వారి స్వనీతిని వెంటాడుచు, నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచు ప్రజలుగా వున్నారా? లేఖనము చెప్పుచున్నది అటువంటి ప్రజలు దేవునినీతియందు విశ్వాసముంచకపోవుటచేత మరియు దీనికి బదులుగా వారి స్వనీతిని వెంటాడువారు, దేవునికి విరోధముగా తిరిగినవారని చెప్పుచున్నది. ఈ ప్రజలు ఏమి చేస్తారు?
దేవుడు మానవజాతికి, దేవునినీతియైన, ఆయన రక్షణను ఇచ్చుటకు, ఇశ్రాయేలీయుల ద్వారా యేసుక్రీస్తును పంపెనా? అవును ఆయన పంపెను! యేసు ఎంతో మక్కువతో ప్రతిపాపిని అతని/ఆమె పాపములనుండి రక్షించవలెనని కోరి ఆయన భూమిమీదకి వచ్చెను, సిలువపైన సిలువ వేయబడెను, మరియు మృతులలో నుండి పునరుత్థానుడయ్యెను మరియొక మాటలో ఆయనయందు విశ్వాసముంచు వారందరిని రక్షించుటకు ఆయన వచ్చెను.
తండ్రియైన దేవుడు ఇశ్రాయేలీయులను వారి పాపములనుండి వారిని రక్షించుటకు యేసుక్రీస్తును వారియొద్దకు పంపెను. అయినను ఇశ్రాయేలీయులు దేవుని నీతియైన, యేసును స్వీకరించలేదు. దీనికి బదులుగా, వారు వారి స్వనీతిని వెంటాడుటచేత ముందుగానే నింపబడియున్నారు. ఇప్పటికి కూడా, ఆయనను వారి ప్రజల మెస్సీయగా మరియు వారి ఆత్మలకు రక్షకునిగా అంగీకరించుట లేదు.
దేవునిచేత పంపబడినవారు వున్నారని పౌలు చెప్పుచున్నాడు మరియు వారి ద్వారా ఈ రమ్యమైన సువార్త వినిపించబడగలదు. దేవుని సేవకులచేత వినిన ఈ సువార్త ఆయనచేత పంపబడినదను దేవునినీతిని కలిగియున్న సువార్త. నీవు ఈ అవకాశమును తప్పించుకొనలేవు. ఆయన నీతిని ఎరిగి దీనియందు విశ్వాసముంచు దేవుని సేవకులచేత వినిపించబడుచున్న, నీరు మరియు ఆత్మ సువార్త వినుటచేత మాత్రమే, దేవుడు నీకు పాపముల పరిహారమును ఇచ్చెను మరియు ఆయన నీతి నిచ్చెను అనుదానిని నీవు విశ్వసించగలవు.
నీరు మరియు ఆత్మ సువార్త అనునది ఉత్తమమైనది మరియు లోకమునందు అతి రమ్యమైనది. పాపులను వారి పాపము నుండి రక్షించిన మంచి రమ్యమైన వార్త ఇది. ఈ రమ్యమైన సువార్త ప్రజల ఆత్మలను తృప్తిపరచును ఎందుకనగా దేవునిచేత ఇవ్వబడిన ఈ నీరు మరియు ఆత్మ సువార్త ఆత్మలకు నిజమైన ఆహారము.
దేవునిచేత అనుగ్రహించబడిన ఈ విమోచనా సువార్తయందు ప్రతివాని పాపములను క్షమించు శక్తియున్నది. మన పాపముల ప్రాయశ్చిత్తము చేత మన మనస్సుయందు సమాధానమునిచ్చుటకు ఈ నీరు మరియు ఆత్మ సువార్త దీవించు శక్తిని కలిగియున్నది.
దేవుని ధర్మశాస్త్రమును కేంద్రము చేసుకొని, ఇశ్రాయేలీయులు వారి స్వనీతిని వెంటాడుటయందు నిమగ్నులైయ్యారు. ధర్మశాస్త్రమును స్వీకరించలేదు. వారి విధేయతతో వారు స్వనీతి సమృద్ధియైనదని వారు తలంచారు. వారు యేసును వారి రక్షకునిగా స్వీకరించలేదు. వారు దేవుని నీతిని భరించలేనంతగా, ధర్మశాస్త్ర క్రియలను వెంటాడుటలో చాలా ఆసక్తిని కలిగియున్నారు. ఇప్పటికి కూడా వారి స్వనీతిని వెంటాడుటకు ప్రయత్నము చేయుచు, ప్రభువును వారి రక్షకునిగా స్వీకరించుటలో విఫలమయ్యారు.
లేఖనము ఇశ్రాయేలీయులు వారి స్వనీతిని స్థాపించుటకు దేవునినీతికి విరోధముగా తిరిగితిరని చెప్పుచున్నదా? ముందుగానే ధర్మశాస్త్రము చేత నింపబడిన ఇశ్రాయేలీయులను గురించి మాట్లాడుచు, ‘‘విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తియైయున్నాడు.’’ (రోమా10:4) అని చెప్పుటచేత వారి విశ్వాసమును గద్దించుచున్నాడు.
ఒకని స్వనీతిని వెంటాడు ఒక చట్టబద్ధమైన విశ్వాసము అనునది దేవునియెదుట సరియైన విశ్వాసము కాదు. అప్పటికే ఇశ్రాయేలీయులు పాత నిబంధన యొక్క ధర్మశాస్త్రముచేత మాత్రమే నింపబడియుండగా, వారు దేవునినీతిగా మారిన యేసును, గుర్తించుటలో విఫలమై, దీనికి బదులుగా ఆయనకు విరోధముగా తిరిగిరి. ఎవనికి దేవుని ధర్మశాస్త్రము ఇవ్వబడినదో, మరియు ఎవరు వెంబడించుటకు ఇది ఇవ్వబడినదో, ఆ విధముగా ఎన్నుకొనబడిన ప్రజలమని అతిశయించు ఆసక్తిలో, దేవుని నీతికి విరోధముగా తిరిగిన ఇశ్రాయేలీయులు ఒక జాతిగానే ఆగిపోయారు.
నీవు నీ స్వనీతి స్థాపనతో ముందుగానే నింపబడియున్నావా?
ధర్మశాస్త్రము పట్ల ఇశ్రాయేలీయులకు కలిగిన ఆసక్తితో కలిగిన సమస్య ఏమిటింటే వారి స్వనీతిని స్థాపించుటలో వారికున్న వ్యామోహము. వారి స్వనీతిని బట్టి, మన ప్రభువు చేత స్థాపించబడిన దేవునినీతి పూర్తిగా నిర్లక్ష్యము చేయబడినది.
ఇశ్రాయేలీయుల ధర్మశాస్త్ర సంబంధమైన విశ్వాస ఫలితమేమంటే వారు దేవుని నీతికి విరోధముగా తిరుగుట చేత ముగించారు. ఆ విధముగా, వారు ఇప్పటికి ఈ ఫలితము తిరుగులేని విధముగా నష్టము కలిగించుచున్నదో గ్రహించలేదు. ధర్మశాస్త్ర క్రియలను వెంటాడుట అనునది వారికి ఏ మంచి లేక ఉపకారమును వారికి తెచ్చింది? దేవుని వాక్యమును వెంబడించుటలోని వారి ఆతురత దేవుని నీతిని తెలుసుకొనుటలో మరియు విశ్వసించుటలో ఒక అవరోధముగా మాత్రమే ముగిసినది. మరియొకసారి, ధర్మశాస్త్రమును సరిగా అర్ధము చేసుకొనని వారి ‘‘ఆసక్తి’’ చివరికి వారిని దేవునినీతికి విరోధులుగా మాత్రమే నడిపించునని మనము తప్పక గ్రహించవలెను.
లేఖనము మనకు స్పష్టముగా చెప్పుచున్నది, విశ్వసించు ప్రతివానికి నీతియగుటకు యేసు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయ్యెను. ఆయన బాప్తిస్మము మరియు సిలువపైన చిందించిన రక్తముతో లోక పాపములన్నిటిని తనపైకి తీసుకొనుటచేత మన ప్రభువు దేవునినీతియంతటిని నెరవేర్చెను. ఇదంతయు ఇశ్రాయేలీయుల మరియు అన్యుల ఇద్దరి పాపమును శుద్ధిచేయుటకు. అటువంటి దేవునినీతి కలిగియున్న నీరు మరియు ఆత్మ సువార్త. ధర్మశాస్త్రము కాదు. పాపులందరికి ఎడారిలో ఒక ఒయాసిస్సు అయ్యెను. మన పాపములను తీసివేసి మరియు నిజమైన శుద్ధతను అనుగ్రహించిన నీరు మరియు ఆత్మ సువార్త ఇది. ఈ లోకమునున్న ప్రజలు నీరు మరియు ఆత్మ సువార్తచేత గాక మరి దేనితో వారి హృదయములో నిజమైన శుద్దతను కనుగొనగలరు?
ఇక్కడ రోమా పత్రికలో, దేవుని నీతియందు విశ్వాసముంచక ఒకని స్వనీతిని స్థాపించుట అనునది ఒక భయంకరమైన పాపమని పౌలు చెప్పుచున్నాడు. అన్యులమైన మనకు, ఎటువంటి సువార్త ఒక అందమైన సువార్తగా వుంది? ఆయన బాప్తిస్మముతో లోక పాపములన్నీ మన ప్రభువైన యేసు తీసుకొనెను అని మనకు చెప్పిన సువార్త ఇది.
ఈ సువార్త మత్తయి 3:13-17లో గ్రంధస్థము చేయబడి, యేసు లోక పాపములను తీసుకొనిపోయెనని సాక్ష్యమిచ్చు సువార్త ఇది. ‘‘ఆ సమయమున యెహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యొర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందకు యోహాను ` నేను నీ చేత బాప్తిస్మము పొందవలసినవాడనై యుండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా? అని ఆయనను నివారింపజూచెను గాని యేసు` ఇప్పటికి కానిమ్ము; నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నది అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడాలాగు కానిచ్చెను. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తనమీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఆయనయందు నేనాందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను’’ ఈ విధముగా యెహానుచేత ఆయన బాప్తిస్మముతో యేసు లోకపాపములన్నిటిని ఆయనపైకి వేసుకొనెను. దేవుని నీతియందు విశ్వాసముంచనివారిని ‘‘ఎవడు పరలోకమునకు ఎక్కిపోవును’’? (అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు) అని అడుగుట చేత ధర్మశాస్త్ర సంబంధులను గద్దించుచున్నాడు. ఈ ప్రశ్న భిన్నముగా ‘‘అతని/ఆమె పాపము నుండి కేవలము ధర్మశాస్త్రమునందు విశ్వాసముంచుట చేత ఎవడు రక్షించబడగలడు?’’ అని అడుగుతుంది. పౌలు ప్రశ్న ఉద్దేశ్యమేమనగా ధర్మశాస్త్రమును వెంబడించుట ఎన్నడును పాపము నుండి రక్షణను తీసుకొని రాలేదను విషయమును నొక్కిచెప్పుట. మరియొక మాటలో, మనకు మనమే పాపమును త్రోలివేయుటకు మనము చేయగలిగినది ఏమీ లేదని, అతడు మనకు చెప్పుచున్నాడు.
పౌలు తరుచుగా ఆయన పత్రికలో దేవుని నీతిని గురించి మాట్లాడుచున్నాడు నిజమైన విశ్వాసమునకు పౌలు జవాబు రోమా 10:10లో కనుగొనబడుతుంది. ‘‘ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. పౌలు చేత బోధించబడిన సువార్త అనునది దేని చేత ఈ దేవునినీతి ప్రత్యక్షపరచబడినదో, ఆ మన ప్రభువు బాప్తిస్మమునందు మరియు సిలువపైన ఆయన రక్తమునందు మనము విశ్వాసముంచుటచేత మనము దేవునినీతిని పొందగలమని మనకు చెప్పుచున్నది. ప్రభువు మనకు నీరు మరియు ఆత్మ సువార్తను ఇచ్చెనని విశ్వసించవలెను మరియు ఈ సువార్తయందు విశ్వాసముంచువారికి ఇది ఒక నిజమైన మనశ్శాంతిని అనుమతించెను.
నిజమైన విశ్వాసము దేవుని వాక్యమును వినుట వలన వచ్చును
నిజమైన విశ్వాసమును గురించి పౌలు ఏమి చెప్పుచున్నాడు? రోమా 10:17 చెప్పుచున్నది. ‘‘కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును.’’ నిజమైన విశ్వాసము, మరియొక మాటలో ఆయన వాక్యముతో బోధించుచు, ఆయన ఎవరి ద్వారా మాట్లాడునో, ఆయన సేవకుల ద్వారా సువార్తను వినుట వలన వచ్చును.
నిజమైన మన విశ్వాసమును గురించిన ఒప్పుకోలు దేవుని వాక్యమును వినుట వలన వచ్చును, మనము తప్పక ఆయన వాక్యమును విని దానియందు విశ్వాసముంచవలెను. దేవుని వాక్యమును వినుటచేత మాత్రమే మనము నిజమైన విశ్వాసమును కలిగియుందము మరియు కేవలము దీనిచేత మాత్రమే మన విశ్వాసము పెరుగును. ఇందువలననే దేవుడు మనయొద్దకు ఆయన నీతిని బోధించు, ఆయన సేవకులను పంపెను.
దేవునిచేత మానవజాతికివ్వబడిన నీరు మరియు ఆత్మ సువార్తను వినినప్పుడు, మనము మన పాపములకు ప్రాయశ్చిత్తమును పొందగలము. మరియు మన హృదయములయందు విశ్రాంతిని కలిగియుందుము. పాపము నుండి విడుదల కేవలము దేని ద్వారా మనము మనశ్శాంతిని కలిగియుందుమో, ఆ దేవునినీతియందు విశ్వాసముంచుటచేత మాత్రమే కలుగును.
మన ప్రభువునీతి మన కన్నీటిని తుడిచి మన వేదనలు మరియు బాధ నుండి మనలను విడిపించునని మనకు చెప్పబడలేదా? అవును మనకు చెప్పబడినది. దేవునిచేత ఇవ్వబడిన నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచుట చేత, మన వేదనలన్నియు తీసుకొని పోబడును. నీరు మరియు ఆత్మ సువార్త లోకమునందు అతి రమ్యమైన వార్త మరియు దేవుని నీతి నెరవేర్చు.
దేవుడు ఆయన నీతిని నెరవేర్చిన, మన ప్రభువును ఇశ్రాయేలీయుల యొద్దకు పంపెను అయితే వారి స్వనీతిని వెంటాడుటలో, వారు ఆయన వైపుకు తిరుగుటకు నిరాకరించిరి. అప్పుడు, దేవుడు చేసినది ఏమిటి? ఇశ్రాయేలీయులకు మత్సరము కలుగునట్లుగా ఆయన నీతి నెరవేర్పు అయిన, సువార్తను విశ్వసించుటకు అన్యులకిచ్చెను. అప్పుడు, దేవుడు అన్యుల నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచు అవకాశమును అనుమతించెనా? నిజముగా, వారు ఆయనను వెదకనప్పటికీ, ఆయనను పిలువనప్పటికీ, ఆయనను ఆరాధించనప్పటికి, వారు ఇశ్రాయేలీయుల కన్నా ఎంతో తక్కువైనప్పటికీ ఆయన వారికి నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచు అవకాశమును ఇచ్చెను.
ఇందువలననే అన్యులు ఆయననీతి నెరవేర్పయిన రమ్యమైన సువార్తయందు విశ్వాసముంచుటచేత దేవుని పిల్లలుగా మారగలిగారు. ఇందువలన కూడా, దేవుని నీతి ఇశ్రాయేలీయులకు వెలుపల గౌరవమును పొందినది మరియు మహిమపరచబడినదని లేఖనము మనకు చెప్పుచున్నది.
దేవునినీతిని నెరవేర్చిన నీరు మరియు ఆత్మ సువార్తను మనకిచ్చుటచేత వాస్తవముగా ఎంతమంది ప్రజలు ప్రభువునకు వందనములు చెల్లించుచున్నారు? మన ప్రభువు లోక పాపములన్నియు రమ్యమైన నీరు మరియు ఆత్మ సువార్తతో తీసుకొని పోయెను. అయినప్పటికి, ఈ సత్యమునందు విశ్వాసముంచని అనేకులు వున్నారు. అప్పుడు, దేవుని యెదుట స్థిరపరచుటకు మన యందు ఏదైనా నీతిని కలిగియున్నామా? లేదు మనము కలిగిలేము! అప్పుడు, మనమెందుకు విశ్వసించకూడదు? దేవునినీతిని నెరవేర్చిన సువార్త ఏదో మనము ఎరుగనందునా? అయితే ఈ సువార్తను తెలుసుకొనుట సులభమైనది.
మనము కూడా ఇశ్రాయేలీయులు చేసినట్లుగా మన స్వనీతిని వెదకినటువంటి ప్రజలము, అయితే దేవుడు ఈ రమ్యమైన నీరు మరియు ఆత్మ సువార్తను మనకిచ్చుటచేత మన అన్ని పాపముల నుండి మనలను రక్షించెను. దేవునినీతి నెరవేర్పు అయిన నీరు మరియు ఆత్మ సువార్తను, విశ్వసించుటకు మనకిచ్చినందులకు మేము దేవునికి వందనములు చెల్లించుచున్నాము.
‘‘పరలోకమునకు ఎక్కిపోయినవాడు ఎవడు?’’ అని మనకు
6వ వచనము చెప్పుచున్నది, ‘‘అయితే విశ్వాసమూలమగు నీతి యీలాగు మాట్లాడుచున్నది. ఎవడు పరలోకమునకు ఎక్కిపోవును (క్రీస్తును క్రిందికి తెచ్చుటకు), అని నీ హృదయములో అనుకొనవద్దు.’’ విమోచనము మరియు మనము సేవించుచున్న సువార్త ఈ రెండూ నీరు మరియు ఆత్మ సువార్తయందు మనకున్న విశ్వాసముచేత సాధ్యపడినవి గాని మన క్రియల వలన కాదు. దేవునినీతిని నెరవేర్చిన సత్యమునందు మనము విశ్వాసముంచనట్లయితే మనము వారి స్వనీతిని వెంటాడుటలో కేవలము దేవునిని ఇబ్బందిపెట్టు, ధర్మశాస్త్ర సంబంధులవలె, పాపులమే అగుదుము కాని మరి ఏమి కాము.
దేవుని నీతియందు విశ్వాసముంచుటచేత మన రక్షణ వచ్చినట్లుగా, మనము ఆయన నీతియందు విశ్వాసముంచుటచేత కూడా మనము ప్రభువు కొరకు జీవించగలము. ఈ నీతియొక్క జ్ఞానము నీరు మరియు ఆత్మ సువార్తయందున్న మన విశ్వాసముచేత లేచిన విధముగా, దేవుని నీతియందున్న మన విశ్వాసమునుండి మన జీవితమును కొనసాగించు బలము వచ్చును.
విమోచింపబడవలసిన వారికి దేవుని నీతియందు విశ్వాసము కన్నా మరియొక సత్యము ఒక్కటీ లేదు. క్రైస్తవ సారము విశ్వాసమును కేంద్రముగా చేసుకొనినది మరియు దేవునినీతియే క్రైస్తవ విశ్వాసమునకు అంతా అని చెప్పుటలో ఎక్కువేమీ లేదు. నీతిమంతులుగా తీర్చబడినవారు ఈ నీతియందున్న వారి విశ్వాసముచేత జీవించగలరు. మరియు ఈ సువార్తను బోధించగలరు. దేవునినీతియందు విశ్వాసముంచుచు మీరు, అప్పుడు, కష్టమును కూడా ఎదుర్కొందురా? వారు కష్టమును ఎదుర్కొంటారు. అయితే దేవుని నీతియందున్న విశ్వాసముచేత, దేవుడు వారి సమస్యల విషయములో శ్రద్ధతీసుకొనును అని వారు విశ్వసించి నమ్మినట్లుగా, వారి కష్టములన్నిటిని జయించగలరు. అటువంటి విశ్వాసము దేవుని నీతియందున్న విశ్వాసము నుండి జనిస్తుంది.
దేవుని నీతిని కలుపని ఇతర విశ్వాసముల గురించి ఏమిటి? అవన్నీ మానవుని కార్యముల మీద ఆధారపడిన, తప్పు విశ్వాసములా? నిజముగా అవి తప్పు విశ్వాసము. దేవుని నీతియందు విశ్వాసముంచకుండా యేసుయందు విశ్వాసముంచు విశ్వాసము, నిజమైన విశ్వాసము కాదు.
మొదట దేవుని నీతియందు విశ్వాసముంచకుండా నీవు నేను మన పాపముల నుండి రక్షించబడగలమా? ఆయన నీతియందు విశ్వాసముంచకుండా దేవునియందు విశ్వాసముతో మనము జీవించగలమా? ఏదీ సాధ్యము కాదు. ప్రభువును సేవించుటకు నీతిమంతులకు బలము దేవునినీతియందున్న వారి విశ్వాసమును బట్టి వారికి బహుమానముగా ఇవ్వబడిన, పరిశుద్ధాత్మ యొక్కశక్తి నుండి వచ్చును. నీవు ఈ లోకములో నీ సొంత బలము లేక భూ సంబంధమైన బలముచేత నీవు జీవించగలవా? నీవు నిజముగా వీటితో మనశ్శాంతిని కనుగొనగలవా?
దేవుని నీతియందు విశ్వాసముంచుటచేత సమాధానముతో ఈ సువార్తను సేవించగలము. నీరు మరియు ఆత్మ సువార్తను సేవించువారు విశ్వాసమును, ధైర్యమును, బలమును సమాధానమును కలిగియుందురు. దేవునినీతి నెరవేర్పు అయిన నీరు మరియు ఆత్మ సువార్తను సేవించని నీతిమంతులు, సమాధానమును గాని ధైర్యముగాని కలిగియుందురు. నీతిమంతుల మనస్సుకు ధైర్యము అవసరమా? వారికి అవసరము నీరు మరియు ఆత్మ సువార్తను వ్యాప్తి చేయుటకే గాదు, జీవతకాలము పొడవునా వారికి సమాధానము అవసరము.
నీ మనస్సు సమాధానముగా వున్నదా? నీవు నీ కొరకే జీవించుచున్నట్లయితే నీ మనస్సులో సమాధానము పెరగవలసిన కారణము ఏమీ వుండదు. శరీరములో జీవించుచుండగా శరీర అవయవములు తీర్చుట మాత్రమే అవసరమైనప్పుడు, ఇంకా ఎక్కువ సమాధానము లేక విశ్వాసము ఎందుకు అవసరము? అయితే నీవు దేవుని సేవించుటకొరకు వున్నట్లయితే, నీ మనస్సులో వున్న సమాధానము కూడా పెరగవలసిన అవసరము వుంది. దేవుని నీతిని నెరవేర్చిన ఈ సువార్తను సేవించుటకు, నీ విశ్వాసము మరియు సమాధానము తప్పక పెరుగును.
దేవుని నీతియందు విశ్వాసముంచువారు వారి సమాధానమును ప్రపంచమంతా వ్యాప్తిచేయు బాధ్యతగవారై యుండాలి. ఇది కేవలము వ్యక్తిగత శ్రద్ధకు చెందిన విషయము కాదు. అయితే యేసుక్రీస్తు చేత ఇవ్వబడిన మనశ్శాంతిని ప్రతి ఒక్కరికి వ్యాప్తి చేయవలసిన అవసరతను బట్టి మన దేవుని నీతి సువార్తను ప్రపంచమంతటికి బోధించవలసిన అవసరము వుంది. మనవలెనే దేవుని సమాధానము ఇప్పటికి ఇతరులకు అవసరమైయున్నది. ఈ సమాధానమును ఇతరులకు వ్యాప్తిచేయు ప్రయత్నములో మనము దేవునిని ఎన్నోసార్లు అభ్యర్ధించవలసివుంది. దేవుని నీతిని వ్యాప్తి చేయుటకు మనము జీవించునప్పుడు, మనశ్శాంతి మాత్రమే పెరుగును. మనము స్పష్టమైన మరియు ప్రశస్తమైన మన జీవిత గమ్యమును కలిగి వుంటాము.
దేవునిచేత ఇవ్వబడిన నిజమైన శాంతిని నీవు తెలుసుకొనవలెనంటే, ఆయన నీతిని నెరవేర్చిన సువార్తను తెలుసుకొని ఈ సువార్తయందు నీవు విశ్వాసముంచాలి. దేవుడు నీ కొరకు సిద్దపరచడిన మనశ్శాంతిని నీ కొరకు అభ్యసించవలసిన అవసరము వుంది.
నీవు ఎప్పటినుండో ప్రభువును బాగుగా సేవించావు. అయితే ఆయన సన్నిధికి నీవు పిలువబడునంత వరకు, ఇతరులు నీ సమాధానము పంచుకొనునట్లుగా, నీవు ఆయనను బాగా సేవించుటలో కొనసాగవలసిన అవసరము వుంది. దేవుని నీతియందున్న విశ్వాసముతో నీవు సమాధానము కొరకు చేరినప్పుడు, విమోచనము కొరకు నీ అడుగుజాడలను వెంబడించుచున్న విశ్వాసులు కూడా ఇతరుల సమాధానము కొరకు జీవించుదురు.
విశ్వాసములో చిన్నవారైనవారు విశ్వాస రాజ్యములో క్రొత్తగా అడుగుపెట్టినవారు, మరియు దీనిని అర్ధము చేసుకొను సామర్థ్యములో పరిమితిని కలిగినవారు. అయితే ఎప్పుడు మనము మన విశ్వాసముతో జీవించెదమో, కొంత వ్యవధి తీసుకొన్నప్పటికి వారు మన వెనుక వుందురు. చివరికి మన విశ్వాసపు అడుగును వెంబడించుటచేత, సమాధానముతో వారు ఎటువంటి జీవితమును కలిగియున్నారో వారు అర్ధము చేసుకొనెదరు.
విశ్వాసముచేత జీవించుట ఎట్లో నిన్ను వెంబడించువారికి బోధించుటకు నీకు ఏదైనా కష్టముగా వుందా? అటువంటి ఒక బోధా జీవితము ఒక్క రాత్రిలో రాదు. సమాధానముతో జీవించుటకు అవసరమైన విశ్వాసములోనికి నీవు నడిపించగలుగుటకు చివరికి అది ఎంతో కాలము పట్టవచ్చు. అయితే సమయము వచ్చినప్పుడు, దేవుని నీతియందు విశ్వాసముంచుటచేత విమోచించబడినవారు చివరికి అంతకుముందు దేవుని సేవించుచున్న విశ్వాసులు మనశ్శాంతిని కనుగొనిన ప్రకారము, ముందున్న మననుండి నేర్చుకొనుట చేత, విశ్వాస ప్రజలుగా జీవించుటకు నేర్చుకొందురు.
నీవు మరియు నేను మనమందరము దేవునినీతియందున్న విశ్వాసముచేత జీవించవలెను, నీతిమంతులు తప్పక దేవుని వాక్యమునందున్న విశ్వాసముచేత జీవించవలెను. మన భవిష్యత్తు మరియు ప్రస్తుత జీవితము తప్పక విశ్వాసముచేత నిర్ధారింపబడవలెను. లేఖనము మనలను ‘‘బోధించువాడు లేకుండా వారు ఎలా వింటారు?’’ అని అడుగుచున్నది. మనము దేవునినీతియందు విశ్వాసముంచుచున్నందున, మనము తప్పక సువార్తను ప్రపంచమునకు బోధించాలి. విశ్వాసముచేత, సువార్తను వ్యాప్తిచేయుచుండగా మనము ఎదుర్కొను అన్ని సవాళ్ళను ఎదుర్కొనగలము.
విశ్వాసముచేత జీవించని నీతిమంతుల జీవితము అనునది మనశ్శాంతిని కోల్పోయిన వారి జీవితము. దేవుని నీతియందు విశ్వాసముంచుట ప్రజలను వారి మనశ్శాంతిని సంపాదించుకొనుటకు అనుమతించును. అన్నిటి కొరకు, నీవు దేవుని వాక్యమునందు మరియు దేవుని నీతియందు విశ్వాసముంచినప్పుడు మనకు సమాధానము ఇవ్వబడుతుంది.
దేవుని నీతియందు విశ్వాసముంచుటచేత, నీ విశ్వాసములోను సమాధానములోను తప్పక స్థిరముగా నిలబడవలెను. నీవు తప్పక దేవునిని స్తుతించవలెను. ఏలయనగా ప్రభువు ఆయన నీతి విడుదల మరియు సమాధానముచేత జీవించుటకు నిన్ను అనుమతించెను. ఎవరి నుండి నీ సమాధానమును పొందియున్నావో, ఆ దేవుని యందున్న విశ్వాసముతో, సువార్తను బోధించుటచేత నీ జీవితమును జీవించెదవుగాక.
రోమా పత్రిక నుండి మనము దేవునినీతి ఎంత పరిపూర్ణమైనదో నేర్చుకొంటున్నామా? ఈ దేవునినీతి అంటే ఏమిటో రోమా వివరముగా మనకు వివరించుచున్నది. మనము మాట్లాడుచున్న దేవునినీతి మానవుడు చేసిన నీతివంటిది కాదు, అయితే ఇది దేవునికి, ఆయన ఒక్కడికే చెందినది.
మనలను మన అన్ని పాపముల నుండి రక్షించుటకు దేవునినీతి అనునది పరిపూర్ణమైనది చాలినదానికాన్నా ఎక్కువైనది. ఆయన బాప్తిస్మము ద్వారా లోక పాపములన్నిటిని తీసుకొనుటచేత, పరిపూర్ణతలో, యేసు అందరిని సంరక్షించెను. యేసుక్రీస్తునందు మనము విశ్వాసముంచగలము అనునది దేవునినీతి పరిపూర్ణమైనది అను వాస్తవము వలనైనది. ఈ దేవునినీతి మనలను పూర్ణముగా మన అన్ని పాపముల నుండి రక్షించినప్పటి నుండి దేవుని నీతిని నెరవేర్చిన ఈ సువార్తయందు విశ్వాసముంచుట అనునది పూర్తిగా అత్యవసరమైనది.
దేవుని నీతియందు విశ్వాసముంచుటచేత, మన జీవితమును దీనినిబట్టి ఆశ్చర్యముతోను, వందనములతోను, స్తుతించుటతోను జీవించగలము. ప్రజలు కేవలము ఆయన నీతియందు విశ్వాసముంచుటచేత మాత్రమే దేవుని పరిశుద్ధతలో జీవించగలరు. ఈ నీతియందు మనము విశ్వాసముంచుట చేత, మన మనస్సు శుద్ధిచేయబడినది, మనము దేవుని స్తుతించగలము. మరియు మన జీవితము ఆయన మహిమ కొరకుకు జీవించగలము.
దేవునినీతి పరిపూర్ణము కానట్లయితే, మనము మన పాపముల నుండి విడిపించబడి వుండేవారము కాము. యేసునందు విశ్వాసముంచుటచేత మన మూల పాపము క్షమించబడినప్పటికీ, ఆ తరువాత మనము స్వయముగా ప్రతిదినము చేయు పాపమునకు అనుదిన పశ్చాత్తాప ప్రార్థన అవసరము.
నీరు మరియు ఆత్మ సువార్తయందు ప్రత్యక్షపరచబడిన, దేవునినీతియందు విశ్వాసముంచుటచేత విమోచనము పొందిన తరువాత, అప్పుడు మనము ఈ దేవునినీతి విశ్వసించదగినది మరియు పూర్ణమైనదను వాస్తవమును బట్టి నేను అనంతమైన కృతజ్ఞత కలిగినవానినైయ్యాను. మన జీవిత కాలములో సాధ్యమైన అన్ని పాపముల నుండి మనలను దేవునినీతి విడిపించినందున, ఆయన నీతియందు విశ్వాసముంచుటచేత మనము రక్షించబడగలము.
దేవుని నీతిని మన మానవ మురికితో పోల్చినవారు దేవునినీతియందు విశ్వాసముంచలేరు. ఎందుకనగా వారు కేవలము ఇది ఎంత పెద్దదో వారు ఎరుగరు. చివరికి అత్యంత పరిపూర్ణమైన వ్యక్తి కూడా దేవుని నీతితో పోల్చినప్పుడు శూన్యము. ఇందువలననే మనము ఆయన నీతియందు విశ్వాసముంచుచున్నాము. మరియు అందునుబట్టి ఆయన పరిశుద్ధతలో మనము జీవించుటకు అనుమతించబడియున్నాము. మరియొక మాటలో, ఆయన నీతియందు విశ్వాసముంచుట మరియు నివశించుట చేత, దేవునిని మహిమ పరచువారముగా మారి యున్నాము.
మన హృదయములో దేవునినీతిని గురించి ఒక ఖచ్చితమైన గ్రహింపును కలిగియుండవలసిన అవసరముంది. అదేమనగా దేవుని నీతి మొత్తముగా మనలను మన పాపముల నుండి విడుదల కలుగచేసినది. మన జీవిత కాలమంతా అసంఖ్యాకమైన పాపములను మనము చేయమా? అప్పుడు, ఏ విధముగా అటువంటి లెక్కించలేని పాపముల నుండి విడిపించిన నీతి కార్యమును జరిగించెను? మన స్వరూపమందు శరీరధారిగా ఈ లోకమునకు వచ్చి, యోహానుచేత బాప్తిస్మము పొందుటచేత మన పాపములన్నిటిని తీసుకొని, సిలువపై మరణించుటచేత, మృతులలో నుండి పునరుత్థానుడగుటచేత క్లుప్తముగా, దేవునినీతియంతటిని నెరవేర్చుట చేత, ఆయన దీనిని విజయవంతముగా నెరవేర్చెను.
ప్రతి ఒక్కరూ, యౌవనస్థులు మరియు వృద్ధులు, సంపన్నులు మరియు పేదవారు, బలవంతులు మరియు బలహీనులు, పాపము చేయుదురు. అప్పుడు, ఎవరు ఈ లోక పాపము నుండి మనలను రక్షించారా? దేవుని నీతిని నెరవేర్చుట చేత, మన అన్ని పాపములన్నియు ఆయనపైన వేసుకొనుటకు, దేవుడు యేసును పంపెను అనునది దేవునినీతి.
దీనికన్నా క్లుప్తముగా మన అన్ని పాపముల నుండి రక్షించిన దేవుని నీతికన్నా మరియొకటి ఏదీలేదు. దేవునినీతి మనలను లోక పాపములనుండి ఒక్కసారే విడిపించెను. ఆయన నీతి ఖచ్చితముగా పూర్తిగా పరిపూర్ణమైనది కాదా? దేవుడు మనకిచ్చిన ఈ ప్రేమ ఏదైతే మన జీవితకాలము మట్టుకే కాక నిత్యత్వము మట్టుకు నిలిచియంటుందో దీనిని, దేవుని నీతి అని పిలుస్తాము.
యేసుకు బాప్తిస్మమిచ్చిన తరువాత మరునాడు బాప్తిస్మమిచ్చు యోహాను ప్రకటించినట్లుగా, ‘‘ఇదిగో లోక పాపమును మోసికొనుపోవు దేవుని గొఱ్ఱె పిల్ల!’’ మొదట యోహాను ఆయనకు బాప్తిస్మమిచ్చుటకు నిరాకరించినప్పుడు యేసు చెప్పినట్లుగా ‘‘ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నది’’(మత్తయి 3:15). ఈ వాక్య భాగము యొక్క భావమేమిటి? యేసు బాప్తిస్మము మరియు సిలువపై ఆయన మరణము అనునది దేవునినీతి అది సత్యము కన్నా తక్కువ కాదు అని భావము. ఈ దేవుని నీతి మనము బలహీనులమైనప్పుడు మరియు ఆయన మహిమను పొందలేకపోయినప్పుడు మనలను వదలిపెట్టదు.
మనలను రక్షించిన మరియు ఆయన నీతియందు నివశించుటకు అనుమతించిన ఈ సమృద్ధియైన ప్రేమను బట్టి మనము కేవలము దేవునిని స్తుతించగలము. ఆయనను మహిమపరచగలము. ఈ దేవునినీతియందు విశ్వాసముంచువారు మిగిలిన జీవితకాలమంతా ఆయన నీతికొరకు జీవించుటకు పూనుకుందురు. మనుష్యులను లేక లోకమును నమ్ముకొనుటకంటే దేవునియందు నమ్మికయుంచుట ఎంతో మంచిది. పాపము నుండి పూర్తిగా విడుదల కలుగజేయు ఈ సువార్తను బోధించు జీవితము ఒక రమ్యమైన జీవితము.
పాపము నుండి ప్రాయశ్చిత్తము పొందినవారు ‘‘యోహానుచేత బాప్తిస్మము పొందుట చేత యేసు నా పాపములన్నియు తీసుకొనిపోయెను! లోక పాపములన్నిటి కొరకు ఆయన నా స్థానములో తీర్పుతీర్చబడెను’’ అని సాక్ష్యమిస్తారు. మనము దేవునినీతియందు విశ్వాసముంచినప్పుడు, మనము కేవలము అటువంటి దీవెనలను బట్టి ఆయనకు వందనములు మాత్రమే చెల్లించగలము.
నీ బలహీనతను బట్టి నీవు తొట్రుపడినప్పుడు, శరీరమును బట్టి నీవు పాపములో పడుదువు, లేక నీవు నీ పాపమును బట్టి నిరాశపడి సిగ్గుపడినప్పుడు, నిన్ను పూర్ణునిగా చేసిన దేవునినీతివైపు చూడు, దేవునినీతి మనలను నీతిమంతులుగా చేయలేదా? ఆయన విమోచన మన అన్ని పాపముల నుండి మనము భవిష్యత్తులో చేయు పాపముతో కలిపి, మనలను రక్షించలేదా?
యేసుక్రీస్తు పూర్తిగా మనలను రక్షించెను అని విశ్వసించినప్పుడు మాత్రమే మనము దేవునినీతియందు విశ్వాసముంచుదుము. దేవుని నీతియందు విశ్వాసముంచినప్పుడు మాత్రమే మనము నీతిమంతులముగా తీర్చిబడ్డాము. దేవునినీతియందు విశ్వాసముంచువారు ఆయన నీతి సాధనముగా మారగలరు. దేవునినీతి పరిపూర్ణత పూర్తియైనది. దేవునినీతిని ఎరుగక, వారి స్వనీతిని వెదకువారు, దేవునిచేత శపించబడుటకు వారి స్వనాశనము మీద కూర్చున్న అవివేకులు మాత్రమే.
‘‘వారు దేవునియందు ఆసక్తిగలవారు, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు’’ అని పౌలు చెప్పుచున్నదానిపై ఏకాగ్రతనుంచుము
ఆయన నీతిని ఎరుగని వారిగా మనము మిగిలిపోతే, మనము ఏ విధముగా ఒక విశ్వాసజీవితమును జీవించగలం, విమోచింపబడగలము. దేవుని ప్రజలుగా మారగలము? ధర్మశాస్త్రమును వెంబడించువారు వారి పాపములు వారి నాశనమునకు నడిపించునని తెలుసుకొనవలెను మరియు వారిని పూర్తిగా రక్షించిన దేవునినీతికి వందనస్థులై యుండవలెను. యేసు మన రక్షకుడు అయ్యెను అనునది, మనము ఆయనయందు విశ్వాసముంచుచున్నాము అనునది మనము ఆయనను మహిమపరచుచున్నాము. అనునది మనము దేవునినీతిని ఎరిగి తెలుసుకొని దానియందు విశ్వాసముంచినందు వలన కలిగినవి. కేవలము ఆయన నీతియందు విశ్వాసముంచుట చేత మాత్రమే మనము ఆయన పిల్లలముగా పాపములేని వారముగా, మారగలము మరియు నిత్యజీవమును పొందగలము. యేసుయందు విశ్వాసముంచుటకు ప్రకటించువారు, విశ్వాసపూరితమైన జీవితమును జీవించువారు, ఇవన్నీచేస్తూ దేవుని నీతి విషయములో అజ్ఞానులైనవారు శపించబడు వారైయున్నారు.
ఇశ్రాయేలీయులు దేవునినీతిని ఎరుగనివారుగా వుంటూ, వారి స్వనీతిని వెంటాడుచూ వున్నారు. ఆ విధముగా చేయుటచేత, దేవునినీతికి అవిధేయులయ్యారని రోమా పత్రికలో అపోస్తలుడైన పౌలు సాక్ష్యమిచ్చుచున్నాడు. వారు తప్పక దేవుని నీతియందు కూడా విశ్వాసముంచవలెను.
దేవుడు మనలను లోక పాపములనుండి విడిపించెనని మనము తప్పక విశ్వసించవలెను. మన పాపములన్నియు లోక పాపములో కలుపబడినవి. దేవుని నీతి నెరవేర్పుతో అవన్నియు అదృశ్యమైనవి. నీవు ఈ సత్యమునందు విశ్వాసముంచు చున్నావా?
‘‘విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయ్యెను’’
దేవునినీతి ధర్మశాస్త్రమునకు సమాప్తి అయ్యెను. కారణమేమనగా యేసుక్రీస్తు ఆయన బాప్తిస్మము మరియు సిలువ మరణముతో లోక పాపములన్నియు ఆయనపైకి తీసుకొనుటచేత ధర్మశాస్త్రమునకు అవసరమైనవాటికన్నిటికి జవాబిచ్చినందున.
దేవునినీతి ధర్మశాస్త్రమునకు సమాప్తి అని వ్రాయబడినప్పటికీ, నిశ్చయముగా పాపమునకు వచ్చు ఫలము మరణము. ఎందుకు ? ఇది ఎందుకనగా తండ్రియైన దేవుడు ఆయన అద్వితీయ కుమారుని ఈ లోకమునకు మానవజాతి పాపములన్నిటినీ తీసుకొనుటకు, బాప్తిస్మము పొందుటకు, సిలువపైన మరణించుటకు, మరియు సమాధి నుండి లేచుటకు పంపెను.
నీ హృదయముతో విశ్వసించుట మరియు ధర్మశాస్త్రము నీతిని వెంబడించుట అనునవి భిన్నమైన విషయములు. నీ క్రియలచేత పాపముల ప్రాయశ్చిత్తమును నీవు పొందియున్నావా? నీవు నీ స్వంత క్రియల చేత నీ రక్షణను నీవు పొందియున్నావా? ఈ లోకములో వున్న ఇతర మతములు నీ పాపముల పరిష్కార మార్గము అనునది మంచి క్రియలు చేయుటచేతనే అని బోధించుచున్నది. ఉదాహరణకు బౌద్ధ మతస్థుని పాపమును గురించి గ్రహింపు అనునది, ప్రస్తుతమందు నీవు చేయు మంచి క్రియలు గడిచిన కాలములోని పాపము నుండి విడిపించును అని బోధించును. ఇది నీకేమైన అర్ధమును కలుగజేస్తుందా?
ఒక మనుష్యుడు ఒకసారి మాత్రమే పుడతాడు. ఒక్కసారే మరణిస్తాడు. తరువాత తీర్పు వస్తుంది. ప్రతి ఒక్కరు ఈ లోకములో ఒకేసారి పుట్టి తరువాత దేవుని దగ్గరకు జేరుచున్నందున, ఎవడును మరియొక జీవిత చక్రములో భూమిమీదికి తిరిగిరాడు. ఇందువలననే ప్రజలు ఈ లోకములో వుండగనే, దేవునినీతి యందు విశ్వాసముంచుటచేత తప్పక విమోచించబడవలెను. బౌద్ధమతస్థులు బోధించు కర్మ సిద్ధాంతము ఎంత చెండాలము?
మన పాపముల నుండి మనము రక్షించబడియున్నాము అనునది దేవునినీతియందు విశ్వాసముంచుట. దేవుని నీతియందు విశ్వాసముంచుట అనునది కేవలము ఆయన నీతి ఒక్కదాని యందే విశ్వాసముంచుట మాత్రమే, మన స్వంత క్రియలలో కాదు. అప్పుడు ఏ విధముగా దేవునినీతి, విశ్వాసము మాట్లాడుతుంది? రోమా పత్రికలో వ్రాయబడియున్న ప్రకారము, ఇది ఈ విధముగా మాట్లాడుతుంది. ‘‘ఎవడు పరలోకమునకు ఎక్కిపోవును అని నీ హృదయములో అనుకొనవద్దు’’. ఇది ఎందుకనగా దేవునినీతి ఒకడు తన హృదయములో విశ్వాసముంచుటచేత కనుగొనబడును కాని, ఏదో రకమైన భౌతిక బలము చేత కాదు.
దేవుని నీతియందు విశ్వాసముంచుటచేత శాశ్వత జీవమును పొందు మనము పాపములేని ప్రజలముగా దేవుని కుమారులుగా మారగలము. మనలను మనమే మన పాపములను పరిష్కరించుకొనలేనందున, మనమెన్ని మంచి కార్యములను చేసినప్పటికి, మన కృషియంతా దేవునియెదుట మరింత ఎక్కువ పాపమగును. ఇందువలననే మనయందు మనకున్న అటువంటి విశ్వాసమును వదలివేసి, దీనికి బదులుగా ఆయన నీతిని వెంటాడుటకు దేవునినీతియందు విశ్వాసముంచవలెను. కొంతమంది ప్రజలు ‘‘మనము దేవుని నీతిని ఎరుగకయున్నప్పటికి కేవలము యేసునందు విశ్వాసముంచుట చేత రక్షింపబడలేమా? ప్రభువు నామమును బట్టి ప్రార్థనచేయువారందరు రక్షించబడుదురు అని వ్రాయబడలేదా? అని అడుగుదురు. అయితే రక్షణ కేవలము యేసునామమందు ప్రార్థన చేయుట ద్వారా మాత్రమే రాదు, అయితే దేవునినీతిని పూర్తిగా ఎరిగి దీనియందు విశ్వాసముంచుట ద్వారా కలుగును.
దేవుని నీతియందు విశ్వాసముంచువాడెవడూ సిగ్గుపడడు
11వ వచనము చెప్పుచున్నది ‘‘ఆయనయందు విశ్వాసముంచు వాడెవడు సిగ్గుపడడు’’, ఈ వాక్య భాగము యొక్క భావమేమిటి? ఆయనయందు విశ్వాసముంచువాడెవడు సిగ్గుపడడు ఎందుకనగా అతడు/ఆమె దేవునినీతియందు విశ్వాసముంచును. ‘‘ఆయనయందు విశ్వాసముంచువాడు’’ అనునది ఆయన నీతియందు విశ్వాసముంచువానిని సూచించుచున్నది.
‘‘ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయువాడెవడో వాడు రక్షించబడును’’ అను వాక్య భాగము గురించి ఏమిటి? దీని భావము నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచువారు ఆయన రక్షకుడైన దేవునిగా ఆయనయందు విశ్వాసముంచినందున, యేసు నామమున ప్రార్థించును. దేవుని నీతి ద్వారా మన రక్షణను మనము పొందిన ప్రకారము. ఈ సత్యమునందు విశ్వాసముంచుటచేత మన విమోచనము ఇవ్వబడినదని విశ్వసించుచున్నాము.
ఈ విశ్వాసము లేకుండా, మరియొక మాటలో, మనము ఎన్నిసార్లు వేదనతో ఆయనకు ప్రార్థించిననూ, మనము మన పాపముల నుండి రక్షించబడలేము. లేఖనము ఒక మొత్తముగా యేసునందు దేవునినీతిని గురించి మాట్లాడుచున్నందున, ఒక్క ప్రభువు నామమందు ప్రార్థన చేయుట ఒక్కటే మనకు విమోచనము నివ్వదు.
బైబిల్ మనకు ఆదినుండే దేవునినీతిని గురించి చెప్పుచున్నది. ఆదికాండములో వ్రాయబడినట్లుగా, దేవుడు జీవ వృక్షమును మంచి చెడుల వివేకమునిచ్చు చెట్టును ఏదేను తోటలో పెట్టెను. ఆయన మాటయందు విశ్వాసముంచువలెనని దేవుడు వారికి ఆజ్ఞాపించెను. దేవుడు, దీనిని మరియొక విధముగా చెప్పాలంటే, శాశ్వత జీవమును సంపాదించుకొనుటకు జీవ వృక్షఫమును తినమని వారికి చెప్పెను.
దేవుని వాక్యము చెప్పుచున్నది,‘‘నీతిమంతులు విశ్వాస మూలమున జీవింతురు’’ మనము కూడా, మన జీవితకాలమంతా దేవునినీతియందున్న మన విశ్వాసముచేత జీవించుదుము రక్షించబడుటకు మొదట ఆయనయందు విశ్వాసముంచినప్పుడు మనం రక్షణపొందినప్పుడు చివరిగా మనము దేవుని రాజ్యము చేరునంత మట్టుకు.
ఈ లోకములో చాలామంది క్రైస్తవులు యేసునందు విశ్వాసముంచుటచేత రక్షణ ఇవ్వబడినదని చెప్పుదురు. అయితే వాస్తవమునకు, వారిలో చాలామంది పాపముల నుండి రక్షించబడలేదు ఎందుకనగా వారింకనూ దేవునినీతని ఎరుగని వారుగా వున్నారు. దేవునినీతిని ఎరుగకుండా ప్రజలు యేసునందు విశ్వాసముంచినట్లయితే ఫలితమేమౌతుంది? అటువంటి ప్రజలు వారి ఆరాధనలు మరియు ప్రార్థనల ద్వారా బాహ్య చిహ్నమును చూపించవచ్చు. అయితే వారు దేవునినీతిని ఎరుగని వారుగా వున్నారు. వారు విడుదల పొందని పాపులవలె మతమును అభ్యసించువారుగా వున్నారు.
చాలామంది క్రైస్తవులు సమాజము నుండి మరియు ఇశ్రాయేలీయుల నుండి దేవునినీతిని ఎరుగనివారుగా వున్నారు. ఆ విధముగా వారు దేవుని నీతికి లోబడలేదు. దేవునినీతియందు విశ్వాసముంచక, యేసునందు విశ్వాసముంచువారు ఈ నీతి విషయములో ఒక ముద్ర వేయుదురు. మంచి కార్యములు చేయుటచేత కాదు, పెద్ద కానుకలను ఇచ్చుటకాదు. లేక యేసునందు విశ్వాసముంచుచు దేవుని యెదుట ఇతర వారి సొంత కార్యములను చేయువారు, దేవునినీతిని వారు ఎరుగక వున్నంత కాలము, ఈ నీతిని పొందరు.
ఏ పరిస్థితులలో వారిని వారు కనుగొన్నప్పటికి దేవుని నీతియందు విశ్వాసముంచువారు దీనిని విశ్వసించుదురు. ఆ విధముగా దేవుని మహిమార్థమై, స్తుతులతోను మరియు కృతజ్ఞతతోను కూడిన జీవితమును జీవించుదురు. దేవునినీతియందు విశ్వాసముంచువారికి, మన తప్పిదము మనకు ప్రత్యక్షపరచబడుచున్న కొలదీ, వారి ఆత్మ యెదుట ఆయన నీతి అంత ఎక్కువగా ప్రకాశించును. నీవు కూడా అటువంటి మేల్కొలుపును కలిగియుండగలవని నేను ప్రార్థించుచున్నాను.
మన శరీరములో ఎంతోకొంత న్యాయమున్నందున మనము దేవునినీతిని పొందగలమా? పొందలేము! దేవునినీతికన్నా, మనయందు న్యాయమైనది ఏదీలేదు. దేవుడు ఆయననీతితో మనపాపము నుండి మనలను పూర్తిగా రక్షించినయున్నందున, ఈ నీతియందు మనము విశ్వాసముంచి స్తుతించుదము. ఆయన నీతి మొత్తముగా మనలను మన పాపముల నుండి రక్షించెను.
నీ జీవితములో చీకటి కోణమును నీవు ఎదుర్కొన్నప్పుడు క్రియల సంబంధమైన విశ్వాసములో నీవు పడిపోవద్దు. అయితే ఎల్లప్పుడు నీ పరిస్థితులను పట్టించుకొనక, దేవునినీతియందు విశ్వాసముంచుము. నిత్యత్వమునకు దేవునినీతి పరిపూర్ణమైనది. ఈ లోకములో వున్న ప్రతి ఒక్కరు ఆయన నీతిని తప్పక తెలుసుకొనవలెను. నీరు మరియు ఆత్మ సువార్తకు విధేయులగుటచేత తప్పక విశ్వాసముంచవలెను. ఇప్పటికి ధర్మశాస్త్రమునందున్న నీతి చేత మాత్రమే జీవించుచు యేసునందున్న విశ్వాసమును ప్రకటించువారు, వారు దేవుని నీతిని ఎరిగియున్నారో లేదో నిశ్చయించుకొనవలెను.
దేవుని సువార్త ఆయన నీతిని నెరవేర్చునని చెప్పుటచేత పౌలు ముగించుచున్నాడు. ఈ దేవుని నిజ సువార్తయందు జ్ఞానము లేక, ఆయన నీతి అనగా ఏమిటో ఎవరును వివరించలేరు. అటువంటి ప్రజలు దేవునినీతి అనగా ఏమిటి అని చర్చించుటకు అడుగునప్పుడు, ‘‘సిలువపై మరణించిన యేసు నా రక్షకుడు, మృతులలో నుండి లేచెను, మరియు నన్ను నా పాపముల నుండి రక్షించెను’’ అని చెప్పవచ్చు. అయితే వారు వారి అనుదిన పాపముల నిమిత్తము పశ్చాత్తాప ప్రార్థనలు చేయవలెనని, పరిపూర్ణులుగా మారుటకు, వారు క్రమక్రమముగా శుద్ధీకరించబడవలెనని చెప్పుదురు.
దేవుని నీతిని గురించి తెలుసుకొనుటకు మొదట నిన్ను నీవు తెలుసుకో. నీవు నిన్ను గురించి తెలుసుకొనుట మరియు దేవునినీతిని గురించి తెలుసుకొనుట ఈ రెండింటి గురించి తెలుసుకొని వుంటే, నీవు దేవుని నీతియందు విశ్వాసముంచుట తప్ప మరియొక అవకాశము లేదు. ఎందుకనగా నీతో దేవునినీతిని పోల్చుకున్నప్పుడు, అది ఎంత ఉన్నతమైనదో, పెద్దధో, ఎంత విశాలమైనదో నీవు గ్రహిస్తావు. అయితే నీవు ఆయన నీతిని ఎరుగనట్లయితే, నీవు ఇంతకుమునుపే నీ స్వనీతిని వెంటాడుటయందు నింపబడియున్నావు. వారి స్వనీతిని వెంటాడుటయందు నిమగ్నమైనవారు, కేవలము వారి స్వనీతిని వెంటాడవలెనని కోరుదురు గనుక, వారు దేవునినీతికి లోబడరు.
మనము దీనియందు విశ్వాసముంచక మునుపు, మనము తప్పక దేవునినీతిని గురించి తెలుసుకొనవలెను దీని కొరకు వందనములు చెల్లించవలెను. దేవునినీతిని తెలుసుకొనుటచేత, ఆయన బాప్తిస్మము మరియు సిలువపై మరణించుటచేత, వాటిని ఆయనపైకి తీసుకొనుటచేత, యేసు లోక పాపములన్నిటిని తీసుకొనిపోయెనని మనము విశ్వసించగలము. మనము మనస్వంత మంచి క్రియలచేత నీతిమంతులుగా తీర్చబడినట్లయితే, దేవునినీతిచేత వచ్చు రక్షణ మనకు అవసరమైయుండేది కాదు. ఇది సాధ్యము కాదని మనము గ్రహించినప్పుడు, మంచి క్రియలను ఆధారము చేసుకొని జీవితమును జీవించలేని మనము, దేవుడు మనలను రక్షించినందుకు ఆయన నీతిని మరింత ఎక్కువగా అభినందించుదుము.
నీ ఆలోచనలు మరియు క్రియలన్నియు మంచివేనా? మంచివి కాకపోవచ్చు. మనము చాలా తప్పిదమును కలిగియున్నందునే దేవుడు మొత్తముగా ఆయన నీతితో మనలను రక్షించెను. మనలను రక్షించిన దేవుని నీతియందు విశ్వాసముంచినప్పటి నుండి, ఈ లోకములో దీనిని గురించి తెలియని ప్రజలందరికి ఆయననీతిని బోధించవలెనను కోరిక కలిగియుందుము.
తన గురించి తాను తెలుసుకొననివాడు ఇతరుల తప్పులను కనుగొని వారి గురించి చెడ్డగా మాట్లాడును. అయితే అతడు/ఆమె దేవుని నీతియందు విశ్వాసముంచువాడయితే, అతడు/ఆమె తప్పక అతిశయముతో ఈ నీతిని ప్రకటించవలెను. మరియు తప్పక అతని/ఆమె స్వనీతిని పొగుడుకొనరాదు. అయితే దేవుని నీతియందు విశ్వాసముంచనివారు ఆయననీతిని గాయపరచు పాపములను చేయుదురు. వారి పాపములను బట్టి దేవుడు వారికి తీర్పు తీర్చును.
దేవుడు ఆయన కుమారుని ఈ లోకమునకు పంపెను మరియు నీకు ఆయన రక్షణను ఇచ్చెను. మనము చివరి దినమును సమీపించుచుండగా, ఎవరి నీతి మంచిది లేక చెడ్డది అని ఒకరికొకరము వివాదము పెట్టుకొనకూడదు. దేవునినీతియందు విశ్వాసముంచువారు వారి శరీరములను దృష్టిలో వుంచుకొనరాదు, అయితే ఆయన నీతియందు విశ్వాసముంచుటచేత కేవలము దేవునికి ధన్యవాదములు తెలుపవలెను.
ఆయన నీతితో మనలను మొత్తముగా రక్షించిన దేవునికి మనము వందనములు చెల్లించుదాం. దేవుని నీతిని నీ పాపములన్నిటిని క్షమించినందున, వారి స్వనీతిని వెంటాడుటలో దేవునికి విరోధముగా తిరిగినవారి వలె నీవు మారకూడదు.