• All e-books and audiobooks on The New Life Mission website are free
  • Explore multilingual sermons in global languages
  • Two new revised editions in English have been released
  • Check out our website translated into 27 languages
Search

Sermons

అంశం 11: ప్రత్యక్ష గుడారం

[11-6] సున్నతి నిబంధన ద్వారా దేవుడు చేసిన వాగ్ధానము ఈనాటికీ మనకు కూడా వర్తిస్తుంది. (ఆదికాండము 17:1-14)

(ఆదికాండము 17:1-14)
“అబ్రాము తొంబది తొమ్మిది యేండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదనని అతనితో చెప్పెను. అబ్రాము సాగిలపడియుండగా దేవుడతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసియున్నాను. నీవు అనేక జనములకు తండ్రివగుదువు. మరియు ఇకమీదట నీ పేరు అబ్రాము అనబడదు; నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రాహాము అనబడును. నీకు అత్యధికముగా సంతానభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చునట్లు నియమించుదును, రాజులును నీలోనుండి వచ్చెదరు. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడై యుండునట్లు, నాకును నీకును, నీ తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్యనిబంధనగా స్థిరపరచెదను. నీకును నీ తరువాత నీ సంతతికిని నీవు పరదేశివైయున్న దేశమును, అనగా కనాను దేశమంతటిని నిత్యస్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడవై యుందునని అతనితో చెప్పెను. మరియు దేవుడు నీవును, నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములో నీ సంతతియు నా నిబంధననుగైకొనవలెను. నాకును నీకును నీ తరువాత నీ సంతతికిని మధ్య విూరు గైకొనవలసిన నా నిబంధన యేదనగా విూలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. విూరు విూ గోప్యాంగ చర్మమును సున్నతి పొందవలెను.అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. ఎనిమిది దినముల వయస్సుగలవాడు, అనగా నీ యింట పుట్టినవాడైనను, నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడినవాడైనను, మీ తరములలో ప్రతి మగవాడు విూలో సున్నతి పొందవలెను. నీ యింట పుట్టిన వాడును నీ వెండితో కొనబడిన వాడును, తప్పకసున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన విూ శరీరమందు నిత్యనిబంధనగా ఉండును. సున్నతి పొందని మగవాడు, అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలో నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరియున్నాడని అబ్రహాముతో చెప్పెను.’’
 
 
ఆదికాండము 17వ అధ్యాయములో దేవుడు అబ్రహాముతో చేసిన సున్నతి నిబంధన ద్వారా ఆత్మీయ సున్నతి కనబడుచున్నది. ప్రత్యక్ష గుడారములో బలి అర్పణ బలిపశువు తలపై వారి చేతులు వేయుట వలన ఇశ్రాయేలీయులు ప్రతిపాపము వారి నుండి తొలగింపబడెను. అనగా, దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన, పాపక్షమాపణ బలికి, దహన బలికి చిహ్నముగా ముందుగానే రూపొందించబడింది. ఆయనే తనకును, తన సంతతికిని దేవుడై ఉంటానని వాగ్ధానము చేసిన దేవుడు, ప్రత్యక్ష గుడారములో అబ్రహాము సంతతి బలి అర్పణలో వారి చేతులను బలి పశువుపై పెట్టుట వలన వారి పాపములు ఆ పశువుపై మోపబడునని ప్రవచించెను. దీనిని బట్టి నూతన నిబంధనలో యేసు భూమి మీదనున్న ప్రతి పాపమును, యోహాను ఇచ్చిన బాప్తిస్మము ద్వారా ఆయన మీదకు తీసుకొనెను అని మనము తెలుసుకొని విశ్వాసముంచవలెను.
దేవుడు అబ్రాహాముకు ఈ వాగ్ధానమిచ్చెను. నీవు ఆకాశమువైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీచేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము ఆలాగవునని చెప్పెను (ఆదికాండము 15:5). అబ్రాహాము ఎదుట ప్రత్యక్షమై మరోసారి ఈ వాగ్ధానమిచ్చెను. నీకు అత్యధికముగా సంతానవృద్ధి కలుగచేసి నీలో నుండి జనములు వచ్చునట్లు నియమించుదును, రాజులు నీలోనుండి వచ్చెదరు. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవు డనైయుండునట్లు, నాకును నీకును, నీ తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిబంధనగా స్థిరపరచెదను. (ఆది17:6-7)
దేవుడు అబ్రాహాముతోను అతని సంతానముతోను చేసిన వాగ్ధానము సున్నతి ద్వారా చేసెను. ఈ సున్నతి, ఇశ్రాయేలీయులు దేవునికి యిచ్చు బలి అర్పణలో, పశువుపై చేతులను మోపుటకు సాదృశ్యముగా ఉన్నది. మరియు నూతన నిబంధనా కాలములో యోహాను బాప్తిస్మము ద్వారా ప్రపంచ పాపములన్నిటిని తన మీద మోపుకొని పాపపరిహారము కలిగించుట కూడా ముందుగానే చెప్పబడినది. పాత నిబంధనలో దేవుడు అబ్రాహామునకు సున్నతి ద్వారా చేసిన వాగ్ధానము, నూతన నిబంధనలో యేసు బాప్తిస్మములో పాపము కడుగబడి ఆత్మీయ సున్నతి జరిగెనని మనము తెలుసుకొని విశ్వాసముంచవలెను. ఇంకను, అబ్రాహాము కలిగిన విశ్వాసము, ఇశ్రాయేలీయులకు కూడా ప్రత్యక్ష గుడారములో బల్యర్పణ చేయుచున్నప్పుడు కలిగి యుండవలెనని మనకు తెలియపర్చబడుచున్నది.
దేవుడు అబ్రాహాముతో ఇలా అనెను ‘‘విూరు విూ గొప్యాంగ చర్మమున సున్నతి పొందవలెను. అది నాకు నీకు మధ్య నున్న నిబంధనకు సూచనగా ఉండును. ఎనిమిది దినముల వయస్సుగలవాడు, అనగా నీ యింట పుట్టినవాడైనను, నీ సంతానము కాని అన్యునియొద్ద వెండితో కొనబడినవాడైనను, విూ తరములలో ప్రతి మగవాడు సున్నతి పొందవలెను” (ఆదికాండము 17:11, 12) మరోమాటలో చెప్పాలంటే, దేవుడు అబ్రాహాముతో సున్నతి ద్వారా వాగ్ధానము చేసెనుకాని అందుకు ప్రతిగా వారు సున్నతి పొందవలెను. ‘‘నీ యింటపుట్టిన వాడును నీ వెండితో కొనబడినవాడును, తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును” (ఆదికాండము 17:13)
అందువలనే ప్రపంచ జనములందరిలో, ఇశ్రాయేలీయులు మాత్రమే వారి గోప్యాంగ చర్మమును, అబ్రాహాము కాలం నాటి నుండి సున్నతి చేయుచున్నారు. ఈ రోజులలో ఆరోగ్యపరంగా ఉన్న లాభము వలన సున్నతి ఎక్కువగా చేయబడుచున్నది. కాని ఆ కాలంలో ఇశ్రాయేలు పురుషులు మాత్రమే సున్నతి చేసేవారు. ఇదే దేవుడు అబ్రాహాముతోను, తన సంతతితోను చేసిన వాగ్ధానమునకు గుర్తు, వారి శరీరములో ఆయన చేసిన నిబంధనగా ఉండెను.
ఆదికాండము 17:11తో ఇలా ఉన్నది, ‘‘విూరు విూ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలెను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును.’’ కాబట్టి, సున్నతి నిబంధనకు గుర్తు. తిరిగి జ్ఞాపకము చేసుకొనుటకు, దేవుడు ఈ విధంగా నిబంధన చేసెను. ‘‘విూరు నా ప్రజలని ఎలా తెలుసుకొందురు” సున్నతి గుర్తును చూచుట ద్వారా మీరు తెలుసుకొందురు. ఇప్పటి నుండి, మీలో పుట్టిన మగవాడు గోప్యచర్మమందు సున్నతి పొందవలెను. ఈ విధంగా, నా నిబంధన విూ శరీరమందు నిత్యనిబంధనగా నుండును. నీకును, నీ తరువాత నీ సంతానమునకును నేనే దేవుడనైఉండెదను. నిన్ను ఆశీర్వదించి, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను, నీకు అత్యధికముగా సంతానవృద్ధి కలుగచేసి నీలోనుండి జనములు వచ్చునట్లు నియమించుదును. రాజులు నీలోనుండి వచ్చెదరు. నేను నీకును, నీ తరువాత నీ సంతతికిని నీవు ప్రదదేశివైయున్న దేశముమును, అనగా కనాను దేశమంతటిని నిత్యస్వాస్థ్యముగా నిచ్చెదను” (ఆది17:4-14).
అబ్రాహాముతోను, తన సంతానముతోను దేవుడు చేసిన నిబంధన వారి శరీరములో కనబడును. అనగా, దేవుని వాగ్ధానము సున్నతి చేయబడునని పురుషుల యందు ముద్రించబడెను. దేవుడు ఇశ్రాయేలు జనాంగముతో వారి సున్నతి ద్వారా వాగ్ధానము చేసెను. మరియు మగవారు సున్నతి చేయబడినవారో, కాదో, అనునది వారు అబ్రాహాము సంతతియా? కాదా? అను విషయం మీద ఆధారపడియుండును. కాబట్టి ఎవరైతే సున్నతి చేయబడినారో వారు దేవునిచేత ఆశీర్వదించబడినవారును, అబ్రహాము సంతానమును అయి ఉందురు. సున్నతి లేనివారు అలా గుర్తింపబడక ఆశీర్వదించబడలేదు.
 

అ బ్రాహాము, ఇశ్రాయేలీయులకు ఎంతో ప్రాముఖ్యమైన వ్యక్తి

ఇశ్రాయేలు ప్రజలకు, ధర్మశాస్త్రమునకు తండ్రియైన మోషేకంటే, విశ్వాసమునకు తండ్రియైన అబ్రాహాము ఎంతో ప్రాముఖ్యము. నోవహును మరచిపోయిన ఇశ్రాయేలీయులు బహుకొద్దిమంది ఉండవచ్చును గాని అబ్రాహామును మరచిపోయేవారు ఎవరు ఉండరు. కొంతమంది మాత్రమే షేము, షేతు, మెతుషలా వంటి వారిని గుర్తుంచుకుంటారు కాని, అబ్రాహాము మాత్రము ఇశ్రాయేలు ప్రజలకు మరువలేని విశ్వాస తండ్రి. వారందరూ అబ్రాహామును, వారి జాతిపితగా గుర్తించి, విశ్వాసముంచి వెంబడిస్తున్నారు. అలాగునే, దేవుడు ఇశ్రాయేలీయులకు అబ్రాహాముతో చేసిన వాగ్ధానము ఇంకను సజీవముగానున్నది.
“మేము అబ్రాహాము సంతానము మా జనాంగము వారి శరీరమందు సున్నతి చిహ్నమును కలిగియున్నారు. కాబట్టి, దేవుడు మా దేవుడు. మేము ఆయన సొంతము.’’ ఈ విధంగా, ఇశ్రాయేలీయులు పూర్తిగా విశ్వసిస్తారు. ఇశ్రాయేలీయులు, తామే ఏర్పరచబడిన జనాంగమని ఎందుకు విశ్వసిస్తారంటే, వారు ఇంకను దేవుడు అబ్రాహాముతో సున్నతి ద్వారాచేసిన వాగ్ధానమును ఈ నాటికిని నమ్ముతారు.
అబ్రాహామునకు ఇద్దరు భార్యలు : శారయి దేవునిచే శారా అని పిలువబడెను. శారాయి దాని హాగరు, అతని రెండవ భార్య శారయికి పిల్లలు పుట్టరని భావించి, అబ్రాహాము అతని సొంత ఆలోచనతో హాగరు ద్వారా సంతానమును కలుగవలెనని ఆలోచించెను. (ఆదికాండము 16:1-4). శారాయి న్యాయబద్ధమైన భార్య కాబట్టి ఆమె సొంత సంతానము ద్వారా అబ్రాహామునకు ఆకాశమందు నక్షత్రముల వలె సంతానము ఇచ్చెదనని దేవుడు చెప్పెను. దేవుడు శారా గర్భములో పుట్టిన వారినే ఆయన ఏర్పరచుకొనెను. కాని రెండవ భార్య అయిన హాగరు కుమారుడు ఇష్మాయేలును దేవునియందు గుర్తించలేదు.
ఇశ్రాయేలీయులు గనుక సున్నతి చేయబడని యెడల దేవుని వాగ్ధానము విఫలముగా ఉండేది. దేవుని నిబంధన వారి శరీరములో ఉండవలెనని, సున్నతి లేనిచో దేవుని వాగ్ధానము విఫలమవుతుందని, ఇశ్రాయేలీయులు సున్నతి ఖచ్చితముగా చేసేవారు. ఇశ్రాయేలు జనాంగములో సున్నతి లేనివారు లేకపోవచ్చును. ఎందుకంటే సున్నతి లేకపోవుటంటే దేవుని వాగ్ధానమునకు అర్థం తెలియని అన్యులవలె ఉండుట అని వారికి తెలుసు.
 

ఆత్మీయ సున్నతి

దేవుడు అబ్రాహాముతోను అతని సంతానముతోను ఏర్పరచిన నిబంధన, యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చి బాప్తిస్మమిచ్చు యోహాను బాప్తిస్మము పొంది లోకపాపములన్నిటిని ఆయనమీద తీసుకొని పాపపరిహారము కలిగించుట ద్వారా సంపూర్తి చేయబడినది.
ప్రత్యక్ష గుడారపు ద్వారమును, అడ్డతెరను, నీలిధూమ్ర రక్తవర్ణముగల సన్నని నారతో చేయవలెనని దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పెను. (నిర్గమ 26:31, 27:16). ప్రత్యక్ష గుడారమును గూర్చి ఇంత వివరంగా వర్ణించి, దేవుడు, యేసుక్రీస్తు నందు వచ్చు రక్షణ గురించి నేర్పించెను. ప్రభువు భూమి మీదకు వచ్చి, ముప్పయవ యేట యోహాను ద్వారా బాప్తిస్మము పొంది లోకపాపములు ఆయన మీద మోపుకొని, సిలువపై మరణించి, మరలా మృతులలో నుండి లేచి తద్వారా మన పాపాములన్నిటిని క్షమించెనని విశ్వసించే వారంతా అబ్రాహాము వారసులే. దేవుడు, ఎవరైతే నీల ధూమ్ర రక్త వర్ణములుగల సన్నని నారతో ఉన్న ప్రత్యక్షగుడారమును విశ్వసిస్తారో వారి దేవుడు ఆయనే.
యేసు బాప్తిస్మమును నమ్మి మనమందరము ఆత్మీయ సున్నతి పొందాలి. ఆత్మీయ సున్నతి అనగా, మన పాపాలన్నీ యేసుక్రీస్తు బాప్తిస్మము ద్వారా ఆయన మీద మోపబడెనని విశ్వాసముంచి, మన హృదయములోని పాపమును కోసివేయాలి. (రోమా 2:29)
ఎవరైతే, నీలధూమ్ర వర్ణముగల తెరలో చూపబడిన నీటి మరియు ఆత్మ బాప్తిస్మము నందు విశ్వాసముంచి పాపక్షమాపణ పొందుతారో వారంతా దేవుని రాజ్యములో రాజులు, ఆయన పిల్లలు దేవుని వాగ్ధానము చేసినట్టే. ‘‘రాజులు నీలోనుండి వస్తారు” (ఆదికాండము 17:6), నిజముగా ఆయన జనాంగము ప్రపంచమంతటిలోను నిలుచున్నారు.
అబ్రాహాము వారసులము కావాలంటే, యేసు భూమి మీద పొందిన బాప్తిస్మమును, సిలువపై ఆయన రక్తంను విశ్వసించాలి. యేసు బాప్తిస్మము నందు విశ్వాసముంచుట ఎంత ముఖ్యమో నేను వర్ణించలేను. యేసుక్రీస్తు రాజులకు రాజు ఆయన ఊదారంగు అంగీ ధరించి వచ్చిన రాజులకు రాజు (యోహాను 19:5). యేసు సర్వసృష్టికర్త మరియు సర్వసృష్టికి రాజు. దేవుని ఒక్కగానొక్క కుమారునిగా, తండ్రి చిత్తమునకు విధేయుడై, మనలను పాపము నుండి విడిపించటానికి బాప్తిస్మము ద్వారా మన పాపములన్నిటిని ఒకేసారి ఆయన మీద మోపుకున్నాడు. మన పాపమును తుడిచి వేయటానికి మన హృదయములోని పాపాలన్నిటిని కోసి వేయటానికి, బాప్తిస్మము ద్వారా ఆయన మీద మోపుకొని, వాటన్నిటి కొరకు తీర్పు పొంది సిలువ మీద ఆయన రక్తాన్ని కార్చాడు. ఎవరైతే ఈ సత్యమందు విశ్వాసముంచుతారో వారంతా అబ్రాహాము సంతానమే.
అబ్రాహాము, అతని కుటుంబము వారసులంతా శారీరకంగా సున్నతి పొందారు. అన్యుల వద్ద నుండి వెండితో కొనబడిన పని (బానిసలు) వారు కూడా సున్నతి చేయబడ్డారు. దేవుని నిబంధనలో విశ్వాసముంచి సున్నతి పొందినప్పుడు, ఈ అన్య బానిసలు కూడా ఆశీర్వదించబడ్డారు. దేవుడు వారికి దేవుడైనాడు. విశ్వాసము వలనే మనము ఆయన బిడ్డలమవ్వగలము. విశ్వాసము వలనే పరలోక రాజ్యానికి వెళ్తాము. విశ్వాసము వలన భూమి మీద రాజులుగా జీవిస్తాము. లోకంలోని సమస్త నూతన నిబంధనా సమయములో, బాప్తిస్మము ద్వారా యేసు లోకంలోని సమస్త పాపాలన్ని తీసుకొనెనని విశ్వసించుటయే ఈ విశ్వాసము.
అయినప్పటికీ, యేసుక్రీస్తు పొందిన ఈ బాప్తిస్మము ప్రాముఖ్యం కాదని కొంతమంది చెపుతారు. ఎందుకంటే వారు ఆ రక్తంలోనే వారి పాపాలు కడుగబడినాయని వారి నమ్మకం. ప్రత్యక్ష గుడార కాలంలో, బలిపశువు తల మీద చేతులు మోపటం గురించి వారు నమ్మినా, యేసు యొక్క (స్వంత) బాప్తిస్మమునకు చాలా తక్కువ ప్రాముఖ్యతనిస్తారు. కాబట్టి వారు బలంగా ఏమని చెప్తారంటే, యేసుక్రీస్తు భూమి మీదకు రాకముందే, మోషే ప్రత్యక్ష గుడారమునకు ఎంతో ముందుగానే అబ్రాహాము విశ్వాసము అంగీకరించబడినది, కాబట్టి యేసు బాప్తిస్మము వాక్యమును కూడా నమ్మకుండా సిలువపై కార్చిన రక్తం గూర్చి నమ్మితే చాలు రక్షణ కలుగుతుందని అని అంటారు.
మనము గుర్తు పెట్టుకోవలసిన విషయం ఏమనగా, దేవుడు అబ్రాహామునకు, మూడేండ్ల పెయ్యను, మూడేండ్ల మేకను, మూడేండ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను తనయొద్దకు తెమ్మని చెప్పినది అబ్రాహాము అతని సంతానము కానాను దేశము వారి స్వాస్థ్యముగా ఇస్తానని చెప్పుటకే మరియు దేవుని మనసులో అగ్నితో అర్పించే దహనబలి ఉంది. ‘‘మరియు పొద్దుగ్రుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యి అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను” అని ఆదికాండము 15:17లో ఉన్నది. దేవుడు అర్పించిన దహనబలిని అంగీకరించెను గాని, దహన బలి అర్పణనను నమ్మని కయిను అర్పణను అంగీకరించలేదు.
ఈ నాటి క్రైస్తవులలో అనేకమంది ఎన్నడు విశ్వాసములో ఆత్మీయ సున్నతి పొందకుండానే గ్రుడ్డిగా యేసులో విశ్వాసముంచితే రక్షణ కలుగుతుందని తప్పుగా అర్థం చేసుకుంటారు. వాళ్ళ పాపాలన్నీ బాప్తిస్మము ద్వారానే యేసు మీదకు మోపబడ్డాయి అన్న సత్యాన్ని నమ్మకుండానే వాళ్ళు దేవుని స్వంత జనాంగము ఎన్నటికి కాలేరు, ఎందుకంటే అలా నమ్మటం వలన హృదయములో నుండి మన పాపాలన్నీ పెరికివేయలేము. దేవుడు చెప్పిన విధంగా ఆయన నిబంధనకు గుర్తు సున్నతి పొందిన వారి శరీరములోనే ఉంది. కాబట్టి సున్నతి లేని వారికి దేవుని వాగ్ధానముతో ఏ సంబంధము లేదు.
యేసు బాప్తిస్మమిచ్చు యోహాను వద్ద పొందిన బాప్తిస్మములో విశ్వాసముంచకపోతే మనుష్యులు పాపము నుండి రక్షించబడగలరా? అలాంటి వాళ్ళు దేవుని పిల్లలు కాగలరా? పరలోక రాజ్యంలో వాళ్ళు ప్రవేశించగలరా? ఆయన రాజ్యంలో వాళ్ళు రాజులు కాగలరా? ఈ ప్రశ్నకు జవాబు ‘‘లేదు” ఈ రోజు మనము చదివిన ముఖ్యభాగం ఈ జవాబుకు రుజువు. అబ్రాహామునకు దేవుడు చేసిన వాగ్ధానము ఈ రోజు నాకు, నీకు, ఎవరైతే యేసుక్రీస్తు బాప్తిస్మము ద్వారా, రక్తం ద్వారా తమ పాపక్షమాపణ పొందారు అని నమ్మని ప్రతివారికి దేవుని వాగ్ధానము అదే. ఎవరైతే దీని నమ్ముతారో వారికి దేవుడు పలికిన ఆశీర్వాదము కూడా వర్తిస్తాయి.
 

యేసుని నిజంగా అనుసరించే వారు వారి సొంత సిద్ధాంతాలను అనుసరించరు.

బైబిల్‌లోని దేవుని వాక్యము రక్షణను గూర్చిన ఖచ్చితమైన సత్యము; ఎంత ఎక్కువగా చదివి ఎంత ధ్యానిస్తామో మనకు అంత సత్యముగాను, క్షుణ్ణంగాను అర్థమవుతుంది. ఈనాటి క్రైస్తవులలో అనేకమంది వారి సొంత ఆలోచనలో నడుస్తూ అది కనీసం తప్పు అది తెలియకుండా, వారి విశ్వాసము తప్పుకు దారి తీస్తుంది. అలాంటి వారి విశ్వాసపునాదులే తప్పు. వాళ్ల తృప్తి కొరకు ఎలా అయినా యేసు వాళ్ళను రక్షిస్తాడు అని నమ్మవచ్చు, కాని దేవుడు వారి గ్రుడ్డి విశ్వాసాన్ని అంగీకరించడని తెలుసుకోవాలి.
ఎవరైతే ఆయనను వెంబడించాలనుకుంటారో వారు తమని తాము తృణీకరించి ఆయన సిలువనెత్తుకోవాలని మనప్రభువు చెప్పెను. ఎవరైతే దేవుని వాక్యాన్ని నమ్ముతారో, వారు తమ ఆలోచనలను విడచి, దేవుని వాక్యము నిజంగా ఏమి చెప్తుందో దానినే నమ్మాలి. యేసుక్రీస్తు ఈ భూమిమీదకు వచ్చి, బాప్తిస్మము ద్వారా సమస్త పాపములను ఆయన మీద మోపుకొని సిలువపై రక్తం కార్చి, మృతులలో నుండి తిరిగి లేవడం వలన పాపపరిహారము పొందగలమని నీవు, నేను ఈరోజు నమ్మాలి.
ఈ రోజుల్లో అనేకమంది అలా నమ్మిన యేసు నామముతో గ్రుడ్డిగా వేలాడుతూ తమ స్వంత విశ్వాసం వారికి ఉంది అంటారు. అలాంటి మనుష్యుల విశ్వాసం, నీటి (వాక్యం) సువార్తకు, యేసు వచ్చిన ఆత్మకు ఏ సంబంధము లేదు. ఉదాహరణకు, కొంతమందికి వాళ్ళు దూరపు కొండలో ప్రార్థిస్తుండగా యేసు వారికి కనిపించాడని అందుకే వాళ్ళు ఒక చర్చికి వెళ్ళి, ఉపవాసము ఉండి, రాత్రంతా మేలుకొని ప్రార్థిస్తూ వారి పాపాలగూర్చి బాధపడుతారు. అట్టివారు పశ్చాత్తాప ప్రార్థనల ద్వారా పాపాన్ని పొగొట్టుకోలేరు.
ఇలాంటి రకాలైన విశ్వాసానికి, నీటి వాక్య సువార్తకును మన ప్రభువు ఇచ్చిన ఆత్మ వలన వచ్చు నిజమైన రక్షణకు ఏ సంబంధము లేదు. అలాంటి విశ్వాసం ఉంటే ఆయన మన పాపాలను క్షమిస్తాడని దేవుని వాక్యంలో ఎక్కడ ఉంది? ఎక్కడా లేదు. వాళ్ళు దేవుడు ఒక్కడేనని, యేసు సర్వాధికారి అని, తెలుసుకోకుండానే, వాళ్ళకు తెలిసిన తక్కువ జ్ఞానంతో వారి కుటిల విశ్వాసానికి క్రీస్తు పేరును కలుపుతూ, దేవుని పేరును వ్యర్ధంగా ఉచ్ఛరించి వారి పాపములను మరచిపోయి దేవుని ఉగ్రతను పెంచుతున్నారు. ఆ మనుష్యులు వాళ్ళ ఊహలో యేసును, రక్షణ యొక్క వారి సొంత ఆలోచనలను రూపొందించి వాళ్ళ సొంత ఆలోచనలను నమ్ముతారు.
‘‘సున్నతి పొందని మగవాడు, అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలోనుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరి యున్నాడు’’ అని ఆదికాండము 17:14లో ఉన్నది. ఎవరైతే నీటిమూలముగాను, ఆత్మ మూలముగాను తిరిగి జన్మిస్తారో వారే ఆయన పిల్లలు అని దేవుడు వాగ్ధానమిచ్చెను. కాబట్టి, యేసు బాప్తిస్మములో విశ్వాసముంచక ఆయన సిలువపై కార్చిన రక్తాన్ని మాత్రమే నమ్మితే వారు దేవుని బిడ్డలు కాలేరు. అలాంటి వారు దేవుడు వాగ్ధానము చేసిన సువార్తను నమ్మినా ఆయనను మోసగించినట్లే కాబట్టి వారు దేవుని జనము నుండి కొట్టివేయబడతారు, దేవునిచే శాపగ్రస్తులవుతారు.
మన పాపము నుండి మనలను రక్షించగల విశ్వాస పునాది, నీరు మరియు ఆత్మ మూలమైన సువార్త మాత్రమే. నీటి మరియు ఆత్మవలనైన సువార్తతో మన పునాది బలంగా వేసినపుడే మనము దేవుని రాజ్యాన్ని సంపూర్తిగా నమ్మగలుగుతాము. హృదయములో సున్నతిలేని ఆత్మీయ అన్యులు, దేవుని రాజ్యాన్ని వారి హృదయంలోనికి ఎలా తీసుకోగలరు? ఎన్నడును అలా చెయ్యలేరు! ఎందుకంటే నీటి మరియు ఆత్మ బాప్తిస్మము మనకు ఆత్మయ సున్నతి నిచ్చి మనలను దేవుని పిల్లలుగా చేస్తుంది. పునాది లేకుండా, దేవుని రాజ్యము మనకు మానవ జ్ఞానము వలెనే వచ్చును.
కాబట్టి తిరిగి జన్మించిన సేవకుల ఆత్మీయ బోధనులు, ఎవరైతే నీటి మరియు ఆత్మ మూలమైన సువార్తలో నమ్ముతారో వారికి అర్థమవుతాయి, లభిస్తాయి. వేరే మాటలో చెప్పాలంటే, ఎవరైతే నీటి మూలముగాను, ఆత్మమూలముగాను బాప్తిస్మము పొందుతారో వారు మాత్రమే దేవుని మాటను వినగలరు అర్థం చేసుకోగలరు. నీరు మరియు ఆత్మ మూలమైన సువార్త తెలియని వాళ్ళతో కలిసినప్పుడు, వారు సిలువ మీద రక్తము వలనే వారు తిరిగి జన్మించారు అని చెప్పారు. ఒక దేవుని వారు కూడా నమ్ముతాం అంటారు కాని మనకు మనము వేరు దేవుని గూర్చి మాట్లాడినట్లు భావిస్తాం. ఒక్కడే నిజమైన దేవుడు ఎవరు? అబ్రాహామునకు వాగ్ధాన హక్కు నిచ్చిన దేవుడే నిజమైన దేవుడు.
“నా నిబంధన విూ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును’’ (ఆదికాండము 17:13)అని దేవుడు అబ్రాహామునకు తన సంతానమునకు వాగ్ధానము చేసెను. మనము పాప పరిహారము పొందామని చెప్పటానికి గుర్తు ఏది? అది మన హృదయములో కనబడుతుంది. యేసుక్రీస్తు బాప్తిస్మంలో మన హృదయంలో విశ్వాసముంచుట వలన మనము దేవుని పిల్లలమైనాము. నిజమైన సువార్తను నమ్ముట వలన ఆత్మీయ సున్నతి పొందినాము. ప్రభువు మన పాపముల వలన బాప్తిస్మము పొందెను, మనము ఆత్మీయ సున్నతి పొందామని మన హృదయంలో విశ్వసించినందున మనము ఆయన పిల్లలమైనాము.
ఈ సత్యమునందు ఉన్న విశ్వాసం ద్వారా, మన పాపములు యేసుక్రీస్తు మీద మోపబడి, ఆయన వాటిని సిలువ మీదకు మోసుకొనిపోయి మన స్థానంలో సిలువ వేయబడి, మృతులలో నుండి తిరిగిలేచి, మన పాపములన్నిటిని క్షమించెను. మరో మాటలో చెప్పాలంటే విశ్వాసం ద్వారా మనము దేవుని పిల్లలమైనాము. విశ్వాసము వలనే మనము పాపములేని వారమైనాము. మనలో ఇంకా ఏ పాపమైనా ఉండిపోయినదా? లేనేలేదు! ఎటువంటి పాపమును మనలో లేదు. ఇదంతా నిజంగా అద్భుతమైన సువార్తలోని సత్యం ద్వారా సంపూర్ణమైనది.
 
 
నీవు నేను అబ్రాహాము వారసులము ఎలా కాగలము?

యేసుక్రీస్తు కార్యము నందు బయలుపర్చబడిన ప్రత్యక్ష గుడారపు నీలధూమ్ర రక్తవర్ణము గల సన్నని నారను నమ్ముట వలన మనము ఆత్మీయ సున్నతి పొంది అబ్రాహాము సంతానమైనాము. యేసు బాప్తిస్మమును సిలువపై ఆయన కార్చిన రక్తమును నమ్ముట వలన మనము ఆత్మీయ సున్నతి పొంది దేవుని బిడ్డలమైనాము. యేసు బాప్తిస్మము ద్వారా పాపములన్నిటిని మోసి, వాటి కొరకు సిలువపై తీర్పుపొందెను. అని నమ్ముట వలన మనకు పాప పరిహారము కలిగెను. ఈ విధంగా నీవు నేను ఆత్మీయంగా అబ్రాహాము సంతానమైనాము.
నీటిమూలముగాను, ఆత్మమూలముగాను తిరిగి జన్మించిన వారు నిజముగా ఎవరు అనునది గ్రహించవలెను. నీరు మరియు ఆత్మ సువార్తను నమ్మే నేను, నీవు విశ్వాసముచే ఆత్మీయంగా సున్నతి పొందిన దేవుని పిల్లలము.
రానున్న వెయ్యేండ్ల పరిపాలనలో మనము రాజులము. దేవుని సృష్టినంతటిని పాలించి ఆయన మహిమలో ఆనందించెదము. ఈ విధంగా మన హోదా మార్చబడినది. నిజంగా ఎవరమో ఈ లోకంలోని ప్రజలకు తెలుసా? వారికి తెలియదు. కాని దేవుని రాజ్యంలో విశ్వాసముంచుట వలన స్థానము మారిన వారము మనము. కాబట్టి ఇప్పుడు మనలను మనమే తేటగాను పూర్తిగాను తెలుసుకోగలము.
దేవుని రాజ్యమూలంగా తిరిగి జన్మించినవారు, నిజముగా వారెవరో వారికి తెలుసు. ఎవరైతే లోక మతములో, ఆ సంఘంలో తమను తాము ప్రకటించుకొంటూ, తప్పు సిద్ధాంతాలు నేర్పుతూ తిరిగి జన్మించిన, నిజమైన దేవుని జనులను విమర్శిస్తారో వారికి మనము సిద్ధాంత రీత్యా వారికి వేరు. ఇశ్రాయేలీయులు వారే దేవుని జనాంగమని నమ్మి ఇష్మాయేలు సంతానాన్ని వేరుగా పరిగిణిస్తారో అదే విధంగా, అబ్రహాము ఆత్మీయ సంతానమైన మనకు కూడా దేవుడు ఏర్పరచిన జనాంగమని చెప్పుకునే హక్కు ఉన్నది.
నీరు మరియు ఆత్మ మూలమైన సువార్తనందు విశ్వాసముంచు మనము మన విశ్వాసము ద్వారా అబ్రాహాము వారసులమైనాము. ప్రత్యక్ష గుడారములోని నీల ధూమ్ర రక్తవర్ణముగల సన్నని నార సువార్తను నమ్మిన యెడల విశ్వాసము వలన మనము పరలోకములో ప్రవేశించగలము.
తన సంతానమును ఆకాశమునందు నక్షత్రముల వలే చేస్తానని దేవుడు అబ్రాహాముకు చేసిన వాగ్ధానము మన కళ్ళ ఎదుట నిజముగా మనకు ఈ వాగ్ధానము సంపూర్తి అగుట చూడగలము. ఇదే దేవుడు మనమీద ఉంచిన ఆశీర్వాదము.
మన హృదయము సున్నతి వలన దేవుడు మనలను లోక పాపము నుండి రక్షించెను. నీలధూమ్ర రక్తవర్ణముగల సన్నని నారతో ప్రత్యక్ష గుడారపు ద్వారము ద్వారా ఈ సున్నతి చేయబడును.