• All e-books and audiobooks on The New Life Mission website are free
  • Explore multilingual sermons in global languages
  • Two new revised editions in English have been released
  • Check out our website translated into 27 languages
Search

Sermons

అంశం 9: రోమీయులకు ( రోమా పత్రిక పుస్తకం పై నున్న వ్యాఖ్యానం)

[అధ్యాయము 16] ఒకరికొకరు వందనములు చెప్పుకొనుడి

రోమాలో వున్న పరిశుద్ధులకు తన ముగింపులో ఒకరికొకరు వందనము చెప్పుకొనుడని అపోస్తలుడైన పౌలు చెప్పుచున్నాడు. ఈ యుగములో కూడా హృదయపూర్వముగా మనము ఎవరికి వందనములు చెల్లించగలము? మనము ఈ ప్రపంచమునకు దేవుని వాక్యమునుకు ప్రకటించుచున్న సేవకులకు విశ్వాసులకు ఆనందముతో వందనములు చెల్లించగలము. నీరు మరియు ఆత్మ సువార్తతో రక్షించబడిన వారితో మనము సహవాసమును కలిగియుండగలము. మనము కూడా సంఘమును, మనము వందనము చెప్పుగల విశ్వాసులను, దేవుని సేవకులను కలిగియుండగలము.
ప్రతి ఒక్కరు ఈ నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచనందున, నీతిమంతులు ప్రతి ఒక్కరికి వందనములు చెల్లించలేరు. మనము ఆనందముతో వందనములు చెప్పుగలవారు ఈ ప్రపంచములో ఎక్కువమంది లేరు. నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచి, ఎవరికి మనము ఆనందముతో వందనములు చెల్లించగలమో అదే విశ్వాసముతో సహవాసమును కలిగియుండగలమో అటువంటివారు చాలామంది లేకపోవడము మాత్రమే విచారకరము. ప్రాపంచిక చర్చిలో దేవుని సేవకులుగా అగపరచుకొను పాపులతో మనము సహవాసమును కలిగియుండలేము.
పాపము మరియు పరిశుద్ధాత్మ కలిసియుండలేనట్లుగా, పాపులు మరియు నీతిమంతులు ఒకరికొకరు వందనములు చెల్లించుకొనలేరు. నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచువారు దేవునిని ఆత్మీయముగా ఆరాధించగలరు మరియు ఆత్మకార్యముల కొరకు పనిచేయగలరు. తమ పాపములకు ఇప్పటికీ ప్రాయశ్చిత్తము నొందని పాపులు, ధర్మశాస్త్రమును పాటించుటచేత రక్షించబడవలెనని ప్రయత్నము చేయుదురు. ఆ విధముగా వారు నీతిమంతులతో సహవాసమును కలిగియుండలేరు. ఒక జంతువు ఒక మనుష్యుడు ఏ విధముగా సంభాషించుకొనలేరో, నీతిమంతులు పాపులతో ఆత్మీయ సహవాసమును కలిగియుండలేరు.
పౌలు ఎవరితో ఆత్మీయ సహవాసమును కలిగియున్నాడో వారు పౌలుకు కలిగిన అదే విశ్వాసమును కలిగినవారని మనము చూడగలము. ఒకడు పౌలుతో సహవాసము కలిగియున్నట్లయితే, దీని భావము అతని/ఆమె విశ్వాసము పౌలు అంగీకరించాడని భావము. అందువలన, ‘‘ఒక ప్రత్యేకమైన ప్రాంతమునకు నేను వెళితే, మొదట నేను ఎవరికి వందనములు చెల్లిస్తాను?’’ అని ఆలోచిస్తాను. నేను సక్కో చర్చికి వెళ్లేవాడనైతే నిశ్చయముగా సక్కోను దర్శిస్తాను. గంగ్నేయంగ్‌కు వెళితే గంగ్నేయంగ్‌ చర్చిని దర్శిస్తాను. నేను దేవుని సేవకులను మరియు విశ్వాసులను కలుసుకొని వారితో సహవాసము చేయగలను మరియు వారితో రొట్టె విరువగలను. అక్కడ వున్న నా సహోదరి సహోదరుల గృహమును దర్శించి వారికి వందనములు చెప్పుదును. అయితే నేను వందనములు చెల్లించగలిగినవారు నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచువారు మాత్రమే. మరియు పరిశుద్ధాత్మయందు అదే విశ్వాసమును వారితో నేను పంచుకొనుగలను.
పౌలు చేత సమ్మతించబడిన విశ్వాసము కలిగిన వారు ఎంతో ధన్యులని మనము చూడగలము. మనము ఒకని విశ్వాసమును ఒకరు నిర్ధారించుటకు మరియు ఒకరికొకరము వందనములు చెల్లించుటకు నీరు మరియు ఆత్మ సువార్తను కలిగియుండుట ఎంత గొప్ప విషయము. ఒకనికొకరు వందనములు చెల్లించుకొనునట్లుగా చేయు నీరు మరియు ఆత్మ సువార్తయందు నీవు విశ్వాసముంచుచున్నావా? నీకు ఏ మాత్రము పాపములులేవని దేవుని యెదుట, ఏ సందేహము లేకుండా, నమ్మకముగా ఒప్పుకొనగలవా?
నేను చైనాను దర్శించినప్పుడు నా తోటి సహోదరులకు వందనములు చెప్పే అవకాశము నాకొకటి వచ్చింది. హారాను నది ఒడ్డును నివశించు ఒక సహోదరుని నేను కలుసుకొన్నాను. మరుసటి ఉదయము మేము లేచిన వెంటనే, అతడు మాకు పెద్ద అల్పాహారమును ఏర్పాటు చేసాడు. మేము ఒక పెద్ద గుండ్రని బల్ల యెదుట కూర్చున్నాము. మేము కూర్చున్న తీరు విశాల పరచబడిన మా కుటుంబము వలె వున్నది, మరియు అక్కడ వున్న సహోదరులతో ప్రియమైన సహవాసమును కలిగియున్నాను. మమ్మును చూచుటకు ఆసక్తికలిగిన అక్కడికి దగ్గరలోవున్న పట్టణములో ఒక సువార్తికుడు ఉన్నాడు. అందువలన, మేము ఆయనను దర్శించి ఆయనతో సహవాసమును కలిగియున్నాము కూడా. నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచు వారికి మేము వందనములు చెల్లించగలము.
నేను అమెరికా సంయుక్త రాష్ట్రములు దర్శించినట్లయితే నేను ఎక్కడికి వెళతాను? నేను న్యూయార్క్‌ సిటీలో వున్న పాస్టర్ సామ్యూల్‌కిమ్‌ మరియు ఆయన భార్య ఫ్లషింగ్‌ను దర్శిస్తాను. నేను అక్కడ వున్న న్యూలైఫ్‌ సంఘమును కూడా అక్కడున్న మన సహోదరి సహోదరులను కలుసుకొనుటకు దర్శిస్తాను. రష్యాలో కూడా, కొన్ని సంవత్సరముల క్రితము తిరిగి జన్మించిన సంఘమును నేను కలుసుకున్నాను. జపానులో టోక్యోలో వున్న డీకాను గృహమైన సూన్‌ ఓక్‌ పార్క్‌ను కలుసుకొంటానికి ఇష్టపడతాను.
నీరు మరియు ఆత్మ సువార్తయందున్న విశ్వాసముచేత రక్షించబడిన మేము నీతిమంతులము. మా శరీరములో ఏ విజయమును బట్టి అయినా మేము రక్షించబడలేదు. అయితే నీరు మరియు ఆత్మ సువార్తయందున్న మా విశ్వాసము ద్వారా మేము పొందిన దేవునినీతిని బట్టి మేము రక్షించబడియున్నాము.
నీవు చూచిన విధముగా, రోమా 16వ అధ్యాయములో రోమా పట్టణములో పౌలు వందనములు చెల్లించుటకు ఒక పట్టీ కలిగియున్నట్లుగా, నీతిమంతులు వందనములు చెల్లించుటకు కొంతమంది నిర్దేశించివున్నారు. మనము ప్రతి క్రైస్తవునికి వందనములు చెల్లించలేము. ఎందుకంటే వారిలో అందరికి సరియైన విశ్వాసము లేదు. అయితే దేవునినీతిని ఎరిగి దానియందు విశ్వాసముంచిన వారికే మనము వందనములు చెల్లించగలము. దేనియందు మనము వందనములు చెల్లించగలమో మరియు వందనములు పొందగలమో అటువంటి విశ్వాసమును మనకిచ్చినందుకు దేవునికి వందనములు చెల్లించుట తప్ప మరేమియు చేయలేము.
 

ఇటువంటి ప్రజల నుండి దూరముగా వుండమని పౌలు మనలను హెచ్చరించుచున్నాడు

17వ వచనము నుండి తమ కడుపులను మాత్రమే సేవించుకొను వారికి దూరముగా వుండమని అపోస్తలుడైన పౌలు రెండవ హెచ్చరికను చేయుచున్నాడు. ‘‘సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగచేయువారిని కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. వారు ఇంపైన మాటల వలనను ఇచ్ఛకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు.’’ (రోమా16:17-18) క్రీస్తును కాక కేవలము తమ సొంత కడుపును మాత్రమే సేవించువారు కలరు. విశ్వాసుల మధ్య కలతలు రేగుటకు కారణము వీరు ఇచ్ఛకపు మాటలతో ఇంపైన మాటలతో నిష్కపటులను మోసపుచ్చుదురు. మనము అటువంటి ప్రజలకు వందనములు చెప్పకూడదు. అయితే వారి నుండి దూరముగా వుండాలి.
పౌలు అటువంటి ప్రజల నుండి దూరముగా వుండమని కోరుచున్నాడు. ఎందుకంటే వారు సంఘమందు కలతకు కారణమై దానిని బట్టి ఆనందించుదురు. దేవుని వెంబడించువారిని చెడగొట్టుదురు. కేవలము వారి దురాశ కొరకు నిష్కపటులను పొగుచేయుదురు. అటువంటి మోసపు నాయకుల పాపము క్రింద వున్న ప్రజలను పూర్తిగా ధర్మశాస్త్రమునకు లోబడునట్లు హద్దులో వుంచుదరు. వారు కేవలము యేసు నామములో వారి స్వంత కడుపును నింపుకొందురు అమాయకులను మోసము చేయుదురు. వారికి వందనములు చెల్లించవలసిన అవసరములేదు. ఏలయనగా వారు కేవలము తమ కడుపు నింపుకొను సేవలో వున్నారు.
 

నీరు మరియు ఆత్మ సువార్త తప్పక దేశములన్నిటికి వ్యాపించవలెను.
 
మూడవదిగా, సువార్త దేశములన్నిటికి వ్యాపించవలసిన అవసరతను గురించి మాట్లాడుచున్నాడు. 26వ వచనము చెప్పుచున్నది, ‘‘అనాది నుండి రహస్యముగా ఉంచబడి యిప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము, నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడియున్నది’’ పౌలు బోధించిన నీరు మరియు ఆత్మ సువార్త నిజముగా దేశములన్నీ తెలుసుకొని తప్పక విధేయులవ్వవలసిన సువార్త. పౌలు సంఘమును స్థాపించిన స్థలములో నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచిన ప్రాంతములు ఇప్పుడు ఇస్లాము ప్రాంతముగా మారినవి అనునదే చాలా దురదృష్టకరమైన విషయము.
ఆ కాలమునందు దేవునినీతిని కలిగియున్న నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచిన వారి ప్రాంతములకు పౌలు వెళ్ళి, వారిలో నాయకులను నియమించాడు. మా సేవా బడియందు శిక్షణ తరువాత మా సంఘముకు పనివారిని పంపు విధానము అదే విధముగా వున్నది. సంఘము ఆ సమయమందు ‘‘ప్రభువు ఒక్కడే, విశ్వాసమొక్కటే, బాప్తిస్మమొక్కటే’’ (ఎఫెసీ 4:5) అను దానియందు విశ్వాసముంచినప్పటికి, ఆ సువార్తయందు వారు కొనసాగుటలో విఫలమయ్యారు. ఎందుకంటే ఈ సువార్తను గ్రంధస్తము చేయలేదు.
ఇప్పుడు మేము మా పుస్తకమును టర్కీష్‌ బాషలోనికి అనువదించు ప్రక్రియలో వున్నాము. టర్కీ నుండి ఒకరు మా ఇంగ్లీషు పుస్తకమును చదవడం జరిగినది మరియు అతడు స్వచ్ఛందముగా వాటిని అనువదించుటకు ముందుకు వచ్చెను. మేము ఇప్పుడు పౌలు తనకు తానే ఎక్కడ ఒకసారి సువార్తను బోధించి దేవుని సంఘములను స్థాపించాడో అక్కడ మేము నీరు మరియు ఆత్మ సువార్తను వ్యాపింపచేయుటకు ప్రారంభించి యున్నాము. పౌలు ఆయన దర్శించిన ప్రాంతములో ఆయన బోధించిన అదే సువార్తను మేము బోధించుచున్నాము. పౌలు బోధించిన సువార్త ఏదనగా కేవలము విశ్వాసముంచి విధేయులగుటచేత దేశములన్నిటిని రక్షించగల నీరు మరియు ఆత్మ సువార్త ఇది.
రోమా అఖరి అధ్యాయములో, రోమాలో వున్న పరిశుద్ధులకు ఒకరికొకరు వందనములు చెల్లించు కొనుచు, కేవలము తమ కడుపును నింపుకొనువారికి దూరముగా వుంటూ, దేశదేశములకు నీరు మరియు ఆత్మ సువార్తను వ్యాప్తి చేయుచువుండవలెనని అపోస్తులుడైన పౌలు చెప్పెను.
 

నీరు మరియు ఆత్మ సువార్త మనలను బలపరచును

పౌలు ఉదహరించిన నాలుగవ విషయము ఏమనగా ఈ నీరు మరియు ఆత్మ సువార్త మనలను స్థిరపరచు దేవుని జ్ఞానము. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు, ‘‘అనాది నుండి రహస్యముగా ఉంచబడి యిప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము, నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడియున్నది. ఈ మర్మమును అనుసరించియున్న నా సువార్త ప్రకారముగాను, యేసుక్రీస్తునుగూర్చిన ప్రకటన ప్రకారము గాను, మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి, యేసుక్రీస్తు ద్వారా, నిరంతరము మహిమ కలుగును గాక ఆమెన్‌’’ (రోమా 16:25-27) రోమాలో వున్న పరిశుద్ధులను ఏది స్థిరపరచెను. ఇది పౌలు సువార్తయైన నీరు మరియు ఆత్మ సువార్త చేయగలదు మరియు రోమాలో పరిశుద్ధులను స్థిరపరచెను. ఈ సువార్త దేవుని జ్ఞానము కూడా.
దేవుడు మనకిచ్చిన ఈ సువార్తలో జ్ఞానమున్నది. పూర్తిగా తప్పిదముతో నిండినవారి అన్ని పాపములను తీసివేయుటకు ఈ సువార్త శక్తిని కలిగియున్నది. నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచువారు కేవలము పాపములేని వారిగానే చేయబడలేదు గాని వారెంత బలహీనులైనను పూర్తిగా లోపముతో కప్పబడియున్నను, ఈ సువార్త బోధకులుగా చేయబడ్డారు. నీరు మరియు ఆత్మ సువార్త నుండి వచ్చు దేవుని జ్ఞానము కేవలము మనలను పూర్ణులనుగా చేయును. ఈ సువార్త కాక ఒకని ఆత్మను, హృదయమును, ఆలోచనను మరియు దేహమును బలపర్చగలిగిన మరియొక సువార్త లేదు.
పౌలు ఈ సువార్తను కేవలము సువార్తను ‘‘సువార్త’’ అనలేదు గాని ‘‘నా సువార్త’’ అని అన్నాడు. పౌలు బోధించిన నీరు మరియు ఆత్మ సువార్త, పాత మరియు క్రొత్త రెండు నిబంధనలలో ప్రత్యక్షపరచబడినవి. ఈ నీరు మరియు ఆత్మ సువార్త పాత నిబంధనలోని ప్రవక్తల ద్వారా ప్రత్యక్షపరచబడిన సువార్తను ఆధారము చేసుకొని క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుచేత నెరవేర్చబడినది. ఇందువలననే పౌలు ‘ఇతని సువార్త’ అనాది నుండి రహస్యముగా వుంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము, నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనములు ద్వారా వారికి తెలుపబడియున్నది.
పౌలు బోధించిన సువార్త పాత నిబంధనలోని ఐదు కాండములయందు, ప్రత్యేకించి లేవీయకాండములోని బలుల విధానమును సూచించుచున్నది. మరియు నూతన నిబంధనలో ఆయన బాప్తిస్మము, సిలువపైన ఆయన మరణము మరియు ఆయన పునరుత్థానము ద్వారా దేవునినీతిగా నెరవేర్చబడినది. ఇందువలననే ‘‘నా సువార్త ప్రకారము మిమ్మును స్థిరపరచు దేవునికి మహిమ కలుగును గాక’’ అని దేవునికి మహిమను చెల్లించుచున్నాడు.
నీరు మరియు ఆత్మ సువార్త పరిశుద్ధులను మరియు దేవుని సేవకులను స్థిరపరచును. ఇతని సువార్త ద్వారా, మన విశ్వాసము, ఆత్మలు, ఆలోచనలు, మనస్సులు, మరియు దేహము బలపరచబడెను. మన విశ్వాసము ఏ విధముగా బలపరచబడగలదు? మన మెల్లప్పుడు బలహీనముగా వున్నప్పుడు మనలను బలవంతులుగా చేసేది ఏమిటి?
మన విశ్వాసము బలమైనదిగా మారును ఎందుకనగా, ఆయన బాప్తిస్మము మరియు సిలువపైన ఆయన రక్తము ద్వారా మన పాపములన్నిటిని తీసివేసిన క్రీస్తు యొక్కరక్షణను పొందియున్నాము. మనము దేవునియెదుట పాపములేని వారమని చెప్పగలము. ఎందుకనగా మన హృదయము సిగ్గుకలిగించునది ఏదీ కలిగియుండలేదు. మరియు ఈ సిగ్గు కలిగించని ఆత్మీయ విశ్వాసముతో, పాపములో ఇప్పటికి బంధించబడియున్నవారికి నీరు మరియు ఆత్మ సువార్తను వ్యాప్తి చేయగలము.
 

ఆఖరి హెచ్చరికలు

‘‘జ్ఞానవంతుడునైన దేవునికి, యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక. ఆమెన్‌’’ అను ముగింపు ప్రార్థన చెప్పుట ద్వారా పౌలు 16వ అధ్యాయమును ముగించుచున్నాడు. అన్నిటికన్నా దేవుని మహిమపరచునది ఏమిటి? యేసుక్రీస్తునందున్న దేవునినీతిని బోధించుట దేవునిని ఉన్నతముగా మహిమపరచును. మన హృదయమంతటితో ఈ సువార్తను సేవించినప్పుడు మనము కూడా మహిమ పరచబడుదుము.
రోమా 16లో పౌలు సందేశ సారాంశము ఇది: ఒకనికొకరు వందనములు చెప్పుకొనుడి, వారి కడుపు మాత్రమే నింపుకొను వారికి దూరముగా వుండుడి, అన్ని దేశములకు సువార్తను ప్రకటించుడి. ఇది రోమాలోని సంఘమునకు పౌలు ఇచ్చుచున్న అఖరి హెచ్చరిక. పౌలు బోధించిన నీరు మరియు ఆత్మ సువార్త ప్రతి మార్గములో మనలను బలపరచు శక్తిని కలిగియున్నది. మనము దీనియందు విశ్వాసముంచుచున్నాము ఇది. నీరు మరియు ఆత్మ సువార్తయందున్న ఈ విశ్వాసము బైబిల్‌లో అపోస్తలు కలిగియున్న అదే విశ్వాసము మరియు ఇప్పుడు మన స్వంత సంఘము విశ్వసించుచున్న విశ్వాసము.
నీవు ఇటువంటి దానినే అనుభవించగలవా? నేను బైబిల్‌ చదువుచున్నప్పుడెల్లా బైబిల్‌ లెక్క ప్రకారము రెండు వేల సంవత్సరముల క్రిందట జీవించిన వారి అదే విశ్వాసమును కలిగియున్నామని గ్రహించి ఆశ్చర్యపడతాను.
ప్రతిదినము మేము ఎంతమందికి ఈ సువార్తను అందించుచున్నామో మీకు ఆలోచన వున్నదా? మేము ప్రతిదినము రెండు వేలమందికి తక్కువ లేకుండా సువార్తను ప్రకటించుచున్నాము. ఈ రెండు వేలు ప్రతి దేశములో తిరిగి జన్మించిన పరిశుద్ధులు వారి పొరుగువారికి బోధించినట్లయితే త్వరలోనే పదివేలగును. ఈ పదివేలు ఇరవైవేలగుటకు పదివేలమంది ఒక్కసారి బోధించవలసి వుంటుంది. నీవు చూచుచున్న విధముగా, ప్రపంచమునకు ఈ సువార్తను ప్రకటించుట అసాధ్యమైన కార్యము కాదు.
నీరు మరియు ఆత్మ సువార్త మీదున్న మా పుస్తకము ముఖ్య లక్ష్యము మాయమవదు గాని భద్రము చేయబడుతుంది. ఎంతమంది ప్రజలు చదివినను వాటి భావం మారదు. నీరు మరియు ఆత్మ సువార్త కలిగిన పుస్తకము ఎక్కడున్నదో అక్కడ చాలామంది ప్రజలు దీనిని కొనుక్కొని చదువుతారు. మరియు దేవుని సువార్త వ్యాపించును. ఈ సువార్త ప్రపంచమంతటికి వ్యాపించిన దినము ఎంతో దూరములో లేదు.
నీ విశ్వాసముచేత నీవు కలిగియున్న దేవునినీతి అనునది నీరు మరియు ఆత్మ సువార్త. అది అభివృద్ధి చెందుచున్న దేశములోని ప్రజలకు కూడా బాగా తెలియదు. మేము ప్రపంచమంతటా పంచవలెననుకొన్న సత్యసువార్త అనునది ప్రపంచము ఎరుగని ఒక రహస్యము. ఆ విధముగా వారి పాపముతో బాధపడుచున్నవారి అందరికి మేము ఆసక్తితో రక్షణా రహస్యమును ప్రత్యక్షము చేయవలెనని కోరుచున్నాము. నీరు మరియు ఆత్మ సువార్తయందు చూపబడిన దేవునినీతి చాలా స్పష్టముగా నున్నది ఈ సువార్తను అంగీకరించువారు దేవునికి వందనములు చెల్లిస్తారు మరియు దేవునిని మహిమపరచుదురు.
కొంతమంది ప్రజలు దీనిని ఆలోచించి, మేము పదే పదే దీనిని గురించి మాట్లాడుదుమని అంటారు. మేము ఎన్నిసార్లు వల్లించినను, ఇది ఇప్పటికీ మా హృదయములో ఆనందమును కలిగించును మా ఆత్మలో కృతజ్ఞతను కలుగచేయును. చాలామంది క్రైస్తవులు ఇప్పటికీ పాపములో బంధించబడియున్నందున, ప్రపంచమంతటికి మేము పదే పదే నీరు మరియు ఆత్మ సువార్తను ప్రకటిస్తాము. ఈ సువార్త అపోస్తలుడైన పౌలుతో కలిపి, అపోస్తలుల చేత చేపట్టబడిన సువార్తయైనందున, ఆత్మలన్నీ ఈ సువార్తయందు విశ్వాసముంచాలి. మనము ఈ సువార్తను విని మన హృదయములో చెక్కుకొనవలసిన అవసరము వుంది ఎందుకంటే ఇది ప్రతి క్రైస్తవునికి అత్యవసరము.
మా పుస్తకముల ద్వారా ఈ సువార్తను ముద్రించబడిన మరియు ఎలక్ట్రానిక్‌ పుస్తకము, మరియు వెబ్‌సైట్‌ ద్వారా మేము ప్రతిదినము రెండువేలమంది ప్రజలకు పంచుచున్నాము. విత్తనము మంచినేలలో పడినట్లయితే, ఇది విత్తబడిన వాటికంటే ముప్పై, అరవై లేక వందంతులుగా ఒక పంటను ఉత్పత్తి చేయునని మాకు నిశ్చయత కలదు. ఒక వ్యక్తి సువార్తను డజన్లకొద్ది మనుష్యులకు బోధించగలడు, ఈ ప్రజలలో ప్రతి ఒక్కరు ఈ సువార్తను అసంఖ్యాకమైన ప్రజలకు వ్యాప్తి చేయుచు, మరిన్ని డజన్ల కొలది ప్రజలకు బోధించగలరు.
మా సువార్త ప్రతిదినము రెండువేల మందికి బోధించబడుచున్నదని మేము విన్నప్పుడు, మా హృదయము దేవునినీతితో నింపబడును. ప్రపంచమునకు ఈ సువార్తను విడుదల చేయుటకు మార్గమును తెరచినందుకు దేవునికి వందనములు చెల్లించుచున్నాను. ఆయన సేవకుల విశ్వాసమును దేవుడు మరింత బలపరచునని నేను ప్రార్థించుచున్నాను.
ఇప్పుడు ప్రపంచమంతటా వ్యాపించుచున్న ఈ నీరు మరియు ఆత్మ సువార్త రక్షణ కొరకు ఒక సత్య తరంగము. ఈ సువార్త పరిశుద్ధాత్మను పొందుటకు మరియు పరలోకరాజ్యములో ప్రవేశించుటకు ఒకే ఒక మార్గము. లౌకిక మతములో నీవెంత కష్టపడి శోధించినను, నీవు నీరు మరియు ఆత్మ సువార్తను కనుగొనలేవు.
ప్రజలు ప్రపంచమంతటా దేవునికి వందనములు చెల్లించుచున్నారు. ఎందుకనగా వారు ఇప్పుడు నీరు మరియు ఆత్మ సువార్తద్వారా దేవునినీతిని కలిగియున్నారు. మా పుస్తకము చదివిన ప్రతి ఒక్కరు ‘‘ఆహా! ఈ విధముగా యేసు నా పాపము నుండి నన్ను రక్షించెను!’’ అని అబ్బురపడుచున్నారు. ఏలయనగా వారింతకు మునుపు ఎన్నడూ ఇలాంటి సువార్తను వినలేదు.
పాప బంధకముల నుండి స్వతంత్రులు కావలెనని కోరువారు మరియు పరిశుద్ధాత్మను పొందవలెనని అంతము లేకుండా ప్రయత్నించువారు వారు చివరికి నీరు మరియు ఆత్మ సువార్తను ఎరిగి స్వీకరించినప్పుడు వారు పూర్తి పాపముల క్షమాపణను మనశ్శాంతిని పొందుదురు. ఈ క్షణము నుండి ప్రపంచములోనున్న ప్రతి దేశమునకు ఈ సువార్త వ్యాపించును.
నీరు మరియు ఆత్మ సువార్త ప్రపంచమంతటా వ్యాపింపచేయబడుచున్నందుకు నా హృదయము ఆనందముతో నింపబడుచున్నది. నేను ఈ సువార్తను సేవించుచున్నప్పటికీ, నేను పూర్తి బలహీనతతోను తప్పిదములతోను నింపబడియున్నవాడను. నేను నీరు మరియు ఆత్మ సువార్తయందు పూర్ణముగా విశ్వాసముంచి దేవునినీతిని ఎరిగియున్నందున, నేనెల్లపుడు ప్రభువు నుండి నూతన శక్తిని పొందుచూ వుంటాను. అందువలన నేను ఆయన సువార్తను కొనసాగించగలను. ఈ సువార్త ఇప్పుడు చాలా దేశములలో ప్రవేశించినది; ఎంతో మంది ప్రజలు మా పుస్తకములను చదివారు అటువంటి పరిపూర్ణ సువార్తను బట్టి ఆశ్చర్యపోయారు.
ప్రపంచ వ్యాప్తముగా దేవునినీతియందు విశ్వాసముంచువారు నీరు మరియు ఆత్మ సువార్తయందు విశ్వాసముంచుటచేత రక్షించబడినవారు. మన బలహీనతకు మారుగా మన పూర్ణముగా మొత్తముగా నిలబడుటకు కారణము దేవునినీతియైన మన ప్రభువు నందు మనము విశ్వాసముంచు చున్నాము. మనము దేవుని పనివారము. మనము కేవలము మన శరీర కడుపును మాత్రమే తృప్తిపరచుకొను వారము కాము. అయితే నిజ విశ్వాసమును ప్రపంచమంతటా వ్యాప్తి చేయుచున్నాము. ప్రపంచమంతటా మా సవాలుకు ఈ సువార్తను వ్యాపింపజేయుటకు చాలామంది నీతిమంతులైన విశ్వాసులు లేచుదురని నేను ఆశించుచున్నాను ఆ విధముగా దీవించుచున్నాను.
పౌలు వలె, ప్రభువు ఎప్పుడు వచ్చునో అనుదానికి సంబంధము లేకుండా మనము నీరు మరియు ఆత్మను వ్యాపింపజేయగలము. ఈ గొప్ప తీర్మానము కొరకు మనమందరము కలిసి కష్టపడి పనిచేద్దాము. ఈ భూదిగంతముల వరకు మనము సువార్తను ప్రకటించినప్పుడు, ఆయన వాగ్ధానము ప్రకారము ప్రభువు వచ్చును మనలను ఇంటికి కొనిపోవును. పౌలు మనలను ఏ విధముగా హెచ్చరించెనో మనము జాగ్రత్తగా వినవలెను. ఒకరికొకరు వందనములు చెప్పుకొనుచూ ప్రొత్సాహపరచుకొనవలెను. మనము మన కార్యములయందు కొరత కలిగియున్నను, దేవునినీతియందున్న మన విశ్వాసము ద్వారా ఆత్మీయముగా మనము గొప్పగా బలపరచబడియున్నాము. నీరు మరియు ఆత్మ సువార్తయందున్న మన విశ్వాసము ఎంతగా సరిపోయినదో నిశ్చయమైనదో మనము తెలుసుకుంటాము. మనము నిజముగా పరిపూర్ణ దేవునినీతియైన మన ప్రభువు నందు విశ్వాసులము.
దేవుని నీతియందున్న మన విశ్వాసముతో ఈ ప్రపంచమును చూసినప్పుడు, చేయుటకు ఎంతో వున్నదని మనము కనుగొనగలము. మనమందరము ఈ ప్రపంచమంతటికి ఈ సువార్తను వ్యాపింపచేయుటచేత దేవునినీతియైన క్రీస్తునందున్న మన విశ్వాసము ద్వారా దేవునిని స్తుతించుచు జీవించగలము.