవ సమాజములో కరుణను కలిగిన పాత్రలుగా ఉగ్రతను కలిగిన పాత్రలుగా ఉన్నారని దేవుడు చెప్పెను. మరియొక మాటలో, దేవునిచేత ప్రేమించబడిన ప్రజలు మరియు దేవునిచేత ప్రేమించబడని ప్రజలు ఉన్నారు.
రోమా 9:17 మనకు చెప్పుచున్నది, " మరియు లేఖనము ఫరోతో ఈలాగు చెప్పెను - నేను నీ యందు నా బలము చూపుటకును, నా నామము భూలోకమందంతట ప్రచురమగుటకును, అందు నిమిత్తమే నిన్ను నియమించితిని." దేవుడు ఫరోవంటి ప్రజలను కూడా ఆయన శక్తి తెలియబడుటకు లేపెను. ఏదిఏమైనా, కరుణా పాత్రులకు, ఆయన ప్రేమ చూపెను అందువలన, ఆయన నామము లోకమంతటా ప్రకటించబడెను. మన పాపములను బట్టి మరియు దేవుని ఉగ్రతనుబట్టి, మనమందరము నరకమునకు నిర్దేశించబడియున్నాము. ఏలయనగా ఆయనయందు విశ్వాసముంచిన మనపట్ల ఆయన కరుణ కలిగియున్నాడు.
దేవునినీతియందు విశ్వాసముంచినవారు మరియు వారి స్వనీతిని నెరవేర్చుటలో ఆసక్తి కలిగినవారు దేవునికి విరోధముగా తిరిగియున్నారు. దేవుడు ఆయన ఉగ్రతకొరకు వదలివేసిన ప్రజలున్నారు; ఆయన శక్తివంతమైన ఉగ్రత కనబరచుటకొరకు, ఆయనకు విరోధముగా నిలుచువారు కొంతమంది తప్పక ఉండాలి. దీని ద్వారా, దేవుని న్యాయమైన తీర్పు చూపబడుతుంది. 
ఫరోవంటి ప్రజలు దేవుని ప్రేమానీతిని తృణీకరించినవారు. ఫరోకి సంబంధించి, దేవుడుపది తెగుళ్లను ఇచ్చెను; ఆఖరి తెగులు మరణము. దేవునిని తృణీకరించినవారి కొరకు ఆరని అగ్నిగుండము మాత్రమే ఎదురుచూస్తుంది. ఇదీ దేవుని శక్తి యొక్క ఉగ్రత. దేవున్ని తృణీకరించేఅధికారముగల ప్రజలు చాలా మంది వున్నారు. అయితే ఆయన ఉగ్రతా శక్తిని ప్రకటించుటకు దేవుడు వారిని చివరికి పడవేయును. ఇందువలననే ఆయనను ఒంటరిగా వదిలివేయు ప్రజల హృదయములు కఠినపరచబడునట్లుగా ఆయన వారిని వదిలివేయుచున్నాడు. 
అప్పుడు, మనకు ప్రాముఖ్యమైనదేమనగా, మనము ఏ విధముగా కరుణా పాత్రలుగా చేయబడుదుము అనునది, ఎందుకనగా ఈ విధముగా మారుటను బట్టి, మనము దేవునినీతి ప్రేమయందు మన విశ్వాసముంచుదుము. దేవునియెదుట చూపించుటకు మనకేమీ లేదు; దీనికి బదులు, మనము ఆయన నీతితో కూడిన ప్రేమయందు మనము విశ్వాసముంచుటకు జన్మించియున్నాము. బైబిల్ మనకు సుంకరి ఒక పరిసయ్యుడు దేవుని యెదుటచేయు ప్రార్ధనా కథను చెప్పుచున్నది. దేవుడు పరిసయ్యుని పట్ల ఏమీలేకుండా సుంకరిపట్ల జాలిగొనెను. సుంకరివాలె వారు దేవునియెదుట ఏ మంచి చేయలేదని మరియు దేవుని మహిమను పొందలేకపోయారని గుర్తుపట్టినవారు సుంకరివంటి ప్రజలు; కావున వారు దేవుని కరుణ కొరకు వేడుదురు. 
దేవుని ప్రేమకు చెందిన నీతి వస్త్రమును ధరించు ప్రజలు ఈ రకమైనవారు. పరిసయ్యునివంటి ప్రజలు నిరంతరము దేవుని కొరకు ఎంత చేసారో - వారు పదియవ వంతు ఇచ్చారు, ఒక వారానికి రెండుసార్లు ఉపవాసమున్నారు, వారు ప్రార్ధన చేసారు, మతపరముగా అంకితము చేసుకొన్నారు అని డంబాలు పలుకుదురు. దేవునియెదుట మనమెక్కడ నిలుచున్నామో దానిమీదఆధారపడి, మనము దేవుని ప్రేమ నీతివస్త్రమును ధరించుకొంటాము లేక ఆయన ఉగ్రతా శిక్షకుగురౌదుము. దేవునియెదుట మన హృదయములను కఠినము చేసుకున్నట్లయితే, మన పాపములు శాశ్వతముగా క్షమించబడనివిగా మిగిలిపోతాయి. పాపక్షమాపణ లేకుండా మన గమ్యము నరకమౌతుంది.
నీరు మరియు ఆత్మ సువార్త ప్రపంచమంతటా భోదించబడుతూ వుంది. రక్షించబడనివారు కేవలము వారి హృదయములు కఠినమగుటచేత వారు రక్షింపబడనివారుగానే మిగిలిపోతారు. మానవులలో నీతిమంతులు ఎవరును లేరు, కేవలము విశ్వాసముచేత మాత్రమే దేవుని నీతి ప్రేమ వస్త్రమును ధరించుకొనగలము. దేవుడు వారిని చేసినప్పటికీ, ఆయన నీతిని గుర్తించుటకు నిరాకరించువారిని, దేవుడు ద్వేషించును. అయితే దేవునినీతియైన, నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచువారు. ఆయనచేత ప్రేమించబడుదురు మరియు శాశ్వత జీవమును పొందుదురు.
లోకములోవున్న చాలామంది క్రైస్తవులు నేడు దేవుని యెదుట ఉగ్రతా పాత్రలుగా జీవించుచున్నారు. ఇందువలననే మనము రోమా పత్రికనుండి దేవునినీతి అంటే ఏమిటో తెలుసుకొనవలసియున్నది. దేవుడు కొంతమందిని ప్రేమించుచున్నాడు, కొంతమందిని ప్రేమించుటలేదు అను దానికి కారణము, కొంతమంది ఆయననీతియందు విశ్వాసముంచుచున్నారు. మిగిలినవారు దీనియందు విశ్వాసముంచుటలేదు. నేను మాట్లాడాలి అని కోరుకొనే సత్యము ఇదే. దేవుడు యాకోబు ఏశావుల పట్ల చేసినది సరియైనది. యేసునందు విశ్వాసముంచువారిలో, నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచకుండా దేవునిచేత ప్రేమించబడవలెనని కోరువారు అనేకులు. ఇటువంటి ప్రజలు ఏశావువంటివారు, దేవుడు వారి పాపముల ప్రకారము వారికి తీర్పుతీర్చును.
దేవుడు ఒక క్రమములో లోక పాపములన్నిటిని తీసివేయుటకు యోహానుచేత బాప్తిస్మము పొందునట్లు ఆయన కుమారుని పంపెను. ఈ సత్యమునందు నీవు విశ్వాసముంచుచున్నావా? నీవు నిజముగా నీ హృదయమందు గాఢముగా విశ్వాసముంచుచున్నావా? దేనిచేత దేవునినీతి చూపబడెనో, ఆ నీరు మరియు ఆత్మ సువార్త సత్యమునందు నీవు విశ్వాసముంచినప్పుడు ఒక్కసారేమనమందరము మన అన్ని పాపములనుండి విడిపించబడుదుము. యేసు లోక పాపములన్నిటిని తీసుకొనిపోయెను మరియు వాటిని ఆయన భుజములపైనా పెట్టుకొనెను, సిలువపై మరణించెను, మృతులలోనుండి పునరుత్ధానుడయ్యెను, ఇవి అన్నీ ఒక్కసారే, అందువలన, మనము కూడా, మనపాపములనుండి ఒక్కసారే విడిపించబడుదుము.
దేవునినీతియందు విశ్వాసముంచక మనము ప్రాయశ్చిత్తము పొందుటకు ప్రయత్నము చేసినయెడల, ఆయనకు విరోధముగా మనము పాపము చేయుచూ వుంటాము. మనము ఆయననీతియందు విశ్వాసముంచనట్లయితే, దీని భావమేమనగా మన పాపముల కొరకు యేసు క్రీస్తు ప్రతిదినము బాప్తిస్మము పొంది ప్రతిరోజు మరణించవలసి వుంది అని. దేవుడు, ఆయన అనంతమైన జ్ఞానములొ, అటువంటి మార్గమును ఎన్నుకొనునా? మనలను మన పాపములనుండి విడిపించుటకు దేవుడు ఆయన కుమారుని ఒక్కసారి మాత్రమే పంపెను, బాప్తిస్మము పొందుటకు, సిలువవేయబడుటకు మనందరి పాపముల కొరకు కేవలము ఒక్కసారే పునరుత్ధానుడయ్యెను అందువలన ఆయన మనలను ఒక్కసారే పూర్తిగా రక్షించును.
మన దేవుడు నీతిగల దేవుడు. దేవుడు ఆయననీతియందు మన పాపముల పరిహార ప్రణాళిక వేసెను. మనము పాపముచేసిన ప్రతిసారి కేవలము ఆయన క్షమాపణ కొరకు మనము ప్రార్ధన చేయుటనుబట్టి దేవుడు మన పాపములను కడిగివేయడు. దీనికి బదులుగా, ఆయననీతియందు విశ్వాసముంచుటచేత విమోచించబడినవారి అన్ని పాపములను ఒక్కసారే అన్నిటిని ఆయన కడిగివేసెను.
అప్పుడు,ఆ తరువాత మనము చేయు అనుదిన పాపములకు ఏమి సంభవించును? మనము కృతజ్ఞతతో దేవునినీతిని బట్టి దేవునిని ఆరాధించినప్పుడు మరియు మహిమనంతటిని ఆయనకే చెల్లించినప్పుడు,ఇవి సంరక్షణలోనికి తీసుకొనబడతాయి. దేవుని దృష్టినుండి, యేసు ఆయన బాప్తిస్మముతో లోక పాపములను ఒక్కసారే ఆయనపైకి తీసుకొనెను, సిలువపై రక్తమును చిందించెను మరియు మనకు బదులుగా తీర్పుతీర్చబడెను, ఆ విధముగా ఒక్కసారే మన పూర్ణ రక్షణకొరకు మన పాపములన్నియు తీసికొనిపోయెను. లోక పాపములన్నిటిని తొలగించుటకు ఆయనవేసిన ప్రణాళికనుండి దేవుని ప్రేమ నీతి పూర్తియైనది.
రోమా 9:25 వ్యాఖ్యానించుచున్నది, "ఆ ప్రకారము నా ప్రజలు కానివారికి నా ప్రజలనియు,ప్రియురాలు కానిదానికి ప్రియురాలనియు, పేరు పెట్టుదును. అని హోషెయలో ఆయన చెప్పుచున్నాడు." అవును, దేవుడు చెప్పెను ఆయన ప్రజలుకాని వారిని ఆయన ప్రజలుగా పిలుచుదునని. ఎందుకనగా మనము విశ్వాసముంచిన దేవునినీతి ఒక శాస్త్రము కాదు, అయితే వాస్తవమునకు, ఆయననీతియందు విశ్వాసముంచుటచేత మనము మన పాపముల నుండి రక్షించబడియున్నాము.ఇది ఒక వాస్తవమైనందున, ఆయననీతిని అలక్ష్యము చేయువారు ఏశావువాలె ద్వేషించబడి తీర్పుపొందుదురు. దేవుని యెదుట అతని/ఆమె పాపములనుబట్టి పొగుడుకొనగలవాడు ఎవడును లేడు.
మనలను మన అన్ని పాపములనుండి విడిపించుటకు, దేవుడు మనలను ఆయననీతితో రక్షించెను. అప్పుడు, ఆయనను మనము స్తుతించకుండా కృతజ్ఞతలను తెలపకుండా ఎలా వుండగలము? కృతజ్ఞతతోను మరియు విశ్వాసముతోను దేవునినీతి సువార్తను వ్యాప్తిచేయుటతప్ప మనమేమిచేయలేము.