• All e-books and audiobooks on The New Life Mission website are free
  • Explore multilingual sermons in global languages
  • Two new revised editions in English have been released
  • Check out our website translated into 27 languages
Search

Sermons

అంశం 9: రోమీయులకు ( రోమా పత్రిక పుస్తకం పై నున్న వ్యాఖ్యానం)

[అధ్యాయము 11] ఇశ్రాయేలీయులు రక్షింపబడుదురా?

2021.04.28 1,191
రోమా 11:1 చెప్పుచున్నది, ‘‘ఆలాగైనయెడల నేనడుగునదేమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించెనా? అట్లనరాదు. నేను కూడా ఇశ్రాయేలీయుడను, అబ్రాహామును సంతానమందలి బెన్యామీను గోత్రమునందు పుట్టినవాడను.’’ మరియొక మాటలో దేవుడు ఇశ్రాయేలీయులను వదలివేయలేదు, ఏలయనగా పౌలు కూడా ఒక ఇశ్రాయేలీయుడు.
రోమా 11:2-5లో దేవుడు చెప్పుచున్నాడు, ‘‘తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలియాను గూర్చిన భాగములో లేఖనము చెప్పునది మీరెరుగరా? ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠమును పడగొట్టిరి. నేనొక్కడనే మిగిలియున్నాను. నా ప్రాణమును తీయజూచుచున్నారు అని ఇశ్రాయేలునకు విరోధముగా దేవునియెదుట అతడు వాదించుచున్నాడు. అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలుకు మోకాళ్లూనని యేడువేలమంది పురుషులను నేను శేషముగా నుంచుకొనియున్నాను. అలాగుననే అప్పటి కాలమందు సయితము కృపయొక్క యేర్పాటు చొప్పున శేషము మిగిలియున్నది.’’
యేసునందు విశ్వాసముంచుటచేత చాలామంది ఇశ్రాయేలీయులు ఆయనయొద్దకు వచ్చెదరు అని దేవుడు మనకు చెప్పినట్లుగా, చాలామంది యూదులు వారి పాపములనుండి రక్షించబడుదురు. కాలమునకు అంతము వచ్చినప్పుడు, దేవునినీతియందు విశ్వాసముంచుటచేత మరియు యేసుక్రీస్తు యొద్దకు వచ్చుటచేత ఒక గొప్ప సంఖ్యలో అన్యులు వారి పాపముల నుండి రక్షించబడుదురు.
పౌలు అడుగుచున్నాడు, ‘‘ఏలియాను గూర్చిన భాగములో లేఖనము చెప్పునది మీరెరుగరా?’’ ఇక్కడ పౌలు చివరికి చాలామంది ఇశ్రాయేలీయులు వారి పాపమును తీసుకొనిపోవు దేవునినీతియందు విశ్వాసముంచుదురను వాస్తవమును సూచించు చున్నాడు. ఏలియాతో చెప్పబడిన దేవుని మాటతో, ఇశ్రాయేలీయులలో అనేకులు యేసుక్రీస్తును వారి రక్షకునిగా అంగీకరించుదురని లేఖనము చెప్పుచున్నది. ఈ వాక్యమునందు మేము విశ్వాసముంచియున్నాము.
లేఖనములో, ‘‘7’’ అను అంకె పూర్ణతకు చిహ్నముగా వుంది. దేవుడు ఆరు దినములలో ఈ లోకమును సృజించి ఏడవ దినమున విశ్రమించెను. బయలు దేవతకు మోకాళ్ళూనని ఏడువేలమంది ప్రజలను శేషముగా నుంచుకొందునని దేవుడు ప్రమాణము చేసాడు. దీని భావము యేసుక్రీస్తును వారి రక్షకునిగా అంగీకరించుటచేత వారి పాపముల నుండి రక్షణను పొందువారు చాలామంది వుందురు.
ఇశ్రాయేలీయులకు మరియు అన్యులకు గల సంబంధమును గురించి వివరించుటలో, ఇశ్రాయేలీయులలో చాలామంది రక్షింపబడుదురని పౌలు విశ్వసించెను.
 

వారు పడిపోవునట్లు తొట్రిల్లిరా?
 
రోమా 11:6`12లో పౌలు చెప్పుచున్నాడు. ఒకవేళ ఇశ్రాయేలీయులు మొత్తముగా యేసు వారి రక్షకుడు అను వాస్తవమును అంగీకరించినట్లయితే, అన్యుల రక్షణ అనునది వుండేది కాదు. ఇశ్రాయేలీయులు యేసును వారి రక్షకునిగా అంగీకరించినందున, అన్యుల నీరు మరియు ఆత్మ సువార్త ద్వారా రక్షించబడు ఒక అవకాశమునకు దేవుడు అనుమతించెను. దీనిచేత, యేసునందు విశ్వాసముంచి ఆయన కుమారులుగా మారిన అన్యులను చూచి ఇశ్రాయేలీయులు రోషపడవలెనని దేవుడు అనుకొన్నాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు యేసుక్రీస్తును వారి రక్షకునిగా అంగీకరించుటకు ప్రారంభించుదురు చివరికి యేసుక్రీస్తు నిజముగా వారి మెస్సీయా అను వాస్తవమును అంగీకరించుదురు.
 

వేరు పరిశుద్ధమైనది ఆ విధముగా కొమ్మలును పరిశుద్ధములే
 
రోమా 11:13 వ్యాఖ్యానించుచున్నది, ‘‘అన్యజనులగు మీతో నేను మాటలాడు చున్నాను. నేను అన్యజనులకు అపోస్తలుడనైయున్నాను గనుక ఏవిధముననైనను నా రక్త సంబందులకు రోషము పుట్టించి; వారిలో కొందరిననూ రక్షింపవలెనని నా పరిచర్యను ఘనపరచు చున్నాను.’’ అన్యజనులకు అపోస్తులుడుగా పౌలు తన పరిచర్యను ఘనపరచుచున్నానని చెప్పెను. అతడు తన సొంత రక్త సంబంధులును అన్యులు తిరిగి జన్మించుటను బట్టి వారికి రోషము కలిగించుటచేత రక్షించవలెనని అతడు కోరుకున్నాడు.
‘‘వారిని విసర్జించుట, లోకమును దేవునితో సమాధానపరచుట అయిన యెడల, వారిని చేర్చుకొనుట ఏమగును? మృతులు సజీవులైనట్లే అగును గదా? ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలును పరిశుద్ధములే.’’ (రోమా 11:15-16) ఈ వాక్యభాగము యొక్క అర్థము, ఇశ్రాయేలీయుల వేరు అయిన అబ్రాహాము ఆయన వాక్యమునందు విశ్వాసముంచుటచేత దేవుని నీతిని సంపాదించుకొని రక్షించబడినట్లయితే, అప్పుడు అబ్రాహాము కొమ్మలైన ఇశ్రాయేలీయులు కూడా రక్షించబడుదురు.
అదే సమయములో, అన్యులలో నుండి రక్షించబడిన తిరిగి జన్మించినవారు అడవి ఒలీవ చెట్టుకొమ్మ నుండి విరిచివేయబడి ఒలీవచెట్టుకు అంటుకట్టబడి నూతన జీవమైన వారు దేవుని పరిశుద్ధ జనమైనందునకు అతిశయపడకూడదని వారిని హెచ్చరించాడు. రోమా 11:18 చెప్పుచున్నట్లుగా, ‘‘ఆ కొమ్మలపైన నీవు అతిశయించకుము, నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించున్నదిగాని నీవు వేరును భరించుటలేదు.’’
దేవుని నీతియందు విశ్వాసముంచుటచేత మనము రక్షించబడియున్నాము. అయితే మనము దేవుని నీతిని వదలివేసినట్లయితే, మనము కూడా వదలివేయబడుదుము. మనము ఇది చేయలేముఎందుకనగా యేసుక్రీస్తు మనలను మన పాపములనుండి రక్షించుటకు దేవుని నీతియంతటిని నెరవేర్చెను. మరియు మనము నిజముగా మన పాపములన్నిటినుండి రక్షించబడియున్నాము గనుక. దేవుని పూర్ణ నీతియందున్న మన విశ్వాసముచేత మనము రక్షించబడియున్నాము గాని, మన సొంత క్రియలను బట్టి కాదు. అన్యులమైన మనము ఆయన నీతియందున్న మన విశ్వాసముచేత, విరిచి వేయబడిన కొమ్మలస్థానములో ప్రతిక్షేపించబడుటచేత ఆయన ప్రజలమయ్యాము.
 

మనము దేవుని నీతియందు విశ్వాసముంచుచున్నందున మనము ధృడముగా నిలిచియుండగలము.
 
కావున దేవుని నీతియందు విశ్వాసముంచుటచేత, క్రైస్తవులు మరియు యూదులు ఇద్దరు ఆయన ప్రజలుగా క్రీస్తులోనికి అంటుకట్టబడియున్నాము. దేవునినీతియందు మనము విశ్వాసముంచనియెడల, మన పాపములను బట్టి ఆయన న్యాయమైన తీర్పుననుసరించి నిశ్చయముగా చనిపోవుదుము. దీని విషయములో పౌలు మొదట ఇశ్రాయేలీయులను హెచ్చరించెను. అయితే ఆ హెచ్చరిక నుండి మనము మినహాయించబడలేదు.
దేవుడు అన్యులమైన మన మీద జాలిగొనెను, ఆయన నీతితో మనలను పూర్తిగా రక్షించెను. దేవునినీతిని తెలుసుకొని దీనియందు విశ్వాసముంచినవారు వారి పాపములన్నిటి నుండి రక్షించబడియున్నారు. నేటి క్రైస్తవులు వారు యేసునందు విశ్వాసముంచుచున్నారని ఒప్పుకొనుచున్నప్పటికి, వారిని పూర్తిగా రక్షించిన దేవునినీతియందు విశ్వాసముంచనట్లయితే వారు నాశనములో వుండబడుదురు.
రోమా 11:23-24 వరకు చెప్పుచున్నది. ‘‘వారును తమ అవిశ్వాసములో నిలువకపోయినయెడల అంటుకట్టబడుదురు; దేవుడు వారిని మరల అంటుకట్టుటకు శక్తిగలవాడు. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవచెట్టునుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలీవచెట్టున అంటుకట్టబడినయెడల స్వాభావికమైన కొమ్మలగువారు మరి నిశ్చయముగా తమ సొంత ఒలీవ చెట్టున అంటుకట్టబడరా?’’ మరియొక మాటలో, దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన నీతియందు విశ్వాసము కలిగియుండునట్లు నడిపించుటకు శక్తిగలవాడు. ఆ శక్తి నీరు మరియు ఆత్మ సువార్త ద్వారా దేవునినీతియందు వాగ్ధానము చేయబడెను.
ఇశ్రాయేలీయులకు మరియు అన్యులకు, వారి కార్యములు దేవుని పిల్లలుగా మారుటకు వారిని నడిపించలేదు. దీనికి బదులుగా ఆయన నీతియందు మరియు ఆయన ప్రజలుగా వారిని చేయుదుననిన ఆయన వాగ్ధానమునందు విశ్వాసముంచుటచేత వారు దేవుని కుమారులుగా మారగలరు. దేవునినీతి పూర్తిగా ధర్మశాస్త్రము యొక్క నీతికి వేరుగా బయలుపరచబడినది. దేవునినీతిద్వారా, లోకములోనున్న ఇశ్రాయేలీయులు మరియు అన్యులు ఇద్దరు వారి విశ్వాసముచేత రక్షించబడుదురు. మన చేత వ్యాపించబడుచున్న సువార్తద్వారా నెరవేర్చబడు దేవుని గొప్ప రక్షణా దీవెన ఇది. ఈ శక్తి ఆయననీతియందు చేయబడిన ఆయన విశ్వాసము యొక్క వాగ్ధానము.
రోమా 11:26-27 వరకు చూద్దాము.
‘‘విమోచకుడు సీయోనులో నుండి వచ్చి
యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును
నేను వారి పాపములను పరిహరించినప్పుడు
నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే
అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరును రక్షించబడుదురు.’’
కాలము అంతమగునప్పుడు చివరికి ఆయన ఇశ్రాయేలీయులను రక్షించునని దేవుడు ప్రమాణము చేసెను. అదే విధముగా, యేసుక్రీస్తును వారి రక్షకునిగా విశ్వసించువారిగా చేయుటకు, ఇశ్రాయేలీయుల మనస్సులో నుండి మలినమును చెడును తొలగించుదునని దేవుడే ప్రమాణము చేసెను. వారు విశ్వాసపాత్రులైన పితరులను కలిగియున్నప్పటికి, ఇశ్రాయేలీయులు వారే రక్షణను పొందలేదు. అయితే దేవుడు వారి హృదయమును స్పర్శించుటచేత వారిని ఆయన నీతియందు విశ్వాసముంచువారిగా చేయుట చేత సమీప భవిష్యత్తులో వారిని రక్షించుటకు దేవుడు ఇచ్ఛయించాడు.
 

అందరియెడల కృప కరుణ చూపవలెనని, దేవుడు అందరిని అవిధేయతా స్థితిలో మూసివేసి బంధించియున్నాడు

మనము సమృద్ధియైన, 32వ వచనమును చదువుదాం. ‘‘అందరియెడల కృప కరుణ చూపవలెనని, దేవుడు అందరిని అవిధేయతా స్థితిలో మూసివేసి బంధించియున్నాడు.’’ ప్రతి ఒక్కడు దేవునికి విరోధముగా తిరుగబడియున్నాడు. ఎవడును పూర్తిగా ఆయనకు విధేయత చూపుటలేదు. అయితే దేవుడు మనలను అవిధేయతా స్థితిలో వుంచుటకు కారణమేమనగా, దీనిని బట్టి ఆయన మనకు కరుణను మరియు ప్రేమను ఇవ్వగలడు. ఇది నిజముగా ఒక ఆశ్చర్యకరమైన అత్యద్భుతమైన సత్యము.
ఈ వాక్యభాగము ద్వారా, దేవుడు ఎందుకు మానవులను అవిధేయతా స్థితిలో మూసివేసి బంధించాడో, మనము అర్ధము చేసుకొనగలము. ఆయన సంకల్పము ఎంత ఆశ్చర్యకరమైనది! ఆయన పరిపూర్ణ నీతిలో మరియు కరుణాయుతమైన ప్రేమలో వస్త్రము ధరింపజేయుటకు దేవుడు మనలను అవిధేయతా స్థితిలో వుంచెను. ఆయన ఆశ్చర్యకరమైన సంకల్పమును బట్టి ఆయనయందు మనము కేవలము విశ్వాసముంచి వందనములు మాత్రమే చెల్లించగలము. దేవుడు చివరికి ఇశ్రాయేలీయులను సయితము కృప కరుణ చూపవలెనని, అవిధేయతా స్థితిలో మూసివేసి బంధించియున్నాడు. చాలామంది అన్య క్రైస్తవులు సొమ్ము చేసుకొనుటకు ఆయనను ఉపయోగించుకొనుచుండగా, ఇశ్రాయేలీయులు ఇప్పటికీ యేసును చిన్న చూపు చేస్తారు. నజరేతు నుండి తక్కువ జీవనము నుండి వచ్చినవాడుగా పరిగణిస్తారు.
దేవుని కరుణాయుతమైన ప్రేమకు అవిధేయులైనవారిని నరకమునకు పంపుట తప్ప మరియొక అవకాశము లేదు. దేవుడు ఇప్పటికే మండుచున్న నరకమును వారి కొరకు సిద్దపరిచాడు. అయితే ఆయన వారిపై బహుగా జాలిపడినందువలన, ప్రజలు నరకమునకు వెళ్ళుటను భరించలేక పోవుచున్నాడు. ‘‘నేను నిన్ను ఏ విధముగా నరకమునకు పంపగలను?’’ పూర్తి సంఖ్యలో అన్యులు ఆయన రక్షణలోనికి వచ్చినప్పుడు, ఏడేండ్ల శ్రమలలో చివరి సగము కాలములో క్రీస్తు విరోధి వారిని హింసించుచున్నప్పుడు, చాలామంది క్రైస్తవులు యేసును వారి రక్షకునిగా అంగీకరిస్తారు. భవిష్యత్తులో, ఇశ్రాయేలీయులలో నుండి యేసును దేవుని నీతిగా ఒప్పుకొను లెక్కించలేనంత మంది విశ్వాసులు ఇశ్రాయేలీయులలో నుండి లేస్తారు.
‘‘అందరియెడల కృప కరుణ చూపవలెనని, దేవుడు అందరిని అవిధేయతా స్థితిలో మూసివేసి బంధించియున్నాడు’’ ఈ అద్భుతమైన వాక్య భాగము దేవుడు ఆయన నీతియందు విశ్వాసముంచుటచేత పాపులనందరిని రక్షించుటకు అనుమతించెనని వివరించుచున్నది.
మహాశ్రమల కాలములో తగిన సంఖ్యలో అన్యులు హతసాక్షులుగా మారినప్పుడు ఆయన ఇశ్రాయేలీయులను పశ్చాత్తాపపడునట్లుగా చేసి క్రీస్తునందు విశ్వాసముంచువారిగా చేయుదునని పౌలుతో దేవుడు చెప్పెను. రోమా 11:33లో పౌలు చెప్పుచున్నట్లుగా, ‘‘ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయనతీర్పులు శోధింప నెంతో అవశ్యము ఆయన మార్గములెంతో అగమ్యము!’’
నిజమైన జ్ఞానము మరియు దైవ సంకల్పము అనునవి దేవుని నుండి వచ్చును. ఆది నుండి ఆయన మానవులనందరిని అసంపూర్ణులుగా చేసియున్నాడు. ఇది మనలను దేవుని రక్షణను స్వీకరించువారిగా చేయును దేవుని జ్ఞానమును చూపించుచున్నది. దీని వలన, కడవరి దినములలో ఆయనయందు విశ్వాసముంచుట చివరికి ఇశ్రాయేలీయులను కూడా రక్షించును. మనమందరము అగ్ని గుండములోనికి నాశనములోనికి నెట్టివేయబడుట తప్ప మరియొక అవకాశము లేదు, అయితే దేవుడు ఆయన ప్రణాళిక వేయబడి విజయవంతముగా నెరవేర్చబడిన ఆయన నీతితో మన పాపములన్నిటి నుండి మనలను రక్షించెను. మానవజాతి అంతా సాతాను చేత శోధించబడి దేవుని ధర్మశాస్త్రమును మీరుట చేత పాపులుగా మారినప్పుడు, పాత నిబంధనలోని బలుల విధానము ప్రకారము పాపులందరు యేసు బాప్తిస్మము మరియు రక్తముచేత రక్షించబడవలెనని దేవుడు ఇచ్ఛయించును.
అప్పుడు, ఏ విధముగా, ఒకడు దేవుని జ్ఞానమునకు విరోధముగా నిలువగలడు? ‘‘ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగినవి. ఆమెన్‌.’’ఆయన కరుణను మనకిచ్చుటకు మనలను అవిధేయతా స్థితిలో మూసివేసి బంధించియుంచెనను ఈ సత్యమును గ్రహించగలిగినవాడు ఎవడు? దేవుడు ఆ విధముగా చేయుట తప్పు అని చెప్పగల ధైర్యముగలవాడు ఎవడు? ఎవ్వడును లేడు! దైవిక సంకల్పము మరియు మహిమ అంతయు యుగయుగములు ఆయనకే చెల్లును.
అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మతో నింపబడుటచేత, ‘‘ప్రభువు మనస్సును ఎరిగినవాడు ఎవడు? ఆయనకు ఆలోచన చెప్పినవాడు ఎవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగియున్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమెన్‌.’’ (రోమా 11:34-36)
మనము పూర్తిగా తప్పిదముతో నిండియున్ననూ, దేవునినీతి సువార్తను బోధించుటకు మనము జీవించుచున్నాము. ఈ దేవుని నీతి సువార్తకు విరోధముగా నిలుచువారందరు ఆయనకు విరోధులు. అది నిజము! అటువంటి ప్రజలు మనలో నుండి సహితము లేస్తారు. అందువలన మనలో ఎవడును అటువంటి శోధనలో పడకుండా మనము ప్రార్థన చేయవలెను. ఎటువంటి పరిస్థితిలో కూడా ఎన్నడును ఈ సువార్తకు విరోధముగా మనము నిలువరాదు. అవిశ్వాస హృదయముతో మనమెన్నడును నీరు మరియు ఆత్మ సువార్తకు విరోధముగా తిరుగరాదు. ఈ సువార్తకు విరోధముగా నిలిచినారా ఈ ప్రపంచములోని రాబోవు లోకములోను నశింపజేయబడుదురు.
ఇశ్రాయేలీయులు యేసునందు విశ్వాసముంచు కాలము దగ్గరగా వుంది. ఈ భూమిమీద ఆరు బిలియన్లు ప్రజలు దేవుని యొద్దకు తిరిగి వచ్చి రక్షణను స్వీకరించుట ఎంత అద్భుతము? దేవునినీతియందు విశ్వాసముంచిన నీతిమంతులు, ప్రస్తుత పరిస్థితులనే చూడకూడదు. అయితే దేవుడు ఇశ్రాయేలీయుల కొరకు వేసిన ప్రణాళికను చూసి క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలోనికి వారు ప్రవేశించునట్లు విశ్వాసమును సిద్దపరచాలి. నీతిమంతులు ఎల్లప్పుడు విశ్వాసము మరియు నిరీక్షణతో జీవించవలెను.
నేను దేవునికి వందనములు చెల్లించుచున్నాను. ఏలయనగా యేసుక్రీస్తును వారి రక్షకునిగా ఇశ్రాయేలీయులు అంగీకరించు రోజు సమీపములోనే వున్నదని నాకు తెలుసు.
ప్రభువైన యేసు, త్వరగా రమ్ము!