• All e-books and audiobooks on The New Life Mission website are free
  • Explore multilingual sermons in global languages
  • Two new revised editions in English have been released
  • Check out our website translated into 27 languages
Search

Sermons

అంశం 9: రోమీయులకు ( రోమా పత్రిక పుస్తకం పై నున్న వ్యాఖ్యానం)

[అధ్యాయము 15] ఈ సువార్తను ప్రపంచమంతా వ్యాప్తి చేయుదము

2021.04.28 863
‘‘బలవంతులమైన మనము, మనలను మనమే సంతోషపరచుకొనుక, బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమైయున్నాము. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైనదానియందు అతనిని సంతోషపరచవలెను.’’ (రోమా15:1-2)
యేసు తన స్వ మహిమను వెదకనందున, దేవునినీతియందు విశ్వాసముంచు వారు వారి స్వనీతిని వెదకరాదు. నీతిమంతులు దేవుని రాజ్యము కొరకు జీవించవలెను మరియు ఇతరుల మేలు కొరకు సువార్తను ప్రకటించవలెను. బలవంతులు వారిని వారు సంతోషపరచుటకు బదులుగా బలహీనుల దౌర్బల్యమును భరించవలెను.
దేవునినీతి విశ్వాసులు తప్పక సువార్తను బోధించవలెను అందువలన యేసుక్రీస్తు రక్తము మరియు బాప్తిస్మముతో ఇతరుల పాపములను శుద్ధిచేయగలరు. ఈ కారణము చేతనే పాపులను రక్షించుటకు సువార్తను ప్రకటించని సోమరులను దేవుడు ద్వేషించుచున్నాడు. కావున మనము తప్పక మన స్వనీతిని వెదకరాదు. అయితే దేవునినీతిని ఇతరులకు వ్యాపింపచేయవలెను. మనము తప్పక నీరు మరియు ఆత్మ సువార్తను ప్రసంగించవలెను అందువలన విశ్వాసము ద్వారా పాపులు రక్షించబడగలరు. మనలో మనము ఒకరినొకరిని వెలిగించుకొనవలెను కూడా.
 

మరియొక మనుష్యుని పునాదిమీద నీ విశ్వాసపు ఇంటిని కట్టకుము
 
20వ వచనము చెప్పుచున్నది, ‘‘నేనైతే మరియొకని పునాది మీద కట్టకుండు నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారమెవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియు, విననివారు గ్రహింతురనియు, వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామమెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలెనని మిక్కిలి ఆశగలవాడనైయుండి అలాగున ప్రకటించితిని.’’
పౌలు బోధించిన బోధలో ఏదో ఒక ప్రత్యేకమైనది ఒకటున్నది. అతడు నీరు మరియు ఆత్మ సువార్తను మాత్రమే ప్రకటించుటకు ఆతురపడ్డాడు. దేవునినీతి విశ్వాసులు పౌలు చేసినట్లుగా, నీరు మరియు ఆత్మ సువార్తను ప్రకటించుటకు ఆతురపడవలెను. ఇది ఒక క్రమములో సంభవించుటకు, మన మేలుకు బదులుగా, మనము ఇతరుల మంచిని చూడవలెను. ఇతరుల మేలు కోరువారు ఆ విధముగా చేస్తారు ఎందుకనగా వారు క్రీస్తుతో కూడా సిలువవేయబడి ఆయనతో కూడా పునరుత్థానులయ్యారు. క్రీస్తునందు విశ్వాసముంచువారు చనిపోలేదు, గాని జీవించియున్నారు.
‘‘ఈ హేతువు చేతను మీ యొద్దకు రాకుండ నాకు అనేక పర్యాయములు ఆటంకము కలిగెను. ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేనిక సంచరింపవలసిన భాగము లేదు గనుక, అనేక సంవత్సరముల నుండి మీ యొద్దకు రావలెనని మిక్కిలి ఆపేక్ష కలిగి, నేను స్పెయిను దేశమునకు వెళ్ళునప్పుడు మార్గములో మిమ్మును చూచి, మొదట మీ సహవాసము వలన కొంత మట్టుకు సంతృప్తిపొంది, మీ చేత అక్కడికి సాగనంపబడుదునని నిరీక్షించుచున్నాను. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. ఏలయనగా యోరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియవారును అకయవారును కొంతసొమ్ము చందావేయ నిష్టపడిరి. అవును వారిష్టపడి దానిని చేసిరి; వారు వీరికి ఋణస్థులు; ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారైయున్నారు గనుక శరీర సంబంధమైన విషయములలో వీరికి సహాయముచేయ బద్ధులైయున్నారు. ఈ పనిని ముగించి ఈ ఫలమును వారికప్పగించి, నేను మీ పట్టణము మీదుగా స్పెయినకు ప్రయాణము చేతును. నేను మీ యొద్దకు వచ్చునప్పుడు, క్రీస్తుయొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వుత్తునని యెరుగుదును.’’ (రోమా15:22-29)
 

పౌలు పలుచోట్ల తిరుగుచూ బోధించు బోధకుడు మరియు దేశ దేశములో సంఘమును కట్టు దేవుని సంఘమునకు చెందినవాడు
 
పౌలు యెరూషలేములోని సంఘమునకు వెళ్ళుచున్నప్పుడు మార్గము మధ్యలో, మాసిదోనియా మరియు అకయవారి నుండి కానుకను వీరి కొరకు స్వీకరించాడు. వారి ఆత్మీయ కార్యములలో అన్యులు పాలుపంపులు పొందుచున్నందున, శరీర విషయములో వారికి పరిచర్య చేయుట విధి అని పౌలు జతచేయుచున్నాడు. యెరూషలేములోనున్న పరిశుద్ధులు అప్పుడు శ్రమలో వున్నారు. వారి భౌతిక లోపము నుండి వారు స్వతంత్రులు కాలేదు. యేసునందు విశ్వాసముంచినందుకు గొప్ప హింసననుభవించుచున్న, యెరూషలేము సంఘము, అన్యులైన సహోదరి సహోదరులను బట్టి గొప్ప ఓదార్పు ననుభవించినది. 
గతములో వలే ఇప్పుడు కూడా, దేవుని సంఘముకు వారికి వారే సంతోషించుటకు బదులుగా అవసరమైన వారికి వారి సంపదను పంచడము ఒక సంప్రదాయమైనది. ప్రత్యేకించి ఆత్మ చేత నింపబడినవారు తమకు తామే ఒంటరిగా జీవించలేరు. ఎందుకు? వారిలో పరిశుద్ధాత్ముడు నివశించుచున్నందున వారు వారియందు నివశించుచున్న పరిశుద్ధాత్మ చేత నడిపించబడుచున్నారు.
అన్య సంఘము యెరుషలేము సంఘమునకు చందానిచ్చినవి మరియు బలపరచుట అద్భుతము. ఇది పరిశుద్ధాత్ముని కార్యము. పరిశుద్ధాత్ముడు నీరు మరియు ఆత్మ సువార్త ప్రకటించుట కొరకు యెరుషలేము సంఘమును బలపరిచాడు. వ్యక్తిగతముగా కాదు, అదే విధముగా సేదదీర్చు పదార్థము కాదు. ఆ సమయమందు ఇశ్రాయేలులో, చాలామంది కొట్టబడ్డారు. చెరసాలోనికి నెట్టబడ్డారు. యేసును వారి రక్షకునిగా అంగీకరించినందుకు చంపబడ్డారు కూడా.
టీవి చలన చిత్రములో, భూ గృహములలో మిగిలిన హతసాక్షులను మరియు కొండ గుహలలో దాయబడిన వారి అవశేషాలను మనము తరచు చూస్తుంటాము. ఆ సమయమునందు యెరుషలేము సంఘము ప్రయాణించవలసి వచ్చిన దారి ఇది. మనము కూడా, దేవుని సంఘములు కష్టములను ఎదుర్కొనునప్పుడు సహాయ హస్తమును అందించవలెను.
మనము ఆది సంఘము ఒకరికొకరు సహాయము చేసుకొన్నదానిని మరింత మెరుగుచేసి ప్రాముఖ్యత నివ్వవచ్చు. అయితే ఇది విశ్వాసులు హింసనుండి తప్పించుకొనుటకు దాగుకొని నివశించుకాలమది. యెరూషలేము సంఘము హింసకు లోనైయున్నందున, మిగిలిన సంఘములు ఆ సంఘమునకు సహాయము చేయుట స్వభావసిద్ధమైనది. ఇది పరిశుద్ధాత్ముని కార్యమైనందున, ఇది చక్కగా అతికినది అందముగా వుంది. 
నీవు, ఒక దేవునినీతి విశ్వాసివి, అటువంటి కార్యములలో పాలు పొందవలెను. న్యూలైఫ్‌ మిషన్‌ యొక్క సంఘము చందాను పోగుచేసి దీనిని ప్రపంచమంతటికి సువార్తను ప్రకటించుటకు పెట్టుబడి పెట్టుచున్నవి. ఈ విధముగా సహకరించుటకు అందరికి ఆర్థికమైన కష్టమున్నది, అయినను వారు ఇప్పటికీ ఆత్మలను రక్షించుటకు సువార్తను అందించుటకు ఆసక్తి కలిగియున్నారు.
పౌలు నీరు మరియు ఆత్మ సువార్త ప్రకటించుటకు ఒక గుడారము కుట్టువాడుగా పనిచేసాడు. ఆయన కనుగొనిన సంఘము పట్ల శ్రద్ధ తీసుకొనువాడు వున్నప్పుడు, అతడు ఆ సంఘమును అతనికి అప్పగించేవాడు, ఈ సువార్తను ప్రకటించుటకు వేరొక ప్రాంతమునకు తన దారిని తాను పోయేవాడు ఆ మధ్య అతని సంపాదన మరియు జీవనము అంతా గుడారమును కుట్టుట.
నీవు నీ కొరకే ఏ విధముగా జీవించవో, మన సేవకులు కూడా వారి కొరకు జీవించరు. పరిశుద్ధాత్మ తమయందు నివశించుచున్నవారు తమను తాము దేవుని పనికొరకు అంకితము చేసుకొందురు అదేమనగా, నశించిన వారిని వారి పాపములన్నిటినుండి రక్షించుట, మా సేవలోని పరిచారకులు మరియు సంఘసభ్యులు వారిని వారు పోషించుకొనుటకు సొంత ఉద్యోగమును కలిగి అదే సమయములో ఈ సువార్తను వ్యాప్తి చేయుటకు, ఆర్థికముగాను మరియు స్వచ్ఛందముగాను, ఈ పరిచర్యను ‘‘గుడారము కుట్టుపరిచర్య’’ ద్వారా కొంత సమయమును కేటాయిస్తారు.
ఇదే విధముగా, పౌలు పరిచర్యకు మరియు నేడున్న దేవుని సంఘము పరిచర్యకు చాలా పోలికలున్నవి. మాకు అదే కట్టడములో అమరిన మనస్సులున్నవి, పరిశుద్ధాత్మను సంతోషపరచు జీవితమును జీవించుచున్నాము. బాగా చలిగా వున్నప్పుడు మనకేమి అనిపిస్తుంది? మనము నిశ్చయముగా మన తోటి క్రైస్తవులు మరియు దేవుని సేవకులను క్రైస్తవులమైన, మనము, ఒకరిపట్ల ఒకరము శ్రద్ధ తీసుకొని గమనిస్తూ వుంటాము. బైబిల్‌లో వున్న నీతిమంతులు ఒకరికి ఒకరు అవసరమైయ్యారు. వారు కలసి దేవునినీతిని సేవించారు. ఈ విశ్వాస జీవితము అనునది నీతిమంతుల నిజమైన జీవితము.
ఆ విధముగా స్థిరపరచబడిన మనస్సుతో మనము జీవించాము. మేము ఈ నీరు మరియు ఆత్మ సువార్తను మొదట బోధించుట ప్రారంభించినపుడు, మాకేమి లేనందున చాల కొంచెం నుండి ప్రారంభించాము. మేము చర్చి అద్దె మరియు బిల్లు కట్టుటకు కొద్దిగా కొన్ని వంద డాలర్లతో కొన్నికొన్నిసార్లు ఆర్థికముగా చాలా కష్టములు తరచుగా అనుభవించాము. అయితే మేము ఇప్పటికీ ఈ దేశమంతటా మా సాహిత్య పరిచర్య కొరకు మమ్మును మేము సమర్పించుకొన్నాము.
మేము ఆర్థికపరమైన కష్టమును ఎదుర్కొన్నప్పుడు, దేవుడు మా కొరకు ఆ సమస్యలను తీర్చి మా పరిచర్య ఫలము మేము చూచుటకు సహాయము చేసాడు. పరిశుద్ధాత్ముడు మా హృదయముందు నిలచియున్నందున, ఈ సువార్తను ప్రకటించవలెనను కోరిక మాలో మండుచున్నందున, మా ఎదుట ఎటువంటి కష్టమున్నా, దేవుని సంఘము చేసినట్లుగా, బైబిల్‌లో వ్రాయబడిన నీతిమంతులు చేసినట్లుగా, నీరు మరియు ఆత్మ సువార్తను బోధించుటచేత నశించిన ఆత్మలకు దేవుని ప్రేమను పంచాలని మేము కోరుచున్నాము.
ఆది సంఘములో తిరిగి జన్మించిన క్రైస్తవులు ఒకరినొకరు పోషించుకొనుట మనము కనుగొనగలము. అదే విధముగా మేము కూడా చేయుదుము. ఇది పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా అసాధ్యము. తిరిగి జన్మించిన వారి సమర్పణ నుండి పరిశుద్ధాత్ముడు దేవునినీతిని భూమియంతటను వ్యాపింపజేయుచున్నాడు. అదే విధముగా చేయుటయందు కొనసాగును.
 

చివరి దినములను మనము ఎదుర్కొనినప్పటికి కూడా
 
బైబిల్‌లో ప్రవచించబడిన కష్టములన్ని నెరవేరునప్పుడు, మనము చివరి దినములలో నివశించుచున్నామని ప్రజలు చెప్పుదురు.
చివరి దినములలో వినాశనము ప్రకృతి అరిష్టము భూమియంతంటా కమ్ముకొనును. విశ్వాసులుగా దేవుని నీతియందున్న మన విశ్వాసమునందు ఇంకా ఎక్కువ దృఢముగా నిలబడవలెను మరింత కష్టపడి నీరు మరియు ఆత్మ సువార్తను ప్రకటించవలెను. దేవునినీతియందు విశ్వాసముంచువారు ఈ చివరిదినములలో ఒకరినొకరు ప్రేమించుకొనుటకు ఒకరి నొకరు సంరక్షించుకొను హృదయమును కలిగియుండవలెను. లోకములో వున్న వారి హృదయము వలె కఠిన పరచబడినట్లుగా మన హృదయములు కూడా కఠినపరచబడవచ్చు. అయితే, అంతమునందు మనము ఈ లోకమును జయిస్తాము. ఎందుకనగా మనయందు పరిశుద్ధాత్ముని కలిగియున్నాము. పరిస్థితులు ఎటువంటివైనను, మనము దేవుని సంఘమును మరియు ఆత్మలను సంరక్షించవలసియున్నది. మన సహాయము ఎవరికి అవసరమో మన తోటి సహోదరీ సహోదరులను గురించి ఆలోచించుచు, వారిని సంరక్షించవలెను, వారిని ప్రేమించవలెను, అంతము వరకు సువార్తను ప్రకటించవలెను.
మన స్వనీతిని వెదకుటకు బదులుగా, ఇతరుల రక్షణకొరకు మనలను మనము సమర్పించుకొనవలెను. ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తముగా, నీరు మరియు ఆత్మ సువార్తను వినని ప్రజలు అనేకులున్నారు. చాలా దేశములలో వున్న ప్రజలు నీరు మరియు ఆత్మ సువార్తను ఇంతవరకు వినలేదు. దేవునినీతిని ఎరిగే అవకాశము కలిగియుండలేదు. నశించు ఆత్మలను జయించుటకు పోరాడు సైనికువలె నీరు మరియు ఆత్మతో దేశమును జయించుటకు మన మనస్సులను స్థిరపరచుకొనవలెను. ఈ పరిచర్య ఒక శక్తిచేత బలవంతము చేయబడునట్లు, బలవంతము చేసేదికాదు. ఎవనియందు పరిశుద్ధాత్మ నిలిచియుంటుందో వారియందు స్వభావసిద్ధముగా ఉదయిస్తుంది.
నీరు మరియు ఆత్మ సువార్తను భూమి అంతము వరకు ప్రకటించవలెనను గొప్ప తీర్మానము ఈ దినమున హృదయములో చురుకుదనమును సంతరించుకున్నది. నేను మీకు చెప్పదలచుకొన్నదేమిటంటే, ఈ లోకము క్లిష్టముగా మారే కొలది, ఆయన పరిశుద్ధాత్మను మన మీదికి కుమ్మరించును. సత్యము కొరకు దాహముగొనిన వారికి మా ముద్రించబడిన పుస్తకము మరియు ఎలక్ట్రానిక్‌ పుస్తకము ద్వారా మేము ఈ సువార్తను ఉచితముగా వ్యాప్తి చేయుచున్నాము. మేము నిరంతరము ప్రపంచవ్యాప్తముగా ఇంటర్‌నెట్‌ ద్వారా మా పరిచర్యను కొనసాగిస్తాము.
మేము అమెరికా మరియు యూరపు వారి కన్నా ఏ మాత్రము ధనవంతులము కాకున్ననూ, మేము ఇప్పటికీ దేవునినీతి కలిగి సువార్తను అందించగలము. పేతురు చెప్పినట్లుగా మేము, ‘‘వెండి బంగారములు మా వద్ద లేవుగాని మాకు కలిగినదే మేము నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి, నడువుము’’ (అపో.కా.3:6) అదే స్థిరమైన మనస్సును కలిగియున్నాము.
వారు ఎరుగని దేవునినీతిని నెరవేర్చిన సువార్తను మేము వారికి ఉచితముగా ఇవ్వగలము. ప్రపంచ కొలతతో మేము కొలవబడినప్పుడు మేము ఎవ్వరికన్నా గొప్పవారము కాము గాని, మేము దేవుని నీతిని కలిగియున్న సువార్తను ఇవ్వగలిగినవారము. మా పరిచర్య ద్వారా ఈ సువార్తను వినుట తటస్థించి దీనిని తెలుసుకొని విశ్వాసముంచినవారు గొప్పగా దీవించబడుదురు.
ఇది ఇంటర్నెట్‌ యుగము, మరియు దీనితో ఒక మార్గమును ప్రపంచవ్యాప్తముగా దేవుడు మాకు అనుగ్రహించాడు. దేవునినీతిని కలిగిన సువార్తను మేము ఇచ్చినప్పుడు ఎంత ఆనందముగా కృతజ్ఞతతో వున్న ప్రజలను మేము చూశాము. ప్రపంచము నిస్పృహగా మారుచున్న కొలది, నశించిన వారికి దేవునినీతి సువార్తను ప్రకటించుచుండగా మేము మరింత కృతజ్ఞత కలిగిన వారముగా శక్తివంతులముగా మారుదుము. ప్రపంచము ఈ విధముగా అంతమగునా లేక ఆయన సువార్తను ప్రకటించుటకు దేవుడు మనకు ఇంకా మరిన్ని అవకాశములనిచ్చునా? మనము ఆలోచించి ప్రార్థన చేయవలసినది దీని గురించి ప్రతిదీ పరిశుద్ధాత్మ చేత పరిపూర్ణముగా నెరవేరును.
నేను తిరిగి జన్మించక మునుపు, నేను నా శరీరమును గురించే ఆలోచించాను. నేను స్వార్ధపరునిగా వున్నాను. నేను మాత్రమే కాదు. మనమందరము అలాగునే వున్నాము. శరీర సౌఖ్యములకొరకే జీవించువారు తాము ప్రేమను కలిగియున్నామని చెప్పుదురు కాని, వాస్తమునకు వారు ఇతరులను ప్రేమించలేరు. పరిశుద్ధాత్మ కలిగిన వారికీ, పరిశుద్ధాత్మ లేని వారికున్న వ్యత్యాసమది. పాపులు కేవలము వారి కొరకే జీవింతురు. అయితే పరిశుద్ధాత్మతో నింపబడినవారు ఇతరుల కొరకు జీవించగలిగిన శక్తి కలిగివుంటారు. మరియు వాస్తవముగా ఇతరుల కొరకు జీవిస్తారు. త్రియేక దేవుడు విశ్వాసుల ఇతర ఆత్మల కొరకు జీవించు శక్తిని వారికి ఇస్తాడు. దేవుడు వారి హృదయముయందు నివశించుచున్నాడు కావున, వారు ఆయన నీతి కార్యమును చేయగలరు.
ఈ ప్రపంచములో ఎన్ని చర్చిలు కలిగియున్నను, వాటిలో దాదాపు అన్నీ కేవలము లౌకిక వ్యాపారముగా మారినవి. వారి బాధ్యతా రహితమైన చర్చిలను కట్టడానికి వారు ఏ మాత్రము డబ్బు ప్రక్కన పెట్టరు, మరియు వారు మిలియన్ల డాలర్ల బడ్జెట్‌ కలిగివుంటారు. అప్పటికి కనికరయుత కార్యక్రమాలకు ఒక చిన్న భాగము మాత్రమే వారు కేటాయిస్తారు. వారు ఈ భూమి నుండి ఎంతో సంపాదించుకొనడానికి వారు పిచ్చి వాళ్లుగా మారారు. వారి వాస్తవమైన పాపములనుండి ఆత్మలను రక్షించు సేవను రెండవదిగా మరియు ప్రాముఖ్యము లేనిదిగా విడిచిపెట్టారు. వారు దేవుని సంఘములో ఒక భాగము కాలేరు, దేవుని ప్రజలకు చెందిన సంఘము దాని స్వంత ఆసక్తిని వెంటాడదు కనుక.
నిజమైన దేవుని సంఘము స్వచ్ఛతతోను మరియు నిజాయితీతో దాని వనరులను నశించిన ఆత్మలను రక్షించుటకు ఉపయోగించును. బైబిల్‌ చెప్పుచున్నట్లుగా, ‘‘కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు’’ (మత్తయి 5:7) లోకములోని ఆత్మలను సంరక్షించునట్లుగా మరియు వారిని విమోచనములోనికి నడిపించునట్లుగా, దేవుడు మాకు హృదయమునిచ్చెను మరియు ఇవన్నియు సాధ్యమగునట్లుగా ఆయన చేసెను. ఈ నీరు మరియు ఆత్మ సువార్త ఇప్పుడు ప్రచురణలుగా పెట్టబడుచున్నవి. మరియు దాదాపు 40 బాషలలోనికి తర్జుమా చేయబడినవి మరియు ఆత్మీయ మరణమును ఎదుర్కొనుచున్న వారికి దేవుని నీతిని గూర్చి సాక్ష్యమిచ్చుటకు ప్రతి పుస్తకము దాదాపు 60 పుస్తకములకు పైగా వున్నవి.
ప్రపంచము మహాశ్రమలలో కప్పబడి, దాని అంతమునకు రాకమునుపూ, పాపులను రక్షించుటకు మనమింకను ఎక్కువగా ప్రార్థించి నీరు మరియు ఆత్మ సువార్తను మరి ఎక్కువగా వ్యాప్తిచేసిన యెడల దేవుడు ఎంతగా సంతోషించును? మనము నిరాశచెందక అంతము వరకు విశ్వాసపాత్రులుగా వుందుము.
గడచినకాలములో, ఒకరికొకరు సహాయము చేసుకొనుటద్వారా పేదలు బ్రతక గలిగే వారు. అయితే మనమిప్పుడు బలవంతులు మాత్రమే బ్రతుకగల అవధులేని పోటీ యుగములోనికి మనము ప్రవేశించియున్నాము. మనము ఈ తరమును చూచినప్పుడెల్లా, ఇప్పటికీ సువార్తను వినని వారికి నీరు మరియు ఆత్మ సువార్తను వ్యాప్తి చేయవలెనను మన విధి విషయములో సఖ్యపడుచున్నాము. ఈ కఠిన ప్రపంచములో అంతము లేని సమస్యతో విసిగిపోయి అలసినవారికి సమాధానము తెచ్చు సువార్తను వినిపించుటకు మనమందరము హృదయమును కలిగియున్నాము. రండి మనము నీరు మరియు ఆత్మ సువార్త ఆత్మీయ దీవెనలను వారికి వినిపించుదాము. దేవుని నీతియందున్న మన విశ్వాసముతో మనము క్రీస్తు కొరకు జీవించగలము, ఏలయనగా ఆయన మన పాపములన్నిటిని తీసుకొనిపోయెను.
దేవుని నీతిని కలిగియున్న ఈ సువార్త పదియంతలుగు, వందంతలుగా, వెయ్యి వంతలుగా, లక్ష వంతలుగా మరింతగా సుడులు తిరుగుచూ వ్యాపించును. మనము చేయుటకు ఎంతో పని వుంది. అందువలన మనము నమ్మకస్తులుగా వుందాము. తలాంతులు కలిగిన వారు వారి తలాంతులను ప్రభువునకు ఇవ్వవలెను మరియు నీరు మరియు ఆత్మ సువార్తను ప్రతి ఆత్మకు వ్యాప్తి చేయవలెను. దేవుడు మనకిచ్చిన తలాంతుల ప్రకారముగా మనమందరము కలసి సువార్తను వ్యాపింపజేయుటకు పనిచేయవలెను. మనము మన స్వంత శక్తిని కలిగిలేము. అయితే మనలను పురికొలుపు మనయందున్న పరిశుద్ధాత్మ ప్రకారము మనము ప్రార్థించినట్లయితే, దేవుడుమన కోరికలన్నిటిని తీర్చును.
క్రీస్తు పాపులను ప్రేమించు ఆయన నిజప్రేమను మనకిచ్చెను. దేవునినీతియందున్న మన విశ్వాసముచేత లోక పాపములనుండి రక్షించబడియున్నాము. ఇందువలననే ఈ లోకములో జీవించుట కష్టమగుచున్న కొలది కష్టపడి సువార్తను ప్రకటించవలెను. ఇప్పటికీ సువార్తను వినని వారికి ఈ సువార్తను ప్రకటించు బాధ్యత మనకున్నది.
దేవుడు చెప్పెను, ‘‘బయలుకు మోకాళ్ళూనని యేడువేలమంది పురుషులను నేను శేషముగా నుంచుకొనియున్నాను’’ (రోమా 11:4) ఇప్పటికీ నీరు మరియు ఆత్మ సువార్తను పొందనివారు. ఈ లోకములో చాలామంది ఉన్నారు. చాలా ఆత్మలు, వారు పాష్టర్లుగాని, వేదాంత పండితులుగాని, లేక సంఘస్తులు గాని వీరందరు లేస్తున్నారు.
క్రీస్తు ప్రేమను బట్టి మనము ఈ సువార్త పనిని చేయగలుగుచున్నాము. మనము ఇప్పటికి చేయవలసిన పని చాలా వుంది. కొన్నిసార్లు వీటి చేత మనము చాలా బాధననుభవిస్తాము. అయితే మనము కష్టములు ఎదుర్కొనుచున్న కొలదీ మనము మరింత కష్టపడి సువార్తను వ్యాప్తి చేయవలెను. ఇది క్రీస్తు హృదయము. నీతిమంతులైన మీరు, మీ గురించే మీరు ఆలోచించుకొనగూడదని నేను ప్రార్థించుచున్నాను. నీవు నిన్ను గురించి మాత్రమే ఆలోచించినట్లయితే, విశ్వాసములేని ప్రార్థన అవసరమే లేదు. ఎందుకనగా కేవలము నీవు జీవించుటను గురించి మాత్రమే నీవు ఆలోచించుచున్నావుగాని, నశించిన ఆత్మ గురించి నీవు చేయవలసినదేమీ లేదు గనుక నిన్ను నీవు పోషించుకొనుటకు మరియు ఇతరుల ఆత్మల కొరకుగాను, జీతమును సంపాదించుకొనునట్లయితే, ఏమి సంభవిస్తుంది? నీవు బలహీనుడవైనందున దేవునికి ప్రార్థన చేస్తావు.
ఈ విధముగా మన విశ్వాసము పెరుగును. ఇందువలననే దేవుడు చెప్పుచున్నాడు.
‘‘వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు తగినదానికన్న తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు’’ (సామెతు 11:24)
నీరు మరియు ఆత్మ సువార్తను ఇతరులకు పంచుట అనునది క్రైస్తవులకు అత్యున్నతమైన నీతియుక్తమైన జీవితము. ఆత్మీయ జీవితము అనునది ప్రజలను క్రీస్తు యొద్దకు నడిపించు నిజ సువార్తను వ్యాప్తిచేయుట. రండి మనము మన పొరుగువారిని వారి ఆత్మలను సంరక్షించుదాం. మరియు ఈ సువార్తను ప్రపంచ వ్యాప్తముగా వ్యాప్తి చేయుదము. దేవునినీతి దీవెనలు ఎల్లప్పుడు మీతో వుండు గాక.
హల్లెలూయ! మనము ప్రభువును స్తుతించుదాం! ఆయన నీతియుక్తమైన మంచి కార్యములను చేయుటకు అనుమతించినందుకు, చీకటిశక్తుల నుండి మనలను విడిపించి కుమారుని రాజ్యములోనికి మమ్మును నడిపించినందుకు నేను దేవునికి వందనములు చెల్లించుచున్నాను.