(రోమా 10:16-21)
‘‘అయినను అందరు సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారమెవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు గదా? కాగా వినుటవలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అయినను నేను చెప్పునదేమనగా, వారు వినలేదా? విన్నారు గదా?
‘‘వారి స్వరము భూలోకమందంటికిని, వారి మాటలు భూదిగంతముల వరకును, బయలు వెళ్లెను.’’మరియు నేను చెప్పునదేమనగా ఇశ్రాయేలునకు తెలియకుండెనా?
జనము కానివారి వలన మీకు రోషము పుట్టించెదను
అవివేకమైన జనము వలన మీకు ఆగ్రహము కలుగజేతును
అని మొదట మోషే చెప్పుచున్నాడు
మరియు యెషయా తెగించి
నన్ను వెదకనివారికి నేను దొరికితిని, నన్ను విచారింపనివారికి ప్రత్యక్షమైతిని
అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై యెదురాడు ప్రజలకు నేను దినమంతయు
నా చేతులు చాచితిని అని చెప్పుచున్నాడు.
17వ వచనము చెప్పుచున్నది, ‘‘కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిను మాటవలన కలుగును.’’ ఒక వ్యక్తిని అతని/ఆమె పాపము నుండి విడిపించు విశ్వాసము ఎక్కడ నుండి వచ్చును? నిజమైన విశ్వాసము దేవుని వాక్యము వినుటచేత కలుగును.
ఆయన వాక్యము ద్వారా దేవునినీతి సువార్తకు సాక్ష్యమిచ్చుటలో కొనసాగవలెనని నేను ఇష్టపడుచున్నాను. రోమా 3:10-20 వరకు చూచుటచేత మనము ప్రారంభించుకుందాము.
‘‘ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా
నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు
గ్రహించువాడెవడును లేడు,
దేవుని వెదకువాడెవడును లేడు
అందరును త్రోవ తప్పి యేకముగా పనికిమాలినవారైరి.
మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు.
వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు;
వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది
వారి నోటినిండ శపించుటయు పగయు ఉన్నవి.
రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తుచున్నవి
నాశనమునుకు కష్టమును వారి మార్గములలో ఉన్నవి.
శాంతిమార్గము వారెరుగరు
వారి కన్నుల యెదుట దేవుని భయము లేదు.
ప్రతి నోరు మూయబడునట్లును, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును, ధర్మశాస్త్రము చెప్పువాటినన్నటిని ధర్మశాస్త్రమునకు లోనైనవారితో చెప్పుచున్నదని యెరుగుదుము. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు; ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది.’’
రక్షణ పొందుటకు ఈ వాక్యభాగమును మనము ఏ విధముగా అర్ధము చేసుకుంటాము మరియు దీనియందు విశ్వసించుదాము? ఆది నుండి, నీతిమంతులు లేరు దేవుని వెదకువారు లేరు. అయితే అందరును పాపులు. వారి గొంతుక తెరచిన సమాధి. వారి నాలుక ఒక విషసర్పము విషమువలె మోసముతోను శాపముతోను పగతోను వున్నది. వారి పాదములు రక్తము చిందించుటకు పరుగులెత్తుచున్నవి. వారు శాంతి మార్గమును ఎరుగరు. లేక వారి కన్నులయెదుట దేవుని భయము లేదు. వారు వారి నాశనము కష్టము వున్న మార్గములో నడిచారు. ప్రతివారు దేవునినీతిని ఎరుగక విశ్వసించకమునుపు ఒక పాపిగా వున్నారు. దేవునియెదుట వారు పాపులని కనుగొనిన మార్గము ధర్మశాస్త్రము.
ధర్మశాస్త్రము లేకుండా, ఏ విధముగా, మనము మన పాపములను తెలుసుకొనగలము? ఏ విధముగా మనము దేవునిని తెలుసుకొనగలము? మనమెన్నడైనా దేవునికి భయపడ్డామా? రోమా 3:18 చెప్పుచున్నది, ‘‘వారి కన్నుల యెదుట దేవుని భయము లేదు’’. మన శరీర కన్నులు ఎన్నడైనా ఆయనను చూచినవా? దేవుని ఉనికిని గురించి మన మనస్సాక్షికి స్వల్పముగా తెలిసివుండవచ్చు. అయితే మనము ఆయనను చూడలేదు ఆయనకు భయపడును లేదు. అప్పుడు, ఏ విధముగా, మనము పాపులమని మనము తెలుసుకున్నాము? వ్రాయబడిన దేవుని వాక్యమును వినుటచేత దేవుని ఉనికిని మనము తెలుసుకున్నాము. ఇందువలననే వినుట దేవుని వాక్యము వలన కలుగును.
దేవుడు లోకమును సృష్టించెనని మనకు తెలుసు ఎందుకంటే ఆ విధముగా లేఖనములో వ్రాయబడినది. ‘‘ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను’’ (ఆది కాండము 1:11) ఈ దేవుని వాక్యము వినుటవలన ఆయన ఉనికిని గురించి తెలుసుకొని విశ్వాసముంచియున్నాము. మరియు ఆయన విశ్వమునకు సృష్టికర్తని విశ్వసించుచున్నాము. ఒకవేళ ఇది దేవుని వాక్యము వలన కానట్లయితే, ఎవడును ఆయనను తెలుసుకొనలేడు, ఆయనకు భయపడడు. దేవుని వాక్యము లేకుండా మనము మన పాపములను గురించి కూడా తెలుసుకొనలేము - ఒక్క వ్యక్తి కూడా.
మరియొక మాటలో ప్రాథమికముగా నిరుపయోగమైన వాటిని పూజించుచు, దేవుని ఎరుగని వారము, ఈ విధముగా మన స్వంత పాపములను గురించి తెలుసుకొనకుండా వున్నాము. అయితే దేవుడు మనకు ధర్మశాస్త్రమును ఇచ్చెను. ఈ విధముగా మనము దేవుని యెదుట మన పాపములను గురించి తెలుసుకొనియున్నాము. ధర్మశాస్త్రమునకు చెందిన ఆయన వాక్యము పది ఆజ్ఞలు మరియు 613 వివరమైన శాసనములను వినుటచేత మనము మన తప్పిదములను పాపములను తెలుసుకొనియున్నాము.
ధర్మశాస్త్రము యొక్క వాక్యము లేకుండా కనీసము ఒక్కడు కూడా వాని స్వంత పాపములను తెలుసుకొనలేదు. ఇనుప చువ్వల వెనుక వున్నవారిలో దాదాపు అందరూ అతడు/ఆమె అతని/ఆమె నేరమేమిటో, లేక అతడు/ఆమె ఎందుకు బందింఛబడ్డారో వారికి తెలియదని వారు చెప్పుకుంటారు. వారిలో చాలామంది నిర్దోషులమని చెప్పుకుంటారు. అన్యాయముగా తప్పుగా వారిని చెరసాలలో బంధించారని వారు చెప్పుకుంటారు. దేవుని ధర్మశాస్త్రము తెలియకుండా, మనము మన స్వంత పాపములను తెలుసుకొనలేక ‘‘నేనెప్పుడు ఈ విధముగా ప్రవర్తించాను. ప్రతివారు దీనిని చేస్తారు. ఇది ఎలా పాపము కాగలదు?’’
దేవుని ధర్మశాస్త్రమును చూచి వినుట వలన మనము మన పాపములను గ్రహించియున్నాము. మనము ఇతర దేవతలను పూజించుచున్నామని, దేవుని నామమును వ్యర్ధముగా ఉచ్ఛరించామని, విశ్రాంతి దినమును ఆచరించుటలో మన విఫలము, మన నరహత్యలు, మన వ్యభిచారములు, మన దొంగతనములు, మన అబద్ధములు, మన మత్సరములు దేవుని వాక్య ప్రకారము నడచుటలో మన అపజయము, క్లుప్తముగా ఈ కార్యములన్నియు పాపములు ఎందుకనగా దేవుని ధర్మశాస్త్రము ఈ విధముగా చెప్పుచున్నది. ఈ విధముగా మనము ధర్మశాస్త్ర వాక్యము చేత, దేవుని యెదుట పాపులమని గ్రహించియున్నాము గుర్తించియున్నాము. ఈ ధర్మశాస్త్రమునకు ముందు, మనము మన స్వంత పాపములను కూడా ఎరుగము.
మనము పాపులమని గ్రహించుట వలన, అప్పుడు, దేవునియెదుట మనమేమి చేయవలెను? మన పాపములు ఎలా క్షమించబడగలవో మనము అడగవలసిన అవసరమున్నది. దేవుని వాక్యమును వినుటచేత మనము పాపులమని తెలుసు కొనియున్నాము. మరియు రక్షణ కొరకైన అవసరతను గ్రహించియున్నాము. ఆకలిగొనినవాడు ఆహార అవసరతను ఎలా అనుభవిస్తాడో, దేవుని ధర్మశాస్త్రమును తప్పిపోయామని గుర్తించినవారు వారు భయంకరమైన పాపులమని తెలుసుకొంటారు రక్షణ కొరకు వారి అవసరతను తెలుసుకుంటారు.
ఈ విధముగా మనము దేవుని వెదుకుదుము మరియు ఎవరినైతే ఆయన మన కొరకు పంపియున్నాడో, ఆ యేసుక్రీస్తు ద్వారా ఆయన నీతియందు విశ్వాసముంచు అవసరతను గుర్తించియున్నాము. ‘‘వినుట చేత విశ్వాసము కలుగును’’ అన్నట్లుగా దేవుని వాక్యము వినుటచేత మనము మన పాపములను తెలుసుకుంటాము.
మనము పాపులమని ఇప్పుడు మనకు తెలుసు. అప్పుడు మన పాపముల నుండి విడిపించబడుటకు మనము చేయవలసిన దేమిటి?
దేవుని వాక్యము విని నేర్చుకొనుటచేత మనము మన పాపములను తెలుసుకొనినట్లుగా, మన హృదయ కేంద్రములో నిలుచు రక్షణ, ఆయన వాక్యమునందున్న విశ్వాసముచేత వచ్చును. రోమా 3:21-22 చెప్పుచున్నట్లుగా, ‘‘ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది; దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలును సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై, నమ్మువారందరికి కలుగు దేవుని నీతియై యున్నది.’’
ఆయన ధర్మశాస్త్రమును మనకిచ్చుటచేత, ఆయన వాక్యము చేత జీవించుటలో మనము విఫలమగుటచేత, దేవుడు ఆయన యెదుట మనము పాపులమని తెలుసుకొనునట్లు చేసాడు. దీని ఫలితముగా మనకు రెండు విభిన్న అవసరతలు ఉన్నవి. మనము ధర్మశాస్త్రముచేత జీవించవలెనని కోరుచున్నాము. అయితే అదే సమయమున, పాపమునుండి స్పష్టముగా మన రక్షణను వెదకుచున్నాము. అయితే ‘‘ధర్మశాస్త్రమునకు వేరుగా దేవునినీతి ప్రత్యక్షపరచబడి’’ యున్నందున, వారి పాపముల నుండి విడుదల పొందవలెనని కోరువారు ఈ దేవుని నీతి యందు విశ్వాసము చేత తప్పక విమోచనమును కనుగొనవలెనుగాని, ధర్మశాస్త్రమునందు విశ్వాసముంచుట వలన కాదు. ఈ విడుదల కలిగినది దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులైనందున కాదని మనకు తెలుసు. అయితే దేవునిచేత ఇవ్వబడిన యేసుక్రీస్తు ద్వారా మనలను రక్షించిన దేవునినీతియైన ఈ రక్షణయందు విశ్వాసముంచుటచేత కలిగినది.
అప్పుడు, దేవునినీతి మరియు రక్షణ ఏమిటి? ఇది పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన రెండింటిలో పలుకబడిన నీరు మరియు ఆత్మ సువార్త. ఈ నీరు మరియు ఆత్మ సువార్త పాతినిబంధనలో బలుల విధానములో విశ్వాసముంచుటచేత కలిగిన రక్షణగా నూతన నిబంధనలో యేసు బాప్తిస్మము మరియు ఆయన సిలువయందు విశ్వాసముగా కనబడుచున్నది. రోమా 3:21-22 చెప్పుచున్నది. ‘‘ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవునినీతి బయలుపుడుచున్నది; దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలును సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై, నమ్మువారందరికి కలుగు దేవునినీతియైయున్నది.’’
అప్పుడు మనము ఏ విధముగా దేవునినీతిని పొందగలము? ధర్మశాస్త్రము ప్రవక్తలును సాక్ష్యమిచ్చిన దేవుని వాక్యము ద్వారా, యేసు దేవుడు మరియు మనకు రక్షకుడు, అని తెలుసుకొనుటచేత, ఆయనయందున్న విశ్వాసముద్వారా మన అన్ని పాపముల నుండి రక్షించబడుటచేత, మనము దేవునినీతిని తెలుసుకొనగలము.
మరియొక మాటలో, పాతనిబంధనయొక్క ధర్మశాస్త్రము మరియు ప్రవక్తలు సాక్ష్యమిచ్చిన ఆయన వాక్యమునందు విశ్వాసముంచుటచేత మనము దేవునినీతిని పొందుతాము. ధర్మశాస్త్రము మరియు ప్రవక్తలు సాక్ష్యమిచ్చిన దేవుని వాక్యము హెబ్రీయులకు మరియు రోమాపత్రిక మొదటి అధ్యాయములో చూపబడినది.
యేసువచ్చి మనలను విడిపించుట అనునది దేవునిచేత మనకు వాగ్ధానము చేయబడిన రక్షణ. ధర్మశాస్త్రమునకు లోనై వారి నాశనమునకు బంధించబడిన పాపులను రక్షించుటకు ఈ వాగ్ధానము దేవునిచేత వేల సంవత్సరముల క్రిందట చేయబడినది.
ఉదాహరణకు ఒక వాక్యభాగమును చూద్దాం. లేవీకాండము 16:21 చెప్పుచున్నది; ‘‘అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తలమీద తన రెండు చేతులు ఉంచి, ఇశ్రాయేలీయుల పాపములన్నియు అనగా వారి దోషములన్నియు వారి అతిక్రమములన్నియు దాని మీద ఒప్పుకొని, ఆ మేకతల మీద వాటిని మోపి, తగిన మనుష్యునిచేత అరణ్యములోనికి దాని పంపవలెను. రోమా 3:21-22 నుండి దేవుని నీతికి ధర్మశాస్త్రమును ప్రవక్తలును సాక్ష్యమిచ్చిరి అను వాక్యభాగము భావము యేసు పూర్ణ రక్షణ పాత్ర పాత నిబంధన ప్రత్యక్ష గుడారము బలుల విధానము ద్వారా మరియు యెషయా, యెహెజ్కేలు, యిర్మియా మరియు దానియేలు వంటి ప్రవక్తల ద్వారా ప్రత్యక్షపరచబడినదని అర్ధము.
మరియొక మాటలో, పాతనిబంధన వాక్యము ద్వారా దేవుడు అప్పటికే ఆయన రక్షణా వాగ్ధానమును ఎలా నిలుపుకుంటాడో ` యేసు క్రీస్తును పంపి, ఆయన బాప్తిస్మముతో లోక పాపములన్నిటిని ఆయన పైకి తీసుకొనునట్లు చేయుటచేత, మన స్థానములో సిలువపై మరణించునట్లు చేసి, అక్కడ దేవునినీతిద్వారా పాపము నుండి మన విడుదల కొరకు ఆయన స్వంత దేహముతో మన పాపముల క్రయధనమును చెల్లించునని ఆ విధముగా ప్రత్యక్షపరచెను. మన రక్షణ ఆ విధముగా ధర్మశాస్త్రమును బట్టికాదు గాని, ధర్మశాస్త్రము మరియు ప్రవక్తలు సాక్ష్యమిచ్చినట్లుగా, దేవుని నీతి తానే అయిన యేసుక్రీస్తునందున్న మన విశ్వాసము చేత కలిగెను.
మనము యేసుక్రీస్తుచేత నెరవేర్చబడిన, ఆయన నీతియందు విశ్వాసముంచుటచేత మన పాపముల నుండి మనము రక్షించబడియున్నామని దేవుడు మనతో చెప్పుచున్నాడు. మన విశ్వాసము ఈ దేవుని వాక్యము వినుటచేత, యేసుక్రీస్తును గూర్చి వినుటచేత కలుగును. ఏ విధముగా యేసుక్రీస్తు మన రక్షకుడని తెలుసుకొని విశ్వసించగలము? మనలను రక్షించుటకు ప్రణాళికననుసరించి మనలను రక్షించుటకు ఆయన వాగ్ధానము చేసెను మరియు యేసు ఈ వాగ్ధానము ప్రణాళికననుసరించి మనలను రక్షించుటకు వచ్చెను అను, ఆయన సేవకులచేత పలకబడిన దేవుని వాక్యము వినుటచేత, మనము యేసు మన రక్షకుడని తెలుసుకొని విశ్వసిస్తాము. దానియేులు 9:24 వ్రాయబడినట్లుగా, ‘‘తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలు పరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకు డెబ్బదివారములు విధింపబడెను.’’
దేవుడు మన ప్రజల కొరకు డెబ్బది వారములు విధించెను
దానియేలు గ్రంథము నుండి పైనున్న వాక్యభాగముతో మనము కొనసాగుదాము. ఈ వాక్యభాగము వర్ణించుచున్నది ఏమనగా, ఇశ్రాయేలు వారి విగ్రహారాధన వలన వారు బబులోనుచేత చెరపట్టబడిన వారుగా కొనిపోబడుదురని బానిసలుగా డెబ్బది సంవత్సరములు జీవించుదురని దేవుడు నిర్ధారణకు వచ్చినప్పుడు, బబులోను చేత ఇశ్రాయేలు పడిన పతనమును వర్ణించుచున్నది. దేవుని నిర్ణయమును బట్టి, ఇశ్రాయేలీయులు దాడికి గురై బబులోను వలన వేదన ననుభవించారు కోలుకోలేక పోయారు. చాలామంది ఇశ్రాయేలీయులను ఖైదీలుగా పట్టుకొనిపోయి వారిని బానిసులుగా మార్చిన బబులోను వారికి లొంగిపోయారు. పట్టుకొనిపోయిన ఖైదీలో, బబులోను రాజు అతని సలహాదారునిగా నియమించిన, జ్ఞాని అయిన దానియేలు కూడా వున్నాడు.
అందువలన దేవుడు ఇశ్రాయేలీయులను వారి పాపమునుబట్టి ఈ విధముగా శిక్షించాడు, అయితే ఆయన కరుణామయుడైనందున, ఆయన ఉగ్రత యుగయుగములు ఉంచలేదు. దీనికి బదులుగా డెబ్బది వారములలో వారిని స్వతంత్రులనుగా చేయుటకు ప్రణాళిక వేసాడు.
దానియేలు ఆయన ప్రజల తరపున దేవునియెదుట పశ్చాత్తాపపడినప్పుడు, ఆయన కరుణకొరకు విడుదల కొరకు ప్రార్థన చేసాడు. వాక్యమును పలికిన దూతను దేవుడు పంపాడు. ‘‘తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలు పరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకు డెబ్బది వారములు విధింపబడెను.’’ ఈ వాక్య భాగము 70 వారములలో వారి దోషము సమాప్తమయినప్పుడు ఆయన ప్రజల పాపములన్నిటిని ఆయన క్షమించునని దానియేలుకు దేవుడు చేసిన వాగ్ధానము ఇది.
ఇశ్రాయేలీయులు చాలా పాపము చేసినందున, దేవుడు వారిని శిక్షించవలసి వుంది. డెబ్బది వారముల బానిస క్రయధనముతో, దేవుడు వారి గడిచిన పాపములన్నిటిని క్షమించాడు. దోషము విమోచించబడినపుడు, అపరాధమునకు కరుణాధారము చేయబడినప్పుడు, నిత్యము నిలుచు దేవునినీతి తీసుకొని రాబడినది, దర్శనము ప్రవచనము ముద్రించబడినవి, యిర్మియాకు చెప్పబడిన దేవుని వాక్యమంతయు నెరవేరును. 70 వారముల బానిసత్వముద్వారా, ఇవన్నియు భరించవలసివుండును, 70వ వారమున, ఇశ్రాయేలీయులు వారి స్వంత దేశమునకు తిరుగు ముఖము పట్టుదరు.
దానియేలుకు ఆయన దూత ద్వారా దానియేలుకు దేవుడు చెప్పినది ఇది. ఈ వాగ్ధానము ఇశ్రాయేలీయులకు చేయబడిన వాగ్ధానము, అయితే ఇది ఒక ఆత్మీయ చిహ్నము కూడా డెబ్బది వారములలో ఇశ్రాయేలు ప్రజలకు వారి స్వంత పరిశుద్ధ పట్టణమును సిద్ధపరచినట్లుగా, ఆయన యందు విశ్వాసముంచు మన అందరికీ మన పరిశుద్ధ పట్టణమైన పరలోక రాజ్యము, మన దేవుని రాజ్యమును దేవుడు సిద్ధపరిచాడు.
రోమాలో, ఇది చెప్పబడినది, ‘‘ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవునినీతి బయలుపడుచున్నది; దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలును సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై, నమ్మువారందరికి కలుగు దేవునినీతియైయున్నది.’’ యేసుక్రీస్తు ఈ భూమి మీదికి వచ్చి, బాప్తిస్మము పొందినప్పుడు, సిలువపై మరణించినప్పుడు, మన దోషములన్నియు తొలగింపబడెను. మన పాపములు ముగిసెను నిత్యము నిలుచు నీతి ప్రత్యక్షపరచబడెను, దర్శనము మరియు ప్రవచనముకు ముద్రవేయబడెను. దానియేలు నుండి ఈ వాక్యభాగము ‘‘పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు’’ అను మాటతో ముగుస్తుంది. పరిశుద్ధ స్థలము అనగా అభిషేకించబడుటకు ఈ భూమిమీదకు రానైయున్న, యేసుక్రీస్తు కాక మరియొకటి కాదు.
అభిషేకించుట అనగా అర్థమేమిటి? అదేమనగా యేసు రాజుకు చెందిన మూడు స్థితులను, దేవుని రాజ్య యాజకుడు, మరియు ప్రవక్త. మన రాజుగా, ప్రధాన యాజకుడు మరియు ప్రవక్తగా, యేసు మన పాపములనుండి మనలను విడిపించుటకు దేవుని చిత్తమును నెరవేర్చును. దానియేలుతో మాట్లాడిన దూత ప్రవచించునట్లుగా, యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి బాప్తిస్మము పొందుటచేత ఆయనపైన మన పాపములన్నిటిని వేసుకొనెను మనకు బదులుగా తీర్పుతీర్చబడెను.
‘‘వినుటవలన విశ్వాసము కలుగును’’, అప్పుడు ఏ విధముగా దేవునినీతికి చెందిన ఈ సువార్తను విని దీనియందు విశ్వాసముంచగలము? యేసుక్రీస్తు మన రక్షకుడని మనము ఏ విధముగా విశ్వసించగలము? పాత నిబంధనలో దేవుడు మాట్లాడిన ` దేవుని ప్రవక్తలు మరియు ఆయన సేవకులచేత పలుకబడిన మాటను మనము విని దానియందు విశ్వాసముంచగలము. ఇందువలననే పౌలు వినుటవలన విశ్వాసము కలుగును అని చెప్పుచున్నాడు. మరియు ఈ విశ్వాసము క్రీస్తును గురించి వినుట వలన కలుగును.
దానియేలు యెషయా వంటి పాత నిబంధన ప్రవక్తలు యేసుక్రీస్తు రాకను గురించి ప్రవచించారు. యెషయా ప్రత్యేకించి, ‘‘నిశ్చయముగా అతడు మన రోగమును భరించెను మన వ్యసనములను వహించెను, వధకు తేబడు గొఱ్ఱె పిల్లయు బొచ్చు కత్తిరించువానియందు గొఱ్ఱెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువలేదు’’ (యెషయా 53:4, 7)
యేసుక్రీస్తు ఈ భూమిమీదికి వచ్చుటకు సామాన్యులలో ఒక సామాన్యునిలా ఒక కన్యకు జన్మించునని, 33 సంవత్సరములు జీవించునని, బాప్తిస్మము పొంది, సిలువవేయబడి, మూడవ దినమున మృతులలో నుండి లేచునని యెషయా కాలములో ఎవడు విశ్వాసముంచాడు? అయినను యేసుక్రీస్తు రాకకు 700 సంవత్సరముల పూర్వమే. జరగబోవు వీటినన్నిటిని యెషయా చూచి ప్రవచించాడు. యేసుక్రీస్తు మనరోగమును మరియు మన అన్ని పాపములను భరించెను అను వాస్తవమునకు సాక్ష్యమిచ్చాడు.
ఇందువలననే పౌలు రోమా పత్రికను వ్రాస్తున్నప్పుడు తరచుగా దేవుని సేవకులు ఏ విధముగా యేసు మన రక్షకుడయ్యెను ఈ భూమికి వచ్చి, మన అన్ని పాపములను తీసుకొనుటచేత, దేవునినీతితో మనలను రక్షించుట అను దానిని ఏ విధముగా దేవుని సేవకులు ప్రవచించిరో వివరించుటకు పాత నిబంధన వాక్యమును ఉపయోగించెను.
ఏలయనగా అందరును పాపము చేసియున్నారు
రోమా 3:23-24 చెప్పుచున్నది. ‘‘ఏ బేధమును లేదు అందరును పాపము చేసి దేవుడనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు.’’ మనము పాపములో జన్మించి దేవునికి విరోధముగా పాపము చేసినందున, దేవుడనుగ్రహించు మహిమను మరియు దేవుని రాజ్యమును పొందలేక పోవుచున్నాము. యేసుక్రీస్తునందున్న విమోచనము ద్వారా దేవుని కృపచేత ఉచితముగా నీతిమంతులముగా తీర్చబడియున్నాము. మనము నీతిమంతులముగా తీర్చబడుట అనునది ఒక వెలలేని, ఉచితమైనది. ఆయనను గురించి విని ఆయనయందు విశ్వాసముంచు మనలనందరిని విడిపించుటకు, యేసు మన పాపములన్నిటిని తీసుకొనిపోయి సిలువపైన ఆయన స్వంత ప్రాణముతో మన పాపముల జీతమును చెల్లించినందున మనము మన పాపముల క్రయధనమును చెల్లించవలసిన అవసరమే లేకుండా పోయింది.
అన్ని పాపముల నుండి రక్షణయందున్న విశ్వాసముచేత అనగా మన భావమేమిటి? మనము చాలా సులభముగా దేవునినీతియందున్న విశ్వాసము అని అర్ధము చెప్పగలము. దేవునినీతియందు విశ్వాసముంచుట అనుదానికి క్రియలతో ఎటువంటి సంబంధము లేదు. అయితే దీనికి కలిగియున్నదంతా మన హృదయముతో పని మాత్రమే. మన ప్రభువు వాక్యమును విని దీనియందు మన హృదయముతో విశ్వాసముంచుటచేత మనము నీతిమంతులముగా తీర్చబడియున్నాము. మనలను మన పాపముల నుండి రక్షించుటకు మన ప్రభువు ఈ లోకమునకు వచ్చెను, బాప్తిస్మమిచ్చు యోహానుచేత బాప్తిస్మము పొందుటచేత లోకపాపములన్నిటిని మోసికొని పోయిన, దేవుని గొఱ్ఱె పిల్లగా మారెను, సిలువపైన మరణించెను, మూడవ దినమున, మృతులలో నుండి ఆయన లేచెను, ఇప్పుడు తండ్రియైన దేవుని కుడి పార్శ్వమున కూర్చునియున్నాడు.
యేసు లోక పాపములన్నిటిని ఆయనపైకి వేసుకున్నాడు. ఆయన స్వంత ప్రాణముతో మన పాపములకు వెలను చెల్లించాడు. మృతులలో నుండి లేచాడు. ఇవన్నీ నిర్ధేశించబడిన మన స్వంత మరణము నుండి రక్షించుటకు, దీనియందు విశ్వాసముంచుటచేత మనము రక్షించబడియున్నాము. మన రక్షణ విశ్వాసము వలన కలుగును మరియు మన విశ్వాసము లిఖించబడిన దేవుని వాక్యమును వినుట వలన కలుగును, మరియు క్రీస్తును గురించి వినుట వలన కలుగును.
‘‘వినుట వలన విశ్వాసము కలుగును’’ మన హృదయములతో మనము విశ్వసించుచున్నాము. మన జ్ఞానము తెలివి కొరకు, మన దేహము పనిచేయుట కొరకు, మనము విశ్వసించునది మన హృదయములో వుంటుంది. అప్పుడు మన హృదయములో విశ్వాసముంచవలసినది ఏమిటి? ఏ విధముగా? దేవుని వాక్యము వినుటచేత, మనము ఆయన సువార్తను వినగలము, ఆయన సువార్తను వినుటచేత, మనము విశ్వాసము కలిగియుండగలము, విశ్వాసము కలిగియుండుటచేత, మనము రక్షించబడగలము. మనము విశ్వసించినప్పుడు, మనము దేవుని వాక్యము చేత విశ్వసిస్తాము. అది, ఆయన బాప్తిస్మముతో క్రీస్తు మన పాపములన్నియు తీసుకొనెను, వాటిని మోసికొనిపోయెను, సిలువపైన మరణించెను మరియు మృతులలో నుండి తిరిగి లేచెను అను ప్రకటించు లిఖించబడిన దేవుని వాక్యమునందు మనము విశ్వాసముంచియున్నాము.
దేవుని వాక్యమునందు విశ్వాసముంచుట అనునది ఆయననీతియందు విశ్వాసముంచుట. అందువలన దేవుని వాక్యము వినకుండా విశ్వాసముంచుట అనునది నిష్ఫలము మరియు నిరుపయోగము. దేవుడు ఒకని కల ద్వారా తెలియపరచెను లేక తెలియపరచలేదు అని చెప్పుకొనునవి అన్నీ అబద్ధము.
మనము విశ్వాసముచేత రక్షించబడియున్నాము మరియు విశ్వాసము ఒక్కదానిచేత మాత్రమే రక్షించబడియున్నాము. రోమా 3:24-26 వరకు మరియొకసారి చదువుకుందాము. ‘‘ఏ బేధమును లేదు, అందరును పాపముచేసి దేవుడనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు. కాబట్టి నమ్మువారు కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనబరచవలెనని క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసముద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటికాలమందు తన నీతిని కనబరుచునిమిత్తము, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముగల వానిని నీతిమంతునిగా తీర్చువాడునైయుండుటకు ఆయన అలాగు చేసెను’’ ఆమెన్. మన ప్రభువు మన పాపములకు కరుణాధారముగా చేయబడెను. మన పాపములనుబట్టి, మనము దేవుని శత్రువుగా చేయబడియున్నాము, అయితే యేసు ఆయన బాప్తిస్మము, మరణము మరియు పునరుత్థానముతో మన పాపములకు కరుణాధారమగుటచేత దేవునితో మన సంబంధమును పునఃస్థాపించాడు.
రోమా 3:25 మధ్యలో వున్న వాక్య భాగమిది. ‘‘పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనుబరచవలెనని క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను.’’ ఈ వాక్య భాగము దేవుడు ఎంతో కాలమునుండి దీర్ఘశాంతముతో ఎదురుచూసాడు. మరియు తీర్పు దినము వరకు ఆయన ఎదురు చూచును అని చెప్పుచున్నది. యేసుక్రీస్తునందు విశ్వాసముంచువారు, నీరు మరియు రక్తము ద్వారా రక్షణయందు విశ్వాసముంచువారు, తండ్రియైన దేవుని కరుణాధారముగా మారని, కుమారుని రక్షణయందు విశ్వాసముంచువారు. వారి పాపములన్నియు దేవునిచేత ఉపేక్షించబడినవి. ‘పాపములను ఉపేక్షించుట’ అనగా దేవుడు ఆయన వాక్యమును మరియు ఆయన సువార్తను విని దీనియందు విశ్వాసముంచువారి పాపములను మరియు, యేసు బాప్తిస్మము మరియు సిలువపైన ఆయన రక్తమునందు విశ్వాసముంచు ప్రజల పాపమును ఆయన ఉపేక్షించెను.
సమయము గడచిన కొలది మన జీవితములో మనము తప్పుడు వారమవ్వవచ్చు. అయితే మన శరీరము మన మనస్సు బలహీనతలను బట్టి, యేసు రక్షణను మనము తృణీకరించనంత కాలము, దేవుడు పాపమును పాపముగా చూడడు. మరియొక మాటలో, వారి హృదయములో ఎవరు యేసుక్రీస్తు యొక్క నీరు మరియు రక్తమునందు విశ్వాసముంచుటచేత రక్షించబడుదురో వారి పాపములను దేవుడు చూడడు, అయితే ఆయన వాటిని ఉపేక్షించును.
అప్పుడు, ఎందుకు దేవుడు మన పాపములను దాటిపోవును? ఆయన పరిశుద్ధుడు మరియు న్యాయమైన దేవుడైనప్పుడు, అటువంటి పాపములను ఆయన ఏ విధముగా పట్టించుకోకుండా వుంటాడు? ఇది ఎందుకంటే, యేసు ఈ లోకమునకు వచ్చెను బాప్తిస్మము పొందెను. ఆయన బాప్తిస్మము మరియు సిలువ మరణముతో లోక పాపములన్నిటిని తుడిచివేసినందున, అదేమనగా దేవుడు పూర్వము చేయబడిన పాపములను ఉపేక్షించును. పూర్వము చేయబడిన పాపములనగా కేవలము మన మూల పాపమును మాత్రమే సూచించుచున్నదా? కాదు. అది ఆ విధముగా సూచించబడదు. ఎందుకనగా అది మనకు మన మూల పాపముగా కనబడినప్పటికి, నిత్యుడగు మన తండ్రికి, ప్రతిదీ గడిచిపోయినదే.
నిత్యత్వ దృష్టిలో, ఈ లోకములో వున్న కాలము ఎప్పుడూ గడిచిన కాలమువలె కనబడును. ఈ లోకమునకు ఆరంభము అంతము కాదు. అయితే దేవుడు నిత్యుడు మన లోక కాలమున ఆయన కాలముతో పోల్చినప్పుడు, లోక పాపములన్నియు ఆయన యెదుట పూర్వము చేయబడిన పాపముగా కనబడును. ‘‘పూర్వము చేయబడిన పాపమును దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనబరచవలెనని.’’ ఇందువలననే దేవుడు మన పాపములను చూడడు, మన పాదములను చూచుటకు ఆయనకు కన్ను లేక కాదు. ఆయన కుమారుడు యేసుక్రీస్తు మన పాపములకు జీతమును చెల్లించినందున ఆయన వాటిని చూడడు. క్రీస్తు బాప్తిస్మము మరియు సిలువ మరణము మన పాపములను కడిగివేసినందున మనము వాస్తవముగా దేవునియెదుట పాపములేని ప్రజలుగా కనబడుదుము.
దేవునినీతి నెరవేర్పు అయిన యేసుక్రీస్తు విమోచనము దీనియందు విశ్వాసముంచు మనవారందరిని విమోచించి, అప్పటికే మన పాపములను మన వద్ద నుండి తీసుకొనిపోయినప్పుడు, దేవుడు మన పాపములను ఎలా చూడగలడు? ఈ విధముగా పూర్వము చేయబడిన పాపములను, ఇప్పటికే యేసుక్రీస్తుచేత వెల చెల్లించబడిన పాపములను, ఆయన ఇప్పుడు తన నీతిని కనబరుచునిమిత్తము ఉపేక్షించును.
దేవునినీతియందున్న విశ్వాసము క్రీస్తును గురించి వాక్యముచేత వచ్చును. ఎందుకనగా ఇది దేవునినీతిని కలిగియున్నది. ఆయన నీతిని కనబరుచుటచేత, దేవుడు ఆయన నీతిని మాత్రమే కాదు. యేసుక్రీస్తునందు విశ్వాసముంచువారి నీతిని కూడా కనబరిచెను. దేవుడు మన పాపములన్నిటిని తరిమివేసెను. మనము కూడా యేసు మన పాపములను తీసుకొనిపోయెనని మనహృదయములయందు విశ్వాసముంచుచున్నాము. ఇందువలననే మనము పాపములేని వారముగా మరియు నీతిమంతులముగా, క్రీస్తుకు కలిగిన నీతిని ధరించుకొనినవారముగా మారియున్నాము. (గలతీ 3:27) దేవుడు మరియు మనము నీతిమంతులమైనందున, మనందరము ఒక కుటుంబముగా చేరియున్నాము. మరియు నీవు నేను ఆయన కుమారులము. ఈ అందమైన వార్తయందు నీవు విశ్వాసముంచుచున్నావా?
అతిశయించగలుగుటకు మనము ఏదో కలిగియున్నాము అని దీని భావమా? కాదు! వాస్తవమునకు క్రీస్తును గురించి విని దానియందు విశ్వాసముంచుటచేత మాత్రమే మన రక్షణ సాధ్యమైనప్పుడు, మనము అతిశయించుటకు ఏముంది? మనము మన స్వంత క్రియల వలన రక్షించడియున్నామా? మనము అతిశయించుటకు వున్నదేమిటి? ఏమీ లేదు! ఉదయకాల ఆరాధనకు నీవు హాజరుగటచేత రక్షించబడియున్నావా? ఆదివార సంఘ ఆరాధన ఎన్నడు తప్పిపోనందున నీవు రక్షించబడియున్నావా? పదియవవంతు నిశ్చయముగా నీవు చెల్లించుట వలన నీవు రక్షించబడ్డావా? కాదు గదా.
ఇవన్నీ క్రియలు, క్రియలమీద ఆధారపడిన విశ్వాసము లేక క్రియలకు అనుబంధమైన విశ్వాసము తప్పు విశ్వాసము. మనము మన హృదయములలో దేవునినీతియందు విశ్వాసముంచుటచేత మనము రక్షించబడియున్నాము. విశ్వాసము వినుట వలన కలుగును. రక్షణ క్రీస్తు వాక్యమునందున్న విశ్వాసము చేత కలుగును.
యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన తరువాత, పశ్చాత్తాప ప్రార్థన ద్వారా పాపము పరిహారమును పొందుటను ప్రయత్నించుట అనునది కూడా ఒక తప్పు విశ్వాసము ఏలయనగా నిజ విశ్వాసము దేవునినీతియందు విశ్వాసముంచుటచేత మాత్రమే కలుగును గాని, ధర్మశాస్త్ర క్రియలచేత మాత్రము కాదు. దేవుడు చెప్పుచున్నట్లుగా, ‘‘కాబట్టి అతిశయ కారణమెక్కడ? అది కొట్టివేయబడెను. ఇట్టి న్యాయమును బట్టియే. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని యెంచుచున్నాము. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే.’’
యేసుక్రీస్తు ఆయన నీరు మరియు రక్తముతో వారిని రక్షించెనని వారు విని వారి హృదయములయందు విశ్వాసముంచుటచేత, ఇశ్రాయేలీయులకు మరియు అన్యులకు ఇద్దరికి రక్షణ కలుగును. మనము దేవుని నీతియందు విశ్వాసముంచినప్పుడు మనము మన పాపములనుండి రక్షించబడ్డాము. ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు అయిన ఈ నీతియందు విశ్వాసముంచియున్నామో, మన పాపమునుండి మనము రక్షించబడియున్నాము. దేవుడు తన తండ్రియగును మనము ఆయన పిల్లలమగుదుము. దేవునినీతియందు విశ్వాసముంచుటచేత, క్రీస్తును గురించి విని దీనియందు విశ్వాసముంచుటచేత కలిగిన రక్షణ ఇది. దేవునినీతియందు విశ్వాసముంచుటచేత మనకు విశ్వాసము కలుగును.
మన రక్షణ క్రీస్తును గూర్చిన వాక్యమునందున్న మన విశ్వాసము చేత కలుగును. అప్పుడు, క్రీస్తు, నీ రక్షకునిగా ఈ భూమిమీదికి వచ్చెనని, ఆయన బాప్తిస్మముతో, దేవునికి ఒక కరుణాధారముగా లోక పాపములన్నియు తీసుకొనిపోయెనని, సిలువపై మరణించెననియు, మూడవ దినమున మృతులలో నుండి లేచెనని, తండ్రియైన దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెనని విశ్వసించుదువా? ప్రభువైన యేసుక్రీస్తు చేసిన ఈ ప్రాయశ్చిత్తమునందు, ఈ రక్షణయందు నీవు నిజముగా విశ్వాసముంచుచున్నావా?
దేవునిని వారి కలలో కనబడమని అడిగే ప్రజలు చాలామంది వున్నారు. వారు వారి కన్నులతో ఒక్కసారి చూచినట్లయితే విశ్వసించమని చెప్పువారు వీరు. చివరికి కొంతమంది వారి కలలో యేసును చూసామని ఆయన వారికి అది చేయమని ఇది చేయమని చెప్పాడని ఇక్కడ ఒక చర్చి కట్టమని, అక్కడ ఒక ప్రార్థనా కేంద్రము, మొదలగు వాటిని చెప్పాడని చెప్పుకుంటారు. అయితే సామాన్యముగా కొంత డబ్బు అవసరము. ఈ విధమైన తప్పుగా చెప్పుకొనువాటిచేత మోసగించుబడుటచేత, చాలామంది వక్రమార్గమునకు తిప్పబడి నశించుచున్నారు. క్రైస్తవ లోకములో విచారకరమైన సంఘటనలు అనేకమైనవి వున్నాయి. వీటిలో అన్నీ ప్రభువు కార్యములు కావు. అయితే దయ్యం పనులని మనము తప్పక తెలుసుకోవాలి.
ఒకవేళ, ఏదో ఒక రకముగా, నీ కలలో యేసును చూచినట్లయితే, దానిని నీవు చాలా పెద్ద విషయముగా తీసుకొనవద్దు. కలలు కేవలము కలలే. యేసు అటువంటి విధానములో నీ యెదుట ప్రత్యక్షమయ్యే దేవుడు కాదు. అలా కాకుంటే బైబిల్ అవసరమే లేదు. ఒకవేళ దేవుడు ఒక్కసారి మన యెదుట ప్రత్యక్షమైతే, అప్పుడు తప్పక మనము బైబిల్‌ను మూసివేయాలి. ఎందుకంటే అది ఇక ఏ మాత్రము మనకు అవసరము లేదు గనుక. అయితే ఇది క్రీస్తు రక్షణా కార్యముపైన ఎంతో చెడు ప్రభావమును కలిగివుంటుంది.
బైబిల్ లేకుండా మనము యేసునందు విశ్వాసముంచుటకు వున్నట్లయితే, ఆయన ప్రతివాని ముందర ప్రత్యక్షమవ్వాలి. అయితే దీనికి ఏ అవసరము లేదు. ఏలయనగా మన ప్రభువు రక్షణకు అవసరమైన వాటినన్నింటిని ఇప్పటికే నెరవేర్చెను. ఇందువలననే, విశ్వాసము క్రీస్తును గురించి తెలుసుకొని దానియందు విశ్వాసముంచుటచేత కలుగును. అప్పుడు ప్రజలందరు యేసుక్రీస్తును గురించి విన్నారా? వారు యేసుక్రీస్తు నామమును విని యుండవచ్చు. కాని వారందరు నిజ సువార్తను వినియుండకపోవచ్చు. ఇందువలననే పౌలు అడుగుచున్నాడు, ‘‘బోధించువాడు లేక వారు ఏ విధముగా విందురు?’’
కావున, మనము తప్పక, దేవునినీతి కలిగియున్న ఈ సువార్తను బోధించవలెను. దేనితో మరియు ఏ విధముగా బోధించాలి? ఏ పద్ధతిలో లేక ఏ విధముగా సువార్త ప్రకటించబడినది అనునది ముఖ్యము కాదు. సువార్తను వ్యాపింపజేయు అన్ని పద్ధతులు, మాట్లాడుటచేత మరియు ముద్రించబడిన సాహిత్యము చేత, అన్నీ ఉపయోగించబడవలెను. వినుట వలన విశ్వాసము కలుగును మరియు వినుట క్రీస్తును గురించిన వాక్యము చేత కలుగును. సువార్తను బోధించు ముద్రించబడిన పత్రికలు కూడా పాఠకులను నిజ విశ్వాసములోనికి నడుపును. పద్ధతితో సంబంధము లేకుండా, వినుట ద్వారా మాత్రమే విశ్వాసము కలుగునని, ఆ వినుట సువార్తను బోధించుటచేత మాత్రమేనని నీవు తెలుసుకొనవలెను.
నీవు నిజముగా నీ హృదయమునందు దేవుని వాక్యముపట్ల విశ్వాసమున్నట్లయితే, నీవు నిజమైన క్రైస్తవుడవని నీవు తెలుసుకుంటావు. నీవు నీ పాపములనుండి రక్షించబడియున్నావని తెలుసుకొందువని, నేనాశించుచు ప్రార్థించుచున్నాను. నీరు మరియు ఆత్మ సువార్తను నీవు ప్రియముగా పట్టుకొందువని నేను ఆశించుచు ప్రార్థించుచున్నాను. అప్పుడు, రోమా 10:17 మనమందరము కలసి చదువుకొనుటచేత మన చర్చలను ముగించుకుందాము.
‘‘కాగా వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును’’ ఆమెన్. లిఖించబడిన ఈ వాక్యమును వినుటచేత వారి హృదయములయందు విశ్వాసముంచువారు నిజవిశ్వాసము కలిగినవారు. నీవు ఈ నిజ విశ్వాసమును కలిగియున్నావా? మన ప్రభువు మన అన్ని పాపముల నుండి మనలను విడిపించియున్నాడు.
మన ప్రభువు మన పాపములన్నిటిని తీసుకొని పోయినందున మనమెంత సంతోషముగా వున్నాము వందనస్థులమైయున్నాము! ఈ సువార్త లేకుండా, ప్రజలెప్పుడూ నిరాశలో వుంటారు. అయితే ఆయన బాప్తిస్మముతో యేసు మన పాపములను కొనిపోయెనని కేవలము వినుటచేత, మన హృదయములు ఆనందముతో నింపబడును మరియు మన విశ్వాసము పెరుగుటకు ప్రారంభించును.
మనలను రక్షించినందుకు నేను ప్రభువుకు వందనములు చెల్లించుచున్నాను.