• All e-books and audiobooks on The New Life Mission website are free
  • Explore multilingual sermons in global languages
  • Two new revised editions in English have been released
  • Check out our website translated into 27 languages
Search

Sermons

అంశం 9: రోమీయులకు ( రోమా పత్రిక పుస్తకం పై నున్న వ్యాఖ్యానం)

[అధ్యాయము 9-2] ముందుగా ఏర్పరచుకొనుట అనునది దేవునినీతిలోపలే ప్రణాళిక వేయబడును అనునది మనము తప్పక తెలుసుకొనవలెను. (రోమా 9:9-33)

2021.04.28 1,018
(రోమా 9:9-33)
" వాగ్ధానరూపమైన వాక్యమిదే- మీదటికి ఈ సమయమునకు వచ్చెదను; అప్పుడు శారాకు కుమారుడు కలుగును. అంతేకాదు; రిబ్కా మన తండ్రియైన ఇస్సాకు అను ఒకనివలన గర్భవతియైనప్పుడు,ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము,క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా వుండు నిమిత్తము,పిల్లలింక పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇందునుగూర్చి నేను యాకోబును ప్రేమించితిని,ఏశావును ద్వేషించితిని అని వ్రాయబడియున్నది. కాబట్టి యేమందుము? దేవునియందు అన్యాయము కలదా? అట్లనరాదు. అందుకు మోషెతో ఈలాగు చెప్పుచున్నాడు- ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును; ఎవనియెడల జాలి చూపుదునో వానియెడల జాలి చూపుదును. కాగా పొందగోరువానివలనైనను, ప్రయాసపడువాని వలననైనను కాదుగాని, కరుణించు దేవునివలననే అగును. మరియు లేఖనము ఫరోతో ఈలాగు చెప్పెను - నేను నీయందు నా బలము చూపుటకును, నా నామము భూలోకమందంతట ప్రచురమగుటకును, అందు నిమిత్తమేనిన్ను నియమించితిని. కావున ఆయన ఎవనిని కనికరింప గోరునో వానిని కనికరించును; ఎవనికఠిన పరచగోరునో వాని కఠిన పరచును. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరము మోపనేల అని నీవు నాతో చెప్పుదువు. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీ వేవడువు? నన్నెందుకీలాగు చేసితివని రూపింపబడినది రూపించినవానితో చెప్పునా? ఒకముద్దనుండియే ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటిమీద కుమ్మరివానికి అధికారము లేదా? ఆలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును, తన ప్రభావమును చూపుటకు ఇచ్ఛయించినవాడై, నాశనమునకు సిద్ధపడి ఉగ్రతా పాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించిననేమి? మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణా పాత్ర ఘటములయెడల, అనగా యూదులలోనుండి మాత్రమే కాక, అన్యుజనములలోనుండియు ఆయన పిలిచిన మనయెడల, తన మహిమైశ్వర్యము కనుపరచవలెననియున్న నేమి? ఆ ప్రకారము
 నా ప్రజలు కానివారికి నా ప్రజలనియు, 
ప్రియురాలు కానిదానికి ప్రియురాలనియు, పేరు పెట్టుదును. 
మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజలుకారని యేచోటను వారితో చెప్పబడెనో, 
ఆ చోటనే జీవముగల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును 
అని హోషేయలో ఆయన చెప్పుచున్నాడు. మరియు ప్రభువు తన మాట సమాప్తము చేసి, క్లుప్తపరచి భూలోకమునందు దానిని నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుకవలె ఉండినను శేషమే రక్షించబడునని యెషయ ఇశ్రాయేలును గూర్చి బిగ్గరగా పలుకుచున్నాడు. 
మరియు యెషయా ముందు చెప్పిన ప్రకారము - 
సైన్యములకు అధిపతియగు ప్రభువు, మనకు సంతానము శేషింపచేయకపోయిన యెడల 
సొదొమవలెనగుదుము, గొమోఱ్ఱాను పోలియుందుము. 
అట్లయితే మనమేమందుము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని, అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి; అయితే ఇశ్రాయేలు నీతికారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాసమూలముగా కాక క్రియల మూలముగానైనట్లు దానిని వెంటాడిరి. 
-ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సీయోనులో స్థాపించుచున్నాను; ఆయనయందు విశ్వాసముంచువాడు సిగ్గుపడడు అని వ్ర్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి, తొట్రుపడిరి."
 

దేవునిచేత ప్రణాళిక వేయబడిన నిజమైన ముందు ఏర్పాటు ఏమిటి?
 
మనమిప్పుడు `దేవునిచేత ప్రణాళిక వేయబడిన నిజమైన ముందు ఏర్పాటు` ఏమిటో దానిపై మన ఏకాగ్రతను మరల్చుదాం. ఒక క్రమములో క్లుప్తముగా ముందు ఏర్పాటు అనగా ఏమిటో అర్ధము చేసుకొనుటకు, మనము లిఖించబడిన వాక్యమును దేవుని వాక్యముగా గౌరవించవలెను, మరియు మన విశ్వాసములలో ఏదైనా తప్పు వున్నట్లయితే మనలను మనమే సరిచేసుకొనవలెను. దీని కొరకు, దేవుడు ఎందుకు ఏశావును ద్వేషించుచు యాకోబును ప్రేమించెనుఅను దానిని మనము మొదట అర్ధము చేసుకొనవలెను. ముందు ఏర్పాటుపట్ల ఆధునిక క్రైస్తవ గ్రహింపు లేఖనమునుండి తప్పిపోవుచున్నదా లేదా అను దానిని కూడా మనము గ్రహించవలెను. దేవునిచేత స్థిరపరచబడిన ముందు ఏర్పాటు యొక్క నిశితమైన గ్రహింపును మనమందరము కలిగియుండవలెను. దేవునినుండి దీవెనలు పొందుటకు, దేవుని ఏర్పాటు ఆయన ప్రణాళిక లోనికి ఏ విధముగా సరిపోయినదో క్రైస్తవులమైన మనము గ్రహించవలసిన అవసరము వుంది. దేవుని ప్రణాళికనుగురించి అలోచించినప్పుడు, చాలామంది ఆధునిక క్రైస్తవులు, యాకోబు మరియు ఏశావుల జాతకములు ఎటువంటి షరతులు లేకుండా ఏకపక్షముగా దేవునిచేత నిర్ధేశించబడినట్లుగా, వారి గమ్యములు వారి పుట్టుకకు ముందే ఏర్పాటుచేయబడినవని తలంచుదురు. అయితే విషయము ఇది కాదు. మనము దేవునిచేత ప్రేమించబడ్డామా లేదా అనునది మనము దేవునినీతియందు విశ్వాసముంచియున్నామా లేదా అనుదానిచేత నిర్ధారింపబడుతుంది. ఆయన ప్రణాళికలో దేవుడు మనకిచ్చిన సత్యము ఇది.
 

నీవు నిజముగా దేవుని ముందు ఏర్పాటును అర్ధము చేసుకొనవలెనని గ్రహించినట్లయితే, నీవు నీ స్వంత ఆలోచనను వదలివేసి దేవునినీతిమీద నీ విశ్వాసము కేంద్రీకరించవలసిన అవసరం వుంది.
 
యేసుక్రీస్తుద్వారా కనపరచబడిన దేవునినీతిని గురించి చాలామంది ప్రజలు ఆలోచించలేక మరియు విశ్వాసముంచలేక పోయినందున, వారు ఎంచుకున్న మార్గములో దేవుని ప్రేమనుగురించి ఆలోచించుటకు ఇష్టపడుచున్నారు. చివరికి కొంతమంది దేవుని ప్రేమ న్యాయమైనది కాదుఅని కూడా తలంచుదురు. ఈ విధముగా ఆలోచించుట సరియైనది కాదు అని కూడా వారుతెలుసుకొనవలెను. యేసుక్రీస్తు ద్వారా కనపరచబడిన దేవునినీతిని పట్టించుకొనక పోవుటచేత, తప్పుగావచ్చిన విశ్వాస ఒప్పందములను మనము పారద్రోయవలసిన అవసరము వుంది. నీవు కేవలందేవుడు కొంతమందిని ప్రేమించును కొంతమందిని ద్వేషించును అని నీవు సులభముగాఆలోచించినట్లయితే, నీ స్వంత ఆలోచనచేత మిళితము చేయబడిన ఒక రకమైన తప్పు విశ్వాసము అని నీవు తప్పక, గ్రహించాలి. 
పొరపాటు ఆలోచనలచేత మానవ మనస్సులకు తెగులుపట్టింది. చాలామంది ఆధునిక క్రైస్తవులు సరియైన విశ్వాసమును కలిగిలేరు ఎందుకనగా వారి మనస్సులు అప్పుడప్పుడు తప్పు ఆలోచనలచేత ఉప్పొంగి ప్రవహిస్తాయి. ఇందువలననే నీ విలువలేని ఆలోచనలను త్రోసివేయవలసిన అవసరం వుంది, మరియు దేవుని వాక్యమును వెంబడించుటచేత మరియు ఆయననీతియందు విశ్వాసముంచుటచేత నీ విశ్వాసమును సరియైన మార్గములో పెట్టుము. 
ముందు ఏర్పాటు దేవునినీతిలోపల ప్రణాళిక వేయబడినందున, మనము ఆయననీతియందు విశ్వాసముంచినప్పుడే ఇది నిక్కచ్చిగా అర్ధము కాగలదు మరియు విశ్వాసముంచగలము. కావున మనము తప్పక ఆయన ప్రణాళికయందు మరియు ఆయననీతియందు విశ్వాసము కలిగియుండవలెను. దేవుని ప్రణాళిక ఏమనగా ఆయననీతిలోపలనూ ఆయన ప్రేమయందూ విశ్వాసముంచువారికి ఆయననీతి వస్త్రమును ధరింపచేయుట అనునది. 
ఆ విధముగా, ఆయన ముందు ఏర్పాటు అనునది యేసు బాప్తిస్మము మరియు ఆయన సిలువ మరణముచేత చెల్లించబడిన పాముల ప్రాయశ్చిత్తము యొక్క రక్షణతో వారికి వస్త్రముధరింపచేయుటచేత విశ్వాసులను ఆయన ప్రజలుగా చేయుట. ఆయననీతిలోపల ఆయనచేతప్రణాళిక వేయబడిన ఈ సత్యమునందు విశ్వాసముంచుటచేత మనము తప్పక దేవునితో సరియైన సంబంధము కలిగియుండవలెను. దేవుడు ఏశావువంటివారిని ఆయన ఉగ్రతను పొందువారిగా చేసి, యాకోబువంటి వారిని ఆయన ప్రేమను పొందువారిగా చేసెను.
 

దేవుని ముందు ఏర్పాటు విధివ్రాత వంటిది కాదు
 
దేవుని ప్రణాళికయందున్న ముందు ఏర్పాటు ఆయననీతిలోపల స్థాపించబడినది. దేవుని ప్రేమ అనునది ఎటువంటి ప్రణాళిక లేకుండా ఒక పరిధిలో నియమించబడినది కాదు. ఎవడైనను ఎటువంటి షరతులేకుండా, అతని/ఆమె జీవితము విధిచేత ఏర్పాటుచేయబడినట్లుగా, అతని లేక ఆమె జీవితము అతని/ఆమె పుట్టుకకు ముందే ఏర్పాటుచేయబడినట్లయితే, యేసునీతియందు విశ్వాసముంచుటచేత ఒకడు ఏ విధముగా విడుదల పొందగలడు? అతడు/ఆమె దేవునిచేత ప్రేమించబడుట అనునది దేవుని అనునది ముందు ప్రణాళిక మరియు ముందుగా నిర్ధారించబడినదానినుండి వచ్చినది అయితే, ఆ విధముగా ఒకని విధి అతని/ఆమె పుట్టుకకు మునుపే నియమించబడినట్లయితే, దేవుడు న్యాయవంతుడని ఎవడు తలంచును, అటువంటి దేవునినియందు ఎవడు విశ్వాసముంచును? ఒక పరిధిలో ఒక నియంతయైన అటువంటి దేవునియందు ఎవ్వడును విశ్వాసముంచవలెనని కోరుకొనడు.
అయితే మన దేవుని ప్రణాళిక ఒక కక్ష్యలోనిది లేక నియంత్రించునది కాదుగాని, మనలను మన పాపములనుండి ఆయననీతియందే విడిపించి మనలను ఆయన ప్రజలుగా చేయునదైయున్నది. దేవుడు ఆయన ప్రణాళికయందు, మరియు ఈ ప్రేమా నీతిలోపల, ఆయన మనకు క్షమాపణను ఇచ్చెను ఆయన నీతిప్రేమయందు విశ్వాసముంచువారికి ప్రేమ వస్త్రములు ధరింపజేయుటకు, దీనియందు విశ్వాసముంచనివారికి ఉగ్రతా వస్త్రమును ధరింపజేయుటకు ఆయన సిద్ధపరచెను.
ఒక అపార్ధములో దేవుని ముందు ఏర్పాటునుబట్టి వ్యధననుభవించువారికి నేను ఈ విధముగా చెప్పవలెనని కోరుచున్నాను. దేవుని ప్రణాళిక అనునది, ఆయనచేత సృజించబడిన మనము, ఆయన స్వంత ప్రజలుగా చేయబడుటకొరకు. కావున మనము తప్పక ఆయన ముందు ఏర్పాటునుబట్టిఆయనకు వందనస్థులమైయున్నాము. ఆయనను నిందించుచు వ్యధననుభవించు వారికంటే దేవునినీతియందు విశ్వాసముంచు మనము ఆయన ప్రజలుగా కృతజ్ఞత కలిగియుండుట మంచిది. అతని/ఆమె రక్షకునిగా యేసునందు విశ్వాసముంచు ప్రతిఒక్కరు దేవునినీతియందు ప్రణాళికవేయబడిన, దేవుని ముందు ఏర్పాటుయందున్న విశ్వాసముపట్ల నిశితమైన గ్రహింపును కలిగియుండాలి.
 

దేవుని నిజమైన ముందు ఏర్పాటు పిలిచిన ఆయనచేత స్థాపించబడెను.
 
రోమా 9:9 నుండి ఈ రోజు వాక్యభాగము చెప్పుచున్నది," వాగ్దానరూపమైన వాక్యమిదే - మీదటికి ఈ సమయమునకు వచ్చెదను; అప్పుడు శారాకు కుమారుడు కలుగును. అంతేకాదు; రిబ్కా మన తండ్రియైన ఇస్సాకు అను ఒకనివలన గర్భవతియైనప్పుడు, ఏర్పాటుకు అనుసరించిన దేవుని సంకల్పము, క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా వుండు నిమిత్తము, పిల్లలింక పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇందునుగూర్చి నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని అని వ్రాయబడియున్నది."
ఈ వాక్యభాగము దేవుని ముందు ఏర్పాటు అనునది దేవునినీతి ప్రేమ ప్రణాళిక వేయబడిన దేవుని ప్రేమకు చెందినది. ఆదికాండము 18:10 లో చూపబడినట్లుగా, శారా గర్భముధరించుట మానవరీత్యా అసాధ్యమైనప్పటికీ, అబ్రహామును దేవుని వాగ్ధానమును విశ్వసించెను ఎందుకనగా ఆయన మాటను ఇచ్చెను. ఈ విధముగా దేవుడు అబ్రాహామును నీతిమంతునిగా తీర్చెను: అతడు ఆయనయందు విశ్వాసముంచినందున దేవుడు అతనికి కుమారుడిని ఇచ్చెను, మరియుదేవుడు అతని విశ్వాసమును సమ్మతించెను. 
అందువలన మనము దేవునినీతియందున్న విశ్వాసమును గురించి మాట్లాడునప్పుడు, మనము దేవుని వాక్యమునందున్న విశ్వాసమును గురించి మాట్లాడుకొనుచున్నాము. దేవుని ప్రణాళిక మరియు ముందు ఏర్పాటును గురించిన మన చర్చ కూడా ఆయన వాక్యమునందున్న మన విశ్వాసముచేత నడిపించబడినది. ఈ విధముగా చేయనివారు - ఉదాహరణకు, ప్రార్ధించుచుండగా లేక కలలు కనుచుండగా చిహ్నములు లేక గురుతులు చూశామని చెప్పుకొనువారు దేవునినీతి సంకల్పమును గందరగోళములో పడవేయునప్పుడు - వారు వారి విశ్వాసముతో పెద్ద పొరపాటును చేయుచున్నారు.
పౌలు తరువాత "రిబ్కా మన తండ్రియైన ఇస్సాకు అను ఒకనివలన గర్భవతియైనప్పుడు, ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము, క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా వుండు నిమిత్తము, పిల్లలింక పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను." అను దానిని కలుపుచున్నాడు.
లేఖనము మనకు చెప్పుచున్నది, అదేమనగా ఇస్సాకు, తన స్వంతకుమారుని కలిగిలేనప్పుడు, దేవునికి ప్రార్ధన చేసాడు, దేవుడు అతనికి కవలలను ఇచ్చుటచేత అతని ప్రార్థనకు జవాబిచ్చాడు. దేవునినీతియందు ప్రణాళిక వేయబడిన ముందు ఏర్పాటు ఆయనచేత ప్రేమించబడిన వారివిశ్వాసముతో ఒక నిర్దిష్ట సంబంధమును కలిగివుంది.
11వ వచనము మరలా చెప్పతగినటువంటి: "ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము, క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా వుండు నిమిత్తము, పిల్లలింక పుట్టి మేలైనను కీడైనను చేయకముందే". దేవుని ప్రణాళికయందు ఇమిడియున్న ముందుఏర్పాటు మరియు ఎన్నికను అర్ధము చేసుకొనుటకు తాళపుచెవి అనునది "ఆయన పిలిచినవానియందు" దేవుని సంకల్పము నిలకడగావుండు నిమిత్తము. యాకోబు ఏశావుల మధ్య, దేవుని ప్రణాళికయందు ఇమిడియున్న ముందు ఏర్పాటు ప్రకారము, దేవుడు యాకోబును పిలిచెను మరియు ప్రేమించెను.
దేవుడు ప్రజలను పిలిచి వారిని ప్రేమించినప్పుడు, మరియొక మాటలో, నీతికి ఎంతో దూరముగా నున్న, యాకోబువంటి, ప్రజలను ఆయన పిలచును ప్రేమించును. గర్వముతో నిండి, తననుతాను నీతిమంతునిగా తీర్చుకొను ఏశావును దేవుడు పిలవలేదు. ఆయన ప్రణాళికయందునియమించిన, దేవుని ముందు ఏర్పాటులో, దేవుడు యాకోబువంటి ప్రజలను పిలచును మరియు ప్రేమించును అనునది ఒక విషయము. యాకోబువంటి ప్రజలను ఆయన పిలచుటలోని ఉద్ధేశ్యముఅనునది పాపులను పాపమునుండి స్వతంత్రులనుగా చేసి ఆయన స్వంత కుమారులుగా చేయుట. ఏశావు యాకోబుల మధ్య ప్రేమతో వస్త్రము ధరింపజేయుటకు పిలచినవాడు దేవుడు, పిలవబడినవాడు యాకోబు.
ఆయన ప్రణాళికయందు ఇమిడియున్న దేవునినీతిని తెలుసుకొని మనము తప్పక విశ్వాసముంచవలెను. యాకోబు దేవుడు ఆయననీతియందు ఎవనిపట్ల ఆయన కరుణను చూపెనో అటువంటి ఒక క్లిష్టమైన ఒక పాపికి ప్రాతినిధ్యము వహించుచుండగా, ఏశావు వారి స్వనీతిని అవలంబించుటలో ఆయననీతితో కూడిన ప్రేమను ఎరుగక దేవునికి విరోధముగా తిరిగిన వారికి ప్రాతినిధ్యము వహించుచున్నాడు. ఇందువలననే, ఆయన ప్రణాళికయందు ఇమిడియున్న ముందు ఏర్పాటుపై దేవుని వాక్యమును ముగించుటకు తాళపుచెవి అనునది "ఆయన ఎవనిని పిలుచునో" వానియందు నిలకడగా వుండు దేవుని సంకల్పము అర్ధము చేసుకొనుటయైయున్నది.
మన స్వంత ఆలోచనలచేత సృజించబడిన భ్రాంతితో కూడిన విశ్వాసములనుండి మనలను మనము తప్పక స్వతంత్రులమవ్వవలెను. దేవుడు, ఆయననీతిలోపల, యాకోబును ప్రేమించుట మరియు ఏశావును ద్వేషించుట మాత్రమే చేయగలడు. ఆయన ప్రణాళిక మరియు ముందుఏర్పాటును గురించిన దేవుని వివరణ "పిలిచినవాని" సంకల్పము నిలకడగా వుండుటకు అను ఆయన స్పష్టము చేయుటద్వారా ప్రతి ఒక్కరికి ఇది అందజేయబడినది. దేవుని ప్రణాళిక అనునది ఆయననీతిలోపల నెరవేర్చబడినది ప్రేమా సత్యము. దేవుడు యాకోబును ప్రేమించి ఏశావును ద్వేషించబడినప్పుడు, ముందు ఏర్పాటు అనునది, రక్షణ కొరకు ఆయన ప్రణాళిక ప్రకారము, దేవునినీతిని నెరవేర్చుటకొరకై యున్నది.
చాలా ఇతర మతములు చెప్పుకొనునట్లుగా, నీవు దేవుని చేత ప్రేమించబడినది లేక ద్వేషించబడినది అనునది మంచి క్రియల చేత కాదు, అయితే ఆయన ప్రణాళిక మరియు ఆయన నీతియందు విశ్వాసముంచుటచేత మీరు ఆయన కుమారులుగా మారియున్నారు మరియు మీ పాపములనుండి విమోచించబడియున్నారు.
 

దేవునిది తప్పా?

ఆయననీతిని ప్రేమించి విశ్వసించువానిని దేవుడు ప్రేమించును. మరియొక మాటలో, మన తండ్రియైన దేవుడు యేసుక్రీస్తునందు దేవునినీతియందు విశ్వాసముంచువారిని ప్రేమించుటకు మరియు ఆయన కుమారులుగా చేసుకొనుటకు నిర్ణయించుకొనెను అను వాస్తవమునందు తప్పేమీ లేదు. దేవుడు యేసుక్రీస్తునందు ప్రతివానిని ప్రేమించునట్లుగా ఆయన ప్రణాళిక వేయలేదు, అయితే యాకోబువంటి వారిని ప్రేమించునట్లుగా ప్రణాళిక వేసెను.
అప్పుడు, తప్పక, మనము ఏశావు వలె వున్నామా లేక యాకోబువలె వున్నామా అని మనలను మనము ప్రశ్నించుకొనవలెను. అయితే వారి మంచి క్రియలతో మరియు స్వనీతితో నిండినవారు కూడా ఇప్పటికీ దేవునిచేత ప్రేమించబడవలెనని కోరుచున్నారు, అయితే తప్పు మార్గములో క్రిందకు పరుగులు తీస్తున్న వారిని ఎవరూ ఆపలేరు. మనమిప్పుడు మాట్లాడుచున్నట్లుగా, దేవునిచేత ప్రేమించబడినవారు, ద్వేషించబడినవారు, ఈ రెండు రకములైన ప్రజలు ఎల్లప్పుడూ వుంటారు.
మనము తప్పక ఆయన నీతియుక్తమైన ప్రేమయందు మరియు మన రక్షణ కొరకైన ఆయన ప్రణాళికయందు విశ్వాసముంచుటచేత దేవునికి వందనములు చెల్లించుచు ఆయనను మహిమపరచుచు స్తుతించవలెను. మనము విశ్వాసముంచు, నీరు మరియు ఆత్మ సువార్త ఆశ్చర్యకార్యముగా దేవునినీతిపై ప్రతిబింబించును అను వాస్తవమును బట్టి కూడా ఆయనకు వందనములు చెల్లించవలెను. ప్రతిఒక్కరు దేవుని వస్త్రమును ధరింపజేయబడుటకు గ్రహించవలెను, దేవునియెదుట అతడు/ఆమె మొదట అతని/ఆమె తప్పిదములను మరియు పాపములను గుర్తించవలెను, ఆయననీతియందు విశ్వాసముంచవలెను. 
సమస్య ఏమిటంటే, చాలామంది క్రైస్తవులు, దేవునినీతిని నెరవేర్చిన యేసు బాప్తిస్మము మరియు సిలువను గూర్చిన సత్యమునందు విశ్వాసముంచలేక పోవుచున్నారు, మరియు తప్పుగా దేవుడు కొంతమంది నియమిత ప్రజలను ప్రేమించును మిగిలిన వారు కేవలము ఆయనచేత వదిలివేయబడుటకే విధింపబడియున్నారని విశ్వసించుచున్నారు.
ఇంకా సమస్యాత్మకమైనదేమనగా, ఇటువంటి తేలికయైన విశ్వాసము ఇతరులకు గొప్ప ఒప్పుదలతో బోధించబడుచూ వ్యాప్తిచేయబడుచున్నదను ఒక దురదృష్ట వాస్తవము. ఇది త్వరగా వ్యాప్తి చెందుచున్నది; ఆయనచేత ప్రణాళిక వేయబడి దేవుని ముందు ఏర్పాటుచేత చూపబడిన, దేవుని ప్రేమను అపార్థము చేసుకొన్న ప్రజలను ఇంకా ఇంకా నడిపించుచున్నది. యాకోబు ఏశావుకధలను మనకు చెప్పుటద్వారా దేవుడు మనకు చెప్పాలని ప్రయత్నము చేయుచున్నదేమనగా, ఆయన కుమారులుగా మారుటకు, అవసరమైనది మానవనీతి కాదు, ఆయన ప్రణాళిక ప్రకారముముందుగా ఏర్పాటుచేసిన, దేవునినీతి ప్రేమయందు విశ్వాసముంచుట మాత్రమే.
లేఖనము మనకు చెప్పుచున్నది అదేమనగా దేవుడు అబ్రాహామునకు వాగ్ధానముచేసిన కుమారుని శారాకిచ్చెను. ఇది మనకు, నేడు కూడా, దేవుని ప్రేమ మరియు నీతి వాక్యమును విశ్వాసమును కలిగినవారు, ఆయన కుమారులు కాగలరు అని చెప్పుచున్నది. అటువంటి కుమారులుగా మారుటకు, ఆయన ప్రణాళిక మరియు నీతియందున్న మన విశ్వాసములతో ఇవ్వబడిన సత్యమును గుర్తుపట్టవలెను, మరియు ఈ సత్యమునందు విశ్వాసముంచుటకు, మనము దేవుని ప్రేమ మరియు ఆయననీతియందు విశ్వాసముంచవలసిన అవసరముంది.
మనపట్ల యేసుక్రీస్తు ప్రేమ, మరియు మన కొరకే దేవుని ప్రణాళిక అనునది పూర్తిగా సత్యము మరియు ప్రేమ మన అందరికి ఇవ్వబడినది. మనలను మన పాపములనుండి రక్షించుటకు, ఆయన బాప్తిస్మముతో యేసు మన పాపములన్నింటిని ఆయనపైకి తీసుకొనెను, సిలువపై మరణించెను, మృతులలోనుండి పునరుత్థానుడయ్యెను, ఇది అంతయు ఆయనయందు విశ్వాసముంచు మనకు శాశ్వత జీవమును ఇచ్చుటకు.
దీని అర్ధము కేవలము మతపరమైన వారిగా వుండుట, మన స్వంత కృషిని కనబరచుటచేత, మనము దేవుని కుమారులుగా మారగలము అని కాదు,అయితే దీని భావము దేవుని కుమారులుగా మారుటకు ఒకే ఒక మార్గము అనునది మనకు చెప్పబడిన మరియు ఆయనచేత మనకొరకు ప్రణాళిక వేయబడిన, ప్రేమ వాక్యమునందు మరియు దేవునినీతియందు విశ్వాసముంచుటచేత మాత్రమే. దేవుని ప్రేమయందు మరియు నీతియందు విశ్వాసముంచినవారే ఆయన ప్రేమ వస్త్రమును ధరించుకొందురని మనమందరము గ్రహించుకొనవలెను.
అప్పుడు, మన కర్తవ్యమేమైయుండాలి? యేసు బాప్తిస్మము మరియు సిలువపైన ఆయన రక్తమునందు విశ్వాసము కలిగియుండాలి. కావున, మనము తప్పక దేవుడు మనకొరకు ముందుగా ఏర్పరచిన ప్రేమ ప్రణాళికను తెలుసుకొని దానియందు విశ్వాసముంచాలి. స్పష్టమైన సత్యమేమనగా దేవునినీతియుక్తమైన ప్రేమను తెలుసుకొని విశ్వాసముంచినవారు ఆయనచేత ప్రేమించబడుచుండగా, ఆయన ప్రేమను తృణీకరించుచు నిర్లక్ష్యము చేయువారు దేవునిచేత ద్వేషించబడుదురు.
 

నీరు మరియు ఆత్మ సువార్తను ఎవరు పొందగలరు? 
 
దేవునిచేత మనకివ్వబడిన నీరు మరియు ఆత్మ సువార్త అనునది కేవలము ఆయననీతిని ప్రత్యక్షపరచు సత్యము. అప్పుడు, ఎటువంటి ప్రజలు వారి హృదయములలోనికి ఈ సత్యమును స్వీకరించుదురు? ఎవరైతే వారి గమ్యములు శాశ్వతముగా వున్నవని గుర్తించి, దేవునియెదుట మరియు ఆయన వాక్యము యెదుట వారు పాపులని గుర్తించి, ఆయన కరుణ కొరకు అడుగువారు. "ప్రభువా, నీ ధర్మశాస్త్రము ప్రకారము ఎంతమాత్రమూ జీవించలేని ఒక పాపిని. నేను నా హృదయమును విడిచిపెట్టి నీకు అప్పగించుకొనుచున్నాను." ఆయననీతియందు ఆయనప్రేమ యొక్క పాపముల ప్రాయశ్చిత్తము ఎవరికి అనుగ్రహించబడినదో ఆ ప్రజలు వీరు. దేవునినీతిని కనబరచిన ఈ సువార్తయందున్న విశ్వాసము అనునది పాపులందరికి అత్యంత ప్రాముఖ్యమైనది.
దేవుడు ధర్మశాస్త్రము దానియందున్న ప్రతి శాసనము మనము వెంబడించునట్టు ఇవ్వలేదు, ఇది తరుచుగా అనేకులు అపార్థము చేసుకొను ఒక వాస్తవము. దీనికి బదులుగా, ధర్మశాస్త్రముయొక్క సంకల్పము అనునది మన స్వంత పాపస్వభావమును గుర్తుపట్టుటకు మనలను నడుపుటకొరకు. అప్పుడు, ఎందుకు పాపులు ధర్మశాస్త్రమును వెంబడించుటకు ముందుకు వస్తారు? ఎందుకంటే ప్రతి పాపి సహజ సిద్ధముగా విమోచనమును వెదకును మరియు అతని/ఆమె పాప క్షమాపణను వెదకును.
అయితే అన్ని శాసనములను వెంబడించగల సామర్ధ్యము కలిగినవాడు ఎవ్వడును లేడు. ఈ ప్రయత్నములన్నీ వారి పాపములను నిరాశలో దాచుకొనే ప్రయత్నములో, కేవలము క్షణికమైన అనుకరణ,- దేవునియెదుట మోసకరమైన ఒక విశ్వాసము. అందువలననే పాపులు ఈ మోసపూరితమైన విశ్వాసమును త్రోసివేస్తారు, దేవునినీతియందున్న విశ్వాసమునకు మరలుదురు, మరియు ఆయన ప్రేమ వస్త్రము ధరింపజేయబడుదురు.
మనకును ఈ ప్రేమ వస్త్రమును ధరింపజేయుటకు, యోహానుచేత బాప్తిస్మమియ్యబడి, లోకపాపములన్నిటిని ఆయన భుజములపైకి తీసుకొని, సిలువపై రక్తమును చిందించుటచేత, వాటినన్నిటిని కడిగివేసిన యేసును దేవుడు ఈ లోకమునకు పంపెను. ఆయననీతి ప్రేమయందు విశ్వాసము గలవారిని దేవుడు గుర్తించెను. దేవునినీతియైన, నీరు మరియు ఆత్మ సువార్తయందున్న మన విశ్వాసముద్వారా మన అన్ని పాపములనుండి మనము విడిపించబడినప్పుడు, ఆయన ప్రేమ వస్త్రము ధరించబడినవారముగా మనము మారియున్నాము. ఆయన ప్రణాళికయందు దేవుడు మన కొరకు సిద్ధపరచిన వాగ్ధాన సత్యమిది.
వారిమీద వారు ఆధారపడువారిని దేవుడు అసహ్యించుకొనును. అటువంటి ప్రజలు మనచుట్టూ చాలామంది వున్నారు. అయితే నీవు దేవునిప్రేమ మరియు ఆయననీతిని నెరవేర్చిన, యేసు బాప్తిస్మము మరియు ఆయన రక్తమునందు విశ్వాసముంచుటచేత, నీ అన్ని పాపములనుండినీవు రక్షించబడవలెను. అప్పుడు నీవు నిశ్చయముగా ఆయన ఎవరిని పిలుచునో వారికి భద్రపరచబడిన, దేవుని ప్రేమ వస్త్రము ధరింపజేయబడుదువు. ప్రజలు తరచుగా వారికి వారే ఆయన ప్రేమను మరియు పాప క్షమాపణను గెలుచుకొనుటకు వారి స్వంతముగా కార్యములు చేయుటకుప్రయత్నము చేయుదురు, అయితే దేవునినీతియందు విశ్వాసములేకుండా ఈ కృషి నిష్ప్రయోజనము.
దేవుడు ఆయన ప్రేమ వస్త్రమును ధరింపజేయుటకు యాకోబును మాత్రమే పిలిచెనుగాని ఏశావును పిలువలేదు. దేవునియెదుట, యాకోబు నక్కజిత్తుల ఒక మోసకరమైన అబద్ధికుడు, అయితే అతడు దేవుని ప్రేమ మరియు ఆయననీతియందు విశ్వాసముంచినందున, అతడు విశ్వాసుల తండ్రులలో ఒకడయ్యెను. మనము కూడా, దేవునినీతి నెరవేర్పు అయిన, యేసు బాప్తిస్మము మరియు సిలువపైన ఆయన రక్తమును, మన విమోచనముగా, విశ్వాసముంచుటచేత మనము తప్పక దేవుని నీతిని పొందవలెను. ఏశావు తన స్వంతవేటతో తన తండ్రిచేత దీవించబడవలెనని ప్రయత్నించినందున, అతడు దేవుని దీవెనలు సంపాదించుకొనలేని వారికి చిహ్నముగా మారెను. ఈ విషయముమీద జాగ్రత్తగా ఆలోచించుటకు మనము కొంత సమయమును గడపవలెను. ఈ ప్రపంచములో ఏశావు వంటివారు ఎవరు? మనము అతనివంటి వారము కామా?
యాకోబువంటి ప్రజలు దేవుని నీతియుక్తమైన ప్రేమను ఆకర్షించినవారు. యాకోబువలెమనము కూడా, బలహీనులము మరియు దుష్టులమని మనకు తెలుసు. నిలుచుటకు మనము పుట్టక మునుపే మన క్రియలవలన కాక ఆయన పిలుపుచేత మనలను పిలిచిన దేవుడు, ఆయన ప్రేమ పొందుటకు ఆయన ప్రేమ మరియు నీతియందు విశ్వాసముంచవలెనని మనకు చెప్పెను. మనందరి కొరకు, ఆయన ప్రణాళికయందు దేవునినీతిని నెరవేర్చిన దేవుడు, యేసును పంపెను.
దేవుడు మొదట మనలను పిలిచినప్పుడు, ఆయన పాపులను పిలుచుటకు వచ్చెను, నీతిమంతులను కాదు. ఆయనచేత ద్వేషించబడినవారు వారి స్వనీతితో నిండినవారని తలంచుచు ఆయన కరుణాపూరితమైన ప్రేమయందు విశ్వాసముంచనివారు. అటువంటి తప్పుగా నడిపించబడిన విశ్వాసములు కలిగినవారు దేవునిచేత ద్వేషించబడ్డారు మరియు ఆయన ప్రజలుగా వుండుటకు ఆయన ప్రేమయందు ఎన్నటికి వస్త్రముగా ధరించలేరు. దేవుడు ఆయన హృదయమందు ఈ సత్యమును ముందుగానే ఏర్పరచెను. అందువలన, పౌలు ఖచ్చితముగా వ్యాఖ్యానించుచున్నాడు, "కాబట్టి యేమందుము? దేవునియందు అన్యాయము కలదా? అట్లనరాదు." (రోమా 9:14)
 

దేవునిచేత ప్రేమించబడినవారు యాకోబువంటివారు
 
దేవుడు నీ వైపు చూసినప్పుడు, ఆయన ఎవనిమీద కరుణకలిగియుండెనో అటువంటి నిజమైన వ్యక్తివా? ఆయన ఎవనిమీద కనికరముంచునో మరియు ఆయన ఎవనిని ద్వేషించునో వారిని ద్వేషించుటకు దేవునికి ఎటువంటి కారణము అవసరమైయుండును? ఆయన మనయెడల తప్పు చేసాడని మనమెలాగు చెప్పగలము? 
ఈ భూమిమీద లెక్కించుటకు వీలులేనంతమంది ప్రజలు నివసించుచున్నారు. కొంతమంది దేవునిచేత ప్రేమించబడుచుండగా, కొంతమంది దేవునిచేత ప్రేమించబడుటలేదు. దీని భావమే దేవుడు వారి పట్ల తప్పుగా ప్రవర్తించెనా?
ఆయననీతికి విరోధముగా తిరిగిన వారికి తీర్పుతీర్చిన దేవుడు కూడా ఒక న్యాయమైన దేవునిగా వున్నాడు. ఈ నీతియందున్న మన విశ్వాసముచేత ఆయన నీతియందు కనబరచబడిన దేవుని ప్రణాళికను అర్ధము చేసుకొనుటచేత ఈ విషయములో మనకున్న ఏ అపార్ధమునైనను మనము తప్పక తప్పించవలెను. ఫరో హృదయమువలే, హృదయములు కఠినపరచబడి తప్పుగా నడిపించబడిన క్రైస్తవులు అనేకులున్నారు. ఈ అధ్యాయములోని 17వ వచనము వివరించుచున్నట్లుగా, దేవునిచేత ద్వేషించబడిన ప్రజలు ఈ రకమైనవారు. "మరియు లేఖనము ఫరోతో ఈలాగు చెప్పెను - నేను నీయందు నా బలము చూపుటకును, నా నామము భూలోకమందంతట ప్రచురమగుటకును, అందు నిమిత్తమే నిన్ను నియమించితిని."
మనమందరము దేవునియెదుట అసంపూర్ణులము. అప్పుడు, మనము ఫరోవంటి వారముగా మారరాదు. ఫరోవలే విననేరక వుండిన మనలను, మన విమోచనముగా యేసు బాప్తిస్మముమరియు సిలువపైన ఆయన రక్తమును విశ్వసించనందుకు, దేవుడు మనలను ద్వేషించవలెనా? అవును. ఫరోవంటి ప్రజలు దేవునికి విరోధముగా తిరిగియున్నారు. అటువంటి ప్రజలు వారి స్వనీతిని పొగుడుకొనుచు వారి స్వనీతిమీద ఆధారపడుదురు, అయితే వారి స్వనీతి వారి సొంత పాపములనుండి వారిని విమోచించదు. దేనిమీద ఫరో ఆధారపడెను? అతడు నైలునదిని నమ్మి ఆ నదిమీద ఆధారపడెను. విరివిగా అతడు నీరు కలిగియున్నంతకాలము, ప్రతీది కేవలము బాగుండునని అనుకొన్నాడు. ఇందువలననే ఫరోవంటి ప్రజలను దేవుడు ద్వేషించును. ఫరో హృదయమువలె ఎవని హృదయము కఠినమగునో వాడు దేవునిచేత ద్వేషింపబడి శాపగ్రస్థుడగును. నీవు అతనివలె వుండకూడదు. దేవుడు నీకు ఉచితముగా ఇవ్వబడిన కరుణా ప్రేమను స్వీకరించుటచేత, దీనికి బదులుగా ఆయనకుమారుడువగుదువు.
 

దేవునినీతి ప్రణాళికతో నీవు ఆనందముగా ఏకీభవించెదవా?
 
ఆయన ప్రణాళికయందు ముందుగా ఏర్పరచబడిన దేవునినీతియుక్తమైన ప్రేమను స్వీకరించుటకు నీ హృదయము సిద్ధముగా వున్నదా? యేసునందు విశ్వాసముంచినప్పటికీ వారు దేవుని ప్రణాళికను అపార్థము చేసుకొనినందున విపరీతమైన ఆందోళనతో బాధపడుచు వుండే, ప్రజలు కొంతమంది వున్నారు. అటువంటి ప్రజలు " నేను యేసునందు విశ్వాసముంచుచున్నాను, అయితే దేవుడు నన్ను నిజముగా ఎన్నుకొనెనా? ఆయన నన్ను ఎన్నుకొననట్లయితే, నా విశ్వాసమువలన నాకేమి ప్రయోజనము? అప్పుడు నేనేమి చేతును? నేను కేవలము యేసునందు విశ్వాసముంచుట మానను; నేనేమి చేయగలను? నేను నిజముగా దేవునియందు విశ్వాసముంచుచున్నాను, ఆయన ఎన్నికలో నేను లేనట్లయితే ఏమి సంభవిస్తుంది?"
అప్పుడు వారు "నేను యేసునందు విశ్వాసముంచి చర్చి ఆరాధనలకు హాజరౌచున్నప్పటినుండి, దేవుడు తప్పక నన్ను ఎన్నుకొనవలసినది. నిశ్చయముగా విషయము అదే! పరలోకముఖచ్చితముగా ఒక స్థలము నా కొరకు కలిగియుండవలసినది!" అయితే వారు పాపములో పడినప్పుడు, వారు మరలా " దేవుడు తప్పక నన్ను ఎన్నుకోనలేదు! యేసునందు నమ్మికను వదిలివేయుటకు నాకిదే సమయము!" అని ఆశ్చర్యపడుదురు. మరియొక మాటలో, వారిలో వారే ఆలోచించుకుంటారు, వారికి వారే ముగింపుకు వస్తారు, ప్రతిదానికి వారే ముగింపునిస్తారు. ఇటువంటి ప్రజలు ప్రత్యేకముగా దేవుని ప్రణాళిక గురించిన వారి గ్రహింపు గురించి మరలా ఆలోచించి యేసును వారి రక్షకునిగా విశ్వసించుటకు సమగ్రమైన సరియైన అవగాహనను పొందవలెను.
దేవుని స్వంత వాక్యముకంటే వేదాంతపండితుల బోధలను ఎక్కువగా విశ్వసించువారు, మరియొకవైపున, " ఆయన యాకోబును ప్రేమించుచు వారు పుట్టకముందే, ఏశావును ద్వేషించి, పెద్దవారు చిన్నవారికి పరిచర్య చేయమని దేవుడు చెప్పలేదా? మనము యేసును విశ్వసించినప్పుడు నిశ్చయముగా మనము మన పుట్టుకకు ముందే మనము రక్షించబడుటకు నియమించబడియున్నాము" అని అనవచ్చు. అయితే అపొస్తలుడైన పౌలు దేవునిచేత ప్రణాళిక వేయబడిన ముందు ఏర్పాటు "నిలకడగా వుండుటకు, క్రియలచేతకాదుగాని పిలిచిన ఆయననుబట్టి" అనిచెప్పుచున్నాడు.
ధర్మశాస్త్రమును వెంబడించుట ఒకనిని దేవుని పిల్లవానిగా చేయదు. కేవలము దేవునినీతియందు మరియు ఆయన కరుణయందు మరియు యేసు బాప్తిస్మము మరియు సిలువపైన ఆయనరక్తమునందు విశ్వాసము కలిగియుండుటచేత, మనము ఆయన పిల్లలము కాగలము. 
వేదాంతపండితులు నియమించిన సిద్ధాంతముల వలన, చాలామంది ప్రజలు దేవునినీతి కార్యరూపమైన, యేసు బాప్తిస్మము మరియు ఆయన రక్తమునందు వారి రక్షణగా విశ్వాసముంచలేక పోవుచున్నారు. ఆయన ప్రేమను కనబరచుచున్న, సువార్త ప్రేమను విని, అప్పటికీ దీనియందు విశ్వాసముంచనివారు కేవలము ఫరోవంటివారు. యేసుక్రీస్తునందు ప్రత్యక్షపరచబడిన దేవునినీతియందు విశ్వాసముంచక, వారి వారి స్వంత అభిరుచుల ప్రకారము యేసునందు విశ్వాసముంచుటచేత దేవుని కుమారులుగా మారవలెనని ప్రయత్నించువారిని, దేవుడు ద్వేషించును.
యేసుక్రీస్తుద్వారా చేప్పబడిన దేవునినీతియుక్తమైన ప్రేమయందు నీవు విశ్వాసముంచనట్లయితే, నీవు ఆ విధముగా చేయుటకు ఇది సరియైన సమయము. అప్పుడు, నీవు దేవుని ప్రేమ వస్త్రము ధరింపజేసుకొనెదవు. మనమందరము స్వభావసిద్ధముగా ఏశావువంటి వారము, అయినప్పటికీ దేవునినీతి యొక్క ప్రేమయందు మనము విశ్వాసముంచుటచేత ఒక్కసారే మనము రక్షించబడియున్నాము. ఆయననీతియందు మనము విశ్వాసముంచుటచేత దేవుని ధన్యప్రేమను మనము పొందియున్నాము. 
దేవుడు ఇశ్రాయేలీయులకు మరియు అన్యులకు ఇద్దరికీ ఆయననీతియుక్తమైన ప్రేమయందు విశ్వాసముంచువారిని ఆయన కుమారులుగా మారుటకు అనుమతించు దీవెన లభ్యమగునట్లు చేసెను. "నా ప్రజలు కానివారికి నా ప్రజలనియు, ప్రియురాలు కానిదానికి ప్రియురాలనియు, పేరు పెట్టుదును," అని దేవుడు చెప్పిన విధముగా, ఆయన మనకు యేసు బాప్తిస్మము మరియు ఆయన రక్తము యొక్క సువార్తను ఇచ్చెను, మరియు దీనియందు విశ్వాసముంచు మనకు, ఆయన నీతిప్రేమను ఇచ్చెను.
"మరియు జరుగుదేమనగా, మీరు నా ప్రజలు కారని యేచోటను వారితో చెప్పబడెనో, ఆ చోటనే జీవముగల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును" అను ఈ వాక్య భాగము నేడు మనకొరకు నెరవేర్చబడిన దేవుని ప్రేమ వాక్యము. ఆ విధముగా మనము దేవునియెదుట బాగా కురచయైనందున, దేవుడు శరీరధారియై మనయొద్దకు వచ్చి ఆయననీతియొక్క ప్రేమ మనకు లభ్యముగునట్లుగా చేయుటవలన, మనలను రక్షించెను. 
నీవు నేను దేవునియెదుట మన పాపములన్నిటినుండి రక్షించబడియున్నాము అనునది దేవునినీతిలోపల ప్రణాళిక వేయబడిన దేవుని విమోచనా ప్రేమ. మన హృదయములను కఠినపరుచుకొనకుండా, దేవునినీతియుక్తమైన ప్రేమయందు విశ్వాసముంచుటచేత మన అన్ని పాపములనుండి విమోచించబడుట,ఈ సత్యమునందు విశ్వాసముంచుటచేత మాత్రమే సాధ్యపడగలదు. ఈ విశ్వాస మార్గము కాక, పాపుల ప్రాయశ్చిత్తము పొందుటకు మరియొక మార్గమే లేదు. మనమందరము కఠినమైన హృదయములతో జన్మించియున్నాము, అయితే దేవుని వాక్యము మన హృదయములను మన మొండితనమును జయించగలదు. అప్పుడు మన హృదయములు దేవుని సమాధానముచేత పాలించబడును. నీవు దేవునియందు విశ్వాసముంచినట్లయితే, దేవునినీతి నీదగును.
దేవునినీతిని కలిగియున్న మనము బోధించుచున్న ఈ సత్య సువార్త ఉనికిలో లేనట్లయితే, ఈ లోకములోవున్న ప్రతిఒక్కరు అతని/ఆమె స్వనాశమును ఎదుర్కొనవలసివుండేది. నీరు మరియు ఆత్మ సువార్తను బోధించువారు లేకుండా, మానవజాతియంతా దాని నిరీక్షణను కోల్పోయేది. దేవునినీతియుక్తమైన ప్రేమ వస్త్రము ధరింపబడినవారు లేకపోతే, ప్రతివారు వారి పాపమునకు తీర్పు తీర్చబడుటను బట్టి, ప్రపంచము ఇప్పటికే దాని అంతమునకు వచ్చేది. అయితే దేవుడు ఆయననీతియుక్తమైన ప్రేమయందు విశ్వాసముగల మనలను ఈ భూమిపై వదిలెను. మనకెన్ని బలహీనతలు లోపములున్ననూ, ఆయన మనద్వారా పనిచేయుటను బట్టి, దేవునికి వందనములుమాత్రమే చెల్లించగలము.
దేవునినీతియుక్తమైన ప్రేమయందు వస్త్రము ధరించబడిన విశ్వాసము, యేసు బాప్తిస్మముమరియు సిలువపైన ఆయన రక్తమునుండి వచ్చెను. దేవునినీతియందున్న విశ్వాసము అనునది యేసు బాప్తిస్మము మరియు ఆయన రక్తమునందు విశ్వాసముంచు హృదయమునందు కనుగొనబడును. ఆయననీతియందున్న మన విశ్వాసముద్వారా మనము మన పాపములనుండి విడుదల పొందియున్నాము. ఈ సత్యమే దేవుడు మనకొరకు సిద్ధపరచిన ప్రణాళిక, ముందు ఏర్పాటు, మరియు ఎన్నిక. 
యేసుక్రీస్తునందు దేవునినీతిని నెరవేర్చు, దేవుని వాక్యమునందు ఎవరు విశ్వాసముంచుదురో వారు, అతని లేక ఆమె పాపములనుండి రక్షించబడుదురు. ఒకడు నాశనమును ఎదుర్కొనును దేవునినీతి పాపములన్నిటిని తొలగించకపోవుటను బట్టికాదు, అయితే అతని/ఆమె కఠిన పరచబడిన హృదయమును బట్టి, అతడు/ఆమె దీనియందు విశ్వాసముంచకపోవుటను బట్టి మాత్రమే.
మనము తప్పక దేవుని వాక్యము యెదుట మన హృదయములను దీనముగా చేసుకొనవలెను మరియు నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచవలెను. మన హృదయములు ఆయన యెదుట మోకరించవలెను. మనము దేవునినీతియుక్తమైన ప్రేమయందు విశ్వాసముంచుటచేత దీవించబడియున్నాము. ఆయన మనపై ఎంతో కరుణను కలిగియున్నందున మన అన్ని పాపములనుండి మనము రక్షించబడియున్నాము. మనము ఆయనకు వందనములు చెల్లిస్తాం. దేవునినీతియందు విశ్వాసముంచు మనము దీని విషయమై సిగ్గుపడుటకు మనమేమి కారణము కలిగిలేము. దీనికి భిన్నముగా, ఆయననీతియందు అతిశయించుటకు ప్రతి కారణమును మనము కలిగియున్నాము. 
ఆయన యెదుట మనమేమీ లేనివారమైనందున దేవుడు మనలను మన పాపములనుండిపూర్తిగా రక్షించాడు - ఈ రక్షణను బట్టి ప్రభువును స్తుతించుము. దేవునిచేత ప్రేమించబడుటకు, మనము తప్పక ఆయననీతియందు విశ్వాసముంచగలిగియుండాలి. 
ఈ దేవునినీతి నీకు తెలుసా? నీకు తెలిసియున్నట్లయితే, అప్పుడు దీనియందు నీవు విశ్వాసముంచుము. దేవుని నీతియుక్తమైన ప్రేమ నీ హృదయములోనికి వచ్చును. ఆయన నీ కొరకు ప్రణాళిక వేసిన దేవునినీతి ప్రేమయందున్న నీ విశ్వాసము అపార్థమునుండి స్వేచ్ఛను పొందును. 
దేవుడు నీ కొరకు నియమించిన విమోచనా ప్రేమ నీ హృదయములోనికి వచ్చును గాక. హల్లెలూయ! ఆయననీతియందు ఆయన కుమారులుగా మనలను చేసిన త్రియేక దేవునికి నేను వందనములు చెల్లించుదును.