రోమా 13:1 వ్యాఖ్యానించుచున్నది, ‘‘ప్రతివాడును పై అధికారులకు లోబడి యుండవలెను; ఏలయగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి యున్నవి.’’
మనము తప్పక సామాజిక నియమావళి హద్దులలో జీవించాలి. మన ఆత్మీయ జీవితములో మరియు శరీరరీత్యా అధికారము కలిగినవారికి భయపడి వారిని గౌరవించవలెనని దేవుడు మనకు ఆజ్ఞనిచ్చెను. దేవుడు ఒక కారణమును బట్టి ప్రభుత్వ అధికారులకు అధికారమును ఇస్తాడు, కావున మనము వారిని నిర్లక్ష్యము చేయరాదు. పౌలు చెప్పుచున్నదానిని మనము జ్ఞాపకము చేసుకొనవలెను. ‘‘ఒకనినొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియు ఎవనికిని అచ్చియుండవద్దు.’’ (రోమా 13:8)
ఇందువలననే మేము ఉచిత పుస్తకమును ముద్రించుచున్నాము మరియు ఈ రమ్యమైన పుస్తకమును ప్రపంచమంతటా ప్రజలందరికి పంపిణీ చేయుచున్నాము.
ప్రభువు చెప్పెను, ‘‘ప్రేమించుట ధర్మశాస్త్రమును నెరవేర్చుట’’. ప్రజలు వారి మతపరమైన జీవితములో నమ్మకముగా ధర్మశాస్త్రమును పాటించుచున్నారని భ్రమతో నింపబడియున్నారు.
మనలను పాపము నుండి రక్షించుటకు ఆయన నీతిని ప్రత్యక్షపరచు నీరు మరియు ఆత్మ సువార్తను దేవుడు మనకిచ్చెను. నీరు మరియు ఆత్మలో చూపబడిన, దేవునినీతియందు విశ్వాసముంచవలసిన అవసరము మనకున్నది.
ప్రభువు మనకిచ్చిన ఈ రమ్యమైన సువార్తను వ్యాప్తిచేయుట అనునది ఇది ప్రజలను వారి పాపములన్నిటి నుండి రక్షించుచున్నందున ఇతరులకు నిజముగా జీవితమునిచ్చుటయే. యేసుక్రీస్తు ప్రేమచేత మనము పొందిన ప్రేమ ఋణము తప్ప, మనకిక ఏ ఋణము వుండరాదు.
ఇది మనకు నిద్ర మేల్కొను సమయము
11వ వచనము చెప్పుచున్నది, ‘‘మరియు మీరు కాలము నెరిగి, నిద్ర మేలుకొను వేళయైనదని తెలిసికొని, ఆలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటె ఇప్పుడు, రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది.’’ మన అల్పమైన దేహము మార్పుచెందినప్పుడు మనము క్రీస్తుతో ఒక వెయ్యి సంవత్సరములు పాలిస్తాము. అదెప్పుడంటే, మన దేహము కూడా విమోచించబడినప్పుడు.
మన తరము వారికిని మరియు నోవహు తరము వారికి మధ్య సారూప్యమును మనము చూడగలము. విశ్వవిద్యాలయములో స్వలింగ సంపర్కులు అను ఒక నూతన తరంగము ఉదృతమైనది. రొక్కము కట్టే ఫోనును కేవలము ఎక్కువ కాలము ఉపయోగించుకున్నాడని ఒక మనిషిని మరియొక మనిషి చంపుచున్నప్పుడు ఈ లోకము ఎంత దుర్మార్గముగా వున్నది? అటువంటి క్రూరమైన దుష్ట కార్యము ఈ తరమునందు జరుగుచున్నవి.
మనము నిద్ర మేల్కొను సమయము ఇదేనని మనము తప్పక గ్రహించవలెను. మన ప్రభువు రెండవ రాకడ కాలము అతి సమీపముగా వున్నది. ఇది ఏ కాలమువలె వున్నది అని శ్రద్ధగా గ్రహించగలిగియుండాలి, మరియు ప్రభువు రాకడ అతి సమీపముగా వున్నదని గ్రహించాలి. అయితే అదే సమయములో, ఈ కాలమును గురించి వాస్తవమును ఎరుగని ప్రజలు అనేకులున్నారని మనము గుర్తించుకోవాలి.
‘‘నోవహు దినములు ఏలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును ఆలాగే వుండును’’ (మత్తయి 24:37) నోవాహు కాలములోకూడా, ప్రజలు ఇండ్లు కట్టుకున్నారు. పెండ్లి చేసుకున్నారు. అన్నిరకములైన పాపములు చేసారు. ఒక దినమున దేవుని తీర్పువారిపై ఆకస్మాత్తుగా కుమ్మరించబడు దినము వరకు వారి అనుదిన వ్యాపారమునకు వారు వెళ్లారు. నోవాహు ఓడలో ఆశ్రయము పొందిన కొద్దిమంది తప్ప అందరు తుడిచిపెట్టుకు పోవు కుండపోత వర్షము మరియు వరద వచ్చునని నోవాహు తప్ప మరి ఎవరూ ఊహించలేదు. ఊహించక స్వేచ్ఛగా తినుచూ త్రాగుచూ వున్నవారు దేవుని భయంకరమైన తీర్పును ఎదుర్కొని నశించారు.
ఈ లోకము యుద్ధ అపాయముకే కాదు, వాతావరణము మార్పువలన ప్రపంచమంతటా సంభవించుచున్న విపరీతమైన ప్రకృతి సహజమైన వినాశనముకు గురియగుచున్నది. మనము తినుచున్న దానిలో కూడా ఒక ప్రమాదకరమైన అపాయము అనుమానస్పదముగా కదలాడుచు వుంటుంది. మనము ఎంతో కాలము మన సొంత భోజనమును వాటి గురించి ఆందోళన చెందకుండా తినలేము. ఇందువలననే ఈ యుగములో మనము జ్ఞానముతో బ్రదకవలెను. మనము మొదట విశ్వసించినప్పటికంటే మన దేహముకు రక్షణ సమీపములోనే వున్నదని మనము గుర్తించుకొనవలెను.
క్రీస్తు రక్షణతో నీకుగా నీవు వస్త్రమును ధరించుకొన్నావా?
ఈ లోకము నాశనమగుట అనుదానికి విశ్వాస ప్రపంచముతో సంబంధమేమీ వుండదని నీవనుకోవచ్చు. అయితే దీనికి లౌకిక రాజకీయాలతో మరియు ఆర్థిక విషయాలతోనే ప్రతిదీ చేయవలసివుంది. అయితే భూగోళమంతటా వున్న వినాశనము లోక అంతమును గురించి ప్రమాద చిహ్నముగా వున్నాయి. ఈ లోకము త్వరలో ఆర్థిక మరియు పర్యావరణ కష్టమును విపరీతముగా ఎదుర్కొనబోతూ వుంది. బైబిల్ మనకు చెప్పుచున్నది ప్రభువు రాకడ మనకు సమీపమగుచున్నకొలదీ, మనము తప్పక ‘‘ప్రేమ కలిగియుండుట విషయములో తప్ప మరి దేని విషయములో ఒకనికి ఒకడు అచ్చివుండవద్దు’’ సహాయము చేయుట, కాపాడుట, నడిపించుట, ప్రేమలో ఒకరితో ఒకరు సహకరించుకొనుట. మనము మొదట విశ్వసించినప్పటికంటే మన నిరీక్షణ దగ్గరగా వున్నదని మనము గ్రహించవలెను.
మనము నిరీక్షణతో జీవించవలసిన శకములో యేసుక్రీస్తు తిరిగి వచ్చుట కొరకు ఎదురుచూస్తూ మనము జీవించుచున్నాము.
మన నిరీక్షణ ఎక్కడ వున్నది? ఏడేండ్ల మహా శ్రమచేత ముందుకు సాగి, మనలను పునరుత్థానులుగా చేసి ఆయనతో వెయ్యి సంవత్సరములు పాలించు బహుమానమును ఇచ్చు క్రీస్తు తిరిగి వచ్చుట కొరకు ఎదురు చూచుటలో మన నిరీక్షణ కనుగొనబడినది. సమయము సమీపించుచున్న కొలది, దేవునినీతిని కలిగియుండటచేత, మన తప్పక నిరీక్షణతో జీవించవలెను. మనము తప్పక ధృఢముగా నీరు మరియు ఆత్మ సువార్తయందు నిలచి, దీనిని మన పూర్ణహృదయముతో సేవించవలెను. ప్రపంచవ్యాప్తముగా ప్రతి ఆత్మకు ఈ సువార్తను పంచుటకు మన పరిచర్యను విశాలపరచవలెను.
మనము ఒకరి నొకరము ప్రేమించుటలో తప్ప దేనిలోని అచ్చియుండకూడదు.
భూకంపాలు, అగ్ని పర్వతముల వంటి ప్రకృతి వినాశనము నుండి ఎక్కువ వేదన వుంటుందని నాకు తెలుసు. భూగోళ నాశనమును గురించి చాలా సినిమాలు ఈ దినములలో తీయబడుచున్నవి. హాలీవుడ్ రచయితలు ఊహించునట్లుగా సాధ్యమైనంతవరకు ఈ లోకము మారినందున, ప్రజలు వారికి తెలియకుండానే ఇప్పుడే లోకమునకు అంతము వచ్చినదని భావించుచున్నారని నేననుకుంటున్నాను.
కావున, మనము మన శరీర కార్యములతో మనలను మనము చూచుకొనకూడదు, అయితే ఆత్మకార్యములయందు మాత్రమే శ్రద్ధ కలిగియుండవలెను.
నీరు మరియు ఆత్మ సువార్తను వ్యాప్తిచేయు జీవితము ఒక రమ్యమైన జీవితమని మనము తప్పక విశ్వసించాలి. ప్రపంచమంతటా ప్రజలు మన పరిచర్యను చూచి అబ్బురపడుచున్నారు. మన పరిచర్యద్వారా అసంఖ్యాకమైన ప్రజలు సవాలుకు గురైనామని మాకు చెప్పారు. కొరియాలో వున్న దేవుని సేవకుల సమూహము, ఒక చిన్న దేశము, దేవునినీతిని ఇంత శక్తివంతముగా ఎలా వ్యాప్తి చేయగలుగుచున్నారో వారు విశ్వసించలేక పోవుచున్నారు. అవును, మేము నిజముగా చిన్నవారము మరియు బలహీనులము, అయితే మేము ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తముగా సువార్తను వ్యాప్తి చేయుచున్నాము. ఎందుకనగా మేము నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచుచున్నాము అనగా, దేవుని నీతియందు విశ్వాసముంచుచున్నాము.
రోమా 14:8 చెప్పుచున్నది, ‘‘మనము బ్రదికినను ప్రభువు కోసమే బ్రదుకుచున్నాము; చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవుచున్నాము. కాబట్టి మనము బ్రదికినను చనిపోయినను ప్రభువు వారమైయున్నాము.’’ దీనికి ముందున్న వచనములో పౌలు ఇదికూడా చెప్పుచున్నాడు, ‘‘మనలో ఎవడును తన కోసమే బ్రదుకడు, ఎవడును తన కోసమే చనిపోడు.’’ మన ప్రభువు కొరకు మాత్రమే మనము ఉనికిలో వున్నాము.
మన ప్రభువు చేత మనము ఈ లోకములో జన్మించినందున, ఆయన నీతిచేత నీతిమంతులుగా మారినందున, మనము చనిపోయినను బ్రదికినను క్రీస్తుకు చెందినవారము. క్రీస్తు జీవించినట్లుగా, మనము దేవుని నీతి కొరకు మన జీవితమును జీవించి ఈలోకమును విడిచిపెట్టుదుము. దేవుడు మనలను బట్టి సంతోషించెను, మనలను ఆనందకరమైన వార్తను లోకమంతటా వ్యాపింపచేయుటకు ఆయన సాధనముగా ఉపయోగించుటకు ఎన్నుకొనెను. ఆ విధముగా ఆయన మన కొరకు గొప్ప సువార్త ద్వారమును తెరిచాడు. వాస్తవముగా ప్రతిదేశములో అడుగుపెట్టి సువార్తను వ్యాపింపజేయుట చేతకాక, పుస్తకము ద్వారా సువార్తను వ్యాప్తి చేయుటకు ఆయన అనుమతించెను.
దేవునినీతిని కలిగివున్న పుస్తక ప్రచురణలు అనువదించబడి ఇంగ్లీషు మాట్లాడు ప్రపంచమునకు పంపబడినవి, స్పానిష్ మాట్లాడు దేశముకు, ఆసియాలోవున్న ప్రతి దేశమునకు, ఆఫ్రికా, మరియు యూరప్ దేశములకు పంపబడినవి. దేవునినీతియగు మన ప్రభువు అని పేరు పెట్టబడిన ఈ నూతన ప్రచురణలు ప్రపంచములోనున్న ప్రతి ఆత్మకు గొప్ప ఆత్మీయ దీవెనలు ఇచ్చునని నేను నిశ్చయతను కలిగియున్నాను.
ఈ ప్రపంచము చివరికి ఈ రమ్యమైన సువార్తచేత నింపబడుతుంది. ఒక్కసారి ఈ దేవునినీతి కలిగియున్న సువార్త ప్రపంచమంతటా వ్యాపించినట్లయితే, దేవుడు మనకొరకు దాచియుంచిన ప్రతి ప్రణాళికను నెరవేరుస్తాడు.
ఈ శకము గాలిదుమారముల మీదున్నది. ఇంధన సమస్య, భూగోళ ఆర్థిక బాధ, ఈ ప్రపంచమును మరియొకసారి కొట్టవచ్చు. మనము దేనికి నియమించబడియున్నామో దాని విషయములో మనము మరింత విశ్వాసపాత్రులుగా వుండాలి. ఈ ప్రపంచ అంతము వరకు మనము తప్పక నీరు మరియు ఆత్మ సువార్తనువ్యాప్తి చేయవలెను. ప్రపంచములో ఈ సువార్తను వినకుండా ఎవడును విడువబడకుండా వుండునట్లుగా మనము కష్టపడి నీరు మరియు ఆత్మ సువార్తను వ్యాప్తి చేద్దాం. మనము తప్పక ఇదే ఉద్దేశ్యము కొరకు సహకరించుకుందాము. మనము తప్పక గిడియోను మూడువందల యోధులవలె పనిచేయవలెను. మనము సంఖ్యలో కొద్దివారముగా వున్నప్పటికి, మనము పరలోకము యొక్కధైర్యముగ సైనికులము, మరియు దేవుడు మనతో వున్నాడు.
పాపము క్షమాపణను పొందినవాడు ఎవడైనను మరియు దేవునికి వందనములు చెల్లించువాడు దేవుని నీతి వ్యాప్తి చేయుటకు యోగ్యునిగా కాగలడు. విశ్వాసముచేత మనము విజయము ఎందుకనగా మనము దేవునినీతిని కలిగియున్నాము. ఈ దేవునినీతియందు విశ్వాసముంచువారు ఆత్మ కార్యములను వెంటాడదురు మరియు వారి లక్ష్యమును ఆత్మకార్యములపై వుంచుదురు.
దేవుని నీతి మీపైన వుండునట్లు నేను ప్రార్థించుచున్నాను.