• All e-books and audiobooks on The New Life Mission website are free
  • Explore multilingual sermons in global languages
  • Two new revised editions in English have been released
  • Check out our website translated into 27 languages
Search

Sermons

అంశం 9: రోమీయులకు ( రోమా పత్రిక పుస్తకం పై నున్న వ్యాఖ్యానం)

[అధ్యాయము 14] ఒకనికొకరు తీర్పు తీర్చుకొనకుడి

2021.04.28 937
రోమా 14:1 వ్యాఖ్యానించుచున్నది. ‘‘విశ్వాసము విషయమై బలహీనుడైనవానిని చేర్చుకొనుడి, అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు.’’
ఒకని విశ్వాసమును ఒకడు విమర్శించుకొనవద్దని లేక తీర్పు తీర్చవద్దని పౌలు రోమాలో వున్న పరిశుద్ధులను హెచ్చరించాడు. ఆ సమయమందు, రోమాలో ఎంతో విశ్వాసముగా, విశ్వాసము లేకుండా వున్న వారు సంఘములో వున్నందున, వారు ఒకరి విశ్వాసమును మరియొకరు విమర్శించుకోవడం మొదలు పెట్టారు. ఒకవేళ ఇది నీకు సంభవించినట్లయితే, మీరు తప్పక ఒకరి విశ్వాసమును ఒకరు గౌరవించుకొనవలెను దేవుని సేవకులకు విరోధముగా నున్న విమర్శలను దూరము చేయవలెను. ఆయన సేవకులను లేపుట అనునది దేవునికి సంబంధించినది మనకు చెందినది కాదు.
చివరికి దేవుని సంఘములో కూడా, విశ్వాసుల మధ్యలో అనేక సమస్యలు లేచును. మనము ఒకసారి వారి విశ్వాసమును చూచినట్లయితే, మనము అన్నిరకముల విశ్వాసమును కనుగొంటాం.కొంతమంది విమోచింపబడక మునుపు ధర్మశాస్త్రమునకు లోబడి వుంటారు. ఆ విధముగా వారు ఇప్పటికి వారి పాత ధర్మశాస్త్ర విశ్వాస నీడలను కలిగివుంటారు.
కొంతమంది క్రైస్తవులు ఎంచుకొన్న పదార్థములు భుజించుట విషయములో గొప్ప ప్రాధాన్యతను తీసుకుంటారు. ఉదాహరణకు అటువంటి ప్రజలు పంది మాంసమును తినకూడదు అని విశ్వసించవచ్చు. కొంతమంది ఎటువంటి పరిస్థితులలోను విశ్రాంతిదినమును పాటించవలెను అని విశ్వసించవచ్చు. అయితే ఈ బేధమును దేవునినీతియందున్న మన విశ్వాసముద్వారా పరిష్కరించుకొనవచ్చు. అంతేగాని ఇటువంటి చిన్న విషయములలో ఒకరని ఒకరు విమర్శించుకొనకూడదు. పౌలు మాట్లాడుచున్న సారాంశము ఇది. 
పౌలు 14వ అధ్యాయములో మన సహ విశ్వాసులు దేవునినీతిని కలిగియున్న యెడల వారి బలహీనతను మనము విమర్శించరాదని మనకు బోధించుచున్నాడు. ఎందుకు విమర్శించరాదు? వారు బలహీనులైనప్పటికి, వారు కూడా దేవునినీతియందు విశ్వాసముంచుచున్నారు.
దేవుని నీతియందు విశ్వాసముంచుటచేత వారి పాపముల నుండి విమోచించ బడినవారిని దేవుని ప్రశస్తమైన ప్రజలుగా బైబిల్‌ గౌరవించును. వారు ఒకరికంటికి ఒకరు అసంపూర్ణులుగా అనిపించినప్పటికీ ఇతర విశ్వాసుల విశ్వాసమును విమర్శించునని దేవుడు మనకు ఎన్నడును ఆజ్ఞాపింపలేదు. ఇది ఎందుకంటే శరీరమునందు వారు అసంపూర్ణులైనప్పటికీ, విశ్వాసముచేత వారు ఇప్పటికి దేవుని కుమారులుగా మారారు.
 

ప్రతివాని విశ్వాసము ఒకదానికొకటి భిన్నముగా వుండును
 
2-3వ వచనము వ్యాఖ్యానించుచున్నది. ‘‘ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు; మరియొకడు బలహీనుడైయుండి, కూరగాయలనే తినుచున్నాడు. తినువాడు తిననివాని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు; ఏలయనగా దేవుడతనిని చేర్చుకొనెను.’’
దేవుని సేవకుల మధ్యలో దేవునినీతియందు విశ్వాసముంచుటలోను మరియు ఆయనను వెంబడించుటలో వ్యత్యాసముండగలవు. రక్షణయుందున్న విశ్వాసము ఒక్కటే. ఆయన వాక్యమునందు ఎంత విశ్వాసమున్నది అనుదానిలో బేధముండవచ్చు.
దేవునినీతి సువార్తయందు విశ్వాసముంచుటచేత ఒకడు తిరిగి జన్మించక మునపు ఒకడు ధర్మశాస్త్ర సంబంధిగా ఉన్నట్లయితే, అతడు/ఆమె దేవునినీతియందు విశ్వాసముంచుటచేత అతని/ఆమె విశ్వాసమును పూర్తిగా విడిచిపెట్టుటకు కొంత సమయము అవసరమవ్వవచ్చు. ఈ ప్రజలు విశ్రాంతిదినమును పాటించుటకు ఎంతో మక్కువను చూపిస్తారు. అయితే మీరు వారిని విమర్శించకూడదు ఏలయనగా వారు కూడా దేవునినీతి యందు విశ్వాసముంచారు.
దేవునినీతిని ఎరిగి దానియందు విశ్వాసముంచుటచేత వారి విశ్వాసమును బట్టి దేవుడు సంతోషపడ్డాడు. ఆయన వారిని ఆయన ప్రజలుగా తీసుకున్నాడు. కావున, దేవునినీతియందు నిజముగా విశ్వాసముంచువారు వారి విశ్వాసములోవున్న వారి బలహీనతను బట్టి వారిని విమర్శించుటకు బదులుగా, దేవునినీతితో వారి సహ విశ్వాసులను పోషించుటకు ప్రతి విధమైన కృషిని చేయవలెను.
 

మనము దేవుని సేవకులకు తీర్పుతీర్చరాదు
 
4వ వచనము చెప్పుచున్నది, ‘‘పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిచియుండటయైనను పడియుండుటయైనను అతని సొంత యజమానుని పనియే; అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలబెట్టుటకు శక్తి గలవాడు.’’
మనము తప్పక దేవుడెవరిని సమ్మతించెనో, ఆ దేవుని సేవకులను వారి విశ్వాసముకూడా గుర్తించవలెను. నీకు క్రైస్తవ జీవితమును జీవించుచుండగా దేవుని సేవకులకు తీర్పు తీర్చి వారిని విమర్శించెదవా? అప్పుడు దేవుడు నీ విశ్వాసమును ఇంకా ఎక్కువగా గద్దించును. నీవు దేవుడు సమ్మతించిన దేవుని సేవకుల విశ్వాసమును కేవలము నీకు ఇష్టము లేని కారణముగా నిందించినట్లయితే, ఆయన సేవకులకు తీర్పుతీర్చుట ద్వారా తీర్పు తీర్చు దేవుని సింహాసనమునకు ఎక్కుటకు ప్రాకుచున్నావు. ఇది సరియైనది కాదు. దీనికి బదులుగా, నీకు ఇష్టము లేని ఈ సేవకులను సంతోషముతో చేర్చుకొనవలెను మరియు దేవునినీతిని పైకెత్తుచుండగా వారి నడిపింపునకు విధేయులు కావలెను.
దేవుడు తప్పక మన విశ్వాసమును సమ్మతించును. దేవుని ఆజ్ఞ మరియు ప్రతిఫలమును పొందు నిజమైన విశ్వాసమును మనము కలిగియుండవలెను. మన జీవితమును యేసుక్రీస్తుకు అంకితము చేయుటకు మనలను దేవుడు అనుమతించినందున, ఆయన నీతిని బట్టి మనము ఆయనకు వందనములు చెల్లించవలెను. దేవుడు ఎవరిని సమ్మతించునో వారిని మనము సమ్మతించవలెను. దేవుడెవరిని సమ్మతించడో వారి విషయములో సమ్మతించరాదు. నీవు నీ స్వంత నీతిని పైకెత్తుటకు బదులుగా ఆయన నీతియందు విశ్వాసముంచుటచేత ఆయనను మహిమ పరచెదవని నేనాశించుచున్నాను. దేవుడు నీ విశ్వాసమును సమ్మతించునని ఆశించుచున్నాను. అప్పుడు నీవు ఆయననీతియందున్న నీ విశ్వాసమును బట్టి నీవు లేవనెత్త బడుదువు.
 

వారు కూడా దేవుని నీతియందు విశ్వాసముంచినట్లయితే....
 
‘‘ఒకడు ఒక దినముకంటే మరియొక దినము మంచి దినమని యెంచుచున్నాడు; మరియొకడు ప్రతిదినమును సమానముగా ఎంచుచున్నాడు; ప్రతివాడు తన మట్టుకు తానే తన మనస్సులో రూడి పరచుకొనవలెను. దినమును లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు; తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభువు కోసమే తినుచున్నాడు; తిననివాడు ప్రభువు కోసము తినుట మాని, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు.’’ (రోమా 14:5-6)
యూదులలో క్రీస్తునందు విశ్వాసముంచుటచేత రక్షించబడినవారు ఎవరనగా, నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచినవారు. వారిలో చాలామంది, యేసునందు విశ్వాసముంచినప్పటికి, ఇప్పటికి వారు ధర్మశాస్త్రమునకు లోబడియున్నారు. అయితే వారు అప్పటికే దేవునినీతికి సేవకులు ఎందుకనగా ధర్మశాస్త్రమును పాటించుటకు వారు చేసినదంతా, దేవునినీతిని వ్యాప్తి చేయుటకు వారు చేసారు.
అందువలననే పౌలు చెప్పెను, ‘‘యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదునివలె ఉంటిని, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడినవాడను కాకపోయినను, ధర్మశాస్త్రమునకు లోబడిన వానివలె వుంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడినవాడను, అయినను ధర్మశాస్త్రము లేనివారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రములేనివారికి ధర్మశాస్త్రము లేనివానివలె వుంటిని.’’ (1వ కొరింధి 9:20-21),
దేవుని నీతియందు విశ్వాసముంచువారి విశ్వాసమును మనము నిర్లక్ష్యము చేయకూడదు తృణీకరించకూడదు. వారు దేవునినీతిని విశ్వసించి ఆయనను సేవించుచున్నట్లయితే, మనము వారిని తప్పక దేవుని సేవకులుగా గుర్తించాలి.
 

నీతిమంతులు ప్రభువు కొరకు జీవించవలెను.
 
7-9 వచనము వ్యాఖ్యానించుచున్నవి. ‘‘మనలో ఎవడును తన కోసమే బ్రదుకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రదికినను ప్రభువు కోసమే బ్రదుకుచున్నాము; చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవుచున్నాము. కాబట్టి మనము బ్రదికినను చనిపోయినను ప్రభువువారమైయున్నాము, తాను మృతులకును సజీవులకును ప్రభువైయుండుటకు ఇందు నిమిత్తమే గదా క్రీస్తు చనిపోయి మరల బ్రదికెను?’’
మనము ప్రభువుతో జీవించుదుము క్రీస్తుతో చనిపోవుదుము ఎందుకనగా ఈ సువార్తయందు ప్రత్యక్షపరచబడిన దేవుని నీతియందు విశ్వాసముంచుటచేత మనము మన అన్ని పాపములనుండి రక్షించబడియున్నాము మరియు నూతన జీవితమును పొందియున్నాము. క్రీస్తునందు పాతవి గతించెను సమస్తమును క్రొత్తవాయెను. దేవునినీతియందు నిజముగా విశ్వాసముంచుట అనగా నీవు క్రీస్తుకు చెందినవాడవు అను సత్యమును తెలు సుకొనిదీనియందు విశ్వాసముంచుట. ఆ విధముగా దేవునినీతియందు విశ్వాసముంచిన వారికి ఈ లోకముతో ఏ పనిలేదు గాని దీనికి బదులుగా వారు దేవుని సేవకులుగా మారుదురు.
నీవు దేవుని సేవకునిగా మారియున్నట్లయితే, ఆయనను నీవు పైకి లెవనెత్తుదువు, ఆయనను ప్రేమించుదువు, ఆయన మహిమ కొరకు జీవించుదువు, నీవు ఈ విధముగా జీవించుటకు నీవు అనుమతించబడినందుకు కృతజ్ఞత కలిగియుందువు.
నీవు నిజముగా క్రీస్తుకు చెందినవాడవా? నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచినవారు క్రీస్తుతో కూడా సిలువవేయబడియున్నారు. మరియు ఆయనతో కూడా తిరిగి జీవములోనికి తేబడియున్నారు. మనము బ్రదికినను చనిపోయినను, దేవునినీతి చేత మనము క్రీస్తుకు చెందినవారము. ప్రభువు రక్షించబడిన వారికి ప్రభువుగా మారాడు.
 

మన సహ విశ్వాసులకు మనము తీర్పు తీర్చకూడదు
 
10-12 వచనములో ఇది వ్రాయబడియున్నది, ‘‘అయితే నీవు నీ సహోదరునికి తీర్పుతీర్చనేల? నీ సహోదరుని నిరాకరింపనేల? మనమందరము దేవుని న్యాయపీఠము యెదుట నిలుతుము. నా తోడు, ప్రతి మోకాలును నా యెదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించు అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడియున్నది గనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క యొప్పగించవలెను.’’
మన దేవుడైన క్రీస్తు జీవించుచున్నందున, మనము ఒక దినమున ఆయన యెదుట మోకాళ్ళూని ప్రతీదీ ఒప్పుకొందుము. కావున మనము తీర్పు తీర్చు పీఠము మీద కూర్చుండి మన సహోదరీ సహోదరులకు తీర్పు తీర్చరాదు. అయితే దీనముగా దేవుని యెదుట నిలబడము. ఆయన సంఘములో ఒకరినొకరము నిందించుకొని తీర్పు తీర్చుకొనుటకంటే దేవుని చిత్త ప్రకారము జీవించుట అనునది ప్రాముఖ్యమైనది. మన సహోదరీ సహోదరుల బలహీనతకు మనము తీర్పు తీర్చినట్లయితే, మనము దేవుని యెదుట మన బలహీనతను బట్టి తీర్పు తీర్చబడుదుము. ఇందువలననే ఆయన సంఘములో అందరము కలసి, దేవుని చిత్తము కొరకు జీవించుట ఎంతమంచిదో మనము గ్రహించవలెను.
నిజ విశ్వాసము సహ విశ్వాసులను వెలిగించును మరియు దేవునినీతిని వెంటాడును. గుర్తుంచుకొనుము తప్పు విశ్వాసము దేవుని నీతిని విడిచిపెట్టి కేవలము దాని స్వనీతినే కట్టును. నీ గురించి ఏమిటి? విశ్వాసముతో నీవు దేవుని నీతిని వెంటాడుచున్నావా? లేక నీ స్వంత శరీర నీతిని వెంటాడుచున్నావా?
 

మనము ఇతరుల విశ్వాసమును వెలిగించవలెను
 
13-14 వచనము, ‘‘కాగా మనమిక మీద ఒకనికొకడు తీర్పు తీర్చకుందము. ఇదియు గాక, సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. సహజముగా ఏదియు నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనను నిషిద్ధమని ఎంచుకొనువానికి అది నిషిద్ధమే.’’
దేవునినీతియందు విశ్వాసముంచువారి విశ్వాస పరిమాణము విషయములో బేధమున్నందున, ఒకరినొకరము వెలిగించుకొనుట ద్వారా ఒకరి విశ్వాసమును ఒకరము కట్టుకొనవలెను. దేవుని నీతి విశ్వాసులలో పెరుగుదలను తెచ్చును. మనము నిజముగా దేవుని కొరకు మరియు ఆయన నీతి కొరకు జీవించుచున్నట్లయితే, మనమందరము ఆయన ప్రజలమైయున్నాము.
నీవు దేవునినీతియందు విశ్వాసముంచు క్రైస్తవుడవైనట్లయితే దేవుని వాక్యమునందున్న విశ్వాసముతో నీవేమైనను చేయగలవు. నీవు దీనిని చేయలేనట్లయితే, దేవుని నీతికి బదులుగా నీ స్వనీతిని వెంటాడుచున్నందువలననే, దేవునినీతియందు నీ స్వనీతిని వెంటాడుట అనునది లోకమును వెంటాడునటువంటిది మరియు ఒక తప్పు విశ్వాసమును కలిగియున్నటువంటిది.
దేవుని నీతియందు విశ్వాసముంచుటచేత రక్షించబడినప్పటికి, వారి స్వనీతిని వెదకువారు, దేవుని శత్రువుగా జీవించుచున్నారు. ఆయన నీతియందు విశ్వాసముంచుటచేత రక్షించబడినవారు వారి జీవితకాలమంతా ఆయన నీతిని వెంబడించుచు కొనసాగవలెనని దేవుడు కోరుచున్నాడు.
 

ప్రేమయందు నడువుము
 
15-18 వచనము చెప్పుచున్నవి, ‘‘నీ సహోదరుడు నీ భోజనము మూలముగా దుఃఖించిన యెడల నీవికను ప్రేమకలిగి నడుచుకొను వాడవుకావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో వానిని నీ భోజనముచేత పాడుచేయకుము. మీకున్న మేలైనది దూషణపాలు కానియ్యకుడి. దేవుని రాజ్యము భోజనము పానమును కాదు గాని, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై యున్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడనైవాడు దేవునికి ఇష్టుడును మనుష్యుల దృష్టికి యోగ్యుడునైయున్నాడు.’’
దేవుని నీతియందు విశ్వాసముంచుటచేత రక్షించబడినవారు మరియు దీనిని వ్యాప్తిచేయుటకు జీవించుచున్నవారు భోజనము కొరకు ఆయన ప్రజలను దుఃఖపెట్టరు. మనము కొన్నిసార్లు ప్రేమతో సహవాసము కలిగియుండుటకు పంచుటకు భోజనమును తీసుకొనివస్తాము. పేదలైన మన సహోదరి సహోదరులను విడిచిపెట్టి ధనవంతులకు మాత్రమే పెట్టడము అను దానిని బట్టి పౌలు మనకు విరోధముగా హెచ్చరించుచున్నాడు. ఏలయనగా ఇది మన తోటి సహోదరులు తొట్రిల్లునట్లు చేయును.
ఆయన నీతియందు విశ్వాసముంచు మనమీద ఆయన క్రుమ్మరించిన దీవెనలు మనము దేవుని నీతిని వెంబడించునట్లుగా నీరు మరియు ఆత్మ సువార్తచేత మనకివ్వబడిన సమాధానము, మనము కలసి ప్రభువును సేవించగలుగుట, ఆయన మనకిచ్చిన సంతోషమును ఒకరితో ఒకరు పంచుకొనుటకు అనుమతించుచున్నవి. ధనవంతులైనవారు వారి సంపదయంతయు దేవునినుండి కలిగినదని వారు గ్రహించవలెను మరియు సువార్తను పంచుటకు వాటిని ఇతరులతో పంచుకొనవలెను మరియు వారితో కలసి దేవునినీతిని వెంబడించవలెను. అటువంటి జీవితమును జీవించువారిని బట్టి దేవుడు సంతోషించును వారిని ప్రేమించును.
 

ఇతరులను వెలిగించుటకై చూచుట
 
19-21 వచనము చెప్పుచున్నవి, ‘‘కాబట్టి సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతము. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి; సమస్త పదార్థములు పవిత్రములే గాని అనుమానముతో తినువానికి అది దోషము. మాంసము తినుట గాని, ద్రాక్షారసము త్రాగుటగాని, నీ సహోదరుని కడ్డము కలుగజేయునది మరేదియు గాని, మానివేయుట మంచిది.’’
చాలా సంవత్సరముల క్రిందట, పురాతన పట్టణములైన రోమా మరియు కొరింథి అను పట్టణములలో ఒకసారి విగ్రహములకు అర్పణగా అర్పించిన ఆహారమును అమ్ముదురు. దేవునినీతియందు విశ్వాసముంచిన వారిలో కొందరు అటువంటి మాంసమును కొని తినేవారు. అప్పుడు, దేవుని సంఘమునందు విశ్వాసములో బలహీనముగా వున్న కొందరు విశ్వాసులు అటువంటి మాంసమును తినుట పాపము అని తలంచేవారు. ఇందువలననే పౌలు చెప్పుచున్నాడు. ‘‘భోజనము బట్టి దేవుని పనిని పాడుచేయకుడి’’ (20వ వచనము)
ద్రాక్షారసము విషయములో కూడా ఇదే వర్తిస్తుంది. త్రాగుట విషయములో ఎక్కువగా ఆందోళన పడని విశ్వాసులు కొంతమంది వుండేవారు. అటువంటి ప్రవర్తనలు సహవిశ్వాసుల విశ్వాసమును వారి త్రాగుడుతో బలహీన పరచినట్లయితే వారి సహ విశ్వాసులు బాధపడకుండా వుండు నిమిత్తము వారు త్రాగుడు మానివేయుట మంచిదని అని పౌలు గద్దించుచున్నాడు. కావున మన క్రైస్తవ జీవితము ఇతరులను వెలిగించునట్లుగా జీవించవలెను, మరియు దేవునినీతిని వెదకవలెను. మన పితరులకు భోజనముగా అర్పణముగా పెట్టు విషయములో నేడు వాదములు లేపగలవు. అందువలన విశ్వాసమునందు బలహీనులైనవారి నిమిత్తము అటువంటి భోజనమును చేయకపోవుట మంచిది.
 

దేవునినీతియందు విశ్వాసము కలిగియుండుము
 
22-23 వచనము వ్యాఖ్యానించుచున్నవి, ‘‘నీకున్న విశ్వాసము దేవుని యెదుట నీ మట్టుకు నీవే యుంచుకొనుము; తాను సమ్మతించిన విషయములో తనకు తానే తీర్పుతీర్చుకొనిన వాడు ధన్యుడు. అనుమానించువాడు తినినయెడల విశ్వాసము లేకుండా తినును గనుక దోషి అని తీర్పు నొందును. విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము.’’
దేవునినీతియందు విశ్వాసముంచిన వారు సరియైన విశ్వాసమును కలిగినవారు. దేవుని నీతియందు విశ్వాసముంచుట అనునది మన పాపములన్నిటిని కడిగివేయు దేవునిచేత ఇవ్వబడిన విశ్వాసము. కావున క్రైస్తవులు తప్పక దేవునినీతియందు విశ్వాసముంచాలి మరియు ఆయన నీతియందున్న వారి విశ్వాసమును గట్టిగా పట్టుకోవాలి.
లేఖనము మనకు చెప్పుచున్నది ఆయన నీతియందు విశ్వాసముంచకుండా దేవుని వెంబడించుట అనునది పాపము. విశ్వాసము లేకుండా ఏది చేసినా అది పాపము. ఆయన నీతియందు విశ్వాసముంచకుండా ఏది చేసినను పాపమని తెలుసుకొనుటచేత, ఆయన నీతియందు మనము మరింత విశ్వాసమును కలిగివుండాలి.
బైబిల్‌ చెప్పుచున్నది, ‘‘అనుమానముతో తినువానికి దోషము కలుగును’’, దేవుని నీతియందున్న విశ్వాసముతో నీవు ఏది తినినను అది పవిత్రమే ఎందుకంటే ప్రతి జంతువును ప్రతి మొక్కను దేవుడు చేసెను.
దేవుని నీతిని తెలుసుకొని దానియందు విశ్వాసముంచుట ఎంత ప్రాముఖ్యమో మనము తప్పక అర్థము చేసుకొనవలెను. మనము తప్పక తిరిగి జన్మించిన మన సహ విశ్వాసులను కూడా వెలిగించాలి వారి విశ్వాసమును గౌరవించాలి.