• All e-books and audiobooks on The New Life Mission website are free
  • Explore multilingual sermons in global languages
  • Two new revised editions in English have been released
  • Check out our website translated into 27 languages
Search

Sermons

అంశం 9: రోమీయులకు ( రోమా పత్రిక పుస్తకం పై నున్న వ్యాఖ్యానం)

[అధ్యాయము 9-3] యాకోబును ప్రేమించుటనుబట్టి దేవునిది తప్పా? (రోమా 9:30-33)

2021.04.28 1,136
(రోమా 9:30-33) 
"అట్లయితే మనమేమందుము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని, అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి; అయితే ఇశ్రాయేలు నీతికారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాసమూలముగా కాక క్రియల మూలముగానైనట్లు దానిని వెంటాడిరి. 
-ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సీయోనులో స్థాపించుచున్నాను; ఆయనయందువిశ్వాసముంచువాడు సిగ్గుపడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి, తొట్రుపడిరి."
 

మనలనందరిని పిలుచుటలో,మన ప్రభువు చెప్పుచున్నాడు,"అయితే నేను పాపులను పిలవవచ్చితినిగాని నీతిమంతులను పిలువరాలేదు" (మత్తయి 9:13). వారి స్వనీతిని వెదుకువారికి, రక్షణా బహుమానము అనుమతించబడలేదు, మరియు దీనిని ప్రక్కనపెట్టుటకు, మనము దీనికి బదులు దేవునినీతియందు విశ్వాసముంచాలి.
రోమా 9:13 చెప్పుచున్నది ఏశావును ద్వేషించుచుండగా దేవుడు యాకోబును ప్రేమించెను అని. కృతజ్ఞతతో దేవునినీతిని స్వీకరించినవారికి, వారిని ఆయన ప్రజలుగా చేయు దీవెనతో బాటుగా, పాపముల ప్రాయశ్చిత్తమును బహుమానమును వారికిచ్చెను. మనమందరము తప్పక ఆయననీతి సమాచారముతో దేవునియందు విశ్వాసముంచవలెను. 
దేవునినీతి వాక్యము మనకందరికి ఇవ్వబడినదని తెలుసుకొని అర్ధము చేసుకొనవలెను. ఒకడు ఒకని పాపములనుండి విడుదలపొందవలెనని కోరినప్పుడు, ఒకడు తప్పక మొదట దేవునినీతితో పాటు అతని/ఆమె తప్పిదములను మరియు దోషములను తెలుసుకొనవలెను. మనము తప్పక ఆయననీతిని తెలుసుకొని విశ్వాసముంచవలెను. నరకమునకు వెళ్ళుటకు నియమించబడినవారమని ఎవరు తెలుసుకొందురో వారు మాత్రమే ఆయన నీతి అవసరమును కలిగియుందురని దేవుడు చెప్పెను. మనము మన స్వంత పాపములను గుర్తించి మన పాపములనుబట్టి, దేవునిఉగ్రతను ఎదుర్కొంటున్నాము అది నరకమునందున్న మన శిక్షను తప్పించలేనిదిగా చేయును అని గ్రహించుట అతి ప్రాముఖ్యమైనది.
అయితే మన ప్రభువు బాప్తిస్మము, సిలువపై ఆయన మరణము మరియు ఆయన పునరుత్థానము ద్వారా మన హృదయములలోనికి నీరు మరియు ఆత్మ సువార్తను స్వీకరించగలము ఎందుకనగా దేవునినీతియందు విశ్వాసముంచినవారు మాత్రమే ఆయన నీతియందు విశ్వాసముంచుదురు. ఇది ఎందుకనగా దేవుని కృప మరియు ఆయన ప్రేమ అనునవి నేడు చాలామంది క్రెస్తవులు లీనమైనట్లు ప్రశ్చాత్తాప ప్రార్ధనలద్వారా లేక ఒక అత్యంత భక్తిగల జీవితము ద్వారా సంపాదించుకొనగలిగినది కాదు. ఏదిఏమైనా, దేవునిచేత ఇవ్వబడిన పాపముల ప్రాయశ్చిత్తము ఆయన నీతియందు విశ్వాసముంచి ఆరాధించువారందరికి ఇవ్వబడినది.
మనము ఇష్టపూర్వకముగా నీరు మరియు ఆత్మ సువార్తయందు మన హృదయములలో విశ్వాసముంచుటకు సిద్ధముగా వుండవలెను. నీవు దేవునినీతిని స్వీకరించవలెనని కోరుచున్నావా?అప్పుడు దేవునియెదుట మరియు ఆయన ధర్మశాస్త్రముపట్ల నీ స్వంత లోపమును ఒప్పుకొనుము. నీ పాపములను బట్టి నీవు దేవుని ఉగ్రతకింద వున్నావు, మరియు నీకు ఆయన నీతి అవసరము అని గుర్తించు! నీవు నీరు 
మరియు ఆత్మ సువార్తను విశ్వసించినప్పుడు మరియు దీనిని నీ హృదయములోనికి అంగీకరించినప్పుడు, దేవునినీతి నీదగును. నీవు తప్పక ఈ సత్యమును తెలుసుకొనవలెను.
 

దేవునినీతియందు విశ్వాసముంచని వారి మనస్సులు గందరగోళములోను మరియు శూన్యములో చెరపట్టబడినవి.

మన మనస్సులు ఆదినుండి గందరగోళములో వున్నవని దేవుడు చెప్పెను (ఆదికాండము 1:2). మనుష్యుని ఆలోచనలు ఆదినుండి ఎందుకు అయోమయంలో పడినవి?ఇది ఎందుకంటేదేవునికి విరోధముగా తిరిగి పడిపోయిన దూత వారి మనస్సులను అయోమయముగాను శూన్యముగాను చేయుటచేత ప్రజలు దేవునినీతివాక్యమునందు విశ్వాసముంచుటను నిరోధించినది. ఇందువలననే మనుష్యుని హృదయములోనికి పాపము వచ్చినది (ఆదికాండము 3:1-8). 
దేవునిచేత సృజించబడిన ఒక దూత ఆయనకు విరోధముగా తిరిగినదని లేఖనము మనకు చెప్పుచున్నది. ఈ దూత తన స్వంత ప్రణాళికతో మరియు స్వంత బలముతో దేవుని సింహాసనము తీసుకొనవలెనని ప్రయత్నము చేసినది, ఈ తిరుగుబాటులో విఫలమగుటనుబట్టి అతని ఉన్నత స్థానమునుండి బయటికి నెట్టివేయుట జరిగినది. ఈ పడిపోయిన దూత అప్పుడు మానవజాతిని మోసగించినది ప్రలోభపరచినది, మరియు వారిని దేవునికి విరోధులనుగా చేసినది. ఈ దూత సాతాను అని పిలవబడినది. ఈ గర్వముతో కూడిన దూత ఇప్పటికీ విశ్వాసములలోను మరియు అవిశ్వాసులలోను అన్ని రకముల గర్వముతో కూడిన మరియు తిరుగుబాటులతో పనిచేయును. మనుష్యుని మోసగించుటచేత, అతడు దేవుని అధికారమును దేవుని నీతి వాక్యమును సవాలు చేసెను.
దుష్టుడు ఎల్లప్పుడు నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచకుండా వుండునట్లు అబద్ధములు పోగుచేయును. దుష్టునిచేత మోసగించబడుటచేత, చాలామంది ఫలించక వారి స్వనీతిని స్థాపించుటకు ప్రయత్నించుదురు. ఆయన మానవజాతిని పాపములో పడునట్లు చేసెను, దీని ఫలితముగా, వారి జీవితములను అయోమయములోను మరియు శూన్యమైన మనస్సులతో జీవుంచునట్లు చేసెను. 
 

దేవునిచేత ఇవ్వబడిన పాపముల ప్రాయశ్చిత్తము మరియు నీతి. 

సాతాను దుష్ట శోధనచేత పాపములో పడిపోయిన, మానవజాతి పాప విడుదల, ఒకని ఆసక్తి లేక అతని/ఆమె స్వనీతి మీద ఆధారపడదు. ఏదిఏమైనా, చాలామంది ప్రజలు వారి సొంత లోపములను గ్రహించకుండా దేవునికి విరోధముగా తిరుగుతూ వారి పాపములనుండి తప్పించుకొనుటకు అనేక విధములుగా ప్రయత్నము చేయుదురు. వారి స్వనీతిని వెదకువారిని, వారి మంచి క్రియలచేత దేవునినీతిని సంపాదించుకొనుటకు ప్రయత్నించువారిని దేవుడు గద్దించెను. విమోచనము అనునది అటువంటి ప్రజలకొరకు కాదు; తాము పాపులమని ఎరిగినవారికి, నిజ సువార్తయైన నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచువారికి మాత్రమే, దేవుడు ఆయననీతిని అనుమతించెను.
దేవుని సార్వభౌమ చిత్తము దాని పరిపక్వతయందు మానవుని ఆలోచనలకు భిన్నముగా వున్నది. ఒక వ్యక్తి వెలుపలికి ఎంత భక్తిని ప్రదర్శించుచున్నా - చర్చికి హాజరగుట, సంపూర్ణరాత్రి ప్రార్ధనలు, ఉదయకాల ప్రార్ధనలు, ఉపవాసములు, కానుకలు, పశ్చాత్తాప ప్రార్ధనలు, మొదగులగునవి చేస్తూవున్నా, - అతడు/ఆమె అతని/ఆమె పాపములను ఎన్నడును శుద్దీచేసుకొనలేడు. 
ధర్మశాస్త్ర కార్యములు మన పాపములనుండి మనలను విమోచించలేవు మరియు దేవునినీతిని మనదిగా చేయలేవని దేవుడు మనకు చెప్పుచున్నాడు. 9వ అధ్యాయములో 32-33 చెప్పినట్లుగా, "వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాసమూలముగా కాక క్రియల మూలముగానైనట్లు దానిని వెంటాడిరి. -ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సీయోనులో స్థాపించుచున్నాను; ఆయనయందు విశ్వాసముంచువాడు సిగ్గుపడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయితగిలి, తొట్రుపడిరి." ఆ విధముగా, దేవునినీతి పొందుటకు, మానవజాతికి దేవునికి మధ్య దీనిద్వారా యేసు బలిపశువు అయ్యేనో, ఆ యేసు బాప్తిస్మము మరియు ఆయన రక్తముయందు విశ్వాసముంచవలెను. ఒక క్రమములో దేవునినీతిని పొందుటకు నీ స్వంతనీతిని నీవు తప్పక త్రోసివేయవలెనని నీవు అర్ధము చేసుకొనుట పూర్తిగా క్లిష్టమైనది. యేసును మన రక్షకునిగా అంగీకరించుచుండగా, మనకు ఉచితముగా ఇవ్వబడిన, దేవునినీతిని మనము త్యజించరాదు. 
ఇప్పుడు కూడా, యేసు ప్రభువును వారి రక్షకునిగా ఒప్పుకొనువారు ఇంకనూ పాపులుగానే మిగిలియున్నారు ఎందుకనగా దేవునినీతిని కనబరచు సువార్తయందు వారు విశ్వాసముంచారు. ప్రజలు ఆయన ధర్మశాస్త్రమును వెంబడించుటచేత దేవునినీతి సంపాదించుకొనలేరు. దేవునినీతి వాక్యమునందు విశ్వాసముంచువారు వారి స్వనీతివెంట పరుగులు తీయుటను తరిమివేయవలెను. వారి స్వంత ధర్మశాస్త్ర క్రియలచేత దేవునినీతిని మరియు వారి విమోచనమును వెదకువారికి యేసు అడ్డుతగులు రాయిగా వున్నాడని మనము జ్ఞాపకముంచుకొనవలెను.
దేవునిచేత మనకివ్వబడిన, నీరు మరియు ఆత్మ సువార్త, యేసుక్రీస్తును వారి రక్షకునిగా అంగీకరించువారిని విమోచించు సత్యమైయున్నది, అయితే ఇది తప్పక దేవునినీతిని వెదకువారికితోడవ్వవలెను. విమోచనమునకు మరియు శాశ్వతజీవనమునకు ఖచ్చితముగా అవసరమైనది ఏమిటంటే, యేసు బాప్తిస్మము మరియు సిలువపైన ఆయన రక్తముద్వారా కనపరచబడిన దేవునినీతి వాక్యమునందు విశ్వాసముంచుట. క్రైస్తవులమధ్య పాపముల క్షమాపణను పొందలేని మనకు వాక్యము ప్రత్యక్షపరుచుచున్నది, మరియు అదే సమయములో, నీరు మరియు ఆత్మ సువార్తయందువిశ్వాసముంచువారు దేవునినీతిని పొందుదురని ఇది మనకు భోధించుచున్నది. 
కావున, దేవుడు ఎటువంటి షరతులు లేకుండా ఒక నియమిత ప్రజల సమూహమును నరకమునకు పంపించుటకు నిర్ణయించుకొనలేదు అనునది ఖచ్చితమైన విశ్వాసమునకు అవసరమైయున్నది. ఒకవేళ దేవుడు నిజముగా కొంతమందిని ఒక పరిధిలో ద్వేషించుచు, కొంతమందిని ప్రేమించినట్లయితే, ప్రజలు ఆయన నీతిని గౌరవించరు.
నీరు మరియు ఆత్మ సువార్తద్వారా, పాపులను వారి పాపములనుండి రక్షించుటకు, దేవుడు విమోచనా నీతి ధర్మశాస్త్రమును స్థిరపరచెను, మరియు ఆయన ప్రేమ వస్త్రమును ధరించుకొను గొప్ప దీవెనను ఆయన మనకిచ్చెను. దేవునినీతిచేత పలకబడిన నీరు మరియు ఆత్మ సువార్త యెదుట అతని/ఆమె స్వంత నీతిని తప్పక త్రోసివేయవలెను. దేవుడు దీనియందు విశ్వాసముంచువారికి మాత్రమే ఆయన నీతినిచ్చెను. 
దేవుడు ప్రజలు వారి స్వనీతిచేత వారిని వారి పాపములనుండి రక్షించుకొనగల వారగునట్లు అనుమతించలేదు. దేవునినీతిగా నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచకుండా, అతడు/ఆమె యేసునందు విశ్వాసమును ఒప్పుకొనునప్పటికీ, ఈ నీతిని పొందువాడు ఎవడును లేదు (యోహాను 3:1-8).
యేసు పొందిన బాప్తిస్మము మరియు సిలువపైన ఆయన చిందించిన రక్తము దేవునినీతిగా మారెను. ఇందువలననే యేసు వారి స్వనీతిని వెంటాడిన వారికి అడ్డుతగులు బండ అయ్యెను. కావున, యేసునందున్న విశ్వాసులు, వారు వారి స్వనీతిని వెంటాడినప్పుడు, వారు దేవుని నీతిపైన విరుచుకు పడుదురు అని తెలుసుకొని అర్ధము చేసుకొనవలెను.దేవునినీతియందు విశ్వాసముంచకుండా ఏ పాపి పరలోక ద్వారములలో ప్రవేశించలేడు. యేసుయందు విశ్వాసముంచు మనము తప్పక దేవునినీతియందు విశ్వాసముంచుట చేత మన పాపముల క్షమాపణను పొందవలెను.
ఈ లోకమునకు వచ్చిన, యేసుక్రీస్తు, పాపుల రక్షకుడు మరియు ఆయనే దేవునినీతియైయున్నాడు. యేసు నీరు మరియు ఆత్మ వాక్యముచేత మన పాపములను క్షమించినట్లుగా, మనముతప్పక నిజముగా దేవునినీతియందు విశ్వాసముంచాలి. యేసునందున్న విశ్వాసులు తప్పక యోహానునుండి ఆయన పొందిన బాప్తిస్మము మరియు సిలువపైన ఆయన రక్తమునందు దేవునినీతిగా విశ్వాసముంచాలి. లిఖించబడిన నీరు మరియు ఆత్మ వాక్యమునందు విశ్వాసముంచువారు మాత్రమే పరలోకమునందు ప్రవేశించగలరు.
 

మనము కరుణా పాత్రమైనవారుగాను ఉగ్రతా పాత్రమైన వారుగాను విభజించబడుదుమని చెప్పబడియున్నాము.

ప్రభువు చెప్పుచున్నాడు, "ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొంటే అతనికేమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి యియ్యగలడు?" (మత్తయి 16:26). ఒకడు అతని/ఆమె శాశ్వత జీవమును పోగొట్టుకొనవలసివచ్చినట్లయితే, అతని/ఆమె ఈ లోకమందు సాధించినవి, అవి ఏమయినను నిరుపయోగమగును. ఒకడు లోకమునంతయు జయించినను లేక విశ్వమంతటిని జయించినను, అతడు/ ఆమె యేసు బాప్తిస్మము మరియు సిలువపైన ఆయన రక్తమునందు విశ్వాసముంచి దేవునినీతిని పొందనట్లయితే, దీని వలన ఉపయోగములేదు. 
వేదాంతపరమైన సిద్ధాంతములు ఎంత ఉన్నతముగా అభివృద్ధిచేయబడినను, దేవునినీతినినెరవేర్చు నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచుటచేత మాత్రమే ఒకడు ఆయననీతిని తెలుసుకొనగలడు మరియు విశ్వాసముంచగలడు. యేసుయొక్క విశ్వాసులు దేవునినీతియందు విశ్వాసముంచి దీనిని పొందినప్పుడు మాత్రమే వారి పాపములనుండి వారు స్వతంత్రులు కాగలరు. 
ఈ దినములో, దేవునినీతియందు విశ్వాసముంచుచున్నామని చెప్పుకొను విశ్వాసులు, ప్రతి ఉదయకాల ప్రార్ధనలోనే వారి పాపములను గురించి ఆందోళనపడుతూ వుంటారు. వాస్తవమునకు వారు దేవునినీతియందు విశ్వాసముంచుటలేదు. ఆయననీతియందు ఇమిడియున్న విమోచనమును విశ్వసించక వారి విశ్వాసములను బహిరంగముగా ప్రకటించువారు దేవునిని సంతోషపెట్టరని, ఆయనకు కోపము మాత్రమే తెప్పించుదురని మనము తప్పక తెలుసుకొనవలెను. వారు దేవునినీతికి విరోధముగా తిరిగినందున, వారు ఆయనకు శత్రువులుగా మాత్రమే మిగిలిపోదురు.
యోహాను 3:5 మనకు చెప్పుచున్నది "ఒకడు నీటి మూలముగాను మరియు ఆత్మ మూలముగాను తిరిగి జన్మించితేనేగాని వాడు దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు". ఇందువలననే నీవు నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచుటచేత, మరియు దేవునినీతియందు నీ పాప సమస్యలన్నిటిని పరిష్కరించుకొనవలెను. నీరు మరియు ఆత్మ సువార్త దేవునినీతియైనది మరియు అది నీకు పాపముల క్షమాపణను మరియు ఆయననీతిని ఇవ్వగలదు. 
దేవునినీతిలో నిన్ను నీతిమంతునిగా తీర్చు ఇటువంటి విశ్వాసమును నీవు కలిగియుండవలెనని కోరినట్లయితే, నీవు తప్పక ఈ నీతిని కలిగియున్న నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచి వెంబడించవలెను. నీ హృదయము దేవునినీతియందున్న విశ్వాసముచేత నింపబడుటకు, నీవు నీ స్వనీతిని ప్రక్కకు తోసివేయవలసిన అవసరముంది. అన్యులకును ఇశ్రాయేలీయులకు ఇద్దరికినీ పౌలు చెప్పుచున్నదేమనగా, వారు దేవునినీతి పొందవలెనని కోరినట్లయితే, తప్పక వారి స్వనీతిని వెంటాడుటను వదిలివేయవలెను.
దేవుడు అబ్రాహాముకు అతని కుమారుని దేవునినీతియందున్న విశ్వాసమునకు ఒక ఫలముగా ఇచ్చెను. దేవునినీతి నీరు మరియు ఆత్మ వాక్యమునందు కనబడును. ఈ నీతివాక్యమునందు విశ్వాసముంచువాడు ఎవడైనను ఒక నీతిగల వ్యక్తిగా ,మారును. రిబ్కా ఇస్సాకు భార్య, అతని వలన కవలలను గర్భము ధరించినది, వారు పుట్టక మునుపే, వారు మంచియైనను చెడు అయినను చేయకమునుపే, ఆమెకు "పెద్దవాడు చిన్నవానికి దాసుడగును" అని చెప్పబడెను. ఈ వాక్య భాగమునుండి కొందరు, దేవుడు న్యాయమైన దేవుడు కాదని ముగించుదురు, అయితే ఇది ఒక పొరపాటు ముగింపు.
ఇది ఎందుకనగా వారు రిబ్కా గర్భములో వున్నప్పుడే దేవుడు, ఏశావు యాకోబుల భవిష్యత్తు విశ్వాసములు, ఎరిగియుండెను. దేవునినీతియొక్క రహస్యము ఈ నీరు మరియు ఆత్మ సువార్తయందు దాగియున్నది. ఎందుకనగా ఏశావు అతని మంచికార్యములను బట్టి అతిశయించువాడు, దేవుడతనిని అతనినీతియందున్న విశ్వాసము ఏమీ లేకుండుట 
చూచెను, ఇందువలననే దేవుడతనిని ద్వేషించెను. మరియొకవైపున, యాకోబు, దేవునినీతియందు విశ్వాసముంచువాడు మరియు మహిమనంతటిని ఆయనకే ఇచ్చెను;ఆ విధముగా దేవుడతనిని ప్రేమించుటతప్ప మరి ఏమీచేయలేక పోయెను.
కావున, దేవుడు యాకోబును ప్రేమించును ఏశావును ద్వేషించెను అనునది, సత్యమును ఆధారము చేసుకోని సత్యమైయున్నది. దేవుడు, దేవునినీతియందు విశ్వాసముంచక అతని స్వనీతిని బట్టి అతిశయించు, ఏశావువంటి ప్రజలను, దేవుడు అభినందించడు, అయితే అతని దోషములన్నియు ఎరిగి కేవలము ఆయననీతియందు విశ్వాసముంచు, యాకోబువంటి ప్రజలను బట్టి సంతోషించును మరియు వారిని ప్రేమించును. 
ప్రజలు తరచుగా, దేవుడు ఇస్సాకు విషయములో ఆ విధముగా ఎలా చేయగలిగాడు అని అడుగుటచేత ప్రజలు తరచుగా దేవుని నీతిని అపార్థము చేసుకుంటారు. వారు దేవుడు కొంతమందిని ద్వేషించుచు కొంతమందిని ప్రేమించాడు, ఇక్కడ ఏదో దేవునిలో తేడా వుండాలి అని తలంచుదురు, వారు చివరికి అన్యాయస్థుడైన దేవుడు అని ఆయనను గురించి తలంచుచు వారు యేసునందు విశ్వాసముంచుటకు కూడా తిరస్కరిస్తారు. 
అయితే దేవుడు అన్యాయస్థుడు ఎలా కాగలడు? ఒకవేళ ఒకడు దేవుడు అన్యాయస్థుడనితలంచినట్లయితే, అతడు/ఆమె దేవునినీతిని సరిగా అర్ధము చేసుకొనలేదు అను దానికి ఒక ప్రతిబింబము మాత్రమే కాగలదు. దీనియంతటికన్నా, దేవునినీతియందు విశ్వాసముంచక, వారి మానవ నీతితో ఆయననీతిని కప్పుకొనుట అది దేవుని యెదుట ఇంకా భయంకరమైన తప్పిదము. ప్రతి ఒక్కరు దేవునినీతియెదుట వారి స్వనీతిని తీసివేయవలెను మరియు నీరు మరియు ఆత్మ సువార్త వాక్యమునందు విశ్వాసముంచవలెను.
దేవునినీతిని కలిగియున్న విమోచనా వాక్యమునందు విశ్వాసముంచుటకు ఇది ఒక్కటే మార్గము. దేవుడు అన్యాయస్థుడనేది ఆయన ప్రణాళిక మరియు ముందు ఏర్పాటులో నియమించిన, సమృద్ధియైన దేవుని సంకల్పమును ఎరుగని, నీ అజ్ఞానమునుండి ఉద్భవించిన, నీ సొంత ఆలోచనలతో ఒక ముక్క దేవుని నీతియుక్తమైన ప్రణాళిక అనునది మన యెదుట ఆయననీతిని ప్రత్యక్షపరచుట. దేవునికి ఈ కవలల భవిష్యత్తు ముందుగానే ఎరిగియున్నందున, దాని ప్రకారము ఆయననీతియందు విశ్వాసముంచు ఒకనిని ప్రేమించుటకు ఏర్పరచెను . 
మనము తప్పక ఆయన ప్రణాళికయందున్న దేవునినీతిని అర్ధము చేసుకొని విశ్వాసముంచవలెను. యాకోబు ఏశావు మధ్య దేవుడు ఎవనిని పిలిచెను? మన ప్రభువు చెప్పెను అదేమనగా ఆయన "నీతిమంతులను పిలుచుటకు రాలేదుగాని, పాపులను పిలుచుటకు వచ్చెను". దేవునినీతి, మరియొక మాటలో,యాకోబువంటి ప్రజలను పిలుచును. ఏశావు విషయములో,అతడు దేవుని న్యాయమైన పిలుపుకు స్పందించలేదు, అయితే అతడు అతని స్వనీతి విషయములో అతిశయించెను కూడా. ఇందువలననే దేవునినీతి పిలుపుకు జవాబిచ్చిన, యాకోబు ప్రేమించబడుచుండగా, ఏశావు ద్వేషించబడెను.
దేవునినీతి ప్రేమను ఎరిగి దానియందు విశ్వాసముంచిన విశ్వాసములోపల ఈ బైబిల్ సంబంధమైన సత్యములను తెలుసుకొనవలెను. ఒకడు దేవునినీతియుక్తమైన ప్రేమను గురించి సరియైన జ్ఞానము లేకుండా,దేవుని ఏర్పాటుకు చెందిన సమస్యను పరిష్కరించుటకు ప్రయత్నము చేసినట్లయితే, అతడు/ఆమె వారి స్వనాశమునకు నడిపించబడడు, అతడు/ఆమె ఏర్పరచుకొనిన ఉచ్చులో పడిపోవును. 
దేవుడు ఆయననీతియుక్తమైన ప్రేమను ప్రత్యేక్షపరచుటకు ముందు ఏర్పాటును నియమించెను. యాకోబు అతని తప్పిదములను గుర్తించి దేవునినీతి వాక్యమునందు విశ్వాసముంచిన మనిషి. దేవుడు యాకోబును ప్రేమించెను ఏశావును ద్వేషించెను అనునది న్యాయమైనది. దేవుని న్యాయమైన దృష్టిలో, ప్రతి ఒక్కరు ఆయన ఉగ్రతకు తగినవారు, అయితే ఆయననీతియందు విశ్వాసముంచువారందరికి ఆయన విమోచనమును మనకనుగ్రహించెను. దేవునియెదుట ఆయన కరుణావస్త్రమును ధరించుకొనినవారు ఎవరనగా వారి స్వనీతియందు అతిశయించక, వారి విమోచనముగా దేవునినీతియందు విశ్వాసముంచినవారు. "నేను నా పాపములను బట్టి నేను నరకమునకు పంపుటకు నేను తగియున్నాను. ప్రభువైన దేవా, నా యందు కరుణనుజూపుము, నీ నీతిని నాకు బోధించుము" అని ఒప్పుకొను ప్రజలు వీరు.
ఆయననీతియుక్తమైన ప్రేమయందు విశ్వాసముంచు వారికి మాత్రమే దేవుడు పాపములక్షమాపణను ఇచ్చును, మరియు ఇది ఆయన మనకు ఇప్పటికే ప్రత్యక్షపరచిన, ఆయన కుమారులుగా మారుటకు మనకొరకైన దేవుని ప్రణాళిక. యాకోబును ప్రేమించి ఏశావును ద్వేషించుట అను దేవుని ప్రణాళిక నీవు అపార్థము చేసుకొనకూడదు, ఏదోవిధముగా నీవు దేవునినీతిని సరిగా అర్ధము చేసుకొననట్లయితే, ఆయననీతియందున్న దేవునినీతియుక్తమైన ప్రేమయందు విశ్వాసముంచుటకు ఇదే నీకు సమయము. 
నేను దేవునినీతియందు విశ్వాసముంచుచున్నాను. దేవునినీతియుక్తమైన ప్రేమను సరిగా అర్ధము చేసుకొనినవారు, ఆయననీతియందున్న దేవునినీతియుక్తమైన దైవ సంకల్పమును కూడా సరిగానే అర్ధము చేసుకొందురు. అయితే ఈ లోకములో కొద్దిమంది మాత్రమే దేవునినీతియుక్తమైనప్రణాళికపట్ల గ్రహింపును కలిగియున్నారు మరియు దీనియందు విశ్వాసముంచుచున్నారు, మరియు చాలామంది దేవునిని అపార్థము చేసుకొనుటచేత తెగులు కలిగియున్నారు. 
ఈ ప్రజలు, దేవుడు ఏశావును ద్వేషించెనని చెప్పుచున్నందున, కొంతమంది ప్రజలు, ఆయనచేత ద్వేషించబడుట వారి విధివ్రాత అయినట్లుగా, దేవునిచేత ద్వేషించబడుటకు ఒక పరిధిలో నియమించబడియున్నారు, అని తలంచుదురు. అయితే మన దేవుడు అటువంటి నియంత కాడు. దేవుడు ఆయననీతియందు న్యాయమైన సరియైన ఒక తీర్పరి. దేవుడు మనలో ప్రతి ఒక్కరికి ఆయన నీతియుక్తమైన కరుణను ప్రేమను ఇవ్వవలెనని కోరుచున్నాడు. 
యేసుక్రీస్తుద్వారా దేవుడు మనకు ఆయననీతిని ఇవ్వవలెనని కోరియున్నాడు, మరియు ఆయననీతియందు మరియు ఆయన కరుణయందు విశ్వాసముంచిన వారి ఆయన వస్త్రము ధరింపజేసెను మరియు వారిని ఆయన కుమారులుగా జేసెను.
ఈ సత్యము క్రొత్త నిబంధనలతో మత్తయి సువార్త 9:12-13లో ఎక్కడ యేసు "ఆయన ఆ మాటవిని - రోగులకేగాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు గదా అయితే నేను పాపులనుపిలువవచ్చితినిగాని నీతిమంతులను పిలువరాలేదు. గనుక - కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావమేమిటో నేర్చుకొనుడి" అని చెప్పినచోట, ప్రత్యక్షపరచబడెను. చివరికి వైద్యుడక్కరలేని వారు కూడా తాము బాధపడుచున్నవారుగా తలంచుదురు. ప్రజలు ఆరోగ్యవంతులుగా వున్నప్పుడు వైద్యుని ప్రాముఖ్యతను గ్రహించనివారుగా ఎలా వుంటారో, దేవునినీతినిదానియందు విశ్వాసముంచుటచేత వారి హృదయములలోనికి స్వీకరించుటలోని ప్రాముఖ్యతను గ్రహించరు. దేవునినీతిని ఎరుగక పోవుటచేతకాదు, వారు వారి స్వనీతిని వెంటాడుటలో నిమగ్నమైయున్నారు. 
అయితే పాపులు వారి స్వనీతిని తప్పక వదలివేసి దేవునినీతియందు విశ్వాసముంచవలెను. నీవు దేవునియెదుట యాకోబువు లేదా ఏశావువు కాగలవు. ఎవరివలె వుండవలెనని కోరుచున్నావు? దేవుని బహుమానము మరియు శిక్ష దేవునినీతియెక్క విమోచనమునందు నీవు విశ్వాసముంచుచున్నావా లేదా అను దానిమీద ఆధారపడియుండును.
 

దేవుని విషయములో తప్పేమీ లేదు

ప్రతి మనుష్యుడు స్వభావసిద్ధముగా పోటీ తత్వమును కలిగియున్నాడు. వారిలో కొంతమంది అత్యున్నతమైన తెలివితేటలు కలవారు మరియు విజయమును పొందువారు మరి కొంతమంది ఇతరుల కొరకు చాలా మంచి కార్యములను చేసివుండవచ్చు. అయితే దేవునినీతియందు గ్రహింపు మరియు విశ్వాసములేకుండా, వారు దేవుని సమ్మతిని పొందరు. ప్రతిఒక్కరు - నీవు, మరియు నేను, చివరికి ఇశ్రాయేలీయులు కూడా, దేవునియెదుట నరకమునకు పోగుచేయబడియున్నారు. దీనికి విరుద్ధముగా, మనము నీతిమంతులముగా తీర్చబడియున్నాము,మన స్వంత కృషిచేత కాదు, క్రియలను బట్టికాదు, లేదా బలమును బట్టికాదు, దేవునినీతియందున్న విశ్వాసముచేత మాత్రమే. 
దేవుడు నిష్పక్షపాతముగా మరియు న్యాయముగా ప్రతి ఒక్కరికి ఆయననీతియుక్తమైన ప్రేమను ఇచ్చినందున, దీనియందు విశ్వాసముంచువారందరు వారి పాపములనుండి విడిపించబడగలరు. దేవుడు నీవు ఆయనను గురించి ఆలోచించినట్లుగా అన్యాయస్థుడైన దేవుడు కాడు. 
ఒకడు దేవుని విమోచనా దీవెనను పొందునా లేదా అనునది అతడు/ఆమె దీనిని పొందుటకు నిర్ణయించుకొనునా లేక తృణీకరించుటకు నిర్ణయించుకొనునా అనుదాని మీద ఆధారపడియున్నది. ఇందువలననే, కొంతమంది ప్రజలు ఉగ్రతా పాత్రగా చేయబడుచుండగా, మరికొందరు కరుణా పాత్రముగా చేయబడుచున్నారు. యాకోబు దీనిని భిన్నముగా వుంచుటకు, ఒక కరుణా పాత్రయ్యెను, ఇదిలా వుండగా ఏశావు ఒక ఉగ్రతా పాత్రగా అంతమయ్యెను. 
అయితే కొంతమంది వేదాంతపండితులు మరియు పరిశుద్ధాత్మలేనివారు తరచుగా దేవునిని అపహాస్యము చేయుదురు. వారు "చూడు, దేవుడు ఫరోను ఉగ్రతా పాత్రనుగా చేయలేదా? యాకోబు ఏశావులను చూడుము! కుమ్మరి ఏమి చేసెనో చూడుము! దేవుడుఆదినుండే ఒకనిని గౌరవ పాత్రముగా చేయలేదా? ఇది కేవలము విధి మాత్రమే కాగలదు!" అనిచెప్పుదురు. వారి తర్కము ఈ విధముగా కొనసాగును: కొంతమంది ప్రజలు దేవుని కుమారులుగా మారుటకు ఇప్పటికే చివరికి వారి పుట్టుకకు మునుపే, ఎన్నుకొనబడ్డారు; దేవుని కుమారులుగా ముందుగా ఏర్పాటు చేయబడి ఎన్నిక చేయబడినవారు అటువంటి ప్రజలు, మిగిలిన వారు నరకమునకు నిర్ధేశించబడినవారు. ఈ విధముగా దేవుని ఎన్నిక దాడికిగురౌతుంది. అయితే దేవుడు ప్రతివానికి ఆయననీతిని ఇచ్చెను, దానియందు విశ్వాసముంచువారిని ఆయన నిష్పక్షపాతముగా ఎన్నుకొనును.
వాస్తవమునకు, దీనికిముందు, మనము ఆయన ప్రజలము కాకమునుపు, దేవునినీతియందు విశ్వాసముంచుటచేత మనము నీతిమంతులముగా తీర్చబడియున్నాము. ఆయన వాక్యముద్వారా నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచుటచేత మనము నీతిమంతులముగా తీర్చబడినందున,మన విశ్వాసములను దేవుడు సమ్మతించగలడు. దేవుని అద్భుతమైన శక్తిని చూపించుసువార్తయొక్క సత్యము ఇది.
సహజసిద్ధముగా, మనయందు దేవుడు లేడు, ఆయనను ఎరుగము,మరియు పాపులము, అయితే దేవునినీతియందు విశ్వాసముంచుటచేత మనము ఆయన కుమారులముగా చేయబడియున్నాము. మనము విశ్వాసముంచు, నీరు మరియు ఆత్మ సువార్త, అనునది ఒక అసంపూర్ణమైనది కాదు, అయితే సంపూర్ణమైన, పరిపూర్ణమైనది. దేనిద్వారా మనము ఆయననీతిని పొందగలమో ఆ సత్యమును మనకిచ్చినందుకే తప్పక దేవునిని స్తుతించవలెను. 
మన జీవితములన్నియు పూర్తిగా కష్టములతో నిండియుండవచ్చు, అయితే మనము దేవునినీతిని మరువరాదు ఎందుకనగా దేవుడు ఆయన శక్తియొక్క గొప్పదనమును మనకు బోధించెను. ఈ విశ్వమంతటిలో సంతోషకరమైన వ్యక్తి అనువాడు దేవునినీతిని ఎరిగినవాడు. దేవునియందు విశ్వాసముంచు మనకు, త్రియేక దేవుడు కరుణకే తండ్రి. ఆయన మన పరిశుద్ధ దేవుడు. ఆయన దేవునినీతియందు విశ్వాసము గలవారి ఆత్మలలో దేవునినీతియందు విశ్వాసమును వుంచును. ఆయననీతిని ఎరిగి దానియందు విశ్వాసముంచుటచేత మనము దేవుని కుమారులుగా మారి ఆయన కృపను స్వీకరించువారిగా చేయబడియున్నాము.
అయినప్పటికీ చాలామంది ప్రజలు ఇప్పటికీ మంచి కార్యములు చేయుటకు వారి కృషిచేత ముందుగానే నింపబడియున్నారు. కానుకలు ఇచ్చుట, చర్చి కొరకు స్వచ్చందముగా పనిచేయుట, ఇతరులతో పోటీపడుచు పెద్ద చందాలను ఇచ్చుట,- నీవు కూడా వీటిని మంచి కార్యములని తలంచవచ్చు, అయితే ఇవి మాత్రమే నిన్ను రక్షించవు, రక్షించలేవు. కేవలము క్రియలమీదే నీగురిని నిలుపుట అనునది దేవునినీతియందున్న నీ విశ్వాసమును సూచించదు,అయితే ఇది నీ స్వనీతిని నీవు వెంటాడుచున్నావనుటకు ఒక సూచన. వారి స్వంత శరీరము యొక్క కృషిచేత ముందుగానే నింపబడినవారు దేవునికి విరోధముగా పోవుచున్నారు. దేవునినీతిని ఎరుగని వారు అటువంటి శరీర విషయములతో ముందుగానే నింపబడియున్నారు.
లేఖనము మనకు చెప్పుచున్నది అదేమనగా దేవుని రక్షణ దీనికొరకు వెంటాడువారి కొరకు ఇవ్వబడలేదు, అయితే ఆయననీతియందు విశ్వాసముంచువారికి మాత్రమే ఇవ్వబడినది. ఈ నీతి మన కరుణాత్ముడైన దేవునియందు విశ్వాసముంచుటచేత మాత్రమే పొందుకొనగలము. మన క్రియలవలన మనము దేవునిచేత ప్రేమించబడలేదు, అయితే కేవలము ఆయననీతియందు విశ్వాసముంచుటచేత మాత్రమే ఆయన కరుణ ప్రేమను పొందియున్నాము. ఇందువలననే నిజమైనవిశ్వాసము మనము దేవునినీతిని తెలుసుకొని దానియందు విశ్వాసముంచుచున్నామా లేదా అనుదానిపై ఆధారపడియున్నది. 
మనము ఆదినుండే పనికిమాలిన వారముగా లేమా? మనము ఆ విధముగా కానప్పటికీ, దేవునినీతియందున్న మన విశ్వాసమును బట్టి, మనమెంతో గొప్పవారముగా మారలేదా? దేవునినీతియందు విశ్వాసముంచుటచేత మరియు ఇప్పుడు మనము దేవుని కుమారులుగా చేయబడియున్నాము. అను వాస్తవమును బట్టి అతిశయించుచు మనము అంతము వరకు మన విశ్వాసములను కాపాడుకొనగలము. 
చెడును చేయుచూ, దేవుడు లేడని చెప్పుకొనువారు చాలామంది వున్నారు, అయితే మనము ఆయననీతియందు విశ్వాసముంచియున్ననందున దేవుడు మనపై కరుణను కలిగియున్నాడు. మనము దేవుని యెదుట నిజముగా గొప్పవారము మరియు దేవునియందు మన అతిశయము బహుగా తగినటువంటిది. ఈ భూమిమీద వుండగా మనము శోధనలను పరీక్షలను ఎదుర్కొనవచ్చు,అయితే మనమందరము ఆత్మీయముగా సంపన్నులము మరియు సంతోషముగలవారము . మనమందరము తప్పక దేవునినీతిని వెంబడించవలెను మరియు యేసును గొప్ప చేయవలెను. 
దేవుడు పాపులందరిని ఆయన కుమారులుగా, పాపములేనివారిగా, నీతిమంతులుగా, మరియు ఆయన యెదుట పరిపూర్ణులుగా చేసెను. ఎవనిమీద దేవునినీతి దిగివచ్చునో మనము తప్పక తెలుసుకొనవలెను. దేవునినీతి మన తప్పిదములన్నిటికీ జమ చేయబడెను మరియు లోపముతో కూడిన పాపములను శుద్ధిచేసెను . నీవు ఈ సత్యమునందు విశ్వాసముంచుట లేక విశ్వాసముంచకపోవుట అనునదియంతా నీ మీదే ఆధారపడియుంది. నీవు కూడా, దేవునినీతిచేత పూర్తిగా నీ పాపములనుండి రక్షించబడియున్నావు, అప్పుడు, నీవు ఏమి చేస్తావు?విశ్వాసముంచుటకు నీ నిర్ణయమును రేపుకు వాయిదా వేసెదవా? దేవునినీతి నీతో వుండును గాక.